atmakur (M)
-
అధికారదాహం కోసమే ప్రజాకూటమి : గొంగిడి సునీత
సాక్షి, ఆత్మకూరు(ఎం) : అధికారం దాహం కోసమే కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ ప్రజాకూటమిగా ఏర్పడ్డాయని టీఆర్ఎస్ ఆలేరు అభ్యర్థి గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం ఆత్మకూరు(ఎం) మండలం తుక్కాపురం, పోసానికుంట, రహీంఖాన్‌పేట, మోదుబావిగూడెం, కామునిగూడెంలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించి మాట్లాడారు. ప్రజాకూటమిగా ఏర్పడిన నాయకులకు ప్రజా సంక్షేమం అవసరం లేదన్నారు. కేసీఆర్‌ను ఒంటరిగా ఓడించలేమని కాం గ్రెస్ పార్టీ నాలుగు పార్టీలను కలుపుకుని మాయా కూటమిగా ఏర్పడిందని ఎద్దేవా చేశారు. తెలం గాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అన్ని గ్రామాల్లో మౌలిక వసతులను కల్పించకోగలుగుతున్నామని చెప్పారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను, కుంటలను అభివృద్ధి చేసుకున్నామని, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా నీటిని తీసుకొచ్చామని గుర్తుచేశారు. గ్రామీణ స్థాయిలో ప్రస్తుతం ప్రజలు లబ్ధిపొందే పథకాలను గతంలో ఏ ప్రభుత్వమైనా ఆలోచించిందా అని ప్రశ్నించారు. నియోజకవర్గంలో సాగునీటి కాల్వ ల అభివృద్ధికి సీఎం కేసీఆర్ రూ.300 కోట్లు మంజూరు చేశారని పేర్కొన్నారు. సాగునీటి కా ల్వలు పూర్తి చేసి ఈ ప్రాంతానికి సాగునీటిని అం దిస్తామని హామీ ఇచ్చారు. ఆలేరు నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయడానికి మీ ప్రతినిధిగా కారు గుర్తుకు ఓటు వేసి తనను మరోమారు అసెంబ్లీకి పంపించాలని కోరారు. ఈ సందర్భంగా మోదుబావిగూడెంలో కారు గుర్తుకు ఓటు వేస్తామని ప్రజలు తీర్మాణం చేశారు. రహీంఖాన్‌పేట, తుక్కాపురం, కామునిగూడెంలో వివిధ పార్టీల నుంచి 150 మంది టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డమీది రమేష్‌గౌడ్, మండల అధ్యక్షుడు భాషబోయిన ఉప్పలయ్య, వైస్ ఎంపీపీ ఏనుగు దయాకర్‌రెడ్డి, రైతు సమితి జిల్లా సభ్యుడు కోరె భిక్షపతి, బీసు ధనలక్ష్మి, నాయకులు బీసు చందర్‌గౌడ్, యాస కవిత, మామిడి శ్రీనివాస్‌గౌడ్, కొత్త నర్సింహారెడ్డి, కర్రె అయిలయ్య, చిక్కిరి రవి, కంభంపాటి జయమ్మ, సామ బుచ్చిరెడ్డి, దోర్నాల గోపాల్, కట్టెకోల శ్రీహరి, కంభంపాటి సోమరాజు, బండ సాయి, నాతి స్వామి, నాతి మల్లికార్జున్ ఉన్నారు. మరిన్ని వార్తాలు.. -
వ్యవసాయరంగంలో మహిళలు రాణించాలి
ఆత్మకూరు(ఎం): వ్యవసాయ రంగంలో మహిళలు రాణించాలని రైతు శిక్షణ కేంద్ర సహాయ సంచాలకులు శాంతి నిర్మల అన్నారు. మండలంలోని కాటెపల్లిలో గురువారం రైతు శిక్షణ కేంద్రం నల్లగొండ ఆధ్వర్యంలో వ్యవసాయ రంగంలో మహిళలకు నైపుణ్యతపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించి మాట్లాడారు. వ్యవసాయ అనుబంధ రంగాలైన పాడి, పట్టు, కోళ్లపరిశ్రమ రంగాల్లో మహిళల భాగస్వామ్యం ఉన్నట్లు చెప్పారు. వ్యవసాయ రంగంలో సేంద్రియ ఎరువుల వాడకం పెంచాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఏనుగు లక్ష్మినాగిరెడ్డి, మండల వ్యవసాయ అధికారి ఎస్. లావణ్య, ఏఈఓ బి. నాగార్జున రైతులు ఉపేంద్ర, కవిత పాల్గొన్నారు. -
వ్యవసాయరంగంలో మహిళలు రాణించాలి
రంగంలో మహిళలు రాణించాలని రైతు శిక్షణ కేంద్ర సహాయ సంచాలకులు శాంతి నిర్మల అన్నారు. మండలంలోని కాటెపల్లిలో గురువారం రైతు శిక్షణ కేంద్రం నల్లగొండ ఆధ్వర్యంలో వ్యవసాయ రంగంలో మహిళలకు నైపుణ్యతపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించి మాట్లాడారు. వ్యవసాయ అనుబంధ రంగాలైన పాడి, పట్టు, కోళ్లపరిశ్రమ రంగాల్లో మహిళల భాగస్వామ్యం ఉన్నట్లు చెప్పారు. వ్యవసాయ రంగంలో సేంద్రియ ఎరువుల వాడకం పెంచాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఏనుగు లక్ష్మినాగిరెడ్డి, మండల వ్యవసాయ అధికారి ఎస్. లావణ్య, ఏఈఓ బి. నాగార్జున రైతులు ఉపేంద్ర, కవిత పాల్గొన్నారు. -
రాష్ట్రంలో రజాకారుల పాలన
ఆత్మకూరు(ఎం) : తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పరిపాలన చూస్తుంటే రజాకారుల పాలన తలపిస్తుందని డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్య గౌడ్ విమర్శించారు. శనివారం మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులకు ఏనాడు వ్యతిరేకం కాదన్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ప్రతి పక్షాల నాయకులను అరెస్టు చేసి భయభ్రాంతులకు గురిచేస్తుందన్నారు. దళితులకు మూడు ఎకరాల భూపంపిణీ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎంసెట్–2 పరీక్ష లీకేజీకి ప్రభుత్వం నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి, సంబంధిత ఇద్దరు మంత్రులు పదవులకు రాజీనామా చేయాలన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొడిత్యాల నరేందర్ గుప్తా, సింగిల్ విండో చైర్మన్ జిల్లాల శేఖర్‌రెడ్డి, నాయకులు యాస లక్ష్మారెడ్డి, కందడి అనంతరెడ్డి, ముద్దసాని సిద్దులు, కట్టెకోల హన్మంతు గౌడ్, బొడిగె భిక్షపతి, యాదగిరి ఉన్నారు.