న్యూఢిల్లీ : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్ధుల ఎంపికపై కాంగ్రెస్ తీవ్ర కసరత్తే చేస్తోంది. తాజాగా రాజస్థాన్, తమిళనాడు ఐదు లోక్‌సభ స్థానాలకు అభ్యర్ధుల్ని ఖరారు చేస్తూ ఆరో జాబితాను విడుదల చేసింది.
రాజస్థాన్‌లో అజ్మీర్ లోక్‌సభ స్థానం నుండి రామచంద్ర చౌదరి, రాజ్‌సమంద్ నుండి సుదర్శన్ రావత్, భిల్వారా నుండి దామోదర్ గుర్జార్, కోటా నియోజకవర్గంలో ప్రహ్లాద్ గుంజాల్‌కు చోటు కల్పించింది. గుంజాల్ బీజేపీ అభ్యర్ధి, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో తలపడనున్నారు.
రాజస్థాన్‌లో 25 పార్లమెంటరీ నియోజకవర్గాలు ఉన్నాయి. రాష్ట్రంలో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. ఫేజ్ 1 (ఏప్రిల్ 19) 12 స్థానాలకు పోలింగ్ జరగనుండగా, మిగిలిన 13 స్థానాలకు రెండో దశలో (ఏప్రిల్ 26న) పోలింగ్ జరుగుతుంది.
తమిళనాడులో తిరునెల్వేలి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్‌పై సి రాబర్ట్ బ్రూస్‌కు చోటు కల్పించింది. తమిళనాడులోని మొత్తం 39 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది.
कांग्रेस अध्यक्ष श्री @kharge की अध्यक्षता में आयोजित 'केंद्रीय चुनाव समिति' की बैठक में लोकसभा चुनाव, 2024 के लिए कांग्रेस उम्मीदवारों के नाम की छठवीं लिस्ट। pic.twitter.com/KoXyKzYH87
— Congress (@INCIndia) March 25, 2024
Comments
Please login to add a commentAdd a comment