Pon Radhakrishnan
-
కన్యాకుమారి.. వరించేదెవరిని!
బీజేపీ తమిళనాడులో 2014 లోక్‌సభ ఎన్నికల్లో గెలుచుకున్న ఏకైక నియోజకవర్గం కన్యాకుమారి. ఇక్కడ నుంచి ఎన్నికైన కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్.. కాంగ్రెస్ ప్రత్యర్థి హెచ్.వసంతకుమార్‌ను 1.28 లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో ఓడించారు. వీరిద్దరే మళ్లీ తలపుడుతున్నారు. కిందటి లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే, డీఎంకే వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. ఈ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే కూటమిలో బీజేపీ, డీఎంకే కూటమిలో కాంగ్రెస్ చేరడంతో ఈ రెండు ప్రధాన ప్రాంతీయ పక్షాలు పోటీలో లేవు. నియోజకవర్గం ఏర్పడ్డాక జరిగిన 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసిన డీఎంకే అభ్యర్థి జే హెలెన్ డేవిడ్సన్.. బీజేపీ అభ్యర్థి పొన్ రాధాకృష్ణన్‌ను 65 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఓడించారు. చాలా ఏళ్లుగా ఈ ప్రాంతంలో బీజేపీ బలపడుతోంది. ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లున్న కన్యాకుమారి స్థానంలో 15 లక్షల మందికి పైగా ఓటర్లున్నారు. పోలింగ్ గురువారం జరగనుంది. నియోజకవర్గాల పునర్విభజనలో నాగర్‌కోయిల్ స్థానం రద్దయి 2009లో కన్యాకుమారి ఏర్పాటైంది. ప్రస్తుతం ఇక్కడ రెండు జాతీయ పక్షాల అభ్యర్థుల మధ్య గట్టి పోటీ ఉందనీ, గెలుపుపై జోస్యం చెప్పడం కష్టమని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. 1999లో నాగర్‌కోయిల్ నుంచి రాధాకృష్ణన్.. 1999 లోక్‌సభ మధ్యంతర ఎన్నికల్లో డీఎంకే కూటమిలో ఉన్న బీజేపీ మంచి ఫలితాలు సాధించింది. ఈ ఎన్నికల్లో పొన్ రాధాకృష్ణన్ నాగర్‌కోయిల్ స్థానం నుంచి బీజేపీ టికెట్‌పై పోటీ చేసి గెలుపొందారు. 2004 పార్లమెంటు ఎన్నికల్లో ఆయన సీపీఎం అభ్యర్థి ఏవీ బెలార్మిన్ చేతిలో ఓడిపోయారు. కన్యాకుమారి నియోజకవర్గంలో గణనీయ సంఖ్యలో ఉన్న బీసీ వర్గం నాడార్ కులానికి చెందిన రాధాకృష్ణన్ జనాదరణ కలిగిన నాయకుడు. నియోజకవర్గంలోని 19 లక్షల జనాభాలో సగం మంది హిందువులు. క్రైస్తవులు 40–45 శాతం వరకు ఉన్నారు. ఎన్నికల్లో మతపరమైన విభజన బీజేపీకి అనుకూలాంశం. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్న రాధాకృష్ణన్ 2013లో ఈ ప్రాంతంలోని పేద హిందువులందరికీ స్కాలర్షిప్లు ఇవ్వాలంటూ సాగిన ఉద్యమానికి నాయకత్వం వహించారు. ధనికులైన మైనారిటీలకు స్కాలర్షిప్లు ఇస్తున్నారనీ, హిందువులను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఈ ఆందోళన ఉధృతంగా సాగింది. మంత్రి అయ్యాక రాధాకృష్ణన్ ఈ విషయంలో చేసిందేమీ లేదనే అసంతృప్తి స్థానికుల్లో ఉంది. మత్స్యకారులు తమ ఉత్పత్తులను కొచ్చి, తూత్తుకుడి వంటి దూర ప్రాంతాలకు పంపే అవసరం లేకుండా వారి కోసం కోల్డ్ స్టోరేజీ సౌకర్యం కల్పిస్తానని బీజేపీ అభ్యర్థి హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే–కాంగ్రెస్ హవా 2016 అసెంబ్లీ ఎన్నికల్లో కన్యాకుమారి పరిధిలోని ఆరు అసెంబ్లీ సీట్లను డీఎంకే, కాంగ్రెస్ కూటమి కైవసం చేసుకుంది. రెండు పార్టీలూ మూడేసి స్థానాలు గెలుచుకున్నాయి. పేదలకు నెలకు రూ.6 వేల సహాయ పథకంతోపాటు తనను గెలిపిస్తే వ్యవసాయ, విద్యా రుణాలు మాఫీ చేయిస్తానని కాంగ్రెస్ అభ్యర్థి వసంత కుమార్ ప్రస్తుత ఎన్నికల్లో హామీ ఇస్తున్నారు. వసంతకుమార్ కూడా నాడార్ వర్గానికి చెందిన నాయకుడే. నియోజకవర్గంలో టెక్నోపార్క్ ఏర్పాటు చేయిస్తానని ఆయన వాగ్దానం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బ్రాంచీలున్న రిటైల్ సంస్థ వసంత్ అండ్ కంపెనీ స్థాపకుడైన వసంత్‌కుమార్ ఈసారి గెలుపునకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల్లో ప్రభావం చూపే అంశాలు ► సగం జనాభా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నా గ్రామీణ ప్రాంతాలను వ్యవసాయ సంక్షోభం కుంగదీస్తోంది. రైతులకు మేలు చేసే విధానాలు అమలు చేయకపోవడంతో గిట్టుబాటు ధరలు లేక వారు అల్లాడుతున్నారు. జీడిపప్పు దిగుమతి నిబంధనలు సడలించడంతో ఈ రంగంలోని ఫ్యాక్టరీ కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. ► రహదారుల విస్తరణతో వ్యవసాయ భూముల విస్తీర్ణం తగ్గిపోతోంది. జలవనరులు కుంచించుకుపోతున్నాయి. ఇవన్నీ ఎన్నికల్లో చర్చకు వస్తున్నాయి. ► ఎన్డీఏ సాగరమాల ప్రాజెక్టులో భాగంగా కోలాచల్లో ఏర్పాటు చేస్తామన్న కంటెయినర్ టెర్మినల్ ప్రాజెక్టును అధికారంలోకి వచ్చాక సమీపంలోని ఇనాయంకు తరలించారు. తమ జీవనోపాధికి ఈ ప్రాజెక్టు నష్టదాయకమంటూ స్థానిక మత్స్యకారులు ఆందోళన చేశారు. చివరికి ఈ ప్రాజెక్టును కోవలంలో ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. కాని, కోలాచల్, ఇనాయం, తెంగైపట్టినం వంటి తీర ప్రాంతాల్లోని క్రైస్తవులైన లక్ష మందికి పైగా మత్స్యకారులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ► రాధాకృష్ణన్‌కు కన్యాకుమారి, నాగర్‌కోయిల్‌లో చెప్పుకోదగ్గ బలం ఉంది. తీర ప్రాంతాల్లో బీజేపీ మద్దతుదారుల సంఖ్య తక్కువ. తన గెలుపు తీర ప్రాంత ప్రజల తీర్పుపై ఆధారపడి ఉండటంతో ఈ ప్రాంత ప్రజల సమస్యలు ఈసారి తప్పక పరిష్కరిస్తానని బీజేపీ అభ్యర్థి హామీ చేస్తున్నారు. -
కేరళ, తమిళనాడు సరిహద్దుల్లో ఉద్రిక్తత
సాక్షి, చెన్నై: కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ పట్ల కేరళ పోలీసులు వ్యవహరించిన తీరును ఖండిస్తూ బీజేపీ నేతలు చేపట్టిన కన్యాకుమారి జిల్లా బంద్ కొనసాగుతుంది. బంద్‌లో భాగంగా బీజేపీ నేతలు జిల్లావ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. పలుచోట్లు ఆందోళనకారులు కేరళ రవాణా సంస్థకు చెందిన బస్సులపై దాడి చేశారు. దీంతో కేరళ, తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణం నెలకొంది. సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొనడంతో అధికారులు ఇరు రాష్ట్రాల మధ్య వాహన రాకపోకలను నిలిపివేశారు. భారీగా మోహరించిన పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కాగా, రాధాకృష్ణన్ ఇరుముడితో అయ్యప్ప దర్శనార్థం బుధవారం శబరిమలైకి వెళ్లారు. ప్రైవేటు వాహనంలో రాధకృష్ణన్ పంబన్‌కు వెళ్లడంతో ఆయన్ను అడ్డుకున్నారు. అక్కడ పోలీసులు ఆయనతో వ్యవహరించిన తీరు వివాదస్పదంగా మారింది. దీంతో రాధాకృష్ణన్‌కు జరిగిన అవమానానికి నిరసనగా ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న కన్యాకుమారిలో బీజేపీ నేడు బంద్ చేపట్టింది. -
రజనీకే ఆదరణ.. లంచగొండులను పట్టిస్తే ఆయనకు పూలమాల!
సాక్షి, పెరంబూరు : సూపర్‌స్టార్ రజనీకాంత్‌కే ప్రస్తుతం ప్రజల్లో అధిక ఆదరణ ఉందని కేంద్రమంత్రి, బీజేపీ నేత పొన్ రాధాకృష్టన్ అభిప్రాయపడ్డారు. లంచగొండులను పట్టిస్తే హీరో విజయ్‌కు పూలమాల వేసి స్వాగతిస్తాననీ చెప్పారు. విజయ్ తాజా చిత్రం ‘సర్కార్’ ఆడియో ఆవిష్కరణ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. రాష్ట్రంలో అవినీతి, లంచగొండితనం రాజ్యమేలుతున్నాయని ఆయన పేర్కొనడం అన్నాడీఎంకే వర్గాల్లో ప్రకంపనలు రేపుతోంది. మరోవైపు బీజేపీ నేతలు సైతం విజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి పొన్ రాధాకృష్ణన్ గురువారం ఉదయం తిరుచ్చి విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా విలేకరుల ప్రశ్నలకు ఆయన ఈ విధంగా బదులిచ్చారు. ప్ర: హైడ్రో కార్బన్ పథకానికి వ్యతిరేకంగా డీఎంకే పోరాటం చేయడంపై మీ స్పందన? జ: అది పనికిమాలిన పని.. డీఎంకే, కాంగ్రెస్ పార్టీలకు హైడ్రో కార్బన్ పథకం గురించి మాట్లాడే అర్హత లేదు, ప్ర: బీజేపీకి వ్యతిరేకంగా రెండో స్వాతంత్య్ర పోరాటం చేస్తామంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యల గురించి? జ: వారికి స్వాతంత్య్రం రాదు, ఎప్పుడూ ఊహల్లోనే పోరాటం చేస్తారు. ప్ర: నటుడు విజయ్ తాజాగా తాను సీఎంనైతే నిజాయితీగా ఉంటా. నటించనని అనడం గురించి మీ కామెంట్? జ: అందరూ ఎంజీఆర్, జయలలితలా కాలేరు. ఇప్పుడు ప్రజల మధ్య ఆదరణ ఉన్న నటుడు రజనీకాంత్ మాత్రమే. ప్ర: బీజేపీ రజనీకాంత్‌ను వెనుకేసుకురావడానికి కారణం? జ: ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చు. పలువురు నటులు, పత్రికల వాళ్లు వివిధ పార్టీలో కార్యకర్తలుగా ఉన్నారు. విజయ్ లంచం గురించి మాట్లాడుతున్నాడు. ఏదో ఆరోపణలు చేయాలని కాకుండా.. అలాంటి లండగొండులను పట్టిస్తే నేను ఆయన వద్దకు నేరుగా వెళ్లి పూలమాల వేసి స్వాగతిస్తాను. రజనీకాంత్‌కు మంచి మనిషి అని ప్రజల్లో పేరు ఉంది. ప్ర: రజనీకాంత్ బీజేపీకి మద్దతునిస్తారా? జ: రజనీకాంత్ ఇంకా పార్టీనే స్థాపించలేదు. ఐనా ఆయన బీజేపీకి మద్దతు తెలుపుతారా? లేదా అన్నది తెలియదు. ప్ర: లోక్‌సభ ఎన్నికలకు మరో 6 నెలల సమయం మాత్రమే ఉంది. మీ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? జ: గత ఎన్నికల కంటే కూడా అధిక స్థానాలను బీజేపీ గెలుచుకుంటుంది. బీజేపీ 350 స్థానాలను సొంతంగా.. కూటమితో కలిసి 400లకు పైగా స్థానాలను గెలుచుకుని మళ్లీ గద్దెనెక్కుతుంది. -
తమిళనాడులో ఉగ్రవాదులు: కేంద్రమంత్రి
నాగర్‌కోయిల్: తమిళనాడులో ఉగ్రవాదులు ఉన్నారని కేంద్ర నౌకాయాన సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ ఆరోపించారు. ఈ సంఘవిద్రోహ శక్తుల్ని ఏరివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సాయం చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలపై తీవ్రనిరసన తెలిపిన అన్నాడీఎంకే మంత్రులు, రాష్ట్రం సురక్షితంగా ఉందని స్పష్టం చేశారు. శుక్రవారం రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. ‘ఉగ్రమూకల చేతిలో తమిళనాడు నాశనమైపోవడాన్ని ఓ తమిళుడిగా తాను చూడలేను’ అని ఆయన పేర్కొన్నారు. -
కేంద్ర మంత్రిపై చెప్పు విసిరాడు
-
కేంద్ర మంత్రిపై చెప్పు విసిరాడు
సేలం: కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ కు సొంత రాష్ట్రంలో చేదు అనుభవం ఎదురైంది. తమిళనాడులోని సేలంలో జేఎన్ యూ దళిత పరిశోధక విద్యార్థి ముత్తుకృష్ణన్ అంత్యక్రియలకు హాజరైన ఆయనపై ఆంగతకుడొకరు చెప్పు విసిరాడు. అది ఆయనకు కొంతదూరంలో పడింది. జేఎన్‌యూలో సమానత్వానికి చోటులేదని పేర్కొంటూ ముత్తుకృష్ణన్ సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. కుల వివక్షకు మరో విద్యార్థి బలయ్యాడన్న ప్రచారంతో తమిళనాట ఆగ్రహ జ్వాలలు రేగాయి. కుల వివక్షతో ఓ ప్రొఫెసర్ పెడుతున్న వేధింపులు తట్టుకోలేకే ముత్తుకృష్ణన్ బలవన్మరణానికి పాల్పడ్డాడని తమిళ అభిమాన సంఘాలు, పార్టీలు ఆరోపించాయి. ముత్తుకృష్ణన్ మృతిపై న్యాయ విచారణ జరపాలని సేలంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. విద్యార్థి సంఘాలు చెన్నైలోని బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించాయి. -
తమిళ సీఎం ఎక్కువ కాలం కొనసాగరు!
చెన్నై: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ విధేయుడు, తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన కె.పళనిస్వామి ఎంతో కాలం పదవిలో కొనసాగరని కేంద్ర మంత్రి పోన్ రాధాక్రిష్ణన్ అన్నారు. సొంతింట్లో మన కుర్చీలో కూర్చోవడం.. అద్దె కుర్చీలో కూర్చోవడం రెండు ఒకటి కాదంటూ పళనిస్వామిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇంకా చెప్పాలంటే తమిళనాడు కొత్త సీఎం కె.పళనిస్వామి అద్దె కుర్చీ (వేరొకరి స్థానం)లో ఉన్నారని తాను భావిస్తున్నట్లు మంత్రి చెప్పారు. విశ్వాసపరీక్షలో పళనిస్వామి నెగ్గడంపై మంత్రి రాధాక్రిష్ణన్ స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. 'అసెంబ్లీలో విశ్వాసపరీక్ష జరిగిన తీరు నిజంగా సిగ్గుచేటు. ప్రతిపక్షాలు లేకుండానే స్పీకర్ ధన్ పాల్ బలపరీక్ష నిర్వహించడం దారుణం. ఈ ఘటనతో రాష్ట్రమంతా సిగ్గుతో తలదించుకోవాల్సి వచ్చింది. బలనిరూపణ సమయంలో ప్రతిపక్ష డీఎంకే నేతలపై దాడి విషయంపై ఎంక్వరీ కమిషన్ వేయాలని' ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ ఎంపీ ఎల్.గణేషన్ మాట్లాడుతూ.. పళనిస్వామి అంకెల్లో మాత్రమే మెజార్టీ నిరూపించుకున్నా.. నైతికంగా ఆయన ఓడిపోయారని చెప్పారు. అన్నాడీఎంకే నేతలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయడానికి అవకాశం లేకుండా పోయిందని అభిప్రాయపడ్డారు. -
తీరంలో 90శాతం ఆయిల్ తొలగింపు...!
-
తీరంలో 90శాతం ఆయిల్ తొలగింపు...!
చెన్నై: సముద్రతీరంలో గతవారం రోజులుగా పేరుకుపోయిన ముడిచమురు వ్యర్థాలలో 90శాతాన్ని తొలగించినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు 65 టన్నుల ముడిచమురు రొంపిని శుభ్రపరిచినట్టు వెల్లడించింది. త్వరలోనే తొలగింపు ప్రక్రియ పూర్తవుతుందని పేర్కొంది. చెన్నైకి సమీపంలోని సముద్ర తీరంలో సముద్రంలో భారీగా ముడిచమురు రొంపి పేరుకుపోవడంతో ఒక్కసారి పర్యావరణ ఆందోళన వ్యక్తమైన సంగతి తెలిసిందే. తొలిగించిన ముడిచమురు రొంపిని సురక్షితంగా తరలించేందుకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ జీవ ప్రతిక్రియాత్మక చర్యలు తీసుకుంటున్నది. కేంద్రమంత్రి పోన్ రాధాకృష్ణన్ శనివారం ఎన్నోర్ తీరప్రాంతాన్ని సందర్శించి.. చమురు రొంపి తొలగింపు పనులను పర్యవేక్షించారు. ప్రస్తుతం ఎన్నోర్ తీరప్రాంతంలోనే ముడిచమురు రొంపి పేరుకుపోయి ఉందని, దీనిని రానున్న రెండురోజుల్లో తొలగించేస్తారని తెలిపారు. మనుష్యులే తొలగింపు పనుల్లో పాల్గొనాల్సి వస్తుండటంతో ఈ పనుల్లో జాప్యం జరుగుతోందని ఆయన చెప్పారు. -
రాజీనామాకు సిద్ధం!
సాక్షి, చెన్నై: కులచల్ హార్బర్ ప్రాజెక్టు సాధన కోసం అవసరం అయితే, కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి పోరాటాలకు సిద్ధమని పొన్ రాధాకృష్ణన్ వ్యాఖ్యానించారు. డీఎంకే, అన్నాడీఎంకేలు ఐక్యతతో పనిచేసి, రాష్ట్ర ప్రగతి మీద దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. కన్యాకుమారి జిల్లా కులచల్లో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వర్తక రీత్యా హా ర్బర్ నిర్మాణానికి కసరత్తుల్లో నిమగ్నమైంది. ఇందుకు తగ్గ ప్రకటనను ఎన్నిక ల ప్రచార సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ చేశారు. అయితే, ఈ ప్రకటన తరువాయి, ప్రజల్లో ఆందోళన రేకెత్తించే రీతిలో సముద్ర తీరాల్లో ప్రచారం సాగుతున్నది. ప్రజల స్థలాల్ని బలవంతంగా లాక్కుంటారని, హార్బర్ పేరిట తీర వాసుల్ని బయటకు పంపించే అవకాశాలు ఉన్నాయని, గోడౌన్ల పేరిట వ్యవసాయ భూముల్ని లాక్కునే ప్రమాదం ఉందన్న ప్రచారం బయలు దేరింది. దీనిని పనిగట్టుకుని కొన్ని పార్టీలు చేస్తున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రచారాన్ని ఖండిస్తూ కేంద్ర సహాయ మంత్రి పొన్‌రాధాకృష్ణన్ గురువారం నాగుర్ కోయిల్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కొందరు ఆరోపణలు గుప్పిస్తూ , ప్రజల్ని రెచ్చగొట్టే యత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ ప్రాజెక్టు సాధన కోసం అవసరం అయితే, తన మంత్రి పదవికి రాజీనామా చేసి పోరుబాట సాగించేందుకు సైతం తాను సిద్ధం అని ప్రకటించారు. ఈ ప్రాజెక్టుతో కన్యాకుమారి, తిరునల్వేలి జిల్లాలు ఆర్థిక ప్రగతిని సాధిస్తాయని, అయితే, దీనిని అడ్డుకోవడం లక్ష్యంగా కుట్రలు సాగుతున్నామని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ విదేశాల్లో తిరుగుతూ, ఆయా దేశాలతో కుదుర్చుకునే ఒప్పందాల మేరకు కొత్త ప్రాజెక్టుల్ని దేశంలోకి తీసుకు వస్తున్నారని వివరించారు. డీఎంకే, అన్నాడీఎంకేలు సమిష్టిగా, ఐక్యతతో వ్యవహరించి కేంద్రం నుంచి పథకాలు, ప్రాజెక్టుల్ని రాష్ట్రంలోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర ప్రగతికి రెండు పార్టీలు కేంద్రంతో కలిసి ముందుకు సాగాలని పిలుపు నిచ్చారు. తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ బీజేపీ మీద నిందలు వేయడం మానుకుని, కాంగ్రెస్ బలోపేతం మీద దృష్టి పెట్టాలని హితవు పలికారు. ఇప్పటికే కాంగ్రెస్ చతికిలబడిందని, విస్మరిస్తే అథోగతి తప్పదని హెచ్చరించారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న పుణ్యమా డీఎంకే ఇబ్బందుల్లో పడాల్సి వ చ్చిందని వ్యాఖ్యానించారు. -
సీఎం అభ్యర్థిగా కెప్టెన్
►కమలం పెద్దల నిర్ణయం..? ► విజయకాంత్‌తో చర్చల జోరు ► ఎన్డీఏలోనే ఆయన : పొన్ రాధాకృష్ణన్ ► ప్రేమలతతో తమిళి సై భేటీ సాక్షి, చెన్నై : బీజేపీ సీఎం అభ్యర్థిగా డీఎండీకే అధినేత విజయకాంత్ పేరును ప్రకటించేందుకు ఆ పార్టీ ఢిల్లీ పెద్దలు సిద్ధం అవుతున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఇందుకు అద్దం పట్టే రీతిలో విజయకాంత్‌తో కమలనాథుల మంతనాలు జోరుగా సాగుతున్నాయి. ఇక, ఆయన ఎన్డీఏలోనే ఉన్నారని, ఉంటారంటూ కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏతో కలసి డీఎండీకే అధినేత విజయకాంత్ పయనించిన విషయం తెలిసిందే. తదుపరి పరిణామాలతో కమలనాథులతో అంటీఅంటనట్టు వ్యవహరించడం మొదలెట్టారు. ఎన్నికల సమయంలో తమకు ఇచ్చిన హామీలను బీజేపీ విస్మరించిందన్న ఆగ్రహాన్ని పలు మార్లు వ్యక్తం చేసి ఉన్నారు. తాను ఎన్డీఏలో లేదన్నట్టుగా వ్యాఖ్యలు కూడా చేశారు. దీంతో విజయకాంత్‌ను తమ వైపునకు తిప్పుకునేందుకు డీఎంకే రంగంలోకి దిగింది. డిప్యూటీ సీఎం పదవిని ఆయనకు కట్టబెట్టేందుకు తగ్గ మంతనాలు సాగినట్టు సమాచారం. అయితే, డీఎంకే, అన్నాడీఎంకేలకు తాను దూరం అని పదే పదే విజయకాంత్ వ్యాఖ్యలు చేయడం మొదలెట్టారు. దీంతో డీఎంకే ప్రయత్నాలు నీరుగారినట్టు అయ్యాయి. అలాగే, ఎండీఎంకే, వీసీకే, సీపీఎం, సీపీఐలతో కూడిన ప్రజా కూటమికి మద్దతుగా విజయకాంత్ వ్యాఖ్యలు అందుకోవడంతో ప్రాధాన్యం సంతరించుకున్నట్టైంది. ఆయన వస్తే, అందరితో చర్చించి సీఎం అభ్యర్థిగా ప్రకటించేందుకు సిద్ధం అని ఎండీఎంకే నేత వైగో ప్రకటించారు. దీంతో విజయకాంత్ అడుగులు ఆ వైపుగానే ఉంటాయన్న ప్రచారం బయలు దేరింది. ఈ సమయంలో వ్యూహాత్మకంగా అడుగులు వేయడానికి కమలనాథులు సిద్ధమైనట్టున్నారు. తమతో చేతులు కలిపిన పక్షంలో సీఎం అభ్యర్థిగా విజయకాంత్ పేరును తెర మీదకు తెస్తామో, తీసుకురామో అన్న బెంగ తో ఉన్న డీఎండీకే వర్గాల్లో నమ్మకాన్ని కల్గించే ప్రయత్నాలకు సిద్ధమయ్యారు. ఢిల్లీలో పార్టీ అధినేత అమిత్‌షాతో సాగిన భేటీలో విజయకాంత్ ప్రస్తావన వచ్చినట్టు సమాచారం. అలాగే, అన్నాడీఎంకేతో కలిసి నడవడం కన్నా, బీజేపీ, డీఎండీకే, ఇతర పార్టీలు కలిసి నడిస్తే లాభం ఉంటుంద న్న వాదనను కొందరు నేతలు అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. దీంతో విజయకాంత్ ఇతర కూటమిలోకి వెళ్లకుండా, ఆయన్ను బీజేపీ వైపే ఉండే విధంగా మంతనాలు సాగించాలని అమిత్ షా ఆదేశించినట్టు తెలిసింది. ఆయన్ను బీజేపీ కూటమి సీఎం అభ్యర్థిగా ప్రకటించేం దుకు తగ్గ ఏకాభిప్రాయాన్ని పార్టీలో తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తామన్న హామీని అమిత్ షా రాష్ట్ర పార్టీ నాయకులకు ఇచ్చినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. విజ యకాంత్ తమ చేతి నుంచి జారిపోకుండా జాగ్రత్తలకు సిద్ధమైన రాష్ట్ర నాయకులు మంతనాల జోరులో పడ్డట్టున్నారు. ఇందుకు అద్దం పట్టే రీతిలో శనివారం విజయకాంత్‌తో కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ , ఆయన సతీమణి ప్రేమలత విజయకాంత్‌తో బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ భేటీ కావడం గమనార్హం. ఈ భేటీలో విజయకాంత్ ప్రజా కూటమి వైపుగా అడుగులు వేయకుండా, ఆయన మనస్సు మార్చే ప్రయత్నం చేసినట్టుగా కమలాలయం వర్గాలు పేర్కొం టున్నాయి. సీఎం అభ్యర్థిత్వానికి విజయకాంత్ పేరును తప్పకుండా తమ అధిష్టానం ప్రతిపాదిస్తుందన్న నమ్మకాన్ని కల్గించే యత్నం చేసినట్టు సమాచారం. ఈ విషయంగా పొన్ రాధాకృష్ణన్‌ను కదిలించగా, ఆయన ఎన్డీఏ వెంటే అని సమాధానం ఇవ్వడం గమనార్హం. ఆయన తమతో కలిసి అడుగులు వేస్తారన్న నమ్మకం ఉందన్నారు. ఇక, తమిళి సై సౌందరరాజన్‌ను కదిలించగా, తాను ప్రేమలతతో భేటీ కావడం కొత్తేమి కాదన్నారు. తరచూ తాము కలవడం జరుగుతున్నదని, తాము మంచి మిత్రులం అన్నట్టుగా స్పందించడం బట్టి చూస్తే, విజయకాంత్ దారి ఏ వైపు ఉంటుందోనన్న ఎదురు చూపులు మిగిలిన పార్టీల్లో నెలకొంది. -
చిత్రహింసలు పెట్టారు
శ్రీలంక చెర నుంచి విముక్తి పొందిన రామేశ్వరం, పుదుకోట్టై, నాగపట్నం జాలర్లు స్వగ్రామాలకు చేరారు. శ్రీలంక సేనలు చిత్ర హింసలకు గురి చేశాయని జాలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ దృష్టికి తీసుకెళ్తానని కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ పేర్కొన్నారు. సాక్షి, చెన్నై:యూపీఏ అధికారంలో ఉన్న సమయంలో శ్రీలంక సేనలు సృష్టించిన వీరంగం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేంద్రంలో అధికారం మారడంతో తమ తలరాతలు మారతాయన్న ఆశతో ఉన్న జాలర్లకు చివరకు నిరాశేమిగిలింది. యూపీఏ హయూంలో ఉన్నప్పుడు కన్నా, తాజాగా బీజేపీ హయూంలో శ్రీలంక సేనలు మరింతగా రెచ్చిపోవడం రాష్ట్ర జాలర్ల భద్రతను ప్రశ్నార్థకం చేస్తోంది. కడలిలో తమకు భద్రత కరువవుతోందని జాలర్లు గగ్గోలు పెడుతున్నా, పాలకులు దృష్టి పెట్టడం లేదు. పట్టుకెళ్లిన వాళ్లను విడిపిస్తున్నారేగానీ, పడవ లను స్వాధీనం చేసుకోవడంలో, దాడులను అరికట్టడంలో విఫలమవుతున్నారు. ఇన్నాళ్లూ పట్టుకెళ్లిన వారిని సురక్షితంగా విడుదల చేస్తూ వచ్చిన శ్రీలంక సేనలు, ప్రస్తుతం వారి దేశ చెరలో ఉన్న వారిని చిత్ర హింసలకు గురి చేయడం చూస్తే పంథా మార్చినట్టు స్పష్టం అవుతోంది. దీన్ని బట్టి చూస్తే తమిళ జాలర్లకు ఇక భద్రత కరువైనట్టేనన్నది స్పష్టం కాక మానదు. విడుదల : జూలై నెలాఖరులో కడలిలో చేపల వేటకు వెళ్లిన తమిళ జాలర్లపై శ్రీలంక సేనలు ప్రతాపం చూపించారు. రామేశ్వరానికి చెందిన 20 మంది, కోట్టై పట్నం, జగదాపట్నంకు చెందిన 23 మంది, నంబుదాల్, అక్కరై పేట్టై పరిసరాలకు చెందిన మరో 51 మంది జాలర్లను పట్టుకెళ్లారు. 94 మంది జాలర్ల విడుదల కోసం ఓ వైపు రామేశ్వరం వేదికగా, మరో వైపు పుదుకోట్టై వేదికగా జాలర్ల సమ్మె సాగుతోంది. ఎట్టకేలకు భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ జాలర్ల విడుదలకు శ్రీలంక ప్రభుత్వం నిర్ణయించింది. అనురాధపురం చెరలో ఉన్న రామేశ్వరం జాలర్లను, యాల్పానం చెరలో ఉన్న జగదాపట్నం, కోట్టై పట్నం జాలర్లను, కొడియకరై చెరలో ఉన్న ఇతర జాలర్లను ఆయా ప్రాంత కోర్టుల్లో హాజరు పరిచారు. వీరందరినీ జట్లుజట్లుగా భారత దౌత్య అధికారులకు అప్పగించారు. శ్రీలంక చెర నుంచి విముక్తి పొందిన 94 మంది జాలర్లను భారత సరిహద్దుల్లో కోస్టు గార్డుకు అప్పగించారు. తమ బోట్లలో జాలర్లను భారత కోస్టుగార్డు కారైక్కాల్‌కు తరలించింది. అక్కడి నుంచి స్వస్థలాలకు శనివారం రాత్రిజాలర్లను పంపించారు. వీరంతా ఆదివారం ఉదయాన్నే వారి వారి స్వగ్రామాలకు చేరుకున్నారు. జాలర్లను రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి కేఏ జయపాల్, ఎంపీ, గోపాల్, నాగపట్నం జిల్లా కలెక్టర్ మునుస్వామి జాలర్లను పరామర్శించారు. చిత్రహింసలు పెట్టారు: స్వగ్రామాలకు చేరుకున్న జాలర్లకు ఆత్మీయులు, బంధువులు స్వాగతం పలికారు. అయితే 15 రోజులకు పైగా శ్రీలంక చెరలో అనుభవించిన కష్టాలను జాలర్లు తమ వారితో చెబుతూ కన్నీరుమున్నీరయ్యూరు. తమతో శ్రీలంక సేనలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని కన్నీటి పర్యంతమయ్యారు. కొందరు సిబ్బంది అవహేళన చేయడం, దురుసుగా మాట్లాడడం, చేయి చేసుకోవడం వంటి చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. నాగపట్నంకు చెందిన జాలర్లు, రాజేంద్రన్, అమల్, దురైలు పేర్కొంటూ, తమను, తమతో పాటుగా అనురాధపురం చెరలో ఉన్న జాలర్లను ఐస్గడ్డల మీద పడుకోబెట్టి నరకాన్ని చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. మరి కొందరిని నగ్నంగా ఐస్ గడ్డల మీద పడుకోబెట్టి, మళ్లీ..మళ్లీ తమ భూ భాగంలోకి వస్తారా? అని చిత్ర హింసలకు గురి చేశారని పేర్కొన్నారు. తాము భారత సరిహద్దుల్లో ఉంటే పట్టుకొచ్చారంటూ ప్రశ్నిస్తే, మరింతగా వేధించారని, భారత కోస్టు గార్డుకు అప్పగించిన తర్వాత వైద్య సేవలు, సరైన ఆహారం లభించిందని వివరించారు. జాలర్లపై దాడులు, చిత్ర హింసలతోపాటు సమ్మె ఉధృతం అవుతున్న విషయాన్ని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ దృష్టికి తీసుకెళ్లేందుకు రాష్ట్రానికి చెందిన కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ సిద్ధం అయ్యారు. ఆదివారం తిరువారూర్ జిల్లా మన్నార్ కుడిలో విలేకరులతో మాట్లాడిన ఆయన జాలర్లపై దాడులకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా కేంద్రం త్వరితగతిన చర్యలు తీసుకుంటుందన్నారు. జాలర్లకు భద్రత కల్పించడం, వారి జీవితాల్లో వెలుగు నింపే విధంగా సుష్మా స్వరాజ్ నిర్ణయం తీసుకుంటారన్నారు. ఢిల్లీకి వెళ్లగానే సుష్మా స్వరాజ్ దృష్టికి అన్ని విషయాలను తీసుకెళ్తానని, జాలర్లతో భేటీకి చర్యలు తీసుకుంటానన్నారు. -
కాంగ్రెస్‌తో పోల్చద్దు
సాక్షి, చెన్నై: కాంగ్రెస్ ప్రభుత్వంతో బీజేపీ ప్రభుత్వాన్ని పోల్చుకోవద్దంటూ శ్రీలంక ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ హెచ్చరించారు. ఆయన ఆదివారం కమలాలయ సందర్శనకు రావడంతో కార్యకర్తలు సందడి చేశారు. రాష్ట్రంలోని ఇతర పార్టీలకు భిన్నంగా బీజేపీ ఐదేళ్ల క్రితం ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పార్టీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు ఏడాదిలో ఓ రోజు పార్టీ కార్యాలయాన్ని సందర్శించే విధంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి వినూత్న స్పందన వస్తోంది. ప్రతి ఏటా జరిగే ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు తమ కుటుంబ సమేతంగా తరలి వస్తున్నారు. శనివా రం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఈ సందర్శన వేడుక కమలాలయంలో జరిగింది. అందరి కన్నా భిన్నంగా అక్క డ ఏర్పాట్లు చేశారు. పార్టీ మైకులు, స్పీక ర్లు, ప్రసంగాలకు చోటు ఇవ్వకుండా, టీ నగర్‌లోని పార్టీ కార్యాలయ పరిసరాల ను ఓ పెళ్లి వేడుకను తలపించే విధంగా తీర్చిదిద్దారు. తరలి వచ్చిన కార్యకర్తలను పార్టీ అధ్యక్షుడు, కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్, నాయకులు ఇలగణేషన్, తమిళి సై సౌందరరాజన్, వానతీ శ్రీనివాసన్, మోహన్ రాజులు, హెచ్ రాజా తదితరులు ప్రవేశ మార్గంలో స్వాగతం పలకడం విశేషం.విందులతో సందడి: పార్టీ కార్యాలయం లో విందులు, సంగీత విభావరిలతో కార్యకర్తలు, నాయకులు సందడి చేశా రు. దేశ భక్తి గీతాల సంగీత విభావరి, మోడీ వేషధారణలతో ప్రత్యేక ఆకర్షణ గా నిలిచాయి. అలాగే, గ్రామీణ సం స్కృతి ఉట్టి పడే రీతిలో దుకాణాలు సైతం ఏర్పాటు చేయడం విశేషం. 20 రకాల వంటకాలను కార్యకర్తలకు విందుగా అందజేశారు. రాత్రి పొద్దుపోయే వరకు కుటుంబంతో కలసి పార్టీ కార్యకర్తలు ఆనందాన్ని తమ నేతలతో పంచుకున్నారు. కొందరు నాయకులు, కార్యకర్తలు తమ సమస్యల్ని, తమ ప్రాంతాల్లోని సమస్యల్ని వినతి పత్రాల రూపంలో తెలియజేశారు. అండగా ఉంటాం: కార్యకర్తలతో మాట్లాడిన పొన్ రాధాకృష్ణన్ అందరికీ అం డగా ఉంటామని హామీ ఇచ్చారు. కేంద్రంలో ఇది వరకు కాంగ్రెస్ అసమర్థ ప్రభుత్వం అధికారంలో ఉన్నదని, ఆ ప్రభుత్వంతో బీజేపీని పోల్చుకోవద్దంటూ శ్రీలంకను హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం జయలలితను ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించడాన్ని తీవ్రంగా ఖండిచారు. శ్రీలంక క్షమాపణలు చెప్పడాన్ని ఆహ్వానిస్తున్నామని, అయితే, తమ వెబ్ సైట్లోకి అవి ఎలా వచ్చాయో తెలియవంటూ శ్రీలంక పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ విషయంలో మాత్రం తాము శ్రీలంకతో ఏకీభవించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సాగించిన ఆటలు తమ ప్రభుత్వ హయూంలోనూ కొనసాగించే యత్నంలో శ్రీలంక ఉన్నట్టుందని ధ్వజమెత్తారు. తమిళ జాలర్లకు ఇచ్చిన హామీని నెరవేర్చి తీరుతానని, మరో రెండు మూడు రోజుల్లో విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ తో భేటీకి చర్యలు తీసుకుంటానంటూ ఈసందర్భంగా ఓ కార్యకర్త సంధించిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇవ్వడం విశేషం. -
‘కాల్పుల’ కల్లోలం!
సాక్షి, చెన్నై:తమిళ జాలర్లపై కడలిలో శ్రీలంక సేనలు తూటాలను ఎక్కుబెట్టడం కలకలం రేపింది. తూటాల దెబ్బకు ఓ పడవ మునిగింది. అందులోని ఆరుగురిని కొందరు జాలర్లు అతి కష్టం మీద రక్షించారు. రామేశ్వరానికి చెందిన 22 మంది, పుదుకోట్టైకు చెందిన 24 మందిని శ్రీలంక సేనలు పట్టుకెళ్లాయి. సముద్రంలో రాష్ట్ర జాలర్లకు భద్రత కరువైంది. పాలకులు మారినా, తమబతుకులు ఇంతే అన్న ఆవేదనలో జాలర్లు ఉన్నారు. వరుస దాడులతో శ్రీలంక సేనలు తమ వీరంగాన్ని ప్రదర్శిస్తూ రావడం జాలర్లను తీవ్ర ఆందోళనలో పడేస్తున్నాయి. సమ్మె బాట పట్టినా, నిరసనలు తెలియజేసినా, పాలకుల హామీలు బుట్ట దాఖలవుతున్నాయి. కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ భరోసాతో, కడలిలోకి వెళ్లిన రామేశ్వరం, రామనాథపురం, పాంబన్ జాలర్లకు చివరకు మిగిలింది కన్నీళ్లే. ఇన్నాళ్లు చితకబాది బందీలుగా పట్టుకెళ్లే శ్రీలంక సేనలు ప్రస్తుతం తూటాలను ఎక్కుబెట్టడం జాలర్ల బతుకును ప్రశ్నార్థకం చేస్తున్నది. కాల్పులతో కల్లోలం: రెండు మూడు రోజులుగా వాతావరణంలో వచ్చిన మార్పులతో కడలి కల్లోలంగానే ఉంది. సముద్ర కెరటాలు ఎగసి పడుతున్నాయి. అయినా, బతుకు బండి లాగడం కోసం రామేశ్వరం, రామనాథపురం, పాంబన్ జాలర్లు బుధవారం రాత్రి కడలిలోకి వెళ్లారు. కచ్చదీవుల సమీపంలో అర్ధరాత్రి వలలను విసిరి వేటలో నిమగ్నమయ్యారు. ఈ సమయంలో అటు వైపుగా వచ్చిన లంక సేనలు వీరంగం సృష్టించాయి. వారు వచ్చీ రాగానే ఓ పడవను టార్గెట్ చేసి తూటాలను ఎక్కుబెట్టారు. భయాందోళన చెందిన జాలర్లు తమ పడవలతో ఒడ్డుకు తిరుగు ముఖం పట్టారు. జాలర్ల వలల్ని తెంచి పడేస్తూ, కాల్పులతో లంక సేనలు పైశాచికంగా వ్యవహరించాయి. తూటాల దెబ్బకు ఆ పడవ నీట మునిగింది. తమ ప్రాణాలను రక్షించుకునేందుకు అందులోని ఆరుగురు జాలర్లు సముద్రంలోకి దూకేశారు. ఈదుకుంటూ వస్తున్న వారిని మరో పడవలో ఉన్న జాలర్లు అతి కష్టం మీద రక్షించారు. అప్పటికే శ్రీలంక సేనలు ఐదు పడవల్ని చుట్టేశారుు. అందులో ఉన్న 22 మందిని తమ బందీలుగా పట్టుకెళ్లారు. వీరిని మన్నార్ వలిగూడాలో ఉంచారు. శ్రీలంక నావికాదళానికి చెందిన మరో బృందం పుదుకోట్టై జాలర్ల మీద తమ ప్రతాపం చూపించింది. వలల్ని తెంచి పడేసి, ఓ పడవను పాక్షికంగా ధ్వంసం చేశారు. ఆరు పడవలతో పాటుగా 24 మందిని బందీలుగా పట్టుకెళ్లింది. వీరిని నెడుం దీవుల్లో ఉంచింది. ఆందోళన : తమ వాళ్ల మీద దాడితో జాలర్ల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. రామేశ్వరం జాలర్లపై తూటాలను ఎక్కుబెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి. గతం పునరావృతం అవుతున్నట్టుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో తూటాలను ఎక్కుబెట్టి హెచ్చరికలు చేశారని, పడవలను సముద్రంలో మునిగేలా చేశారని పేర్కొంటున్నారు. ఆ తర్వాత జాలర్లకు తూటాలు గురి పెట్టారని గుర్తు చేస్తూ, గతం పునరావృతం కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తృటిలో తూటాల భారీ నుంచి తప్పించుకున్న ఆరుగురు జాలర్లు మీడియాతో మాట్లాడుతూ, చిమ్మ చీకట్లో సినీ తరహాలో తమ మీద కాల్పులు జరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. తొలుత తమ బోట్లకు గురి పెట్టారని, తమ మీద గురి పెట్టే సమయంలో సముద్రంలోకి దూకేశామని, లేకుంటే తమ ప్రాణాలు గాల్లో కలసి ఉండేవని విలపించారు. సముద్రంలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఈదుకుంటూ వస్తున్న తమను కొంత దూరం లంక సేనలు వెంబడించాయని, తాము కాసేపు నీళ్లలోకి వెళ్లడంతో తప్పించుకోగలిగామని చెప్పారు. సీఎం సీరియస్: కడలిలో జాలర్లపై శ్రీలంక తూటాలు ఎక్కుబెట్టడాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత తీవ్రంగా పరిగణించారు. గతంలో సాగిన కాల్పులు, అనంతరం పట్టుకెళ్లిన సంఘటనలు వివరిస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. శ్రీలంక దాడులు రోజు రోజుకూ పెరుగుతున్నాయని, ఆ దేశాన్ని తీవ్రంగా హెచ్చరిస్తూ, రాజ్యంగ పరమైన చర్యలను తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. శ్రీలంక సేనలు పట్టుకెళ్లిన 46 మంది జాలర్లను విడిపించాలని డిమాండ్ చేశారు. ఇది వరకే ఆ దేశ ఆధీనంలో ఉన్న 23 పడవలతో పాటుగా, తాజాగా పట్టుకెళ్లిన 11 పడవలను విడుదల చేయించాలని కోరారు. శ్రీలంక సేనలు తూటా ఎక్కుబెట్టడాన్ని డీఎంకే అధినేత కరుణానిధి, ఎండీఎంకే నేత వైగో, పీఎంకే నేత రాందాసు తీవ్రంగా ఖండించారు. శ్రీలంక పైశా -
లంక తీరుపై ఆగ్రహం
సాక్షి, చెన్నై:జాలర్లపై దాడులు తమిళాభిమానులు, రాజ కీయ పార్టీల్లో ఆగ్రహాన్ని రగుల్చుతున్నాయి. శ్రీలంక పైశాచికత్వంపై రాజకీయ పక్షాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. చెరపట్టిన వారిని విడుదల చేయాలని పట్టుబడుతున్నాయి. ఈ పరిణామాలు తమను ఇరకాటంలో పడేస్తుండడంతో జాలర్ల విడుదలే లక్ష్యంగా బీజేపీ నేతలు ప్రయత్నాల్లో పడ్డారు. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌తో కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పొన్ రాధాకృష్ణన్ భేటీ అయ్యారు. రాష్ట్ర జాలర్లపై ఏళ్ల తరబడి శ్రీలంక సాగిస్తున్న పైశాచికత్వం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేంద్రంలో అధికార మార్పుతో తమకు భద్రత దొరికినట్టేనని భావించిన రాష్ట్ర జాలర్లకు కన్నీళ్లే మిగులుతున్నారుు. విరామం తరువాత కడలిలోకి వెళ్లిన రోజు నుంచి శ్రీలంక సేనలు వీర విహారం చేస్తున్నాయి. వరుస దాడులతో బెంబేలెత్తిపోయిన జాలర్లు కడలిలోకి వెళ్లడానికిసాహసించడం లేదు. తమకు భద్రత కావాలంటూ నిరవధిక సమ్మె బాటలో రామేశ్వరం, పాంబన్, రామనాథపురం జాలర్లు ఉండగా, వీరికి మద్దతగా గళం పెరుగుతోంది. తూత్తుకుడి, నాగపట్నం, కడలూరు, కన్యాకుమారి తీర జాలర్ల సంఘాలు తదుపరి కార్యాచరణపై సమాలోచనలో పడ్డారు. జాలర్ల సంఘాలు ఏకమవుతుండడంతో వీరికి అండగా నిలబడేందుకు రాజకీయ పక్షాలు సిద్ధమయ్యాయి. నేతల శివాలు: శ్రీలంక చర్యలను డీఎంకే అధినేత ఎం కరుణానిధి తీవ్రంగా ఖండించారు. జాలర్లను విడుదల చేయించేందుకు తక్షణం చర్యలు చేపట్టాలంటూ ప్రధాని నరేంద్ర మోడీకి ఆయన సోమవారం లేఖాస్త్రం సంధించారు. దాడులు పునరావృతం కాకుండా ఇప్పుడే అడ్డుకట్ట వేయాలని విజ్ఞప్తి చేశారు. శ్రీలంక మెడలు వంచి తమిళ జాలర్లకు న్యాయం చేయాలని కోరారు. పీఎంకే నేత రాందాసు సైతం తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అధికార మార్పుతో తమకు భద్రత కల్గిందన్న ఆనందంలో ఉన్న జాలర్లకు చివరకు ఆవేదన మిగులుతోందని పేర్కొన్నారు. ఈ దాడుల పర్వానికి అడ్డుకట్ట వేయాలంటే శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేను, ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖను భారత ప్రధాని నరేంద్ర మోడీ తప్పు పట్టాల్సిన అవసరం ఉందని సూచించారు. ఇక కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జికేవాసన్, టీఎన్‌సీసీ అధ్యక్షుడు జ్ఞాన దేశికన్, ఎండీఎంకే నేత వైగో, నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్, సీపీఎం, సీపీఐల నాయకులు సైతం జాలర్లకు అండగా నిలబడుతూ శ్రీలంకపై తమ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుష్మాతో భేటీ : జాలర్లపై వరుస దాడులు రాష్ట్రంలో తమను ఇరాకటంలో పడేస్తుండటంతో కమలనాథులు మేల్కొన్నారు. జాలర్ల విడుదలే లక్ష్యంగా కేంద్రంలోని తమ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే పనిలో పడ్డారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, కేంద్ర పరిశ్రమల శాఖ సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ ఉదయాన్నే ఢిల్లీలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌తో భేటీ అయ్యారు. జాలర్లను విడుదల చేయించేందుకు చర్యలు తీసుకోవాలని కోరడంతో, అందుకు తగ్గ ప్రయత్నాల్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వేగవంతం చేసింది. కోర్టుకు హాజరు : ఓ వైపు జాలర్లను విడుదల చేయించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుంటే, మరో వైపు శ్రీలంక సేనలు మాత్రం చేతికి చిక్కిన జాలర్లను కోర్టులో హాజరు పరిచే పనిలో పడ్డారు. 82 మందిని తలై మన్నార్ కోర్టులో, మరో 36 మంది గ్రామ భద్రతా కోర్టులో హాజరు పరిచారు. అయితే, వీరిని సాయంత్రం వరకు రిమాండ్‌కు న్యాయమూర్తులు ఆదేశించినట్టు సమాచారం. ఇందుకు కారణం శ్రీలంకలోని భారత రాయ దౌత్య కార్యాలయ వర్గాలు వీరిని విడుదల చేయించేందుకు ప్రయత్నాల్లో నిమగ్నం కావడమే. అయితే, తమ దేశ ప్రభుత్వం నుంచి స్పష్టమైన అనుమతి వచ్చాకే విడుదల చేస్తామంటూ శ్రీలంక నావికాదళం స్పష్టం చేయడం గమనార్హం. విడుదలకు ఆదేశం : తమ దేశ నావికాదళం గుప్పెట్లో ఉన్న తమిళ జాలర్లను విడుదల చేయడానికి శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే ఆదేశాలు ఇచ్చారు. 78 మందిని విడుదల చేస్తున్నామంటూ రాజపక్సే తన ట్విట్టర్లో పేర్కొనడం విశేషం. ఈ దృష్ట్యా, ఆ 78 మందిని మంగళవారం శ్రీలంకలోని భారత దౌత్య కార్యాలయ వర్గాలకు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, మిగిలిన వారి విడుదల గురించి రాజపక్సే ఆదేశాలు ఇవ్వక పోవడం గమనించాల్సిందే. -
మిత్రుల్లో ‘చిచ్చు’కు కుట్ర
సాక్షి, చెన్నై : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్‌ను కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి పదవి వరించిన విషయం తెలిసిందే. కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టినానంతరం తొలి సారిగా శనివారం ఆయన చెన్నైకు వచ్చారు. మీనంబాక్కం విమానాశ్రయంలో ఆ పార్టీ వర్గాలు ఆయనకు బ్రహ్మరథం పట్టాయి. దారి పొడవున ఫ్లెక్సీలు, బ్యానర్లతో ఘన స్వాగతం పలికారు. టీ నగర్‌లోని కమలాల యంలోను ఆయనకు అపూర్వ స్వాగ తం లభించింది. రాష్ట్రపార్టీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి హోదాతో తొలిసారిగా కమలాలయూనికి వచ్చిన ఆయన్ను అక్కడి సిబ్బంది అభినందించారు. సమాలోచన: కమలాలయంలో తిరువళ్లూరు, కాంచీపురం, చెన్నై జిల్లా పార్టీల నాయకులతో రాధాకృష్ణన్ సమాలోచన జరిపారు. పార్టీ బలోపే తం, ఆయా ప్రాంతాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలను వివరించారు. ఈ మూడు జిల్లాల పరిధిలో పార్టీకి వచ్చి న ఓటు బ్యాంక్ ఆధారంగా మరింత బలోపేతానికి సూచనలు ఇచ్చారు. పరిశ్రమలతో ఉపాధి మెరుగు: మీడియాతో పొన్ రాధాకృష్ణన్ మాట్లాడుతూ, పార్టీ అధ్యక్ష మార్పు అధిష్టానం చేతిలో ఉందన్నారు. కొత్త అధ్యక్షుడు ఎవరన్నది త్వరలో అధిష్టానం ప్రకటిస్తుందని పేర్కొన్నారు. తమిళనాడు సీఎం జయలలిత ఢిల్లీ వచ్చిన సందర్భంలో తనతో భేటీ అయ్యారని గుర్తు చేశారు. రాష్ట్రంలోని పరిశ్రమలు, రానున్న కాలంలో నెలకొల్పాల్సిన పరిశ్రమలు, తదితర అంశాలపై చర్చించినట్లు వివరించారు. రాష్ట్రానికి మరిన్ని ప్రాజెక్టులు రానున్నాయని, తద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగు పడనున్నాయని తెలిపారు. తమిళ జాలర్లపై దాడులకు అడ్డుకట్ట వేయడం లక్ష్యంగా కేంద్రం చర్యలు తీసుకుంటోందన్నారు. మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ దాడులకు ఆరు నెలల్లోపు అడ్డుకట్ట వేసి తీరుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈలం తమిళులకు సమ న్యాయం లక్ష్యంగా తప్పకుండా ప్రధాని మోడీ కృషి చేస్తారని పేర్కొన్నారు. కావేరి సంక్షేమ బోర్డు ఏర్పాటు లక్ష్యంగా కేంద్రం తప్పకుండా చర్యలు తీసుకుంటుందని, కర్ణాటక నుంచి తమిళనాడుకు వాటా నీటిని పంపింగ్ చేయించి తీరుతానని ధీమా వ్యక్తం చేశారు. అసంతృప్తి: కేంద్రంలో పదవులు దక్కలేదన్న అసంతృప్తి పీఎంకే, డీఎండీకేల్లో కనిపిస్తోందే? అని మీడియా ప్రశ్నించగా, అటువంటిదేమీ లేదన్నారు. ఆ పార్టీ నాయకులతో తాను మాట్లాడానని, వారిలో ఎలాంటి అసంతృప్తి లేదని స్పష్టం చేశారు. కూటమిలో చీలిక రాబోతున్నట్టుందే? అని మరో ప్రశ్న సంధించగా, మిత్రులందరం ఏక తాటి మీదే ఉన్నామని, తమలో చీలిక వచ్చే ప్రసక్తే లేదన్నారు. అయితే, మిత్రుల మధ్య చిచ్చు పెట్టి చీల్చే కుట్ర జరుగుతోంద ని, ఈ కుట్ర చేస్తున్న వారి ప్రయత్నాలు ఫలించబోవన్నారు. రాష్ట్రంలో ని బీజేపీ కూటమిలో ఉన్న అన్ని పార్టీల లక్ష్యం రానున్న అసెంబ్లీ ఎన్నికలేనంటూ ముగించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు వానతీ శ్రీనివాసన్, మోహన్ రాజులు, సవేరా చక్రవర్తి, తదితరులు పాల్గొన్నారు. -
‘రాధా’కు పదవి!
సాక్షి,చెన్నై: రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్‌కు కేంద్రంలో పదవి దక్కిం ది. ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వంలో సహాయ మంత్రి పదవి ఆయన్ను వరించింది. దీంతో రాష్ట్రంలోని కమలనాథుల్లో ఆనందోత్సాహాలు నిండాయి. సంబరాల్లో మునిగి తేలారు.పదేళ్లుగా రాష్ట్రంలో బీజేపీ చతికిలపడిన విషయం తెలిసిందే. ద్రవిడ పార్టీలు చీదరించుకోవడంతో ఆ పార్టీని అక్కున చేర్చుకున్న వాళ్లు లేరు. చిన్నా, చితక పార్టీలతో కలసి ఎన్నికలను ఎదుర్కోవాల్సి వచ్చింది. చతికిలపడిన పార్టీని బలోపేతం చేయడం లక్ష్యంగా పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన పొన్ రాధాకృష్ణన్ శ్రమించారు. డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలకు ప్రత్యామ్నాయ శక్తిగా మెగా కూటమిని ఏర్పాటు చేయడంలో పొన్ రాధాకృష్ణన్ కీలక పాత్ర పోషించారు. ఎన్నికల్లో తమ కూటమికి అత్యధిక స్థానాల్లో ఓటమి ఎదురైనా రెండు సీట్లు దక్కించుకోవడం బీజేపీలో ఆనందాన్ని నింపింది. కన్యాకుమారి నుంచి పొన్ రాధాకృష్ణన్ విజయ ఢంకా మోగించారు.కేంద్రంలో పదవి : ఎంపీ గెలుపొందిన పొన్ రాధాకృష్ణన్‌కు బీజేపీ అధిష్టానం గుర్తింపును ఇచ్చింది. రాష్ట్ర పార్టీ బలోపేతానికి శ్రమించిన ఆయన్ను గౌరవించే విధంగా కేంద్ర సహాయ మంత్రి పదవిని అప్పగించింది. సోమవారం సాయంత్రం ఢిల్లీలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో కేంద్ర సహాయ మంత్రిగా పొన్ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో రాష్ట్ర బీజేపీ వర్గాల్లో ఆనందం వెల్లివిరిసింది. పదేళ్ల తర్వాత రాష్ట్రం నుంచి తమ ప్రతినిధి ఎన్నిక కావడంతో పాటుగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడికి పదవి రావడంతో బాణ సంచాలు పేల్చుతూ పండుగ చేసుకున్నారు. రెండో సారి మంత్రిగా: పొన్ రాధాకృష్ణన్‌ను రెండో సారి కేంద్ర సహాయ మంత్రి పదవి వరించింది. బ్రహ్మచారిగా ఉన్న రాధాకృష్ణన్ తొలుత హిందూ మున్ననిలో చురుగ్గా రాణించారు. హిందూ మున్నని నుంచి ఆర్ఎస్ఎస్లోకి వెళ్లిన ఆయన ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. అంచెలంచెలుగా ఎదిగారు. కన్యాకుమారి జిల్లా పరిధిలో పూర్వం ఉన్న నాగుర్కోయిల్ లోక్‌సభ నుంచి 1999లో ఎన్నికయ్యారు. ప్రధాని వాజ్పాయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో యువజన సర్వీసులు, క్రీడల శాఖ సహాయ మంత్రి పదవి ఆయన్ను వరించింది. 2004లో అదే స్థానం బరిలో మళ్లీ నిలబడ్డా ఓటమి తప్పలేదు. 2009లో నాగుర్ కోయిల్ గల్లంతై, కన్యాకుమారి ఆవిర్భవించడంతో తన అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో పడ్డారు. అయితే, ద్రవిడ పార్టీల అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టించారేగానీ, విజయాన్ని అందుకోలేకపోయారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో విజయ ఢంకాతో కేంద్రంలో మళ్లీ మంత్రి పదవిని కొట్టేశారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళల్లో అత్యధిక భూ భాగం సముద్ర తీరం ఉండటం, ఇక్కడి హార్బర్ల ద్వారా అత్యధిక ఆదాయం కేంద్రానికి వస్తుండటంతో ఆయనకు కేంద్ర నౌకాయన శాఖ సహాయ మంత్రి పదవిని అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు రాష్ట్ర బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. అన్భుమణికి భంగ పాటు: కేంద్రంలో పదవి దక్కుతుందన్న ఆశతో ఉన్న అన్భుమణి రాందాసుకు భంగ పాటు తప్పలేదు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో కలసి పీఎంకే బరిలోకి దిగింది. ఎంపీగా గెలిస్తే అన్భుమణికి చోటు కల్పిస్తామని ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా సీట్ల పందేరం సమయంలో సంకేతాలు వెలువడ్డాయి. ఆ పార్టీ 8 చోట్ల అభ్యర్థుల్ని నిలబెట్టింది. పార్టీ అధినేత రాందాసు తనయుడు అన్భుమణి రాందాసు ధర్మపురి నుంచి తొలి సారిగా పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. ఈ గెలుపుతో కేంద్రంలో తమకు పదవి దక్కుతుందన్న ఆశ పీఎంకే వర్గాల్లో నెలకొంది. అన్భుమణి రాందాసు గతంలో ఆరోగ్య శాఖ మంత్రిగా కేబినెట్ హోదాతో పనిచేసినదృష్ట్యా, ఈ సారి అదే హోదాతో ఏదేని పదవి దక్కుతుందన్న ఆశతో ఉన్న అన్భుమణికి బీజేపీ ఝలక్ ఇచ్చింది. ఆయనకు మొదటి విడతలో పదవి దక్కలేదు. కేబినెట్ విస్తరణలో ఏమైనా అవకాశాలున్నాయేమో వేచిచూడాల్సిందే! -
ఆశల పల్లకిలో!
సాక్షి, చెన్నై : రాష్ట్రంలో డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయంగా తమ నేతృత్వంలో మెగా కూటమి ఏర్పాటులో కమలనాథుల పాత్ర ప్రశంసనీయం. చతికిలపడిన పార్టీకి ఆక్సిజన్ నింపడంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్ కీలక భూమిక పోషించారు. కష్ట కాలంలో పార్టీ అధ్యక్ష పగ్గాలను చేపట్టడంతోపాటుగా ప్రజల్లోకి చొచ్చుకెళ్లే యత్నం చేశారు. మెగా కూటమిని ఏర్పాటు చేసి ప్రధాన ద్రవిడ పార్టీల్లో వణుకు పుట్టించే యత్నం చేశారు. ఎన్నికల్లో ఈ మెగా కూటమి అనేక చోట్ల మూడో స్థానానికి పరిమితం అయింది. కొన్ని స్థానాల్లో ఆ కూటమి అభ్యర్థులు డీఎంకేకు చుక్కలు చూపించారని చెప్పవచ్చు. కన్యాకుమారి, పుదుచ్చేరి, ధర్మపురిలో మాత్రం విజయ కేతనం ఎగుర వేశారు. పరువు దక్కించుకున్నా, జాతీయ స్థాయిలో బీజేపీ అధికార పగ్గాలు చేపట్టడం కూటమి మిత్రుల్లో ఆనందాన్ని నింపుతోంది. పదవుల కోసం...: బీజేపీ 8 చోట్ల అభ్యర్థుల్ని నిలబెట్టినా, చివరకు కన్యాకుమారిలో మాత్రం గెలిచింది. గతంలో ఇక్కడి నుంచే పొన్ రాధాకృష్ణన్ పార్లమెంట్ మెట్లు ఎక్కారు. వాజ్ పేయ్ మంత్రి వర్గంలో యువజన సర్వీసులు, క్రీడల శాఖ సహాయ మంత్రి పదవి ఆయన్ను వరించింది. ఇప్పుడు తన వ్యక్తిగత హవా, మోడీ ప్రభావంతో లక్షా 25 ఓట్ల ఆధిక్యంతో రాధాకృష్ణన్ గెలిచారు. అయితే, ఇక్కడ పోటీ అన్నది కాంగ్రెస్ అభ్యర్థి వసంత కుమార్, రాధాకృష్ణన్ మధ్య నెలకొనడంతో ప్రధాన ద్రవిడ పార్టీలు గల్లంతయ్యాయి. ద్రవిడ పార్టీలను ఇక్కడ మట్టి కరిపించిన రాధాకృష్ణన్‌కు మళ్లీ మంత్రి పదవి దక్కుతుందన్న ఆశ కమలనాథుల్లో నెలకొంది. గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న దృష్ట్యా, రాష్ట్రంలో పార్టీ బలోపేతం వెనుక ఆయన పడ్డ శ్రమకు అధిష్టానం తప్పకుండా గుర్తింపు ఇస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తనకు పదవి దక్కుతుందన్న ఆశ లోపల ఉన్నా, బయటకు కనిపించకుండా ఢిల్లీకి ఆగమేఘాలపై రాధాకృష్ణన్ పరుగులు తీశారు. అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, శిరసా వహిస్తానని స్పష్టం చేస్తున్న ఆయన్ను పదవి వరించడం ఖాయం. అన్భుమణికి చాన్స్ : బీజేపీ కూటమిలోని పార్టీలన్నీ మట్టి కరిచినా, పీఎంకే మాత్రం పరువు దక్కించుకుంది. వన్నియర్ సామాజిక వర్గం ఓట్లు కలసి రావడంతో ధర్మపురిని ఆ పార్టీ చేజిక్కించుకుంది. రాజ్యసభ సీటుతో గతంలో కేంద్ర మంత్రి వర్గంలో చక్రం తిప్పిన అన్భుమణి రాందాసు తొలి సారిగా ప్రత్యక్ష ఎన్నికలను ఎదుర్కొన్నారు. విజయం కోసం చమటోడ్చాల్సిన పరిస్థితి ఆయనకు ఏర్పడింది. వన్నియర్ కుల ఓట్లు అత్యధికంగా ఉన్న ధర్మపురిని ఎంపిక చేసుకుని పథకం ప్రకారం ముందుకు కదిలారు. ఎన్నికల ఫలితాలు ఒక్కో రౌండ్‌కు ఒక్కో రూపంలో ఉండటంతో అన్భుమణి ఆశలు తొలుత అడియాలు అయ్యాయి. అయితే, అదృష్టం కలసి వచ్చి చివరి నాలుగు రౌండ్లు ఆదుకోవడంతో గెలుపు బావుటా ఎగుర వేసిన అన్భుమణిలో కేంద్ర పదవి ఆశలు చిగురించాయి. బీజేపీతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు తమ నేతకు తప్పకుండా పదవి దక్కుతుందన్న ఎదురు చూపుల్లో పీఎంకే వర్గాలు ఉన్నాయి. అయితే, పీఎంకే ఆశిస్తున్నట్టుగా కేంద్రంలో కేబినెట్ హోదా పదవి మాత్రం దక్కే అవకాశాలు అరుదే. ఇస్తే రెడీ : ఎన్డీఏ కూటమితో ఒప్పందాలు కుదుర్చుకున్న పుదుచ్చేరి ఎన్ఆర్ కాంగ్రెస్‌కు పీఎంకే నిర్ణయం ఇరకాటంలో పడేసింది. తమిళనాడు వరకే బీజేపీతో పొత్తు అంటూ పుదుచ్చేరిలో తమ అభ్యర్థిని పీఎంకే రంగంలోకి దించింది. అయితే, ఎన్ఆర్ కాంగ్రెస్ అధినేత రంగస్వామి హవా ముందు పీఎంకేతో పాటుగా డీఎంకే, అన్నాడీఎంకే, కాంగ్రెస్ కంగు తినాల్సి వచ్చింది. పుదుచ్చేరిలో పార్టీ ఆవిర్భావంతో సత్తా చాటిన రంగస్వామి, అదే ఊపుతో పుదుచ్చేరి ఎంపీ సీటును ఎన్ఆర్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకున్నారు. తమ అభ్యర్థి రాధాకృష్ణన్‌ను కేంద్రంలో మంత్రిని చేయడానికి రంగస్వామి సిద్ధం అయ్యారు. కేంద్ర పాలిత ప్రాంతానికి తప్పని సరిగా ఓ సహాయ మంత్రి పదవి వరించడం ఖాయం కావడంతో, ఆ పదవి ఏదో తమకు ఇవ్వాలంటూ మోడీకి మొర పెట్టుకునేందుకు సిద్ధం అయ్యారు. ఇక, ఆశల పల్లకిలో ఊగిసలాడుతున్న ఈ మూడు పార్టీలకు కేంద్రం లో పదవులు దక్కేనా అన్నది వేచి చూడాల్సిందే. -
రజనీకాంత్‌కు బీజేపీ గాలం
తమిళసినిమా, న్యూస్‌లైన్: సూపర్‌స్టార్ రజనీ కాంత్ కోసం బీజేపీ గాలం వేస్తోంది. ఈ పార్టీ రాష్ట్రాల్లో తమ ప్రభావాన్ని పెంచుకుని కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా తమిళనాడులో బీజేపీ ముఖ్య నాయకులు పావులు కదుపుతున్నారు. బిగ్షాట్స్ అనే వాళ్లకు వల విసిరే ప్రయత్నం చేస్తున్నారు. ముందుగా అత్యంత అభిమానగణం, ప్రజాదరణ గల నటుడు రజనీకాంత్‌ను తమ పార్టీలోకి లాక్కునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తమిళనాడు భారతీయ లోక్‌సభ ఎన్నికల కార్యాచరణ సంఘం సమావేశం శనివారం తిరుచ్చిలో జరిగింది. ఈ సమావేశానికి భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి మురళిధరరావ్ అధ్యక్షత వహించారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్, ఇల.గణేశన్, తమిళచ్చి సౌందరరాజన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పొన్‌రాధాకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా నరేంద్రమోడి గాలి వీస్తోందన్నారు. ఆ ప్రభావం తమిళనాడులోనూ బలంగా ఉందన్నారు. బీజేపీ తన బలాన్ని పెంచుకుని కేంద్రంలోనూ, రాష్ట్రం లోనూ అధికారం చేపట్టనుందన్నారు. తమిళనాడులో ఇతర పార్టీలతో కూటమికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఎండీఎంకేతో చర్చలు ముగిశాయని, డీఎండీకేతో చర్చిస్తున్నట్లు వెల్లడించారు. అదే విధంగా నటుడు రజనీకాంత్ మొదలగు ముఖ్యమైన వ్యక్తుల మద్దతు కోరనున్నట్లు పొన్‌రాధాకృష్ణన్ తెలిపారు.