
హైదరాబాద్, సాక్షి: లోక్ సభలో ప్రతిపక్షనేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై బీజేపీ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ క్విట్ ఇండియా అని వ్యాఖ్యానించారు. ఆయన బుధవారం శేరిలింగంపల్లి బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని హాట్ కామెంట్లు చేశారు.
‘‘రాహుల్ గాంధీ.. క్విట్ ఇండియా. విదేశాలకు వెళ్లి భారత ఎన్నికల వ్యవస్థను విమర్శిస్తావా?. రిజర్వేషన్లపై నోటికొచ్చినట్లు మాట్లాడతావా?. కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో వేయడం సీఎం రేవంత్‌కు సాధ్యం కావడం లేదు. కేసీఆర్ ఢిలీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడుకుని వచ్చారు. బీజేపీ అధికారంలోకి వస్తే కేసీఆర్ అంతు చూసేటోళ్లం. అంకుశం సినిమాలో రాంరెడ్డికి పట్టిన గతే కేసీఆర్ కుటుంబానికి పట్టేది. కేసీఆరే దశమ గ్రహం.. నవగ్రహాలు చేయడం విడ్డూరం. వరదలతో జనం అల్లాడుతుంటే కేసీఆర్ ఎందుకు బయటకు రావడం లేదు?. ప్రజలు కేసీఆర్ కు ‘నో ఎంట్రీ బోర్డు’పెట్టేశారు. ఇగ రీ ఎంట్రీ కలే. ఆరు గ్యారంటీలపై డైవర్ట్ చేసేందుకే హైడ్రా పేరుతో ‘హైడ్రామా’లాడుతున్నారు.
దేశ ప్రజలారా.. కాంగ్రెస్ ముక్త్ భారత్ లక్ష్యంగా ముందుకు సాగండి. అత్యధిక సభ్యత్వం నమోదు చేసిన డివిజన్ కార్యకర్తలను నేను సన్మానిస్తా. ఈసారి జీహెచ్ఎంసీ మేయర్ బీజేపీదే. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి పోటీ చేయడం తథ్యం. లౌకికవాదులారా.. జైనూర్ ఘటనపై నోరెందుకు మెదపడం లేదు?. హిందూ పండుగలపై ఆంక్షలు పెడుతుంటే ఎందుకు స్పందించరు?. జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించని వాళ్లు నా దృష్టిలో భారతీయులే కాదు’ అని అన్నారు.
చదవండి: ‘వాల్మీకి’ స్కామ్‌లో మేం చెప్పిందే జరిగింది: కేటీఆర్
Comments
Please login to add a commentAdd a comment