
సాక్షి, హైదరాబాద్: తాజా వర్షాల వల్ల జరిగిన పంట నష్టాన్ని తక్షణమే అంచనా వేయాలని, ఎకరాకు రూ.15 వేల చొప్పున రైతులకు పరిహారం చెల్లించాలని టీపీసీసీ చీఫ్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంటల సాగుకు విత్తనాలు, ఎరువులు, ఇన్‌ఫుట్ సబ్సిడీ ఇవ్వాలని, తదుపరి పంటలకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి పంటల బీమా పథకాల అమలుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు ఆయన మంగళవారం బహిరంగలేఖ రాశారు.