kanyakumari
-
కశ్మీర్‌కు వందేభారత్.. మంచులోనూ వెచ్చదనం
దేశంలో వందేభారత్ రైళ్లు పరుగులు పెడుతూ, ప్రయాణికులకు నూతన రైలు ప్రయాణ అనుభూతిని అందిస్తున్నాయి. తాజాగా కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రైల్వే లైన్ ద్వారా దేశాన్ని అనుసంధానించడానికి ప్రారంభించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఉదంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్(యూఎస్బీఆర్ఎల్) పనులు దాదాపు పూర్తయ్యాయి. త్వరలో ఢిల్లీ నుండి రైళ్లు కశ్మీర్‌కు బయలుదేరనున్నాయి. ఈ మార్గంలో నడిపేందుకు ముందుగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ఎంపిక చేశారు. అయితే కశ్మీర్ లోయలో హిమపాతం, అక్కడి సబ్-జీరో ఉష్ణోగ్రతను దృష్టిలో ఉంచుకుని, ఈ వందేభారత్ రైలులో పలు నూతన ఫీచర్లను జోడించారు.ఇప్పటివరకు కశ్మీర్ వైపు వెళ్లే రైళ్లు కాట్రా వరకు మాత్రమే నడుస్తున్నాయి. తదుపరి రైల్వే లైన్ వేసే పనిని వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన యూఎస్బీఆర్ఎల్ ప్రాజెక్ట్(USBRL Project) కింద చేపట్టారు. ఈ పనులు దాదాపు పూర్తయ్యాయి. ఇంకా 17 కిలోమీటర్ల దూరం మాత్రమే మిగిలి ఉంది. ఇది త్వరలో పూర్తి కానుంది. ఈ ప్రాజెక్టు పూర్తయ్యాక రైళ్లు రియాసి జిల్లాలోని అంజి వంతెన, చీనాబ్ వంతెన ద్వారా ఉధంపూర్, జమ్మూ, కాట్రా గుండా వెళతాయి. సంగల్డాన్, బనిహాల్ మీదుగా నేరుగా శ్రీనగర్, బారాముల్లా చేరుకుంటాయి. దీనిని రోడ్డు మార్గంతో పోలిస్తే, ఆరు గంటలు ఆదా అవుతుంది. ప్రయాణం కూడా చాలా సులభతరం అవుతుంది.కశ్మీర్ లోయ వరకూ సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు ఈ మార్గంలో నడిచే మొదటి రైలుగా వందే భారత్‌ను ఎంపిక చేశారు. ఈ రైలుకు ప్రత్యేక ఫీచర్లు అనుసంధానించారు. రైలు బయట మంచుకురుస్తుంటో లోపలి ప్రయాణికులు వెచ్చదనాన్ని అనుభవించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కశ్మీర్లో రైళ్లు నడపడానికి మంచు కురువడం, సున్నా కంటే తక్కువ ఉష్ణోగ్రతలు ప్రధాన సవాలుగా నిలుస్తున్నాయి. విండ్ స్క్రీన్ పై మంచు కురుస్తున్న కారణంగా, లోకో పైలట్ ముందున్న రోడ్డును చూడలేకపోతారు. మైనస్ ఉష్ణోగ్రత(Subzero temperature)లో టాయిలెట్ పైప్లైన్లు కూడా స్తంభించిపోతాయి. అలాగే విపరీతమైన చలి కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతుంటారు.కశ్మీర్‌కు నడిపేందుకు రూపొందించిన రైలులో పైలట్ క్యాబిన్ విండ్‌స్క్రీన్ డబుల్ లేయర్ గ్లాస్‌తో తయారు చేశారని, మధ్యలో హీటింగ్ ఎలిమెంట్ ఉంటుందని ఉత్తర రైల్వే చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ హిమాన్షు శేఖర్ ఉపాధ్యాయ్ మీడియాకు తెలిపారు. ఈ సాంకేతికత కారణంగా గ్లాస్‌కు అంటుకున్న మంచు వెంటనే కిందకు జారిపోతుందన్నారు. వైపర్ నుండి వేడి నీరు కూడా బయటకు వస్తుందని, ఇది మిగిలిన మంచు, ఆవిరిని తొలగిస్తుందన్నారు. కొత్త ఫీచర్లతో కూడిన ఈ వందే భారత్‌లో లోకో పైలట్ క్యాబిన్‌లోని సీట్లు కూడా మరింత సౌకర్యవంతంగా ఉండనున్నాయి. రైలు అంతటా హీటర్ వ్యవస్థ ఉంటుంది. ప్రతి కోచ్‌లో హై లెవల్ థర్మోస్టాట్ లేయరింగ్ ఉంటుంది. తద్వారా సున్నా కంటే తక్కువ ఉష్ణోగ్రతలలో కూడా లోపలి ఉష్ణోగ్రత సాధారణ స్థితిలో ఉంటుంది.వందే భారత్ టాయిలెట్లలో నీటి పైప్‌లైన్‌ను సిలికాన్ హీటింగ్ ప్యాడ్లతో ఇన్సులేట్ చేశారు. తద్వారా బయో టాయిలెట్‌లోని ట్యాంక్‌కు హీటింగ్ కూడా అందుతుంది. ఫలితంగా దుర్వాసన వచ్చే అవకాశం ఉండదు. ఇదేవిధంగా ఈ నూతన వందే భారత్ రైలు కిటికీలకు డబుల్ లేయర్డ్ గ్లాస్ కూడా అమర్చారు. దీంతో ఎవరైనా ఒకవేళ రాయి విసిరినప్పటికీ, పైగాజు మాత్రమే పగిలిపోతుంది. ప్రయాణికులకు ఎటువంటి హాని వాటిల్లదు.ఇది కూడా చదవండి: సంధ్యావేళ.. మహా కుంభమేళా -
‘ములక్కారం’పై ధిక్కారం.. గుండెను కోసే రవిక సుంకం
‘తంగలాన్’ సినిమాలో దళిత స్త్రీలకు మొదటిసారి రవికెలు ఇచ్చినప్పుడు వారు వెలిబుచ్చే ఆనందం, సంబరం ప్రేక్షకులకు కన్నీరు తెప్పించింది. స్త్రీలపై పీడన చరిత్రలో అనేక విధాలైతే దళిత స్త్రీలకు పై వస్త్రం ధరించే హక్కు లేకుండా చేయడం మరో పీడన. రవికె ధరించాలంటే దళిత స్త్రీలు ‘ములక్కారం’ పేరుతో సుంకం కట్టాల్సి వచ్చేది. దీనిని ఎదిరించడానికి తన రొమ్ముల్ని కోసుకుంది నాంజెలి అనే స్త్రీ. కన్యాకుమారిలో దళిత స్త్రీలు ‘రవికె కట్టు ఉద్యమాన్ని’ నిర్వహించారు. ఈ తరం విద్యార్థులు తెలుసుకోవాల్సిన చరిత్ర ఇది.‘తంగలాన్’ సినిమాలో ఉత్తర ఆర్కాట్ జిల్లాలోని దళితులకు భూమి ఉండదు. ఊరిలో భాగం ఉండదు. అలాగే బట్ట కూడా ఉండదు. ఒంటి నిండా బట్ట లేకుండా ఉంచడం వారిని ‘గుర్తించడానికి’ ఒక సంకేతం. పురుషులు ‘మోకాళ్లకు దిగని’ అంగవస్త్రాన్ని మాత్రమే కట్టుకోవాలి. స్త్రీలు రవిక లేకుండా మోకాళ్ల పైకి చీర చుట్టుకోవాలి. వారి భూమిని వారి నుంచి లాక్కుని వారినే కూలివాళ్లుగా మార్చి పని చేయిస్తుంటాడు జమీందారు.ఒకవేళ ఎవరికైనా భూమి ఉంటే అందులో పంట పండితే అది ఇల్లు చేరదు. నిప్పుకు ఆహుతి అవుతుంది. ఈ బాధలు పడలేక బ్రిటిష్ వారి కింద ఊడిగం చేసి బంగారు గని కార్మికులుగా పని చేసి బాగుపడదామనుకుంటారు దళితులు. అందులో భాగంగా తంగలాన్ (విక్రమ్) నాయకత్వంలో దళితులను కోలార్‌కు వలస తీసుకెళతారు. అక్కడ విక్రమ్ కష్టం చూసి, నాయకత్వ లక్షణాలు చూసి ముందు అతన్ని దుస్తులతో గౌరవిస్తాడు. ప్యాంట్ షర్ట్ ఇస్తాడు.కూలి డబ్బు తీసుకొని గుర్రమెక్కి వచ్చిన విక్రమ్ తన వాడ మహిళల కోసం తెచ్చే ఒకే ఒక కానుక రవికలు. వాటిని చూసి మహిళలు తమ జీవితాల్లో ఇలాంటి రోజొకటి వస్తుందా అన్నట్టు చూస్తారు. రవిక తొడుక్కునే స్వేచ్ఛను మొదటిసారి అనుభవిస్తూ పులకించిపోతారు. ఒంటి నిండా బట్ట కట్టుకుంటే వచ్చే గౌరవాన్ని పొందుతారు. 1850 కాలం నాటి కథగా దీనిని దర్శకుడు పా.రంజిత్ చూపుతాడు. అయితే ఆ కాలం దాటి ఇన్నేళ్లు గడిచినా ఇంకా కొన్ని తెగలలో స్త్రీలకు ఎద పై వస్త్రం దొరకడం, తొడిగే ఆర్థిక స్థితి రాకపోవడం విషాదం. అదే సమయంలో తమ హక్కును గుర్తెరిగి వక్షాన్ని కప్పుకునే హక్కు కోసం నినదించే స్త్రీలనూ మనం గుర్తు చేసుకోవాలి.అరిటాకుల్లో వక్షోజాలుకేరళ, తమిళనాడుల్లోని ట్రావెన్కోర్ రాజ్యాన్ని పరిపాలించిన శ్రీమూలమ్ తిరుమాళ్ (1885–1924) కాలంలో జరిగిన ఘటన ఇది. ఆ రోజుల్లో ట్రావెన్కోర్ రాజ్యంలో దళితుల మీద 110 రకాల పన్నులుండేవి. మగవాళ్లు శిరోజాలు పెంచుకుంటే ‘తలక్కారం’ అనే పన్ను కట్టాలి. స్త్రీలు వక్షోజాలు కప్పుకుంటే ‘ములక్కారం’ అనే పన్ను కట్టాలి. అసలే పేదరికంలో ఉన్న దళితులు ఈ పన్నులు కట్టలేక బాధలు అనుభవించేవారు. నాంజెలి అనే మహిళ తన ఇంటి ముందుకు వచ్చిన పన్ను వసూలు వ్యకికీ, అలాగే రాజుకు జీవితకాల పాఠం నేర్పాలని అనుకుంది.అరిటాకుల్లో బియ్యం పెట్టి కట్టాల్సిన పన్నుకు బదులు పదునైన కొడవలితో కోసుకున్న తన వక్షోజాలను పెట్టి ఇచ్చింది. అరిటాకుల్లో కోసిన వక్షోజాలు కేరళలో పెనుకంపనం కలిగించాయి. ఆ విధంగాప్రాణత్యాగం చేసిన నాంజెలి వల్ల వెంటనే రాజు వక్షోజ పన్నును తొలగించాడు. తొలగించింది పన్నే తప్ప దళిత స్త్రీలకు, నాడార్ స్త్రీలకు రవిక తొడుక్కునే హక్కు ఇవ్వలేదు. దాని కోసం పోరాటం సాగిస్తే ముడివేసుకునే రవికలు ధరించేందుకు అనుమతి లభించింది. ఆ తర్వాత చాలా కాలానికి అందరిలాంటి రవికలు ధరించారు. 1990ల వరకూ కూడా తమిళనాడు, కేరళలోని దళితులలో వృద్ధ మహిళలు రవిక ధరించేవారు కాదు. వారికి ఆ అలవాటు మెదడులో నిక్షిప్తమైపోవడమే కారణం.రవిక కట్టే ఉద్యమంఆ సమయంలోనే కన్యాకుమారి జిల్లాలో దళిత స్త్రీలు ‘రవిక కట్టే ఉద్యమాన్ని’ భారీ ఎత్తున లేవదీశారు. దీనిని ‘మారు మరక్కమ్ సమరం’ అని పిలిచారు. దీనికే ‘చన్నార్ తిరుగుబాటు’ అని పేరు. పై కులాల వాళ్ల ముందు స్త్రీలైనా, పురుషులైనా నగ్నమైన ఛాతీతో ఉండటమే మర్యాదగా నాటి సమాజం నిశ్చయిస్తే రేగిన తిరుగుబాటు అది. పరిశోధకులు ఈ విషయమై సాగించిన అధ్యయనంలో ‘దళిత మహిళలకు చనిపోయిన మహిళల ఒంటిపైన ఉండే దుస్తులు ఇచ్చేవారు. కాన్పు సమయంలోని దుస్తులు ఇచ్చేవారు. వాటినే దళిత మహిళలు ధరించేవారు. శుభ్రమైన కొత్త బట్టలు ఇస్తే దళితులు కట్టుకోవడానికి సంశయించి పక్కన పడేసేవారు. వాటిని ఎప్పటికీ తొడుక్కునేవారు కాదు. అంతగా వారిని బట్టలకు దూరం ఉంచారు’ అని తెలియజేశారు.యూనిట్లో అందరూ ఏడ్చారు‘ఈ సన్నివేశం మాకు చెప్పేటప్పుడు ఆ కాలంలో ఆ స్త్రీల అనుభూతిని వివరించడానికి దర్శకుడు ప్రయత్నించాడు. కాని సన్నివేశంలో నటిస్తున్న స్త్రీలందరం ఒకే రకమైన ఉద్వేగంతో ఉన్నాం. రవిక తొడక్కుండా ఉండటం అంటే ఏమిటో తెలియని మేము ఆనాటి స్త్రీల వేదనను అర్థం చేసుకుని మొదటిసారి తొడుక్కున్నట్టు నటించాం. మొదటి, రెండవ టేకే ఓకే అయింది. మా నటన చూసి యూనిట్లో సభ్యులు సంతోషంతో కన్నీరు కార్చారు’ అంది నటి పార్వతి. ఆమె ఈ సినిమాలో విక్రమ్ భార్య గంగమ్మగా నటించింది. -
ముగిసిన ప్రధాని మోదీ ధ్యానం
సాక్షి, చెన్నై: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధ్యానం విరమించారు. తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారిలో వివేకానంద రాక్ మెమోరియల్ ధ్యాన మండపంలో గురువారం సాయంత్రం మొదలైన మోదీ ధ్యానం శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు ముగిసింది. ఆయన దాదాపు 45 గంటలపాటు ధ్యానంలో నిమగ్నమయ్యారు. రెండు రోజులపాటు కేవలం ద్రవాహారం తీసుకున్నారు. ధ్యానం ముగిసిన తర్వాత మోదీ రాక్ మెమోరియల్ నుంచి పడవలో అక్కడికి సమీపంలోని తమిళ కవి తిరువళ్లువర్ విగ్రహం కాంప్లెక్స్ వద్దకు చేరుకున్నారు. తిరవళ్లువర్ విగ్రహం వద్ద ఘనంగా నివాళులరి్పంచారు. అనంతరం తీరానికి చేరుకున్న మోదీ హెలికాప్టర్లో తిరువనంతపురం బయలుదేరివెళ్లారు. అక్కడి నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. మరోసారి ఎన్డీఏకే పట్టం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి మోదీ న్యూఢిల్లీ: కేంద్రంలో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టబోతున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. అవకాశవాద ‘ఇండియా’ కూటమిని ప్రజలు నమ్మలేదని పేర్కొన్నారు. విపక్ష కూటమి తిరోగమన రాజకీయాలను జనం తిరస్కరించారని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆఖరి విడత పోలింగ్ పూర్తయిన నేపథ్యంలో ప్రధాని మోదీ శనివారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. తమ ప్రభుత్వ ట్రాక్ రికార్డును ప్రజలు చూశారని, తమకు మళ్లీ అధికారం అప్పగించబోతున్నారని వెల్లడించారు. పేదలు, బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకొచ్చామని తెలిపారు. తమ ప్రభుత్వం అమలు చేసిన సంస్కరణలతో మన దేశం ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందన్నారు. మన ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రజల క్రియాశీల భాగస్వామ్యమే మూలస్తంభమని ఉద్ఘాటించారు. ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నవారికి ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేందుకు తోడ్పడిన భద్రతా దళాలకు సైతం ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. -
మోదీ ధ్యాన ముద్ర
సాక్షి, చెన్నై: కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్‌లో ధ్యానం చేస్తున్న ప్రధాని మోదీ శుక్రవారం సూర్యోదయ వేళ సూర్యునికి ఆర్ఘ్యం సమరి్పంచారు. కాషాయ వ్రస్తాలను ధరించిన ప్రధాని మోదీ జపమాల చేబూని, కమండలంలోని జలాన్ని సముద్రంలోకి వదులుతూ ప్రార్థన చేశారు. అనంతరం సర్వశక్తిమంతుడైన ఆ సూర్యభగవానునికి ముకుళిత హస్తాలతో నమస్కరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను, సంక్షిప్త వీడియోను బీజేపీ ‘ఎక్స్’లో షేర్ చేసింది. ధ్యాన మంటపంలో ప్రధాని ధ్యానంలో ఉన్న ఫొటోలను, జపమాలతో ధ్యాన మంటపం చుట్టూ ఆయన ప్రదక్షిణలు చేస్తున్న ఫొటోలను కూడా బీజేపీ విడుదల చేసింది. మే 30వ తేదీ సాయంత్రం మొదలైన మోదీ ధ్యానం జూన్ ఒకటో తేదీ సాయంత్రంతో ముగియాల్సి ఉంది. అయితే, ప్రధాని మోదీ పర్యటన కారణంగా వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద పర్యాటకులు ఇబ్బందులు పడ్డారని తమిళనాడు మంత్రి దురైమురుగన్ ఆరోపించారు. ఆ పరిసర ప్రాంతాల్లోకి ప్రజలతోపాటు ఓడలు, విమానాలను కూడా అనుమతించలేదని చెప్పారు. ‘ఎన్ని భంగిమలు! ఎంతమంది ఫొటోగ్రాఫర్లు! స్వామి వివేకానంద మౌనంగా ఉన్నారు’అంటూ తమిళనాడు కాంగ్రెస్ ప్రధాని మోదీ ధ్యానంపై వ్యాఖ్యానించింది. -
PM Modi: మోదీ ప్రచార సునామీ.. ఒక్క నెలలోనే 96 ప్రచార సభలు
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో మారథాన్ ఇన్నింగ్స్ ఆడారు ప్రధాని మోదీ. 400 ప్లస్ స్థానాలే లక్ష్యంగా.. సుడిగాలిలా రాష్ట్రాలను చుట్టేశారు. 75 రోజుల్లో 206 ర్యాలీల్లో పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లో అత్యధిక ర్యాలీలు నిర్వహించారు ప్రధాని మోదీ. బహిరంగ సభలు, రోడ్‌షోలతోపాటు వివిధ మీడియా సంస్థలకు 80 ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు.లోక్‌సభ ఎన్నికలు ముగింపు దశకు చేరుకున్నాయి. జూన్ 1న జరిగే చివరి విడత పోలింగ్ కౌంట్‌డౌన్ మొదలైంది. కేంద్రంలో హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీ.. ప్రచారంలోనూ అదే దూకుడు ప్రదర్శించింది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్రాలను చుట్టేశారు. ఒక్కో రోజు మూడు నుంచి ఐదు సభల్లో పాల్గొని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. మొత్తంగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత నుంచి ఈ రెండున్నర నెలల్లో దాదాపు 180 ర్యాలీలు నిర్వహించారు ప్రధాని.ప్రధాని చేపట్టిన ప్రచారాల్లో దాదాపు సగం ర్యాలీలు కేవలం నాలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. 80 మంది ఎంపీలను ఎన్నుకునే ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 31 సభలు నిర్వహించారు. దీదీ ఇలాకా పశ్చిమ బెంగాల్లో రికార్డుస్థాయిలో 22 ర్యాలీల్లో పాల్గొన్నారు. బుధవారం కూడా ఆయన బెంగాల్లో ప్రచారం చేపట్టారు. ఆ తర్వాత బిహార్‌పై దృష్టిపెట్టిన ప్రధాని.. ఆ రాష్ట్రంలో 20 ర్యాలీల్లో పాల్గొన్నారు. మహారాష్ట్రలో 19 ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. 2019తో పోలిస్తే మహరాష్ట్రలో ఈసారి రెట్టింపు స్థాయిలో ర్యాలీలు నిర్వహించారు మోదీ. మొత్తంగా ఈ నాలుగు రాష్ట్రాల్లో కలిపి 88 ర్యాలీలు చేపట్టినట్టు బీజేపీ వర్గాలు వెల్లడించాయి.2024 లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణాదిపైగా ప్రత్యేకంగా దృష్టిపెట్టారు ప్రధాని మోదీ. సౌత్‌లో బలం పెంచుకోవాలన్న లక్ష్యంతో.. ప్రచారంలోనూ ఆ దిశగా వ్యూహాలు అమలు చేసింది. దక్షిణ భారతంలోని ఐదు రాష్ట్రాల్లో ప్రధాని 35 ర్యాలీలు నిర్వహించారు. అత్యధికంగా కర్ణాటక, తెలంగాణలో 11, తమిళనాడులో 7 సార్లు ప్రచారం సాగించారు. కర్ణాటకలో గత ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు దక్కించుకుంది. ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో స్పెషల్ ఫోకస్ పెట్టింది బీజేపీ. అందుకే మోదీ సభలు పెంచింది.ఒడిశాలో నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజు జనతా దళ్‌తో పొత్తు కుదరకపోవడంతో.. ఆ రాష్ట్రంపైనా బీజేపీ గట్టిగానే ఫోకస్ పెట్టింది. అక్కడ మోదీ 10 సభలు నిర్వహించారు. జగన్నాథ సన్నిధి పూరీలో ఆయన చేపట్టిన భారీ రోడ్ షోకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. ఇక సొంత రాష్ట్రం గుజరాత్లో మోదీ 5 సభల్లో పాల్గొనగా.. మధ్యప్రదేశ్‌లో 10, జర్ఖండ్‌లో 7, రాజస్థాన్‌లో 5, ఛత్తీస్‌గఢ్‌లో 4, హరియాణాలో 3 ర్యాలీలు నిర్వహించారు ప్రధాని. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌తోపాటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ ప్రచారాల్లో పాల్గొన్నారు. కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్లోనూ ఓసారి పర్యటించిన ప్రధాని.. పలు జాతీయ, ప్రాంతీయ మీడియా సంస్థలకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూలిచ్చారు. 2024 ఎలక్షన్ సీజన్లో తన చివరి ప్రచారాన్ని పంజాబ్‌లో నిర్వహించారు ప్రధాని మోదీ. హోషియార్‌పుర్ బహిరంగ సభతో సార్వత్రిక ప్రచార పర్వానికి ముగింపు పలికి.. ధ్యాన ముద్రలోకి వెళ్లారు. -
కన్యాకుమారి చేరుకున్న ప్రధాని మోదీ.. 45 గంటలు ధ్యానంలోనే..
చెన్నై: ప్రధానమంత్రి నరేంద్రమోదీ తమిళనాడులోని తీర పట్టణం కన్యాకుమారి చేరుకున్నారు. అక్కడి ప్రసిద్ధ వివేకానంద రాక్ మెమోరియల్‌లో 45 గంటలపాటు సుదీర్ఘ ధ్యానం చేయనున్నారు. ముందుగా భగవతి అమ్మన్ ఆలయానికి వెళ్లి ప్రార్థనలు చేశారు మోదీ. ధోతీ తెల్లటి శాలువ ధరించిన ప్రధాని.. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు, మోదీకి పూజారులు ప్రత్యేక హారతి అందించారు. అలాగే ఓ శాలువ, అమ్మవారి ఫోటో, ప్రసాదాన్ని ప్రధానికి అందించారు.నేటి సాయంత్రంతో లోక్‌సభ ఎన్నికల ప్రచారం పూర్తిగా ముసిగింది. ర్యాలీలు పర్యటనలు, బహిరంగ సభలతో బిజీ బిజీగా గడిపిన ప్రధాని మోదీ కాస్త విశ్రాంతి తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే రెండు రోజులపాటు పూర్తిగా ధ్యానంలో మునిగిపోనున్నారు. మే 30 సాయంత్రం నుంచి జూన్ 1 సాయంత్రం వరకు దాదాపు 45 గంటల పాటు ఆయన ధ్యానం చేయనున్నారు. కాగా ఎన్నికల ప్రచారం ముగిశాక ప్రధాని మోదీ ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లడం ఇదేం తొలిసారి కాదు. 2019లో కేదార్‌నాథ్‌ను, 2014లో శివాజీ ప్రతాప్‌గఢ్‌ను సందర్శించారు.ప్రత్యేకత ఇదే..అయితే ఈ వివేకానంద రాక్ మెమొరియల్‌కు ఎంతో ప్రత్యేకత ఉంది. 132 ఏళ్ల క్రితం 1892 లో స్వామి వివేకానంద.. ఈ వివేకానంద రాక్ మెమొరియల్ ఉన్న ప్రాంతంలో ధ్యానం చేశారు. అందుకే ఆయనకు నివాళులు అర్పించేందుకు గుర్తుగా కన్యాకుమారిలో సముద్రంలో ఈ వివేకానంద రాక్ మెమొరియల్‌ను నిర్మించారు.ఇక ప్రధాని నరేంద్ర మోదీ 2 రోజుల పాటు కన్యాకుమారిలో ఉండనుండటంతో ఆ ప్రాంతంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. దాదాపు 2 వేల మంది పోలీసులను మోహరించారు. గురువారం సాయంత్రం నుంచి జూన్ 1 వ తేదీ వరకు కన్యాకుమారిలో మోదీ ఉండనున్నారు. ఈ క్రమంలోనే భారత తీర రక్షక దళం, భారత నావికాదళం గట్టి నిఘా ఉంచాలని కోరింది.ఇదిలా ఉండగా ఏప్రిల్ 19న ప్రారంభమైన లోక్‌సభ ఎన్నికలు ఏడు దశల్లో జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఆరు విడతల్లో ఎన్నికలు పూర్తి కాగా.. జూన్ ఒకటిన చివరి దశ ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ భావిస్తోంది. -
కోడ్ ఉల్లంఘనే
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ తలపెట్టిన 48 గంటల ధ్యానంపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. ఏడో విడత పోలింగ్ ముందు ప్రధానమంత్రి ధ్యానం చేయడం ముమ్మాటికీ ఎన్నికల నిబంధనావళిని ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొంది. తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ ధ్యాన మండపంలో గురువారం నుంచి రెండు రోజులపాటు మోదీ ధ్యానం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని టీవీ మీడియాలో ప్రసారం చేయకుండా, ప్రింట్ మీడియాలో ప్రచురించకుండా చర్యలు తీసుకోవాలని బుధవారం ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ నేతలు రణదీప్ సూర్జేవాలా, అభిõÙక్ సింఘ్వీ, సయీద్ నజీర్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు. -
ప్రచారం ముగిశాక కన్యాకుమారికి ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే ప్రధాని మోదీ తమిళనాడులోని కన్యాకుమారి వెళ్లనున్నారు. జూన్ 1న జరగనున్న ఏడవ, తుది విడత ఎన్నికల ప్రచారానికి మే 30వ తేదీ సాయంత్రంతో గడువు ముగుస్తుంది.ప్రచారం ముగించుకుని 30న ప్రధాని కన్యాకుమారి చేరుకుంటారు. జూన్ 1 వరకు 3 రోజుల పాటు ఆయన కన్యాకుమారిలోనే ఉంటారు. ఈ పర్యటనలో భాగంగా సముద్రం ఒడ్డున ఉన్న వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద ప్రధాని ధ్యానం చేయనున్నారు. ఇదే స్థలంలో స్వామి వివేకానంద ఒకప్పుడు మూడు రోజులపాటు ధ్యానం చేశారు.ఈ పర్యటనలో ప్రధాని కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలకే సమయం కేటాయించనున్నారు. ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొనరు. 2019లోనూప్రధాని ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత కేదార్‌నాథ్‌కు ధ్యానం చేసేందుకు వెళ్లారు. -
స్కేట్‌బోర్డ్‌పై మనాలి టు కన్యాకుమారి
‘మనాలి నుంచి కన్యాకుమారికి ఎలా వెళతాం?’ అనే ప్రశ్నకు ‘స్కేట్‌బోర్డ్ మీద’ అని ఎవరూ చెప్పరు. ‘మీరు చెప్పకపోతేనేం... నేనైతే స్కేట్‌బోర్డ్ మీదే వెళ్లాను’ అంటున్నాడు రితిక్. ప్రెషనల్ స్కేట్ బోర్డర్ అయిన రితిక్ క్రాడ్జెల్ మనాలి నుంచి కన్యాకుమారికి స్కేట్‌బోర్డ్ మీద వెళ్లాడు. ఈ ప్రయాణానికి సంబంధించిన వీడియోలు నెట్లోకాన్ని అబ్బురపరుస్తున్నాయి. చిన్న బ్యాక్‌ప్యాక్‌తో బయలుదేరిన రితిక్ 100 రోజుల్లో తన ప్రయాణాన్ని పూర్తి చేశాడు. రీల్స్, వీడియోలలో తనకు ఎదురైన అనుభవాలను నెటిజనులతో పంచుకున్నాడు. గూగుల్ మ్యాప్స్ పనిచేయకపోవడం నుంచి దట్టమైన ΄పొగమంచుతో హైవేల జీరో విజిబిలిటీ వరకు రితిక్‌కు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. ఎన్ని సవాళ్లు ఎదురైనా ముందుకే వెళ్లాడు. రితిక్ సాహసం, ఓపికకు నెటిజనులు ప్రశంసల వర్షం కురిపించారు. -
ముత్తు నందిని ప్యాలెస్ ఇష్టాల ఇల్లు
రాజ్ చందర్ పద్మనాభన్, నాగ జయలక్ష్మి దంపతులు తమిళనాడు రాష్ట్రం, కన్యాకుమారిలో నివసించేవారు. సొంత ఇంటి కలను నెరవేర్చుకునే క్రమంలో వీరు అనుసరించిన విధానం ఇప్పుడు దేశమంతటినీ ఆకర్షిస్తోంది. పర్యావరణ ప్రేమికులనైతే మరీ ఎక్కువగా ఆకట్టుకుంటోంది. రెండేళ్ల కిందట గృహప్రవేశం చేసుకున్న కొత్త ఇల్లది. అయితే ఆ ఇంట్లో అడుగుపెడితే కాలం గిర్రున సినిమా రీల్‌లాగ వందేళ్ల వెనక్కి తిరిగిపోయిందా అనిపిస్తుంది. ఇంటిని చూడడానికి వచ్చిన వాళ్లను అతిథి మర్యాదలతో ముంచెత్తుతారు ఈ దంపతులు. సేంద్రియ పద్ధతిలో పండించిన దినుసులు, కాయగూరలతో సంప్రదాయ తమిళ, చెట్టినాడు వంటలను వడ్డిస్తారు. ఎర్రమట్టి, సున్నపు రాయితో నిర్మించిన ఇంట్లో భూగర్భ జలాలను పరిరక్షించే ఏర్పాటు ఉంది. బంకమట్టి నిర్మాణం కావడంతో ఎండాకాలం చల్లగా ఉంటుంది. నేచర్ ఫ్రెండ్లీ ట్రావెల్‌ను ఇష్టపడే వాళ్లు ఇక్కడ బస చేస్తుంటారు. బస చేయకపోయినా చూసి పోవడానికి వచ్చేవాళ్లు కూడా ఎక్కువగానే ఉంటారు. ఈ కాలంలో ఇంటిని ఇలా ఎందుకు కట్టుకున్నారనే ప్రశ్న దాదాపుగా ప్రతి ఒక్కరి నుంచి ఎదురవుతుంటుంది. జయలక్ష్మి ప్రతి ఒక్కరికీ పూసగుచ్చినట్లు వివరిస్తుంటుంది. బాల్యంలోకి వెళ్లారాయన! ‘‘రాజ్‌చందర్ వృత్తిరీత్యా జియో డాటా అనలిస్ట్. ఆయనకు ఇష్టమైన రోజులంటే చిన్నప్పుడు వాళ్ల అమ్మమ్మ గారింట్లో గడిపిన బాల్యమే. పైగా రాజ్ అభిరుచి, విధి నిర్వహణ కూడా పర్యావరణవేత్తలతో కలిసి పని చేయడమే. ఈ రెండు ఇష్టాలను కలుపుతూ చక్కటి ఇల్లు కట్టుకోవాలని ఎప్పుడూ చెప్పేవారు. నాక్కూడా మా సంప్రదాయ నిర్మాణంలో ఉండే సౌందర్యం చాలా ఇష్టం. ఇద్దరి అభిరుచులూ కలవడంతో ఇంటిని ఇలా కట్టుకున్నాం. మా ఇద్దరి ఇష్టాల మేరకు ఎలా కట్టుకోవాలో ఒక ఐడియా వచ్చేసింది. ఎక్కడ కట్టాలనే విషయంలో ఒక అభిప్రాయానికి రావడం కొంచెం కష్టమే అయింది. లొకేషన్ సెర్చింగ్ మొదలు పెట్టాం. సంజీవని శకలం కన్యాకుమారికి సమీపంలో పోథయాడి గ్రామాన్ని చూసినప్పుడు కొండలు, పచ్చటి చెట్లతో ప్రదేశం బాగుందనిపించింది. ఆశ్చర్యంగా మరో విషయం తెలిసింది. అదేంటంటే... రామాయణంలో లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు వైద్యం కోసం హనుమంతుడు ఏకంగా సంజీవని మొక్క ఉన్న పర్వతం అంతటినీ ఎత్తుకొచ్చాడని విన్నాం. వైద్యం చేసిన తర్వాత ఆ పర్వతాన్ని తిరిగి తీసుకెళ్లే క్రమంలో పర్వతంలోని ఒక శకలం విరిగి కింద పడి పోయిందని, ఆ శకలమే ఈ కొండ అని చె΄్పారు స్థానికులు. వాళ్ల విశ్వాసాన్ని పక్కన పెడితే ఆ కొండమీద చుట్టు పక్కల ఉన్న మొక్కలన్నీ ఔషధ మొక్కలే. ప్రకృతితో మమేకమై నివసించడానికి మాకు ఇంతకంటే సౌకర్యవంతమైన ప్రదేశం మరోటి ఉండదేమో అనిపించింది. అంతే... 2021లో నిర్మాణం మొదలు పెట్టాం. ఒక ఏడాదిలో తమిళ, వేనాడు, చెట్టినాడు సంస్కృతుల సమ్మేళనమైన మా ఇంటి నిర్మాణం పూర్తయింది. సంప్రదాయ కళాకృతుల సేకరణ నా హాబీ. ఇంటిని తమిళ సంప్రదాయ సంస్కృతికి ప్రతీకగా మలిచాను. ఇంటి ముఖద్వారం నుంచి నేల, గోడ, మెట్లు, పై కప్పు, అలంకరణ వస్తువులు ప్రతి ఒక్కటీ తమ వైభవాన్ని తామే చెప్పుకుంటాయి. పర్యావరణ హితమైన సున్నపు పోడి ఇటుకలు, ఎర్ర మట్టి, ఆవుపేడ, ధాన్యం పోట్టు, కోడిగుడ్లు, బెల్లంతోపాటు అత్తంగుడి నది తీరాన దొరికే ఇసుకతో తయారు చేసే అత్తంగుడి టైల్స్‌ను వాడాం. పై కప్పుకి కాంక్రీట్ వాడకాన్ని తగ్గించి ఫిల్లర్ స్లాబ్ టెక్నిక్ ఉపయోగించాం. వర్షపు నీటిని నిల్వ చేయడానికి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్, కరెంటుకోసం సోలార్ ప్యానెల్స్ పెట్టాం. ఈ మట్టి సౌధంలో 5బెడ్ రూమ్‌లు, మూడు బాల్కనీలు, మూడు లివింగ్ స్పేస్‌లు ఉన్నాయి. ఇప్పటివరకు రెండు వందల మందికి పైగా పర్యాటకులు ఈ హోమ్ స్టేలో బస చేశారు. ఆహారం కూడా తమిళనాటప్రాంంతాల వారీగా విలసిల్లిన విభిన్నమైన రుచులుంటాయి. ఇంటి ఆవరణలో అన్ని రకాల కూరగాయలనూ పండిస్తాం. వంటగదిలో వచ్చే వ్యర్థాలనే ఎరువుగా వేస్తాం’’ అని తమ పర్యావరణ హిత భవనం ముత్తు నందిని ప్యాలెస్ గురించి వివరించింది జయలక్ష్మి. -
సైక్లింగ్‌తో స్ఫూర్తి నింపుతూ...
సాక్షి, వరంగల్: ఆరోగ్యాన్ని మించిన మహాభాగ్యం లేదని అందరూ అంటారు. కానీ కొందరు మాత్రమే ఆరోగ్యంకోసం తపిస్తారు. ఆదాయం వేటలోపడి ఆరోగ్యాన్ని మరచిపోతారు. అయితే యుక్త వయసులోనే రంజిత్ కుమార్ దవేరాకు ఆరోగ్యం ఎంత విలువైనదో తెలియజెప్పింది కరోనా... మార్చిన మహమ్మారి... కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో ఆ మహమ్మారి బారిన పడిన నాన్న రాములే కాదు...కళ్లెదుటే ఎంతో మంది చనిపోవడం వరంగల్ గిర్మాజీపేటకు చెందిన ఈ డీఫార్మసీ గ్రాడ్యుయేట్‌ను కదిలించింది. సరైన శారీరక శ్రమ లేక వ్యాధినిరోధకత కోల్పోయి ఈ మహమ్మారికి బలయ్యారని ఆయనకు అవగతమైంది. దీంతో ప్రతిఒక్కరిలో ఆరోగ్యంగా ఫిట్‌గా ఉండాలన్న ఆలోచన కలిగించడమే లక్ష్యంగా సైక్లింగ్ వైపు రంజిత్ అడుగులు పడ్డాయి. అలా 2021 ఏప్రిల్ 5న మొదలైన ‘రంజిత్ ఆన్ వీల్స్’సైక్లింగ్....దశలవారీగా రాష్ట్రాలు దాటింది. ఇప్పుడు ఏకంగా ఖండాంతరాలు దాటింది. ఏ ఉద్దేశంతో ఈ సైక్లింగ్ మొదలెట్టాడో... ఇప్పుడు అదీ కార్యాచరణ రూపంలో కనిపించడం ఎంతో సంతృప్తిగా ఉందని అంటున్నాడు రంజిత్. దాదాపు 500 మంది వరకు తనను చూసి స్ఫూర్తి పొందారని మలేసియాలో సైక్లింగ్ కొనసాగిస్తున్న రంజిత్ ‘సాక్షి’కి తెలిపారు. తనను ఆగస్టు 15న మలేసియా ఇండియన్ హైకమిషన్ సత్కరించడం సంతోషం కలిగించిందన్నాడు. అలా మొదలైంది... 2021 ఏప్రిల్ ఐదున హైదరాబాద్ నుంచి కన్యాకుమారి వరకు మొదలైన సైక్లింగ్...దాదాపు 3,000 కిలోమీటర్లు తిరిగి హైదరాబాద్‌లోనే జూన్ 14న ముగిసింది. మళ్లీ జూలై 17న ప్రారంభించి హైదరాబాద్ నుంచి లడఖ్ వరకు సైక్లింగ్ చేశాడు. ఇది కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూకశ్మీర్, లదాఖ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల మీదుగా తిరిగి అక్టోబర్ 22న హైదరాబాద్‌లో ముగిసింది. ఈ సమయంలోనే రంజిత్ సినీ హీరో సోనూసూద్‌ను కలిశాడు. ఆ తరువాత హైదరాబాద్ నుంచి చైనా సరిహద్దు వరకు పెంపుడు శునకం భగీరతో కలిసి రంజిత్ సైక్లింగ్ చేశాడు. విజయవాడ, విశాఖపట్నం, భువనేశ్వర్, కోల్‌కతా, అస్సాం, మేఘాలయ, అరుణాచల్‌ప్రదేశ్,అస్సాం, వెస్ట్‌బెంగాల్, సిక్కింల నుంచి నథులాపాస్‌లో చైనా బార్డర్ వరకు వెళ్లాడు. గత 2022 ఫిబ్రవరి 8న మొదలైన ఈ ఆరువేల కిలోమీటర్ల యాత్ర జూలై 25న ముగిసింది. ఆ్రస్టేలియా వైపుగా... హైదరాబాద్ నుంచి వియత్నాంకు రోడ్డు మార్గాన వెళ్లే అవకాశం లేకపోవడంతో 2023 మే ఐదున శంషాబాద్ విమానాశ్రయంలో సైకిల్ ప్యాక్ చేసుకొని వియత్నాం వెళ్లాడు. అక్కడ హానోయ్ సిటీ నుంచి హోచి మిన్హ్ వరకు దాదాపు మూడు వేల కిలోమీటర్లు సైక్లింగ్ చేసి, ఆ తర్వాత కాంబోడియాలోకి ప్రవేశించి 900 కిలోమీటర్లు, థాయ్‌లాండ్‌లో 2,200 కిలోమీటర్లు, మలేసియాలో 400 కిలోమీటర్లు దాటి ప్రస్తుతం కౌలంలంపూర్‌కు చేరుకున్నాడు. ఆ తర్వాత సింగపూర్, ఇండోనేసియా, జకార్తాకు, అక్కడి నుంచి ఆ్రస్టేలియాకు విమానం ద్వారా చేరుకొని సైక్లింగ్ పూర్తి చేస్తాడు రంజిత్. 2021 ఏప్రిల్ ఐదు నుంచి ఇప్పటివరకు 22 వేల కిలోమీటర్ల మార్క్ చేరుకున్నాడు. ఆసియా, ఆ్రస్టేలియా, ఆఫ్రికా, అమెరికా, యూరప్ ఖండాల్లో సైక్లింగ్ చేసే దిశగా ముందుకు వెళుతున్నానని వెల్లడించాడు. సోషల్ మీడియాతో మరింత క్రేజ్ సైక్లింగ్ చేస్తున్న సమయంలో రంజిత్ తీస్తున్న వీడియోలు, ఫొటోలు తనకు సామాజిక మాధ్యమాల్లో లక్షలాది మంది ఫాలోవర్స్‌ను తెస్తున్నాయి. ‘రంజిత్ ఆన్ వీల్స్’ఫేస్బుక్ పేజీలో 40,000 మంది, ఇన్‌స్టాగ్రామ్‌లో 3,15,000 మంది, యూట్యూబ్‌లో రెండు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇలా సైక్లింగ్ చేస్తూనే...ఇంకోవైపు సామాజిక మాధ్యమాల ద్వారా కూడా రంజిత్ ఎంతో మందిని చైతన్యవంతం చేస్తున్నారు. -
కన్యాకుమారి ట్రైన్లో మంటలు
బరంపురం: గంజాం జిల్లా బరంపురం దగ్గర కన్యాకుమారి నుంచి పశ్చిమ బెంగాల్ వేళ్లే సూపర్ ఫాస్ట్ రైలులో మంటలు చెలరేగాయి. ఈస్ట్–కోస్ట్ రైల్వే అధికారులు మరియు బరంపురం సబ్ కలెక్టర్ అశుతోష్ కులకర్ణి తెలిపిన వివరాల మేరకు.. మంగళవారం మధ్యాహ్నం కన్యాకుమారి నుంచి పశ్చిమ బెంగాల్ వెళ్తున్న సూపర్ ఫాస్ట్ రైలు 10వ నంబర్ బోగీలో హటాత్తుగా మంటలు వచ్చాయి. అయితే ఆ సమయంలో లోకో ఫైలెట్ అప్రమత్తమై బండిని వెంటనే స్టేషన్ ఔటర్లో నిలిపివేశారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని ప్రయాణికులను దించి, మంటలను అదుపు చేశారు. అనంతరం బండి యథావిధిగా బయల్దేరింది. ఈ ఘటనతో పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి. -
జోజిలా భారీ గేమ్ ఛేంజర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కశ్మీర్‌ను కన్యాకుమారితో అనుసంధానం చేయాలనే కలను సాధించడంలో జోజిలా టన్నెల్‌కీలకపాత్ర పోషిస్తుందని కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ తెలిపారు. ‘ఈ ప్రాజెక్ట్ ఇండియాలో భారీ గేమ్ ఛేంజర్కాబోతోంది. కశ్మీర్ లోయ, లడఖ్ మధ్య సంవత్సరం పొడవునా కనెక్టివిటీని అందిస్తుంది. క్లిష్ట వాతావరణ పరిస్థితుల్లో పనులు కొనసాగిస్తున్న ఇంజినీర్లు, కాంట్రాక్టర్లకు నా అభినందనలు. ఎముకల కొరికే చలిలో కూడా వారు పనులను కొనసాగిస్తున్నారు. టన్నెల్లో దాదాపు 38 శాతం పనులు పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్ట్పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తుంది. దీనివల్ల ఉపాధి పెరుగుతుంది. ఇక్కడ రిసార్ట్స్, అడ్వెంచర్ స్పోర్ట్ వంటివి నిర్మిస్తూ.. కశ్మీర్‌ను మరో స్విట్జర్లాండ్‌లా తీర్చిదిద్దుతాం’ అని అన్నారు. మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) నిర్మిస్తున్న జోజిలా టన్నెల్‌నిర్మాణ పనుల పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. పనుల పురోగతిని సోమవారం పరిశీలించారు. ఎంఈఐఎల్ డైరెక్టర్ సి.హెచ్.సుబ్బయ్య, జోజిలా ప్రాజెక్ట్ హెడ్ హర్పాల్ సింగ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ఇచ్చారు. కశ్మీర్ లోయ, లడఖ్ ప్రాంతం మధ్య అన్ని వాతావరణాలకు అనువుగా ఉండేలా వ్యూహాత్మకంగా జాతీయ రహదారిపై 11,578 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్న సొరంగం పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఈ సందర్భంగా మంత్రికి తెలిపారు. 2026 డిసెంబరు నాటికి ప్రాజెక్టును పూర్తి చేసే యోచనలో ఉన్నామని వెల్లడించారు. -
భారత్ జోడో యాత్ర: రాహుల్ ఓకే అంటే పెళ్లికి రెడీ!
చెన్నై: కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతంగా ముందుకు సాగుతోంది. మూడో రోజు యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ శనివారం తమిళనాడు కన్యాకుమారిలోని మార్తాండం చేరుకున్నారు. ఇక్కడ మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం మహిళా కార్యకర్తలు ఆయనతో ముచ్చటించారు. ఈ సమయంలో రాహుల్ పెళ్లి ప్రస్తావన కూడా వచ్చింది. ఓ మహిళ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీకి తమిళనాడు అంటే ఎంత ప్రేమో మాకు తెలుసు. అందుకే ఆయన పెళ్లి చేసుకునేందుకు ఓ తమిళ అమ్మాయిని చూసిపెడతాం అని అంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. భారత్ జోడో యాత్రలో ఇది వినోదాత్మకమైన క్షణం అన్నారు. పెళ్లి ప్రస్తావన రాగానే రాహుల్ గాంధీ ఎలా నవ్వుతున్నారో చూడండి అని ఓ ఫోటో కూడా షేర్ చేశారు. A hilarious moment from day 3 of #BharatJodoYatra During @RahulGandhi’s interaction with women MGNREGA workers in Marthandam this afternoon, one lady said they know RG loved Tamil Nadu & they’re ready to get him married to a Tamil girl! RG looks most amused & the photo shows it! pic.twitter.com/0buo0gv7KH — Jairam Ramesh (@Jairam_Ramesh) September 10, 2022 దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం సహా ఇతర సమస్యలకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను బుధవారం కన్యాకుమారిలో ప్రారంభించారు. ఈ యాత్ర 150 రోజుల పాటు 3వేలకు పైగా కీలోమీటర్లు సాగనుంది. కశ్మీర్లో ముగుస్తుంది. ప్రస్తుతం కేరళలో కొనసాగుతోంది. చదవండి: కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది.. సోనియాకు షాకిచ్చిన ఐదుగురు ఎంపీలు! -
విలేజ్ కుకింగ్ ఛానెల్‌తో మరోసారి..
కన్యాకుమారి: విలేజ్ కుకింగ్ ఛానెల్.. యూట్యూబ్‌లో వంట వీడియోలను చూసేవాళ్లకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని ఛానెల్. ప్రకృతి ఒడిలో పచ్చటి పొలాల నడుమ.. సహజసిద్ధమైన వాటితోనే సంప్రదాయరీతిలో వంటలు చేస్తూ, ఆ రుచుల్ని వాళ్లు మాత్రమే ఆస్వాదించడమే కాకుండా.. వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలకు వడ్డిస్తూ దేశవ్యాప్తంగా పాపులర్ అయిన ఒక తమిళ కుకింగ్ ఛానెల్. తాజాగా ఈ ఛానెల్ సభ్యులు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని కలిశారు. కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్రలో భాగంగా పాదయాత్ర చేస్తున్న రాహుల్ గాంధీని శుక్రవారం ఈ ఛానెల్ సభ్యులు కలుసుకున్నారు. వాళ్లను ఆప్యాయంగా పలకరించిన రాహుల్ గాంధీ.. కాసేపు ముచ్చటించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ యాత్రకు విలేజ్ కుకింగ్ ఛానెల్ సభ్యులు మద్దతు ప్రకటించారు. అయితే.. Shri @RahulGandhi meets the members of the Village cooking channel during the yatra. The village cooking channel is having - 17.9 M subscribers.#BharatJodoYatra#villagecookingchannel pic.twitter.com/fjlBuxQPWA — Arjunreddy Thodigala (@AThodigala) September 9, 2022 ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. విలేజ్ కుకింగ్ ఛానెల్‌కు పాన్ ఇండియా గుర్తింపు దక్కింది ఇంతకు ముందు రాహుల్ గాంధీని కలిసిన తర్వాతే. గతంలో ఈ కుకింగ్ ఛానెల్ వీడియోలో మష్రూమ్ బిర్యానీ సెషన్లో పాల్గొన్నారు రాహుల్. అప్పటిదాకా సౌత్‌కు మాత్రమే పరిమితమైన వీళ్ల ఫేమ్.. రాహుల్ పాల్గొనడంతో నార్త్‌కు సైతం పాకింది. విలేజ్ కుకింగ్ ఛానెల్‌ను కేటరింగ్ చేసి ఆపేసిన పెరియాతంబీ అనే పెద్దాయన తన మనవళ్ల సాయంతో 2018లో సరదాగా ప్రారంభించారు. టైంపాస్‌గా ప్రారంభించిన ఈ ఛానెల్.. తక్కువ టైంలో, అందునా కరోనా టైంలో బాగా పాపులర్ అయ్యింది. అరుస్తూ చేసే గోలతో ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. తమిళనాడులో 10 మిలియన్ల సబ్‌స్క్రయిబర్స్ పూర్తి చేసుకున్న తొలి యూట్యూబ్ ఛానెల్ ఇదే కావడం గమనార్హం. ఈ బృందం ఈ మధ్యే లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో కమల్ హాసన్ లీడ్ రోల్ చేసిన ‘విక్రమ్’ సినిమాలోనూ ఓ సీక్వెన్స్‌లో సందడి చేసింది. ప్రస్తుతం ఈ ఛానెల్‌కు 18 మిలియన్ల సబ్స్క్రయిబర్స్పైనే ఉన్నారు. ఎల్లారుం వాంగా.. ఆల్వేస్ వెల్కమ్స్ యూ అంటూ అంటూ వాళ్లు ఆహ్వానించే విధానం గత నాలుగేళ్ల నుంచి ప్రధానంగా ఆకట్టుకుంటోంది కూడా. ఇదీ చదవండి: మోదీ సూట్ Vs రాహుల్ టీ షర్ట్ -
పెళ్లిపీటలు ఎక్కాల్సిన వధువు.. స్నానానికి వెళ్లి తిరిగి రాకపోవడంతో..
సాక్షి, చెన్నై: కన్యాకుమారి జిల్లా ఇరానియల్ సమీపంలోని బ్లాక్ కోడ్ పొట్రారై కాలనీకి చెందిన సుకుమార్ (63) కుమార్తె గాయత్రీదేవి (23) బెంగళూరులో ఉన్న ఒక ఐఏఎస్ అకాడమీలో చదువుతోంది. ఈ క్రమంలో తల్లిదండ్రులు గాయత్రీదేవికి ఇదే ప్రాంతానికి చెందిన ఒక యువకుడితో వివాహం నిశ్చయించారు. గురువారం ఉదయం వివాహం జరగాల్సి ఉండగా ఇరు కుటుంబాల వారు బుధవారం ఉదయం వధువు ఇంటికి చేరుకున్నారు. స్నానానికి ఇంటిపైకి వెళ్లిన గాయత్రీదేవి ఎంతసేపటికీ రాకపోవడంతో సందేహపడిన బంధువులు తలుపు తట్టారు. ఎంతకీ తీయకపోవడంతో తలుపులు పగులగొట్టి చూడగా ఫ్యాన్‌కు ఉరి వేసుకుని శవమై వేలాడుతూ కనిపించింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అప్పటికే గాయత్రీదేవి మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. ఆత్మహత్యకు కారణం ఏమిటనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. చదవండి: తల్లి రుణం తీర్చుకోవడానికి ఓ తనయుడి కష్టాలు ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
టీఆర్ఎస్ పొత్తుపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అధికార టీఆర్ఎస్-ప్రతిపక్ష కాంగ్రెస్‌ల మధ్య పొత్తు ఉండనుందా? అనే ఆసక్తికరమైన చర్చ తెర మీదకు వచ్చింది. కాంగ్రెస్ సీనియర్ దిగ్విజయ్ సింగ్ ఈమధ్య ‘కేసీఆర్ తమతో కలవచ్చుగా..’ అంటూ చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. ఈ తరుణంలో తెలంగాణలో కాంగ్రెస్-టీఆర్ఎస్ పొత్తులపై టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్‌రెడ్డి తేల్చేశారు. కలలో కూడా టీఆర్ఎస్తో పొత్తు సాధ్యం కాదని తేల్చేశారు ఆయన. కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్న పార్టీ కీలక నేత, ఎంపీ రాహుల్ గాంధీని.. గురువారం మధ్యాహ్నాం లంచ్ బ్రేక్‌లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా.. రేవంత్ రెడ్డి మీడియాతో పొత్తు అంశంపై కీలక వ్యాఖ్యలే చేశారు. ‘‘టీఆర్ఎస్తో పొత్తు ఉండదని వరంగల్ సభలో రాహుల్ గాంధీ తేల్చి చెప్పారు. తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ జాడ లేకుండా చేసేందుకే కేసీఆర్.. బీజేపీని ప్రోత్సహించారు. ఇప్పుడు అదే బీజేపీ.. కేసీఆర్ పాలిట శాపంగా మారింది.. సమస్యలు సృష్టిస్తోంది. ఎనిమిదేళ్ల కేసీఆర్ పాలనపై యుద్ధం చేసి తీరతాం. అంతేగానీ.. టీఆర్ఎస్ పాపాలను మోసేందుకు మాత్రం కాంగ్రెస్ సిద్ధంగా లేదన్నారు రేవంత్ రెడ్డి. అలాగే.. బీజేపీపైనా విమర్శలు గుప్పించిన ఆయన.. తెలంగాణ బీజేపీలో గెలిచేంత మొనగాళ్లు ఎవరున్నారని? ప్రశ్నిస్తూ.. ఆయన కనీసం 10 మంది కూడా గెలవలేరని జోస్యం చెప్పారు. ఇక రాహుల్ గాంధీతో భేటీ అయితే రేవంత్ రెడ్డి.. తెలంగాణలో బారత్ జోడో యాత్ర పైన చర్చించినట్లుగా తెలుస్తోంది. రాహుల్ యాత్రను మునుగోడు మీదుగా జరిగేలా చూడడంతో పాటు అక్కడే ఓ బహిరంగ సభ ఏర్పాటు చేయాలన్నది కాంగ్రెస్ ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది. ఇదీ చదవండి: మాతో టచ్‌లో 10 మంది ఎమ్మెల్యేలు.. బాంబు పేల్చిన ప్రతిపక్షం -
Bharat Jodo Yatra: యాత్ర మొదలైంది
సాక్షి, చెన్నై: బీజేపీ, ఆరెస్సెస్ దేశాన్ని పథకం ప్రకారం మతం, భాష పేరిట నిలువునా విభజిస్తున్నాయంటూ కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ దుయ్యబట్టారు. ‘‘అన్ని మతాలకు, ప్రాంతాలకు, రాష్ట్రాలకు సొంతమైన త్రివర్ణ పతాకాన్ని తమ సొంత ఆస్తిగా బీజేపీ, ఆరెస్సెస్ భావిస్తున్నాయి. దేశంలో మోదీ సర్కారు దాడికి గురవని వ్యవస్థ, సంస్థ అంటూ లేవు. బీజేపీ అసమర్థ పాలన వల్ల దేశం ఎన్నడూ లేనంతటి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. నిరుద్యోగిత ఎన్నడూ లేనంతగా పెరిగిపోయింది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు, త్రివర్ణ స్ఫూర్తిని కాపాడుకునేందుకు పౌరులంతా కలిసి రావాలి’’ అంటూ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ భారత్ జోడో పాదయాత్రను బుధవారం తమిళనాడులోని కన్యాకుమారిలో ఆయన త్రివర్ణ పతాకాన్ని ఊపి లాంఛనంగా ప్రారంభించారు. సముద్ర తీరంలో దివంగత సీఎం కె.కామరాజ్ స్మారక మందిరం దాకా పాదయాత్ర చేశారు. అనంతరం పార్టీ నేతలను, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘దేశ సమైక్యత కోసం తక్షణం చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని కోట్లాది మంది పౌరులు భావిస్తున్నారు. అందుకే ఈ యాత్ర’’ అని ప్రకటించారు. ‘‘మోదీ సర్కారు అచ్చం బ్రిటిష్ పాలకుల్లా విభజించి పాలించు సూత్రాన్నే అమలు చేస్తోంది. రైతులు, ఉద్యోగులు, కార్మికులు, వ్యాపారులు... ఇలా ప్రతి వర్గాన్నీ పథకం ప్రకారం పీడిస్తోంది. వారిని కొట్టి ఒకరిద్దరు బడా బాబులకు దేశాన్ని దోచిపెడుతోంది. వారు లేకుండా మోదీ ఒక్క రోజు కూడా రాజకీయంగా మనలేరు. అప్పట్లో ఈస్టిండియా కంపెనీ దేశాన్ని నియంత్రించేది. ఇప్పుడు దేశాన్ని ఓ మూణ్నాలుగు బడా కంపెనీల నియంత్రణలోకి బీజేపీ సర్కారు నెట్టింది. దీనిపై ప్రశ్నించకుండా మీడియాను అణగదొక్కుతోంది. విపక్షాలు నిలదీయకుండా ఈడీ, సీబీఐ, ఐటీ వంటి సంస్థల ద్వారా భయపెట్టజూస్తోంది. కానీ ఎంత వేధించినా ఒక్క విపక్ష నాయకుడూ భయపడబోడు. ఈ త్రివర్ణం మనకు అంత తేలిగ్గా లభించలేదు. కానుకగానూ రాలేదు. ప్రాణాలకు తెగించి పోరాడి సాధించుకున్నది. అలాంటి జాతీయ పతాకమే ఇప్పుడు ఆరెస్సెస్, బీజేపీ కాషాయీకరణ తాలూకు ముట్టడిలో ఉంది’’ అన్నారు. 12 రాష్ట్రాలు, 150 రోజులు, 3,570 కి.మీ. కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా సాగే భారత్ జోడో యాత్రకు రాహుల్ సారథ్యం వహించనున్నారు. 119 మంది కాంగ్రెస్ నేతలు ఆయనతో పాటు కలిసి నడుస్తారు. 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల గుండా 3,570 కిలోమీటర్ల దూరం 150 రోజుల పాటు యాత్ర సాగుతుంది. దీన్ని స్వతంత్ర భారతదేశంలో ఒక రాజకీయ పార్టీ తలపెట్టిన అత్యంత సుదీర్ఘ యాత్రగా కాంగ్రెస్ అభివర్ణిస్తోంది. డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ రాహుల్ చేతికి జాతీయ పతాకాన్ని అందించారు. కన్యాకుమారిలోని గాంధీ స్మారకం వద్ద రాహుల్‌కు ఆయన స్వాగతం పలికారు. సామూహిక ప్రార్థనల అనంతరం ప్రఖ్యాత వివేకానంద శిలా స్మారకాన్ని రాహుల్ సందర్శించారు. గాంధీ స్మారక మండపంలో ధ్యానం చేశారు. రఘుపతి రాఘవ రాజారాంతో పాటు తమిళ మహాకవి సుబ్రమణ్య భారతి రచించిన పలు దేశభక్తి గీతాల ఆలాపన నడుమ యాత్రను ప్రారంభించారు. ‘‘దేశ సమగ్రతకు, సమైక్యతకు, వైవిధ్యానికి, ఆత్మగౌరవానికి చిహ్నమైన త్రివర్ణాన్ని చేబట్టి భారత్ జోడో యాత్రలో ఈ రోజు తొలి అడుగు వేస్తున్నాం. నడవాల్సిన దూరం ఎంతో ఉంది. అంతా కలిసి దేశాన్ని మరోసారి సమైక్యం చేద్దాం రండి’’ అంటూ ట్వీట్ చేశారు. చరిత్రాత్మక సందర్భం: సోనియా భారత్ జోడోయాత్రను చరిత్రాత్మక సందర్భంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అభివర్ణించారు. పార్టీ పునరుజ్జీవానికి ఇది దోహదపడుతుందని ఆశాభావం వెలిబుచ్చారు. ఇది దేశ రాజకీయాలను కూడా మేలిమలుపు తిప్పే సందర్భమన్నారు. ‘‘వైద్య పరీక్షల నిమిత్తం విదేశాల్లో ఉన్నందున యాత్రలో పాల్గొనలేకపోతున్నా. కానీ మానసికంగా యాత్రలో ప్రతి రోజూ పాల్గొంటూనే ఉంటా’’ అంటూ ఆమె సందేశం పంపారు. రాజీవ్‌కు నివాళులు యాత్ర ప్రారంభానికి ముందు శ్రీపెరంబుదూరులో దివంగత ప్రధాని, తన తండ్రి రాజీవ్‌గాంధీకి రాహుల్ ఘనంగా నివాళులు అర్పించారు. విద్వేష, విభజన రాజకీయాలే తన తండ్రిని బలి తీసుకున్నాయని ఆవేదన వెలిబుచ్చారు. దేశాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వాటికి బలిపె ట్టబోనన్నారు. ‘‘ద్వేషాన్ని ప్రేమ, భయాన్ని ఆశ జయిస్తాయి (అన్బు వెరుప్పై వెల్లుం). . కలసికట్టుగా సమస్యలను అధిగమిద్దాం’’ అంటూ తమిళంలో ట్వీట్ చేశారు. రాజీవ్ స్మారకం వద్ద మొక్క నాటారు. 1991 మే 21న లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా శ్రీపెరంబుదూరులో ఎల్టీటీఈ ఆత్మాహుతి దాడికి రాజీవ్ బలవడం తెలిసిందే. యాత్ర సాగేదిలా... గురువారం ఉదయం ఏడింటికి కన్యాకుమారిలో రాహుల్ తదితరులు యాత్రకు శ్రీకారం చుడతారు. ఉదయం 10.30 దాకా, తిరిగి మధ్యాహ్నం 3.30 నుంచి 6.30 దాకా సగటున రోజుకు 23 కిలోమీటర్లు పాదయాత్ర సాగుతుంది. తిరువనంతపురం, కొచ్చి, నీలంబూర్, మైసూర్, బళ్లారి, రాయచూర్, వికారాబాద్, నాందేడ్, జల్గావ్, ఇండోర్, కోటా, దౌసా, ఆళ్వార్, బులంద్‌షహర్, ఢిల్లీ, అంబారా, పఠాన్‌కోట్, జమ్మూ గుండా సాగి శ్రీనగర్‌లో ముగుస్తుంది. సెప్టెంబర్ 11న యాత్ర కేరళలో ప్రవేశిస్తుంది. రాష్ట్రంలో 18 రోజులు సాగాక సెప్టెంబర్ 30న కర్నాటకలోకి ప్రవేశిస్తుంది. 21 రోజుల అనంతరం వికారాబాద్ వద్ద తెలంగాణలోకి ప్రవేశించనుంది. యాత్రలో పాల్గొనేందుకు ఇప్పటిదాకా 50 వేల మంది పేర్లు నమోదు చేసుకున్నారు. -
భారత్ జోడో యాత్ర.. లేఖ విడుదల చేసిన సోనియా
సాక్షి, కన్యాకుమారి/ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ను అధికారికంగా మొదలుపెట్టారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బాఘెల్ సమక్షంలో త్రివర్ణ పతాకాన్ని అందుకుని యాత్రను మొదలుపెట్టారాయన. ఈ సందర్భంగా కాంగ్రెస్ సభ్యులను ఉద్దేశించి ఆ పార్టీ అధినేత్రి(తాత్కాలిక) సోనియా గాంధీ ఓ లేఖ రాశారు. ‘‘కాంగ్రెస్ చేపట్టిన భారత్ జోడో యాత్రను దేశరాజకీయాల్లో ఒక పరివర్తన ఉద్యమం. చారిత్రక నేపథ్యం ఉన్న కాంగ్రెస్‌కు ఇది ఎంతో ప్రత్యేకమైన సందర్భం. ఈ యాత్రలో దారిపొడవునా పాల్గొనబోతున్న నేతలకు, కార్యకర్తలకు నా అభినందనలు. ప్రత్యేకించి.. 3,600 కిలోమీటర్ల పాదయాత్రలో పూర్తిగా పాల్గొననున్న 120 మంది సభ్యులను అభినందిస్తున్నా. అనారోగ్యం కారణాల వల్ల ఈ కార్యక్రమంలో నేను పాల్గొనలేకపోతున్నా. ఇందుకు నేను చింతిస్తున్నా. కానీ, నా ఆలోచనలన్నీ యాత్ర వెంటే నడుస్తుంటాయి.. నిత్యం యాత్రను ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిస్తుంటా. కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవనం చెందుతుందని ఆశిస్తున్నా’’ అని లేఖలో ఆమె పేర్కొన్నారు. ఇక భారత రాజకీయాలకు ప్రతిష్టాత్మక వేదికగా అభివర్ణించే కన్యాకుమారిలోని మహాత్మా గాంధీ మండపం నుంచి బుధవారం సాయంత్రం కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర ప్రారంభమైంది. గాంధీ మండపం నుండి బీచ్ రోడ్డు వరకు రాహుల్ గాంధీ పాదయాత్ర నిర్వహించారు. జోడో యాత్రలో కాంగ్రెస్ నుంచి పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొంటారు. కన్యాకుమారిలో ప్రారంభమైన యాత్ర కశ్మీర్ లో పూర్తి కానుంది. తమిళనాడు. కేరళ, కర్ణాటక, తెలంగాణ , మహారాష్ట్రల మీదుగా యాత్ర ముందుకు సాగనుంది. #BharatJodoBegins officially CM Tamil Nadu Shri @mkstalin, CM Rajasthan Shri @ashokgehlot51 & CM Chhattisgarh Shri @bhupeshbaghel hand over the Tiranga to Shri @RahulGandhi at Mahatma Gandhi Mandapam to mark the onset of the biggest political movement in India since independence. pic.twitter.com/TaGRluQ5nx — Congress (@INCIndia) September 7, 2022 ప్రతి రోజూ రెండు విడతలుగా కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర సాగనుంది. ఉదయం ఏడు గంట నుండి పదిన్నర గంటల వరకు యాత్ర సాగుతుంది. మళ్లీ మధ్యాహ్నం మూడున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు పాదయాత్ర ఉంటుంది. ప్రతి రోజూ కనీసం 26 కి.మీ. నడవాలని ప్లాన్ చేశారు. అయితే ప్రతి రోజు సగటున 23.5 కి.మీ నడిచేలా రూట్ మ్యాప్ లు సిద్దం చేశారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విభజన రాజకీయాలు చేస్తుందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. దేశాన్ని ఏకం చేసేందుకు ఈ యాత్ర దోహద పడుతుందని ఆ పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రకు ఊహించని స్పందన లభించింది. జీ-23 నేత, గత కొంతకాలంగా కాంగ్రెస్ అధిష్టానంపై అసంతృప్త గళం వినిపిస్తున్న సీనియర్ ఆనంద్ శర్మ.. రాహుల్ గాంధీకి శుభాకాంక్షలు తెలియజేశారు. మరోవైపు బీజేపీ రథయాత్ర అధికారం కోసమైతే.. కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర మాత్రం సత్యాన్ని పరిరక్షించేందుకు అని కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ పేర్కొన్నారు. -
కాంగ్రెస్ ‘భారత్ జోడో యాత్ర’.. తండ్రి స్మారకం వద్ద రాహుల్ గాంధీ నివాళులు
కన్యాకుమారి: ‘భారత్ జోడో యాత్ర’ సందర్భంగా తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో రాహుల్ గాంధీ తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ స్మారకం వద్ద బుధవారం ఉదయం నివాళులర్పించారు. అనంతరం కన్యాకుమారిలో ర్యాలీని ప్రారంభిస్తారు. కార్యక్రమంలో తమిళనాడు సీఎం స్టాలిన్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ సీఎంలు అశోక్ గహ్లోత్, భూపేశ్ బఘేల్‌తో పాటు పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు, పార్టీ శ్రేణులు భారీగా పాల్గొంటారు. ఖాదీ జాతీయ జెండాను చేతబూని రాహుల్ తన యాత్రను ప్రారంభిస్తారు. కాగా నేటి నుంచి కాంగ్రెస్ ‘భారత్ జోడో యాత్ర’ ప్రారంభం కానుంది.కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు సుధీర్ఘ యాత్ర సాగనుంది. సుమారు 3,570 కిలోమీటర్ల మేర 12 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల మీదుగా రాహుల్ యాత్ర సాగనుంది. చదవండి: కర్ణాటక మంత్రి హఠాన్మరణం -
Azadi Ka Amrit Mahotsav: దేశానికి పండుగొచ్చింది
న్యూఢిల్లీ: దేశానికి పండుగ కళ వచ్చేసింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు త్రివర్ణ పతాక శోభ ఉట్టిపడుతోంది. మువ్వన్నెల రెపరెపలతో ప్రతీ ఇల్లు కళకళలాడుతోంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆజాదీ కా అమృతోత్సవ్‌లో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. దేశంలోని ప్రతీ ఇంటిపై జాతీయ జెండా సమున్నతంగా ఎగరాలన్న ఉద్దేశంతో 13వ తేదీ నుంచి 15 వరకు ప్రతీ ఒక్కరూ ఇళ్లపై జాతీయ జెండాని ఆవిష్కరించాలని కేంద్రం పిలుపునిచ్చింది. ఈ పిలుపునందుకొని రాజకీయ నాయకుల దగ్గర నుంచి సామాన్యుల వరకు ఎంతో ఉత్సాహంగా జాతీయ జెండాని ఆవిష్కృతం చేస్తున్నారు. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ప్రొఫైల్ పిక్చర్స్ కింద జాతీయ జెండా ఇమేజ్‌లను ఉంచుతున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తన సతీమణితో కలిసి ఢిల్లీలోని తన నివాసంపై మువ్వన్నెల జెండా ఎగురవేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రం మంత్రులు నేతలు తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘‘జాతీయ జెండా మనకి గర్వకారణం. భారతీయులందరినీ సమైక్యంగా ఉంచుతూ స్ఫూర్తి నింపుతుంది. దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టిన త్యాగధనుల్ని అందరం స్మరించుకుందాం’’ అని షా ట్వీట్ చేశారు. గత పది రోజుల్లోనే పోస్టాఫీసుల ద్వారా ఒక కోటి జాతీయ జెండాలను విక్రయించినట్టుగా పోస్టల్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. ఇక గ్రామాలు, పట్టణాల్లోనూ జాతీయ జెండాకు సేల్స్ విపరీతంగా పెరిగాయి. ఢిల్లీలోని కేజ్రివాల్ ప్రభుత్వం 25 లక్షల జెండాలను విద్యార్థులకు పంపిణీ చేస్తోంది. గుజరాత్లో ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ విద్యార్థులకు జెండాలు పంచారు. ప్రొఫైల్ పిక్చర్‌ని మార్చిన ఆరెస్సెస్ ఎట్టకేలకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) సామాజిక మాధ్యమాల్లో తన అకౌంట్లలో ప్రొఫైల్ పిక్చర్లో జాతీయ జెండాను ఉంచింది. ఆజాదీ కా అమృతోత్సవ్ వేడుకల్లో భాగంగా అందరూ జాతీయ జెండాలను ప్రొఫైల్ పిక్‌లుగా ఆగస్టు 2 నుంచి 15వరకు జాతీయ జెండాని ఉంచాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు ఇచ్చినప్పటికీ ఆరెస్సెస్ ఇన్నాళ్లూ పట్టించుకోలేదు. కాషాయ రంగు జెండానే ఉంచింది. దీంతో ఆరెస్సెస్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. హర్ ఘర్ కా తిరంగా కార్యక్రమంతో ఆర్సెసెస్ తన ప్రొఫైల్ పిక్‌లో జాతీయ జెండాను ఉంచింది. -
ఆ భార్యాభర్తలు దేశం మొత్తం నడిచేశారు
ఫస్ట్ కపుల్ టు వాక్ అరౌండ్ ఇండియా అనే రికార్డు సాధించారు ఈ కేరళ దంపతులు. కన్యాకుమారి నుంచి కశ్మీర్‌కు తిరిగి కశ్మీర్ నుంచి కన్యాకుమారికి మొత్తం 8,263 కిలోమీటర్లు నడిచారు. బెన్నీ కొట్టరత్తిల్, అతని భార్య మాలి కొట్టరత్తిల్ తమ స్వస్థలం అయిన కేరళ కొట్టాయం నుంచి ఈ సుదీర్ఘయాత్ర చేశారు. డిసెంబర్ 1, 2021 నాడు ‘చలో భారత్’ అని బయలుదేరి 216 రోజులలో 17 రాష్ట్రాలలో తిరిగి జూలై 3, 2022న ఇల్లు చేరారు. ఏడు నెలల మూడు రోజుల తమ పర్యటనలో వారు గడించిన అనుభవాలు మరొకరు పొందలేనివి. ఉదయం లేచి మార్నింగ్ వాక్ చేయడం కాదు. మణికట్టు మీదున్న వాచ్‌లో ‘ఓ... ఇవాళ ఐదు వేల అడుగులు నడిచాను’ అని లెక్క చూసుకోవడం కాదు. నడుస్తూ ఉండాలి. రోజంతా నడుస్తూ ఉండాలి. వారమంతా నడుస్తూ ఉండాలి. నెలంతా నడుస్తూ ఉండాలి. నడవగలరా? కొట్టాయం దంపతులు బెన్నీ, మాలి నడిచారు. దేశమంతా నడిచారు. పాదాలతోపాటు కనులు, మనసు, ఆత్మ ధన్యం చేసుకున్నారు. వారు ఇదంతా ఎలా చేశారు? ‘ప్లాన్ చేయకుండా. ప్లాన్ చేస్తే చాలా పనులు జరగవు. మీనమేషాలు లెక్కెట్టకండి... అనుకున్నదే తడవు చేసేయండి’ అనేది వీరి ఫిలాసఫీ. కోవిడ్ ‘రోడ్డున పడేసింది’ ప్రపంచంలో అందరి జీవితాలు గందరగోళం అయినట్టే బెన్ని, మాలి జీవితాలు కూడా గందరగోళం అయ్యాయి. 50 ఏళ్ల బెన్నీ ఆంధ్రప్రదేశ్‌లోని ప్రయివేట్ స్కూల్లో టీచర్‌గా పని చేసేవాడు. కాని కోవిడ్ వల్ల 2019లో ఉద్యోగం పోయింది. భార్యాభర్తలు తమ సొంత ఊరు కొట్టాయం చేరుకున్నారు. చేయడానికి పని దొరకలేదు. చివరకు బెన్నీకి సెక్యూరిటీ గార్డ్ జాబ్ వచ్చింది ఒక హాస్పిటల్లో. ఆ సమయంలో పోస్ట్ కోవిడ్ అనారోగ్యాలు, హార్ట్ స్ట్రోక్‌లు చాలా చూశాడు బెన్ని.‘తగినంత వ్యాయామం లేకనే ఇవన్నీ’ అని అర్థమైంది. మరి తానేం చేస్తున్నట్టు? అప్పటికే ఆ ఉద్యోగం బోర్ కొట్టింది. 2019 నవంబర్‌లో ఒక సైకిలెక్కి ‘అలా దేశం చూసి వస్తా’ అని భార్యకు చెప్పి బయలు దేరాడు. కేవలం 58 రోజుల్లో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు వెళ్లి వచ్చాడు 13 రాష్ట్రాల మీదుగా. ఆ పని కిక్ ఇచ్చింది. మళ్లీ 2021 జూలైలో ఒక సైకిల్ యాత్ర చేశాడు భూటాన్, నేపాల్ వరకు. మూడోసారి కూడా ప్లాన్ చేస్తుంటే భార్య మాలి ‘నన్ను కూడా తీసుకెళతావా?’ అంది అతడు సైకిల్ తుడుస్తుంటే... ‘మనిద్దరం సైకిల్ మీద ఎక్కడెళ్లగలం. నడవాల్సిందే’ అన్నాడు బెన్నీ. ‘అయితే నడుద్దాం పద‘ అంది మాలి. యాత్ర మొదలైంది. డిసెంబర్లో యాత్ర మొదలు డిసెంబర్ 1, 2021న ‘కన్యాకుమారి నుంచి కశ్మీర్’ వరకు సుదీర్ఘ పాదయాత్రను ప్రారంభించారు బెన్నీ, మాలి. ‘మాకు పిల్లలు లేరు, మా దగ్గర ఎక్కువ డబ్బు లేదు. స్నేహితులు సాయం చేసిన డబ్బు, ఒక టెంట్, నీళ్ల బాటిళ్లు, అవసరమైన మందులు, అన్నింటి కంటే ముఖ్యంగా పవర్ బ్యాంకులు... వీటిని తీసుకుని బయలుదేరాం. మాకు ఆధారం గూగుల్ మేప్సే’ అంటాడు బెన్నీ. ఈ యాత్రను వీళ్లు 17 రాష్ట్రాల మీదుగా ప్లాన్ చేశారు. అయితే ఇదంతా అంత సులభమా.. ఎండా గాలి చలి దుమ్ము... బాత్రూమ్ కష్టాలు... నిద్రకు చోటు... దొంగల భయం... ఇవన్నీ ఉంటాయి. ‘మేమిద్దరం పదే పదే ఒకటే మాట చెప్పుకున్నాం. ఏది ఏమైనా యాత్రను సగంలో ఆపి వెనక్కు పోయేది లేదు అని. ఏం జరిగినా సరే ముందుకే వెళ్లాలి ఒకరినొకరు ప్రోత్సహించుకున్నాం’ అంటారు ఇద్దరూ. ఎన్నో అనుభవాలు మొత్తం 216 రోజుల యాత్రలో వారు చలికాలం, ఎండాకాలం చూశారు. చలికాలం టెంట్ సాయపడినా ఎండాకాలం టెంట్లో పడుకోవడం దుర్లభం అయ్యింది వేడికి. ‘టెంట్ బయట పడుకుంటే దోమలు నిర్దాక్షిణ్యం గా పీకి పెట్టేవి’ అన్నాడు బెన్నీ. అదొక్కటే కాదు.. భార్య భద్రత కోసం అతడు సరిగా నిద్రపోయేవాడు కాదు. ‘చీమ చిటుక్కుమన్నా లేచి కూచునేవాణ్ణి‘ అన్నాడు. వీళ్ల కాలకృత్యాల అవసరాలకు పెట్రోలు బంకులు ఉపయోగపడేవి. గుళ్లు, గురుద్వారాలు, పోలీస్ స్టేషన్ల వరండాలు, బడులు... ఇవన్నీ వారు రాత్రి పూట ఉండే చోటుగా మారేవి. బడ్జెట్ కోసం రొట్టెల మీదే ఎక్కువ ఆధారపడేవారు. ‘వెస్ట్ బెంగాల్ పురూలియాలో రాత్రి తాగుబోతుల బారిన పడి పారిపోయాం. తమిళనాడు విల్లుపురం గుడిలో పడుకుంటే దొంగలు వచ్చారు. అట్టపెట్టెల వెనుక ఉండటం వల్ల మమ్మల్ని చూడలేదు. కుక్క మొరగడంతో పారిపోయారు. ఆంధ్రప్రదేశ్‌లో వేడి వేడి అన్నం, కూర తినడంతో మా ప్రాణం లేచి వచ్చింది. పంజాబ్‌లో జనం చాలా అతిథి మర్యాదలు చేస్తారు. ఒక ముసలాయన మమ్మల్ని ఇంటికి తీసుకెళ్లి మంచి భోజనం పెట్టి మరుసటి రోజుకి కట్టి ఇచ్చాడు’ అన్నారు వారు. ఎన్నెన్ని అందాలు అమృత్సర్, మురుడేశ్వర్, రిషికేశ్, బుద్ధగయ, వైష్ణోదేవి, కశ్మీర్, వాఘా బోర్డర్... ఇవన్నీ ఈ దంపతులు తమ కాళ్ల మీద నడుస్తూ చూసి సంతోషించారు. ఎందరికి దొరుకుతుంది ఈ అదృష్టం. ఎందరికి ఉంటుంది ఈ తెగువ. వారు తమ యాత్రానుభవాలను వారి యూట్యూబ్ చానల్ ‘వికీస్ వండర్ వరల్డ్’లో వీడియోలుగా పోస్ట్ చేశారు. తిరిగి వచ్చాక ఉద్యోగం వెతుక్కునే పనిలో ఉన్నాడు బెన్నీ. కాసింత సంపాదన చేసుకుని భార్యతో ఈసారి బైక్ మీద రివ్వున దూసుకెళ్లాలని ఆశ. ఎందుకు నెరవేరదూ? (క్లిక్: పర్యాటకుల స్వర్గధామం.. కాస్ పీఠభూమి) -
శౌర్య యాత్ర.. 40 మంది మహిళలా సైనికులు, ఢిల్లీ నుంచి కన్యాకుమారి వరకు..!
నిత్య ఉత్తేజం చే గువేరా ‘మోటర్ సైకిల్ డైరీస్’లో ఒక మాట... ‘ప్రపంచం నిన్ను మార్చే అవకాశం ఇవ్వు. ఆ తరువాత ఈ ప్రపంచాన్ని మార్చే దిశగా ప్రయాణిస్తావు’ ప్రయాణం అనేది పైకి భౌగోళిక అంశాలకు సంబంధించిన విషయంగా కనిపించినప్పటికీ, సూక్ష్మదృష్టితో చూస్తే... అది మనలోకి మనం ప్రయాణించడం. ప్రయాణ క్రమంలో కొత్త విషయాలను నేర్చుకోవడం. మన దగ్గర ఉన్న విషయాలను పంచుతూ వెళ్లడం. రక్తం గడ్డ కట్టే చలిలో జమ్మూ అంతర్జాతీయ సరిహద్దుల్లో డేగకళ్లతో కాపుకాసి, ఉగ్రవాదులకు, అక్రమ చొరబాటుదారులకు చెక్ పెట్టిన మహిళా సైనికుల ధీరత్వం ఇప్పటికీ తాజాగానే ఉంటుంది. ఎర్రటి ఎండల్లో, నాలుక పిడచకట్టుకుపోయే భయానక వేడిలో రాజస్థాన్ సరిహద్దుల్లో విధులు నిర్వహించిన మహిళా సైనికుల అంకితభావం ఎప్పటికీ గుర్తుంటుంది. విధినిర్వహణలో కాలప్రతికూలతలు, భౌగోళిక ప్రతికూలతలను అధిగమించి ‘ఎలాంటి పరిస్థితుల్లో అయినా, ఎలాంటి విధి అయిన నిర్వహించగలం’ అని నిరూపించారు బీఎస్ఎఫ్ మహిళా సైనికులు. రాజస్థాన్‌కు చెందిన తనుశ్రీ ప్రతీక్ బీఎస్ఎఫ్ చరిత్రలో ఫస్ట్ ఉమెన్ కంబాట్ ఆఫీసర్‌గా నియామకం అయినప్పడు అది ఒక విశేషం మాత్రమే కాదు, ఎంతోమంది మహిళలకు విశిష్టమైన ఉత్తేజాన్ని అందించింది. మొన్నటి దిల్లీ రిపబ్లిక్ డే వేడుకల్లో బీఎస్ఎఫ్ మహిళా దళం ‘సీమ భవాని’ చేసిన అపురూప సాహసిక విన్యాసాలు ఇప్పటికీ కళ్లముందు కదలాడుతూనే ఉన్నాయి. అయితే ఇవేమీ జ్ఞాపకాలుగా మాత్రమే మిగిలిపోవడం లేదు. ఒక కొత్తదారికి ఊతం ఇవ్వబోతున్నాయి. తాజా విషయానికి వస్తే.. బీఎస్ఎఫ్కు చెందిన నలభైమంది మహిళా సైనికులు దిల్లీ నుంచి కన్యాకుమారి వరకు బైక్ యాత్ర చేపట్టారు. 5,280 కి.మీ ఈ యాత్రకు ‘సీమా భవాని శౌర్య ఎంపవర్మెంట్ రైడ్–2022’ అని నామకరణం చేశారు. అటు అమృత్సర్ నుంచి ఇటు చెన్నై, హైదరాబాద్, అనంతపురం, బెంగుళూరు వరకు స్త్రీ సాధికారికతకు సంబంధించిన ఘట్టాలను పంచుకుంటూ, సానుకూల దృక్పథాన్ని రేకెత్తించడమే ఈ యాత్ర లక్ష్యం. యాత్రలో భాగంగా బృంద సభ్యులు పాఠాశాల, కాలేజీ విద్యార్థులు, ఎన్సీసీ వాలెంటీర్లు, బైక్‌రైడర్స్... మొదలైన వారితో సమావేశం అవుతారు. దిల్లీకి సమీపంలోని ఒక పాఠశాల విద్యార్థులతో సమావేశం అయినప్పుడు... మొన్నటి రిపబ్లిక్‌డే వేడుకల్లో సీమభవాని బృందం చేసిన సాహసకృత్యాలను గుర్తు చేసుకుంది ఒక చిన్నారి. తాను కూడా అలా చేయాలనుకుంటుదట! ‘నువ్వు కచ్చితంగా చేయగలవు’ అని చెప్పినప్పుడు ఆ పాప ముఖం ఎంత సంతోషంతో వెలిగిపోయిందో! మరోచోట ఒక కాలేజీ విద్యార్థిని ‘బీఎస్ఎఫ్లో చేరాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి? ఏం చదవాలి?’... మొదలైన విషయాలను అడిగింది. ఆ అమ్మాయికి అన్ని విషయాలను పూసగుచ్చినట్లు చెప్పింది రైడర్స్ గ్రూప్. దూరాలను అధిగమించడమే కాదు... దూరాలను తగ్గించడం కూడా ఈ యాత్ర లక్ష్యం. రాయల్ ఎన్ఫీల్డ్ వాహనాలపై రాజసంగా కనిపిస్తున్న సీమ భవానీ శక్తులను ఒక్కసారి చూడండి... ఎంత ఉత్తేజకరమైన దృశ్యమో! -
తొమ్మిదేళ్ల సర్వేశ్‌ని అభినందించిన సీఎం స్టాలిన్
సాక్షి, చెన్నై: ప్రపంచంలోని పరిస్థితులు, మార్పు, సాధించాల్సిన లక్ష్యాలను వివరిస్తూ తొమ్మిదేళ్ల బాలుడి కన్యాకుమారి నుంచి చెన్నైకు నడక పయనం పూర్తి చేశాడు. ఆ బాలుడ్ని సీఎం ఎంకే స్టాలిన్ శనివారం అభినందించారు. చెన్నై తాంబరం సమీపంలోని సాయిరాం పాఠశాలలో ఐదో తరగతి చదువుకుంటున్న సర్వేశ్(9) ప్రపంచంలోని ప్రస్తుత పరిస్థితులను వివరిస్తూ కన్యాకుమారి నుంచి చెన్నైకు అవగాహన యాత్ర చేయాలని నిర్ణయించాడు. ఆ మేరకు గాంధీ జయంతి రోజు(అక్టోబరు 2)న కన్యాకుమారి లోని గాంధీ మండపం వద్ద తన నడక పయనాన్ని చేపట్టాడు. 750 కి.మీ దూరం 14 రోజుల పాటుగా నడిచాడు. శుక్రవారం సాయంత్రం చెన్నై శివారులోని వండలూరుకు చేరుకున్న ఈ బాలుడ్ని సహచర విద్యార్థులు ఆహ్వానించారు. శనివారం ఉదయం వళ్లువర్‌కోట్టంలో తన పయనాన్ని ఆ బాలుడు ముగించాడు. చదవండి: (ఆరవ తరగతి విద్యార్థినికి సీఎం స్టాలిన్ ఫోన్ కాల్) ఈ సందర్భంగా ఆ బాలుడ్ని సీఎం ఎంకే స్టాలిన్, మంత్రి ఎం సుబ్రమణియన్‌తో పాటుగా, తాంబరం ఎమ్మెల్యే ఎస్ఆర్ రాజా అభినందించారు. పుష్పగుచ్ఛాన్ని అందజేసి సత్కరించారు. అనంతరం సీఎం స్టాలిన్ కొళత్తూరు నియోజకవర్గంలో పర్యటించారు. అక్కడ పేదలకు రూ. 2 కోట్ల విలువైన సంక్షేమ పథకాలను అందజేశారు. -
గుండెనిండా ‘జగనన్న’ అభిమానం: కశ్మీర్ నుంచి యాత్ర
ఆదిలాబాద్ టౌన్: తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట మండలం మాధవపట్నం గ్రామానికి చెందిన పడాల రమేశ్ జగనన్నకు గుండె నిండా అభిమానాన్ని చాటారు. జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్ సీఎం కావాలని 2018లో ప్రజాసంకల్ప పాదయాత్రలో ఆయనను కలిశారు. ముఖ్యమంత్రి అయితే కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర చేపడతానని ప్రతిజ్ఞ చేశాడు. జగన్ సీఎం కావడంతో ఇచ్చిన మాట ప్రకారం సైకిల్ యాత్ర చేపట్టాడు. 2020 ఫిబ్రవరిలో శ్రీనగర్ నుంచి సైకిల్ యాత్ర ప్రారంభించి జమ్ము, పంజాబ్, హర్యాన, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల మీదుగా సైకిల్ యాత్ర కొనసాగింది. మార్చి 23వ తేదీన లాక్‌డౌన్‌తో సైకిల్ యాత్ర నిలిపివేసి ఇంటికి చేరుకున్నాడు. చదవండి: బంగారు చేప.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన మత్య్సకారుడు ఆదిలాబాద్ నుంచే.. దివంగత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని గురువారం ఆదిలాబాద్ పట్టణం నుంచి మళ్లీ సైకిల్ యాత్రను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. 33 రోజుల్లో 4 వేల కిలో మీటర్లు సైకిల్ యాత్ర చేపట్టడం జరిగిందని, మరో 20 రోజుల్లో 1,800 కిలోమీటర్ల వరకు యాత్ర చేపట్టాల్సి ఉందని పేర్కొన్నారు. ఆదిలాబాద్ పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, టీటీడీ ఎల్సీ మెంబర్ బెజ్జంకి అనిల్‌కుమార్ ఈ సైకిల్ యాత్రను గురువారం ప్రారంభించనున్నట్లు తెలిపారు. చదవండి: నువ్వంటే క్రష్.. ‘ఓయో’లో కలుద్దామా.. ఉద్యోగికి బాస్ వేధింపులు -
పదవుల పందేరం... ఆ జిల్లాల నేతలకు అవకాశాలు!
సాక్షి, చెన్నై: రాష్ట్ర బీజేపీలో సంస్థాగత మార్పులకు రంగం సిద్ధమైంది. ఇందుకు తగ్గ కసరత్తుల్లో కొత్త అధ్యక్షుడు అన్నామలై నిమగ్నమై ఉన్నారు. 50 శాతం మేరకు పదవుల్లో మార్పులు తథ్యం అని కమలాలయం వర్గాలు పేర్కొంటున్నాయి. ఎవ్వరూ ఊహించని రీతిలో రాష్ట్ర బీజేపీలో పరిణామాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా అధ్యక్షుడి పగ్గాలు చేపట్టిన ఎల్. మురుగన్ అనూహ్యంగా కేంద్ర సహాయ మంత్రి అయ్యారు. ఆయన స్థానంలో పార్టీలో చేరిన నెలల వ్యవధిలో కొత్త అధ్యక్షుడిగా మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై నియమితులయ్యారు. ఈ మేరకు తనదైన శైలిలో పార్టీలో మార్పులకు శ్రీకారం చుట్టేందుకు ఆయన సిద్ధమయ్యారు. పార్టీలో అధ్యక్షుడి తర్వాత ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షులు, కోశాధికారి పదవులు కీలకంగా ఉన్నాయి. ఇదిలా ఉండగా, స్థానిక ఎన్నికల కసరత్తుల్లో భాగంగా సోమవారం మరోమారు తొమ్మిది జిల్లాల నాయకులతో సమావేశానికి అన్నామలై నిర్ణయించారు. ఇక, అసెంబ్లీ ఎన్నికల్లో 4 చోట్ల బీజేపీ గెలిచిన విషయం తెలిసిందే. ఆ మేరకు గెలిచిన నియోజకవర్గాలైన తిరునల్వేలి, కన్యాకుమారి, కోయంబత్తూరు, ఈరోడ్ జిల్లాలకు పార్టీ తరపున ఇన్నోవా కార్లను ఆదివారం పంపిణీ చేయడం విశేషం. పార్టీ అభ్యర్థుల కోసం శ్రమించిన ఈ జిల్లాలకు చెందిన కొందరు నేతలకు రాష్ట్ర కార్యవర్గంలో పదవులు దక్కబోతున్నట్లు తెలుస్తోంది. చదవండి: డీఎంకే నాయకుడి హత్య -
ఇండియాలో ఎక్కువ దూరం ప్రయాణించే రైలు ఏదో తెలుసా?
మనదేశంలో ఎక్కువ దూరం ప్రయాణించే రైలు వివేక్ ఎక్స్‌ప్రెస్. ఇది అస్సాంలోని దిబ్రూగఢ్ నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకు 4,273 కి.మీల దూరం ప్రయాణిస్తుంది. తొమ్మిది రాష్ట్రాల మీదుగా సాగిపోతుంది. మధ్యలో 56 స్టేషన్లలో ఆగుతుంది. దిబ్రూగఢ్‌లో మొదలైన రైలు కన్యాకుమారి చేరడానికి ఐదు రోజులు పడుతుంది. ఇది వీక్లీ ట్రైన్. ట్రావెల్ టిప్స్: జాగ్రత్తగా వెళ్లి వద్దాం ► టూర్‌కి వెళ్తున్న ప్రదేశం ప్రత్యేకతలను ముందుగా తెలుసుకుని బయలుదేరితే పర్యటనను ఆసాంతం ఆస్వాదించవచ్చు. ► ముఖ్యంగా అక్కడికి మాత్రమే ప్రత్యేకమైన వంటలు, పండ్లు, అక్కడ మాత్రమే దొరికే వస్తువులను మిస్ కాకూడదు. ► టూర్లో ఉదయం బ్రేక్‌ఫాస్ట్ మాత్రం పూర్తి స్థాయిలో తీసుకోవాలి. ► ఇక రోజంతా ఆహారాన్ని ఒకేసారి ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. కొద్ది కొద్దిగా ఎక్కువ సార్లు తీసుకోవాలి. ► టూర్‌కి వెళ్లే ముందు ఫ్యామిలీ డాక్టర్‌ను సంప్రదించి, డాక్టర్ సూచించిన మందులను వెంట తీసుకు వెళ్లాలి. -
శభాష్ భరత్.. 99 రోజుల్లో 11 రాష్ట్రాలు దాటి
అసలైతే పాదాభివందనం చేయాలనుకున్నాడు భరత్. కానీ ఒకరా ఇద్దరా! డాక్టర్లు, నర్సులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, సామాజిక కార్యకర్తలు.. వేలు, లక్షలు! ఎంతమందికని పాదాభివందనం చేయగలడు? పోనీ.. ‘ఎందరో కరోనా యోధులు. అందరికీ వందనాలు’ అనుకుని మనసులోనే చేతులు జోడించవచ్చు. అలాక్కూడా కాదు, అంతకన్నా ఎక్కువగా కృతజ్ఞతలను చెల్లించాలనుకున్నాడు. కాలి నడకన కన్యాకుమారి నుంచి బయల్దేరి శ్రీనగర్‌లోని దాల్ సరస్సుకు చేరుకున్నాడు. తన ప్రయాణాన్ని ఒక స్తుతిగా, నమస్కృతిగా చెల్లించుకున్నాడు. భరత్‌ది మైసూర్. కరోనా కాలంలో కష్టాలు పడుతున్నవాళ్లను చూశాడు. ఆ కష్టాలను తమవిగా భావించి చేయి అందించిన వాళ్లూనూ చూశాడు. ఆసుపత్రులలో కరోనా బాధితుల్ని చూశాడు. ప్రాణానికి ప్రాణమిచ్చి వారిని కాపాడిన వైద్యులను, సిస్టర్స్‌ని చూశాడు. ప్రతి చోటా ఏదో ఒక సహాయం చేయడానికి వచ్చినవారే! ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా.. మనిషిలోని మంచితనాన్ని కూడా బయట పెట్టింది. ఏడాదిగా చూస్తున్నాడు భరత్. కరోనా యోధులకు అవార్డులు ఇస్తున్నారు. వారిని అభినందిస్తూ పెయింటింగ్ లు వేస్తున్నారు. సత్కరిస్తున్నారు. సర్టిఫికెట్ లు ఇస్తున్నారు. మ్యూజియంలు ఏర్పాటు చేస్తున్నారు. తనూ ఏదైనా చేయాలని అనుకున్నాడు. అనుకోవడం కాదు, చేయకుండా ఉండలేకపోయాడు. ఇప్పటికే అతడు పర్యావరణాన్ని పరిరక్షించే పనిలో ఉన్నాడు. మొక్కలు నాటుతున్నాడు. ఫిట్‌నెస్‌పై అవగాహన కల్పిస్తున్నాడు. ఆ పనులను కొనసాగిస్తూనే దేశవ్యాప్తంగా కరోనా యోధులకు అభివాదాలు తెలియజేసేందుకు ‘వాక్ ఫర్ హ్యుమానిటీ’ (మానవత్వం కోసం పాదయాత్ర) ను తలపెట్టాడు. 4000 వేల కి.మీ. పొడవైన ఆ మహా సంకల్పాన్ని పూర్తి చేశాడు! ∙∙ ముప్పై మూడేళ్ల భరత్ 2020 డిసెంబర్ 11న తన పాద యాత్రను ప్రారంభించాడు. మైసూర్ నుంచి కన్యాకుమారి వెళ్లి అక్కడ తొలి అడుగు వేశాడు. చివరి అడుగు జమ్ము కశ్మీర్. శ్రీనగర్‌లోని దాల్ సరస్సు ఒడ్డుకు చేరీచేరగానే.. పసుపు, ఎరుపు రంగుల్లో తను రూపకల్పన చేసుకున్న యాత్ర పతాకాన్ని రెండు చేతులతో రెపరెపలాడించాడు. మొత్తం 99 రోజుల ప్రయాణం. హైవేల మీదుగా రోజుకు 45 నుంచి 50 కిలో మీటర్ల నడక. మొత్తం 11 రాష్ట్రాలు దాటుకుంటూ వెళ్లాడు భరత్. కరోనా రాక ముందు వరకు అతడు రకరకాల వ్యాపారాలు చేసేవాడు. కరోనాతో అవన్నీ దెబ్బతిన్నాయి. లాక్డౌన్లో పూర్తిగా ఇంటికే పరిమితం కావడం, ఆ మాత్రం అవకాశం కూడా లేని కరోనా యోధులు నిరంతరం ఇంటికి దూరంగా గడపడం చూశాక భరత్‌కు తను కూడా ఏదైనా చేయాలన్న ఆలోచన కలిగింది. నిస్వార్థంగా సేవలు అందిస్తున్న లక్షల మందికి ధన్యవాద సమర్పణ చేయదలచుకున్నాడు. పాదయాత్ర తో వారి రుణం తీర్చుకోవాలనుకున్నాడు. దారి మధ్యలో కొన్ని చోట్ల చెట్ల కింద సేద తీరాడు. సామాజిక కార్యకర్తలను పరిచయం చేసుకున్నాడు. 150 చోట్ల మొక్కలు నాటాడు. అతడి ఒంటరి ప్రయాణానికి ఏదో ఒక రూపంలో శక్తిని అందించినవారు ఎందరో ఉన్నారు. ‘‘ఈ కృతజ్ఞతా ప్రయాణం నా ఒక్కడిదే కాదు. వాళ్లందరిది కూడా’’ అంటున్నాడు భరత్. -
‘పెద్ద ఎత్తున ధార్మిక కార్యక్రమాల నిర్వహణ’
సాక్షి, చెన్నై : తమిళనాడులోని కన్యాకుమారిలో వివేకానంద ట్రస్ట్ సహకారంతో ఇక మీదట పెద్ద ఎత్తున ధార్మిక కార్యక్రమాల నిర్వహణకు చర్యలు తీసుకుంటామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. వైవీ దంపతులు బుధవారం కన్యాకుమారిలోని శ్రీవారి ఆలయం ద్వితీయ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. అర్చకులు శాస్త్రోక్తంగా పుణ్యాహవచనం ఇతర వైదిక క్రతువులు నిర్వహించారు. అనంతరం వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. కోవిడ్ కారణంగా కన్యాకుమారిలో ధార్మిక కార్యక్రమాలకు అవరోధం ఏర్పడిందన్నారు. వివేకానంద ట్రస్ట్ టీటీడీకి చట్ట పరంగా భూమి అప్పగిస్తే కళ్యాణ మండపం నిర్మాణం ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. భక్తుల కోరిక మేరకు కన్యాకుమారి ఆలయం ఆవరణంలో గరుడాళ్వార్ విగ్రహం ఏర్పాటు చేసే విషయం ఆగమ పండితులతో మాట్లాడి, రానున్న బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ ముగిశాక తిరుమలకు గతంలో సాధారణ రోజుల్లో ఎంత సంఖ్యలో భక్తులను అనుమతించేవారో అంత సంఖ్య పెంచుతామని చైర్మన్ తెలిపారు. ఆలయానికి రోడ్డు నిర్మాణం కూడా చేపడతామని తెలిపారు. టీటీడీ పాలకమండలి సభ్యులు శేఖర్ రెడ్డి, డాక్టర్ నిశ్చిత అధికారులు పాల్గొన్నారు. -
ముగ్గురు మిత్రుల సాహసయాత్ర!
ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృభిస్తున్న నేపథ్యంలో చాలా టెక్ సంస్థలు తమ ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని సూచించాయి. దింతో చాలా మంది ఉద్యోగులు తమ స్వంత గ్రామాలకు వెళ్లి పని చేస్తున్నారు. మరి కొంత మంది ఉద్యోగులు ఈ కరోనా భయం తగ్గే వరకు సెలవులు తీసుకున్నారు. కానీ, మహారాష్ట్రకు చెందిన ముగ్గురు యువకులు మాత్రం చాలా కొత్తగా అలోచించి తమకు నచ్చిన సైక్లింగ్ యాత్ర చేస్తూ మధ్య మధ్య పని చేసుకున్నారు.(చదవండి: భూగర్భంలో గోల్కొండ షో!) ఈ మహమ్మారి కారణంగా దొరికిన సమయాన్ని వారు మంచిగా సద్వినియోగం చేసుకున్నారు. ఇటు ఆఫీస్ పని చేసుకుంటూనే వారు యాత్రను ఎంజాయ్ చేసారు. బక్కెన్ జార్జ్, ఆల్విన్ జోసెఫ్, రతీష్ భలేరావ్ అనే ముగ్గురు స్నేహితులు ఉద్యోగం చేస్తూనే సైకిల్‌పై ముంబయి నుంచి కన్యాకుమారి వరకు వెళ్లారు. ఎలాగూ ఆఫీస్‌కు వెళ్లాల్సిన పని లేదు కాబట్టి.. పనిచేస్తూ ఎక్కడికైనా సైకిల్‌పై విహార యాత్రకు వెళ్తే బాగుంటుందని బక్కెన్ మొదట నిర్ణయించుకున్నాడు. గతంలో బక్కెన్‌కు సైకిల్‌యాత్రలు చేసిన అనుభవం కూడా ఉంది. అందుకే ఈ సారి ఉద్యోగం చేస్తూనే కన్యాకుమారి వరకు వెళ్లాలని బక్కెన్ నవంబర్ లో నిర్ణయించుకున్నాడు. తరువాత అతను తన ఇద్దరు స్నేహితులను ఒప్పించాడు. హోటళ్లే ఆఫీసులు ఈ యాత్రలో భాగంగా వారికీ కావాల్సిన ల్యాప్‌టాప్, మొబైల్ఫోన్లు, ఇతర గ్యాడ్జెట్లు వెంటపెట్టుకున్నారు. వారు ప్రతిరోజు ఉదయం 4 గంటలకు లేచి 11 గంటల వరకు సైకిల్ యాత్ర చేపట్టేవారు. తర్వాత మార్గం మధ్యలో కనిపించే దాబా లేదా హోటల్ వద్ద ఆగేవారు. అక్కడ భోజనం చేసిన తర్వాత ఆఫీస్ విధుల కోసం ల్యాప్‌టాప్‌లో లాగిఇన్ అయి.. సాయంత్రం వరకు అక్కడే పనిచేసుకునేవారు. ఇలా వీరు 26 రోజుల్లో 1,687కి.మీ ప్రయాణించి కన్యాకుమారి చేరుకున్నారు.(చదవండి: ఇదే హవా ఉంటే మూడోసారి ప్రధాని పీఠంపై) వారాంతాల్లో ఎక్కువ దూరం ప్రయాణించే వారు అని జోసెఫ్ పేర్కొన్నాడు. వీరు మార్గం మధ్యలో కోవిడ్ ఆంక్షల కారణంగా బస చేయడానికి కొన్ని సమస్యలు ఏర్పడేవని పేర్కొన్నారు. ఈ ప్రయాణం కోసం ఒక్కొక్కరికి సుమారు 25 వేల రూపాయలు ఖర్చు అయ్యాయని పేర్కొన్నారు. దీనిలో ఎక్కువ భాగం బస, భోజనానికి ఖర్చు అయ్యాయని తెలిపారు. కానీ ఈ ప్రయాణంలో భాగంగా పని చేస్తూ ప్రకృతిని ఆస్వాదించడం తమకు బాగా నచ్చిందని వారు తెలిపారు. -
ఒంటికాలిపై.. 43 రోజుల్లో 3,800 కి.మీ.
భోపాల్ : అవయవాలన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ ఒక చోట నుంచి మరోచోటకి ప్రయాణం చేయాలంటే చిరాకు పడుతుంటాం. అటువంటిది ఒంటి కాలుతో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్రను విజయవంతంగా పూర్తి చేసి రికార్డు సృష్టించింది మధ్యప్రదేశ్‌కు చెందిన తాన్య దగా. బీఎస్ఎఫ్ సహకారంతో నడిచే ఆదిత్యా మెహతా ఫౌండేషన్.. దేశవ్యాప్తంగా శారీరకంగా వికలాంగులైన విద్యార్థులకు పారా స్పోర్ట్స్‌పై అవగాహన కల్పించి, విరాళాలు సేకరిస్తుంది. ఇందులో భాగంగా ఏటా ‘ఇన్ఫినిటీ రైడ్’ను నిర్వహిస్తోంది. అయితే ‘ఇన్ఫినిటీ రైడ్ కె2కే– 2020’లో తొమ్మిది సభ్యుల బృందంలో ఏకైక ఫిమేల్ పారసైక్లిస్ట్‌గా పాల్గొన్న తాన్య.. 43 రోజుల్లో 3,800 కిలోమీటర్ల (కశ్మీర్ టు కన్యాకుమారి) సైకిల్ యాత్ర పూర్తి చేసింది. 3,800 కిలోమీటర్లు ప్రయాణించి దేశంలోనే ఏకైక ఫిమేల్ పారా సైక్లిస్ట్‌గా తాన్య గుర్తింపు తెచ్చుకుంది. ‘‘అది 2018. నేను డెహ్రాడూన్ లో ఎంబీఏ చదువుతున్నాను. ఒకరోజు విధి నాపై కన్నెర్ర చేయడంతో కారు ప్రమాదంలో నా కుడికాలిని కోల్పోయాను. దాంతో ఆరునెలలపాటు బెడ్‌మీద నుంచి కదలలేని పరిస్థితి. అప్పుడు జీవితం అంతా అయిపోయిందనిపించింది. ఆ సమయంలో నాన్న నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ నాలో ధైర్యాన్ని నూరిపోసారు. శరీరంలో ఓ భాగం కోల్పోయినంత మాత్రాన మన జీవితం అక్కడితో ఆగిపోదని, మన లక్ష్యం కోసం శ్రమించాలని నాన్న చెప్పిన మాటలే నాకు మరో జీవితాన్నిచ్చాయని తాన్య చెప్పుకొచ్చింది. ఆరు నెలల తర్వాత శారీరకంగాను మానసికంగా దృఢంగా తయారై పారాస్పోర్ట్స్‌ను ప్రోత్సహించే ఫౌండేషన్ లో చేరాను’’ అన్నది. ‘‘ఈ క్రమంలోనే 2020 నవంబర్ 19న కశ్మీర్ టు కన్యాకుమారి యాత్రకు మా టీమ్‌తో బయలు దేరాము. అంతా సాఫీగా సాగుతున్న సమయంలో విధి మరోసారి నన్ను వెక్కిరించింది. డిసెంబర్ 18న హైదరాబాద్‌లో ఉండగా.. నాన్న చనిపోయాడనే వార్త నన్ను ఒక్కసారిగా కలిచివేసింది. మరోసారి జీవితం అంధకారమైనట్లు అనిపించింది. ఆ బాధతోనే మధ్యప్రదేశ్ వెళ్లి నాన్నను కడసారి చూసి వచ్చి.. మళ్లీ మా బృందంతో కలిసి యాత్ర కొనసాగించాను. నన్ను ఎంతగానో ప్రోత్సహించి, కుంగిపోకుండా కొత్త జీవితాన్ని పరిచయం చేసిన నాన్న చివరి కోరిక ఈ యాత్రను పూర్తి చేయడం. అందుకే అంత బాధలోనూ నాన్న స్ఫూర్తితో లక్ష్యాన్ని పూర్తి చేసి నాన్న కోరికను తీర్చానని తాన్య గర్వంగా చెప్పింది’’. -
సూసైడ్‌లో నోట్లో షాకింగ్ విషయం
సాక్షి, చెన్నై: చదువుకున్న ప్రతి యువకుడి అతిమ లక్ష్యం ప్రభుత్వ ఉద్యోగం. ఎంత పెద్ద చదువు చదవినా.. నిద్రలేని రాత్రులు గడిపినా వారి ప్రయత్నమంతా గవర్నమెంట్ జాబ్ కోసమే. ఒక్కసారి జాబ్ వచ్చిందంటే ఇక వారి ఆనందానికి హద్దులే ఉండవు. అయితే ఈ ప్రయత్నంలో ఎంత కష్టపడ్డా కోరుకున్న ఉద్యోగం రాలేదని ఆత్మహత్యకు పాల్పడిన యువకులు, నిరుద్యోగుల సంఖ్య కోకొల్లలు. దేశంలో రోజు నమోదు అవుతున్న ఆత్మహత్యల కేసుల్లో సింహ భాగం వీరిదే ఉంటుంది. (నీవు లేక నేనుండ లేను.. నీ వద్దకే వస్తా) అయితే ఓ యువకుడు విచిత్రంగా తనకు ఉద్యోగం వచ్చిందని ప్రాణం తీసుకున్నాడు. వినడానికి కొంత ఆశ్చర్యంగా ఉన్నా.. నమ్మి తీరాల్సిందే. వివరాల ప్రకారం.. తమిళనాడులోని కన్యాకుమారికి చెందిన ఎస్ నవీన్ (33) అనే యుకుడికి ఇటీవల ఓ జాతీయ బ్యాంక్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా ఉద్యోగం లభించింది. ఆర్థిక రాజధాని ముంబైలో పోస్టింగ్. ఎన్నో ప్రయత్నాల తరువాత ఉన్నత ఉద్యోగం రావడంతో కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు, సన్నిహితులు ఎంతో సంతోషపడ్డారు. అయితే ఉద్యోగంలో చేరిన 15 రోజుల్లోనే నవీన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముంబై నుంచి త్రివేండ్ర వెళ్తున్న రైలు కింద పడి గత శనివారం ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషయం కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తుల్లో విషాదంలో నింపింది. అయితే నవీన్ ఆత్మహత్యపై విచారణ చేపట్టిన పోలీసులకు షాకింగ్ విషయం తెలిసింది. అతని చేబులో స్వాధీనం చేసుకున్న సూసైడ్ లెటర్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తనకు ప్రభుత్వ ఉద్యోగం వస్తే తన ప్రాణాలు అర్పిస్తానని దేవుడికి మొక్కినట్లు దానిలో రాసిఉంది. ‘ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎంతో కాలంగా ప్రయత్నిస్తున్నా. ఎన్నో ప్రార్థనలు చేశా. జాబ్ వస్తే తన ప్రాణలు అర్పిస్తా అని మొక్కినా. చివరికి ప్రార్థనలు ఫలించి బ్యాంక్ మేజేజర్ పోస్టు వచ్చింది. 15 రోజులు ఉద్యోగం చేశా. దేవుడికి ఇచ్చిన మాట ప్రకారం ఆత్మహత్య చేసుకుంటున్నా. నా చావుకు ఎవరూ కారణం కాదు’ అంటూ నోట్లో పేర్కొన్నాడు. మరోవైపు నవీన్ సూసైడ్ లెటర్‌పై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది అతనే రాశాడా లేక దీని వెనుక ఎవరి కుట్రైనా ఉందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. ప్రభుత్వం ఉద్యోగం వస్తే ఆత్మహత్య చేసుకోవడం ఏంటనీ మరింత లోతుగా విచారిస్తున్నారు. ఆత్మహత్యగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు..మృతదేహాన్ని కన్యాకుమారిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వార్త ప్రస్తుతం వైరల్‌గా మారింది. -
ఆఖరికి అతడిని జైళ్లో పెట్టారు: చిన్మయి
చెన్నై: అనేక ఫిర్యాదుల అనంతరం కాశి అనే వ్యక్తిపై పోలీసులు చర్యలు తీసుకున్నారని ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద హర్షం వ్యక్తం చేశారు. మహిళలను వేధించినందుకు ఆఖరికి అతడు జైలు పాలయ్యాడని పేర్కొన్నారు. కన్యాకుమారి జిల్లాకు చెందిన కాసి అలియాస్ సుజి అనే వ్యక్తి ఫిట్నెస్ ట్రైనర్‌గా పనిచేస్తున్నాడు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియా యాప్‌లలో యాక్టివ్‌గా ఉండే అతడు ఎప్పటికప్పుడు తన కొత్త ఫొటోలను అప్లోడ్ చేసేవాడు. ఈ క్రమంలో సంపన్న వర్గాలకు చెందిన అమ్మాయిల ప్రొఫైల్స్ గుర్తించి వారికి రిక్వెస్ట్ పంపేవాడు. అనంతరం వారితో చాటింగ్ చేస్తూ పరిచయాన్ని స్నేహంగా మార్చుకునేవాడు. ఆ తర్వాత వ్యక్తిగతంగా కలిసి సన్నిహితంగా మెలిగేవాడు. ఈ క్రమంలో వారికి తెలియకుండా ఫొటోలు, వీడియోలు తీయించేవాడు. వారితో చేసిన చాటింగ్, వీడియో కాల్స్ తాలూకు స్క్రీన్‌షాట్స్ కూడా సేవ్ చేసుకునేవాడు. కొన్ని రోజుల పాటు ఇలా స్నేహం కొనసాగించిన తర్వాత తన ఆరోగ్యం బాగా లేదంటూ డబ్బు కావాలని కోరేవాడు. కొంతమంది అతడి మాటలు నమ్మి పెద్దమొత్తంలో ముట్టజెప్పారు. అయితే మరికొంత మంది మాత్రం డబ్బులేదని చెప్పడంతో వారి ప్రైవేటు ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తానంటూ బ్లాక్‌మెయిలింగ్‌కు దిగేవాడు. అతడి ఆగడాలు ఎక్కువవడంతో కొంతమంది అమ్మాయిలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం సామాజిక మాధ్యమాల్లో అతడి గురించి సమాచారాన్ని పోస్ట్ చేశారు. ఈ విషయం చిన్మయి దృష్టికి రావడంతో ఆమె పోలీసులను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో శనివారం కాశిని అరెస్టు చేసిన కన్యాకుమారి పోలీసులు.. అతడి మోడస్ ఆపరాండి గురించి వివరిస్తూ ట్విటర్లో పత్రికా ప్రకటనను షేర్ చేసి చిన్మయిని ట్యాగ్ చేశారు. ఫేక్ ఐడీలతో కాశి ఇదంతా చేశాడని.. ఇంకెవరైనా బాధితులు ఉంటే ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదని.. వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు షేర్ చేయవద్దని హెచ్చరించారు. Press release by @kumari_police regarding the Guy Kasi ! @Chinmayi pic.twitter.com/bp26TqSZ7T — Kanyakumari Memes (@kanyakumarimeme) April 24, 2020 -
100 రోజుల్లో.. కశ్మీర్ టూ కన్యాకుమారికి పరుగు
న్యూఢిల్లీ : సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న విద్వేశం ఆగాలని, మనమంతా ఒక్కటేననే భావనలో జీవించాలని కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఓ మారథన్ రన్నర్ ‘యూనిక్ మిషన్’ పరుగును మొదలు పెట్టింది. ఢిల్లీకి చెందిన 33 ఏళ్ల సుఫియా సుఫి.. 11 రాష్ట్రాలు, 25 నగరాలు, వేలాది గ్రామాల మీదుగా 100 రోజుల్లో పరుగును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మధ్యలో గాయం మూడు రోజులపాటు ఆమెను ఇబ్బంది పెట్టినా ఆమె సంకల్పం ముందు చిన్నబోయింది. ఏప్రిల్ 25న తన పరుగును ప్రారంభించిన సుఫియా.. జమ్మూకశ్మీర్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, రాజస్తాన్, మధ్యప్రదేశ్ రాష్టాల్లో తన పరుగును పూర్తి చేసుకుని ముంబైకి చేరింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతమైన విద్వేశం వ్యాప్తి చెందుతుంది. నా పరుగు దానికి కౌంటర్‌గా ఉంటుందని భావిస్తున్నాను. మనుష్యులంతా మానవత్వం, ఏకత్వం, శాంతి, సమానత్వంతో జీవించడమే నాకు కావాలి.’ అని తెలిపింది. ఇప్పటి వరకు తన సొంత డబ్బులనే ఈ మిషన్‌కు ఉపయోగించానని తెలిపిన ఆమె.. ప్రస్తుతం క్రౌడ్ ఫండింగ్ చేస్తున్నట్లు పేర్కొంది. లిమ్కారికార్డు హోల్డర్ అయిన సుఫియా.. 15 రోజుల్లో 720 కిలోమీటర్ల పరుగును పూర్తి చేసుకోని ఈ ఘనతను అందుకుంది. ఫిజికల్ ఫిట్నెస్ కోసం పరుగును ప్రారంభించిన ఆమె.. ప్రస్తుతం అదే పిచ్చిగా జీవిస్తోంది. ఏయిర్ ఇండియాలో ఉద్యోగం వదిలేసి మరి పరుగెత్తుతోంది. తన ’యూనిక్ మిషన్’ మధ్యలో గాయంతో సుఫియా ఆసుపత్రిలో చేరడంతో ఆమె పరుగు 3 రోజులు ఆగింది. ‘ ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఈ మిషన్ ఎలా పూర్తి చేస్తాననే ఆందోళన కలిగింది. నేను పరుగుత్తుతున్న రూట్లో చాలా ట్రాఫిక్ ఉంటుంది. ఇదే నా అనారోగ్యానికి కారణం. కానీ నేను వెంటనే కోలుకుని నా పరుగును అందుకున్నాను. మరి కొద్ది రోజుల్లోనే నా మిషన్ పూర్తి చేస్తాను’ అని ధీమా వ్యక్తం చేసింది. ఇక సుఫియా తన లక్ష్యాన్ని చేరుకోవాలని మనం కూడా ఆశిస్తూ.. ఆల్‌దిబెస్ట్ చెబుదాం. -
సహగమపదని..!
వాకా మంజులారెడ్డి సంగీత కచేరీ వేదిక మీద సహవాయిద్యాలతో అలరించే వాళ్లలో ఎక్కువగా మగవాళ్లే కనిపిస్తుంటారు. ఈ తరం మహిళలు ఆ భేదాన్ని తుడిచేస్తున్నారు. రేపు (మే 11, శనివారం) హైదరాబాద్, రవీంద్ర భారతిలో జరుగుతున్న సంగీత విభావరిలో పాల్గొంటున్న వాద్యకారులంతా మహిళలే. వయోలిన్, సహ వయోలిన్, మాండలిన్, ఫ్లూట్, మృదంగం, తబలా, ఘటం, మోర్చింగ్వాద్యాలను మహిళలే వాయిస్తారు. మొత్తం ఎనిమిది మంది మహిళలు పంచుకోనున్న ఈ వేదిక దక్షిణ భారతమంతటికీ ప్రాతినిధ్యం వహిస్తోంది. వయోలిన్ విద్వాంసురాలు అవసరాల కన్యాకుమారి సంగీత ప్రపంచ వైతాళికుల్లో ఒకరు. మద్రాసు మ్యూజిక్ అకాడమీ నుంచి సంగీత కళానిధి పురస్కారం అందుకున్న తొలి మహిళా వయోలిన్ వాద్యకారిణి ఆమె. దాదాపుగా యాభై ఐదేళ్ల సంగీత సాధనలో ఆమె దేశ విదేశాల్లో వేలాది కచేరీలు నిర్వహించి ప్రతిష్ఠాత్మకమైన పురస్కారాలందుకున్నారు. ఆమెను భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. దక్షిణాది రాష్ట్రాల్లో ఈ విభాగంలో పద్మశ్రీ పురస్కారం అందుకున్న తొలి మహిళ కన్యాకుమారి. పదేళ్ల కిందట తమిళనాడులో తీవ్రమైన దుర్భిక్షం నెలకొన్న తరుణంలో పద్మనాభస్వామి కోవెలలో స్వరజతి నిర్వహించారు. అప్పుడు వర్షం కురిసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ‘‘అది మా సంగీతకారుల గొప్పతనం కాదు, స్వరం– సాహిత్యం కలయికల గొప్పతనం’’ అన్నారామె. ఆమె కీర్తికిరీటంలో మరో కలికితురాయి అఖండం. ఎనభై మంది సంగీతకారులతో ఒక్కొక్కరు అరగంట చొప్పున ఇరవై నాలుగ్గంటల సేపు నిరంతరాయంగా సంగీత కచేరీ నిర్వహించారామె. విజయనగరంలో పుట్టిన తాను చెన్నైలో స్థిరపడడానికి కారణం అక్కడ సంగీతానికి ఉన్న ఆదరణేనన్నారు. ‘‘తమిళనాడులో సంగీతానికి ప్రత్యేక ఆదరణ ఉంది, ఆ కారణంగానే మన తెలుగు కళాకారులు అనేక మంది చెన్నైలో స్థిరపడుతున్నారు. ద్వారం వెంకటస్వామి నాయుడు, బాల మురళీకృష్ణ, సుశీల వంటి సంగీతఖనులు తమిళనాడుకి వెళ్లడానికి కారణం తమిళుల సంగీతారాధన, కళకు లభిస్తున్న గౌరవాలే. నా యాభై ఐదేళ్ల సంగీత ప్రయాణంలో పాతిక సంగీత సాధనాలతో జుగల్బందీ ప్రయోగాలు చేశాను. వాయిద్యకారులుగా మహిళలు తక్కువగానే ఉన్నారు. ఫ్లూటు, మాండలిన్, ఘటం, మోర్చింగ్లో అయితే మరీ తక్కువ. ప్రస్తుతం వోకల్ మ్యూజిక్‌తో పోలిస్తే ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్‌కి ఆదరణ తగ్గుతోంది. వోకల్ రాణించాలంటే ఇన్స్ట్రుమెంట్స్ సహకారం తప్పని సరి. అన్ని రకాల సంగీతరీతులనూ గౌరవించగలిగినప్పుడే కళ సమతుల్యంగా ఉంటుంది’’ అన్నారు కన్యాకుమారి. కావేరి తీరాన గోదావరి సంగీతం మాది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు. ఐదేళ్లకు చెన్నైలో ఉన్న తాతగారి దగ్గరకు వెళ్లిపోయాను. నాకు మాండలిన్ నేర్పించాలనేది ఆయన కోరికే. ఆరేళ్ల నుంచి ప్రాక్టీస్ చేసి, ఎనిమిదేళ్లకు తొలి కచేరీ ఇచ్చాను. త్యాగరాజు ఆరాధన ఉత్సవాల సందర్భంగా తమిళనాడులో కావేరీ నది తీరాన తిరువాయూర్లో తొలి ప్రదర్శన ఇచ్చే భాగ్యం కలిగింది. అది త్యాగరాజు పుట్టిన ఊరు. అప్పట్లో నన్ను చైల్డ్ ప్రాడిజీ బేబీ నాగమణి అనేవారు. చెన్నైలో చిన్మయ విద్యాలయలో చదువుకున్నాను. ఆ స్కూలు సాంస్కృతిక కళలను ప్రోత్సహిస్తుంది. తొమ్మిదేళ్లకే సౌత్ ఆఫ్రికాలో పదిహేను కచేరీలు చేయగలిగాను. కాశ్మీర్ తప్ప దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కచేరీలు చేశాను. నా తొలి గురువు, మామయ్య అయిన యు.పి రాజుగారితో వివాహమైంది. చెన్నైలో స్థిరపడ్డాం. చెన్నైలోనే ‘శాస్త్రీయ మాండలిన్ శిక్షణ’ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాం. – ఉప్పలపు నాగమణి, మాండలిన్ వాద్యకారిణి అష్ట స్వర సంగమమ్ విజయనగరంలో పుట్టిన కన్యాకుమారి, పాలకొల్లు వాద్యకారిణి బేబీ నాగమణి, హైదరాబాద్ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ నుంచి తబలాలో పట్టా పుచ్చుకున్న కేరళ మహిళ రత్నశ్రీ, బెంగుళూరు నుంచి ఫ్లూట్ కళాకారిణి వాణీ మంజునాథ్, మోర్చింగ్ విద్వాంసురాలు భాగ్యలక్ష్మి ఎమ్ కృష్ణ, తమిళనాడు నుంచి మృదంగ విద్వాంసురాలు అశ్విని శ్రీనివాసన్, ఘట వాద్యకారిణి రమ్య రమేశ్, అనుతమ మురళి.. రేపు తెలుగు శ్రోతలను అలరించడానికి హైదరాబాద్‌లో కొలువుదీరనున్నారు. కన్యాకుమారి ఆధ్వర్యంలో ఈ ‘సంగీత సంగమమ్’ జరుగుతోంది. ఈ సంగీత విభావరిని వెంకటాచలం అయ్యర్ జ్ఞాపకార్థం ప్లాంజెరీ ఫౌండేషన్ నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ నిర్వాహకులు శంకర్ ప్లాంజెరీ, రాజ్యలక్ష్మి ప్లాంజెరీ దంపతులు తెలియచేశారు. నాన్నను చూసి నేర్చుకున్నాను మాది బెంగళూరు. మా నాన్నగారు ప్రముఖ మోర్చింగ్ కళాకారుడు ‘గానకళా భూషణ’ విద్వాన్ డాక్టర్ ఎల్ భీమాచార్. ఆయన ప్రాక్టీస్ చేస్తుంటే రోజూ చూసేదాన్ని. అలా మోర్చింగ్ మీద ఆసక్తి కలిగింది. పదేళ్ల వయసు నుంచి ప్రాక్టీస్ మొదలు పెట్టాను. దేశవిదేశాల్లో పదిహేను వందల కచేరీల్లో పాల్గొన్నాను. డాక్టర్ ఎం. బాల మురళీ కృష్ణ, విదుషి నీల రామ్‌గోపాల్, విదుషి ఎ. కన్యాకుమారి, సంజయ్, సుధా రఘునాథన్ వంటి ప్రముఖులకు మోర్చింగ్ సహకారం అందించాను. ఆల్ ఇండియా రేడియోలో ఏ గ్రేడ్ ఆర్టిస్ట్ట్ని. ఈ రంగంలో అమ్మాయిలను తీసుకురావాలనేది నా కోరిక. భాగ్యలక్ష్మి ఎం. కృష్ణ, తొలి మహిళా మోర్చింగ్ కళాకారిణి -
కన్యాకుమారి.. వరించేదెవరిని!
బీజేపీ తమిళనాడులో 2014 లోక్‌సభ ఎన్నికల్లో గెలుచుకున్న ఏకైక నియోజకవర్గం కన్యాకుమారి. ఇక్కడ నుంచి ఎన్నికైన కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్.. కాంగ్రెస్ ప్రత్యర్థి హెచ్.వసంతకుమార్‌ను 1.28 లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో ఓడించారు. వీరిద్దరే మళ్లీ తలపుడుతున్నారు. కిందటి లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే, డీఎంకే వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. ఈ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే కూటమిలో బీజేపీ, డీఎంకే కూటమిలో కాంగ్రెస్ చేరడంతో ఈ రెండు ప్రధాన ప్రాంతీయ పక్షాలు పోటీలో లేవు. నియోజకవర్గం ఏర్పడ్డాక జరిగిన 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసిన డీఎంకే అభ్యర్థి జే హెలెన్ డేవిడ్సన్.. బీజేపీ అభ్యర్థి పొన్ రాధాకృష్ణన్‌ను 65 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఓడించారు. చాలా ఏళ్లుగా ఈ ప్రాంతంలో బీజేపీ బలపడుతోంది. ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లున్న కన్యాకుమారి స్థానంలో 15 లక్షల మందికి పైగా ఓటర్లున్నారు. పోలింగ్ గురువారం జరగనుంది. నియోజకవర్గాల పునర్విభజనలో నాగర్‌కోయిల్ స్థానం రద్దయి 2009లో కన్యాకుమారి ఏర్పాటైంది. ప్రస్తుతం ఇక్కడ రెండు జాతీయ పక్షాల అభ్యర్థుల మధ్య గట్టి పోటీ ఉందనీ, గెలుపుపై జోస్యం చెప్పడం కష్టమని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. 1999లో నాగర్‌కోయిల్ నుంచి రాధాకృష్ణన్.. 1999 లోక్‌సభ మధ్యంతర ఎన్నికల్లో డీఎంకే కూటమిలో ఉన్న బీజేపీ మంచి ఫలితాలు సాధించింది. ఈ ఎన్నికల్లో పొన్ రాధాకృష్ణన్ నాగర్‌కోయిల్ స్థానం నుంచి బీజేపీ టికెట్‌పై పోటీ చేసి గెలుపొందారు. 2004 పార్లమెంటు ఎన్నికల్లో ఆయన సీపీఎం అభ్యర్థి ఏవీ బెలార్మిన్ చేతిలో ఓడిపోయారు. కన్యాకుమారి నియోజకవర్గంలో గణనీయ సంఖ్యలో ఉన్న బీసీ వర్గం నాడార్ కులానికి చెందిన రాధాకృష్ణన్ జనాదరణ కలిగిన నాయకుడు. నియోజకవర్గంలోని 19 లక్షల జనాభాలో సగం మంది హిందువులు. క్రైస్తవులు 40–45 శాతం వరకు ఉన్నారు. ఎన్నికల్లో మతపరమైన విభజన బీజేపీకి అనుకూలాంశం. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్న రాధాకృష్ణన్ 2013లో ఈ ప్రాంతంలోని పేద హిందువులందరికీ స్కాలర్షిప్లు ఇవ్వాలంటూ సాగిన ఉద్యమానికి నాయకత్వం వహించారు. ధనికులైన మైనారిటీలకు స్కాలర్షిప్లు ఇస్తున్నారనీ, హిందువులను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఈ ఆందోళన ఉధృతంగా సాగింది. మంత్రి అయ్యాక రాధాకృష్ణన్ ఈ విషయంలో చేసిందేమీ లేదనే అసంతృప్తి స్థానికుల్లో ఉంది. మత్స్యకారులు తమ ఉత్పత్తులను కొచ్చి, తూత్తుకుడి వంటి దూర ప్రాంతాలకు పంపే అవసరం లేకుండా వారి కోసం కోల్డ్ స్టోరేజీ సౌకర్యం కల్పిస్తానని బీజేపీ అభ్యర్థి హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే–కాంగ్రెస్ హవా 2016 అసెంబ్లీ ఎన్నికల్లో కన్యాకుమారి పరిధిలోని ఆరు అసెంబ్లీ సీట్లను డీఎంకే, కాంగ్రెస్ కూటమి కైవసం చేసుకుంది. రెండు పార్టీలూ మూడేసి స్థానాలు గెలుచుకున్నాయి. పేదలకు నెలకు రూ.6 వేల సహాయ పథకంతోపాటు తనను గెలిపిస్తే వ్యవసాయ, విద్యా రుణాలు మాఫీ చేయిస్తానని కాంగ్రెస్ అభ్యర్థి వసంత కుమార్ ప్రస్తుత ఎన్నికల్లో హామీ ఇస్తున్నారు. వసంతకుమార్ కూడా నాడార్ వర్గానికి చెందిన నాయకుడే. నియోజకవర్గంలో టెక్నోపార్క్ ఏర్పాటు చేయిస్తానని ఆయన వాగ్దానం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బ్రాంచీలున్న రిటైల్ సంస్థ వసంత్ అండ్ కంపెనీ స్థాపకుడైన వసంత్‌కుమార్ ఈసారి గెలుపునకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల్లో ప్రభావం చూపే అంశాలు ► సగం జనాభా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నా గ్రామీణ ప్రాంతాలను వ్యవసాయ సంక్షోభం కుంగదీస్తోంది. రైతులకు మేలు చేసే విధానాలు అమలు చేయకపోవడంతో గిట్టుబాటు ధరలు లేక వారు అల్లాడుతున్నారు. జీడిపప్పు దిగుమతి నిబంధనలు సడలించడంతో ఈ రంగంలోని ఫ్యాక్టరీ కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. ► రహదారుల విస్తరణతో వ్యవసాయ భూముల విస్తీర్ణం తగ్గిపోతోంది. జలవనరులు కుంచించుకుపోతున్నాయి. ఇవన్నీ ఎన్నికల్లో చర్చకు వస్తున్నాయి. ► ఎన్డీఏ సాగరమాల ప్రాజెక్టులో భాగంగా కోలాచల్లో ఏర్పాటు చేస్తామన్న కంటెయినర్ టెర్మినల్ ప్రాజెక్టును అధికారంలోకి వచ్చాక సమీపంలోని ఇనాయంకు తరలించారు. తమ జీవనోపాధికి ఈ ప్రాజెక్టు నష్టదాయకమంటూ స్థానిక మత్స్యకారులు ఆందోళన చేశారు. చివరికి ఈ ప్రాజెక్టును కోవలంలో ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. కాని, కోలాచల్, ఇనాయం, తెంగైపట్టినం వంటి తీర ప్రాంతాల్లోని క్రైస్తవులైన లక్ష మందికి పైగా మత్స్యకారులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ► రాధాకృష్ణన్‌కు కన్యాకుమారి, నాగర్‌కోయిల్‌లో చెప్పుకోదగ్గ బలం ఉంది. తీర ప్రాంతాల్లో బీజేపీ మద్దతుదారుల సంఖ్య తక్కువ. తన గెలుపు తీర ప్రాంత ప్రజల తీర్పుపై ఆధారపడి ఉండటంతో ఈ ప్రాంత ప్రజల సమస్యలు ఈసారి తప్పక పరిష్కరిస్తానని బీజేపీ అభ్యర్థి హామీ చేస్తున్నారు. -
తొలిసారి మోదీ నోట అభినందన్ మాట
సాక్షి, చెన్నై: భారత వింగ్ కమాండర్ విక్రం అభినందన్ ధైర్యసాహసాలను చూసి ప్రతీ భారతీయుడు గర్వపడుతున్నాడని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. తమిళనాడులోని కన్యాకుమారిలో శుక్రవారం ఆయన పర్యటించారు. ఈసందర్భంగా మోదీ మాట్లాడుతూ.. పాకిస్తాన్ చెరలో చిక్కుకున్న అభినందన్ గురించి తొలిసారి ప్రస్తావించారు. అభిందన్ తమిళనాడు పౌరుడు అయింనందుకు ప్రతి భారతీయుడు గర్వ పడుతున్నాడని అన్నారు. కేంద్ర తొలి మహిళా రక్షణ శాఖమంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఈ రాష్ట్రానికే చెందినవారేనని గుర్తుచేశారు. కాంగ్రెస్ హయాంలో ఉగ్రవాదంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఉగ్రవాదాన్ని అంతంచేయడం కోసం తమ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని మోదీ పేర్కొన్నారు. పార్లమెంట్‌పై ఉగ్రవాదుల కాల్పులు, ముంబై బ్లాస్టింగ్స్‌తో పాటు అనేక ఉగ్రదాడులు జరిగినా గత పాలకులు ప్రతీకార చర్యలు తీసుకోలేపోయ్యారని మండిపడ్డారు. పఠాన్‌కోటా, పుల్వామా దాడికి తాము ఏవిధంగా బదులిచ్చామో దేశమంతటా తెలుసని అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తమ పోరాటం ఎప్పటికీ ఉంటుందని మోదీ స్పష్టం చేశారు. -
తమిళనాడు: కన్యాకుమారిలో శీవారి ఆలయం
-
ఆకాశంలో ఆర్మీ సాహసం
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఇండియన్ ఆర్మీ ఆకాశంలో అద్భుతం సృష్టించనుంది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆకాశమార్గాన భారీ బెలూన్‌లో సాహస ప్రయాణం చేసి రికార్డు నెలకొల్పబోతోంది. అందులో భాగంగా మంగళవారం ఇక్కడికి చేరుకున్న బృందం తిరిగి బుధవారం బయలుదేరి వెళ్లింది. వివరాల్లోకి వెళితే..ఇండియన్ ఆర్మీ అధికారి మేజర్ అనిరుధ్ నేతృత్వంలో 60 మంది సైనికుల బృందం జమ్మూ–కశ్మీర్ నుంచి తమిళనాడు కన్యాకుమారి వరకు భారీ బెలూన్‌లో ఆకాశయానాన సాహస ప్రయాణాన్ని గత నెల 6వ తేదీన ప్రారంభించింది. ఇండియన్ ఆర్మీ అనే అక్షరాలు రాసి ఉన్న రంగు రంగుల ఆకర్షణీయమైన ఈ బెలూన్‌లో నలుగురు మాత్రమే ప్రయాణించాల్సి ఉంది. ఈ కారణంగా నలుగురు సైనికులు బెలూన్‌లో ప్రయాణిస్తే మిగిలిన వారు రోడ్డు మార్గంలో వారిని అనుసరించారు. నిర్ణీత ప్రయాణం చేసిన తరువాత బెలూన్ నేలపైకి దిగినపుడు అందులోని సైనికులు కిందకు దిగుతుండగా..మరో నలుగురు అందులో ఎక్కేలా ఏర్పాట్లు చేసుకున్నారు. జమ్మూ–కశ్మీర్ నుంచి ఆగ్రా, భోపాల్, తిరుపతి మీదుగా చెన్నైకి చేరుకున్నారు. చెన్నై నుంచి కాంచీపురానికి సమీపంలోని కురువిమలైలోని విమాన కంట్రోలు కార్యాలయం మైదానంలో మంగళవారం సాయంత్రం దిగారు. ఆకాశంలో ఎగురుకుంటూ వచ్చి మైదానంలో దిగిన బెలూన్ చూసి పరిసరాల ప్రజలు ఆశ్చర్యంతో చుట్టూ చేరారు. సైనిక వీరులతో సెల్ఫీ దిగారు. ఇక్కడ కొన్ని గంటలపాటు విశ్రాంతి తీసుకుని తిరిగి బుధవారం బయలు దేరారు. చెన్నై, తిరుచ్చిరాపల్లి, మదురై, శివకాశి, తిరునెల్వేలి మీదుగా ఈనెల 29వ తేదీకి కన్యాకుమారి చేరుకుంటారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ సాహస ప్రయాణంలో ఆకాశమార్గాన 3,236 కిలోమీటర్లు, రోడు మార్గంలో 3,901 కిలోమీటర్లు పయనించినట్లవుతుందని వారు తెలిపారు. -
కేరళ, తమిళనాడు సరిహద్దుల్లో ఉద్రిక్తత
సాక్షి, చెన్నై: కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ పట్ల కేరళ పోలీసులు వ్యవహరించిన తీరును ఖండిస్తూ బీజేపీ నేతలు చేపట్టిన కన్యాకుమారి జిల్లా బంద్ కొనసాగుతుంది. బంద్‌లో భాగంగా బీజేపీ నేతలు జిల్లావ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. పలుచోట్లు ఆందోళనకారులు కేరళ రవాణా సంస్థకు చెందిన బస్సులపై దాడి చేశారు. దీంతో కేరళ, తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణం నెలకొంది. సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొనడంతో అధికారులు ఇరు రాష్ట్రాల మధ్య వాహన రాకపోకలను నిలిపివేశారు. భారీగా మోహరించిన పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కాగా, రాధాకృష్ణన్ ఇరుముడితో అయ్యప్ప దర్శనార్థం బుధవారం శబరిమలైకి వెళ్లారు. ప్రైవేటు వాహనంలో రాధకృష్ణన్ పంబన్‌కు వెళ్లడంతో ఆయన్ను అడ్డుకున్నారు. అక్కడ పోలీసులు ఆయనతో వ్యవహరించిన తీరు వివాదస్పదంగా మారింది. దీంతో రాధాకృష్ణన్‌కు జరిగిన అవమానానికి నిరసనగా ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న కన్యాకుమారిలో బీజేపీ నేడు బంద్ చేపట్టింది. -
మహబూబ్‌నగర్ జిల్లాలో దారుణం
సాక్షి, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని మక్తల్ మండలం ముసులేపల్లిలో బుధవారం మహిళా హెడ్మాస్టర్పై ఆమె భర్త కత్తితో దాడి చేశాడు. పాఠశాలలోనే జరిగిన ఈ ఘటనలో హెడ్మాస్టర్ కన్యాకుమారి తీవ్రంగా గాయపడింది. అనంతరం భర్త కూడా గొంతుగోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. గ్రామస్తులు ఇద్దరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కుటుంబ కలహాలతో భర్త రమణారెడ్డి దాడి చేసినట్లుగా సమాచారం. -
కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఆమె పాదయాత్ర
-
ఆమె పాదయాత్ర 3,800 కిలోమీటర్లు
సాక్షి, న్యూఢిల్లీ : కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు అంటే దేశ దక్షిణ మూల నుంచి ఉత్తర కొన వరకు బస్సుల్లో, రైళ్లలో ప్రయాణించే వారిని మనం ఎంతో మందిని చూస్తూనే ఉంటాం. తీర్థ యాత్రల కోసం, ప్రకతి వీక్షణ కోసమో అలాంటి వారు ప్రయాణిస్తుంటారు. వారందరికి భిన్నంగా సృష్టి భక్షి అనే యువతి కన్యాకుమారి నుంచి గతేడాది సెప్టెంబర్ 14వ తేదీన కశ్మీర్‌లోని శ్రీనగర్ వరకు పాదయాత్రను ప్రారంభించారు. అదీ ఓ సమున్నతాశయం కోసం. దేశంలోని మహిళలను సంపూర్ణ సాధికారత సాధించే దిశగా వారికి స్ఫూర్తినివ్వడం కోసం, మహిళలకు, ఆడ పిల్లలకు భారత దేశాన్ని సురక్షిత ప్రాంతంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఆమె ఈ యాత్ర ప్రారంభించారు. ఈ ఆశయ సాధన కోసం సృష్టి భక్షి ‘క్రాస్బో మైల్స్’ను స్థాపించి అదే బ్యానర్‌పై ఆధునిక దండి యాత్ర పేరిట 3,800 కిలోమీటర్ల పొడువైన పాదయాత్రను ప్రారంభించారు. మొత్తం 260 రోజులు సాగనున్న పాతయాత్రలో ఆమె ఇప్పటికే 128 రోజుల యాత్రను ముగించారు. సృష్టి భక్షి 3,800 కిలోమీటర్ల పాదయాత్ర ముగిసేటప్పటికీ వందకోట్ల అడుగులు పూర్తవుతాయన్నది ఆమె చెబుతున్న ఒక అంచనా. సృష్టి తన పాద యాత్ర సందర్భంగా పలు నగరాలు, పట్టణాల్లోని విద్యా సంస్థల్లో, మహిళా సంస్థల ఆధ్వర్యంలో మహిళా సాధికారికతపై సదస్సులు, సమావేశాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో కళాకారులతో కలసి గోడలపై పెయింటింగ్స్ రూపంలో తమ ప్రచారాన్ని కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రజల విరాళాలపై అంటే, ఆహారం, వసతి కల్పించడం లాంటి సాయంతో పాదయాత్ర కొనసాగిస్తున్న సృష్టి వెంట ఓ డాక్యుమెంటరీ ఫిల్మ్ బృందం కూడా వెళుతోంది. మార్గమధ్యంలో అనేక వర్గాలకు చెందిన ప్రజలు, ముఖ్యంగా మహిళా పోలీసులు సృష్టి భక్షికి సంఘీభావంగా కలిసి కొంతదూరం పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఏదో లక్ష్యం కోసం ఎవరైనా పాద యాత్రను నిర్వహించవచ్చని ఆమె ప్రజలకు పిలుపునిస్తున్నారు. -
కుమారికి.. రాహుల్ గాంధీ
సాక్షి, చెన్నై: కన్యాకుమారిలో ఓఖి బాధితుల్ని పరామర్శించేందుకు ఏఐసీసీ అధ్యక్షుడిగా ఎంపికైన రాహుల్‌గాంధీ వెళ్తున్నారు. గురువారం ఆయన పర్యటన సాగనుండడంతో కుమరిలో భద్రత కట్టుదిట్టం చేశారు. ఓఖి ప్రళయ తాండవానికి కన్యాకుమారి సర్వం కోల్పోయిన విషయం తెలిసిందే. కడలిలోకి వెళ్లిన వందలాది మంది జాలర్ల జాడ కాన రాలేదు. ఆదుకుంటామన్న భరోసాను ప్రభుత్వం ఇచ్చినా బాధితులు మాత్రం పోరాటాలు సాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికే కేంద్రం తరఫున రక్షణ మంత్రి నిర్మల సీతారామన్, రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్షాలకు చెందిన నేతలందరూ బాధితుల్ని పరామర్శించి ఓదార్చి వచ్చారు. ఈనేపథ్యంలో కొద్ది రోజులుగా గుజరాత్ ఎన్నికల బిజీగా ఉన్న రాహుల్ గాంధీ ప్రస్తుతం కుమరిలో పర్యటించేందుకు నిర్ణయించారు. నేడు రాక : ఏఐసీసీ అధ్యక్షుడిగా ఎంపికైన రాహుల్‌గాంధీ కన్యాకుమారిలో పర్యటించనుండడంతో కాంగ్రెస్ వర్గాలు ఆయన దృష్టిలో పడేందుకు సిద్ధమయ్యాయి. పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు కుమరికి బుధవారమే తరలి వెళ్లారు. అయితే, పార్టీ వర్గాలతో ఎలాంటి పలకరింపులకు అవకాశం లేకుండా, కేవలం బాధిత ప్రాంతాల్లో పర్యటించే విధంగా రాహుల్ కుమరికి వచ్చేందుకు నిర్ణయించారు. ఆ మేరకు తిరువనంతపురం నుంచి హెలికాప్టర్లో కుమరి తూత్తురులోని ఓ ప్రైవేటు కళాశాలలో ఏర్పాటు చేసిన హెలిపాడ్‌కు ఉదయం 11గంటల సమయంలో చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఆయన పర్యటన సాగనుంది. తొలుత చిన్నదురైలో బాధితుల్ని పరామర్శించనున్నారు. ఆ తదుపరి పంట పొలాలు, జాలర్ల గ్రామాల్లో ఆయన పర్యటన సాగనుంది. అలాగే, జాలర్లు, రైతు సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యే విధంగా రాహుల్ పర్యటనను రూపొందించారు. రాహుల్ పర్యటనతో కుమరిని నిఘా నీడలోకి తెచ్చారు.ఆయన పర్యటన సాగే ప్రాంతాల్లో భద్రతను పెంచారు. తిరునల్వేలి, తూత్తుకుడిల నుంచి అదనపు బలగాలను రంగంలోకి దించారు. కడలిలోకి వెళ్లిన వారిలో 662 మంది జాలర్ల జాడ ఇంత వరకు కాన రాలేదని, వారి మీద ఆశలు సన్నగిల్లుతున్నట్టు జాలర్ల కాంగ్రెస్ అధ్యక్షుడు గుణనాథన్ ఆవేదన వ్యక్తం చేశారు. చెన్నైలో బాధితుల్ని ఆదుకోవాలని నినదిస్తూ బుధవారం జాలర్ల కాంగ్రెస్ నేతృత్వంలో ఆందోళన కార్యక్రమం జరిగింది. -
సుచీంద్రం ఆలయాన్ని ముంచెత్తిన వరద
-
సుచీంద్రం ఆలయాన్ని ముంచెత్తిన వరద
సాక్షి, చెన్నై : ఓక్కి తుపాను తమిళనాడు, లక్షద్వీప్‌ను అతలాకుతలం చేస్తోంది. భీకరమైన ఈదురుగాలులు, ఎగిసిపడుతున్న అలలతో తీర ప్రాంతం భీకరంగా ఉంది. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఇప్పటివరకూ 8 మంది మరణించగా 90 మంది ఆచూకీ గల్లంతయింది. తమిళనాడులో పరిస్థితి మరింత తీవ్రంగా ఉండడంతో 7 జిల్లాల్లోని పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. కన్యాకుమారి వద్ద సముద్రం ఉప్పొంగింది. ప్రఖ్యాత సుచీంద్రం ఆలయం లోపలికి సముద్రపు నీరు చొచ్చుకువచ్చింది. ఆలయంలోని ముఖమంటపం మొత్తం నీరు నిండిపోయింది. దీంతో ఆలయాన్ని అధికారులు మూసేశారు. లక్షద్వీప్‌లో సముద్రం హోరెత్తుతోంది. అలలు ఎగిసిపడుతున్నాయి. తీరప్రాంతంలోని రిసార్టుల్లోకి సముద్రపు నీరు ప్రవేసించింది. -
కన్యాకుమారి అతలాకుతలం..
-
తమిళనాడుపై పగబట్టిన వరుణుడు
చెన్నై: తమిళనాడుపై వరుణుడు మరోసారి తన ప్రతాపం చూపిస్తున్నాడు. తుఫాను ప్రభావంతో ప్రసిద్ధి పర్యాటకకేంద్రం కన్యాకుమారి అతలాకుతలం అయ్యింది. జిల్లాలో భారీ వర్షాల కారణంగా అయిదుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఇవాళ మధ్యాహ్నం కురిసిన భారీ వర్షాలకు తోడు, ఈదురు గాలులతో పెద్ద ఎత్తున చెట్లు కూలిపోయాయి. ఒక్కసారిగా చెట్లు కూలడంతో పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వర్షాలతో పాటు ఈదురు గాలులు బలంగా వీడయంతో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. అలాగే కన్యాకుమారిలో హై అలర్ట్ ప్రకటించిన అధికారులు, సముద్రంలో వేటకు వెళ్లడాన్ని నిషేధించడమే కాకుండా, పర్యాటకులు సముద్రంలో ఈత కొట్టడంతో పాటు, బీచ్‌కి వెళ్లడంపై ఆంక్షలు విధించారు. అలాగే తిరునల్వేలి, కన్యాకుమారి, రామేశ్వరం, కొలాచల్ ఓడరేవుల్లో మూడోనెంబర్ ప్రమాద హెచ్చరిక జారీచేశారు. ఇక వర్షాల కారణంగా కన్యాకుమారి నుంచి నాగర్ కోవిల్, త్రివేండ్రం వెళ్లే రైళ్లను నిలిపివేశారు. మరోవైపు తుఫాను ప్రభావంతో ఏడు జిల్లాల్లో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. కాగా ఈ నెల మొదట వారంలో తమిళనాడులో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. -
కన్యాకుమారి టు కాశ్మీర్
అడ్డాకుల(దేవరకద్ర): మహిళల సాధికారత కోసం ఓ యువతి కన్యాకుమరి నుంచి కాశ్మీర్(శ్రీనగర్)కు చేపట్టిన పాదయాత్ర సోమవారం మండలంలోని జాతీయ రహదారి మీదుగా సాగింది. డెహ్రడూన్ ప్రాంతానికి చెందిన స్రిష్టిబక్షి అనే యువతి సెప్టెంబర్ 15న కన్యాకుమారిలో పాదయాత్ర ప్రారంభించింది. మహిళల రక్షణ, చిన్న పిల్లలపై ఆకృత్యాల నివారణ, అక్షరాస్యత ద్వారా మహిళలు సాధికారత సాధించి దేశంలో మహిళలకు సురక్షిత స్థానం ఉండాలన్న ఆకాంక్షతో పాదయాత్ర చేపట్టింది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌లోని శ్రీనగర్ వరకు 260రోజుల్లో 3800 కిలోమీటర్ల మేర 100కోట్ల అడుగులతో పాదయాత్ర సాగనుంది. 2018 ఏప్రిల్ 28న శ్రీనగర్‌లో పాదయాత్ర ముగియనుంది. ఈ నెల 12న జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాలపాడులో స్రిష్టి బక్షి పాదయాత్ర ద్వారా తెలంగాణలో అడుగు పెట్టింది. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, అదిలాబాద్ జిల్లాల మీదుగా సాగే పాదయాత్ర డిసెంబర్ 16న మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లాలోకి ప్రవేశించనుంది. అడ్డాకులలో బక్షి పాదయాత్రకు ఎస్ఐ ఆర్.మధుసూదన్, హెడ్ కానిస్టేబుల్ కృష్ణయ్య, కానిస్టేబుల్ శ్రీనివాసులు, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వెంకట్‌సాగర్, నాయకులు ప్రవీన్, గంగుల రాజశేఖర్‌రెడ్డి, శివ, వెంకటేష్, రాజు, శ్రీను తదితరులు ఘనస్వాగతం పలికారు. ఆమెతోపాటు కొంతదూరం నడిచారు. మహిళా శక్తి వంటింటికే పరిమితం కాకూడదు మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: మహిళా శక్తి వంటింటికి పరిమితం కాకూడాదని గ్రాస్బో స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి స్రిష్టి బక్షి అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలికల జూనియర్ కళాశాలలో మహిళల హక్కులపై ఎన్ఎస్ఎస్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహణ సదస్సులో ఆమె మాట్లాడారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ యాత్రలో భాగంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
మూడు సముద్రాల తీరరేఖ కలిగిన ప్రదేశం?
భారతదేశ తీర మైదానాలు దక్కన్ పీఠభూమికి ఇరువైపులా అరేబియా సముద్రం, బంగాళాఖాతం వెంబడి వివిధ వెడల్పుల్లో తీర మైదానాలున్నాయి. ఇవి రెండు రకాలు.. అవి.. పశ్చిమ తీర మైదానం తూర్పు తీర మైదానం పశ్చిమ తీర మైదానం ఈ మైదానం దక్కన్ పీఠభూమికి పశ్చిమం వైపున, అరేబియా సముద్రం మధ్య వ్యాపించి ఉంది. ఈ మైదానం సన్నగా, అసమానంగా అక్కడక్కడా కొండలున్న భూభాగంతో గుజరాత్ తీరంలోని ‘రాణా ఆఫ్ కచ్’ నుంచి దక్షిణాన ‘కన్యాకుమారి’ వరకు విస్తరించి ఉంది. ఈ మైదానాలు ఇరుగ్గా, తక్కువ వెడల్పుతో ఉంటాయి (10–25 కి.మీ). ఈ మైదానాల్లో డెల్టాలు, కయ్యలు మాత్రమే ఉన్నాయి. గమనిక: నదులు తమతోపాటు తెచ్చిన ఒండ్రు మట్టిని వాటి ముఖద్వారం వద్ద నిక్షేపించకుండా సముద్రంలో కలిస్తే ఆ ప్రాంతాలను కయ్యలు అంటారు. పశ్చిమ తీర రేఖ సచ్ఛిద్రంగా రంపపు పళ్ల నిర్మాణాన్ని కలిగి ఉండటం వల్ల ఈ మైదానంపై భ్రంశాలు ఏర్పడ్డాయి. అందువల్ల ఈ మైదానం సహజ ఓడ రేవులకు ప్రసిద్ధి చెందింది. పశ్చిమ కనుమల పశ్చిమ వాలు ఎక్కువగా ఉండటం, పశ్చిమ కనుమలకు, అరేబియా సముద్రానికి మధ్య దూరం తక్కువగా ఉండటం వల్ల ఇక్కడ డెల్టాలు లేవు. పశ్చిమ తీర మైదానాన్ని వివిధ రకాలుగా విభజించవచ్చు. అవి.. 1. గుజరాత్ మైదానం ఇది గుజరాత్‌లోని ‘రాణా ఆఫ్ కచ్’ నుంచి ‘డామన్’ వరకు విస్తరించి ఉంది. ఇక్కడున్న తీరాన్ని గుజరాత్ తీరం/కాండ్లా తీరం/ కథియవార్ తీరం/గిర్నార్ తీరం అని పిలుస్తారు. ఈ మైదానం అటుపోట్లకు ప్రసిద్ధి. ఈ తీర మైదానంలో ప్రవహించే నదులు– నర్మద, తపతి, సబర్మతి. ఈ మైదాన తీరంలో ‘గిర్నార్’ కొండలున్నాయి. ఈ కొండల్లో ఎత్తయిన శిఖరం – గిర్ శిఖరం. గిర్నార్ కొండల్లో ‘గిర్ నేషనల్ పార్క్’ (జునాగఢ్ – గుజరాత్) ఉంది. 2. కొంకణ్ మైదానం ఈ మైదానం డామన్ నుంచి గోవా వరకు విస్తరించి ఉంది. ఇది మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల్లో ఉంది. ఈ తీర మైదానం బసాల్ట్ నేలలకు ప్రసిద్ధి. దీన్ని కొంకణ్ తీరం అని కూడా పిలుస్తారు. 3. కర్ణాటక మైదానం ఇది ‘గోవా’ నుంచి కన్ననూర్ వరకు విస్తరించి ఉంది. దీన్ని కెనరా తీరం అని కూడా పిలుస్తారు. ఈ మైదానం గుండా శరావతి, నేత్రావతి నదులు ప్రవహిస్తున్నాయి. ఈ మైదానంలో ప్రవహించే శరావతి నదిపై దేశంలోకెల్లా అతి ఎత్తయిన జలపాతం జోగ్(జర్సొప్పా) ఉంది. దీని ఎత్తు సుమారు 275 మీ. ఈ తీర మైదానం కయ్యలకు ప్రసిద్ధి. 4. కేరళ మైదానం ఈ మైదానం కన్ననూర్ నుంచి కన్యాకుమారి వరకు విస్తరించి ఉంది. దీన్ని మలబార్ తీరం అని కూడా పిలుస్తారు. మలబార్ తీరం ఉప్పునీటి సరస్సులకు ప్రసిద్ధి. వీటినే లాగూన్లు (వృష్ట జలాలు) అంటారు. ఇక్కడ ఉన్న లాగూన్లు– అష్టముడి, వెంబనాడ్. ఇక్కడి లాగూన్లను స్థానికంగా కాయల్ అని పిలుస్తారు. ఈ కాయల్ను వెనుక జలాలు అంటారు. దేశంలో పొడవైన లాగూన్, సరస్సు – చిల్కా సరస్సు (ఒడిశా) దేశంలో అత్యధికంగా లాగూన్లు విస్తరించి ఉన్న మైదానం – మలబార్ తీరం ఈ మైదానంలో ప్రవహించే నదులు –పెరియార్, పంబ, భద్రావతి మొదలైనవి. దేశంలో పశ్చిమ, తూర్పు తీరాల పొడవు – 6,100 కి.మీ దేశంలో అత్యధిక తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం – గుజరాత్ (1,054 కి.మీ.) రెండోది ఆంధ్రప్రదేశ్ (974 కి.మీ.) తూర్పు తీర మైదానం ఈ మైదానం దక్కన్ పీఠభూమికి తూర్పున, బంగాళాఖాతానికి మధ్య విస్తరించి ఉంది. ఈ మైదానం పశ్చిమ తీర మైదానంలా కాకుండా బల్లపరుపుగా ఉండి ఎక్కువ వెడల్పుతో (సుమారు 120 కి.మీ) ఉంది. ఈ మైదానం దక్షిణాన కన్యాకుమారి నుంచి ఈశాన్యంగా సువర్ణ రేఖ నది మీదుగా గంగానది ముఖ ద్వారం వరకు (సుమారు 1,800 కి.మీ పొడవున) విస్తరించి ఉంది. తూర్పు తీరంలో మహానది, గోదావరి, కృష్ణా, పెన్నా, కావేరి నదులతో ఏర్పడిన డెల్టాలున్నాయి. గమనిక: నదులు తమతోపాటు తెచ్చిన ఒండ్రు మట్టిని నది ముఖద్వారం వద్ద నిక్షేపంæచేసి, సముద్రంలో కలిసే ప్రాంతాన్ని డెల్టా అంటారు. ఈ తీరంలోని డెల్టాలు దక్షిణ భారతదేశ ధాన్యాగారాలుగా ప్రసిద్ధి చెందాయి. తూర్పు తీరంలో పొడవైన తీరం ఉన్న రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. తూర్పు తీర మైదానం విశాలమైన బీచ్‌లతో ఉంది. విరూపకారక బలాల వల్ల బంగాళాఖాతం.. ఖండ భూభాగం నుంచి క్రమంగా తిరోగమిస్తోంది. తూర్పు తీరంలోని హుగ్లీ నది ముఖద్వారం వద్ద, సముద్రంలోని ఖండ భాగాలు తిరోగమనం చెందడం వల్ల న్యూమూరో దీవులు ఆవిర్భవించాయి. ఒకప్పుడు కొల్లేరు సరస్సు తూర్పు మైదానంలో కృష్ణ–గోదావరి నదీ డెల్టాల మధ్య ఉప్పు నీటి సరస్సుగా ఉండేది. అనంతరం బంగాళాఖాతం క్రమంగా ఖండ భూభాగం నుంచి తిరోగమించడంతో కొల్లేరు సరస్సు ప్రస్తుతం తీరానికి దూరంగా ఖండ భూభాగంపై మంచినీటి సరస్సుగా ఆవిర్భవించింది.తూర్పు తీర మైదానాన్ని వివిధ మైదానాలుగా విభజించవచ్చు. అవి.. 1. తమిళనాడు మైదానం దీన్ని కోరమాండల్ తీరం అని కూడా అంటారు. ఇది కన్యాకుమారి నుంచి పులికాట్ సరస్సు వరకు వ్యాపించి ఉంది. ఈ మైదానంలో ప్రవహించే నది – కావేరి. దీన్ని ప్రాచీన కాలంలో చోళ మండలం అని పిలిచేవారు. పులికాట్ సరస్సుకు సమీపంలోనే శ్రీహరి కోట ద్వీపం ఉంది. ఇక్కడే సతీష్ ధావన్ రాకెట్ ప్రయోగ కేంద్రం (షార్) ఉంది. పులికాట్ సరస్సును ఆనుకొని నేలపట్టు పక్షి సంరక్షణ కేంద్రం ఉంది. గమనిక: మనదేశంలో మూడు సముద్రాల తీర రేఖ కలిగిన రాష్ట్రం – తమిళనాడు. మూడు సముద్రాల తీర రేఖ కలిగిన ప్రదేశం–కన్యాకుమారి (తమిళనాడు) 2. ఆంధ్రా మైదానం దీన్ని కోస్తా తీరం లేదా సర్కార్ తీరం అని పిలుస్తారు. ఇది పులికాట్ సరస్సు నుంచి బరంపురం (ఒడిశా) వరకు విస్తరించి ఉంది. ఈ మైదానంలో గోదావరి, కృష్ణా, పెన్నా డెల్టాలు విస్తరించి ఉన్నాయి. కృష్ణా–గోదావరి నదుల మధ్య కొల్లేరు సరస్సు ఉంది. ఇందులో కలిసే నదులు – బుడమేరు, తమ్మిలేరు, ఉప్పుటేరు. కొల్లేరు సరస్సులోని నీటిని సముద్రంలోకి తీసుకెళ్లే నది – ఉప్పుటేరు. 3. ఉత్కళ మైదానం దీన్ని ఒడిశా తీరం/కళింగ తీరం/ఒడియాతీరం అని కూడా పిలుస్తారు. ఈ మైదానం బరంపురం నుంచి సుందర్బన్స్ వరకు వ్యాపించి ఉంది. ఈ మైదానంలో ఉన్న డెల్టా– మహానది. ఇక్కడ చిల్కా సరస్సు ఉంది. ఇందులో రిడ్లే తాబేళ్లను సంరక్షిస్తున్నారు. ఈ తీరంలో సిమ్లిపాల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది. 4. వంగ తీరం దీన్ని కాంతి తీర మైదానం అని పిలుస్తారు. ఇది సుందర్బన్స్ నుంచి గంగానది ముఖద్వారం వరకు విస్తరించి ఉంది. ఇక్కడ గంగానది డెల్టా ఉంది. దీన్ని బెంగాలీ తీరం అని కూడా పిలుస్తారు. ఈ తీరంలో మడ అడవులున్నాయి. ప్రపంచంలోకెల్లా అతి పెద్దదైన సుందర్బన్స్ డెల్టా ఈ తీర మైదానంలోనే ఉంది. పశ్చిమ తీరాలు – రాష్ట్రాలు కాండ్లా తీరం – గుజరాత్ కొంకణ్ తీరం – మహారాష్ట్ర, గోవా కెనరా తీరం – కర్ణాటక మలబార్ తీరం – కేరళ తూర్పు తీరాలు – రాష్ట్రాలు కోరమాండల్ తీరం – తమిళనాడు సర్కార్ తీరం – ఆంధ్రప్రదేశ్ ఉత్కళ/కళింగ తీరం – ఒడిశా వంగ తీరం – పశ్చిమ బెంగాల్ ఎడారులు భారత ఉప ఖండంలో అతి పెద్ద ఎడారి థార్. దీన్ని భారతదేశ గొప్ప ఎడారి అంటారు. ఇది ఆరావళి పర్వతాలకు వాయవ్యంగా, సుమారు 2 లక్షల చ.కి.మీ. విస్తీర్ణంలో ఉంది. ఈ ఎడారి భారతదేశంలో అత్యధికంగా, పాకిస్థాన్‌లో కొద్ది భాగం విస్తరించి ఉంది. ఈ ఎడారి రాజస్థాన్‌లో అధిక భాగం, పంజాబ్, హరియాణాల్లో కొంత భాగం విస్తరించి ఉంది. ఈ ఎడారిలో వార్షిక వర్షపాతం అతి తక్కువగా (10 సెం.మీ–50 సెం.మీ) ఉండటం వల్ల ముళ్ల పొదల వంటి ఉద్భిజ్జాలు (జెరోఫైటిక్ వృక్షాలు) అక్కడక్కడా ఉన్నాయి. ఈ ఎడారి ప్రాంతంలో జోధ్‌పూర్, బికనీర్, జైసల్మీర్ మొదలైన పట్టణాలున్నాయి. పోఖ్రాన్ అణుపరిశోధన ఇక్కడే జరిపారు. నీటి లభ్యత ఉన్న ప్రదేశాల్లో జన్మించి ఎడారుల మీదుగా ప్రవహించే నదులను ఎడారి జీవనదులు లేదా ఎక్సోటిక్ రివర్స్ అని పిలుస్తారు. ఈ ఎడారిలో సింధూ నది ప్రవహిస్తుంది. -
కడలిపై విమాన కలకలం
టీ.నగర్: కన్యాకుమారి సముద్రంపై గుర్తు తెలియని విమానం చక్కర్లు కొట్టడంతో కలకలం చెలరేగింది. దీంతో పోలీసులు రాత్రంతా గస్తీ పనులలో నిమగ్నమయ్యారు. కన్యాకుమారి జిల్లాలోని ఆరోగ్యపురం నుంచి నీరోడి వరకు 45కు పైగా సముద్రతీర గ్రామాలున్నాయి. ప్రస్తుతం ఈ తీర గ్రామాలలో భద్రతను పెంచారు. కుళచ్ఛల్ నుంచి కోస్టుగార్డు పోలీసులు ఆధునిక పడవలలో ప్రతిరోజు గస్తీ తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి కన్యాకుమారి నుంచి కుళచ్ఛల్ వరకు గల తీర ప్రాంతాల్లో ఓ విమానం చక్కర్లు కొట్టింది. దీనిపై ఆందోళన చెందిన స్థానికులు వెంటనే ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ కార్యాలయ కంట్రోల్ రూమ్‌కు సమాచారం తెలిపారు. వెంటనే అక్కడికి చేరుకున్న కన్యాకుమారి పోలీసులతో పాటు కుళచ్ఛల్ నుంచి కోస్టుగార్డు పోలీసులు కూడా వచ్చి తీర ప్రాంతాలలో గస్తీ తిరిగారు. ఈ విమానం మూడు గంటల సేపు ఆ ప్రాంతంలో పర్యటించినట్లు తెలిసింది. దీంతో ఆ ప్రాంతంలో పోలీసులు గస్తీని పెంచారు. తీర ప్రాంతాలలో అనుమానిత వ్యక్తులు సంచరించినట్లయితే వెంటనే తెలియచేయాలని పోలీసులు ప్రజలను కోరారు. -
కుమరిలో హైఅలర్ట్
సాక్షి, చెన్నై: ఈశాన్య రుతు పవనాల ప్రభావంతో కన్యాకుమారి జిల్లాలో వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడ తెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నా యి. ఇక రాష్ట్రంలో పలు చోట్ల కెరటాలు వెనక్కి తగ్గడంతో ప్రజల్లో సునామి భ యం బయలు దేరి ఉన్నది. కుమరిలో చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై అధికారులతో మంత్రి ఆర్బీ ఉదయకుమార్ సమాలోచించారు. ఈశాన్య రుతు పవనాల ప్రభావం అత్యధికంగా కేరళ సరిహద్దుల్లో ఉన్న కన్యాకుమారి జిల్లా మీద ఉన్నది. తదుపరి తిరునల్వేలి మీద ప్రభా వం చూపుతున్నది. అయితే కన్యాకుమారిలో మాత్రం ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. కాసేపు కుండ పోతగా, మరి కాసేపు చిరు జల్లులతో కూడిన వర్షం పడుతుండడంతో అక్కడి జలాశయాలన్నీ నిండే స్థాయి చేరాయి. పెరుంజాని జలాశయం నిండడంతో ఉబరి నీళ్లను విడుదల చేశారు. ఆ తీరం వెంబడి ఉన్న పదిహేడు గ్రామాల ప్రజల్ని అప్రమత్తం చేశారు. అలాగే ఐదు గ్రామాల తీరవాసుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వర్షం తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న దృష్ట్యా, జిల్లాల్లోని అన్ని చెరువులు, చిన్న చిన్న జలాశయాలు, చెక్ డ్యాంల నుంచి ఉబరి నీటిని విడుదల చేసే పనిలో పడ్డారు. కుమరిలో వర్షం ప్రభావం అత్యధికంగా ఉండడంతో అక్కడ చేపట్టిన ముందస్తు చర్యలు, బాధితుల్ని ఆదుకునేందుకు తగ్గ కార్యక్రమాలపై రెవెన్యూ శాఖ మంత్రి ఆర్బీ ఉదయకుమార్ సోమవారం సచివాలయంలో సమీక్షించారు. సహాయ చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. వెనక్కి సముద్రం: నిన్న మొన్నటి వరకు కడలిలో కెరటాల జడి అంతాఇంతా కాదు. చెన్నై పట్టినం బాక్కం, శ్రీనివాసపురంలతో పాటుగా నాగపట్నం నుంచి కన్యాకుమారి తీరం వరకు కెరటాలు ఉవ్వెత్తున ఎగసి పడ్డాయి. పట్టినంబాక్కంలో అయితే, యాభై ఇళ్లు ఈ అలల తాకిడికి పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితుల్లో సోమవారం ఉన్నట్టుండి సముద్రం వెనక్కి తగ్గింది. సాధారణంగా ఒడ్డుకు దూసుకొచ్చే ప్రాంతం నుంచి మరీ వెనక్కి తగ్గడంతో ప్రజల్లో ఆందోళన బయల్దేరింది. ఎక్కడ సునామీ వంటి ప్రళయాలు ఎదురవుతాయో అన్న ఆందోళన నెలకొని ఉన్నది. ఇందుకు కారణం గతంలో కెరటాలు ఉవ్వెత్తున ఎగసి పడడం, తదుపరి వెనక్కు తగ్గడం అనంతరం కొద్ది రోజులకు సునామీ రూపంలో ప్రళయం ముంచుకు రావడం తెలిసిందే. -
హాస్టల్ గదిలో మెడికో ఆత్మహత్య
చెన్నై: హెచ్ సీయూలో రోహిత్ వేముల ఆత్మహత్య, జేఎన్ యూ వివాదం పార్లమెంట్ సమావేశాలను కుదిపేస్తున్న తరుణంలోనే తమిళనాడులో మరో దళిత విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కన్యాకుమారిలోని ప్రఖ్యాత శ్రీ మూగాంబికా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో మెడిసిన చివరి సంవత్సరం చదువుతోన్న పార్థి అనే దళిత విద్యార్థి ఆదివారం హాస్టల్ గదిలోని ఫ్యాన్ కు ఉరివేసుకున్నాడు. ఇది గమనించిన స్నేహితులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. పోస్టుమార్టం నివేదిక అందాల్సి వుంది. ఆత్మహత్యకు గల కారణాలూ తెలియాల్సిఉంది. -
మనకు మనమేతో ప్రజల్లో మార్పు ముగిసిన స్టాలిన్ పయనం
♦ అధికారం తమదేనన్న ధీమా కరుణ ఆశీస్సులు ♦ మనకు...మనమే పర్యటన ప్రజల్లో మార్పును తీసుకొచ్చిందని, అధికారం తమదేనన్న ధీమాను డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్ వ్యక్తం చేశారు. మనకు..మనమే నినాదంతో ఆయన చేపట్టిన పయనం శుక్రవారంతో ముగిసింది. సాక్షి, చెన్నై : రానున్న ఎన్నికల్లో అధికార పగ్గాలు చేపట్టి తీరాలన్న కాంక్షతో డీఎంకే అధినేత ఎం కరుణానిధి ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ఆయన వ్యూహాలకు పదును పెట్టే రీతిలో రాష్ట్రంలో ఇంత వరకు ఏ పార్టీ చేపట్టని పర్యటనకు ఎన్నికల ముందు స్టాలిన్ శ్రీకారం చుట్టారు. మనకు..మనమే’ నినాదంతో ప్రజల్లోకి దూసుకెళ్లే దిశగా గత ఏడాది సెప్టెంబర్‌లో కన్యాకుమారి వేదికగా పయనానికి స్టాలిన్ శ్రీకారం చుట్టారు. ఈ పర్యటనలో స్టాలిన్ సరికొత్త గెటప్‌తో ముందుకు సాగారు. సరికొత్త గెటప్‌లో స్టైలిష్‌గా ఉన్న స్టాలిన్‌ను అభినందనలు తెలియజేసే వాళ్లుంటే, వ్యంగ్యాస్త్రాలు సంధించే వాళ్లూ ఈ సమయంలో పెరిగారు. తమిళనాడు సమగ్రాభివృద్ధి, విద్యా, ఉద్యోగ అవకాశాల మెరుగు, ఆర్థికంగా బలోపేతం, మార్పు తదితర అంశాలతో మనకు...మనమే నినాదంతో పాదయాత్ర రూపంలో, సైకిల్ తొక్కుతూ, ఆటో, ట్రాక్టర్ నడుపుతూ, బడ్డీకొట్టుల్లో బజ్జీలు తింటూ, టీ తాగుతూ ఇలా స్టాలిన్ సాగించిన ఈ పర్యటనకు అమిత స్పందనే వచ్చిందని చెప్పవచ్చు. కన్యాకుమారిలో చేపట్టిన పర్యటన శుక్రవారం టీనగర్ నియోజకవర్గంలో ముగిసింది. వ్యాపారులతో సమావేశమై భరోసా ఇచ్చారు. హామీలు గుప్పించారు. టి నగర్ నియోజకవర్గంలోని ప్రజల్ని అప్యాయంగా పలకరిస్తూ, తమకు అండగా నిలవాలని వేడుకోలు పలికారు. ఇక, పర్యటన ముగియడంతో మనకు..మనమే దిగ్విజయవంతమైందని స్టాలిన్ ప్రకటించారు. అధినేత కరుణానిధిని కలుసుకుని ఆశీస్సులు అందుకున్నారు. మార్పు తథ్యం : మనకు..మనమే పర్యటన విజయవంతం గురించి మీడియాతో స్టాలిన్ మాట్లాడారు. 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తన పయనం సాగిందని గుర్తు చేశారు. ఎక్కడకు వెళ్లినా ప్రజలు ఆదరించారని, అన్నాడీఎంకే పాలనలో పడుతున్న కష్టాలను తన దృష్టికి తెచ్చారన్నారు. ఈ పర్యటనలో వెలుగు చూసిన ప్రతి అంశం, ప్రతి సమస్యను డీఎంకే పరిష్కరిస్తుందన్నారు. ఎన్నికల అనంతరం కూడా ఈ పయనం సాగుతుందన్నారు. ప్రజలందరిలో చైతన్యం వచ్చి ఉన్నదని, అన్నాడీఎంకే సర్కారును సాగనంపడం లక్ష్యంగా నిర్ణయం తీసుకుని ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల్లో మార్పు అన్నది వచ్చిందని, రానున్న ఎన్నికల ద్వారా డీఎంకే అధికార పగ్గాలు చేపట్టడం ఖాయం అన్నారు. డీఎంకే అధికారంలోకి వస్తే డీఎండీకే అధినేత విజయకాంత్ డిప్యూటీ సీఎం అవుతారా? అని ఈసందర్భంగా మీడియా ప్రశ్నించగా, విజయకాంత్ ఎక్కడైనా ఆ విధంగా చెప్పారా.? అంటూ ఎదురు ప్రశ్న వేశారు. -
సముద్రుడి కోసం దర్భశయనం...
కన్యాకుమారి ప్రసిద్ధం. రామేశ్వరం జగత్ ప్రసిద్ధం. కానీ ఆ సమీపంలోనే ప్రసిద్ధి చెందిన దేవాలయం ఒకటి ఉంది. అదే దర్భశయనం. రాముడు దర్భలమీద శయనించి, సముద్రుడిని ఉపాసించినట్టుగా చెబుతోంది ఇక్కడి స్థల పురాణం. పది అడుగుల రాముడి ఏకశిలా విగ్రహం గురించి, మరెన్నో విశేషాల గురించి వివరిస్తున్నారు దర్భశయనం సందర్శించిన ఒంగోలు వాస్తవ్యులు సంగుబొట్ల వెంకటసత్య భగవానులు. ‘పంచభూత లింగాల దర్శనంతో పాటు కన్యాకుమారి రామేశ్వరం ప్రాంతాలను సందర్శించాలనుకున్నాం మేము. కానీ అనుకోకుండా మరో పుణ్యక్షేత్రమైన దర్భశయన కూడా చూస్తామనుకోలేదు. అది మా యాత్రలో మాకు దక్కిన మరో భాగ్యం. ఒంగోలు నుంచి కన్యాకుమారి వరకూ దాదాపు 1000 కిలోమీటర్ల దూరం. రాను పోను మరో 1500 కిలోమీటర్ల ప్రయాణం పడుతుంది అనుకున్నాం. మా ప్రణాళిక ప్రకారం ఈ యాత్ర అంతా కలిపి 7 రోజులు. ఇదంతా వెహికిల్ మాట్లాడుకుని తిరుగుదామని నిశ్చయించుకున్నాం. ఒంగోలు నుంచి బయల్దేరి ఈ యాత్రకు విఘ్నాలు కలగకుండా ముందుగా కాణిపాకంలోని గణపతిని దర్శించుకొని చిత్తూరు మీదుగా అరుణాచలం చేరుకున్నాం. అక్కడే ‘అగ్నిలింగం’ ఉంది. దానిని దర్శించుకొని రాత్రి శ్రీరంగపట్టణం మీదుగా మరుసటిరోజు అక్కడకు సమీపంలో ఉన్న జంబూకేశ్వరం చేరుకున్నాం. ఇక్కడే ‘జల లింగం’ ఉంది. దానిని దర్శించుకొని దిండిగల్ మీదుగా పళని- అటు నుంచి మధురై- దర్శించుకొని కన్యాకుమారి చేరుకున్నాం. మన ఉపఖండానికి చివర ప్రాంతం ఇది. ఇక్కడికి పది కిలోమీటర్ల దూరంలో శుచీంద్రంలోని అనసూయాదేవి ఆలయం ఉంది. అనసూయాదేవి అంటే సతీ అనసూయ. ఆమె బ్రహ్మ విష్ణు మహేశ్వరులను పసిపిల్లలను చేసి, ఊయలలో ఊపిన స్థలం ఇదేనని అంటారు. ఇక్కడి దేవాలయం పై కప్పు మీద శ్రీచక్రం ఉండటం అబ్బురంగా అనిపించింది. అలాగే ఇక్కడి 20 అడుగుల హనుమంతుని విగ్రహం చూడటానికి కూడా రెండు కళ్లు సరిపోలేదు. మరునాడు కన్యాకుమారి నుంచి రామేశ్వరం చేరుకొని ఆ చుట్టుపక్కల దేవాలయాలన్నీ దర్శించుకున్నాక తిరుగు ప్రయాణానికి సిద్ధమై దారిలో రామనాథపురం చేరుకున్నాం. తమిళనాడులో ఇదో పెద్ద జిల్లా. ఇక్కడే మాకు దర్భశయనం గురించి తెలిసింది. రామనాథపురం నుంచి ఈ ఆలయం 10 కి.మీ. దూరంలో ఉందని స్థానికులు ఈ గ్రామాన్ని ‘తిరుపులని’ అంటారని చెప్పారు. ఈ వివరాలు విని దర్భశయనం చూడాలని నిశ్చయించుకున్నాం. రాత్రికి అక్కడే బస చేసి ఉదయం 6.30 గంటలకు ఆలయానికి చేరుకున్నాం. కాని 8 గంటలకు గానీ దేవాలయ ద్వారాలు తెరుచుకోలేదు. సుమారు 10-15 ఎకరాలలో ఉంటుంది దర్భశయన దేవాలయం. సువిశాలంగా ఉన్న ఆ ఆలయ ప్రాకారాలు చూసుకుంటూ ముందుకు సాగాం. అది చాలా ప్రాచీన గుడి. మూలవిరాట్టును చూడగానే మాటల్లో చెప్పలేని ఉద్వేగానికి లోనయ్యాం. కథ తెలుసుకొని తరించాం. పాయసం.. సంతాన భాగ్యం... ఇక్కడ దేవుడికి నైవేద్యంగా పాయసం పెడతారు. ఆ ప్రసాదాన్ని ఆకు దోనెలలో పెట్టి భక్తులకు పంచుతారు. ముఖ్యంగా సంతానం లేని దంపతులకు ప్రత్యేక పూజలు జరిపి ఈ పాయసం అందిస్తారు. ఈ పాయసం తింటే సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. కోనేరు తీర్థం పరమపవిత్రం దర్భశయనంలో అతిపెద్ద కోనేరు ఉంది. అయితే ఇందులో స్నానాలు చేయకూడదు. తీర్థంగా ఇక్కడి నీళ్లు తెచ్చుకోవచ్చు. పరమపవిత్రమైన తీర్థంగా ఈ కోనేటికి పేరుంది. వసతి సదుపాయాలు ఇది చిన్న ఊరు. చిన్న చిన్న హోటళ్లలో భోజనం లభిస్తుంది. బస చేయడానికి మాత్రం 10 కి.మీ దూరంలో ఉన్న రామనాథపురానికి రావాలి. అక్కడ చాలా మంచి వసతి సదుపాయాలు ఉన్నాయి. దర్భశయనం ఊరు చిన్నదే అయినప్పటికీ దేవాలయం మాత్రం పెద్దది. రామనాథపురం నుంచి ఆటోలు, బస్సు సౌకర్యాలు ఉన్నాయి. దర్భశయనంలో ఫొటోలు తీసేవారున్నారు. కెమరా తీసుకెళితే మనమే ఫొటోలు తీసుకోవచ్చు. పెద్దగా నిబంధనలు ఏమీ లేవు. పూజాద్రవ్యాలు అన్నీ లభిస్తాయి. వెంట తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. దర్భశయనం పూజాసామగ్రిని అమర్చుకునే బుట్టల అల్లికకు చాలా ప్రసిద్ధి. అలాంటి ఆకర్షణీయమైన బుట్టలు మరేచోట కనిపించలేదు. రూ.40 నుంచి వంద రూపాయల దాకా వివిధ పరిమాణాల్లో ఈ బుట్టలు ఉన్నాయి. ముఖ్య ఉత్సవాలు... మార్చి-ఏప్రిల్ నెలలో ఇక్కడ బ్రహ్మోత్సవం జరుగుతుంది. శ్రీరామనవమి ఇక్కడ ముఖ్యమైన పండగ. అలాగే వైకుంఠ ఏకాదశి, జన్మాష్టమి, పొంగల్, దీపావళి, వారాంతాలు భక్తజన సందడి ఎక్కువగా ఉంటుంది. దేవాలయ దర్శన వేళలు ఉదయం 8 గంటల నుంచి 12.20 వరకు మధ్యాహ్నం 3.30 నుంచి రాత్రి 8.00 వరకు. తిరుగుప్రయాణం... దర్భశయనం దర్శించుకున్న తర్వాత నవగ్రహ పాషాణం చేరాం. రాములవారు రావణవధ తర్వాత తిరుగు ప్రయాణంలో నవగ్రహాలను ప్రతిష్టించి సీతాసమేతంగా పూజలు చేసి వెళ్లిన ప్రదేశం ఇది. అక్కడ భక్తులు నవగ్రహపాషాణాన్ని స్వయంగా తాకి, సముద్రంలో స్నానం చేసి వస్తారు. అక్కడ నుంచి తంజావూరులోని ప్రసిద్ధ బృహదీశ్వరాలయాన్ని సందర్శించుకొని రాత్రికి చిదంబరం చేరాం. ఇక్కడే పంచలింగాలలో ఒకటైన ‘ఆకాశలింగం’ ఉంది. దానిని దర్శించుకుని అక్కడ నుంచి కాంచీపురానికి చేరుకున్నాం. అక్కడ ‘పృథ్వీలింగం’ (ఏకాంబరేశ్వరస్వామిని) దర్శించుకున్నాం. అక్కడ నుంచి విష్ణుకంచిలోని వెండిబల్లి, స్వర్ణబల్లిని స్పర్శించి, అక్కడ నుంచి తిరుపతి మీదుగా శ్రీకాళహస్తి చేరాం. ఇక్కడ ‘వాయులింగం’ను దర్శించుకొని తిరిగి ఒంగోలుకు ఏడో రోజున చేరాం. ఈ క్షేత్రాలలో అపురూపమైనదిగా రామేశ్వరంలో హనుమంతుడు లంఘించిన ప్రదేశం, గంధమాధన పర్వతం, రామేశ్వరానికి 10 కిలోమీటర్ల దూరంలో రామేశ్వరం-ధనుష్కోటి మధ్యలో సముద్రతీరంలో శ్రీరాముల వారు విభీషణుడు కలుసుకున్న ప్రదేశంలో ఓ గుడి ఉంది. అత్యంత ప్రాచీనమైన ఈ గుడిలో విభీషణుడు పూజలు అందుకుంటున్నాడు. ఇక్కడ పూజలు చేయడానికి ఎవరూ లేరు. మనమే పూజలు చేసి, విభీషణుడిని దర్శించుకొని రావాలి. ఈ గుడికి చాలా తక్కువ మంది భక్తులు వెళ్లడం కనిపించింది. ఇక్కడ ప్రదేశాలన్నీ రామాయణం జరిగింది అనడానికి ప్రత్యక్షసాక్ష్యాలు. వాల్మీకి మహర్షి రామాయణంలో దర్భశయనం, నవగ్రహ పాషాణం ప్రస్తావన యుద్ధకాండలో వివరించి ఉన్నారు. ఒక్కొక్కరికి 8 వేల రూపాయలు... ఒంగోలు నుంచి (రాను పోను) లెక్కిస్తే 2600 కిలోమీటర్లు వచ్చింది. హైదరాబాద్ నుంచి అయితే మరొక 450 కిలోమీటర్లు కలుపుకుంటే సరిపోతుంది. మొత్తం 3000 కిలోమీటర్లు అవుతుంది. వాహనం, భోజన వసతి, పూజాద్రవ్యాలు, పూజా కైంకర్యాలు.. ఇవన్నీ ఖర్చులు కలుపుకొని ఏడుగురికి 50 వేల రూపాయల ఖర్చు అయ్యింది. స్థలపురాణం శ్రీరామచంద్రుడు లంకకు వెళ్లడానికి వానర సేనతో సముద్రుడి మీద వారధి కట్టడానికి సిద్ధపడ్డాడు. సముద్రుడి కోసం ఇక్కడ రాముడు మూడు రోజుల పాటు దర్భల మీద శయనించి ఉపాసించాడు. అయినా సముద్రుడు రాలేదు. దీంతో సముద్రుడి మీద కోపగించిన రాముడు బాణ ప్రయోగానికి సంసిద్ధమయ్యాడు. దాంతో సముద్రం అల్లకల్లోలమైంది. అప్పుడు సముద్రుడు ప్రత్యక్షమై శ్రీరాముడితో వారధి కట్టుకొమ్మని అందుకు తాను సాయం చేస్తానని చెప్పాడు. దీంతో నీలుడి ఆధ్వర్యంలో వానర సేనతో వారధి నిర్మించాడు రాముడు. ఇందుకు ఆనవాలుగా ఈ ఆలయం మూలవిరాట్టు దర్భల మీద శయనించి ఉంటుంది. అయితే వేల ఏళ్ల క్రితం పులవార్, కలవార్, కన్నవార్ అనే ముగ్గురు మహర్షులు మహావిష్ణువు గురించి ఘోర తపస్సు చేశారని, మహావిష్ణువు ప్రత్యక్షమై వారి కోరిక మీదకు అక్కడి దర్భల మీద శయనించాడనే పురాణగాథ కూడా ఉంది. -
లోయలోపడ్డ విజయవాడ బస్సు.. పలువురికి గాయాలు
విశాఖపట్నం: శబరిమల వెళ్తున్న ఓ బస్సు లోయలో పడింది. శనివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో 53 మంది అయ్యప్ప భక్తులకు గాయలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి.. విజయవాడకు చెందిన ఓ ప్రైవేట్ బస్సు(ఏపీ 02 టీఏ5112)లో ఏపీకి చెందిన భక్తులు శబరిమలకు బయలుదేరారు. అయితే, ప్రమాదవశాత్తూ వీరు వెళ్తున్న బస్సు తమిళనాడులోని కన్యాకుమారి సమీపంలో లోయలో పడిపోయినట్లు సమాచారం. బస్సులో ప్రయాణిస్తున్న 53 మంది అయ్యప్ప భక్తులకు గాయాలయ్యాయి. పలువురు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. బాధితులంతా విశాఖ జిల్లా కాశింకోట మండలం పేరింటాళ్లపాలెంకు చెందిన వారుగా అధికారులు గుర్తించారు. బస్సు ప్రమాదం ఘటనపై మంత్రి గంటా శ్రీనివాసరావు,అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్ ఆరా తీశారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
మద్య నిషేధం
మద్య నిషేధాన్ని కోరుతూ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు యాత్ర చేపడుతు న్నట్టు సామాజిక ఉద్యమకారుడు స్వామి అగ్నివేశ్ ప్రకటించడం హర్షణీయం. మద్యం కారణంగా కలిగే దుష్పరి ణామా లు దారుణంగా ఉంటాయి. ఒకవేళ మద్యాన్ని అరికట్టినా, కల్తీ మద్యం పుణ్య మా అని వేలాది మంది చనిపోతున్నారు. లేదా రోగాల బారిన పడి ఆస్పత్రులకు చేరుతున్నారు. మద్యం అమ్మకాలను ప్రభుత్వాలే ప్రోత్సహించడం సరికాదు. మద్యపానాన్ని ఎందుకు నిషేధించరాదో తెలుపాల్సిందిగా కోరుతూ సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతా లకు నోటీసులు ఇచ్చింది. ఎప్పుడో ఇచ్చిన ఆ నోటీసులకు ఇంతవరకు జవాబు లేదు. విలువల గురించి మాట్లాడే ఎన్డీఏ ప్రభు త్వం అయినా సుప్రీంకోర్టుకు బాసటగా నిలవాలి. - పి. గంగునాయుడు, శ్రీకాకుళం -
ఈ అమ్మాయి చాలా గ్రేట్..
మంచానికే పరిమితమైన కవలల్ని వివాహమాడిన యువతులు పెద్దలు కాదన్నా ఒప్పించి మరీ తాళి కట్టించుకున్న వైనం చెన్నై, సాక్షి ప్రతినిధి: అవయవాలన్నీ సక్రమంగా ఉండి, సరైన ఆదాయం ఉంటేనే వివాహమవడం కష్టం. అటువంటిది రెండు దశాబ్దాలుగా పడకకే పరిమితమైన కవలలను ఇద్దరు యువతులు వివాహమాడారు. మానవత్వం చాటారు. జీవితాంతం తోడుంటామని బాస చేశారు. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా సామియార్ మఠానికి చెందిన జార్జి విలియమ్, అన్నమ్మాళ్ దంపతుల కుమారులైన విజయకుమార్, జయకుమార్ అనారోగ్యంతో పదేళ్ల వయసులోనే మంచం పట్టారు. తల్లిదండ్రులు ఎన్ని చికిత్సలు చేసినా ఫలితం దక్కలేదు. వారిప్పుడు 30 ఏళ్ల వయసుకు చేరుకున్నారు. 20 ఏళ్లుగా మంచానికే పరిమితమైపోయిన ఆ అన్నదమ్ముల గురించి తెలుసుకున్న కేరళకు చెందిన మంజూష సామియార్ మఠానికి చేరుకుని వారిపట్ల సానుభూతి ప్రకటించింది. అన్నదమ్ముల్లో పెద్దవాడైన విజయకుమార్‌ను 2012లో పెళ్లి చేసుకుంది. తిరునల్వేలి జిల్లా నాంగునేరీకి చెందిన శివకులదేవి సెల్‌ఫోన్ ద్వారా జయకుమార్తో పరిచయం పెంచుకుంది. వీరి పరిచయం క్రమేణా ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. పెద్దలు తొలుత తిరస్కరించినప్పటికీ శివకులదేవి వారిని మెల్లగా ఒప్పించింది. ఈ నెల 22వ తేదీన జయకుమార్ మంచంపై నుంచి లేవలేని స్థితిలోనే ఆమెను వివాహం చేసుకున్నాడు. -
జగన్మోహిని కొలువున్న చోటు..?
కౌన్సెలింగ్ విష్ణుమూర్తి జగన్మోహిని రూపంలో కొలువైన ప్రాంతమేది? దాని విశేషాలేంటి? - ప్రసాద్, విజయనగరం విష్ణుమూర్తి జగన్మోహినీ రూపంలో కొలువైన క్షేత్రం ర్యాలి. ఇది తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలో ఉంది. ఇక్కడున్న జగన్మోహినీ కేశవస్వామి ఆలయంలో విష్ణుమూర్తి జగన్మోహినీ రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. అంటే విగ్రహానికి ముందు వైపు విష్ణుమూర్తి, వెనుక వైపు జగన్మోహిని రూపం భక్తులకు కనిపిస్తుంది. సాలగ్రామ శిలగా ఉన్న ఈ విగ్రహం పొడవు ఐదు అడుగులు. వెడల్పు మూడు అడుగులు. ఈ విగ్రహంలోని శిల్ప సౌందర్యం వర్ణనాతీతం. ప్రపంచంలో ఇలాంటి విగ్రహం మరెక్కడా లేదంటారు. హనుమంతుడిని వెన్నతో అలంకరించే క్షేత్రమేది? అది ఎక్కడ ఉంది? - సి.హెచ్.కుమార్, ఈమెయిల్ హనుమంతుడిని వెన్నతో అలంకరించే క్షేత్రం శుచీంద్రం. ఈ క్షేత్రంలోని స్థానేశ్వర స్వామి ఆలయంలో ఉన్న భారీ హనుమంతుడిని రోజూ వెన్నతో అభిషేకించి, వెన్నతోనే అలంకారం చేస్తారు. ఇలాంటి సంప్రదాయం దేశంలో ఇదొక్కటే కావడం విశేషం. హనుమంతుడు ఇక్కడ భారీ ఆకారంలో దర్శనమిస్తాడు. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు స్వామి వారికి వెన్న సమర్పించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. శుచీంద్రం తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి క్షేత్రానికి సుమారు ఇరవై కిలోమీటర్ల ఈవల ఉంది. -
సముద్ర తీర ప్రాంతాల సందర్శన
పాఠక పర్యటన మూడు సముద్రాలు కలిసే చోట స్నానాలు... మంచుకొండలలో అద్భుతాలు... ‘పచ్చని తరులు నెలకొన్న గిరులు మండువేసవిలో చల్లందనాన్ని... అలలు లేని సముద్రంపై లాంచీలలో విహారం ఆహ్లాదాన్ని ... ఆలయాల సందర్శన ఆధ్యాత్మికత సౌరభాలను ఎదనిండా నింపింది’ అంటూ కొచ్చిన్ నుంచి కన్యాకుమారి వరకు సాగిన తమ ప్రయాణపు అనుభూతుల గురించి వివరిస్తున్నారు హైదరాబాద్ వాస్తవ్యులైన వీరయ్యకొంకల. మండువేసవిలో చల్లదనాన్ని ఆస్వాదించడానికి విహారయాత్ర చేద్దామని మిత్రులు జె.కె శ్రీనివాస్, కె.భరత్‌ల కుటుంబాలతో కలిసి రెండు నెలల ముందుగానే ప్లాన్ చేశాం. దీని వల్ల మొత్తం తొమ్మిది రోజులలో 14 ముఖ్య ప్రదేశాలను చూడగలిగాం. దాదాపు 4,220 కి.మీ... కొచ్చిన్ నుండి చెన్నై వరకు ఉన్న అన్ని సముద్ర తీర ప్రాంతాలను చూసి ఎంజాయ్ చేశాం. రాత్రి హైదరాబాద్ నుండి బయల్దేరి మరుసటి ఉద యం 10 గంటలకు కోయంబత్తూరులో రైలు దిగాం. ఘాట్రోడ్లో దారి కిరువైపుల ఎత్తై చెట్లు, వంపుల రోడ్లు, సన్నగా ఉన్న సింగిల్ రోడ్లో మా ప్రయాణం సాగింది. పచ్చందనాల ఊటి... ముందుగా ఊటి చేరుకున్నాం. తమిళనాడులో నీలగిరి పర్వతాలలో ఉన్న ప్రసిద్ధి చెందిన పర్యాటక కేంద్రం ఊటి. ఎటు చూసినా పచ్చదనం మంత్రముగ్ధులను చేశాయి. ఇక్కడ భోజనాల సమయంలో తాగడానికి వేడినీళ్ళు ఇచ్చారు. ముందు ఆశ్చర్యం అనిపించినా, వేసవిలోనూ చల్లగా ఉండే వాతావరణం అబ్బురమనిపించింది. అలలు లేని సముద్రం.. రెండవరోజు ఉదయం కొయంబత్తూరుకు వెళుతూ మధ్యలో తేయాకు తోటలను సందర్శించాం. కోయంబత్తూరు నుండి ఎర్నాకుళం చేరుకుని, సాయంకాలం కొచ్చిన్ ఓడరేవుకు చేరుకున్నాం. అలలు లేని గంభీర సముద్రం.. అక్కడక్కడా ఆగి ఉన్న పెద్ద పెద్ద ఓడలను చూస్తూ ఎంజాయ్ చేశాం. ద్వీపాల సముదాయం... మూడవరోజు ఉదయం అలెప్పీ చేరుకున్నాం. ఇక్కడంతా సముద్రం బ్యాక్ వాటర్, చిన్న చిన్న ద్వీపాల సముదాయాలతో ఉంటుంది. నీటిలో అక్కడక్కడా లాంచీల స్టాండులు, చిన్న చిన్న గ్రామాలు... వింతగా అనిపించాయి. అలెప్పీ బీచ్‌కు వెళ్లి 4 గంటలకు పైగా సముద్రంలో ఎంజాయ్ చేసి తిరిగి ఎర్నాకుళం చేరుకున్నాం. రాత్రి కి తిరువనంతపురం బయల్దేరాం. పద్మనాభుని సందర్శన... నాలుగవ రోజు కేరళలోని తిరువనంతపురం లో పద్మనాభస్వామి ఆలయానికి వెళ్లి, అటు నుంచి 10 కి.మీ దూరంలో కోవలం బీచ్‌లో గంటల తరబడి చల్ల చల్లగా ఎంజాయ్ చేశాం. పడమటి సింధూరం కన్యాకుమారి... భారతదేశానికి దక్షిణ దిక్కున చిట్టచివరి ప్రదేశమైన కన్యాకుమారి ప్రకృతి సిద్ధమైన అద్భుతం. ఇక్కడ సూర్యోదయం అత్యద్భుతంగా ఉంటుంది. ఇక్కడ అరేబియా, బంగాళాఖాతం, హిందూమహాసముద్రం కలిసే చోట అందరం స్నానాలు చేశాం. ఆసియాలో అతి పెద్ద విగ్రహం తిరుళ్ళువార్ సముద్రంలో 133 అడుగుల ఎత్తులో ఉంటుంది. దానికి దగ్గరలోనే వివేకానంద రాక్ మెమోరియల్ ఉంది. అక్కడ నుంచి మధురై బయల్దేరాం. పవిత్ర నగరం మదురై... తమిళనాడులోని మదురై నగరంలో మీనాక్షి అమ్మవారిని దర్శించుకొని, అనంతరం ట్రావెల్ బస్సులో రామేశ్వరంకు ప్రయాణించాం. తమిళనాడులోని ముఖ్య పట్టణాలలో రామేశ్వరం ఒకటి. శ్రీలంకకు అతి దగ్గరగా ఉన్న ఈ పట్టణంలో ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన రామనాథస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం ఎంతో విశాలంగా అద్భుతంగా ఉంటుంది. మేమంతా సముద్రంలో స్నానాలు చేసి, ఆలయానికి చేరుకున్నాం. మేఘాలలో విహారం... కొడెకైనాల్! ఏడో రోజు ఉదయం ట్రావెల్ బస్సులో కొడెకైనాల్ బయల్దేరాం. ఘాట్‌రోడ్డు మీద ప్రయాణం.. కొంతసేపు ఎండకాస్తే, మరికొంతసేపు వానజల్లులతో తడిసిపోతున్న కొండకోనలు కనువిందుచేశాయి. మే చివరి వారంలో.. అదీ మండువేసవిలో... స్వెటర్లు, మంకీ క్యాపులు ధరించినా చలికి తట్టుకోలేకపోయాం. మధ్య మధ్యలో జలపాతాలు.. వాటి పరిసరాలలో వేడి వేడి పదార్థాలు తిని చలి నుంచి సాంత్వన పొందాం. రైలులో రాత్రికి చెన్నై బయల్దేరి, ఎనిమిదవ రోజు ఉదయం చెన్నై నుండి 70 కి.మీ దూరంలో కంచీపురం చేరుకున్నాం. అక్కడ కంచికామాక్షి, ఏకాంబరేశ్వర, కంచి మఠం దర్శించుకొని, కంచి పట్టుచీరల సొగసు, మెరీనా బీచ్ అందాలను గుండెల్లో నింపుకుని, రాత్రి రైలులో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యాం. -
ప్రముఖుల లేఖలు: చలం
కన్యాకుమారి ఇంద్రజాలం రామేశ్వరం- 25-5-1934 ఈ ద్వీపమంతా తిరిగాం. ఏ ప్రదేశం నుంచి అయినా సరే కొబ్బరి తోపుల్లో నుంచి నీలంగా సముద్రం మెరుస్తో కనబడుతుంది, ఎంతో అందంగా. ఏ చోటనైనా సరే ఇసిక బంగారం మల్లే మెరుస్తో కనబడుతుంది. ఈ ద్వీపమంతా శ్రీరాముడు తిరిగిన చిహ్నలతో ప్రజ్వరిల్లుతోంది. భక్తి ఏమాత్రం లేని నాకు ఆలయం చూస్తే ప్రేమ. జాజిపువ్వులు...పువ్వుల్లో కెల్లా ఇష్టమైనవి. చందనం, నాదస్వరం, హారతి అన్ని నాకు అమితంగా ఇష్టం. ఏమీ లేని బైరాగి, పెద్ద స్తంభాలు, ప్రాకారాలు, మెత్తని కాంతి, శ్రావ్యమైన సంగీతం, గొప్ప గోపురాలు, విగ్రహాలు, ఆస్పత్రుల నర్సుల వలే ఎప్పుడూ సేవ చేస్తో తిరిగే పూజార్లు. అట్లా ఆ ప్రదేశానికి అతుక్కుని పోతారు. ఇవాలో రేపో కుర్తాళం వెడుతున్నాం, అక్కణ్ణించి ఇంకా దక్షిణానికి, బహుశా కన్యాకుమారి దాకా. తోవలో రామనాథ్ చూస్తాం, రాముడితో నిండిన ఇంకో ప్రదేశం. తిరువనంతపురం, పబ్లిక్ గార్డెన్ 9-6-1034 ఈ తోట అద్భుతమైన అందాలు ఒలికే ప్రదేశం. ఈ పరగణానికి ఎండాకాలం అనేది లేదు. కన్యాకుమారి దివ్యమైన లావణ్యాన్ని చూడగలిగాను. ఆకారంలో, రంగులలో ఇంత అందమిచ్చే స్థలాన్ని వొదిలి వెళ్లవలసి రావడం హృదయాన్ని చీల్చేస్తుంది. ఈ సముద్రాన్ని, అడవుల్ని, కొండల్ని వొదిలి బెజవాడలో సిరా మచ్చల బల్లముందు కూచోవడం తప్పదనుకుంటే బతుకు మీద రోత కలుగుతుంది. ఈ సౌందర్యాన్ని చూసి, జీవితమంతా ఈ జ్ఞాపకంతో బాధపడే గతిని తప్పించుకున్న మిమ్మల్ని తలచుకొని ఈర్ష్యపడతాను. బీదరికంలోనూ, ఈ దేశపు స్త్రీల ముఖం మీద తృప్తిలో మునిగిన మాధుర్యం కనబడుతుంది. మీరు ఉంటే ఎంత బావుండేది! కన్యాకుమారి ఇంద్రజాలమల్లే ఉంది. - చింతా దీక్షితులుకు చలంగారి ఉత్తరాల నుంచి. -
150ఏళ్ల పోస్టాఫీసు కోసం..
అన్నానగర్, న్యూస్‌లైన్: కన్యాకుమారి జిల్లా కుళితురై గ్రామంలో ట్రావెన్కోర్ రాజు బలరామ నిర్మించిన 150 ఏళ్ల నాటి పోస్టాఫీసును యథాతథంగా కొనసాగించాలంటూ స్థానికులు పదేళ్లుగా పోరాడుతున్నారు. తొలుత ఈ పాత పోస్టాఫీసును కూల్చివేసేందుకు భారత పురాతత్వ శాఖ పలు ప్రయత్నాలు జరిపినా స్థానికులు ప్రతిఘటించడంతో వారి ఆట సాగలేదు. దీంతో ఆ శాఖ సైతం స్థానికులకు ఆ పోస్టాఫీసుపై ఉన్న ప్రేమను గుర్తించి వారితో పాటుగా కేంద్రానికి అభ్యర్థన లేఖలు పంపడం ఒక విశేషం. ఇది కేవలం పురాతనమైన పోస్టాఫీసు మాత్రమే కాదని, ఒక టూరిస్టు ఆకర్షణ కూడా అని శాఖ పేర్కొంది. భారత్పోస్టల్ శాఖ సైతం 2012లో దీని కూల్చడానికి ప్రయత్నించి విఫలమైంది. కుళితురై గ్రామంలోని ఏ ఇంటి గురించైనా తెలుసుకోవాలంటే కొత్త వ్యక్తులు ఈ పోస్టాఫీసు వద్దకు వచ్చి తెలుసుకొని వెళుతుంటారు. ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే స్థానికులు ఈ పోస్టాఫీసు ముందున్న తపాల పెట్టెలో తమ అప్లికేషన్లను వేస్తే ఉద్యోగం గ్యారంటీ అనే నమ్మకంతో ఉండడం గమనార్హం. దీనికి తగినట్లుగా ఆ తపాలా పెట్టెపైన ‘విష్ యు గుడ్‌లక్’ అని వ్రాసి వుండటం స్థానికుల నమ్మకానికి ఊతాన్ని ఇస్తోంది. అయితే రాత్రి వేళల్లో ఈ భవనంలోకి తాగుబోతులు, వ్యభిచారులు చేరి నానా హంగామా చేస్తుంటారని, ఈ విషయమై సౌత్‌జోన్ పోస్టుమాస్టర్ జనరల్‌కు స్థానికులు లేఖ రాస్తే దానికి ఎటువంటి సమాధానం లేదని స్థానికులు వాపోయారు. -
అమ్మా.. మజాకా!
పార్టీపై ప్రత్యేక నిఘా నిర్లక్ష్యపు మంత్రులపై వేటు మాజీలకు చోటు చెన్నై, సాక్షి ప్రతినిధి : మంత్రులపై వేటు, మాజీ మంత్రులకు చోటు ఇవ్వడం ద్వారా అమ్మా...మజాకా! అని మరోసారి రుజువుచేసుకున్నారు. అమ్మ మార్కు రాజకీయాన్ని మరోసారి ప్రదర్శించి పలువురి పార్టీ పదవులపై వేటు వేశారు. రాష్ట్రంలోని 39, పుదుచ్చేరిలోని ఒకటి కలుపుకుని మొత్తం 40 స్థానాల్లో గెలుపొందినపుడే కేంద్రంలో పట్టుసాధిస్తామని పార్టీ క్యాడర్‌కు అన్నాడీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత అనేకసార్లు నూరిపోశారు. ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో మంత్రిని ఇన్చార్జ్గా నియమించారు. 37 స్థానాల్లో గెలవగా కన్యాకుమారి, ధర్మపురి, పుదుచ్చేరి స్థానాల్లో పార్టీ పరాజయం పాలైంది. దేశమంతా అన్నాడీఎంకే విజయాన్ని ఆకాశానికి ఎత్తేసినా అమ్మ మాత్రం ఆ మూడు స్థానాలపై ఆలోచనలో పడ్డారు, తనదైన శైలిలో ఆరాతీశారు. అంతే ఇంకేముంది ముగ్గురు మంత్రులపై వేటుపడింది. కొందరు పార్టీ పదవులను కోల్పోయారు. కన్యాకుమారిలో అన్నాడీఎంకే అభ్యర్థి మూడోస్థానానికి దిగజారడంతో అక్కడి ఇన్చార్జ్ మంత్రి పచ్చయమ్మాల్ పదవి కోల్పోయారు. ఈరోడ్ ఇన్చార్జ్ మంత్రి దామోదరన్ అనారోగ్యం పేరున సరిగా ప్రచారం చేయకపోవడం, అభ్యర్థుల కోసం పార్టీ ఇచ్చిన నిధులను సక్రమంగా పంచకపోవడంతో మాజీగా మారిపోయారు. తిరువళ్లూరు ఎంపీ వేణుగోపాల్ రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలుపొందినా అక్కడి ఇన్చార్జ్ మంత్రి బీవీ రమణకు వేటుతప్పలేదు. ఇది పార్టీలో సంభ్రమాశ్చర్యానికి గురిచేసింది. రమణ తొలగింపునకు సరైన కార ణాలను పార్టీ నేతలే అన్వేషిస్తున్నారు. అమ్మ కేబినెట్లో కీలక పోర్టుఫోలియోలను నిర్వర్తిస్తున్న కేపీ మునుస్వామి నుంచి తప్పించి సాధారణమైన కార్మిక సంక్షేమ శాఖను అప్పగించి చివరకు ఆ శాఖనుంచి కూడా తొలగించారు. ఎన్నికల సమయంలో అనేక చోట్ల ప్రజలు తాగునీటి సమస్య ఎదుర్కొన్నా తగిన నివారణ చర్యలను తీసుకోలేదన్న ఆరోపణ వుంది. పార్టీ క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడిగా ఉన్న మంత్రి కేపీ మునుస్వామిని తప్పించి ఎడప్పాడీ పళనిసామిని నియమించారు. కన్యాకుమారి, ధర్మపురిల్లో పార్టీ బాధ్యతలను నిర్వహిస్తున్నవారిపై కూడా జయ వేటువేశారు. మాజీలకు మళ్లీ చోటు సక్రమంగా పనిచేయనివారిపైనే కాదు సమర్థవంతంగా వ్యవహరించిన నేతలపైనా తన నిఘా ఉందని అమ్మ నిరూపించుకున్నారు. గతంలో మంత్రి పదవుల నుంచి తొలగింపునకు గురైన వేలుమణి, అగ్రి కృష్ణమూర్తి, గోకుల ఇందిర ఈ ముగ్గురు తాజా ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు విశేషంగా కృషి చేసినందుకు మెచ్చుకోలుగా అమ్మ మళ్లీ పదవులను కట్టబెట్టారు. మంగళవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్ కె.రోశయ్య సీఎం జయ సమక్షంలో వారి చేత ప్రమాణస్వీకారం చేయించారు. -
కలిసి వెళితే కలదు లాభం...
యాత్రలకు ఎంత మంది కలిసి వెళితే, అంత లాభం’ అంటున్నారు హైదరాబాద్‌లోని కృష్ణానగర్‌కి చెందిన వి.రామరాజు. ఆయన విశ్రాంత జీవనం గడుపుతున్నారు. ఈ వారం జమ్మూ, కాశ్మీర్ విహారయాత్రకు వెళుతున్నారు. అందులో ప్రత్యేకత ఏముందీ? అంటారా... అయితే చదవండి... ‘‘నేనూ, నా సతీమణి స్వర్ణకుమారి ప్రతి ఏడాదీ విహారయాత్రలకు వెళ్లడం ఓ అలవాటుగా చేసుకున్నాం. ఈ వారంలో మనదేశ స్వర్గసీమగా భావించే జమ్మూ, కాశ్మీర్‌కు బయల్దేరుతున్నాం. ఇందులో ప్రత్యేకత ఏంటంటే.. నాతో కలిసి మరో తొంభైమంది ప్రయాణిస్తున్నారు. అంతా మా బంధువులు! నాలుగేళ్లక్రితం పదిమంది గ్రూప్‌గా యాత్రలకు వెళ్లడం మొదలుపెట్టాం. ఇప్పుడు ఆ సంఖ్య వందకు చేరువవుతోంది. రెండేళ్ల క్రితం 65 మందిమి కలిసి దక్షిణ భారతదేశం తిరిగొచ్చాం. కన్యాకుమారి, రామేశ్వరం అన్నీ చుట్టొచ్చాం. అంతకుముందు ఏడాది హిమాలయ యాత్రకు వెళ్లాం. హరిద్వార్, రుషికేష్ చూసొచ్చాం. ఏడాదిన్నరక్రితం ఉత్తరభారతదేశానికి 75 మందిమి ఒక గ్రూప్‌గా కలిసి వెళ్లాం. ఇప్పుడు 91 మందిమి వెళుతున్నాం. మా గ్రూప్‌లో అందరూ దాదాపు 60 దాటినవాళ్ళే! అన్నీ ప్రయోజనాలే! జమ్మూ-కాశ్మీర్ పదిరోజుల యాత్రకు నెల ముందుగానే ట్రావెల్స్‌లో బుక్ చేసుకున్నాం. 35 సీట్లు ఉన్న 3 బస్సులలో ప్రయాణం. మాతో ప్రతి బస్సుకు ఒక ట్రావెల్ గైడ్ కూడా ఉంటాడు. వెళ్లిన చోట ఇద్దరు వ్యక్తులు ఒకే హోటల్ గదిలో ఉండేట్టయితే ఒక్కొక్కరికి (మొత్తం ఛార్జీలు, భోజనంతో సహా) రూ.15,000/-లు. ముగ్గురు ఒకే గదిలో ఉండేట్టయితే ఆ ముగ్గురికీ రూ.31,000/-. ముందు ట్రావెల్ ఏజెంట్‌ని కలిసినప్పుడు జమ్మూకాశ్మీర్ యాత్ర ఒక్కొక్కరికి రూ.18000/- అని చెప్పాడు. కాని 91 మందితో గ్రూప్ అనేసరికి ఒక్కొక్కరికి రూ.3 వేలు తగ్గింపు లభించింది. సాధారణంగా ఏ వేడుకల్లోనో బంధువులం కలుస్తాం. హడావిడిగా వెళ్లిపోతాం. అదే ఇలా వెళితే కనీసం పది రోజులకు పైగా అంతా కలసి ఉంటాం. భోజనాలైనా, తిరగడమైనా కలిసే చేస్తాం. సరదాగా ఉండటం వల్ల అందరితో చనువు ఏర్పడుతుంది. పెద్ద వయసు, మోకాళ్ల నొప్పులు ఉన్నవారు కూడా ప్రయాణంలో కిలోమీటర్ల కొద్దీ తిరుగుతారు. అయినా చిన్న నొప్పి అని కూడా ఎవరూ అనరు. అంత ఉల్లాసంగా ఉంటుంది. ఏ సమస్య వచ్చినా మనకి మరో తొంభైమంది తోడుగా ఉన్నారన్న భరోసా ఉంటుంది. తమిళనాడు, ఉత్తరాంచల్ వెళ్లినప్పుడు... రైలు టికెట్లు, హోటల్స్ అన్నీ మేమే ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్నాం. ఖర్చులన్నీ కలిపి చివరగా అందరం పంచుకున్నాం. ఆ విధంగా చాలా తక్కువ డబ్బులకే ప్రయాణాలు చేసిన సందర్భాలున్నాయి. ఈసారి సంఖ్య ఎక్కువైందని ట్రావెల్ బస్సులు బుక్ చేసుకున్నాం’’అని తెలిపారు. ఎక్కువ మంది కలిసి గ్రూప్‌గా యాత్రలకు వెళితే కొత్త ప్రాంతాల్లో మరింత భరోసాగా గడిపిరావచ్చు. ఖర్చూ కలిసి వస్తుంది. కలిసి ఇలా టూరు వెళితే మరిన్ని ప్రయోజనాలు మీరూ స్వయంగా తెలుసుకుంటారు. - నిర్మలారెడ్డి -
మరో ద్రోణి
సాక్షి, చెన్నై: నైరుతీ, ఈశాన్య రుతు పవనాల ప్రభావం రాష్ర్టం మీద అంతంత మాత్రమే. దక్షిణాదిలోని తిరునల్వేలి, కన్యాకుమారిని మాత్రం ఈశాన్య రుతుపవనాలు కరుణించాయి. మిగిలిన చోట్ల ప్రభావం కరువే. అయితే, వరుసగా పైలీన్, హెలెన్, లెహర్ తుపాన్ల రూపంలో వర్షాలు పడుతుండడంతో అన్నదాతకు ఊరట కలుగుతోంది. ఈ తుపాన్ల ప్రభావంతో రాష్ట్రానికి పెను నష్టం తప్పినా, వర్షాలు మాత్రం పడుతుండటం విశేషం. లెహర్ బలహీన పడిన తర్వాత ఓ మూడు నాలుగు రోజులు వర్షాలు తెరపిచ్చాయి. అయితే, శనివారం బంగాళా ఖాతంలో నైరుతీ దిశలో ఏర్పడ్డ అల్ప పీడనం ప్రభావంతో సముద్ర తీర, దక్షిణాది జిల్లాల్లో శనివారం రాత్రి నుంచి వర్షాలు పడుతున్నాయి. రాత్రుల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. ఈ ద్రోణి శ్రీలంక - ఉత్తర తమిళనాడు వైపుగా నైరుతీ-వాయువ్య దిశలో సాగుతోంది. అదే సమయంలో బంగాళాఖాతంలో ఆదివారం మరో ద్రోణి బయలు దేరింది. ఆగ్నేయంలో నెలకొన్న ఈ ద్రోణి క్రమంగా బలపడే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు ద్రోణుల పుణ్యమా అని రాష్ట్రంలో మరో మూడు రోజులు భారీ వర్షాలు పడనున్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ ప్రభావంతో చెన్నై, కడలూరు, నాగపట్నం, తూత్తుకుడి, కన్యాకుమారి తదితర సముద్ర తీరాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఆదివారం చిదంబరంలో అత్యధికంగా 11 సె.మీ, కాయిల్ పట్టినం, తిరుప్పూండిలో పది సెం.మీ, కులశేఖర పట్నంలో 8 సె.మీ, రామనాధపురంలో ఆరు సె.మీ వర్షం పడ్డట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది. చెన్నై, కాంచీపురంలో కూడా వర్షం పడింది. ఆకాశం మేఘావృతమైంది. వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులతో చలి మరికాస్త ఎక్కువైంది. -
కుండపోత వాన
సాక్షి, చెన్నై: ఈశాన్య రుతు పవనాలు రాష్ట్రంలోకి గత నెలలో ప్రవేశించాయి. ఈ పవనాల రాకతో దక్షిణ, ఉత్తరాదిలోని పలు జిల్లాల్లో నాలుగైదు రోజులు వర్షా లు పడ్డాయి. తర్వాత అడపాదడపా వర్షాలు కురుస్తూ వచ్చాయి. ఈ పరిస్థితుల్లో శ్రీలంక సమీపంలోని బం గాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం క్రమంగా కన్యాకుమారి తీరం వైపు సాగుతుండడంతో అక్కడ వర్షా లు పడుతున్నాయి. కన్యాకుమారి, తిరునల్వేలి జిల్లా ల్లో ఆదివారం కుంభవృష్టి కురిసింది. కన్యాకుమారిలో కోతకు సిద్ధమైన వరి పంట నీళ్ల పాలైంది. 255 ఎకరాల్లో పంట దెబ్బతింది. అల్పపీడన ప్రభావంతో కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, రామనాథపురం, నాగపట్నం సముద్రతీర ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురంలో చెదురుమదురుగా వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లు జలమయం: ఆదివారం నాటి కుండపోత వాన తో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యూయి. చెన్నైలోని కోయంబేడు, టీనగర్, వడపళని, నుంగంబాక్కం, తాంబరం, పెరంబూరు, ఉత్తర చెన్నై, మీనంబాక్కం, విరుగంబాక్కం, అరుంబాక్కం రోడ్లు చెరువులను తలపించాయి. బాణసంచా పేలుళ్లతో రోడ్లపైకి చేరిన చెత్తాచెదారం వర్షపునీటిలో కొట్టుకెళ్లింది. అల్పపీడన ప్రభావంతో 24 గంటల్లో తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షం పడవచ్చని వాతావరణ కేంద్రం ప్రకటించింది. -
ప్రాధాన్యత క్రమంలో రైల్వే ప్రాజెక్టులు పూర్తి
= భూ సేకరణ పూర్తయిన వెంటనే గిణిగెర-మహబూబ్‌నగర్ రైలు మార్గం నిర్మాణ పనులు = రాష్ర్టంలో రైల్వే ప్రాజెక్టులు చేపట్టేందుకు 12500 ఎకరాల భూమి అవసరం = రైల్వే మంత్రి మల్లికార్జున ఖర్గె రాయచూరు, న్యూస్‌లైన్ : ప్రాధాన్యతక్రమంలో రైల్వే ప్రాజెక్టులు పూర్తి చేస్తామని రైల్వే మంత్రిత్వశాఖ మంత్రి మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. నూతనంగా ఏర్పాటు చేసిన మార్గంలో రాయచూరు-గద్వాల, రాయచూరు-కాచిగూడ రైలు సర్వీసులను శనివారం ఆయన రాయచూరు రైల్వే స్టేషన్లో ప్రారంభించి మాట్లాడారు. వివిధ దశలలో ఉన్న రైల్వే ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని చెప్పారు. రాయచూరు రైల్వే స్టేషన్లో రూ. కోటితో ఎక్స్‌వేటర్ ఏర్పాటుకు అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రైలు మార్గం అనుసంధానానికి శ్రీకారం చుట్టామన్నారు. గిణిగెర- మహబూబ్‌నగర్ రైలు మార్గానికి 2190 ఎకరాల భూమి అవసరం కాగా ఇప్పటికే 1070 ఎకరాలు సేకరించామన్నారు. మిగతా భూ సేకరణ పూర్తయిన వెంటనే రైలు మార్గం పనులు చేపడతామన్నారు. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులకు అవసరమైన భూమిని ఇచ్చేందుకు సీఎం సిద్ధరామయ్య ఆధ్వర్యంలోని మంత్రి వర్గం హామీ ఇచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. చిక్కమగళూరు- కడూరు, బీదర్- హుమ్నాబాద్ రైల్వే మార్గాల్లో సర్వే నిర్వహించి రెండు నెలల్లో రైల్వే సంచారం ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలోని నీటి పారుదల పథకాలకు కేంద్రం రూ.5,500 కోట్లు మంజూరు చేసిందన్నారు. అప్పర్ కృష్ణ పథకం పూర్తి చేయడం రికార్డుగా చెప్పవచ్చన్నారు. 2016 నాటికి మూడున్నర లక్షల ఎకరాలకు నీటిపారుదల సౌకర్యం కలుగుతుందన్నారు. రాయచూరుకు సంబంధించిన వివిధ సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. రైల్వే శాఖలో సీ, డీ గ్రూప్ ఉద్యోగులకు పదోన్నతి కల్పించి 53 రోజుల నిర్ధిష్ట దినాలను 58 రోజులకు పెంచే తీర్మానం చేశామన్నారు. దీని వల్ల రూ.వెయ్యి కోట్ల ఆర్థిక భారం రైల్వే శాఖపై పడనుందన్నారు. ఆర్టికల్-371(జే) అమలుతో హై-క అభివృద్ధి హై-క అభివృద్ధికి సంబంధించిన ఆర్టికల్-371(జే) సవరణకు రాష్ట్రపతి నుంచి వారం రోజుల్లో గ్రీన్ సిగ్నల్ రానుందన్నారు. దీంతో ఆరు జిల్లాలు అభివృద్ధి బాటలో నడుస్తాయన్నారు. ఈ మండలికి గవర్నర్ అధ్యక్షుడిగా ఉన్నందున అభివృద్ధికి, నిధులకు ఎలాంటి లోటు రాదన్నారు. హై-క అభివృద్ధి మండలి ప్రధాన కార్యాలయం గుల్బర్గాలో ఏర్పాటు కావడం వల్ల ఇతర జిల్లాల వారు అనుమాన పడాల్సింది ఏమి లేదన్నారు. లాభాల బాటలో రైల్వే అనేక సవాళ్ల మధ్య కూడా రైల్వే శాఖ 3 శాతం లాభాలు ఆర్జించిందని మంత్రి మల్లికార్జున ఖర్గే తెలిపారు. భారీ వర్షాలు, సమైక్యాంధ్ర వల్ల కొంత మేర నష్టం కలిగిందన్నారు. సమయపాలన, ప్రజా అవసరాల మేర మార్గాలను రూపొందించడం వల్ల నష్టాలను తగ్గించుకున్నామన్నారు. దేశంలో 16 జోన్లలో అనేక సమస్యలున్నాయని, వాటిని పరిష్కరించేందుకు చర్యలుతీసుకుంటున్నామన్నారు. రాష్ర్టంలో రైల్వే ప్రాజెక్టులు చేపట్టేందుకు 12500 ఎకరాల భూమి అవసరం ఉండగా 2000 ఎకరాల భూమి మాత్రమే లభ్యమైందన్నారు. మిగిలిన భూస్వాధీనానికి చర్యలు తీసుకున్నామని ఉన్నతాధికారి ఏకే.మిత్తల్ తెలి పారు. కార్యక్రమంలో మంత్రులు ఆర్వీ.దేశ్‌పాండే, మహదేవప్ప, శరణప్రకాష్ పాటిల్, మాజీ ఎమ్మెల్యేలు బోసురాజ్, పాపారెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు హంపనగౌడ, హంపయ్య నాయక్, ప్రతాప్‌గౌడ పాటిల్, డీసీసీ అధ్యక్షుడు వసంతకుమార్, జయణ్ణ పాల్గొన్నారు. -
ఇసుక మాఫియాపై నివేదిక ఇవ్వాల్సిందే
రాష్ట్రంలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా వ్యవహారం పలు వివాదాలకు తెరదీస్తుండగా, తాజాగా ప్రభుత్వానికి తలనొప్పులు సృష్టిస్తోంది. ఇసుక అక్రమ రవాణాపై ఐఏఎస్ అధికారి విచారణ జరిపి సమర్పించిన నివేదికను తమకు అందజేయాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. లేనిపక్షంలో తమకున్న ప్రత్యేకాధికారాలను ఉపయోగించి రాబట్టుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. చెన్నై, సాక్షి ప్రతినిధి : తిరునల్వేలి, తిరుచ్చిరాపల్లి, తూత్తుకుడి, కన్యాకుమారి జిల్లాల్లోని ఇసుక క్వారీ లీజుదారులు ప్రభుత్వ నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి వ్యాపారాలు సాగిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. లీజులో పేర్కొన్న హద్దులను అతిక్రమించి ఇసుకను తవ్వి విదేశాలకు రవాణా చేస్తున్నట్లు ప్రభుత్వానికి సమాచారం అందింది. దీంతో ప్రభుత్వం రాష్ట్ర రెవెన్యూ కార్యదర్శి గగన్‌సింగ్ బేడీని ప్రత్యేకాధికారిగా నియమించి విచారణకు ఆదేశించింది. నెలరోజుల్లోగా ప్రాథమిక నివేదికను సమర్పించాలని గడువు విధించింది. గగన్‌సింగ్ బేడీ ఈ నెల మొదటి వారంలో ప్రభుత్వానికి నివేదిక అందశారు. దీంతో ప్రభుత్వం 77 క్వారీలకు నోటీసులు జారీచేసింది. అంతేగాక ఈ నాలుగు జిల్లాల్లో ఇసుక తవ్వకాలపై నిషేధం విధించింది. ప్రభుత్వ చర్యలను సవాల్ చేస్తూ తిరునల్వేలికి చెందిన దయా దేవదాస్ అనే వ్యక్తి మద్రాసు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇసుక మాఫియా అక్రమాలను అరికట్టాలని, సీబీఐతో విచారణ జరిపించాలని పేర్కొన్నారు. ఈ పిటిషన్ శుక్రవారం న్యాయమూర్తులు వేణుగోపాల్, జయచంద్రన్‌తో కూడిన బెంచ్ వద్దకు విచారణకు వచ్చింది. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ సోమయాజి వాదనలు వినిపిస్తూ పిటిషన్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇసుక మాఫియా అక్రమాలను అడ్డుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని తెలిపారు. విచారణ జరిపించి తవ్వకాలపై నిషేధం విధించిందని విన్నవించారు. అందువల్ల సీబీఐ విచారణ అవసరం లేదని పేర్కొన్నారు. దీనిపై జోక్యం చేసుకున్న న్యాయమూర్తులు ప్రభుత్వం వద్దనున్న విచారణ నివేదికను కోర్టుకు సమర్పించాలని ఆదేశించారు. అందుకు అడ్వకేట్ జనరల్ అభ్యంతరం చెబుతూ ప్రత్యేక రీతిలో ప్రభుత్వం జరిపించిన విచారణ నివేదికను కోర్టుకు సమర్పించడం కుదరదని పేర్కొన్నారు. న్యాయస్థానం కోరిన మీదట సమర్పించి తీరాలని, ధిక్కరిస్తే తమ ప్రత్యేకాధికారాలను ప్రభుత్వంపై ప్రయోగించి రాబట్టుకోవాల్సి ఉంటుందని న్యాయమూర్తులు హెచ్చరించారు. అక్టోబర్ 4వ తేదీ వాయిదాలోగా నివేదికను కోర్టు ముందుంచాలని ఆదేశించారు. -
టెన్షన్ లేనిటూర్
దసరా సెలవులు సమీపిస్తున్నాయి... ఫ్యామిలీ అంతా కలిసి ఏదైనా టూర్‌కి వెళ్లి ఎంజాయ్ చేయాలనుకోవడం సహజం. కానీ, రైల్వే, విమాన టికెట్ల రిజర్వేషన్, వీసా మొదలు... గైడు, చూడాల్సిన ప్రదేశాల ఎంపిక, భోజనం, వసతి ఏర్పాట్లు కష్టమే. వీటికి భయపడే చాలా మంది తమ టూర్లు రద్దు చేసుకుంటారు. అరుుతే.. ఇప్పుడు అలాంటి సందేహాలు అక్కర్లేదు. ఆ ఏర్పాట్లన్నీ చూసుకునే టూర్ సర్వీసెస్ వరంగల్ నగరంలో విస్తరిస్తున్నాయి. ఒక్కటేమిటి... అన్ని రకాల సేవలను ఆయూ సంస్థలే బాధ్యతగా తీసుకుంటున్నారుు. ఇక మీరు చేయూల్సిందల్లా... ఎమౌంట్ చెల్లించడమే. సాక్షి, హన్మకొండ :తిరుపతి వంటి పుణ్యక్షేత్రాలు, వివాహ శుభకార్యాలకు వాహనాలు నడిపించడమే గతంలో టూర్ సర్వీసెస్‌గా ఉండేది. ఇప్పుడు బస్సులో తీసుకెళ్లడమే కాదు.. అక్కడ బ్రేక్ దర్శనాలు కూడా చేరుుస్తున్నారు. హానీమూన్ ప్యాకేజీలు కూడా అందిస్తున్నారు. పెళ్లి, విహారయాత్రలకు వాహనాలు సమకూర్చడం ప్రస్తుత పోటీ ప్రపంచంలో చిన్న అంశంగా మారింది. యాత్ర ప్రత్యేకతలను తెలిపే గైడ్ల నుంచీ... వసతి, భోజన, దర్శన, వీసా, టికెట్ల వంటి ఏర్పాట్లు చేసే సంస్థలు వెలిశారుు. ఈ సర్వీసెస్ వరంగల్‌లో అందుబాటులోకి రాగా... ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. టూర్ ఏదైనా సరే.. విద్యార్థులు వెళ్లే ఎడ్యుకేషనల్ టూర్స్, ఫ్యామిలీస్ వెళ్లే పుణ్యక్షేత్రాల దర్శనం, కొన్ని కుటుంబాలు కలిసి చేసే ఆథ్యాత్మిక యాత్రలు, కార్పొరేట్ కంపెనీలు ఏర్పాటు చేసే రిఫ్రెష్మెంట్ టూర్స్, సింగిల్‌గా వెళ్లే ఎడ్వెంచర్స్ టూర్, కొత్తగా పెళ్లైన జంటలకు హానీమూన్... ఇలా ఏదైనా సరే అన్నీ ఏర్పాట్లు చకచకా జరిగిపోతుంటాయి. టూర్ బుక్ చేసుకుని ఎమౌంట్ చెల్లిస్తే చాలు. ఆ తర్వాత ఎలాంటి టెన్షన్స్ లేకుండా టూర్‌ని ఎంజాయ్ చేయడమే యాత్రికులకు మిగిలిన పని. సింపుల్‌గా చెప్పాలంటే రైల్వే రిజర్వేషన్ నుంచి మొదలు పెడితే విదేశాల్లో వీసా ఇప్పించడం వరకు అన్ని బాధ్యతలను ఈ సంస్థలే తీసుకుంటున్నారుు. సేవలు ఎలా అంటే.. ముందుగా సదరు వ్యక్తులు ఎక్కడికి వెళతారో... సంస్థలో బుక్ చేసుకోవాలి. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు రైలు, బస్సు, విమానం టికెట్లు బుక్ చేసి ఇస్తారు. ఆ తర్వాత వరంగల్ నుంచి బయల్దేరి గమ్యస్థానం చేరిన వెంటనే అక్కడ ఈవెంట్ మేనెజ్మెంట్ సంస్థకు సంబంధించిన బాధ్యులు యాత్రికులను పికప్ చేసుకుంటారు. ఒప్పందం ప్రకారం 3 స్టార్, 4 స్టార్ హోటళ్లలో వసతి, భోజన సౌకర్యం కల్పిస్తారు. అనంతరం దర్శనీయ స్థలాలు చూసేందుకు వాహనం, గైడ్, అనుమతి తదితర పనులన్నీ వీరే చక్కబెడతారు. తిరుపతి వంటి పుణ్యక్షేత్రాల్లో అయితే బ్రేక్ దర్శనం ఏర్పాట్లు కూడా ఈ సర్వీస్ సంస్థకు చెందిన బాధ్యులే తీసుకుంటారు. యాత్ర మొత్తం పూర్తయిన తర్వాత తిరిగి వరంగల్ చేరే వరకు ఏ ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తారు. అందుబాటులో ఉన్న ప్యాకేజీలు ఎడ్యుకేషన్ టూర్లో భాగంగా విద్యార్థులకు జిల్లాలో హన్మకొండలోని వేయిస్తంబాలగుడి, భద్రకాళి టెంపుల్, ఖిలావరంగల్, లక్నవరం, రామప్ప ప్యాకేజ్ టూర్ అందుబాటులో ఉంది. ఈ ప్రదేశాల దర్శనంతో పాటు లంచ్, స్నాక్స్ కూడా అందిస్తారు. ఇవి కాకుండా ఎడ్యుకేషన్ టూర్లో మైసూర్, బెంగళూరు, కన్యాకుమారి ప్యాకేజీలూ ఉన్నాయి. ఈ ప్యాకేజీకి కనీసం 50 మంది విద్యార్థులు ఉండాలి. ప్రకృతి, పుణ్యక్షేత్రం ప్యాకేజీలో భద్రాచలం అందుబాటులో ఉంది. ఇక షిర్డీ, వైజాగ్, తిరుపతి వంటి ప్రాంతాలకు సంబంధించి మూడు పగళ్లు, నాలుగు రాత్రుల ప్యాకేజీకి అన్ని ఖర్చులు కలిపి ఒక్కరికి రూ. 6000 వరకు చార్జ్ వేస్తున్నారు. కొత్తగా పెళ్లైన జంటలకు సంబంధించి కేరళకు హనీ మూన్ ప్యాకేజీ ఉంది. ఇందులో ఐదు రాత్రులు, నాలుగు పగళ్లు కలిపి జంటకు రూ. 44,000 చార్జ్ తీసుకుంటున్నారు. బ్యాంకాక్ టూర్లో భాగంగా ఐదు పగల్లు, నాలుగు రాత్రులకు సంబంధించి ఒక్కరికి రూ. 44,000... ఖాట్మాం డు టూర్లో మూడు పగల్లు, నాలుగు రాత్రుళ్లకు సంబంధించి ఒక్కరికి రూ. 25,000 చార్జ్ వేస్తున్నారు. విదేశీ యాత్రల్లో తెలుగు భాష తెలిసిన గైడ్, ఇంగ్లిష్ భాష వచ్చిన క్యాబ్ డ్రైవర్లను సంస్థలే సమకూర్చుతారుు. ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ అందిస్తున్న ప్యాకేజీలు (హైదరాబాద్ నుంచి) కాకతీయ హెరిటేజ్ ప్యాకేజ్ ( 2 డేస్, 2 నైట్స్) యాదగిరిగుట్ట, పెంబర్తి, జైన దేవాలయం, చేర్యాల పెయింటింగ్స్, ఖిలా వరంగల్, భద్రకాళి టెంపుల్, వేయిస్తంభాలగుడి, గణపురం కోటగుళ్లు, రామప్పదేవాలయం, ఏటూరునాగరాం అభయారణ్యం, లక్నవరం సరస్సులున్నాయి. ఒక్క యాత్రికుడికి టికెట్ ధర ఏసీ కోచ్ అయితే రూ. 3,000, నాన్ ఏసీ కోచ్‌కు రూ. 2,500. హిల్‌స్టేషన్ ప్యాకేజ్ (3 డేస్, 2 నైట్స్) అన్నవరం,బొర్రగుహాలు, అరకు, విశాఖపట్నం, భీమవరం, పాలకొల్లు, విజ యవాడ, ద్వారాకా తిరుమల ఉన్నా రుు. ఏసీ కోచ్ టికెట్ ధర ఒక్కరికి రూ.4,000, నాన్ఏసీ కోచ్‌కు రూ. 3,500. టెంపుల్ ప్యాకేజీ (2 డేస్, 1 నైట్) వేములవాడ, కొండగట్టు, కాళేశ్వరం, బాసర ప్యాకేజీకి ఏసీ కోచ్ టికెట్ ధర ఒక్కరికి రూ. 2,600, నాన్ ఏసీకి రూ.2,100. విహారయాత్ర (2 డేస్, 1 నోట్) భద్రాచలం, పాపికొండలు (బోటు జర్నీ). ఏసీ కోచ్ టికెట్ ధర ఒక్కరికి రూ.2,600, నాన్ ఏసీకి రూ. 2,100. ఆదరణ బాగుంది కొంత కాలం క్రితం వరకు ప్రైవేట్ బస్ సర్వీసెస్ ఉండే ఏనుగుల గడ్డ ప్రాంతమే నగరంలో టూరిస్ట్ సర్వీసెస్‌కి అడ్డా. కానీ, పోటీ ప్రపంచంలో అందరూ వివిధ వృత్తుల్లో బిజీ అవడంతో తీరిక లేకుండా ఉంటున్నారు. అందువల్లే పని ఒత్తిడి నుంచి బయట పడేందుకు టూర్స్‌కి ఎక్కువగా వెళ్తున్నారు. అయితే అక్కడ కూడా బస, వసతి ఇబ్బందులు ఉండొద్దని కోరుకుంటున్నారు. అందువల్లే టూరిస్ట్ సర్వీసెస్‌కి నగరంలో ఆదరణ పెరుగుతోంది. మేం సర్వీస్ ప్రారంభించిన వారం రోజుల వ్యవధిలోనే బ్యాంకాక్, ఖాట్మాండుల ప్యాకేజీలను ఇద్దరు టూరిస్టులు బుక్ చేసుకోవడం ఇక్కడున్న డిమాండ్‌ని తెలియజేస్తుంది. మా సర్వీసెస్ కావాలనుకునే వారు 97009 99786 ఫోన్ నంబర్లో సంప్రదించవచ్చు. - ప్రదీప్, హ్యాపీడేస్-హాలీడేస్ మేనేజర్ విదేశాలకు వెళ్లేవారు పెరిగారు గతంలో యాత్రలు అంటే తిరుపతి, వేములవాడ, కాళేశ్వరం.. లేదంటే చార్ధామ్ యాత్ర అన్నట్లుగానే ఉండేది. కానీ గడిచిన ఐదేళ్లలో నగరంలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. సమ్మర్ వెకేషన్స్‌కి ఎక్కువ మంది కులూమనాలి, సిమ్లా, గోవా, ఊటీలకు వెళ్తున్నారు. ప్రకృతి ప్రేమికులు ఎక్కువగా కేరళ... లేదంటే బ్యాంకాక్, పుకెట్ ఐలాండ్ వంటి దీవులకు వెళ్తున్నారు. గతంలో ఈ సర్వీస్‌ల కోసం హైదరాబాద్ వరకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు నగరంలో అందిస్తుండటంతో వెకేషన్స్‌కి విదే శాలకు వెళ్లేవారి సంఖ్య పెరిగింది. - నవీన్, శ్రీజా ట్రావెల్స్ మేనేజింగ్ డెరైక్టర్ -
టెన్షన్ లేని టూర్
దసరా సెలవులు సమీపిస్తున్నాయి... ఫ్యామిలీ అంతా కలిసి ఏదైనా టూర్‌కి వెళ్లి ఎంజాయ్ చేయాలనుకోవడం సహజం. కానీ, రైల్వే, విమాన టికెట్ల రిజర్వేషన్, వీసా మొదలు... గైడు, చూడాల్సిన ప్రదేశాల ఎంపిక, భోజనం, వసతి ఏర్పాట్లు కష్టమే. వీటికి భయపడే చాలా మంది తమ టూర్లు రద్దు చేసుకుంటారు. అరుుతే.. ఇప్పుడు అలాంటి సందేహాలు అక్కర్లేదు. ఆ ఏర్పాట్లన్నీ చూసుకునే టూర్ సర్వీసెస్ వరంగల్ నగరంలో విస్తరిస్తున్నాయి. ఒక్కటేమిటి... అన్ని రకాల సేవలను ఆయూ సంస్థలే బాధ్యతగా తీసుకుంటున్నారుు. ఇక మీరు చేయూల్సిందల్లా... ఎమౌంట్ చెల్లించడమే. సాక్షి, హన్మకొండ :తిరుపతి వంటి పుణ్యక్షేత్రాలు, వివాహ శుభకార్యాలకు వాహనాలు నడిపించడమే గతంలో టూర్ సర్వీసెస్‌గా ఉండేది. ఇప్పుడు బస్సులో తీసుకెళ్లడమే కాదు.. అక్కడ బ్రేక్ దర్శనాలు కూడా చేరుుస్తున్నారు. హానీమూన్ ప్యాకేజీలు కూడా అందిస్తున్నారు. పెళ్లి, విహారయాత్రలకు వాహనాలు సమకూర్చడం ప్రస్తుత పోటీ ప్రపంచంలో చిన్న అంశంగా మారింది. యాత్ర ప్రత్యేకతలను తెలిపే గైడ్ల నుంచీ... వసతి, భోజన, దర్శన, వీసా, టికెట్ల వంటి ఏర్పాట్లు చేసే సంస్థలు వెలిశారుు. ఈ సర్వీసెస్ వరంగల్‌లో అందుబాటులోకి రాగా... ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. టూర్ ఏదైనా సరే.. విద్యార్థులు వెళ్లే ఎడ్యుకేషనల్ టూర్స్, ఫ్యామిలీస్ వెళ్లే పుణ్యక్షేత్రాల దర్శనం, కొన్ని కుటుంబాలు కలిసి చేసే ఆథ్యాత్మిక యాత్రలు, కార్పొరేట్ కంపెనీలు ఏర్పాటు చేసే రిఫ్రెష్మెంట్ టూర్స్, సింగిల్‌గా వెళ్లే ఎడ్వెంచర్స్ టూర్, కొత్తగా పెళ్లైన జంటలకు హానీమూన్... ఇలా ఏదైనా సరే అన్నీ ఏర్పాట్లు చకచకా జరిగిపోతుంటాయి. టూర్ బుక్ చేసుకుని ఎమౌంట్ చెల్లిస్తే చాలు. ఆ తర్వాత ఎలాంటి టెన్షన్స్ లేకుండా టూర్‌ని ఎంజాయ్ చేయడమే యాత్రికులకు మిగిలిన పని. సింపుల్‌గా చెప్పాలంటే రైల్వే రిజర్వేషన్ నుంచి మొదలు పెడితే విదేశాల్లో వీసా ఇప్పించడం వరకు అన్ని బాధ్యతలను ఈ సంస్థలే తీసుకుంటున్నారుు. సేవలు ఎలా అంటే.. ముందుగా సదరు వ్యక్తులు ఎక్కడికి వెళతారో... సంస్థలో బుక్ చేసుకోవాలి. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు రైలు, బస్సు, విమానం టికెట్లు బుక్ చేసి ఇస్తారు. ఆ తర్వాత వరంగల్ నుంచి బయల్దేరి గమ్యస్థానం చేరిన వెంటనే అక్కడ ఈవెంట్ మేనెజ్మెంట్ సంస్థకు సంబంధించిన బాధ్యులు యాత్రికులను పికప్ చేసుకుంటారు. ఒప్పందం ప్రకారం 3 స్టార్, 4 స్టార్ హోటళ్లలో వసతి, భోజన సౌకర్యం కల్పిస్తారు. అనంతరం దర్శనీయ స్థలాలు చూసేందుకు వాహనం, గైడ్, అనుమతి తదితర పనులన్నీ వీరే చక్కబెడతారు. తిరుపతి వంటి పుణ్యక్షేత్రాల్లో అయితే బ్రేక్ దర్శనం ఏర్పాట్లు కూడా ఈ సర్వీస్ సంస్థకు చెందిన బాధ్యులే తీసుకుంటారు. యాత్ర మొత్తం పూర్తయిన తర్వాత తిరిగి వరంగల్ చేరే వరకు ఏ ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తారు. అందుబాటులో ఉన్న ప్యాకేజీలు ఎడ్యుకేషన్ టూర్లో భాగంగా విద్యార్థులకు జిల్లాలో హన్మకొండలోని వేయిస్తంబాలగుడి, భద్రకాళి టెంపుల్, ఖిలావరంగల్, లక్నవరం, రామప్ప ప్యాకేజ్ టూర్ అందుబాటులో ఉంది. ఈ ప్రదేశాల దర్శనంతో పాటు లంచ్, స్నాక్స్ కూడా అందిస్తారు. ఇవి కాకుండా ఎడ్యుకేషన్ టూర్లో మైసూర్, బెంగళూరు, కన్యాకుమారి ప్యాకేజీలూ ఉన్నాయి. ఈ ప్యాకేజీకి కనీసం 50 మంది విద్యార్థులు ఉండాలి. ప్రకృతి, పుణ్యక్షేత్రం ప్యాకేజీలో భద్రాచలం అందుబాటులో ఉంది. ఇక షిర్డీ, వైజాగ్, తిరుపతి వంటి ప్రాంతాలకు సంబంధించి మూడు పగళ్లు, నాలుగు రాత్రుల ప్యాకేజీకి అన్ని ఖర్చులు కలిపి ఒక్కరికి రూ. 6000 వరకు చార్జ్ వేస్తున్నారు. కొత్తగా పెళ్లైన జంటలకు సంబంధించి కేరళకు హనీ మూన్ ప్యాకేజీ ఉంది. ఇందులో ఐదు రాత్రులు, నాలుగు పగళ్లు కలిపి జంటకు రూ. 44,000 చార్జ్ తీసుకుంటున్నారు. బ్యాంకాక్ టూర్లో భాగంగా ఐదు పగల్లు, నాలుగు రాత్రులకు సంబంధించి ఒక్కరికి రూ. 44,000... ఖాట్మాం డు టూర్లో మూడు పగల్లు, నాలుగు రాత్రుళ్లకు సంబంధించి ఒక్కరికి రూ. 25,000 చార్జ్ వేస్తున్నారు. విదేశీ యాత్రల్లో తెలుగు భాష తెలిసిన గైడ్, ఇంగ్లిష్ భాష వచ్చిన క్యాబ్ డ్రైవర్లను సంస్థలే సమకూర్చుతారుు. ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ అందిస్తున్న ప్యాకేజీలు (హైదరాబాద్ నుంచి) కాకతీయ హెరిటేజ్ ప్యాకేజ్ ( 2 డేస్, 2 నైట్స్) యాదగిరిగుట్ట, పెంబర్తి, జైన దేవాలయం, చేర్యాల పెయింటింగ్స్, ఖిలా వరంగల్, భద్రకాళి టెంపుల్, వేయిస్తంభాలగుడి, గణపురం కోటగుళ్లు, రామప్పదేవాలయం, ఏటూరునాగరాం అభయారణ్యం, లక్నవరం సరస్సులున్నాయి. ఒక్క యాత్రికుడికి టికెట్ ధర ఏసీ కోచ్ అయితే రూ. 3,000, నాన్ ఏసీ కోచ్‌కు రూ. 2,500. హిల్‌స్టేషన్ ప్యాకేజ్ (3 డేస్, 2 నైట్స్) అన్నవరం,బొర్రగుహాలు, అరకు, విశాఖపట్నం, భీమవరం, పాలకొల్లు, విజ యవాడ, ద్వారాకా తిరుమల ఉన్నా రుు. ఏసీ కోచ్ టికెట్ ధర ఒక్కరికి రూ.4,000, నాన్ఏసీ కోచ్‌కు రూ. 3,500. టెంపుల్ ప్యాకేజీ (2 డేస్, 1 నైట్) వేములవాడ, కొండగట్టు, కాళేశ్వరం, బాసర ప్యాకేజీకి ఏసీ కోచ్ టికెట్ ధర ఒక్కరికి రూ. 2,600, నాన్ ఏసీకి రూ.2,100. విహారయాత్ర (2 డేస్, 1 నోట్) భద్రాచలం, పాపికొండలు (బోటు జర్నీ). ఏసీ కోచ్ టికెట్ ధర ఒక్కరికి రూ.2,600, నాన్ ఏసీకి రూ. 2,100. ఆదరణ బాగుంది కొంత కాలం క్రితం వరకు ప్రైవేట్ బస్ సర్వీసెస్ ఉండే ఏనుగుల గడ్డ ప్రాంతమే నగరంలో టూరిస్ట్ సర్వీసెస్‌కి అడ్డా. కానీ, పోటీ ప్రపంచంలో అందరూ వివిధ వృత్తుల్లో బిజీ అవడంతో తీరిక లేకుండా ఉంటున్నారు. అందువల్లే పని ఒత్తిడి నుంచి బయట పడేందుకు టూర్స్‌కి ఎక్కువగా వెళ్తున్నారు. అయితే అక్కడ కూడా బస, వసతి ఇబ్బందులు ఉండొద్దని కోరుకుంటున్నారు. అందువల్లే టూరిస్ట్ సర్వీసెస్‌కి నగరంలో ఆదరణ పెరుగుతోంది. మేం సర్వీస్ ప్రారంభించిన వారం రోజుల వ్యవధిలోనే బ్యాంకాక్, ఖాట్మాండుల ప్యాకేజీలను ఇద్దరు టూరిస్టులు బుక్ చేసుకోవడం ఇక్కడున్న డిమాండ్‌ని తెలియజేస్తుంది. మా సర్వీసెస్ కావాలనుకునే వారు 97009 99786 ఫోన్ నంబర్లో సంప్రదించవచ్చు. - ప్రదీప్, హ్యాపీడేస్-హాలీడేస్ మేనేజర్ విదేశాలకు వెళ్లేవారు పెరిగారు గతంలో యాత్రలు అంటే తిరుపతి, వేములవాడ, కాళేశ్వరం.. లేదంటే చార్ధామ్ యాత్ర అన్నట్లుగానే ఉండేది. కానీ గడిచిన ఐదేళ్లలో నగరంలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. సమ్మర్ వెకేషన్స్‌కి ఎక్కువ మంది కులూమనాలి, సిమ్లా, గోవా, ఊటీలకు వెళ్తున్నారు. ప్రకృతి ప్రేమికులు ఎక్కువగా కేరళ... లేదంటే బ్యాంకాక్, పుకెట్ ఐలాండ్ వంటి దీవులకు వెళ్తున్నారు. గతంలో ఈ సర్వీస్‌ల కోసం హైదరాబాద్ వరకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు నగరంలో అందిస్తుండటంతో వెకేషన్స్‌కి విదే శాలకు వెళ్లేవారి సంఖ్య పెరిగింది. - నవీన్, శ్రీజా ట్రావెల్స్ మేనేజింగ్ డెరైక్టర్ -
జనగామ ఏఎస్పీకి అరుదైన అవకాశం
జనగామ క్రైం, న్యూస్‌లైన్ : జనగామ డివిజన్ ఏఎస్పీ జోయల్ డేవిస్‌కు అరుదైన అవకాశం లభించింది. ఈ నెల 15వ తేదీన సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్‌లో నిర్వహించే స్వాతంత్య్ర వేడుకల్లో ఆయన పరేడ్ కమాండెంట్‌గా జాతీయ పతాకానికి గౌరవ వందనం చేయనున్నారు. 2010 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన జోయల్ డేవిస్ స్వస్థలం తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి ప్రాంతంలోని పుట్టకొడ గ్రామం. ఆయన ప్రసుత్తం జనగామ ఏఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నారు. స్వాంతత్య్ర దినోత్సవం రోజున ముఖ్యమంత్రి సాయుధ బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించే పెరేడ్‌కు నేతృత్వం వహించనున్నారు. ఇందుకు గాను ఆయన పేరేడ్ గ్రౌండ్లో ఈ నెల 1 నుంచి జరుగుతున్న రిహార్సల్లో పాల్గొంటున్నారు. పెరేడ్‌గ్రౌండ్‌లో జరిగే స్వాతంత్య్ర వేడుకల్లో జనగామ డివిజన్ నుంచి పాల్గొనబోయే రెండవ ఐపీఎస్ అధికారి డేవిస్. గతంలో ఇక్కడ ఏఎస్పీగా పనిచేసిన అంజనీకుమార్ 1992 ఆగస్టు 15న పెరేడ్‌గ్రౌండ్‌లో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్నారు. -
కోల్‌కతా టు కన్యాకుమారి
భోగాపురం, న్యూస్‌లైన్ : దీక్ష పట్టుదల ఉంటే సాధించలేనిదేదీ లేదని అంటున్నాడు తమిళనాడుకు చెందిన 32 ఏళ్ల ఆర్.తంగరాజు. పుట్టు వికలాంగుడైన అతను కోల్‌కతా నుంచి కన్యాకుమారి వరకు మూడు చక్రాల సైకిల్‌పై వెళ్తూ.. ఆదివారం భోగాపురం చేరుకున్నాడు. ఈ సందర్భంగా రాత్రి అతనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాకర్లపూడి శ్రీనివాసరాజు తన స్వగృహంలో ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా తనను కలిసిన విలేకరులతో తంగరాజు మాట్లాడాడు. కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ సంస్థలో తన తల్లి 25 సంవత్సరాలుగా పని చేస్తుందని చెప్పారు. తాను అక్కడే ఇంజినీరింగ్ చదివానని, స్వామి వివేకానందుని ప్రవచనాలపై ఆసక్తితో సంఘ సేవకునిగా మారానని తెలిపారు. జనవరి 12, 2013 నుంచి 12 జనవరి 2014 వరకు వివేకానందుని కేంద్రం, కన్యాకుమారి ఆధ్వర్యంలో 150వ జయంత్యుత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. వివేకానందుని జన్మస్థలం కోల్‌కతాలో నుంచి బేలూరు మఠం నుంచి ఆయన తపస్సు చేసిన కన్యాకుమారి వరకు సైకిల్‌యాత్ర చేపట్టానని అన్నారు. జూలై 22న ఈ యాత్ర ప్రారంభించానని తెలిపారు. సెప్టెంబరు 11నాటికి అంటే 536 రోజుల్లో 2,400 కిలోమీటర్ల మేర యాత్ర చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే 800 కిలోమీటర్లు ప్రయాణం చేశానని చెప్పారు. రోజుకు 60 నుంచి 70 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ.. దారిపొడువునా విద్యార్థులకు, యువతకు వివేకానందుని జీవిత చరిత్ర, సంఘం కోసం అతని సూచించిన మార్గాన్ని తెలుపుతున్నానని చెప్పారు. తనను చూసి కొంతమందైనా ఆయన మార్గం అవలంబిస్తే తన ఆశయం నెరవేరుతుందని అన్నారు. ఈ ఏడాది జనవరి 16 నుంచి ఫిబ్రవరి 6 వరకు కోల్‌కతా నుంచి వివేకానందుడు సంచరించిన వివిధ ప్రదేశాల్లో 995 కిలోమీటర్ల మేర సైకిల్ యాత్ర చేశానని, ఇది రెండోయాత్ర అని పేర్కొన్నారు. కృషి, పట్టుదల, ఒక దృఢ సంకల్పంతో ప్రయాణిస్తున్న తనకు అంగవైకల్యం అడ్డుకాదని చెప్పారు. ఈ కార్యక్రమంలో వివేకానంద 150వ జయంతి ఉత్సవ కమిటీ జిల్లా అధ్యక్షుడు చెరుకూరి శ్రీధర్, బాలాజీ పాణిగ్రహి, కె.ఉమామహేశ్వరరావు, కన్వీనరు జీఎస్ఏ నరసింహం, ఉమాశ్రీనివాస్, వైఎస్ఆర్సీపీ జిల్లా లీ గల్ సెల్ అధ్యక్షుడు వరుపుల సుధాకర్, శిరుగుడు గోవిందరావు పాల్గొన్నారు.