crop loss
-
భారీ వర్షాల ప్రభావంతో నష్టపోయిన రైతులు
-
రైతు సంక్షేమం కోసం YSRCP ప్రభుత్వం పనిచేసింది
-
పరిహారం..పరిహాసం
కంకిపాడు: ఎకరా వరి పంటకు పెట్టుబడి కనీసం రూ.25 వేలు. పసుపు పంటకు రూ.1.50 లక్షలు. కందకు రూ.1.70 లక్షలు, తమలపాకుకు రూ.2 లక్షలు. ఇలా ఏ పంట వేసినా రైతు భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టాలి. ఇటీవలి భారీ వర్షాలు, వరదలకు చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఇచ్చిన సాయం ఎకరాకు రూ.10 వేలు మాత్రమే. అదీ.. కొంతమందికే వచ్చింది. వారికీ పంట వేసిన విస్తీర్ణంలో కొంత మొత్తానికే ఇస్తున్నారు. ఇందుకు ఈడే సాంబశివరావే ఉదాహరణ. ఆయన 3.70 ఎకరాల్లో వరి వేస్తే ఇచ్చిన పరిహారం ఎకరాకు రూ.10 వేలే. అంటే దాదాపు లక్ష రూపాయలు పెట్టుబడి వరదలో కొట్టుకుపోతే బాబు సర్కారు విదిల్చింది రూ.20 వేలే. ఇటీవలి కృష్ణా, బుడమేరు వరదలు, భారీ వర్షాలతో పంట నాశనమైపోయిన అనేక గ్రామాల్లో రైతుల పరిస్థితి ఇదే. చేతికి దిగుబడి అందే తరుణంలో పంటలు దెబ్బతినడం, ప్రభుత్వమూ పూర్తిస్థాయిలో ఆదుకోకపోవడంతో అన్నదాత తల్లడిల్లిపోతున్నాడు.కౌలు రైతుకు మొండిచేయివాస్తవంగా రైతులకంటే కౌలుదారుల చేతుల్లోనే సాగు అధికంగా ఉంది. చంద్రబాబు ప్రభుత్వం కౌలు రైతులకూ మొండి చేయి చూపింది. కొన్ని చోట్ల కౌలుకు తీసుకున్న భూముల్లో కౌలుదారుకు కాకుండా భూ యజమాని ఖాతాలో ప్రభుత్వం పరిహారాన్ని జమ చేసింది. దీంతో కౌలుదారులు పూర్తిగా దెబ్బతిన్నారు. పలువురు రైతులకు బ్యాంకు ఖాతాతో ఆధార్ అనుసంధానం జరగకపోవటంతో పరిహారం విడుదలైనా చేతికి అందే పరిస్థితి లేదు.దయలేని సర్కారువైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రకృతి విపత్తులకు పంట నష్టపోయిన ప్రతి రైతునీ ఆదుకుని, అండగా నిలిచేది. పెట్టుబడి సాయం, బీమా వర్తింపజేసి అన్నదాతను ఆదుకొనేది. కానీ కూటమి సర్కారు మాత్రం అన్నదాత పట్ల దయలేకుండా వ్యవహరిస్తోంది. ఉదాహరణకు కృష్ణా జిల్లావ్యాప్తంగా 48,641 హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు కేంద్ర బృందానికి నివేదిక ఇచ్చారు. ఇందులో 44,521 హెక్టార్లలో వరి, వేరుశనగ, మినుములు, చెరకు, ఇతర పంటలు, 4,700 హెక్టార్లలో ఉద్యాన పంటలు, 50 హెక్టార్లలో పట్టు పంట దెబ్బతిందని ఆ నివేదికలో పేర్కొన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం నిబంధనల పేరుతో నష్టం అంచనాల్లో భారీగా కోత వేసింది. కృష్ణా జిల్లాలో 21,661.02 హెక్టార్లలోనే పంట నష్టం వాటిల్లిందని సగానికిపైగా కోత వేసింది. ఇవే లెక్కలతో రైతులు వాస్తవంగా నష్టపోయినదానికంటే అతి తక్కువ పరిహారం అందించి రైతులను నట్టేట ముంచింది.కౌలు రైతుల పరిస్థితి దారుణం గ్రామంలో 20 ఎకరాలు కౌలు తీసుకుని వరి సాగు చేస్తున్నా. బుడమేరు వరదతో పంట అంతా నీటి పాలైంది. ఎకరాకు రూ 25 వేలు వరకూ పెట్టుబడి అయ్యింది. తిరిగి మళ్లీ పంట సాగు చేసుకోవటానికి చేతిలో డబ్బు లేదు. ప్రభుత్వం పరిహారం కూడా మాకు ఇవ్వలేదు. అప్పులు చేసి సాగుకు వెళ్లాల్సిన పరిస్థితి. కౌలు రైతుగా నా పరిస్థితి దారుణంగా ఉంది. – కొలకలూరి కోటయ్య, కౌలురైతు, మంతెనబ్యాంకు ఖాతా లింక్ అవ్వలేదు అంటున్నారు నా పొలం మూడెకరాలు కౌలుకి ఇచ్చాం. బుడమేరు ముంపుతో దెబ్బతింది. దాని తాలూకా డబ్బులు వచ్చాయి. ఎకరం నిమ్మతోట వేశాను. వరదకి పంట కుళ్లిపోయింది. పంట ఆనవాళ్లు కూడా లేవు. ప్రభుత్వం నుంచి మెసేజ్ ఫోన్‌కి వచ్చింది. బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ కాలేదని. మిగిలిన డబ్బులు వస్తున్నాయి. ఇది మాత్రం కొర్రీ పెట్టారు. అధికారులు స్పందించి పరిహారం అందేలా చూడాలి. – బద్దల శ్రీనివాసరావు, రైతు, మంతెనరైతు పేరు ఈడే సాంబశివరావు. మంతెన గ్రామం. కేసరపల్లి గ్రామం పరిధిలో 3.70 ఎకరాల పొలం ఉంది. బుడమేరు వరదతో ఈ పొలాల్లో వేసిన వరి పూర్తిగా నీటి మునిగి కుళ్లిపోయింది. అధికారులు నష్టం నమోదు చేశారు. కానీ రెండెకరాలకు మాత్రమే ఎకరాకు రూ 10 వేలు చొప్పున బ్యాంకు ఖాతాలో పడ్డాయి. నష్టం భారీగా జరిగితే.. పరిహారం ఇంత తక్కువ వచ్చిందని సాంబశివరావు ఆవేదన చెందుతున్నారు. -
ఎస్డీఆర్ఎఫ్ కింద రూ.3,448 కోట్లు
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన రెండు తెలుగు రాష్ట్రాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ నిధి (ఎస్డీఆర్ఎఫ్) కింద రూ.3,448 కోట్లు వెంటనే విడుదల చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని వరద ప్రాంతాల్లో పర్యటించడంతో పాటు అక్కడి రైతులను, ప్రజలను కలిసి పరిస్థితులను అంచనా వేసిన అనంతరం.. రెండు రాష్ట్రాల సీఎంలు రేవంత్‌రెడ్డి, చంద్రబాబులతో చర్చించిన తర్వాత ఈ మేరకు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.రెండు రాష్ట్రాలకు పూర్తిస్థాయిలో సాయం అందించడానికి కట్టుబడి ఉన్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. తెలంగాణలో పంటలు దెబ్బతిన్న మీనవాలు, పెద్దగోపవరం, మన్నూరు, కట్టలేరు పరిశీలించడంతో పాటు ఖమ్మంలో మున్నేరు వరదను ఏరియల్ సర్వే చేసినట్లు వెల్లడించారు. ఎవరూ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని, ప్రధాని నరేంద్ర మోదీ అందర్నీ ఆదుకుంటారని భరోసా ఇచ్చారు. నష్టం అంచనా వేసిన తర్వాత పరిహారంపై నిర్ణయం వరదల వల్ల జరిగిన పంటనష్టాన్ని అంచనా వేసిన తర్వాత ఏ మేరకు నష్టపరిహారం ఇవ్వాలన్నది నిర్ణయిస్తామని చౌహాన్ చెప్పారు. వరదల్లో అరటి, పసుపు, కూరగాయ ల పంటలు పూర్తిగా దెబ్బతిన్నట్లు తెలిపారు. ఇది ఊహించని విపత్తు అని మంత్రి వ్యాఖ్యానించారు. రైతులను ఆదుకోవడం, పంటల బీమా పథకం అమలు, రైతులు పొలాల్లో పనిచేసుకునే పరిస్థితులు కలి్పంచడం, తదుపరి పంటలు వేసుకునేలా సహకరించడం.. కేంద్ర ప్రభుత్వ నాలుగు ప్రాథమ్యాలని పేర్కొన్నారు. ఎరువులు, విత్తనాలకు ఎలాంటి లోటు లేకుండా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు. -
వరద నీటిలో పంట పొలాలు.. తీవ్ర ఆందోళనలో రైతులు
-
ఏపీని అతలాకుతలం చేస్తున్న వర్షాలు
-
అకాల వర్షం..అపార నష్టం
-
చేతికొచ్చిన పంట నీళ్లపాలు
-
అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం
జనగామ/ తుంగతుర్తి/ సూర్యాపేట రూరల్: ‘‘పంట ఎండిపోయిందని అధైర్యపడొద్దు.. ధైర్యంగా ఉండండి.. అధికారులు వచ్చినప్పుడు నష్టం వివరాల ను రాయించుకోండి. మేం అండగా ఉంటాం’’అని రైతులకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు భరోసా ఇచ్చారు. ఎండిన పంట పొలాల పరిశీలనలో భాగంగా.. ఆదివారం జనగా మ జిల్లా దేవరుప్పుల మండలం ధరావత్ తండాలో, సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం సింగారంతండా, మొండికుంట తండా, సూర్యా పేట మండలం ఎర్కారం గ్రామాల్లో పర్యటించారు. అక్కడి రైతులతో మాట్లాడారు. ‘‘యాసంగిలో ఎన్ని ఎకరాల్లో వరి సాగు చేశారు. ఎంత పెట్టుబడి పెట్టారు. కరెంటు ఎన్ని గంటలు వస్తోంది. కాలువల ద్వారా నీళ్లొస్తున్నాయా. బోర్లలో నీళ్లు ఉన్నాయా.. రైతుబంధు వచ్చిందా..’’ అని అడిగి తెలుసుకున్నారు. నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయంటూ.. కేసీఆర్‌కు రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. పొట్టదశకు వచ్చిన పంట నీళ్లు లేక ఎండిపోయిందంటూ కన్నీళ్లుపెట్టుకున్నారు. జనగామ జిల్లా ధరావత్ తండాలో మహిళా రైతు అముగోతు సత్తెమ్మ మాట్లాడుతూ.. ‘‘సారూ.. ఎనిమిది ఎకరా ల్లో వరి వేసినం. రూ.3 లక్షలకుపైగా పెట్టుబడులు అయినయి. కాలువ నీళ్లు రాక.. రూ.1.80 లక్షలు ఖర్చుచేసి నాలుగు బోర్లు వేయించినం. వాటిలోనూ నీళ్లు సరిగా పడలేదు. పంటంతా ఎండిపోతోంది. ఇక మాకు దిక్కెవరు..’’ అంటూ కన్నీరు పెట్టుకుంది. కుమారుడి పెళ్లి పెట్టుకున్నామని, అప్పులు కూడా పుట్టట్లేదని వాపోయింది. దీంతో ‘‘బిడ్డా బాధపడకు.. మళ్లీ వచ్చేది మనమే. బాధలన్నీ తీరుతయి. అందాక రూ.5లక్షల చెక్కు పంపిస్తా.. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెచ్చిస్తరు’’ అని భరోసా ఇచ్చారు. సాగు నీళ్లు రావడం లేదంటూ.. తర్వాత కేసీఆర్ సూర్యాపేట జిల్లాలోని సింగారం, మొండికుంట తండాల్లో ఎండిపోయిన పొలాలను పరిశీలించారు. రైతులు దయ్యాల వెంకటనారాయ ణ, ధరావత్ సురేశ్, భూక్యా శ్రీను, ఆంగోతు హర్జా, గుగులోతు సుశీలతో మాట్లాడారు. ఈ రెండు తండాల్లో 250 ఎకరాల వరకు వరి వేయగా.. పూర్తిగా ఎండిపోయిందని రైతులు తెలిపారు. గత ఐదారేళ్లు ఎస్సారెస్పీ కాలువ ద్వారా గోదావరి జలా లు రావడంతో.. పంటలు బాగా పండాయన్నారు. ఈ యాసంగి సీజన్ మొదట్లో కాల్వల ద్వారా నీళ్లు వదలడంతో.. వరి వేశామని, కానీ ఇప్పుడు నీళ్లు రాక పంటలన్నీ ఎండిపోయాయని వాపోయారు. రోజులో 16 గంటలే కరెంట్ వస్తోందని.. అదికూడా 16 సార్లు ట్రిప్ అవుతోందని పేర్కొన్నారు. ప్రభు త్వం నుంచి నష్టపరిహారం వచ్చేలా చూడాలని వేడుకున్నారు. అనంతరం కేసీఆర్ సూర్యాపేట మండలం ఎర్కారం చేరుకున్నారు. మళ్లీ అప్పుల పాలవుతున్నాం.. ఎర్కారం గ్రామంలో రైతు కొదమగుండ్ల వెంకటయ్య, సరోజనమ్మ పొలాన్ని కేసీఆర్ పరిశీలించారు. ఈ సమయంలో సరోజనమ్మ కేసీఆర్ వద్దకు వచ్చి విలపించింది. ‘‘మీరు సీఎంగా ఉన్నప్పుడు సాగునీళ్లు వచ్చేవి. సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు కష్టాలు మొదలయ్యాయి. కాలువ నీళ్లు రావట్లేదు. ఐదెకరాల్లో వరి ఎండింది. మళ్లీ అప్పుల పాలు అవుతున్నాం’’ అని ఆవేదన వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడుతా రైతుల గోడు ఆలకించిన కేసీఆర్.. వారికి ధైర్యం చెప్పారు. ఏ రైతును పలకరించినా కన్నీరే వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టకాలంలో అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తానని.. ఎండిన వరి పొలాలకు ఎకరానికి రూ.25 వేలు నష్ట పరిహారం వచ్చేలా చేస్తానని చెప్పారు. ఎన్ని కష్టాలెదురైనా మళ్లీ 24 గంటల కరెంట్‌ను సాధించుకుందామన్నారు. -
fact check: కుంభకర్ణ నిద్ర మీదే రామోజీ
సాక్షి, అమరావతి: నిత్యం కుట్రపూరిత ఆలోచనలు, విషపూరిత రాతలు.. అక్షరాలకు అందని ఆక్రోశం.. ఇదీ ఈనాడు రామోజీరావు పరిస్థితి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పదేపదే అబద్ధాలను అచ్చేస్తూ వయోభారానికి తోడు తనకున్న అల్జీమర్స్ వ్యాధి ముదిరి పోయిందని సోమవారం మరోసారి రుజువు చేసుకున్నాడు. దేశవ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితుల ప్రభావంతో ఖరీఫ్‌తో పాటు రబీలో పంటల సాగు తగ్గిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేందుకు వీలుగా ఒకే వ్యవసాయ సీజన్లో నాలుగు సార్లు సబ్సిడీపై విత్తనాలు ప్రభుత్వం అందించిన విషయాన్ని తన రాతల్లో మరుగున పరిచారు. 103 కరువు మండలాల పరిధిలో పంటలు నష్టపోయిన రైతులతో పాటు డిసెంబర్లో విరుచుకుపడిన మిచాంగ్ తుపాన్ వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకూ పెట్టుబడి రాయితీని నాలుగు రోజుల క్రితమే విడుదల చేసిన విషయాన్ని మరచిపోయారు. మూడో విడత రైతు భరోసా, సున్నా వడ్డీ రాయితీలు కలిపి ఏకంగా 75.96 లక్షల మందికి రూ.2588.92 కోట్లు లబ్ధి చేకూర్చిన అంశం ఈ కబోదికి కన్పించలేదు. ఆరోపణ: ఖరీఫ్, రబీలో కలిపి 45 లక్షల ఎకరాల్లో బీడు వాస్తవం: ఖరీఫ్, రబీ పంట కాలాల్లో సాధారణ విస్తీర్ణం 140.24 లక్షల ఎకరాలకు గాను 104.94 లక్షల ఎకరాల్లో సాగైంది. బెట్ట పరిస్థితుల వలన 35.30 లక్షల ఎకరాలలో పంటలు వేయలేదు. కానీ ఉద్యాన పంటల విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. పండ్లు, ప్లాంటేషన్ తోటలు, కూరగాయలు, వాణిజ్య పూలు, ఇతర ఉద్యాన పంటల విస్తీర్ణం ఖరీఫ్, రబీల్లో 7,87,621 ఎకరాలకు చేరింది. సాధారణం కన్నా కేవలం 27.42 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు తగ్గింది. కానీ ఈనాడుకు మాత్రం ఏకంగా 45 లక్షల ఎకరాల్లో తగ్గినట్టుగా కని్పంచింది. ఆరోపణ: కరువు, తుపానులతో మరో 43 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాస్తవం: వర్షాభావ పరిస్థితుల వల్ల ఏడు జిల్లాల్లో 103 కరువు మండలాలను ప్రకటించారు. ఈ మండలాల్లో 14,24,245 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టుగా గుర్తించారు. ఇందులో ఉద్యాన, వ్యవసాయ పంటలున్నాయి. రబీ సీజన్ ఆరంభంలో విరుచుకుపడిన మిచాంగ్ తుపాన్ భారీ వర్షాల వలన 6,64,380 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టుగా గుర్తించారు. కరువు, మిచాంగ్ తుపాన్ వల్ల 20,88,625 ఎకరాలు పంటలు దెబ్బతింటే ఈనాడుకు మాత్రం 43 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టుగా కని్పంచింది. ఆరోపణ: వెంటాడిన పొడి వాతావరణం వాస్తవం:దేశ వ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులు ఖరీఫ్‌తో పాటు రబీలోనూ కొనసాగింది. కానీ పొడి వాతావరణం కని్పంచినంత మాత్రాన కరువు ఉన్నట్టు కాదన్న విషయం రామోజీకి తెలియంది కాదు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పుడు ఏదైనా ప్రాంతాన్ని కరువు ప్రాంతంగా గుర్తించాలంటే ఆరు ప్రామాణికాల ఆధారంగా తీసుకుంటారు. తొలుత ప్రాథమిక అంచనా, క్షేత్ర స్థాయి పరిశీలన, తర్వాత నిబంధనల మేరకు 33 శాతానికి పైగా మునిగిపోయి దెబ్బతిన్న పంటలను పరిగణనలోకి తీసుకొని నష్టం తుది అంచనాలను రూపొందిస్తారు. ఆ మేరకు పంటలవారీగా లెక్కించి పరిహారాన్ని (ఇన్పుట్æసబ్సిడీ) అందిస్తారు. ఆరోపణ: పడిపోయిన 3 కోట్ల క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వాస్తవం: కరువు, మిచాంగ్ ప్రభావం ఉన్నప్పటికీ 2023–24లో ఆహార ధాన్యాల దిగుబడి 154.73 లక్షల టన్నులు నమోదవుతున్నట్టు డైరెక్టర్ ఆఫ్ స్టాటస్టిక్స్ (కేంద్ర గణాంక శాఖ) రెండో ముందస్తు అంచనా వేసింది. ఈ దిగుబడులు గడిచిన ఐదేళ్ల సగటు దిగుబడులతో పోలిస్తే తక్కువేమీ కాదు. వరితో సహా జొన్న, సజ్జ, రాగి, పెసలు, మినుము, ఉలవలు వేరుసెనగ, నువ్వులు, పత్తి పంటల ఎకరా దిగుబడి గత ఏడాదితో పోలిస్తే పెరిగింది. 2023–24 సీజన్లో 57.87 లక్షల ఎకరాలకు 48.93లక్షల ఎకరాల్లో వరి సాగైంది. వాస్తవాలు ఇలా ఉంటే ఏకంగా 3 కోట్ల క్వింటాళ్ల ధాన్యం దిగుబడి తగ్గిందంటూ కాకిలెక్కలు అచ్చేశారు. ఆరోపణ: కరువు విజృంభిస్తున్నా ఉపశమన చర్యలేవీ వాస్తవం: ఒకే సీజన్లో నాలుగు సార్లు సబ్సిడీపై విత్తనాలు అందించారు. బెట్ట పరిస్థితులు నెలకొన్న సమయంలో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలకు అనుగుణంగా ఆర్బీకేల ద్వారా 80 శాతం సబ్సిడీపై విత్తనాలను సరఫరా చేశారు. 2023లో జూలై– ఆగస్ట్ నెలల్లో కురిసిన అధిక వర్షాలకు వరి నారుమళ్ళు దెబ్బతిని నష్టపోయిన రైతులు మరలా విత్తుకునేందుకు 1479 క్వింటాళ్ళ స్వల్పకాలిక వరి రకాలు అందించారు. బెట్ట పరిస్థితుల వల్ల ఖరీఫ్ 2023లో పంటలు దెబ్బతిన్న రైతులకు 30వేల క్వింటాళ్ల ఉలవలు, అలసంద, మినుము, పెసర, కంది, రాగి, జొన్న, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు విత్తనాలను రూ.26.02 కోట్ల సబ్సిడీతో 1.14 లక్షల మందికి ఇచ్చారు. 2023 డిసెంబర్లో మిచాంగ్ తుపాను వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు 49,758 క్వింటాళ్ల శనగ, వేరుశనగ, మినుములు, పెసర, నువ్వులు, రాగి, తక్కువ పంట కాల వరి రకాలను రూ. 31.06 కోట్ల సబ్సిడీతో 71415 మందికి పంపిణీ చేశారు. మిచాంగ్ తుపాన్ వేళ రంగుమారిన, తడిసిన 6.79లక్షల టన్నుల ధాన్యాన్ని 1.11లక్షల మంది రైతుల నుంచి కొనుగోలు చేసి వారికి జీఎల్టీతో సహా రూ.1483.61 కోట్లు జమ చేశారు. ఆరోపణ: కరువు, తుపాన్ వేళ సాయమేది? వాస్తవం: కరువు, మిచాంగ్, అకాల వర్షాల వల్ల అందించిన సాయానికి అదనంగా 2023–24 సీజన్లో వైఎస్సార్ రైతు భరోసా కింద రూ.7226.08 కోట్ల పెట్టుబడి సాయంతో పాటు వైఎస్సార్ ఉచిత పంటల బీమా పధకం ద్వారా రూ.1117.21కోట్లు, వై.ఎస్.ఆర్. సున్నావడ్డీ పంట రుణాల పథకం ద్వారా రూ.215.98 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేసింది అంతేకాకుండా ఈ సీజన్లో ఇప్పటి వరకు రూ.326.14 కోట్ల ఖర్చుతో ఆర్బీకేల ద్వారా రైతులకు అందించారు. ఇవేమీ ఈనాడుకు కని్పంచకపోవడం విడ్డూరంగా ఉంది. ఆరోపణ: సాయంపై సర్కార్ మీనమేషాలు వాస్తవం: ఖరీఫ్ 2023 పంటకాలంలో మే–ఆగస్ట్ మధ్య కురిసిన వర్షాలు, వరదల వల్ల 12,198.62 ఎకరాల్లో దెబ్బతిన్న అరటి, కూరగాయలు, బొప్పాయి, తమలపాకు, మామిడి తదితర ఉద్యాన పంటల రైతులు 11,373 మందికి పెట్టుబడి రాయితీగా రూ.11 కోట్లు అందించారు. 2023 మార్చి–మే మధ్య కురిసిన అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న మొక్కొజొన్న, జొన్న పంటలకు సంబంధించి 1892 మంది రైతులకు క్వింటాలుకు రూ. 500 చొప్పున రూ.5 కోట్ల ప్రత్యేక పెట్టుబడి రాయితీ ఇచ్చారు. 2023లో కరువు వల్ల నష్టపోయిన 6.96 లక్షల మంది రైతులకు రూ.847.23 కోట్లు, మిచాంగ్ తుపాన్ వల్ల నష్టపోయిన 4.61 లక్షల మంది రైతులకు రూ.442.36 కోట్లు పెట్టుబడి రాయితీని రైతుల ఖాతాలకు ఇటీవలే విడుదల చేశారు. దీనికోసం జీవో ఎంఎస్ నెం.5 జారీ చేశారు. ఈ జాబితాలను ఆర్బీకేల్లో ప్రదర్శించారు. తమ పేరు లేదని కానీ, ఇన్పుట్ సబ్సిడీ రాలేదని ఒక్కరంటే ఒక్క రైతూ ఫిర్యాదు చేసిన దాఖలాలు లేవు. అదే ఈనాడుకు కంటగింపుగా ఉంది. గతంలో ఎన్నడూ లేనంత దుర్భిక్షం చంద్రబాబు పాలనలో ఏటా సగటున 324 మండలాల్లో కరువు తాండవించేది. కరువు మండలాలను సీజన్‌కు అనుగుణంగా ప్రకటించిన దాఖలాలు లేవు. 2014 ఖరీఫ్ కరువు మండలాలను 2015 నవంబర్‌లో, 2015వి 2016 నవంబర్‌లో, 2016వి 2017 జూన్‌లోనూ, 2017వి 2018 ఆగష్టులోనూ ప్రకటించారు. 2018 ఖరీఫ్, 2018–19 రబీ సీజన్లలో ఏర్పడిన కరువు మండలాలను అసలు ప్రకటించనే లేదు. తన ఐదేళ్ల పాలనలో 24,79,985 మంది రైతులకు చెల్లించాల్సిన రూ.2558 కోట్లు ఎగ్గొట్టిన ఘనత చంద్రబాబుదే. -
Fact Check: కాకి లెక్కలతో రోత
సాక్షి, అమరావతి: సాధారణంగా ప్రాథమిక పంట నష్టం అంచనాలకు, తుది నష్టం లెక్కలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎందుకంటే ప్రాథమిక అంచనాలను ముంపు విస్తీర్ణం ఆధారంగా అప్పటికప్పుడు రూపొందిస్తారు. ముంపునీరు సకాలంలో దిగిపోతే పంటలకు నష్టం వాటిల్లదు. శాస్త్రవేత్తల సూచనలు పాటిస్తే ఆశించిన స్థాయిలో దిగుబడులొస్తాయి. ఇది రైతన్నలందరికీ తెలిసినా రోత రాతల రామోజీ మాత్రం పంట నష్టం లెక్కలను ప్రభుత్వం తగ్గించి చూపిస్తోందంటూ బురద చల్లుతున్నారు. నిజంగానే అలా తగ్గించే ఉద్దేశమే ఈ ప్రభుత్వానికి ఉంటే గతంతో పోలిస్తే పెట్టుబడి రాయితీని పెద్ద ఎత్తున ఎందుకు పెంచుతుంది? లబ్దిదారులను వెతికి మరీ ఎందుకిస్తుంది? గత సర్కారు ఎగ్గొట్టిన బకాయిలను ఎందుకు చెల్లిస్తుంది? ఇక రామోజీ చెబుతున్నట్లు అన్నదాతకు వాతలు నిజమే కానీ, అది ఇప్పుడైతే కాదు. చంద్రబాబు సర్కారు హయాంలో అన్నది పచ్చి నిజం. అప్పుడు రామోజీ కలం మొద్దుబారిపోవడంతో కదల్లేదు కాబోలు!! ఎలా లెక్కిస్తారో తెలియదా? ఆరు ప్రామాణికాలు (వర్షపాతం, సాగు విస్తీర్ణం, ఉపగ్రహ ఆధారిత పంటల పరిస్థితి, వాగు ప్రవాహం, భూగర్భ జలాల స్థాయి, జలాశయాల మట్టం) పరిగణలోకి తీసుకొని కరువు మండలాలను ప్రకటిస్తారు. తుపాన్లు, వరదలు, అకాల వర్షాల సమయంలో తొలుత ప్రాథమిక నష్టాన్ని అంచనా వేస్తారు. క్షేత్ర స్థాయి పరిశీలన తర్వాత నిబంధనల మేరకు 33 శాతానికి పైగా మునిగిపోయి దెబ్బతిన్న పంటలను పరిగణలోకి తీసుకొని పంట నష్టం తుది అంచనాలను రూపొందిస్తారు. ఆ మేరకు పంటల వారీగా లెక్కించిన నష్ట పరిహారాన్ని (ఇన్పుట్ సబ్సిడీ) అందిస్తారు. ఆర్బీకే సిబ్బంది, ప్రభుత్వ యంత్రాంగం అన్నదాతలకు తోడుగా నిలవడంతో ముంపు నీరు త్వరగా దిగిపోయేలా చేసి పంట నష్టాన్ని గణనీయంగా తగ్గించగలిగారు. పెరిగిన పెట్టుబడి రాయితీ వైపరీత్యాల వేళ కేంద్రం నిర్ణయించిన దాని కంటే ఎక్కువగా ఇవ్వాలనే ఉద్దేశంతో పెట్టుబడి రాయితీని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయ భూముల్లో మట్టి, ఇసుక మేట తొలగించేందుకు గతంలో హెక్టారుకి రూ.12 వేలు ఇవ్వగా సీఎం జగన్ ప్రభుత్వం రూ.18 వేలకు పెంచింది. దెబ్బతిన్న వర్షాధార పంటలకు గతంలో హెక్టారుకి రూ.6,800 మాత్రమే ఉన్న పరిహారాన్ని రూ.8,500కి పెంచింది. నీటిపారుదల భూములైతే ఇన్పుట్ సబ్సిడీ గతంలో రూ.13,500 ఇవ్వగా ఇప్పుడు రూ.17 వేలు అందిస్తున్నారు. ప్రధానంగా వరి, వేరుశనగ, పత్తి, చెరుకు తదితర పంటలకు గతంలో హెక్టార్‌కు రూ.15 వేలు ఇవ్వగా ప్రస్తుతం రూ.17 వేలకు పెంచారు. ఉద్యాన పంటలకు రూ.7,500 నుంచి రూ.17 వేలకు పెంచారు. మామిడి, నిమ్మ జాతి తోటలకు రూ.20 వేల నుంచి రూ.22,500కి పరిహారం పెరిగింది. మల్బరీకి రూ.4,800 నుంచి రూ.6 వేలకు పెంచి ఇస్తున్నారు. ఎగ్గొట్టిన చరిత్ర చంద్రబాబుదే చంద్రబాబు పాలనలో ఏటా సగటున 324 మండలాల్లో కరువే తాండవించినా రైతులను కనికరించలేదు. హుద్‌హుద్ నుంచి పెతాయి తుపాన్ వరకు ఏటా విరుచుకుపడినా ఏనాడైనా ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి సంబంధించి నష్ట పరిహారాన్ని ఆ సీజన్ కాదు కదా కనీసం ఆ ఏడాది ముగిసేలోగానైనా ఇచ్చిన దాఖలాలు లేవు. ఐదేళ్ల పాలనలో 24.80 లక్షల మందికి రూ.2,558.07 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని ఎగ్గొట్టిన ఘన చరిత్ర చంద్రబాబుదే. సబ్సిడీ విత్తనాలకు సంబంధించి రూ.282.71 కోట్లు, సున్నా వడ్డీ రాయితీ రూ.1,180.66 కోట్లు, పంటల బీమా పరిహారం రూ.715.84 కోట్లు, ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలకు ఎక్స్‌గ్రేíÙయా రూ.23.70 కోట్లు, యాంత్రీకరణ కోసం రూ.221.07 కోట్లు, ధాన్యం కొనుగోలు బకాయిలు రూ.960 కోట్లు కలిపి ఏకంగా రూ.5,942.05 కోట్లు ఒక్క అన్నదాతలకే చంద్రబాబు ఎగ్గొట్టారు. ఇక రైతులకే మరో రూ.8,845 కోట్ల మేర విద్యుత్ బకాయిలు పెట్టారు. వీటిని ఇప్పుడు ఈ ప్రభుత్వమే చెల్లిస్తూ రైతన్నలకు తోడుగా నిలిచింది. విపత్తు ఏదైనా ఆగమేఘాల మీద స్పందిస్తూ నష్టపోయిన ప్రతి ఎకరాకు, దెబ్బతిన్న ప్రతీ రైతుకు సీజన్ చివరిలో పంట నష్ట పరిహారాన్ని (ఇన్పుట్ సబ్సిడీ) అణాపైసలతో సహా లెక్కగట్టి మరీ నేరుగా ఖాతాల్లో జమ చేస్తోంది. ఇలా 22.85 లక్షల మంది రైతులకు రూ.1,976.45 కోట్ల మేర ఇన్పుట్ సబ్సిడీ చెల్లించింది. పైసా భారం పడకుండా వైఎస్సార్ ఉచిత పంటల బీమా ద్వారా 54.48 లక్షల మంది రైతులకు రూ.7,802.05 కోట్ల బీమా పరిహారాన్ని అందించింది. నిబంధనలు సడలించి కొనుగోలు వర్షాభావంతో 2023 ఖరీఫ్‌లో 63.46 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. 103 కరువు మండలాలను గుర్తించగా 14.07 లక్షల ఎకరాల్లో 6.96 లక్షల మంది రైతులు పంట నష్ట పోయినట్లు తేలింది. వారికి రూ.847.27 కోట్ల పెట్టుబడి రాయితీని ఖాతాల్లో జమ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు డిసెంబర్లో మిచాంగ్ తుపాన్ వల్ల పంట నష్టపోయిన 4.61లక్షల మంది రైతులకు రూ.442.11 కోట్లు ఇన్పుట్ సబ్సిడీని కూడా త్వరలో జమ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. తుపాన్ ప్రభావంతో రంగు మారిన, తడిసిన 12.70 లక్షల క్వింటాళ్ల ధాన్యాన్ని నిబంధనలు సడలించి మరీ రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసింది. -
గాయం మానేలా సాయం
-
ఆంధ్రప్రదేశ్‌లో తుపాను బాధితులకు గతంలో కంటే వేగంగా, మిన్నగా, ముందే అందిన సాయం..ఇంకా ఇతర అప్డేట్స్
-
రైతాంగానికి తుపాను కష్టం..వేల హెక్టార్లలో పంట నష్టం
-
పంటనష్టంపై రేపటినుంచి క్షేత్రస్థాయిలో పరిశీలన
-
మానవత్వంతో స్పందించిన సీఎం
సాక్షి, తిరుపతి: ఆర్థిక సాయం కోసం ఆపన్న హస్తం కోరిన వారికి మానవత్వంతో స్పందించి వెంటనే ఆర్థిక సాయం అందించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డిని సీఎం జగన్ ఆదేశించారు. స్థానికుల నుంచి వినతులను స్వీకరించి వాటినీ పరిష్కరించాలని ఆదేశాలిచ్చారు. తుపాను వల్ల పంటలు నష్టపోయిన బాధితులతో ముఖాముఖి కార్యక్రమంలో శుక్రవారం తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డి పాళెంకు సీఎం వచ్చారు. ఆయనను కుటుంబ యాజమానులను కోల్పోయి ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పి.రమణమ్మ, ఐ.కవిత కలిసి తమకు సాయం చేయాలని కోరారు. దీంతో సత్వరమే స్పందించిన సీఎం..తిరుపతి జిల్లా కలెక్టర్ కే వెంకట రమణారెడ్డిని ఇరువురికీ ఆర్థిక సాయాన్ని అందజేయాలని ఆదేశించారు. సీఎం సూచనల మేరకు జిల్లా జాయింట్ కలెక్టర్ డీకే బాలాజీ ఇద్దరు మహిళలరూ రూ.లక్ష వంతున చెక్కులను అందజేశారు. -
ఫోటో ఎగ్జిబిషన్ ను సందర్శించిన సీఎం వైఎస్ జగన్
-
మిర్చి పంటపై దృష్టిసారించిన అధికారులు
-
పంటలు దెబ్బతిన్న రైతులకు ఇన్ పుట్ సబ్సిడి
-
బాపట్ల జిల్లాలో పంట నష్టాన్ని అంచనా వేస్తున్న అధికారులు
-
పంట.. నీటిపాలు
సాక్షి, హైదరాబాద్/ఖమ్మంవ్యవసాయం/సూపర్‌బజార్(కొత్తగూడెం): వర్షాలతో చేతికొచ్చిన పంటలన్నీ నేలపాలయ్యాయి. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్, కరీంనగర్, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. పత్తి, మిర్చితోపాటు టమాటా, వంగ, బీర, బెండ తోటలు కూడా దెబ్బతిన్నాయి. కల్లాల్లో ఉన్న వరి తడిసిపోవడంతో మొలకలొచ్చే పరిస్థితి ఏర్పడింది. కల్లాల్లో ఉన్న మిర్చి తడిసి నష్టం వాటిల్లింది. కోత దశలో ఉన్న వరి పంట కూడా నేల రాలింది. నష్టంపై వ్యవసాయశాఖ అంచనా వేస్తోందని అధికారులు చెబుతున్నారు. రంగుమారుతున్న పత్తి.. ప్రస్తుతం పత్తి తీతలు కొనసాగుతున్నాయి. ఈదురుగాలులు, వానలతో పత్తి నేలరాలిపోతోంది. రంగు మారి నాణ్యత కోల్పోతుండగా, కాయలోకి నీరు దిగి పత్తి నల్లబడుతోంది. పత్తి తీతకు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. కూలీల ఖర్చు కూడా పెరుగుతుంది. వర్షానికి తడిసిన పత్తి బరువు కూడా తగ్గుతుంది. ఇక పత్తిలో ఉన్న గింజ మొలకెత్తే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం రెండో తీతలో ఎకరాకు 3 నుంచి 4 క్వింటాళ్ల వరకు చేతికందే దశలో ఉంది. తుపాను కారణంగా ఈ పత్తి చేతికందుతుందా లేదా అనేది రైతుల్లో ఆందోళనగా ఉంది. ఒకవేళ తుపాను ప్రభావం తగ్గినా ప్రస్తుత పరిస్థితుల్లో చేతి కందే పత్తి బరువు తగ్గి 4 క్వింటాళ్లకు ఒక క్వింటా నష్టం జరుగుతుందని రైతులు చెబుతున్నారు. నేలవాలుతున్న వరి.. వానకాలం వరి కోతలు సగమే పూర్తయ్యాయి. ఇంకా ఆయా జిల్లాల్లో కోతలు కొనసాగుతున్నాయి. వరి కోత, నూర్పిడి దశలో ఉంది. పలు ప్రాంతాల్లో ధాన్యం కల్లాల్లో ఆరబెడుతున్నారు. కోత దశలో ఉన్న వరి ఈదురుగాలులు, తుపాను కారణంగా కంకి బరువుకు నేలవాలుతోంది. గాలులకు ఆరిపోయి ఉన్న కంకుల నుంచి గింజలు నేలరాలిపోతున్నాయి. ఇక నేలవాలిన కంకులు తేమ కారణంగా మొలకొచ్చే ప్రమాదం కూడా ఉంది. ఇక నేలవాలిన వరిని యంత్రాలు కోయటం అంతగా సాధ్యం కాదు. కూలీలతో వరికోతలు జరిపించాల్సి ఉంటుంది. దీంతో రైతులకు ఖర్చులు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఓ వైపు పంట నేలవాలి కొంత దెబ్బతినగా, మరో వైపు కూలీల ఖర్చులు పెరిగి పెట్టుబడులు మరింతగా పెరిగే పరిస్థితులు నెలకొన్నాయి. ఇక కల్లాల్లో ఆరబెట్టిన రైతులు రాశులుగా చేసి టార్పాలిన్లను కప్పి రక్షించుకునే పనిలో ఉన్నారు. తేమతో ఉన్న ధాన్యం రాశులు నాణ్యత కోల్పోతాయని రైతులు దిగులు చెందుతున్నారు. రెండు రోజులు తుపాను కొనసాగితే రాశుల్లో మొలకొచ్చే ప్రమాదం కూడా ఉందని రైతులు చెబుతున్నారు. మిర్చిని అదే పరిస్థితి... కాత దశలో ఉన్న మిర్చి పైర్లు నేలవాలే ప్రమాదం ఉంది. మిర్చి కాయబరువుతో చెట్టు పడిపోతుందని రైతులు చెబుతున్నారు. అక్కడక్కడ తొలి కోతలు కూడా సాగుతున్నాయి. కోసిన మిర్చి ఆరబెట్టకుండా రాశులుగా కల్లాల్లో ఉంచితే తేమబారిన పడి నాణ్యత కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. తేమతో ఉన్న కాయకు నల్లమచ్చ ఆశించే అవకాశం ఉందని రైతులు అంటున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వానలు మాత్రం రైతులను నష్టపరుస్తున్నాయే తప్పా ప్రయోజనం కలిగించటం లేదని అన్నదాతలు వాపోతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీగానే నష్టం ఖమ్మం జిల్లాలో 53,903 మంది రైతులకు చెందిన 82,191 ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం వాటిల్లినట్టు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా వేసింది. ఇందులో అధికంగా వరి 59,307 ఎకరాల్లో నష్టపోయినట్టు చెబుతున్నారు. ► భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 7,450మంది రైతులకు సంబంధించిన 13,608 ఎకరాల్లో వరి, వేరుశనగ, మొక్కజొన్న, మిర్చి, పత్తి పంటలు ధ్వంసమైనట్లు అంచనావేశారు. ప్రస్తుతం అధికారులు అంచనాల్లో నిమగ్నం కాగా.. ఒకటి, రెండు రోజుల్లో పంట నష్టంపై స్పష్టత రానుంది. ► వాజేడు మండలంలో ప్రత్యేకాధికారి సర్ధార్ సింగ్ ఆధ్వర్యంలో అధికారులు ముంపు ప్రాంతాలను పరిశీలించారు. ఈ ప్రాంత ప్రజలను కాపాడేందుకు ఏటూరునాగారంలో పోలీస్ విపత్తు దళం ముళ్లకట్ట వద్ద హైపవర్ బోటులో రీహార్సల్ చేపట్టింది. చనిపోయిన 13వేల బాతులు...గుండెపోటుతో యజమాని మృతి ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టాపురానికి ఏపీలోని జగ్గయ్యపేట మండలానికి చెందిన పేరం ఆదిలక్ష్మి (67) కుటుంబ సభ్యులతో కలిసి బాతులను తీసుకొచ్చి పెంచుతున్నారు. తుపాన్ ప్రభావంతో తడిచిన 13వేల బాతు పిల్లలు మృతి చెందడంతో యజమాని ఆదిలక్ష్మి గుండెపోటుతో మృతి చెందారు. పరిహారం ఇవ్వాలి: తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టాన్ని తక్షణం అంచనా వేసి నష్టపోయిన ఆహార పంటలకు ఎకరాకు రూ. 20 వేలు, వాణిజ్య పంటలకు ఎకరాకు రూ. 40 వేలు చెల్లించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పోతినేని సుదర్శన్, టి.సాగర్ కోరారు. వేలాది ఎకరాల్లో పంటలు తడిసి ముద్దయ్యాయి: కూనంనేని రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని కోరారు. పత్తి, మిర్చికి ఎకరాకు రూ. 40 వేలు, వరికి ఎకరాకు రూ. 20 వేలు, కూరగాయలకు ఎకరాకు రూ. 15 వేలు ఇవ్వాలన్నారు. -
పంట నష్టం అంచనాకు ప్రత్యేక బృందాలు
సాక్షి, అమరావతి: మిచాంగ్ తుపానుతో నష్టపోయిన రైతన్నలకు వైఎస్ జగన్ ప్రభుత్వం కొండంత భరోసానిస్తోంది. తుపాను కారణంగా కురిసిన వర్షాలకు తడిసి, తేమ శాతం, రంగు మారిన ధాన్యాన్ని సాంకేతిక కారణాలను పట్టించుకోకుండా, నిబంధనలు సడలించి మరీ ప్రభుత్వమే కొనుగోలు చేసింది. అదీ రైతులకు ఏమాత్రం నష్టం రాకుండా మద్దతు ధరకే కొని, మిల్లులకు తరలించింది. మరోవైపు సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పంట నష్టం అంచనా వేసేందుకు వ్యవసాయ, ఉద్యాన శాఖలు సన్నద్ధమయ్యాయి. రెవెన్యూ శాఖతో కలిసి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాయి. ఒకటి రెండ్రోజుల్లో ముంపు నీరు దిగిపోయిన వెంటనే క్షేత్రస్థాయి పర్యటనలకు ఈ బృందాలు సిద్ధమవుతున్నాయి. ఈ నెల మూడో వారంలోగా పంట నష్టం అంచనాలు కొలిక్కి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. నెలాఖరులోగా లేదా జనవరి మొదటి వారంలో పరిహారం పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం జగన్ ఆదేశాలతో రంగంలోకి ఖరీఫ్ సీజన్లో 64.35 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, 28.94 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగయ్యాయి. వర్షాభావ పరిస్థితుల వల్ల ఏడు జిల్లాల్లో 14.91 లక్షల ఎకరాల్లో పంటలు ఇప్పటికే దెబ్బతిన్నట్టుగా గుర్తించారు. ఇక మిగిలిన విస్తీర్ణంలో 17 లక్షల ఎకరాల్లో పంటలు కోతలు పూర్తయ్యాయి. మరో 14.37 లక్షల ఎకరాల్లో కోతలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ దశలో మిచాంగ్ తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలు రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేసాయి. ప్రాథమికంగా సుమారు 80 వేల ఎకరాల్లో పంటలు ముంపునకు గురి కాగా, మరో లక్ష ఎకరాలకు పైగా కోతకు సిద్ధంగా ఉన్న పంట నేల కొరిగినట్టు అంచనా వేశారు. వరితో పాటు మిరప, పత్తి, మొక్కజొన్న, వేరుశనగ పంటలపై ప్రభావం చూపినట్టుగా గుర్తించారు. అయితే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తుపాను ప్రారంభమైంది మొదలు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అధికారులను అప్రమత్తం చేశారు. రైతులకు అన్ని విధాలుగా అండగా నిలవాలని ఆదేశాలు జారీ చేశారు. ఫలితంగా కుండపోత వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు ఆర్బీకే సిబ్బందితో కలిసి క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు రైతులను అప్రమత్తం చేశారు. ముఖ్యంగా ఆర్బీకే సిబ్బంది రైతులతో నిత్యం మమేకమవుతూ వారికి అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నారు. స్వయంగా చేలకు వెళ్లి నష్ట నివారణకు తీసుకోవల్సిన చర్యలపై సూచనలు చేశారు. కోతలు పూర్తయిన పంటను కల్లాల నుంచే కొనుగోలు చేశారు. కోతకు సిద్ధంగా ఉన్న పంటను కాపాడుకునేలా రైతులకు వెన్నుదన్నుగా నిలిచారు. ముంపునకు గురైన పొలాల్లో నీరు నిలవకుండా యుద్ధ ప్రాతిపదికన తీసుకున్న చర్యలు ఫలితాన్నిచ్చాయి. వర్షాలు తెరిపినిచ్చిన కొద్ది గంటల్లోనే చేలల్లోని నీరు కిందకు దిగిపోవడం మొదలైంది. మరో వైపు నేలకొరిగిన వరి, ఇతర పంటలను కాపాడుకునేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. వరి పంటను కోయకుండా రైతులను అప్రమత్తం చేశారు. నేలకొరిగిన వరిచేలలో కూడా ఉప్పు ద్రావణాన్ని పిచికారీ చేయిస్తున్నారు. వేరుశనగ, పత్తి, మిరప, శనగ, మినుము, పెసర తదితర పంటలు సాగు చేసిన రైతులను కూడా ఇదే రీతిలో అప్రమత్తం చేశారు. -
పక్కాగా పరిహారం
సాక్షి, అమరావతి: కరువు ప్రభావిత ప్రాంతాల్లో పంట నష్టం అంచనాలు కొలిక్కి వచ్చాయి. అర్హుల జాబితాలను సామాజిక తనిఖీల కోసం రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శిస్తున్నారు. అభ్యంతరాల పరిశీలన పూర్తయిన తరువాత డిసెంబర్ 1న తుది జాబితాలను ప్రదర్శిస్తారు. డిసెంబర్ నెలాఖరులోగా పంట నష్టపరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) జమ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రుతుపవనాలు మొహం చాటేయడంతో దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు తలెత్తాయి. ఈ ప్రభావం రాయలసీమ జిల్లాల్లో కొంతమేర చూపించింది. ఖరీఫ్‌లో 574.7 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా.. 487.2 మిల్లీమీటర్లు నమోదైంది. 7 జిల్లాలో 21 నుంచి 35 శాతం మధ్య లోటు వర్షపాతం నమోదైంది. వ్యవసాయ పంటల సాధారణ విస్తీర్ణం 85.97 లక్షల ఎకరాలు కాగా.. వర్షాభావ పరిస్థితుల వల్ల 64.35 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. ఉద్యాన పంటల సాధారణ విస్తీర్ణం 42 లక్షల ఎకరాలు కాగా.. 28.94 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. 103 మండలాల గుర్తింపు కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా కరువు నిర్వహణ మాన్యువల్ ప్రకారం మండలాన్ని యూనిట్‌గా తీసుకొని 4 సూచికల ఆధారంగా మూడు దశల్లో పరిశీలించడంతో పాటు క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత కరువు మండలాలను గుర్తించారు. 80 మండలాల్లో కరువు ప్రభావం ఎక్కువగా ఉందని.. 23 మండలాల్లో స్వల్పంగా ఉందని అధికారులు గుర్తించారు. మొత్తంగా 7 జిల్లాల పరిధిలో 103 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారు. కరువు ప్రభావిత మండలాలతో పాటు ఇతర జిల్లాల్లో కూడా వర్షాభావ పరిస్థితుల వల్ల ఏర్పడిన పంట నష్టాన్ని అంచనా వేసేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. దాదాపు నెల రోజుల పాటు క్షేత్రస్థాయి పరిశీలన జరిపి పంట నష్టాన్ని అంచనా వేశారు. వ్యవసాయ పంటల వారీగా నష్టం అంచనాలు కొలిక్కిరాగా.. ఉద్యాన పంటల నష్టం అంచనాలు నాలుగైదు రోజుల్లో కొలిక్కి రానున్నాయి. పత్తి, వేరుశనగ పంటలకే నష్టం వ్యవసాయ పంటలకు వాటిల్లిన నష్టం పరిశీలిస్తే.. 7 జిల్లాల పరిధిలో 7.06 లక్షల రైతులకు చెందిన 14.91 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు గుర్తించారు. వర్షాధారం కింద సాగయ్యే ప్రాంతాల్లో 14.17 లక్షల ఎకరాలు, నీటివసతి ఉన్న ప్రాంతాల్లో 74 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టుగా గుర్తించారు. అత్యధికంగా కర్నూలు జిల్లాల్లో 6.92 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతినగా.. ఆ తర్వాత అనంతపురంలో 4.66 లక్షల ఎకరాల్లో, శ్రీసత్యసాయి జిల్లాలో 1.98 లక్షల ఎకరాల్లో పంటలపై ప్రభావం చూపినట్టు గుర్తించారు. పంటల వారీగా చూస్తే అత్యధికంగా 5.59 లక్షల ఎకరాల్లో పత్తి, 3.93 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 2.41 లక్షల ఎకరాల్లో కంది, లక్ష ఎకరాల చొప్పున ఆముదం, మొక్కజొన్న పంటలు దెబ్బతినగా, 43 వేల ఎక ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లినట్టు గుర్తించారు. వీటిని ఆధారంగా చేసుకుని ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ నిబంధనల మేరకు నష్టపరిహారాన్ని అంచనా వేస్తున్నారు. మరోవైపు ప్రాథమిక అంచనాల మేరకు కరువు సాయం కోసం ఇప్పటికే కేంద్రానికి నివేదిక కూడా సమర్పించారు. నెలాఖరులోగా పంపిణీ పంట నష్టం జాబితాలను సామాజిక తనిఖీల్లో భాగంగా ఇప్పటికే ఆర్బీకేల్లో ప్రదర్శిస్తున్నారు. అభ్యంతరాల పరిశీలన పూర్తయింది. తుది జాబితాలను డిసెంబర్ 1న ప్రచురిస్తాం. అర్హులకు డిసెంబర్ నెలాఖరులోగా పంట పరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) జమ చేసేలా కసరత్తు చేపట్టాం. – చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ -
పంటనష్టమొచ్చిందని కౌలు రైతు దంపతుల ఆత్మహత్య
మంథని (పెద్దపల్లి జిల్లా): ఇటీవల కురిసిన భారీవర్షాలు, వరదలతో పంటలు దెబ్బతినడంతో తీవ్రంగా నష్టపోయిన కౌలు రైతు దంపతులు మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎక్లాస్పూర్ గ్రామపంచాయతీ పరిధి నెల్లిపల్లి గ్రామంలో మంగళవారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కటుకు అశోక్ (35), సంగీత (28) దంపతులకు ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారుడు సాయి (5), కూతురు సన (4) ఉన్నారు. గ్రామ శివారులో ఐదెకరాల వ్యవసాయభూమిని కౌలు తీసుకుని రెండెకరాల్లో పత్తి, మూడెకరాల్లో వరి వేశారు. వ్యవసాయ పనులు లేనిసమయాల్లో కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అయితే, ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో పంటలు దెబ్బతిన్నాయి. దీంతో సుమారు రూ.2 లక్షల నష్టం వాటిల్లింది. పెట్టుబడి కోసం తెచ్చిన ఈ అప్పులు తీర్చేదారిలేకపోవడంతో మనస్తాపం చెందిన దంపతులు...సోమవారం రాత్రి పురుగుమందు తాగారు. మంగళవారం ఉదయం ఇరుగుపొరుగు వారు గమనించగా దంపతులిద్దరూ విగతజీవులుగా పడి ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి రామస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. కాగా, వీరి మృతితో అనాథలైన చిన్నారులు తమ తల్లిదండ్రులకు ఏమైందో తెలియక దిక్కులు చూస్తున్న దృశ్యం గ్రామస్తులను కలచివేసింది. -
పంట నష్టంపై ఆరా తీస్తున్న సీఎం కేసీఆర్
-
5 లక్షల ఎకరాల్లో పంటల మునక!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో వివిధ పంటలకు నష్టం వాటిల్లుతోంది. ఇప్పుడిప్పుడే వేసిన పంటలు నీటిలో మునిగిపోయాయి. వ్యవసాయశాఖ వేసిన అంచనా ప్రకారం దాదాపు 5 లక్షల ఎకరాల్లో పంటలు నీటముని గాయి. నిజామాబాద్ జిల్లాలో 21,500 ఎకరా ల్లో పంట నష్టం జరిగినట్లు అక్కడి వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. అలాగే ఇతర ప్రాంతాల్లో సోయాబీన్, మొక్కజొన్న, పెసర సహా ఇతర పంటలు చేతికి వచ్చే పరిస్థితి లేదు. పత్తి కూడా చాలాచోట్ల నీటమునిగింది. మొలక స్థాయిలో ఉన్న పత్తి 10 రోజుల తర్వాత కూడా నీటిని తోడేస్తే నిలబడగలుగుతుందని... విత్తనాలు వేసిన చోట నేల మునిగితే మాత్రం అది భూమిలోనే కుళ్లిపోతుందని వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ప్రాథమిక స్థాయిలో నాట్లు పడినచోట్ల, వరినారు వరదలతో కొట్టుకుపోయింది. అయితే వరదల కారణంగా పూర్తిస్థాయిలో నష్టం అంచనాకు వ్యవసాయ సిబ్బంది క్షేత్రస్థాయికి వెళ్లలేకపోతున్నారని అధికారులు అంటున్నారు. తెరిపినిస్తేనే వ్యవసాయానికి ఊపు... ప్రస్తుత భారీ వర్షాలతో వ్యవసాయానికి ఊపు వచ్చింది. అయితే భారీ వరదల కారణంగా పంటలకు నష్టం తప్పడంలేదు. ఇప్పటివరకు రాష్ట్రంలో 68.80 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. అందులో అత్యధికంగా పత్తి 40.73 లక్షల ఎకరాల్లో సాగవగా 15.63 లక్షల ఎకరాల్లో వరినాట్లు పడ్డాయి. సోయాబీన్ 4.14 లక్షల ఎకరాల్లో, కంది 3.82 లక్షల ఎకరాల్లో, మొక్కజొన్న 3.62 లక్షల ఎకరాల్లో సాగైంది. పత్తికి నష్టం జరిగితే తెరిపినిచ్చాక మరోసారి విత్తుకోవల్సి రానుంది. మొక్కజొన్న, సోయాబీన్ వంటి పంటలు దెబ్బతింటే మరోసారి వేసుకొనే పరిస్థితి ఉండదని అధికారులు అంటున్నారు. పత్తికి ఆగస్టు 10లోగా వేసుకొనే వెసులుబాటు ఉంటుందని, కొందరు రైతులు మూడోసారి కూడా వేసుకొనే పరిస్థితి తలెత్తుతుందని చెబుతున్నారు. ఏదైనా ప్రస్తుత వర్షాలు ఆగిపోతేనే పంటలను కాపాడుకోవచ్చని పేర్కొంటున్నారు. అయితే ప్రస్తుత వర్షాల వల్ల వరి విస్తీర్ణం మాత్రం మరింత పెరుగుతుందని... ఈసారి కూడా వరి వరిసాగు రికార్డు స్థాయిలో జరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వ్యవసాయ సిబ్బంది సెలవుల రద్దు? వర్షాలు, వరదల కారణంగా జిల్లాల్లో వ్యవసాయాధికారుల సెలవులు రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. -
రెవె‘న్యూ’ ప్రాబ్లమ్!
సాక్షి, హైదరాబాద్: వీఆర్ఏ.. గ్రామ రెవెన్యూ సహాయకుడు.. పేరుకే రెవెన్యూ ఉద్యోగి. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అన్ని శాఖల కార్యకలాపాల్లోనూ భాగస్వామ్యం ఉంటుంది. వీఆర్ఏలు అంటే గ్రామస్థాయిలో ప్రభుత్వ ప్రతినిధి లాంటి వారనే అభిప్రాయమూ ఉందంటే వారిదెంతటి కీలక పాత్రో అర్థమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ రెవెన్యూ అధికారి వ్యవస్థను రద్దు చేశాక.. వీఆర్ఏలే గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థకు ఏకైక దిక్కుగా మిగిలారు. అలాంటి వీఆర్ఏల సేవలు గ్రామాల్లో అవసరం లేదని, వారిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదన గందరగోళానికి దారితీస్తోంది. వీఆర్ఏల ఉద్యోగాలను క్రమబద్ధీకరించి, పేస్కేల్ అమలు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించడంపై హర్షం వ్యక్తమవుతున్నా.. వారిని ఇతర శాఖలకు పంపితే క్షేత్ర స్థాయిలో ఎదురయ్యే ఇబ్బందులకు పరిష్కారం ఏమిటన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వీఆర్ఏల విధులెన్నో.. వీఆర్ఏలు రెవెన్యూ శాఖలో విధులు నిర్వహిస్తున్నప్పటికీ వీరి జాబ్‌చార్ట్ మాత్రం మిగతా ఉద్యోగులకు భిన్నంగా ఉంటుంది. గ్రామాల్లోని చెరువులు, కుంటల సంరక్షణతో పాటు ఏ చెరువు కట్ట తెగినా, వాగులు పొంగినా, అలుగులు పోసినా నీటిపారుదల శాఖ ఏఈ, డీఈలకు వీఆర్ఏలే ప్రాథమిక సమాచారం ఇస్తుంటారు. గతంలో అయితే నీటి పంపకం (తైబందీ) కూడా వీరి పర్యవేక్షణలోనే జరిగేది. ఇక, గ్రామపంచాయతీ సమావేశాల ఏర్పాట్లు చేసేది, గ్రామంలోకి ఏ శాఖకు చెందిన అధికారి వచ్చినా దగ్గరుండి గ్రామానికి సంబంధించిన సమాచారం ఇచ్చేది వీఆర్ఏలే. ఆరోగ్య శిబిరాల ఏర్పాటు, ప్రభుత్వ పాఠశాలల్లో జరిగే కార్యక్రమాలకు సంబంధించిన వసతుల కల్పన బాధ్యత కూడా వీరిదే. పదో తరగతి నుంచి అన్ని స్థాయిల్లోని పరీక్షలకు సంబంధించి పాఠశాలలు, కళాశాలల్లో ఏర్పాట్లు చేస్తుంటారు. ప్రకృతి విపత్తులు, పంట నష్టం, శాంతిభద్రతలు, అగ్నిప్రమాదాలు తదితర అంశాలకు సంబంధించిన సమాచారం కోసం వీఆర్ఏలపైనే ఎక్కువగా ఆధారపడుతుంటారు. ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన ఎన్నికల (పోలింగ్) ప్రక్రియలో సైతం తెరవెనుక పనిచేస్తుంటారు. పోలింగ్ స్టేషన్ల గుర్తింపు నుంచి ఆయా స్టేషన్లలో వసతుల కల్పన, పోల్ స్లిప్పుల పంపిణీ, పోలింగ్ బాక్సుల పర్యవేక్షణ (స్ట్రాంగ్ రూంలకు తరలించేంతవరకు) చేసేది వీఆర్ఏలే. గ్రామాల్లో ‘ప్రభుత్వ ప్రతినిధి‘! ఇక గ్రామాల్లో హత్యలు జరిగినప్పుడు, గుర్తుతెలియని మృతదేహాలు కనిపించినప్పుడు, దోపిడీలు, ఆత్మహత్యల్లాంటి ఘటనలు జరిగినప్పుడు వీఆర్ఏలే పోలీసులకు ప్రాథమిక సమాచారం అందిస్తారు. గంజాయి రవాణా, స్మగ్లింగ్ లాంటి ఘటనలు జరిగినప్పుడు సాక్ష్యాలు బలంగా ఉండేలా పోలీసులు నిర్వహించే పంచనామాలో సాక్షులుగా (పంచ్) వ్యవహరిస్తుంటారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమల్లోనూ కీలక పాత్ర పోషిస్తారు. వీటితో పాటు 56 రకాల రెవెన్యూ విధులను వీరు నిర్వహిస్తుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వం తరఫున గ్రామాల్లో ఉండే వ్యక్తి వీఆర్ఏ. అలాంటి వీఆర్ఏలను ఇతర శాఖల్లోకి పంపిస్తే రెవెన్యూ శాఖ పునాదులు కదలడం ఖాయమని, ఆ వ్యవస్థ మనుగడే కష్టసాధ్యమవుతుందనే అభిప్రాయం రెవెన్యూ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇతర శాఖలపైనా తీవ్ర ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. వీరి నిష్క్రమణ కారణంగా ఎదురయ్యే సమస్యలకు గ్రామస్థాయిలో పరిష్కారమే ఉండదని అంటున్నారు. ఇంతటి కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న వీరిని.. ఇతర శాఖల్లో సర్దుబాటు చేసే విషయంలో ప్రభుత్వం ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని రెవెన్యూ ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. అయితే రెవెన్యూ ఉన్నతాధికారులు మాత్రం దీనిపై మౌనం పాటిస్తున్నారు. వారు వెళితే కష్టమే.. వీఆర్ఏల జీవితాల్లో వెలుగులు నింపేలా వారి సర్వీసును క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షణీయం. అయితే వారికి పేస్కేల్ ఇచ్చి రెవెన్యూ శాఖలోనే కొనసాగించాలని కోరుతున్నాం. అలా కాకుండా వారిని ఇతర శాఖల్లోకి బదలాయిస్తే.. క్షేత్రస్థాయిలో పనిచేసే వారుండరు. రెవెన్యూ పాలనే కాదు.. ఇతర శాఖల పరిధిలోని సంక్షేమ పథకాలు, కార్యక్రమాల అమలు కూడా కష్టతరమవుతుంది. దీనివల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారు. – కె.గౌతమ్‌కుమార్, ట్రెసా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఆర్ఏలకు సంబంధించిన గణాంకాలివీ.. రాష్ట్రంలోని మొత్తం రెవెన్యూ గ్రామాలు: 10,416 మొత్తం వీఆర్ఏ పోస్టుల సంఖ్య: 23,046 విధుల్లో ఉన్న వీఆర్ఏలు: 21,434 డిగ్రీ, ఆపైన చదువుకున్నవారు: 2,909 ఇంటర్ విద్యార్హతలున్నవారు: 2,343 పదో తరగతి చదివినవారు: 3,756 పదో తరగతిలోపు చదువుకున్నవారు: 7,200 నిరక్షరాస్యులు: 5,226 విద్యార్హతలపై కిరికిరి? ► ఇతర శాఖలకు పంపే మాట అటుంచితే కేబినెట్ ఆమోదించిన విధంగా వీఆర్ఏల క్రమబద్ధీకరణ ప్రక్రియ సజావుగా సాగుతుందా లేదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. వీరిని క్రమబద్ధీకరించే విషయంలో రెవెన్యూ ఉన్నతాధికారులు పెట్టిన నిబంధనలు చాలామందిని పేస్కేల్ నుంచి దూరం చేస్తాయనే వాదన వినిపిస్తోంది. రెవెన్యూ శాఖ సేకరించిన వివరాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న వీఆర్ఏలలో కేవలం 9,008 మందికి మాత్రమే 10వ తరగతి, అంతకన్నా ఎక్కువ విద్యార్హతలున్నాయి. మిగిలిన 12,426 మంది వీఆర్ఏలు పదో తరగతి కన్నా తక్కువ చదువుకోగా, వీరిలో 5వేల మందికి పైగా నిరక్షరాస్యులు ఉన్నారు. ఒకవేళ విద్యార్హతలే క్రమబద్ధీకరణకు ప్రామాణికమైతే తగిన విద్యార్హతలు లేని వీఆర్ఏల కుటుంబాల్లో అర్హతలు ఉన్న వారికి ఉద్యోగాలివ్వాలని వీఆర్ఏల జేఏసీ, తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) డిమాండ్ చేస్తున్నాయి. కానీ రెవెన్యూ వర్గాలు మాత్రం.. 10వ తరగతి కంటే తక్కువ విద్యార్హతలు ఉన్న మెజారిటీ వీఆర్ఏల విషయంలో ఏం నిర్ణయం తీసుకునేదీ స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం. -
రాష్ట్రంలో వర్షాలు అనంతరం పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష
-
రైతులెవరో తెలియదా రామోజీ?.. ఇంకెన్నాళ్లు ఈ మొద్దునిద్ర?
సాక్షి, అమరావతి: నిన్న వర్షం కురిస్తే.. ఈ రోజుకల్లా నష్ట పరిహారం ఇవ్వాలంటూ గగ్గోలు పెడుతోంది ఈనాడు! పంట నష్టం అంచనాలతో పనిలేకుండా క్షణాల్లో పరిహారం ఇవ్వాలంటూ తప్పుడు కథనాలు ప్రచురించటాన్ని... అసలు వర్షం కురవడమే ఈ ప్రభుత్వ వైఫల్యం అన్నట్లుగా బురద జల్లటాన్ని ఏమనుకోవాలి? వర్షాలు, వరదలు, తుపాన్లు.. విపత్తు ఏదైనా ఆగమేఘాలపై స్పందిస్తూ నష్ట పోయిన ప్రతి ఎకరాకు, దెబ్బతిన్న ప్రతీ రైతన్నకూ సీజన్ ముగియకుండానే పరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) అందిస్తూ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తోంది వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం. పైసా కూడా బకాయి పెట్టకుండా అర్హులెవరైనా మిగిలిపోతే వెతికి మరీ లబ్ధి చేకూరుస్తోంది. లెక్క తెలియదా రామోజీ?.. 37,371 మందికి రూ.34.25 కోట్లు.. పంట నష్ట పరిహారాన్ని (ఇన్పుట్ సబ్సిడీ) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి నిర్ణయాన్ని బట్టి పంటల వారీగా నిర్ణయిస్తారు. ఏదైనా వైపరీత్యం సంభవిస్తే తొలుత పంటల వారీగా ప్రాథమిక అంచనా వేస్తారు. తర్వాత క్షేత్ర స్థాయి పరిశీలన అనంతరం నిబంధనల మేరకు 33 శాతానికి పైగా మునిగిపోయి దెబ్బతిన్న పంటలను పరిగణనలోకి తీసుకొని తుది అంచనాలను రూపొందిస్తారు. అదే కరువు కాటకాల వేళ.. వర్షపాతం, డ్రై స్పెల్స్, భూగర్భ జలాలు, రిజర్వాయర్ల నీటి నిల్వల సూచిక, పంట దిగుబడి, పంట నష్టం లాంటి ప్రామాణికాల ఆధారంగా కరువు మండలాలను ప్రకటించి తదనుగుణంగా పరిహారాన్ని లెక్కిస్తారు. ఇప్పుడు రబీ పంటలు చేతికొచ్చే వేళ అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఇది ఎవరూ ఆపలేని వాస్తవం! గత నెలలో వర్షాల వల్ల నష్టపోయిన 37,371 మంది రైతులకు మే నెలలో రూ.34.25 కోట్లు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో పంట నష్టాన్ని అంచనా వేసేందుకు బృందాలు రంగంలోకి దిగాయి. బాబు ఎగ్గొట్టిన బకాయిలు రూ.5,942 కోట్లు చంద్రబాబు హయాంలో కరువొచ్చినా.. వరదలొచ్చినా.. అకాల వర్షాలతో రైతులు పంట నష్టపోతే రెండేళ్ల తర్వాత కానీ పరిహారానికి దిక్కులేని దుస్థితి. 2014–15లో కర్నూలు జిల్లాలో అక్టోబర్, డిసెంబర్లో వర్షాలు కురిస్తే 2016 జూలైలో అంటే దాదాపు రెండేళ్ల తర్వాతగానీ కరుణించలేదు. అది కూడా అరకొరగానే పంట నష్టపరిహారం అందించారు. 2014లోనే కర్నూలు జిల్లాలో కరువు వస్తే 2017లో కరువు భృతినిచ్చారు. 2015 ఏప్రిల్‌లో అకాల వర్షాలు పడితే ఏడాది తర్వాత అంటే 2016 ఆగస్టులో పరిహారాన్నిచ్చారు. 2015లో కరువు వస్తే నవంబర్ 2016లో భృతినందించారు. అనంతపురం జిల్లాలో 2018 ఖరీఫ్‌లో భారీగా పంట నష్టం జరిగితే పూర్తిగా ఎగ్గొట్టారు. ఐదేళ్లలో 24.80 లక్షల మందికి రూ.2,558.07 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని ఎగ్గొట్టిన ఘన చరిత్ర చంద్రబాబుది. ఒక్క ఇన్పుట్ సబ్సిడీనే కాకుండా బాబు ఐదేళ్ల పాలనలో సబ్సిడీ విత్తనాలకు సంబంధించి రూ.282.71 కోట్లు, సున్నా వడ్డీ పంట రుణ రాయితీ రూ.1,180.66 కోట్లు, పంటల బీమా పరిహారం రూ.715.84 కోట్లు, ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలకు ఎక్స్‌గ్రేíÙయా రూ.23.70 కోట్లు, యాంత్రీకరణ కోసం రూ.221.07 కోట్లు, ధాన్యం కొనుగోలు బకాయిలు రూ.960 కోట్లు కలిపి ఏకంగా రూ.5,942.05 కోట్లు ఎగ్గొడితే ఈనాడు సింగిల్ కాలం వార్త రాసిన పాపాన పోలేదు. ఈ బకాయిల్లో ఇప్పటికే 46.17 లక్షల మంది రైతులకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ.2,890.85 కోట్లు చెల్లించింది. వీటితో పాటు చంద్రబాబు ఎగ్గొట్టిన వ్యవసాయ విద్యుత్ బకాయిలు రూ.8,845 కోట్లు కూడా ఈ ప్రభుత్వం వచ్చాకే చెల్లించింది. టమాటా క్వింటాల్ రూ.530 పైమాటే టమాటాలకు ధర లేక రైతులు గగ్గోలు పెడుతున్నారంటూ ఈనాడు కుళ్లు రాతలు రాస్తోంది. రాష్ట్రంలో ప్రధాన మార్కెట్లైన కలికిరి, వాలీ్మకిపురం, ములకలచెరువు, మదనపల్లి, పలమనేరు, వి.కోట, పుంగనూరు మార్కెట్లలో తాజాగా టమాటా కనిష్ట ధర క్వింటా రూ.530 – రూ.540 ఉండగా గరిష్టంగా రూ.670 – రూ.700 పలుకుతోంది. ఉల్లిపాయలు కూడా కనిష్టంగా క్వింటాల్ రూ.540 ఉండగా గరిష్టంగా రూ.780 పలుకుతోంది. గత నెల రోజులుగా ఏ మార్కెట్లోనూ ఫైన్ క్వాలిటీ టమాటాను కిలో రూ.2 చొప్పున అమ్ముకున్న దాఖలాలు లేవు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక ధరలు పతనమైన ప్రతీసారి మార్కెట్లో జోక్యం చేసుకుంటూ రూ.1.28 కోట్ల విలువైన 1,425 టన్నుల టమాటాను సేకరించింది. మొక్కజొన్న గత మూడేళ్లుగా ఎమ్మెస్పీకి మించి ధర పలుకుతోంది. క్వింటా ఎమ్మెస్పీ రూ.1,962 కాగా ప్రస్తుతం మార్కెట్లో ఫైన్ క్వాలిటీ మొక్కజొన్న గరిష్టంగా రూ.2,500 పలుకుతోంది. మార్కెటింగ్ శాఖ నిత్యం సీఎం యాప్ ద్వారా ధరలను పర్యవేక్షిస్తోంది. ఈ ఏడాది 16.63లక్షల టన్నుల దిగుబడులు అంచనా వేయగా ఇప్పటికే 60 శాతానికి పైగా మార్కెట్లోకి వచి్చంది. టీడీపీ హయాంలో రూ.427.10 కోట్ల విలువైన 3.19 లక్షల టన్నుల మొక్కజొన్న మాత్రమే సేకరించగా, గత నాలుగేళ్లలో ఏకంగా రూ.2,020.52 కోట్ల విలువైన 9.13 లక్షల టన్నులు సేకరించడం గమనార్హం. ఇప్పటికే ఎమ్మెస్పీ కంటే తక్కువగా ఉన్న శనగలు కొనుగోలు చేస్తుండగా పసుపు కొనుగోలుకు కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. జగన్ పాలనలో ఏ సీజన్ లో పరిహారం.. ఆ సీజన్లోనే.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి పరిహారాన్ని అదే సీజన్ ముగిసేలోగా అంటే రెండు నెలల వ్యవధిలోనే అందిస్తున్నారు. 2019లో వరదలొస్తే ఏప్రిల్ 2020లో రైతులకు పరిహారం అందించారు. 2020 ఏప్రిల్–సెపె్టంబర్ మధ్య కురిసిన అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు అదే ఏడాది అక్టోబర్‌లో పరిహారాన్ని జమ చేశారు. అక్టోబర్ 2020లో కురిసిన వర్షాలకు సంబంధించి నవంబర్‌లో చెల్లించారు. 2020 నవంబర్‌లో నివర్ తుపాన్ వల్ల దెబ్బతిన్న రైతులకు డిసెంబర్లో పరిహారం అందించారు. తిత్లీ తుపాన్ సమయంలో సంభవించిన నష్టపరిహారాన్ని చంద్రబాబు ఎగ్గొడితే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వచ్చాక ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడి ప్రభుత్వ పరంగా రూ.182 కోట్లు రైతులకు పంపిణీ చేశారు. 2022 డిసెంబర్లో మాండూస్ తుపాన్ బాధిత రైతులకు 2023 ఫిబ్రవరిలో పరిహారం అందించారు. టీడీపీ సర్కారు ఎగ్గొట్టిన బకాయిలతో కలిపి ఈ నాలుగేళ్లలో వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న 30.86 లక్షల ఎకరాలకు సంబంధించి 22.22 లక్షల మంది రైతులకు రూ.1,911.81 కోట్లు చెల్లించింది. రైతులపై పైసా భారం పడకుండా వైఎస్సార్ ఉచిత పంటల బీమా కింద రూ.6,684.84 కోట్ల పరిహారం అందించిన ఘనత ఈ ప్రభుత్వానిదే. ‘రైతుల నుంచి అంకూర్ సోనం రకం 400 బస్తాల ధాన్యాన్ని రెండు నెలల క్రితం కొన్నా. రైసు మిల్లు ఆవరణలో ఆరబెట్టుకుంటే ఫొటోలు తీసి రైతులవి అంటూ ఈనాడు పత్రికలో వేయటాన్ని చూసి ఆశ్చర్యపోయాం. వర్షాలకు పైపొర మాత్రమే తడిసింది. బస్తాల్లోకి ఎక్కించి సురక్షిత ప్రాంతాలకు పంపించాం. డ్రయ్యర్లో వేస్తాం. మాకు ఇబ్బందేమీ లేదు. ఉందని ఎవరితోనూ చెప్పలేదు కూడా!’ – బొడ్డు మహేష్‌రెడ్డి, ధాన్యం వ్యాపారి ‘100 బస్తాలు కొని రైసు మిల్లు ఆవరణలోని డ్రెయింగ్ ప్లాట్‌ఫారమ్ వద్ద కూలీల సాయంతో ఆరబెట్టాం. ఆరబెట్టేందుకు బస్తాకు రూ.15 చొప్పున అద్దె చెల్లించాం. 10 శాతమే తడిసింది. డ్రయ్యర్లో వేస్తాం. ఇందుకోసం బస్తాకి రూ.100 ఖర్చవుతుంది. మేం నష్టపోయే పరిస్థితులైతే లేవు’ – మైలవరపు సాంబయ్య, ధాన్యం వ్యాపారి. ఇది కూడా చదవండి: సీఎం జగన్‌తో యూఏఈ రాయబారి సమావేశం.. -
ఉమ్మడి వరంగల్ జిల్లాలో వడగళ్లవాన భీభత్సం
-
అకాల వర్షంతో అన్నదాత ఆక్రందన
-
తెలంగాణలో అకాల వర్షాలతో పంట నష్టం
-
రైతులకు సాయంపై తక్షణ చర్యలు
సాక్షి, హైదరాబాద్: అకాల వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయాన్ని అందించేందుకు తక్షణమే చర్యలు చేపట్టాల్సిందిగా సీఎస్ శాంతికుమారిని, సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. పంట నష్టం, పోడు భూములు, గొర్రెల పంపకం, పేదలకు ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం తదితర అంశాలపై మంగళవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. సీఎస్‌తో పాటు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, రెవెన్యూ కార్యదర్శి నవీన్ మిత్తల్, వ్యవసాయ కార్యదర్శి రఘునందన్ రావు, విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, సీఎం కార్యదర్శులు రాజశేఖర్ రెడ్డి, భూపాల్ రెడ్డి పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. వడగండ్ల వానలతో రైతులకు పంట నష్టం జరిగిన నేపథ్యంలో, ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగు జిల్లాల్లో పర్యటించి రైతులను పరామర్శించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నష్ట పోయిన పంటలకు ఎకరాకు రూ.10 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తామని సీఎం ప్రకటించారు. ఈ నేపథ్యంలో మంగళవారం సమీక్ష నిర్వహించిన కేసీఆర్.. జిల్లా కలెక్టర్లు తమ పరిధిలో, క్లస్టర్ల వారీగా స్థానిక వ్యవసాయ అధికారులతో (ఏఈవో) సర్వే చేయించి పంట నష్టంపై పూర్తి వివరాలు సేకరించి ప్రభుత్వానికి అందజేయాలని ఆదేశించారు. కలెక్టర్ల నేతృత్వంలోనే గొర్రెల కొనుగోలు.. రాష్ట్రంలో రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోనే గొర్రెల కొనుగోలు జరుగుతుందని స్పష్టం చేశారు.ఖాళీ జాగాలు ఉన్న అర్హులైన పేదలకు ఇంటి నిర్మాణం కోసం ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన రూ.3 లక్షల ఆర్థిక సాయాన్ని అందించే దిశగా చర్యలు చేపట్టాలని సీఎస్‌ను ఆదేశించారు. ఇందుకు సంబంధించి విధి విధానాలు జారీ చేయాలని సూచించారు. త్వరలో పోడు పట్టాల పంపిణీ రాష్ట్రంలో అర్హులైన వారికి పోడు పట్టాల పంపిణీకి అధికార యంత్రాంగం సంసిద్ధతపై సీఎం సమీక్షించారు. 4 లక్షల ఎకరాలకు సంబంధించి, 1.55 లక్షల మంది అర్హులకు పట్టాలు అందించేందుకు పాస్ బుక్కులు ముద్రించి సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు. దీంతో అర్హులకు పోడు భూముల పట్టాల పంపిణీ తేదీని త్వరలో ప్రకటిస్తామని కేసీఆర్ చెప్పారు. శ్రీ సీతారాముల కల్యాణానికి కోటి రూపాయలు మంజూరు శ్రీరామ నవమి సందర్భంగా ఈ నెల 30న భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాల నిర్వహణకు, ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి కోటి రూపాయలను కేసీఆర్ మంజూరు చేశారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా దేవస్థానం ఆదాయం కోల్పోయిన నేపథ్యంలో.. దేవాదాయ శాఖ అభ్యర్థన మేరకు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు. -
పంటనష్టంపై విస్తృత సర్వే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవల అకాల వర్షా లు, వడగళ్లు, ఈదురుగాలుల కారణంగా జరిగిన పంటనష్టంపై సర్వే చేపట్టాలని ప్రభుత్వం వ్యవసాయశాఖను ఆదేశించింది. ఈ మేరకు గురువారం విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఒక్కసారికి సాయం అందించేందుకు గ్రామాలవారీగా, సాగుదారులవారీగా పంటనష్టంపై సవివరమైన సర్వే చేపట్టాలని వ్యవసాయ శాఖకు సూచించారు. నష్టాన్ని చవిచూసిన రైతులకు, కౌలు రైతులకు ఎకరాకు రూ.10 వేల ఆర్థికసాయం అందించాలని నిర్ణయించామని తెలిపారు. రాష్ట్రంలో ఈ నెల 17 నుంచి 21వ తేదీల మధ్య ఉరుములు, వడగళ్లతో కూడిన భారీ వర్షాలు కురియడంతో అన్నిరకాల పంటలకు నష్టం కలిగిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సహా అధికారుల బృందం పంటలకు నష్టం జరిగిన వివిధ ప్రాంతాలను సందర్శించి పరిస్థితిని అధ్యయనం చేసిందన్నారు. పంట చేతికొచ్చేదశలో ఉందని, ఈ ప్రకృతి వైపరీత్యం వల్ల వందశాతం నష్టం వాటిల్లిందని, దీంతో రైతు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. కాగా, పంటనష్టాన్ని గ్రామాల్లో అంచనా వేయాలని, లబ్ది దారులను గుర్తించాలని వ్యవసాయ శాఖ వ్యవసాయ విస్తరణాధికారు(ఏఈవో)లను ప్రభుత్వం ఆదేశించింది. 2.28 లక్షల ఎకరాల్లో పంటనష్టం రాష్ట్రవ్యాప్తంగా 2.28 లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. అయితే వాస్తవంగా ఇది ఐదు లక్షల వరకు ఉంటుందని రైతు సంఘాలు, కిందిస్థాయి నుంచి సమాచారం వస్తోంది. కాగా, ప్రభుత్వం వేసిన నష్టం అంచనా ప్రకారం మొక్కజొన్న 1,29,446 ఎకరాలు, వరి 72,709 ఎకరాలు, మామిడి 8,865 ఎకరాలు, ఇతర పంటలు అన్ని కలిసి 17,238 ఎకరాల్లో నష్టం జరిగిందని ప్రభుత్వం గుర్తించింది. తాజాగా చేయబోయే సర్వేలో ఇంకేమైనా అదనంగా నష్టం వెలుగుచూడవచ్చని అధికారులు భావిస్తున్నారు. నష్టపరిహారంగా దీన్ని పేర్కొనకూడదని, సహాయ, పునరావాస చర్యలు అని పిలవాలని ముఖ్యమంత్రి పేర్కొన్న సంగతి తెలిసిందే. రైతులు మళ్లీ పుంజుకుని, వ్యవసాయం చేసేందుకు వీలుగా సహాయసహకారాలు అందించాలని ఆయన తెలిపిన సంగతి తెలిసిందే. సీఎం ప్రకటించిన రూ.10 వేల సాయాన్ని వారం, పది రోజుల్లో రైతులకు అందజేస్తామని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి.పంటకు పెట్టుబడి పెట్టింది కౌలు రైతులే కాబట్టి వాళ్లకు న్యాయం జరిగేలా చూస్తామని ప్రభుత్వం తెలిపింది. -
పంట నష్టం జిల్లాలకు నేడు సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవల కురిసిన వడగళ్ల వర్షానికి పంట నష్టం అధికంగా వాటిల్లిన 4 జిల్లాల్లో సీఎం కేసీఆర్ గురువారం పర్యటించి, రైతులతో మాట్లాడి భరోసా కల్పించనున్నారు. అకాల వర్షాలకు ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో వరి, మిర్చి, మామిడి, కూరగాయల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రైతులు భారీగా నష్టపోయారు. ఆయా జిల్లాల్లో మంత్రులు, అధికారులు ఇప్పటికే విస్తృతంగా పర్యటించారు. వారి నివేదికల ఆధారంగా సీఎం కేసీఆర్ గురువారం ఆ నాలుగు జిల్లాల్లో పర్యటించనున్నారు. సీఎం పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి.. ముఖ్యమంత్రి ఉదయం 10:15కు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలోని రామపురానికి వెళతారు. అక్కడ పంట నష్టం వివరాలు పరిశీలించి, రైతులతో సమావేశమవుతారు. – రామపురం నుంచి మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం రెడ్డికుంట తండా చేరుకుని అక్కడ పరిస్థితిని పరిశీలిస్తారు. రైతులకు భరోసా కల్పిస్తారు. తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు ఇస్తారు. – రెడ్డికుంట నుంచి వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం అడవి రంగాపురానికి, అక్కడి నుంచి కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపురం వెళ్లి పంటల నష్టం వివరాలు తెలుకుంటారు. రైతులతో మాట్లాడతారు. ఈ పర్యటనలో మంత్రులు, శాసనసభ్యులు, అధికార యంత్రాంగం పాల్గొంటారు. -
వడగళ్ల దెబ్బ! వేల ఎకరాల్లో పంట నష్టం.. ఆరు జిల్లాల్లో ప్రభావం..
సాక్షి, హైదరాబాద్: వడగళ్ల వానలు రాష్ట్రవ్యాప్తంగా వేల ఎకరాల్లో పంట నష్టం కలిగించాయి. వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో టమాటా, బీరకాయ, మొక్కజొన్న, పచ్చిమిర్చి, బొబ్బర్లు, మినుములు తదితర పంటలకు నష్టం వాటిల్లింది. కొన్నిచోట్ల పొట్టదశకు వచ్చిన వరి నేలవాలింది. మామిడి పిందెలు, కాయలు రాలి తీవ్ర నష్టం వచ్చిందని రైతులు వాపోతున్నారు. ఆరు జిల్లాల్లో ప్రభావం.. అకాల వర్షాలతో ప్రధానంగా ఆరు జిల్లాల్లో పంటలపై ప్రభావం పడింది. సుమా రు 50 మండలాల్లోని 650 గ్రామాల్లో నష్టం జరిగిందని.. ముఖ్యంగా వికారాబాద్ జిల్లాలో నష్టం తీవ్రంగా ఉందని అధికారులు చెప్తున్నారు. వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట్, మర్పల్లి మండలాల్లో అయితే పంట పొలాలన్నీ వడగళ్లతో నిండిపోయి మంచు ప్రాంతంలా మారిపోయాయి. ఆ పంటలు చేతికందే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. దీనితోపాటు సంగారెడ్డి, కొత్తగూడెం, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోనూ పలుచోట్ల వడగళ్లతో పంటలు దెబ్బతిన్నాయి. నేడు మంత్రి పర్యటన వికారాబాద్ జిల్లా మర్పల్లి, మోమిన్‌పేట మండలాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని.. శుక్రవారం రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలసి నష్టాన్ని పరిశీలిస్తానని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మామిడి, గులాబీ, ఉల్లి, బొప్పాయితోపాటు మొక్కజొన్న వంటి వ్యవసాయ పంటలు దెబ్బతిన్నట్టు తెలుస్తుందన్నారు. -
మేలు.. చూడండి
మనది వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని గట్టిగా నమ్మిన ప్రభుత్వం మనది. విత్తనం నుంచి విక్రయం వరకు రైతులకు అన్ని రకాలుగా అండగా నిలిచి చేయిపట్టి నడిపిస్తున్నాం. ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వనివి కూడా ఎన్నో అమలు చేయడం ద్వారా వారికెంతో మేలు చేస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో ఎంత మేలు జరిగింది? ఇప్పుడు గత మూడున్నరేళ్లలో ఎంత మేలు జరిగిందో ఒక్కసారి తేడా గమనించమని కోరుతున్నా. మంచి చేసే ప్రభుత్వానికి అండగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నా. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: మూడున్నరేళ్లుగా ప్రతి అడుగులోనూ రైతులకు తోడుగా నిలిచి మేలు చేస్తున్నామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. క్రమం తప్పకుండా సున్నా వడ్డీ పంట రుణాలివ్వడంతో పాటు ఏ సీజన్లో పంట నష్టం జరిగితే అదే సీజన్ ముగియకముందే ఇన్పుట్ సబ్సిడీని చెల్లిస్తూ కొత్త ఒరవడి తెచ్చామన్నారు. రైతులపై పైసా కూడా భారం పడకుండా పంటల బీమా పథకాన్ని అమలు చేయడంతోపాటు నష్టపోతే బీమా పరిహారాన్ని మరుసటి ఏడాది ఆ సీజన్ రాకముందే అందిస్తూ ఆదుకుంటున్నామన్నారు. రబీ 2020–21, ఖరీఫ్–2021 సీజన్లకు సంబంధించి సున్నా వడ్డీ రాయితీ, ఖరీఫ్–2022లో వరదలు, అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు ఇన్పుట్ సబ్సిడీ సొమ్ముతో కలిపి మొత్తం రూ.200 కోట్లను క్యాంపు కార్యాలయం నుంచి సీఎం సోమవారం బటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న రైతులనుద్దేశించి మాట్లాడారు. ఆ వివరాలివీ.. కంప్యూటర్లో బటన్ నొక్కి రైతుల ఖాతాల్లోకి నిధులను జమ చేస్తున్న సీఎం వైఎస్ జగన్ రైతన్నకు ఎంత చేసినా తక్కువే రైతులకు ఎంత చేసినా తక్కువే. వారంతా సంతోషంగా ఉండాలని అడుగులు వేస్తున్నాం. ఈ ఏడాది జూలై – అక్టోబర్ మధ్య వరదలు, అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్న 45,998 మంది రైతులకు ఇవాళ రూ.39.39 కోట్లను వారి ఖాతాల్లో జమ చేస్తున్నాం. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన 21.31 లక్షల మంది రైతులకు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇవాళ ఇస్తున్న సొమ్ముతో కలిపి ఇప్పటివరకూ రూ.1,834.78 కోట్లను ఇన్పుట్ సబ్సిడీగా అందించాం. రూ.లక్ష లోపు పంట రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించే సన్న, చిన్నకారు రైతులు, వాస్తవ సాగుదారులకు వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద వడ్డీ రాయితీని చెల్లిస్తూ అండగా నిలుస్తున్నాం. వరుసగా మూడో ఏడాది ఈ పథకం కింద రబీ 2020–21, ఖరీఫ్ –2021 సీజన్లలో అర్హత పొందిన 8,22,411 మంది రైతులకు ఈరోజు రూ.160.55 కోట్ల వడ్డీ రాయితీ సొమ్ము జమ చేస్తున్నాం. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన బకాయిలతో కలిపి ఈరోజు ఇస్తున్న మొత్తంతో 73.88 లక్షల మంది రైతులకు రూ.1,834.55 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశాం. బాబొచ్చారు.. బంగారం పోయింది! రైతన్నలకు అందించే సాయంలో గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో కొన్ని ఉదాహరణలు మీ ముందుకు తెస్తున్నా. గతంలో వైఎస్సార్ రైతు భరోసా లాంటి పథకం లేదు. రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలను బేషరతుగా రుణమాఫీ చేస్తామని, బ్యాంకుల్లో ఉన్న బంగారమంతా ఇంటికి తిరిగి రావాలంటే ‘బాబు’ సీఎం కావాలంటూ ప్రచారం చేసి చివరకు నిలువునా మోసగించారు. అప్పులపై వడ్డీలు, వడ్డీల మీద చక్రవడ్డీలు కలిపి రైతులకు తడిసి మోపెడయ్యాయి. నాడు నోటీసులు ఇచ్చి బ్యాంకుల్లో కుదువబెట్టిన బంగారాన్ని వేలం వేయడం పేపర్లలో చూశాం. ఐదేళ్లలో ఆ పెద్దమనిషి రుణమాఫీ పేరిట చెల్లించింది రూ.15 వేల కోట్లు మాత్రమే. అది కూడా రైతులకు సున్నా వడ్డీ పథకాన్ని ఎగ్గొట్టి. అప్పటివరకు అందుబాటులో ఉన్న సున్నా వడ్డీ పథకాన్ని ఎత్తివేశారు. ఇప్పుడు ఒక్క వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారానే మూడున్నరేళ్లలో మన ప్రభుత్వం రూ.25,971 కోట్లను రైతన్నలకు అందించింది. నాడు ఐదేళ్లూ కరువు కాటకాలే.. గతంలో పంటల బీమా కోసం తమ వాటా ప్రీమియాన్ని రైతులే చెల్లించారు. ఆ ఐదేళ్లలో వరుసగా కరువు కాటకాలే. ప్రతి సీజన్లోనూ కరువు మండలాలను ప్రకటించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్సూరెన్స్ సొమ్ము పెరగాలి. కానీ అలా జరగలేదు. ఆ ఐదేళ్లలో బీమా కింద చెల్లించింది కేవలం రూ.3,411 కోట్లు మాత్రమే. మన ప్రభుత్వం వచ్చాక రైతులపై భారం పడకుండా ఉచిత పంటల బీమా అమలు చేశాం. ఈ–క్రాప్ ద్వారా పంటలు వేసే ప్రతి రైతుకూ పంటల బీమా వర్తింపచేశాం. రైతుల ప్రీమియాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించింది. ఇప్పటివరకు రూ.6,685 కోట్ల మేర పంటల బీమా పరిహారాన్ని రైతులకు చెల్లించాం. గతంలో కొంతమందికే ఇన్సూరెన్స్ రాగా ఇప్పుడు ప్రతి రైతుకూ వర్తిస్తోంది. కరువు సాయంలో తేడా చూస్తే.. కరువు సాయం అందించడంలో గత ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి తేడా గమనించండి. మన పాలనలో ఒక్కటైనా కరువు మండలాన్ని ప్రకటించాల్సిన అవసరం రాలేదు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో సగటున ఏటా సగం కరువు మండలాలే. సాయం మాత్రం అంతంత మాత్రమే. 2015 నవంబర్, డిసెంబర్లో కురిసిన భారీ వర్షాలకు రూ.260 కోట్లు, 2018లో కరువు వల్ల ఖరీఫ్‌లో రూ.1,832 కోట్లు, రబీలో రూ.356 కోట్ల మేర పంట నష్టం వాటిల్లితే అందించిన సాయం సున్నా. అదే మన ప్రభుత్వ హయాంలో చూస్తే సీజన్ ముగియకుండానే పరిహారం అందిస్తున్నాం. 2020 జూన్ నుంచి అక్టోబర్ వరకు కురిసిన భారీ వర్షాలు, వరదలకు నష్టపోయిన 3.80 లక్షల మంది రైతులకు రూ.285 కోట్ల పంట నష్ట పరిహారాన్ని అదే ఏడాది అక్టోబర్‌లో అందజేశాం. 2020 నవంబర్‌లో నివర్ తుపాను వల్ల నష్టపోయిన 8.35 లక్షల మంది రైతులకు రూ.645.99 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని నెల తిరగకుండానే డిసెంబర్లో జమ చేశాం. 2021 సెప్టెంబర్‌లో గులాబ్ తుపాను, నవంబర్‌లో కురిసిన అధిక వర్షాల వల్ల నష్టపోయిన 6.31 లక్షల మంది రైతులకు రూ.564 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని అదే ఏడాది నవంబర్‌లో అందజేశాం. ఇలా ఇప్పటి వరకు సీజన్ ముగియకుండానే రూ.1,835 కోట్లకుపైగా ఇన్పుట్ సబ్సిడీని రైతులకు అందించాం సున్నా వడ్డీలో ఎంత తేడా అంటే.. సున్నా వడ్డీ విషయంలో గత ప్రభుత్వం బకాయి పెట్టిన రూ.1,180 కోట్ల వడ్డీ రాయితీ సొమ్మును పూర్తిగా చెల్లించడమే కాకుండా 73.88 లక్షల మంది రైతులకు మూడున్నరేళ్లలో మొత్తం రూ.1,834.55 కోట్లు అందజేశాం. గత ప్రభుత్వం ఏనాడూ రైతులకు పగటిపూట 9 గంటలు నాణ్యమైన విద్యుత్ ఇవ్వలేకపోయింది. మన ప్రభుత్వం 9 గంటల పాటు క్వాలిటీ విద్యుత్‌ను పగటిపూట అందిస్తోంది. సరఫరా వ్యవస్థను మెరుగుపర్చేందుకు రూ.1,700 కోట్లు ఖర్చుచేశాం. గతంలో రైతులకివ్వాల్సిన రూ.9 వేల కోట్లు విద్యుత్ బకాయిలు ఎగ్గొట్టింది కూడా చంద్రబాబే. గత ప్రభుత్వం ధాన్యం సేకరణకు సంవత్సరానికి రూ.7–8 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేస్తే మన ప్రభుత్వం రూ.13 వేల కోట్లు వెచ్చిస్తోంది. గత సర్కారు ఐదేళ్లలో ధాన్యం సేకరణ కోసం చేసిన ఖర్చును మనం మూడేళ్లలోనే అధిగమించి ధాన్యం సేకరణ చేస్తున్నాం. 2014 నుంచి 2019 మధ్య ఆహార ధాన్యాల ఉత్పత్తి సగటున 154 లక్షల టన్నులు కాగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి మూడేళ్లలోనే సగటున 167 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. ఏడాదికి 13 లక్షల టన్నులు దిగుబడిలో పెరుగుదల కనిపిస్తోంది. ఈరోజు అమూల్ రాకతో ప్రైవేట్ డెయిరీలు, కంపెనీల పాల సేకరణ ధరలు ఏ రకంగా పెరిగాయో రాష్ట్రమంతా కనిపిస్తోంది. కార్యక్రమంలో మంత్రి కాకాణి తదితరులు పాల్గొన్నారు. విత్తనం నుంచి విక్రయం వరకూ అండగా.. ఆర్బీకేలు రైతన్నలకు నాణ్యమైన, సర్టిఫైడ్ ఎరువులు, విత్తనాలు, పురుగు మందులను అందిస్తున్నాయి. అన్నదాతలకు సలహాలు ఇస్తున్నాయి. పారదర్శకంగా ఈ–క్రాప్ నమోదు చేస్తున్నాయి. ప్రతి పథకాన్ని పారదర్శకంగా అర్హులైన ప్రతి రైతుకు అందించడంతో పాటు పంటల కొనుగోలు సమయంలో ఇబ్బంది కలగకుండా సహాయకారిగా వ్యవహరిస్తున్నాయి. ఇలాంటి గొప్ప వ్యవస్థ మన కళ్లముందే కనిపిస్తోంది. ఇలాంటి విధానం గతంలో లేదు. కనీసం ఆ ఆలోచన కూడా చేయలేదు. గత ప్రభుత్వ హయాంలో ఇన్పుట్ సబ్సిడీని పూర్తిగా ఎగ్గొట్టారు. 2–3 సీజన్ల తర్వాత అరకొరగా అందించిన పరిస్థితులు చూశాం. ఇప్పుడు ఈ–క్రాప్ ఆధారంగా వాస్తవ సాగుదారులందరికీ ఏ సీజన్లో పంట నష్టం జరిగితే అదే సీజన్ ముగిసేలోగా నేరుగా వారి ఖాతాల్లోనే పరిహారాన్ని జమ చేస్తున్నాం. పారదర్శకతకు అత్యంత పెద్దపీట వేస్తున్నాం. రైతు భరోసా కేంద్రాలలో అర్హుల జాబితాను ప్రదర్శిస్తున్నాం. ఒకవేళ ఎవరైనా అర్హత ఉండి కూడా పొరపాటున జాబితాలో పేరు లేకుంటే మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నాం. వాటిని మళ్లీ వెరిఫై చేసి ఏటా జూలై, డిసెంబరులో మిస్ అయిన వారికి మేలు చేస్తున్నాం. రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది బీసీ కులానికి చెందిన ఒంటరి మహిళనైన నాకు మూడెకరాల పొలం ఉంది. రూ.87 వేల రుణం తీసుకొని సకాలంలో చెల్లించా. సున్నా వడ్డీ కింద రూ.1,791 వచ్చాయి. కంది సాగు చేసి నష్టపోతే ఇన్పుట్ సబ్సిడీ కింద రూ.42 వేలు అందాయి. ఖరీఫ్ పంటను ఈ–క్రాప్‌లో నమోదు చేసుకున్నా. ఆర్బీకేలో రసీదు ఇచ్చారు. గతంలో విత్తనాల కోసం క్యూ లైన్లలో నిలబడి అవస్థలు పడ్డాం. ఇప్పుడన్నీ ఆర్బీకేల ద్వారా అందుతున్నాయి. ఇల్లాలు బాగుంటే ఇల్లు బాగుంటుంది. రాజు బాగుంటే రాజ్యం బాగుంటుందని రుజువు చేశారు. పదికాలాల పాటు మీరే సీఎంగా ఉండాలి. – జయమ్మ,రైతు, ఎర్రవంకపల్లి, శ్రీసత్యసాయి జిల్లా ఇంట్లో అందరికీ అన్నీ.. గోదావరి వరదల సమయంలో మీరు నాటు పడవలో మా లంక గ్రామానికి వచ్చి ప్రతి ఒక్కరినీ పలుకరించారు. ప్రభుత్వం నుంచి సాయం అందిందా లేదా? అని అడిగారు. అందని వారికి మరుసటి రోజే రూ.2 వేలు ఆర్థ్ధిక సాయం అందేలా చేశారు. గతంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి మా లంక గ్రామాలకు రాలేదు. మాకు వంతెన కూడా మంజూరు చేశారు. మీకు జీవితాంతం రుణపడి ఉంటాం. – నక్కా శ్రీనివాసరావు, రైతు, జి. పెద్దపూడి లంక, బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గ్రామంలో వంతెన నిర్మాణ పనుల పురోగతిపై కలెక్టర్ నుంచి సీఎం వివరాలు తెలుసుకున్నారు. అనుమతులు రాగానే వెంటనే పనులు ప్రారంభించాలని ఆదేశించారు. ఈ ప్రభుత్వంలో రూ.5 లక్షల సాయం నాకు రెండెకరాల భూమి ఉంది. రూ.93 వేల రుణం తీసుకుని సకాలంలో చెల్లించా. రూ.3,700 వడ్డీ రాయితీ వచ్చింది. ఆర్బీకేల ద్వారా ఈ–క్రాప్ నమోదు బాగుంది. విత్తనం నుంచి విక్రయం వరకు అన్నీ అందుతున్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంటలు బాగా పండుతున్నాయి. వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. ఏ సమస్య వచ్చినా సచివాలయంలో పరిష్కరిస్తున్నారు. నాకు రైతు భరోసా, చేయూత, నా పిల్లలకు అమ్మ ఒడి సాయం అందింది. నేను ఈ ప్రభుత్వంలో రూ.5 లక్షలు అందుకున్నా. చాలా సంతోషంగా ఉంది. నాలా చాలా మంది లబ్ధి పొందారు. – వెంకట లక్ష్మి, మహిళా రైతు, ముద్దాడ, శ్రీకాకుళం జిల్లా దేశానికే ఆదర్శంగా గతంలో పెట్టుబడుల కోసం వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి. ఈరోజు ఇన్పుట్ సబ్సిడీ, వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు ఈ–క్రాప్ ఆధారంగా అందిస్తున్నారు. ఈ కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. మూడేళ్లుగా మంచి వర్షాలు కురుస్తున్నాయి. ముందుగానే సాగునీరు విడుదల చేయగలిగాం. ఊహకు అందని కార్యక్రమాలను ఈ ప్రభుత్వం చేస్తోంది. టీడీపీ హయాంలో నిత్యం కరువు కాటకాలతో రాష్ట్రం విలవిలలాడింది. నాడు టీడీపీ ఎమ్మెల్యేలే గ్రూపులుగా విడిపోయి నీళ్ల కోసం ఘర్షణలకు దిగిన పరిస్థితి. టీడీపీ హయాంలో 1,623 కరువు మండలాలు ప్రకటించగా ఇప్పుడు మూడేళ్లుగా ఒక్క కరువు మండలం కూడా లేదు. – కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి -
పంట నష్టంతో రైతు ఆత్మహత్య
నర్సాపూర్(జి): భారీ వర్షాలకు పత్తి పంట పూర్తిగా తుడిచి పెట్టుకుపోవడంతో మనస్తాపం చెందిన ఒక రైతు వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నిర్మల్ జిల్లాలో జరిగిన ఈ సంఘటనపై పోలీసులు, రైతు కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. నర్సాపూర్(జి) మండలం బూరుగుపల్లి(కే) గ్రామానికి చెందిన జాదవ్ భోజారాం (48)కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తనకున్న రెండెకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అప్పులు చేసి ఇద్దరు కుమార్తెల పెళ్లి చేశాడు. వ్యవసాయం కోసం కొంత అప్పు చేశాడు. వానాకాలంలో పత్తి పంట సాగుకు రూ.25 వేలు పెట్టుబడి పెట్టాడు. ఈ క్రమంలో గత నెలలో కురిసిన భారీ వర్షాలకు పంట పూర్తిగా కొట్టుకుపోయింది. రూ.5 లక్షల వరకు చేసిన అప్పు ఎలా తీర్చాలని కొన్ని రోజులుగా మనస్తాపం చెందుతున్నాడు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అర్లి(కే) సమీపంలోని సుద్దవాగు వంతెనపై చెప్పులు, సెల్‌ఫోన్ కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వాగులో గాలించగా ఆదివారం భోజారాం మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుని భార్య జాదవ్ లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు నర్సాపూర్(జి) ఎస్ఐ గీత తెలిపారు. -
ఉడుకుతున్న పప్పులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా పప్పుల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. జూలై రెండో వారం నుంచి పప్పుల ధరల్లో పెరుగుదల ఉంటుందన్న కేంద్రం అంచనాలకు అనుగుణంగానే ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. ఇప్పటికే దక్షిణ భారతంలోని తమిళనాడు, కేరళలో కిలో కందిపప్పు ధర రూ.135–140కి చేరగా, ప్రస్తుత వర్షాలతో జరిగిన పంట నష్టం కారణంగా ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయి. దీనిపై కేంద్రం అప్రమత్తమైంది. వరదలతో పెరిగిన నష్టం.. దేశ వ్యాప్తంగా ఈ ఏడాది పప్పుధాన్యాల సాగు తగ్గినట్లు కేంద్ర నివేదికలు చెబుతున్నాయి. గత ఏడాది ఇదే సమయంలో 1.27 కోట్ల హెక్టార్లలో పప్పుధాన్యాలు సాగు కాగా, ఈ ఏడాది అది 1.18 కోట్ల హెక్టార్లకు తగ్గింది. దేశంలో ఎక్కువగా సాగు చేసే కంది పంట విస్తీర్ణం గత ఏడాది 47 లక్షల హెక్టార్లుంటే అది ఈ ఏడాదికి 41 లక్షల హెక్టార్లకు తగ్గింది. అధికంగా సాగయిన మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్ర పంట నష్టం జరిగింది. ఇలాంటి సమయాల్లో ఎక్కువగా మిల్లర్లు విదేశీ దిగుమతులపై ఆధారపడతారు. ముఖ్యంగా మయన్మార్, దక్షిణాఫ్రికా, సింగపూర్, కెన్యాల నుంచి దిగుమతి చేసుకుంటారు. అయితే అక్కడ సైతం వర్షాభావంతో సాగు తగ్గి దిగుబడులు పడిపోయాయి. ఇదే అవకాశంగా తీసుకొని వ్యాపారులు పప్పుల ధరలను క్రమంగా పెంచుతున్నట్లు కేంద్రం గుర్తించింది. జూలై మొదటి వారంలో కందిపప్పు జాతీయ సగటు ధర కిలో రూ.100 ఉంటే అది ఇప్పుడు రూ.109కి చేరింది. మినప, పెసర, శనగ పప్పులు ధరలు సైతం ఏకంగా రూ.10 మేర పెరిగాయి. కేంద్రం అంచనా వేసిన ధరల కన్నా రూ.10–15 మేర అధికంగా బహిరంగ మార్కెట్లో విక్రయాలు జరుగుతున్నాయి. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ప్రస్తుతం గ్రేడ్–1 రకం కందిపప్పు ధర కిలో రూ.135–140మధ్య ఉంది. ఇక్కడ ధరలు నెల రోజుల వ్యవధిలోనే రూ.20–25 వరకు పెరిగాయి. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ధరలు రూ.100 నుంచి రూ.115 మధ్య ఉన్నాయి. ఢిల్లీలోనూ కిలో కందిపప్పు ధర రూ.120 ఉండగా, మినపపప్పు ధర రూ.125గా ఉంది. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం పండగల సీజన్ మొదలయింది. ఆగస్టు మొదలు అక్టోబర్ వరకు పండగ సీజన్ నేపథ్యంలో వ్యాపారులు కృతిమ కొరత సృష్టిస్తే ఈ ధరల పెరుగుదల మరింతగా ఉండవచ్చని కేంద్రం అంచనా. ఈ నేపథ్యంలో రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. గట్టి నిఘా ఉంచండి.. ధరల కట్టడిలో భాగంగా దేశీయ, విదేశీ మార్కెట్లలో పప్పుల లభ్యత, ధరలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం వ్యాపారుల వద్ద ఉండే నిల్వలపై గట్టి నిఘా ఉంచాలని సూచించింది. పప్పుధాన్యాల స్టాక్ హోల్డర్లు నిల్వలను బహిర్గతం చేసేలా చూడాలని కోరింది. నిల్వల వివరాలను ఆన్లైన్ మానిటరింగ్ పోర్టల్‌లో అప్డేట్ చేసే వివరాలను సమీక్షించాలని తెలిపింది. -
పంటనష్టాన్ని తక్షణమే అంచనా వేయండి
సాక్షి, హైదరాబాద్: తాజా వర్షాల వల్ల జరిగిన పంట నష్టాన్ని తక్షణమే అంచనా వేయాలని, ఎకరాకు రూ.15 వేల చొప్పున రైతులకు పరిహారం చెల్లించాలని టీపీసీసీ చీఫ్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంటల సాగుకు విత్తనాలు, ఎరువులు, ఇన్‌ఫుట్ సబ్సిడీ ఇవ్వాలని, తదుపరి పంటలకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి పంటల బీమా పథకాల అమలుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు ఆయన మంగళవారం బహిరంగలేఖ రాశారు. -
Tomato Price: సెంచరీ కొట్టిన టమాటా
మదనపల్లె (చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లా మదనపల్లె మార్కెట్లో మొదటి రకం టమాటా ధర కిలో రూ.100 పలికింది. గడచిన ఐదేళ్లలో ఇంత అత్యధిక ధర నమోదవడం ఇదే తొలిసారి. వాతావరణంలో ఒక్కసారిగా చోటుచేసుకున్న మార్పులు, వరుసగా కురుస్తున్న వర్షాలతో టమాటా దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. అంతో ఇంతో వస్తున్న పంట వర్షం కారణంగా నాణ్యత లేకపోవడం, డ్యామేజీ అధికంగా వస్తుండటంతో మార్కెట్లో టమాటాకు డిమాండ్ ఏర్పడింది. దీనికితోడు బయట రాష్ట్రాల్లో ఎడతెరిపిలేని వర్షాలతో అక్కడ స్థానికంగా లభ్యమయ్యే పంటకు నష్టం వాటిల్లింది. దీంతో వ్యాపారులు 365 రోజులు టమాటా దొరికే మదనపల్లె మార్కెట్‌పై దృష్టి కేంద్రీకరించారు. ప్రస్తుతం ఇక్కడి మార్కెట్లో అన్‌సీజన్ కావడం, దిగుబడులు ఆశించిన స్థాయిలో లేకపోవడం, డిమాండ్ ఎక్కువ ఉండటంతో రికార్డు స్థాయి ధర పలికింది. 2016 నవంబర్‌లో మొదటి రకం అత్యధికంగా కిలో రూ.98 పలికింది. తర్వాత కిలో రూ.100 మంగళవారం నమోదైంది. -
వేలాది ఎకరాల్లో నేలకొరిగిన వరి పంట
-
ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలకు దెబ్బతిన్న పంటలు
-
పంట నష్టపరిహారం చెల్లించాల్సిందే
సాక్షి, హైదరాబాద్: గత ఏడాది వర్షాల కారణంగా జరిగిన పంట నష్టానికి రైతులకు పరిహారం చెల్లించాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు తేల్చిచెప్పింది. అప్పుడు రాష్ట్రంలో ఎక్కడా పంట నష్టం జరగలేదన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను తప్పుబట్టింది. విపత్తులతో పంటలు నష్టపోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తేల్చిచెప్పింది. పంట నష్టం జరిగిందనేందుకు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని తెలిపింది. నష్టాన్ని నివారించామనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ఆధారాలను చూపలేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో గత ఏడాది వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పంట నష్టాన్ని మూడు నెలల్లో అంచనా వేయాలని ఆదేశించింది. ఆ తర్వాత నెల రోజుల్లో రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి (ఎస్డీఆర్ఎఫ్), జాతీయ విపత్తుల నిర్వహణ నిధి (ఎన్డీఆర్ఎఫ్) నుంచి కౌలు రైతులతో పాటు నష్టపోయిన రైతుందరికీ ఇన్పుట్ సబ్సిడీగా పరిహారం అందించాలని ఆదేశించింది. పంట బీమా లేక తీవ్రంగా నష్టపోయిన సన్న, చిన్నకారు రైతులకు అదనపు ఆర్థిక సాయం అందించాలని స్పష్టం చేసింది. గత ఏడాది పంటలు నష్టపోయిన రైతులకు ఆర్థిక సాయం అందించేలా ఆదేశించాలంటూ రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధులు విస్సా కిరణ్‌కుమార్, కన్నెగంటి రవి, ఆశాలతలు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు, జస్టిస్ టి.వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పునిచ్చింది. నష్టం లేకుండా చేయడం అసాధ్యం ‘భారీ వర్షాలు పడ్డాయని, పంట పొలాల్లో భారీగా నీరు నిలిచిందని రాష్ట్ర ప్రభుత్వమే అంగీకరించింది. అయితే వెంటనే చేపట్టిన నష్టనివారణ చర్యలతో పంటలు నష్టపోలేదన్న రాష్ట్ర ప్రభుత్వ వాదన సమర్థనీయం కాదు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో నష్టాన్ని కొంతవరకు తగ్గించవచ్చేమో. అంతేగానీ అసలు నష్టమే జరగకుండా చేయడం అన్నది అసాధ్యం. వాస్తవానికి భారీ వర్షాలతో పంటలు తీవ్రంగా నష్టపోయాయని, ఆర్థిక సాయం చేయాలంటూ సీఎం, సీఎస్ వేర్వేరుగా కేంద్రానికి లేఖలు రాశారు. ఈ మేరకు కేంద్ర ప్రతినిధి బృందం కూడా రాష్ట్రంలో పర్యటించి పంట నష్టాన్ని అంచనా చేసింది. ఇప్పుడేమో రాష్ట్ర ప్రభుత్వం పొంతన లేని వాదనలు చేస్తోంది. కేంద్రం నుంచి ఎటువంటి సాయం అందలేదన్న వాదన కూడా సరికాదు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ కింద కేంద్ర ప్రభుత్వం తన వాటాను రాష్ట్రానికి కేటాయించింది. రైతు బంధు భూమి యజమానులకు మాత్రమే ఇస్తున్నారు. కౌలు రైతులకు సాయం అందడం లేదు. విపత్తులు సంభవించినప్పుడు సన్న, చిన్నకారు, కౌలు రైతులే తీవ్రంగా నష్టపోతారు. వారిని ఆదుకోవడం ప్రభుత్వం బాధ్యత..’అని ధర్మాసనం పేర్కొంది. పిల్ అన్నింటికీ మాత్ర కాదు ‘ఈ వ్యాజ్యంలో ప్రజాప్రయోజనం లేదు. రైతులకు నష్టపరిహారం ఇవ్వాలా లేదా అన్నది రాష్ట్ర ప్రభుత్వ విచక్షణాధికారం. గత ఏడాది.. ముందు నష్టం జరిగిందని భావించి సీఎం, సీఎస్ కేంద్రానికి లేఖ రాశారు. తర్వాత పరిశీలించగా ఎక్కడా నష్టం జరగలేదని తెలిసింది. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎటువంటి సాయం అందలేదు..’అని అంతకుముందు అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదించారు. ఇందులో ప్రజా ప్రయోజనం ఉంది ఏజీ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్లో ఎక్కడా ఈ అభ్యంతరం వ్యక్తం చేయలేదని, పిల్‌ను విచారణకు స్వీకరించిన దాదాపు 10 నెలల తర్వాత విచారణార్హం కాదనడం సరికాదని పేర్కొంది. ఈ పిటిషన్లో ప్రజాప్రయోజన ఉందని తేల్చిచెప్పింది. ఎలాంటి సాయం అందించలేదు ‘5.97 లక్షల ఎకరాల్లో దాదాపు 33 శాతం పంటలు దెబ్బతిన్నాయని, దీంతో రూ. 5 వేల కోట్ల నష్టం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. తక్షణ సాయంగా రూ.1,350 కోట్లు ఇవ్వాలని సీఎం, సీఎస్ కోరారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ కింద కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. అయినా రైతులకు ఎటువంటి సాయం అందించలేదు..’అని పిటిషనర్ల తరఫున న్యాయవాది సీహెచ్ రవికుమార్ వాదనలు వినిపించారు. నష్టం జరిగిందని లేఖ రాశారు గత ఏడాది వర్షాలకు రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయాయని సీఎం కేసీఆర్, సీఎస్‌లు కేంద్రానికి గత ఏడాది అక్టోబర్ 16న లేఖలు రాసినట్లు కేంద్రం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఎన్.రాజేశ్వర్‌రావు నివేదించారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీగా పరిహారం ఇచ్చేందుకు రూ.7,219.5 కోట్లు అవసరమని కోరిందని తెలిపారు. లక్షలాది మంది రైతులకు ప్రయోజనం ‘హైకోర్టు చారిత్రక తీర్పుతో లక్షలాది మంది రైతులకు న్యాయం జరుగుతుంది. ఈ తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిది. బేషజాలకు పోకుండా ఇప్పటికైనా తీర్పును అమలు చేయాలి. అలాగే ఈ ఏడాది వర్షాలతో నష్టపోయిన పంటల వివరాలు సేకరించి బాధిత రైతులను ఆదుకోవాలి. ఈ ఏడాది యాసంగికి పంటల బీమాను నోటిఫై చేయాలి..’అని రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధులు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. -
14 లక్షల ఎకరాల్లో పంట నష్టం
సాక్షి, హైదరాబాద్: రోజురోజుకూ పంట నష్టం పెరుగుతోంది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో దాదాపు 14 లక్షల ఎకరాలకు పైగా పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు సమాచారం. ఈ వారంలో మొదటి మూడు రోజుల్లో 8 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లగా, ఆ తర్వాత 12 లక్షల ఎకరాలకు చేరిందని వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా వేసింది. అయితే బుధవారం నాటికి అది కాస్తా 14 లక్షల ఎకరాలకు చేరి ఉండొచ్చని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. అయితే తుది నివేదిక ఇంకా రావాల్సి ఉందని పేర్కొంటున్నారు. గత వారం రోజులుగా కురిసిన వర్షాలకే ఇంత నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. అయితే ఈ వివరాలను అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. వరి దాదాపు 5,10,216 ఎకరాలు, పత్తి 7,50,150 ఎకరాలు, ఇంకా ఇతర పంటలు కలిపి 14,06,110 ఎకరాలు దెబ్బతిన్నట్లు సమాచారం. ఓ అంచనా ప్రకారం దాదాపు 7,60,138 మంది రైతులు పంటలు నష్టపోయినట్లు తెలిసింది. అయితే నష్టం రూ.వేల కోట్లలో ఉంటుందంటున్నారు. అన్నదాత గగ్గోలు..: వరి, పత్తికి కనిష్టంగా రూ.25 వేలు, గరిష్టంగా రూ.35 వేల చొప్పున రైతులు పెట్టుబడి పెట్టారు. వరదలు, వర్షాలతో పెట్టుబడి మొత్తం కోల్పోయే పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఈ పరిస్థితుల్లో నష్ట పరిహారం అందజేయలని కోరుతున్నారు. కాగా, ఈ ఏడాది నుంచి రాష్ట్ర ప్రభుత్వం.. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) పథకం నుంచి వైదొలిగింది. దీంతో పంటల బీమా కూడా అందే దిక్కు లేకుండా పోయిం ది. ఎలాంటి బీమా పథకాలు ఈ వానాకాలం సీజన్లో అమలు చేయకపోవడంతో చాలా నష్టం వాటిల్లింది. రైతు యూనిట్‌గా పంటల బీమా కోసం కేంద్రా న్ని రాష్ట్ర ప్రభుత్వం గతంలో డిమాండ్ చేసింది. అయితే అది అమల్లోకి రాలేదు. ఇప్పుడు కేంద్ర పథకం నుంచి వైదొలగడంతో పరిస్థితి ఇబ్బందిగా మారింది. రాష్ట్రంలో ప్రత్యేకంగా పంటల బీమా పథకాన్ని తీసుకురావాలని పోచారం శ్రీనివాస్‌రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు కసరత్తు జరిగింది. కానీ ఇప్పుడు వ్యవసాయ శాఖ అధికారులు దానిపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేయకపోవడంపైనా విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు కేంద్రం ఇచ్చే పరిహారంపైనే ఆశలున్నాయి. -
40 వేల హెక్టార్లలో పంట నష్టం : కన్నబాబు
తూర్పు గోదావరి : వరదల కారణంగా ఇప్పటివరకు జిల్లాలో 40 వేల హెక్టార్లలో వరిపంటకు నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు తెలిపారు. వరదలతో గండ్లు పడిన ప్రాంతాలను పరిశీలించిన మంత్రి దీనికి శాశ్వత పరిష్కారం చూపుతామని పేర్కొన్నారు. గండ్లు పడిన చోట పూడ్చివేత పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఏలేరు వరదలతో పెద్దాపురం, పిఠాపురం నియోజకవర్గాల్లో పంట పొలాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని, ఉద్యానవన పంటలు కుళ్లిపోయిన పరిస్థితి, తీవ్రంగా ఉందని తెలిపారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ముంపు ప్రాంతాల్లో ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలు అందజేస్తున్నామని తెలిపారు. వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది సహాయక చర్యల్లో యాక్టివ్‌గా పనిచేస్తున్నారని మంత్రి వెల్లడించారు. -
ధాన్యం..ధర దైన్యం
కర్నూలు, కోవెలకుంట్ల/బనగానపల్లె: ఈ ఏడాది ఎండకారు వరి సాగు రైతులకు నష్టాలు మిగిల్చింది. సాగునీటి కష్టాలు, వివిధ రకాల తెగుళ్లు దిగుబడులపై ప్రభావం చూపాయి. కోవెలకుంట్ల వ్యవసాయ సబ్ డివిజన్లోని ఆరు మండలాల పరిధిలో ఈ ఏడాది రబీలో కుందూనది, చెరువులు, బోర్లు, బావులు, తదితర సాగునీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో 4 వేల హెక్టార్లలో 555 రకానికి చెందిన వరిసాగు చేశారు. పంటకాలం పూర్తి కావడంతో డివిజన్లోని ఆయా గ్రామాల్లో వరికోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. పెరిగిన పెట్టుబడులు.. తగ్గిన దిగుబడులు తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా గత ఏడాది డిసెంబర్ నాటికే కుందూనది ఎండిపోయింది. దీంతో నదితీర రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు పడ్డారు. నాట్లు వేసిన నెల రోజులకే సాగునీరు అందకపోవడంతో రైతులు సాగునీటికోసం అవస్థలు పడ్డారు. ఎట్టకేలకు అధికారులు కుందూనదికి నీటిని విడుదల చేయడంతో ఊపిరి పీల్చుకున్నారు. రబీ వరిసాగులో పెట్టుబడులు విపరీతంగా పెరిగి దిగుబడులు గననీయంగా తగ్గడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు, కలుపులు, కోత, నూర్పిడి, తదితర పెట్టుబడుల రూపంలో ఎకరాకు రూ. 22 వేల నుంచి రూ. 25వేలు వెచ్చించారు. సాగునీటి కష్టాలు, వాతావరణం అనుకూలించక, దోమపోటు, అగ్గి తెగులు కారణంగా ఎకరాకు 30 బస్తాలకు మించి దిగుబడులు రాకపోవడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. పెట్టుబడులు పెరిగి దిగుబడులు తగ్గడానికి తోడు మార్కెట్లో వరికి గిట్టుబాటు ధర లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత మార్కెట్లో బస్తా రూ.1100 మించి ధర లేకపోవడం, ఈ ధరకు విక్రయిస్తే పెట్టుబడులు కూడా రావని రైతులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని వరికి గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు. ఇక్కట్లలో కౌలు రైతులు రైతులకు ఎకరానికి భూములను బట్టి రూ 15–20వేల రూపాయలు కౌలు చెల్లించాలి. ఆ తర్వాత పంటలకు పెట్టుబడి పెట్టాలి. ఇవన్నీ పోను మిగులు లభించాలంటే తప్పనిసరిగా కౌలు రైతులకు గిట్టుబాటు ధర లభించాలి. – నరసయ్య, కౌలు రైతు, ఇల్లూరు కొత్తపేట గిట్టుబాటు ధర లేదు రబీలో సాగు చేసిన వరిపంటకు గిట్టుబాటు ధర లభించడం లేదు. ఈ విషయంపై చాలామంది రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, గిట్టుబాటు ధర కల్పించి వరిపంటను కొనుగోలు చేయాలి. – పవన్‌కుమార్, వ్యవసాయాధికారి -
అకాల వర్షానికి 2500 కోళ్లు మృతి
-
రాయలసీమలో కరువు విలయతాండవం
సాక్షి, హైదరాబాద్: రాయలసీమలో రెండు, మూడేళ్లుగా వర్షాభావ పరిస్థితుల నెలకొన్నాయని, కరువు విలయతాండవం చేస్తోందని, ప్రజల పరిస్థితి దారుణంగా మారిందని మాజీ మంత్రి ఎంవీ మైసూరారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ వడ్డమాను శివరామకృష్ణారావు, డాక్టర్ మదన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. వారు బుధవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. రాయలసీమ దుర్భిక్ష పరిస్థితులు, నీటి వనరుల కేటాయింపులపై ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి వేర్వేరుగా రాసిన లేఖలను విడుదల చేశారు. కరువు వల్ల పంటల నష్టం జరిగినా బాధిత రైతాంగానికి వ్యవసాయ బీమా సౌకర్యం లభించలేదని బాబుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని వాపోయారు. -
పంటల బీమా... రైతులకు ధీమా !
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం రైతులకు ధీమా ఇస్తోంది. ప్రతిసారి ఏదో ఒక ప్రకృతి వైపరీత్యంతో నష్టపోతున్న రైతులకు బీమా భరోసా కల్పిస్తోంది. గత ఖరీఫ్ 2017లో వరిలో దిగుబడులు బాగా తగ్గి రైతులు ఆందోళన చెందిన విషయం విదితమే. ఇందుకు కూడా వాతావరణ ప్రతికూలతలు, దోమపోటు తదితర అనేక కారణాలు ఉన్నాయి. వ్యవసాయశాఖ నిర్వహించిన పంట ప్రయోగ ఫలితాలతో ఇదే విషయం తేలింది. దీంతో వరి పంటలో గ్రామాన్ని యూనిట్‌గా ప్రకటించడంతో వరిపై ప్రీమియం చెల్లించిన రైతులకు, దిగుబడి తగ్గిన గ్రామాల్లో ఆ మేరకు లబ్ధి చేకూరేలా అమలుచేస్తున్న ఫసల్ బీమా రైతులకు ఇప్పుడు అండగా మారింది. ఈ మేరకు వ్యవసాయశాఖ అధికారుల అందించిన వివరాల ప్రకారం జిల్లాలో వరిపై ప్రీమియం చెల్లించిన రైతుల్లో దాదాపు 7,386 మందికి రూ.7,40,88,530 పంట పరిహారం కింద విడుదలయ్యాయి. ఈ మేరకు జిల్లాలోని 14 బ్యాంకులు పరిహారం జమ చేసినట్లు అధికారులు తెలిపారు. పంటల బీమా కింద విడుదలైన పరిహారాన్ని వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. సాక్షి, కరీంనగర్: రెండేళ్లలో రూ.18.63 కోట్ల పరిహారం.. నేటి నుంచి రైతుల ఖాతాల్లో జమప్రధానమంత్రి ఫసల్ బీమా కింద ఇప్పటివరకు పంటలు నష్టపోయిన రైతులకు రూ.18.63 కోట్లు అందజేశారు. 2014–15 రబీలో రూ.7.82 కోట్లు, 2016–17ఖరీఫ్‌లో రూ.3.40 కోట్లు, తాజాగా ఇప్పుడు ఖరీఫ్ 2017లో రూ.7.41 కోట్ల విడుదలయ్యాయి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వాటి వాటాను చెల్లించిన దరిమిలా ఇన్సూరెన్స్ కంపెనీ వారు బీమా పరిహారం మొత్తాన్ని ఆయా బ్యాంకులకు జమ చేస్తాయి. ఈ మొత్తాన్ని సంబంధిత బ్యాంకులు వారి శాఖల ద్వారా రైతుల ఖాతాలలో వెంటనే జమచేయాలన్న జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సోమవారం నుంచి ప్రక్రియ మొదలు కానుంది. రెండురోజుల క్రితం జరిగిన బ్యాంకర్ల సమీక్ష సమవేశంలో కూడా ఈ విషయమై బ్యాంకర్ల నుంచి ఏ రైతులకు ఎంతమేర పరిహారం విడుదలైంది వంటి స్పష్టమైన వివరాలు సేకరించారు. ఆ వివరాలను శాఖలవారీగా క్రోడీకరించి కన్వీనర్ లీడ్ బ్యాంక్ మేనేజర్‌కు అందించాలని, దాని ప్రతిని ఒకటి జిల్లా వ్యవసాయ అధికారికి ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా రైతుల ఖాతాలకు జమ చేయడంలో ఎటువంటి జాప్యమూ చేయరాదని కూడా స్పష్టంగా ఆదేశించడంతో వ్యవసాయశాఖ కసరత్తు ముమ్మరం చేసింది. రబీ బీమా కోసం వ్యవసాయ శాఖ ప్రచా రం.. బీమా చెల్లింపునకు ఈనెల 31 చివరితేదీ పంటల బీమాకు ప్రీమియం చెల్లించడంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఇప్పుడిప్పుడే కలెక్టర్ ప్రొద్బలంతో ప్రతికూలతలు అధిగమిస్తున్నామన్న ధీమాను వ్యవసాయశాఖ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. రానున్న రబీ పంట కాలానికి సంబంధించి వడగళ్లతో పంటనష్టపోయే సందర్భాలు గతంలో అనేకం చూశామని, ఈ క్రమంలో రైతులందరూ తప్పనిసరిగా తమ వరిపంటకు బీమా చేయించుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ సంవత్సరం బీమా పథకం, అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా వారికి అప్పగించడం వల్ల రైతులు పంట రుణాలను కూడా సత్వరమే రెన్యువల్ చేసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే పంట రుణాలు తీసుకోని రైతులు బీమా ప్రపోజల్ ఫారమ్ నింపి, పంట బీమా ప్రీమియం, ధ్రువీకరించిన కామన్ సర్వీస్ సెంటర్లో లేదా సమీప బ్యాంకులో కట్టవచ్చని పోస్టర్లు, కరపత్రాల ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. వరికి చెల్లించాల్సిన ప్రీమియం రూ.450 కాగా, చివరితేదీ ఈనెల 31వరకే ఉంది. ఇంకా మిగిలి ఉన్న బ్యాంకు పనిదినాలు ఐదురోజులు మాత్రమే ఉన్నందున రైతులు పూర్తి ఇంకా వివరాలకు సమీప వ్యవసాయ అధికారిని సంప్రదింంచి బీమా చేయించుకోవాలని సూచిస్తున్నారు. బీమా చేసుకుంటే మేలు రైతులు రబీ కోసం బీమా ప్రీమియం చెల్లించడానికి ఈనెల 31 చివరి తేదీ. ఇందులో బ్యాంకు పనిదినాలు కేవలం ఐదు రోజులే ఉన్నందున త్వరపడాల్సిన అవసరం ఉంది. రెండేళ్లుగా స్వయంగా పరిశీలిస్తున్న పంటకోత ప్రయోగాలు, వ్యవసాయ విస్తీర్ణాధికారులకు ఒక బాధ్యతగా నిర్వహిస్తున్నాం. వీటి ఫలితాల బట్టి రైతులకు బీమా పరిహారం అందుతుంది. జిల్లా కలెక్టర్ విరివిగా నిర్వహిస్తున్న సమీక్ష సమావేశాల్లో పంటల బీమా ఆవశ్యకతను, ప్రయోజనం వర్తింపుపై అటు బ్యాంకర్లకు, ఇటు వ్యవసాయ శాఖ ఉద్యోగులకు ఒక ప్రాధాన్య అంశంగా చర్చిస్తున్నారు. గతంలో ఏ రైతుల వద్దకు వెళ్లి పథకం వివరాలు చెప్పినా రైతుల నుంచి నిరాశక్తత ఎదురయ్యేది... ఇప్పుడా పరిస్థితి లేదు. – వి.శ్రీధర్, జిల్లా వ్యవసాయ అధికారి -
పంట పందుల పాలు
తలమడుగు(బోథ్): జిల్లాలోని అటవీ ప్రాంతా ల్లో పంటలకు రక్షణ కరువైంది. అడవి పందులు పంటలపై దాడి చేసి ధ్వంసం చేస్తుండడంతో రైతులు నష్టపోవాల్సి వస్తోంది. దరఖాస్తు చేసుకున్నా పరిహారం అందకపోవడంతో అప్పుల్లో కూరుకుపోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ఆదిలాబాద్ జిల్లా అంటేనే అడవుల జిల్లాగా పేరుంది. చుట్టూ అడవులు ఉండడంతో పందులు పంటలపై దాడి చేసి నాశనం చేస్తున్నాయి. జిల్లాలో ఎక్కువగా పత్తి, కంది, జొన్న పంటలు సాగు చేస్తుంటారు. రబీలో వేరుశనగ, శనగ, మొక్కజొన్న పంటలు సాగు చేసే రైతులు పందుల బెడదతో జంకుతున్నారు. జిల్లాలో 18 మండలాలు ఉన్నాయి. మహారాష్ట్ర సరిహద్దు మండలాలైన తలమడుగు, తాంసి, బేల, బజార్హత్నూర్, బోథ్ మండలాల్లో, అటవీ ప్రాంతం చుట్టూ ఉన్న ఇచ్చోడ, సిరికొండ, నేరడిగొండ మండలాల్లో పంటలకు పందుల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఈ ఏడాది ఖరీఫ్‌లో పత్తి, కంది పంటలు లక్షా 39 వేల హెక్టార్లలో సాగు చేశారు. 1200 ఎకరాల్లో పత్తి, జొన్న, కంది పంటలపై అడవి పందులు దాడి చేసి నష్టపర్చాయి. తలమడుగు మండలం పల్లి, బరంపూర్, దేవపూర్, కుచుపూర్, కజ్జర్ల, ఉమ్రీ, తాంసి మండలం వడ్డాడి, గోట్కుర్, జామిడి, కప్పర్ల, గిరిగామ్, అంబుగామ్, అట్నమ్గూడ, లింబుగుడ, భీంపూర్ మండలం పిప్పల్‌కోఠి, తాంసి(కే), అందర్‌బంద్, టెక్టిరాంపుర్, దన్నోర, కరంజి గ్రామాల్లో అటవీ ప్రాంతం ఎక్కువగా ఉండడంతో పంటలను అడవి పందులు ధ్వంసం చేశాయి. అటవీశాఖ నుంచి పరిహారం ఇప్పించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు విఫలమయ్యారని రైతులు ఆరోపిస్తున్నారు. జిల్లాలో గత ఏడాది 980 ఎకరాల్లో, ఈ ఏడాది సుమారు 1200 ఎకరాల్లో పంటలను అడవి పందులు ధ్వంసం చేశాయి. వ్యవసాయ, అటవీ శాఖ అధికారులు పంటలను సందర్శించి నష్టాన్ని అంచనా వేశారు. రైతులు ఫొటోలతో సహా దరఖాస్తులు తీసుకున్నారు. అయినా పరిహారం అందలేదు. అడవిపందులు పంటలపై దాడులు చేస్తుండడంతో రాత్రింబవళ్లు రైతులు పొలాల వద్ద గుడిసెలు వేసుకుని కాపలా ఉంటున్నారు. పందులు వస్తే టపాసులు పేల్చుతూ బెదరగొడుతున్నారు. పంట చుట్టూ ఫెన్సింగ్, చీరలు కట్టి రక్షించుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో రైతులు పందుల దాడిలో గాయపడిన సంఘటనలు ఉన్నాయి. చేతికొచ్చిన పంటలను రక్షించుకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. -
ఏడాదిన్నరగా ఎదురుచూపులే..
శ్రీకాకుళం , సీతంపేట: మన్యంలో ఏనుగుల గుంపు విధ్వంసానికి ఆర్థికంగా కుదేలైన గిరిజనులు పంటనష్ట పరిహారం కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. ఏడాదిన్నరగా పరిహారం చెల్లింపులో మీనమేషాలు లెక్కిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఏనుగుల గుంపును తరిమికొట్టడంలో వైఫల్యం చెందిందనే చెప్పాలి. మరోవైపు ఇటీవల తిత్లీ తుఫాన్ ప్రభావంతో పంటలన్నీ నష్టపోయిన వీరిని ఆదుకున్న పాపానపోలేదు. దీంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆరు మండలాల్లోనే ప్రధానంగా వరి, అరటి, చెరుకు, జీడి మామిడి తదితర పంటలకు నష్టం కలిగిస్తున్నాయి. 2008లో 11 ఏనుగుల గుంపు లకేరీ అడవుల నుంచి శ్రీకాకుళం జిల్లాలో సీతంపేట ఏజెన్సీలో ప్రవేశించాయి. అప్పట్నుంచి నాలుగైదేళ్లుగా పాలకొండ, వీరఘట్టం, సీతంపేట మండలాల్లో పంటలను నష్టపరిచాయి. ప్రస్తుతం నాలుగు ఏనుగులు సీతంపేట, ఎల్‌ఎన్‌పేట, హిరమండలం, కొత్తూరు మండలాల్లోనే సంచరించి పంటలను నాశనం చేస్తున్నాయి. ఏడాది కిందట మరో 7 ఏనుగుల గుంపు సంచరిస్తూ పంటలను ఇష్టానుసారంగా ధ్వంసం చేశాయి. వరి కోతకు వచ్చే సమయంలో నాశనం చేయడంతో గిరిజనులు లబోదిబోమంటున్నారు. ఇంత భారీ స్థాయిలో నష్టం కలిగిస్తున్నప్పటికీ అటవీశాఖ, ఉద్యానవనశాఖ, రెవెన్యూ శాఖలు స్థాయిలో సర్వే చేయడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు ఉన్నవారికి మాత్రమే పరిహారం చెల్లించి, పట్టాలు లేని వారిని లెక్కల్లోకి తీసుకోకపోవడం ఎంతవరకు సమంజసమని గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. పరిహారం అరకొర పంపిణీ.. ఏనుగుల వల్ల కలిగిన పంట నష్టంపై అరకొరగా పరిహారం పంపిణీ చేసి అటవీశాఖ చేతులు దులుపుకుంటుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 2008 నుంచి ఇప్పటి వరకు 1,008 మంది రైతులకు 249.42 ఎకరాలకుగాను రూ.36.99 లక్షల వరకు మాత్రమే పరిహారం చెల్లించారు. ఆరు మండలాల్లో దాదాపు 8 వేల ఎకరాల్లో పంటల నష్టం ఉంటుందని గిరిజనుల అంచానా. దాదాపు రెండు వేల మందికిపైగా బాధితులు ఉన్నారు. కోటి రూపాయల వరకు పరిహారం చెల్లించాల్సి ఉంటుందని గిరిజనులు చెబుతున్నారు. మండలంలోని అంటికొండ, అచ్చిబ, కుడ్డపల్లి, పెద్దగూడ, మండ, జక్కరవలస, బుడగరాయి, దోనుబాయి, పుబ్బాడ తదితర ప్రాంతాల పరిధిలో ఏనుగులు ఇటీవల పంటలు నాశనం చేసినా ఎటువంటి పరిహారమూ అందలేదు. అటవీశాఖ వైఫల్యం ఏనుగుల వల్ల పంట నష్టపోయిన వారికి పరిహారం చెల్లించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఏడాదిన్నర కిందట అరకొర పరిహారం చెల్లించి చేతులు దులుపుకున్నారు. ప్రస్తుతం ఏనుగులు విపరీతంగా పం టలను నాశనం చేస్తున్నాయి. వీటివల్ల పంట నష్టపోయిన వారందరికీ పరిహారం చెల్లిం చాలి. – విశ్వాసరాయి కళావతి, పాలకొండ ఎమ్మెల్యే ఏనుగుల వల్ల పంట నష్టం కలిగిన మండలాలు: 6 ఏయే మండలాలు: సీతంపేట, కొత్తూరు, హిరమండలం, ఎల్‌ఎన్‌పేట, వీరఘట్టం, పాలకొండ నష్టం : 8 వేల ఎకరాలపైనే ఇంతవరకూ చెల్లింపు : 249 ఎకరాలు చెల్లించిన పరిహారం: రూ.36లక్షలు ఇంకా చెల్లించాల్సిన పరిహారం: రూ.కోటిపైనే -
పరిహారం అందేనా?
ఖమ్మంవ్యవసాయం: అయితే అతివృష్టి.. లేకుంటే అనావృష్టి..ఇదీ ఈ ఏడాది ఖరీఫ్ పరిస్థితి. సీజన్ ఆరంభంలో మోస్తరుగా కురిసి.. తర్వాత ముఖం చాటేసి, కొన్ని పంటలు ఎదుగుతున్న క్రమంలో, మరికొన్ని పైర్లు చేతికొచ్చే సమయంలో.. ఎడతెరిపి లేకుండా పడిన వానలు రైతులను తీవ్రంగా నష్టపరిచాయి. ఆగస్టులో జిల్లాలో రోజుల తరబడి సాధారణం కంటే రెట్టింపు వర్షపాతం నమోదైంది. పంటలు నీటమునిగి లోతట్టు ప్రాంత రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంటనష్టంపై అంచనా వేసిన వ్యవసాయశాఖ పరిహారం చెల్లించడంలో జాప్యం చేస్తోంది. అధికారులు ప్రభుత్వానికి పంటనష్టంపై నివేదిక పంపిన కొన్ని రోజులకే అసెంబ్లీ రద్దు కావడంతో అసలు పరిహారం అందుతుందా? లేదా? అనే సందిగ్ధంలో రైతులు ఉన్నారు. నాడు సంభవించిన అల్పపీడనానికి తోడు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదలడంతో జిల్లాలో దాదాపు 20రోజుల పాటు రెట్టింపు వానలు పడ్డాయి. దీంతో వాగులు.... వంకలు పొంగిపొర్లాయి. అంతేగాక చెరువులు, రిజర్వాయర్లు అలుగుపడ్డాయి. ఫలితంగా పల్లపు ప్రాంతాల్లో వేసిన పంటలు పూర్తిగా నీట మునిగాయి. జిల్లాలో ప్రధానంగా సాగు చేసిన వరి, పత్తి, మొక్కజొన్న పంటలు జలమయమయ్యా యి. పెసర పంట మాత్రం చేతికొచ్చే సమయంలో పనికిరాకుండా పోయింది. ప్రకృతి వైపరీత్యానికి పంటలు దెబ్బతినడంతో ప్రభుత్వం స్పందించింది. వెంటనే ప్రాథమిక నివేదిక అందించాలని ఆదేశించింది. రెవెన్యూ, వ్యవసాయ శాఖలు సంయుక్తంగా సమగ్రంగా పంటనష్టాలపై నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందజేశారు. వాగులు, చెరువులు, కుంటల పరీవాహక ప్రాంతా లతోపాటు వరద తాకిడికి కోతకు గురై.. ఇసుక మేటలకు గురై.. 33శాతం నష్టపోయిన పంటలను మాత్రమే అధికారులు పరిగణనలోకి తీసుకున్నారు. ఈ మేరకు నివేదికను రూపొందించారు. నెలలు గడుస్తున్నా.. అధికార యంత్రాంగం పంటనష్టంపై నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపి నెలలు గడుస్తున్నా.. పరిహారం ఇంకా మంజూరు కాలేదు. నివేదిక అందించిన కొద్దిరోజులకే అసెంబ్లీ రద్దు కావడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పరిస్థితి ఉంది. ఫలితంగా జిల్లా నుంచి వెళ్లిన నివేదికలు రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యాలయంలో మూలుగుతున్నాయి. ప్రభుత్వ ఖజానాలో నిధుల కొరత కారణంగా కూడా ఈ సమస్యను అధికారులు పట్టించుకోవట్లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో రైతులు దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుందని ఆశతో ఎదురు చూస్తున్నారు. పలు ప్రాంతాల్లో మండల వ్యవసాయశాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. 4,079 హెక్టార్లలో నష్టం.. జిల్లాలో మొత్తం 4,079 హెక్టార్లలో పంటనష్టం వాటిల్లినట్లు జిల్లా యంత్రాంగం గుర్తించింది. అధికంగా పెసర దాదాపు 1800 హెక్టార్లు. తిరుమలాయపాలెం మండలంలోనే ఈ పంటకు బాగా నష్టం వాటిల్లింది. నీటి పారుదల కింద సాగు చేసిన వరి 1,000 హెక్టార్లలో, పత్తి 700 హెక్టార్లలో, 600 హెక్టార్లలో మొక్కజొన్న, మినుము పంటలు దెబ్బతిన్నాయి. వరికి హెక్టారుకు రూ.13,500, మొక్కజొన్నకు రూ. 8,333, పత్తికి రూ. 13,500, పెసరకు రూ. 13,500 పరిహారం చెల్లించాలని నిబంధనలు చెబుతున్నాయి. పత్తి నీటమునిగి దెబ్బతింది.. అధిక వర్షాల కారణం గా చెరువు వెంబడి ఉన్న ఎకరం పత్తి 10 రోజులు నీటిలో మునిగి పూర్తిగా దెబ్బతింది. దీంతో పంటను వదిలేశా. అధికారులు వచ్చి వివరాలను నమోదు చేసుకున్నారు. కానీ తర్వాత ఎలాంటి సమాచారం లేదు. పరిహారం ఇస్తారో.. ఇవ్వరో.. అర్థం కావట్లేదు. – చోడపోయిన సంగం, కమలాపురం, ముదిగొండ మండలం పెసర కోతదశలో వర్షాలపాలైంది.. 10 ఎకరాల్లో పెసర పంట వేశా. ఆగస్టులో వచ్చిన వానలకు కోతదశలో నీటిపాలైంది. దీంతో పూర్తిగా పనికి రాకుండా పోయింది. పెట్టుబడి దాదాపు రూ.లక్ష వరకు పెట్టా. అధికారులు వచ్చి పంట నష్టానికి సంబంధించి రాసుకొని వెళ్లారు. ఇంత వరకు పరిహారం ముట్టలేదు. – కొప్పుల రాంరెడ్డి, బీరోలు, తిరుమలాయపాలెం మండలం -
పెను విధ్వంసం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: తిత్లీ.. అంతా భయపడినట్లే విరుచుకుపడింది! ఉత్తరాంధ్రకు చెందిన శ్రీకాకుళం జిల్లాలో ఈ పెను తుపాను విధ్వంసం సృష్టించింది. పచ్చని కొబ్బరిచెట్లతో సిక్కోలు కోనసీమగా పేరొందిన ఉద్ధానం ఊపిరి తీసేసింది! గంటకు 165 కిలోమీటర్ల వేగంతో విరుచుకుపడిన ఈ తుపాను ధాటికి రోడ్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు ధ్వంసమవడంతో జిల్లాతో ఉద్ధానం బంధం తెగిపోయింది. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు దాదాపు పన్నెండు గంటలపాటు ఏకధాటిగా విలయతాండవం చేసిన తిత్లీ దెబ్బకు జిల్లా అతలాకుతలమైంది. గతంలో ఇలాంటి సీజన్‌ల్లోనే దాడి చేసిన ఫైలీన్, హుద్‌హుద్ తుపానుల కన్నా మితిమీరిన ప్రతాపంతో విరుచుకుపడడంతో ఉద్ధానం వారేగాక శ్రీకాకుళం జిల్లా ప్రజలంతా ప్రాణాలు గుప్పిట పెట్టుకుని గజగజ వణికిపోయారు. తుపాను కారణంగా చెట్లు, ఇళ్లు కూలిన ఘటనల్లో ఏడుగురు మృతిచెందారు. తుపాను సృష్టించిన విధ్వంసానికి జిల్లాలోని పలు ప్రాంతాల్లో చెట్లు కూకటివేళ్లతో విరిగిపడ్డాయి. పూరిళ్లు పైకప్పులు లేచిపోయాయి. విద్యుత్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో పాటు పలుచోట్ల విద్యుత్తు తీగలు తెగిపడ్డాయి. ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. వందలాది గ్రామాలు, పట్టణాలు అంధకారంలో మునిగిపోయాయి. రైతులకు అపారనష్టం వాటిల్లింది. పంటలు భారీగా దెబ్బతిన్నాయి. కొబ్బరి తోటలు నేలమట్టమయ్యాయి. వరి తీవ్రంగా దెబ్బతింది. మరోవైపు విజయనగరం జిల్లాపైనా తుపాను ప్రభావం చూపింది. ఇక ఒడిశా రాష్ట్రంపైనా తిత్లీ విరుచుకుపడింది. ప్రధానంగా గజపతి జిల్లాలో బీభత్సం సృష్టించింది. మొత్తంగా విలయ విధ్వంసం సృష్టించి, భీకర గాలులతో తీవ్ర నష్టాన్ని కలిగించి శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేసిన తిత్లీ అతి తీవ్ర తుపాను గురువారం వేకువ జామున 4.30 నుంచి 5.30 గంటల మధ్య తీరాన్ని దాటింది. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పల్లెసారధి గ్రామం వద్ద గంటకు 150 నుంచి 165 కిలోమీటర్ల వేగంతో తీరాన్ని దాటింది. అనంతరం తీవ్ర తుపానుగాను, ఆపై తుపానుగాను మారి గురువారం రాత్రికి తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. ఇది ఈశాన్య దిశగా పశ్చిమబెంగాల్ వైపు పయనిస్తోంది. గురువారం రాత్రి పది గంటల సమయానికి ఇది ఒడిశాలోని భవానీపట్నాకు తూర్పు ఆగ్నేయంగా 80 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. చిగురుటాకులా వణికిన సిక్కోలు.. తిత్లీ ప్రభావంతో బుధవారం రాత్రి నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అయితే విశాఖపట్నం, విజయనగరం జిల్లాలను కరుణించిన తిత్లీ శ్రీకాకుళం జిల్లాలో మాత్రం పెను విధ్వంసాన్ని సృష్టించింది. ఫలితంగా దీని ధాటికి సిక్కోలు చిగురుటాకులా వణికిపోయింది. అర్థరాత్రి తర్వాత నుంచి గంటగంటకూ తిత్లీ తన ప్రతాపాన్ని చూపించింది. తీరాన్ని దాటే సమయానికి పలాస, ఇచ్చాపురం, టెక్కలి, నర్సన్నపేట, సోంపేట తదితర ప్రాంతాల్లో పెనుగాలుల ఉధృతి మరింత పెరిగింది. దీంతో ఈ ప్రాంతాలపై తుపాను ప్రభావం అధికంగా ఉంది. టెక్కలి డివిజన్లో అనేక ఇళ్లు, చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. సమాచార వ్యవస్థ కుప్పకూలిపోయింది. అప్పటిదాకా గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలులు తెల్లవారుజామున 3 గంటల నుంచి 130 నుంచి 165 కిలోమీటర్ల వేగానికి చేరాయి. దీంతో శ్రీకాకుళం జిల్లావాసులు తీవ్ర భయాందోళనలతో బిక్కుబిక్కుమంటూ గడిపారు. తుపాను తీరాన్ని దాటిన సమయంలో వజ్రపుకొత్తూరు మండల ప్రజలు గజగజ వణికిపోయారు. నాలుగేళ్లక్రితం ఇదే సమయంలో విశాఖ కేంద్రంగా హుద్‌హుద్ వణికించగా.. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాను తిత్లీ తీవ్రంగా దెబ్బతీసింది. ఉద్ధానంపై తీవ్ర ప్రభావం.. ముఖ్యంగా వజ్రపుకొత్తూరు మండలంలో తీరం దాటడంతో ప్రధానంగా ఉద్ధానం ప్రాంతంపై తీవ్ర ప్రభావం పడింది. భీకర రీతిలో విరుచుకుపడిన పెనుగాలుల ప్రభావంతో కొబ్బరి చెట్లతోపాటు జీడిమామిడి, అరటి, బొప్పాయి తదితర ఉద్యాన పంటలన్నీ దెబ్బతిన్నాయి. టెక్కలి సమీపంలో కన్నెవలస వద్ద జాతీయ రహదారి పూర్తిగా వరదలో మునిగిపోవడంతో ఉద్ధానం ప్రాంతానికి జిల్లాతో సంబంధం తెగిపోయింది. సుమారు 12 గంటలపాటు కురిసిన వర్షాలకు జిల్లా అంతటా వరద ముంచెత్తింది. గురువారం జిల్లాలో సగటున 77 మిమీ వర్షపాతం నమోదైంది. దీంతో పలు మండలాల్లో వరి పంట నీటమునిగింది. సుమారు 1.44 లక్షల హెక్టార్లలో పంట దెబ్బతింది. అలాగే ఉద్ధానం సహా జిల్లావ్యాప్తంగా 3 లక్షల కొబ్బరి చెట్లు నేలకూలాయి. 737 హెకార్లలో అరటి, బొప్పాయి, జీడిమామిడి తదితర ఉద్యాన పంటలతో పాటు కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. మొత్తంగా రెండు లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు ధ్వంసమైనట్టు అధికారులు అంచనా వేశారు. పంటలకు వాటిల్లిన నష్టం రూ.1,350 కోట్ల వరకూ ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. పక్కా ఇళ్లకూ తప్పని దెబ్బ... తిత్లీ తుపాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో భారీగా ఇళ్లకు నష్టం వాటిల్లింది. జిల్లావ్యాప్తంగా 1,021 ఇళ్లు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమికంగా లెక్కించారు. ఇందులో రెండు పక్కా ఇళ్లు పూర్తిగా ధ్వంసంకాగా, మరో ఆరిళ్లు పాక్షికంగా దెబ్బతి న్నాయి. పూరిళ్లు మాత్రం తుపాను దాటికి ఆగలేకపోయాయి. 409 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మరో 254 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. వీటిలో ఎక్కువగా రేకుల ఇళ్లే. ఈదురుగాలులకు రేకులు ఎగిరిపోవడంతో వర్షానికి ఇళ్లల్లోని వస్తువులు, ఆహారధాన్యాలు పాడైపోయాయి. ఇలా ఇళ్లు నష్టపోయినవారిలో ఎక్కువమంది వంశధార ప్రాజెక్టు నిర్వాసితులే ఉన్నారు. ఈ మొత్తం నష్టం రూ.20 కోట్ల వరకూ ఉంటుందని ప్రాథమిక అంచనా. మత్స్యకారులకు తీరని నష్టం... తిత్లీ తుపాను ధాటికి మత్స్యకారులకు సంబంధించిన 12 బోట్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. మరో 445 బోట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అంతేకాదు మత్స్యకారులు వేటకు ఉపయోగించే 1,520 వలలు కూడా ఎందుకూ పనికిరాకుండా పోయాయి. దీనివల్ల జరిగిన నష్టం రూ.9.34 కోట్లు ఉంటుందని అంచనా. ఇచ్ఛాపురంలో 24 సెం.మీల భారీ వర్షం.. తిత్లీ ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో పలుచోట్ల కుంభవృష్టి వర్షాలు కురిశాయి. అత్యధికంగా ఇచ్ఛాపురంలో 24, టెక్కలిలో 23, పలాసలో 20, మందసలో 13, సోంపేటలో 12, పాతపట్నంలో 10, కళింగపట్నంలో 9, రణస్థలంలో 5, పాలకొండలో 4 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైంది. తుపాను తీరాన్ని దాటాక గాలుల ఉధృతి క్రమేపీ తగ్గుముఖం పట్టినా గురువారం మధ్యాహ్నం దాకా ఈదురుగాలులు కొనసాగుతూనే ఉన్నాయి. రాత్రికి గాలులు తగ్గి వాతావరణం సాధారణ స్థితికి చేరుకుంది. మరోవైపు తిత్లీ తుపాను తీరం దాటి తీవ్ర వాయుగుండంగా బలహీనపడి పశ్చిమ బెంగాల్ వైపు పయనిస్తుండడంతో ఉత్తరాంధ్రలో వానలు తగ్గుముఖం పట్టనున్నాయి. రానున్న రెండు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే వీలుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) గురువారం రాత్రి నివేదికలో వెల్లడించింది. తుపాను తీరం దాటడంతో రాష్ట్రంలోని అన్ని పోర్టులకు జారీ చేసిన హెచ్చరికలను ఉపసంహరించింది. ఏడుగురి మృతి... తుపాను ప్రభావంతో విరుచుకుపడిన ఈదురుగాలులు, వర్షాల కారణంగా గురువారం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరొకరికి గాయాలయ్యాయి. వర్షానికి నానిపోయిన ఇంటిస్లాబ్ కూలిపోయిన ప్రమాదంలో సరిబుజ్జిలి మండలం రొట్టవలసకు చెందిన మూడడ్ల సూర్యారావు(46) చనిపోయారు. తనపై చెట్టు కూలిపోవడంతో వంగర మండలంలోని వోనె అగ్రహారానికి చెందిన తాడి అప్పలనర్సమ్మ(62) అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. సంతబొమ్మాళి మండలంలో సున్నాపల్లి గ్రామానికి చెందిన బొంగు దుర్గారావు(50) కూడా చనిపోయినా కారణం ఏమిటనేదీ అధికారికంగా ప్రకటించలేదు. పొలంలో తన ఎద్దులను రక్షించడానికి వెళ్లిన సంతబొమ్మాళి మండలం వడ్డితాండ్ర గ్రామానికి చెందిన అప్పలస్వామి(56) మృత్యువాత పడ్డారు. టెక్కలిలోని ఆండ్ర వీధిలో పూరిల్లు కూలిపోయి కొల్లి లక్ష్మమ్మ(70) అనే వృద్ధురాలు మృత్యువాత పడ్డారు. అలాగే నందిగాం మండలం దేవీపురం గ్రామానికి చెందిన మున్నేన సంతోష్‌కుమార్(29), బోలుభద్ర గ్రామానికి చెందిన ఇప్పిలి కన్నయ్య(53) గొర్రెలను కాస్తూ మందస మండలంలోని సువర్ణపురం వద్దకు వెళ్లారు. వారిపై కొబ్బరిచెట్టు పడడంతో ఇద్దరూ మృత్యువాత పడ్డారు. అలాగే తుపాను ధాటికి మూగజీవాలు సైతం మృత్యువాత పడ్డాయి. తొమ్మిది ఎద్దులు, గేదెలు చనిపోగా, గొర్రెలు, మేకలు 80 వరకూ చనిపోయినట్టు తెలుస్తోంది. అలాగే 500 కోళ్లు చనిపోయినట్లు సమాచారం. 9 లక్షలమందిపై ప్రత్యక్ష ప్రభావం! ఊహించిన దానికన్నా ప్రచండమారుతంలా తిత్లీ తుపాను విరుచుకుపడటంతో ప్రత్యక్షంగా నష్టపోయిన బాధితుల సంఖ్య సుమారు 9 లక్షలమంది దాకా ఉంటుందని అధికారిక లెక్కలు పేర్కొంటున్నాయి. అయితే అనధికారికంగా ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుందని అంచనా. జిల్లాలోని 38 మండలాలపైనా తుపాను ప్రభావం కనిపించింది. 16 మండలాలపై తీవ్రంగా ఉంది. సుమారు 1,864 గ్రామాలతో పాటు జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీలు కూడా ఈ తుపాను ధాటితో నష్టాన్ని చవిచూశాయి. మొత్తం మీద తిత్లీ తుపాను వల్ల జిల్లాలో రూ.1,400 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. -
కుర్మయ్య కుటుంబానికి సాయం అందేనా?
వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం పోల్కేపహాడ్ గ్రామానికి చెందిన కొమరోని కుర్మయ్య తనకున్న ఎకరా 10 గుంటల సొంత భూమికి తోడు మరో 4 ఎకరాలు(ఎకరానికి రూ. 10 వేలు) కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసేవారు. సొంత భూమిలో నీటి కోసం 6 బోర్లు వేయించారు. ఒక్క బోరులో కూడా నీరు పడలేదు. వర్షాధారంగా ఆ భూమిలో మొక్కజొన్న, వేరుశనగ పంటలు సాగు చేసేవారు. 2014, 2015 వరుస సంవత్సరాలలో పంటలో నష్టం కారణంగా(ఒక వైపు వర్షం లేక మరో వైపు అడవి పందుల బెడద) అప్పులు ఎక్కువయ్యాయి. బోర్ల కోసం చేసిన అప్పులు, కౌలు ధరలు కూడా చెల్లించలేక తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. అప్పులు వడ్డీతో కలిపి రూ. 3 లక్షలకు పెరిగాయి. అప్పుల వాళ్ల నుంచి తీవ్రమైన ఒత్తిడి కారణంగా 2016 డిసెంబర్ 5న ఇంటిలోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక ఆత్మహత్య జరిగి దాదాపు 2 సంవత్సరాలు కావస్తున్నా ఈ కుటుంబానికి ప్రభుత్వం నుంచి రావలసిన ఎక్స్‌గ్రేషియా అందలేదు. కనీసం జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కూడా అందలేదు. కొడుకు కాశీం డిగ్రీ పూర్తి చేయడానికి నెలలో ఒక వారం కూలికి పోవలసి వస్తున్నది. కూతురు కవిత ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. కుర్మయ్య భార్య రాములమ్మ తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నది. – బి. కొండల్‌రెడ్డి, రైతు స్వరాజ్య వేదిక -
పంట ఎండి.. కడుపు మండి..
కర్నూలు, కృష్ణగిరి: ఈ ఖరీఫ్ అన్నదాతలను పూర్తిగా ముంచేసింది. ఏ గ్రామమెళ్లినా ఎండిన పంటలు.. అన్నదాతల కంట కన్నీళ్లే కనిపిస్తున్నాయి. కృష్ణగిరి మండలంలో ఈ ఖరీఫ్‌లో 12,162 హెక్టార్లలో వేరుశనగ, 4,092 హెక్టార్లలో పత్తి, 2,024హెక్టార్లలో ఆముదం, 4, 284 హెక్టార్లలో కంది పంటలను సాగు చేశారు. మొదటి నుంచి వర్షాభావ పరిస్థితులు వెంటాడుతుండడంతో వేరుశనగ పంట పూర్తిగా ఎండిపోయింది. దీంతో రైతులు ఆశలు వదిలేసుకున్నారు. కొందరు రైతులు పంటను తొలగించేస్తున్నారు. అమకతాడు గ్రామంలో శుక్రవారం కె.రామకృష్ణ, తలారి కుళ్లాయి అనే రైతులు తమ పొలాల్లో ఎండిన వేరుశనగ పంటను ఎద్దులతో తొలగించారు. ఇలా మండల వ్యాప్తంగా పంటను తొలగించేందుకు చాలామంది సిద్ధమయ్యారు. విత్తనాలు, సేద్యాలు, ఎరువులు, కూలీల ఖర్చుల కింద ఎకరాకు రూ.15 వేల వరకు ఖర్చు చేసినట్లు రైతులు తెలిపారు. మండలంలో ఇలాంటి పరిస్థితులు గత 60 ఏళ్లలో ఎన్నడూ చూడలేదని చెబుతున్నారు. ఇంత దారుణం ఎన్నడూ చూడలేదు ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ చూడలేదని మా పెద్దలు కూడా అంటున్నారు. నాకు 18ఎకరాల భూమి ఉంది. నాలుగు ఎకరాల్లో వేరుశనగ, ఐదు ఎకరాల్లో పత్తి, మరో 9ఎకరాల్లో కంది పంటను జూన్ 10, 11తేదీల్లో సాగు చేశా. పంట సాగు చేసినప్పటి నుంచి ఇంతవరకు చిరుజల్లులే తప్పా భారీ వర్షం పడలేదు. వేరుశనగ, పత్తిసాగుకు ఎకరాకు రూ.15 వేల వరకు ఖర్చు పెట్టా. వర్షం లేక పంట ఎండిపోతుంటే గుండె తరుక్కుపోతోంది. అందువల్లే వేరుశనగ తొలగించేస్తున్నా. పత్తి ఎలాంటి ఎదుగుదల లేకపోవడంతో గొర్రెలకు మేపేశాం. వేరుశనగ పంటపై మందులు పిచికారీ చేయడంతో పశువుల మేతకు కూడా పనికి రాకుండా పోయింది. కష్టాల్లో ఉన్న మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలి.– రామకృష్ణ, అమకతాడు -
వర్షాకాల మృతులు 1,276
న్యూఢిల్లీ: ఈ సంవత్సరం వర్షాకాలంలో ఇప్పటివరకు వరదలు, కొండచరియలు విరిగిపడటం తదితర వర్ష సంబంధిత కారణాల వల్ల 8 రాష్ట్రాల్లో 1,276 మంది మృత్యువాత పడ్డారని, వారిలో అత్యధికంగా 443 మంది కేరళలోనే చనిపోయారని సోమవారం కేంద్ర హోంశాఖ ప్రకటించింది. కేరళలో 54.11 లక్షల మంది వరద బాధితులుగా మారారని, 47,727 వేల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని వెల్లడించింది. వరదల కారణంగా ఉత్తరప్రదేశ్‌లో 218, పశ్చిమబెంగాల్లో 198 మంది, కర్ణాటకలో 166, మహారాష్ట్రలో 139 మంది, గుజరాత్, అస్సాం, నాగాలాండ్‌ల్లో వరుసగా 52, 49, 11 మంది మరణించారని తెలిపింది. -
పంటతోపాటు ప్రాణం పోయింది
రాయికల్(జగిత్యాల): ప్రకృతి కన్నెర్రజేసింది. చేతికందే సమయంలో తాను సాగుచేసిన ఆరు ఎకరాల వరిపంట దెబ్బతినడంతో ఆ పంటను చూసిన మహిళారైతు గుండె ఆగిపోయింది. వివరాల్లోకి వెళ్తే... జగిత్యాల జిల్లా రాయికల్ మండలం తాట్లవాయి గ్రామంలోని లాల్నాయక్ తండాకు చెందిన మహిళా రైతు నునావత్ కైక (55) గ్రామంలోని ఆరు ఎకరాల పొలంలో వరిపంట సాగుచేసింది. మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన రాళ్లవాన కురవడంతో చేతికొచ్చిన పంట పూర్తిగా దెబ్బతినడంతో ఆ మహిళ రైతు గుండె తల్లడిల్లింది. ఏడుస్తూ ఇంటికి వచ్చి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన రాయికల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతిచెందింది. మృతురాలికి భర్త పర్శరాం, ఇద్దరు కూతుళ్లు, కొడుకులు ఉన్నారు. ఇటీవలే కొడుకు పెళ్లి కుదిరింది. వడగండ్ల వానతో పంటనష్టం రాయికల్ మండలం తాట్లవాయి ధర్మాజీపేట, కట్కాపూర్ గ్రామంలో మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం పడటంతో గ్రామంలోని వేలాది ఎకరాల్లో వరిపంటకు నష్టం జరిగింది. వరి చేలు నేలవాలగా, మామిడి కాయలు రాలిపోయాయి. తాట్లవాయి గ్రామంలో లావుడ్య కిషన్, భూక్యానాయక్, ధర్మాజీపేటలోని సురేశ్‌నాయక్ ఇళ్ల పైకప్పు లేచిపోవడంతో నిత్యావసర వస్తువులన్నీ కొట్టుకుపోయాయి. ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకునేలా చూడాలని గ్రామస్తులు, రైతులు కోరుతున్నారు. -
ఏం కష్టమొచ్చె దేవుడా..
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: అన్నదాతకు కొత్త కష్టం వచ్చి పడింది. ఆకస్మాత్తుగా కురుస్తున్న వడగండ్ల వర్షానికి చేతికొచ్చిన పంటలు నేలపాలవుతున్నాయి. నోటిదాకా వచ్చిన ముద్ద మట్టి పాలవుతోందనే బాధ ఒకవైపు... తడిసిన ధాన్యాన్ని తీసుకునేందుకు మార్కెటింగ్‌శాఖ ససేమిరా అనడం మరోవైపు.. ఇలా రెండు విధానాలుగా కష్టమే ఎదురుకావడంతో ఏం చేయాలో తోచన వరి సాగు చేసిన రైతులు విలవిల్లాడుతున్నారు. ఇటీవల వారం రోజులుగా కురుస్తున్న వడగండ్ల వానతో జిల్లాలో మూడో వంతు పంట నేలపాలైంది. ఇంత భారీ స్థాయిలో పంట నష్టం జరగడంతో బాధిత రైతుల పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. అధికారులు మాత్రం నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించడమే తమ బాధ్యత అని.. పరిహారానికి సంబంధించి తమకు సంబంధం లేదని స్పష్టం చేస్తున్నారు. ఇక తడిసిన ధాన్యాన్ని తీసుకునేందుకు మార్కెటింగ్ శాఖ అధికారులు నిరాకరిస్తుండడం అన్నదాతను ఆవేదనకుగురి చేస్తోంది. మొత్తంగా కాలం కాని కాలం.. వరుణుడి కన్నెర్రతో సమస్యల సుడిగుండలో చిక్కుకున్న పాలమూరు రైతన్నలు ఏం చేయాలో దిక్కుతోచక స్థితి ఎదుర్కొంటున్నాలు. నిబంధనల విషయంలో సడలింపు, నష్టపరిహారం పంపిణీలో ప్రభుత్వం నిర్ణయంతో కోసం కొండంత ఆశతో ఎదురుచూస్తున్నారు. మూడో వంతు నేలపాలు... క్యుములోనింబస్ మేఘాల కారణంగా ఇటీవల కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలో భారీగా పంట నష్టం వాటిల్లింది. జిల్లాలోని 26 మండలాలకు గాను 20 మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు సాగైన పంటలో దాదాపు మూడో వంతు పూర్తిగా నష్టపోయినట్లు వ్యవసాయ శాఖ గణాంకాలే పేర్కొంటున్నాయి. జిల్లాలో 46వేల ఎకరాల్లో వరి పంట సాగవగా.. ఇటీవలి వడగండ్ల వానకు 15,123 ఎకరాల్లో పంట పూర్తిగా దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. జిల్లాలోని మొత్తం 206 గ్రామాల్లో 8,428 మంది రైతులు పంట నష్టపోయినట్లు తేలింది. తద్వారా జిల్లా రైతాంగానికి రూ.8.16 కోట్ల పంట నష్టం వాటినట్లు అధికార గణాంకాలు చెబుతున్నాయి. జిల్లాలో అత్యధికంగా కోయిల్‌కొండ మండలంలో 2,699 ఎకరాలు, మద్దూరు మండలంలో 2,125 ఎకరాలు, గండేడ్ మండలంలో 2,054 ఎకరాల చొప్పున రైతులు పంట నష్టపోయారు. మార్కెట్‌కు వస్తున్న ధాన్యం యాసంగి సీజన్ సంబంధించి ధాన్యం ఇప్పుడిప్పుడే మార్కెట్ వస్తోంది. కోతలు పూర్తి చేసి ధాన్యాన్ని రైతులు మార్కెట్‌కు తరలిస్తున్నారు. అయితే అకస్మాత్తుగా కురుస్తున్న వర్షానికి చాలా వరకు కళ్లాల్లో ఉన్న ధాన్యం తడిసి ముద్దవుతోంది. కొన్నిచోట్ల ఎండిన ధాన్యాన్ని మార్కెట్‌కు తీసుకొచ్చినా అకాల వర్షాలతో తడిసిపోతుంది. దేవరకద్ర మార్కెట్‌కు సోమవారం తీసుకొచ్చిన ధాన్యం బస్తాలు వర్షానికి తడిసి ముద్దయ్యాయి. అప్పటికప్పుడు కవర్లు కప్పే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఫలితంగా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. మరోవైపు తడిసిన ధాన్యాన్ని తీసుకునేందుకు మార్కెటింగ్‌శాఖ అధికారులు ససేమిరా అంటున్నారు. నిబంధనల మేరకు తేమ 14శాతం కంటే తక్కువగా ఉండాలని, అంతకంటే ఎక్కువగా ఉంటే తీసుకునే ప్రసక్తే లేదని తేల్చిచెబుతున్నారు. అయితే జిల్లాలో ఇప్పటి వరకు 2,489 క్వింటాళ్ల హంస, 3,635 క్వింటాళ్ల సోనమసూరి రకం ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి రెండు ఎకరాల్లో వరి సాగు చేశాను. ఇందుకు గాను రూ. 40 వేల పెట్టుబడి పెట్టాను. వారం రోజుల నుంచి ఈదురు గాలులతో కూడిన వర్షం రావడంతో 50 శాతం ధాన్యం నేలరాలింది. దీంతో నాకు రూ. 80 వేల వరకు నష్టం వట్టిలింది. ఈ విషయాన్ని గమనించి తడిసిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వం కొనుగోలు చేసి మాలాంటి వారిని ఆదుకోవాలి. – టంకర్ శ్రీనివాస్, మరికల్ -
అప్పుల బాధతో ఆగిన రైతు గుండె
రాప్తాడు: వ్యవసాయం కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలోనని ఆందోళనకు గురైన రైతు గుండెపోటుతో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు.. రాప్తాడు మండలం పాలవాయి గ్రామానికి చెందిన రైతు హనుమంతు నాయక్ (67)కు నాలుగు ఎకరాల పొలం ఉంది. నాలుగైదేళ్లుగా వేరుశనగ సాగుచేసినా పంట చేతికందలేదు. వ్యవసాయ పెట్టుబడులతోపాటు ఇద్దరు కూతుళ్లు, కుమారుల వివాహాల కోసం బయటి వ్యక్తులతో అప్పులు చేశాడు. ఇటీవల పొలంలో నాలుగు బోర్లు వేయించి అరకొర నీటితోనే టమాట, బెండ, అనుము పంటలు సాగు చేసినా ఆశించినస్థాయిలో దిగుబడులు రాలేదు. భూగర్భజలాలు అడుగంటిపోవడంతో పంటలు ఎండుముఖం పట్టాయి. ఎలాగైనా పంటను కాపాడుకోవాలని మరో బోరు వేయించినా నీరు పడలేదు. ఈ క్రమంలో అప్పులు రూ.8లక్షలకు చేరుకున్నాయి. పెరిగిన రుణదాతల ఒత్తిళ్లు వరుస పంట నష్టాలతో కుదేలైన హనుమంతునాయక్‌కు రుణదాతల నుంచి ఒత్తిళ్లు పెరిగాయి. శనివారం రాత్రి కూడా రుణదాతలు ఇంటి దగ్గరకు వచ్చి అప్పు తీర్చాలని పట్టుబట్టారు. నాలుగైదు రోజుల్లో అప్పు తీర్చేస్తానని చెప్పి వారిని పంపించేశాడు. మానసిక వేదనకు గురైన రైతు ఆ పూట అన్నం కూడా తినకుండా అలాగే పడుకున్నాడు. అప్పులపై చర్చిస్తూ కుప్పకూలిపోయాడు వ్యవసాయం కలసిరాకపోవడం, అప్పులు పెరిగిపోవడంపై భార్య దస్లీబాయితో హనుమంతునాయక్ ఆదివారం మధ్యాహ్నం చర్చించాడు. తర్వాత భోజనం తినకుండానే ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. గ్రామస్తులతో అప్పుల విషయమై చర్చిస్తుండగా ఒక్కసారిగా గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచాడు. రైతు కుటుంబాన్ని ఆదుకోవాలి అప్పులబాధ తట్టుకోలేక గుండెపోటుకు గురై రైతు హనుమంతునాయక్ మృతిచెందిన విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పాలవాయి గ్రామాన్ని సందర్శించారు. మృతదేహాన్ని పరిశీలించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. రుణదాతల నుండి ఒత్తిళ్లు అధికం కావడంతోనే హనుమంతు నాయక్ మృతి చెందాడన్నారు. మృతుని కుటుంబానికి వెంటనే ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలన్నారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు. ఆయన వెంట జెడ్పీటీసీ సభ్యుడు వెన్నపూస రవీంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ బోయ రామాంజినేయులు, యూత్ మండల కన్వీనర్ చిట్రెడ్డి సత్య నారాయణరెడ్డి, నాయకులు రామచంద్రారెడ్డి, పోతన్న, పాలవాయి పుల్లయ్య, మురళినాయక్, గొవింద నాయక్ పాల్గొన్నారు. -
పంట నష్టంతో రైతు ఆత్మహత్య
పినపాక: ఈ నెల 4న కురిసిన వడగండ్ల వానతో వరి పంట పూర్తిగా దెబ్బతినడంతో అప్పులు తీర్చే మార్గం లేక ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం తోగ్గూడెంలో శని వారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బండ సమ్మిరెడ్డి(45) అప్పులు తెచ్చి వరిసాగు చేశాడు. పంట బాగానే పండినప్పటికీ అకాలవర్షంతో పంట పూర్తిగా దెబ్బతింది. దీంతో అప్పులు తీర్చలేననే మనోవేదనతో పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు భద్రాచలం ఆస్పత్రికి తరలిస్తుండగానే మృతి చెందాడు. -
ఏనుగుల దండయాత్ర...
సాక్షి, క్రిష్ణగిరి/ కెలమంగళం : పంట పొలాలపై పడి ధ్వంసంచేయడమే కాక అటవీ పరిసర గ్రామాలపై దాడిచేస్తూ ఏనుగుల గుంపు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. డెంకణీకోట సమీపంలోని నగనూరు అటవీ ప్రాంతంలో మకాం వేసిన 20 ఏనుగుల మంద పంటపొలాలపై దాడి చేసి ధ్వంసం చేస్తున్నాయి. రెండు నెలల క్రితం కర్ణాటక రాష్ట్రం బన్నేరుగట్ట అటవీ ప్రాంతం నుండి వచ్చిన ఏనుగులు గుంపులుగా విడిపోయి డెంకణీకోట సమీపంలోని బేవనత్తం, నగనూరు, అంచెట్టి, జవుళగిరి, తావరకెరె ప్రాంతాలలో మకాం వేశాయి. డెంకణీకోట సమీపంలోని తావరకెరె అటవీ ప్రాంతంలో మకాం వేసిన 20 ఏనుగుల మంద ఆదివారం రాత్రి నగనూరు, మరగట్ట, ఏణిముచ్చంద్రం, ఆలళ్లి, కురుబట్టి, సందనపల్లి తదితర ప్రాంతాల్లో సంచరిస్తూ రైతులు పండించిన రాగి కుప్పలను ధ్వంసం చేశాయి. అదేవిధంగా బేవనత్తం అటవీ ప్రాంతంలో మకాం వేసిన 30 ఏనుగులు ఊడేదుర్గం ప్రాంతంలో రైతుల పంటపొలాలను ధ్వంసం చేస్తున్నాయని అటవీ శాఖాధికార్లు చర్యలు చేపట్టి ఏనుగులను కర్ణాటక వైపు మళ్లించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే సూళగిరి సమీపంలో ఏనుగులు గ్రామాలకు చొరబడుతుండడంతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురౌతున్నారు. కొద్ది రోజుల క్రితం శ్యానమావు అటవీ ప్రాంతంలో మకాం వేసిన ఏనుగులను అటవీశాఖాధికార్లు డెంకణీకోట అటవీ ప్రాంతానికి మళ్లించారు. ఈ తరుణంలో మళ్లీ కొన్ని ఏనుగులు శ్యానమావు అటవీ ప్రాంతంలో మకాం వేసి పోడూరు, ఆళియాళం, గోపసంద్రం, తిరుమలపేట, రామాపురం, పాతకోట ప్రాంతాల్లో రైతుల పంటపొలాలను ధ్వంసం చేయడమే కాక గ్రామాలకు చొరబడుతుండడంతో ఆ ప్రాంత గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురౌతున్నారు. -
నష్టం అనంతం
అనంతపురం అగ్రికల్చర్: వరుణుడి ధాటికి పంటలు వర్షార్పణం అయ్యాయి. నష్టం కూడా ‘అనంతం’. నెలరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వ్యవసాయ, ఉద్యాన పంటలు భారీగా దెబ్బతిన్నాయి. పదేళ్ల తర్వాత ఈయేడు చేతికొస్తాయనుకుంటున్న పంటలు కళ్లెదుటే దెబ్బతింటుంటే రైతుకు కన్నీరే మిగులుతోంది. అధిక వర్షాలతో పంటనష్టపోయి విలవిల్లాడుతున్న రైతులను పరామర్శించి భరోసా కల్పించడంలో మంత్రులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగం విఫలమైంది. 20 రోజుల్లో 220 మి.మీ వర్షపాతం: సెప్టెంబర్ 25న మొదలైన వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. 20 రోజుల్లో ఏకంగా 220 మి.మీ వర్షపాతం నమోదయ్యింది. గతనెల 25న 6.3 మి.మీ, 26న 10 మి.మీ, 27న 3.7 మి.మీ, 28న 11.3 మి.మీ, 29న 10.5 మి.మీ, 30న 4.1 మి.మీ సగటు నమోదు కాగా... ఇక ఈ నెల ఒకటోతేదీ నుంచి వరుణుడు మరింత విరుచుకుపడ్డాడు. 2న 34.4 మి.మీ, 4న 11.9 మి.మీ, 5న 10.5 మి.మీ, 8న 13.8 మి.మీ, 9న 35 మి.మీ, 10న 14 మి.మీ, 12న 20 మి.మీ, 14న 14.6 మి.మీ వర్షపాతం నమోదైంది. 360 రోజుల వార్షిక వర్షపాతం 552 మి.మీ కాగా గత 20 రోజుల్లోనే 220 మి.మీ వర్షపాతం నమోదైంది. జూన్, జూలై ముగిసేనాటికి 32 శాతం లోటు వర్షపాతం నమోదైన జిల్లాలో సెప్టెంబర్, అక్టోబర్ వర్షాలకు ప్రస్తుతం 32 శాతం లోటు పూడ్చుకుని 33 శాతం అధికంగా వర్షపాతం నమోదు కావడం విశేషం. వేరుశనగ, పత్తి పంటలకు భారీ నష్టం: జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో వేరుశనగ, పత్తి పంటలకు భారీ నష్టం వాటిల్లింది. వరి, పెసర, ఆముదం పంటలకు కొంత నష్టం కలుగుతోంది. జూన్‌లో వేసిన 1.50 లక్షల ఎకరాల వేరుశనగ తొలగించడానికి సిద్ధంగా ఉండగా వర్షాలు పట్టుకోవడంతో ఇబ్బందిగా మారింది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 20 వేల ఎకరాల్లో పంట తొలగించడంతో పొలాల్లోనే కుళ్లిపోయింది. మిగతా ప్రాంతాల్లో కాయల నుంచి మొలకలు వస్తున్నాయి. వేరుశనగ రైతులకు రూ.250 కోట్లకు పైగా నష్టం వాటిల్లుతున్నట్లు అంచనా. అలాగే పామిడి, పెద్దవడుగూరు, గుత్తి, యల్లనూరు, పుట్లూరు, కనేకల్లు తదితర ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో పత్తి పంట నీటముని రూ.90 కోట్ల వరకు నష్టం జరిగే పరిస్థితి. ‘వరి’ంచని ఆశలు : బోరుబావుల కింద సాగు చేసిన వరి పంటలు కూడా వర్షానికి దెబ్బతిన్నాయి. వరి, ఇతర పంటలకు కూడా రూ.20 నుంచి రూ.30 కోట్ల వరకు నష్టం ఉంటుందని అంచనా. తాడిపత్రి, పుట్లూరు, యల్లనూరు, పామిడి, పెద్దపప్పూరు, గోరంట్ల, కనగానపల్లి, ధర్మవరం, తాడిమర్రి, బత్తలపల్లి తదితర 25 నుంచి 30 మండలాల పరిధిలో చీనీ, దానిమ్మ, ద్రాక్ష, అరటి, బొప్పాయి, ఆకుతోటలు, కళింగర, కర్భూజా, దోస, టమాట, వంగ, బెండ తదితర పంటలు 17 వేల నుంచి 20 వేల ఎకరాల్లో దెబ్బతినడంతో రైతులకు రూ.300 నుంచి రూ.320 కోట్ల వరకు నష్టం వాటిల్లే పరిస్థితి. ఇలా ఇప్పటివరకు జిల్లాలో పంట నష్టం రూ.700 కోట్ల వరకు ఉంటుందని లెక్కలు వేశారు. పత్తా లేని ప్రజాప్రతినిధులు: భారీ వర్షాలతో పంటలు వర్షార్పణమై రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నా ప్రజాప్రతినిధులు పత్తాలేకుండా పోయారు. పరామర్శకు వెళితే పరిహారం అడుగుతారని పాలకులు పొలాలవైపు తిరిగి చూడడం లేదు. అధికారులు కూడా మొక్కుబడిగా నష్టం అంచనాలు వేస్తున్నారు. దీంతో కచ్చితమైన పంటనష్టం లెక్కలు తేలడంలేదు. అపార నష్టం వాటిల్లినా తమ గ్రామాన్ని ఇప్పటికీ ఎవరూ సందర్శించలేదని పామిడి పక్కనే ఉన్న కొత్తపల్లి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా చాలా గ్రామాల్లో నష్టం వివరాలు సేకరించడంలో యంత్రాంగం ఘోరంగా విఫలమవుతున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యంపై రైతులు తమ ఆక్రోశాన్ని వెల్లగక్కుతున్నారు. ధర్మవరం డివిజన్లో కుంభవృష్టి అనంతపురం అగ్రికల్చర్: ధర్మవరం డివిజన్‌పై శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకువరణుడు తన ప్రతాపాన్ని చూపించాడు. తాడిమర్రి మండలంలో 111.6 మి.మీ కుండపోత నమోదైంది. బత్తలపల్లి 84.2 మి.మీ, నార్పల 66.2 మి.మీ, ధర్మవరం 64.7 మి.మీ, కంబదూరు 61.3 మి.మీ, రామగిరి 54.1 మి.మీ, మడకశిర 48.6 మి.మీ, సోమందేపల్లి 39.9 మి.మీ, చెన్నేకొత్తపల్లి 36.9 మి.మీ, పరిగి 35.4 మి.మీ, కనగానపల్లి 28.7 మి.మీ, రామగిరి 27.8 మి.మీ, రొద్దం 26.4 మి.మీ, కుందుర్పి 25.9 మి.మీ, యాడికి 14.7 మి.మీ, గుడిబండ 14.1 మి.మీ, అమడగూరు 12.9 మి.మీ, తాడిపత్రి 12.4 మి.మీ, రొళ్ల 11.7 మి.మీ, లేపాక్షి 10.4 మి.మీ వర్షం కురిసింది. కనేకల్లు, బొమ్మనహాల్ మినహా అన్ని మండలాల పరిధిలో 14.6 మి.మీ సగటు నమోదైంది. అక్టోబర్ నెల సాధారణ వర్షపాతం 110.7 మి.మీ కాగా ఇప్పటికే 172.3 మి.మీ నమోదైంది.జూన్ ఒకటి నుంచి ఇప్పటి వరకు 404 మి.మీ గానూ 33 శాతం అధికంగా 537.7 మి.మీ నమోదైంది. ఎడతెరపి లేని వర్షాలకు వాగులు, వంకలు, చెక్‌డ్యాంలు పొంగిపొర్లుతుండగా చాలా చెరువులు నిండి మరువలు పారాయి. వందలాది చెరువుల్లోకి భారీగా వర్షపు నీరు చేరంది. వేరుశనగ, పత్తి, వరి, పండ్లతోటలు, కూరగాయల పంటలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. -
ఇష్టారాజ్యం
- తప్పులతడకగా పంట నష్టం జాబితాలు – నిర్లక్ష్యంగా వ్యవహరించిన వ్యవసాయ, రెవెన్యూ అధికారులు – వేరుశనగ సాగు చేస్తే కందికి ఇన్పుట్ సబ్సిడీ – అధికార పార్టీ నేతల ఆధ్వర్యంలో జాబితాల తయారీ – గ్రామ పంచాయతీల్లో ప్రదర్శనకు పెట్టని వైనం కర్నూలు (అగ్రికల్చర్): – మంత్రాలయం మండలం రచ్చుమర్రిలో గత ఏడాది ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలు వర్షాభావం వల్ల పూర్తిగా దెబ్బతిన్నాయి. పెట్టుబడుల్లో 50శాతం కూడా దక్కలేదు. గ్రామ రైతుల్లో దాదాపు 70 శాతం మంది చిన్న, సన్న కారు రైతులే. అయితే.. పంట నష్టం వివరాల నమోదులో వీఆర్ఓ, ఏఈఓలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఐదెకరాలు ఉంటే పావు ఎకరా, మూడెకరాలు ఉన్న రైతుకు అరఎకరాలో పంట నష్టం వాటిల్లినట్లు నమోదు చేశారు. దీంతో వారికి రూ.500 నుంచి రూ.2వేల వరకు మాత్రమే ఇన్పుట్ సబ్సిడీ వచ్చింది. –వెల్దుర్తి మండలం బోగోలు గ్రామంలో వడ్డె రాముడికి 357/1 సర్వే నంబరులో 2.50 ఎకరాలు, 357/ఏ సర్వే నంబరులో 2.50 ఎకరాల భూమి ఉంది. గత ఖరీఫ్‌లో వేరుశనగ సాగు చేశారు. ఈ–క్రాప్ బుకింగ్‌లో వేరుశనగ అని నమోదైంది. అడంగల్‌లోనూ అదే పంటను పేర్కొన్నారు. కానీ ఇన్పుట్ సబ్సిడీకి మాత్రం ‘కంది పంట’ అని రాశారు. దీంతో రాముడు హెక్టారుకు రూ.5వేల ఇన్పుట్ సబ్సిడీని కోల్పోయారు. ‘మేము వేరుశనగ వేశాము కదా..! కంది పంటకు ఇన్పుట్ సబ్సిడీ వచ్చిందేమిట’ని అడిగితే.. పొరపాటు జరిగిందని, ఏమీ అనుకోవద్దని అధికారులు చెబుతున్నారు. ఖరీఫ్-2016లో సాగు చేసిన అన్ని పంటలు వర్షాభావం వల్ల దెబ్బతిన్నాయి. దీంతో ప్రభుత్వం జిల్లాలోని 36 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించింది. ఇందులో పది మండలాల్లో పంటల దిగుబడి బాగా ఉందంటూ నష్టం వివరాలను నమోదు చేయలేదు. 26 మండలాలకు ఇన్పుట్ సబ్సిడీ కింద రూ.325 కోట్లు ఇటీవల విడుదల చేసింది. ఈ మొత్తాన్ని ఏడీఏలకు విడుదల చేశారు. వారి నుంచి రైతులకు పంపిణీ చేస్తారు. కాగా.. పంట నష్టం వివరాల నమోదులో రెవెన్యూ, వ్యవసాయాధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. అధికారుల నిర్లక్ష్యంపై రైతుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఒకరు, ఇద్దరు కాదు.. వేలాది మంది రైతులకు అన్యాయం జరిగింది. కావలసిన వారికి పత్తి, వేరుశనగ వేసినట్లు రాసి హెక్టారుకు రూ.15వేలు ఇన్పుట్ సబ్సిడీ వచ్చేలా చూశారు. ఇతరులకు కొర్ర, కంది వంటి పంటలు చూపారు. దీనివల్ల వారికి తక్కువ మొత్తం వచ్చింది. పాత జాబితాలనే వినియోగించారు! ఇన్పుట్ సబ్సిడీ నమోదులో పాత జాబితాలతోనే మమ అనిపించినట్లు విమర్శలు వస్తున్నాయి. 2014లో 20 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించగా.. కేవలం ఆదోని రెవెన్యూ డివిజన్లోని దేవనకొండ, ఆలూరు, పత్తికొండ, చిప్పగిరి, తుగ్గలి మండలాల్లో మాత్రమే పంట నష్టం జరిగినట్లు నిర్ధారించారు. ఈ మండలాలకు రూ.73 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ విడుదలైంది. 2015, 2016లోనూ ఈ మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించారు. దీంతో ఇక్కడ 2014 కరువు జాబితాలనే 2015, 2016కు వినియోగించినట్లు విమర్శలున్నాయి. 2015లో ప్రభుత్వం జిల్లాలో 40 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించింది. అన్ని మండలాల్లో పంట నష్టం జరిగినట్లు నిర్ధారించింది. నష్టపోయిన రైతుల జాబితాలను తయారు చేసి ఇన్పుట్ సబ్సిడీకి ప్రతిపాదించారు. ఈ జాబితాలనే తిరిగి 2016లోనూ వినియోగించినట్లు తెలుస్తోంది. దీనివల్ల వేలాది మంది రైతులకు తీవ్ర అన్యాయం జరిగింది. నిబంధనలకు తూట్లు నిబంధనల ప్రకారం పంట నష్టంపై సర్వే పూర్తయి, జాబితాలు రూపొందించిన తర్వాత వాటిని గ్రామ పంచాయతీల్లో రైతుల పరిశీలనకు ఉంచాలి. అందులో పేర్లు లేకపోయినా, ఒక పంట సాగు చేసి ఉంటే మరో పంటను నమోదు చేసినా, విస్తీర్ణంలో తేడా ఉన్నా.. రైతులు అధికారులకు ఫిర్యాదు చేయొచ్చు. వాటిని పరిశీలించి.. తుదిజాబితాను రూపొందించి వ్యవసాయ సంయుక్త సంచాలకుడి(జేడీఏ)కి పంపాల్సి ఉంటుంది. కానీ ఏ గ్రామ పంచాయతీలోనూ రైతుల పరిశీలనకు జాబితాలు పెట్టిన ధాఖాలాలు లేవు. ప్రదర్శించి ఉంటే ఇప్పుడిన్ని ఫిర్యాదులు, ఆందోళనలు ఉండేవి కావు. అధికార పార్టీ నేతల సిఫారసు మేరకే.. హాలహర్వి పూర్తిగా కరువు మండలం. ఇక్కడ అధికార పార్టీ నేతలు ఇన్పుట్ సబ్సిడీ కోసం వారికి ఇష్టమైన వ్యక్తుల పేర్లు మాత్రమే నమోదు చేయించారు. నిజమైన రైతులకు తీవ్ర అన్యాయం చేశారు. చింతకుంట, శ్రీధర్‌హాల్, కామినహాల్, బిలేహాల్ గ్రామాల్లో అధికార పార్టీ నేతల ఆధ్వర్యంలోనే జాబితాలు రూపొందాయి. నిజమైన రైతులకు అన్యాయం జరగడంపై వీఆర్ఓ, తహసీల్దార్లను అడిగితే వ్యవసాయాధికారులపైన, వారిని అడిగితే రెవెన్యూ అధికారుల మీద చెబుతున్నారు. మొత్తమ్మీద అధికారుల తప్పిదాల వల్ల వేలాదిమంది రైతులు నష్టపోవాల్సి వస్తోంది. -
చూశారా చోద్యం !
► ఒక్క రూపాయే పంట నష్టపరిహారం ► రైతు ఖాతాలో జమ చేసిన సర్కార్ ► కంగుతిన్న రైతులు ► విరుచుకుపడిన శెట్టర్ తుమకూరు: పంట నష్టపరిహారాల చెల్లింపుల్లో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తుమకూరు, ధార్వాడ జిల్లాల రైతులకు శుక్రవారం గట్టి షాక్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తమ ఖాతాల్లో జమ చేసిన పంటనష్ట పరిహారం చూసి తుమకూరు గ్రామాంతర పరిధిలోని సిరివర గ్రామానికి చెందిన రైతులు అవాక్కయ్యారు. గ్రామానికి చెందిన శివరామయ్య తమకున్న 1.30 ఎకరాల్లో సాగు చేసిన పంట వర్షాభావంతో పూర్తిగా ఎండిపోవడంతో పంట నష్టపరిహారం కోసం అర్జీ పెట్టుకున్నారు. అందుకు స్పందించిన ప్రభుత్వం శివరామయ్యకు రూ.7 వేల పంటనష్ట పరిహారం అందించడానికి నిర్ణయించుకుంది. అందులో భాగంగా శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం శివరామయ్య బ్యాంకు ఖాతాలో పంటనష్ట పరిహారాన్ని జమ చేసింది. ఖాతాలో డబ్బు జమ అయినట్లు మెసేజ్ చూసుకున్న శివరామయ్య ఖాతాను పరిశీలించగా కేవలం ఒక రూపాయి (రూ.1)మాత్రమే జమ అయినట్లు తెలియడంతో హతాశుడయ్యాడు. ఇదే రీతిలో తురువేకెరె తాలూకా మావినహళ్లికి చెందిన మహిళా రైతు మంగళమ్మ ఖాతాలో కూడా పంటనష్ట పరిహారం కేవలం ఒక్క రూపాయి జమ కావడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ తరహా ఘటన తుమకూరులో మాత్రమే కాకుండా ధార్వాడ జిల్లాలో కూడా చోటు చేసుకుంది. జిల్లాలోని హారోబెళవడి గ్రామంలోని నంగనగౌడ, మానప్ప, రుద్రప్ప రైతుల ఖాతాల్లో కూడా పంట నష్టపరిహారంగా కేవలం ఒక్క రూపాయి మాత్రమే జమ చేయడంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే గ్రామానికి చెందిన మరికొంత మంది రైతులకు పంట నష్టపరిహారంగా రూ.100 నుంచి రూ.300 వరకు జమ చేసిన ఘటనలు వెలుగుచూసాయి. రైతుల ఖాతాల్లో ఒక్క రూపాయి జమ చేసిన ఘటనపై విధానసభ ప్రతిపక్ష నాయకుడు జగదీశ్‌శెట్టర్ శుక్రవారం శాసనమండలి సమావేశాల్లో జీరో అవర్‌లో ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడ్డారు. పంట నష్టపోయి ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతుల ఖాతాల్లోకి కేవలం ఒక్క రూపాయి మాత్రమే జమ చేయడం ద్వారా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో బహిర్గతమైందన్నారు. అందుకు న్యాయశాఖ మంత్రి టీ.బీ.జయచంద్ర స్పందిస్తూ ఈ ఘటన తమను కూడా దిగ్భ్రాంతికి గురి చేసిందని తగిన చర్యలు తీసుకుంటామన్నారు. -
ఇన్పుట్ సబ్సిడీ విడుదల
- 2014 సంవత్సరంలో పంట నష్టం - ఐదు మండలాలకు రూ.73,24,66,362 విడుదల కర్నూలు(అగ్రికల్చర్): 2014 సంవత్సరంలో ఎంపికైన కరువు మండలాలకు ఎట్టకేలకు ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అప్పట్లో 20 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించగా.. పత్తికొండ, చిప్పగిరి, తుగ్గలి, దేవనకొండ, ఆలూరు మండలాల్లో మాత్రమే పంట నష్టం జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. ఈ మండలాల్లో 82,058 మంది రైతులు 75,515.26 హెక్టార్లలో పంటలు కోల్పోయారు. వీరికి పెట్టుబడి రాయితీ చెల్లించేందుకు ప్రభుత్వం రూ.73,24,66,362 విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి ఈ పరిహారాన్ని గత ఏడాదే విడుదల చేయగా, ట్రెజరీలో బిల్లులు ల్యాప్స్ అయ్యాయి. ఇందువల్ల ప్రభుత్వం తాజాగా నిధులను విడుదల చేసింది. -
సమయమూ కరువేనా..
మొక్కుబడిగా సాగిన కేంద్ర బృందం పర్యటన మండలాల సంఖ్య కుదింపు పశ్చిమాన నామమాత్రంగా... ఆలస్యంగా ప్రారంభించి వడివడిగాముగించుకున్న వైనం జిల్లాలో కరువు పరిశీలనకు వచ్చిన కేంద్ర బృందం నిరాశ మిగిల్చింది. పంట నష్టంతో దిగాలు పడిన అన్న దాతకు బృందం పర్యటన తీరు భంగపాటు కలిగించింది. వచ్చాం.. వెళ్లాం.. అనే రీతిలో వీరి పర్యటన సాగడం విమర్శలకు దారితీసింది. సోమవారం ఆలస్యంగా ప్రారంభించి ఆదర బాదరాగా రెండు మూడు మండలాల్లో మొక్కుబడిగా తిరిగి పర్యటన అయ్యిందనిపించారు. కరువు కరాళ నృత్యం చేస్తున్న పశ్చిమ మండలాల్లో నామమాత్రంగా పర్యటించడం అక్కడి రైతాంగాన్ని బాధించింది. కరువు జాబితాలో లేని మండలాన్ని పర్యటించడం కొసమెరుపు. పర్యటించాల్సిన మండలాల షెడ్యూలును కూడా కుదించేసుకుంటూ బృందం వడివడిగా వైఎస్సార్ జిల్లాకు పయనమైపోయింది. చిత్తూరు (కలెక్టరేట్): జిల్లాలో నెలకొన్న కరువు పరిశీలనకు వచ్చిన కేంద్ర బృందం పర్యటన ఆదరాబాదరాగా సాగింది. సోమవారం ఉదయం నుంచి ప్రారంభం కావాల్సిన పర్యటన ఆఖరి నిముషంలో మార్పు చేశారు. దీంతో పలు మండలాల పర్యటనను రద్దుచేసి, నామమాత్రపు పరిశీలనకు శ్రీకారం చుట్టారు. కరువు ఎక్కువగా ఉన్న పడమటి మండలాల్లో పొద్దుపోయాక తిరిగామనిపించారు. ఆదివారమే తిరుమలకు చేరుకున్న బృందం సోమవారం చెన్నై నుంచి వచ్చినట్లు భ్రమింపజేశారు. ముందస్తుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సోమవారం ఉదయం 9.45 గంటలకు చిన్నగొట్టిగల్లు నుంచి బృందం పర్యటన సాగాలి. సాయంత్రం 4 గంటల వరకు 9 మండలాల్లో కరువును పరిశీలించాల్సి ఉంది. అయితే ఆది వారం మధ్యాహ్నం జిల్లాకు వచ్చిన అధికారుల బృందం నేరుగా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళింది. సోమవారం ఉదయం ఆఖరి నిమిషంలో షెడ్యూల్‌ను బాగా కుదిం చేసింది. దీంతో ఈ బృందం మధ్యాహ్నానికి తూర్పుప్రాంతంలోని వరదయ్యపాళెం మండలంలో పర్యటించి తిరుపతికి చేరుకుంది. అక్కడి నుంచి సాయంత్రం 4 గంటలకు చిన్నగొట్టిగల్లు మండలం చేరుకుని అక్కడి పరిస్థితులను చూసింది. తరువాత రొంపిచెర్ల , పీలేరు మండలం వద్దకు చేరుకునే సమయానికే పొద్దుపోయింది. అక్కడ నుంచి కలికిరి, కలకడ మండలాలకు వెళ్లింది. చీకట్లో తూతూ మంత్రంగా పర్యటన చేపట్టి వైఎస్సార్ జిల్లాకు వెళ్లిపోయింది. కరువు బృందం ఆదివారం మధ్యాహ్నానికే తిరుమలకు చేరుకున్న విషయం సోమవారం అన్ని పత్రికల్లో ప్రముఖంగా వార్తలు ప్రచురితమయ్యాయి. ఈ బృందం తిరుమల నుంచి నేరుగా నెల్లూరు జిల్లా తడకు చేరుకుంది. అక్కడి నుంచి మధ్యాహ్నానికి చిత్తూరు జిల్లాకు చేరుకున్న ఈ బృందం చెన్నై నుంచి వచ్చినట్లు చెప్పుకోవడం గమనార్హం. జిల్లాలో కరువు తాండవిస్తున్న పడమటి మండలాల్లో కరువు బృందం పర్యటించాల్సి ఉంది. ఇందుకోసం చిన్నగొట్టిగల్లు నుంచి కలకడ వరకు 9 మండలాల్లో పర్యటించే విధంగా షెడ్యూల్ రూపొందించింది. సోమవారం ఉదయం హడావుడిగా షెడ్యూల్‌ను తమకు అనుకూలంగా మార్చుకున్న బృందం కరువు లేని తూర్పు ప్రాంతాల్లోని వరదయ్యపాళెం మండలంలో పర్యటించడం విస్మయం కలిగించింది. తిరుపతిలో ఫొటో ఎగ్జిబిషన్ చూసి సాయంత్రం కరవు పర్యటనకు శ్రీకారం చుట్టింది. సమయం తక్కువగా ఉండటంతో మార్గం మధ్యలోని నాలుగు మండలాలను మాత్రం పరిశీలించకుండా వైఎస్ఆర్ జిల్లాకు వెళ్లిపోయింది. తమ ప్రాంతాలకు కరువు బృందం వస్తుంది... అంచనాలు వేస్తుంది... తమకేదో లాభం చేకూర్చుతుందని భావించి ఆశగా ఎదురుచూసిన కురబలకోట, మదనపల్లె ప్రాంత రైతులకు నిరాశే మిగిలింది. ఆఖరు నిమిషంలో బృందం తమ మండలాలకు రావడం లేదని తెలియడంతో రైతులు నిరుత్సాహపడ్డారు. బృందం పర్యటించిన మండలాల రైతులు కూడా ఉదయం నుంచి పొద్దుపోయేంత వరకు పొలాల్లోనే పడిగాపులు కాశారు. తరువాత చీకట్లో వెళ్లిన బృందం గ్రామాల్లోని రైతులతో పలకరించి వెళ్లిపోయింది. కరువు విలయతాండం రొంపిచెర్ల(పుంగనూరు): రొంపిచెర్ల మండలంలో తీవ్ర వర్షాభావంతో దెబ్బతిన్న పంటలను సోమవారం కేంద్ర కరువు బృందం పరిశీలించింది. బొమ్మయ్యగారిపల్లె పంచాయతీ పెద్దకురవపల్లెకు సమీపంలోని వ్యవసాయ పొలాలను పరిశీలించి రైతులను విచారించింది. ఐదేళ్లుగా కరువు విలయ తాండవం చేస్తోందని రైతులు అధికారులకు తెలిపారు. పశువులకు గ్రాసం కూడా లేదనీ, చెరువులు ఎండిపోవడంతో పశువులకు తాగునీరు కూడా దొరకడం లేదని వివరించారు. ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమని చెప్పారు. వెయ్యి అడుగులు డ్రిల్చేసినా నీరు లేదు కలికిరి(పీలేరు): వెయ్యి అడుగుల లోతు కంటే ఎక్కువగా బోర్లు డ్రిల్ చేసినా నీరు పడడం లేదని కలికిరి మండల ప్రజలు కరువు బృందానికి తెలిపారు. మేడికుర్తి పంచాయతీలోని సుల్తాన్ చెరువును సోమవారం సాయంత్రం కేంద్ర బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా హంద్రీ–నీవా జలాలను ఈ ప్రాంతానికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని రైతులు విన్నవించారు. రుణాలు మాఫీ చేయండి వరదయ్యపాళెం (సత్యవేడు): ఇటు వరాభావ పరిస్థితులు.. అటు చెరువులకు చేరని తెలుగు గంగ నీటితో రెండేళ్లుగా పంటలు చేతికందలేదని వరదయ్యపాళెం మండల రైతులు కేంద్ర కరువు బృందానికి తెలిపారు. కేంద్ర బృందం సోమవారం ఉదయం మండలంలోని కడూరులో పర్యటించింది. ఈ సందర్భంగా తమకు వ్యవసాయరుణాలు పూర్తిస్థాయిలో మాఫీ చేసి కొత్త రుణాలు అందజేయాలని రైతాంగం మొరపెట్టుకుంది. తిరుపతిలో ఫోటో ప్రదర్శన పరిశీలన తిరుపతి (అలిపిరి) : జిల్లాలో కరువు పరిస్థితులపై తిరుపతి ఆర్ అండ్ బీ అతిథి అతిథి గృహంలో ఏర్పాటుచేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను సోమవారం ఉదయం కేంద్ర బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా కరువు మండలాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఎటువంటి చర్యలు తీసుకున్నారని జిల్లా అధికారులను ప్రశ్నించింది. -
గుండ్రేవుల రైతుల ధర్నా
కర్నూలు(న్యూసిటీ): సి.బెళగల్ మండలం గుండ్రేవుల పరిధిలో 2015-16వ సంవత్సర పంట నష్టానికి సంబంధించి పరిహారం ఇవ్వాలని గ్రామ రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం సర్పంచు భర్త యోహాన్, రైతులు బి.లింగన్న, బి.తిమ్మప్ప తదితరులు కలెక్టరేట్‌కు తరలివచ్చి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరుతడి పొలాలు, బీడు, వంకలకు పరిహారం మంజూరు చేసిన అధికారులు నిజంగా పంటలు సాగు చేసి నష్టపోయిన రైతులకు మాత్రం అన్యాయం చేశారని ఆరోపించారు. వీఆర్ఏ, వీఆర్వో, తహసీల్దార్, మండల వ్యవసాయాధికారి మామూళ్లు తీసుకుని తప్పుడు నివేదికలు ఇచ్చారని, వాటి ప్రకారమే పరిహారం మంజూరైందన్నారు. కలెక్టర్ స్పందించి అర్హులైన రైతులకు న్యాయం చేయాలని కోరారు. ధర్నాలో రైతులు జి.నగేష్, చిన్నరాముడు, బి.చిన్నబడేసాహెబ్, బి.రాముడు, బి.కమల్, పెద్ద మారెప్ప, కురువ రంగన్న తదితరులు పాల్గొన్నారు. -
ఆశలు ఆవిరి
- రబీనీ దెబ్బతీసిన వరుణుడు - కనీస వర్షపాతం కూడా నమోదుకాని వైనం - భారీగా పడిపోయిన సాగు విస్తీర్ణం - బీళ్లుగా మారిన పొలాలు - దిక్కుతోచని స్థితిలో రైతన్న అనంతపురం అగ్రికల్చర్: ఖరీఫ్‌ను అల్లకల్లోలం చేసిన వరుణుడు రబీ వ్యవసాయాన్ని కూడా అతలాకుతలం చేశాడు. రబీపై రైతన్న పెట్టుకున్న కాస్తో కూస్తో ఆశలను ఆవిరి చేసేశాడు. అక్టోబర్ నుంచి ప్రారంభమైన ఈ రబీలో అన్ని పంటలు కలిపి 1,30,965 హెక్టార్లలో సాగులోకి రావాల్సి ఉండగా, ప్రస్తుతానికి కేవలం 28 వేల హెక్టార్లకు పరిమితం కావడం విశేషం. ఖరీఫ్‌కు సంబంధించి జూ¯ŒS నుంచి సెప్టెంబర్ వరకు 338.4 మి.మీ గానూ 257.3 మి.మీ వర్షపాతం నమోదు కావడంతో 6.70 లక్షల హెక్టార్లలో వేసిన ఖరీఫ్ పంటలు దారుణంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. జూన్, జూలై మినహా కీలకమైన ఆగస్టు, సెప్టెంబర్‌లో వర్షంజాడ లేకపోవడంతో పంటలన్నీ ఎండిపోవడంతో రైతులకు రూ.కోట్ల నష్టం వాటిల్లింది. మొత్తమ్మీద 492.7 మి.మీ గానూ 283.8 మి.మీ వర్షపాతం నమోదైంది. 42.4 శాతం లోటు వర్షపాతం నమోదు కావడంతో ఖరీఫ్, రబీ ఆశలు గల్లంతయ్యాయి. రబీ పరిస్థితి ఇలా రబీ సాగుకు కీలకమైన అక్టోబర్‌లో వర్షాలు కురవకపోవడంతో 78 వేల హెక్టార్ల విస్తీర్ణంలో సాగులోకి రావాల్సిన ప్రధాన పంట పప్పుశెనగ 18,800 హెక్టార్లకు పరిమితమైంది. అరకొర తేమలో వేయడం వల్ల వేసిన పప్పుశెనగ నుంచి దిగుబడులు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మరో ప్రధాన పంట వేరుశనగ 20 వేల హెక్టార్లలో సాగవుతుందని అంచనా వేయగా, ఇప్పటివరకు 4,500 హెక్టార్లు మాత్రమే సాగులో ఉంది. విత్తు సమయం ముగిసిపోవడంతో వేరుశనగ పంట కూడా సగం కన్నా తక్కువగానే రావచ్చని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. 10 వేల హెక్టార్లలో వరి సాగులోకి రావాల్సి ఉంగా ఇంకా 800 హెక్టార్లలో ఉంది. జొన్న 6,672 హెక్టార్లకు గానూ 1,750 హెక్టార్లు, మొక్కజొన్న 5926 హెక్టార్లకు గానూ 800 హెక్టార్లు, పొద్దుతిరుగుడు 4,673 హెక్టార్లకు గానూ 300 హెక్టార్లు, ఉలవ 3,855 హెక్టార్లకు గానూ 60 హెక్టార్ల విస్తీర్ణంలో సాగులోకి వచ్చాయి. ప్రస్తుతానికి 25 శాతం విస్తీర్ణంలో పంటలు వేయగా ఇంకా 75 శాతం విస్తీర్ణం ఖాళీగానే దర్శనమిస్తోంది. రబీకి సంబంధించి అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు 155.5 మి.మీ వర్షం కురవాల్సి ఉండగా కేవలం 26.4 మి.మీ మాత్రమే నమోదు కావడం వర్షాభావ తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థమం చేసుకోవచ్చు. అది కూడా ఇటీవల సంభవించిన తుఫాను వల్ల సాధ్యమైంది. కాగా గతేడాది రబీ సీజన్లో 1.26 లక్షల హెక్టార్లలో రబీ పంటలు వేశారు. ఈ సారి మాత్రం అందులో సగం కూడా సాగులోకి రాలేదు. -
నష్టం అంచనాకు కేంద్ర బృందం
తెనాలి: భారీ వర్షాలకు కలిగిన నష్టం అంచనాకు కేంద్రం బృందం త్వరలోనే వస్తుందని, తగిన నివేదిక ఇచ్చిన వెంటనే తప్పక ఆదుకొంటామని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు చెప్పారు. ఇక్కడి చావాస్ గ్రాండ్లో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఆత్మీయ సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ప్రస్తుతం ప్రకృతి విపత్తు నిధులు రూ.300 కోట్లు అందుబాటులో ఉన్నాయని, వాటిని ముందు వినియోగిస్తూ తర్వాత మిగతా నిధులు కేటాయించుకోవచ్చని చెప్పారు. ప్రాథమిక అంచనా ప్రకారం నష్టం రూ.1142 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర రాజధాని కోసం డ్రాఫ్ట్ ప్రాజెక్టు రిపోర్టు లేదన్న అభ్యంతరాలను ఖాతరు చేయకుండా విజయవాడ, గుంటూరులో కొన్ని పథకాల కోసం రూ.1000 కోట్లను మంజూరు చేయించినట్టు వెంకయ్యనాయుడు వెల్లడించారు. గన్నవరం– విజయవాడ– అమరావతి మధ్య మెట్రో రైలు, గుంటూరు– అమరావతి మధ్య షటిల్ రైలు సర్వీసులు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. రాజధానికి 168 కిలోమీటర్ల ఔటర్ రింగురోడ్డును కేంద్రమే నిర్మిస్తుందని తెలిపారు. తాగునీరు, మురుగునీటి పథకాలకూ నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యడ్లపాటి రఘునాథబాబు అధ్యక్షత వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ కేవలం 18 నెలల్లోనే కేంద్రం 8 ఉన్నత విద్యా సంస్థల్ని 13 జిల్లాల్లో ఏర్పాటుకు వేల కోట్ల రూపాయల్ని మంజూరు చేసిందన్నారు. అనంతరం తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్, రాజ్యసభ మాజీ సభ్యుడు యడ్లపాటి వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమ, బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు దారా సాంబయ్య, టి.అనంతాచార్యులు, డాక్టర్ పి.దక్షిణామూర్తి, దిలీప్‌రాజా మాట్లాడారు. వేదికపై మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, డాక్టర్ కామినేని శ్రీనివాస్, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, అనగాని సత్యప్రసాద్, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ రావి రవీంద్రనాథ్ ఉన్నారు. -
నివేదికలు సిద్ధం చేయండి
పంట నష్టం అంచనాలు సత్వరమే రూపొందించాలి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం రెడీగా ఉంది వ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బంది అప్రమత్తం కావాలి జెడ్పీ సర్వసభ్య సమావేశంలో డిప్యూటీ సీఎం కడియం హన్మకొండ : జిల్లాలో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు జరిగిన పంట నష్టంపై అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి నివేదిక పంపాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో మంగళవారం జెడ్పీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. వర్షాలతో జరిగిన పంట నష్టాలను పలువురు ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో కడియం మాట్లాడుతూ.. వర్షాలు, వరుదలతో నష్టపోయిన పంటల వివరాలపై అంచనాలు రూపొందించాలని రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. వ్యవసాయ యాంత్రీకరణలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోందన్నారు. పంట నష్టం నివేదికల్లో ఎక్కడైనా అక్రమాలు జరిగితే కలెక్టర్ దృష్టికి తీసుకురావాలన్నారు. అవి నిరూపణ అయితే త్రీమెన్ కమిటీ సభ్యులపై చర్య తీసుకోవాలని ఆదేశించారు. రైతులకు నిబంధనల మేరకే ట్రాక్టర్లు ఇస్తున్నామని, గ్రూపులకే ఇవ్వాలనేది ఎక్కడా లేదని అన్నారు. అయితే గ్రూపులకు ఇస్తే చాలా మందికి లబ్ధి చేకూరే అవకాశం ఉన్నందున, అలాంటి వారికి ఇస్తే బాగుంటుందని సూచించారు. రైతులకు వ్యవసాయ పనిముట్లను ప్రభుత్వం రాయితీపై అందిస్తోందని, అవి అర్హులకే అందేలా అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. ఎంపిక చేసిన రైతుల జాబితాలు మండల కార్యాలయాల్లోని నోటీసు బోర్డుపై పెట్టాలని సూచించారు. జిల్లాలో 5550 చెరువులుండగా 3663 చెరువులు పూర్తిగా, 1400 చెరువులు 70 శాతం పైగా నిండాయని వివరించారు. 450 చెరువుల్లో 50 శాతం కంటే తక్కువ నీరు చేరిందన్నారు. దీంతో రబీలో సాగు విస్తీర్ణం పెరుగనుందని, ఈ మేరకు వ్యవసాయ అధికారులు ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. రాష్ట్రంలో రబీలో కోటి ఎకరాలు సాగు కావచ్చన్నారు. శ్రీరాంసాగర్, ఎల్ఎండీ రిజర్వాయర్లు నిండాయని, పాకాల, లక్నవరంలో నీరు పూర్తి స్థాయిలో ఉందని, రామప్ప చెరువులోకి దేవాదుల ద్వారా గోదావరి నీటిని పంపింగ్ చేస్తున్నామని చెప్పారు. జిల్లాలో గతంలో కంటే ఆస్పత్రుల పరిస్థితి మెరుగుపడిందన్నారు. భారీ వర్షాలు కురిసిన క్రమంలో అంటు వ్యా«ధులు ప్రబలే ప్రమాదం ఉందని, వైద్యులు అందుబాటులో ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రధానంగా ఎజెన్సీలో డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. డాక్టర్ల కొరత లేకుండా కాంట్రాక్ట్ లేదా ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయాలని ప్రభుత్వం ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. జిల్లాలో వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని పంచాయతీరాజ్ అధికారులను అదేశించారు. జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ మాట్లాడుతూ హరితహారం కార్యక్రమంలో జిల్లాలో 4.41 కోట్ల మొక్కలు నాటామన్నారు. రాష్ట్రంలో వరంగల్ జిల్లా ప్రథమ స్థానంలో ఉందన్నారు. 4 కోట్ల లక్ష్యం కాగా లక్ష్యాన్ని అధిగమించి రాష్ట్రంలో వరుసగా రెండవసారి ప్రథమ స్థానంలో నిలిచామన్నారు. పీహెచ్సీలో ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
28 వేల హెక్టార్లలో పంట నష్టం
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వరదల వల్ల ఏడుగురు మృతిచెందారని కలెక్టర్ యోగితారాణా తెలిపారు. 28 వేల హెక్టార్లలో పంట నష్టం జరిగిందన్నారు. 10 పునరావాస కేంద్రాల్లో 1100 మందికి ఆశ్రయం కల్పించామని చెప్పారు. 4వేల ఇళ్లు పాక్షికంగా, 530 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయినట్టు ఆమె వెల్లడించారు. జియో సర్వే ద్వారా పంట నష్టం అంచనా వేస్తామని యోగితారాణా అన్నారు. -
చెరుకు రైతు బతుకు చేదు
రోగాలతో నిలువునా ఎండిపోతున్న చెరుకు పంట లబోదిబోమంటున్న అన్నదాతలు పెద్దేముల్: రెండు నెలల దాటితే పంటలు చేతికి వచ్చే సమయంలో చెరుకు పంటకు రోగాలు వచ్చి నిలువునా ఎండిపోతున్నాయి. దీంతో రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని 33 గ్రామాల్లో రైతులు సుమారు రెండు వేల ఎకరాలకు పైగా చెరుకు పంటను సాగుచేశారు. డిసెంబర్, జనవరి మాసంలో రైతులు చెరుకు పంటను సాగు చేయగా, రెండు నెలలు దాటితే పంటలు చేతికి వస్తాయి. ఇదే సమయంలో చెరుకు వేర్లకు లద్దె పురుగు సోకి పంటను నిలువునా తినేయడంతో చెరుకు పంట పాడవుతోది. దీంతో కౌలు రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఎకరా పొలంలో సుమారు 25 వేల నుంచి 30 వేల వరకు ఖర్చు పెట్టి.. చెరుకు పంటలు సాగు చేస్తే పంటలు చేతికొచ్చే సమయంలో నిలువునా ఎండిపొవడంతో రైతులు అప్పుల ఊడిలో కూరుకుపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది నుంచి ఈ వ్యాధులు సోకి రైతులు అప్పుల పాలవుతున్నా ఏ అధికారీ తమను పట్టించుకోవడం లేదని, కనీసం సూచనలు ఇచ్చే వారు కూడా కరువయ్యారని పలు గ్రామాల రైతులు అంటున్నారు. ఏ ప్రభుత్వాలు వచ్చినా రైతులు రాతలు మాత్రం ఎవరూ మార్చలేదని అంటున్నారు. ఇప్పటికైనా వ్యవసాయ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి చెరుకు పంటలకు ఎందుకు రోగాలు వస్తున్నాయి.. దాని నివారణకు ఏఏ మందులు వాడాలనే విషయాలను రైతులకు అందజేయాలని కోరుతున్నారు. -
కోకో తోటలో మంటలు
రాయన్నపాలెం (పెదవేగి రూరల్): పెదవేగి మండలం రాయన్నపాలెంలో విద్యుదాఘాతంతో కోకో తోటలు మంటలు చెలరేగాయి. ఎకరన్నర పొలం కాలిబూడిదయ్యింది. అగ్నిమాపక సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. రాయన్నపాలెం గ్రామానికి చెందిన కూచిపూడి వెంకట భాస్కరరావు కోకో పొలం మీదుగా 11 కేవీ విద్యుత్ తీగల లైన్ ఉంది. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో విద్యుత్ తీగల నుంచి నిప్పులు చెలరేగి మంటలు వ్యాపించాయి. దీంతో కోకో చెట్లు కాలిపోయాయి. స్థానికులు, ఏలూరు అగ్నిమాపక సిబ్బంది రక్షణ చర్యలు చేపట్టినా ఫలితం లేదు. ప్రమాదంలో రూ.25 వేలు విలువైన డ్రిప్పులు, రూ.75 వేల పంట నష్టం వాటిల్లినట్టు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. మంటలను వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది నియంత్రించారు. -
పరిహారమా.. పరిహాసమా..
గత ఏడాది వరద నష్టంపై ఇప్పటికీ అందని సాయం పంట నష్టం అంచనాలకే పరిమితం ఏడు నెలలుగా రైతుల ఎదురుచూపు గత ఏడాది నవంబరులో కురిసిన భారీ వ ర్షానికి పంటలు కోల్పోయిన జిల్లా రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించడంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. అట్టహాసంగా పంటల నష్టాన్ని అంచనాలు వేసిన ప్రభుత్వం, పరిహారం చెల్లించడంలో రైతులకు ఏడు నెలలుగా మొండిచేయి చూపుతోంది. ముంపునకు గురైన పంటలకు సంబంధించిన రైతులు నష్టపరిహారం అందుతుందని నెలల తరబడి ఎదురుచూసి నిరాశ నిస్పృహలకు గురవుతున్నారు. చిత్తూరు (అగ్రికల్చర్) దశాబ్ద కాలంగా వరుస కరువులతో జిల్లావాసులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఈ తరుణంలో జిల్లా వ్యాప్తంగా గత నవంబర్‌లో అనుకోని రీతిలో భారీ వర్షం కురిసింది. నవంబర్‌లో సాధారణ వర్షపాతం 164.1 మిల్లీమీటర్లు. గత ఏడాది నవంబర్‌లో అత్యధికంగా 650.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ భారీ వర్షంతో 5,593 హెక్టార్ల మేరకు పంటలు ముంపునకు గురయ్యాయి. రైతులకు రూ. 11.78 కోట్ల మేరకు నష్టం కలిగినట్లు అధికారులు అంచనా వేశారు. అందులో ఉద్యాన పంటలు 3,164 హెక్టార్లు దెబ్బతినగా, రూ. 4.78 కోట్లు నష్టం వాటిల్లింది. ఇతర పంటలు 2,429 హెక్టార్ల మేరకు ముంపునకు గురికాగా రూ. 7 కోట్లు నష్టం సంభవించింది. ఇందులో వరి 1,790 హెక్టార్లు, వేరుశనగ పంట 167 హెక్టార్లు, ఇతర పంటలు 472 హెక్టార్లు ముంపునకు గురయ్యాయి. నెలలు గడుస్తున్నా అందని పరిహారం జిల్లాలో భారీ వర్షాలకు పంటలు దెబ్బతిని నెల లు గడుస్తున్నా రైతులకు ప్రభుత్వం నష్టపరి హారం చెల్లించక కాలయాపన చేస్తోంది. నష్టపోయిన పంటలను కేంద్ర ప్రభుత్వ బృందం కూ డా జిల్లాకు విచ్చేసి పరిశీలించి అంచనా వేసింది. పంటలకు పరిహారాన్ని రైతులకు అందించడాన్ని మాత్రం మరచిపోయింది. పరిహారం అందకపోవడంతో రైతులు రోజురోజుకూ ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారు. ఓ పక్క చేతికందే దశలో పంటలను వర్షాల కారణంగా కోల్పోవడం, మరో పక్క వర్షం కురవడంతో కొత్త పంటలకు పెట్టుబడులు కూడా పెట్టలేక సతమతమయ్యారు. రబీలో పంటల సాగుకు రైతులకు బ్యాంకుల్లో అప్పులు పుట్టకపోగా, ప్రైవేటు వ్యక్తుల వద్ద అధిక వడ్డీలకు రుణాలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. ఇప్పటికైనా పరిహారం అందితే ఈ ఖరీప్ సీజనుకైనా ఆశించిన మేరకు అప్పులు చేయకుండా పంటలను సాగుచేసుకోవచ్చని రైతులు భావిస్తున్నారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుచూస్తుంటే ముంపునకు గురైన పంటలకు నష్టపరిహారాన్ని అందించే పరిస్థితులు ఏమాత్రం కానరావడం లేదు. ఇప్పటి వరకు పైసా వుుట్టలేదు నాకు ఐదు ఎకరాల పొలం ఉంది. పొలం పైభాగంలో వెళుతున్న తెలుగుగంగ కాలువకు వుూడుచోట్ల గండ్లు పడ్డారుు. వెరుు్య ఎకరాల పంట నీట వుునిగింది. 300 ఎకరాలకు ఇసుక దిబ్బలు కట్టారుు. దానిలో నా భూమి ఐదు ఎకరాలు మొదట్లోనే ఉంది. వుంత్రులతోపాటు స్థానిక నాయుకులు, అధికారులు పదేపదే పరిశీలన చేస్తే న్యాయుం జరుగుతుందని భావించాం. నెలలు గడిచిపోతున్నా పైసా కూడా అందలేదు. -ఈశ్వరయ్యు, చిన్నకనపర్తి గ్రావుం, తొట్టంబేడు వుండలం ప్రభుత్వం నుంచి పరిహారం రాలేదు నవంబరులో కురిన భారీ వర్షాలకు దె బ్బతిన్న పంటలకు నష్టపరిహారం అంచాలు వేసి ప్రభుత్వానికి పంపాం. వాటికి సంబందించిన నష్టపరిహారం ప్రభుత్వం నుంచి ఇంతవరకు రాలేదు. -విజయ్‌కుమార్, వ్యవసాయశాఖ జేడీ -
పైపులైను లీకేజి..ఎకరాల్లో పంటనష్టం
-
కౌలు రైతుకు కష్టం
గుర్తింపు కార్డుల జారీలో జాప్యం రుణాలు పొందడంలో ఇబ్బందులు పంట నష్టపోతే అంతే.. చొరవ చూపించని అధికారులు రూపాయి అప్పు ఇవ్వలే... ఆరేళ్ల సంది కౌలుకు చేత్తన్న. ఆరెకరాల్లో పత్తి, వరి సాగుచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. వానదేవుడు కనికరించక, వడగళ్లతో పంటలు నష్టపోయిన. ప్రతి సీజన్‌కూ అప్పులు చేసి పంటలను సాగుచేత్తున్నం. రైతు రాసిచ్చిన కౌలు కాయితం, పట్టా బుక్కులు చూసి మూడేళ్ల కిందట కౌలుకార్డు ఇచ్చిండ్రు. గిప్పటి వరకు కార్డు ఉందే తప్ప, బ్యాంకోళ్లు రూపాయి అప్పు ఇవ్వలేదు. పోయినేడు పెట్టుబడుల మందం పైసలు వచ్చినయి. గిప్పుడు చేతిలో చిల్లిగవ్వలేదు. ప్రైవేట్‌లో రూ.20వేలు అప్పుతెచ్చి నాలుగున్నరెకరాల్లో వరి, ఎకరంన్నరలో పత్తి పెట్టా. తెలంగాణ ప్రభుత్వమైనా కౌలుకార్డు ఇచ్చి ఆదుకోవాలి. - పిట్టల నర్సయ్య, కౌలురైతు, గోపాల్‌నగర్, బచ్చన్నపేట సాక్షి, హన్మకొండ : బ్యాంకు రుణాలు పొందడం, పంట నష్ట పరిహారం అందుకోవడంలో కౌలు రైతుల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం 2011 సంవత్సరంలో కౌలు రైతుల అర్హత గుర్తింపు కార్డులు అందుబాటులోకి తెచ్చింది. ఈ కార్డులు కలిగిన కౌలు రైతు లు భూమి యజమాని అంగీకారం తో నిమిత్తం లేకుండా బ్యాంకు రుణాల మంజూరు, రాయితీపై ఎరువులు, ఠమొదటిపేజీ తరువాయి విత్తనాలు పొందవచ్చు. అదేవిధంగా ప్రకృతి విపత్తులతో పంట నష్టపోయిన సందర్భాల్లో ప్రభుత్వ సాయం పొందేందుకు ఓ సాధనంగా ఉపయోగపడు తుంది. ఒక ఏడాదిపాటు భూమిని కౌలుకు తీసుకున్న రైతులకు ఈ రుణ అర్హత కార్డులు జారీ చేయాలి. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే మార్చిలో గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియను మొదలుపెట్టి జూన్ 15వ తేదీ వరకు కౌలు రైతులకు ఈ పట్టాలు అందివ్వాలి. ఈ బాధ్యతను క్షేత్రస్థాయిలో వీఆర్వో, డిప్యూటీ తహసీల్దార్లు నిర్వహించాల్సి ఉంది. ప్రభుత్వ నిర్లక్ష్యం 2011 సంవత్సరం తొలినాళ్లలో రుణ అర్హత కార్డులకు అనూహ్య స్పందన లభించింది. జిల్లాలో 1.20 లక్షల మంది కౌలు రైతులు ఉండగా 30 వేల మంది కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు మంజూరయ్యూరుు. ఈ అర్హత కార్డులు పొందిన రైతులు రుణసాయం కోసం బ్యాంకులకు వెళ్తె భూమి యజమాని నుంచి అంగీకార పత్రం తీసుకురావాల్సిందిగా అధికారులు కొర్రీలు వేశారు. దీనితో సమస్య మొదటికి వచ్చింది. బ్యాంకు అధికారులు, కౌలు రైతులకు మధ్య నెలకొన్న సందేహాలను తీర్చేందుకు జిల్లా అధికారులు చొరవ చూపలేదు. తొలి ఏడాది కేవలం నాలుగు శాతం రైతులకే రుణాలు అందాయి. ఫలితంగా రైతులు ఈ కార్డులను తీసుకోవడంపై అనాసక్తి చూపారు. 2014లో ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో రుణ అర్హత కార్డులు జారీ చేయలేదు. ఎన్నికలు ముగియడం, కొత్త రాష్ట్రం, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రుణ అర్హత కార్డుల జారీలో జాప్యం జరిగింది. ఫిబ్రవరిలో మొదలు కావాల్సిన ప్రక్రియ జూన్‌లో ప్రారంభమైంది. దానితో ఈ ఖరీఫ్‌కి కౌలు రైతుల రుణఅర్హత కార్డుల జారీ అందని ద్రాక్షగానే మిగిలింది. ఈ విషయంలో బ్యాంకు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నారుు. ఇప్పటికైనా తెలంగాణ సర్కారు రుణ అర్హత కార్డులు మంజూరు చేయూలని రైతులు కోరుతున్నారు. రాయితీలు అందించాలి.. నేను ఎంకాం వరకు చదువుకున్నా. దుగ్గొండి మండలం రాజుతండాలో నాలుగేళ్లు గా భూమిని కౌలుకు తీసుకుని సాగుచేస్తున్నా. మూడెకరాల భూమికి రూ.48 వేలు చెల్లించా. ప్రభుత్వం కౌలు రైతులకు రుణాలిస్తామంటూ గతంలో రెండు సార్లు కౌలు గుర్తింపు కార్డులు ఇచ్చింది. నేటికి రూపాయి రుణం అందలేదు. రెండేళ్ల క్రితం అధిక వర్షాలతో పంట నాశనమైంది. పోయినేడాది పంట నష్టం ఇచ్చింది. కానీ.. నష్టపరిహారం అందలేదు. ఆపై ఆ పరిహారాన్ని అసలు రైతులకే ఇచ్చారు. గతేడాది పంటలు గిట్టుబాటు కాక రూ. లక్ష నష్టం వచ్చింది. ప్రభుత్వం సాయం చేసింది శూన్యం. ఇప్పటికైనా ప్రభుత్వం కౌలు రైతులకు రుణాలతోపాటు పంట నష్టపరిహారం, రాయితీలు అందేలా చూడాలి. - బానోతు శ్రీనివాస్, దుగ్గొండి -
భారీ నష్టం మిగులుస్తున్న అకాల వర్షాలు
నెల్లూరు : అకాల వర్షాలతో అన్నదాతకు ఇక్కట్లు తప్పడం లేదు. వేసవిలో వరుణుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఆదివారం ఆంధ్రపదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో మండల పరధిలోని పలు గ్రామాల్లో ఉన్న నిమ్మ, అరటి, బొప్పాయి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మండలంలోని కాకివాయి, వాగిలేరు, మడిచర్ల తదితర గ్రామాల్లో పెద్ద సంఖ్యలో చెట్లు నేలకొరగడంతో పాటు పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ధర్మవరంలో వడగళ్ల వాన: అనంతపురం జిల్లా ధర్మవరంలో ఆదివారం కురిసిన వడగళ్ల వాన అన్నదాతకు తీవ్ర నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఈ వడగళ్ల వానతో మండలంలోని పలు గ్రామాల్లో ఇళ్లు, పండ్లతోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అంతేకాకుండా మండల పరిధిలోని పోతుకుంట వద్ద ఉన్న 2హెచ్‌టీ విద్యుత్ టవర్ కూలడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. -
'నష్టపోయిన రైతులకు.. రెట్టింపు పరిహారం'
కరీంనగర్: పంట నష్టపోయిన రైతులకు గతంలో కంటే రెట్టింపు పరిహారం చెల్లించి ఆదుకుంటామని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ హామీ ఇచ్చారు. బుధవారం ఆయన కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల డివిజన్లో పంట నష్టాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ విలేకరులతో మాట్లాడుతూ.. గతంలో ఉన్న నిబంధనలను కేంద్రం సడలించినట్టు చెప్పారు. అలాగే 30శాతం పంట నష్టాపోయిన రైతులకు కొత్త నిబంధనల ప్రకారం పరిహారం చెల్లించాలని రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని దత్తాత్రేయ కోరారు. -
48 గంటల్లో అంచనా వేయండి
అకాల వర్షాల వల్ల పంటలకు ఎంత నష్టం వాటిల్లిందో 48 గంటల్లో అంచనా వేయించాలని, రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని తెలంగాణ అసెంబ్లీ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కుందూరు జానారెడ్డి డిమాండ్ చేశారు. గాంధీభవన్‌లో మంగళవారం నాడు అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అకాల వర్షాలకు తెలంగాణలో 70 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, నష్టపోయిన రైతులకు తెలంగాణ సర్కారు వెంటనే పరిహారం చెల్లించాలని ఆయన అన్నారు. ఇప్పటికే వర్షాభావంతో పంట దిగుబడి లేక, పంటలు గిట్టుబాటు కాక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఇప్పుడీ అకాల వర్షాలు మరింతగా రైతులను ముంచేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం 33 శాతం తడిసినా కూడా మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం అమలుచేయాలని జానారెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జానాతో పాటు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య, డి.శ్రీనివాస్, జాతీయ నేతలు భట్టీ, కుంతియా తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణలోవర్షాలు రైతులకు తీవ్ర నష్టం
-
తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు రైతులకు తీవ్ర నష్టం
తెలంగాణ వ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వర్షం కారణంగా వాణిజ్యపంటలతో పాటూ కూరగాయలు, పండ్ల తోటలకు కూడా నష్టం వాటిల్లింది. పిందె దశలో ఉన్న మామిడి తోటలు కూడా దెబ్బతిన్నాయి. కాగా భారీ వర్షం కారణంగా జిల్లాలోని పలు రోడ్లపై నీరు నిలిచి రాక పోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ , నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అకాల వర్షాలు తీవ్రం ప్రభావం చూపాయి. దాదాపు 50 వేల హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు అంచనా. కోట్లలో ఆస్తి నష్టం ఉండే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. నల్లగొండ- నల్లగొండ, సూర్యాపేట్, నకిరేకల్, ఆలేరు, మిర్యాలగూడలో కురిసిన భారీ వర్షంతో వేల ఎకరాల్లో పంట నీట మునిగింది. మార్కెట్, ఐకేపీ కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యం తడిసి ముద్దయింది. కరీంనగర్- అకాల వర్షం, వడగండ్ల వానతో 20 వేల హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లింది. 13 వేల హెక్టార్లలో వాణిజ్యపంటలు, 7 వేల హెక్టార్లలో వరి, మొక్కజొన్న, పప్పు దినుసు పంటలకుక నష్టం కలిగింది. ఈ వర్షాలకి 50 వేల కోళ్లు మృతి చెందాయి. జగిత్యాల డివిజన్లో రైతులకు అపార నష్టం వాటిల్లింది. పంట నష్టం అంచనా వేయడంలో అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా చల్గల్ వద్ద జాతీయ రహదారి పై రైతులు రాస్తారోకోకి దిగారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పంటలకు నష్ట పరిహారం ప్రకటించాలని రైతులు కోరుతున్నారు. -
ఆరు ఎకరాల్లో అరటి బుగ్గి
పులివెందుల : వైఎస్సార్ జిల్లా పులివెందుల మండలం బ్రాహ్మణపల్లెలో చోటు చేసుకున్న అగ్నిప్రమాదం వల్ల ఆరెకరాల్లోని అరటి పంట పూర్తిగా దగ్ధమైంది. వివరాల్లోకి వెళ్తే... బ్రాహ్మణపల్లె గ్రామంలోని రైతు మల్‌రెడ్డికి చెందిన అరటి తోటలో సోమవారం మధ్యాహ్నం విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు రూ.10 లక్షల మేర ఆస్తినష్టం జరిగినట్లుగా తెలుస్తోంది. సంఘటనా స్థలాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, పులివెందుల మునిసిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ వైఎస్ మనోహర్‌రెడ్డి సందర్శించారు. -
భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలు
మెదక్ : మెదక్ జిల్లాలో కురిసిన అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆదివారం రాత్రి మెదక్ జిల్లాలోని జహీరాబాద్, కోహీర్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లో కురిసిన భారీ వర్షంతో.. సాగులో ఉన్న జొన్న, మొక్కజొన్న పంటలు కొంత మేర దెబ్బతిన్నాయి. జహీరాబాద్ మండలంలో 2.7 సెం.మీ, కోహీర్ మండలంలో 7.6 సెం.మీ, ఝరాసంగం మండలంలో 6.2 సెం.మీ, న్యాల్కల్ మండలంలో 7.7 సెం.మీ వర్షం కురిసింది. వర్షం కారణంగా కూరగాయలు, పండ్ల తోటలకు కూడా కొంత మేర నష్టం వాటిల్లింది. పిందె దశలో ఉన్న మామిడి తోటలు కూడా దెబ్బతిన్నాయి. కాగా భారీ వర్షం కారణంగా జహీరాబాద్ పట్టణంలోని పలు రోడ్లపై నీరు నిలిచి రాక పోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రభుత్వం వెంటనే స్పందించి పంటలకు నష్ట పరిహారం ప్రకటించాలని రైతులు కోరుతున్నారు. -
ఆదుకోని రబీ
సాక్షి, సంగారెడ్డి: అకాల వర్షాలతో రబీ పంటల భవితవ్యం దినదినగండంగా మారింది. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో పంట నష్టం రోజురోజుకు పెరిగిపోతోంది. పంటలు కోల్పోయి అన్నదాతలు దుఃఖంలో మునిగిపోయారు. గత నెల 27 నుంచి జిల్లా అంతటా భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తుండటంతో మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, వరి, గోధుమ, జొన్న, మినుము పంటలతో పాటు కూరగాయలు, మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. తాజాగా జిల్లాలో పంట నష్టం 3,632 హెక్టార్లకు ఎగబాకింది. దీంతో దిగుబడి రూపంలో రైతులు రూ.11.71 కోట్ల ఆదాయాన్ని కోల్పోవాల్సి వచ్చింది. పంట నష్టంపై సమగ్ర సర్వే జరిపి మరో వారం రోజుల్లో ప్రభుత్వానికి తుది అంచనా నివేదిక పంపించాలని కలెక్టర్ స్మితా సబర్వాల్ అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉండగా..ప్రభుత్వం తక్షణమే పెట్టుబడి రాయితీని విడుదల చేసి ఆదుకోవాలని బాధిత రైతులు, రైతు సంఘాలు కోరుతున్నాయి. రబీపై ‘అకాల’ దెబ్బ రబీ సాధారణ విస్తీర్ణం 1.56 లక్షల హెక్టార్లని వ్యవసాయ శాఖ అంచనా వేయగా ఏకంగా 1.76 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. గతేడాది భారీ వర్షాలు కురవడంతో భూగర్భ జలాలు పెరగడంతో రబీ సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది. నెల రోజులు గడిస్తే పంటలు చేతికందనుండగా అకాల వర్షాలు అనూహ్యంగా దెబ్బతీశాయి. వరి సాధారణ సాగు 44,407 హెక్టార్లయితే రైతులు 65,263 హెక్టార్లలో పంట వేశారు. అదే విధంగా 20,029 హెక్టార్లలో చెరకు సాగైంది. నెల రోజులుగా విద్యుత్ కోతలు తీవ్రం కావడంతో పంటలు క్రమంగా క్షీణిస్తున్న దశలో వర్షాలు ఆదుకుని కొంత వరకు ప్రాణం పోశాయి. అయితే, వడగళ్ల బీభత్సవానికి వందల ఎకరాల్లో వరి, చెరకు పంటలు సైతం ధ్వంసమయ్యాయి. 26,975 హెక్టార్లలో సాగైన మొక్కజొన్న, 10,149 హెక్టార్లలో సాగు చేసిన పొద్దుతిరుగుడు పంటలపై మాత్రం అకాల వర్షాలు దెబ్బతీస్తున్నాయి. మొక్కజొన్న పంట కంకు, పొద్దుతిరుగుడు పంటలు పువ్వూ ఏర్పడే దశలో ఉన్నాయి. పది రోజులుగా కురుస్తున్న వార్షిలకు వందల ఎకరాల్లో మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, శనగ పంటలు దెబ్బతిన్నాయి. పొంచి ఉన్న తెగుళ్లు ఏకధాటిగా వర్షాలు కురుస్తుండడంతో పంటలకు తెగుళ్లు సోకే ప్రమాదముంది. గాలిలో తేమతో పాటు తక్కువ ఉష్ణోగ్రతల కారణంగా మొక్కజొన్న, జొన్న, పొద్దుతిరుగుడు, వరి పంటలకు చీడపీడలు ఆశించే అవకాశాలున్నాయి. చేలల్లో వర్షపు నీళ్లు నిల్వ ఉండనీయకుండా ఎప్పటికప్పుడు తొలగించాలని సంగారెడ్డిలోని ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. తెగుళ్ల నివారణ కోసం ఈ రసాయన మందులను నీటిలో కలిపి పిచికారి చేయాలని పలు రకాల మందులను సిఫారసు చేస్తున్నారు. మొక్కజొన్న పంటలకు ఆకుమచ్చ, తలకుళ్లు తెగుళ్లు ఆశించే అవకాశముంది. ఆకుమచ్చ తెగుళ్ల నివారణ కోసం లీటర్ నీటిలో జినెట్ 2 గ్రాములు లేదా మంకోజిట్ 3 గ్రాములు కలిపి పిచికారి చేయాలి. అదే విధంగా తలకుళ్లు తెగుళ్ల నివారణ కోసం లీటర్ నీటిలో సెంథియాన్ ఒక మిల్లీలీటర్ లేదా నీటిలో కరిగే గందకం 3 గ్రామాలు కలిపి పిచికారి చేయాలి. జొన్న పంటకు సోకే తేనె బంక తెగుళ్లు నివారణకోసం లీటర్ నీటిలో గ్రాము భావిష్టిన్ లేదా 2.5 గ్రాముల మాంకోజెట్ కలిపి వారం రోజుల్లో రెండు సార్లు పిచికారి చేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. -
చివరిలో చినుకుపోటు
డోన్, న్యూస్‌లైన్ : చివరి దశలో ఉన్న పంటలపై అకాల వర్షం ప్రతాపం చూపి రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. ప్రధానంగా మామిడి, అరటి, వరి, మిరప పంటలకు నష్టం తీవ్రత అధికంగా ఉంది. డోన్ డివిజన్లో శనివారం రాత్రి సంభవించిన గాలి, వాన కారణంగా జలదుర్గం, కొమ్మెమర్రి, కన్నపుకుంట, ఊటకొండ, ఎంబాయి, కొత్తకోట తదితర గ్రామాల పరిధిలో సాగు చేసిన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కోటి రూపాయల వరకు నష్టం జరిగినట్లు అంచన. వరి, అరటి పంట నేలవాలగా మామిడి చెట్లపై పూత, పిందె రాలిపోయింది. గాలి కారణంగా గుడిసెల పైకప్పులు లేచిపోయాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ఫలితంగా ఆయా గ్రామాలు అంధకారంలో మగ్గిపోయాయి. కరెంటు లేకపోవడంతో ఆయా గ్రామాల వాసులు నీటి సమస్యను ఎదుర్కొన్నారు. గాలుల కారణంగా 40ఎకరాల్లో అరటి పంట నాశనమైంది. మరో పది, పదిహేను రోజుల్లో కోత కోసేందుకు సిద్ధంగా ఉన్న పంట నేలవాలడంతో సుమారు రూ.20లక్షలు నష్టపోయినట్లు జీవనమూర్తి అనే రైతు వాపోయాడు. డోన్,వెల్దుర్తి, ప్యాపిలి మండలాల పరిధిలో మామిడి పంటకు అపార నష్టం జరిగినట్లు బాధిత రైతులు తెలిపారు. అన్నదాతకు తీవ్ర నష్టం కొలిమిగుండ్ల : అకాల వర్షం అన్నదాతను నిండా ముంచింది. మండల పరిధిలోని కోటపాడు, నందిపాడు, నాగిశెట్టిపల్లె, బి.ప్పులూరు తదితర గ్రామాల్లో కల్లాల్లో ఎండబోసిన మిరప కాయలు తడిసిపోవడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. తడి సిన కారణంగా మిరప కాయలు రంగు మారి ధర ఎక్కువగా పలకవని రైతులు ఆందోళన చెందుతున్నారు. అలాగే మండల పరిధిలో సాగు చేసిన ఉల్లి పంట పుప్పోడి కట్టే సమయంలో వర్షం రావడంతో నష్టం జరిగింది. అలాగే పెనుగాలి కారణంగా పెట్నికోటలోని రెండు నాపరాళ్ల పాలీష్ ప్యాక్టరీలకు చెందిన రేకుల షెడ్లు ఎగిరిపోయాయి. బెలుం సమీపంలో రెండు విద్యుత్ స్తంభాలు పడిపోగా కొలిమిగుండ్ల రామసుబ్బారెడ్డి ఆసుపత్రి ఆవరణలో రెండు వృక్షాలు నేలకూలాయి. -
వర్ష బీభత్సం
సాక్షి, సంగారెడ్డి: అకాల వర్షం బీభత్సాన్ని సృష్టించింది. రబీపై రైతులు పెట్టుకున్న ఆశలను వమ్ము చేసింది. గత మూడు రోజులుగా కురుస్తోన్న గాలివానకు జిల్లాలో భారీ విస్తీర్ణంలో పంటలు ధ్వంసమయ్యాయి. ఈదురు గాలుల ఉధృతికి వందల ఎకరాల్లో మొక్కజొన్న, పొద్దుతిరుగుడు మొక్కలు నేలకు ఒరిగాయి. మామిడి పూతలు, పిందెలు నేలరాలాయి. పంట నష్టంపై జిల్లా వ్యవసాయ శాఖ ఏ రోజుకారోజు అంచనా వేస్తోంది. వ్యవసాయ అధికారుల ప్రాథమిక అంచనాల ప్రకారం.. శుక్రవారం ఒక్క రోజే జిల్లాలో 350 హెక్టార్లలో పంటలు దెబ్బతినగా, శనివారం కురిసిన వర్షానికి మరో 63 హెక్టార్ల విస్తీర్ణంలో నష్టం వాటిల్లింది. ఆదివారం సాయంత్రం కుండపోతగా వర్షం కురవడంతో నష్టం మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఆదివారం నాటి నష్టంపై సోమవారం అధికారిక లెక్కలు వెల్లడికానున్నాయి. -
ముంచుకొస్తున్న కరువు
సింగపూర్: భారత్‌కు మళ్లీ కరువు ముప్పు ముంచుకొస్తోంది. దేశంలో గత నాలుగేళ్లుగా వర్షాలను సమృద్ధిగా కురిపించిన రుతుపవనాలు ముఖం చాటేయనున్నాయి. ఈ ఏడాది నుంచి మళ్లీ వర్షాభావంతో పంటలపై తీవ్ర ప్రభావం పడనుంది. వరి, గోధుమ, చెరకు ఉత్పత్తిలో రెండోస్థానంలో ఉన్న భారత్ ఆ పంటల దిగుబడులు తగ్గి కరువును ఎదుర్కోనుంది. పసిఫిక్ మహా సముద్రంలో మళ్లీ ఉష్ణోగ్రతలు పెరిగి ‘ఎల్ నినో’ వాతావరణ పరిస్థితులు ఏర్పడనుండటమే ఈ గడ్డు కాలానికి కారణం కానుంది. ఈ ఏడాది రెండో సగం నుంచి ఎల్ నినో పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని ఈ మేరకు ఆస్ట్రేలియాకు చెందిన ‘బ్యూరో ఆఫ్ మెటియరాలజీ’, అమెరికాకు చెందిన ‘యూఎస్ క్లైమేట్ ప్రిడిక్షన్ సెంటర్’ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఈ ఎల్ నినోతో భారత్‌తోపాటు ఇతర ఆసియా దేశాలు, ఆస్ట్రేలియా తీర ప్రాంతాలు, ఆఫ్రికాలోనూ తీవ్ర కరువు ఏర్పడనుంది. అదే సమయంలో అమెరికాలోని కాలిఫోర్నియా, తదితర ప్రాంతాలు, బ్రెజిల్ దేశాలను భారీ వర్షాలు ముంచెత్తనున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ ఎల్ నినో తీవ్రతపై వాదనలు కొనసాగుతున్నాయని, దీనిని తీవ్రమైనదిగా నిర్ధారిస్తే గనక.. ప్రపంచవ్యాప్తంగా ఆహార కొరత ఏర్పడి వివిధ సరుకుల ధరలు కూడా నింగినంటుతాయని అంటున్నారు. ఇంతకుముందు 2009లో ఏర్పడిన ఎల్ నినో వల్ల.. భారత్‌లోని పలు ప్రాంతాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా నాలుగు దశాబ్దాల్లోనే అతిపెద్ద కరువును దేశం చవిచూడాల్సి వచ్చింది. చక్కెర ధరలు సైతం 30 ఏళ్లలో అత్యధికంగా పెరిగాయి. 1990లలో తీవ్ర ఎల్ నినో వల్ల ఏర్పడిన కరువుకు వివిధ దేశాల్లో 2 వేల మంది మృత్యువాతపడ్డారు. వందల కోట్ల డాలర్ల నష్టం సంభవించింది. ప్రస్తుత ఎల్ నినో వల్ల థాయిలాండ్, ఇండోనేసియా, వియత్నాం, ఫిలిప్పీన్స్, చైనా దేశాల్లో వరి, కాఫీ, మొక్కజొన్న పంటలు కరువుతో ఎండిపోనున్నాయి. వరదలు రావడం లేదా రవాణాకు ఆటంకం కలగడం వల్ల బంగారం, నికెల్, టిన్, కాపర్ (రాగి), బొగ్గు వంటి ఖనిజాల ధరలూ భారీగా పెరిగే అవకాశమూ ఉంది. ఎల్ నినో.. ‘బ్యాడ్’బోయ్! స్పానిష్ భాషలో ఎల్ నినో అంటే బాలుడు అని అర్థం. పసిఫిక్ మహా సముద్రం ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా పెరగడం వల్ల ఏర్పడే వాతావరణ పరిస్థితినే ఎల్ నినోగా పిలుస్తారు. ఇది ప్రతి 4 నుంచి 12 ఏళ్లకు ఒకసారి ఏర్పడుతుంది. ఈ ప్రక్రియ ఎల్ నినో-దక్షిణ డోలనం అనే సహజ వాతావరణ వలయంలో భాగంగా జరుగుతుంది. ఎల్ నినో వల్ల రుతుపవనాలు ప్రభావితమై ఆయా దేశాల్లో తీవ్ర కరువు ఏర్పడే ముప్పు ఉంటుంది కాబట్టి.. దీనిని బ్యాడ్ బోయ్‌గా అభివర్ణిస్తారు. ఇది ముఖ్యంగా మనదేశంలో నైరుతి రుతుపవనాలపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది. అలాగే సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే భారీగా తగ్గి.. ఎల్ నినోకు వ్యతిరేక ంగా ఏర్పడే వాతావరణ పరిస్థితిని ‘లా నినా’(స్పానిష్‌లో లిటిల్ గర్ల్)గా పిలుస్తారు. దీని వల్ల అమెరికా, తదితర చోట్ల కరువు ఏర్పడుతుంది. భారత్, ఆస్ట్రేలియా, తదితర దేశాల్లో మాత్రం భారీ వర్షాలు కురుస్తాయి. -
నష్టం లెక్క తేలింది
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్: రబీ సీజన్ ఆరంభంలోనే భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటల నష్టం అంచనాలను వ్యవసాయ, రెవెన్యూ అధికారులు ఎట్టకేలకు తేల్చారు. ఖరీఫ్ పూర్తయి రబీ ప్రారంభంలోనే పై-లీన్ తుఫాన్ వచ్చింది. ఆ వెంటనే అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాలు జిల్లాలోని 39 మండలాల్లో వేసిన పంటలను ముంచేశాయి. దీంతో దెబ్బతిన్న పంటల నష్టం అంచనాలు పూర్తిచేసి మొత్తం రూ 22 కోట్లుగా లెక్క తేల్చారు. పర్చూరు, చీరాల, దర్శి, అద్దంకి, మార్టూరు వ్యవసాయ సబ్డివిజన్లతో పాటు మరికొన్ని మండలాల్లో పంట నష్టం జరిగింది. అధికారులు మొత్తం 37,977 మంది రైతులు సుమారు 23 వేల ఎకరాల్లో పంట నష్టపోయినట్లు తేల్చారు. ఎక్కువగా వరి, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. ప్రధానంగా వరి 7133 హెక్టార్లలో, పత్తి 12,900 హెక్టార్లలో, పొగాకు 1387 హెక్టార్లలో, అలసంద 729 హెక్టార్లలో, మొక్కజొన్న 311 హెక్టార్లలో దెబ్బతిన్నట్లు తేల్చారు. వాటితో పాటు సజ్జ, వేరుశనగ, కందులు, మినుము, పొద్దుతిరుగుడు, నువ్వులు, ఆముదం పంటలు కూడా అక్కడక్కడా దెబ్బతిన్నట్లు అంచనాల్లో చూపించారు. 2010 సంవత్సరం నుంచి మొత్తం 8 సార్లు జరిగిన విపత్తులకు రైతులకు నష్టపరిహారం రావాల్సి ఉంది. నాలుగేళ్లవుతున్నా అంచనాలు ప్రభుత్వానికి చేరాయే కానీ రైతుకు చిల్లిగవ్వ కూడా విదల్చలేదు. ఆ పాత పంట నష్టం బకాయిలు రూ 47.14 కోట్లు ఇంకా ఇవ్వాల్సి ఉంది. ఇవి కాక అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాల నష్టం రూ 22 కోట్లతో కలుపుకొని మొత్తం రూ 69.14 కోట్లు పంట నష్ట పరిహారం రైతులకు అందాల్సి ఉంది. మొత్తం బాధిత రైతులు లక్షా 63 వేల 53 మంది ఉన్నారు. 2010 నవంబర్‌లో వచ్చిన జల్ తుఫాన్‌కు జరిగిన నష్టానికి సంబంధించి ఇంకా 106 మంది రైతులకు రూ 3.58 లక్షలు రావాల్సి ఉంది. 2011లో వచ్చిన కరువు వల్ల 3,505 మంది రైతులకు రూ 1.04 కోట్ల పరిహారం ఇంకా అందలేదు. 2011 ఫిబ్రవరిలో వచ్చిన తుఫాన్ వల్ల నష్టపోయిన 28 మంది రైతులకు రూ 2.13 లక్షలు అందాల్సి ఉంది. 2011 ఏప్రిల్‌లో వచ్చిన కరువుకు 382 మంది రైతులు నష్టపోయిన పంటల పరిహారం రూ 11.47 లక్షలు ఇంకా అందలేదు. 2011 డిసెంబర్ ఆఖరివారంలో వచ్చిన థానే తుఫాన్‌కు 7,992 మంది రైతులు రూ 2.37 కోట్లు నష్టపోయారు. 2011-12లో వచ్చిన కరువు వల్ల జిల్లాలో 8,912 మంది రైతులు నష్టపోగా, నష్టం అంచనాలు రూ 21.24 కోట్లుగా తేల్చారు. 2012 జనవరిలో వచ్చిన భారీ వర్షాలకు 69,034 మంది రైతులు పంటలు నష్టపోగా..రూ 20.32 కోట్ల నష్టం వాటిల్లింది. 2013 ఫిబ్రవరిలో వచ్చిన భారీ వర్షాలకు 2,240 మంది రైతులు రూ 1.33 కోట్ల మేర పంటలు నష్టపోయారు. అయితే 2012 నవంబర్‌లో వచ్చిన నీలం తుఫాన్‌కు నష్టపోయిన రైతులకు కొంత మందికి నష్టపరిహారమిచ్చారు. ఇంకా 1315 మంది రైతులకు రూ 65.63 లక్షలు ఇవ్వాల్సి ఉంది. -
పంట నష్టం రూ.29 కోట్లు
సాక్షి, విశాఖపట్నం : అల్పపీడనం ప్రభావంతో పంటనష్టం తుది నివేదికను శుక్రవారం సాయంత్రం వ్యవసాయశాఖాధికారులు కలెక్టర్‌కు అందజేశారు. ఈ ఏడాది అక్టోబర్‌లో జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు 14,923 హెక్టార్లలో సుమారు రూ.29 కోట్లు నష్టం వాటిల్లినట్టు ఎట్టకేలకు తేల్చారు. ఇందుకు 59,387 మంది రైతులకు రూ.13.85కోట్లు ఇన్‌ఫుట్ సబ్సిడీ చెల్లించాలని అందులో పేర్కొన్నారు. ఇంకా తొమ్మిది మండలాల్లో ఒకటి రెండు పంచాయతీల్లో లెక్కింపు పూర్తికాకపోవడంతో స్వల్ప మార్పులుండొచ్చని తెలిపారు. దీనిని కలెక్టర్ పరిశీలించాక ఇన్‌ఫుట్ సబ్సిడీ మంజూరు కోసం ప్రభుత్వానికి లేఖ రాయనున్నారు. అప్పట్లో భారీ వర్షాలకు జిల్లాలో పెద్ద ఎత్తున పంటలు నీట మునిగాయి. 28,285హెక్టార్లలో నష్టం వాటిల్లినట్టు ప్రాథమిక అంచనా వేశారు . క్షేత్రస్థాయిలో లెక్కింపు అనంతరం 34మండలాల్లోని 14,923 హెక్టార్లలో మాత్రమే వాస్తవంగా నష్టం ఉన్నట్టు నిర్ధారించారు. 50 శాతం లోపు నష్టపోయిన పంటను, అంతర పంటల్ని పరిగణనలోకి తీసుకోకపోవడంతో ప్రాథమిక అంచనాలో నష్టం దాదాపు సగానికి పైగా తగ్గిపోయింది. రైతులు వాస్తవంగా రూ.54.57కోట్లు నష్టపోయినా ఇన్‌ఫుట్ సబ్సిడీగా ప్రభుత్వమిచ్చేది కేవలం రూ.13.85 కోట్లు మాత్రమే. వరి, వేరుశనగ,పత్తి, చెరకు పంటలకు హెక్టార్‌కు రూ.10వేలు చొప్పున, మిగతా పంటలకు హెక్టార్‌కు రూ.6,250 చొప్పున లెక్క కట్టారు. ఈ లెక్కన జిల్లాలో 59,387మంది రైతులు పరిహారం పొందడానికి అర్హులని తేల్చారు. -
తుపాన్ల సమయంలో రాజకీయాలా?
సీఎంపై చంద్రబాబు ధ్వజం ‘హెలెన్’ బాధిత ప్రాంతాల్లో పర్యటన సాక్షి, రాజమండ్రి, కాకినాడ: రాష్ట్రాన్ని తుపాన్లు కుదిపేస్తుంటే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మాత్రం రచ్చబండ రాజకీయాలు చేస్తున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. హెలెన్ తుపాను బాధిత ప్రాంతాలలో పర్యటించేందుకు సోమవారం తూర్పు గోదావరి జిల్లాకు వచ్చిన చంద్రబాబు రాజమండ్రిలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందానికి కూడా వర్షాల వల్ల వాటిల్లిన నష్టం, కావాల్సిన సహాయంపై రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇవ్వలేక పోయిందని చంద్రబాబు విమర్శించారు. తుపాను నష్టం రూ.1630 కోట్లని ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని, నష్టం అంతకు రెట్టింపు ఉంటుందన్నారు. వరికి ఎకరాకు రూ.10 వేలు, వాణిజ్య పంటలకు ఎకరాకు రూ. 20 వేలు, మత్స్యకారులకు రూ.20 వేలు, కొబ్బరి చెట్టుకు రూ.5 వేలు పరిహారంగా ఇవ్వాలని, తుపాను మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు వాటిల్లిన పంటనష్టాన్ని పూర్తిగా చెల్లించాలని, కుటుంబానికి 50 కిలోల బియ్యం, ఐదు లీటర్ల కి రోసిన్ తక్షణ సహాయంగా అంద చేయాలని కోరారు. తుపాను బాధిత ప్రాంతాల పర్యటనను కోనసీమలోని కొత్తపేట మండలం నుంచి చంద్రబాబు ప్రారంభించారు. రాకుర్తివారిపాలెం, సీహెచ్ గన్నేపల్లి, పల్లాం, చెయ్యేరు అగ్రహారం తదితర గ్రామాల్లో పర్యటించి, అరటి, కొబ్బరి, వరి రైతులను పరామర్శించారు. కురుక్షేత్ర యుద్ధంలాంటి ఎన్నికలు మరో నాలుగు నెలల్లో రానున్నాయని, ఆ తరువాత అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం పార్టీయేనని ధీమా వ్యక్తం చేశారు. చెయ్యేరు అగ్రహారంలో ఇళ్లు కోల్పోయిన బాధితులను పరామర్శిస్తూ రెండు కుటుంబాలకు రెండువేల రూపాయల చొప్పున అందించారు. రాజ్యాంగ విరుద్ధంగా విభజిస్తే ఊరుకోం.. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని చంద్రబాబు విమర్శించారు. ఈ ప్రక్రియరాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతోందని, దీన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాల వారితో చర్చించి, అందరికీ ఆమోదయోగ్యమైన విధంగా, సమన్యాయాన్ని పాటిస్తూ విభజన జరగాలని ముందు నుంచీ తమ పార్టీ స్పష్టంగా చెబుతోందన్నారు. ఆర్టికల్ 3కి సవరణలు చేయడం ద్వారా రాష్ట్ర విభజన జరగాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చూస్తోందన్నారు. విభజన ప్రక్రియ అంతా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా డెరైక్షన్‌లో సాగుతోందని విమర్శించారు. -
తుపాను బాధితులను ఆదుకుంటాం
జగన్‌కు శరద్‌పవార్ హామీ నేడు, రేపు గోదావరి జిల్లాల్లో జగన్ పర్యటన పై-లీన్, హెలెన్ తుపానుల వల్ల రాష్ట్రంలో తీవ్రంగా నష్టపోయిన రైతులు, ప్రజల కడగండ్లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్‌పవార్ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రాన్ని ఏకపక్షంగా విభజించేందుకు కాంగ్రెస్, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో వివిధ రాజకీయ పక్షాల మద్దతును కూడగ ట్టడంలో భాగంగా జగన్ సోమవారం మధ్యాహ్నం ముంబయిలో పవార్‌ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తుపానుల వల్ల సంభవించిన నష్టాన్ని కూడా ఆయన కేంద్ర మంత్రికి వివరించారు. రైతుల దుస్థితికి సంబంధించిన వివరాలను సావధానంగా తెలుసుకున్న పవార్ కేంద్రం నుంచి రాష్ట్రానికి సాధ్యమైనంత ఎక్కువ ఆర్థిక సాయం అందజేయడానికి ప్రయత్నిస్తానని జగన్‌కు హామీ ఇచ్చారు. ఇలావుండగా జగన్ మంగళవారం నుంచి తుపాను తాకిడికి గురై నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించనున్నారు. రెండురోజుల పర్యటనలో భాగంగా తొలిరోజు తూర్పుగోదావరి, రెండోరోజు పశ్చిమగోదావరి జిల్లాల్లో ఆయన నష్టాన్ని పరిశీలిస్తారు. బాధిత రైతాంగాన్ని పరామర్శిస్తారు. జగన్ మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో రాజమండ్రికి చేరుకుంటారు. కొత్తపేట, అమలాపురం, ముమ్మిడివరం, పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గాల్లో పర్యటించిన అనంతరం రాత్రికి నర్సాపురంలో బస చేస్తారు. బుధవారం పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తారు. -
పైరు పోయింది.. కన్నీరు మిగిలింది
వరుస విపత్తులతో వెన్నువిరిగిన అన్నదాత శ్రీకాకుళం, విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, విజయవాడ, సాక్షి ప్రతినిధులు వరుస విపత్తులు.. ఒకదాని వెనుక మరొకటి ముంచుకొస్తున్న తుపాన్లు.. మొన్న పై-లీన్, నిన్న కుండపోత వర్షాలు.. నేడు హెలెన్.. అన్నదాతను దెబ్బ మీద దెబ్బ కొడుతున్నాయి. ఇవన్నీ చాలవన్నట్టు లెహెర్ రూపంలో మరో పెను తుపాను తరుముకొస్తోంది! కేవలం నెల వ్యవధిలోనే కనీవినీ ఎరుగని రీతిలో ప్రకృతి విరుచుకుపడడంతో రాష్ట్రంలో రైతులు విలవిలలాడిపోతున్నారు. ఇన్నాళ్లూ కంటికి రెప్పలా కాపాడుకున్న వరి పంట సరిగ్గా చేతికొచ్చే సమయంలోనే సర్వనాశనమైంది. ఖరీఫ్‌లో వేసిన పంటంతా ఆనవాళ్లు లేకుండా తుడిచిపెట్టుకుపోయింది. శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో పెనునష్టం వాటి ల్లింది. హెలెన్ దెబ్బకు ఈ ఐదు జిల్లాల్లోనే దాదాపు 11 లక్షల ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. కోనసీమ కల్పవృక్షమైన కొబ్బరి దారుణంగా దెబ్బతింది. లక్షకు పైగా కొబ్బరి చెట్లు నేలకూలడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. మామిడి, అరటి, జీడి తోటలతోపాటు కాయగూర పంటలు కూడా హెలెన్ దెబ్బకు నేలపాలయ్యాయి. ఈ వరుస విపత్తులతో ఈ ఐదు జిల్లాల్లోనే వరి రైతులకు రూ.1,800 కోట్ల నష్టం వాటిల్లింది. ఇతర పంటలకు మరో రూ.500 కోట్ల నష్టం జరిగింది. గోరుచుట్టుపై రోకటిపోటులా రైతులపై దెబ్బమీద దెబ్బ పడుతున్నా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. నష్టపరిహారం ఊసే మర్చిపోయింది. పెట్టుబడి రాయితీ అందని ద్రాక్షే అవుతోంది. అక్కడక్కడ ఏదో మొక్కుబడిగా కొందరు రైతులకు పరిహారం అందజేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంటోంది. పశ్చిమగోదావరికి పెను నష్టం.. ఈ ఏడాది పశ్చిమగోదావరి జిల్లాను వరుస తుపానులు కోలుకోలేని విధంగా దెబ్బతీశాయి. రైతులకు అపార నష్టం వాటిల్లింది. తాజా హెలెన్ తుపాను కారణంగా భారీ వర్షాలు కురిసి 2.73 లక్షల ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. అంతకు ముందు పై-లీన్ కారణంగా 34,171 ఎకరాల్లో వరి నాశనమైంది. ఈ రెండు తుపానుల కారణంగా జిల్లాల్లో రైతులు రూ.220 కోట్ల మేర నష్టపోయారు. జిల్లా అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం తప్పితే నష్టపోయిన రైతులకు ఇప్పటికీ పైసా పెట్టుబడి రాయితీ అందించలేదు. ‘తూర్పు’లో కుదేలైన కొబ్బరి రైతు వరి అత్యధికంగా పండించే తూర్పుగోదావరి జిల్లా వరుస తుపాన్లతో అల్లాడింది. జిల్లాలో హెలెన్ దెబ్బకు దాదాపు 4.70 లక్షల ఎకరాల్లో వరి దెబ్బతింది. కోనసీమలో కొబ్బరి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ ఒక్క జిల్లాలోనే సుమారు 80 వేల కొబ్బరి చెట్లు కూలిపోవడంతో కోట్లలో నష్టం వాటిల్లింది. బోండాలు రాలిన నష్టమే రూ.28 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. మొత్తమ్మీద ఈ జిల్లాలో రైతులు రూ.225 కోట్ల మేర నష్టపోయారు. శ్రీకాకుళంలో అపార నష్టం పై-లీన్, హెలెన్ దెబ్బకు జిల్లాలో ఆహార పంటలతో పాటు ఉద్యాన పంటలు పనికి రాకుండా పోయాయి. వరి, ఇతర పంట పొలాల్లో ఇంకా నీరు నిలిచే ఉండడంతో రైతులు దిగుబడిపై ఆశలు వదులుకున్నారు. అధికారుల అంచనా ప్రకారం పై-లీన్, హెలెన్ కారణంగా సుమారు 3 లక్షల ఎకరాల్లో పంటలు నీటిపాలయ్యాయి. కొబ్బరి, జీడి తోటలు నాశనమవడంతో రైతుల గుండె చెదిరింది. రెండు తుపాన్లతో జిల్లాలో రైతులు రూ.312 కోట్ల మేర నష్టపోయారు. విపత్తులతో జిల్లాలో 80 వేల మంది రైతులు నష్టపోయినా ప్రభుత్వం నుంచి వారికి ఇప్పటికీ నయా పైసా సాయం అందలేదు. విశాఖకు ‘నీలం’ సాయమే అందలేదు.. జిల్లాలో గతేడాది నీలం తుపానుతో నష్టపోయిన రైతులకే పరిహారం నేటికీ అందలేదు. తాజాగా వచ్చిన పై-లీన్, హెలెన్ తుపాన్లతో రూ.416.76 కోట్ల మేర పంట నష్టం వాటిల్లింది. విపత్తులతో 71,042.5 ఎకరాల్లో రూ.59.62 కోట్ల పంట నష్టం జరిగిందని అధికారులు లెక్క కట్టారు. 61,269మంది రైతులు నష్టపోయినట్టు గుర్తించారు. ఇప్పటికీ వారికి పెట్టుబడి రాయితీ పూర్తిస్థాయిలో అందలేదు. కృష్ణా జిల్లాలో భారీ నష్టం వరుస తుపాన్లతో కృష్ణా జిల్లాలో 2.25 లక్షల ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. నీటిపాలైన పంటలో కొంతైనా దక్కకపోతుందా అనే ఆశతో రైతన్నలు చేల వద్దే రాత్రి పగలు నీటిని తోడుతున్నారు. గూడూరు, మచిలీపట్నం, పెడన, బంటుమిల్లి, కత్తివెన్ను మండలాల్లోని వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. అవనిగడ్డ, పామర్రు, పెనమలూరు నియోజకవర్గాల పరిధిలోని పలు ప్రాంతాల్లో దాదాపు 46 వేల ఎకరాల్లో కూరగాయల తోటలు దెబ్బతిన్నాయి. అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం రైతులకు రూ.275 కోట్ల మేర నష్టం వాటిల్లింది. పై-లీన్ తుపాను కారణంగా నష్టపోయిన 60 వేల మంది రైతులకు ఇప్పటికీ పైసా సహాయం అందలేదు. అప్పులెలా తీర్చాలో తెలియడం లేదు.. ‘‘నేను రెండెకరాల భూమి కౌలుకు తీసుకొని వరి వేశా. మొన్న అక్టోబర్‌లో భారీ వర్షాల వల్ల గింజ సరిగా పాలుపోసుకోలేదు. ఉన్నవాటినైనా దక్కించుకుందామనుకున్న సమయంలో హెలెన్ వచ్చింది. పైరు మొత్తం నీట మునిగింది. ఇప్పటివరకు అప్పులు తెచ్చి రెండెకరాలకు రూ.40 వేలు పెట్టుబడి పెట్టాను. పంట పోయింది. చేతిలో చిల్లిగవ్వ లేదు. అప్పు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదు’’ - భూపతి పరశురామయ్య, చినకామనపూడి, కృష్ణా జిల్లా పంటపై ఆశలు వదిలేసుకున్నా.. ‘‘నేను సొంతానికి ఐదెకరాలు, కౌలుకు మరో ఐదెకరాలు సాగు చేస్తున్నాను. ఎకరాకు రూ.15 వేల చొప్పున ఇప్పటి దాకా రూ.1.5 లక్షలు పెట్టుబడి పెట్టాను. మరో పది రోజుల్లో కోతలు కోద్దామని అనుకునే సరికి హెలెన్ ముంచేసింది. పంటపై ఆశలు వదిలేసుకున్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో కోతలు కోయిస్తే కూలీల ఖర్చులకే అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఒక్క గింజ కూడా చేతికొచ్చే అవకాశంలేదు’’ - దున్నాల రామకృష్ణయ్య, వానపల్లిపాలెం, తూర్పుగోదావరి కూరగాయల రైతులకు పరిహారం ఇవ్వాలి ‘‘ఎన్నో ఏళ్లుగా కూరగాయ పంటలు సాగుచేస్తున్నాను. తుపానులు, భారీ వర్షాలతో ఈ ఏడాది మొక్కలు, పాదులు నాశనమయ్యాయి. ఎకరం విస్తీర్ణంలో కూరగాయలకు రూ.20 వేల పెట్టుబడి పెట్టాను. ఇంత దారుణంగా ఎన్నడూ నష్టపోలేదు. ప్రభుత్వం కూరగాయల రైతులకు కూడా నష్టపరిహారం అందజేసి ఆదుకోవాలి’’ - జక్కంశెట్టి రాముడు, జిన్నూరు, పశ్చిమగోదావరి జిల్లా -
సీఎం భార్యకు పంట నష్టపరిహారం
ముంబై: సాక్షాత్తు రాష్ట్రాన్ని ఏలుతున్న ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ భార్య సత్వశీల రైతు అవతారమెత్తారు. ఇదేమిటనుకుంటున్నారా? ఇది నిజమే?. 2011-12 కాలంలో పశ్చిమ మహారాష్ట్రలో ఏర్పడిన కరువు వల్ల పంటలు కోల్పోయిన రైతులకు సర్కార్ పంపిణీ చేసిన నష్టపరిహారం అందుకున్న వారిలో సత్వశీల పేరు కూడా ఉంది. ‘కరువు వల్ల వాటిల్లిన పంట నష్టంపై సర్వే చేశాం. కలెక్టర్ నేతృత్వంలోని ఓ కమిటీ చేసిన ప్రతిపాదనల ప్రకారం సత్వశీలకు రూ.మూడు వేల నష్టపరిహారాన్ని చెల్లించాం. అలాగే ఆమె తల్లి సోదరుడికి కూడా చెక్ అందించాం. ఆ ప్రాంతంలో నాలుగువేల మంది పంట కోల్పోయారని అంచనా వేశాం. వారి బ్యాంక్ ఖాతాల్లో డబ్బు డిపాజిట్ చేశామ’ని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. చవాన్ భార్య సత్వశీలకు సాంగ్లీలోని బేదగ్ గ్రామంలో 2.5 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని చెప్పారు. అయితే నష్టపరిహారానికి సంబంధించి ఆమె నుంచి ఏ దరఖాస్తు రాలేదని చెప్పిన సదరు అధికారి సాధారణంగానే జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌లో ఉన్న ఖాతాలో డబ్బు డిపాజిట్ అయ్యిందని వివరించారు. అయితే అధికారుల పనితీరుతో రైతులు నివ్వెరపోయారు. -
తేల్చి.. ముంచారు
సాక్షి, సంగారెడ్డి: తుపాన్ వల్ల దెబ్బతిన్నపంట నష్టంపై అధికారులు లెక్క తేల్చారు. అయితే ప్రాథమిక అంచనాలతో పోల్చితే తుది నివేదికలో మూడో వంతు నష్టం తరిగిపోయింది. గత నెల 23- 26 తేదీల మధ్య కురిసిన జడివానకు జిల్లాలో 34,693 హెక్టార్ల పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనాల్లో తేల్చి న అధికారులు.. సమగ్ర సర్వే తర్వాత ఈ నష్టాన్ని 26,839 హెక్టార్లుగా ఖరారు చేశారు. ఎప్పుడు లేని విధంగా ఈ సారి కఠిన నిబంధనలు అమలు చేశారు. పొలంలో ఉన్న పంట(స్టాండింగ్ క్రాప్)ల సర్వేకు మాత్రమే ఆదేశించడం, వీడియో చిత్రీకరణ జరపాలనే విచిత్ర మెలిక పెట్టడంతో తుది జాబితాల తయారీపై ప్రభావం చూపింది. వర్షాల తర్వాత మళ్లీ కోలుకున్న పంటలను మినహాయిం చినట్లు అధికారులు పేర్కొంటున్నా.. ప్రాథమిక, తుది సర్వేల మధ్య భారీ వ్యత్యాసం సందేహాలను రేకెత్తిస్తోంది. సర్వే ముగిసింది జిల్లాలోని 33 మండలాల పరిధిలోని 768 గ్రామాల్లో 11,343 హెక్టార్ల వరి, 991.7 హెక్టార్ల మొక్కజొన్న, 14,487 హెక్టార్ల పత్తి, 4.8 హెక్టార్లలో చెరకు, 3.2 హెక్టార్లలో కంది, 9 హెక్టార్లలో సోయా పంటలు దెబ్బతినడంతో 76,775 మంది రైతులు నష్టపోయినట్లు అధికారులు తేల్చారు. అత్యధికంగా జగదేవ్‌పూర్ మండలంలో 3,644 హెక్టార్లు, చిన్నకోడూరు మండలంలో 3,304 హెక్టార్లు, నంగనూరు మండలంలో 3,244 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు మండల స్థాయి నుంచి వ్యవసాయ శాఖ జిల్లా కార్యాలయానికి నివేదికలు అందాయి. తుది జాబితా తయారీకి జిల్లా కలెక్టర్ విధించిన గడువు బుధవారంతో ముగిసింది. ఈ మేరకు వ్యవసాయ, రెవెన్యూ శాఖలు నిర్వహించిన ఉమ్మడి సర్వే సైతం ఇప్పటికే ముగిసిపోవడంతో, జిల్లా వ్యవసాయ శాఖ తుది నివేదిక తయారీపై దృష్టిపెట్టింది. మండలాల నుంచి వచ్చిన నివేదికల్లో రైతుల బ్యాంకు ఖాతా నంబర్లు లేకపోవడంతో జాప్యం జరుగుతోంది. నష్టపోయిన రైతుల బ్యాంకు ఖాతా నంబర్లతో తుది జాబితాను రూపొందించి సమర్పిస్తామని అధికార వర్గాలు తెలిపాయి. ఇన్పుట్ సబ్సిడీ రూ.26.64 కోట్లే ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ మంజూరు చేస్తోంది. ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం వరి, పత్తి పంటలు దెబ్బతింటే హెక్టారుకు రూ.10 వేలు, మొక్కజొన్న హెక్టారుకు రూ.8,333 చొప్పున ఇన్పుట్ సబ్సిడీ వర్తించనుంది. వ్యవసాయశాఖ నివేదిక ప్రకారం.. వరి, పత్తి, మొక్కజొన్న రైతులకు పరిహారం ఇలా రానుంది. 11,343 హెక్టార్లలో వరి వరి పంట దెబ్బతినడంతో రూ.11.34 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ వర్తించనుంది. 991.7 హెక్టార్లలో మొక్కజొన్న పంట దెబ్బతినడంతో రూ.82.63 లక్షల పరిహారం వర్తించనుంది. 14,487 హెక్టార్లలో పత్తి పంట దెబ్బతినడంతో రూ.14.48 కోట్ల పరిహారం రానుంది. -
కుండపోత వాన
సాక్షి, చెన్నై: ఈశాన్య రుతు పవనాలు రాష్ట్రంలోకి గత నెలలో ప్రవేశించాయి. ఈ పవనాల రాకతో దక్షిణ, ఉత్తరాదిలోని పలు జిల్లాల్లో నాలుగైదు రోజులు వర్షా లు పడ్డాయి. తర్వాత అడపాదడపా వర్షాలు కురుస్తూ వచ్చాయి. ఈ పరిస్థితుల్లో శ్రీలంక సమీపంలోని బం గాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం క్రమంగా కన్యాకుమారి తీరం వైపు సాగుతుండడంతో అక్కడ వర్షా లు పడుతున్నాయి. కన్యాకుమారి, తిరునల్వేలి జిల్లా ల్లో ఆదివారం కుంభవృష్టి కురిసింది. కన్యాకుమారిలో కోతకు సిద్ధమైన వరి పంట నీళ్ల పాలైంది. 255 ఎకరాల్లో పంట దెబ్బతింది. అల్పపీడన ప్రభావంతో కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, రామనాథపురం, నాగపట్నం సముద్రతీర ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురంలో చెదురుమదురుగా వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లు జలమయం: ఆదివారం నాటి కుండపోత వాన తో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యూయి. చెన్నైలోని కోయంబేడు, టీనగర్, వడపళని, నుంగంబాక్కం, తాంబరం, పెరంబూరు, ఉత్తర చెన్నై, మీనంబాక్కం, విరుగంబాక్కం, అరుంబాక్కం రోడ్లు చెరువులను తలపించాయి. బాణసంచా పేలుళ్లతో రోడ్లపైకి చేరిన చెత్తాచెదారం వర్షపునీటిలో కొట్టుకెళ్లింది. అల్పపీడన ప్రభావంతో 24 గంటల్లో తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షం పడవచ్చని వాతావరణ కేంద్రం ప్రకటించింది. -
39వేల హెక్టార్లలో పంటనష్టం
నరసాపురం(రాయపేట), న్యూస్‌లైన్ : అధిక వర్షాలకు జిల్లాలో 39 వేల 21 హెక్టార్లలో పంటనష్టం వాటిల్లిందని, నష్టపోయిన రైతులను అన్నివిధాలా ఆదుకుంటామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు. నరసాపురం మునిసిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్షాలు వల్ల జిల్లాలో 635 ఇళ్లు, పంచాయతీ, ఆర్అండ్ బీ రోడ్లు దెబ్బతిన్నాయని, 4 పశువులు మృతిచెందాయని వివరించారు. ప్రభుత్వం అందించే నష్టపరిహారాన్ని త్వరలో వెల్లడించనున్నట్లు తెలిపారు. ఎకరాకు రూ.5వేల నుంచి రూ.15వేలు నష్టపరిహారాన్ని అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. మృతుల కుటుంబాలకు అందించే ఎక్స్‌గ్రేషియో కూడా పెంచే యోచనలో ఉన్నట్లు తెలిపారు. ఐదు రోజులుగా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో అనేక ఇళ్లు ధ్వంస మయ్యాయని, పంటనీట మునగడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, నలుగురు మృతిచెందారని, పశువుల పెంపకందారులకు నష్టంవాటిల్లిందని, చేనేత మగ్గాల్లోకి వర్షం నీరు చేరుకుందని పేర్కొన్నారు. జిల్లాలో ఏలూరు మండలం శ్రీపర్రు, తణుకు మండలం దువ్వ, నరసాపురం మండలం నవరసపురం, చాగల్లు మండలం ఊనగట్ల, నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామాల్లో క్యాంపులు నిర్వహించామన్నారు. జిల్లాలో వరిపంటకు తీవ్ర నష్టంవాటిల్లగా పత్తి, వేరుశనగ తదితర పంటలకు నష్టం వాటిల్లిందని పంట నష్టాన్ని అధికారులు గుర్తిస్తున్నారని తెలిపారు. ఎర్ర కాలువ, తమ్మిలేరు పొంగిపొర్లుతున్నాయని, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు నియోజకవర్గంలో జరిగిన నష్టాన్ని మంత్రి, జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ దృష్టికి తీసుకువచ్చారు. పై-లీన్ తుఫాన్‌తో దెబ్బతిన్న పంటలకు అధిక వర్షాలు తోడు కావడంతో రైతులు తీవ్ర నష్టపోయారన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకీరామ్, రెవెన్యు, మునిసిపల్, ఆర్డ బ్ల్యూఎస్ అధికారులు పాల్గొన్నారు. -
పశ్చిమ గోదావరిలో నాలుగు రోజులుగా వర్షాలు
పశ్చిమగోదావరి జిల్లాలో నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఏలూరు, భీమవరం, పాలకొల్లు, నరసాపురం లాంటి చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. 70 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. 60 వేల ఎకరాల్లో వరి పంట నీట మునిగిపోయింది. పొగాకు, చెరకు, కూరగాయల పంటలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. జిల్లా కలెక్టర్ సిద్దార్థ జైన్ ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. రెండు రోజుల్లో పంట నష్టం అంచనా వేసేందుకు ప్రత్యేక బృందాలను పంపుతామని ఆయన తెలిపారు. -
ఉసురు తీసిన అప్పులు
యాచారం, న్యూస్‌లైన్: అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. సీఐ రాములు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని నందివనపర్తి అనుబంధ గ్రామం బొల్లిగుట్టతండాకు చెందిన వర్ష్యావత్ బాషా నాయక్(40) తనకున్న రెండెకరాలతోపాటు మరో రెండెకరాలు కౌలుకు తీసుకొని పత్తి పంటను సాగు చేశాడు. గతేడాది తన పొలంలో బాషా రూ.రెండు లక్షల వరకు అప్పులు చేసి నాలుగు బోరు బావులు తవ్వించాడు. అయినా ఒక్కదానిలో కూడా నీరు పడలేదు. ఈ సారి వర్షాలు బాగానే పడటంతో పంట పెట్టుబడి కోసం మరో రూ.50 వేలు అప్పు చేసి సాగు మొదలుపెట్టాడు. కొంతకాలంగా అప్పులిచ్చిన వారినుంచి ఒత్తిడి పెరిగింది. చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక తీవ్ర మనస్తాపానికి గురైన బాషా సోమవారం రాత్రి 9 గంటల సమయంలో తన పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రాత్రి 11 గంటలైనా భర్త తిరిగి రాకపోవడంతో బాషా భార్య కమలమ్మ పొలానికి వెళ్లి చూడగా అతడు విగతజీవిగా కనిపించాడు. మృతుడికి భార్యతోపాటు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. బాషా మృతితో ఆ కుటుంబం దిక్కులేనిదైంది. బాషా కుటుంబానికి ఆర్థిక సహాయం చేసి ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్ రాజు నాయక్ విజ్ఞప్తి చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.