
బీజింగ్: భారత్, చైనా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. కానీ ప్రధాని మోదీకి మాత్రం చైనాలో ఫాలోయింగ్ మామూలుగా లేదు! ముఖ్యంగా నెటిజన్లయితే మోదీ పట్ల ఫిదా అవుతున్నారు. ‘మోదీ లావోగ్జియన్’ (మోదీ చిరంజీవి) అని ప్రేమగా పిలుచుకుంటున్నారు.
ఒక విదేశీ నేత పట్ల చైనీయులు ఇంతటి గౌరవాదరాలు చూపడం అరుదు. ‘మోదీ అద్భుతమైన నాయకుడు. విభిన్నంగా ఆలోచిస్తారు. భారత్‌ను చక్కగా ముందుకు తీసుకెళ్తున్నారు’ అంటూ చైనా సోషల్ సైట్ సినావెబోలో నెటిజన్లు ఆకాశానికెత్తుతున్నారని అమెరికా మ్యాగజైన్ ది డిప్లొమేట్ పేర్కొంది. సినా వెబోకు 58 కోట్లకు పైగా యాక్టివ్ యూజర్లున్నారు.
Comments
Please login to add a commentAdd a comment