
శశీంద్ర.. హఠాత్తుగా వార్తల్లోకి వచ్చారు. ఆమె కేరళ నివాసి. ఈ జూలై 31న ఓ అరుదైన చరిత్రను సృష్టించారు. ఈ చరిత్రకు వేదిక త్రిస్సూర్. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పోలీసు వందనాన్ని స్వీకరించేందుకు కేటాయించిన ఓపెన్‌టాప్ జీప్‌ను నడిపింది శశీంద్రనే. అలా ముఖ్యమంత్రికి జీప్‌ను నడిపిన మొదటి కేరళ మహిళగా క్రెడిట్ సొంతం చేసుకున్నారు శశీంద్ర. పోలీస్ అకాడమీలో డ్రైవింగ్ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేస్తున్నారు ఆమె. అకాడమీలో ఉన్న పద్నాలుగు మంది డ్రైవింగ్ ఇన్‌స్ట్రక్టర్‌లలో శశీంద్ర ఒక్కరే మహిళ. అంతేకాదు ఆ రోజు ఇంకో ఘనతా చోటు చేసుకుంది. నిషాంతిని అనే మహిళా కమాండెంట్ ఆధ్వర్యంలోని 578 మంది ఆల్ విమెన్ బెటాలియన్ కూడా వందన సమర్పణ చేసింది. వీరిలో 44 మంది మహిళా పోలీసులు కమాండోస్‌గా శిక్షణ పొందారు.
ఈ విషయాన్ని పక్కన పెడితే.. కేరళ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (కేటీడీసీ) ఇంకో మార్పునకు పునాది వేసింది. ‘హోస్టెస్’ పేరుతో మహిళల కోసం మహిళలు నడిపే హోటల్ నిర్మాణాన్ని చేపట్టింది. దేశంలోనే మొదటి పబ్లిక్ సెక్టార్ హోటల్ ఇది. తిరువనంతపురంలోని కేరళ ట్రాన్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కాంప్లెక్స్‌లో కట్టనున్నారు. ఆర్నెల్లలో ఇది పూర్తి అవుతుందని అంచనా. అక్షరాస్యత, స్త్రీ, పురుష లింగనిష్పత్తి, ఉపాధి.. వంటి చాలా విషయాల్లో కేరళ ముందున్నట్టే ఈ విషయాల్లోనూ ఆ ఆనవాయితీని నిలుపుకుంటోందన్నమాట. ఫస్టే కాదు బెస్ట్ అనే కితాబూ అందుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment