‘నిజాం పాలనలో జరిగిన దౌర్జన్యాలను సమర్ధించుకునేందుకేనా ప్రత్యేక రాష్ట్రం సాధించుకుంది.
కేసీఆర్‌కు కిషన్‌రెడ్డి సవాలు
సాక్షి, మహబూబ్‌నగర్: ‘నిజాం పాలనలో జరిగిన దౌర్జన్యాలను సమర్ధించుకునేందుకేనా ప్రత్యేక రాష్ట్రం సాధించుకుంది. ఈ అంశంపై సీఎం కె.చంద్రశేఖర్‌రావుతో బహిరంగ చర్చకు సిద్ధం’ అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సవాలు విసిరారు. మహబూబ్‌నగర్ జిల్లా మాగనూరు మండలం కృష్ణా గ్రామంలో సోమవారం జరిగిన తెలంగాణ బీజేపీ పోరుయాత్ర దినోత్సవ సభలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. కేసీఆర్‌కు నిజాంపై ప్రేమ లేదని, మజ్లిస్‌తో కలసి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఓట్లు పొందేందుకే దివాలాకోరు విధానం అవలంభిస్తున్నారని దుయ్యబట్టారు.
అమరులను మరవద్దు:
తెలంగాణ సాధన కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరులను మరిచిపోతే భవిష్యత్ నిర్మాణం సాధ్యం కాదని జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. బీజేపీ పోరుయాత్ర నిర్వహించి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా కృష్ణా గ్రామంలో బీజేపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సమావేశంలో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.