సాక్షి, న్యూఢిల్లీ : ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేతలు పోటీ చేయడం లేదంటూ వస్తున్న వార్తలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే స్పందించారు. కార్యకర్తలు తనను ఎన్నికల్లో పోటీ చేయమని కోరితే తాను పోటీ చేయవచ్చని అన్నారు. అయితే వయోభారం కారణంగా ఈసారి ఎన్నికల బరిలోకి దిగకపోవచ్చనే సంకేతాలిచ్చారు.
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో.. సీనియర్ నేతలు లోక్‌సభ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయడం లేదంటూ మీడియా ప్రతినిధులు ఖర్గేని ప్రశ్నించారు.
మేం పోటీకి దూరంగా లేము. వయస్సు రిత్యా ఇంతకుముందులా రాజకీయాలు చేయాలంటే కుదరదు. మీరు (జర్నలిస్ట్) 65ఏళ్లకే రిటైర్ అవుతారు. మరి నా వయస్సు 83ఏళ్లు. కార్యకర్తలు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని కోరుకుంటే తప్పకుండా అదే చేస్తా అని స్పష్టం చేశారు. ఇక మల్లికార్జున్ ఖర్గే 2009, 2014లో కర్ణాటకలోని గుల్బర్గా నుంచి ఎంపీగా విజయం సాధించారు. అయితే, 2019లో ఓటమి పాలవ్వడంతో తిరిగి రాజ్యసభకు ఎంపికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment