Rahul Gandi
-
రాహుల్ గాంధీకి కోర్టు నోటీసులు
లక్నో : పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కుల గణనపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి బరేలీ జిల్లా కోర్టు నోటీసులు జారీ చేసింది. జనవరి 7న కోర్టుకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని పంకజ్ పాఠక్ అనే వ్యక్తి న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు. రాహుల్ వ్యాఖ్యలు దేశంలో అంత్యర్ధం, విభజన, అశాంతిని ప్రేరేపించే అవకాశం ఉందని, న్యాయపరమైన జోక్యం అవసరమని ఆరోపిస్తూ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. ముందుగా ప్రత్యేక ఎంపీ,ఎమ్మెల్యే కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా విచారణకు తిరస్కరించింది. దీంతో తాజాగా తాను జిల్లా కోర్టును ఆశ్రయించగా విచారణ చేపట్టిన కోర్టు రాహుల్ గాంధీకి నోటీసులు పంపినట్లు పిటిషనర్ తెలిపారు.#WATCH | Uttar Pradesh: Bareilly District Court issues notice to Lok Sabha LoP and Congress MP Rahul Gandhi over his statement on caste census. Petitioner, Pankaj Pathak says "We felt that the statement given by Rahul Gandhi during the elections on caste census was like an… pic.twitter.com/Es8rxilbTU— ANI (@ANI) December 22, 2024 హైదరాబాద్ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలోహైదరాబాద్ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో కులగణనపై రాహుల్ గాందీ మాట్లాడారు. బీజేపీపై విమర్శులు గుప్పిస్తూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశంలో ఆర్థిక, సంస్థాగత సర్వే నిర్వహిస్తామని చెప్పారు. “ఇతర వెనుకబడిన తరగతులు (ఓబీసీలు), షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీలు), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీలు), మైనారిటీలకు చెందిన వారు ఎంత మంది ఉన్నారో తెలుసుకోవడానికి మొదట దేశవ్యాప్త కుల గణనను నిర్వహిస్తాం. ఆ తర్వాత ఆర్థిక, సంస్థాగత సర్వే నిర్వహిస్తాం’అని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై పిటిషనర్ కోర్టుకు వెళ్లినట్లు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. -
రాహుల్ గాంధీ పౌరసత్వంపై కోర్టులో పిటిషన్
లక్నో : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పౌరసత్వంపై అలహాబాద్ హైకోర్టు కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. రాహుల్ గాంధీకి భారత్, యూకే పౌరసత్వాలు ఉన్నాయంటూ దాఖలైన పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది.రాహుల్ గాంధీకి యూకే పౌరసత్వం ఉందని, కాబట్టే భారత పౌరసత్వాన్ని రద్దు చేయాలని కర్ణాటకు చెందిన న్యాయవాది ఎస్ విఘ్నేష్ శిశిర్ పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అంశంపై సీబీఐ విచారణ చేపట్టాలని కోరారు. విఘ్నేష్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు తీర్పును డిసెంబ్ 20కి వాయిదా వేసింది. కోర్టు ఆదేశాలతో రాహుల్ పౌరసత్వంపై మూడు వారాల్లోగా వివరణ ఇవ్వాలని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్బీ పాండే హోం మంత్రిత్వ శాఖ సూచించారు. ఈ సందర్బంగా పిటిషనర్ ఎస్ విఘ్నేష్ శిశిర్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీకి రెండు యూకే, భారత్‌లో పౌరసత్వం ఉందనే ఆధారాలు లభించాయి. వాటన్నింటిని కోర్టుకు సమర్పించాం. భారత చట్టాల ప్రకారం ఒక పౌరుడికి రెండు దేశాల్లో పౌరసత్వం ఉండకూడదు. అలా ఉంటే ఒక దేశ పౌరసత్వం రద్దు అవుతుంది. రాహుల్ గాంధీ పౌరసత్వాన్ని భారత ప్రభుత్వం రద్దు చేస్తుందని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. -
కేసీఆర్ ‘రీ ఎంట్రీ’ ఇక కలే: బండి సంజయ్
హైదరాబాద్, సాక్షి: లోక్ సభలో ప్రతిపక్షనేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై బీజేపీ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ క్విట్ ఇండియా అని వ్యాఖ్యానించారు. ఆయన బుధవారం శేరిలింగంపల్లి బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని హాట్ కామెంట్లు చేశారు.‘‘రాహుల్ గాంధీ.. క్విట్ ఇండియా. విదేశాలకు వెళ్లి భారత ఎన్నికల వ్యవస్థను విమర్శిస్తావా?. రిజర్వేషన్లపై నోటికొచ్చినట్లు మాట్లాడతావా?. కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో వేయడం సీఎం రేవంత్‌కు సాధ్యం కావడం లేదు. కేసీఆర్ ఢిలీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడుకుని వచ్చారు. బీజేపీ అధికారంలోకి వస్తే కేసీఆర్ అంతు చూసేటోళ్లం. అంకుశం సినిమాలో రాంరెడ్డికి పట్టిన గతే కేసీఆర్ కుటుంబానికి పట్టేది. కేసీఆరే దశమ గ్రహం.. నవగ్రహాలు చేయడం విడ్డూరం. వరదలతో జనం అల్లాడుతుంటే కేసీఆర్ ఎందుకు బయటకు రావడం లేదు?. ప్రజలు కేసీఆర్ కు ‘నో ఎంట్రీ బోర్డు’పెట్టేశారు. ఇగ రీ ఎంట్రీ కలే. ఆరు గ్యారంటీలపై డైవర్ట్ చేసేందుకే హైడ్రా పేరుతో ‘హైడ్రామా’లాడుతున్నారు.దేశ ప్రజలారా.. కాంగ్రెస్ ముక్త్ భారత్ లక్ష్యంగా ముందుకు సాగండి. అత్యధిక సభ్యత్వం నమోదు చేసిన డివిజన్ కార్యకర్తలను నేను సన్మానిస్తా. ఈసారి జీహెచ్ఎంసీ మేయర్ బీజేపీదే. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి పోటీ చేయడం తథ్యం. లౌకికవాదులారా.. జైనూర్ ఘటనపై నోరెందుకు మెదపడం లేదు?. హిందూ పండుగలపై ఆంక్షలు పెడుతుంటే ఎందుకు స్పందించరు?. జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించని వాళ్లు నా దృష్టిలో భారతీయులే కాదు’ అని అన్నారు.చదవండి: ‘వాల్మీకి’ స్కామ్‌లో మేం చెప్పిందే జరిగింది: కేటీఆర్చదవండి: అప్పుడే రిజర్వేషన్లు తీసేయాలి: రాహుల్ -
ప్రజలకు మోదీ భయం పోయింది: రాహుల్ గాంధీ
న్యూయార్క్: లోక్ సభ ఎన్నికల ఫలితాలు విడుదలైన అనంతరం ప్రజల్లో బీజేపీపై ఉన్న భయం పోయిందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ఆయన అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్‌లో ప్రసంగించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్పై విరుచుకుపడ్డారు. భారత దేశం అంటే ఒకే సిద్ధాంతం అనే ఆలోచనతో ఆర్ఎస్ఎస్ ఉంది. కానీ, భారత్ సిద్ధాంత బహుళత్వంగా కాంగ్రెస్ భావిస్తుందని అన్నారు. దానిపైనే తాము పోరాటం చేస్తున్నామని తెలిపారు. భారతీయ రాజకాల్లో ప్రేమ, గౌరవం తగ్గిపోయాయని అన్నారు.‘‘లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ మెజార్టీ స్థానాలు దక్కించుకోలేదు. దీంతో అప్పటి వరకు ప్రజల్లో ఉన్న బీజేపీ, నరేంద్రమోదీపై భయం పోయింది. ఇది రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సాధించిన విజయం కాదు. రాజ్యాంగంపై దాడిని అంగీకరించబోమని గ్రహించిన భారత దేశ ప్రజలు విజయం. అదేవిధంగా మహిళల పట్ల వైఖరిపై కూడా బీజేపీ, ప్రతిపక్షాల మధ్య సైద్ధాంతిక తేడాలు ఉన్నాయి. వాటిపై కూడా మేము పోరాటం చేస్తున్నాం. బీజేపీ, ఆర్ఎస్ఎస్ మహిళలు కొన్ని ప్రత్యేకమైన పనులకు మాత్రమే పరిమితం కావాలని నమ్ముతారు. కానీ మేము అలా కాదు. మహిళలు ఏమి చేయాలని కోరుకున్నా అనుమతించాలని నమ్ముతున్నాం. భారత్ నిరుద్యోగ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. చాలా దేశాల్లో ఈ సమస్య లేదు. పెరుగు దేశం చైనా కూడా నిరుద్యోగ సమస్య లేదు’ అని అన్నారు.#WATCH | Texas, USA: Lok Sabha LoP and Congress MP Rahul Gandhi says, "The RSS believes that India is one idea and we believe that India is a multiplicity of ideas. We believe that everybody should be allowed to participate, allowed to dream, and should be given space regardless… pic.twitter.com/uHULrGwa6X— ANI (@ANI) September 9, 2024రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. ‘చైనా కమ్యూనిస్ట్ పార్టీతో తనకున్న ఒప్పందం వల్ల రాహుల్ చైనా కోసం బ్యాటింగ్ చేయడానికి ఉత్సాహంగా ఉన్నారు. విభజించు, పాలించడమే రాహుల్ స్ట్రాటజీ. భారత సిద్ధాంతాలుపై విమర్శలు చేయటం రాహుల్‌కు అలవాటుగా మారింది. ఆయన బెయిల్‌పై ఉన్నందున భారత న్యాయ వ్యవస్థపై దాడి చేస్తాడు’ అని బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ మండిపడ్డారు. -
వరదలతో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కేవలం రూ.5 లక్షలు నష్టపరిహారం ప్రకటించటం అన్యాయమని..రూ.25లక్షలు పరిహారం ప్రకటించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. గతంలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ వరదల్లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రూ. 25 లక్షలు పరిహారం అందిస్తామని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. వరదల కారణంగా ఇళ్లు కోల్పోయిన వారికి రూ.2.5లక్షల నుంచి రూ.5లక్షల వరకు పరిహారం ఇవ్వాలన్నారు. భారీ వర్ష సూచన ఉన్నా కుంభకర్ణ నిద్రలో ప్రభుత్వం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నేరపూరిత నిర్లక్ష్యం ఫలితంగా ఓ యువ శాస్త్రవేత్తతో పాటు సుమారు 20 మంది వరదల్లో ప్రాణాలు కోల్పోయారని కేటీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆగస్టు 27న ప్రకటించినా కాంగ్రెస్ ప్రభుత్వం కుంభకర్ణ నిద్రలో ఉందన్నారు. ‘ఒక మంత్రి హెలికాప్టర్లు దొరకలేదంటాడు. మరొక మంత్రి, ఈ రాష్ట్రానికి సీఎం లేనట్టు పక్క రాష్ట్ర సీఎంకు ఫోన్ చేస్తాడు. మూడో మంత్రి ఫొటోలకు పోజులకే పరిమితమవుతా డు. జరగాల్సిన నష్టమంతా జరిగాక పూల డెకరేషన్ స్టేజీ మీద కూర్చొని వరదల మీద సమీక్ష చేసే ‘చీఫ్ మినిస్టర్’ఉల్టా చోర్ కొత్వాల్‌కో డాంటే అన్నట్టు వరదలొస్తే సాయం చేయకుండా ప్రతిపక్షం ఏం చేస్తుందని ప్రశి్నస్తాడు’అని కేటీఆర్ మండిపడ్డారు. ఎస్‌ఎన్‌డీపీతోనే హైదరాబాద్‌కు వరద ముప్పు తప్పింది విజన్ ఉంటే విపత్తులను కూడా సమర్థంగా ఎదుర్కోవచ్చని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ‘ఎస్ఎన్డీపీ’నిరూపించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కొద్దిరోజులుగా హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నా..లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురికాకుండా కాపాడటంలో ఎస్ఎన్డీపీ (స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం) కీలకపాత్ర పోషించిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.రాహుల్‌గాంధీ ట్వీట్‌పై కేటీఆర్ ఆగ్రహం భారీవర్షాలు, వరదల కారణంగా తెలంగాణలో ఏర్పడిన పరిస్థితులు తనను ఆవేదనకు గురిచేశాయని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తెలంగాణ ప్రభుత్వం అవిశ్రాంతంగా చర్యలు చేపట్టిందంటూ రాహుల్‌గాంధీ చేసిన ట్వీట్‌పై కేటీఆర్ ఒక ప్రకటనలో విచారం వ్యక్తం చేశారు. బాధపడుతున్నట్టుగా ప్రకటనలు చేస్తే సరిపోదని రాహుల్‌కు సూచించారు. తెలంగాణలో సహాయక కార్యక్రమాలను ఎంత చిత్తశుద్ధితో చేస్తున్నారో లేదో తెలుసుకుంటే ప్రభుత్వ నిర్వాకం తెలిసేదని వ్యాఖ్యానించారు. -
రాహుల్‌కు కిరిణ్ రిజిజు కౌంటర్.. వారిని ఎగతాళి చేయొద్దు
న్యూఢిల్లీ: అందాల పోటీ మిస్ ఇండియా జాబితాలో కూడా దళిత, ఆదివాసీ వర్గాలకు చోటు దక్కటం లేదని లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు కౌంటర్ ఇచ్చారు. ఇటువంటి వ్యాఖ్యలు కేవలం ‘బాల బుద్ధి (చిన్న పిల్లలు)మాతమ్రే చేస్తారని ‘ఎక్స్’ వేదికగా ఎద్దేవా చేశారు. ‘ఇప్పుడు రాహుల్ గాంధీ మిస్ ఇండియా పోటీలు, సినిమాలు, ఆటల్లో రిజర్వేషన్లు కావాలని కోరుకుంటున్నారు. ఇది ‘బాల బుద్ధి’తో వచ్చిన సమస్య కాదు. ఎవరైనా ఆయన చేస్తున్న వ్యాఖ్యలకు ఆనందం వ్యక్తంచేస్తున్నారో వాళ్లు ఆయన వ్యాఖ్యలకు సమాన బాధ్యత వహించినట్లే. చిన్నపిల్లల తెలివితేటలు వినోదానికి మంచివి కావచ్చు. కానీ మీ విభజన వ్యూహాలతో వెనుకబడిన వర్గాలను ఎగతాళి చేయకండి. .. ప్రభుత్వాలు మిస్ ఇండియాను, ఒలింపిక్స్‌కు క్రీడాకారులను ఎంపిక చేయవు. సినిమాలకు నటులను ఎంపిక చేయవు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి అత్యున్నత సర్వీసుల రిక్రూట్మెంట్లలో రిజర్వేషన్లను మార్చేందుకు సుప్రీంకోర్టు అనుమతించబోదు. కానీ రాష్ట్రపతి పదవిలో ఉన్నది ఓ గిరిజన మహిళ, ప్రధాని ఓబీసీ, రికార్డు సంఖ్యలో ఎస్సీ/ఎస్టీ వర్గాలకు చెందినవారు కేబినెట్లో మంత్రులుగా ఉన్నారు.. వారంతా రాహుల్ గాంధీకి కనిపించటం లేదు’’ అని కిరణ్ రిజిజు అన్నారు.Now, He wants reservations in Miss India competitions, Films, sports! It is not only issue of "Bal Budhi", but people who cheer him are - equally responsible too!बाल बुद्धि मनोरंजन के लिए अच्छी हो सकती है पर अपनी विभाजनकारी चालों में, हमारे पिछड़े समुदायों का मजाक न उड़ाएं। pic.twitter.com/9Vm7ITwMJX— Kiren Rijiju (@KirenRijiju) August 25, 2024 శనివారం రాహుల్ గాంధీ ప్రయాగ్ రాజ్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ‘ నేను మిస్ ఇండియా పోటీల జాబితాను పరిశీలించాను. అందులో ఒక్క దళిత, ఆదివాసీ, ఓబీసీ మహిళ లేదు. కొంతమంది క్రికెట్, బాలీవుడ్ గురించి మాట్లాడారు. అందులో కూడా దళిత, ఆదివాసీలు లేరు. మీడియా రంగలోని టాప్ యాంకర్లలో 90 శాతం వెనబడిన వర్గాలకు చెందినవారు కాదు’’ అని అన్నారు. అయితే దేశవ్యాప్తంగా కుల గణనను డిమాండ్ చేస్తూ రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. -
‘వయనాడ్ విషాదం మా మనసుల్ని కలచివేస్తోంది‘: రాహుల్ గాంధీ
తిరువనంతపురం: వయనాడ్ విషాదం మా మనసుల్ని కలచివేసింది అని కేరళ వయనాడు విషాదంపై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ విచారం వ్యక్తం చేశారు. గురువారం కేరళలో కొండచరియలు విరిగిపడిన వయనాడ్‌లోని చూరల్మల ప్రాంతాన్ని సందర్శించారు. ప్రజల క్షేమ సమాచారాన్ని, భద్రతా బలగాల సహాయక చర్యలు ఏ విధంగా జరుగుతున్నాయో అడిగి తెలుసుకున్నారు.అనంతరం మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ.. మానాన్న రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డానో.. ఇప్పుడు అంతే బాధపడుతున్నా.. యావత్ దేశం వయనాడ్ బాధను చూస్తోంది. నేనొక్కడినే కాదు అనేకమంది ఈ బాధను అనుభవిస్తున్నారు. వయనాడ్ విషాదం మా మనసుల్ని కలచివేసింది. రాజకీయాలు మాట్లాడేందుకు ఇది సరైన సమయం కాదన్న ఆయన.. బాధితులకు అన్నీ రకాలుగా సహాయం అందించడమే మా ప్రాధాన్యమని వ్యాఖ్యానించారు. వయనాడ్ ప్రజల బాధను చూడలేకపోతున్నాం. బాధితులకు అండగా నిలిచేందుకు ఇక్కడికి వచ్చాం. హిమాచల్ ప్రదేశ్‌లోనూ ఇలాంటి విషాదాలే చోటు చేసుకున్నాయి. ఈ విషాదం చూస్తే నాకు మాటలు రావడం లేదు అని ప్రియాంక గాంధీ విచారం వ్యక్తం చేశారు. #WATCH | On deaths due to Wayanad landslides, Congress MP & LoP Lok Sabha, Rahul Gandhi says, "Today, I feel how I felt when my father died. Here people have not just lost a father but an entire family. We all owe these people respect and affection. The whole nation's attention… pic.twitter.com/9dSPI6kQdx— ANI (@ANI) August 1, 2024 -
Wayanad Landslides: బెయిలీ వంతెన నిర్మాణం పూర్తి: సీఎం పినరయి
Updatesవయనాడ్ కొండచరియలు విరిగిపడిన విపత్తులో మృతుల సంఖ్య 288కి చేరింది. మరో 200 మంది జాడ తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు 219 మంది గాయాలతో చికిత్స పొందుతున్నట్లు కేరళ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి.. తీవ్ర ప్రాణ నష్టాన్ని మిగిల్చిన ప్రాంతాన్ని ఇవాళ రాహుల్ గాంధీ పర్యటించారు. చూర్మలాలో ఆయన తన సోదరి ప్రియాంకా గాంధీతో కలిసి పర్యటించారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. 288 మంది మృతిచెందగా, వెయ్యి మందిని కాపాడారు. వయనాడ్ విపత్తుపై అఖిలపక్ష సమావేశం జరిగింది: సీఎం పినరయి విజయన్ఈ ఘటనపై ప్రతిపక్ష పార్టీలతో కలిసి చర్చించాం.శిథిలాల్లో చిక్కుకున్న వారిని రక్షించడంమైనే మేము దృష్టి పెట్టాం. ఆర్మీ సిబ్బంది కృషిని అభినందిస్తున్నాను. చాలా మందిని రక్షించినట్లు వారు తెలిపారు. మట్టి, బురద కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు యంత్రాలను కిందకు దింపడం కష్టతరంగా ఉండడంతో వంతెన నిర్మాణం చేస్తున్నారు. బెయిలీ వంతెన నిర్మాణం చాలా వరకు పూర్తయింది.గల్లంతైన వారి కోసం నదిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రక్షించిన వారిని తాత్కాలికంగా శిబిరాలకు తరలిస్తున్నారు. పునరావాస పనులు త్వరగా జరుగుతున్నాయి. Wayanad landslide | Kerala CM Pinarayi Vijayan says "A high-level meeting was held today. After that political party leaders meeting was also held. The opposition leaders also attended the meeting. Our focus is to rescue those who were isolated. I appreciate the efforts of the… pic.twitter.com/G40UffRpiT— ANI (@ANI) August 1, 2024సీఎం పినరయి విజయన్ వయనాడ్‌లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. వయనాడ్ విపత్తుపై చర్చ జరుపుతున్నారు.#WATCH | Wayanad Landslide: Kerala CM Pinarayi Vijayan chairs an all-party meeting in Wayanad pic.twitter.com/PLpNeYnv5s— ANI (@ANI) August 1, 2024వయనాడ్‌కు రాహుల్ గాంధీ చేరుకున్నారు. రాహుల్ వెంట ప్రియాంకబాధితులకు రాహుల్ గాంధీ పరామర్శించనున్నారు.#WATCH | Kerala: Congress leader & Lok Sabha LoP Rahul Gandhi and Congress leader Priyanka Gandhi Vadra arrive at Kannur airportThey will visit Wayanad to take stock of the situation of the constituency which has been rocked by massive landslides leading to 167 deaths. pic.twitter.com/sKlKnc4sBo— ANI (@ANI) August 1, 2024 వయనాడ్‌లోని కొండచరియలు విరిగినపడిన ప్రాంతంలో సీఎం పినరయి విజయన్ ఏరియల్ సర్వే చేపట్టారు.మేజర్ జనరల్ ఇంద్రబాలన్ సాయం తీసుకున్న సీఎం పినరయి విజయన్మరోపక్క.. బాధిత గ్రామాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వర్షం కాస్త తెరిపి ఇచ్చినప్పటికీ నడుం లోతుకి పైగా కూరుకుపోయిన బురదలో విపత్తు నిర్వహణ బృందాలు, ఆర్మీ, సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. వయనాడ్‌కు సీఎం విజయన్154 మృతదేహాలను జిల్లా అధికారులకు అప్పగించాంశిథిలాల కింద దొరికిన మృతదేహాలను జెనెటిక్ శాంపిళ్లను సేకరిస్తున్నాంసీఎం పినరయి విజయన్ ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ సహాయం కోరారుఆయన ఇవాళ వయనాడ్‌లో పర్యటిస్తారు:::కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జ్#WATCH | Kerala: Search and rescue operations continue at landslide-affected Chooralmala in Wayanad. The death toll stands at 167. pic.twitter.com/vEPjtzyK94— ANI (@ANI) August 1, 2024ప్రతిపక్షనేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి వయనాడు బయలుదేరారు. రాహుల్ గాంధీతో పాటు ఆయన సోదరి, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ వాద్రా కూడా ఉన్నారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో పర్యటించనున్న రాహుల్.. రిలీఫ్క్యాంప్లో, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించనున్నారు. #WATCH | Congress leader & Lok Sabha LoP Rahul Gandhi along with Congress leader Priyanka Gandhi Vadra arrives at Delhi airport, they'll shortly leave for Wayanad, Kerala.Bothe the Congress leaders will visit Wayanad to take stock of the situation of the constituency which has… pic.twitter.com/7u3wLfSb21— ANI (@ANI) August 1, 2024కేరళ వయనాడ్ జిల్లా మెప్పాడి, మందక్కై, చూరాల్మల, అట్టామల, నూల్‌పుజా గ్రామాల్లో సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. కొండ చరియలు విరిగిపడి గ్రామాల ఆనవాళ్లు లేకుండా పోయాయి. వందల ఇళ్లు నేలమట్టమయ్యాయి. వందల మంది బురద మట్టిలో కూరుకుపోయారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. -
‘మణిపూర్ రెండు ముక్కలైంది.. ఇప్పటికైనా ప్రధాని మోదీ..’
ఢిల్లీ: జాతుల మధ్య అల్లర్లతో హింస చెలరేగిన మణిపూర్ రాష్ట్రాన్ని ఇప్పటికైనా ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించాలని ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ కోరారు. ఈ మేరకు ఆయన ఇటీవల మూడోసారి మణిపూర్ సందర్శించిన వీడియోను ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘‘ మణిపూర్ ఇంకా ఆందోళనలోనే ఉంది. జాతుల మధ్య చెలరేగిన హింసలో ఇళ్లు కాలిపోయాయి. అమాయక ప్రజలు ప్రమాదంలో పడ్డారు. వేల కుటుంబాలు నిరాశ్రయులై సహాయక శిబిరాల్లో ఉన్నారు. నేను 2023 మే నుంచి ఇప్పటివరకు మూడుసార్లు మణిపూర్‌కు వెళ్లాను. ఇప్పటికే కూడా మణిపూర్ రెండు ప్రాంతాలుగా విడిపోయి ఉంది. ఇప్పటికైనా ప్రధాని మోదీ మణిపూర్ సందర్శించాలి. అక్కడి ప్రజలు సమస్యలు విని, శాంతిని నెలకొల్పాలి’’ అని రాహుల్ గాంధీ అన్నారు.मणिपुर में हिंसा शुरू होने के बाद, मैं तीसरी बार यहां आ चुका हूं, मगर अफसोस स्थिति में कोई सुधार नहीं है - आज भी प्रदेश दो टुकड़ों में बंटा हुआ है।घर जल रहे हैं, मासूम ज़िंदगियां खतरे में हैं और हज़ारों परिवार relief camp में जीवन काटने पर मजबूर हैं।प्रधानमंत्री को मणिपुर खुद… pic.twitter.com/8EaJ2Tn6v8— Rahul Gandhi (@RahulGandhi) July 11, 2024ఇటీవల మణిపూర్‌లో పర్యటించిన రాహుల్ గాంధీ చురచంద్‌పూర్ సహాయక శిబిరంలో బాధితులు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ ప్రభుత్వం ఇక్కడ ఘర్షణలకు ముగింపు పలకాలని భావిస్తేనే తొందరగా సమస్య పరిష్కారం అవుతుంది. మణిపూర్ ప్రజల తరఫున కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తా.కానీ, దీనిపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి’’ అని అన్నారు.గతేడాది మణిపూర్‌లోని కుకీ, మైతేయి జాతుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ కాస్త.. సింసకు దారితీసిన విషయం తెలిసింది. ఈ హింసాత్మక ఘటనల్ల 224 మంది మృతి చెందగా.. సుమారు 60 వేల మంది ప్రజలు వలస వెళ్లారు. -
మీరేమైనా ప్రధాని అభ్యర్థినా?.. రాహుల్‌పై స్మృతి ఇరానీ విమర్శలు
ఢిల్లీ: ఎన్నికల అంశాలపై ప్రధాని మోదీతో బహిరంగ చర్చకు తాను సిద్ధమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విమర్శలు గుప్పించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో డిబేట్ చేయడానికి రాహుల్ గాంధీ ఏమైనా విపక్షాల కూటమికి పీఎం అభ్యర్థిగా ఉన్నారా? అని ప్రశ్నించారు. ఆమె ఓ జాతీయా మీడియాతో మాట్లాడారు. ‘మొదటిగా.. తమ కంచుకోట అని భావించే స్థానంలో ఓ సాధారణ బీజేపీ కార్యకర్తపై కూడా పోటీ చేసే ధైర్యం లేనివ్యక్తి ప్రగల్భాలు పలకడం మానుకోవాలి. రెండోది.. ప్రధానిమోదీతో భేటీ అయిన ఆయనతో డిబేట్ చేసే స్థాయి రాహల్ గాంధీకి ఉందా?. నేను సూటిగా అడుగుతున్నా.. రాహల్ గాంధీ ఏమైనా విపక్ష కూటమికి ప్రధాని అభ్యర్థినా?’’ అని స్మృతి ఇరానీ నిలదీశారు.పలు లోక్‌సభ న్నికల అంశాలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీతో బహిరంగ చర్చ ఆహ్వానానికి తాను సిద్ధమేనని శనివారం రాహుల్ గాంధీ ప్రకటించిన విషయం తెలిసిందే. ‘మా పార్టీ విజన్‌ను ప్రజలు అర్థం చేసుకోవడానికి ఈ డిబేట్ సాయం చేస్తుంది. సరైన సమాచారం ప్రజలకు చేరుతుంది’ అని రాహల్ గాంధీ అన్నారు. ఈ డిబేట్లో తాను లేదా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పాల్గొనడానికి సిద్ధమని తెలిపారు. ఇక.. ఈ బహిరంగ చర్చకు.. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మదన్ బీ లోకూర్, హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఏపీ షా, సీనియర్ జర్నలిస్టు ఎన్ రామ్ ఆహ్వానం పలికారు. -
‘ డిబేట్‌కి ఎక్కడైనా రెడీ’.. ప్రియాంకా గాంధీకి స్మృతి ఇరానీ సవాల్
లక్నో: కేంద్రమంత్రి, బీజేపీ అమేథీ అభ్యర్థిని స్మృతి ఇరానీ.. కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీకి సవాల్ విసిరారు. ఏ ఛానెల్ అయినా, హోస్ట్ ఎవరైనా, టైం, ప్రదేశం, అంశం ఏదైనా తాను డిబేట్లో మాట్లాడటానికి బీజేపీ సిద్ధంగా ఉందని స్మృతి ఇరాని ప్రియాంకా గాంధీకి ఛాలెంజ్ చేశారు.‘‘నేను ప్రియాంకా గాంధీ, రాహుల్ గాంధీ ఇద్దరికీ ఛాలెంజ్ చేస్తున్నా. ఛానెల్, యాంకర్, ప్రదేశం, టైం విషయం ఏదైనా డిబేట్ చేయడానికి బీజేపీ సిద్ధం. ఒకవైపు.. సోదరుడు, సోదరీ. మరోవైపు.. బీజేపీ అధికార ప్రతినిధి ఉంటారు. మా పార్టీ నుంచి అయితే సుధాంశు త్రివేది చాలు. వాళ్లకు అన్ని సమాధానాలు చెబుతారు’’అని స్మృతి ఇరానీ బుధవారం అమేథీలో సవాల్ చేశారు.దేశంలోని ముఖ్యమన అంశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పెదవి విప్పరని ప్రియాంకా గాంధీ చేసిన ఆరోపణల నేపథ్యంలో స్మృతి ఇరానీ పైవిధంగా ఛాలెంజ్ విసిరారు. 2019లో స్మృతి ఇరానీ.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని 55 వేల మేజార్టీతో ఓడించారు. మరోసారి బీజేపీ స్మృతి ఇరానీకి అమేథీ టికెట్ కేటాయించింది. ఇప్పటికే స్మృతి ఇరానీ అమేథీ పార్లమెంట్ సెగ్మెంట్ మొత్తం తిరిగి ప్రచాం చేశారు. మరోవైపు.. కాంగ్రెస్‌కు కంచుకోట స్థానమైన అమేథీలో నామినేషన్ల చివరి రోజు గాంధీ కుటుంబానికి సన్నిహితుడైన కిషోరి లాల్ సింగ్‌ను బరిలోకి దిపింది. ఇక.. అమేథీ, రాయ్ బరేలీలో గెలుపే లక్ష్యంగా ప్రియాంకా గాంధీ శరవేంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. -
రాహుల్ గాంధీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం! ఆడియో వైరల్
ఇటీవల కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ ఉపయోగించి తయారు చేస్తున్న డీప్ ఫేక్ వీడియోలు కలకలం సృష్టిస్తున్నాయి. సినీ రాజకీయ ప్రముఖులకు డీప్ ఫేక్ వీడియోలు తలనొప్పిగా మారుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా రాహుల్ గాంధీకి సంబంధించిన ఏఐ జనరేటెడ్ వాయిస్ క్లిప్ ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. అయితే రాహుల్ గాంధీ.. ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లు ఆ వాయిస్ క్లిప్ విపిస్తుంది. ఏఐ వాయిస్‌తో పాటు.. మ్యూజిక్, ఢిల్లీలోని ఎర్రకోట దృష్యాలు కూడా ఉన్నాయి. అయితే ఈ ఆడియో క్లిప్‌ను కొందరు కాంగ్రెస్ మద్దతుదారులు షేర్ చేయటంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.The day is soon… on June 4… The Prime Minister will be Rahul Gandhi… pic.twitter.com/ymrLZC447q— Aaron Mathew (@AaronMathewINC) April 25, 2024 ఒకవైపు లోక్‌సభ ఎన్నికల ప్రచారం జోరుగా జరుగుతున్న వేళ.. రాహుల్ గాంధీ ప్రమాణం చేసినట్లు ఆడియో క్లిప్ వైరల్ కావటంతో నెటిజన్లు తమ నేతకు మద్దతుగా కామెంట్లు పెడుతూ వీడియో క్లిప్ షేర్ చేస్తున్నారు.‘ఆ రోజు త్వరలోనే రానుంది.. అది జూన్ 4’, ‘రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు’అని నెటిజన్లు కామెంట్లు పెట్టారు. అయితే ఈ ఆడియో క్లిప్.. ఏఐ వాయిస్ క్లోన్ అని కొన్ని డిటెక్షన్ టూల్స్ నిర్ధారణ చేశాయి. ఆడియో, వీడియో రెండు వేరుగా చేసి.. ఫ్యాక్ట్ చేయగా ఈ క్లిప్ ఏఐ జనరేటెడ్‌గా తేలిందని పేర్కొంటున్నాయి. ఇది ఫేక్ ఆడియో క్లిప్ అని తేల్చాయి. ఇక.. ఇటీవల ఇదే తరహాలో కాంగ్రెస్ నేత కమల్‌నాథ్ ఏఐ వాయిస్ క్లోన్ క్లిప్ ఒకటి వైరల్‌గా మారింది. అందులో ఆయన ఆర్టికల్ 370 గురించి మాట్లాడినట్టు ఉంది. -
బీజేపీ 150 సీట్లకే పరిమితం: రాహుల్ గాంధీ
లక్నో: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కేవలం 150 సీట్లు మాత్రమే గెలుస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఆయన బుధవారం ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో కాంగ్రెస్, ఎస్పీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘ఎన్ని గెలుస్తామో ముందే జోష్యం చెప్పలేను. 15-20 రోజుల క్రితం బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో 180 సీట్లు గెలుస్తుందని అనుకున్నా. కానీ, బీజేపీ గ్రాఫ్ రోజురోజుకి పడిపోతుంది. బీజేపీ కేవలం 150 సీట్లలో మాత్రమే గెలుస్తుంది. మాకు అన్ని రాష్ట్రాల నుంచి రిపోర్టులు అందాయి. కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతోంది. మాది ఉత్తరప్రదేశ్‌లో చాలా బలమైన కూటమి. మాకు మంచి ఫలితాలు వస్తాయి. గత పదేళ్లలో ప్రధాని మోదీ నోట్లరద్దు చేశారు. బడా వ్యాపారవేత్తల కోసం తప్పడు జీఎస్టీ అమలు చేసి ఉపాధి తగ్గించారు. యువతకు ఉపాధి కోసం మేము 23 విప్లవాత్మకమైన ఆలోచనలు చేశాం. ఉత్తరప్రదేశ్‌లోని గ్రాడ్యుయేట్లు, డిప్లొమా చేసినవారికి అప్రెంటిస్‌షిప్ హక్కును కల్పిస్తాం. యువత బ్యాంకు ఖాతాలో ఏడాదికి లక్ష రూపాయలు జమ చేస్తాం. కోట్లాది మంది యువతకు ఈ హక్కులు కల్పిస్తాం. పేపర్ లీకులు జరగకుండా చట్టం చేస్తాం’ అని రాహుల్ గాంధీ తెలిపారు. ప్రధాని మోదీ అవినీతికి ఛాంపీయన్ ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ ప్రపంచంలోనే అతి పెద్ద దోపిడి పథకమని అన్నారు. అదేవిధంగా అవినీతిలో ప్రధాని మోదీ ఒక ఛాంపీయన్ అని మండిపడ్డారు. ప్రధాని స్క్రిప్ట్ ఆధారంగా ఇంటర్వ్యూలో మాట్లడారని ఎద్దేవా చేశారు. ‘కొన్ని రోజుల కిత్రం ఓ ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ మాట్లాడారు. అందులో ఎన్నికల బాండ్ల గురించి ప్రస్తావించారు. ఎన్నికల బాండ్లు రాజకీయాల్లో పారదర్శకత కోసం తీసుకువచ్చామని సమర్థించుకున్నారు. అలాంటప్పుడు సుప్రీంకోర్టు ఎందుకు రద్దు చేసింది. పారదర్శకత కోసమే అయితే బీజేపీకి విరాళాలు ఇచ్చిన వారి పేర్లు ఎందుకు దాచారు. ఏయే తేదీల్లో విరాళాలు అందజేశారో ఎందుకు దాచారు’అని రాహుల్ గాంధీ నిలదీశారు. #WATCH | Ghaziabad, UP: On the upcoming Lok Sabha elections, Congress MP Rahul Gandhi says "I do not do prediction of seats. 15-20 days ago I was thinking BJP would win around 180 seats but now I think they will get 150 seats. We are getting reports from every state that we are… pic.twitter.com/tAK4QRwAGl — ANI (@ANI) April 17, 2024 సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాల ఇండియా కూటమి అనేది ఒక కొత్త ఆశాకిరణమని తెలిపారు. మెనిఫెస్టోలో పేదరిక నిర్మూలనకు సంబంధించిన అంశాలు చాలా ఉన్నాయని రాహుల్ గాంధీ చెప్పారు. రైతుల ఆదాయం పెంచాలని, పేదరికం నిర్మూలించాలని ఇండియా కూటమిలో అన్ని రాజకీయ పార్టీలు పంటలకు ఎంఎస్పీ మద్దతు ధర కల్పిస్తామని చెబుతున్నాయని తెలిపారు. అదేవిధంగా ప్రతిపక్షాల ఇండియా కూటమి ఘజియాబాద్ నుంచి ఘాజీపూర్ వరకు బీజేపీని తుడిచిపెడుతుందని అన్నారు. బీజేపీ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవటంతో రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. #WATCH | Ghaziabad, Uttar Pradesh: SP chief Akhilesh Yadav says, "INDIA alliance is the new hope in the elections and as Rahul ji said that there are many things in his manifesto by which poverty can be eradicated. Adding to that I want to say that the day the farmers of our… pic.twitter.com/QyJL3Y7oEs — ANI (@ANI) April 17, 2024 -
అమేథీ నుంచే లోక్‌సభ బరిలో రాహుల్ గాంధీ?
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ అమేథీ లోకసభ నియోజక వర్గం నుంచి పోటీ చేయడం దాదాపూ ఖరారైంది. తాజాగా, ఢిల్లీలో జరిగిన పార్టీ సమావేశం నుంచి తిరిగి వచ్చిన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ప్రదీప్ సింఘాల్ మాట్లాడుతూ.. అమేథీ నుంచి రాహుల్ గాంధీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగుతారని అన్నారు. త్వరలో రాహుల్ గాంధీ పేరును అధిష్టానం అధికారికంగా ప్రకటిస్తుందని ఆయన పేర్కొన్నారు. రాహుల్ గాంధీ వర్సెస్ స్మృతి ఇరానీ ప్రదీప్ సింఘాల్ చెప్పినట్లుగానే రాహుల్ ఎన్నికల బరిలోకి దిగితే అమేథీలో రాజకీయం రసవత్తరంగా మారనుంది. కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ స్మృతి ఇరానీపై రాహుల్ గాంధీ పోటీపడనున్నారు. తన అదృష్టాన్నిపరీక్షించుకోనున్నారు. 2019 ఎన్నికల్లో ఓటమి 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్‌పై ఇరానీ 55,120 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే ఆ ఎన్నికల్లో వాయనాడ్ నియోజక వర్గంలో గెలుపొంది రాహుల్ గాంధీ లోక్‌సభలోకి అడుగుపెట్టారు. 2014 ఎన్నికల్లో రాహుల్ గాంధీ చేతిలో స్మృతి ఇరానీ ఓడిపోయారు. అయితే, ఆమె ఆ తర్వాత ఐదేళ్లలో తన పాపులారిటీని పెంచుకున్నారు. 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీని ఓడించి చారిత్రాత్మక విజయంతో కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చారు. -
నిరుద్యోగుల కోసం ఎన్నికల హామీలు..త్వరలో రాహుల్ గాంధీ ప్రకటన
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో దేశంలోని యువత, నిరుద్యోగుల కోసం రాహుల్ గాంధీ 10 ఎన్నికల వాగ్ధానాలను ప్రకటించే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్‌లోని బద్నావర్ జిల్లాలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కలిసి జరిగే ర్యాలీలో రాహుల్ గాంధీ ఈ ప్రకటన చేస్తారని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఏఎన్ఐ తెలిపింది. గతవారం భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా ఆదివారం మధ్యప్రదేశ్ గ్వాలియర్ జిల్లాలోని మోహనాలో నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిందని అన్నారు. పాకిస్తాన్ లాంటి దేశాల కంటే మన దేశంలోనే ఎక్కువ నిరుద్యోగం ఉన్నది అని చెప్పారు. ఈ తరుణంలో ఉజ్జయినిలో భారత్ న్యాయ్ యాత్రలో నిరుద్యోగుల కోసం ఎన్నికల హామీలను ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఆ వాగ్ధానాలు ఏంటనేది తెలియాల్సి ఉంది. కాగా, రాహుల్ గాంధీ భారత్ న్యాయ్ యాత్రను 15 రాష్ట్రాల్లో 100 లోక్‌సభ నియోజవర్గాలను మీదిగా దాదాపు 67 రోజులపాటు 6, 713 కిలోమీటర్లు రాహుల్ పర్యటించనున్నారు. మొత్తం 110 జిల్లాల మీదుగా సాగే యాత్ర ..మార్చి 20 లేదా 21న ముంబైలో ముగియనుంది. ప్రస్తుతం రాహుల్ గాంధీ ర్యాలీ మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో కొనసాగుతుంది. -
‘నిరుద్యోగంలో భారత్ పాక్‌ను మించిపోయింది’.. రాహుల్ గాంధీ విమర్శలు
భోపాల్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయాల వల్ల చిరువ్యాపారులు కుదేలయ్యారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో భాగంగా రాహుల్ గాంధీ మధ్యప్రదేశ్‌లోని ఓ సభలో మాట్లాడారు. ‘ఈ రోజులో గత 40 ఏళ్లలో లేని అత్యంత భారీ నిరుద్యోగం దేశంలో ఉంది. పాకిస్తాన్లో ఉన్న నిరుద్యోగం కంటే రెండింతలు అధికంగా ఉంది. బంగ్లాదేశ్, భూటాన్ దేశాలో కంటే ఎక్కువ నిరుద్యోగం భారత్‌లో ఉంది. దానికి గల కారణం ప్రధాని మోదీ అమలు చేసిన విధానాలు. ప్రధాని మోదీ తీసుకున్న నోట్ల రద్దు, జీఎస్టీ నిర్ణయాల వల్ల చిరు వ్యాపారులు కుదేలయ్యారు’ అని రాహుల్‌గాంధీ మడిపడ్డారు. అంతకు ముందు మరో సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు. గతంలో చేపట్టిన యాత్ర కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు సాగింది. అయితే మిగతా రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, చత్తీస్ఘడ్, గుజరాత్ ఎందుకు వెళ్లలేదని ప్రజలు తనను ప్రశ్నించారని తెలిపారు. అందుకే మరో యాత్ర చేపట్టానని.. ఇది న్యాయ కోసం చేసే యాత్ర అని రాహుల్ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ యాత్ర మధ్యప్రదేశ్‌లో ప్రవేసించిన ఇవాళ ఉదయం ఆయన ఎక్స్ సర్వీస్‌మెన్, అగ్నీవీర్లతో మాట్లాడారు. ఈ రోజు రాహుల్ గాంధీ బిహార్‌లో జరిగే ‘ఇండియా కూటమి’ ర్యాలీ సందర్భంగా తన యాత్రకు బ్రేక్ ఇవ్వనున్నారు. తిరిగి సోమవారం ప్రారంభమై మధ్యప్రదేశ్‌లో పలు జిల్లాకుండా కొనసాగనుంది. రైల్వే పాలసీలు ధనికుల కోసమే.. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైల్వే పాలసీలపై రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శలు గుప్పించారు. రైల్వే పాలసీలన్నీ కేవలం ధనికుల కోసమే తీసుకువచ్చారని మండిపడ్డారు. ‘ప్రతి ఏడాది 10 శాతం రైల్వే చార్జీలు పెంచుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రజలను దోపిడి చేస్తోంది. క్యాన్సలేషన్ చార్జీలు పెంచుతోంది. ప్లాట్‌ఫామ్ టికెట్ చార్జీలు పెంచింది. ఉన్నత వర్గానికి చెందిన రైలు పేరుతో ప్రజలను దోపిడి చేస్తోంది. పేదలు కనీసం ఆ రైలులో కాలుపెట్టలేని పరిస్థితి ఉంది. ... రైళ్లలో ఏసీ కోచ్‌లు సంఖ్య పెంచి.. జనరల్ కోచ్‌లు సంఖ్య తగ్గించారు. జనరల్ కోచ్‌ల తగ్గింపుతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. సాధారణ కోచ్‌ల తయారీ కంటే మూడు రెట్లు ఎక్కవ ఏసీ కోచ్‌లు తయారు చేస్తున్నారు. రైల్వే బడ్జెట్ విడిగా ప్రవేశపెట్టడం ఆపేయటం మూలంగా రైల్వేలో జరిగే కుట్రలు తెలియటం లేదు’ అని రాహుల్ గాంధీ ‘ఎక్స్’ ట్విటర్లో మండిపడ్డారు. -
కుదిరిన సంధి.. త్వరలో మహారాష్ట్ర విపక్షాల లోక్‌సభ సీట్ల ప్రకటన
సాక్షి, ముంబై : అధికార బీజేపీ లోక్‌సభ ఎన్నికల శంఖారావం పూరించింది. రికార్డ్ స్థాయిలో మొత్తం 195 మందితో తొలి విడుత అభ్యర్ధుల జాబితాను విడుదల చేసింది. ఇక ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ సైతం లోక్‌సభ సీట్ల జాబితా విడుదలపై కసరత్తు చేస్తోన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా మహారాష్ట్రలో ప్రతిపక్షాల కూటమి మహావికాస్ అఘాడీలో సీట్ల సర్దుబాటుపై చర్చించింది. ఆ అంశం కొలిక్కి వచ్చినట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. మొత్తం 48 లోక్‌సభ స్థానాలకు గాను ఉద్ధవ్ ఠాక్రే శివసేన(UBT) 20 స్థానాల్లో పోటీ చేయనుంది. కాంగ్రెస్ 18, శరద్‌పవార్ ఎన్సీపీ 10 చోట్ల అభ్యర్థులను బరిలో దించనుందని సమాచారం. కొద్దిరోజుల క్రితం వరకు ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న మహరాష్ట్ర ప్రాంతీయ పార్టీ వంచిత్ బహుజన్ అఘాడి (VBA) మొత్తం ఐదు సీట్లను డిమాండ్ చేసింది. అయితే, తాజాగా ప్రతిపక్షాల కూటమి మహావికాస్ అఘాడీలో వీబీఏకి రెండు సీట్లు కేటాయించింది. శివసేన ముంబైలోని ఆరు లోక్‌సభ స్థానాలకు గాను నాలుగింటిలో పోటీ చేస్తుండగా.. రాష్ట్రంలోనే 14 శాతం ఓటు షేర్ ఉన్న వీబీఏ ముంబై నార్త్ ఈస్ట్ సీటు దక్కించుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకుల అంచన. పోటాపోటీ ఇక ముంబై సౌత్ సెంట్రల్, నార్త్ వెస్ట్ 39 అసెంబ్లీ స్థానాలకు సీట్ల కేటాయింపుపై స్పష్టం వచ్చినట్లు సమాచారం. ఈ రెండు ప్రాంతల్లో ఎక్కువ శాతం సీట్ల కోసం ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్, శివసేనలు పోటీపడుతున్నాయి. 2019లో ఎవరెన్ని గెలిచారంటే 2019 ఎన్నికలలో శివసేన (అప్పుడు బీజేపీతో పొత్తులో ఉంది) 23 స్థానాల్లో పోటీ చేసింది. ముంబై సౌత్ సెంట్రల్, నార్త్ వెస్ట్ సహా 18 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ 25 స్థానాల్లో పోటీ చేసి చంద్రాపూర్‌లో మాత్రమే గెలిచింది, శరద్ పవార్ ఎన్సీపీ 19 స్థానాల నుండి పోటీ చేసి నాలుగు గెలుచుకుంది. -
రాహుల్ గాంధీకి ఖలిస్థానీ సిక్కుల నిరసన సెగ!
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తాను చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ యాత్ర’కు బ్రేక్ ఇచ్చి ఇటీవల లండన్ పర్యటించారు. కేంబ్రిడ్జ్ యూనివర్సీటీలోని జడ్జ్ బిజినెస్ స్కూల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించడానికి వెళ్లారు. అయితే రాహుల్ గాంధీకి జడ్జ్ బిజినెస్ స్కూల్లో ఖలీస్థానీ అనుకూల సిక్కుల నుంచి నిరసన సెగ తగిలినట్లు తెలుస్తోంది. అయితే బిజినెస్ స్కూల్ అధికారుల జోక్యంతో నిరసన అదుపలోకి వచ్చినట్లు సమాచారం. ఈ విషయంపై స్పందించిన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం పోలీసులు.. ఖలీస్థానీ అనుకూల సిక్కు నిరసనకారులను జడ్జ్ బిజినెస్ స్కూల్లోకి తాము అనుమతించలేదని పేర్కొనటం గమనార్హం. పరమజిత్ సింగ్ పమ్మా ఆధ్వర్యంలోనే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై నిరసన తెలిపినట్లు యూకే పోలీసులు తెలిపారు. పరమజిత్ సింగ్ పమ్మా.. యూరప్‌లోని సిక్ ఫర్ జస్టిస్ సంస్థ కో-ఆర్డినేటర్. 1984లో సిక్కు వ్యతిరేక అల్లర్లు, అమృత్సర్ హత్యలకు కారణం గాంధీ కుంటుంబమేనంటూ నిరసన తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. రాహుల్ గాంధీ చేపట్టే పలు విదేశి పర్యటనల్లో సైతం ఆయన తమ నిరసన తప్పించుకోలేరని నిరసనకారులు సవాల్ చేసినట్లు తెలుస్తోంది. ఇక.. ఖలీస్థానీ అనుకూల సిక్కుల నిరసన నేపథ్యంలో రాహుల్ గాంధీ ప్రసంగం అనతంరం.. యూకే పోలీసులు కల్పించిన పటిష్టమైన భద్రత నడుమ యూనివర్సిటీ నుంచి బయటకు రాగలిగినట్లు తెలిసింది. అయితే ఈ నిరసన ఘటనపై ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెల్లడికాలేదు. -
‘రాహుల్ గాంధీ పగ! అందుకే ఆప్‌కు కేటాయింపు’
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆరోపణలు, విమర్శల దాడి పెరుగుతోంది. కాంగెస్, బీజేపీ పార్టీలు అభ్యర్థులపై ఎంపికపై కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ.. ఇండియా కూటమిలో భాగంగా పలు రాష్ట్రాల్లో సీట్ల పంపకంపై తీవ్రంగా కసరత్తు చేస్తూ ఓ కొలిక్కి తీసుకువస్తోంది. బీజేపీని ఓడించటమే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ఇక.. బీజేపీ సైతం వారం రోజుల్లో లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యుర్థుల మొదటి జాబితాను విడుదల చేయనుందని వార్తలు వస్తున్నాయ. ఇక.. కాంగ్రెస్ పార్టీ సీట్ల పంపకం ఢిల్లీ, యూపీలో కొలిక్కి రాగా గుజరాత్లో కూడా ఆప్‌తో పొత్తుగా భాగంగా రెండు సీట్లను కేటాయించింది. గుజరాత్లో కాంగ్రెస్ పార్టీ ఆప్‌కు కేటాయించిన రెండు సీట్లలో భారుచా లోక్‌సభ నియోజకవర్గం ఒకటి. ఇది దివంగత కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ కుటుంబానికి బలం ఉన్న నియోజకవర్గం. ఇక.. పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ భారుచా సెగ్మెంట్‌ను ఆప్‌కు ఇవ్వటంపై ఇప్పటికే అహ్మద్ పటేల్ కూతురు, కొడుకు నిరాశ వ్యక్తం చేశారు. In the Congress, one dynasty is more equal than the others. Everyone knows of the differences between late Ahmed Patel and Rahul Gandhi. Giving away Bharuch to AAP is Rahul Gandhi’s attempt to erase his legacy and humiliate the family. Gandhis believe in use and throw. https://t.co/nQWDqDneTe — Amit Malviya (@amitmalviya) February 24, 2024 గుజరాత్‌తో కాంగ్రెస్ ఆప్‌కు కేటాయించిన సీట్లపై బీజేపీ తీవ్రంగా విమర్శలు గుప్పింస్తోంది. ‘కాంగ్రెస్ పార్టీలో ఇతర వారసత్వ కుటుంబాల కంటే ఒక్కరికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ప్రతి ఒక్కరిగి తెలుసు దివంగత నేత అహ్మద్ పటేల్, రాహుల్ గాంధీకి మధ్య ఉన్న విభేదాలు. కాంగ్రెస్ భారుచా సెగ్మెంట్‌ను ఆప్‌కు ఇవ్వటం అంటే రాహుల్ గాంధీ.. అహ్మద్ పటేల్ వారసత్వాన్ని అంతం చేయటమే. ఆ కుటుంబాన్ని అవమానపరచటమే. రాహుల్ గాంధీ ఎప్పుడూ ఉపయోగించుకోని.. వదిలేయటాన్ని మాత్రమే నమ్ముతారు’ అని అహ్మద్ పటేల్ కూతురు ముంతాజ్ పటేల్ ట్వీట్‌ను బీజేపీ నేత అమిత్ మాల్వియా షేర్ చేశారు. Handing over long standing stronghold of Sh Ahmed Patel, who gave his life to Congress Party, to AAP is the revenge of the “Prince” ! — Jaiveer Shergill (@JaiveerShergill) February 24, 2024 బీజేపీ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్.. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు. ‘కాంగ్రెస్ పార్టీకి ఎంతో కృషి చేసిన దివంగత అహ్మద్ పటేల్ కుటుంబానికి బలం ఉన్న భారుచా సెగ్మెంట్‌ను ఆప్‌కి అప్పగించటం..‘యువరాజు’ (రాహుల్) పగలో భాగం’ అని ఎక్స్‘ట్విటర్’లో మండిపడ్డారు. -
రాహుల్ గాంధీపై వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఫైర్
లక్నో: వారణాసిలో యువత మద్యం తాగి రోడ్డు మీద పడి ఉన్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా మండిపడ్డారు. ప్రధాని మోదీ వారణాసి లోక్‌సభ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఓ సభలో పాల్గొని మాట్లాడారు. ‘వాళ్లు నరేంద్ర మోదీని దశాబ్దాలుగా దూషిస్తున్నారు. కానీ ప్రస్తుతం వాళ్లు తమ అసహనాన్ని ప్రజల మీద చూపిస్తున్నారు. వాళ్లు కనీసం తెలివి లేకుండా ఉత్తరప్రదేశ్ యువతను మద్యం బానిసలు అంటూ నిందిస్తున్నారు. వారణాసి యువతపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా’ అని ప్రధాని మోదీ అన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర ఉత్తరప్రదేశ్‌లో కొనసాగుతున్న సమయంలో వారణాసిలో యువత మద్యం తాగి రోడ్డు మీద పడి ఉన్నారని వ్యాఖ్యానించారు. రాహుల్ వ్యాఖ్యలను ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. ‘ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ అభివృద్ధి చెందుతోంది. కాంగ్రెస్ కుటుంబానికి చెందిన యువరాజు(రాహుల్ గాంధీ) యూపీ యువతను మద్యం బానిసలు అన్నారు. ఇదేం భాష. ఇండియా కూటమి యూపీ యువతను అవమానించిన తీరును ఎవరూ మర్చిపోరు. వారసత్వంగా వచ్చి ఆ వ్యక్తి(రాహుల్ గాంధీ) దేశంలోని సామాన్య ప్రజలకు ప్రమాదకారి. తెలివిలేనివారు మాత్రమే నా వారణాసి యువతను మద్యం బానిసలు అని పిలుస్తారు. ...వాళ్లు కేవలం తమను పొగిడే వాళ్లనే ఇష్టపడతారు. రామ మందిరం ప్రారంభోత్సవం జరిగినప్పటి నుంచి యూపీ ప్రజలను ఇష్టపడటం లేదు. నాకు అస్సలు అర్థం కావటం లేదు.. కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాముడిపై అంత ద్వేషం పెంచుకుంటుందో?. వాళ్లు తమ కుటుంబం, ఓటు బ్యాంకును తప్ప ఏమి చూడరు’అని ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. -
‘వారు వేసే బిస్కెట్ తినకుండా రాజీనామా చేశా’
న్యూఢిల్లీ: అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్శ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మరోసారి విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ ప్రస్తుతం జార్ఖండ్‌లో కొనసాగుతోంది. అక్కడ చోటుచేసుకున్న ఓ సంఘటనపై హిమంత ఎద్దేవా చేశారు. రాహుల్ చేట్టిన యాత్రలో భాగంగా ఒక కాంగ్రెస్ కార్యకర్త తన పెంపుడు కుక్కను తీసుకువచ్చారు. ర్యాలీ చేస్తున్న వాహనంపైకి తీసుకెవెళ్లగా.. రాహుల్ గాంధీ దానికి బిస్కెట్ తినిపించడానికి ప్రయత్నించారు. అయితే ఆ పెంపుడు కుక్క రాహుల్ గాంధీ పెట్టిన బిస్కెట్ తినకుండా తిరస్కరించింది. దీంతో ఆయన కుక్క తినకుండా తిరస్కరించిన బిస్కెట్‌ను కాంగ్రెస్ కార్యకర్తకు అందించి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. A brief pause for a paw-some furry friend. 🐾#BharatJodoNyayYatra pic.twitter.com/ccysNDVIHr — Bharat Jodo Nyay Yatra (@bharatjodo) February 4, 2024 ‘గతంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుక్కలతో పోల్చుతారు. ఇప్పుడేమే కుక్క తినకుండా నిరాకరించిన బిస్కెట్‌ను రాహుల్ గాంధీ కార్యకర్తలు ఇచ్చారు. వాళ్లు కాంగ్రెస్ కార్యకర్తలు, మద్దతుదారులు, ఓటర్లకు ఇచ్చే గౌరవం ఇదా? అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. How shameless First, Rahul Gandhi made @himantabiswa ji eat biscuits 🍪 from same plate as his pet dog 🐕 Pidi Then Congress President Khargeji compares party workers to dogs 🐕 & now, Shehzada gives a biscuit 🍪 rejected by a dog 🐕 to a party worker This is the RESPECT… pic.twitter.com/hXZGwGa2Ks — PallaviCT (@pallavict) February 5, 2024 దీనిపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్వ స్పందించారు. ‘రాహుల్ గాంధీ మాత్రమే కాదు. ఆ కుటుంబం.. వాళ్లు వేసే బిస్కెట్‌ను నేను తినేలా చేయలేకపోయారు. నేను గర్వించదగిన అస్సామీని, భారతీయుడిని. నేను ఆ బిస్కెట్ తినడానికి నిరాకరించాను. అందుకే కాంగ్రెస్‌కు రాజీనామా చేశాను’ అని ‘ఎక్స్’ ట్విటర్ వేదికగా తెలిపారు. Pallavi ji, not only Rahul Gandhi but the entire family could not make me eat that biscuit. I am a proud Assamese and Indian . I refused to eat and resign from the Congress. https://t.co/ywumO3iuBr — Himanta Biswa Sarma (@himantabiswa) February 5, 2024 ఇక.. తాను కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు రాహుల్ గాంధీని కవలడానికి వారి నివాసానికి వెళ్లితే.. రాహుల్ తన పెంపుడు కుక్క బిస్కెట్లు తినే ప్లేట్లోనే కాంగ్రెస్ నేతలకు బిస్కెట్లు ఇచ్చేవారని ఆరోపణలు చేశారు. మరోవైపు.. రాహుల్ గాంధీ కుక్క తినకుండా తిరస్కరించిన బిస్కెట్‌ను కుక్క యజమాని అయిన కాంగ్రెస్ కార్యకర్తకు ఇస్తే దాన్ని ఆ యజమాని కుక్కకు తినిపించినట్లు మరికొందరు నెటిజన్లు కామెంట్లు చేయటం గమనార్హం. -
రాహుల్ యాత్ర రాంగ్: పీకే కీలక వ్యాఖ్యలు
దేశవ్యాప్తంగా వాడీవేడిగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన వాతావరణం నెలకొన్న ప్రస్తుత సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ వల్ల ఉపయోగం లేదని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ విమర్శలు గుప్పించారు. శుక్రవారం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రశాంత్ కిషోర్ రాహుల్ యాత్రపై స్పందించారు. రాహుల్ గాంధీ యాత్ర తనకు ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఇలా యాత్ర చేయమని ఏ ఎన్నికల వ్యూహకర్త చెప్పారోనని ఎద్దేవా చేశారు. ఢిల్లీలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో ఉండాల్సిన రాహుల్.. ఎన్నికల సమయంలో ఇలా యాత్ర చేయటం ఒక చెత్త నిర్ణయమని, అసలు ఈ సమయంలో యాత్ర చేపట్టడం సరికాదన్నారు పీకే. పార్లమెంట్ ఎన్నికలకు సుమారు ఆరు నెలల ముందు ఇటువంటి యాత్ర నిర్వహించాల్సి ఉండేదన్నారు. యాత్ర కాకుండా.. బహిరంగ సభలు, అభ్యర్థుల ఎంపిక ఖరారు, భాగస్వామ్య పక్షాలు కలుపుకుపోవటం, ఎన్నికల కోసం వనరుల సేకరణ, రోజువారి సమస్యలకు పరిష్కారాలపై కసరత్తు చేయాల్సిందన్నారు. కానీ యాత్ర చేయటంలో లాజిక్ ఏం లేదన్నారు. ప్రస్తుతం ఢిల్లీలోని కాంగ్రెస్ కేంద్ర కార్యాలయం, క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలి. కానీ, యాత్ర చేయమని సలహా ఇచ్చింది ఎవరని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష ‘ఇండియా కూటమి’లో నితీష్ కుమార్ వంటి కీలక నేతలు చేజారుతూ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో చేరుతుంటే.. రాహుల్ గాంధీ మాత్రం ఈశాన్య భారతంలో యాత్రలో ఉన్నారని ఎద్దేవా చేశారు. దేశంలోని పలు ప్రాంతాల్లో పర్యటించటం కొంతమేరకు మంచిదే అయినప్పటికీ ఢిల్లీలోని కాంగ్రెస్ కేంద్ర కార్యాలయాన్ని వదలటం తెలివైన పని కాదని అన్నారు. రాహుల్ ఇటువంటి చెత్త సలహాలు ఎవరు ఇస్తున్నారో తనకు తెలియటం లేదని అన్నారు. జనవరి 14న మణిపూర్‌లో ప్రారంభమైన రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ యాత్ర’.. మార్చి 20న ముంబైలో ముగియనుంది. ప్రస్తుతం యాత్ర పశ్చిమ బెంగాల్లో కొనసాగుతోంది. చదవండి: అలాంటి వాళ్లు కాంగ్రెస్ వీడాలనుకున్నా: రాహుల్ గాంధీ -
‘రాహుల్ యాత్రకు బెంగాల్లో కూడా అడ్డంకులు’
కోల్‌కతా: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ యాత్ర’కు సంబంధించిన మీటింగ్‌లకు పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(TMC) ప్రభుత్వం అనుమతి ఇవ్వటంలేదని రాష్ట్ర కాంగెస్ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరి మండిపడ్డారు. ‘కొన్నిచోట్ల ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ కావాలని రోడ్డు అడ్డగింపు వంటి సమస్యలను ఎదుర్కొంటోంది. బహిరంగ సమావేశాలకు కొన్ని ప్రాంతాల్లో అనుమతి లభించటం లేదు. అస్సాంతో సహా.. ఈశాన్య భారతంలో ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ పలు సమస్యలను ఎదుర్కొటోంది. ప్రస్తుతం టీఎంసీ ప్రభుత్వం ఉన్న పశ్చిమ బెంగాల్లో కూడా సమస్యలు ఎదుర్కొంటున్నాం’ అని బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ అధీర్ రంజన్ చౌదరి అన్నారు. అయితే తాము పశ్చిమ బెంగాల్ కొన్ని చోట్ల రాహుల్ యాత్రకు మినహాయింపులు లభిస్తాయని భావిస్తున్నామని తెలిపారు. అయితే అధికార యంత్రాంగం మాత్రం అనుమతి ఇవ్వటం లేదని విమర్శించారు. అధీర్ రంజన్ చౌదరి చేసిన వ్యాఖ్యలను టీఎంసీ ఎంపీ శంతను సేన్ తీవ్రంగా ఖండించారు. పశ్చిమ బెంగాల్‌లోని అధికార యంత్రాంగం రాజకీయ ప్రలోభాలకు లోనుకాకుండా వ్యవహరిస్తోందని కౌంటర్ ఇచ్చారు. ‘బెంగాల్లో ‘ఇండియా కూటమి’ ఉనికి కోల్పోవటానికి అధీర్ రంజన్ బాధ్యత వహించాలి. అన్ని ప్రతిపక్ష పార్టీలు బెంగాల్లో సమావేశాలు నిర్వహించుకున్నా..ఎవరికీ ఇబ్బందులు కలగవు. విద్యార్థుల పరీక్షల నేపథ్యంలో ప్రభుత్వం యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకుంది’ అని శంతను సేన్ అన్నారు. ఇక.. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ఒంటరిగా పోటీ చేయటానికి కాంగ్రెస్ చీఫ్ అధీర్ రంజన్ కారణమని టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. అధీర్ రంజన్.. బీజేపీ వారిలా మాట్లాడేవారని మండిపడ్డారు. రాహుల్ యాత్ర గురువారం అస్సాం నుంచి బెంగాల్‌లోని కూచ్‌బెహర్ జిల్లాలోకి ప్రవేశించింది. అక్కడి కార్యకర్తలు, అభిమానులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అయితే రోడ్డు షోలో పాల్గొన్న అనంతరం ఆయన మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లారు. శుక్రవారం, శనివారం ఆయన తీసుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక.. 28వ తేదీన మళ్లీ యాత్ర ప్రారంభంకానుంది. మరుసటి రోజు రాహుల్ యాత్ర బిహార్‌లో ప్రవేశించనుంది. అటుపై 31న పశ్చిమ బెంగాల్లోకి వెళ్లనుంది. 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాహుల్.. పశ్చిమ బెంగాల్ వెళ్లటం ఇదే తొలిసారి. అందుకే రాహుల్ యాత్రపై టీఎంసీ అడ్డంకులు సృష్టించనుందని అధీర్ రంజన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. చదవండి: ‘ఇండియా కూటమిలో ఉంటే నితీష్ కుమారే ప్రధాని!’ -
రాహుల్ గాంధీ అరెస్ట్ ఖాయం: అస్సాం సీఎం
గువాహటి: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర అస్సాం(అసోం)లో రాజకీయ వేడిని పెంచుతోంది. రాహుల్ వర్సెస్ హిమంత బిశ్వ శర్మగా మారి తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రాహుల్ గాంధీ అరెస్ట్ కావటం ఖాయమని సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు. బుధవారం సిబ్సాగర్ జిల్లాలోని నజిరా ప్రాంతంలో ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రాబోయే లోక్ సభ ఎన్నికల అనంతరం రాహుల్ గాంధీ అరెస్ట్ అవుతారని సీఎం హిమంత చెప్పారు. రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు అయినట్లు తెలిపారు. ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) కూడా విచారణ చేపట్టిందని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ అరెస్ట్ కావటం ఖాయని అన్నారు. మంగళవారం మేఘాలయా నుంచి అసోం గువాహటిలోకి రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర కొనసాగుతుండగా పోలీసులు అనుమతి లేదని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకొని అది కాస్త తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. అసోంలో ఘర్షణలు సృష్టించినందుకుగానూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా పలువురు నేతలపై పోలీసు కేసులు నమోదు చేశారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో హింస, రెచ్చగొట్టడం, పోలీసులపై దాడికి పురిగొల్పినందుకు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, కన్హయ్య కుమార్, ఇతర పార్టీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: అస్సాం ఉద్రిక్తతల వేళ.. మళ్లీ సంచలన ఆరోపణలకు దిగిన రాహుల్ గాంధీ -
రాహుల్ గాంధీ యాత్ర: లోగో, స్లోగన్ ఆవిష్కరణ
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తరహాలో మారో యాత్ర చేపడతారని కాంగ్రెస్ ప్రకటించిన విషయం తెలిసందే. అయితే శనివారం రాహుల్ గాంధీ చేపట్టే యాత్రకు ‘భారత్ జోడో న్యాయ యాత్ర’గా నామకరణం చేస్తూ కాంగ్రెస్ చీఫ్ మళ్లికార్జున ఖర్గే ప్రకటించారు. భారత్ జోడో యాత్ర లోగో, స్లోగన్‌ను ఖర్గే ఆవిష్కరించారు. ఈ యాత్రకు ‘భారత్ జోడో న్యాయ యాత్ర’గా నామకరణం చేసి.. ‘న్యాయం అందేవరకు’ అనే స్లోగన్‌ను పెట్టినట్లు తెలిపారు. ఇక.. ఈ జనవరి 14 నుంచి రాహుల్ గాంధీ చేపట్టే.. ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ మణిపూర్‌లోని ఇంఫాల్ నుంచి మహారాష్ట్రలోని ముంబై వరకు బస్సు యాత్రగా కొనసాగనుంది. ये है 14 जनवरी, 2024 को मणिपुर से मुंबई तक शुरू होने जा रही भारतीय राष्ट्रीय कांग्रेस की भारत जोड़ो न्याय यात्रा का रूट मैप। @RahulGandhi 66 दिनों में 110 ज़िलों से गुज़रते हुए 6700 किलोमीटर से ज़्यादा की दूरी कवर करेंगे। यह पिछली भारत जोड़ो यात्रा की तरह ही प्रभावशाली और… pic.twitter.com/m3JeA3Nw4O — Jairam Ramesh (@Jairam_Ramesh) January 4, 2024 చదవండి: Ayodhya: 22న అయోధ్యలో హైసెక్యూరిటీ.. భద్రతా బలగాలివే.. -
Bharat Nyay Yatra: రాహుల్ గాంధీ యాత్ర.. ఫోకస్ అంతా అక్కడే!
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ ‘భారత్ న్యాయ యాత్ర’ జనవరి 14 నుంచి మణిపూర్‌లోని ఇంపాల్‌లో ప్రారంభం కానుంది. గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లను మీదుగా.. ఈ యాత్ర 14 రాష్ట్రాల్లోని 85 జిల్లాల్లో సాగనుంది. రాబోయే 2024 సాధారణ పార్లమెంట్లో గెలుపే లక్ష్యంగా రాహుల్ గాంధీ చేపట్టబోయే యాత్రకు ప్రాధాన్యత సంతరించుకుంది. రాహుల్ గాంధీ తన ‘భారత్ న్యాయ యాత్ర’ద్వారా ప్రధానంగా ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలను ఫోకస్ చేయనున్నట్లు తెలుసోంది. వీలైనన్ని ఎక్కువ రోజులు ఈ రెండు రాష్ట్రాలను యాత్ర కొనసాగిస్తారని సమాచారం. అయితే గత లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఒకే ఎంపీ స్థానంలో గెలుపొంది. సోనియా గాంధీ రాయ్‌బరేలి సెగ్మెంట్లో గెలుపొందారు. అదే విధంగా గుజరాత్లో గత రెండు సాధారణ పార్లమెంట్ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీ కనీసం కనీసం ఒక్కసీటు కూడా గెలవకపోవటం గమనార్హం. అయితే పార్టీ గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో ఉన్న ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పాగా వేయడానికి రాహుల్ గాంధీ యాత్రను ఉపయోగించుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి స్థానిక నేతల అభ్యర్థనలు, పార్టీ రాజకీయ ప్రయోజనాలు, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యం వంటి అంశాల నేపథ్యంలో యూపీ, గుజరాత్లో రాహుల్ ‘భారత్ న్యాయ యాత్ర’ సుమారు వారంరోజుల సాగనుంది తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ కూడా యూపీ, గుజరాత్లో రాహుల్ యాత్ర కొనసాగాలని భావిస్తున్నట్లు కార్యకర్తల్లో చర్చ మొదలైంది. అయితే గతంలో రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ గుజరాత్ అడుగు పెట్టలేదు. ఉత్తరప్రదేశ్‌లో తగిన ప్రాధాన్యం ఇవ్వకుండా కేవలం మూడు రోజులు మాత్రమే రాహుల్ గాంధీ యాత్ర కొనసాగించారు. మణిపూర్‌లో యాత్ర ప్రారంభమై నాగాలాండ్‌లో ఒకరోజు, ఆస్సాంలో 3 లేదా 4 రోజులు రోజుల పాటు యాత్ర కొనసాగి పశ్చిమ బెంగాల్లో అడుగుపెట్టనుందని తెలుస్తోంది. అయితే పశ్చిమ బెంగాల్లో సైతం కాంగ్రెస్ పార్టీ గత పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లకే పరిమైతమైనంది. బెంగాల్‌లోని ఉత్తర బెంగాల్ ప్రాంతంలో యాత్ర ఫోకస్ చేయనున్నట్టు తెలుస్తోంది. నార్త్ బెంగాల్లో ఉన్న మూడు స్థానాలు రిజర్వడ్ కాగా.. అక్కడ కాంగ్రెస్ బలమైన ఓటు బ్యాంక్ ఉండటం విశేషం. గత యాత్రలో యాత్రలో రాహుల్ గాంధీ గుజరాత్ పర్యటించకపోవటనికి కారణం రూట్ సమస్యలేనని, కానీ ‘భారత్ న్యాయ యాత్ర’లో గుజరాత్లో చాలా ప్రాంతాల్లో రాహుల్ యాత్ర కొనాసాగుతుందని ఓ కాంగ్రెస్ నేత తెలిపారు. 14 రాష్ట్రాల్లో చేపట్టబోయే రాహుల్ ‘భారత్ న్యాయ యాత్ర’ 358 ఎంపీ నియోజకవర్గాల కుండా సాగుతుంది. 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్‌పార్టీ రాహుల్ గాంధీ యాత్రకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. జనవరి 14న ప్రారంభమై మార్చి 20న ముంబైలో ముగిసే రాహుల్ ‘భారత్ న్యాయ యాత్ర’కు సంబంధించిన అధికారిక ఫైనల్ రూట్ మ్యాప్ సిద్ధం కాలేదు. చదవండి: కాంగ్రెస్ కు పరీక్షా కాలం -
ఆమె కన్నీళ్లకు మించిందా.. మీ విలువ?: రాహుల్ గాంధీ
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు. ప్రముఖ రెజ్లర్ వినేశ్ ఫోగట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఖేల్‌రత్న, అర్జున అవార్డులను వెనక్కి ఇవ్వడానికి శనివారం ఢిల్లీలోని ప్రధానమంత్రి నివాసానికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆమెను కర్తవ్వపథ్లో పోలీసులు అడ్డుకున్నారు. తాజాగా దీనిపై రాహుల్ గాంధీ స్పందిస్తూ.. దేశంలోని ప్రతి ఆడబిడ్డకు ఆత్మగౌరవం ముందు వస్తుంది. మరేదైనా పతకం లేదా గౌరవం ఆ తర్వాత వస్తుందని అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం తనను తాను బాహుబలిగా ప్రకటించుకునే వ్యక్తి విలువ.. వీరత్వంతో ఈ ఆడబిడ్డల కన్నీళ్లను మించిందా? అని సూటిగా ప్రశ్నించారు. ప్రధాని నరేంద్రమోదీ తాను భారతజాతికి కాపలాదారని అంటారని మండిపడ్డారు. మరీ మోదీ పాలనలో ఇలాంటి క్రూరత్వం కనిపించడం చాలా బాధాకరమని అన్నారు. అయితే నిన్న వినేష్ ఫోగాట్‌ను పోలీసులు అడ్డుకున్న వీడియోను ఆయన ‘ఎక్స్’ ట్విటర్ పోస్ట్ చేశారు. देश की हर बेटी के लिये आत्मसम्मान पहले है, अन्य कोई भी पदक या सम्मान उसके बाद। आज क्या एक ‘घोषित बाहुबली’ से मिलने वाले ‘राजनीतिक फायदे’ की कीमत इन बहादुर बेटियों के आंसुओं से अधिक हो गई? प्रधानमंत्री राष्ट्र का अभिभावक होता है, उसकी ऐसी निष्ठुरता देख पीड़ा होती है। pic.twitter.com/XpoU6mY1w9 — Rahul Gandhi (@RahulGandhi) December 31, 2023 -
‘కుస్తీ’ పట్టిన రాహుల్ గాంధీ
హర్యానా: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ప్రముఖ రెజ్లింగ్ క్రీడాకారుడు బజరంగ్ పూనియా, ఇతర రెజ్లింగ్ క్రీడాకారులను హర్యానాలోని ఝజ్జర్ జిల్లాలో ఛారా గ్రామంలొ కలుసుకున్నారు. ఆయన బుధవారం ఉదయమే.. రెజ్లింగ్ క్రీడాకారులు నిరసన వ్యక్తం చేస్తున్న ప్రదేశానికి వెళ్లారు. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్ష ఎన్నికకు సంబంధించి.. రెజ్లింగ్ క్రీడాకారులు నిరసన తెపుతున్న విషయం తెలిసిందే. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ ఎంపికను నిరసిస్తూ... బజరంగ్ పూనియా తనకు వచ్చిన పద్మశ్రీ అవార్డును ఎనక్కి ఇస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సమయాలో బుధవారం ఎంపీ రాహుల్ గాంధీ క్రీడాకారులతో భేటీ అయి వారికి మద్దతుగా నిలిచారు. దీంతో ఎంపీ రాహుల్ గాంధీ సందర్శన ప్రాధాన్యత సంతరించుకుంది. वर्षों की जीतोड़ मेहनत, धैर्य एवं अप्रतिम अनुशासन के साथ अपने खून और पसीने से मिट्टी को सींच कर एक खिलाड़ी अपने देश के लिए मेडल लाता है। आज झज्जर के छारा गांव में भाई विरेंद्र आर्य के अखाड़े पहुंच कर ओलंपिक पदक विजेता बजरंग पूनिया समेत अन्य पहलवान भाइयों के साथ चर्चा की। सवाल… pic.twitter.com/IeGOebvRl6 — Rahul Gandhi (@RahulGandhi) December 27, 2023 ‘ఎంపీ రాహుల్ గాంధీ రెజ్లర్ల రోజువారి సాధన, కార్యకలాపాలను తెలుసుకోవడానికి మా వద్దకు వచ్చారు. కాసేపు మాతో పాటు రెజ్లింగ్ కూడా చేశారు’ అని క్రీడాకారుడు బజరంగ్ పూనియా తెలిపారు. ‘రాహుల్ గాంధీ ఇక్కడ వస్తున్నట్లు మాకు ఎవరూ సమాచారం అందించలేదు. మేము రెజ్లింగ్ ప్రాక్టిస్ చేస్తున్న క్రమంలో అకస్మత్తుగా మా వద్దకు ఆయన చేరుకున్నారు. ఆయన ఉదయమే 6.15 గంటలకు ఇక్కడికి వచ్చారు. మాతో పాటు కాసేపు వ్యాయామం చేశారు. ఆయనకు క్రీడల పట్ల ఉన్న అనుభవాలను మాతో పంచుకున్నారు. రాహుల్ గాంధీకి క్రీడాల పట్ల చాలా పరిజ్ఞానం ఉంది’ అని రెజ్లింగ్ కోచ్ వీరేంద్ర ఆర్య పేర్కొన్నారు. బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్‌కు నమ్మినబంటుగా పేరున్న సంజయ్ కుమార్‌ను.. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా ఎన్నికపై నిరసన తెలుపుతూ.. తాజాగా రెజ్లర్ వినేశ్ ఫొగాట్ కూడా అర్జున, మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డులు వెనక్కి ఇస్తున్నట్లు ప్రకటించారు. రెజ్లర్లు రోడ్డెక్కి పోరాడుతున్న క్రీడాశాఖ నుంచి స్పష్టమైన హామీ లభించకపోవడం గమనార్హం. #WATCH | Haryana: On Congress MP Rahul Gandhi visits Virender Arya Akhara in Chhara village of Jhajjar district, Wrestler Bajrang Poonia says, "He came to see our wrestling routine...He did wrestling...He came to see the day-to-day activities of a wrestler." pic.twitter.com/vh0aP921I3 — ANI (@ANI) December 27, 2023 చదవండి: వినేశ్ ఫొగాట్ సంచలన నిర్ణయం -
కర్ణాటక మోడల్...ఇక దేశమంతటా!
మైసూరు: ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల వేళ కర్ణాటక ప్రజలకిచ్చిన కీలక ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెప్పారు. ఇప్పుడిక దేశమంతటా కర్ణాటక మోడల్‌నే అమలు చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని 1.1 కోట్ల మహిళలకు నెలకు రూ.2,000 చొప్పున ఆర్థిక సాయం అందించే ఎన్నికల వాగ్దానమైన గృహ లక్ష్మి పథకం అమలుకు సిద్ధరామయ్య సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేతుల మీదుగా బుధవారం శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా మైసూరులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో రాహుల్ మాట్లాడారు. తామెప్పుడూ తప్పుడు వాగ్దానాలు చేయబోమని చెప్పారు. కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వం చేసిన, చేస్తున్న మంచి పనులను దేశమంతటా విస్తరించి చూపిస్తామన్నారు. ప్రభుత్వాలు పేదల కోసమే పాటుపడాలన్నది కాంగ్రెస్ విధానమని చెప్పారు. ‘వేర్లు గట్టిగా ఉంటేనే చెట్టు దృఢంగా ఉంటుంది. కన్నడ మహిళలు వేర్ల వంటివారు. ఢిల్లీలో ఉన్న బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం మాత్రం మహిళలను నిర్లక్ష్యం చేస్తూ అపర కుబేరులను మాత్రమే నెత్తిన పెట్టుకుంటోంది‘ అని అన్నారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తదితరులు సభలో పాల్గొన్నారు. గత మే లో హోరాహోరీగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీని ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి రావడం తెలిసిందే. అందుకు దోహద పడ్డ ఐదు ప్రధాన వాగ్దానాల్లో గృహ లక్ష్మి పథకం ఒకటి. చైనా మ్యాప్ తీవ్రమైన అంశం న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్‌ను తమ అంతర్భాగంగా చూపుతూ చైనా తయారుచేసిన మ్యాప్ చాలా తీవ్రమైన అంశమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ తక్షణం స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. ‘ నేను ఇప్పుడే లద్దాఖ్ నుంచి తిరిగి వచ్చాను. అక్కడ అంగుళం నెల కూడా అన్యాక్రాంతం కాలేదన్న మోదీ మాటలు పచ్చి అబద్ధాలు. చైనా మన భూమిని ఆక్రమించిందని లద్దాఖ్‌లో ప్రతి ఒక్కరికీ తెలుసు‘ అన్నారు. -
వైరల్‌గా సోనియా, రాహుల్ గాంధీ, ప్రధాని మోదీ ఫోటోలు
ఇటీవల కాలంలో తరచుగా వినిపిస్తున్న పేరు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(AI). ఈ టెక్నాలజీ చేస్తున్న పనులకు ఇది ఎంతగానో పాపులర్ అయ్యింది. ఇదిలా ఉండగా కొందరు ఏఐ టెక్నాలజీని ఉపయోగించి సెలబ్రిటీల ఫోటోలను మారుస్తూ నెట్టింట షేర్ చేయడం ట్రెండ్‌గా మారింది. ఈ క్రమంలో ఇప్పటికే తమ అభిమాన స్టార్ హీరోల ఫోటోలను ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఉపయోగించి మార్చగా.. తాజాగా ఆ వరుసలో రాజకీయ నేతలు కూడా చేరారు. అంతా బార్బీ ఫీవర్.. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ట్రెండింగ్‌లో ఏది నడుస్తుంటే వాటిని ఫాలో అవుతుంటారు సహజమే. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా విడుదలైన చిత్రం బార్బీ రికార్డ్ కలెక్షన్లను కొల్లగొడుతోంది. దీంతో అంతటా బార్బీ ఫీవర్ నడుస్తోంది. ప్రజలు, వ్యాపారాలు, బ్రాండ్లు ఇలా ప్రతి ఒక్కటీ గులాబీ రంగులో దూసుకుపోతోంది. తాజాగా ఓ ఏఐ ఆర్టిస్ట్ భారత్‌లోని ప్రముఖ రాజకీయ నేతలను ఏఐ సాయంతో వారందరిని పింక్ డ్రెస్లోకి మార్చాడు. హూ వోర్ వాట్ అనే ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. "వీరిలో మీకు ఎవరు ఇష్టం? ఇక్కడ బార్బీ, అక్కడ బార్బీ! ప్రతిచోటా బార్బీ" అని ఆ ఫోటోల కింద ఈ క్యాప్షన్‌ను జోడించారు. ఏఐ ఉపయోగించి భారత్‌లోని 10 మంది రాజకీయ నాయకులు వీళ్లే.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ మాజీ సభ్యుడు, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, భారత హోం వ్యవహారాల మంత్రి అమిత్ షా, లోక్‌సభ మాజీ ప్రతిపక్ష నేత సోనియా గాంధీ, ఆర్జేడీ లాలూ ప్రసాద్ యాదవ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీజేపీ నేత నితిన్ గడ్కరీ. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు వావ్, సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. View this post on Instagram A post shared by Who Wore What (@whoworewhat.club) -
‘ఫ్రెంచి పరేడ్’కు ‘రాఫెల్ పాసు’!
న్యూఢిల్లీ: రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పదం కోసం ఫ్రాన్స్‌లో పర్యటించడం ద్వారా బాస్టిల్ డే కవాతులో పాల్గొనే అవకాశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సంపాదించారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. ‘‘మణిపూర్‌లో ఓ వైపు విద్వేషాగ్ని వ్యాపిస్తోంది. ఈ అంశాన్ని యూరప్ పార్లమెంట్ కూడా పట్టించుకుని చర్చకు పెట్టింది! కానీ మన ప్రధాని మాత్రం అసలేం పట్టనట్లు కూర్చున్నారు. మణిపూర్‌పై ఇంతవరకు ఒక్కమాటా మాట్లాడలేదు. పైగా రాఫెల్ ఒప్పందంతో పారిస్‌లో బాస్టిల్ డే కవాతులో పాల్గొనే పాస్ సంపాదించారు’’ అంటూ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ కూడా, ‘‘1997లో రిచర్డ్ నెల్సన్ ‘ది మూన్ అండ్ ది గెట్టో’ అని ఒక వ్యాసం రాశారు. అందులో ఏముందంటే.. అద్భుత సాంకేతికత సాధించిన అమెరికా చంద్రుడిపై కాలుమోపింది. కానీ స్వదేశంలో నెలకొన్న సమస్యలకు పరిష్కారం కనుగొనలేకపోయింది. ఇప్పుడు ఆ వ్యాసాన్ని భారత్‌లో మాత్రం ‘ది మూన్ అండ్ మణిపూర్’గా చదువుకోవాలి’’ అని విమర్శించారు. విసుగెత్తిన యువరాజు: బీజేపీ కౌంటర్ రాహుల్ విమర్శలపై బీజేపీ నేత స్మృతి ఇరానీ స్పందించారు. ‘ఫ్రాన్స్‌లో నిరసనలు, అల్లర్ల విషయాన్ని ప్రస్తావించని ఈయూ పార్లమెంట్.. భారత్‌లో మణిపూర్ అంశంపై చర్చకు సిద్దమవుతాయి. ఇదే రాహుల్ ఆశించేది. భారత అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యాన్ని ఆయన కోరుకుంటున్నారు. ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారంతో మోదీని సత్కరించడంతో విసుగు చెందిన యువరాజు ‘మేక్ ఇన్ ఇండియా’ లక్ష్యాలను తుంగలో తొక్కుతున్నారు. ప్రజలు తిరస్కరించిన రాహుల్ రక్షణ ఒప్పందాలు తమ హయాంలో జరగలేదే అని తెగ బాధపడిపోతున్నారు’ అని స్మృతి ఇరానీ ఆరోపించారు. ఇన్నేళ్లూ మణిపూర్ సమస్యను అపరిష్కృతంగా తయారుచేసిన ఘనత కాంగ్రెస్‌దే అని బీజేపీ నేత అమిత్ మాలవీయ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘లైంగిక వేధింపులపై ఉద్యమిస్తున్న మహిళా అథ్లెట్లకు ఈ మహిళా నేత కనీస మద్దతు ఇవ్వరు. కానీ రాహుల్‌పై విమర్శలకు రెడీ అవుతారు’’ అంటూ స్మృతీపై కాంగ్రెస్ మహిళా నేత సుప్రియా శ్రీనాథే విమర్శలు గుప్పించారు. -
అదానీ, ఐదుగురు నేతలపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
-
రాహుల్ గాంధీకి గౌతమ్ అదానీ కౌంటర్!
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలకు బిలియనీర్ గౌతమ్ అదానీ కౌంటర్ ఇచ్చారు. తమ సంస్థల్లో పెట్టిన పెట్టుబడులు అంతా పారదర్శకమేనని, ఆ పెట్టుబడులు ఎలా వచ్చాయో తెలుపుతూ అదానీ గ్రూప్ నివేదికను విడుదల చేసింది. అమెరికా షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్, అదానీ గ్రూప్ వివాదంపై రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్నానంటూ..అదానీకి చెందిన షెల్ కంపెనీలలో 20 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఎవరు పెట్టారు? అని ప్రశ్నించారు. ఆ నిధులు ఎవరిదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ తరుణంలో రాహుల్ వ్యాఖ్యలపై అదానీ గ్రూప్ కౌంటర్‌గా పెట్టుబడులు ఎలా వచ్చాయో తెలిపింది. బిలియనీర్ గౌతమ్ అదానీ గ్రూప్ 2019 నుండి గ్రూప్ సంస్థలలో 2.87 బిలియన్ డాలర్ల వాటా విక్రయాల వివరాలు, అలాగే 2.55 బిలియన్ డాలర్లు గ్రూప్ కంపెనీల వ్యాపారాల్లోకి ఎలా వచ్చాయన్న విషయాలనూ వివరించింది. కాగా, అదానీ గ్రూప్‌లో విదేశీ పెట్టుబుడులపై ఫైనాన్షియల్ టైమ్స్ ప్రచురించిన నివేదికను అదానీ గ్రూప్ ఖండించింది. ఇది గ్రూప్ ప్రతిష్టను దెబ్బతీసేలా ‘ఉద్దేశపూర్వక’ ప్రయత్నమని పేర్కొంది -
Sankalp Satyagraha: మోదీ పిరికిపంద
న్యూఢిల్లీ: ‘‘దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన ప్రధాని రాజీవ్‌గాంధీ కుమారుడు రాహుల్. దేశ ఐక్యత కోసం వేలాది కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. అలాంటి వ్యక్తి దేశాన్ని ఎందుకు అవమానిస్తారు?’’ అని ఆయన సోదరి, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ ప్రశ్నించారు. ‘‘బీజేపీ నేతలు రాహుల్‌ను మీరు జాఫర్ అంటూ ఎగతాళి చేశారు. జాతి వ్యతిరేక శక్తి అని నిందించారు. మా తల్లిని అవమానించారు. నెహ్రూ ఇంటిపేరు ఎందుకు పెట్టుకోలేదంటూ మమ్మల్ని ఎద్దేవా చేశారు. మా కుటుంబాన్ని, కశ్మీరీ పండిట్ల సంప్రదాయాన్ని ఆక్షేపించారు. అయినా వారిపై ఎందుకు కేసులు పెట్టలేదు? జైలు శిక్షలు విధించలేదు?’’ అని ప్రశ్నించారు. తమ కుటుంబాన్ని ఇప్పటికీ అవమానిస్తూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘హార్వర్డ్, కేంబ్రిడ్జ్ వంటి ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో చదివిన రాహుల్‌ను ‘పప్పు’ అని ఎగతాళి చేస్తున్నారు. కానీ ఆయన పప్పు కాదని బీజేపీ నాయకులకు తెలిసిపోయింది. అందుకే పార్లమెంటు నుంచి బయటికి పంపించారు’’ అంటూ దుయ్యబట్టారు. రాహుల్‌పై అనర్హత వేటుకు నిరసనగా కాంగ్రెస్ ఆదివారం దేశవ్యాప్తంగా ‘సంకల్ప్ సత్యాగ్రహ’ దీక్షలు చేపట్టింది. ఢిల్లీలో రాజ్‌ఘాట్ వద్ద దీక్షలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తదితర అగ్ర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీపై ప్రియాంక నిప్పులు చెరిగారు. ‘‘మోదీ ఉత్త పిరికిపంద. అధికారం వెనుక దాక్కుంటున్నారు’’ అంటూ ఎద్దేవా చేశారు. అహంకారపూరిత మోదీ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం నేర్పించడం తథ్యమన్నారు. అరాచక బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. ‘‘మా కుటుంబం ధారపోసిన రక్తం దేశ ప్రజాస్వామ్యానికి ఊతమిచ్చింది. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం దేనికైనా సిద్ధంగా ఉన్నాం’’ అని చెప్పారు. ఇకపై తాము మౌనంగా ఉండే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ‘మోదీ’లను విమర్శిస్తే నొప్పెందుకు: ఖర్గే ‘‘ఒక వ్యక్తిని కాపాడడానికి మొత్తం ప్రభుత్వం, కేబినెట్ మంత్రులు, ఎంపీలు ప్రయత్నిస్తున్నారు. అసలు అదానీ ఎవరు? ప్రభుత్వం ఆయనకు ఎందుకు అండగా ఉంటోందో చెప్పాలి’’ అని ప్రియాంక నిలదీశారు. ‘‘ప్రజల హక్కుల కోసం రాహుల్ పోరాడుతున్నారు. జోడో యాత్రలో ఆయన వెంట లక్షల మంది నడిచారు’’ అన్నారు. అక్రమాలకు పాల్పడి విదేశాలకు పరారైన నీరవ్ మోదీ, లలిత్ మోదీలను విమర్శిస్తే బీజేపీ ప్రభుత్వానికి నొప్పి ఎందుకని ఖర్గే ప్రశ్నించారు. సత్యాగ్రహం పేరిట కాంగ్రెస్ దీక్ష చేయడం సిగ్గుచేటని బీజేపీ దుయ్యబట్టింది. దానికి ఆ అధికారమే లేదని బీజేపీ నేత సుధాంశు త్రివేది అన్నారు. ‘అనర్హత వేటు పడిన ఎంపీ’ ట్విట్టర్ ఖాతాను అప్డేట్ చేసిన రాహుల్ లోక్‌సభ సభ్యుడిగా తనపై అనర్హత వేటు పడిన నేపథ్యంలో రాహుల్ ఆదివారం తన ట్విట్టర్ ఖాతాను అప్డేట్ చేశారు. బయోడేటాను ‘అనర్హత వేటుపడిన ఎంపీ’గా మార్చారు. తన అధికారిక వయనాడ్ ట్విట్టర్ ఖాతాలోనూ ‘డిస్‌క్వాలిఫైడ్ ఎంపీ’ అని రాశారు. -
నేషనల్ హెరాల్డ్ కేసు: మూడో రోజు ఈడీ ముందుకు రాహుల్..
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విచారణ మూడో రోజుకు చేరుకుంది. మనీలాండరింగ్ కేసులో ఈడీ రాహుల్‌పై ప్రశ్నల పరంపరను కొనసాగిస్తోంది. ఈ క్రమంలో వరుసగా మూడో రోజు ఈడీ ముందుకు రాహుల్ గాంధీ హాజరయ్యారు. గడిచిన 2 రోజుల్లో 21 గంటలపాటు ఈడీ ప్రశ్నించింది. చదవండి: నేషనల్ హెరాల్డ్ కేసేంటి?.. ఈ ప్రశ్నలకు బదులేది? తొలిరోజు 10 గంటల పాటు, రెండో రోజు 11 గంటల పాటు విచారణ జరిపిన ఈడీ.. ఇప్పటికే ఈ కేసులో పలు కీలక విషయాలకు సంబంధించిన ప్రశ్నలను విచారణలో అడిగినట్లు సమాచారం. పీఎంఎల్ఏ సెక్షన్ 50 కింద రాహుల్ గాంధీని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. మరో వైపు దేశవ్యాప్తంగా రాహుల్ విచారణపై కాంగ్రస్ నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. చదవండి: మళ్లీ కరోనా టెన్షన్.. ఒక్క రోజులో 33 శాతం అధికంగా కేసులు నమోదు! -
రెండో రోజు ఈడీ విచారణకు రాహుల్ గాంధీ.. ఢిల్లీలో ఆంక్షలు
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారం విచారణ కోసం ఈడీ ముందుకు హాజరయ్యారు. రాహుల్ వెంట ప్రియాంక గాంధీ కూడా ఈడీ ఆఫీస్‌కు చేరుకున్నారు. అంతకముందు ఏఐసీసీ కార్యాలయం వద్ద రాహుల్ గాంధీ ధర్నాలో పాల్గొన్నారు. రాహుల్‌తోపాటు ధర్నాకు దిగిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా నిన్న(సోమవారం) రాత్రి 10 గంటల వరకు రాహుల్ గాంధీని ఈడీ అధికారులు విచారించిన విషయం తెలిసిందే.. కాసేపట్లో ఏఐసీసీ దగ్గర కాంగ్రెస్ నేతల భేటీ కానున్నారు. రెండో రోజు ఈడీ విచారణ, కాంగ్రెస్ నిరసనలు కొనిసాగిస్తున్న నేపథ్యంలో ఢిల్లీలో ఆంక్షలు విధించారు. అక్బర్ రోడ్, జన్‌పథ్ మార్గాల్లో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. సంబంధిత వార్త: నేషనల్ హెరాల్డ్ కేసేంటి?.. ఈ ప్రశ్నలకు బదులేది? -
మరో సత్యాగ్రహం: కాంగ్రెస్
న్యూఢిల్లీ: మోదీ ప్రభుత్వ తీరు బ్రిటిషర్ల నియంతృత్వాన్ని తలపిస్తోందంటూ కాంగ్రెస్ మండిపడింది. తమ పార్టీని చూసి కేంద్రం ఎంతగా భయపడుతోందో చెప్పేందుకు శాంతియుత నిరసనపై జరిపిన దమనకాండే నిదర్శనమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్ సుర్జేవాలా అన్నారు. పార్టీ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. మోదీ పిరికిపంద ప్రభుత్వంపై మరోసారి గాంధీ సత్యాగ్రహం మొదలు పెట్టామని ప్రకటించారు. 23న సోనియా ఈడీ విచారణకు హాజరైప్పుడూ ఇలాగే ప్రదర్శనకు దిగుతారా అని ప్రశ్నించగా పరిస్థితిని బట్టి దీటుగా స్పందించే సామర్థ్యం కాంగ్రెస్‌కు ఉందని రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ బదులిచ్చారు. తమ నిరసన సందర్భంగా ఏఐసీసీ కార్యాలయం వద్ద భారీ మోహరింపులనుద్దేశించి ‘బుల్డోజర్లే తక్కువయ్యాయి’ అంటూ కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం ఎద్దేవా చేశారు. చిదంబరం పక్కటెముకలు విరిగాయి శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమ నేతలతో ఢిల్లీ పోలీసులు దుర్మార్గంగా ప్రవర్తించారని సుర్జేవాలా ఆరోపించారు. ‘‘మా వారిపై పోలీసులు ప్రాణాంతక దాడికి దిగారు. కేసీ వేణుగోపాల్‌ను, ఎంపీ శక్తిసింగ్ గోహిల్‌ను విపరీతంగా కొట్టారు. పోలీసుల దాడిలో కేంద్ర మాజీ హోం మంత్రి అయిన పి.చిదంబరంతో పాటు మరో నేత ప్రమోద్ తివారీ పక్కటెముకలు ఫ్రాక్చరయ్యాయి. చిదంబరం కళ్లద్దాలు ఏఐసీసీ కార్యాలయం బయట రోడ్డుపై పగిలిపోయి కన్పించాయి’’ అని చెప్పారు. కేంద్ర మాజీ హోం మంత్రితో ఎలా వ్యవహరించాలో కూడా మోదీ సర్కారుకు తెలియదా అని దుయ్యబట్టారు. ఇంకెన్ని దుర్మార్గాలకు దిగుతారో చెప్పాలన్నారు. తనతో పోలీసులు దురుసుగా వ్యవహరించారంటూ చిదంబరం కూడా ట్వీట్ చేశారు. ‘‘ముగ్గురు భారీకాయులైన పోలీసులు నాపై పడ్డారు. అదృష్టం కొద్దీ కేవలం ఫ్రాక్చర్‌తో తప్పిం చుకున్నా. అది హెయిర్‌లైన్ ఫ్రాక్చరైతే 10 రోజుల్లో మానుతుందని డాక్టర్లు చెప్పారు. నేను బానే ఉన్నా. రేపట్నుంచి మళ్లీ రంగంలో దిగుతా’’ అని చెప్పారు. వేణుగోపాల్‌ను పోలీసులు ఈడ్చుకెళ్తున్న ఫొటోలు, వీడియోలను కాంగ్రెస్ పోస్ట్ చేసింది. -
ఢిల్లీ: ఈడీ విచారణకు హాజరైన రాహుల్ గాంధీ
సాక్షి, న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ సోమవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఈడీలోని ఇద్దరు అధికారులు రాహుల్ గాంధీని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఈడీ ఆఫీసులు ముందు ఏఐసీసీ నిరసనలను చేపడుతోంది. ఈ క్రమంలో బషీర్‌బాగ్ ఈడీ ఆఫీస్ ముందు తెలంగాణ కాంగ్రెస్ నిరసన చేపట్టింది. కేంద్రం కక్ష సాధింపుల చర్యలను నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు ఆందోళనలు చేపట్టారు. అందులో భాగంగా నగరంలోని నెక్లెస్ రోడ్ ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ర్యాలీ ప్రారంభించి ఈడీ కార్యాలయం వరకు కాంగ్రెస్ శ్రేణుల నిరసన చేపట్టారు. రాహుల్ విచారణ నేపథ్యంలో ఏఐసీసీ కార్యాలయం వద్ద భారీగా పోలీసుల మోహరించారు. రాహుల్ గాంధీకి మద్దతుగా ఆఫీస్‌కు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ , పలువురు కాంగ్రెస్ ఎంపీలు చేరుకున్నారు. కాగా నేషనల్ హెరాల్డ్ ఆస్తులను కాంగ్రెస్ ప్రాయోజిత యంగ్ ఇండియా సంస్థ ద్వారా అక్రమ పద్ధతిలో హస్తగతం చేసుకున్నారంటూ మనీ ల్యాండరింగ్ చట్టాల కింద ఈడీ కేసు నమోదుచేసి దర్యాప్తు కొనసాగిస్తున్న విషయం తెల్సిందే. ఈ కేసు నిమిత్తమే రాహుల్‌ని ఈడీ విచారించనుంది. చదవండి: ED Summons To Sonia Gandhi: సోనియాకు మరోసారి సమన్లు జారీ చేసిన ఈడీ -
Sakshi Cartoon: విద్వేష బుల్డోజర్లను స్విచ్చాఫ్ చేయండి
విద్వేష బుల్డోజర్లను స్విచ్చాఫ్ చేయండి -
బీజేపీ-టీఆర్ఎస్ కుమ్మకై రైతులను హింస పెడుతున్నాయ్: మధు యాష్కీ
సాక్షి, ఖమ్మం: వరంగల్ పట్టణం మే 6నలో కిసాన్ సంఘర్షణ పోరాట సభ జరగనుందని ఆ కార్యక్రమానికి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్యఅతిథిగా హాజరు అవుతున్నారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ గౌడ్ తెలిపారు. ఆయన మంగళవారం ఖమ్మంలో మీడియాతో మాట్లాడుతూ.. ఖమ్మం మంత్రి గుండాగా మారి, కాంగ్రెస్ పార్టీ నేతలపై కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. మంత్రి వేధింపులు తట్టుకోలేక నగరంలో ఒక యువకుడు ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిద్ర పోతున్నడా ? అని ప్రశ్నించారు. రౌడీ మంత్రిని తక్షణమే కేబినెట్ బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి అయిన తారక రామారావు అండ చూసుకుని స్థానిక మంత్రి అజయ్ కుమార్ రెచ్చి పోతున్నాడని దుయ్యబట్టారు. బీజేపీ-మోదీ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే.. కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబ సభ్యుల ఆస్తులపై సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలతో విచారణ జరపాలన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త.. రాష్ట్రం వచ్చాక రాబందుల సమితిగా మారిందని, కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం మిల్లర్లతో కుమ్మక్కై వేల కోట్ల రూపాయలను దోపిడీ చేస్తోందని మండిపడ్డారు. బీజేపీ-టీఎర్ఎస్ పార్టీలు కుమ్మకై రైతులను హింస పెడుతున్నాయని అన్నారు. ఢిల్లీ రాజధానిలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసింది ధర్నా కాదు.. డ్రామా అని ఎద్దేవా చేశారు. సమస్యలు పరిష్కరించాల్సిన ప్రధానమంత్రి మనుషులు హైదరాబాద్‌లో ధర్నా చేస్తారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఢిల్లీలో ఏసీలు, కూలర్లు పెట్టుకుని డ్రామా చేస్తాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. విపరీతంగా ధరలు పెంచుతూ సామాన్యులను హింసకు గురి చేస్తున్నారని విమర్శించారు. -
అధిష్టానం ‘అలయ్ బలయ్’!
సాక్షి, హైదరాబాద్: పార్టీ అధిష్టానం అల్లంత దూరమనే భావన తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులకు దూరమవుతోందా? తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలని భావిస్తున్న ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు కూడా రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు దగ్గరవుతున్నారా? గత మూడు రోజులుగా ఢిల్లీ వేదికగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయా? అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. తెలంగాణ నేతలు సోమవారం నుంచి ఢిల్లీలో ప్రత్యేకంగా మకాం వేసి మరీ అధిష్టానం పెద్దలను కలుస్తుండడం, వీహెచ్, జగ్గారెడ్డి తదితర నాయకులకు ఢిల్లీ అగ్రనేతలు వరుసగా అపాయింట్మెంట్లు ఇస్తుండడం, త్వరలో రాష్ట్రానికి రానున్న రాహుల్‌గాంధీ పార్టీలోని అన్ని స్థాయిల నేతలను కలిసేందుకు ఏర్పాట్లు జరుగుతుండడంపై హర్షం వ్యక్తం చేస్తున్నాయి. వరుస భేటీలు తెలంగాణలో పార్టీని ఐక్యంగా ముందుకు తీసుకెళ్లేందుకు గాను గతంలో ఎన్నడూ లేనివిధంగా 40 మంది రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలతో రాహుల్‌గాంధీ సమావేశం కావడంతో భేటీల పరంపర మొదలయింది. అంతకుముందే ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు సమావేశమయ్యారు. రాహుల్‌తో సమావేశం ముగిసిన మరుసటి రోజే సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డిలు ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి కేసీ వేణుగోపాల్‌తో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఆ తర్వాత పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్‌ను జగ్గారెడ్డి కుటుంబ సమేతంగా కలిశారు. ఈలోపే రాహుల్‌గాంధీ కూడా జగ్గారెడ్డికి అపాయింట్మెంట్ ఇచ్చారు. జగ్గారెడ్డితో పాటు టీపీసీసీ మరో వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్‌ను కూడా కలిసేందుకు అంగీకరించారు. కుటుంబసభ్యులతో కలిసి ఫొటోలు జగ్గారెడ్డి.. తన భార్య, సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు నిర్మల, కుమారుడు భరత్‌సాయిరెడ్డి, కుమార్తె జయారెడ్డిలతో కలిసి వెళ్లి రాహుల్‌ను కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. ఇక మహేశ్‌కుమార్‌గౌడ్ తన కుమారుడు, లా విద్యార్థి ప్రణవ్గౌడ్ను వెంటబెట్టుకుని రాహుల్‌ను కలిశారు. ఇద్దరు నేతలు రాహుల్‌ను కలిసినప్పుడు కూడా రాజకీయ అంశాల కంటే పిల్లల చదువులు, కుటుంబ అంశాలపైనే రాహుల్ మాట్లాడినట్టు సమాచారం. మరో వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి కూడా రాహుల్‌తో భేటీ అయ్యారు. రాహుల్‌తో భేటీ తర్వాత జగ్గారెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే తన నియోజకవర్గ నేతలను కూడా ఢిల్లీకి తీసుకువచ్చి రాహుల్‌ను కలిసి ఫొటోలు దిగేలా ప్రయత్నం చేస్తానని చెప్పడం గమనార్హం. గతానికి భిన్నంగా.. కాంగ్రెస్ పెద్దలను ఢిల్లీ వెళ్లి కలవడం ఎంత కష్టమో.. రాష్ట్రానికి వచ్చినప్పుడు కూడా అంతే కష్టమనే భావన రాష్ట్ర పార్టీ శ్రేణుల్లో ఉంది. రాహుల్ లేదా సోనియా లేదా ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు ఎవరు వచ్చినా కీలక నాయకులు మినహా ఎవరికీ వారిని కలిసే అవకాశముండేది కాదు. పార్టీలో సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న వారు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులకు కూడా కాంగ్రెస్ పెద్దలను కలవడం ఓ టాస్క్లాగానే ఉండేది. అయితే ఈసారి అందుకు భిన్నంగా రాహుల్‌గాంధీ తెలంగాణ పర్యటన ఉంటుందనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. ఈనెలాఖరులో రాష్ట్రానికి రానున్న రాహుల్ రెండ్రోజులు ఇక్కడే ఉంటారని, ఒకరోజు బహిరంగ సభకు హాజరు కానుండగా, మరోరోజు రాష్ట్రానికి చెందిన అన్ని స్థాయిల్లోని పార్టీ నేతలతో సమావేశమవుతారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా టీపీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు, ప్రధాన కార్యదర్శులతో పాటు పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, ముఖ్య నేతలందరినీ కలిసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అదే విధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు, స్థానిక సంస్థలకు ప్రాతి నిధ్యం వహిస్తున్న నాయకులు, సభ్యత్వ నమోదులో కీలకపాత్ర పోషించిన వారితో కూడా రాహుల్‌తో కలిపించాలనే భావనలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. అందని ద్రాక్షలు కాదు..! ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు అందని ద్రాక్షలేమీ కాదని, అందరితో కలివిడిగా ఉంటారనే భావనను పార్టీ శ్రేణుల్లోకి తీసుకెళ్లాలనేది రేవంత్‌రెడ్డి యోచనగా కనిపిస్తోంది. ఆ భావన కలిగించడం ద్వారా జరగబోయే ఎన్నికల్లో మరింత క్రియాశీలంగా కేడర్ పనిచేస్తుందనే చర్చ కూడా పార్టీలో జరుగుతోంది. -
ఇంట్లో పోరు ఉండొద్దు.. కారుతో పొత్తుండదు
టీఆర్ఎస్ను ఓడించడమే లక్ష్యం టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంలను ఎదుర్కోవడంపైనే నేతలు దృష్టిపెట్టి పనిచేయాలి. టీఆర్‌ఎస్‌తోగానీ, ఎంఐఎంతోగానీ పొత్తు, స్నేహం లాంటి ఆలోచనలు ఉండనే ఉండవు. అలాంటి ఊహాగానాలను పట్టించుకోవద్దు. టీఆర్ఎస్ను ఓడించడమే లక్ష్యం. కొత్తవాళ్లను చేర్చుకోవడంపై దృష్టి పెట్టండి, యువతకు పెద్దపీట వేయండి. మనం.. ఓ కుటుంబం.. గతంలో జరిగింది.. జరిగిపోయింది.. మనమంతా ఒక కుటుంబం.. అందరం కలిసికట్టుగా పనిచేయాలి. తెలంగాణ ఇచ్చిన పార్టీగా రాష్ట్రంలో అధికారం సాధించాలి. నేను కూడా తెలంగాణకు పూర్తి సమయం కేటాయిస్తా.. –టీపీసీసీ నేతలతో రాహుల్‌గాంధీ సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీతో ఎట్టిపరిస్థితుల్లోనూ పొత్తు ఉండబోదని ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ తెలంగాణ కాంగ్రెస్ నేతలకు స్పష్టం చేశారు. టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంలను గట్టిగా ఎదుర్కోవడంపైనే దృష్టిపెట్టాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ అంతా ఒక కుటుంబమని.. ఇక నుంచి పార్టీ నేతలంతా విభేదాలు మాని ఏకతాటిపైకి రావాలని దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కలిసి పనిచేయాలన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన 40మంది ముఖ్య నేతలు సోమవారం ఢిల్లీలో రాహుల్‌గాంధీని కలిశారు. దాదాపు మూడున్నర గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో.. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ అంశాలు, ప్రభుత్వ విధానాలు, క్షేత్రస్థాయిలో పార్టీ స్థితిగతులు, అంతర్గత విభేదాలు, సంస్థాగత వ్యవహారాలు, పలు ఇతర అంశాలను రాహుల్ అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర నేతలు చెప్పిన అంశాలను విన్నారు. అనంతరం పలు సూచనలు చేశారు. మీడియా ముందు మాట్లాడొద్దు పార్టీలో ఏవైనా విభేదాలుంటే అంతర్గతంగా మాట్లాడుకోవాలని రాష్ట్ర నేతలకు రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు. మీడియా ముందు ఎవరూ మాట్లాడొద్దని సూచించారు. ఏవైనా అభిప్రాయ భేదాలుంటే అధిష్టానానికి చెప్పుకొనేలా తాను ఏర్పాటు చేస్తానని.. పార్టీ అంతర్గత విషయాలను బయట చర్చిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా రాష్ట్రంలో అధికారం సాధించాలని.. రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేయడంపై దృష్టిపెట్టాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రజాసమస్యలపై పోరుబాట పట్టాలని ఆదేశించారు. తాను కూడా తెలంగాణకు పూర్తి సమయం కేటాయిస్తానని పార్టీ నేతలకు మాట ఇచ్చారు. కాగా.. సమావేశంలో భాగంగా పలువురు నేతలు తమతో విడివిడిగా మాట్లాడాలని రాహుల్‌ను కోరారు. దీనిపై స్పందించిన రాహుల్.. త్వరలోనే అందరికీ వన్‌టూవన్ చర్చల కోసం సమయం ఇస్తానని మాట ఇచ్చారు. సమావేశంలో రాష్ట్ర నేతలు చెప్పే అంశాలను వినేందుకే రాహుల్ ప్రాధాన్యత ఇచ్చారని.. ఆయన కేవలం ఏడెనిమిది నిమిషాల పాటు మాత్రమే మాట్లాడారని తెలిసింది. సునీల్‌ను పరిచయం చేసిన రాహుల్ భేటీ సందర్భంగా సునీల్ కనుగోలును టీపీసీసీ నేతలకు రాహుల్‌గాంధీ పరిచయం చేసి, పలు సూచనలు చేసినట్టు సమాచారం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గురించి సునీల్ తన పని తాను చేసుకుంటున్నారని, ఆయనను ఓ ఏజెన్సీగా భావించవద్దని పేర్కొన్నట్టు తెలిసింది. సునీల్ కాంగ్రెస్ పార్టీ వర్కర్ అని, ఆయన పూర్తిగా ఏఐసీసీ పరిధిలో పనిచేస్తారని, అవసరమైనప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ నేతల సాయం తీసుకుంటారని వివరించినట్టు సమాచారం. గతంలో మాట్లాడినవి మర్చిపోయా.. భేటీ సందర్భంగా తాను పార్టీకోసం ఏమేం చేశాననే దానిపై రాహుల్‌కు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వివరించినట్టు సమాచారం. కొన్ని కారణాల వల్ల తాను మాట్లాడాల్సి వచ్చిందని.. తనకు 10 నిమిషాలు సమయమిచ్చి, తర్వాత నిర్ణయం తీసుకోవాలని కోరినట్టు తెలిసింది. దీనిపై స్పందించిన రాహుల్.. అంతా ఓ కుటుంబంలా పనిచేయాలని సూచించినట్టు సమాచారం. రాహుల్ చెప్పిన మాటతో తాను సంతృప్తి చెందానని, గతంలో తాను మాట్లాడిన విషయాలన్నీ మర్చిపోయానని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు పార్టీలో కమ్యూనికేషన్ గ్యాప్ నెలకొందని.. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై తాము ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావడం లేదని భేటీ సందర్భంగా పలువురు నేతలు రాహుల్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన రాహుల్.. భవిష్యత్తులో అలాంటి పరిస్థితి రాకుండా తాను చూసుకుంటానని చెప్పారు. పార్టీ అనుమతి లేకుండా టికెట్లను ప్రకటిస్తున్నారని, అలా జరగవద్దని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొనగా.. అలా టికెట్లు ప్రకటించడం సరైంది కాదని, భవిష్యత్తులో అలా జరగొద్దని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వానికి రాహుల్ సూచించినట్టు తెలిసింది. ఇక గత ఎన్నికల సందర్భంగా పొత్తుల పేరుతో చివరి వరకూ పార్టీ అభ్యర్థులను ప్రకటించలేకపోయామని, టికెట్లు వచ్చిన వారు సరిగా ప్రచారం చేసుకోలేకపోయారని కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివరించినట్టు సమాచారం. ఆరు నెలలు, ఏడాది ముందే అభ్యర్థులను ప్రకటిస్తే మంచిదని కూడా ఆయన కోరగా.. ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించే అంశంపై కసరత్తు చేద్దామని రాహుల్ చెప్పినట్టు తెలిసింది. ఇక అభ్యర్థుల ఎంపికకు సంబంధించి రాష్ట్రస్థాయిలో ఓ స్క్రీనింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేయాలనే అంశం కూడా చర్చకు వచ్చినట్టు సమాచారం. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినా.. పీఏసీకి అధికారం ఇవ్వడమా, లేక కొత్త కమిటీ ఏర్పాటు చేయడమా అన్నదానిపై చర్చిద్దామనే అభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. రాహుల్‌తో భేటీ అయిన నేతలు వీరే రాహుల్ గాంధీతో జరిగిన సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు డి.శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, సీతక్క, వీరయ్య, సీనియర్ నేతలు జానారెడ్డి, షబ్బీర్‌అలీ, మధుయాష్కీగౌడ్, దామోదర రాజనర్సింహ, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, వీహెచ్, రేణుకాచౌదరి, బలరాం నాయక్, పొన్నాల లక్ష్మయ్య, మహేశ్‌కుమార్‌గౌడ్, అంజన్‌కుమార్‌యాదవ్, అజారుద్దీన్, గీతారెడ్డి, సంపత్, చిన్నారెడ్డి, వంశీచంద్‌రెడ్డి, దాసోజు శ్రవణ్, ఎం.కోదండరెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, సంభాని చంద్రశేఖర్, కొండా సురేఖ, సుదర్శన్‌రెడ్డి, ఆర్.దామోదర్‌రెడ్డి, గడ్డం వినోద్, గడ్డం ప్రసాద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇక పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్, ఏఐసీసీ ప్రధానకార్యదర్శి కేసీ వేణుగోపాల్, కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాసన్ కూడా హాజరయ్యారు. -
పెట్రోల్ ట్యాంక్‌లు నింపుకోండి.. ‘ఎన్నికల ఆఫర్ ముగుస్తోంది’
న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్‌లో మరో రెండు రోజుల్లో అన్ని దశల్లో పోలింగ్ ముగియనుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ కూడా యూపీ చివర విడుత పోలింగ్‌తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో చివరి దశ పోలింగ్‌కు రెండు రోజు ముందే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీజేపీపై తీవ్రమైన విమర్శలు గుప్పించారు. మరో రెండు రోజుల్లో యూపీ చివరి దశ పోలింగ్ ముగిస్తుందని ఈ క్రమంలో ముందస్తుగా పెట్రోల్ ట్యాంక్‌ను నింపుకోవాలని ప్రజలకు సలహా ఇచ్చారు. పోలింగ్ ముగిసిన అనంతరం మళ్లీ పెట్రోలు రేట్లు అమాంతం పెరుగుతాయని సెటైర్లు వేశారు. ‘త్వరగా పెట్రోల్ ఫుల్ట్యాంక్ చేసుకోండి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ‘ఎన్నికల ఆఫర్’ అయిపోతుంది’ అని రాహుల్ గాంధీ ట్విటర్లో పేర్కొన్నారు. అంతర్జాతీయంగా చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లు దాటిందని తెలిపారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కారణంగా ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను లాక్ చేశాయని తెలిపారు. వచ్చే వారం ఎన్నికలు ముగిసిన తర్వాత మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే అవకాశం ఉందని అన్నారు. फटाफट Petrol टैंक फुल करवा लीजिए। मोदी सरकार का ‘चुनावी’ offer ख़त्म होने जा रहा है। pic.twitter.com/Y8oiFvCJTU — Rahul Gandhi (@RahulGandhi) March 5, 2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఏడవ దశ(చివరి) పోలింగ్ సోమవారం ముగిస్తుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మార్చి 10న విడుదల కానున్నాయి. దేశీయ ఇంధన ధరల పెరుగుదల అంతర్జాతీయ చమురు ధరల మీద ఆధాపడి ఉంటుంది. ఎందుకంటే సుమారు 85 శాతం చమురు అవసరాలను భారత్.. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. అయితే గత 118 రోజులు నుంచి భారత్‌లో ఇందన ధరలు పెరగకుండా స్థిరంగా ఉండటం గమనార్హం. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఉండటం వల్లనే చమురు ధరలు స్థిరంగా ఉన్నాయని విపక్షాలు మండిపడుతున్నాయి. -
ప్రధాని మోదీ గుప్పిట్లో వ్యవస్థలు: రాహుల్ గాంధీ
సాక్షి, చెన్నై: ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని పలు వ్యవస్థలను శాసిస్తూ పబ్బం గడుపుకుంటున్నారని కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్‌గాంధీ మండిపడ్డారు. ‘మీలో ఒకడిని’ పేరిట తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రచించిన స్వీయ జీవిత చరిత్ర పుస్తకాన్ని సోమవారం చెన్నైలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాహుల్ మాట్లాడుతూ.. రాష్ట్రాల సమాఖ్య భారత్ అని, ఈ సమైక్యతను కేంద్ర ప్రభుత్వం దెబ్బతీస్తోందని ఆరోపించారు. దేశ, రాష్ట్రాల చరిత్రలు తెలుసుకోకుండా ఆధిపత్యం చెలాయించేందుకు ప్రధాని సిద్ధపడుతున్నారని విమర్శించారు. బీజేపీని ఎలా ఎదుర్కోవాలో తమకు తెలుసని అన్నారు. ‘అందరికీ అన్నీ’ అనేది ద్రవిడ సిద్ధాంతమని, ఈ సిద్ధాంతాన్ని దేశవ్యాప్తం చేసేందుకు జాతీయ స్థాయిలో నాయకత్వం వహిస్తానని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) నేత తేజస్వీ యాదవ్ పాల్గొన్నారు. -
ఆ బాలుడ్ని అప్పగించండి: చైనాను కోరిన ఇండియన్ ఆర్మీ
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్- చైనా సరిహద్దుల్లో తప్పిపోయిన బాలుడు మీరామ్ టారోన్‌ను తమకు అప్పగించాలని భారత సైన్యం చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) కోరినట్లు రక్షణ శాఖ వర్గాలు గురువారం పేర్కొన్నారు. అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన 17 ఏళ్ల మీరామ్ టారోన్ అనే బాలుడుని చైనా ఆర్మీ.. కిడ్నాప్ చేసిందని అరుణాచల్ ప్రదేశ్ ఎంపీ తపిర్ గావో బుధవారం ఆరోపించారు. భారత భూభాగంలోని సియాంగ్ జిల్లాలో అతను అపహరణకు గురైనట్లు తెలిపారు. దీంతో సమాచారం అందుకున్న భారత ఆర్మీ.. హాట్‌లైన్ సాయంతో మీరామ్ టారోన్ విషయాన్ని పీఎల్ఏకు తెలిపింది. బాలుడుని పట్టుకొని ప్రొటోకాల్ ప్రకారం తమకు అప్పగించాలని ఇండియన్ ఆర్మీ.. చైనా సైన్యాన్ని కోరింది. మూలికలు సేకరించడానికి, వేటుకు వెళ్లిన సదరు బాలుడు దారితప్పిపోయిడంతో అదృశ్యం అయినట్లు తెలుస్తోంది. అరుణాచల్ ప్రదేశ్‌లో త్సాంగ్పో నది భారతదేశంలోకి ప్రవేశిస్తుందని అక్కడ బాలుడు అపహరణకు గురైనట్లు ఎంపీ తపిర్ గావో తెలిపారు. ఈ ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ.. రిపబ్లిక్ డేకు కొన్ని రోజల ముందే భారతదేశానికి చెందిన ఓ బాలుడిని చైనా కిడ్నాప్ చేసిందని, దీనిపై ప్రధాని మోదీ మౌనం వీడాలని డిమాండ్ చేశారు. బాలుడి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ట్వీటర్లో పేర్కొన్నారు. -
కేంద్రం గుడ్డిగా వ్యవహరిస్తోంది: రాహుల్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆశా ఆరోగ్య కార్యకర్తల సమ్మె నేపథ్యంతో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. తమకు మెరుగైన సేవా పరిస్థితులు, ప్రయోజనాలు కల్పించాలని ఆశా కార్యకర్తలు రెండు రోజులపాటు సమ్మె చేపట్టిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆశా కార్యకర్తల విషయంలో మౌనం వహిస్తోందని రాహుల్ విమర్శించారు. ప్రస్తుతం వారి సమస్యలను ఏమాత్రం వినిపించుకోకుండా గుడ్డిగా వ్యవహిస్తోందని విరుచుకుపడ్డారు. ఆశా వర్కర్లు దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి ఆరోగ్య రక్షకులుగా సేవలు అందిస్తారు. వారు నిజమైన ఆరోగ్యయోధులని అన్నారు. అటువంటి ఆరోగ్య కార్యకర్తలు నేడు తమ సొంత హక్కుల కోసం రోడ్లపై సమ్మెల చేయాల్సి వస్తోందని రాహుల్ కేంద్రంపై మండిపడ్డారు. (మోదీ ఎందుకు అబద్ధాలు చెబుతున్నారు?) ఆశా(అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్), అంగన్వాడీ, నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలోని కార్మికులకు సంబంధించిన పలు మీడియా నివేదికలను రాహుల్ తన ట్విటర్లో ట్యాగ్ చేశారు. నేషనల్ హెల్త్ మిషన్ శుక్రవారం నుంచి రెండు రోజులపాటు దేశవ్యాప్తంగా సమ్మెలో పాల్గొన్న విషయం తెలిసిందే. పది సెంట్రల్ ట్రేడ్ యూనియన్ల పిలుపుతో దేశ వ్యాప్తంగా సుమారు ఆరు లక్షల మంది ఆశా వర్కర్లు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. -
రాహుల్ క్షమాపణ చెప్పాల్సిందే: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్ : ఆధారాలు లేని ఆరోపణలు చేసి బీజేపీపై బురద చల్లాలని అనుకుంటే చూస్తూ ఊరుకోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్షణ్ హెచ్చరించారు. రఫెల్ వ్యవహారంపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు నిరసనగా అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేపీ నాయకులు శనివారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. రాహుల్ తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ క్షమాపణ చెప్పేదాకా దేశ ప్రజలు వదిలిపెట్టరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆకాశం, పాతాళంలో కూడా కాంగ్రెస్ అవినీతి ఉంటుందని, కాంగ్రెస్ ఒక బెయిల్ గాడీ అని విమర్శించారు. పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాత పెట్టారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఆలీబాబా దొంగల ముఠాలంటిదని, దేశ సంపదను దోచుకొని విదేశాల్లో దాచుకున్నారని దుయ్యబట్టారు. అర్థం లేని విమర్శలు చేస్తున్నారు రాహుల్ చిన్న పిల్లల మనస్తత్వంతో విమర్శలు చేస్తున్నారని, రఫెల్‌పై సుప్రీంకోర్టు చెంపపెట్టులాంటి తీర్పు ఇచ్చిందని లక్ష్మణ్ స్పష్టం చేశారు. క్షమాపణ చెప్పడం కాదు, నోరు అదుపులో పెట్టుకోవాలని కోర్టు సూచించిందని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ నాయకులు పాకిస్తాన్ భాష మాట్లాడుతున్నారని, కోడిగుడ్డుపై ఈకలు పీకే రాజకీయాలు నడవవని మండిపడ్డారు. దేశ భద్రత కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచిస్తూంటే రాహుల్ మాత్రం అర్థంలేని విమర్శలు చేస్తున్నారని, మోదీకి మంచి పేరు వస్తుందనే రఫెల్‌పై రివ్యూ పిటిషన్ వేశారని ఎమ్మెల్సీ రాంచందర్ రావు విమర్శించారు. ప్రజలు కాంగ్రెస్‌కు బుద్ది చెప్పి మోదీకి మద్దతుగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. ధర్నాలో లక్ష్మణ్‌తో పాటు ఎమ్మెల్సీ రామచందర్‌రావు, పొంగులేటి సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు. -
నమ్మకంగా ముంచేశారా?
న్యూఢిల్లీ: ఇటీవలి లోక్‌సభ ఎన్నికల విషయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఆయన నమ్మకస్తులే మోసం చేశారన్న వార్తలు వస్తున్నాయి. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితులు, పార్టీ వ్యూహకర్తల బృందం అసలు విషయాన్ని దాచిపెట్టి, అంతా బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉందంటూ రాహుల్ గాంధీని నమ్మించారని, ఫలితాలు వెలువడ్డాకా వారంతా అందుబాటులో లేకుండాపోయారని జాతీయ వార్తా పత్రిక ‘ద గార్డియన్’లో ఒక కథనం వచ్చింది. దీని ఆధారంగా ఇతర పత్రికలు,వెబ్సైట్లు ఈ విషయాన్ని ప్రచురించాయి. అయితే, ఈ కథనం నిరాధారమని కాంగ్రెస్ డేటా ఎనలిస్ట్ చీఫ్ ప్రవీణ్ చక్రవర్తి అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 164 నుంచి 184 సీట్లు కచ్చితంగా వస్తాయని, ప్రధాని పదవి రాహుల్ గాంధీదేనని వారు గట్టిగా చెప్పడంతో రాహుల్ నమ్మేశారని ఆ కథనం పేర్కొంది. వారి మాటలు పట్టుకుని ప్రభుత్వం ఏర్పాటుకు రాహుల్ సన్నాహాలు చేసుకున్నట్టు తెలిసింది. అఖిలేశ్ యాదవ్, ఎంకే స్టాలిన్, ఒమర్ అబ్దుల్లా, శరద్‌పవార్ తదితర నేతలకు రాహుల్ ఫోన్లు చేసి మంత్రివర్గంలో వారికి చోటు కల్పించే విషయమై చర్చలు జరిపారని తెలిసింది. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతివ్వాల్సిందిగా రాష్ట్రపతిని కోరుతూ సీనియర్ న్యాయవాదుల తో రెండు లేఖలు రాయించుకున్నారట. అంతటితో ఆగకుండా పార్టీ కేంద్ర కార్యాలయం ముందు దాదాపు పదివేల మందితో పెద్ద ఎత్తున విజయోత్సవాలు నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేసినట్టు ఆ కథనం పేర్కొంది. తీరా ఫలితాలు వెల్లడయ్యేసరికి పరిస్థితి తారుమారైంది. కేంద్రంలో అధికారం చేపట్టే మాట అటుంచి కనీసం ప్రతిపక్షం హోదా దక్కడం కష్టమయ్యే పరిస్థితి ఏర్పడింది. దాంతో హతాశుడైన రాహుల్ అధ్యక్ష పదవికి రాజనామా చేస్తానని పట్టుబట్టారు. పార్టీ వ్యూహకర్తలు రాహుల్నేకాకుండా సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలనూ నమ్మించారని తెలిసింది. దీనికి కారకులైన, ఎన్నికల వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించిన ప్రవీణ్ చక్రవర్తి, దివ్య స్పందన ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఎవరికీ కనబడటం లేదట. దివ్య అయితే తన ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్ ఖాతాలను మూసేశారని తెలిసింది. కాంగ్రెస్ పార్టీ శక్తి యాప్‌ను నిర్వహించే చక్రవర్తి డేటా విశ్లేషకుడిగా వ్యవహరించారు. దేశవ్యాప్తంగా ప్రజల నాడి ఎలా ఉందో సర్వే చేసి చెబుతానని ఆయన 24 కోట్లు తీసుకున్నారని, అయితే, దానికి సంబంధించి కనీసం ఒక్క నివేదిక ఇవ్వలేదని తెలిసింది. చక్రవర్తి తమ దగ్గర ఉంటూ బీజేపీ ఏజెంటుగా పని చేశాడని కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇప్పుడు అనుమానిస్తున్నారు. అలాగే, కాంగ్రెస్ తరఫున సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తానని చెప్పి దివ్య రూ.8 కోట్లు తీసుకున్నారని తెలుస్తోంది. అభూత కల్పన ఎన్నికల విషయంలో తమ విభాగం రాహుల్ గాంధీని మోసగించిందంటూ వచ్చిన కథనాలను కాంగ్రెస్ పార్టీ డేటా ఎనలిస్ట్ చీఫ్ ప్రవీణ్ చక్రవర్తి ఖండించారు. అవన్నీ అభూతకల్పనలని, నిరాధారమైనవని సోమవారం న్యూఢిల్లీలో ఆయన ఒక ప్రకటనలో చెప్పారు. -
మోదీ మళ్లీ ప్రధాని కాబోరు
మొరేనా/భిండ్/గ్వాలియర్: ప్రధాని మోదీపై దేశప్రజలు నమ్మకం కోల్పోయారని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ విమర్శించారు. ఆయన మరోసారి ప్రధాని కాబోరని వ్యాఖ్యానించారు. 2014 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో మోదీ ఘోరంగా విఫలమయ్యారనీ, అందుకే ప్రజలకు ముఖం చూపించలేకపోతున్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సామాన్యులపై భారం పడకుండా పెట్రోల్, డీజిల్‌లను వస్తుసేవల పన్ను(జీఎస్టీ) పరిధిలోకి తెస్తామన్నారు. మధ్యప్రదేశ్‌లోని మొరేనా, గ్వాలియర్, భిండ్‌లో బుధవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో రాహుల్ మాట్లాడారు. అంబానీని కౌగిలించుకోను.. ప్రధాని మోదీకి పెద్దపెద్ద పారిశ్రామికవేత్తలపై ఉన్న ప్రేమ సామాన్యులు, పేదలు, యువతపై లేదని రాహుల్ విమర్శించారు. ‘15 మంది బడా పారిశ్రామికవేత్తలకు మోదీ ప్రభుత్వం రూ.5.55 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసింది. కానీ రైతులు, యువతపై ఇదే సానుభూతి చూపించలేకపోయింది. ఓ రైతు వ్యవసాయ రుణాలను చెల్లించకలేకపోతే జైలుకు పోతున్నాడు. మేం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇలాంటి రైతన్నలను అరెస్ట్‌చేయకుండా చర్యలు తీసుకుంటాం. విదేశాలకు వెళ్లే మోదీ వ్యాపారవేత్తలతో కరచాలనం చేయడంతో పాటు కౌగిలించుకుంటూ ఉంటారు. కానీ నేనుమాత్రం అనిల్ అంబానీని ఎప్పుడూ ఆలింగనం చేసుకోను. దేశంలోని పేదప్రజలకు తోడుగా ఉంటాను’ అని తెలిపారు. అమరులను అవమానించారు.. రఫేల్ ఒప్పందాన్ని దొంగలించడం ద్వారా మోదీ అమరుల్ని అవమానించారని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రఫేల్ ఫైటర్జెట్లను భారత్‌లో కాకుండా ఫ్రాన్స్‌లో తయారుచేయాలని నిర్ణయించడం ద్వారా భిండ్‌లో వందలాది యువకులు ఉపాధి కోల్పోయారని ఆరోపించారు. ‘రఫేల్’పై విచారణ జరుపుతాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రఫేల్ ఒప్పందంపై విచారణ జరుపుతామని రాహుల్ ప్రకటించారు. ‘ఈ విచారణలో ప్రధానంగా ఇద్దరి పేర్లే బయటకు వస్తాయి. వాటిలో మోదీ ఒకరు కాగా, అనిల్ అంబానీ మరొకరు. మోదీకి దమ్ముంటే అనిల్ అంబానీ ఇంట్లో తప్పించి ఎక్కడైనా నాతో బహిరంగ చర్చకు రావాలి. నాతో 15 నిమిషాలు చర్చకు కూర్చుంటే మోదీ దేశానికి ముఖం చూపించుకోలేరు. నిజాల నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఉగ్రసంస్థ జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్‌ను బీజేపీ ప్రభుత్వం జాగ్రత్తగా విమానంలో వదిలిపెట్టింది. అదే ఉగ్రవాది పుల్వామాలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల మరణానికి కారకుడయ్యాడు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 14న జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ లక్ష్యంగా జరిగిన ఆత్మాహుతి దాడిలో ఓ పోలీస్, 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. -
కర్మ మీకోసం ఎదురుచూస్తోంది!
న్యూఢిల్లీ: భారత దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీ అవినీతిపరుడిగా అంతమయ్యారని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ స్పందించారు. ‘మోదీజీ.. యుద్ధం ముగిసిపోయింది. కర్మ ఫలితం మీకోసం ఎదురుచూస్తోంది. మీ గురించి మీ మనసులో ఉన్న భావాలను నా తండ్రిపై రుద్దడం ద్వారా మీరు తప్పించుకోలేరు. మీకో పెద్ద కౌగిలింత, ప్రేమతో.. రాహుల్’ అని ట్వీట్ చేశారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో యూపీలో శనివారం ప్రచారంలో పాల్గొన్న మోదీ రాహుల్‌గాంధీని ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘మీ తండ్రి రాజీవ్‌గాంధీని ఆయన అనుచరులంతా ‘మిస్టర్ క్లీన్‘గా అభివర్ణించేవారు. చివరకు ఆయన నంబర్ 1 అవినీతిపరుడిగా అంతమయ్యారు’ అని తీవ్రవ్యాఖ్యలు చేశారు. మోదీ వ్యాఖ్యలపై ప్రియాంకా గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. ‘అమరుల పేర్లు చెప్పి ప్రజలను ఓట్లడిగే మోదీ పిచ్చిపిచ్చిగా మాట్లాడారు. దేశం కోసం ప్రాణాలర్పించిన ఓ మంచి వ్యక్తిని అవమానించారు. అమేథీ ప్రజల సేవలోనే రాజీవ్ ప్రాణలు అర్పించారు. ఆ ప్రజలే మోదీకి బుద్ధి చెబుతారు. మోదీజీ.. మీలాంటి మోసకారుల్ని దేశం ఎన్నటికీ క్షమించదు’ అని విమర్శించారు. సభ్యత, సంస్కారాల విషయంలో మోదీ అన్ని హద్దులు దాటేశారని కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ వ్యాఖ్యలపై ఓ గుజరాతీగా సిగ్గుపడుతున్నానని రాజీవ్ స్నేహితుడు, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చీఫ్ శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యానించారు. మోదీ వ్యాఖ్యలపై ఢిల్లీ మాజీ సీఎం షీలాదీక్షిత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
అక్కడి సేల్స్.. జనం పల్స్ చెబుతాయి!
సాక్షి, సెంట్రల్ డెస్క్ : కోల్‌కతాలో అతి పెద్ద హోల్‌సేల్ మార్కెట్ బుర్రా బజార్. అక్కడ అడుగుపెడితే.. ఎలక్షన్ ఫీవరే కాదు, జనం నాడిని కూడా పట్టుకోవచ్చు. ఈ మార్కెట్లో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీకి సంబంధించిన ఎన్నికల సామగ్రి ఎక్కువగా అమ్ముడుపోతుంది. జాతీయ జెండాలు, టీ షర్ట్లు, చీరలు, స్టోన్స్, గొడుగులు, బ్యాడ్జెట్స్, రిస్ట్ బ్యాండ్స్, బెలూన్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. వాటి మీద మోదీ ఫొటోలు, లేదంటే ఆకట్టుకునే బీజేపీ ఎన్నికల నినాదాలు కనిపిస్తాయి. ఇక టీఎంసీ ఎన్నికల గుర్తు గడ్డి, రెండు పువ్వులు, ఆ పార్టీ ఎన్నికల నినాదాలు ముద్రించి ఉన్న వస్తువులకీ డిమాండ్ ఎక్కువుంది. గత రెండు నెలల అమ్మకాలు పరిశీలిస్తే టీఎంసీకి చెందినవి 10 వేల వస్తువులు అమ్ముడుపోతే, బీజేపీవి 2,500 అమ్ముడయ్యాయి. ‘కోల్‌కతాలో అతి పెద్ద మార్కెట్ ఇదే. బెంగాల్ నలుమూలల నుంచి ఎన్నికల సమయంలో పార్టీ మద్దతుదారులు వచ్చి రకరకాల వస్తువులు కొంటుంటారు. 50 ఏళ్లుగా నా దుకాణం ఇక్కడే ఉంది. తృణమూల్ పార్టీ వస్తువులకే డిమాండ్ ఎక్కువ. టీఎంసీ, బీజేపీ అమ్మకాలు 4ః1 నిష్పత్తిలో ఉంటాయి’ అని గంభీర్ అనే దుకాణదారుడు వివరించారు. ఈ అమ్మకాలే ఓ రకంగా పశ్చిమ బెంగాల్లో ఎన్నికల సరళిని కూడా తెలుపుతోందని ఆయన అన్నారు. ‘ఎన్నికలకు ఆరు నెలల ముందే పార్టీల వారీగా సామగ్రిని అమ్మకానికి పెడతాం. మొత్తమ్మీద అమ్మకాల ఆధారంగా జనం మూడ్‌ని పసిగట్టగలం’ అని మరో దుకాణదారుడు కిషన్ దాగా వ్యాఖ్యానించారు. వాస్తవానికి ఈ మార్కెట్లో మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లోని సూరత్ నుంచి వచ్చిన వ్యాపారులే ఎక్కువున్నారు. కానీ ఈ మార్కెట్‌పై మమత పట్టు కొనసాగుతోంది. రాహుల్ టీ షర్టుల్ని ఎవరూ పట్టించుకోవట్లేదు. -
న్యాయ్‌పై అనుమానమెందుకు?
శ్రీనగర్ (ఉత్తరాఖండ్): బడావ్యాపారవేత్తలు నీరవ్‌మోదీ, మెహుల్ చోక్సీలాంటి వారి జేబులు నింపడానికి సందేహించని బీజేపీకి, న్యాయ్ పథకం అమలుపై అనుమానాలెందుకని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఎత్తిపొడిచారు. ఉత్తరాఖండ్‌లో జరిగిన పార్టీ ఎన్నికల ర్యాలీల్లో ఆయన మాట్లాడారు. ‘మీ(ప్రజలు) నుంచి తీసుకున్న డబ్బును ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ, అనిల్ అంబానీ లాంటి వారికి ప్రధాని మోదీ ఇచ్చేశారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడే న్యాయ్ పథకం అమలుకు డబ్బు ఎక్కడి నుంచి తెస్తారంటూ అడుగుతున్నారు’ అని తెలిపారు. ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి దుష్ప్రభావం పడకుండానే ఈ పథకాన్ని అమలు చేయవచ్చంటూ ఆర్థిక వేత్తలు చెప్పారని ఆయన అన్నారు. దాదాపు 25 కోట్ల మంది నిరుపేద ప్రజలకు ఐదేళ్లలో ఏడాదికి రూ.72 వేల చొప్పున అందించేందుకు రూ.3.6 లక్షల కోట్ల మేర అవసరమవుతాయని ఆయన తెలిపారు. 2014 ఎన్నికల్లో రైతులు, యువతకు ఇచ్చిన హామీలను బీజేపీ ప్రభుత్వం విస్మరించిందన్నారు. -
ఏకపక్షానికి ‘ఎదురుగాలి’
పన్నెండు నెలలు.. కేవలం పన్నెండు నెలలు భారత రాజకీయ చరిత్రనే తిరగరాశాయి. ఈ ఏడాది వేసవిలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో నిజమైన పోటీని మనం చూడబోతున్నాం. 2017లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ పోరాటంతో నరేంద్రమోదీ, అమిత్‌షా ద్వయాన్ని కలవరపర్చిన రాహుల్ గాంధీ కాంగ్రెస్‌కు కొత్త ఊపిరి పోశారు.మూడు కీలకమైన హిందీ ప్రాబల్య రాష్ట్రాల్లో బీజేపీని చావు దెబ్బ తీయడం ద్వారా మోదీ, షా వ్యూహాలకు రాహుల్ తొలి సవాలు విసిరారు. బీజేపీ రూపంలో ఏకధ్రువ పాలన తప్పదన్న పరిస్థితిని మార్చి రెండో ధ్రువంగా కాంగ్రెస్‌ను నిలిపిన రాహుల్ 2019 సార్వత్రిక ఎన్నికల్లో మోదీని ఏమాత్రం ఢీకొనగలరనేది అసలు ప్రశ్న. చాలామంది రాజకీయ విశ్లేషకులు 2017 శీతాకాలం వరకు మూడు అంశాలలో ఏకాభిప్రాయంతో ఉండేవారు: అవేమిటంటే, నరేంద్ర మోదీ రెండో దఫా అధికారంలోకి రావడం ఖాయం; రాహుల్ గాంధీకి, ఆయన నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీకి తుది పతనం తప్పదు; ఇందిరాగాంధీ హయాం ముగిసిన చాలాకాలం తర్వాత భారత్ సుదీర్ఘకాలం పాటు ఏక పార్టీ పాలన, ఏకధ్రువ పాలన వైపుగా నడుస్తోంది. ఈ మూడు అంశాలకు దన్నుగా, ఉత్తరప్రదేశ్‌లో పొందిన భారీ విజయంతో దేశంలోని 21 రాష్ట్రాలు బీజేపీ ఏలుబడిలోకి వచ్చాయి. మోదీ ప్రభుత్వ పాలనలో మిగిలిన రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికల్లోనూ, 2019లో జరిగే అతిపెద్ద పరీక్షలోనూ సంభవించనున్న ఫలితాలకు తగిన భూమికను ఇవి నిర్దేశించినట్లే కనిపించింది. అయితే 2017 డిసెంబర్ మధ్యనాటికి పరిస్థితిలో ఏదో మార్పు వచ్చింది. అవును.. గుజరాత్లో వరుసగా ఆరోసారి కూడా బీజేపీ గణనీయ విజయం సాధించింది. కానీ ఎవరూ ఊహించని విధంగా తీవ్రమైన పోటీ నెలకొంది. నరేంద్రమోదీ, అమిత్ షాలు తమ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ప్రదర్శించిన ఆందోళనలు గుజరాత్ ఎన్నికల ఫలితాలు ప్రతిబింబించాయి కూడా. గుజరాత్ ఎన్నికలు జరిగిన కొద్ది కాలంలోనే జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని అటు విజయమూ, ఇటు ఉపశమనమూ కలగలిసిన భంగిమతో కన్నీళ్లు కార్చారు కూడా. ఆ సన్నివేశం గుజరాత్ ఎన్నికలు ఎంత పోటాపోటీగా జరిగాయో తేల్చి చెప్పింది. దీంతో మోదీషా రాజకీయాల్లో ఇది మౌలిక మార్పును తీసుకొస్తుందని అప్పట్లే రాజకీయ వ్యాఖ్యాతలు రాశారు కూడా. అంతవరకు అభివృద్ధి, ఉద్యోగాల కల్పన గురించి ఆలోచించకుండా వీరు హిందుత్వ, కరడుగట్టిన జాతీయవాదం, సంక్షేమవాదం, అవినీతిని నిర్మూలించే భారీ స్థాయి ప్రచారంలో తలమునకలై ఉండేవారు. అలాంటి సమయంలో సరైన పిలుపునే ఇచ్చామని మేం ఒకరకంగా సంతృప్తి చెందాం కూడా. అయితే గుజరాత్ ఎన్నికలు ఏమంత ముఖ్యమైన మార్పుగా కనిపించలేదు. కానీ దాని ప్రభావాన్ని అంచనా వేయడంలో రాజకీయ వ్యాఖ్యాతలుగా మేం విఫలమయ్యాం. భారత రాజకీయాలు తదుపరి 12 నెలల్లో దాని ఏకధ్రువ పరిస్థితిని కోల్పోనున్నాయన్న విషయాన్ని 2017 డిసెంబర్18న ఎవరూ పెద్దగా ఊహించలేకపోయారు. కానీ ఇప్పుడు సరిగ్గా అదే జరిగింది. ఒక టీవీ చానల్ కార్యక్రమంలో ఆ చానల్ యాంకర్ నవికా కుమార్‌కు, బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్‌కి మధ్య జరిగిన సంవాదం మన రాజకీయాలు ఎంత ఏకధ్రువ స్వభావాన్ని సంతరించుకున్నాయో స్పష్టంగా తెలిపింది. కర్ణాటక ఎన్నికలో అధికారం చేజిక్కించుకోవడానికి తగిన సంఖ్యను సాధించలేకపోతే, బీజేపీ ఏం చేయగలదని ఆ టీవీ యాంకర్ ప్రశ్నించారు. దానికి పాలక పార్టీలో అత్యంత శక్తిమంతుడైన రామ్ మాధవ్, ‘అయితే ఏంటి, మాకు అమిత్ షా ఉన్నారు’ అని సమాధానమిచ్చారు. అది సొంత డబ్బా మాత్రం కాదు. బీజేపీకి తగినన్ని స్థానాలు రాకపోతే గెలిచిన మిగిలిన పార్టీల సభ్యులను బీజేపీలోకి ఆకర్షిస్తాం అనే ధీమాను రామ్ మాధవ్ వ్యాఖ్య వ్యక్తం చేసింది. గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లు సాధించిన అతి పెద్ద పార్టీగా బరిలో నిలబడలేకపోయినప్పటికీ, మేఘాలయాలో మైనారిటీలో ఉన్నప్పటికీ బీజేపీ ఆ రాష్ట్రాల్లో అధికారం సాధించగలిగింది. సీట్లు ముఖ్యం కాదని, తనకు పోటీయే లేదని బీజేపీ ఇక్కడ నిరూపించుకుంది. అది అమిత్‌షా వ్యూహంతో గెల్చుకున్న అధికారమని రామ్ మాధవ్ సూచించారు. కానీ తొలిసారిగా కర్ణాటక అసెంబ్లీ ఫలితాలతో ఈ పరిస్థితిలో మార్పువచ్చింది. అతిచిన్న పొత్తుదారుకు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టడం ద్వారా కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ప్రత్యర్థిని నివ్వెరపర్చింది. దీంతో నూతన రాజకీయాలకు నాంది ఏర్పడింది. బీజేపీని అధికారంలోంచి తప్పించాలని బలంగా కోరుకుంటున్న పార్టీలన్నీ పొత్తుకు అంగీకరించే ధోరణి పెరిగింది. దానికోసం ఎలాంటి మూల్యాన్ని చెల్లించడానికైనా ఈ పార్టీలు ఇప్పుడు సిద్ధపడిపోయారు. ఇది నిజంగానే అమిత్ షా రాజకీయాలకు సవాల్ విసిరింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుకోసం బీజేపీ ఎన్ని పన్నాగాలూ పన్నినప్పటికీ, ఎన్ని కుయుక్తులు అల్లినప్పటికీ, అతిపెద్ద పార్టీగా నంబర్ల గేమ్‌ను ఆడినప్పటికీ అధికారాన్ని కైవసం చేసుకోలేకపోయింది. తొలిసారిగా, మోదీ, షాలు ఓటమి ఎరుగని, పరాజయం తెలీని మహా వ్యూహకర్తలు కాదని కర్ణాటక నిరూపించింది. వ్యూహాత్మకంగా బీజేపీని ఓడించగల సమయస్ఫూర్తిని కాంగ్రెస్ ప్రదర్శించింది. పైగా, మోదీ కేంద్రంగా నడిచే ఎన్నికల ప్రచార పోరాటంలో మోదీ తొలిసారిగా విఫలమయ్యారు. బీజేపీకి దన్నుగా నిలిచే అధికార వనరులూ, ఏజెన్సీలు కర్ణాటకలో ఎమ్మెల్యేలను గెల్చుకోవడంలో పరాజయం పొందాయి. ప్రధానంగా సుప్రీంకోర్టు బీజేపీ ఎత్తుగడలకు అడ్డుకట్ట వేసింది. గుజరాత్లో అహ్మద్ పటేల్‌ను రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కాకుండా చూడాలని మోదీ, షా ద్వయం చేసిన ప్రయత్నాలకు తొలి సంస్థాగత వైఫల్యం సంభవించిన సంవత్సరం తర్పాత బీజేపీని అధికారం నుంచి తప్పించగలమని, ఉనికి కాపాడుకోవడమే కాదు. గెలుపు కూడా సాధించగలమనే నమ్మకాన్ని కర్ణాటక ఫలితాలు స్పష్టం చేశాయి. సరిగ్గా ఇదే హిందీ ప్రాబల్య ప్రాంతాల్లో తదుపరి జరిగిన ఎన్నికలకు ఒక విభిన్న పొందికను నిర్దేశించింది. మోదీని ఓడించవచ్చని కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు ఇప్పుడు నమ్మసాగాయి. 2017 డిసెంబర్మధ్యనాటికి కలలో కూడా ఇలాంటి స్థైర్యం వాటికి ఉండేది కాదు. 2018 డిసెంబర్ మధ్య నాటికి అధికారం తమకు చేరువలో ఉందని తొలిసారిగా కాంగ్రెస్‌తో సహా ప్రతిఫక్షాలకు విశ్వాసం కలిగింది. అందుకే 2017 డిసెంబర్ నుంచి 2018 డిసెంబర్ మధ్య కాలం అత్యంత ముఖ్యమైన రాజకీయ సంవత్సరంగా మనం పిలుస్తున్నాం. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ ఫలితాలు ప్రకటితమైన మధ్యాహ్నమే, మోదీ ప్రవచిస్తూ వచ్చిన కాంగ్రెస్ విముక్త భారత్ భావన కథ ముగిసిపోయిందని వ్యాఖ్యాతలుగా చెప్పాం. ఇటీవల ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ కూడా పరోక్షంగా ఈ వాస్తవాన్ని గుర్తించారు. కాంగ్రెస్ ముక్త్ అనే తన భావనకు అర్థం కాంగ్రెస్ పార్టీని నిర్మూలించాలని కాదని, దాని భావజాలం, ఆలోచనలు ఉనికిలో లేకుండా పోవాలన్నది తన అభిమతమని మోదీ తొలిసారిగా నిర్వచనమిచ్చారు. కాంగ్రెస్ అలోచనలు అంటే కులతత్వం, వంశపారంపర్య రాజకీయాలు, అప్రజాస్వామికమైన, బంధుప్రీతితో కూడిన రాజకీయాలు మాత్రమేనని మోదీ వివరణ ఇచ్చారు. ఇప్పుడు రాహుల్ గాంధీ బరిలో ముందుకురావడం, ఉత్తరప్రదేశ్‌లో కుల ప్రాతిపదిక పార్టీలైన సమాజ్‌వాదీ, బహుజన్ సమాజ్ పార్టీలు కూటమి బీజేపీకి హెచ్చరికలు పంపడం, మోదీపై అవినీతి ఆరోపణలతో కాంగ్రెస్ ఎదురుదాడికి దిగటం వంటి పరిణామాలు బీజేపీకి అడ్డం తిరిగాయి. కాంగ్రెస్ ఆలోచనలు నశించాలి అనే మోదీ నిర్వచనం సరైందే అనుకుందాం. కానీ 2010 తర్వాత తొలిసారిగా కాంగ్రెస్ తనను తాను శక్తివంతమైన పార్టీగా మార్చుకుని ముందుకొచ్చింది. భారతీయ రాజకీయాల్లో గత మూడేళ్ల తర్వాత ఏర్పడిన రెండో ఏక ధ్రువపార్టీగా కాంగ్రెస్ అవతరించింది. అయితే మోదీ 2019 సార్వత్రిక ఎన్నికల్లో దుర్భల స్థితిలో ఉన్నారని చెప్పడానికి మీకు కాస్త దమ్ముండాలి మరి. ఆయన వ్యక్తిగత ప్రజాదరణ, తన శ్రోతలతో తానేర్పర్చుకున్న అనుసంధానం, ఆకర్షణ శక్తి ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. మనం ముందే చెప్పుకున్నట్లుగా భారతదేశంలో మెజారిటీని కలిగివున్న ఒక బలమైన నాయకుడిని ఇంతవరకూ ఏ పోటీదారు ఓడించలేకపోయారు. అలాంటి బలమైన నాయకుడు లేక నాయకురాలు (1977లో ఇందిరాగాంధీ లాగా) తనను తాను ఓడించుకోవలసిందే. ఇలా జరగాలంటే తప్పనిసరిగా మూడు పరిణామాలు సంభవించాల్సి ఉంది. ఆ బలమైన నాయకుడు తనకు వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేసేంత స్థాయిలో ప్రజాదరణ కోల్పోవాలి. తమలోని విభేదాలను, ఆకాంక్షలను, దురాశలను పక్కనబెట్టి ఆ బలమైన నాయకుడికి వ్యతిరేకంగా విభిన్న రాజకీయ శక్తులు పొత్తు కుదుర్చుకుని అతడి ఓటమికి ప్రాతిపదికను ఏర్పర్చుకోవాలి. కాబోయే ప్రధాని స్థాయిని ప్రకటించుకోనప్పటికీ ఇలాంటి రాజకీయ శక్తులను ఒక చోటికి చేర్చగలిగిన సమున్నత వ్యక్తిత్వం ఉన్న వారు ముందుకు రావాలి. 1977లో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా జయప్రకాష్ నారాయణ్ ఇలాంటి పాత్రనే పోషించారు. 1989లో రాజీవ్ గాంధీకి వ్యతిరేకంగా వీపీ సింగ్ ఇలాంటి పాత్రనే పోషించారు. ఒక సంవత్సరం క్రితం వెలిసిపోతున్న రాజవంశానికి ప్రతినిధిగా ఉన్న స్థితినుంచి రాహుల్ గాంధీ ఇప్పుడు రెండో ఏకధ్రువ స్థితికి కాంగ్రెస్‌ను అమాంతంగా తీసుకొచ్చారు. 2019 కోసం రాజకీయ క్రీడ ఇప్పుడు సిద్ధంగా ఉంది. ప్రధాని నరేంద్రమోదీ పార్లమెంటుకు కూడా హాజరుకాకుండా తన రాజకీయ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించడం వెనకున్న బలీయమైన కారణం ఇదే మరి. - శేఖర్ గుప్తా వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
రెండు విడతల్లో పాలమూరు – రంగారెడ్డి
సాక్షి, గద్వాల: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రెండు విడతల్లో పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఏఐసీసీ అధ్యక్షుడు రాహూల్‌గాంధీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మధ్యాహ్నం గద్వాలలో మహాకూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి మండల కేంద్రంలో 30 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేస్తామన్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రధాని మోదీకి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మద్దతిచ్చారని, దేశ ప్రజలను ఎన్నో కష్టాల పాల్జేసిన నోట్ల రద్దుకు వత్తాసు పలికారని, బీడీ కార్మికుల యాజమాన్యాలకు నష్టం కలిగించిన జీఎస్టీని కొనియాడారని విమర్శించారు. ‘కేసీఆర్‌కు ఒకే లక్ష్యం ఉంది.. తెలంగాణలో తన కుటుంబం, కేంద్రంలో మోదీ పరిపాలించాలి.. టీఆర్ఎస్ పేరుకు మరో ఎస్ జోడించాలని, ఇది టీఆర్ఎస్ కాదు.. టీ..ఆర్ఎస్ఎస్ పార్టీ..’ అని ఎద్దేవా చేశారు. మోదీ, కేసీఆర్ చీకటి ఒప్పందాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఢిల్లీ నుంచి మోదీని.. తెలంగాణ నుంచి కేసీఆర్‌ను తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయన్నారు. రాష్ట్రంలో కేసీఆర్, కేంద్రంలో మోదీ అభివృద్ధి నిరోధకులుగా మారారన్నారు. రాష్ట్రంలో ఎక్కడా చూసినా కేసీఆర్ అవినీతి కనిపిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకకాలంలో రూ.2 లక్షల రైతు రుణమాఫీ, 22 లక్షల మందికి డబుల్ బెడ్రూం ఇళ్లు, ప్రతి పేదోడి ఇంటికి రూ.5 లక్షలు సాయం అందిస్తామన్నారు. 20 శాతం నిధులు విద్యారంగానికి కేటాయిస్తామని, ఎస్సీ వర్గీకరణ చేస్తామని, మహాకూటమిని గెలిపించాలని రాహుల్‌గాంధీ కోరారు. తెలంగాణ తల్లి.. సోనియాగాంధీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించి పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన తెలంగాణ తల్లి సోనియాగాంధీ అని మాజీ మం త్రి, కాంగ్రెస్ గద్వాల ఎమ్మెల్యే అభ్యర్థి డీకే అరుణ కొనియాడారు. ఎన్నికల ముందు రైతులను మోసం చేయడానికి రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రూ.2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని, బోయలను ఎస్టీ జాబితాలో చేర్చుతామన్నారు. 371(జే) గద్వాలకు ప్రత్యేక హోదా కల్పించి ప్రత్యేక ప్యాకేజీని అమలు చేసేందుకు కృషిచేస్తామన్నారు. నా హయాంలోనే అభివృద్ధి మంత్రి, ఎమ్మెల్యేగా తన హయాంలోనే గద్వాల నియోజక వర్గ అభివృద్ధి జరిగిందని డీ.కే.అరుణ వెల్లడించారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఉన్నా, లేకున్నా ప్రజల సమస్యల్లో పాలుపంచుకుంటూ అభివృద్ధి చేశానని వెల్లడించారు. మాజీ మంత్రి డీకే సమరసింహారెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో అసమర్థ పాలన కారణంగా ముందస్తు ఎన్నికలు వచ్చాయని విమర్శించారు. కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ఇంటి పార్టీ నాయకుడు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ నడిగడ్డ భవిష్యత్ కోసం కాంగ్రెస్ అభ్యర్థి డీకే అరుణను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జ్ కుంతియా, నాయకులు సలీంఅహ్మద్, నర్సిరెడ్డి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు సుధాకర్, నాగర్‌కర్నూల్ ఎంపీ నంది ఎల్లయ్య, కేంద్ర మాజీ మంత్రి సూర్యప్రకాష్‌రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి సంపత్‌కుమార్, నాయకులు డీకే స్నిగ్ధారెడ్డి, శివసేనారెడ్డి, కృష్ణవేణి, రామాంజనేయులు, పద్మావతి, కృష్ణారెడ్డి పాల్గొన్నారు. కూటమిని గెలిపించండి ప్రజా యుద్ధనౌక గద్దర్ మాట్లాడుతూ.. ‘మా భూములు, మా నీళ్లు, మా నిధులు మాకు కావాలి..’ అనే నినాదంతో పోరాడి తెలంగాణ తెచ్చుకుంటే.. పాలకుల నిర్లక్ష్యానికి ఏ ఒక్కటీ నెరవేరలేదన్నారు. సభకు వచ్చిన జనాన్ని చూస్తుంటే మహాకూటమి కచ్చితంగా విజయం సాధిస్తుందన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆలపించిన పాటకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. -
ముందు ముందు మరిన్ని నిజాలు
న్యూఢిల్లీ: రాఫెల్ ఒప్పందంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపణల తీవ్రత పెంచారు. రాఫెల్ ఒప్పందంతోపాటు విజయ్‌మాల్యా తదితరులకు సంబంధించిన మరికొన్ని నిజాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయని అన్నారు. సొంత నియోజకవర్గం అమేథీలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అమేథీలో కూడా హెచ్ఏఎల్ ప్లాంట్ ఉంది. ‘ప్రభుత్వ రంగ సంస్థకు దక్కాల్సిన రాఫెల్ కాంట్రాక్టును అంబానీకి కట్టబెట్టడం వల్ల హెచ్ఏఎల్, యువత అవకాశాలను లాగేసుకున్నారనే విషయాన్ని గ్రహించాలి. నిజాన్ని మీకు చెబుతున్నా. ఏది న్యాయమో మీరే నిర్ణయించండి’ అని అన్నారు. తన సన్నిహిత మిత్రుల జేబులు నింపేందుకే ప్రధాని మోదీ రాఫెల్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని ఆరోపించారు. లోక్‌పాల్ అంబుడ్స్‌మెన్ నియామకంలో జాప్యానికి రాఫెల్ వివాదంపై ప్రధాని మోదీ మౌనమే కారణమని రాహుల్ ఆరోపించారు. ప్రజలకు హామీ ఇచ్చిన విధంగా అచ్చే దిన్(మంచి రోజు)ను ఎప్పటికీ తేలేకపోయినా కనీసం సచ్చే దిన్(నిజమైన రోజు) వచ్చేలా ఈ ఒప్పందంలో నిజాలను వెల్లడించాలని మోదీని డిమాండ్ చేశారు. దోపిడీ దారులను చట్టం ముందు నిలబెడతానంటూ ట్విటర్లో వివిధ వర్గాల ప్రజలకు హామీ ఇచ్చారు. ‘సైనిక జవాన్లు, ఎయిర్ ఫోర్స్ అధికారులు, అమరవీరుల కుటుంబాలతోపాటు హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) సిబ్బంది ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు. వారిని దోచుకుని, అవమాన పరిచిన వారిని దోషులుగా నిలబెడతా’ అని ట్విటర్లో పేర్కొన్నారు. ‘కాపలాదారుగా ఉంటానని చెప్పి అంబానీ జేబును రూ.30వేల కోట్లతో నింపారు. మీరు దేశానికా లేక అంబానీకి ప్రధానా? ఇప్పటివరకు ఆలీబాబా 40 నలబై దొంగల కథ విన్నాం. మోదీ బాబా, 40 దొంగలు ఏం సమాధానం చెబుతారని ఇప్పుడు అడుగుతున్నాం’ అని కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సూర్జేవాలా అన్నారు. దేశంలో ఎన్నడూ జరగనంతటి పెద్ద కుంభకోణం ఇది అని మరో నేత కపిల్ సిబల్ అన్నారు. హెచ్‌ఏల్‌ను పక్కనబెట్టడం వల్ల ఏమిటి ప్రయోజనం? దాని నుంచి ఎవరు లబ్ధి పొందారు?. తను ఇష్టం వచ్చినట్లుగా చేయడానికే ప్రజలు అధికారం ఇచ్చినట్లు మోదీ అనుకుంటున్నట్లుంది. అది ఆమోదయోగ్యం కాదు’ అని సిబల్ అన్నారు. -
అదిగో రాహుల్.. ఇదిగో ప్రియాంక..
న్యూఢిల్లీ : మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ జీవితం ఆధారంగా బాలీవుడ్లో ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ అనే చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మన్మోహన్ సింగ్ పాత్రలో ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్, సోనియా గాంధీగా జర్మన్ నటి సుజేన్ బెర్నెర్ట్, మన్మోహన్ భార్య గుర్షరన్ కౌర్ పాత్రలో దివ్య సేథ్ నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పాత్రల్లో ఎవరో కూడా తెలిసిపోయింది. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీగా అర్జున్ మాథూర్, ప్రియాంక గాంధీగా ఆహానా కుమ్రా నటిస్తున్నారు. మన్మోహన్ సింగ్‌తో రాహుల్ గాంధీ, అతని సోదరి ప్రియాంక గాంధీ మాట్లాడుతున్నా ఫోటోను అనుపమ్ ఖేర్ తన ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. ఈ ఫోటోలో అర్జున్, ఆహానా కుమ్రా అచ్చం రాహుల్, ప్రియాంకలానే ఉన్నారు. ఆహానా కుమ్రా మాట్లాడుతూ.. ‘ఈ చిత్రంలో ప్రియాంక గాంధీగా నటించడం సంతోషంగా ఉంది. అది చాలా ప్రాధాన్యత ఉన్న పాత్ర. ఈ సినిమాలో అన్ని పాత్రలో నిజజీవితంలో ఉన్నవారే కాబట్టి వారిలా మారడం, నటించడం చాలా అవసరం’ అని అన్నారు. మన్మోహన్ సింగ్ కు మీడియా సలహాదారుగా వ్యవహరించిన సంజయ్ బారు రాసిన పుస్తకం 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ : ది మేకింగ్ అండ్ అన్‌మేకింగ్ ఆఫ్ మన్మోహన్సింగ్' ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విజయ్ రత్నాకర్ గట్టీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను బొహ్రా బ్రదర్స్ నిర్మిస్తున్నారు. సలీమ్-సలైమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను 2019 ఎన్నికల నేపథ్యంలో డిసెంబర్ 21న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
250 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ?
సాక్షి, న్యూఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో 250 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీచేయనున్నట్లు రాజకీయ వర్గాల సమాచారం. బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ తక్కువ స్థానాల్లో పోటీచేసి గెలుపు అవకాశాలున్న మిత్రపక్షాలకు, ప్రాంతీయ పార్టీలకు ఎక్కువ సీట్లను కేటాయించాలని కాంగ్రెస్ భావిస్తోంది. మోదీని ఓడించేందుకు బీజేపీ వ్యతిరేక పార్టీలతో మహాకూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్లేందుకు ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెస్ మంతనాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఏవిధంగా పోటీచేయాలి, ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న అంశంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ కేంద్రమంత్రి ఏకే ఆంటోని అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేశామని పార్టీ సీనియర్ నేతలు వెల్లడించారు. కమిటీ అన్ని రాష్ట్రాల్లోని సీనియర్ నేతలతో చర్చించి ఏ స్థానాల్లో విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయనే అంశంపై ఓ నివేదికను తయారుచేస్తోందన్నారు. 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసిన కాంగ్రెస్ కేవలం 44 స్థానాల్లోనే విజయం సాధించిన విషయం తెలిసిందే. బీజేపీకి ఆయుపట్టుగా ఉన్న ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ వంటి పెద్ద రాష్ట్రాల్లో విజయం సాధించాలంటే బీజేపీ వ్యతిరేక పార్టీలతో జట్టుకట్టక తప్పదు. రానున్న ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి ప్రాంతీయ పార్టీలు, బీజేపీ వ్యతిరేక పార్టీలు మహాకూటమిగా ఏర్పడాలని ఇటీవల కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించాలంటే త్వరలో జరుగునున్న రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో తప్పక విజయం సాధించాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 250 స్థానాల్లో పోటీ చేస్తే మొదటి సార్వత్రిక ఎన్నికల నుంచి అతి తక్కువ స్థానాల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి అవుతుంది. -
కాంగ్రెస్‌లో చేరిన టీడీపీ నేతలు
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతునే ఉన్నాయి. శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కొంత మంది తెలుగు దేశం పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ నేత ప్రతాప్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు అల్లుడు మదన మోహన్, ఉస్మానియా విశ్వ విద్యాలయం విద్యార్థి నాయకుడు పృథ్వీ రాజ్ యాదవ, తెలంగాణ ప్రొగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్న హర్షవర్ధన్ రెడ్డిలు కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కుంతియా, సునితా లక్ష్మారెడ్డి హాజరయ్యారు. -
ఆమరణ దీక్షకు దిగుతా: కేజ్రీవాల్
సాక్షి, న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కన్వీనర్, ఢిల్లీ ముఖ్య మంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్రానికి హెచ్చరిక జారీ చేశారు. ఈ నెల 31లోపు సీలింగ్ డ్రైవ్(షాపుల మూసివేత) నిలిపివేయకపోతే ఆమరణ నిరాహారదీక్షకు దిగుతానని ప్రకటించారు. నిబంధనలకు విరుద్ధంగా నివాస ప్రాంతాలలో ఉన్న దుకాణ సముదాయాలను మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సీజ్ చేస్తున్నారు. వ్యాపారులకు మద్ధతుగా నిలిచిన క్రేజీవాల్ అవసరమైతే వారి తరపున పోరాడేందుకు సిద్ధమని తెలిపారు. ‘వ్యాపారులు నిజాయితీగానే పన్నులు కడుతున్నారు. సీలింగ్ డ్రైవ్ వల్ల వేలాది మంది జీవనోపాధిని కోల్పోయి రోడ్డున పడతారు. నిరుద్యోగ సమస్య పెరిగిపోతుంద’ని ఆయన చెప్పారు. పార్లమెంట్లో చట్టం చేయడం ఒక్కటే సీలింగ్ డ్రైవ్‌కు పరిష్కారమని కేజ్రీవాల్ సూచించారు. కేంద్రం తక్షణమే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ... ప్రధానమంత్రి మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కేజ్రీవాల్ లేఖ రాశారు. చట్టపరమైన చిక్కులు తలెత్తకుండా పార్లమెంట్లో బిల్లు చేసి సీలింగ్ డ్రైవ్ ఆపేలా చొరవ చూపాలని ఆ లేఖల్లో పేర్కొన్నారు. -
ఆయన నా కలల రాకుమారుడు..
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఓ వృద్ధ మహిళ మనసు పారేసుకుంది. ఇటీవల 107వ పుట్టినరోజు వేడుకలు చేసుకున్న ఓ వృద్ధ మహిళ కోరిక సంచలంగా మారింది. పుట్టినరోజు కానుకగా ఏమివ్వాలని అడిగిన తన మనవరాలు దీపాలీ సికండ్కి ఆ బామ్మ ‘రాహుల్ గాంధీ చాలా అందంగాడు.. ఆయనని కలుస్తా’, అని చెప్పింది. ఆ బామ్మ కోరికను దీపాలీ సికండ్ రాహుల్ గాంధీకి ట్వీట్ చేసింది. దీనికి రాహుల్ స్పందించి ‘మీ అందమైన బామ్మకి నా తరుపున పుట్టినరోజు, క్రిస్మస్ శుభాకాంక్షలు’ అని తెలిపాడు. అంతేకాదు నా తరుపున బామ్మని గట్టిగా కౌగిలించుకోండి అని అందులో పేర్కొన్నారు. Today my grandmother turned 107. Her one wish. To meet @OfficeOfRG Rahul Gandhi ! I asked her why? She whispers ... He's handsome ! pic.twitter.com/k3wUaSMKfE — Dipali Sikand (@SikandDipali) 25 December 2017 -
అయోధ్యలో రాహుల్
26 ఏళ్ల తర్వాత నెహ్రూ-గాంధీ కుటుంబ వ్యక్తి పర్యటన అయోధ్య: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం అయోధ్యలో పర్యటించారు. 1992 నాటి బాబ్రీ మసీదు ఘటన తర్వాత నెహ్రూ-గాంధీ కుటుంబంలో ఒక వ్యక్తి ఇక్కడ పర్యటించడం ఇదే ప్రథమం. అయితే ఆయన వివాదాస్పద రామజన్మభూమి, బాబ్రీ మసీదు స్థలానికి మాత్రం వెళ్లలేదు. ఆ ప్రాంతానికి కిలో మీటరు దూరంలో ఉన్న హనుమాన్‌గడీ ఆలయంలో పూజలు చేశారు. అంతకుముందు వీహెచ్‌పీకి వ్యతిరేకిగా పేరున్న మహంత్ జ్ఞాన్ దాస్‌తో చర్చలు జరిపారు. భేటీ తర్వాత జ్ఞాన్ దాస్ మాట్లాడుతూ..తన ఆశీస్సుల కోసం రాహుల్ వచ్చారని చెప్పారు. రామజన్మభూమి విషయంలో సుప్రీం కోర్టు చెప్పిన దానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంటుందని రాహుల్ చెప్పినట్లు తెలిసింది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ముందు కాంగ్రెస్‌పై ఉన్న హిందూ వ్యతిరేకి అన్న విమర్శను తుడిచిపెట్టడానికే రాహుల్ అయోధ్యలో పర్యటించారని విమర్శకుల అంచనా. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సూచనలో భాగంగా రాహుల్ హనుమాన్ గుడిని సందర్శించారని తెలుస్తోంది. ఇక తన రోడ్ షో ప్రారంభానికి ముందు కిచాయుచా షరీఫ్ దర్గాకు రాహుల్ వెళ్లారు. ఇది బ్రాహ్మణ, ముస్లిం, ఓబీసీ ఓట్లను దృష్టిలో పెట్టుకుని కిశోర్ రూపొం దించిన వ్యూహమని భావిస్తున్నారు. -
'స్వచ్ఛభారత్ చేతల్లో చూపండి'
ముంబై: స్వచ్ఛభారత్ పేరుతో ఫోటోలు దిగడానికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారని శుభ్రత కోసం చిత్తశుద్ధితో కృషి చేయాలని ప్రధానికి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మోదీకి చురకలంటించారు. ఈశాన్య ముంబైలోని దేవనార్ ప్రాంతంలో ఉన్న అతిపెద్ద డంపింగ్ యార్డ్ ను మంగళవారం రాహుల్ పరిశీలించారు. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం స్వచ్ఛభారత్ కోసం మరింత కృషి చేయాల్సింది పోయి అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. డంపింగ్ యార్డులో చెత్త కాల్చడంతో పర్యావరణ కాలుష్యం పెరిగి ముంబై వాసులు అనేక దీర్ఘకాలక వ్యాధుల పాలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చెంబూర్ ప్రాంతంలో చిన్న పిల్లలు సైతం టీబీ వ్యాధితో బాధపడుతున్న విషయాన్ని రాహుల్ ప్రస్తావించారు. ఇక్కడ చెత్తను మండించడం ద్వారా వస్తున్న పొగ శాటిలైట్ నుంచి కూడా కనిపించిన విషయాన్ని గుర్తుచేశారు. స్వచ్ఛభారత్ గురించి చెప్పడం, ఆచరణ రెండూ వేరని ప్రభుత్వాన్ని విమర్శించారు. ముంబై నగరం దేశ అభివృద్ధికి చిహ్నంగా ఉండాలని ఇలా కాలుష్యంతో రోగాల బారినపడ్డ ప్రజలతో కాదని రాహుల్ అన్నారు. జనావాసాలకు దూరంగా డంపింగ్ యార్డును తరలించాలని డిమాండ్ చేశారు. -
కు.ని. ఆపరేషన్లపై తప్పు కప్పిపుచ్చే యత్నం: రాహుల్ గాంధీ
బిలాస్పూర్: కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల్లో మహిళల మరణాలకు సంబంధించి, ఆ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆపరేషన్లు వికటించి అస్వస్థతతో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధిత మహిళలను పరామర్శించిన అనంతరం రాహుల్ గాంధీ విలేకరులతో మాట్లాడారు. శస్త్రచికిత్స శిబిరాల నిర్వహ ణలో తప్పిదాలకు, అవకతవలకు బాధ్యతను ఒప్పుకోవడానికి బదులుగా చత్తీస్‌గఢ్ ప్రభుత్వం తప్పును కప్పిపుచ్చుకునే ందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలకోసం వినియోగించిన మందులను తగులబెడుతున్నారని, సాక్ష్యాధారాలను ధ్వంసం చేస్తున్నారని అన్నారు. మొత్తం వ్యవహారంపై క్షుణ్ణంగా దర్యాప్తు జరిపించాలన్నారు. -
రాహుల్‌తో మోడీ కరచాలనం
ఎన్నికల ప్రచార ఘట్టం ఇరు శిబిరాలకూ నాయకులుగా ఆద్యంతం పరస్పరం కత్తులు దూసుకున్న నరేంద్ర మోడీ, రాహుల్‌గాంధీ కరచాలనం ఉభయ సభల సంయుక్త భేటీలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఎనిమిదో వరుసలో జైరాం రమేశ్ తదితర కాంగ్రెస్ నేతలతో పాటు కూర్చున్న రాహుల్ వద్దకు మోడీ చొరవగా వెళ్లి ఆయన చేతిని అందుకున్నారు. పలకరింపుగా రాహుల్ చిరునవ్వు నవ్వారు. మరోవైపు సోనియా వెళ్లి బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ పక్కన కూర్చుని ప్రణబ్ ప్రసంగం మొదలయ్యేదాకా చాలాసేపు ఏదో సంభాషిస్తూ కన్పించారు. ఇక పలువురు ఎంపీలు కూర్చునేందుకు కుర్చీల్లేక ప్రణబ్ ప్రసంగాన్ని నుంచునే విన్నారు. -
'సీమాంధ్రలో కాంగ్రెస్ అభ్యర్థుల కొరత అవాస్తం'
న్యూఢిల్లీ : సీమాంధ్రలో కాంగ్రెస్ అభ్యర్థుల కొరత అవాస్తవమని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్ అన్నారు. ఈనెల 14వ తేదీలోగా సీమాంధ్ర కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికను పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. ఈనెల 16న తెలంగాణలో సోనియా గాంధీ, 17న రాహుల్ గాంధీ పర్యటిస్తారని ఆయన శుక్రవామిక్కడ పేర్కొన్నారు. కరీంనగర్లో 16న సోనియా సభ ఉంటుందని, 17న మహబూబ్‌నగర్, మెదక్, వరంగల్‌లో రాహుల్ బహిరంగ సభలు ఉంటాయని దిగ్విజయ్ తెలిపారు. కాగా అభ్యర్థుల ఖరారుపై ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి శుక్రవారం ఉదయం దిగ్విజయ్ ని కలిశారు. ఆయనతో పాటు చిరంజీవి, జేడీ శీలం కూడా ఉన్నారు. -
ఈశాన్య భారతంలో కొత్త పొద్దు
ఈశాన్య భారతానికీ, ప్రధాన స్రవంతి భారతానికీ నడుమ కనిపించని ఒక గోడ ఉంది. దీనిని బలంగా ఉంచుతున్నది- సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్ఎస్పీఏ). దీనిని ఎత్తివేయాలని కొన్ని దశాబ్దాలుగా ఈశాన్య వాసులు కోరుతున్నారు. పదహారో లోక్‌సభ ఎన్నికలు ఈశాన్య భారతం భవిష్యత్తును తీర్చిదిద్దగలుగుతాయా? సిక్కింతో పాటు సెవెన్ సిస్టర్స్ ఓటర్లలో ఈసారి గణనీయమైన మార్పు కనిపిస్తున్నదని విశ్లేషకులు చెబుతున్నారు. 25 లోక్‌సభ స్థానాలు ఉన్న ఈశాన్య భారతంలో ఇప్పుడు జరుగుతున్న పోటీ చరిత్రలో ప్రత్యేకమైనది కూడా. ఈశాన్యం నిర్లక్ష్యానికి గురైన ప్రాంతమంటే ఎవరికీ సందేహం అక్కరలేదు. భౌగోళికంగా ఈశాన్య భారతం వాటా దేశ భూభాగంలో ఎనిమిది శాతం. అక్కడి జనాభా 2011 లెక్కల ప్రకారం దేశ జనాభాలో 3.1 శాతం. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ రాజ్యమేలింది. తరువాత ప్రాంతీయ పార్టీలు గట్టి ప్రభావాన్ని కలిగి ఉన్నాయి. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ ఫిబ్రవరి మొదటి వారంలోనే ఇక్కడ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. మిగిలిన భారతదేశం మాదిరిగానే అక్కడ కూడా ఈసారి ‘మోడీ గాలి’ కనిపించడంతో పార్టీ దీనిని ఉపయోగించుకుంది. అటల్ బిహారీ వాజ్‌పేయి నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తరువాతే ఈశాన్యంలో ఆ పార్టీకి ఉనికి ఏర్పడింది. ఇందుకు కారణం ఎన్డీయే ‘లుక్ ఈస్ట్’విధానం, ఈశాన్య రాష్ట్రాల కోసం మంత్రిత్వ శాఖ ఏర్పాటు యోచన. గౌహతి మునిసిపల్ కార్పొరేషన్‌కు నిరుడు జరిగిన ఎన్నికలలో బీజేపీ ద్వితీయ స్థానం సాధించింది. అయితే అక్కడ కూడా బీజేపీ పట్టణ ఓటర్లకు పరిమితమైన సూచనలే ఎక్కువ. ఇప్పుడు మోడీ ప్రచార శైలి, కాంగ్రెస్ మీద సంధిస్తున్న విమర్శలు బాగా ఆకట్టుకుంటున్నాయి. 23 సంవత్సరాలుగా అసోం నుంచి రాజ్యసభకు ఎన్నికవుతూ డాక్టర్ మన్మోహన్సింగ్ ఈ ప్రాంతానికి ఏం చేశారని మోడీ ప్రశ్నించడం ఆకట్టుకుంటోంది. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా వారిని ఆకర్షిస్తున్నది. కాంగ్రెస్‌నూ, ఇతర స్థానిక పార్టీలనూ వదిలి ఈసారి ఈశాన్య భారత వాసులు ధోరణి మార్చుకునే పంథాలో ఉన్నారు. ఇందులో కొందరు ముస్లింలు కూడా ఉండడం పెద్ద పరిణామం. అసోం, మణిపూర్, త్రిపుర, అరుణాచల్‌ప్రదేశ్‌లలో మోడీ ప్రసంగించిన సభలకు విశేష స్పందన వచ్చింది. ప్రపంచంలో ఏ మూల నుంచి శరణార్థిగా వచ్చిన హిందువునైనా ఆదరిస్తామని మోడీ బంగ్లా హిందువులను ఉద్దేశించి పేర్కొని హిందుత్వ కార్డును ఉపయోగించుకున్నారు. 1962 నాటి చైనా దాడి సమయంలో అరుణాచల్ వాసులు ‘జైహింద్’ నినాదం ఇచ్చి వీరులు అనిపించుకున్నారని శ్లాఘించారు. ఈశాన్య ప్రాంత తేయాకు కార్మికులకు అనేక వరాలు ప్రకటించారు. ఢిల్లీలో ఈశాన్య భారత విద్యార్థి నిడో హత్యకు గురికావడం దారుణమని ప్రకటించి వారి మనసులను గెలిచే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, ఆ పార్టీ అప్రకటిత ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీ ఒకింత ఆలస్యంగా ఇక్కడ ప్రచారం ప్రారంభించారు. మార్చి 18న ఆయన కూడా నాలుగు రాష్ట్రాలలో - మేఘాలయ, అరుణాచల్, మణిపూర్, మిజోరాం-లలో ప్రచా రం ప్రారంభించారు. ఈశాన్య భారతాన్ని ఢిల్లీతో అనుసంధా నం చేయాలన్న కాంగ్రెస్ కృషికి కొన్ని అభివృద్ధి నిరోధక శక్తులు అడ్డుపడుతున్నాయని ఆరోపించారు. ఈశాన్యంలో ఈ ఇద్దరితో పాటు ఇంతవరకు విస్తృతంగా ప్రచారంలో పాల్గొన్నవారిలో మమతా బెనర్జీ ఒకరు. అరుణాచల్ వరకు నిన్నటి తరం బాలీ వుడ్ హాస్య నటుడు గోవర్ధన్ అస్రానీ కాంగ్రెస్ తరఫున ప్రచారంలో కీలకంగా ఉన్నారు. ఇంతకు మించి హడావుడి లేదు. ఈశాన్య భారతానికీ, ప్రధాన స్రవంతి భారతానికీ నడుమ కనిపించని ఒక గోడ ఉంది. దీనిని బలంగా ఉంచుతున్నది- సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్ఎస్పీఏ). దీనిని ఎత్తివేయాలని కొన్ని దశాబ్దాలుగా ఈశాన్య వాసులు కోరుతున్నారు. సాయుధ దళాలకు విశేష అధికారాలను కట్టబెట్టే ఈ చట్టం రాజ్యాంగ బద్ధతను ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషనర్ నవనీతం పిళ్లై ప్రశ్నించారు. ఈ చట్టాన్ని తొలగించవలసిన అవసరం ఉందని మార్చి 23, 2009లో ఐక్య రాజ్యసమితి కూడా భారత్‌కు సూచించింది. మణిపూర్‌కు చెందిన మహిళ షర్మిల చాను ఈ చట్టాన్ని ఎత్తి వేయాలని కోరుతూ 2000 సంవత్సరం నుంచి నిరశన దీక్ష చేస్తున్నారు. కానీ బీజేపీ, కాంగ్రెస్ రెండూ ఈ అంశాన్ని ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించడం లేదు. ఎన్డీయే కాలంలో ఈశాన్యంలో ఉగ్రవాదులతో చర్చల ప్రక్రియను ప్రారంభించారు. ఇప్పుడు కూడా ఎన్డీయే వైపు ఈశాన్య వాసులు మొగ్గుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. పార్టీ, ప్రభుత్వం ఏదైనా, ఇప్పుడు అక్కడ వ్యక్తమవుతున్న ధోరణి జాతి ప్రయోజనాల దృష్ట్యా మంచి అవకాశం. ప్రత్యేక అధికారాల చట్టాన్ని తొలగించి ఆ ప్రాంత ప్రజలకు స్వేచ్ఛను ఇచ్చి ప్రధాన స్రవంతి జీవనంలోకి ఆహ్వానించేందుకు వచ్చిన అవకాశమిది. ఈ ఎన్నికలు అందుకు ఉపయోగపడితే ప్రజాస్వామ్యం ధన్యమైనట్టే. - కల్హణ -
మీ ఇంట్లో అవినీతి మాటేమిటి?
రాహుల్‌గాంధీపై చంద్రబాబు ఫైర్ సాక్షి, హైదరాబాద్: చరిత్రలో ఏనాడూ లేనన్ని కుంభకోణాలకు కారణమైన కాంగ్రెస్ పార్టీ దేశానికి క్షమాపణలు చెప్పాల్సింది పోయి ప్రజలను మోసం చేసే ప్రయత్నాల్లో ఉందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విమర్శించారు. అవినీతిని రూపుమాపుతామంటున్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ వ్యాఖ్యలు అందులే భాగమేనన్నారు. యూపీఏ పాలనలో లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు జరిగినపుడు రాహుల్‌గాంధీకి అవినీతి కనిపించలేదా అని ప్రశ్నించారు. శనివారం తన నివాసంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘2జీ, కామన్వెల్త్, ఐపీఎల్, ఆదర్శ్, అగస్టా, కోల్గేట్ వంటి లక్షల కోట్ల రూపాయలు లూటీ చేసిన కుంభకోణాలు యూపీఏ రెండు విడతల పాలనలో జరిగాయి. అవి బయటపడినప్పుడు ఎక్కడున్నావు రాహుల్? ఈ కుంభకోణాలన్నీ ఒక ఎత్తయితే మీ ఇంట్లో జరిగే కుంభకోణాలు మరోఎత్తు. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు మీ బావ రాబర్ట్‌వాద్రా ఆస్తులు రూ. 5 లక్షలు. ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ రూ. 20 వేల కోట్లకు చేరింది. మీ బావ అవినీతి నీకు కనిపించడం లేదా?’ అని ప్రశ్నించారు. ఈ విలేకరుల సమావేశానికి సాక్షి ప్రతినిధిని అనుమతించలేదు. వివిధ మార్గాల్లో సేకరించిన సమాచారం మేరకు ఈ వార్తనిస్తున్నాం. అనుమతించి ఉంటే ఈ ప్రశ్నలకు చంద్రబాబు నుంచి సమాధానాలు కోరేది. తొమ్మిదేళ్ల పాలనలో మీపై ఆనేక ఆరోపణలు వచ్చాయి. ఏ ఒక్క దానిపైనా మీరు ఎందుకు విచారణకు సిద్ధపడలేదు? మీ పాలనలో అవినీతిపై ‘బాబు జమానా అవినీతి ఖజానా’ అని సీపీఎం పుస్తకాన్నే ప్రచురించింది. వాటిపై ఈరోజుకూ మీరు సమాధానం చెప్పకుండా నీతి గురించి మాట్లాడితే ప్రజలు విశ్వసిస్తారా? కాంగ్రెస్ అవినీతిపై మాట్లాడుతున్న మీరు రాజ్యసభలో ఎఫ్‌డీఐల బిల్లు ఆమోదం పొందడానికి మీ ఎంపీలను ఎందుకు గైర్హాజరయ్యేలా చూశారు? రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విపక్షాలు అవిశ్వాస తీర్మానం పెడితే మీరు మాత్రం తటస్థ వైఖరిని అనుసరించి తద్వారా ప్రభుత్వాన్ని ఎందుకు కాపాడినట్టు?