India-China relations
-
ఆసియా భవిష్యత్తుకు భారత్-చైనా సంబంధాలే కీలకం: జై శంకర్
భారత్-చైనా సరిహద్దు వివాదంపై విదేశాంగశాఖ మంత్రి జై శంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. న్యూయార్క్‌లోని ఆసియా సొసైటీ పాలసీ ఇన్స్టిట్యూట్లో జై శంకర్ మాట్లాడుతూ.. 2020 నుంచి గాల్వాన్ వ్యాలీ వద్ద భారత్, చైనా మధ్య ప్రతిష్టంభన నెలకొందని తెలిపారు. అక్కడ జరిగిన ఘర్షణలు భారత్-చైనా సంబంధాలను పూర్తిగా దెబ్బతీశాయని అన్నారు. అయితే చైనాతో సమస్య పరిష్కారానికి ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు.తూర్పు లఢక్‌లో సైన్యం తొలగింపు విషయంలో భారత్-చైనా సరిహద్దు వివాద చర్చల్లో 75 శాతం పురోగతి సాధించినట్లు చెప్పారు.సరిహద్దులో హింస ఉండకూడదని, ఒకవేళ ఉద్రిక్త పరిస్థితులు ఉంటే ఇరుదేశాల సంబంధాలపై ప్రభావం చూపుతాయని అన్నారు. చైనాతో భారత్‌కు స్పష్టమైన ఒప్పందాలు ఉన్నప్పటికీ 2020లో బీజింగ్ అనేక మంది సైనికులను వాస్తవ నియంత్రణ రేఖకు తరలించిందని జైశంకర్ అన్నారు.‘చైనాతో ఢిల్లీకి కష్టమైన చరిత్ర ఉంది. బీజింగ్‌తో మనకు స్పష్టమైన ఒప్పందాలు ఉన్నప్పటికీ, కోవిడ్ కాలంలో ఈ ఒప్పందాలను ఉల్లంఘిస్తూ చైనా పెద్ద సంఖ్యలో బలగాలను ఎల్ఏసీ కి తరలించడాన్ని మనం చూశాం. దీని వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది. జరిగింది కూడా. తద్వారా ఇరు దేశాలకు చెందిన అనేక మంది సైనికులు మరణించారు. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి’ అని పేర్కొన్నారు.కాగా ఈ నెల ప్రారంభంలో జైశంకర్ మాట్లాడుతూ.. చైనాతో సరిహద్దు చర్చల్లో భారత్ పురోగతి సాధించిందని, ఆ దేశ బలగాల ఉపసంహరణకు సంబంధించిన సమస్యలు దాదాపు 75 శాతం పరిష్కారం అయ్యాయని వెల్లడించారు. తూర్పు లడఖ్ సరిహద్దు వద్ద చైనా సైనికీకరణ పెరుగుతుండడం అతిపెద్ద సవాలుగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.#WATCH | New York: During the Asia Society at the Asia Society Policy Institute, EAM Dr S Jaishankar says, "We have a difficult history with China... Despite the explicit agreements we had with China, we saw in the middle of covid that the Chinese moved large number of forces in… pic.twitter.com/vNyfWTZrJY— ANI (@ANI) September 24, 2024 ఈ విషయాన్ని తాజాగా ప్రస్తావిస్తూ.. చైనాతో సరిహద్దు విషయంలో 75 శాతం పరిష్కరించిందని తాను చెప్పింది కేవలం బలగాల ఉపసంహరణ మాత్రమేనని తెలిపారు.. అయితే పెట్రోలింగ్ సమస్యలు కొన్ని పరిష్కరించాల్సి ఉందని,. తదుపరి చర్చల్లో వీటిని ప్రస్తావించనున్నట్లు పేర్కొన్నారు.ఆసియా భవిష్యత్తుకు భారత్-చైనా సంబంధాలు కీలకమని భావిస్తున్నట్లు జైశంకర్ వెల్లడించారు. ఇది కేవలం ఖండంలోనే కాకుండా యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుందని అన్నారు. రెండు దేశాల సమాంతర పెరుగుదల నేటి ప్రపంచ రాజకీయాల్లో చాలా పెద్ద సమస్యగా ఉందని పేర్కొన్నారు. ఆసియా, ప్రపంచాన్ని బహుళ ధృవంగా మార్చడానికి భారతదేశం- చైనా మధ్య సంబంధాలే కీలకమని నొక్కి చెప్పారు. -
భారత్, చైనా సరిహద్దుల్లో సైనికీకరణ ఆందోళనకరం
జెనీవా: తూర్పు లద్ధాఖ్‌లో భారత్–చైనా సరిహద్దులో నాలుగేళ్ల క్రితం మొదలైన ఉద్రిక్తతలను తగ్గించడానికి ప్రయత్నాలు ఊపందుకున్నాయని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ చెప్పారు. వివాదాస్పద సరిహద్దు ప్రాంతాల నుంచి ఇరుదేశాల సైన్యం వెనక్కి వెళ్లిపోయే విషయంలో చైనాతో నెలకొన్న సమస్యలు 75 శాతం పరిష్కారమైనట్లు తెలిపారు. చేయాల్సింది ఇంకా మిగిలే ఉందని పేర్కొన్నారు. గురువారం స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఓ చర్చా కార్యక్రమంలో జైశంకర్ మాట్లాడారు. 2020లో జరిగిన గల్వాన్ లోయ ఘర్షణలు భారత్–చైనా సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపాయని పేర్కొన్నారు. సరిహద్దుల్లో శాంతియుత పరిస్థితులు ఉంటేనే ఇరుదేశాల మధ్య సంబంధాలు బలపడతాయని ఉద్ఘాటించారు. భారత్, చైనా సైన్యం మధ్య ఘర్షణలకు పూర్తిగా తెరదించడానికి నాలుగేళ్లుగా చర్చలు జరుగుతున్నాయని వివరించారు. తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దుల వెంబడి భారత్, చైనా సైన్యం వెనక్కి వెళ్తుండగా, మరోవైపు అక్కడ మిగిలి ఉన్న రెండు దేశాల సేనలు ఎదురెదురుగా సమీపంలోకి వస్తుండడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. సరిహద్దుల్లో సైనికీకరణ జరుగుతోందని వెల్లడించారు. ఈ సమస్యను కచి్చతంగా పరిష్కరించాల్సి ఉందన్నారు. సేనలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని భారత్, చైనా నిర్ణయం తూర్పు లద్దాఖ్‌లో వివాదాస్పద సరిహద్దుల నుంచి తమ సేనలను సాధ్యమైనంత త్వరగా పూర్తిగా ఉపసంహరించుకోవాలని భారత్, చైనా నిర్ణయించుకున్నాయి. ఈ దిశగా ప్రయత్నాలను వేగవంతం, రెట్టింపు చేయాలని తీర్మానించుకున్నాయి. భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గురువారం రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో సమావేశమయ్యారు. సరిహద్దుల్లో శాంతి, సామరస్యం నెలకొనాలని తాము కోరుకుంటున్నామని అజిత్ దోవల్ ఈ సందర్భంగా తేలి్చచెప్పారు. వాస్తవా«దీన రేఖను(ఎల్ఏసీ)ని గౌరవించాలని వాంగ్ యీకి సూచించారు. భారత్, చైనా మధ్య సంబంధాలు సాధారణ స్థితికి చేరుకోవాలంటే ఎల్ఏసీని గౌరవించాల్సిందేనని స్పష్టంచేశారు. -
భారత్–చైనా ఆర్మీ మధ్య రేపు చర్చలు
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లోని మిగిలిన ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణ వేగంగా జరగాలని భారత్ స్పష్టం చేయనుంది. భారత్– చైనా మధ్య 19వ విడత చర్చలు ఈ నెల 14న జరగనున్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రెండు దేశాల కార్ప్స్ కమాండర్ స్థాయి చివరి దఫా చర్చలు నాలుగు నెలల క్రితం జరిగాయి. రేపు జరిగే చర్చల్లో మిగిలిన ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణ పూర్తిగా జరగాలని భారత ప్రతినిధి బృందం పట్టుబడ్టనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. రెండు దేశాల మధ్య పలు విడతలుగా జరిగిన చర్చల ఫలితంగా తూర్పులద్దాఖ్‌లోని కొన్ని ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి ఇరు పక్షాలు బలగాలను ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. 18వ విడత చర్చల్లో ప్రధానంగా డెప్సాంగ్, డెమ్చోక్ ప్రాంతాల నుంచి సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలంటూ భారత్ గట్టిగా డిమాండ్ చేసింది. తాజా చర్చలు చుషుల్–మోల్డో సరిహద్దు పాయింట్‌లోని భారత భూభాగంలో జరుగుతాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. భారత బృందానికి లెఫ్టినెంట్ జనరల్ రషీమ్ బాలి, చైనా కు సౌత్ జిన్జియాంగ్ మిలటరీ డిస్ట్రిక్ట్ కమాండర్ నాయకత్వం వహించే అవకాశాలున్నాయి. -
సరిహద్దుల్లో శాంతితోనే సత్సంబంధాలు
న్యూఢిల్లీ: భారత్–చైనా మధ్య సత్సంబంధాలు కొనసాగాలంటే సరిహద్దు సమస్యలన్నీ ద్వైపాక్షిక ఒప్పందాలకు లోబడి పరిష్కారం కావాల్సి ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కుండబద్దలు కొట్టారు. గురువారం ఆయన చైనా రక్షణ మంత్రి లి షంగ్ఫుతో చర్చలు జరిపారు. తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి(ఎల్ఏసీ) మూడేళ్లుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో జరిగిన ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. శుక్రవారం జరిగే షాంఘై సహకార సంస్థ(ఎస్సీవో) దేశాల రక్షణ మంత్రుల సమావేశం కోసం లి గురువారం ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్, లి సుమారు 45 నిమిషాలసేపు చర్చలు జరిపారు. ఇరువురు మంత్రులు సరిహద్దు వివాదాలతోపాటు ద్వైపాక్షిక సంబంధాలపై ఎటువంటి దాపరికాలు లేకుండా చర్చలు జరిపినట్లు రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఎల్ఏసీ వెంట నెలకొన్న వివాదాలు రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలు, హామీలు, ఒడంబడికలకు లోబడి పరిష్కారం కావాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ తెలిపారు. ‘సరిహద్దుల్లో శాంతియుత వాతావరణాన్ని బట్టే రెండు దేశాల మధ్య సంబంధాల కొనసాగింపు ఆధారపడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సరిహద్దు ఒప్పందాల ఉల్లంఘనలతో ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతింటాయని, ఉద్రిక్తతలు సడలిన తర్వాత మాత్రమే బలగాల ఉపసంహరణ ఉంటుందని తెలిపారు’అని రక్షణ శాఖ ఆ ప్రకటనలో వివరించింది. -
ప్రధాని మోదీకి జైకొడుతున్న చైనా నెటిజన్లు.. అమెరికా మ్యాగజైన్ వెల్లడి
బీజింగ్: భారత్, చైనా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. కానీ ప్రధాని మోదీకి మాత్రం చైనాలో ఫాలోయింగ్ మామూలుగా లేదు! ముఖ్యంగా నెటిజన్లయితే మోదీ పట్ల ఫిదా అవుతున్నారు. ‘మోదీ లావోగ్జియన్’ (మోదీ చిరంజీవి) అని ప్రేమగా పిలుచుకుంటున్నారు. ఒక విదేశీ నేత పట్ల చైనీయులు ఇంతటి గౌరవాదరాలు చూపడం అరుదు. ‘మోదీ అద్భుతమైన నాయకుడు. విభిన్నంగా ఆలోచిస్తారు. భారత్‌ను చక్కగా ముందుకు తీసుకెళ్తున్నారు’ అంటూ చైనా సోషల్ సైట్ సినావెబోలో నెటిజన్లు ఆకాశానికెత్తుతున్నారని అమెరికా మ్యాగజైన్ ది డిప్లొమేట్ పేర్కొంది. సినా వెబోకు 58 కోట్లకు పైగా యాక్టివ్ యూజర్లున్నారు. -
పార్లమెంట్ సమావేశాలకు తెర
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు షె డ్యూల్ కంటే ఆరు రోజుల ముందే శుక్రవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ నెల 7న సమావేశాలు ప్రారంభమయ్యాయి. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 29న ముగియాల్సి ఉంది. సరిహద్దులో భారత్–చైనా ఘర్షణపై పార్లమెంట్ చర్చించాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు ఉభయ సభలను కొద్దిరోజులుగా స్తంభింపజేస్తున్నాయి. దీంతో సభలను తరచూ వాయిదా వేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం శీతాకాల సమావేశాలను షెడ్యూల్ కంటే ముందే ముగించినట్లు తెలుస్తోంది. క్రిస్మస్, న్యూ ఇయర్ దృష్ట్యా ఇందుకు అన్ని పార్టీల సభాపక్ష నేతలు అంగీకరించారని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా చెప్పారు. శుక్రవారం చివరి రోజు పార్లమెంట్‌కు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, పీయూష్ గోయల్, కాంగ్రెస్ ఎంపీలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ తదితరులు హాజరయ్యారు. వరుసగా ఎనిమిదోసారి.. పార్లమెంట్ సమావేశాలు షెడ్యూల్ కంటే ముందే ముగియడం ఇది వరుసగా ఎనిమిదోసారి! 17వ లోక్‌సభలో అత్యంత తక్కువ కాలం జరిగిన భేటీల్లో ఇది కూడా ఒకటని సమాచారం. -
పార్లమెంట్లో ‘సరిహద్దు’ రగడ.. లోక్‌సభ ఐదుసార్లు వాయిదా
న్యూఢిల్లీ: సరిహద్దులో భారత్, చైనా జవాన్ల ఘర్షణ, చైనా దురాక్రమణ గురించి పార్లమెంట్లో చర్చించాలన్న డిమాండ్‌పై ప్రతిపక్షాలు పట్టువీడడం లేదు. లోక్‌సభలో గురువారం సైతం ఇదే అంశాన్ని విపక్ష సభ్యులు లేవనెత్తారు. సభలో ఇతర వ్యవహారాలను పక్కనపెట్టి, చైనా ఆగడాలపై వెంటనే చర్చ ప్రారంభించాలని తేల్చిచెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభకు వచ్చి, సమాధానం చెప్పాలని, నిరంకుత్వం చెల్లదని నినాదాలు చేశారు. చర్చకు సభాపతి నిరాకరించడంతో సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. సభ సజావుగా సాగడానికి సహకరించాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ కోరినా వారు పట్టించుకోలేదు. దీంతో ఐదుసార్లు సభను వాయిదా వేయాల్సి వచ్చింది. ప్రస్తుత శీతాకాల సమావేశాల్లో లోక్‌సభను ఒకేరోజు ఐదుసార్లు వాయిదా ఇదే మొదటిసారి. విపక్షాల నినాదాల హోరు కొనసాగుతుండగానే మరోవైపు కేంద్ర వాణిజ్యమంత్రి గోయల్ ‘జన విశ్వాస్ (సవరణ) బిల్లు–2022’ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. బిల్లును పార్లమెంట్ జాయింట్ కమిటీ పరిశీలనకు పంపాలని సిఫార్సు చేశారు. విపక్షాల ఆందోళన కారణంగా సభా వ్యవహారాలేవీ సాగలేదు. ప్రశ్నోత్తరాల్లో పాల్గొనాలని స్పీకర్ బిర్లా పదేపదే కోరినా కాంగ్రెస్ తదితర పార్టీల ఎంపీలు వినిపించుకోలేదు. సరిహద్దులో ఘర్షణపై చర్చ ప్రారంభించాలని పట్టుబట్టారు. కరోనా వైరస్ వ్యాప్తిపై కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటన చేస్తున్న సమయంలోనూ ప్రతిపక్ష సభ్యులు నినాదాలు కొనసాగించారు. చైనా దురాక్రమణపై చర్చించాలని కోరుతూ పార్లమెంట్ ఉభయ సభల్లో పలువురు విపక్ష సభ్యులు ఇప్పటికే వాయిదా తీర్మానాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఒకరోజు బహిష్కరించిన విపక్షాలు సరిహద్దు అంశంపై చర్చకు అనుమతి ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ విపక్షాలన్నీ గురువారం రాజ్యసభ కార్యకలాపాలను బహిష్కరించాయి. తొలుత ఉదయం సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష ఎంపీలు వెల్‌లోకి దూసుకొచ్చారు. చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ నినాదాలు ప్రారంభించారు. సభను అడ్డుకోవద్దంటూ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ సూచించారు. అయినా నినాదాలు ఆపలేదు. సరిహద్దు వ్యవహారంపై చర్చకు చైర్మన్ అంగీకరించకపోవడంతో సభను బహిష్కరిస్తున్నట్లు విపక్ష ఎంపీలు చెప్పారు. -
చైనాతో వాణిజ్య బంధం తెంచుకోవాలనడం సరికాదు
న్యూఢిల్లీ: సరిహద్దులో అతిక్రమనలకు ప్రతీకారంగా చైనాతో భారత్ వాణిజ్య సంబంధాలు తెగతెంపులు చేసుకోవలన్న డిమాండ్ సరికాదని నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ పనగారియా స్పష్టం చేశారు. అలాచేయడం వల్ల భారత్ ఆర్థిక వృద్ధి వేగమూ మందగిస్తుందని హెచ్చరించారు. అందుకు బదులుగా ముందు భారతదేశం తన వాణిజ్యాన్ని విస్తరించడానికి బ్రిటన్, యూరోపియన్ యూనియన్ (ఈయూ) వంటి దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏ)కుదుర్చుకోవడానికి ప్రయత్నించాలని కొలంబియా విశ్వవిద్యాలయంలో ఎకనమిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆయన సూచించారు. ‘‘ రెండు దేశాలు వాణిజ్య ఆంక్షలు విధించుకోవచ్చు. అయితే 17 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ (చైనా)కు మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ (భారతదేశం)ని దెబ్బతీసే సామర్థ్యమే అధికంగా ఉంటుంది’’ అని ఆయన విశ్లేషించారు. ‘‘మనం చైనాను శిక్షించాలని ప్రయత్నిస్తే, అది వెనక్కి తగ్గదు. అమెరికా ఆంక్షల విషయంలో చైనా ఎలా ప్రతిస్పందించిందన్న విషయాన్ని, ఇందుకు సంబంధించి అమెరికాలో పరిణామాలను మనం ఈ సందర్భంగా ప్రస్తావించుకోవాలి’’ అని ఆయన అన్నారు. ఆంక్షల విధింపు వల్ల లాభంకన్నా నష్టాలే ఎక్కువనే అన్నారు. రష్యాపై ఆంక్షల విధింపు ద్వారా అమెరికా, యూరోపియన్ యూనియన్లు ఎలాంటి ప్రతికూల పర్యవసానాలను ఎదుర్కొంటున్నాయో కూడా మనం గమనించాలని అన్నారు. చౌక కాబట్టే కొంటున్నాం... భారతదేశం దిగుమతి చేసుకునే అనేక ఉత్పత్తులకు చైనా చౌకైన సరఫరాదారు కాబట్టే భారత్ బీజింగ్ నుండి కొనుగోలు చేస్తోందని పనగారియా చెప్పారు. భారతదేశం ఎగుమతి చేయాలనుకుంటున్న వస్తువులకు చైనా మంచి ధరను అందించబోదని అన్నారు. ఇక్కడే మనం అమెరికా వంటి వాణిజ్య భాగస్వాములకు మన వస్తువులను భారీగా అమ్మడంపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. దీని ఫలితంగా చైనాతో వాణిజ్య లోటు– అమెరికాతో వాణిజ్య మిగులుతో భర్తీ అవుతుందని అన్నారు. వెరసి చైనాతో వాణిజ్యలోటు తీవ్రత వల్ల ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదన్నారు. ఏటేటా భారీ వాణిజ్యలోటు భారత్– చైనాల మధ్య వాణిజ్య లోటు (ఎగుమతులు–దిగుమతుల మధ్య వ్యత్యాసం) ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–అక్టోబర్ మధ్య కాలంలో 51.5 బిలియన్ల డాలర్లకు చేరుకుంది. 2021–22లో ఈ లోటు 73.31 బిలియన్ డాలర్లు. 2020–21లో 44.03 బిలియన్లతో పోల్చితే వాణిజ్యలోటు భారీగా పెరగడం గమనార్హం. తాజా ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్–అక్టోబర్ మధ్య చైనా దిగుమతులు 60.27 బిలియన్ డాలర్లు. ఎగుమతులు 8.77 బిలియన్ డాలర్లు. క్యాడ్‌పై ఇప్పటికి ఓకే... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) భారత్ కరెంట్ ఖాతా లోటు (క్యాడ్) 2 నుండి 3 శాతం (జీడీపీ విలువతో పోల్చి) మధ్య ఉండవచ్చని అన్నారు. ఇది భారత్ తట్టుకునే పరిమితిలో ఉందని పేర్కొన్నారు. ఈ స్థాయి క్యాడ్‌తో స్థూల ఆర్థిక స్థిరత్వానికి ఎటువంటి ముప్పు ఉండబోదని స్పష్టం చేశారు. 2020–21లో భారతదేశం జీడీపీలో 0.9 శాతం కరెంట్–ఖాతా మిగులు నమోదయ్యింది. 2021–22లో 1.2 శాతం కరెంట్–ఖాతా లోటు ఏర్పడింది. ఒక నిర్దిష్ట కాలంలో ఒక దేశంలోకి వచ్చీ–దేశంలో నుంచి బయటకు వెళ్లే విదేశీ మారకద్రవ్య విలువ మధ్య నికర వ్యత్యాసాన్ని ‘కరెంట్ అకౌంట్’ ప్రతిబింబిస్తుంది. దేశానికి సంబంధిత సమీక్షా కాలంలో విదేశీ నిధుల నిల్వలు అధికంగా వస్తే, దానికి కరెంట్ అకౌంట్ ‘మిగులు’గా, లేదా దేశం చెల్లించాల్సిన మొత్తం అధికంగా ఉంటే ఈ పరిస్థితిని కరెంట్ అకౌంట్ ‘లోటుగా’ పరిగణిస్తారు. దీనిని సంబంధిత సమీక్షా కాలం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువతో పోల్చి శాతాల్లో పేర్కొంటారు. -
దేశ భద్రతపై మౌనమా? కేంద్రాన్ని నిలదీసిన సోనియా గాంధీ
న్యూఢిల్లీ: భారత్–చైనా సరిహద్దు అంశంపై పార్లమెంట్లో చర్చించకుండా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తోందని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సోనియా గాంధీ మండిపడ్డారు. దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారంపై ప్రభుత్వం మౌనంగా ఉండడం ఏమిటని నిలదీశారు. బుధవారం పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో తమ ఎంపీలను ఉద్దేశించి సోనియా మాట్లాడారు. మన దేశ భూభాగాన్ని చైనా దురాక్రమిస్తున్నా నరేంద్ర మోదీ ప్రభుత్వం నోరుమెదపడం లేదని ఆరోపించారు. పార్లమెంట్లో చర్చిద్దామని కోరినా పట్టించుకోవడం లేదన్నారు. దేశ రక్షణ, సరిహద్దు పరిస్థితిపై దేశ ప్రజలకు నిజాలు చెప్పాలిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. తన చర్యలు, విధానాలు ఏమిటో కూడా చెప్పాలన్నారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది? దేశ సరిహద్దును చైనా సైన్యం ఉల్లంఘిస్తుండడం అత్యంత ఆందోళనకరమైన అంశమని సోనియా గాంధీ పేర్కొన్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ చైనా సైన్యం దాడులను సమర్థంగా తిప్పికొడుతున్న మన జవాన్లకు మన దేశం యావత్తూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. దేశ భద్రతకు సవాలు ఎదురైనప్పుడు పార్లమెంట్‌ను విశ్వాసంలోకి తీసుకోవడం ఒక ఆనవాయితీ అని గుర్తుచేశారు. మోదీ ప్రభుత్వం మాత్రం అందుకు సిద్ధంగా లేదని ఆక్షేపించారు. పార్లమెంట్లో చర్చ జరగకపోవడం వల్ల రాజకీయ పార్టీలకు, ప్రజలకు క్షేత్రస్థాయిలో జరుగుతున్నదేమిటో తెలియడం లేదన్నారు. దేశంలో విభజన రాజకీయాలు, సమాజంలో ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకోవడం, విద్వేషాలు రెచ్చగొట్టడం వంటివి కొనసాగుతున్నాయని, దీనివల్ల విదేశాల నుంచి పొంచి ఉన్న ముప్పును ఎదిరించడం మన దేశానికి కష్టతరం అవుతుందని సోనియా ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థను చట్టం పరిధి నుంచి తప్పించేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతోందన్నారు. జ్యుడీషియరీని పలుచన చేయొద్దని సూచించారు. ‘చైనా’పై చర్చ జరగాల్సిందే పార్లమెంటు ఆవరణలో విపక్షాల ధర్నా మీ హయాంలో చర్చించారా?: కేంద్రం న్యూఢిల్లీ: చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలపై పార్లమెంటులో చర్చ జరగాల్సిందేనని విపక్షాలన్నీ మరోసారి డిమాండ్ చేశాయి. కాంగ్రెస్ నేత సోనియాగాంధీ సారథ్యంలో బుధవారం పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద ధర్నాకు దిగాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, నేతలు, డీఎంకే, శివసేన, ఎన్సీపీ, ఆర్జేడీ, జేడీ(యూ), వామపక్షాలతో సహా 12 విపక్షాల ఎంపీలు పాల్గొన్నారు. ‘‘ప్రధాని మోదీ మౌనం వీడాల్సిందే. చైనా దురాక్రమణ యత్నాలపై మా ప్రశ్నలకు సభలో బదులిచ్చి తీరాల్సిందే’’ అని వారంతా నినదించారు. అయితే ఆ డిమాండ్‌ను కేంద్రం మరోసారి తోసిపుచ్చింది. యూపీఏ హయాంలో ఇలాంటి అంశాలను సభలో చర్చకు తాము డిమాండ్ చేస్తే ఇవ్వలేదని కేంద్ర న్యాయ మంత్రి కిరెణ్ రిజిజు అన్నారు. -
చైనా దురాక్రమణపై చర్చించాల్సిందే
న్యూఢిల్లీ: అరుణాచల్‌ప్రదేశ్‌లో భారత్, చైనా జవాన్ల మధ్య ఘర్షణ, చైనా దురాక్రమణపై చర్చించాలని ప్రతిపక్ష కాంగ్రెస్ శుక్రవారం రాజ్యసభలో డిమాండ్ చేసింది. ఉదయం సభ ప్రారంభం కాగానే పార్టీ ఎంపీలు నినాదాలు ప్రారంభించారు. వెల్‌లో బైఠాయించారు. దాంతో సభ 25 నిమిషాలు వాయిదా పడింది. తర్వాత కూడా చర్చకు విపక్షాలిచ్చిన నోటీసులను ఆమోదించాలని, ఇతర కార్యకలాపాలను పక్కనపెట్టి చైనా దురాక్రమణపై చర్చ చేపట్టాలని కాంగ్రెస్ ఎంపీలు పట్టుబట్టారు. దేశ భద్రతకు సంబంధించిన కీలకమైన అంశంపై చట్టసభలో చర్చించకపోవడం ఏమిటని ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే మండిపడ్డారు. జీరో అవర్‌ను ప్రారంభిస్తున్నట్లు డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ప్రకటించడంతో ఎంపీలు నినాదాలకు దిగారు. దాంతో సభ వాయిదా పడింది. లోక్‌సభలో కీలక అంశాల ప్రస్తావన రోడ్ల అనుసంధానం, అన్ని ఎన్నికలకు ఒకే ఓటర్ జాబితా, కేంద్ర పథకాలకు నిధులు, కాలుష్యం వంటి కీలకాంశాలను లోక్‌సభలో శుక్రవారం పలు పార్టీల సభ్యులు ప్రస్తావించారు. పెన్షన్లు, రిటైర్మెంట్ ప్రయోజనాల విషయంలో సమస్యలను తక్షణమే పరిష్కరించాలని శివసేన ఎంపీ వినాయక్ రౌత్ కోరారు. కొన్ని రాష్ట్రాల్లో ఆయుష్మాన్ భారత్–ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన దుర్వినియోగం అవుతోందని బీజేపీ సభ్యుడు సుదర్శన్ భగత్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారత్ భద్రతకు చైనా నుంచి అతిపెద్ద ముప్పు
న్యూఢిల్లీ: భారత్ భద్రతకు డ్రాగన్ దేశం చైనా నుంచి అతిపెద్ద ముప్పు పొంచి ఉందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎఫ్) బిపిన్ రావత్ ఉద్ఘాటించారు. దేశ సరిహద్దుల రక్షణ కోసం గత ఏడాది తరలించిన వేలాది మంది సైనికులను, ఆయుధాలను ఇప్పుడే వెనక్కి తీసుకొచ్చే అవకాశం లేదని తెలిపారు. సమీప భవిష్యత్తులోనూ అది సాధ్యం కాదని అన్నారు. భారత్–చైనా మధ్య సరిహద్దు వివాదానికి పరిష్కారం లభించడం లేదని, ఇరు దేశాల మధ్య విశ్వాసం కొరవడడం, అనుమానాలు పొడసూపుతుండడమే ఇందుకు కారణమని వివరించారు. సరిహద్దులో గానీ, సముద్రంలో గానీ ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తినా ధీటుగా బదులు చెప్పేందుకు భారత సైన్యం సర్వసన్నద్ధంగా ఉందని బిపిన్ రావత్ స్పష్టం చేశారు. అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ పాలన పునఃప్రారంభం కావడం భారత్ భద్రతకు ప్రమాదకరమైన పరిణామమేనని వివరించారు. అఫ్గానిస్తాన్ నుంచి అందే ఆయుధాలతో జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు బలం పుంజుకొనే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గత ఏడాది జూన్‌లో వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద ఇరు దేశాల సైన్యం మధ్య భీకర ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇరు పక్షాలు పదుల సంఖ్యలో ప్రాణనష్టాన్ని ఎదుర్కొన్నాయి. సరిహద్దుకు భారత్, చైనా భారీగా సైన్యాన్ని, ఆయుధాలను తరలించాయి. సైన్యాన్ని వెనక్కి రప్పించడానికి ఆరు పక్షాల మధ్య ఇప్పటిదాకా 13 దఫాలు చర్చలు జరిగాయి. అయినప్పటికీ పరిస్థితిలో మాత్రం మార్పు రాలేదు. ఇరు దేశాలు ఎల్ఏసీ వద్ద పెద్ద సంఖ్యలో సైన్యాన్ని మోహరించాయి. సరిహద్దు వెంట తమ భూభాగాల్లో మౌలిక వసతులను అభివృద్ధి చేసుకుంటున్నాయి. -
భారత్–చైనామధ్య 13వ దఫా చర్చలు
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభనను తొలగించే లక్ష్యంతో భారత్, చైనా ఆదివారం 13వ దఫా చర్చలు జరపనున్నాయి. చైనా బలగాలు ఇటీవల సరిహద్దులు దాటి ఉత్తరాఖండ్‌లోని బారాహోతీ సెక్టార్, అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్లలోకి ప్రవేశించిన నేపథ్యంలో జరుగుతున్న ఈ చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తూర్పు లద్దాఖ్ ఘర్షణాత్మక ప్రాంతాల్లోని కొన్ని ఫార్వర్డ్ పోస్టుల్లో మోహరించిన బలగాల ఉపసంహరణే ఈ భేటీ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. చైనా వైపు ఉన్న మోల్డో బోర్డర్ పాయింట్లో 10వ తేదీ ఉదయం 10.30 గంటలకు చర్చలు ప్రారంభం కానున్నాయని వెల్లడించాయి. భారత బృందానికి లెహ్‌లోని 14 కారప్స్ కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ పీజీకే మీనన్ నాయకత్వం వహించనున్నారు. డెప్సాంగ్, డెమ్చోక్ ప్రాంతాల విషయం ప్రస్తుతానికి పక్కనబెట్టి, మిగతా ఘర్షణాత్మక ప్రాంతాల్లో సాధ్యమైనంత త్వరగా బలగాల ఉపసంహరణ చేపట్టాలని చర్చల సందర్భంగా భారత్ ప్రతినిధులు పట్టుబట్టే అవకాశం ఉంది. 12వ విడత చర్చలు జూలై 31వ తేదీన జరిగాయి. ఫలితంగా కీలకమైన గోగ్రా పాయింట్ నుంచి రెండు దేశాల ఆర్మీ ఉపసంహరణ పూర్తయింది. చైనా మోహరింపులు ఆందోళనకరం ప్రతిష్టంభన కొనసాగుతున్న తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో చైనా మిలటరీ మోహరింపులు కొనసాగించడం, మౌలిక వసతులను పెంచుకోవడం ఆందోళన కలిగించే అంశమని ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే అన్నారు. ఇండియాటుడే కాంక్లేవ్‌లో శనివారం ఆయన మాట్లాడారు. శీతాకాలం ఆసాంతం బలగాల మోహరింపులను చైనా కొనసాగించాలని చూస్తే, పాకిస్తాన్ వైపు ఎల్వోసీ (నియంత్రణ రేఖ) వెంబడి వంటి పరిస్థితికి దారితీయవచ్చని భావిస్తున్నామన్నారు. ఆ దేశ మిలటరీ పీఎల్ఏ (పీపుల్స్ లిబరేషన్ ఆరీ్మ)కదలికలపై ఓ కన్నేసి ఉంచామన్నారు. చైనా సైన్యానికి సరితూగే స్థాయిలో భారత్ కూడా బలగాల మోహరింపులను కొనసాగిస్తుందని, ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా తిప్పికొడుతుందని స్పష్టం చేశారు. ప్రపంచమంతటా కోవిడ్ మహమ్మారి తీవ్రత కొనసాగుతుండటం, దక్షిణ చైనా సముద్రంలో ఒక వైపు వివాదాలను ఎదుర్కొంటున్న చైనా..మరో వైపు భారత్‌తో ప్రతిష్టంభనను ఎందుకు కొరుకుంటోందనేది అర్థం కాని విషయమన్నారు. ఏదేమైనప్పటికీ తూర్పు లద్దాఖ్ ప్రతిష్టంభనతో నిఘా వ్యవస్థను పటిష్టం చేయాల్సిన అవసరాన్ని గుర్తించామన్నారు. కశ్మీర్లో పరిస్థితులపై ఆయన మాట్లాడుతూ.. అఫ్గాన్ ఉగ్రవాదులు కశీ్మర్‌లోకి ప్రవేశించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో అఫ్గాన్‌లో తాలిబన్లు అధికారం చెలాయించిన సమయంలోనూ అక్కడి ఉగ్రమూకలు కశీ్మర్‌లోకి ప్రవేశించి విధ్వంసానికి పాల్పడ్డారని ఆయన గుర్తు చేశారు. అక్రమ చొరబాట్లను నిరోధించేందుకు, ఉగ్రవాదుల ఆటకట్టించేందుకు మన బలగాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. అఫ్గాన్‌లో తాలిబన్లు అధికారంలోకి రావడానికి, ఇటీవలి కాలంలో ఉగ్రవాదులు కశీ్మర్లో పౌరులను లక్ష్యంగా చేసుకోవడంతో సంబంధం ఉన్నట్లు భావించడం లేదని తెలిపారు. లోయలో అశాంతిని ప్రేరేపించాలని కుట్రపన్నిన ఉగ్రమూకలు చివరి ప్రయత్నంగా అమాయకులను పొట్టనబెట్టుకుంటున్నాయన్నారు. స్వేచ్ఛా నౌకాయానమే కీలకం: రాజ్‌నాథ్ భారతదేశ అభివృద్ధి స్వేచ్ఛా నౌకాయానంతోనే ఎక్కువగా ముడిపడి ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఎంతోకాలం నుంచి సముద్రంతోనే మనకు సన్నిహిత సంబంధం కొనసాగుతోంది. మన వాణిజ్యం, ఆరి్థక వ్యవస్థ, మన పండుగలు, సంస్కృతి సముద్రంతోనే సాన్నిహిత్యం కలిగి ఉన్నాయి. అయినప్పటికీ, సముదప్రాంతానికి సంబంధించి ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం’ అని శనివారం జరిగిన భారత తీర రక్షక దళం(ఐసీజీ) కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సముద్రయాన భద్రత లేకుండా, దేశానికి సమగ్ర రక్షణ వ్యవస్థను సాధించడం అసాధ్యమన్నారు. -
చైనాతో ఘర్షణలు కొనసాగుతూనే ఉంటాయ్
న్యూఢిల్లీ: భారత్, చైనా మధ్య ఒక ఒప్పందం కుదిరే వరకు సరహద్దుల్లో ఘర్షణలు కొనసాగుతూనే ఉంటాయని ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె వ్యాఖ్యానించారు. డ్రాగన్ దేశం ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడినా గతంలో మాదిరిగా బుద్ధి చెప్పడానికి మన సైన్యం సన్నద్ధంగా ఉందన్నారు. గురువారం పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ వార్షిక సదస్సులో పాల్గొన్న నరవణె మాట్లాడారు. అఫ్గానిస్తాన్‌లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలతో ఏర్పడే ముప్పుపై దృష్టి సారించామని చెప్పారు. దానికనుగుణంగా వ్యూహాలను రచిస్తున్నట్టుగా తెలిపారు. -
చర్చలు.. చర్యలు!
న్యూఢిల్లీ: ఒకవైపు చర్చల ప్రక్రియ కొనసాగిస్తూనే.. మరోవైపు వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ)కి ఇరువైపులా బలగాలు, ఇతర సైనిక సంపత్తి మోహరింపును భారత్, చైనాలు పెద్ద ఎత్తున చేపడుతున్నాయి. భారత సైన్యంతో పాటు ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ) కూడా సరిహద్దు కేంద్రాలకు సుశిక్షితులైన అధికారులు, ఇతర సిబ్బందిని తరలిస్తోంది. ఆర్మీకి మద్దతుగా మరిన్ని ఐటీబీపీ బలగాలను సరిహద్దులకు తరలించాలని శనివారం లెఫ్ట్‌నెంట్ జనరల్ పరంజిత్ సింగ్, ఐటీబీపీ చీఫ్, మిలటరీ ఆపరేషన్ డైరెక్టర్ జనరల్ ఎస్ఎస్ దేశ్వాల్ లేహ్‌ను సందర్శించిన అనంతరం నిర్ణయించారు. ‘జూన్ 15 ఘటనకు ముందే కొన్ని కంపెనీల బలగాలను లద్దాఖ్‌కు పంపించాం. ఇప్పుడు మరిన్ని బలగాలను తరలించాలని నిర్ణయించాం’ అని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. సైనిక కేంద్రాల్లో ఆర్మీకి సహకారంగా ఐటీబీపీ నుంచి ప్లటూన్ల స్థానంలో కంపెనీలను మోహరించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఘర్షణాత్మక గల్వాన్ లోయ, హాట్ స్ప్రింగ్స్, ప్యాంగ్యాంగ్ సరస్సు ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పరిస్థితి నేటికి కూడా ఉద్రిక్తంగానే ఉంది. రెండు దేశాల మిలటరీ అధికారుల మధ్య జరుగుతున్న చర్చల్లో.. ఏప్రిల్ 30, 2020 నాటికి ఉన్న యథాతథ స్థితి నెలకొనాలని భారత్ డిమాండ్ చేస్తోంది. గల్వాన్, గోగ్రా, హాట్ స్ప్రింగ్స్‌లోని 14, 15, 17 పెట్రోలింగ్ పాయింట్స్(పీపీ)లో బలగాల సంఖ్యను గణనీయంగా తగ్గించాలని రెండు దేశాలు అంగీకారానికి వచ్చినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. అయితే, పీపీ 14, పీపీ 15 దగ్గరలో చైనా పలు తాత్కాలిక నిర్మాణాలు చేపట్టినట్లు ఉపగ్రహ చిత్రాల్లో కనిపిస్తోంది. అలాగే, పీపీ 17 వద్దకు పెద్ద ఎత్తున సైనికులను తరలించింది. దాంతో, పీపీ 17 వద్ద భారత్ కూడా సైనికుల సంఖ్యను పెంచింది. ప్యాంగ్యాంగ్ సరస్సులోని ‘ఫింగర్ 4’ వరకు చైనా దళాలు చేరుకున్నాయి. అక్కడికి చైనా బోట్లు, ఇతర వాహనాలను కూడా తరలించింది. దాంతో భారత్ కూడా అక్కడ దళాలను మోహరించింది. చర్చలు జరపండి లండన్: భారత్, చైనాల మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతలపై బ్రిటన్ ఆందోళన వ్యక్తం చేసింది. ‘పరిస్థితి తీవ్రంగా, ఆందోళనకరంగా ఉంది’ అని ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ బుధవారం పార్లమెంట్లో వ్యాఖ్యానించారు. పరిస్థితిని బ్రిటన్ నిశితంగా గమనిస్తోందన్నారు. వివాద పరిష్కారానికి చర్చలు జరపాలని భారత్, చైనాలకు సూచించారు. -
నవశకం
-
‘చెన్నై కనెక్ట్’
సాక్షి ప్రతినిధి, చెన్నై/మామల్లపురం: విభేదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటూ సహకారంలో నూతన అధ్యాయం ప్రారంభించాలని భారత్, చైనాలు నిర్ణయించాయి. భారత్, చైనా సంబంధాల్లో ‘చెన్నై కనెక్ట్’ కొత్త ఊపునిస్తుందని ప్రధాని మోదీ అభివర్ణించారు. మామల్లపురంలో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ల మధ్య ముఖాముఖి రెండోరోజు కొనసాగింది. ద్వైపాక్షిక చర్చలకు వేదికైన మహాబలిపురం సమీపంలోని కోవలం బీచ్ తాజ్ ఫిషర్మన్ కోవ్ రిసార్టుకు ఉదయం 9.30 గంటలకు చేరుకున్న జిన్‌పింగ్‌కు మోదీ స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరు నేతలూ గోల్ఫకార్ట్లో తిరిగారు. బీచ్‌లో నడిచారు. అక్కడి ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అద్దాల గదిలో ఇద్దరు నేతలు ఏకాంతంగా 90 నిమిషాలసేపు చర్చలు జరిపారు. అనువాదకులు ఆ సమయంలో వారితో ఉన్నారు. తర్వాత భారత విదేశాంగ మంత్రి జైశంకర్, చైనా విదేశాంగ కార్యదర్శి వాంగ్యూ సహా ఇరుదేశాలకు చెందిన 8 మంది అధికారులతో కలిసి మోదీ, జిన్‌పింగ్ సమావేశమయ్యారు. రెండు రోజుల్లోనూ సుమారు 7 గంటలపాటు జరిపిన ముఖాముఖిలో రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడుల పెంపునకు ఉన్నతస్థాయి యంత్రాంగం ఏర్పాటు వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీంతోపాటు ప్రతిపాదిత ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం (ఆర్సీఈపీ)పై జరుగుతున్న చర్చల్లో భారత్ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకునేందుకు, భద్రతలో సహకారం, సరిహద్దుల్లో శాంతికి మరిన్ని చర్యలు తీసుకునేందుకు చైనా హామీ ఇచ్చింది. మూడో భేటీకి చైనా రావాలన్న జిన్‌పింగ్ ఆహ్వానాన్ని ఈ సందర్భంగా మోదీ అంగీకరించారు. ఇద్దరు నేతలు ఏమన్నారంటే.. ‘వూహాన్ సమ్మేళనంతో ప్రారంభమైన రెండు దేశాల మధ్య సంబంధాల్లో ‘చెన్నై కనెక్ట్’తో కొత్త ఊపు వచ్చింది. చైనా అధ్యక్షుని రాకతో మహాబలిపురం గ్రేట్ వే ఆఫ్ ఫ్రెండ్షిప్గా చరిత్రపుటల్లో నిలిచిపోయింది’ అని మోదీ అన్నారు. ప్రధాని మోదీ, నేను మంచి స్నేహితులం. ఈ రెండు రోజుల్లో ఇద్దరం మనసువిప్పి మాట్లాడుకున్నాం’ అని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అన్నారు. తమిళనాడులో తాను పొందిన ఆతిథ్యాన్ని ఎన్నటికీ మరువజాలనని జిన్‌పింగ్ అన్నారు. డ్రాగన్, ఏనుగు నాట్యం కేవలం చైనా, భారత్‌ల విషయంలోనే సాధ్యమని జిన్‌పింగ్ పేర్కొన్నారు. ‘రెండుదేశాల మధ్య విభేదాలు దైపాక్షిక సహకారంపై ప్రభావం చూపజాలవు. ఏనుగు, డ్రాగన్ నాట్యం చేయడం భారత్, చైనాల విషయంలో మాత్రమే నప్పుతాయి. రెండు దేశాల కీలక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, ఏళ్లుగా నానుతున్న సమస్యలను విభేదాలను జాగ్రత్తగా పరిష్కరించుకోవాలి’ అని అన్నారు. ప్రస్తావనకు రాని కశ్మీర్ భేటీ అనంతరం విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే మీడియాతో మాట్లాడారు. ‘సరిహద్దుల్లో తరచూ తలెత్తే వివాదాలను పరిష్కరించుకునేందుకు, శాంతిని నెలకొల్పేందుకు పరస్పరం విశ్వాసం పాదుకొల్పే మరిన్ని చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. వాణిజ్యంలో సమతూకం సాధించేందుకు, వాణిజ్య, వ్యాపార సంబంధాలను విస్తృతం చేసుకునేందుకు ప్రత్యేకంగా ఉన్నత స్థాయి యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని, తయారీ రంగం భాగస్వామ్యం, పెట్టుబడుల పెంపుపై ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ చర్చలకు చైనా ఉప ప్రధాని హు చిన్హువా, భారత్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వం వహిస్తారని తెలిపారు’ అని ఆయన తెలిపారు. ఇద్దరు నేతల మధ్య కశ్మీర్ అంశం చర్చకు రాలేదని, ఆ ప్రస్తావనే లేదని తెలిపారు. భారత్, చైనా దౌత్య సంబంధాలకు వచ్చే ఏడాది 70 ఏళ్లు నిండుతున్న సందర్భంగా రెండు దేశాల మధ్య సాంస్కృతిక, ప్రజా సంబంధాలను మరింత విస్తృతం చేసుకునేందుకు జిన్‌పింగ్ అంగీకరించారని చైనా అధికార వార్తా సంస్థ జిన్హువా తెలిపింది. ఇలా ఉండగా, జిన్‌పింగ్ పర్యటనను పురస్కరించుకుని చైనా పర్యాటకుల కోసం ప్రత్యేకంగా ఐదేళ్ల ఈ వీసా సౌకర్యం కల్పిస్తున్నట్లు బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. మధ్యాహ్నం 12.55 గంటలకు జిన్‌పింగ్ కోవలం బీచ్ హోటల్ నుంచి చెన్నై విమానాశ్రయానికి చేరుకుని ప్రత్యేక విమానంలో నేపాల్ వెళ్లిపోయారు. బీచ్‌లో మోదీ ప్లాగింగ్ చెత్తా చెదారాన్ని ఎత్తివేసి ప్రజల్లో స్ఫూర్తిని నింపిన ప్రధాని మహాబలిపురం సముద్ర తీరంలో మోదీ అరగంట సేపు స్వచ్ఛభారత్ నిర్వహించారు. అక్కడ పరిసరాలు చెత్తా చెదారంతో నిండిపోవడంతో ఆయన వాటన్నింటిని ఎత్తేశారు. స్వచ్ఛభారత్ అభియాన్, ఫిట్ ఇండియా ఉద్యమం స్ఫూర్తిని ఏకకాలంలో ప్రజల్లో రగిల్చేలా చేశారు. నల్లని రంగు కుర్తా, పైజామా ధరించిన ప్రధాని మోదీ ఒక పెద్ద ప్లాస్టిక్ బ్యాగ్‌ని పట్టుకొని ఇసుక తిన్నెల్లో నడుస్తూ తాగి పారేసిన ప్లాస్టిక్ బాటిల్స్, క్యారీ బ్యాగ్స్ , స్ట్రాలు ఇతర చెత్తలన్నీ ఏరారు. బీచ్‌లో చెత్తను తీసి బ్యాగ్‌లో వేస్తూ.. ఇలా చేయడం వల్ల వంటికి వ్యాయామానికి వ్యాయామం జరుగుతుంది. పరిసరాలు శుభ్రానికి శుభ్రం అవుతాయి. దీనికి సంబంధించిన మూడు నిమిషాల వీడియోను ప్రధాని తన ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేశారు. ‘‘మహాబలిపురం తీరంలో ప్లాగింగ్ చేశాను. దాదాపుగా 30 నిమిషాల సేపు చెత్తలన్నీ ఏరి దానిని హోటల్ యజమాని జయరాజ్‌కు అందజేశాను. ప్రజలందరూ బహిరంగ ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అదే సమయంలో ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండాలి’’అని ప్రధాని ట్వీట్ చేశారు. అంతకు ముందు సముద్రం నీళ్లలో తడుస్తూ, అక్కడి సూర్యోదయం అందాలను వీక్షిస్తూ ప్రధాని చాలా సేపు బీచ్‌లో గడిపి సేద తీరారు. రోడ్లపై జాగింగ్ చేస్తూ చెత్తా చెదారాన్ని ఎత్తేపారేసే ప్రక్రియని ప్లాగింగ్ అని పిలుస్తారు. జిన్‌పింగ్ ముఖచిత్రంతో చేనేత పట్టు శాలువా చైనా అధినేతకు మోదీ అపూర్వ కానుక భారత్‌కు రెండు రోజుల పర్యటన కోసం వచ్చిన చైనా అ«ధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అపురూపమైన కానుకని బహూకరించారు. చేతితో తయారు చేసిన ఎర్ర రంగులో ఉన్న ఈ శాలువాపై జిన్‌పింగ్ ముఖ చిత్రాన్ని డిజైన్‌గా వేయించారు. బంగారు రంగు అంచుల జరీతో మెరిసిపోతున్న ఈ శాలువా ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉంది. తమిళనాడులో కోయంబత్తూరు జిల్లాలోని సిరుముగైపుడూర్కి చెందిన శ్రీ రామలింగ సౌదాంబిగై చేనేత సహకార సంఘం మల్బరీ పట్టుతో ఎర్ర శాలువాని తయారు చేసింది. ఎరుపు రంగు ఎంచుకోవడానికి ఓ కారణం ఉంది. తన ఫొటో ఉన్న జ్ఞాపికను జిన్‌పింగ్ నుంచి స్వీకరిస్తున్న మోదీ చైనా జాతీయ జెండా రంగు, అధికార పార్టీ జెండా రంగు ఎరుపే. అంతేకాదు చైనా సంస్కృతిలో ఎరుపు రంగుని శుభసూచికంగా పరిగణిస్తారు. ఈ రంగుతో అదృష్టం కలిసివస్తుందని, జీవితం ఆనందోత్సాహాల్లో నిండిపోతుందని వారి నమ్మకం. ఈ శాలువాపై జిన్‌పింగ్ ముఖ చిత్రాన్ని డిజైన్‌గా వేయడానికి ఎలక్ట్రానిక్ ఫ్యాబ్రిక్‌ని వినియోగించారు. ఆ తర్వాత దానిపై బంగారు రంగు దారాలతో అల్లారు. చేతి వృత్తుల పరిశ్రమ, చేనేత కళలకు తమిళనాడు పెట్టింది పేరు. దశాబ్దాలుగా ఎందరో చేనేత కార్మికులు చేతితో తయారు చేసే వస్త్రాలతో అద్భుతాలు సృష్టించారు. కంచి, ఆరణి, మదురై, కోయంబత్తూరు వంటివి పట్టు వస్త్రాల ప్రపంచంలో తమకంటూ ఒక గుర్తింపుని సాధించాయి. మామల్లపురం బీచ్‌లో సేదతీరుతున్న మోదీ -
భిన్నాభిప్రాయాలు ఘర్షణగా మారొద్దు
బీజింగ్/ఇస్లామాబాద్: భారత్, చైనా మధ్య ఉండే భిన్నాభిప్రాయాలు ఘర్షణగా మారకూడదని భారత విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ తెలిపారు. ఓ దేశపు సమస్యలపై మరో దేశం ఎలా స్పందిస్తుందన్న విషయంపైనే భవిష్యత్తులో ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు ఆధారపడి ఉంటాయని స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370ని భారత్ ఏకపక్షంగా రద్దుచేయడాన్ని ఖండిస్తున్నామని చైనా ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో జై శంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. వుహాన్ సదస్సులో ఏర్పడిన సానుకూల పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ భారత్–చైనాల సంబంధాలను సరికొత్త ఎత్తుకు తీసుకెళ్లాలని ఆయన ఆకాంక్షించారు. మూడు రోజుల చైనా పర్యటనలో భాగంగా బీజింగ్ చేరుకున్న జై శంకర్, చైనా ఉపాధ్యక్షుడు వాంగ్ క్విషన్, విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ప్రత్యేకంగా సమావేశమై చర్చలు జరిపారు. పాక్ విదేశాంగ మంత్రి ఖురేషీ చైనా పర్యటన ముగిసిన వెంటనే జై శంకర్ చైనాను సందర్శించడం గమనార్హం. వారు వాస్తవాన్ని గుర్తించారు: బీజింగ్‌లో సోమవారం జరిగిన భారత్–చైనా అత్యున్నత కమిటీ(సాంస్కృతిక, ప్రజా సంబంధాలు) సమావేశంలో జై శంకర్ మాట్లాడుతూ..‘అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్–చైనాల ద్వైపాక్షిక సంబంధాలు చాలా విశిష్టమైనవి. ఇండియా–చైనా రెండూ అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద ఆర్థికవ్యవస్థలు. రెండేళ్ల క్రితం భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఈ వాస్తవాన్ని గ్రహించారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో భారత్–చైనా ద్వైపాక్షిక సంబంధాలు పటిష్టం కావాల్సిన అవసరముందని అస్తానా(కజకిస్తాన్)లో జరిగిన భేటీలో చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. ఇరుదేశాల మధ్య సత్సంబం ధాలకు ప్రజామద్దతును పొందాల్సిన అవసరం కూడా ఉంది. అయితే ఇది సాధ్యం కావాలంటే ఇండియా–చైనాల మధ్య ఉన్న అభిప్రాయభేదాలు ఘర్షణలుగా మారకూడదు’ అని తెలిపారు. ఈ భేటీ వల్ల ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు మరింత పటిష్టమవుతాయి వాంగ్ చెప్పారు. -
భారత్‌పై చైనా నోట మళ్లీ అదే మాట!
-
భారత్‌పై చైనా నోట మళ్లీ అదే మాట!
బౌద్ధుల మతనాయకుడు దలైలామాను ఉపయోగించుకొని చైనా ప్రయోజనాలను దెబ్బతీసేందుకు భారత్ ప్రయత్నించకూడదని ఆ దేశం పేర్కొంది. దలైలామా ఇటీవల చేపట్టిన అరుణాచల్ ప్రదేశ్ పర్యటన వల్ల ఇరుదేశాల సంబంధాలకు నష్టం కలిగించిందని మరోసారి వ్యాఖ్యానించింది. ‘దలైలామా అరుణాచల్ ప్రదేశ్ పర్యటన భారత్-చైనా సంబంధాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. టిబేట్‌పై తీసుకున్న కట్టుబాటును భారత్ పాటించాల్సిన అవసరముంది. చైనా ప్రయోజనాలకు తక్కువ చేసేందుకు దలైలామాను ఆ దేశం వాడుకోకూడదు’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లు కాంగ్ అన్నారు. అరుణాచల్ ప్రదేశ్ తమ దేశంలోని దక్షిణ టిబేట్లో భాగమని చైనా మొండిగా వాదిస్తున్న సంగతి తెలిసిందే. ధర్మశాల కేంద్రంగా బౌద్ధుల మతనాయకుడిగా, టిబేట్ ఆధ్యాత్మిక గురువుగా ఉన్న దలైలామా ప్రత్యేక దేశంగా టిబేట్ ఏర్పాటుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపిస్తున్నది.