సాక్షి, చెన్నై: కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ పట్ల కేరళ పోలీసులు వ్యవహరించిన తీరును ఖండిస్తూ బీజేపీ నేతలు చేపట్టిన కన్యాకుమారి జిల్లా బంద్ కొనసాగుతుంది. బంద్‌లో భాగంగా బీజేపీ నేతలు జిల్లావ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. పలుచోట్లు ఆందోళనకారులు కేరళ రవాణా సంస్థకు చెందిన బస్సులపై దాడి చేశారు. దీంతో కేరళ, తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణం నెలకొంది. సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొనడంతో అధికారులు ఇరు రాష్ట్రాల మధ్య వాహన రాకపోకలను నిలిపివేశారు. భారీగా మోహరించిన పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
కాగా, రాధాకృష్ణన్ ఇరుముడితో అయ్యప్ప దర్శనార్థం బుధవారం శబరిమలైకి వెళ్లారు. ప్రైవేటు వాహనంలో రాధకృష్ణన్ పంబన్‌కు వెళ్లడంతో ఆయన్ను అడ్డుకున్నారు. అక్కడ పోలీసులు ఆయనతో వ్యవహరించిన తీరు వివాదస్పదంగా మారింది. దీంతో రాధాకృష్ణన్‌కు జరిగిన అవమానానికి నిరసనగా ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న కన్యాకుమారిలో బీజేపీ నేడు బంద్ చేపట్టింది.
Comments
Please login to add a commentAdd a comment