'ఎంఐఎం చేతిలో కీలుబొమ్మగా కేసీఆర్' | KCR is puppet in the hands of MIM says kishanreddy | Sakshi
Sakshi News home page

'ఎంఐఎం చేతిలో కీలుబొమ్మగా కేసీఆర్'

Published Mon, Mar 30 2015 4:35 PM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM

'ఎంఐఎం చేతిలో కీలుబొమ్మగా కేసీఆర్' - Sakshi

'ఎంఐఎం చేతిలో కీలుబొమ్మగా కేసీఆర్'

నిజామాబాద్: బీజేపీ నాయకులపై దాడులని సహించేదిలేదని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎంఐఎం చేతిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలుబొమ్మగా మారారని కిషన్ రెడ్ది మండిపడ్డారు. ఇసుక మాఫియాలో మంత్రుల హస్తం ఉన్నట్లు వస్తున్న ఆరోపణలని ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు.

మంత్రుల్లో సగం మంది టీడీపీ వారే ఉండగా,తెలంగాణను వ్యతిరేకించిన టీడీపీ నాయకులు తలసాని శ్రీనివాస్, తుమ్మల నాగేశ్వరరావులకు మంత్రివర్గంలో ఎలా చోటు కల్పించారన్నారు. కేసీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయే తప్ప ...చేతల్లో చూపించడం లేదని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement