రాష్ట్రంలో రజాకారుల పాలన
రాష్ట్రంలో రజాకారుల పాలన
Published Sat, Jul 30 2016 8:19 PM | Last Updated on Mon, Sep 4 2017 7:04 AM
ఆత్మకూరు(ఎం) : తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పరిపాలన చూస్తుంటే రజాకారుల పాలన తలపిస్తుందని డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్య గౌడ్ విమర్శించారు. శనివారం మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులకు ఏనాడు వ్యతిరేకం కాదన్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ప్రతి పక్షాల నాయకులను అరెస్టు చేసి భయభ్రాంతులకు గురిచేస్తుందన్నారు. దళితులకు మూడు ఎకరాల భూపంపిణీ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎంసెట్–2 పరీక్ష లీకేజీకి ప్రభుత్వం నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి, సంబంధిత ఇద్దరు మంత్రులు పదవులకు రాజీనామా చేయాలన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొడిత్యాల నరేందర్ గుప్తా, సింగిల్ విండో చైర్మన్ జిల్లాల శేఖర్‌రెడ్డి, నాయకులు యాస లక్ష్మారెడ్డి, కందడి అనంతరెడ్డి, ముద్దసాని సిద్దులు, కట్టెకోల హన్మంతు గౌడ్, బొడిగె భిక్షపతి, యాదగిరి ఉన్నారు.
Advertisement