Published
Thu, Aug 4 2016 6:15 PM
| Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
వ్యవసాయరంగంలో మహిళలు రాణించాలి
ఆత్మకూరు(ఎం): వ్యవసాయ రంగంలో మహిళలు రాణించాలని రైతు శిక్షణ కేంద్ర సహాయ సంచాలకులు శాంతి నిర్మల అన్నారు. మండలంలోని కాటెపల్లిలో గురువారం రైతు శిక్షణ కేంద్రం నల్లగొండ ఆధ్వర్యంలో వ్యవసాయ రంగంలో మహిళలకు నైపుణ్యతపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించి మాట్లాడారు. వ్యవసాయ అనుబంధ రంగాలైన పాడి, పట్టు, కోళ్లపరిశ్రమ రంగాల్లో మహిళల భాగస్వామ్యం ఉన్నట్లు చెప్పారు. వ్యవసాయ రంగంలో సేంద్రియ ఎరువుల వాడకం పెంచాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఏనుగు లక్ష్మినాగిరెడ్డి, మండల వ్యవసాయ అధికారి ఎస్. లావణ్య, ఏఈఓ బి. నాగార్జున రైతులు ఉపేంద్ర, కవిత పాల్గొన్నారు.