సాక్షి, చెన్నై: ఈశాన్య రుతు పవనాలు రాష్ట్రంలోకి గత నెలలో ప్రవేశించాయి. ఈ పవనాల రాకతో దక్షిణ, ఉత్తరాదిలోని పలు జిల్లాల్లో నాలుగైదు రోజులు వర్షా లు పడ్డాయి. తర్వాత అడపాదడపా వర్షాలు కురుస్తూ వచ్చాయి. ఈ పరిస్థితుల్లో శ్రీలంక సమీపంలోని బం గాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం క్రమంగా కన్యాకుమారి తీరం వైపు సాగుతుండడంతో అక్కడ వర్షా లు పడుతున్నాయి. కన్యాకుమారి, తిరునల్వేలి జిల్లా ల్లో ఆదివారం కుంభవృష్టి కురిసింది. కన్యాకుమారిలో కోతకు సిద్ధమైన వరి పంట నీళ్ల పాలైంది. 255 ఎకరాల్లో పంట దెబ్బతింది. అల్పపీడన ప్రభావంతో కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, రామనాథపురం, నాగపట్నం సముద్రతీర ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురంలో చెదురుమదురుగా వర్షాలు కురుస్తున్నాయి.
రోడ్లు జలమయం: ఆదివారం నాటి కుండపోత వాన తో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యూయి. చెన్నైలోని కోయంబేడు, టీనగర్, వడపళని, నుంగంబాక్కం, తాంబరం, పెరంబూరు, ఉత్తర చెన్నై, మీనంబాక్కం, విరుగంబాక్కం, అరుంబాక్కం రోడ్లు చెరువులను తలపించాయి. బాణసంచా పేలుళ్లతో రోడ్లపైకి చేరిన చెత్తాచెదారం వర్షపునీటిలో కొట్టుకెళ్లింది. అల్పపీడన ప్రభావంతో 24 గంటల్లో తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షం పడవచ్చని వాతావరణ కేంద్రం ప్రకటించింది.
కుండపోత వాన
Published Mon, Nov 4 2013 12:13 AM | Last Updated on Sat, Sep 2 2017 12:15 AM
Advertisement
Advertisement