బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల అవసరం కాంగ్రెస్‌కే ఉంది: బండి సంజయ్‌ | minister bandi sanjay comments on congress over brs mlas | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల అవసరం కాంగ్రెస్‌కే ఉంది: బండి సంజయ్‌

Published Sun, Aug 18 2024 1:45 PM | Last Updated on Sun, Aug 18 2024 5:22 PM

minister bandi sanjay comments on congress over brs mlas

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ అవుట్‌ డేటెడ్‌ పార్టీ అని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అన్నారు. ఆయన ఆదివారం హైదరాబాద్‌లోని కోఠిలో మీడియాతో మాట్లాడారు. 

‘‘ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల అవసరం కాంగ్రెస్‌ పార్టీకే ఉంది. బీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోవాల్సిన కర్మ మాకు లేదు.  విలీనం, పొత్తులు గంగలో కలవనీయండి. వాటితో ప్రజలకేం సంబంధం?. కేసీఆర్, కేటీఆర్ పేరెత్తితేనే జనం రాళ్లతో కొట్టే పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ అవుట్ డేటెడ్ పార్టీ. రుణమాఫీ కాక రైతులు కాంగ్రెస్ దిష్టిబొమ్మలు కాల్చేస్తున్నా పట్టించుకోరా? రుణమాఫీ సహా 6 గ్యారంటీలపై చర్చను పక్కదారి పట్టించేందుకు విలీన డ్రామాలు. 

...కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి ఆడుతున్న డ్రామాలు. రుణమాఫీపై కాంగ్రెస్ మాట తప్పింది. 64 లక్షల మంది రుణాలు తీసుకుంటే 22 లక్షల మందికే మాఫీ చేస్తారా? రైతులందరికీ రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చి.. ఎన్నికల్లో 40 వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు. బడ్జెట్లో రూ.26 వేల కోట్లు కేటాయించి.. చివరకు రూ.17 వేల కోట్లు మాత్రమే మాఫీ చేస్తారా?. కాంగ్రెస్ మోసాలు ప్రజలకు అర్ధమయ్యాయని తెలిసే విలీన డ్రామాలాడుతూ చర్చను పక్కదారి పట్టిస్తున్నారు’’ అని మండిపడ్డారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement