రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ అమేథీ లోకసభ నియోజక వర్గం నుంచి పోటీ చేయడం దాదాపూ ఖరారైంది.
తాజాగా, ఢిల్లీలో జరిగిన పార్టీ సమావేశం నుంచి తిరిగి వచ్చిన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ప్రదీప్ సింఘాల్ మాట్లాడుతూ.. అమేథీ నుంచి రాహుల్ గాంధీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగుతారని అన్నారు. త్వరలో రాహుల్ గాంధీ పేరును అధిష్టానం అధికారికంగా ప్రకటిస్తుందని ఆయన పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ వర్సెస్ స్మృతి ఇరానీ
ప్రదీప్ సింఘాల్ చెప్పినట్లుగానే రాహుల్ ఎన్నికల బరిలోకి దిగితే అమేథీలో రాజకీయం రసవత్తరంగా మారనుంది. కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ స్మృతి ఇరానీపై రాహుల్ గాంధీ పోటీపడనున్నారు. తన అదృష్టాన్నిపరీక్షించుకోనున్నారు.
2019 ఎన్నికల్లో ఓటమి
2019 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్‌పై ఇరానీ 55,120 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే ఆ ఎన్నికల్లో వాయనాడ్ నియోజక వర్గంలో గెలుపొంది రాహుల్ గాంధీ లోక్‌సభలోకి అడుగుపెట్టారు. 2014 ఎన్నికల్లో రాహుల్ గాంధీ చేతిలో స్మృతి ఇరానీ ఓడిపోయారు. అయితే, ఆమె ఆ తర్వాత ఐదేళ్లలో తన పాపులారిటీని పెంచుకున్నారు. 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీని ఓడించి చారిత్రాత్మక విజయంతో కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment