ఎన్నికల ప్రచార ఘట్టం ఇరు శిబిరాలకూ నాయకులుగా ఆద్యంతం పరస్పరం కత్తులు దూసుకున్న నరేంద్ర మోడీ, రాహుల్‌గాంధీ కరచాలనం ఉభయ సభల సంయుక్త భేటీలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఎనిమిదో వరుసలో జైరాం రమేశ్ తదితర కాంగ్రెస్ నేతలతో పాటు కూర్చున్న రాహుల్ వద్దకు మోడీ చొరవగా వెళ్లి ఆయన చేతిని అందుకున్నారు.
పలకరింపుగా రాహుల్ చిరునవ్వు నవ్వారు. మరోవైపు సోనియా వెళ్లి బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీ పక్కన కూర్చుని ప్రణబ్ ప్రసంగం మొదలయ్యేదాకా చాలాసేపు ఏదో సంభాషిస్తూ కన్పించారు. ఇక పలువురు ఎంపీలు కూర్చునేందుకు కుర్చీల్లేక ప్రణబ్ ప్రసంగాన్ని నుంచునే విన్నారు.
రాహుల్‌తో మోడీ కరచాలనం
Published Tue, Jun 10 2014 12:46 AM | Last Updated on Fri, Mar 29 2019 5:57 PM
Advertisement
Advertisement