Nizam rule
-
మునుగోడు కోసమే ‘విమోచన’
తెలంగాణలో సెప్టెంబర్ 17 అన్నది విలీనమా, విమోచనా, విద్రోహమా లేక విద్వేషమా అనే వాదనను పక్కన పెడితే, ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన కనీస చారిత్రక అంశాలు కొన్ని ఉన్నాయి. అసఫ్ జాహీ వంశస్థులు మొఘల్ పాలన నుంచి విడిపోయి, నిజాం పాలకులుగా (1724–1948) పేరొందారు. నిజాంలు మత ప్రాతిపదికన ఏలినవారు కాదు, స్వతంత్రులూ కారు. ‘ట్రియటీ ఆఫ్ సబ్సిడియరీ అలయెన్స్’ పేరిట, 1800లో బ్రిటిష్ వారికి అధీనులుగా ఒప్పందం చేసుకొన్న అనేక మంది హిందూ రాజుల వంటివారే. తెలంగాణలో నిజాం వ్యతిరేక పోరాటం ఉద్ధృతంగా ఉన్న సమయంలో కూడా హిందూ ఫ్యూడల్స్ నిజాం మంత్రులుగా పనిచేశారు. వారిలో అత్యధికులు కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత కూడా పోలీసు చర్య జరిగే వరకూ కాంగ్రెస్ టోపీలు పెట్టు కోలేదు! విలీన చర్చల్లోనూ హిందూ సలహాదారులు నిజాం పక్షానే ఉన్నారు. ఆ చర్చల్లో కేంద్రం పక్షాన, నిజాం తరఫున ఇరు వైపులా బ్రిటిషువారే ఉన్నారు. పటేలుకు 1948 మార్చిలో గుండెపోటు రావడం వల్ల ఎక్కువగా మౌంటుబాటెనే కీలక సమావేశాల్లో పాల్గొ న్నారని విలీన వ్యవహారాల కార్యదర్శి, పటేలు కుడిభుజం అయిన వీపీ మీనన్ తన పుస్తకంలో రాశారు. నిజాం పాలన కానీ, విలీన వ్యతిరేకత కానీ, ఆ మాట కొస్తే నిజాం వ్యతిరేక ప్రతిఘటన కానీ ఏవీ మతం ఆధారంగా లేవు. రజాకార్లు కూడా నిజాం పాలన మొదటి నుంచీ లేరు. తర్వాతి దశలో 1938లో ఏర్పడిన ‘వాలంటీర్ల’ సంస్థకు చెందినవారు. ఆ సంస్థ 1947 తర్వాతే కిరాయి ప్రైవేటు సైన్యంలా దౌర్జన్యకర పాత్ర నిర్వహిం చింది. 1915లోనే ఏర్పడిన హిందూ మహాసభ గానీ, 1925లో ఆవిర్భవించిన ఆరెస్సెస్ గానీ నిర్వహించిన నిజాం వ్యతిరేక పాత్ర అక్షరాలా సున్నా. నిజాం నిరంకు శత్వం నుండి తెలంగాణను పటేల్ విముక్తి చేశారనీ, నెహ్రూ ముస్లిం పాలకుడి పట్ల మెతకగా ఉన్నారనీ అసత్య ప్రచారాలు మాత్రం జరిగాయి. నిజాంని 1947 ఆగస్టు తర్వాత కూడా ఏడాదిపాటు కొనసాగించటానికి యథా తథ స్థితి ఒప్పందం చేసుకొన్నది నెహ్రూ, పటేల్‌లతో కూడిన నాయకత్వమే. ఆ విషయంలో వారి మధ్య విభేదాల్లేవు. పటేలు మరణించిన 1950 చివర్లో, ఆ తర్వాత 1951 చివరి దాకా మిలిటరీ తెలంగాణలో స్వైర విహారం చేసింది. దానివల్ల నాలుగు వేల మంది రైతాంగ కార్యకర్తలు హతులయ్యారు. లక్షమంది జైళ్ల పాలయ్యారు. అలా చూస్తే ఇది రైతాంగ విప్లవం నుంచి ఫ్యూడల్ రాజు నిజాంకు లభించిన విమోచన తప్ప వేరేమీ కాదు. (క్లిక్ చేయండి: బీఆర్ఎస్ అంటే ఏంది?) ఈ ఏడాది సెప్టెంబర్ పదిహేడు... 75 ఏళ్ల చారిత్రక ఘట్టమే. మరి ఉత్సవాలను నిర్వహించాలని ముందే నిర్ణయం ఎందుకు తీసుకోలేదు? మొన్నటి జూలైలో బీజేపీ అఖిలభారత సమావేశం హైదరాబాదులో జరిగినప్పుడు, ఆ తర్వాత ఆగస్టు 15న కానీ తీసుకోలేదు. సెప్టెంబరు 3న హడావుడిగా తీసుకున్నారు. ఆనాడు లేనిదీ, నేడున్నదీ మునుగోడు ఎన్నిక! ఇదంతా బీజేపీ దేశభక్తి కాదు, 2023 తెలంగాణ ఎన్నికల్లో ముక్తి కోసమే. దానికి మునుగోడు అసెంబ్లీ ఎన్నిక రిహార్సల్. ప్రజలు గమనించకుండా ఉంటారా! – సీహెచ్.ఎస్.ఎన్. మూర్తి ఎఫ్ఐటీయూ ప్రధాన కార్యదర్శి -
విలీనం తర్వాత 12 మందికి ఉరిశిక్ష..చివరి క్షణాల్లో దిగొచ్చి..
సాక్షి, మిర్యాలగూడ, కోదాడ: నిజాం నవాబు భారత ప్రభుత్వానికి లొంగిపోయిన తర్వాత ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అక్కినెపల్లి, షా అబ్దుల్లాపురం గ్రామాల్లో జరిగిన దొరల, రజాకార్ల హత్య కేసులో నంద్యాల శ్రీనివాస్‌రెడ్డి (నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే), దోమల జనార్ధన్ రెడ్డి, గార్లపాటి రఘుపతిరెడ్డి, దూదిపాల చినసత్తిరెడ్డి, మేర హనుమంతు, మాగి వెంకులు, దాసరి నారాయణరెడ్డి, వడ్ల మల్లయ్య, ఎర్రబోతు రాంరెడ్డి, మిర్యాల లింగయ్య, కల్లూరి ఎల్లయ్య, గులాం దస్తగిరికి ప్రత్యేక ట్రిబ్యునల్ 1949 ఆగస్టు 13, 14న మరణశిక్ష వేసింది. ఉరిశిక్ష పడిన వెంకులు (14), ఎర్రబోతు రాంరెడ్డి(15), నంద్యాల శ్రీనివాసరెడ్డి (20) తోపాటు నల్లా నర్శింహులు (22) నల్లగొండ జైల్లో ఉండగా టైమ్ పత్రికకు చెందిన ఓ మహిళా జర్నలిస్టు వారిని కలిసి మైనర్ అయిన ఎర్రబోతు రామిరెడ్డి ఫొటోతో వ్యాసం రాసింది. అది పెను సంచలనంగా మారింది. లండన్ న్యాయవాది డీఎన్ ప్రిట్, బొంబాయ్ నుంచి డేనియల్ లతీఫ్, గణేష్ షాన్‌బాగ్ వంటి న్యాయవాదులు స్థానిక న్యాయవాది మనోహర్‌లాల్ సక్సేనాతో కలిసి మరణశిక్ష ఆపేందుకు ప్రయత్నించారు. అంతర్జాతీయంగా ఉరిశిక్ష లకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. జెకొస్లోవేకియాలో 10 వేల మందితో భారీ నిర్వహించారు. దీంతో అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్ క్షమాభిక్షతో మరణశిక్ష కాస్తా యావజ్జీవ శిక్షగా మారింది. 1956లో కొందరు, దీంతో 1958లో మరికొందరు విడుదలయ్యారు. నిజాంపై గర్జించిన కృష్ణా జిల్లా సాక్షి, అమరావతి: తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఉధృతం చేయడంలో, రజాకార్లను ఎదుర్కోవడంలో కృష్ణా జిల్లాకు ఘనమైన చరిత్ర ఉంది. 1944లో మొదలైన తెలంగాణ సాయుధ పోరాటం దొడ్డి కొమరయ్యను రజాకార్లు కాల్చేయడంతో తీవ్రరూపం దాల్చింది. నల్లగొండ జిల్లాలో మొదలైన ఉద్యమం క్రమంగా విస్తరించింది. కృష్ణా జిల్లా నుంచి అనేక మంది నేతలు ఈ సాయుధ పోరుకు ఊతమిచ్చారు. చండ్ర రాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య విజయవాడ నుంచే ఉద్యమానికి దిశానిర్దేశం చేశారు. సోవియట్ యూనియన్ తరహాలో విజయవాడలో ‘కమ్యూన్’ఏర్పాటు చేశారు. వడిసెలు, రాళ్లు, కత్తులు వంటి ఆయుధాల ప్రయోగం, తుపాకీ పేల్చడంలో శిక్షణ ఇచ్చారు. పగలంతా కలిసికట్టుగా శ్రమ చేసి సంపాదించిన సొమ్ముతో ఒకే చోట వండుకుని భోజనాలు చేసేవారు. రాత్రి సమయాల్లో యుద్ధ విద్యల్లో శిక్షణ పొందేవారు. ఇక్కడ శిక్షణ పొంది వెళ్లి నల్గొండ జిల్లాలో దళాలు ఏర్పాటు చేశారు. దళాల నేతృత్వంలోనే సాయుధ దాడులు జరిగాయి. ఈ పోరాటాల్లో జిల్లాకు చెందిన 13 మంది ప్రాణత్యాగాలు చేశారు. ‘దారి’ చూపిన ‘మెతుకుసీమ’ సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: భారత ప్రభుత్వం హైదరాబాద్ రాజ్యంపై పోలీసు చర్య చేపట్టాలని నిర్ణయించిన రోజులవి. అప్పటి కేంద్రహోంమంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ చొరవతో ఇండియన్ యూనియన్ సైన్యం హైదరాబాద్ రాజ్యాన్ని చుట్టుముట్టింది. ఉత్తరాన ఉన్న ఔరంగాబాద్ వైపు నుంచి సైనికచర్య మొదలైంది. ఉమ్మడి మెదక్ జిల్లా మీదుగానే హైదరాబాద్ రాజ్యంలోకి ప్రవేశించింది. అదెలా జరిగిందంటే.. నిజాం ప్రైవేట్ సైన్యం అయిన రజాకార్లు లాతూర్(మహారాష్ట్ర) నుంచి జహీరాబాద్ (సంగారెడ్డి జిల్లా)కు రైలులో బయలుదేరేందుకు సిద్ధమవుతుండగా ఒక్కసారిగా భారత సైన్యం బాంబుల మోత మోగించింది. దీంతో రజాకార్లు రైలు దిగి పరుగెత్తారు. ట్రక్కుల్లో పారిపోయారు. కొన్నిట్రక్కులు అదుపుతప్పి రోడ్డు పక్కన గుంతల్లో కూరుకుపోయాయి. అప్పటికే దౌల్తాబాద్, హుమ్నాబాద్, జాల్న ప్రాంతాలు భారతసైన్యం వశమయ్యాయి. 1948 సెప్టెంబర్ 16 భారత సైన్యం జహీరాబాద్ వైపు రోడ్డుమార్గంలో వస్తుండగా రజాకార్లు ఎక్కెల్లి (ప్రస్తుతం కర్ణాటకలో ఉంది) వంతెనను కూల్చేశారు. అయితే భారత సైన్యం తాత్కాలిక వంతెన నిర్మించుకుని ముందుకు సాగడంతో నిజాంసేన చెల్లాచెదురైంది. ఇలా జహీరాబాద్‌ను భారత సేనలు వశపరుచుకున్నాయి. 1948 సెప్టెంబర్ 17 భారతసైన్యం జహీరాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వస్తుండగా పటాన్చెరు ప్రాంతంలో రజాకార్లు రోడ్డుకు ఇరువైపులా పేలుడు పదార్థాలు ఉంచారు. అప్రమత్తమైన భారతసైన్యం రూట్ మార్చి బొల్లారం మీదుగా ముందుకు సాగాయి. 1948 సెప్టెంబర్ 18 (సాయంత్రం 4 గంటలు): భారత సైన్యం బొల్లారం చేరింది. నిజాం సైన్యాధ్యక్షుడైన ఎల్.ఎద్రూస్ తన ఆయుధాలను వీడి భారత సైన్యం మేజర్ జనరల్ జేఎన్ చౌదరి ఎదుట లొంగిపోయారు. దీంతో ప్రజలు జయజయ ధ్వానాలతో భారత సైనికులకు స్వాగతం పలికారు. స్వేచ్ఛా స్వాతంత్య్రాలు పొందామని ఆనందోత్సవాలు చేసుకున్నారు. -
అణచివేతపై సాయుధ పోరాటం!
సాక్షి, హైదరాబాద్: నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల దాష్టీకాలు ఓ వైపు.. జమీందార్ల దుర్మార్గాలు మరోవైపు.. దారుణమైన బతుకుల నుంచి బయటపడేందుకు పుట్టిన ఉద్యమమే తెలంగాణ సాయుధ పోరాటం. 1946 సెప్టెంబర్ 11న మొదలై 1951 అక్టోబర్ 21 దాకా ఐదేళ్లకుపైగా సాయుధ ఉద్యమం కొనసాగింది. ప్రపంచ చరిత్రలోని గొప్ప పోరాటాల్లో ఒకటిగా నిలిచింది. 1946లో చాకలి ఐలమ్మ సాగుభూమి మీద జమీందారు విసునూరు రాంచంద్రారెడ్డి కన్ను పడింది. ఆ భూమిని, పంటను స్వాధీనం చేసుకునేందుకు గూండాలను పంపాడు. భీమిరెడ్డి నర్సింహారెడ్డి, చకిలం యాదగిరిరావు, నల్ల ప్రతాపరెడ్డి తదితరుల సహకారంతో ఐలమ్మ తిరగబడింది. భీమిరెడ్డి నర్సింహారెడ్డి వంటి వారిని పోలీసులు అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టారు. అయితే ఐలమ్మ భూమిని, ధాన్యాన్ని భూస్వాములు స్వాధీనం చేసుకోలేక పోయారు. దీంతో ఆవేశం పట్టలేక కడివెండి గ్రామ నాయకులను హత్య చేయాలని పథకం వేశారు. 1946 జూలై 4న దేశ్‌ముఖ్ మనుషులు గ్రామ నాయకుల ఇళ్ల మీద రాళ్లు వేయడంతో.. ప్రజలు లాఠీలు, వడిసెలు చేత బట్టుకుని ప్రదర్శనగా బయలు దేరారు. ఈ ఊరేగింపు జమీందారు ఇంటి దగ్గరికి రాగానే.. జమీందారు మనుషులు కాల్పులు జరపడంతో గ్రామ నాయకుడు దొడ్డి కొమరయ్య బలయ్యాడు. ఈ విషయం దావానలంలా వ్యాపించి.. ఊరూరా జనం తిరుగుబాటు మొదలు పెట్టారు. ఆ ప్రతిఘటనను అణచి వేసేందుకు జమీందార్ల మనుషులు, రజాకార్లు, నిజాం పోలీసులు దాడులకు దిగారు. అయినా ప్రజలు తిరుగుబాటు ఆపలేదు. ఈ క్రమంలోనే కమ్యూనిస్టు పార్టీ 1946 సెప్టెంబర్ 11న సాయుధ పోరాటానికి పిలుపునిచ్చింది. పేదలకు 10 లక్షల ఎకరాలు పంపిణీ.. అణచివేత, దోపిడీలకు వ్యతిరేకంగా మొదలైన సాయుధ ఉద్యమం భూపోరాటంగా మారి దున్నేవాడికే భూమి దక్కాలని నినదించింది. నిజాం రాచరికం, జమీందార్ల అరాచక పాలన మీద తిరుగుబాటుగా మారింది. భూమి కోసం, భుక్తి కోసమేగాక సామాజిక వివక్షపైనా పోరాటం జరిగింది. మూడు వేల గ్రామాలకు ఉద్యమం విస్తరించింది. భూస్వాములు, జమీందార్ల నుంచి పది లక్షల ఎకరాలకుపైగా భూమిని రైతులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా తాకట్టులో ఉన్న భూములను విడి పించుకున్నారు. రుణపత్రాలను రద్దు చేసి.. పశువులను పంపిణీ చేశారు. ఈ పోరాటాల్లో ఆరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యం వంటి మహిళలూ ముందు నిలిచారు. 4 వేల మంది వీర మరణంతో.. రైతాంగ సాయుధ పోరాటం నడుస్తుండగానే 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ఎన్నో సంస్థానాలు ఇండి యన్ యూనియన్‌లో విలీనమైనా.. నిజాం సంస్థానం మాత్రం ఒప్పుకోలేదు. దీనికి నాటి భారత ప్రభుత్వం అంగీకరించింది. నిజాం రాజుతో 1947 నవంబర్ 29న యథాతథ ఒప్పందంపై సంతకాలు చేసింది. కానీ తెలంగాణ ప్రజలు నిజాం పాలన అంతం కావాలని, హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కావాలని పోరాటాలు చేశారు. అందులో భాగంగా సాయు ధ పోరాటం ఉధృతంగా కొనసాగింది. రజాకార్లు, నిజాం సైన్యాల దాడుల నుంచి రక్షణకోసం.. పదివేల మంది గ్రామదళ సభ్యులు, దాదాపు రెండు వేల గెరిల్లా దళ సభ్యులతో శక్తివంతమైన సాయుధ బలగాన్ని నిర్మించుకోగలిగారు. కానీ నిజాం పాలకులు, జమీందార్లు కలిసి.. నాలుగు వేల మంది కమ్యూనిస్టు కార్యకర్తలు, రైతులను హతమార్చారు. మరెన్నో వేల మందిని నిర్బంధ శిబిరాల్లో, జైళ్లలో బందీలను చేశారు. అయినా సాయుధ పోరాటం ఉధృతంగా సాగింది. ఈ పోరాటం తమ గెరిల్లా పోరాటం కంటే గొప్పదని క్యూబా ఒక సందర్భంలో వ్యాఖ్యానించడం గమనార్హం. విమోచన కాదు.. అది విలీన ఒప్పందం: మొయిన్ గోల్కొండ: అప్పటి హైదరాబాద్ సంస్థానం విలీనం సందర్భంగా యూనియన్ ప్రభుత్వానికి, నిజాం చివరి పాలకుడికి మధ్య విలీన ఒప్పందం జరిగిందని ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు ఎంకే మొయిన్ అన్నారు. దీనిని కొన్ని రాజకీయ పార్టీలు వక్రీకరించి విమోచన దినంగా చెబుతూ సంబరాలు జరుపుకోవడం సరికాదన్నారు. ఖాసీం రజ్వీ నాయకత్వంలోని రజాకార్లకు హిందూ జమీందారులైన దేశ్‌ముఖ్‌లు అండగా ఉండి ఆర్థిక సహాయం అందించారని తెలిపారు. అయితే ఈ సత్యాన్ని ఇప్పుడు కొందరు వక్రీకరిస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. భారతదేశంలో నిజాం సంస్థానం విలీనంపై అప్పటి ప్రధాని జవహర్లాల్ న్రెహూ ముద్ర స్పష్టంగా ఉందని, అయితే కొంతకాలంగా విలీన హీరోగా వల్లభాయ్ పటేల్‌ను చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థిగా 1944 సంవత్సరంలో దారుల్ షిఫా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నప్పుడే తాను కమ్యూనిస్టు పార్టీ వైపు ఆకర్షితుడినయ్యానని పేర్కొన్నారు. తెలంగాణ విలీన సమయంలోనూ అజ్ఞాతంలోనే ఉన్నానని చెప్పారు. అటువంటి తనను సన్మానిస్తామని విమోచనోత్సవం నిర్వహిస్తున్న బీజేపీ పిలవడం విడ్డూరంగా ఉందన్నారు. (క్లిక్ చేయండి: విముక్తి సమరంలో చరిత్రకెక్కిన పరకాల పోరు) -
నిజాం నిరంకుశత్వంపై నినదించిన ‘మా భూమి’
సాక్షి, హైదరాబాద్: ‘మా భూమి’ ఒక సినిమా మాత్రమే కాదు. ఒక చారిత్రక దృశ్యకావ్యం. తెలుగు సినీచరిత్రలోనే ఒక అద్భుతమైన ప్రయోగం. నిజాం నిరంకుశత్వాన్ని, రజాకార్ల అకృత్యాలను, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని సమున్నతంగా ఎత్తిపట్టిన సామాజిక చిత్రం. నలభై రెండేళ్ల క్రితం విడుదలైన ‘మా భూమి’సినిమా ఇప్పటికీ ప్రేక్షాకాదరణను పొందుతూనే ఉంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆ సినిమా ఒక చర్చనీయాంశం. సాయుధపోరాటాన్ని, తెలంగాణలో పోలీస్ యాక్షన్ కాలాన్ని ‘మాభూమి’లో చిత్రీకరించారు. రజాకార్ల దోపిడీ, దౌర్జన్యాలను, హింసను చూసిన హైదరాబాద్ రాజ్యం పోలీసు యాక్షన్‌తో భారత యూనియన్‌లో భాగమైంది.ఆ నాటికి ఒక కీలకమైన దశాబ్ద కాలాన్ని అద్భుతమైన మా భూమి సినిమా ద్వారా ప్రపంచానికి పరిచయం చేశారు చిత్ర నిర్మాత, సంగీత దర్శకులు బి. నర్సింగ్‌రావు. అప్పటి అనుభవాలు ఆయన ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే... నిర్మాత నర్సింగరావుతో నటుడు సాయిచంద్ అదొక ప్రయోగం.. ‘మా భూమి’ సినిమా ఒక ప్రయోగం.అప్పటి వరకు సినిమా తీసిన అనుభవం లేదు. నటీనటులు కూడా అంతే. స్టేజీ ఆర్టిస్టులు. సాయిచంద్ బహుశా గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. క్రికెట్ ఆడుతుండగా తీసుకెళ్లాం, ఆయనకు అదే మొదటి సినిమా. కాకరాల, భూపాల్‌రెడ్డి, రాంగోపాల్, తదితరులంతా రంగస్థల నటులు. సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణులు, దర్శకుడు గౌతమ్‌ఘోష్ అందరం కలిసి ఒక ఉద్యమంలాగా ఈ సినిమా కోసం పని చేశాం. ►1978 నుంచి 1980 వరకు సినిమా నిర్మాణం కొనసాగింది. చిత్రం షూటింగ్ ప్రారంభోత్సం నుంచి లెక్కిస్తే ఇప్పటికి 44 ఏళ్లు. విడుదలైనప్పటి నుంచి అయితే 42 సంవత్సరాలు. సినిమా విడుదలైన రోజుల్లో సినిమా టాకీస్ల వద్దకు జనం పెద్ద ఎత్తున ఎడ్ల బండ్లు కట్టుకొని వచ్చేవారు. సినిమా టాకీసులన్నీ జాతర వాతావరణాన్ని తలపించేవి. హైదరాబాద్‌లో ఈ సినిమాకు అపూర్వమైన ఆదరణ లభించింది. దర్శకుడు గౌతమ్‌ఘోష్ మా భూమిని అత్యంత ప్రతిభావంతంగా, సృజనాత్మకంగా, ఒక దృశ్యకావ్యంలా చిత్రీకరించారు. ‘మా భూమి’ సినిమాలోని సన్నివేశాలు హైదరాబాద్‌లో చిత్రీకరణ... మా భూమి సినిమాను చాలా వరకు మొదక్ జిల్లా మంగళ్పర్తి, దొంతి గ్రామాల్లో , శివంపేట గడీలో చిత్రీకరించాము. విద్యుత్ సదుపాయం కూడా లేని ఆ రోజుల్లో పగటిపూటనే చీకటి వాతావరణాన్ని చిత్రీకరించి సినిమా షూటింగ్ చేశాం.రజాకార్ల దాడి , కమ్యూనిస్టుల పోరాటాలు వంటి కీలకమైన ఘట్టాలను చిత్రీకరించే సమయంలో కళాకారులకు దెబ్బలు కూడా తగిలేవి. గాయాలకు కట్టుకట్టేందుకు రోజుకు ఒక అయోడిన్ బాటిల్ చొప్పున వినియోగించిన సందర్భాలు ఉన్నాయి. హైదరాబాద్‌లో చాలా చోట్ల సినిమా చిత్రీకరణ జరిగింది. హైదరాబాద్ నగర సంస్కృతిని ప్రతిబింబించేవిధంగా ఆఫ్జల్‌గంజ్‌లోని ఇరానీ హాటల్లో ఒక సన్నివేశాన్ని తీశాం. అలాగే కార్వాన్, జాహనుమా, జూబ్లీహాల్, వనస్థలిపురం, నయాఖిల్లా, సాలార్జంగ్ మ్యూజియం, కాలాగూడ, తదితర ప్రాంతాల్లో మా భూమి సినిమా తీశాం. కథానాయిక చంద్రి నివాసం, గుడిసెలు అంతా హైదరాబాద్‌లోనే సెట్టింగ్ వేశాం.ఈ సినిమా ఒక అద్భుతమైన అనుభవం. అందరికీ ఒకే కిచెన్ ఉండేది. అందరం కలిసి ఒకే చోట భోజనాలు చేసేవాళ్లం. లారీల్లో ప్రయాణం చేసేవాళ్లం, ప్రజలు కళాకారులే... ఆ రోజుల్లో కేవలం రూ.5.40 లక్షలతో ఈ సినిమా పూర్తయింది. ఆర్టిస్టులకు రూ.300, రూ.500, రూ.1000 చొప్పున ఇచ్చాం.చాలా మంది స్వచ్చందంగా నటించారు. సగం మంది ఆర్టిస్టులు ఉంటే మిగతా సగం మంది ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజలే. షూటింగ్ సందర్శన కోసం వచ్చిన వాళ్లే ఆర్టిస్టులయ్యారు. ఒకసారి 80 మంది గ్రామస్తులకు ఆ రోజు కూలి డబ్బులు మాత్రమే చెల్లించి సినిమా షూటింగ్లో భాగస్వాములను చేశాం.అప్పటి తెలంగాణ సమాజాన్ని, రజాకార్ల హింసను, పోలీసు చర్య పరిణామాలను ఈ సినిమా ఉన్నదున్నట్లుగా చూపించింది. ‘ అని వివరించారు. బండెనుక బండి కట్టి... ఈ సినిమాలో ప్రజాగాయకుడు గద్దర్ పాడిన పాట అప్పటి నిజాం రాక్షస పాలన, జమీందార్ల దౌర్జన్యాలపైన ప్రజల తిరుగుబాటును కళ్లకు కట్టింది. ‘బండెనుక బండి కట్టి. పదహారు బండ్లు కట్టి.. నువు ఏ బండ్లె పోతవురో నైజాము సర్కరోడా....’ అంటూ గద్దర్ ఎలుగెత్తి పాడిన ఆ పాటు ప్రజలను పెద్ద ఎత్తున కదిలించింది. నిజాం నిరంకుశ పాలనపైన, దొరలు, జమీందార్ల పెత్తనంపైన ప్రజాగ్రహం పెల్లుబికేవిధంగా ఈ పాట స్ఫూర్తిని రగిలించింది. -
నిజాం పాలన తర్వాత తెలంగాణకు 75 ఏళ్ళు
-
అనగనగా హైదరాబాద్.. భాగ్యనగరంలో స్వరాజ్య సమరశంఖం
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో ఆ రోజు మువ్వన్నెల జెండా రెపరెపలాడలేదు. దేశమంతా స్వాతంత్య్రోత్సవాలు వెల్లివిరిసిన 1947 ఆగస్టు 15న హైదరాబాద్‌లో జాతీయోద్యమ నేతలు, కాంగ్రెస్ నాయకులు, వివిధ వర్గాల ప్రజలు రహస్యంగానే తమ దేశభక్తిని చాటుకున్నారు. కానీ దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన జాతీయోద్యమానికి దీటుగా హైదరాబాద్‌లోనూ మహత్తరమైన స్వాతంత్య్ర పోరాటాలు జరిగాయి. న గరంలోని అబిడ్స్, కోఠి, సుల్తాన్‌బజార్, బొగ్గులకుంట, ట్రూప్‌బజార్, కుందన్‌బాగ్ వంటి ప్రాంతాలు స్వాతంత్య్రోద్యమ నినాదాలతో మార్మోగాయి. గాంధీజీ పిలుపు మేరకు స్వామి రామానంద తీర్థ నేతృత్వంలో స్టేట్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉద్యమాలను చేపట్టారు. ఇదంతా ఒకవైపు అయితే భారత ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంగా పేరొందిన సిపాయిల తిరుగుబాటు హైదరాబాద్‌లోనూ ఉవ్వెత్తున ఎగిసిపడింది. బ్రిటిష్ వలస పాలనను, ఆధిపత్యాన్ని ప్రతిఘటించింది. ఒప్పందంపై నిరసన... అప్పటి నిజాం నవాబు 1800 బ్రిటిష్ ప్రభుత్వంతో సైనిక సహకార ఒప్పందం ఏర్పాటు చేసుకున్నాడు. ఈ మేరకు బ్రిటిష్ అధికార ప్రతినిధికి హైదరాబాద్‌లో రెసిడెన్సీ (కోఠి)ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అదే ఏడాది అక్టోబర్ 12 నుంచి సహకార ఒప్పందం అమల్లోకి వచ్చింది. అయితే అప్పటికే జాతీయ భావాలతో చైతన్యం పొందిన యువత బ్రిటిష్ ఆధిపత్యం పట్ల తమ వ్యతిరేకతను చాటుకుంది. అదే సమయంలో బెంగాల్ సహా దేశవ్యాప్తంగా బ్రిటిష్ పాలకుల వ్యతిరేకంగా మొదలైన వహాబీ ఉద్యమం నగరంలోని ఉద్యమకారులను ప్రభావితం చేసింది. అప్పటి నిజాం నవాబు నసీరుద్దౌలా సోదరుడు ముబారిజ్ ఉద్దౌలా నగరంలో వహాబీ ఉద్యమానికి సారథ్యం వహించాడు. 20 వేల మంది వహాబీ ఉద్యమకారులతో బ్రిటిష్ అధికార ప్రతినిధిపై దాడికి ప్రయత్నించాడనే ఆరోపణలపై నిజాం ప్రభుత్వం ఆయనను అరెస్టు చేసి 1854లో చనిపోయే వరకు కోటలోనే బంధించారు. చదవండి: ఇంటిపై జాతీయ జెండా ఎగురవేస్తున్నారా?.. ఈ నియమాలు తప్పనిసరి.. నగరంలో 1857 అలజడి.. మీరట్, లక్నో తదితర ప్రాంతాల్లో సిపాయిలు చేపట్టిన తిరుగుబాటు హైదరాబాద్‌లో పెద్దఎత్తున అలజడిని సృష్టించింది. అప్పటికే ముబారిజ్‌ద్దౌలా మృతితో ఆగ్రహంతో ఉన్న ఉద్యమకారులు బ్రిటిష్ ప్రభుత్వంపై ప్రతీకారేచ్ఛతో రగిలిపోయారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ కేంద్రంగా సిపాయిల తిరుగుబాటును చేపట్టేందుకు వచ్చాడనే ఆరోపణలతో జమేదార్ చీదాఖాన్‌ను అరెస్టు చేశారు. దీంతో బ్రిటిష్ ప్రభుత్వంపై ఉద్యమకారుల వ్యతిరేకత తీవ్రస్థాయికి చేరుకుంది. జమేదార్ తుర్రెబాజ్‌ఖాన్, మౌల్వీ అల్లావుద్దీన్‌ల నేతృత్వంలో సుమారు 500 మంది రొహిల్లాలు 1857 జూలై 17వ తేదీన బ్రిటిష్ రెసిడెన్సీ కోఠిపై దాడి చేశారు. బ్రిటిష్ సైనికుల ప్రతిఘటనతో ఇది విఫలమైంది. ‘బ్రిటిష్ వాళ్లను దేశం నుంచి తరిమివేయడమే తమ లక్ష్యమని’ తుర్రెబాజ్ ఖాన్ ప్రకటించడంతో అరెస్టు చేసి జీవిత ఖైదు విధించింది. జైలు నుంచి తప్పించుకొని పారిపోయే క్రమంలో పోలీసులు అత్యంత దారుణంగా కాల్చి చంపారు. అతని శవాన్ని జోగిపేట వద్ద బహిరంగంగా వేలాడదీసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. ♦ఇలా నగరంలో జాతీయోద్యమానికి స్ఫూర్తినిచ్చింది ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం. -
సైకిళ్లకు రిజిస్ట్రేషన్.. అతిక్రమిస్తే చలాన్లు!
నిజాం సంస్థానంలో ప్రధాన ప్రయాణ సాధనం సైకిల్. అప్పట్లో నగర రోడ్లపై ఎటు చూసినా ఇవే దర్శనమిచ్చేవి. 1918లో హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చిన సైకిళ్లు... 2000 సంవత్సరం వరకు రాజ్యమేలాయి. అయితేసంస్థానంలో సైకిళ్లకు రిజిస్ట్రేషన్ ఉండేది. వినియోగదారులు పన్నులు కూడా చెల్లించేవారు. నిబంధనలు అతిక్రమిస్తేచలాన్లు కూడా విధించేవారు. సిటీలో సైకిల్ రాజ్యంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. సాక్షి, హైదరాబాద్ : యూరోపియన్ దేశాల్లో 1860లలోనే సైకిళ్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ... హైదరాబాద్‌లో 1918 నుంచి వాడుకలోకి వచ్చాయి. అప్పట్లో వీటిని ఇంగ్లాండ్, ఫ్రాన్స్ తదితర దేశాల నుంచి దిగుమతి చేసుకునేవారు. ఆర్డర్ ఇచ్చిన మూడు నాలుగు నెలల్లో ముంబైకి వస్తే.. అక్కడి నుంచి రైలు మార్గంలో నగరానికి తీసుకొచ్చేవారు. అయితే తొలుత ఇవి కేవలం ఉన్నత వర్గాలు, ధనిక కుటుంబాలకే పరిమితమయ్యాయి. ప్రభుత్వ అధికారులు, పోలీస్‌ల దగ్గర ఉండేవి. 1938లో కోఠి, అబిడ్స్ ప్రాంతాల్లో సైకిల్ షాపులు ప్రారంభమయ్యాయి. వ్యాపారులు విదేశాల్లో తయారయ్యే సైకిళ్లను ముంబై నుంచి దిగుమతి చేసుకొని ఇక్కడ విక్రయించేవారు. షాపులు ఏర్పాటు చేయడంతో సాధారణ ప్రజలకు కూడా ఇవి అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా 1951లో అట్లాస్ తదితర కంపెనీలు మన దేశంలో ప్రారంభమవడంతో సైకిళ్ల వినియోగం విరివిగా పెరిగింది. రిజిస్ట్రేషన్ తప్పనిసరి... హైదరాబాద్ సంస్థానంలో సైకిల్ కొంటే దాన్ని తప్పనిసరిగా బల్దియాలో రిజిస్ట్రేషన్ చేయించాలనే నిబంధన ఉండేది. సైకిల్ కొనుగోలుకు సంబంధించిన రసీదు, యజమాని చిరునామాతో సహా రుసుం చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించేవారు. బల్దియా అధికారులు సిల్వర్ టోకెన్‌పై సైకిల్ రిజిస్ట్రేషన్ నెంబర్, గడువు వివరాలు మెషిన్‌తో ముద్రించి ఇచ్చేవారు. ఆ సిల్వర్ టోకెన్‌ను సైకిల్ ముందు భాగంలో అమర్చేవారు. సైకిళ్లకు రిజిస్ట్రేషన్ లేని పక్షంలో పోలీసులు జరిమానా విధించడంతోస్వాధీనం చేసుకునేవారు. ప్రతిఏటా రుసుం చెల్లించి రిజిస్ట్రేషన్ రెన్యూవల్ చేయించాల్సి ఉండేది. సైకిళ్లు వినియోగించేవారు నిజాం కాలంలో పలు నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సి ఉండేవి. సైకిల్‌పై ఇద్దరి కంటే ఎక్కువ మంది ప్రయాణించరాదు. రాత్రి సమయంలో సైకిల్ నడిపితే.. దాని ముందు భాగంలో లాంతర్ లైట్ తప్పనిసరి ఉండాలి. లాంతర్ల అనంతరం డైనమాను వెనక టైరుకు అమర్చి దాని ద్వారా లైట్‌ను వెలిగించేవారు. నిబంధనలు పాటించని పక్షంలో చలాన్లు విధించేవారు. ఒకటి కంటే ఎక్కువ సార్లు పోలీసులకు పట్టుబడితే సైకిల్ సీజ్ చేసేవారు. స్వాతంత్య్రానంతరం 1976 వరకు చలాన్ల వ్యవస్థ కొనసాగింది. ఆ తర్వాత దీన్ని ప్రభుత్వం రద్దు చేసింది. అలా 50 ఏళ్లు... 1951లో దేశీయ సైకిల్ తయారీ కంపెనీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత వాటి వాడకం విరివిగా పెరిగింది. 2,000 సంవత్సరం వరకు నగర రోడ్లపై సైకిళ్లు రయ్‌మంటూ దూసుకెళ్లాయి. గ్రామాల్లోనూ సైకిళ్ల వినియోగం ఎక్కువగా ఉండేది. అయితే 2,000 సంవత్సరం తర్వాత మోటార్ బైక్‌లు అందుబాటులోకి రావడంతో సైకిళ్ల వినియోగం తగ్గింది. కానీ మళ్లీ ఇప్పుడు సైక్లింగ్‌పై చాలామంది ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా నగర యువత వారాంతంలో ప్రత్యేకంగా సైక్లింగ్ పోటీలు నిర్వహిస్తూ పాల్గొంటున్నారు. -
తప్పుల పుట్ట.. భూ రికార్డుల చిట్టా
సాక్షి, హైదరాబాద్ ఒకటి కాదు.. రెండు కాదు... ఏకంగా 74 లక్షల తప్పులు. ఏళ్ల తరబడి దిద్దుబాటుకు నోచుకోని భూ రికార్డుల్లో ఉన్న లోపాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళనలో వెలుగులోకి వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1.7 కోట్ల సర్వే నంబర్లలో 2.4 కోట్ల ఎకరాల భూ విస్తీర్ణం ఉంటే అందులో దాదాపు మూడో వంతు.. అంటే 74 లక్షల ఎకరాలకు సంబంధించిన రికార్డుల్లో తప్పులు నమోదయ్యాయనే గణాంకాలు ఇన్నాళ్లూ తప్పులతడకగా సాగిన రెవెన్యూ వ్యవహా రాలను ఎత్తిపొడుస్తున్నాయి. చిన్నదైనా, పెద్దదైనా తప్పులను సరిచేయకపోవడం, దశాబ్దాల తరబడి ఆ తప్పులు అలాగే కొనసాగడం రెవెన్యూ యంత్రాంగం నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. లక్షల ఎకరాల రికార్డుల్లో తప్పులు గత ఏడాది సెప్టెంబర్ 15 నుంచి రాష్ట్ర ప్రభుత్వం భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టింది. ఎప్పుడో నిజాం కాలంలో సరిచేసిన రికార్డులను పూర్తిగా సవరించి రైతులకు పెట్టుబడి సాయం అందిస్తామంటూ ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రక్రియలో మొదటి నుంచీ విస్మయకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డిసెంబర్ 31, 2017 నాటికే ఈ ప్రక్షాళన కార్యక్రమం గడువు అధికారికంగా ముగిసినా అక్కడక్కడా ఇంకా జరుగుతూనే ఉంది. అయితే, సోమవారం వరకు అందిన లెక్కల ప్రకారం మొత్తం 74,42,910 ఎకరాల రికార్డుల్లో తప్పులున్నాయని తేలింది. ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో అయితే ఈ తప్పులు లక్షల సంఖ్యలో నమోదయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో 9,44,290 ఎకరాల భూ విస్తీర్ణం ఉంటే అది కాస్తా భూ రికార్డుల ప్రక్షాళన తర్వాత ఏకంగా 13,86,943 ఎకరాలకు పెరిగింది. ఇందులో 8,09,827 ఎకరాల రికార్డుల్లో తప్పులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, మేడ్చల్–మల్కాజ్గిరి మినహా అన్ని జిల్లాల్లో లక్ష ఎకరాలకు పైగానే తప్పులు కనిపించాయి. ఖమ్మం, కామారెడ్డి జిల్లాల్లో ఇలా నమోదయిన తప్పుల సంఖ్య 5 లక్షలు దాటింది. మంచిర్యాలలో 4.38 లక్షలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 3.46 లక్షల ఎకరాల రికార్డుల్లో తప్పులు నమోదయ్యాయని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. మిగిలిన అన్ని జిల్లాల్లోనూ పరిశీలిస్తే అత్యల్పంగా మేడ్చల్– మల్కాజిగిరి జిల్లా రికార్డుల్లో తప్పులు తక్కువగా ఉన్నాయని తేలింది. ఇక్కడ మొత్తం భూ విస్తీర్ణం 2,63,582 ఎకరాలుంటే, రికార్డుల పరిశీలన తర్వాత అది 2,92,788 ఎకరాలకు చేరగా, అందులో 2,75,171 ఎకరాల రికార్డులు సరిగా ఉన్నాయని తేలింది. అంటే ఆ జిల్లాలో కేవలం 17,617 ఎకరాల రికార్డుల్లోనే తప్పులు తేలాయి. అందులోనూ 10,935 ఎకరాల రికార్డులను సరిచేయగా, ఇంకా 6,681 ఎకరాల రికార్డులను సరిచేయాల్సి ఉంది. ఇలా లక్షల సంఖ్యలో నమోదయిన తప్పుల్లో ఇప్పటివరకు 66,52,986 ఎకరాల విస్తీర్ణంలోని రికార్డులను సరిచేశారు. మరో 28 లక్షల ఎకరాల్లో రికార్డులను సరిచేసే ప్రక్రియలో రెవెన్యూ యంత్రాంగం నిమగ్నమై ఉంది. మరో వారం ఆగితేనే... వాస్తవానికి, గత ఏడాది డిసెంబర్ 31తోనే భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం ముగియాల్సి ఉన్నా ఇప్పటి వరకు 22 జిల్లాల్లోనే ఈ ప్రక్రియ పూర్తయిందని గణాంకాలు చెబుతున్నాయి. సంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, పెద్దపల్లి, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో కొంత మేర పూర్తి కావాల్సి ఉంది. మిగిలిన అన్ని జిల్లాల్లో పాత సేత్వార్లు, ఖాస్రా పహాణీలలో ఉన్న సర్వే నంబర్ల కన్నా ఎక్కువ సర్వే నంబర్లలోనే పరిశీలన పూర్తయింది. ఈ ఎనిమిది జిల్లాల్లోనూ నేడో, రేపో ప్రక్రియ పూర్తి కానుంది. అయితే, తప్పులను సరిచేయడంతో పాటు అన్లైన్ రికార్డులను కేటగిరీల వారీగా తయారు చేసేందుకు మరో వారంరోజులు పడుతుందని అధికారులంటున్నారు. ఈ వారం ఆగితేనే రాష్ట్రంలోని భూ కమతాలకు సంబంధించిన పక్కా లెక్కలు తేలుతాయని వారంటున్నారు. -
రాష్ట్రంలో రజాకారుల పాలన
ఆత్మకూరు(ఎం) : తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పరిపాలన చూస్తుంటే రజాకారుల పాలన తలపిస్తుందని డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్య గౌడ్ విమర్శించారు. శనివారం మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులకు ఏనాడు వ్యతిరేకం కాదన్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ప్రతి పక్షాల నాయకులను అరెస్టు చేసి భయభ్రాంతులకు గురిచేస్తుందన్నారు. దళితులకు మూడు ఎకరాల భూపంపిణీ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎంసెట్–2 పరీక్ష లీకేజీకి ప్రభుత్వం నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి, సంబంధిత ఇద్దరు మంత్రులు పదవులకు రాజీనామా చేయాలన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొడిత్యాల నరేందర్ గుప్తా, సింగిల్ విండో చైర్మన్ జిల్లాల శేఖర్‌రెడ్డి, నాయకులు యాస లక్ష్మారెడ్డి, కందడి అనంతరెడ్డి, ముద్దసాని సిద్దులు, కట్టెకోల హన్మంతు గౌడ్, బొడిగె భిక్షపతి, యాదగిరి ఉన్నారు. -
నిజాంపాలనలో అభివృద్ధి అమోఘం:హోంమంత్రి
నాంపల్లి: నిజాం నవాబులు తమ పాలనలో అభివృద్ధికి పెద్ద పీట వేశారని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. శనివారం రెడ్‌హిల్స్‌లోని ఫెడరేషన్ హౌస్‌లో బద్రివిశాల్ పన్నాలాల్ పిత్తి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న 450 మంది మెరిట్ విద్యార్థులకు రూ.70 లక్షలు ఉపకార వేతనాలు అందజేశారు. ముఖ్య అతిధిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుతం మనం మాట్లాడుతున్న డ్రైనేజీ, మంచినీటి వసతి, విద్య, ఆరోగ్యాల పరిరక్షణకు నిజాం పాలన నాటి నుంచే బలమైన బీజాలు పడ్డాయన్నారు. దీనికి అప్పటి నిజాం రాజుకు సలహాదారుగా ఉన్న మోతీలాల్ పిత్తి లాంటి వారి దూరదృష్టి ప్రముఖంగా ఉందన్నారు. నిజాం నవాబుల పాలనలో హైదరాబాదు అభివృద్ధి కోసం సలహాలు అందించి మోతీలాల్ పిత్తి, బద్రివిశాల్ పిత్తి ప్రముఖ పాత్ర పోషించారని కొనియాడారు. బద్రి విశాల్ పిత్తి అప్పట్లో అన్ని ట్రేడ్ యూనియన్లు, కార్మిక సంఘాలకు నాయకత్వం వహించడమే కాకుండా, పేదలకు ఆర్థిక సాయం అందించేవారని, దీనిని ఆయన తనయుడు శరద్ బి.పిత్తి కొనసాగించడం అభినందనీయమన్నారు. బద్రి విశాల్ పన్నాలాల్ పిత్తి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శరద్ బి.పిత్తి మాట్లాడుతూ ఈ సంవత్సరం 6 నుంచి మొదలుకుని పీజీ విద్య దాకా 1300 మందికి ఉపకార వేతనాలు అందిస్తున్నట్లు తెలిపారు. తాము విద్యలో ప్రతిభ ఉన్న పేదలకు మాత్రమే ఉపకార వేతనాలు అందిస్తామన్నారు. ట్రస్టీలు అక్షయ్ ఎ.పిత్తి, జి.విజయ్ కుమార్, అజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కార్యశూరుడు నరేంద్రమోదీ
నిజాం పాలన నుంచి తెలంగాణ విముక్తమైన రోజు, ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సెప్టెంబర్ 17వ తేదీయే. మోదీ ఇంతటి ప్రజాదరణ ఎలా పొంద గలుగుతున్నాడో అర్థం చేసుకోవాలంటే ఆయన జీవిత మూలా ల్లోకి వెళ్లాలి. ఇటీవల ‘టైమ్’ మ్యాగజైన్ ఇంటర్వ్యూ లో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, పేదరికంలో పుట్టి పెరగడమే తనకు మొదటి స్ఫూర్తి అన్నారు మోదీ. 1950లో గుజరాత్‌లోని వడోదరా ప్రాంతంలో ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన మోదీకి చిన్ననాడే ఆర్ఎస్ఎస్తో పరిచయమైంది. ప్రచారక్‌గా సామా జిక, సేవా కార్యక్రమాల ద్వారా క్షేత్రస్థాయిలో పట్టు సాధించి, దృఢమైన నేతగా ఎదిగారు. 1987లో బీజే పీలో చేరి, అంచెలంచెలుగా 1998లో బీజేపీ జాతీ య ప్రధాన కార్యదర్శిగా ఎదిగారు. 2001 నాటి గుజరాత్ దారుణ భూకంపం దరిమిలా పునరావాస కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేయడానికి మోదీని కేశూభాయ్ పటేల్ స్థానంలో ముఖ్యమంత్రి గా పార్టీ నియమించింది. 2002లో గోద్రా అల్లర్లు మోదీ కను సన్నలలోనే జరిగాయని విపక్ష కాంగ్రెస్ అసత్య ప్రచారం చేసి ఆయనను మత వాదిగా చిత్రీకరించింది. 2014 వరకు ఈ విషప్రచారం సాగుతూనే ఉంది. అయితే నిబద్ధతతో, కార్యదీక్షతతో ప్రతీ సారి కాంగ్రెస్‌ను చిత్తు చేశాడు మోదీ. 2014 ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా రంగం లోకి దిగిన మోదీ సాంకేతిక పరిజ్ఞానంతో, వాగ్ధా టితో ప్రజల చేత నమో, నమో అని మంత్రం జపం చేయించారు. ఫలితంగా గత మూడు దశాబ్దాల్లో ఎన్నడూలేని విధంగా సంకీర్ణాలకు చరమగీతం పాడి బీజేపీకి పట్టం కట్టారు జనం. కాంగ్రెస్‌ను 44 స్థానాలకు కుదించారు. మోదీ తన ప్రమాణ స్వీకారోత్సవానికి సార్క్ దేశాధిపతులను ఆహ్వానించి మొట్టమొదటిరోజు నుండే ప్రత్యేకతను చాటారు. ప్రపంచ దేశాలను మెప్పించి జూన్ 21వ తేదీని ప్రపంచ యోగా దినో త్సవంగా ఐక్యరాజ్యసమితి చేత ప్రక టింపజేశారు. అమెరికాలోని మ్యాడి సెన్ స్క్వేర్లోనైనా, ఆస్ట్రేలియాలోై నెనా, దుబాయిలోనైనా, చైనాలోనైనా జన నీరాజనాలందుకుంటున్నారు. శత్రుభావంతో ఉన్న చైనాకు ఇరుదేశాల సాం స్కృతిక సంబంధాలను గుర్తుచేసే విధంగా ప్రపంచంలో 16 శాతంగా ఉన్న చైనీయులు మాట్లాడే మాండరీన్‌లోకి వేద సం పదను అనువదించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించి ఆ దేశాన్ని ఆశ్చర్యపరిచారు. అరబ్ దేశా లతో సైతం స్నేహసంబంధాలను నెలకొల్పారు. యూపీఏ పదేళ్ల పాలనలో గాడితప్పిన ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టే ప్రయత్నంలో మోదీ ఉన్నారు. అవినీతిని నిరోధించి ఖజానాను కాపాడుకోవడం, పోటీతత్వం, సహజ వనరుల కేటాయింపులో పార దర్శకత, తద్వారా అదనపు ఆర్థిక వనరులను సృష్టిం చుకోవడం, సబ్సిడీల హేతుబద్ధీకరణ, విదేశీ పెట్టు బడులను ఆకర్షించడం వంటి వాటిపైన దృష్టి పెట్టా రు. వీటితోపాటు స్కిల్ ఇండియా ద్వారా యువ తలో నైపుణ్యాలను పెంచి మానవ వనరులను మో దీ ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నది. జనధన్ యోజన ద్వారా పేద, దిగువ, మధ్య తరగతి వారిని బ్యాం కింగ్‌కు అనుసంధానం చేయడం, వ్యవసాయం, విద్యుత్తు, రైల్వే, రవాణా, మౌలిక సదుపాయాలు వంటి రంగాల్లో పెట్టుబడులు పెంచడం ద్వారా ప్రాధాన్య రంగాలను అభివృద్ధి చేస్తున్నది. ఫలితం గా మొదటిసారిగా ఇటీవల మనం 7.5 జీడీపీ వృద్ధి రేటుతో చైనా వృద్ధి రేటును దాట గలిగాం. కుటుంబ పాలనలు సాగుతున్న ఈ రోజుల్లో బంధుప్రీతి చూపకుండా యావత్ దేశం తన కుటుం బంగా భావించి పరిపాలన కొనసాగించడం ఈ దేశంలో ఎంత మంది రాజకీయ నాయకులకు సాధ్యం? మన భారతీయ సాంస్కృతిక పరంపర నుండి అందిపుచ్చుకున్న సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో ముందుకెళ్తున్న మన మోదీ ఆయురా రోగ్యాలతో ప్రజలకు మేలు చేకూర్చే మరిన్ని నిర్ణ యాలు, పథకాలు, విధానాలతో ప్రజల ఆకాంక్ష లను నెరవేరుస్తారని ఆశిద్దాం. వ్యాసకర్త, రాష్ట్ర కార్యదర్శి, భారతీయ జనతా యువమోర్చా, 90005 22400 - ఏనుగుల రాకేష్‌రెడ్డి -
నిజాంపై బహిరంగ చర్చకు సిద్ధం
కేసీఆర్‌కు కిషన్‌రెడ్డి సవాలు సాక్షి, మహబూబ్‌నగర్: ‘నిజాం పాలనలో జరిగిన దౌర్జన్యాలను సమర్ధించుకునేందుకేనా ప్రత్యేక రాష్ట్రం సాధించుకుంది. ఈ అంశంపై సీఎం కె.చంద్రశేఖర్‌రావుతో బహిరంగ చర్చకు సిద్ధం’ అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సవాలు విసిరారు. మహబూబ్‌నగర్ జిల్లా మాగనూరు మండలం కృష్ణా గ్రామంలో సోమవారం జరిగిన తెలంగాణ బీజేపీ పోరుయాత్ర దినోత్సవ సభలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. కేసీఆర్‌కు నిజాంపై ప్రేమ లేదని, మజ్లిస్‌తో కలసి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఓట్లు పొందేందుకే దివాలాకోరు విధానం అవలంభిస్తున్నారని దుయ్యబట్టారు. అమరులను మరవద్దు: తెలంగాణ సాధన కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరులను మరిచిపోతే భవిష్యత్ నిర్మాణం సాధ్యం కాదని జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. బీజేపీ పోరుయాత్ర నిర్వహించి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా కృష్ణా గ్రామంలో బీజేపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సమావేశంలో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నిజాం పాలనపై పొగడ్తలు దారుణం
* సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలి *మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య డిమాండ్ హైదరాబాద్: దుర్మార్గమైన పాలనతో ప్రజలను వేధించిన నిజాంలను సీఎం కేసీఆర్ పొగడడం ఏమాత్రం సరికాదని, ఈ విషయంలో ఆయన పునరాలోచన చేసి, నిజాంల పాలనపై పొగడ్తలను వెంటనే ఉపసంహరించుకోవాలని మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య డిమాండ్ చేశారు. అలాగే ప్రజలకు ఈ విషయంలో క్షమాపణ చెప్పాలన్నారు. బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం(టీపీఎస్కే) ఆధ్వర్యంలో‘నిజాం పాలన- ఒక పరిశీలన’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చుక్కా రామయ్య మాట్లాడుతూ నిజాం పాలన దొరలకు తోడ్పాటునందించిందని, ఎంతో మంది స్త్రీలపై అత్యాచారాలు జరిగాయన్నారు. తెలంగాణ సాయుధపోరాటంలో ఎంతో మంది రైతులను పొట్టనపెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంత దుర్మార్గమైన పాలనను కొనసాగించిన నిజాంను సీఎం కేసీఆర్ పొగడ్తలతో ముంచెత్తడం అవమానకరమన్నారు. ఇండియన్ జర్నలిస్ట్ యూని యన్ జాతీయ ప్రధాన కార్యదర్శి దేవులపల్లి అమర్ మాట్లాడుతూ నిజాం పాలనలో కొన్ని భవనాలు, స్కూళ్లు, ఆస్పత్రులు నిర్మించినంత మాత్రాన, ఆయన చేసిన పాపం ఊరికే పోదని విమర్శించారు. నిజాం మంచివాడ ని సర్టిఫికెట్ ఇవ్వ టం దుర్మార్గమన్నారు. సీఎం కేసీఆర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరారు. మాజీ ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ అత్యంత దుర్మార్గంగా ప్రజ లను హింసించిన నిజాంను పొగడటం సిగ్గు చేటు అని విమర్శించారు. టీపీఎస్కే కన్వీనర్ జి.రాములు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ చంద్రశేఖర్, ఎస్వికె ట్రస్టీ ఎస్.వినయ్ కుమార్, ప్రొఫెసర్ భంగ్య భూక్యా, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నాగయ్య, సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి, రఘుపాల్, మోత్కూరి నరహరి పాల్గొన్నారు. -
నిజాం పాలనపై పొగడ్తలు దారుణం
సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలి మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య డిమాండ్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం: దుర్మార్గమైన పాలనతో ప్రజలను వేధించిన నిజాంలను సీఎం కేసీఆర్ పొగడడం ఏమాత్రం సరికాదని, ఈ విషయంలో ఆయన పునరాలోచన చేసి, పొగడ్తలను ఉపసంహరించుకోవాలని మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య డిమాండ్ చేశారు. ప్రజలకు ఈ విషయంలో క్షమాపణ చెప్పాలన్నారు. బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం(టీపీఎస్కే) ఆధ్వర్యంలో‘నిజాం పాలన- ఒక పరిశీలన’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చుక్కా రామయ్య మాట్లాడుతూ నిజాం పాలన దొరలకు తోడ్పాటునందించిందని, ఎంతో మంది స్త్రీలపై అత్యాచారాలు జరిగాయన్నారు. తెలంగాణ సాయుధపోరాటంలో ఎంతో మంది రైతులను పొట్టనపెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దుర్మార్గమైన పాలనను కొనసాగించిన నిజాంను సీఎం పొగడ్తలతో ముంచెత్తడం అవమానకరమన్నారు. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ ప్రధాన కార్యదర్శి దేవులపల్లి అమర్ మాట్లాడుతూ నిజాం పాలనలో కొన్ని భవనాలు, స్కూళ్లు, ఆస్పత్రులు నిర్మించినంత మాత్రాన, ఆయన చేసిన పాపం ఊరికే పోదని విమర్శించారు. నిజాం మంచివాడ ని సర్టిఫికెట్ ఇవ్వటం దుర్మార్గమన్నారు. సీఎం కేసీఆర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరారు. మాజీ ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ అత్యంత దుర్మార్గంగా ప్రజలను హింసించిన నిజాంను పొగడటం సిగ్గు చేటని విమర్శించారు. టీపీఎస్కే కన్వీనర్ జి.రాములు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ చంద్రశేఖర్, ఎస్వీకే ట్రస్టీ ఎస్.వినయ్‌కుమార్, ప్రొఫెసర్ భంగ్య భూక్యా, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నాగయ్య, సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి, రఘుపాల్, నరహరి పాల్గొన్నారు. -
'నిజాం పాలనపై బహిరంగ చర్చకురావాలి'
నల్లగొండ: నిజాంను సమర్థిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్.. నిజాం పాలనపై బహిరంగ చర్చకు రావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. జిల్లాలోని భువనగిరిలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ జెండా ఆవిష్కరించిన ఆయన విలేకర్లతో మాట్లాడుతూ పైవిధంగా స్సందించారు. -
నిజాంను పొగడటం దివాలాకోరుతనమే
కేసీఆర్‌పై కిషన్‌రెడ్డి ధ్వజం సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వేల మంది పోరాటయోధులను చంపడంతోపాటు మహిళలను వివస్త్రలను చేసి బతుకమ్మ ఆడించిన నిజాం పాలనను ముఖ్యమంత్రి కేసీఆర్ పొగడటం ఆయన దివాలాకోరుతనానికి నిదర్శనమని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు. కొమురం భీమ్, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, షోయబుల్లాఖాన్ లాంటి వారిని దారుణంగా చంపిన క్రూరమైన నిజాం పాలనను పొగుడుతున్న కేసీఆర్... ఆ మహనీయుల పోరాటం నిజం కాదని చెప్పగలరా? అని ప్రశ్నించారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ చెప్తున్నట్టుగా నిజాంది గొప్ప పాలనే అయితే దాశరథి లాంటి వారు ఆయనకు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడారని, సర్దార్ పటేల్ ఆధ్వర్యంలో కేంద్రం ఎందుకు పోలీసు చర్యకు దిగిందని ప్రశ్నించారు. తెలంగాణలో అరాచకాలు సృష్టించిన నిజాం ప్రైవేట్ సైన్యం నుంచి పుట్టుకొచ్చిన మజ్లిస్ పార్టీ ప్రాపకం కోసం కేసీఆర్ ఇలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. కాగా, తెలంగాణలో బీజేపీ బలపడేందుకు అనుసరించాల్సిన పద్ధతులపై చర్చించే లక్ష్యంతో పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా హైదరాబాద్‌కు వస్తున్నారని కిషన్‌రెడ్డి చెప్పారు. 7న సాయంత్రం వస్తున్న ఆయన మరుసటి రోజు ఉదయం పార్టీ రాష్ట్ర సలహా మండలి సమావేశం, మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు పదాధికారులు, పార్టీ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, ఎమ్మెల్యేలతో సమావేశమవుతారన్నారు. -
అవి చీకటి రోజులు
నిజాం పాలన చరమాంకంలో తెలంగాణలో ఊళ్లకూళ్లు రక్తంతో తడిశాయి. రజాకార్ల దురాగతాలకు పల్లెలు తల్లడిల్లాయి. ఆడపడుచులు, అమ్మలు, ముసలవ్వలు.. ఇలా ఆడవాళ్లందరూ మానప్రాణాల కోసం సొంతూళ్లను వదిలి వలస వెళ్లారు. బతుకు జీవుడా అంటూ ఊరు కాని ఊరు వెళ్లి తలదాచుకున్నారు. ఆ చీకటి రోజుల గురించి ఆ తరం మనిషి.. హైదరాబాద్ మొదటి మేయర్ మాడపాటి హనుమంతరావు మనవరాలు, పద్మారావునగర్‌లో ఉంటున్న మాడపాటి సత్యవతి ‘సిటీప్లస్’కు వివరించారు. - మాడపాటి సత్యవతి, ఆకాశవాణి మాజీ న్యూస్ ఎడిటర్ ఖమ్మం జిల్లాలోని ఎర్పుపాలెం మా ఊరు. మా తాతగారు మాడపాటి హనుమంతరావు. ఆయన అన్నగారి కొడుకు మా నాన్న మాడపాటి రామచందర్‌రావు. హనుమంతరావుగారికి కొడుకులు లేకపోవడంవల్ల నాన్నని, నన్ను ఆయనే పెంచారు. నాకప్పుడు 15 ఏళ్లుంటాయి. ఒకరోజు ఉదయం ఎవరో అబ్బాయొచ్చి ఊరిని రజాకార్లు చుట్టుముట్టారనే వార్త చెప్పాడు. ఆ మాట వినేసరికి ఒళ్లంతా వణికిపోయింది. రజాకార్ల దారుణకాండ మా ఊరికి ఎరుకే. వారిని ఎదిరించిన ఇద్దరు యువకులను కొట్టి చంపారు. ఆ దృశ్యాలు కనుమరుగు కాకముందే మళ్లీ ఊరు మీదికొచ్చిపడ్డారని తెలిసింది. ఇంట్లో అమ్మ, నానమ్మ, నేనూ ఉన్నాం. నిజాం సంస్థానానికి వ్యతిరేకంగా పోరాడే క్రమంలో అప్పటికే మా నాన్న అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. రజాకార్లు మా ఇంటి దగ్గరికి వస్తున్నారన్న విషయం తెలిసిన ఓ కాంగ్రెస్ లీడర్ తుపాకీతో మా ఇంటికొచ్చి నన్ను, అమ్మను దొడ్డి దారిన ఊరు దాటించాడు. నానమ్మ రానంది. ఎడ్ల బండిపై ఊరు దాటి రైల్వేస్టేషన్‌కి వెళ్లి అక్కడ రైలు ఎక్కి విజయవాడలో దిగాం. విలీనం తర్వాత మళ్లీ ఊరికి.. విజయవాడలో తెలిసిన వాళ్లింట్లో మకాం. ఊళ్లోనే ఉన్న నానమ్మకు మా నాన్న ఓ కబురు పంపాడు. ఆమె విజయవాడకు వెళ్లకపోతే నిజాం ప్రభుత్వానికి లొంగిపోతానని నాన్న హెచ్చరించాడు. కొడుకు చేసే ఉద్యమానికి భంగం కలగకూడదని మా నానమ్మ మా దగ్గరికి వచ్చేసింది. 11 నెలలు మేం ముగ్గురం నానా పాట్లు పడ్డాం. మేమే కాదు రజాకార్ల దాడులకు భయపడి కొన్నాళ్లపాటు తలదాచుకోవడానికి వందల సంఖ్యలో ఆడవాళ్లు ఇతర ప్రాంతాలకు వెళ్లారు. వీరిలో గర్భవతులున్నారు, పసిపిల్లల తల్లులు, రకరకాల జబ్బులతో ఇబ్బంది పడుతున్నవారు ఉన్నారు. ఇలా వెళ్లిన వారిని పొరుగువారన్నట్టే చూశారు కానీ, సరైన ఆదరణ చూపలేదు. రజాకార్ల దురాగతాలకు అడ్డుకట్ట పడి, భారతదేశంలో హైదరాబాద్ విలీనమైన తర్వాత తిరిగి మా ఊరికి వెళ్లాం. ఆ పాట్లు మరచిపోలేం.. తిరిగి ఊరెళ్లి చూసుకుంటే ఏముంది. తాతలు కట్టిన అందమైన ఇల్లు పైకప్పు కూలి పూర్తిగా శిథిలమైపోయింది. మొండి గోడలు, ఎండిపోయిన చెట్లు, ఇంటి ఆవరణ మొత్తం జంతువుల కళేబరాలతో నిండిపోయింది. చాలా ఇళ్లది ఇదే పరిస్థితి. ఊళ్లలో మునుపటి పరిస్థితులు ఏర్పడటానికి కొన్నేళ్లు పట్టింది. ఇక్కడి పరిస్థితి తెలిసిన కొందరు ఊరికి తిరిగిరాకుండా వెళ్లిన చోటే స్థిరపడిన వారూ ఉన్నారు. ఇప్పటికీ రజాకార్ల పేరు ఎత్తితే చెట్టుకొకరు, పుట్టకొకరు అయిన మా ఆప్తుల విషయాలే గుర్తుకొస్తాయి. పాడుపడ్డ ఊరిని బాగు చేసుకోడానికి మేం పడ్డ పాట్లే గుర్తుకొస్తాయి. ఓ.. తెలంగి.. నిజాం నిరంకుశ పాలనలో తెలుగు నేర్చుకోవడం నేరం. ఓ నలుగురు తెలుగు మగవాళ్లు మాట్లాడుకోవాలంటే ఉర్దూలోనే మాట్లాడాలి. ఎవరైనా తెలుగు మాట్లాడితే.. మన తెలుగోళ్లే నవ్వుతూ.. ‘ఓ తెలంగి’ అని హేళన చేసేవారు. అలాంటి రోజుల్లో తాతయ్య మాడపాటి హనుమంతరావు గారు ఓ తెలుగు పాఠశాల స్థాపించారు. దానికి అనుమతివ్వమని నిజాం ప్రభుత్వం హెచ్చరించినా పాఠశాల తెరిచారు. ఆయన పాఠశాలలో మొదటి విద్యార్థి ఆయన భార్య.. మా నాయనమ్మ మాడపాటి మాణిక్యమ్మ, రెండో విద్యార్థి బూర్గుల రామకృష్ణారావు గారి భార్య అనంతలక్ష్మి గారు. నారాయణగూడలో తెలుగు బాలికల ఉన్నత పాఠశాల పేరుతో ఆయన స్థాపించిన స్కూల్లో విద్యార్థులకు పదో తరగతి పరీక్ష రాసే అవకాశాన్ని నిజాం ప్రభుత్వం కల్పించకపోయేసరికి ఆంధ్రా యూనివర్శిటీ ద్వారా ఇక్కడ పదో తరగతి చదువుతున్న విద్యార్థినుల్ని విజయవాడ పంపించి పరీక్ష రాయించారు. అలా పరీక్ష రాసిన చివరి బ్యాచ్ విద్యార్థిని నేనే. - భువనేశ్వరి ఫొటోలు: ఎన్.రాజేష్‌రెడ్డి -
ఆరు దశాబ్దాలు గడిచినా... అభివృద్ధి శూన్యం
రాయచూరు రూరల్ : నిజాంల దాష్టీకాలనుంచి హైదరాబాద్( హై-క)కు విముక్తి కలిగి ఆరు దశాబ్దాలు దాటినా అభివృద్ధి ఎండమావిగానే ఉంది. ఇప్పటికీ కనీస సదుపాయాలులేని గ్రామాలు వేల సంఖ్యలో ఉన్నాయి. కర్ణాటకలో ముంబై-కర్ణాటక, మైసూరు-కర్ణాటక, హైదరాబాద్-కర్ణాటకగా మూడు ప్రాంతాలుండగా హైక అన్నింటా వెనకబడి ఉంది. హైదరాబాద్ ప్రాంతపు నిజాం పాలనలో 1724లో అసబ్ జహా వంశానికి చెందిన కమురుద్దీన్ ఆధీనంలో కన్నడ మాట్లాడే బీదర్, గుల్బర్గా, రాయచూరు, కొప్పళ, మహారాష్ట్రలోని ఉస్మానాబాద్, నాందేడ్, పర్భిణి, బీడ్, ఔరంగాబాద్, ఆంధ్రలోని 8 జిల్లాలు ఉండేవి. దేశానికి స్వాతంత్రం లభించిన అనంతరం నిజాం పాలకుల నిరంకుశ పాలనకు చరమ గీతం పాడేందుకు ఉద్యమం ఆరంభమైంది. హై-క ప్రాంతంలో 1942లో పండిత్ తారానాథ్, డాక్టర్ బీజీ.దేశ్‌పాండే, గాణదాళ నారాయణప్పల నేతృత్వంలో సత్యాగ్రహం చేపట్టారు. రాయచూరు జిల్లాకు చెందిన అడవిరావు, జి.హనుమంతరావు, జోషి, కె.పాండురంగారావు, ఎం.నాగప్ప, బెట్టదూరు శంకరగౌడ, సదాశివరాజ్ పురోహిత్, గంగణ్ణగారి నాగణ్ణ, పండిట్ మాణిక్యరావులు ఆందోళన చేపట్టి నిజాంల నుంచి విముక్తి కల్పించాలంటూ 1947 ఆగస్టు 7న రామచూరులో ఆందోళన చేపట్టగా ప్రభుత్వం అరెస్టు చేసింది. 1947 అక్టోబర్ 2న వందల మంది విద్యార్థులతో స్వాతంత్ర సమరయోధుల ఆధ్వర్యంలో జిల్లాధికారిని కలిసేందుకు వెళ్లిన వారిని కూడా అరెస్ట్ చేశారు. ఎం.నాగప్ప, వీరణ్ణ, బసవరాజ్స్వామి తదితరులు 1948 సెప్టెంబర్ 13న పోలీసుస్టేషన్లపై దాడులు చేశారు. దీంతో మేజర్ జనరల్ బి.ఎస్.బ్రా, జనరల్ చౌదరి, ఎ.ఎ.రుద్ర, బిగ్రేడియర్ శోయ దత్తసింగ్ తమ సైన్యాన్ని హైదరాబాద్‌లో నిజాంలకు అప్పగించారు. సెప్టెంబరు 17న హైదరాబాద్ ప్రాంతంగా ఏర్పాటైంది. అభివృద్ధి ఒట్టిమాట : హైదరాబాద్ కర్ణాటక ప్రాంతం ఏర్పాటైనప్పటినుంచి ఈ ప్రాంతంలోని బీదర్, గుల్బర్గా, రాయచూరు, కొప్పళ జిల్లాలు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేకపోయాయి. విద్య, వైద్య, ఆరోగ్య సౌకర్యాలతోపాటు రహదారులు,తాగునీరు తదితర మౌలిక వసతులు కూడా అంతంతమాత్రమే. నిధుల కేటాయింపులోనూ వివక్షే. భాష, ప్రాంతాల రచన అనంతరం రాష్ట్రాన్ని నాలుగు విభాగాలుగా విభజించారు. బీదర్, గుల్బర్గా, రాయచూరు, బళ్లారి, కొప్పళ గుల్బర్గా విభాగానికి, ధార్వాడ, బీజాపుర, కార్వార, బెళగావి, గదగ్, హావేరి, బాగలకోట జిల్లాలు బెళగావి విభాగానికి, పాత మైసూరు ఒక విభాగంగా, బెంగుళూరు మరో విభాగంగా ఏర్పాటు చేశారు. 1996-97లో వైద్య రంగంలో బెంగుళూరు ప్రాంతంలో 650 మంది విద్యార్థులకు సీట్లు లభించగా హై-క భాగంలో 50 సీట్లు లభించాయి. మైసూరు, హాసన వంటి ప్రాంతాల్లో రైతులకు అన్యాయం జరిగితే ప్రభుత్వం యుద్ధప్రాతిదికన స్పందిస్తోంది. హై-కాలో వరదలు, కరవు నెలకొన్నా పట్టించుకునేవారు లేరు. ఈ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం బోర్డు ఏర్పాటు చేసినా అభివృద్ధి అంతంతమాత్రమే. హైస్కూళ్లు 500 మాత్రమే ఉండటంతో సాక్షరతా ప్రమాణం 8.5 శాతానికే పరిమితమైంది.రాయచూరు, బళ్లారి, గుల్బర్గా, బీదర్, కొప్పళ జిల్లాల్లో ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగం పెరిగిపోతోంది.హైకాకు ఆర్టికల్-371 జారీ చేసినా ఈ ప్రాంత అభివృద్ధికి పాలకులు చిత్తశుద్ధితో కృషిచేయడం లేదనే విమర్శలున్నాయి. -
విలీనమా! విమోచనమా?
నిజాం పాలనను శ్లాఘించడం పూర్తిగా అసంగతం కూడా. ఆ విధంగా ఆయన మీద స్వాతంత్య్ర పోరాటం చేసిన మహనీయులను ప్రతినాయకులుగా చిత్రించడం బాధాకరం. మైనారిటీలకు దగ్గర కావాలంటే అది హుందాగా జరగాలే తప్ప, వక్రీకరణలతో మాత్రం కాదు. నాలుగేళ్ల క్రితం, అంటే 2010లోనే సెప్టెంబర్ 17 సందర్భం మీద వివాదం తలెత్తింది. ఉమ్మడి రాష్ట్రంలో ఈ విషయం మీద వివాదం రావడం అదే మొదటిసారి. 1948లో హైదరాబాద్ సంస్థానం మీద పోలీసు చర్య చేపట్టినపుడు చివరికి నిజాం లొంగిపోయిన రోజు అదే. క్లుప్తంగా జరిగిన ఒక కార్యక్రమంలో హైదరాబాద్ రాజ్య సైన్యాధ్యక్షుడు జనరల్ ఎల్ అడ్రూస్ భారత సైన్యానికి చెందిన జనరల్ జేఎన్ చౌదరి ఎదుట ఆయుధాలు అప్పగించాడు. ఇదంతా జరిగిన 62 సంవత్సరాల తరువాత ఈ చర్య విమోచనమా? దురాక్రమణా? లేదంటే విలీనమా? అన్న వివాదం తలెత్తింది. సెప్టెంబర్ 17 ఘటన జరిగిన కొద్దికాలానికి ఆ సందర్భాన్ని విమోచన దినంగా జరుపుకున్న సంగతి పాతకాలం వారందరికీ గుర్తే. ఈ సందర్భంలోని వాస్తవం గురించిగానీ, మనోభావాల గురించిగానీ పెద్దగా తెలియదు కాబట్టి రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాల వారికి ఈ ఘట్టం గురించి ఏమీ పట్టలేదు. నిజానికి తెలంగాణ ప్రాంతంలోని కొందరు కూడా అవగాహన లోపంతో ఆ సందర్భానికి ఇవ్వవలసినంత ప్రాధాన్యం ఇవ్వలేదు. ఆందుకే ఆంధ్రప్రదేశ్ అవతరణ తరువాత ఈ సందర్భానికి ఉన్న ప్రాధాన్యం గురించి అంతా క్రమంగా మరచిపోయారు. తరాలు గడచిపోతున్న కొద్దీ, పోలీసు చర్యకు దారి తీసిన పరిస్థితుల గురించి తెలిసిన వారు కూడా తగ్గిపోతున్నారు. ఇప్పుడు పోలీసు చర్య ఉదంతం మీద కొన్ని పార్టీలకు, కొందరు వ్యక్తులకు అవగాహన లోపించడం దాని ఫలితమే. ఇలాంటి రాజకీయ పార్టీలు ఈ వివాదం గురించి లబ్ధి పొందకుండా జాగ్రత్త పడడానికి ఆ తరానికి చెందిన వ్యక్తిగా, ఆ పోరాటంలో పాల్గొన్న వ్యక్తిగా, 80 ఏళ్ల జీవితాను భవం కలిగిన వ్యక్తిగా కొన్నివిషయాలు గుర్తుచేయడం నా విధిగా భావిస్తున్నాను. భారత ప్రభుత్వం చేపట్టిన పోలీసు చర్య మీద ఉన్న గందరగోళం నుంచి ఈ తరం వారిని విముక్తం చేయడానికి, ఆ చర్యకు ముందు జరిగిన కొన్ని వాస్తవిక ఘటనల గురించి వివరించాలి. ఈ అంశానికి సంబంధించిన కొన్ని ప్రశ్నల గురించి కూడా ఇక్కడ ప్రస్తావించుకోవాలి. ఒక స్వదేశీ సంస్థానం వ్యవహారాలలో భారత ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోవలసి వచ్చింది? ఈ ఆక్రమణ దురాక్రమణ కింద పరిణమించిందా? విలీనమైతే వివాదమే ఉండదు. ఎందుకంటే, సంస్థానాధీశుడే రాజ్యాన్ని భారత యూనియన్‌లో విలీనం చేసినట్టు పోలీసు చర్య దరిమిలా ఒప్పందం మీద సంతకం పెట్టేవాడు. కాబట్టి అప్పుడు జరిగినది విమోచనమా? లేకపోతే దురాక్రమణా? ఈ ప్రశ్నలకు సమాధానాలు రాబట్టాలంటే చరిత్ర పుటల దగ్గరకు వెళ్లాలి. బ్రిటిష్ ఇండియాలో నిజాం సంస్థానం ప్రత్యేకమైనది. విస్తారమైనది. ఉప ఖండంలోనే పెద్ద సంస్థానం. సొంత కరెన్సీ, తపాలా శాఖ, రైల్వేలు, పోలీసు, న్యాయ వ్యవస్థలు సమకూర్చుకున్న సంస్థానం కూడా ఇదే. ఇందులో దాదాపు 85 శాతం హిందువులు. పాలకుడు మాత్రం మహమ్మదీయుడు. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చేనాటికి సింహాసనం మీద ఉన్న నవాబు అసఫ్ జాహి వంశానికి చెందిన సర్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. నిజానికి భారత స్వాతంత్య్ర పోరాటమే నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడడానికి ప్రేరణ ఇచ్చింది. నిజానికి తన రాజ్యంలో ఉన్న మెజారిటీ ప్రజల మనోగతం తెలిసినప్పటికీ నిజాం నవాబు తన అధికారం వదులుకోవడానికి సిద్ధపడలేదు. భారత యూనియన్‌లో విలీనం కావాలన్నది హైదరాబాద్ సంస్థానంలో ఉన్న మెజారిటీ ప్రజలు, అంటే హిందువుల అభిప్రాయం. వాస్తవం చెప్పాలంటే హైదరాబాద్ సంస్థానంలో ఉన్న మెజారిటీ, మైనారిటీ వర్గాల మధ్య సాంఘిక పరమైన, ఆర్థికపరమైన స్థాయిలో పెద్దగా భేదం లేదు. ప్రత్యేక హోదా ఉన్న వ్యక్తులు కొందరు మాత్రం ఈ రెండు వర్గాలలోను కూడా ఉండేవారు. కానీ పాలకుడు మహమ్మదీయుడు కావడంతో ఆ వర్గానికి చెందిన వారు అదొక సదుపాయంగా భావించుకునేవారు. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ముస్లింలు, తమ పౌరులు హిందువులతో సమంగానే వెనుకబడి ఉండేవారు. ముస్లింలలో చదువుకున్న వారికీ, వ్యాపారులకు ప్రత్యేక సౌకర్యాలు లభించేవి. హిందువులలోని కొందరు వ్యక్తులకు కూడా ఈ హక్కులను రాజ్యం కల్పించేది. భూస్వామ్య వర్గాలకు చెందిన వీరంతా నవాబుకు అండదండలను ఇచ్చేవారు. నిజాం పాలన ఘనమైనదంటూ ఇటీవల కొందరు తరచు వ్యాఖ్యా నిస్తున్నారు. అసలు దక్కనీ చరిత్రలోనే నిజాం పాలన స్వర్ణయుగమని చెప్పడానికి కూడా వారు వెనుకాడడం లేదు. హైదరాబాద్ తదితర ప్రాతాలలో నవాబు కట్టించిన భారీ భవంతులు, నిజాం సాగర్ వంటి నీటి పథకాల నిర్మాణాలను బట్టి, విద్యారంగానికి చేసిన సేవను చూసి; ఆరోగ్యం, కమ్యూనికేషన్ల వ్యవస్థ, సంక్షేమం వంటి అంశాలను చూసి వారు ఆ వాదనను ప్రజల ముందుకు తీసుకువస్తున్నట్టు చెబుతున్నారు. కానీ ఇవి ప్రజల అవసరాలను నిజంగా తీర్చాయా? నిజాం సంస్థానంలో మొత్తం 16 జిల్లాలు ఉండేవి. ఇందులో ఎనిమిది తెలుగు ప్రాంతంలోనివి. 5 మరాఠ్వాడాలోను, మూడు కర్ణాటక ప్రాంతంలోను ఉండేవి. ఇందులో ప్రతి జిల్లాకు ఒక ఉన్నత పాఠశాల ఉండేదని చెప్పడానికి అవకాశం లేని పరిస్థితి. హైదరాబాద్ తరువాత మిగిలిన ప్రాంతానికి ఒకే ఒక్క కళాశాల వరంగల్‌లో ఉండేది. అక్కడైనా ఇంటర్మీడియెట్ వరకే విద్య లభించేది. ఇంటర్ తరువాత కూడా విద్యను కొనసాగించదలచిన వారంతా హైదరాబాద్ నగరానికి వెళ్లక తప్పేది కాదు. దీనితో చాలామందికి అవకాశం ఉండేది కాదు. అంతేకాదు, దీని వల్ల బాగా ధనవంతులు, ఉన్నత వర్గీయులకే చదువుకునే అవకాశం కలిగేది. ప్రాథమిక విద్య కూడా తాలూకా కేంద్రాలలోనే లభించేది. దీనితో లోతట్టు గ్రామీణ ప్రాంతాల పిల్లలకు చదువు గగనకుసుమంలా మారిపోయింది. హైదరాబాద్‌లో అయినా రెండు మాత్రమే ఇంటర్ కళాశాలలు ఉండేవి. అవే- సిటీ కాలేజ్ ఫర్ సైన్స్, చాదర్‌ఘాట్ ఆర్ట్స్ కాలేజీ. ఈ రెండు కళాశాలల్లోను ఉర్దూ మీడియం ఉండేది. అండర్ గ్రాడ్యుయేట్ చదువు కోసం రెండు సంస్థలను ఎవరైనా ఆశ్రయించవలసివచ్చేది. ఒకటి ఉస్మానియా విశ్వవిద్యాలయం, రెండు నిజాం కాలేజీ. ఉస్మానియాలో ఉర్దూ మీడియం కాగా, నిజాం కాలేజీలో ఇంగ్లిష్ మీడియం ఉండేది. నిజాం కాలేజీ మద్రాసు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉండేది. హైదరాబాద్ నగరంలో ఇంగ్లిష్ మీడియం ఉన్న రెండు మూడు విద్యా సంస్థల నుంచి వచ్చిన అభ్యర్థులకు తప్ప, మొత్తం ఉర్దూ మీడియం అభ్యర్థులకు నిజాం కాలేజీలో చేరే అవకాశం ఉండేది కాదు. వెరసి ఒక విషయం అర్థమవుతుంది. 85 శాతంతో మెజారిటీగా ఉన్న తెలుగు వారు, అనివార్యంగా ఉర్దూ మీడియంలో చదువుకోక తప్పనిసరి పరిస్థితి నెలకొంది. తెలుగు భాష పాఠ్య ప్రణాళికలో లేదని కాదు. కానీ ఏడో తరగతి వరకే చెప్పేవారు. అది కూడా థర్డ్ లాంగ్వేజ్ హోదా మాత్రమే ఉండేది. విజ్ఞాన శాస్త్రం చదువుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలనుకునే తెలుగు వారంతా అలా ఎనిమిదో తరగతి నుంచి మాతృభాషకు దూరమయ్యేవారు. ఇంగ్లిష్ మినహా మిగిలిన పాఠ్యాంశాలన్నీ ఉర్దూలోనే బోధించేవారు. శనివారం మొదలై, గురువారంతో వారం ముగిసేది. శుక్రవారం వారాంతపు సెలవుగా అమలు చేసేవారు. ఇది ము స్లింల మత అవసరాలను దృష్టిలో పెట్టుకుని అమలుచేసిన నిర్ణయం మాత్రమే. విధుల విషయంలో కూడా నవాబు ఆలోచన తక్కువ సిబ్బందితో సాధ్యమైనంత పని చేయించడం అనే రీతిలోనే ఉండేది. నవాబు తన వర్గానికి చెందిన వారి పైనే ఎక్కువగా ఆధారపడి పాలన సాగించేవాడు. ప్రభుత్వ కార్యాలయాలలోని ముఖ్యమైన పదవులన్నీ వారితోనే నింపాడు. కిషన్ ప్రసాద్, నారాయణరావు గంగాఖేద్కర్ వంటి అరుదైన ఉదాహరణలు తప్పితే, ఉన్నత పదవులన్నీ సర్వసాధారణంగా నవాబు తన వర్గీయులకే కట్టబెట్టేవాడు. రెవెన్యూ, పోలీస్, ఎక్సైజ్, అటవీ శాఖ ఉద్యోగాలలో 90 శాతం ఒక వర్గానికే దక్కేవి. ఉన్నతోద్యోగాలకు ఆ స్థాయి అర్హతలు ఉన్న వ్యక్తి, తన వర్గంలో లభించకుంటే, తన వర్గానికే చెందిన వారిని ఉత్తర భారతదేశం నుంచి రప్పించి, ఉద్యోగాలు కట్టబెట్టేవారు. మధ్య ప్రాచ్యం నుంచి వచ్చినవారికీ, అరబ్బులకు కూడా ఉద్యోగాలు దక్కుతూ ఉండేవి. మతాంతీకరణలు తక్కువే అయినా, మెజారిటీ ప్రజలు అవమానాలను ఎదుర్కొనవలసిన స్థితిలో ఉండేవారు. తాము ద్వితీయ శ్రేణి పౌరులం కాబోలునని వీరు తరచు ప్రశ్నించుకోవలసిన వాతావరణమే ఉండేది. చట్టబద్ధమైన హక్కులు కూడా వీరికి దక్కేవి కాదు. ఆరోగ్య సేవలలో కూడా నవాబు తీసుకున్న చర్యలు సమున్నతంగా కనిపించవు. తాలూకా కేంద్రంలో ఒక డిస్పెన్సరీ ఉండేది. ఉన్నత స్థాయి వైద్య సదుపాయం కావాలంటే ఉస్మానియా ఆస్పత్రికి హైదరాబాద్ రావలసిందే. నిజం చెప్పాలంటే 90 శాతం సాధారణ ప్రజానీకం సరైన వైద్య వసతికి నోచుకోలేదు. ఇక్కడే నాటి మేధావి, యునెటైడ్ ప్రావిన్స్‌తో పాటు, దేశం మొత్తం మీద గొప్ప వకీలుగా పేరున్న తేజ్‌బహదూర్ సప్రూ ఒక సందర్భంలో చేసిన వ్యాఖ్యను ఉదహరించాలి. నిజాం పాలనలోనే సప్రూ ఉస్మానియా విశ్వవిద్యాల యంలో జరిగిన స్నాతకోత్సవానికి హాజరయ్యారు. మిగిలిన సంస్థానం దారిద్య్రంతో అలమటిస్తుండగా హైదరాబాద్ నగరంలో కనిపించే హైకోర్టు భవంతి, ఉస్మానియా ఆస్పత్రి, ఆర్ట్స్ కాలేజీ, ఉస్మానియా విశ్వవిద్యాలయం భవనాలను చూసి మురిసిపోవడంలో అర్థం లేదని ఆయన తన ఉపన్యాసంలోనే పేర్కొన్నాడు. రాజకీయ కార్యకలాపాలేవీ నిజాంకు రుచించేవి కావు. ఆంధ్ర మహాసభ, స్టేట్ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ కావచ్చు, ఎవరు గళమెత్తినా ఆయనకు నచ్చేది కాదు. అయితే ఏదో ఒకరోజున మెజారిటీ తిరగబడుతుందని చెప్పే హెచ్చరికలు గోడల మీద దర్శనం ఇస్తూ ఉండేవి. మగ్దూం మొహియుద్దీన్, షోయిబుల్లా ఖాన్ వంటివారు ఈ ప్రమాదం గురించి హెచ్చరించినవారే. ఈ దశలో మజ్లిస్ ఇతేహాదుల్ ముస్లిమీన్ హైదరాబాద్ సంస్థానంలో ముస్లింలను రక్షించే సంస్థగా కనపడింది. దీని నాయకుడే ఖాశిం రజ్వీ. ముస్లింలు ఈ దేశాన్ని పాలించడానికే ఉన్నారన్న నమ్మకాన్ని ఆ వర్గంలో పెంచి పోషించిన ఘనత ఈ సంస్థదే. మిగిలిన బ్రిటిష్ ఇండియాలో స్వాతంత్య్ర కాంక్ష పెరుగుతున్న కొద్దీ, నిజాం సంస్థానంలో కూడా అందుకు సంబంధించిన సంకేతాలు కనిపించాయి. నిజాం మీద పోరాటం ఉధృతమౌతున్నకొద్దీ రజాకార్లు కూడా విజృం భించారు. నిజాం రాజ్యం స్వర్గం కాదు. సెక్యులర్ రాజ్యం అంత కంటె కాదు. నిజాం ప్రజాభిమానం ఉన్న నియంత కూడా కాదు. ఇదే నిజమైతే, ఆ పోరాటంలో అంతమంది చేసిన ప్రాణ త్యాగాలకు అర్థం ఉండదు. నిజాం పాలనను శ్లాఘించడం పూర్తిగా అసంగతం కూడా. ఆ విధంగా ఆయన మీద స్వాతంత్య్ర పోరాటం చేసిన మహనీయులను ప్రతినాయకులుగా చిత్రించడం బాధాకరం. మైనారిటీలకు దగ్గర కావాలంటే అది హుందాగా జరగాలే తప్ప, వక్రీకరణలతో మాత్రం కాదు. (వ్యాసకర్త తెలంగాణ రైతాంగ పోరాట యోధుడు) -ఎల్. లోహిత్ రెడ్డి -
అరుదైన పుస్తకాలు.. జాన్సీకీ వాణి
ఓ రోజు చార్మినార్ని చుట్టపు చూపుగా పలకరిద్దామని వెళ్లాను. చార్మినార్ పక్కనే చౌక మసీద్ వీధిలో నడుస్తుంటే ఓ బోర్డు నన్ను ఆకర్షించింది. ‘‘హజిక్.ఎన్.మోహీ’’ రేర్ బుక్ సెల్లర్స్. అసలే పుస్తకాలు.. అందులోనూ అరుదైన పుస్తకాలు, ఇక నన్ను ఆపతరమా? రెండవ మనిషి నడిచేందుకు చోటులేని ఆ దుకాణంలో అరలు అరలుగా పుస్తకాలు, నడుస్తున్న కొద్దీ లోపలకి గదులు తెరుచుకుంటూనే ఉన్నాయి. అన్ని పుస్తకాల మధ్య నేను మళ్లీ చిన్నపిల్లనైనంత సంబరపడిపోయాను. ఆ పుస్తకాల్లో హైదరాబాద్ చరిత్ర తొంగి చూస్తోంది. ఆ పుస్తకాల ఖజానాలో చరిత్రకి చిరునామాగా ఓ జ్ఞాపకాల దీవానా. ఎనభైల్లోకి అడుగు పెడుతున్న ఆ కుర్రవాడు అహ్మద్ బిన్ మహమ్మద్ బాఫన్నా, ఈ షాపు ఓనరు. నిజాం పాలన గురించి, తెలంగాణ సాయుధ పోరాటం గురించి మట్లాడే అహ్మద్ గారి కబుర్లు వింటూ కూర్చున్నా. మూడు చాయ్‌లు పూర్తయ్యాయి. మూడున్నరకి అస్ ్రఅజా వినిపించింది. ‘మూడు’ మారిన నా బృందసభ్యుల ఆకలి తెలుస్తోంది కానీ రెండు పుస్తకాల పురుగులు ఒక చోట చేరితే మూడు ముచ్చట్లతో ఎలా ముగిస్తాం చెప్పండి? ఏడు భాషలు మాట్లాడే ఈ పెద్దమనిషి ఓ ఎన్సైక్లోపీడియా. ఫలక్‌నుమా ప్యాలస్‌లోనూ, ఖిల్వత్ ప్యాలస్‌లోనూ లైబ్రరీలను ఏర్పాటు చేయడంలో ముఖ్య భూమిక పోషించిన ఈయనకి పుస్తకాలు అమ్మడం కేవలం వ్యాపారం కాదు, ఓ జీవన విధానం. తన దగ్గరున్న అరుదైన పుస్తకాలను చూపిస్తూ ఆయన తన జ్ఞాపకాల వెంట నన్నూ తీసుకువెళ్లారు. గదంతా పుస్తకాల వాసన. కొన్ని వాసనలు నోస్టాలజిక్గా ఉంటాయి. ఈ వాసనతో నాకు నా స్కూల్ లైబ్రరీ గుర్తొచ్చింది. క్లాసు పుస్తకాల కంటే మిగతావి ఎక్కువ చదువుతానని టీచర్లు ఎంత కంప్లైంట్ చేసినా మా నాన్నగారు నాకు పుస్తకాలు కొనిపెడుతూనే ఉండేవారు. మంచి నవల దొరికితే ఇప్పటికీ మా ఇద్దరికీ పోటీనే. ఇక మా అమ్మగారిదీ అదే బాట. ఆవిడకి ఆధ్యాత్మిక రచనలే లోకం. అప్పట్లో చలం పుస్తకాలు పట్టుకుంటే ఇంకొన్నేళ్లు పోయాక అర్థం చేసుకొనే తీరు మారుతుంది అని మార్గదర్శనం చేసారు. పుస్తకాల బాటలో ఆప్తులు, మిత్రులు, గురువులు ఎందరో! చదివిన పుస్తకాల గురించి ఆలోచన, వాదన, చర్చ ఇలా అన్నింట్లో పాలు పంచుకొని నన్ను పెంచిన సన్నిహితులందరికీ నమః! ముఖ్యంగా తెలుగు సాహిత్యపు తోటలో తియ్యందనాలు రుచి చూపించేందుకు వేలుపట్టి నడిపించిన బ్నిం గారికి, ఆధునిక రచనలతో పరిచయం చేసిన తనికెళ్ల భరణిగారికి సదా రుణపడి ఉంటాను. పుస్తకాలు ప్రపంచపు కిటికీ తెరుస్తాయని నమ్ముతాను కాబట్టే నా కూతురు ధన్యకి కూడా పుస్తకాలను స్నేహితులని చేయాలనే సంకల్పంతో ఆమెకి ఏడాది వయసు నుంచే వారానికో పుస్తకం కొనే సంప్రదాయం ప్రారంభించాను. కానీ దాదాపు రెండేళ్ల నుండి పుస్తక సేకరణ తగ్గు ముఖం పట్టింది. గాడ్జెట్ల హోరులో పుస్తకాల జోరు తగ్గింది. ఏ సమాచారమైనా క్షణాల్లో గూగుల్ చేసి తెలుసుకునే ఈ తరానికి రోజుల తరబడి పుస్తకం పట్టుకొనే ఓపిక లేదు. అందుకే వారికి నచ్చే పద్ధతుల్లోనే పుస్తకాలను పరిచయం చేసే ప్రయత్నం ప్రారంభమైంది. ఇప్పుడు వేలి కొసనే పుస్తక భాండాగారం అందుబాటులో ఉంది. ఈ మధ్య మా పాప స్కూల్‌మేట్స్ కొందరు రాసిన పుస్తకాలు అమెజాన్‌లో అమ్మకానికి పెట్టారంటే, ఎంతో ఆనందపడ్డాను. ఇంత చిన్న వయసులో రాసే ప్రయత్నమే గొప్ప అనుకుంటే అందుకు మార్గం సుగమం చేసిన ఇంటర్నెట్‌ని అభినందించాల్సిందే. ఆధునిక సమాజం ఇంటర్నెట్లో ఉంది. వారిని పుస్తకం దగ్గరకి తీసుకెళ్లలేము కానీ పుస్తకాన్ని వారికి దగ్గరగా తీసుకు వెళ్లొచ్చు. ఆసక్తిగా ఉండీ చదివే తీరికలేని వారి కోసం ఓ కొత్త ప్రక్రియకి శ్రీకారం చుట్టారు. అవే ఆడియో బుక్స్. ముళ్లపూడి రమణ గారి కోతికొమ్మచ్చి కథలని వినిపించే ప్రయత్నం చేశారు వారబ్బాయి ముళ్లపూడి వర. ఎస్పీ బాలుగారు తన గళంలో అద్భుతంగా చదివిన ఆ కథల్లో ఓ చోట నా గొంతూ వినిపించడం నా అదృష్టం. ఇక అదే బాటలో బ్నిం గారి కథలని కూడా నేనూ, సుమ, ఇతర మిత్రులం కలసి ఆడియో పుస్తకాలుగా చదివేశాం. ఏ కారు ప్రయాణంలోనో, తీరిక వేళల్లోనో వినేందుకు వీలుగా సీడీల రూపంలోనూ, మాలికలాంటి వెబ్ పత్రికల్లోనూ అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు ఇంకా ఎన్నో రచనలని కొత్త రూపాల్లోకి కొత్త మాధ్యమాల్లోకీ తీసుకురావాలి. ఇప్పటికే ఆ పని ప్రారంభించిన బ్లాగులకీ, సైట్లకీ ధన్యవాదాలు. వీరి ప్రయత్నాలు ఫలించాలంటే మనం ఆదరించాలి. -
దావత్ల దరహాసాలు!
ఆరో కుతుబ్‌షాహీ భార్య హయత్ బక్షీబేగంను ‘మా సాహెబా (అమ్మగారు)’ అని నగర ప్రజలు పిలుచుకునేవారు. ఆమె పేరుతో తవ్వించిన చెరువును మా సాహెబా తలాబ్ అనేవారు. చెరువు కనుమరుగై ‘మాసాబ్ ట్యాంక్’ మిగిలింది! మాసాబ్‌ట్యాంక్‌లో మా సమీప బంధువు నివసించేవారు. హైద్రాబాద్ వచ్చిన కొత్తలో కజిన్ ఇంట్లో కొన్నాళ్లున్నాం. మా పొరుగు ఇల్లు ఓ నవాబుగారిది. నిజాం పాలనలో ఉన్నతాధికారులను, వారి బంధువులను, సామాజికంగా ఉన్నత కుటుంబీకులను నవాబులుగా వ్యవహరించేవారు. నిజాం హయాం గతించినా, ఓడలు బండ్లు అయినా.. నవాబులు తమ సోషల్ స్టేటస్‌ను కాపాడుకునేందుకు ప్రాధాన్యతనిచ్చేవారు. narendrayan - 4 డేట్ దేఖో.. వఖ్త్ నహీ! నగరం డిన్నర్ పార్టీలకు పెట్టింది పేరు. నిజాం హయాంలో అధికారిక విందు కార్యక్రమాలను గుర్తు చేస్తూ ‘దావత్ -ఎ-నిజాం’ పార్టీలు నిర్వహించేవారు. తిరస్కరించకూడని గౌరవనీయుల నుంచి ఆహ్వానాలొచ్చేవి. దావత్‌కు కారణాలు ఏమిటి? అని లోతుల్లోకి పోకూడదు. ‘బహానా(సాకు)’లు ఒకోసారి చిత్రంగా ఉంటాయి. మిమ్మల్ని ఎవరైనా దావత్‌కు పిలిచారనుకోండి. ఏ రోజు అని మాత్రమే గుర్తుంచుకోవాలి. ఏ సమయం అని గుర్తుంచుకోకూడదు. ఫలానా సమయం అన్నారు కదా అని ఆ సమయానికి మీరు అక్కడికి వెళ్లారా? ‘తప్పు’లో కాలేసినట్లే! నగరానికి వచ్చిన తొలిరోజుల్లో అమాయకంగా ఓ పార్టీకి వెళ్లా, చెప్పిన టైంకు! దావత్ తాలూకూ అలికిడి కన్పించలేదు. ఆహ్వానించిన పెద్దమనిషి కన్పించలేదు. ఆదుర్దాతో పనిమనిషిని వెన్యూ గురించి అడిగాను. ‘రావాల్సిన చోటికే వచ్చారు. డిన్నర్‌కు రావాల్సిన వారు, సాయంత్రం టీ వేళకు వ చ్చారు’ అని జాలిపడ్డాడు. ఓ గంట తర్వాత మధువులొలకడం మొదలైంది. రాత్రి 11 గంటలైంది. నా కడుపులో సెకనుకో ఆకలి గంట మోగుతోంది.చివరికి తెగించి అడిగేశాను. అయ్యా భోజనం పెట్టించండి అని! హోస్ట్ ఆశ్చర్యపోయారు. ‘అదేంటి..అప్పుడే భోజనమా? ఆహ్వానించిన వారిలో చాలామంది రానే లేదు’ అన్నారు. ఆయన దయాశీలి! నా కోసం ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి నేను తెలివి తెచ్చుకున్నాను. ఏ పార్టీకి వెళ్లినా చెప్పిన టైంకు కనీసం రెండు గంటలు ఆలస్యంగా వెళ్లడం అలవాటు చేసుకున్నాను. ‘బేగం’ దావత్! త్వరగా వెళ్లి త్వరగా ఇంటికి రావాలనుకున్నా, లేదా పార్టీ ముగిసేంతవరకూ ఉండి రావాలనుకున్నా.. హైద్రాబాద్ పార్టీలకు భోంచేసి వెళ్లడం మంచిది. నిజాంకు అత్యంత సన్నిహిత కుటుంబీకులు పైగాలు. ఆ వంశానికి చెందిన వలీ ఉద్ దౌలా నిజాంకు ప్రధానిగా పనిచేశారు. ఆయన శ్రీమతి(బేగం) ఓసారి తమ స్వగృహం విలాయత్ మంజిల్ (బేగంపేటలోని ఇప్పటి కంట్రీ క్లబ్)లో డిన్నర్‌కు పలిచారు. టైంకు వెళితే బావుండదు కదా! కొంచె ఆలస్యంగానే వెళ్లాను! ఇదిస్వీకరించండి, అది స్వీకరించండి అనే మర్యాదల నేపథ్యంలో తేలిన విషయం ఏమిటయ్యా అంటే, అందరిలో నేనొక్కడినే శాకాహారిని! మళ్లీ కడుపు కాలింది. బేగంగారు ఇతర ముఖ్యులు శ్రద్ధతో వాకబు చేశారు. యురేకా! ‘పుడ్డింగ్’! ప్రెజెంటేషన్ : పున్నా కృష్ణమూర్తి -
అందుకే గోల్కోండపై జెండా ఎగురవేస్తారా?
విజయవాడ: అధికార గర్వంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విర్రవీగుతున్నారని ఏపీ మంత్రి దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాం పాలన గుర్తుచేయడానికి గోల్కొండ కోటపై జెండా ఎగురవేస్తారా దేవినేని ఉమా ప్రశ్నించారు. వ్యవసాయ యూనివర్సిటీకి ఎన్జీరంగా పేరును కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. రెండు రాష్ట్రాల ప్రజల మధ్య వైషమ్యాలను సృష్టించడం కేసీఆర్ కు తగదని ఆయన అన్నారు. కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేస్తే అతి తక్కువ ఖర్చుతో తెలంగాణకు విద్యుత్ అందిస్తామని ఉమా తెలిపారు. కేసీఆర్ చేతగానితనం వల్లే తెలంగాణలో కరెంట్ సమస్య వచ్చిందని ఏపీ మంత్రి దేవినేని ఉమా విమర్శించారు. -
స్థానికతకు 15 ఏళ్లు చాలు: సీఎల్పీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో 15 ఏళ్లు స్థిర నివాసం ఉన్న వారందరినీ స్థానికులుగా పరిగణించాలని సీఎల్పీ డిమాండ్ చేసింది. ఈ విషయంలో నిజాం పాలనలో కొనసాగిన ‘ముల్కీ’ నిబంధనలే ప్రామాణికంగా పరిగణించాలని సూచించింది. సీఎల్పీ కార్యాలయంలో శుక్రవారం శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనేత షబ్బీర్‌అలీ, ఎమ్మెల్యే భట్టి విక్రమార్కలతో కలసి సీఎల్పీ నేత కె.జానారెడ్డి మీడియాతో మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... - పోలవరం ఆర్డినెన్స్‌ను పార్లమెంట్లో చట్టంగా ఆమోదించడాన్ని నిరసిస్తున్నాం. పోలవరం డిజైన్ మారిస్తే సమస్య పరిష్కారమవుతుంది. తక్షణమే రెండు రాష్ర్ట ప్రభుత్వాలతో కేంద్రం చర్చించాలి. - ఆర్డీఎస్ ఎత్తు పెంచాలని గతంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా కర్ణాటక చేపడుతున్న పను లను కర్నూలువాసులు అడ్డుకోడం సరికాదు. పోలీ సుల రక్షణతోనైనా ఈ పనులను చేపట్టాలి. - 1956కు పూర్వం తెలంగాణలో స్థిరపడిన వాళ్లు తెలంగాణ బిడ్డలేనని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపా దిస్తే, ఒక ప్రాంతానికి వ్యతిరేకమనే భావన ఇక్కడ స్థిరపడినవారిలో కలిగే ప్రమాదముంది. తెలంగాణలో స్థిరపడిన వాళ్లంతా తెలంగాణ బిడ్డలేనంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చిన విషయాన్ని మర్చిపోవద్దు. రెండ్రోజుల్లో సీఎల్పీ కార్యవర్గం కాంగ్రెస్ శాసనసభాపక్ష కార్యవర్గాన్ని రెండురోజుల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు జానారెడ్డి విలేకరులకు తెలిపారు. డిప్యూటీ లీడర్లు, కార్యదర్శులు, కోశాధికారి, కార్యవర్గ సభ్యుల ఎంపికపై కసరత్తు చేస్తున్నట్టు ఆయన చెప్పారు.