సాక్షి,న్యూఢిల్లీ : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్ (INDIA bloc) కీలక నిర్ణయం తీసుకుంది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు కొద్ది రోజుల ముందే ప్రచార వ్యూహం, క్యాడర్ నిర్వహణ, ఉమ్మడి ర్యాలీలు నిర్వహించేలా ప్రతిపక్షాల కూటమి పార్టీలు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యాయి. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న రాష్ట్రాల్లో మాత్రమే ఎన్నికల వ్యూహాలను అమలు చేయనున్నాయి.
ఈ సందర్భంగా ‘ప్రత్యర్ధి పార్టీల ఎత్తుకు పైఎత్తు వేస్తూ ఎన్నికల్లో గెలించేందుకు సమన్వయ కమిటీలు చాలా అవసరం. సమన్వయ కమిటీలు ఎన్నికల వ్యూహం, ఎన్నికల సందేశాలను ప్రజల్లో చేరవేసేందుకు సహాయ పడతాయి. కమిటీలలో వివిధ పార్టీల నుండి సమాన సంఖ్యలో సభ్యులు ఉంటారు’ అని కాంగ్రెస్ సీనియర్ నేతలు చెబుతున్నారు.
రాష్ట్రాల్లోని పార్టీ క్యాడర్‌ల సమన్వయం దిశగా మొదటి అడుగు ఇండియా కూటమి అభ్యర్థులు తీసుకుంటారు. వివిధ పార్టీల కార్యకర్తల మధ్య సమన్వయం ఎన్నికల్లో గెలవడానికి కీలకమనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
త్వరలోనే ప్రకటన
త్వరలో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ఢిల్లీ, హర్యానాలలో సమన్వయ కమిటీలను ప్రకటించే అవకాశం ఉందని, ఇప్పటికే సమన్వయ కమిటీ సభ్యుల పేర్లు కాంగ్రెస్ అధిష్టానానికి పంపినట్లు ఆప్ నేతలు వెల్లడించినట్లు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి.
పొత్తులు ఎంత వరకు వచ్చాయంటే?
ఇప్పటివరకు ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీతో, ఢిల్లీ, హర్యానా, గుజరాత్, గోవాలలో ఆమ్ ఆద్మీ పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. మహా వికాస్ అఘాడీ నియోజకవర్గాలైన శివసేన (యూబీటీ), మహారాష్ట్రలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ), తమిళనాడులోని డీఎంకే, లెఫ్ట్ ఫ్రంట్, జార్ఖండ్‌లోని జార్ఖండ్ ముక్తి మోర్చా, బీహార్‌లోని రాష్ట్రీయ జనతాదళ్ వంటి ప్రాంతీయ పార్టీలతో సీట్ల పంపకాల ఒప్పందం ఇంకా ఖరారు కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment