LK Advani
-
ఎల్కే అద్వానీకి అస్వస్థత
-
ఆస్పత్రిలో అద్వానీ
న్యూఢిల్లీ: బీజేపీ కురువృద్ధుడు, మాజీ ఉపప్రధాని ఎల్కే అద్వానీ(97) అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని ఢిల్లీ అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని.. అబ్జర్వేషన్లో ఉన్నారని వైద్యులు ప్రకటించారు.ఇదిలా ఉంటే.. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న అద్వానీ గతంలోనూ అస్వస్థతకు లోనయ్యారు. ఆస్పత్రిలో చేరి చికిత్స పొంది.. కొన్నిరోజులకే వెంటనే కోలుకున్నారు.BJP leader and Bharat Ratna LK Advani admitted to Apollo hospital in Delhi.— News Arena India (@NewsArenaIndia) December 14, 2024క్రియాశీలక రాజకీయాలకు దూరం అయ్యాక అద్వానీ మీడియా ముందు కనిపించడం అరుదుగా మారింది. రామమందిర ప్రారంభానికి ఆహ్వానం అందినప్పటికీ.. వయసురిత్యా ఇబ్బందులతో ఆయన హాజరుకాలేకపోయారు. మొన్న.. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించి తర్వాత ప్రధాని మోదీ కూడా అద్వానీ నివాసానికి వెళ్లారు. వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టడానికి ముందు మోదీ.. అద్వానీ ఆశీస్సులు తీసుకున్నారు.ఇదీ చదవండి: సంవిధాన్.. సంఘ్ కా విధాన్ కాదు -
మరోసారి ఆస్పత్రిలో చేరిన అద్వానీ!
ఢిల్లీ: మాజీ ఉప ప్రధాని, సీనియర్ బీజేపీ నేత లాల్‌కృష్ణ అద్వానీ మరోసారి అనారోగ్యంతో మంగళవారం ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. 96 ఏళ్ల అద్వానీ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని అపోలో ఆస్పత్రి డాక్టర్లు పేర్కొన్నట్లు పీటీఐ వార్త సంస్థ వెల్లడించింది.జూలై 3న అద్వానీ ఆనారోగ్యం బారిన పడటంతో అయన్ను అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. ఒక రోజు చికిత్స అనంతరం ఆయన డిశ్చార్జ్ అయ్యారు. దీనికంటే వారం రోజల ముందు కూడా అద్వానీ వృద్దాప్యంతో కూడిన అనారోగ్య సమస్యలతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరి ఒకరోజు చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే. -
అడ్వాణీకి పొరపాటున మంత్రి శ్రద్ధాంజలి!
తుమకూరు: బీజేపీ దిగ్గజ నేత ఎల్కే అడ్వాణీ చనిపోయారంటూ కేంద్రమంత్రి వి.సోమణ్ణ ఏకంగా ఆయనకు శ్రద్ధాంజలే ఘటించారు! కర్ణాటకలోని తుమకూరులో శనివారం ఈ ఘటన జరిగింది. అడ్వాణీ అనారోగ్యంతో రెండుసార్లు ఆస్పత్రిలో చేరి చికిత్స అనంతరం కోలుకోవడం తెలిసిందే. మంత్రి మాత్రం బీజేపీ, జేడీ(ఎస్) కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ, ‘‘నాకిప్పుడే సమాచారం అందింది. అడ్వాణీ మరణించారు’’ అంటూ శ్రద్ధాంజలి ఘటించారు. అడ్వాణీ క్షేమంగా ఉన్నారని తేలడంతో సభికులంతా కంగుతిన్నారు. -
బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ హెల్త్ అప్డేట్
న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత, రాజకీయ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ ఢిల్లీలోని అపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు గురువారం అపోలో ఆసుపత్రి ఒక ప్రకటనలో తెలిపింది.కాగా బుధవారం సాయంత్రం అనారోగ్యానికి గురైన ఆయనను.. కుటుంబసభ్యులు హుటాహుటిన ఢిల్లీలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ వినిత్ సూరి పర్యవేక్షణలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండటంతో నేడు డిశ్చార్జ్ అయ్యారు.అయితే వారం రోజుల వ్యవధిలోనే 96 ఏళ్ల అద్వానీ అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరడం రెండోసారి. గత నెల 26న వృద్ధాప్యం కారణంగా యూరాలజీ సంబంధిత సమస్యతో ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన ఆయనకు సర్జరీ నిర్వహించిన విషయం తెలిసిందే. సర్జరీ తర్వాత కోలుకున్న ఆయనను డిశ్చార్జ్ చేశారు. మళ్లీ అద్వానీ ఆస్వస్థకు గురవడంతో ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందజేశారు.కాగా ఈ ఏడాది దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అందుకున్నారు అద్వానీ. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ పురస్కారం ప్రదానం చేశారు. ఈ వేడుకకు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్, ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా సహా బీజేపీ సీనియర్ నేతలు హాజరయ్యారు. అయితే అద్వానీ ఆరోగ్యం క్షీణించడంతో ఆయన నివాసంలోనే ఈ కార్యక్రమం జరిగింది. -
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
న్యూఢిల్లీ: బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆయన్ను న్యూఢిల్లీలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. ప్రస్తుతం ఎల్కే అద్వానీ డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు. అయితే ప్రస్తుతానికి ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి వైద్యులు ఓ ప్రకటనలో తెలిపారు.గత నెల 27న ఎల్కే అద్వానీ అస్వస్థతకు గురికావడంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్చిన విషయం తెలిసిందే. -
అద్వానీకి అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక
న్యూఢిల్లీ: బీజేపీ కురు వృద్ధుడు, మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ బుధవారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్య నిపుణులు సమీక్షిస్తున్నారు. 96 ఏళ్ల అద్వానీ వృద్ధాప్య సంబంధ సమస్యలతో బాధపడుతున్నారు. బీజేపీని దేశవ్యాప్తంగా విస్తరించడంలో దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయితో పాటు అద్వానీది కీలక పాత్ర. దాదాపు నాలుగు దశాబ్దాల ఆయన రాజకీయ జీవితంలో రథయాత్ర కీలక మలుపు. ఆ యాత్ర ద్వారా బీజేపీకి దేశవ్యాప్తంగా ఊపు తీసుకొచ్చారు. 1999–2004 మధ్య ఉప ప్రధానిగా, కేంద్ర మంత్రిగా చేశారు. బీజేపీ అధ్యక్షునిగా కూడా పని చేశారు. పదేళ్లుగా అద్వానీ పూర్తి విశ్రాంత జీవితం గడుపుతున్నారు. ఈ ఏడాదే ఆయన భారతరత్న అందుకున్నారు. వయో భారం దృష్ట్యా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయన నివాసానికి వెళ్లి ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో పురస్కారాన్ని అందజేయడం తెలిసిందే. -
యూపీఏకు ప్రజామోదం
2009 సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారమంతా లౌకికవాదం, ఉగ్రవాదం, మతతత్వం చుట్టూ తిరిగింది. ఐదేళ్లలో అభివృద్ధిని కాంగ్రెస్ ప్రధానంగా నమ్ముకుంది. ఉద్యోగావకాశాల కల్పన, సమాచార హక్కు చట్టం, గ్రామీణ ఉపాధి హామీ వంటి పథకాలను ప్రజలకు గుర్తు చేసింది. మత, భాష, ప్రాంతీయ వాదం, కుల వాదాలకు తాము వ్యతిరేకమంటూ ప్రచారం చేసింది. యూపీఏ హయాంలో ఉగ్రవాదం పెచ్చు మీరిందని బీజేపీ ఎంతగా ప్రచారం చేసినా జనం పట్టించుకోలేదు. మరోవిడత యూపీఏనే ఆశీర్వదించారు... – సాక్షి, నేషనల్ డెస్క్ 2009లో 15వ లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 16 నుంచి మే 13 దాకా ఐదు దశల్లో జరిగాయి. 2004లో జనం తన పాలనను తిరస్కరించడంతో నొచ్చుకున్న వాజ్‌పేయి ఇక ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. దాంతో ఎన్డీఏ ప్రధాని అభ్యర్థిగా ఎల్కే అద్వానీ తెరపైకి వచ్చారు. కానీ ఆయన పట్ల పలు ప్రాంతీయ పార్టీలు సానుకూలంగా లేవు. యూపీఏలోనూ కాస్త అనిశ్చితి నెలకొంది.మళ్లీ గెలిస్తే రాహుల్‌ను ప్రధాని చేస్తారన్న ప్రచారం సాగినా మన్మోహనే కొనసాగుతారని సోనియా స్పష్టం చేశారు. ఎన్నికలకు 5 నెలల ముందు ముంబై ఉగ్ర దాడి 170 మందిని పొట్టన పెట్టుకుంది. ఈ పరిస్థితుల్లో యూపీఏ, ఎన్డీఏ కూటముల్లో దేనికీ మెజారిటీ రాకపోవచ్చని అంతా అంచనా వేశారు. కాంగ్రెస్ బలం 145 నుంచి 206 ఎంపీలకు పెరిగింది. బీజేపీ 22 స్థానాలు కోల్పోయి 116కు పరిమితమైంది. యూపీఏకు 261 స్థానాలు దక్కాయి. మిత్రపక్షాల సాయంతో మొత్తం 322 మంది ఎంపీల మద్దతుతో మన్మోహన్ మరోసారి ప్రధాని అయ్యారు. కాంగ్రెస్‌కు అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లో 33 స్థానాలు లభించాయి! సీపీఎం సారథ్యంలోని థర్డ్ ఫ్రంట్‌కు 78 సీట్లొచ్చాయి. నియోజకవర్గాల పునర్విభజన 2001 జనాభా లెక్కల ఆధారంగా 2008లో లోక్‌సభ స్థానాల పునర్విభజన జరిగింది. ఇది కూడా ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపిందంటారు. 499 స్థానాల స్వరూపం మారింది. ఆ మేరకు ఓటర్ల జాబితాల్లోనూ మార్పుచేర్పులు చేయాల్సి వచ్చింది. కుంభకోణాలతో అప్రతిష్ట యూపీఏ పాలనలో అతి పెద్ద కుంభకోణాలు వెలుగు చూశాయి. 2జీ స్కాం వీటిలో ముఖ్యమైనది. డీఎంకే నేత ఎ.రాజా టెలికం మంత్రిగా ఉండగా 2008లో 122 కొత్త టెలికం లైసెన్స్‌లు జారీ చేశారు. అనుభవం లేని కంపెనీలకు కారుచౌకగా కట్టబెట్టినట్టు ఆరోపణలొచ్చాయి. దాంతో ఖజానాకు ఏకంగా రూ.1.76 లక్షల కోట్ల నష్టం జరిగిందని కాగ్ పేర్కొంది. 2004–11 మధ్య 194 బొగ్గు గనులను వేలం వేయకుండా కేటాయించడం వల్ల మరో రూ.1.86 లక్షల కోట్ల నష్టం వాటిల్లినట్టు తేల్చింది! విశేషాలు 2009 సార్వత్రిక ఎన్నికలు ఇద్దరు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ల సారథ్యంలో జరగడం విశేషం! ఏప్రిల్ 20న తొలి దశ పోలింగ్ ఎన్.గోపాల స్వామి ఆ«ధ్వర్యంలో, మిగతా దశలు నవీన్ చావ్లా పర్యవేక్షణలో జరిగాయి. వీరి విభేదాలు సంచలనంగా మారాయి. ఏప్రిల్ 20న రిటైరైన గోపాలస్వామి, ఆలోగా ఒక విడత పోలింగైనా నిర్వహించాలని భావించారు. దాన్ని ఎన్నికల కమిషనర్‌గా చావ్లా వ్యతిరేకించడం, ఆయన్ను తొలగించాలంటూ రాష్ట్రపతికి గోపాలస్వామి సిఫార్సు చేయడం కలకలం రేపింది. ► 2009 ఎన్నికల్లో ఏకంగా 114 మంది అభ్యర్థులు కేవలం 3 శాతం ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ►యూపీఏ తొలి ఐదేళ్లలో జీడీపీ వృద్ధి రేటు 9.8 శాతంతో ఆల్‌టైం గరిష్టానికి చేరింది. ► 2008 అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభాన్ని యూపీఏ ప్రభుత్వం విజయవంతంగా అధిగమించింది. ఫొటో ఓటర్ జాబితాలు ఎన్నికల సంఘం కొత్తగా ఓటర్ల స్టాంప్ సైజు ఫొటోలతో జాబితాలను ప్రవేశపెట్టింది. దాంతో 2009 లోక్‌సభ ఎన్నికలను ఫొటో ఓటర్ల జాబితాలతో జరిగాయి. అప్పటిదాకా వాటిపై కేవలం పేర్లే ఉండేవి. అయితే అసోం, నాగాలాండ్, జమ్మూ కశీ్మర్లో మాత్రం ఫొటోల్లేని జాబితాలనే ఉపయోగించారు. 15వ లోక్‌సభలో పార్టీల బలాబలాలు (మొత్తం స్థానాలు 543) పార్టీ స్థానాలు కాంగ్రెస్ - 206 బీజేపీ - 116 ఎస్పీ - 23 బీఎస్పీ - 21 జేడీయూ - 20 టీఎంసీ - 19 డీఎంకే - 18 బిజూ జనతాదళ్ - 14 శివసేన - 11 ఇతరులు - 86 స్వతంత్రులు - 9 -
అద్వానీకి భారతరత్న ప్రదానం
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ దిగ్గజం, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ (96) భారత రత్న పురస్కారం అందుకున్నారు. ఆదివారం ఢిల్లీలోని అద్వానీ నివాసంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనకు పురస్కారాన్ని అందజేశారు. ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. అద్వానీకి భారతరత్న ప్రదాన కార్యక్రమంలో పాల్గొనడం తనకు చాలా ప్రత్యేకమైన సందర్భమని మోదీ అన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. భారతరత్న ప్రదాన సమయంలో కూర్చోని ఉండటం ద్వారా రాష్ట్రపతిని మోదీ ఘోరంగా అవమానించారని కాంగ్రెస్ మండిపడింది -
అద్వానీకి భారతరత్న అందించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
సాక్షి, ఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ భారతరత్న అందుకున్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఆదివారం అద్వానీకి భారతరత్నను ప్రదానం చేశారు. కాగా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ కలిసి ఆదివారం అద్వానీ ఇంటికి వెళ్లారు. అనంతరం, అద్వానీకి భారతరత్నను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్, వెంకయ్యనాయుడు, పలువురు నేతలు పాల్గొన్నారు. ఇక, నిన్న (శనివారం) పీవీ నరసింహరావు, చౌదరి చరణ్ సింగ్, ఎంఎస్ స్వామినాథన్, కర్పూరీ ఠాకూర్‌కు భారతరత్నలను అందజేసిన విషయం తెలిసిందే. #WATCH | President Droupadi Murmu confers Bharat Ratna upon veteran BJP leader LK Advani at the latter's residence in Delhi. Prime Minister Narendra Modi, Vice President Jagdeep Dhankhar, former Vice President M. Venkaiah Naidu are also present on this occasion. pic.twitter.com/eYSPoTNSPL — ANI (@ANI) March 31, 2024 -
భారతరత్న ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
సాక్షి, ఢిల్లీ: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు భారతరత్న అవార్డులను ప్రదానం చేశారు. రాష్ట్రపతిభవన్‌లో భారతరత్న అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ సందర్బంగా ఇటీవల భారతరత్న పొందిన వారు అవార్డులను స్వీకరించారు. మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్.. అలాగే, ఎమ్ఎస్ స్వామినాథన్, బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్‌ను మరణానంతరం భారతరత్న అవార్డు వరించింది. మాజీ ప్రధాని పీవీ నరసింహరావు తరపున భారతరత్న పురస్కారం అందుకున్న ఆయన కుమారుడు పీవీ ప్రభాకర్ రావు. చౌదరి చరణ్ సింగ్ తరపున భారతరత్న పురస్కారం అందుకున్న ఆయన కుమారుడు జయంత్ చౌదరి. మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ తరపున భారతరత్న పురస్కారం అందుకున్న ఆయన కుమారుడు రామ్‌నాథ్ ఠాకూర్. వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్. స్వామినాథన్ తరపున భారతరత్న పురస్కారం అందుకున్న ఆయన కుమార్తె డాక్టర్ నిత్య. #WATCH | President Droupadi Murmu confers Bharat Ratna upon former PM Chaudhary Charan Singh (posthumously) The award was received by Chaudhary Charan Singh's grandson Jayant Singh pic.twitter.com/uaNUOAdz0N — ANI (@ANI) March 30, 2024 అనారోగ్యం కారణంగా హాజరు కాలేకపోయిన బీజేపీ సీనియర్ నేత అద్వానీ. దీంతో, రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ రేపు(ఆదివారం) ఎల్కే అద్వానీ ఇంటికి వెళ్లి అవార్డును అందించనున్నారు. #WATCH | President Droupadi Murmu presents the Bharat Ratna award to former PM PV Narasimha Rao (posthumously) The award was received by his son PV Prabhakar Rao pic.twitter.com/le4Re9viLM — ANI (@ANI) March 30, 2024 అయితే, ఇటీవలే ఐదుగురికి కేంద్రం భారతరత్న అవార్డులను ప్రకటించింది. ఇందులో భాగంగానే నేడు భారతరత్నల ప్రదానం జరిగింది. ఇక, ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పలువురు నాయకులు పాల్గొన్నారు. పీవీ కుటుంబ సభ్యుల హర్షం.. పీవీ నరసింహారావుకు భారత రత్న ఇవ్వడం సంతోషంగా ఉంది -శారద, పీవీ నరసింహారావు కూతురు దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు సరైన దిశలో నడిపించారు. ఆయన చేసిన కృషికి భారతరత్న అవార్డు నిదర్శనం. నరేంద్ర మోదీకి ధన్యవాదాలు.- జస్టిస్ శ్రవణ్ కుమార్, పీవీ మనవడు యూపీఏ హయంలోనే పీవీకి భారతరత్న రావాలి. అవార్డు ఆలస్యం అయినా, ఎన్డీఏ ప్రభుత్వం గుర్తించడం సంతోషం. పీవీ నరసింహారావుకు అనేక అవమానాలు జరిగాయి. ఆయన చేసిన మంచి పనులు కాంగ్రెస్ ఖాతాలో వేసుకున్నారు- సుభాష్ , పీవీ.మనవడు. -
లౌకిక వాదానికి హిందుత్వ వారధి
‘భారతరత్న’ లభించడంతో వార్తలలోకి వచ్చిన బీజేపీ రాజకీయ దిగ్గజం లాల్ కృష్ణ అద్వానీ విలక్షణమైన నాయకుడు. ఆయన మాటల్లో దాపరికాలు ఉండవు. తన తప్పును అంగీకరించడానికి భేషజ పడటం ఉండదు. అవసరం అయితే క్షమాపణ అడిగేందుకు కూడా సుముఖంగా ఉంటారు! స్వచ్ఛమైన, సరళమైన జాతీయవాదం కోసం నిలబడిన నాయకుడాయన. హైందవ దుస్తుల్ని తొలగించుకున్న దిగంబర జాతీయవాదం అర్థం లేనిదని ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఆయనంతటి ఆత్మనిశ్చయం గల శక్తిమంతులు ఓ గుప్పెడు మంది మాత్రమే కనిపిస్తారు. పరస్పర వైరుధ్యం కలిగిన హిందుత్వానికి, లౌకికవాదానికి మధ్య వారధి నిర్మించే ప్రయత్నంలో అద్వానీ... లోకమాన్య తిలక్, గాంధీజీల దృక్పథాన్ని అనుసరించారు. నాకు చాలాకాలంగా, అతి సన్నిహితంగా పరిచయం ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకుడు – ఆయన ద్వారా ఆయన కుటుంబం కూడా – లాల్ కృష్ణ అద్వానీ అని నేను నిస్సందేహంగా చెప్పగలను. ఒక కాలం ఉండేది... నేను ఆయన విశ్వాసాన్ని స్పష్టంగా గెలుపొందిన కాలం; కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో నా సలహాను సైతం ఆయన తీసుకున్న కాలం. ఆ క్రమంలో ఆయన నన్ను భారత రాజకీయాలలోని గుంభనమైన అంతర్గత కార్యకలాపాలపైన కూడా నా దృష్టి చొరబాటును అనుమతించారు. ఇప్పుడు ఆయనకు ‘భారతరత్న’ లభించడంతో ఆయనతో నా మొదటి ఇంటర్వ్యూ నా మదికి, మననానికి వచ్చింది. ఆయన్ని నిజమైన ప్రత్యేక రాజకీయ నాయకుడిగా మార్చిన ఆయనలోని లక్ష ణాలను సంగ్రహించిన ఇంటర్వ్యూ అది. తన మాటల్లో దాపరికాలు లేకుండా, నిజాయితీగా ఉండే నాయకుడు మాత్రమే కాదాయన... తన తప్పుల్ని అంగీకరించడానికి సైతం సుముఖంగా ఉండేవారు. అవసరం అయితే ‘మన్నింపు’ను కోరేవారు. ఆయన లాంటి రాజకీయ నాయకులు అతికొద్ది మంది మాత్రమే నాకు తెలుసు. 1990లో అద్వానీ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆ ఇంటర్వ్యూ జరిగింది. అప్పుడు నేను – ఆ ముందరే ఇండియాకు తిరిగి వచ్చిన – ఒక అనామక జర్నలిస్టుని. ‘హిందూస్థాన్ టైమ్స్ ఐవిట్నెస్’ ప్రారంభ ఎపిసోడ్ కోసం ఆ ఇంటర్వ్యూను చేశాన్నేను. డిసెంబరు నాటి ఒక అహ్లాదకరమైన అపరాహ్నవేళ అద్వానీ పండారా పార్క్ నివాసంలో ఆయనతో కలిసి కూర్చున్నాను. మరీ దీర్ఘంగా ఏం కాదు, బహుశా కేవలం పది నిముషాలు మా మధ్య సంభాషణ జరిగినట్లుంది.అందులోని చిన్న భాగం ఇది: కరణ్ థాపర్: మీరు అధికారంలో ఉండి ఉంటే కనుక ఇండియాను హిందూ దేశంగా మార్చేవారా? ఒక అధికారిక హిందూ దేశంగా? ఎల్.కె. అద్వానీ: ఇంగ్లండ్ క్రైస్తవ దేశం అయినట్లే, ఇండియా హిందూ దేశం అని నేను నమ్ముతాను. ఇందులో ఎక్కువ తక్కువలేం లేవు. ‘‘మీరు మాటలతో ఆడుకుంటారనే భావన చాలామందిలో ఉంది. కాబట్టి హిందుత్వం అంటే అర్థం ఏంటో చెప్పండి? హిందుత్వం కోసం మీరు నిలబడతారా, లేక తడబడతారా? హిందు త్వానికి మీరు అనుకూలమేనా?’’ ‘‘నేను స్వచ్ఛమైన, సరళమైన జాతీయవాదం కోసం నిలబడతాను. కానీ తన హైందవ దుస్తుల్ని తొలగించుకున్న దిగంబర జాతీయవాదం అర్థం లేనిదని నమ్ముతాను. ఇంతకు మించి చెప్పేదేం లేదు.’’ ‘‘ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుకుందాం. కచ్చితంగా ఇదీ అని చెప్పండి. మీరు కోరుకుంటున్నది లౌకిక భారతదేశాన్నా లేక హిందూ భారతదేశాన్నా?’’ ‘‘నిశ్చయంగా, నిజాయితీగా నేను లౌకిక భారతదేశం కోసమే నిలబడతాను.’’ ‘‘అక్కడే సమస్య వస్తోంది మిస్టర్ అద్వానీ. చాలామంది ప్రజలు మీరు అనుకూలంగా ఉన్న హిందుత్వకు, మళ్లీ మీరే అనుకూలంగా ఉన్న లౌకికవాదానికి మధ్య తీవ్రమైన వైరుధ్యాన్ని చూస్తున్నారు. ఎక్కువ మంది ప్రజలు మీరు వంతెన వేయలేరని అనుకుంటున్న వాటికి మీరు వంతెన వేయటానికి ప్రయత్నిస్తున్నారు.’’ ‘‘నేను విశ్వసిస్తున్నది లౌకికవాదం పట్ల నెహ్రూకి, లేదా సర్దార్ పటేల్‌కు ఉన్న దృక్పథాన్ని కాదు. లోకమాన్య తిలక్‌కు, గాంధీకి ఉన్న టువంటి దానిని. అయితే ఈ దృక్పథాన్ని గత నాలుగు దశాబ్దాలలో ఎన్నికల ప్రయోజనాలు వక్రీకరిస్తూ వచ్చాయి.’’ ‘‘భారతదేశంలోని పది కోట్లమంది ముస్లింల పట్ల మీ వైఖరి ఏమిటి? వారు ఈ దేశంలోని విడదీయరాని భాగం అని మీరు విశ్వసిస్తారా?’’ ‘‘కచ్చితంగా. కచ్చితంగా. నిస్సంకోచంగా.’’ ‘‘అప్పుడైతే, దేశంలోని దాదాపు 3,000 మసీదులను కూల్చివేసి వాటి స్థానంలో దేవాలయాలు నిర్మించాలనే వీహెచ్‌పీ డిమాండ్‌కు వ్యక్తిగతంగా మీరు వ్యతిరేకం అని నేను నమ్మొచ్చా?’’ ‘‘నేను వ్యతిరేకమే.’’ ‘‘పూర్తిగా?’’ ‘‘పూర్తిగా.’’ కావలిస్తే ఈ సంభాషణను మళ్లీ చదవండి. ప్రశ్నల దృఢత్వాన్ని, జవాబులలోని నిజాయితీని గమనించండి. అద్వానీ తర్వాతి నాయకు లలో ఎవరితోనైనా ఇలాంటి సంభాషణ ఈరోజు సాధ్యం అవుతుందని నేను అనుకోను. వాళ్లు దీనిని ఏమాత్రం సహించలేరు. లేచి వెళ్లి పోతారు. అయితే అసలు విషయం, ఇంటర్వ్యూ తర్వాత ఏం జరిగిందన్నది. తర్వాత నేను ఆద్వానీని కలిసినప్పుడు ‘‘ఇంటర్వ్యూ గురించి మీరేమనుకుంటున్నారు?’’ అని అడిగాను. అందుకు ఆయన కఠిన మైన పలుకులతో... అదొక హాస్యాస్పదం అని కొందరు తనతో అన్నట్లు చెప్పి, ఒక్కసారిగా వెనుదిరిగి అక్కడి నుంచి వెళ్లిపోయారు! ఆయన ప్రవర్తన నన్ను నిరుత్తరుడిని చేసింది. ఆయనకు ఇంటర్వ్యూ వీడియోను పంపి, స్వయంగా తననే చూడమని కబురు పెట్టాను. ఆయన్ని ఎవరో తప్పుదారి పట్టించారని నా నమ్మకం. వారాలు, నిజానికి నెలలు గడిచినా ఆయన్నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. నేను కూడా వస్తుందని ఎదురు చూడటం మానే శాను. హఠాత్తుగా... చీకటి పడుతున్న ఒక వేసవి సాయంత్రం నా ఫోన్ మోగింది. అటువైపు ఎల్.కె. అద్వానీ. ‘‘కరణ్, నేనిప్పుడే ఇంటర్వ్యూ చూశాను. అందులో కొంచెం కూడా నాకు తప్పు కనిపించలేదు. కానీ నాకు తప్పుడు సమాచారం ఇచ్చారు. దానిని సాకుగా చూపడం నా వయసుకు తగినది కాదు. మనం చివరిసారి కలుసుకున్నప్పుడు నీతో అనుచితంగా ప్రవర్తించాను. క్షమాపణలు చెప్పడానికే నీకిప్పుడు ఫోన్ చేశాను’’ అన్నా రాయన. తప్పును అంగీకరించడానికి ఏ సంకోచమూ లేని సంసిద్ధతే బహుశా అద్వానీలోని గొప్ప గుణంగా తక్షణం ఆయన పట్ల నాకు అక ర్షణ కలిగేలా చేసింది. ఆయన తర్వాత మళ్లీ అతి కొద్దిమంది రాజకీయ నాయకులు ఓ గుప్పెడు మంది భేషజాలు లేకుండా తమ తప్పును ఒప్పుకుని క్షమాపణ అడగగల శక్తిమంతులు ఉన్నారు. అద్వానీ గురించి ఇంకా మీరేం అనుకున్నా – ఆయనపై ఇతరులకు భిన్నాభిప్రా యాలు ఉంటాయని నేను అంగీకరిస్తాను – ఒక మంచి మనిషి మాత్రమే అలా ఉండగలరు. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఒకేసారి ఐదుగురికి భారతరత్న.. మోదీ వ్యూహం అదేనా?
భారత మాజీ ప్రధాని పీవీ నరసింహరావుకు కేంద్ర ప్రభుత్వం భారత రత్న బిరుదు ఇవ్వడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అయింది. అదే సమయంలో నరేంద్ర మోదీ వ్యూహాత్మకంగా ఈ అవార్డులను ప్రకటిస్తున్నారన్న అభిప్రాయం కూడా ఏర్పడుతోంది. యూపీలో మరో మాజీ ప్రధాని చరణ్ సింగ్, బీహారులో మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ కు, మాజీ ఉప ప్రధాని ఎల్.కె. అద్వానికి, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎమ్.ఎస్.స్వామినాదన్కు ఈ అవార్డులు ఇచ్చారు. వీరిలో ఎవరిపైన అభ్యంతరాలు లేవు. కాకపోతే ఎన్నికలు మరో రెండు నెలల్లో జరగనున్న తరుణంలో ఈ ప్రముఖులను ఎంపిక చేసుకున్న తీరు మాత్రం చర్చనీయాంశమే. బీహారులో జేడీయూ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎన్డీఏ కూటమిలోకి మారిన నేపథ్యంలో అక్కడ ఉన్న బీసీ వర్గాలను ఆకట్టుకోవడానికి దివంగత నేత కర్పూరికి భారత రత్న ఇచ్చారు. మాజీ ఉప ప్రధాని అద్వానికి ఇవ్వడంలో బీజేపీ ఇంటరెస్టు ఉంటుంది. అద్వానికి సరైన ప్రాధాన్యత లభించడం లేదన్న భావన ప్రబలిన తరుణంలో ఆ వాదనను పూర్వపక్షం చేయడానికి ఇచ్చి ఉండవచ్చు. దివంగత నేత చరణ్ సింగ్‌కు భారతరత్న ఇవ్వడం ద్వారా యూపీలో జాట్ వర్గాన్ని ఆకట్టుకునే ప్లాన్ ఉండవచ్చు. దానికి తగినట్లే చరణ్ సింగ్ మనుమడు జయంత్ సమాజవాది పార్టీ కూటమి నుంచి ఎన్డీఏ.లోకి వచ్చేస్తున్నట్లు ప్రకటించారు. స్వామినాధన్ తమిళనాడుకు చెందినవారు. ఇటీవలికాలంలో ఆ రాష్ట్రంపై మోదీ ఫోకస్ పెట్టారు. ఇది కూడా ఒక కారణం కావచ్చు. ఇక ఇంకో దివంగత నేత పీవీ నరసింహారావు కాంగ్రెస్ ప్రధాన మంత్రిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన తీసుకు వచ్చిన ఆర్దిక సంస్కరణలు దేశ ప్రగతికి బాటలు వేశాయి. బహుభాషా కోవిదుడు అయిన పీవీ నరసింహారావు పట్ల అందరిలోను గౌరవ భావం ఉన్నప్పటికి, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని యూపీఎ ఇవ్వని భారత రత్న అవార్డును బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ. ఇవ్వడం కూడా ఆసక్తికర అంశమే. తెలంగాణలో పీవీ పట్ల ఉన్న అభిమానాన్ని దృష్టిలో ఉంచుకుని కూడా ఈ నిర్ణయం చేసి ఉండవచ్చు. వచ్చే పార్లమెంటు ఎన్నికలలో తెలంగాణ లో ఎక్కువ సీట్లు గెలవాలని ప్రయత్నిస్తున్న బీజేపీ దీనిని కూడా ఒక అస్త్రంగా వాడుకోవచ్చు. ఇక్కడ మరో కోణం ఏమిటంటే 1992లో బాబ్రిమసీదు కూల్చివేత ఘటనకు సంబంధించి అద్వానిపై అప్పట్లో కేసు నమోదు అయింది. ఆ మసీదు కూలుతున్నప్పుడు పీవీ నరసింహారావు గట్టి చర్య తీసుకోకుండా మౌనంగా ఉన్నారన్న విమర్శ ఉంది. వీరిద్దరికి ఒకేసారి భారతరత్న ఇవ్వడం గమనించదగ్గ అంశమే. పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన సంస్కరణలను ఆ రోజుల్లో బీజేపీ, వామపక్షాలు వ్యతిరేకించేవి. నిరసనలు చేపట్టేవి. ఆ తర్వాత కాలంలో బీజేపీ కూడా వాటినే అనుసరించింది. కాని చిత్రంగా కాంగ్రెస్ లో పవర్ పుల్ ఉమన్ గా ఉన్న సోనియాగాంధీతో పీవీకి అప్పట్లో విబేధాలు వచ్చాయి. సోనియాగాందీ చేసిన కొన్ని డిమాండ్లను పీవీ అంగీకరించలేదని,దాంతో ఆయనపై కోపం పెంచుకున్నారని అంటారు. అందువల్లే పీవీ ఢిల్లీలో మరణిస్తే,కుటుంబ సభ్యులు కోరినా, దేశ రాజధానిలో అంత్యక్రియలకు అవకాశం ఇవ్వలేదని అంటారు. ప్రత్యేక ఘాట్‌ను ఏర్పాటు చేయలేదన్న భావన ఉంది.అంతేకాక ఏఐసీసీ కార్యాలయానికి ఆయన బౌతిక కాయాన్ని తీసుకు వెళ్లినప్పుడు లోపలికి తీసుకురాకుండా, గేటు బయటే ఉంచడం కూడా వివాదాస్పదం అయింది. ఆర్దిక సంస్కరణలకు ఆద్యుడు అయిన పీవీ 1996లో కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తెప్పించలేకపోయారు. తెలుగుదేశం, జెఎమ్ఎమ్ వంటి పార్టీలను చీల్చి అధికారంలో ఐదేళ్లపాటు కొనసాగినా, పార్టీ సాదారణ ఎన్నికలలో ఓటమి పాలైంది. జెఎమ్ఎమ్కు లంచాలు ఇచ్చారన్న అబియోగానికి గురయ్యారు. ఇన్ని ఉన్నప్పటికీ దేశ ప్రయోజనాల రీత్యా ఆయన చేపట్టిన కార్యక్రమాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా పెద్దగా సక్సెస్ కాలేకపోయిన పీవీ దేశ ప్రదానిగా సఫలం అయ్యారని చెప్పాలి. తెలుగువారిలో భారతరత్న అవార్డు పొందిన తొలి వ్యక్తిగా పీవీ కీర్తిప్రతిష్టలు పొందారు. తెలుగువారందరికి ఇది గర్వకారణమే. ఒకప్పుడు ప్రధానిగా మాత్రమే కాకుండా , ఏఐసీసీ అధ్యక్షుడుగా అధికారం చెలాయించిన పీవీ ఆ తర్వాత కాలంలో కాంగ్రెస్ లో దాదాపు ఒంటరి అయ్యారు. 1991 లో రాజకీయాల నుంచి దాదాపు విరమించుకుని హైదరాబాద్ వచ్చేసిన ఆయన అనూహ్యంగా దేశ ప్రధాని అయ్యారు. ప్రధాని పదవి నుంచి దిగిపోయిన తర్వాత మళ్లీ అదే రకమైన పరిస్థితిని ఆయన ఎదుర్కున్నారు. కాగా పీవీ మరణానంతరం ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రం హుస్సేన్ సాగర్ ఒడ్డున స్థలం కేటాయించి అంత్యక్రియలు జరిపించి ఆయన స్మృతివనంగా అభివృద్ది చేశారు. కాంగ్రెస్ అధిష్టానం అనుసరించిన వైఖరి నేపద్యంలో పీవీ కుటుంబం కూడా కాంగ్రెస్ కు దూరం అయింది. 2014లో తెలంగాణ ముఖ్యమంత్రి అయిన కెసిఆర్ ఆ పరిస్థితిని తనకు అనుకూలంగా మలచుకున్నారు. పీవీ బందువులకు ప్రాదాన్యం ఇవ్వడం, ఒకరికి మంత్రి పదవి ఇవ్వడం , పీవీ కుమార్తె అయిన వాణి కి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం వంటివి చేశారు. పీవీ శత జయంతి ఉత్సవాలను కూడా నిర్వహించారు. ఇప్పుడు పీవీకి భారత రత్న ఇవ్వడం ద్వారా తెలంగాణలో బీజేపీకి ఎంత మేర రాజకీయ లబ్ది చేకూరుతుందన్నది చూడాలి. బీఆర్ఎస్ కూడా ఈ విషయంలో పోటీ పడుతుంది. కాంగ్రెస్‌కు మాత్రం ఇది కొంత ఇబ్బందికరమైనదే. పీవీకి భారత ఇవ్వలేకపోయారన్న విమర్శను ఎదుర్కుంటోంది. పార్లమెంటు ఎన్నికలలో ఈ అంశం ఎంత ప్రభావం చూపుతుందన్నది అప్పుడే చెప్పలేం. కాగా మరో నేత , తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావుకు భారత రత్న ఇవ్వాలన్న డిమాండ్ రెండు దశాబ్దాలుగా ఉంది. వాజ్ పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఆయనకు భారత రత్న ఇవ్వడానికి దాదాపు నిర్ణయం అయిపోగా , అందుకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులే అడ్డుకున్నారన్న అభిప్రాయం ఉంది. ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతి ఆ అవార్డును స్వీకరించే అవకాశం ఉండడంతో ,అది ఇష్టలేని కుటుంబ సభ్యులు బిరుదును అప్పట్లు ఇవ్వవద్దన్నారని చెబుతారు. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా, ఎన్డీఏ కన్వీనర్‌గా కూడా ఉండేవారు. అయినా ఎన్టీఆర్‌కు భారత రత్న రాలేదు. కాని ప్రతి మహానాడులోను ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలని తీర్మానం చేస్తుంటారు. దాంతో ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల చిత్తశుద్దిపై సందేహాలు ఏర్పడ్డాయి. 2014-2019 టర్మ్‌లో కూడా చంద్రబాబు నాయుడు ఎన్డీఏ.లో ఉన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వంలో ఇద్దరు టిడిపి మంత్రులు కూడా ఉన్నారు. అయినా ఎన్టీఆర్‌కు మాత్రం భారతరత్న రాలేదు. 2018లో మోదీతో తగదా పడి బయటకు వచ్చారు. దాంతో కాస్తో,కూస్తో ఉన్న అవకాశం కూడా పోయినట్లయింది. అదేకనుక ఎన్టీఆర్‌కు కూడా భారతరత్న వచ్చి ఉంటే ఇద్దరు తెలుగువారు ఈ ఘనత సాధించినట్లయ్యేది. ప్రధాని మోదీ వ్యూహాత్మకంగానే పద్మ అవార్డులు ప్రకటిస్తుంటారు. ఉదాహరణకు యూపీ మాజీ ముఖ్యమంత్రి మూలాయం సింగ్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శరద్ పవార్ కు, కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ అజాద్ వంటివారికి పద్మవిభూషణ్ అవార్డులు ఇచ్చారు. ఎన్నికల టైమ్‌లో ఐదుగురికి భారత రత్న అవార్డులు ఇవ్వడంతో రాజకీయంగా ప్రాముఖ్యత ఏర్పడింది. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
భారతరత్న.. ఆ సంప్రదాయాన్ని తిరగరాసి మరీ..!
మునుపెన్నడూ లేని రీతిలో.. దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ఈ ఏడాది ఏకంగా ఐదుగురికి ప్రకటించింది భారత ప్రభుత్వం. భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ.. మాజీ ప్రధానులైన పీవీ నరసింహరావు, చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌లకు ప్రకటించారు. అంతకు ముందు మరో ఇద్దరి పేర్లను ప్రధాని మోదీ స్వయంగానే ప్రకటించిన సంగతీ తెలిసిందే. సాధారణంగా భారతరత్న అవార్డులను ఒకరు, ఇద్దరు, గరిష్టంగా ముగ్గురికి ఇస్తూ వస్తోంది కేంద్రం. ఆ సంప్రదాయానికి 1999లో బ్రేక్ పడి.. ఏకంగా నలుగురికి ప్రకటించింది అప్పటి ప్రభుత్వం. ఆ తర్వాత మళ్లీ ఒకరు, ఇద్దరు, ముగ్గురికి ఇస్తూ వచ్చారు. అయితే ఈ ఏడాది మాత్రం ఏకంగా ఐదుగురికి ప్రకటించింది. ఈ ఏడాది.. బీజేపీ దిగ్గజం ఎల్కే అద్వానీకి, బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి థాకూర్‌కు భారతరత్నలకు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇవాళ మరో ముగ్గురికి ప్రకటించడంతో మొత్తం ఐదుగురికి ఇచ్చినట్లయ్యింది. ఐదుగురివి వేర్వేరు ప్రాంతాలు. ఇందులో స్వామినాథన్ మినహాయించి మిగిలిన నలుగురికి వేర్వేరు రాజకీయ నేపథ్యం ఉంది. దీంతో.. ఆయా ప్రాంతాల రాజకీయ నేతలు పార్టీలకతీతంగా తమ ప్రాంత దిగ్గజాలకు భారతరత్న దక్కడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. పీపీ నరసింహరావు పాములపర్తి వెంకట నరసింహారావు 1921 జూన్ 28న వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లిలో జన్మించారు. 1991 జూన్ 21 నుంచి 1996 మే 16 దాకా భారత దేశానికి ప్రధానిగా పని చేశారు. అంతకు ముందు.. కేంద్రంలో మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్‌గాంధీ ప్రభుత్వాల్లో పనిచేశారు. దేశ హోం, రక్షణ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల బాధ్యతలు నిర్వర్తించారు. స్వాతంత్రోద్యమం సమయంలో దేశం కోసం పోరాడిన పీవీ.. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1957-77 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించిన ఆయన పలు మంత్రిపదవులు చేపట్టారు. 1971 నుంచి 1973 వరకు ఏపీ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఇదీ చదవండి: తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధాని పీవీకి భారత రత్న చరణ్ సింగ్.. ఉత్తర ప్రదేశ్ మీరట్‌లో పుట్టిన పెరిగిన చరణ్ సింగ్.. 1979 జులై 28వ తేదీ నుంచి 1980 జనవరి 14వ తేదీ దాకా దేశానికి ప్రధానిగా పని చేశారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగానూ ఆయన రెండుసార్లు పని చేశారు. యూపీలో చెప్పుకోదగ్గ స్థాయిలో బలం,బలగం ఉన్న రాష్ట్రీయ లోక్‌దళ్(ఆర్ఎల్డీ.. చరణ్ సింగ్ వారసులు స్థాపించిన పార్టీ), విపక్ష శిబిరానికి షాక్ ఇచ్చి ఎన్డీయేలో చేరుతుందన్న ప్రచారం ఉన్న సమయంలోనే.. చరణ్ సింగ్‌కు అవార్డు ప్రకటించడం గమనార్హం. ఇదీ చదవండి: గ్రామీణ ప్రజాబంధు చరణ్ సింగ్ ఎం.ఎస్ స్వామినాథ్.. భారత దేశ హరితవిప్లవ పితామహుడిగా మాన్‌కోంబు సాంబశివన్ స్వామినాథ్ 1925 ఆగస్టు 7న తమిళనాడు రాష్ట్రంలో కావేరి డెల్టా ప్రాంతంలోని కుంభకోణం పట్టణంలో జన్మించారు. కొంతకాలం కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో పనిచేసిన స్వామినాథన్ 1954లో మళ్లీ భారత్‌లో అడుగు పెట్టారు. ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో శాస్త్రవేత్తగా పరిశోధనలపై దృష్టి పెట్టారు. 1972–79లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్‌గా వ్యవహరించారు. 1979లో కేంద్ర ప్రభుత్వం ఆయనను వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. 2007 నుంచి 2013 దాకా రాజ్యసభలో నామినేట్ ఎంపీగా సేవలను అందించారు. స్వామినాథన్ దేశ విదేశాల్లో ఎన్నో ప్రఖ్యాత సంస్థలకు నాయకత్వం వహించారు. కిందటి ఏడాది సెప్టెంబర్ 28వ తేదీన ఆయన కన్నమూశారు. ఇదీ చదవండి: ఆకలిపై పోరాటం జరిపిన శాస్త్రవేత్త కర్పూరి ఠాకూర్ బిహార్ మాజీ సీఎం, దివంగత నేత కర్పూరి ఠాకూర్ ఆయన శతజయంతి వేళ కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న తో గౌరవించింది. బిహార్‌కు రెండు పర్యాయాలు (డిసెంబరు 1970 నుంచి జూన్ 1971 వరకు, డిసెంబరు 1977 నుంచి ఏప్రిల్ 1979 వరకు) సీఎంగా సేవలందించి.. తన పాలనా దక్షతతో జన నాయక్‌గా చెరగని ముద్ర వేసుకున్నారు. 1924 జనవరి 24న బిహార్‌లోని సమస్తీపూర్ జిల్లాలో జన్మించిన కర్పూరి ఠాకూర్.. అనునిత్యం పేద ప్రజల సంక్షేమం కోసం, సామాజిక మార్పు కోసం పనిచేశారు.జనం కోసం నిబద్ధతతో పనిచేసిన ఆయన్ను ‘జననాయక్ కర్పూరి ఠాకూర్’ అని అక్కడి ప్రజలు పిలుస్తారు. లాలూ ప్రసాద్ యాదవ్, నీతీశ్ కుమార్, రాం విలాస్ పాశవాన్ వంటి నేతలకు ఠాకూర్ రాజకీయ గురువు. తాను విశ్వసించిన సిద్ధాంతాలకు కట్టుబడి సుదీర్ఘకాలం పాటు బిహార్, దేశ రాజకీయాలను ప్రభావితం చేయడం ద్వారా గొప్ప రాజనీతిజ్ఞుడిగా గుర్తింపుపొందిన ఆయన 1988 ఫిబ్రవరి 17న తుదిశ్వాస విడిచారు. ఇదీ చదవండి: అరుదైన జననాయకుడు ఎల్కే అద్వానీ రాజకీయ కురువృద్ధుడు, బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీకి భారతరత్న గౌరవం దక్కింది. సంఘ్ భావజాలాన్ని అణువణువునా పుణికిపుచ్చుకుని.. అంచెలంచెలుగా రాజకీయ దిగ్గజంగా ఎదిగిన మేధావి. అద్వానీ.. 1927 నవంబరు 8న భారత్‌లోని కరాచీ (ప్రస్తుతం పాక్‌లో ఉంది)లో జన్మించారు. 1941లో తన పద్నాలుగేళ్ల వయసులో ఆయన ఆరెస్సెస్‌లో చేరారు.దేశ విభజన తర్వాత ముంబయిలో స్థిరపడ్డ అద్వానీ.. రాజస్థాన్‌లో సంఘ్ ప్రచారక్‌గా పనిచేశారు. 1970లో ఢిల్లీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా తొలిసారి ఎన్నికయ్యారు.1980లో అద్వానీ సహా కొంతమంది జన సంఘ్ నేతలు జనతా పార్టీని వీడారు. ఆ తర్వాత వాజ్పేయీతో కలిసి 1980 ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీని స్థాపించారు. కాంగ్రెస్‌ను ఎదుర్కొనేందుకు నేషనల్ డెమొక్రటిక్ అలయెన్స్(ఎన్డీయే)కు రూపకల్పన చేసిన రాజనీతిజ్ఞుడు. 1999లో జరిగిన ఎన్నికల్లో గాంధీనగర్ లోక్‌సభ స్థానం నుంచి అద్వానీ గెలిచారు. లోక్‌సభలో సుదీర్ఘకాలం పాటు ప్రతిపక్ష నేతగా పనిచేశారు. ఉప ప్రధాని పదవిని సైతం ఆయన చేపట్టారు. 2019 నుంచి క్రియాశీల రాజకీయాలకు ఆయన దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇదీ చదవండి: గమ్యం చేరని రథ యాత్రికుడు -
L.K Advani: గమ్యం చేరని రథ యాత్రికుడు
లాల్‌కృష్ణ అడ్వాణీ. 1990ల నుంచి రెండు దశాబ్దాల పాటు దేశమంతటా మారుమోగిపోయిన పేరు. ముఖ్యంగా జాతీయ స్థాయిలో రాజకీయ రథయాత్రలకు పర్యాయపదంగా మారిన పేరు. ఆయన చేపట్టిన ఆరు యాత్రల్లో అయోధ్య రథయాత్ర దేశ రాజకీయ ముఖచిత్రాన్నే శాశ్వతంగా మార్చేసింది. జాతీయ రాజకీయాల్లో బీజేపీపై ‘అంటరాని పార్టీ’ ముద్రను చెరిపేసింది. బీజేపీని కేవలం రెండు లోక్‌సభ సీట్ల స్థాయి నుంచి తిరుగులేని రాజకీయ శక్తిగా తీర్చిదిద్దడంలో వాజ్‌పేయితో పాటు అడ్వాణీది కీలకపాత్ర. వాజ్‌పేయిని భారతరత్న వరించిన తొమ్మిదేళ్లకు తాజాగా ఆయనకూ ఆ గౌరవం దక్కింది. బీజేపీకి సుదీర్ఘ కాలం అధ్యక్షునిగా కొనసాగిన రికార్డు కూడా అడ్వాణీదే. జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్‌కు చెక్ పెట్టేందుకు నేషనల్ డెమొక్రటికల్ అలయన్స్ (ఎన్డీఏ)కు ఊపిరి పోసిందీ ఆయనే. కరాచీ నుంచి కరాచీ దాకా... అడ్వాణీ నేటి పాకిస్తాన్‌లోని కరాచీలో 1927 నవంబర్ 8న జన్మించారు. 14 ఏళ్లప్పుడే ఆరెస్సెస్‌లో చేరారు. అనంతరం జనసంఘ్ నేతగా ఎదిగారు. సహచర నేత వాజ్‌పేయితో పాటు దేశవ్యాప్త క్రేజ్ సంపాదించుకున్నారు. హిందూ హృదయ సమ్రాట్‌గా గుర్తింపు పొందారు. వాజ్‌పేయిది మితవాద ఇమేజీ కాగా అడ్వాణీ మాత్రం హిందూత్వకు పోస్టర్ బోయ్‌గా ముద్ర పడ్డారు. ఇద్దరూ కలిసి జోడెద్దులుగా బీజేపీ ప్రస్థానంలో కీలక పాత్ర పోషించారు. 1983లో కేవలం రెండు లోక్‌సభ సీట్లకు పరిమితమైన కాలంలో అడ్వాణీ బీజేపీ అధ్యక్ష పగ్గాలను అందుకున్నారు. అయోధ్యలో బాబ్రీ మసీదు స్థానంలో రామాలయం నిర్మించాలనే డిమాండ్‌తో దేశవ్యాప్త రామ రథయాత్ర తలపెట్టారు. 1990 సెపె్టంబర్లో గుజరాత్‌లోని సోమనాథ్ నుంచి మొదలు పెట్టిన ఈ యాత్రకు బ్రహా్మండమైన స్పందన లభించింది. అరెస్టుతో యాత్ర మధ్యలోనే ఆగినా బీజేపీకి అదెంతగానో కలిసొచి్చంది. 1991 లోక్‌సభ ఎన్నికల్లో రెండో అతి పెద్ద పారీ్టగా అవతరించింది. 1992లో బాబ్రీ మసీదు విధ్వంసానికి తోడు 1993 నుంచి అడ్వాణీ చేపట్టిన జనాదేశ్, స్వర్ణజయంతి, భారత్ ఉదయ్, భారత్ సురక్ష వంటి రథయాత్రలు బీజేపీని కేంద్రంలో అధికారానికి చేరువ చేశాయి. చివరికి 1996లో బీజేపీ తొలిసారిగా కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. కానీ వాజ్‌పేయి ప్రధాని కావడంతో అడ్వాణీ కల నెరవేరలేదు. దాంతో మితవాద ముద్ర కోసం విఫలయత్నాలు చేశారు. ఆ క్రమంలో 2005లో కరాచీ వెళ్లి మరీ జిన్నాను లౌకికవాది అంటూ పొగడటం ఆయనకు మరింత చేటు చేయడమే గాక ఆరెస్సెస్ కన్నెర్రకూ కారణమైంది. ఆ దెబ్బకు సంఘ్‌తో అడ్వాణీ సంబంధాలు పూర్తిగా చెడిపోయాయి. 2009 ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రధాని అభ్యరి్థగా నిలిచినా పార్టీ పరాజయం పాలైంది. యూపీఏ ప్రభుత్వ అవినీతిపై 2011లో చివరిసారి చేసిన జనచేతన యాత్రా అడ్వాణీకి అంతగా లాభించలేదు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అడ్వాణీకి భారతరత్న
న్యూఢిల్లీ: రాజకీయ కురు వృద్ధుడు, బీజేపీ అగ్ర నేత లాల్‌కృష్ణ అడ్వాణీ (96)కి కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఎక్స్‌లో ఈ మేరకు పోస్ట్ చేశారు. ఆ వెంటనే రాష్ట్రపతి భవన్ నుంచి ఈ మేరకు ప్రకటన వెలువడింది. అయోధ్యలో రామాలయం నిర్మాణం కోసం 1990లో దేశవ్యాప్త రథయాత్రతో బీజేపీకి ఊపు తెచ్చి అధికార సాధనకు బాటలు పరిచిన అడ్వాణీని, రామాలయ ప్రారం¿ోత్సవం జరిగిన కొద్ది రోజులకే భారతరత్న వరించడం విశేషం. అడ్వాణీకి ఈ సందర్భంగా మోదీ అభినందనలు తెలిపారు. ‘‘సమకాలీన రాజకీయవేత్తల్లో అత్యంత గౌరవనీయుడు అడ్వాణీ. దేశాభివృద్ధిలో ఆయనది అత్యంత కీలక పాత్ర. అచంచలమైన చిత్తశుద్ధి, అంకితభావంతో దేశానికి దశాబ్దాల పాటు సేవ చేశారు. ప్రజాస్వామ్యానికి జాతీయవాద విలువలను కూర్చిన గొప్ప నాయకుడు. అత్యంత కింది స్థాయి నుంచి మొదలై ఉప ప్రధానిగా ఎదిగారు. రాజకీయాల్లో నైతిక విలువలకు నూతన ప్రమాణాలు నెలకొల్పారు’’ అంటూ ప్రశంసించారు. ‘‘ఇది నాకెంతో భావోద్వేగపూరిత క్షణం. అడ్వాణీతో అత్యంత సన్నిహితంగా మెలిగి ఎంతగానో నేర్చుకునే అవకాశం నాకు దక్కింది’’ అని ఈ సందర్భంగా మోదీ అన్నారు. ప్రకటన అనంతరం అడ్వాణీకి మోదీ ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. తనకు అత్యున్నత పౌర పురస్కారం లభించడం పట్ల అడ్వాణీ హర్షం వెలిబుచ్చారు. ‘‘దేశం కోసమే నా జీవితమంతా ధారపోశా. నా ఆశయాలకు సిద్ధాంతాలకు దక్కిన గౌరవమిది. నాకెంతో ఆనందంగా ఉంది’’ అన్నారు. ప్రధాని మోదీకి, దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయనకు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తాయి. అద్వానీతో కలిపి ఇప్పటిదాకా 50 మందికి ఈ పురస్కారం దక్కింది. పది రోజుల క్రితమే బిహార్ దివంగత ముఖ్యమంత్రి, ప్రఖ్యాత సామాజికవేత్త కర్పూరి ఠాకూర్‌కు కూడా కేంద్రం భారతరత్న ప్రకటించడం తెలిసిందే. ఒక ఏడాదిలో గరిష్టంగా ముగ్గురికి ఈ పురస్కారం ఇవ్వవచ్చు. కానీ 1999లో మాత్రం నలుగురికి భారతరత్న ప్రకటించారు. కుటుంబ రాజకీయాలను సవాలు చేసిన అడ్వాణీ: మోదీ సంభాల్పూర్ (ఒడిశా): అడ్వాణీ ఆజన్మాంతం కుటుంబ రాజకీయాలను సవాలు చేశారని, దేశ ప్రజాస్వామిక విలువల పునరుద్ధరణ కోసం పోరాడారని మోదీ అన్నారు. బీజేపీపై అంటరాని పార్టీ ముద్రను పోగొట్టి ప్రపంచంలోకెల్లా అతి పెద్ద రాజకీయ వేదికగా తీర్చిదిద్దారని కొనియాడారు. ‘‘దివంగత ప్రధాని వాజ్పేయితోకలిసి భారత ప్రజాస్వామ్యానికి అడ్వాణీ జాతీయ విలువలద్దారు. దేశ ప్రజాస్వామ్యాన్ని ఒక కుటుంబ గుత్తాధిపత్యం నుంచి విముక్తం చేసేందుకు నిరంతరం పోరాడారు. ఆయనకు భారతరత్న లభించడం బీజేపీకి, దాని అసంఖ్యా కార్యకర్తలకు కూడా గొప్ప గౌరవం’’ అని ఒడిశాలోని సంభాల్పూర్ ర్యాలీలో మోదీ పేర్కొన్నారు. మరోవైపు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్, అనురాగ్ ఠాకూర్ తదితరులతో పాటు పలు పారీ్టల నాయకులు కూడా అడ్వాణీకి అభినందనలు తెలిపారు. దేశానికి, బీజేపీకి, పార్టీ సిద్ధాంతానికి ఆయన చేసిన నిస్వార్థ సేవలను వరి్ణంచేందుకు మాటలు చాలవని షా అన్నారు. తన గురువైన అద్వానీకి ఇంతటి గౌరవం దక్కడం ఆనందంగా ఉందని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. ఆయనకు ఫోన్లో శుభాకాంక్షలు తెలిపానన్నారు. జేడీ(ఎస్) నేత కుమారస్వామి, ఎల్జేపీ (రాంవిలాస్) చీఫ్ చిరాగ్ పాశ్వాన్, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు తదితరులు అడ్వాణీకి అభినందనలు తెలిపారు. నేడు అయోధ్యలో రామాలయం కొలువుదీరిందంటే అందుకు అడ్వాణీయే కారణమని బీజేపీ సీనియర్ నేత యడియూరప్ప అన్నారు. త్వరలో దిగిపోనున్న మోదీ సర్కారు బీజేపీ ఓటుబ్యాంకును కాపాడుకునేందుకే అడ్వానీకి భారతరత్న ప్రకటించిందని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ విమర్శించారు. నేను ఆచరించిన విలువలకు, నా సేవలకు గుర్తింపు ‘‘భారతరత్న పురస్కారం నాకు అత్యున్నత గౌరవం మాత్రమే కాదు. నేను జీవితాంతం ఆచరించిన విలువలకు, శక్తివంచన లేకుండా అందించిన సేవలకు గుర్తింపు కూడా. దీన్ని అత్యంత వినమ్రతతో, కృతజ్ఞతతో స్వీకరిస్తున్నా. 14 ఏళ్ల వయసులో కార్యకర్తగా ఆరెస్సెస్‌లో చేరిన రోజు నుంచి భరతమాతకు నిస్వార్థంగా సేవ చేయడమే లక్ష్యంగా బతికా. ఈ జీవితం నాది కాదు, దేశానిదేనన్న భావనే నన్ను ముందుకు నడిపింది. ఈ సందర్భంగా పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజ్‌పేయిలను కృతజ్ఞతతో గుర్తు చేసుకుంటున్నా. ఈ ఇద్దరు మహనీయులతో కలిసి పని చేసే అదృష్టం నాకు దక్కింది. సుదీర్ఘ ప్రజా జీవితంలో నాతో పాటు కలిసి పని చేసిన లక్షలాది బీజేపీ, ఆరెస్సెస్ కార్యకర్తలు తదితరులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నాకు భారతరత్న ప్రకటించినందుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు, ప్రధాని మోదీకి కృతజ్ఞతలు. నాకు అడుగడుగునా అంతులేని ప్రేరణ శక్తిగా నిలిచిన నా కుటుంబీకులను, ముఖ్యంగా నన్ను వీడి వెళ్లిన నా భార్య కమలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నా. నా దేశం మరిన్ని ఘనతలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నా’’ – భారతరత్న ప్రకటన అనంతరం విడుదల చేసిన ప్రకటనలో అడ్వాణీ. -
‘అద్వానీ, మోదీని చూస్తే.. ఆ రెండు సంఘటనలు గుర్తుకొస్తాయి’
రాజకీయ కురువృద్ధుడు, బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీని కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నతో సత్కరించింది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్రమోదీ శనివారం ‘ఎక్స్ (ట్విటర్)’ వేదికగా వెల్లడించారు. అద్వానీ గొప్ప రాజనీతిజ్ఞుడని దేశాభివృద్ధిలో ఆయన పాత్ర కీలకమని కొనియాడారు. అయితే ఎల్కే అద్వానీకి భారత రత్న ప్రకటించడంపై కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ స్పందించారు. బీజేపీ అగ్రనేత ఎల్.కే అద్వానీకి భారతరత్న ప్రకటించిన సందర్భంగా.. అద్వానీ, ప్రధాని మోదీకి సంబంధించి తనకు రెండు సంఘటనలు గుర్తుకు వస్తున్నాయని తెలిపారు. అందులో మొదటి సంఘటన.. 2002లో ప్రస్తుత ప్రధాని మోదీ గుజరాత్‌కు సీఎం ఉన్న సమయంలో.. మోదీని అద్వానీ కాపాడారని తెలిపారు. ఆనాటి ప్రధానమంత్రి దివంగత అటల్ బిహారీ వాజపేయి.. గుజరాత్ సీఎంగా ఉన్న మోదీని ఆ పదని నుంచి తొలగించి రాజధర్మను గుర్తుచేయాలనుకున్నారని తెలిపారు.కానీ, ఆ సమంయలో మోదీని సీఎం పదవి నుంచి తొలగించబడకుండా అద్వానీ రక్షించారని అన్నారు. రెండో సంఘటన.. 5 ఏప్రిల్, 2014 నాటి సమయంలో నరేంద్ర మోదీ.. గుజరాత్‌లోని గాంధీ లోక్‌సభ నియోజకవర్గంలో నామినేషన్ వేశారు. అప్పడు అద్వానీ.. నరేంద్రమోదీపై అసక్తికర వ్యాఖ్యలు చేశారు. నరేంద్రమోదీ తన శిష్యుడు కాదని.. మంచి ఈవెంట్ మేనేజర్ అని అన్నారని తెలిపారు. ఈ మాటలు తాను అంటున్నని కాదని.. స్వయంగా అద్వానీ అన్న మాటలేనని తెలిపారు. వారిద్దరినీ (అద్వానీ, మోదీ) చూసినప్పుడు ఈ సందర్భాలు గుర్తుకువస్తాయని జైరాం రమేష్ అన్నారు. ఇక.. 2002లో మోదీని రక్షించిన అద్వానీ.. 2014లో మాత్రం మోదీ నిజ స్వరూపాన్ని బట్టబయలు చేశారని అన్నారు. आज दोपहर मोहनपुर, देवघर में हुई प्रेस कॉन्फ्रेंस में LK अडवाणी को भारत रत्न दिए जाने को लेकर एक पत्रकार साथी के सवाल पर मेरा जवाब। In my press meet this afternoon at Mohanpur in Deoghar district of Jharkhand I was asked about the Bharat Ratna to Mr. L.K. Advani. This was my… pic.twitter.com/IjnGIgDZoL — Jairam Ramesh (@Jairam_Ramesh) February 3, 2024 -
BharatRatna to LK Advani అద్వానీ కంట తడి, కుమార్తె రియాక్షన్
#LKAdvanBharat Ratna బీజేపీ కురువృద్ధుడు, మాజీ ఉప ప్రధానమంత్రి లాల్ కిషన్ అద్వానీకి అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న లభించనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఈవిషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించారు. దేశ అభివృద్ధికి అద్వానీ కృషి చిరస్మరణీయ మైందనీ, కింది స్థాయినుంచి దేశ ఉపప్రధాని స్థాయికి ఎదిగారని, దేశానికి ఎనలేని సేవలు చేశారంటూ మోదీ ప్రశంసించారు. దీంతో అద్వానీ కుటుంబం, బీజేపీ శ్రేణులతోపాటు దేశవ్యాప్తంగా అద్వానీకి శుభాకాంక్షలు వెల్లువ కురుస్తోంది. #WATCH | Daughter of veteran BJP leader LK Advani, Pratibha Advani shares sweets with him and hugs him. Government of India announced Bharat Ratna for the veteran BJP leader. pic.twitter.com/zdYrGumkAq — ANI (@ANI) February 3, 2024 ఇది ఇలా ఉంటే తన తండ్రికి దేశ అత్యున్నత పురస్కారం దక్కడంపై అద్వానీ కుమార్తె ప్రతిభా అద్వానీ సంతోషం ప్రకటించారు. ఢిల్లీలోని అద్వానీ నివాసంలో తండ్రిని కలిసిన ఆమె ఆయనకు లడ్డూ తినిపించిశుభాకాంక్షలందించారు. ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని ప్రత్యేక అభినందనలు తెలిపారు. “దాదా (ఎల్‌కె అద్వానీ)కి దేశ అత్యున్నత గౌరవం లభించినందుకు కుటుంబం మొత్తం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు నేను నా తల్లిని చాలా మిస్ అవుతున్నాను. ఎందుకంటే వ్యక్తిగత జీవితమైనా లేదా రాజకీయ జీవితమైనా ఆయన జీవితంలో ఆమె చేసిన సహకారం చాలా పెద్దది’’ అన్నారామె. అలాగే తనను ఇంత పెద్ద అవార్డుతో సత్కరించినందుకు ప్రధాని మోదీకి, దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపు తున్నానని తన తండ్రి చెప్పారని ప్రతిభా అద్వానీ వెల్లడించారు.ఈ విషయంలో తెలిసి తండ్రి కళ్లలో నీళ్లు తిరిగాయని చెప్పారు. ఆయన జీవిత కాల స్వప్నం రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా కూడా ఆయన భావోద్వేగానికి లోనయ్యారని తెలిపారు. తన జీవితంలో ఈ దశలో, ఆయన చేసిన కృషికి ఈ అద్భుతమైన గుర్తింపు లభించడం గమనించడం చాలా అద్భుతంగా ఉందని సీనియర్ బీజేపీ నాయకుడు ఎల్కే అద్వానీ కుమారుడు జయంత్ అద్వానీ అన్నారు. #WATCH | Pratibha Advani, veteran BJP leader LK Advani’s daughter, reacts on Bharat Ratna for her father. She says, "The entire family and I are very happy that he has been given the highest civilian award in the country...He is very happy...He said that he dedicated his entire… pic.twitter.com/UMe1WNSldc — ANI (@ANI) February 3, 2024 కాగా గుజరాత్ ఉంచి లోక్‌సభకు ఆరుసార్లు ఎంపికయ్యారు అద్వానీ. 1991లో తొలిసారిగా ఇక్కడి నుంచి గెలుపొందిన ఆయన 2014 వరకూ లోక్‌సభకు ఎన్నికవుతూ వచ్చారు.. ప్రస్తుతం క్రియాశీలక రాజకీయాల నుంచి వైదొలి విశ్రాంతి తీసుకుంటున్నారు. -
కాంగ్రెస్‌పై దేశద్రోహం పెట్టాలి: బండి సంజయ్ ఫైర్
సాక్షి, కరీంనగర్: బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్కే అద్వానీకి భారతరత్న ఇవ్వడంపై ఎంపీ బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. అద్వానీకి భారతరత్న ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీపై దేశద్రోహం పెట్టాలని డిమాండ్ చేశారు. కాగా, బండి సంజయ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘దేశంలో ఎమర్జెన్సీ, అయోధ్య పోరాటంలో పాల్గొన్న అద్వానీకి భారతరత్న ఇవ్వడం సంతోషంగా ఉంది. అన్ని సర్వేల్లో బీజేపీ, ప్రధాని మోదీనే మళ్లీ గెలుస్తారు అని రిపోర్టులు రావడం చూసి బీఆర్ఎస్ నాయకులు కంగారు పడుతున్నారు. బీఆర్ఎస్ ఎంపీ ఎన్నికల కోసం చేసిన సర్వే రిపోర్టు నా దగ్గరకి వచ్చింది. కాంగ్రెస్‌పై దేశద్రోహం కేసు పెట్టాలి. దేశాన్ని విభజించాలి అంటూ కాంగ్రెస్ ఎంపీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. టెర్రరిస్టులు, ఉగ్రవాదులు చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతలు సపోర్టు చేస్తున్నారు. ఇండియా కూటమి విచ్చినం అవుతుందన్న ఆందోళనతో వారు ఇలాంటి పిచ్చి కామెంట్స్ చేస్తున్నారు. రాజీవ్ గాంధీ కూడా ఇలా మాట్లాడిన చరిత్ర ఉంది. అవార్డులను అమ్ముకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ హయాంలో పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులు కావాలంటే డబ్బులు ఇస్తే వచ్చేవి. కానీ, సమాజంలో నిజమైన అర్హులకు మాత్రమే బీజేపీ అవార్డులను ఇస్తోంది’ అంటూ కామెంట్స్ చేశారు. -
అద్వానీకి భారత రత్న.. దేశ అత్యున్నత పురస్కారం అందుకుంది వీరే
రాజకీయ కురువృద్ధుడు, బీజేపీ అగ్రనేత ఎల్.కె. అద్వానీని కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నతో సత్కరించింది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్రమోదీ శనివారం ‘ఎక్స్ (ట్విటర్)’ వేదికగా వెల్లడించారు. అద్వానీ గొప్ప రాజనీతిజ్ఞుడని దేశాభివృద్ధిలో ఆయన పాత్ర కీలకమని కొనియాడారు. అద్వానీకి భారతరత్న ప్రదానం చేయడం తనకెంతో భావోద్వేగ క్షణమని పేర్కొన్నారు. ఆయనతో ఫోన్లో మాట్లాడి శుభాకాంక్షలు తెలిపినట్లు చెప్పారు. కాగా ఇప్పటివరకూ 50 మంది ప్రముఖులు ‘భారతరత్న’ను అందుకున్నారు. వీరిలో 17 మందికి మరణానంతరం భారతరత్న లభించింది. భారతరత్న పొందిన వారిలో క్రికెట్ గాడ్‌గా పేరొందిన సచిన్ టెండూల్కర్ పేరు కూడా ఉంది. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మొదలుకొని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వరకు... ఇలా పలువురు ‘భారతరత్న’ పురస్కారం అందుకున్నారు. ఈ జాబితాలో ఇటీవల ప్రముఖ గాంధేయ సోషలిస్ట్ నేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ పేరు కూడా చేరింది. చదవండి: బీజేపీ ‘రథ యాత్రికుడు’ అద్వానీ! ఇప్పటివరకు ‘భారతరత్న’ అందుకున్నవారు 1. చక్రవర్తి రాజగోపాలాచారి (రాజకీయవేత్త, రచయిత, న్యాయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు)- 1954 2. సర్వేపల్లి రాధాకృష్ణన్ (తత్వవేత్త, రాజకీయవేత్త, భారత మాజీ రాష్ట్రపతి)- 1954 3. చంద్రశేఖర్ వెంకట రామన్ (భౌతిక శాస్త్రవేత్త)- 1954 4. భగవాన్ దాస్ (స్వాతంత్ర్య పోరాట యోధుడు, తత్వవేత్త, విద్యావేత్త)- 1955 5. మోక్షగుండం విశ్వేశ్వరయ్య (సివిల్ ఇంజనీర్, రాజకీయవేత్త, మైసూర్ దివాన్)- 1955 6. జవహర్లాల్ నెహ్రూ (స్వాతంత్ర్య సమర యోధుడు, రచయిత, భారత మాజీ ప్రధాని)- 1955 7. గోవింద్ వల్లభ్ పంత్ (స్వాతంత్ర్య సమరయోధుడు)- 1957 8. ధోండో కేశవ్ కర్వే (సంఘ సంస్కర్త, ఉపాధ్యాయుడు)- 1958 9. బిధాన్ చంద్ర రాయ్ (వైద్యుడు, రాజకీయ నేత , పరోపకారి, విద్యావేత్త, సామాజిక కార్యకర్త) - 1961 10. పురుషోత్తం దాస్ టాండన్ (స్వాతంత్ర్య సమర యోధుడు)- 1961 11. రాజేంద్ర ప్రసాద్ (స్వాతంత్ర్య సమర యోధుడు, న్యాయవాది, రాజకీయవేత్త, పండితుడు, భారత మాజీ రాష్ట్రపతి)- 1962 12. జాకీర్ హుస్సేన్ (స్వాతంత్ర్య పోరాట యోధుడు)- 1963 13. పాండురంగ్ వామన్ కేన్ (ఇండాలజిస్ట్, సంస్కృత పండితుడు)-1963 14. లాల్ బహదూర్ శాస్త్రి (మరణానంతరం) (స్వాతంత్ర్య సమర యోధుడు, భారత మాజీ ప్రధాని) – 1966 15. ఇందిరా గాంధీ (రాజకీయనేత, భారత మాజీ ప్రధానమంత్రి)-1971 16. వరాహగిరి వెంకట గిరి (స్వాతంత్ర్య సమరయోధుడు, భారత మాజీ రాష్ట్రపతి)-1975 17. కుమారస్వామి కామరాజ్ (మరణానంతరం) (రాజకీయవేత్త, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి) - 1976 18. మదర్ మేరీ థెరిసా బోజాక్షియు (మదర్ థెరిసా) (మిషనరీస్ ఆఫ్ ఛారిటీ వ్యవస్థాపకురాలు) - 1980 19. వినోబా భావే (మరణానంతరం) (స్వాతంత్ర్య పోరాట యోధుడు, సంఘ సంస్కర్త)-1983 20. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ (స్వాతంత్ర్య పోరాట యోధుడు)-1987 21. మరుదూర్ గోపాలన్ రామచంద్రన్ (మరణానంతరం) (రాజకీయనేతగా మారిన నటుడు)-1988 22. భీమ్ రావ్ రామ్‌జీ అంబేద్కర్ (మరణానంతరం) (సంఘ సంస్కర్త)-1990 23. నెల్సన్ రోలిహ్లాహ్లా మండేలా (వర్ణవివక్ష వ్యతిరేక పోరాట నేత)- 1990 24. రాజీవ్ గాంధీ (మరణానంతరం) (రాజకీయనేత, భారత మాజీ ప్రధాని)-1991 25. సర్దార్ వల్లభాయ్ పటేల్ (మరణానంతరం) (స్వాతంత్ర్య పోరాట యోధుడు)- 1991 26. మొరార్జీ రాంచోడ్జీ దేశాయ్ (స్వాతంత్ర్య పోరాట వీరుడు, భారత ప్రధాని)- 1991 27. మౌలానా అబుల్ కలాం ఆజాద్ (మరణానంతరం) (స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు)-1992 28. జహంగీర్ రతన్జీ దాదాభాయ్ టాటా (పారిశ్రామికవేత్త)- 1992 29. సత్యజిత్ రే (చిత్ర నిర్మాత)- 1992 30. గుల్జారీ లాల్ నందా (స్వాతంత్ర్య పోరాట యోధుడు)- 1997 31. అరుణా అసఫ్ అలీ (మరణానంతరం) (స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు)- 1997 32. ఎ.పి.జె. అబ్దుల్ కలాం ( శాస్త్రవేత్త, భారత మాజీ రాష్ట్రపతి)-1997 33. మదురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి (కర్ణాటక శాస్త్రీయ గాయని)-1998 34. చిదంబరం సుబ్రమణ్యం (స్వాతంత్ర్య పోరాట యోధుడు)- 1998 35. జయప్రకాష్ నారాయణ్ (మరణానంతరం) (స్వాతంత్ర్య పోరాట యోధుడు, సంఘ సంస్కర్త)- 1999 36. అమర్త్య సేన్ (ఆర్థికవేత్త)- 1999 37. ప్రకాష్ గోపీనాథ్ బోర్డోలోయ్ (మరణానంతరం) (స్వాతంత్ర్య పోరాట యోధుడు) – 1999 38. రవిశంకర్ (సితార్ వాద్యకారుడు) - 1999 39. లతా దీనానాథ్ మంగేష్కర్ (గాయని)- 2001 40. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ (హిందుస్తానీ క్లాసికల్ షెహనాయ్ ప్లేయర్)- 2001 41. భీంసేన్ గురురాజ్ జోషి (హిందుస్తానీ క్లాసికల్ సింగర్)- 2009 42. సిఎన్ఆర్ రావు (కెమిస్ట్, ప్రొఫెసర్)- 2014 43. సచిన్ రమేష్ టెండూల్కర్ (క్రికెటర్)- 2014 44. అటల్ బిహారీ వాజ్‌పేయి (రాజకీయ నేత, భారత మాజీ ప్రధాని)- 2015 45. మదన్ మోహన్ మాలవీయ (మరణానంతరం) (పండితులు, విద్యా సంస్కర్త)- 2015 46. నానాజీ దేశ్‌ముఖ్ (మరణానంతరం) (సామాజిక కార్యకర్త)- 2019 47. భూపేంద్ర కుమార్ హజారికా (మరణానంతరం) (ప్లేబాక్ సింగర్, గేయ రచయిత, సంగీతకారుడు, కవి, చలనచిత్ర నిర్మాత) - 2019 48. ప్రణబ్ ముఖర్జీ (రాజకీయనేత, భారత మాజీ రాష్ట్రపతి)- 2019 49. కర్పూరి ఠాకూర్ (మరణానంతరం) (రాజకీయనేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి) – 2024 50. ఎల్కే అద్వానీ(రాజకీయ నేత, భారత మాజీ ప్రధాని)-2024 -
బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీకి భారతరత్న
-
అద్వానీకి భారతరత్న.. మోదీ భావోద్వేగం
సాక్షి, ఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత అత్యన్నుత పురస్కారం భారతరత్నను మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానికి(96) ఇవ్వనున్నారు. భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’తో అద్వానీని గౌరవించింది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా ట్విట్టర్ వేదికగా ప్రధాని మోదీ.. ఎల్కే అద్వానీ జీకి భారతరత్న ఇస్తున్నారనే వార్తను పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. నేను కూడా ఆయనతో మాట్లాడి ఈ గౌరవం పొందినందుకు అభినందించాను. ఎల్కే అద్వానీ రాజనీతిజ్ఞుడు. భారతదేశ అభివృద్ధిలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. చాలా కింది స్థాయి నుంచి ఉప ప్రధాని వరకు ఎదిగారు. అనేక కేంద్ర మంత్రి పదవులు నిర్వహించారు. పార్లమెంట్లో ఆయనకు ఎంతో అనుభవం ఉంది. ఆయన పార్లమెంటరీ జోక్యాలు ఎప్పుడూ ఆదర్శప్రాయమైనవి, గొప్ప అంతర్దృష్టులతో నిండి ఉన్నాయి అని కొనియాడారు. Advani Ji’s decades-long service in public life has been marked by an unwavering commitment to transparency and integrity, setting an exemplary standard in political ethics. He has made unparalleled efforts towards furthering national unity and cultural resurgence. The conferring… — Narendra Modi (@narendramodi) February 3, 2024 ఎల్కే అద్వానీ పూర్తి పేరు లాల్ కృష్ణ అద్వానీ. ఆయన 1927 నవంబర్ ఎనిమిదో తేదీన ప్రస్తుత పాకిస్తాన్(భారత్ విభజన కాకముందు)లోని కరాచీలో జన్మించారు. కరాచీలోని సెయింట్ పాట్రిక్స్ హైస్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించారు. అలాగే పాక్‌లోని హైదరాబాద్‌లో డీజీ నేషనల్ కాలేజీలో న్యాయవిద్యను చదివారు. ఇక, 1947లో ఆర్ఎస్ఎస్ కరాచీ విభాగం కార్యదర్శిగా అద్వానీ విధులు నిర్వర్తించారు. బీజేపీ వ్యవస్థాపకుల్లో అద్వానీ కూడా ఒకరు. దేశ విభజన తర్వాత 1947 సెప్టెంబర్ 12న భారత్‌కు అద్వానీ వలస వచ్చారు. 1957లో ఆర్ఎస్ఎస్ పిలుపుతో ఢిల్లీకి అద్వానీ. 1960లో ఆర్గనైజర్ పత్రికలో జర్నలిస్ట్‌గా విధుల్లో చేరారు. 1967లో ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ అధ్యక్షుడిగా ఎన్నిక. 1970లో తొలిసారిగా రాజ్యసభకు ఎన్నిక. 1973-76లో జన్‌సంఘ్ అధ్యక్షుడిగా అద్వానీ ఎన్నికయ్యారు. 1977లో జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియామకం 1977 మురార్జీ దేశాయ్ ప్రభుత్వంలో సమాచార ప్రసార శాఖామంత్రిగా నియామకం 1980 రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. 1990 సోమనాథ్ నుంచి అయోధ్య వరకు రథయాత్ర నిర్వహించారు 1998 వాజపేయ్ మంత్రివర్గంలో హోంమంత్రిగా వ్యవహరించారు 2002 ఉప ప్రధానమంత్రిగా నియామకం. 2004 లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు 2005 జిన్నాకు అనుకూలంగా వ్యాఖ్యలు చేసినందుకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు వదలిపెట్టాల్సి వచ్చింది 2007 ప్రధాన మంత్రి అభ్యర్థిగా పార్టీ నిర్ణయించింది 2008 "మై కంట్రీ, మై లైఫ్" పేరుతో స్వీయచరిత్రను విడుదల చేశాడు. మలుపు తిప్పిన అయోధ్య రథయాత్ర.. అద్వానీ జీవితంలోనే కాదు దేశ రాజకీయాలనే మలుపు తిప్పిన సంఘటన అయోధ్య రథయాత్ర. సోమనాథ దేవాలయం నుంచి అయోధ్యకు రథయాత్ర చేసి అయోధ్యలో రామాలయాన్ని నిర్మించడానికి ప్రజల మద్దతు పొందడమే ఆశయంగా పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ జన్మదినమైన 1990, సెప్టెంబర్ 25న ప్రారంభమైంది. అయోధ్య రథయాత్ర బీహార్ సరిహద్దులో అప్పటి బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ అద్వానీ రథయాత్రకు పగ్గాలు వేయడంతో ఆగిపోయింది. 10,000 కిలోమీటర్ల రథయాత్ర చేసి అక్టోబర్ 30న అయోధ్య చేరుకోవాలని ప్రణాళిక వేసుకున్న రథయాత్ర ఆగిపోయినప్పటికీ అద్వానీ విశేష ప్రజాదరణను పొందారు. ఆ తర్వాత విశ్వనాథ్ ప్రతాప్ సింగ్(వీపీ సింగ్) ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఉపసంహరించడం, ఆ తర్వాత 1991 లోక్‌సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ స్థానాల సంఖ్యను 120కు పెంచిన ఘనత అద్వానీదే. 1992 డిసెంబర్ 6న అయోధ్యలో జరిగిన కరసేవ సంఘటనలో అద్వానీ అరెస్ట్ అయ్యాడు. పార్టీ అధ్యక్ష పదవిలో అద్వానీ కొన్నేళ్ల క్రితం వరకు అద్వానీ దేశ రాజకీయాల్లో కీలకంగా వ్యవహించారు. అద్వానీ మొట్టమొదటి సారిగా 1986లో అటల్ బిహారీ వాజపేయి నుంచి పార్టీ పగ్గాలు స్వీకరించి 1991 వరకు, రెండోసారి 1993 నుంచి 1998 వరకు పార్టీ అధిపతిగా పనిచేశారు. చివరగా 2004 నుంచి 2005 వరకు పార్టీని నడిపించి ఆ తర్వాత రాజ్‌నాథ్‌సింగ్‌కు తన స్థానాన్ని అప్పగించాడు. తన అధ్యక్ష పదవీ కాలంలో పార్టీకి మెరుగైనస్థితిలోకి తీసుకొని వచ్చి భారతీయ జనతా పార్టీ ‘ఉక్కుమనిషి’గా పేరుగాంచాడు. రామ జన్మభూమి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఆయనకు భారతరత్న ప్రకటించడంతో బీజేపీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వం.. భారతరత్నను ప్రకటించడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. బీహార్ మాజీ సీఎం, అనేక మంది ప్రముఖులకు రాజకీయ గురువు అయిన దివంగత దిగ్గజ నేత కర్పూరి ఠాకూర్‌కు భారతరత్న ఇస్తున్నట్టు కేంద్రం జనవరి 23న ప్రకటించింది. ఇప్పటివరకూ 49 మంది ప్రముఖులు ‘భారతరత్న’ను అందుకున్నారు. వీరిలో 17 మందికి మరణానంతరం భారతరత్న లభించింది. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మొదలుకొని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వరకు.. ఇలా పలువురు ‘భారతరత్న’ అందుకున్నారు. -
మందిర నిర్మాణానికి మోదీని ఎంచుకున్న విధి
న్యూఢిల్లీ: అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి విధి నరేంద్ర మోదీని ఎంచుకుందని బీజేపీ కురువృద్ధ నేత ఎల్కే అద్వానీ (96) పేర్కొన్నారు. ‘రాష్ట్ర ధర్మ’ ప్రత్యేక మ్యాగజీన్‌కు రాసిన వ్యాసంలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం 33 ఏళ్ల క్రితం తాను చేపట్టిన రథయాత్రను ప్రస్తావించారు. ఆలయ ప్రారంభ సమయానికి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి లేకపోవడం వేదన కలిగిస్తోందన్నారు. ‘‘నాటి రథయాత్ర ఆసాంతం ప్రధాని మోదీ నాతోపాటే ఉన్నారు. అప్పట్లో ఆయన గురించి ఎవరికీ పెద్దగా తెలీదు. కానీ ఆ శ్రీరాముడే ఆలయ పునర్నిర్మాణం కోసం ఆయన్ను ఎంచుకున్నారు. విగ్రహ ప్రతిష్ఠాపన ద్వారా ప్రతి పౌరుడికి మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు’’ అన్నారు. రామాలయ కలను సాకారం చేసి తన లక్ష్యాన్ని నెరవేర్చుతున్నందుకు మోదీకి ధన్యవాదాలన్నారు. చదవండి: స్వామి వివేకానంద బాటలో నడవాలి -
Ayodhya Ram Temple: అద్వానీ, జోషిలకు అందిన ఆహ్వానం
అయోధ్య: అయోధ్యలో వచ్చే నెలలో జరగనున్న రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా బీజేపీ కురువృద్ధులు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషిలను విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ఆహ్వానించింది. అద్వానీ, జోషి ఇద్దరూ రామమందిర నిర్మాణం కోసం విశేష కృషి చేశారు. “జనవరి 22, 2024న అయోధ్యలో జరిగే రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా రామమందిర ఉద్యమానికి ఆద్యులు లాల్ కృష్ణ అద్వానీ, డా. మురళీ మనోహర్ జోషిలను ఆహ్వానించారు. తాము అన్ని విధాలా కృషి చేస్తామని సీనియర్ నాయకులు ఇద్దరూ చెప్పారు." అని విశ్వహిందూ పరిషత్ సభ్యుడు అలోక్ కుమార్ తెలిపారు. ఎల్కే అద్వానీ (96), మురళీ మనోహర్ జోషి (89) ఆరోగ్యం, వయస్సు దృష్ట్యా రామాలయ వేడుకకు హాజరయ్యే అవకాశం లేదని ఆలయ ట్రస్ట్ తెలిపిన విషయం తెలిసిందే. వారి వయస్సును పరిగణనలోకి తీసుకుని, వారిని రావద్దని మొదట అభ్యర్థించారు. ఇందుకు వారితో పాటు కుటుంబ సభ్యులు కూడా అంగీకరించారని రామాలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ చెప్పారు. కానీ తాజాగా ఈ పరిణామాలు జరిగాయి. జనవరి 22వ తేదీన రామ మందిర ఆలయ ప్రారంభోత్సవం జరగనుంది. ప్రధాని మోదీ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఇప్పటికే ఆయనకు ఆహ్వానం అందజేశారు. జనవరి 15వ తేదీలోపు ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తామని, ఆ మరుసటిరోజు ప్రాణ ప్రతిష్ట పూజ మొదలై.. జనవరి 22వ తేదీదాకా కొనసాగుతుందని చంపత్ రాయ్ తెలియజేశారు. దేశవ్యాప్తంగా హిందూ సంఘాల ప్రతినిధులు, ఆలయ పూజారులు, మఠాధిపతులు, రాజకీయ-సినీ ఇతర రంగాల ప్రముఖులకు సైతం అయోధ్య రామ మందరి ప్రారంభోత్సవానికి ఆహ్వానాలు వెళ్తున్నాయి. -
Ayodhya: అద్వానీకి అందని ఆహ్వానం.. ట్రస్ట్ వివరణ
ఢిల్లీ: అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ఏర్పాట్లన్నీ చకచకా జరిగిపోతున్నాయి. ఇప్పటికే పలువురు ప్రముఖులకు ఆలయ ట్రస్ట్ తరఫున ముగ్గురు సభ్యుల బృందం అధికారికంగా ఆహ్వానాలు అందిస్తోంది కూడా. అయితే బీజేపీ కురువృద్ధులు లాల్ కృష్ణ అద్వానీ, మురళీమనోహర్ జోషిలకు మాత్రం ఆహ్వానం అందలేదని ప్రచారం జరిగింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ఉద్యమించిన వాళ్లలో ఈ ఇద్దరూ ముందు వరుసలో ఉన్నారు. అలాంటిది ఈ ఇద్దరికీ ఆహ్వానాలు వెళ్లకపోవడం ఏంటనే అసంతృప్తి వ్యక్తం చేశారు కొందరు. మరోవైపు రాజకీయంగా బీజేపీపై ఈ విషయంలో విమర్శలు వినిపించాయి. దీంతో రామ టెంపుల్ ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ స్పందించారు. Shri Ram Janmabhoomi Mandir first floor - Construction Progress. श्री राम जन्मभूमि मंदिर प्रथम तल - निर्माण की वर्तमान स्थिति pic.twitter.com/Cz9zUS5pLe — Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) December 15, 2023 రామ మందిర ప్రారంభోత్సవ విషయం వాళ్లకు తెలియజేశామని.. అయితే వృద్ధాప్యం, వాళ్లకు ఉన్న ఆరోగ్య సమస్యల రిత్యా ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక రావొద్దని చెప్పామని అన్నారాయన. అందుకు వాళ్లిద్దరూ, వాళ్ల కుటుంబ సభ్యులు అంగీకరించినట్లు చంపత్ రాయ్ మీడియాకు తెలియజేశారు. అద్వానీ వయసు 96 ఏళ్లుకాగా, జోషి వయసు 90. జనవరి 22వ తేదీన రామ మందిర ఆలయ ప్రారంభోత్సవం జరగనుంది. ప్రధాని మోదీ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఇప్పటికే ఆయనకు ఆహ్వానం అందజేశారు. श्री राम जन्मभूमि मंदिर में भगवान श्री रामलला सरकार के श्री विग्रह की प्राण प्रतिष्ठा दिनांक 22 जनवरी 2024 को माननीय प्रधानमंत्री श्री नरेन्द्र मोदी जी के कर कमलों द्वारा की जाएगी। Hon'ble Prime Minister Shri @narendramodi ji will perform Prana Pratishtha of Shri Vigraha of… pic.twitter.com/AMBUcYjtoS — Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) October 25, 2023 జనవరి 15వ తేదీలోపు ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తామని, ఆ మరుసటిరోజు ప్రాణ ప్రతిష్ట పూజ మొదలై.. జనవరి 22వ తేదీదాకా కొనసాగుతుందని చంపత్ రాయ్ తెలియజేశారు. దేశవ్యాప్తంగా హిందూ సంఘాల ప్రతినిధులు, ఆలయ పూజారులు, మఠాధిపతులు, రాజకీయ-సినీ ఇతర రంగాల ప్రముఖులకు సైతం అయోధ్య రామ మందరి ప్రారంభోత్సవానికి ఆహ్వానాలు వెళ్తున్నాయి. श्री राम जय राम जय जय राम! Shri Ram Jai Ram Jai Jai Ram! pic.twitter.com/SZQlSwZl5X — Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) December 8, 2023 -
CEC Bill: అద్వానీ లేఖ తెరపైకి..
ఢిల్లీ: ఎన్నికల సంఘం నియామకాలకు సంబంధించి కేంద్రం తీసుకొచ్చిన బిల్లు ప్రతిపాదనపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. బీజేపీకి కౌంటర్ ఇచ్చే క్రమంలో.. కాంగ్రెస్ కమలం పార్టీ సీనియర్, రాజకీయ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ రాసిన ఓ లేఖను తెరపైకి తెచ్చింది. ఎన్నికల అధికారులను నియమించే ప్యానెల్ నుంచి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని (CJI) తప్పించే ప్రతిపాదిత బిల్లుకు కౌంటర్ ఇచ్చే క్రమంలో అద్వానీ లేఖను కాంగ్రెస్ తెరపైకి తెచ్చింది. ఆ పార్టీ జైరాం రమేష్ ఈ మేరకు లేఖను షేర్ చేశారు. 2012లోనే.. ఇలాంటి నియామకాలను పర్యవేక్షించేందుకు విస్తృత స్థాయి కొలీజియం ఏర్పాటు చేయాలని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ప్రతిపక్ష నేతగా ఉన్న అద్వానీ లేఖ ద్వారా సూచించారు. రాజ్యాంగబద్ధమైన సంస్థగా ఎన్నికల కమిషన్ పనితీరులో స్వతంత్రతను అనుమతించాలంటే.. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ల కార్యాలయం, అలాగే ఎన్నికల కమిషనర్లు కార్యనిర్వాహక జోక్యానికి దూరంగా ఉండాలి అని అద్వానీ ఆ లేఖ స్పష్టంగా అభిప్రాయపడ్డారు. “There is a rapidly growing opinion in the country which holds that appointments to Constitutional bodies such the Election Commission should be done on a bipartisan basis in order to remove any impression of bias or lack of transparency and fairness.” No, this isn’t a Modi… pic.twitter.com/NDXAHLQ6DZ — Jairam Ramesh (@Jairam_Ramesh) August 11, 2023 ఇదిలా ఉంటే.. రాజ్యసభలో ఈ బిల్లును గురువారం ప్రవేశపెట్టారు. ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, ప్రధానమంత్రి నామినేట్ చేసే ఓ కేంద్ర క్యాబినెట్ మంత్రితో కూడిన ప్యానెల్ సిఫారసుల ఆధారంగా.. రాష్ట్రపతి ఎన్నికల సంఘం ఉన్నతాధికారులను నియమించాలన్నది ప్రతిపాదిత బిల్లు సారాంశం. అయితే.. ప్యానెల్లో ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, భారత ప్రధాన న్యాయమూర్తి సభ్యులుగా ఉండాలని సుప్రీంకోర్టు మార్చిలో తీర్పు ఇచ్చింది. అయినా కేంద్రం ఆ తీర్పును పట్టించుకోకుండా తమ పని చేసుకుంటూ పోయింది. చీఫ్ జస్టిస్ ప్లేస్‌లో కేబినెట్ మంత్రిని చేర్చింది. CEC బిల్లు విషయంలో కేంద్రం చర్య.. అద్వానీ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఉండడమే కాదు.. మార్చి 2వ తేదీన సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా ఉందని జైరామ్ రమేశ్ తన ట్వీట్లో విమర్శించారు. అయితే ఈ బిల్లు, ఎన్నికల వేళ ఎన్నికల సంఘాన్ని కేంద్రం తన చేతుల్లోకి తీసుకునే యత్నంగా కనిపిస్తోందని జైరామ్ రమేశ్ ఆరోపించారు. ఇదిలా ఉంటే.. ఎన్నికల కమిషనర్ అనూప్‌చంద్ర పాండే 2024, ఫిబ్రవరి 14వ తేదీతో రిటైర్ కానున్నారు. అదే సమయంలో ఎన్నికలూ జరగాల్సి ఉంది. దీంతో పోల్ ప్యానెల్ ఖాళీని భర్తీ చేయాల్సి ఉంటుంది. సుప్రీం కోర్టు తీర్పునకు ముందు.. చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఎలక్షన్ కమిషనర్లను ప్రభుత్వ సిఫార్సుల మీద రాష్ట్రపతి నియమించేవారు. ఇదీ చదవండి: మన్మోహన్సింగ్ విషయంలో మరీ ఇంత దుర్మార్గమా? -
చివరి నిమిషంలో ప్రధాని పదవి దూరం.. ఏం జరిగింది?
అదృష్టం తలుపు తట్టినా కలిసి రాని రాజయోగం. చివరి నిమిషంలో దురదృష్టం వెక్కిరించడంతో భోగం దూరమైంది. ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా అదృష్ట రేఖ మలుపు తిరిగింది. కొందరికి ఇంటి పోరుతో పదవి దూరమైతే మరికొందరికి వేరే కారణాలెన్నో.. ఇక, ఈ లిస్టులో దిగ్గజ నేతల పేర్లే ఉన్నాయి. వారిలో ముఖ్యులు ములాయం సింగ్ యాదవ్, సోనియా గాంధీ, జ్యోతి బసు, ఎల్కే అద్వానీ ఉన్నారు.. వీరికి ప్రధాని పదవి ఎలా దూరమైందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే.. -
అందుకే దేశం ఆయన్ని గౌరవించింది: ప్రధాని మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: భారత రాజకీయాల్లో దిగ్గజం, భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ(LK Advani) ఇవాళ(మంగళవారం, నవంబర్ 8న) 96వ వడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం ఈ బీజేపీ దిగ్గజ నేత ఇంటికి వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆపై ట్విటర్ ద్వారా విషయాన్ని తెలియజేశారు. అద్వానీగారి నివాసానికి వెళ్లి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాను. భారతదేశ వృద్ధికి ఆయన చేసిన కృషి స్మారకమైనది. ఆయన దూరదృష్టి, మేధస్సు కారణంగా దేశమంతా ఆయన్ని గౌరవించింది. బీజేపీని నిర్మించడంలో, పార్టీని బలోపేతం చేయడంలో ఆయన పాత్ర ఎనలేనిది. ఆయన దీర్ఘాయుష్షుతో ఆరోగ్యవంతంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు. Went to Advani Ji’s residence and wished him on his birthday. His contribution to India’s growth is monumental. He is respected all across India for his vision and intellect. His role in building and strengthening the BJP is unparalleled. I pray for his long and healthy life. pic.twitter.com/Pdxy5Hko8d — Narendra Modi (@narendramodi) November 8, 2022 రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా అద్వానీ నివాసానికి వెళ్లి కలిసొచ్చారు. మరోవైపు బీజేపీ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్, మరరో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి, అద్వానీకి శుభాకాంక్షలు తెలియజేసిన వాళ్లలో ఉన్నారు. आदरणीय लालकृष्ण आडवाणी जी को जन्मदिन की हार्दिक शुभकामनाएं। आडवाणी जी ने अपने सतत परिश्रम से एक ओर देशभर में संगठन को मजबूत किया तो वहीं दूसरी ओर सरकार में रहते हुए देश के विकास में अमूल्य योगदान दिया। ईश्वर से उनके उत्तम स्वास्थ्य व सुदीर्घ जीवन की कामना करता हूँ। — Amit Shah (@AmitShah) November 8, 2022 బీజేపీ పుట్టుకలో కీలక పాత్ర పోషించారు ఎల్కే అద్వానీ. 1927, నవంబర్ 8న అద్వానీ కరాచీ(పాక్)లో జన్మించారు. ఆరెస్సెస్‌లో చేరిక ద్వారా ఆయన ప్రస్థానం మొదలైంది. రథయాత్ర ద్వారా ఆయన పాపులారిటీ మరింత పెరిగింది. ఎన్డీయే హయాంలో 1998-2004 మధ్య ఆయన కేంద్ర మంత్రిగా పని చేశారు. 2002 నుంచి వాజ్‌పేయి హయాంలో రెండేళ్లపాటు ఉపప్రధానిగానూ అద్వానీ పని చేశారు. -
గురు శిష్యుల బంధం
-
పోరాటమే ఆయన జీవనరథం
ఎల్.కె. అడ్వాణీ... భారతీయ జనతా పార్టీ కురు వృద్ధులు. పార్టీ వ్యవస్థాపకులలో ఒకరైన ఆయన దేశానికి స్వాతంత్య్రం రాకముందు పాకిస్తాన్‌లోని కరాచీలో 1927లో జన్మించారు. దేశ ఉప ప్రధానిగా, హోంశాఖ మంత్రిగా ఆయన సేవలు కొనియాడదగినవి. ఆయన్ని ప్రధానిగా చూడాలని కలలు గన్నవారు కొంతమందైతే, దేశ ప్రథమ పౌరునిగా సేవలు అందిం చాలని ఆశపడిన వారు మరికొందరు. ఏమైనప్పటికీ ఇటు దేశ రాజకీయాలలో గానీ, అటు పార్టీలో గానీ ఆయన స్థానం వేరు, ఆయన స్థాయి వేరు అని అభిమానుల అభిప్రాయం. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నప్పుడే బీజేపీని తారాస్థాయికి తీసుకువెళ్లింది అడ్వాణీ అని చెప్పక తప్పదు. అటల్ బిహారీ వాజ్‌పేయి, అడ్వాణీల స్నేహం ప్రపంచానికి ఆదర్శం. వారు ఇరువురు పార్టీ అనే విత్తనం నాటిన నుండి అది మహావృక్షంలా ఎదిగేవరకూ చేసిన ప్రయాణం స్ఫూర్తిదాయకం. 14 ఏళ్ల వయసులోనే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌లో అడ్వాణీ కార్యకర్తగా చేరారు. న్యాయ విద్యాభ్యాసంతో భారత రాజ్యాంగంపై పట్టు పెంచు కున్నారు. రాజకీయాలలో రాజనీతిజ్ఞుడు అనిపించు కున్నారు. భారతీయ జన సంఘ్ అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పుడే ఎమర్జెన్సీ ఉద్యమం మొదలైంది. లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ పిలుపు మేరకు ఆ ఉద్యమంలో పాల్గొని, జనసంఘ్‌ను జేపీ స్థాపించిన జనతా పార్టీలో విలీనం చేసి, 1978లో జనతా ప్రభుత్వానికి శ్రీకారం చుట్టారు. బలమైన నాయకత్వం ఉన్న కాంగ్రెస్ పార్టీ పునా దులను పెకిలించిన జయప్రకాష్ నాయకత్వం విజయ వంతమవ్వడమే కాకుండా అన్ని పార్టీల నాయకులలో ఆత్మవిశ్వాసం మొదలైంది. నాటి జనతా ప్రభుత్వం విఫలమైనప్పటికీ జేపీ స్ఫూర్తితో ఎంతో మంది జాతీయ స్థాయి నాయకులుగా ఎదిగారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, దీన్‌దయాళ్ ఉపాధ్యాయ వంటి వారి భావాలతో ప్రభా వితులైనప్పటికీ, కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొన్న జేపీ ధైర్య సాహసాల స్ఫూర్తితో 1980లో భారతీయ జనతా పార్టీని స్థాపించారు. బ్రిటిష్ వారు స్వాతంత్య్ర సమరయోధులను, విద్యా వేత్తలను, నాయకులను సంవత్సరాలపాటు నిర్బంధించి నప్పుడు జైలులో కూడా వారు దేశ పరిస్థితుల గురించి ఆలోచించడమే కాకుండా, వాటికి అక్షరరూపం ఇచ్చారు. మహాత్మా గాంధీ, బాలగంగాధర తిలక్, సుభాష్ చంద్ర బోస్, భగత్‌సింగ్, ఎం.ఎన్.రాయ్, జవహర్లాల్ నెహ్రూ, అరబింద్ ఘోష్ వంటివారు జైలులో రాశారు. దేశంలో రెండవ స్వాతంత్య్ర పోరాటంగా పిలిచే పొలి టికల్ ఎమర్జెన్సీలో కూడా జయప్రకాశ్ నారాయణ్, మొరార్జీ దేశాయ్, వాజ్‌పేయ్, కులదీప్ నయ్యర్ వంటి వారు డైరీలు రాశారు. ఎమర్జెన్సీ ఉద్యమం సమయంలో దేశంలో చాలామంది నాయకులతో పాటు అడ్వాణీ కూడా అరెస్టయ్యారు. జూన్ 23, 1975 నుండి 19 నెలల పాటు నిర్బంధంలో ఉన్నారు. జైలులో కాలాన్ని వృథా చేయ కుండా కార్యక్రమాలకు వ్యూహాలు రచించారు. దానితో పాటు నిరంతరం డైరీ రాశారు. ఇతర రచయితల జైలు రచనలను చదవడమే కాకుండా, వారి రచనలలో సారాంశాన్ని వీరి రచనలలో ప్రస్తావించారు. అది 1978లో ‘ఎ ప్రిజనర్స్ స్క్రాప్ బుక్’గా ప్రచురితమైంది. ‘ప్రిజన్ రైటింగ్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ ఇన్ ఇండియా: ఎ స్టడీ’ అనే అంశంపై పరిశోధన నిమిత్తం ఢిల్లీలో అడ్వాణీ గారి ఆఫీసులో ఆయన్ని కలవడం, సంభా షించడం నా జీవితంలో మరపురాని ఘట్టం. ఆయన టవ రింగ్ పర్సనాలిటీ, గంభీరమైన స్వరం, సున్నితమైన మనస్సు నుండి జారిన మాటలు నన్ను ఎంతగానో ప్రభా వితం చేశాయి. ఆయనలో జాతీయతాభావం, ప్రజాస్వామిక విలు వల పట్ల నిబద్ధత, నిస్వార్థ రాజకీయ లక్ష్యాలు పుష్క లంగా కనిపించాయి. మరో ఉక్కు మనిషిగా, అభినవ పటేల్‌గా కనిపించారు. ఆయన ఆత్మకథ ‘మై కంట్రీ మై లైఫ్’ భారతదేశ ఔన్నత్యం గురించీ, దేశంతో, దేశ రాజకీ యాలతో ముడిపడిన ఆయన జీవిత ప్రయాణం గురించీ వివరంగా చెబుతుంది. – డాక్టర్ నెమలిపురి సత్యనారాయణ అసిస్టెంట్ ప్రొఫెసర్, అనిల్ నీరుకొండ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్ మొబైల్ : 62810 64934 (నవంబర్ 8న ఎల్.కె. అడ్వాణీ 94వ జన్మదినం) -
కరోనా టీకా రెండో డోస్ తీసుకున్న ప్రధాని మోదీ
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం రోజు ఉదయం కరోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ మేరకు ప్రధానిమోదీ ట్వీట్ చేశారు.‘ఈ రోజు ఎయిమ్స్‌లో కోవిడ్ టీకా రెండవ డోసు తీసుకున్నాను.. వైరస్‌ను ఓడించడానికి మనకు ఉన్న మార్గాలలో వ్యాక్సిన్ ఒకటి. టీకా తీసుకునేందుకు మీరు అర్హులు అయితే వెంటనే వ్యాక్సిన్ వేయించుకోండి.. ఇందుకు కోవిన్ యాప్‌లో రిజిస్ట్రేషన్ CoWin.gov.in చేయించుకోండి’. అని మోదీ పిలుపునిచ్చారు. కాగా మార్చి 1న ప్రధాని నరేంద్ర మోదీ కరోనా తొలి డోస్ తీసుకున్న విషయం తెలిసిందే. నిబంధనల ప్రకారం మొదటి డోస్ తీసుకున్న 28 రోజుల తర్వాత రెండో డోస్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, ఈ వ్యవధిని 6-8 వారాలకు కేంద్రం పెంచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ తాజాగా రెండో డోస్ తీసుకున్నారు. తొలి డోస్ వేయించుకున్నప్పటిలా కాకుండా ఈసారి ప్రధాని ముఖానికి మాస్క్ ధరించి వ్యాక్సిన్ తీసుకున్నారు. మరోవైపు బీజేపీ సీనియర్ నేత ఎల్కే ఆద్వాని సైతం కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్నారు. చదవండి: పరీక్షలు ఒక్కటే జీవితం కాదు: మోదీ Got my second dose of the COVID-19 vaccine at AIIMS today. Vaccination is among the few ways we have, to defeat the virus. If you are eligible for the vaccine, get your shot soon. Register on https://t.co/hXdLpmaYSP. pic.twitter.com/XZzv6ULdan — Narendra Modi (@narendramodi) April 8, 2021 భారత్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. నిత్యం లక్షలాది మందికి వ్యాక్సిన్ అందిస్తున్నారు. వ్యాక్సినేషన్ పరంగా భారత్ ప్రపంచంలోనే ముందు వరుసలోదూసుకుపోతోంది. ముందుగా వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు అందించగా.. తర్వాత 60 ఏళ్లు దాటినవారు, 45 ఏళ్లు దాటి అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నవారికి వ్యాక్సినేషన్ అందజేశారు. ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు దాటిన అందరికీ టీకా పంపిణీ ప్రారంభించారు. ఇక ఇప్పటి వరకు దేశంలో 8 కోట్ల మందికి టీకాను అందజేశారు. -
వారసత్వ రాజకీయాలకు చెల్లుచీటీ
భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండగా.. 1998 మే నెలలో పోఖ్రాన్2 అణు పరీక్షలను నిర్వహించింది. అప్పుడు అగ్రరాజ్యమైన అమెరికా, జపాన్, బ్రిటన్ సహా చాలా దేశాలు భారత్‌పై ఆంక్షలు విధించాయి. అన్ని విధాలా సహాయ సహకారాలను నిలిపివేస్తామని బెదిరించాయి. నిలిపివేశాయి కూడా. భారతదేశాన్ని అణ్వస్త్ర దేశంగా తయారు చేయాలన్న సంకల్పంతో ఉన్న అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వం వీటిని సమర్థవంతంగా ఎదుర్కొంది. వాస్తవానికి ఈ పరీక్షలను అంతకు ముందే అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టాల్సి ఉంది. కానీ, అమెరికా బెదిరింపులకు ఆ పార్టీ తలొగ్గింది. వాజ్‌పేయి ప్రభుత్వం మాత్రం ముందస్తు వ్యూహాలు, కట్టుదిట్టమైన ప్రణాళికలతో.. మూడో కంటికి తెలియకుండా ఈ పరీక్షలను నిర్వహించడమే కాదు.. ఆ తర్వాత ఎదురైన ఒత్తిళ్లను తట్టుకుని సత్తా చాటుకుంది. భారతీయులంతా సగర్వంగా తలెత్తుకునేలా చేసింది. అదే వాజ్‌పేయి ప్రభుత్వం.. ఒకే ఒక్క ఓటు తేడాతో అధికారాన్ని కోల్పోయిన పార్టీగా చరిత్రలో నిలవాల్సి వచ్చింది. మిత్ర పక్షాలు మద్దతు ఉపసంహరించుకోవడంతో ఒకసారి 13 రోజుల్లో, మరోసారి 13 నెలల్లో అధికారం కోల్పోవాల్సి వచ్చింది. ఇలా అధికారాన్ని కోల్పోవడానికైనా సిద్ధపడిందే తప్ప ఏనాడూ లాలూచీలు పడాలని, ఎదుటివారిని లాక్కోవాలని చూడలేదు. బీజేపీకి కావాల్సింది ఏంటి? ఈ దేశంలో పేదరికం లేకుండా చేయడం, కుల, మత, వర్గ భేదాలు లేకుండా అందరికీ సమాన న్యాయాన్ని, స్వేచ్ఛను అందించడం, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం, అన్నివిధాలా దేశాన్ని అగ్రరాజ్యంగా అవతరింపచేయడం, మన ఘనమైన వారసత్వాన్ని నలుదిక్కులా చాటడం. అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రతి బీజేపీ కార్యకర్తా, నాయకుడూ పఠించే, పాటించే మంత్రం ఇదే. 1980 ఏప్రిల్ 6న ప్రారంభమైన బీజేపీ తన ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకుల్ని చూసింది. తొలిసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు వాజ్‌పేయి, అద్వానీ లాంటి మహామహులైన నాయకులంతా పరాజయం పాలయ్యారు. ఇందిరాగాంధీ హత్య తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో బీజేపీ రెండంటే రెండు సీట్లలోనే గెలుపొందింది. ఆ తర్వాతి ఎన్నికల్లో రెండంకెలు, మూడంకెల సీట్లను సాధించి, క్రమంగా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగింది. ఆ తర్వాత మరలా సీట్లు, ఓట్లు తగ్గి బలహీనంగా కనిపించినప్పటికీ.. గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయాలను సొంతం చేసుకుంది. రెండున్నర దశాబ్దాలపాటు దేశాన్ని సంకీర్ణ ప్రభుత్వాలు నడపడంతో.. ఇక భారతదేశంలో ఏక పార్టీ ప్రభుత్వ ఏర్పాటు అసాధ్యం అని రాజకీయ పండితులంతా ఏకగ్రీవంగా ప్రకటించిన సమయంలో బీజేపీ 2014 ఎన్నికల్లో 30 శాతానికి పైగా ఓట్లు, 282 సీట్లు సాధించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇది గాలివాటం కాదని నిరూపిస్తూ 2019 ఎన్నికల్లో 37 శాతానికి పైగా ఓట్లు, 300లకు పైగా సీట్లు సాధించింది. భారతదేశంలో నలు దిక్కులా బీజేపీ తన ప్రాబల్యాన్ని పెంచుకుంటోంది. క్షేత్రస్థాయిలో ప్రత్యర్థులను తట్టుకుని నిలబడిన కోట్లాది మంది కార్యకర్తలు సాధించిన, సాధిస్తున్న విజయం ఇది. కార్యకర్తలే బీజేపీకి పునాది, బలం. ఒక వ్యక్తి, ఒక నాయకుడు, ఒక కుటుంబంతో సంబంధం లేకుండా భారతదేశంలో ఇంత పెద్ద చారిత్రక విజయాలను నమోదు చేసిన ఏకైక పార్టీగా బీజేపీ ఎదిగిందంటే దానికి కారణం కార్యకర్తలే. ప్రస్తుతం 17 రాష్ట్రాల్లో బీజేపీ స్వయంగా కానీ, మిత్రపక్షాల రూపంలో కానీ అధికారంలో ఉంది. కానీ, ఇప్పటి వరకూ అధికారం చేపట్టని, ప్రత్యర్థి పార్టీల్లోని నాయకులకు సరితూగే స్థాయిలో ప్రజాకర్షక నాయకులు లేని కేరళ వంటి రాష్ట్రాల్లో కూడా బీజేపీ బలంగా ఉందంటే బీజేపీ సిద్ధాంతాలను జీర్ణించుకుని, జెండాను భుజాన పెట్టుకున్న కార్యకర్తలే కారణం. స్వాతంత్య్రానంతరం పాశ్చాత్య ప్రభుత్వ పోకడలకు ప్రభావితమైన నాయకులు భారతీయ ఆత్మతో సంబంధంలేని పోకడలను బలంగా నమ్మి, దేశంపైన బలవంతంగా రుద్దుతున్న సమయంలో భారతీయతత్వంతో ‘సమగ్ర మానవతావాదం’ పేరిట మనదైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ. అత్యంత దీనావస్థలో ఉన్న నిరుపేదలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో బీజేపీ ప్రభుత్వాలన్నీ ‘అంత్యోదయ’ పథకాలను ప్రారంభించాయి. కింది స్థాయిలో ఉండే వారికి ప్రభుత్వం నుంచి నేరుగా సహాయ, సహకారాలు అందేలా మోదీ ప్రభుత్వం ఎన్నడూ ఊహించని స్థాయిలో చర్యలు చేపట్టి, అమలు చేస్తోంది. సంక్షేమ కార్యక్రమాల అమలును కొత్తపుంతలు తొక్కించి, మధ్య దళారులను, లీకేజీలను అరికట్టింది. భారతీయ చారిత్రక సంస్కృతి స్ఫూర్తితో అంతర్జాతీయ స్థాయిలో అన్ని విధాలుగా అగ్రరాజ్యంగా భారతదేశాన్ని నిలపాలన్న లక్ష్యంతో కోట్లాది మంది బీజేపీ కార్యకర్తలు ‘దేశం ముందు, పార్టీ తర్వాత, స్వప్రయోజనాలు చివరాఖరున’ అన్న సంకల్పంతో పనిచేస్తున్నారు. అలాంటి వారందరికీ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శుభాభినందనలు.(నేడు బీజేపీ ఆవిర్భావ దినోత్సవం) వ్యాసకర్త: పురిఘళ్ల రఘురామ్ బీజేపీ సీనియర్ నాయకులు -
మరోసారి తెరపైకి అయోధ్య కేసు
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించిన అయోధ్యలోని బాబ్రీమసీదు కూల్చివేత కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. మసీదు కూల్చివేత స్థలంలో నూతన రామమందిరం రూపుదిద్దుకుంటున్న తరుణంలో అలహాబాద్ హైకోర్టు ముందు దాఖలైన పిటిషన్ బీజేపీ సీనియర్ నేతల్లో గుబులు రేపుతోంది. మసీదు కూల్చివేతలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ నేతలు ఎల్కే అద్వానీ (92), మురళీ మనోహార్ జోషీ (86), ఉమాభారతి, కళ్యాణ్ సింగ్, వీహెచ్‌పీ నేత వినయ్ కటియార్లతో పాటు మొత్తం 32 మంది నిర్ధోషులుగా తేల్చుతూ లక్నో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అయోధ్యకు చెందిన ఇద్దరు వ్యక్తులు సవాలు చేశారు. స్థానికులైన హాజీ మహ్మద్ అహ్మద్ (74), సయ్యద్ అల్కఖ్ అహ్మద్ (81) అనే ఇద్దరు ముస్లిం వ్యక్తులు సీబీఐ కోర్టు తీర్పును సవాలు చేస్తూ శుక్రవారం అలహాబాద్ హైకోర్టు ముందు ఓ పిటిషన్ దాఖలు చేశారు. తీర్పును పునఃసమీక్షించాలని పిటిషన్లో కోరారు. (వృద్ధ నేతను వెంటాడుతున్న బాబ్రీ విధ్వంసం) కాగా ఈ కేసుకు సంబంధించి మొత్తం 49 మందిపై సీబీఐ అభియోగాలు నమోదు చేయగా.. 28 ఏళ్ల సుదీర్ఘ విచారణ సమయంలో 17 మంది చనిపోయారు. మిగిలిన 32 మందిని నిర్దోషులని సీబీఐ ప్రత్యేక కోర్టు తాజాగా తీర్పు ప్రకటించింది. మసీదు కూల్చివేతకు నిందితులు కుట్ర పన్నినట్లుగా ఎలాంటి స్పష్టమైన, విశ్వసనీయ సాక్ష్యాధారాలు లేవని పేర్కొంది. పైగా, అందులో రామ్‌లల్లా విగ్రహం ఉన్నందున, ఆ నిర్మాణాన్ని కాపాడేందుకు విశ్వహిందూ పరిషత్ నేత దివంగత అశోక్‌సింఘాల్ ప్రయత్నించారని దాదాపు 2,300 పేజీల తీర్పులో సీబీఐ న్యాయమూర్తి ఎస్కే యాదవ్ వెల్లడించారు. నిందితులంతా రూ. 50 వేల వ్యక్తిగత బాండ్‌ను కోర్టుకు సమర్పించాలని ఆదేశించారు. విచారణ సమయంలో కూల్చివేత ఘటన నాటి వార్తాకథనాలను కానీ, వీడియో క్యాసెట్లను న్యాయమూర్తి సాక్ష్యాలుగా పరిగణించలేదు. (ఎదురుదెబ్బ: ఎన్డీయేలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు!) ఒరిజినల్ కాపీలు కానందున వాటిని సాక్ష్యాలుగా పరిగణించలేదన్నారు. కోర్టుకు సమర్పించిన వీడియోలు కూడా స్పష్టంగా లేవన్నారు. అలాగే, నెగెటివ్స్ సమర్పించనందున, ఘటనకు సంబంధించిన ఫొటోలను కూడా సాక్ష్యాలుగా పరిగణించలేమన్నారు. అయోధ్యలోని 2.77 ఎకరాల వివాదాస్పద స్థలం మొత్తాన్ని రామాలయ నిర్మాణం కోసం వినియోగించాలని సుప్రీంకోర్టు 2019 నవంబర్‌లో చారిత్రాత్మక తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. మసీదు నిర్మాణం కోసం అయోధ్యలోని మరో ప్రముఖ ప్రాంతంలో ఐదు ఎకరాల స్థలం కేటాయించాలని నాటి సీజే రంజన్ గొగోయ్ తీర్పులో పేర్కొన్నారు. ఆ 32 మంది వీరే.. 1, ఎల్కే అడ్వాణీ, 2. మురళీ మనోహర్ జోషి, 3. కళ్యాణ్ సింగ్, 4. ఉమాభారతి, 5. వినయ్ కతియార్, 6. సాక్షి మహరాజ్, 7. సాధ్వి రితంబర, 8. మహంత్ నృత్య గోపాల్ దాస్, 9. రామ్‌విలాస్ వేదాంతి, 10. చంపత్ రాయ్, 11. సతీష్ ప్రధాన్, 12. ధరమ్ దాస్, 13. బ్రిజ్ భూషణ్ సింగ్, 14. పవన్ కుమార్ పాండే, 15. జై భగవాన్ గోయల్, 16. లల్లూ సింగ్, 17. జైభాన్ సింగ్ పావాయా, 18. ఆచార్య ధర్మేంద్ర దేవ్, 19. రాంజీ గుప్తా, 20. ప్రకాశ్ శర్మ, 21. ధర్మేంద్ర సింగ్ గుర్జార్, 22. ఆర్ఎం శ్రీవాస్తవ, 23. సతీష్ ప్రధాన్ కరసేవకులు: 24. రామ్ చంద్ర ఖత్రి, 25. సుధీర్ కక్కర్, 26. అమన్ నాథ్ గోయల్, 27. సంతోష్ దుబే, 28. వినయ్ కుమార్ రాయ్, 29. కమలేష్ త్రిపాఠి, 30. గంధి యాదవ్, 31, విజయ్ బహదూర్ సింగ్, 32. నవీన్ భాయ్ శుక్లా. -
ఫిరాయింపులపై వెంకయ్య కీలక వ్యాఖ్యలు
సాక్షి, నెల్లూరు : దేశంలోని సామాన్య ప్రజల అభివృద్ధి కోసం భారత మాజీ ప్రధానమంత్రి దివంగత నేత అటల్ బిహారీ వాజ్‌పేయీ ఎన్నో సంస్కరణలు చేపట్టారని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. మొదటిసారి పార్లమెంట్లో అడుగుపెట్టిన నాటి నుంచి ప్రజల హక్కులు.. దేశాభివృద్ధి కోసం మాట్లాడేవారని గుర్తుచేశారు. అటల్ తీసుకుని వచ్చిన సంస్కరణలతో దేశానికి ప్రపంచంలో ఎంతో గుర్తింపు వచ్చిందని అభిప్రాయపడ్డారు. సుదీర్ఘ పార్లమెంట్ అనుభవం గడించిన ప్రధాని వాజ్‌పేయీదని, ఆయన చరిత్రను ప్రతి యువకుడు అధ్యయనం చేయాలని సూచించారు. అటల్, అద్వానీ లాంటి ఇద్దరు గొప్ప నేతల మధ్య తాను కూర్చోవడం అదృష్టంగా భావిస్తున్నా అని పేర్కొన్నారు. న్యూక్లియర్ పరీక్షల అనంతరం పార్లమెంట్లో ఒక్క ఓటు తేడాతో రాజీనామా చేశారని గుర్తుచేశారు. శనివారం నెల్లూరులో పర్యటించిన వెంకయ్య నాయుడు స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రసంగించారు. వందేమాతరం అంటూ నినాదాలు చేస్తే జాతీయవాదం కాదని, దేశహితమే జాతీయ వాదమని వ్యాఖ్యానించారు. ‘చర్చలు జరపడం ద్వారా అనేక సమస్యలను పరిష్కరించవచ్చని మన రాజ్యాంగం చెబుతోంది. ప్రస్తుత నాయకులు హామీలు ఇస్తున్నారు కానీ, వాటిని అమలు చేయడం మరుస్తున్నారు. కొంతమంది రాజకీయ నాయకుల తీరుపై ప్రజల్లో నమ్మకం పోతుంది. కొన్ని ప్రాంతాల్లో రాజకీయ నాయకులు శారీరక దాడులకు పాల్పుడటం దురదృష్టకరం. ప్రభుత్వం ప్రతిపాదించినా.. ప్రతిపక్షాలు వ్యతిరేఖించినా.. ఏం చేయాలన్నది చట్టసభకు వదిలేయాలి. పార్టీ ఫిరాయింపులు రాజ్యాంగంను అపహాస్యం చేస్తున్నాయి. ఫిరాయింపులపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని పార్లమెంట్‌లోనే చెప్పాను. దీనిపై రాజకీయ పార్టీలు నిర్ణయం తీసుకోవాలి. అదిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది.. ఆ విలువలు కాపాడుకోవాల్సిన అవసరం మనపై ఉంది. తాత్కాలిక ఉపయోగం కంటే దీర్ఘకాలిక అవసరాల కోసం రాజకీయాలు చేయాలి.’ అని అన్నారు. -
అద్వానీతో కేక్ కట్ చేయించిన మోదీ
సాక్షి, న్యూఢిల్లీ : భారత మాజీ ఉప ప్రధానమంత్రి, బీజేపీ కురవృద్ధుడు ఎల్కే అద్వానీ 93వ పుట్టిన రోజు నేడు (నవంబర్ 08). ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం తన రాజకీయ గురువు అద్వానీ ఇంటికి వెళ్లి పాదాభివందనం చేసి ఆశీర్వదాలు తీసుకున్నారు. అనంతరం కేక్ కట్ చేయించి పుట్టిన రోజు వేడులకును జరిపారు. దీనికి సంబంధిన ఫోటోలను మోదీ తన ట్విటర్ ఖాతాలో ఫోస్ట్ చేస్తూ..‘అద్వానీ జీ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు చెప్పడానికి ఆయన నివాసానికి వెళ్లడం జరిగింది. ఆయనతో సమయం గడపటం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది. పార్టీ కార్యకర్తలకు, దేశానికి ఆయన సజీవ ప్రేరణ. ఆయన జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ వెంటహోంమంత్రి అమిత్‌షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉన్నారు. #WATCH Delhi: Prime Minister Narendra Modi visits senior BJP leader Lal Krishna Advani's residence to celebrate latter's birthday today. Union Home Minister Amit Shah and BJP President JP Nadda also present. https://t.co/RVEDaIzhqj pic.twitter.com/sMlrarfo8O — ANI (@ANI) November 8, 2020 -
బాబ్రీ తీర్పు.. బీజేపీకి నయా అస్త్రం
సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు రేపిన బాబ్రీ మసీదు విధ్వంసం చేసులో పాలక బీజేపీకి అనుకూలంగా తీర్పు రావడంతో కకమలనాథులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చారిత్రక నేపథ్యం కలిగిన మసీదును ఆర్ఎస్ఎస్, బజరంగ్దళ్, కరసేవకులు కూల్చివేశారనే ఆరోపణలు తొలినుంచీ వినిపిస్తున్నాయి. అయితే వీటన్నింటికీ తాజాగా లక్నోలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం చెక్‌పెట్టింది. మసీదు కూల్చివేతలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులంతా నిర్దోషులేనని ఏకసభ్య ధర్మాసనం ప్రకటించింది. దీంతో 28 ఏళ్లుగా నిందను మోస్తున్న బీజేపీ అగ్రనేతలు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, ఉమా భారతీతో పాటు మరికొంత మందికి ఈ కేసు నుంచి ఊరట లభించింది. దేశంలో ఓ వైపు పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఈ తీర్పు రావడం కమలనాథులకు కలిసొచ్చే అంశంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. (తొలగిన మచ్చ.. దక్కిన ఊరట) కీలకమైన బిహార్ అసెంబ్లీతో పాటు దేశ వ్యాప్తంగా 56 అసెంబ్లీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల షెడ్యూల్‌ను విడుదల చేసింది. వీటిలో మధ్యప్రదేశ్‌లోని 24 అసెంబ్లీ స్థానాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా రానున్న ఏడాదిన్నర కాలంలో పంజాబ్‌తో పాటు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలోనే బాబ్రీ విధ్వంసానికి బీజేపీ నేతలు పాల్పడలేదని తాజాగా కోర్టు స్పష్టం చేయడంతో ఈ ఎన్నికల్లో వారికి కొంతమేర లబ్ధి చేకూర్చే అవకాశం ఉంది. మసీదు కూల్చివేత అనేది కుట్రపూరితంగా, ప్రణాళిక ప్రకారం జరగలేదని న్యాయస్థానం ప్రకటించడం బీజేపీ భవిష్యత్‌కు బాటలు వేయడంలాంటిదేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. తాజా తీర్పుతో మైనార్టీలో ఉన్న అపనింద కూడా తొలగిపోతుందని భావిస్తున్నారు. (కమలనాథుల్లో కొత్త ఉత్సాహం) ఈ తీర్పుతో రానున్న కాలంలో ఎన్నికలు జరుగనున్న బిహార్, బెంగాల్లో పాగా వేసేందుకు బీజేపీ నేతలు ప్రణాళికలు రచిస్తున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్లో ఏమాత్రం పట్టులేని బీజేపీ ఏకంగా 18 స్థానాలను కైవసం చేసుకుంది. అనూహ్యంగా 40.64 శాతం ఓట్లు సాధించింది. 2014 ఎన్నికల్లో 34 ఎంపీ స్థానాలను గెలుచుకున్న పాలక తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) 22 స్థానాలకే పరిమితం అయ్యింది. కాంగ్రెస్, వామపక్షాలు ఘోర పరాజయం చవిచూడక తప్పలేదు. ఈ నేపథ్యంలోనే చాపకింద నీరులా విస్తరిస్తున్న బీజేపీని చూసి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆందోళన చెందుతున్నారు. వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తన పట్టు సడలకుండా చూసుకోవడానికి ఇప్పటికే వ్యూహాలు రచిస్తున్నారు. దీనిలో భాగంగానే ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ను తన రాజకీయ సలహాదారుడిగా నియమించుకున్నారు. ఈ తరుణంలో బాబ్రీ మసీదు తీర్పు రావడంతో దానిని తమకు అనుకూలంగా మల్చుకునేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. కమలనాథులు రామ మందిర నిర్మాణాన్ని తమ ఖాతాలో వేసుకుంటూనే మసీదు కూల్చివేతతో అంటిన మట్టిని వదిలించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. గత ఏడాది మందిర నిర్మాణానికి అనుకూలంగా తీర్పు రావడం, ఇప్పుడు మసీదు కూల్చివేతలో బీజేపీ ప్రమేయం లేదని కోర్టు తేల్చి చెప్పడంతో రాజకీయంగా తమకు బాగా లబ్ధి చేకూరుతుందని బీజేపీ వర్గాలు యోచిస్తున్నాయి. ఇక బీజేపీ ప్రయోగించిన ఈ అస్త్రాన్ని ఎదుర్కొవడం విపక్షాలకు పెను సవాలే. -
1992 డిసెంబర్ 6న ఏం జరిగింది ?
బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనపై సమగ్ర విచారణ కోసం ఏర్పాటు చేసిన లిబర్హాన్ కమిషన్ తన నివేదికలో ఆ రోజు అయోధ్యలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో వివరించింది. కరసేవకులు మసీదుని కూలగొట్టడానికి వస్తున్నారన్న సమాచారం ముందే అందడంతో వేలల్లో పోలీసుల్ని పట్టణంలో మోహరించారు. అయితే లక్షన్నర మంది వరకు కరసేవకులు ఒకేసారి రోడ్ల మీదకి రావడంతో వారిని అడ్డుకోవడం సాధ్యం కాలేదని నివేదిక వెల్లడించింది. మన్మోహన్ సింగ్ లిబర్హాన్ ఆధ్వర్యంలోని కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం ఉదయం 12:15కి మొదలైన కూల్చివేత కార్యక్రమం సాయంత్రం 5:30కి ముగిసింది. 1992 డిసెంబర్ 5 నుంచే అయోధ్యలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో యూపీలో నాటి కళ్యాణ్ సింగ్ ప్రభుత్వం భారీగా పోలీసుల్ని మోహరించింది. 35 కంపెనీల ప్రావిన్షియల్ ఆర్మీడ్ కాన్‌స్టబ్యులరీ (పీఏసీ), 195 కంపెనీల పారామిలటరీ బలగాలు, నాలుగు కంపెనీల సీఆర్పీఎఫ్ బలగాలు, 15 బాష్ప వాయు స్క్వాడ్స్, 15 మంది ఇన్స్పెక్టర్లు, 30 మంది ఎస్ఐలు, 2,300 మంది పోలీసు కానిస్టేబుళ్లు మోహరించారు. ఉదయం 10:30 గంటలకి అడ్వాణీ, జోషి వంటి బీజేపీ అగ్రనాయకులు కరసేవ ప్రారంభం చూడడం కోసం వచ్చారు. ఒక 20 నిమిషాల సేపు అక్కడే గడిపిన వారు రామ్‌కథ కుంజ్‌లో మతాధికారులు ఇచ్చే ప్రసంగాలు వినడానికి వెళ్లారు. పలుగు పారలతో మసీదుపై దాడి మసీదు చుట్టూ ఉన్న భద్రతా వలయాన్ని ఛేదించుకొని ఒక టీనేజీ యువకుడు 12 గంటల సమయంలో మసీదు గుమ్మటంపైకి నెమ్మదిగా ఎక్కాడు. అతని వెంట మరో 150 మంది వరకు పైకి ఎక్కి గునపాలు, ఇనుప రాడ్లు, పలుగులు, పారలతో మసీదుని కూల్చడం మొదలుపెట్టారు. మరో పావు గంట గడిచేసరికి 5 వేల మంది వరకు కరసేవకులు మసీదుపైకి ఎక్కేశారు. చేతికి దొరికిన ఆయుధాలతో కూల్చే పని కొనసాగించారు. అడ్వాణీ, జోషి, అశోక్ సింఘాల్, విజయ్‌రాజె సింథియా వంటి నేతలు వారిని వెనక్కి వచ్చేయమని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కరసేవకులు వినిపించుకోలేదు. భద్రతా బలగాలు, మీడియా ప్రతినిధులపైకి ఇటుకలు విసురుతూ ఉద్రిక్తతలకు తెర తీశారు. పోలీసు బలగాలు అడ్డుకోలేకపోయాయి జిల్లా మెజిస్ట్రేట్ పారామిలటరీ బలగాల్ని మోహరించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. వాళ్లెవరూ కాల్పులకు దిగకూడదన్న షరతు మీద ఆ నాటి యూపీ సీఎం కళ్యాణ్ సింగ్ బలగాలకు అనుమతించారు. కానీ వారు వివాదాస్పద కట్టడం దగ్గరకి వెళ్లడంలో విఫలమయ్యారు. మార్గం మధ్యలోనే వారిని కరసేవకులు అడ్డుకున్నారు. ఇక రాష్ట పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్ట కుండా మిన్నకుండిపోయారు. మసీదులో ఒక భాగం కూలిపోగానే డీజీపీ కాల్పులకు అనుమతి అడిగితే కళ్యాణ్‌సింగ్ నిరాకరిం చారు. మసీదు కూలడం మొదలు కావడంతో ఒక్కసారిగా అయోధ్యలో మత ఘర్షణలు పెచ్చరిల్లాయి. సాయంత్రమ య్యేసరికి మసీదు అంతా నేలమట్టమైంది. కేంద్ర కేబినెట్ యూపీలో రాష్ట్రపతి పాలన విధిస్తున్నట్టుగా ప్రకటించింది. -
‘బాబ్రీ’ తీర్పు: అందరూ నిర్దోషులే
లక్నో: దాదాపు మూడు దశాబ్దాల సుదీర్ఘ విచారణకు తెరపడింది. దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టించిన అయోధ్యలోని బాబ్రీమసీదు కూల్చివేత కేసులో తీర్పు వెలువడింది. మసీదు కూల్చివేతకు కుట్ర పన్నారని ఆరోపణలు ఎదుర్కొన్న నిందితులంతా నిర్దోషులేనని సీబీఐ ప్రత్యేక కోర్టు బుధవారం స్పష్టం చేసింది. వారిలో బీజేపీ అగ్రనేత, నాటి రామ మందిర నిర్మాణ ఉద్యమ రథ సారథి ఎల్కే అడ్వాణీ(92), బీజేపీ సీనియర్ నేతలు మురళీ మనోహర్ జోషి(86), ఉమా భారతి, మసీదు కూల్చివేత సమయంలో యూపీ ముఖ్యమంత్రిగా ఉన్న కళ్యాణ్ సింగ్, వీహెచ్‌పీ నేత వినయ్ కటియార్, సాధ్వి రితంబర, ప్రస్తుతం అయోధ్యలో రామాలయ నిర్మాణ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్.. తదితరులు ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి మొత్తం 49 మందిపై సీబీఐ అభియోగాలు నమోదు చేయగా.. 28 ఏళ్ల సుదీర్ఘ విచారణ సమయంలో 17 మంది చనిపోయారు. మిగిలిన 32 మందిని నిర్దోషులని సీబీఐ ప్రత్యేక కోర్టు తాజాగా తీర్పు ప్రకటించింది. మసీదు కూల్చివేతకు నిందితులు కుట్ర పన్నినట్లుగా ఎలాంటి స్పష్టమైన, విశ్వసనీయ సాక్ష్యాధారాలు లేవని పేర్కొంది. పైగా, అందులో రామ్‌లల్లా విగ్రహం ఉన్నందున, ఆ నిర్మాణాన్ని కాపాడేందుకు విశ్వహిందూ పరిషత్ నేత దివంగత అశోక్‌సింఘాల్ ప్రయత్నించారని దాదాపు 2,300 పేజీల తీర్పులో సీబీఐ న్యాయమూర్తి ఎస్కే యాదవ్ వెల్లడించారు. నిందితులంతా రూ. 50 వేల వ్యక్తిగత బాండ్‌ను కోర్టుకు సమర్పించాలని ఆదేశించారు. విచారణ సమయంలో కూల్చివేత ఘటన నాటి వార్తాకథనాలను కానీ, వీడియో క్యాసెట్లను న్యాయమూర్తి సాక్ష్యాలుగా పరిగణించలేదు. ఒరిజినల్ కాపీలు కానందున వాటిని సాక్ష్యాలుగా పరిగణించలేదన్నారు. కోర్టుకు సమర్పించిన వీడియోలు కూడా స్పష్టంగా లేవన్నారు. అలాగే, నెగెటివ్స్ సమర్పించనందున, ఘటనకు సంబంధించిన ఫొటోలను కూడా సాక్ష్యాలుగా పరిగణించలేమన్నారు. లాస్ట్ వర్కింగ్ డే దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొనడంతో సీబీఐ కోర్టు ఉన్న ప్రాంగణంలో కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. మధ్యాహ్నం 12:10 గంటలకు న్యాయమూర్తి ఎస్కే యాదవ్ న్యాయస్థానంలోకి వచ్చారు. ఆ తరువాత, 10 నిమిషాల్లోనే నిందితులంతా నిర్దోషులేనని పేర్కొంటూ తీర్పు ఆపరేటివ్ భాగాన్ని వెలువరించారు. న్యాయమూర్తి ఎస్కే యాదవ్‌కు బుధవారం చివరి పని దినం కావడం గమనార్హం. 26 మంది హాజరు తీర్పురోజు నిందితులంతా కోర్టుకు హాజరు కావాలని జడ్జి గతంలో ఆదేశించారు. కానీ, కరోనా, తదితర కారణాలతో పలువురు హాజరు కాలేదు. జీవించి ఉన్న 32 మంది నిందితుల్లో 26 మంది హాజరయ్యారు. తీర్పు ప్రకటిస్తున్న సమయంలో కోర్టుహాళ్లో ఉన్న కొందరు నిందితులు జడ్జి ముందే గట్టిగా ‘జై శ్రీరాం’ అంటూ నినాదాలు చేశారు. నిందితుల్లో వృద్ధాప్య కారణాలు చూపుతూ అద్వానీ, ఎంఎం జోషి, మహంత్ నృత్యగోపాల్‌దాస్ కోర్టుకు హాజరు కాలేదు. కళ్యాణ్ సింగ్, ఉమాభారతిలకు కరోనా సోకడంతో రాలేదు. విచారణ ఇలా.. విచారణ సమయంలో 351 మంది సాక్ష్యులను, 600 పత్రాలను సీబీఐ కోర్టుకు సమర్పించింది. 49 మందిని నిందితులుగా చేర్చింది. వారిలో విచారణ సాగుతుండగా వీహెచ్‌పీ అగ్రనేత అశోక్ సింఘాల్, శివసేన చీఫ్ బాలాసాహెబ్ ఠాక్రే, విజయరాజె సింధియా తదితర 17 మంది చనిపోయారు. రోజువారీ విచారణ జరపాలని, రెండు సంవత్సరాల్లోగా విచారణ ముగించాలని సీబీఐ ప్రత్యేక కోర్టును ఆదేశించింది. నిందితులు మసీదు కూల్చివేతకు కుట్ర పన్నడంతోపాటు కరసేవకులను రెచ్చగొట్టారని సీబీఐ వాదించింది. విగ్రహాలను పూజారి కాపాడారు: మసీదును దుండగులు కూల్చివేస్తున్న సమయంలో గర్భాలయంలో ఉన్న రామ్‌లల్లా విగ్రహం, ఇతర విగ్రహాలను అక్కడి పూజారి సత్యేంద్ర దాస్ బయటకు తీసుకువెళ్లారని, దీనిబట్టి, మసీదు కూల్చివేత ముందస్తు ప్రణాళికతో జరిగింది కాదని అర్థమవుతుందని నిందితుల తరఫు న్యాయవాది విమల్ శ్రీవాస్తవ వాదించారు. వివాదాస్పద ప్రాంతానికి 200 మీటర్ల దూరంలోని రామకథ కుంజ్ వద్ద వేదికపై నుంచి కూల్చివేత వద్దంటూ వీహెచ్‌పీ నేతలు, ఇతర నాయకులు ఇస్తున్న సూచనలను దుండగులు పట్టించుకోలేదన్నారు. కూల్చివేతను అడ్డుకునేందుకు అశోక్ సింఘాల్ ప్రయత్నించారన్నారు. మతపరమైన విశ్వాసంతో లాంఛనప్రాయంగా కరసేవ చేయాలనేదే నాయకుల ఉద్దేశమని, కాని కొందరు దురుద్దేశపూరితంగా దీన్ని భగ్నం చేసి, కూల్చివేతకు పాల్పడ్డారని వివరించారు. సీబీఐ కోర్టుకు సమర్పించిన వీడియోలు సీల్ అయి లేవని, అవి నిజమైనవా? కాదా? అని లాబ్‌లో పరీక్షించలేదని పేర్కొన్నారు. ముందు నుంచీ చెబుతున్నాం.. మసీదును కూల్చేందుకు కుట్ర పన్నారనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని, ఎల్కే అద్వానీ, ఎంఎం జోషి, కళ్యాణ్ సింగ్, ఉమాభారతి తదితర నిందితులపై తప్పుడు కేసు పెట్టారని ముందు నుంచీ చెబుతున్నామని డిఫెన్స్ లాయర్ విమల్ కుమార్ శ్రీవాస్తవ తీర్పు అనంతరం మీడియాతో వ్యాఖ్యానించారు. అప్పుడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ ఒత్తిడితో ఆ కేసు పెట్టారని, ఈ తాజా తీర్పు న్యాయానికి లభించిన విజయమని ఆయన పేర్కొన్నారు. అప్పీల్‌కు వెళ్లడంపై.. ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుపై సీబీఐ పై కోర్టులో అప్పీల్ చేస్తుందా? అన్న ప్రశ్నకు సీబీఐ న్యాయవాది లలిత్ సింగ్ జవాబిస్తూ.. ఈ తీర్పు కాపీని ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయానికి పంపిస్తామని, తీర్పును సీబీఐ న్యాయ విభాగం అధ్యయనం చేసిన తరువాత అప్పీల్‌కు వెళ్లడంపై తుది నిర్ణయం ఉంటుందని తెలిపారు. మంచిదే: అన్సారీ సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పుపై రామజన్మభూమి– బాబ్రీ మసీదు భూ యాజమన్య హక్కు కేసులో ప్రధాన కక్షిదారు అయిన ఇక్బాల్ అన్సారీ పేర్కొన్నారు. ‘అందరినీ నిర్దోషులుగా ప్రకటించారు. మంచిదే. జరగాల్సిందంతా గత సంవత్సరం నవంబర్ 9ననే జరిగింది. అదే రోజు ఈ కేసు కూడా ముగిస్తే ఇంకా బావుండేది’ అని వ్యాఖ్యానించారు. రామజన్మభూమి– బాబ్రీ మసీదు కేసులో రామజన్మభూమికి అనుకూలంగా 2019లో సుప్రీంకోర్టు తీర్పునివ్వడం తెల్సిందే. మా విశ్వాసం నిలబెట్టింది తీర్పువినగానే జై శ్రీరాం అని అడ్వాణీ నినదించారు. ‘రామ జన్మభూమి ఉద్యమంపై నా నమ్మకాన్ని, బీజేపీ విశ్వాసాన్ని, మా నిబద్ధతను ఈ తీర్పు సమర్థించింది’ అని అన్నారు. ‘అయోధ్యలో భవ్యమైన రామమందిర నిర్మాణం నా చిరకాల స్వప్నం. అందుకు వీలు కల్పించే గత నవంబర్ 29 నాటి సుప్రీంకోర్టు తీర్పు తరువాత.. అదే స్ఫూర్తితో ఈ తీర్పు రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఇక, అయోధ్యలో అద్భుతమైన రామ మందిర నిర్మాణం పూర్తి కావడం కోసం లక్షలాది భక్తులతో పాటు నేను ఎదురు చూస్తున్నా’ అన్నారు. అయోధ్య ఉద్యమ సమయంలో తనకు సహకరించిన పార్టీ కార్యకర్తలు, నాయకులు, స్వామీజీలు, అందరికీ అద్వానీ కృతజ్ఞతలు తెలిపారు. తీర్పు తరువాత తన ఇంటి నుంచి బయటకు వచ్చి, అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులను, అభిమానులను ఆయన జైశ్రీరాం అంటూ పలకరించారు. ఆ 32 మంది వీరే.. 1, ఎల్కే అడ్వాణీ, 2. మురళీ మనోహర్ జోషి, 3. కళ్యాణ్ సింగ్, 4. ఉమాభారతి, 5. వినయ్ కతియార్, 6. సాక్షి మహరాజ్, 7. సాధ్వి రితంబర, 8. మహంత్ నృత్య గోపాల్ దాస్, 9. రామ్‌విలాస్ వేదాంతి, 10. చంపత్ రాయ్, 11. సతీష్ ప్రధాన్, 12. ధరమ్ దాస్, 13. బ్రిజ్ భూషణ్ సింగ్, 14. పవన్ కుమార్ పాండే, 15. జై భగవాన్ గోయల్, 16. లల్లూ సింగ్, 17. జైభాన్ సింగ్ పావాయా, 18. ఆచార్య ధర్మేంద్ర దేవ్, 19. రాంజీ గుప్తా, 20. ప్రకాశ్ శర్మ, 21. ధర్మేంద్ర సింగ్ గుర్జార్, 22. ఆర్ఎం శ్రీవాస్తవ, 23. సతీష్ ప్రధాన్ కరసేవకులు: 24. రామ్ చంద్ర ఖత్రి, 25. సుధీర్ కక్కర్, 26. అమన్ నాథ్ గోయల్, 27. సంతోష్ దుబే, 28. వినయ్ కుమార్ రాయ్, 29. కమలేష్ త్రిపాఠి, 30. గంధి యాదవ్, 31, విజయ్ బహదూర్ సింగ్, 32. నవీన్ భాయ్ శుక్లా. తీర్పు వెలువడ్డాక వారణాసిలో మిఠాయిలు తినిపించుకుంటున్న ముస్లిం మహిళా ఫౌండేషన్ సభ్యులు -
జై శ్రీరాం నినాదంతో తీర్పును స్వాగతించా!
-
బాబ్రీ తీర్పుపై స్పందించిన బీజేపీ దిగ్గజ నేత
సాక్షి, న్యూఢిల్లీ : 1992 బాబ్రీ మసీదు విధ్వంసం కేసు నుంచి తనతో సహా నిందితులందరినీ నిర్ధోషులుగా ప్రత్యేక న్యాయస్ధానం బుధవారం వెలువరించిన తీర్పుపై బీజేపీ దిగ్గజనేత ఎల్కే అద్వానీ స్పందించారు. ఈ తీర్పు రామమందిర ఉద్యమం పట్ల బీజేపీతో పాటు తనకున్న విశ్వాసం, చిత్తశుద్ధిని ప్రతిబింబించిందని చెప్పారు. తీర్పు వెలువడిన అనంతరం తాను జై శ్రీరాం అంటూ నినదించానని, ఇది తమందరికీ సంతోషకర క్షణమని అభివర్ణించారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమం చేస్తూ గత ఏడాది నవంబర్‌లో సుప్రీంకోర్టు వెల్లడించిన చారిత్రాత్మక తీర్పు అనంతరం తాజా తీర్పు వెలువడటం స్వాగతించదగిన పరిణామమని అద్వానీ చెప్పుకొచ్చారు. ఈ తీర్పును తాను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానని 92 సంవత్సరాల అద్వానీ పేర్కొన్నారు. కాగా బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో బీజేపీ దిగ్గజ నేతలు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, ఉమా భారతి, కళ్యాణ్ సింగ్‌లపై కుట్ర ఆరోపణలు సహా 32 మంది నిందితులపై అభియోగాల నుంచి లక్నోలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం విముక్తి కల్పించింది. 1992, డిసెంబర్ 6న జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేత పథకం ప్రకారం జరిగింది కాదని న్యాయస్ధానం స్పష్టం చేసింది. సంఘ విద్రోహ శక్తులు కట్టడాన్ని కూల్చాయని, నిందితులు మసీదు కూల్చివేతను అడ్డుకునేందుకు ప్రయత్నించారని సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం న్యాయమూర్తి ఎస్కే యాదవ్ పేర్కొన్నారు. సీబీఐ సమర్పించిన ఆడియో, వీడియో ఆధారాలు నేతలపై ఆరోపణలను బలపరిచేలా లేవని తేల్చిచెప్పారు. ఇక గత ఏడాది నవంబర్‌లో వివాదాస్పద స్థలాన్ని రామ మందిర నిర్మాణానికి సుప్రీంకోర్టు అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ స్ధలంలోనే ఈ ఏడాది ఆగస్ట్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా రామమందిర నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. చదవండి : న్యాయం గెలిచింది.. క్షమాపణ కోరండి: యోగి -
న్యాయం గెలిచింది.. క్షమాపణ కోరండి: యోగి
న్యూఢిల్లీ/లక్నో: బాబ్రీ మసీదు కేసు కూల్చివేత కేసులో ప్రత్యేక న్యాయస్థానం వెలువరించి తీర్పు పట్ల ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హర్షం వ్యక్తం చేశారు. చివరకు న్యాయమే గెలించిందంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాజకీయ దురుద్దేశంతోనే సాధువులు, బీజేపీ నాయకుల పరువు మసకబార్చేలా కేసులు బనాయించారని ఆరోపించారు. విశ్వహిందూ పరిషత్ సభ్యులతో పాటు వివిధ సామాజిక సంస్థలను ఈ కేసులో ఇరికించారన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ చేసిన పని కారణంగా వీళ్లంతా సుదీర్ఘకాలంగా నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొన్నారని, ఈ కుట్ర వెనుక ఉన్న అసలు కారకులు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా యోగి డిమాండ్ చేశారు. కాగా 1992 నాటి బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో నిందితులంతా నిర్దోషులేనని లక్నోలోని ప్రత్యేక న్యాయస్థానం తుది తీర్పును వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ కేసులో మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్ నేత ఎల్కే అడ్వాణీ, మురళి మనోహర్ జోషి, ఉమా భారతి తదితరులు ప్రధాన నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇదిలా ఉండగా.. చారిత్రక కేసులో తీర్పు వెల్లడి, హత్రాస్ సామూహిక అత్యాచార బాధితురాలి మృతి నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్‌లో భద్రత కట్టుదిట్టం చేశారు. భారీ స్థాయిలో పోలీసులను మోహరించారు. ఆధిపత్య వర్గానికి చెందిన నలుగురు యువకులు దళిత యువతిపై అత్యంత దారుణంగా అత్యాచారానికి పాల్పడటంతో రెండు వారాల పాటు ప్రాణాలతో పోరాడిన ఆమె చివరకు ఢిల్లీ ఆస్పత్రిలో కన్నుమూసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. -
బాబ్రీ విధ్వంసం కేసు: నేడే తుదితీర్పు
లక్నో: సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న 1992 బాబ్రీమసీదు కూల్చివేత కేసులో ప్రత్యేక న్యాయస్థానం నేడు తుదితీర్పు వెలువరించనుంది. తీర్పు వెలువరించే రోజు నాటికి జీవించి ఉన్న 32 మంది ముద్దాయిలు కూడా కోర్టు ఎదుట హాజరుకావాలని సీబీఐ జడ్జి ఎస్కే యాదవ్ 16వ తేదీన ఆదేశించారు. ముద్దాయిల్లో మాజీ ఉపప్రధాని ఎల్కే అడ్వాణీ, కేంద్ర మాజీ మంత్రులు మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్, వినయ్ కతియార్, సాధ్వి రితంబర ఉన్నారు. తీర్పునిచ్చే రోజు కరోనా ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న ఉమాభారతి, కళ్యాణ్ సింగ్ కోర్టులో హాజరవుతారో లేదో తెలియరాలేదు. కళ్యాణ్ సింగ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండగా బాబ్రీ విధ్వంసం జరిగింది. రాజస్తాన్ గవర్నర్‌గా పదవీ కాలం ముగియగానే గత సెప్టెంబర్ నుంచి, ఆయనపై విచారణ కొనసాగింది.(చదవండి: నూతన శకానికి నాందీ క్షణం) విచారణ జరుగుతుండగానే 16 మంది మరణం కాగా 1992 డిసెంబర్ 6న కరసేవకులు అయోధ్యలో బాబ్రీ మసీదుని కూల్చివేశారు. దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసును సీబీఐ విచారించింది. ఈ క్రమంలో సీబీఐ 351 మంది సాక్షుల్ని న్యాయస్థానం ఎదుట ప్రవేశపెట్టింది. 600 డాక్యుమెంట్లను రుజువులుగా చూపించింది. 48 మందిపై అభియోగాలు నమోదు చేయగా, విచారణ జరుగుతుండగానే 16 మంది ప్రాణాలు కోల్పోయారు. 16వ శతాబ్దం నాటి బాబ్రీ మసీదుని కూల్చివేతలో పాల్గొన్న కరసేవకుల్ని ఈ కేసులో నిందితులందరూ కుట్ర పన్ని వారిని రెచ్చగొట్టారని సీబీఐ న్యాయస్థానం ఎదుట వాదనలు వినిపించింది. -
30న బాబ్రీ కూల్చివేత తీర్పు
లక్నో: అయోధ్యలో వివాదాస్పద బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ప్రత్యేక కోర్టు ఈ నెల 30న తీర్పు వెల్లడించనుంది. కూల్చివేత ఘటన జరిగిన 28 ఏళ్ల తర్వాత చరిత్రాత్మక తీర్పు రాబోతోంది. ఈ కేసులో బీజేపీ అగ్రనేతలు అడ్వాణీ, మురళీమనోహర్ జోషి సహా 32 మంది అభియోగాలు ఎదుర్కొంటూ ఉండడంతో తీర్పుపై ఉత్కంఠ నెలకొని ఉంది. ఈ కేసుని విచారిస్తున్న లక్నోలోని సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్కే యాదవ్ తీర్పు వెలువడే 30వ తేదీన నిందితులు అందరూ న్యాయస్థానానికి హాజరు కావాలని బుధవారం ఆదేశాలు జారీ చేశారు. ఉమా భారతి, కళ్యాణ్ సింగ్, వినయ్ కటియార్, స్వాధి రితంబర వంటి బీజేపీ సీనియర్ నాయకులు ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్నారు. 28 ఏళ్లుగా విచారణ కొనసాగుతున్న బాబ్రీ కేసులో ఈ నెల 1న వాదనలు పూర్తయ్యాయి. 351 సాక్షులు, 600 డాక్యుమెంట్లు బాబ్రీ కేసుని విచారించిన సీబీఐ 351 మంది సాక్షుల్ని న్యాయస్థానం ఎదుట ప్రవేశపెట్టింది. 600 డాక్యుమెంట్లను రుజువులుగా చూపించింది. 48 మందిపై అభియోగాలు నమోదు చేయగా, విచారణ జరుగు తుండగానే 16 మంది ప్రాణాలు కోల్పోయారు. 16వ శతాబ్దం నాటి బాబ్రీ మసీదుని కూల్చివేతలో పాల్గొన్న కరసేవకుల్ని ఈ కేసులో నిందితులందరూ కుట్ర పన్ని వారిని రెచ్చగొట్టారని సీబీఐ వాదనలు వినిపించింది. 1992 డిసెంబర్ 6న కరసేవకులు అయోధ్యలో బాబ్రీ మసీదుని కూల్చివేశారు. -
30న బాబ్రీ కేసుపై తీర్పు
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజకీయ, సామాజిక ముఖచిత్రాన్ని మార్చివేసిన 28 ఏళ్ల నాటి బాబ్రీ మసీదు కూల్చివేత కేసుపై ఈనెల 30న తీర్పు వెలువడనుంది. బీజేపీ దిగ్గజ నేతలు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతి సహా నిందితులందరూ కోర్టుకు హాజరు కావాలని తీర్పును వెల్లడించనున్న సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం జడ్జి ఎస్కే యాదవ్ కోరారు. 1992లో బాబ్రీ మసీదు ధ్వంసానికి దారితీసేలా కుట్రపూరితంగా వ్యవహరించారని బీజేపీ దిగ్గజ నేతలపై ఆరోపణలున్నాయి. రాముడి జన్మస్థలంలో మసీదు ఉందని నమ్మడంతో కరసేవకులు ఈ కట్టడాన్ని నేలమట్టం చేశారు. బాబ్రీ కూల్చివేతపై అద్వానీ (92) జులై 24న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీబీఐ ప్రత్యేక న్యాయస్దానం ఎదుట స్టేట్మెంట్ రికార్డు చేశారు. అంతకుముందు రోజు మురళీ మనోహర్ జోషీ (86) తన స్టేట్మెంట్ రికార్డు చేశారు. తమపై నమోదైన అన్ని అభియోగాలను వారు తోసిపుచ్చారు. ఇక బాబ్రీ కేసులో న్యాయస్ధానం ఎలాంటి తీర్పు వెలువరించినా ఇబ్బంది లేదని బీజేపీ సీనియర్ నేత ఉమా భారతి స్పష్టం చేశారు. చదవండి : బాబ్రీ మసీదు పరిమాణంలోనే కొత్త మసీదు! -
వీడని విధ్వంసం : బాబ్రీ కేసుకు డెడ్‌లైన్
సాక్షి, న్యూఢిల్లీ : హిందూవులు చిరకాల స్వప్నం అయోధ్య రామమందిర నిర్మాణానికి ఓ వైపు అడుగులు పడుతున్న వేళ.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను జారీచేసింది. బాబ్రీ మసీదు కూల్చివేత కేసును సెప్టెంబర్ 30లోపు పూర్తి చేయాలని లక్నో సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తిని దేశ అత్యున్నత న్యాయస్థానం శనివారం ఆదేశించింది. విచారణ పూర్తి చేసి తుది తీర్పును కూడా వెలువరించాలని కోర్టు స్పష్టం చేసింది. కాగా గత ఏడాది ఇచ్చిన ఆగస్ట్ 31 వరకు గడువు ముగిస్తున్న నేపథ్యంలో సీబీఐ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి మరికొంత సమయం కావాలని సుప్రీంకోర్టును అభ్యర్థించారు. దీనికి సమ్మతించిన న్యాయస్థానం విచారణ గడువును మరో నెలపాటు పొడిగించింది. దీంతో ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ కురు వృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ (92), అశోక్ సింఘాల్, మురళీ మనోహర్ జోషీ, ఉమాభారతి, వినయ్ కటియార్, గిరిరాజ్ కిషోర్, నాటి యూపీ సీఎం కళ్యాణ్సింగ్లకు కొంత ఊరట లభించింది. (బాబ్రీ కేసులో సీబీఐ కోర్టు ముందుకు అడ్వాణీ) కరసేవకులను రెచ్చగొట్టి కుట్రపూరితంగానే మసీదును కూల్చివేశారని (కుట్ర) ఆరోపణలు వీరు ఎదుర్కొంటున్నారు. దాదాపు 29 ఏళ్ల నుంచి కోర్టుల్లో విచారణ సాగుతోంది. ఈ క్రమంలోనే ఇటీవల ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీలతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరికొంత మంది వాగ్మూలాలను సీబీఐ నమోదు చేసింది. సుప్రీంకోర్టు తాజా ఉత్వర్వులతో విచారణ మరికొంత వేగంగా ముందుకు సాగనుంది. మరోవైపు 1992 నాటి బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో నిందితులుగా ఉన్న అద్వానీ.. ఆ కేసు నుంచి బయటపడేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. సీబీఐ కేసులో బీజేపీ అగ్రనేతలు.. 1992 డిసెంబర్ 6న సాయంత్రం (బాబ్రీ మసీదు కూల్చివేత) స్థానిక పోలీస్ స్టేషన్లో 198/92 నెంబర్‌తో మరో ఎఫ్ఐఆర్ నమోదైంది. వీరిలో బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ, అశోక్ సింఘాల్, మురళీ మనోహర్ జోషీ, ఉమాభారతి, వినయ్ కటియార్, గిరిరాజ్ కిషోర్, నాటి యూపీ సీఎం కళ్యాణ్‌సింగ్ కూడా ఉన్నారు. అయితే 2003 సెప్టెంబర్ 19న రాయ్‌బరేలీలోని స్పెషల్ మెడిస్ట్రేట్ అద్వానీ, జోషీలకు విచారణ నుంచి విముక్తి కల్పించింది. అయితే దీనిపై పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. 2017లో తీర్పును వెలువరిస్తూ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న అద్వానీ, జోషీ, ఉప భారతి, కళ్యాణ్ సింగ్‌లను కూడా విచారించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. దీంతో సీబీఐ వీరందరినీ విచారిస్తోంది. కేసు విచారణ తుది దశతో ఉన్న నేపథ్యంలో.. నేరం రుజువైతే శిక్ష కూడా పడే అవకాశం ఉన్నట్లు న్యాయ నిపుణులు చెబుతున్నారు. తాజా ఆదేశాల ప్రకారం సెప్టెంబర్ 30న తుది తీర్పు వెలువడాల్సి ఉంది. -
అయోధ్య రామాలయం: అద్వానీ ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : హిందువుల చిరకాల స్వప్నం అయోధ్య రామాలయ నిర్మాణం శంకుస్థాపనకు కొద్ది గంటల సమయం మాత్రమే మిగిలింది. దేశమంతా ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్న చారిత్రాత్మక ఘట్టం బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆవిష్కృతం కానుంది. ఈ నేపథ్యంలో రామాలయ నిర్మాణ పోరాట చరిత్రలో ముందుభాగంలో ఉన్న బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆలయ శంకుస్థాపన నేపథ్యంలో మంగళవారం రాత్రి ఓ జాతీయ మీడియాతో ఆయన మాట్లాడుతూ.. తన కల సాకారమైన రోజు ఇదని సంతోషం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భూమి పూజ చేయడం చరిత్రాత్మకమని అన్నారు. ‘అయోధ్యలో రామమందిర నిర్మాణం నాతో సహా భారతీయులందరికీ ఒక ఉద్వేగపూరిత క్షణం. రామజన్మభూమి లో మందిర నిర్మాణం బీజేపీ కల. రథయాత్ర ద్వారా రామజన్మభూమి ఉద్యమంలో పాల్గొనడం ద్వారా నా ధర్మాన్ని కర్తవ్యాన్ని నిర్వహించా. సుప్రీంకోర్టు తీర్పుతో సామరస్య వాతావరణంలో అయోధ్య రామమందిర నిర్మాణం జరగడం శుభపరిణామం. ఈ సామరస్యపూర్వక వాతావరణం భారతీయుల మధ్య కలకాలం నిలబడాలి. భారతీయ నాగరికత వారసత్వానికి రాముడు ఒక ఆదర్శం. రామమందిర నిర్మాణం రామరాజ్యానికి ఆదర్శంగా నిలవాలి. సుపరిపాలన, అందరికీ న్యాయం, సిరి సంపదలకు రామ రాజ్యమే ఒక ఉదాహరణ. రాముడి సద్గుణాలను అందరూ అలవర్చుకోవాలి’ అని వ్యాఖ్యానించారు. కాగా అద్వానీతో పాటు మురళీమనోహర్ జోషీతో పాటు మరికొందరు వీడియో కన్ఫరెన్స్ ద్వారా భూమి పూజ కార్యక్రమానికి హాజరుకానున్నారు. -
భూమిపూజకు అడ్వాణీ, జోషిలకు ఫోన్లో ఆహ్వానం
న్యూఢిల్లీ: అయోధ్యలో ఆగస్టు 5న నిర్వహించే రామ మందిరం భూమి పూజకు భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు ఎల్కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషిని తప్పనిసరిగా ఆహ్వానిస్తామని రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు వర్గాలు శనివారం వెల్లడించాయి. ఇతర నాయకుల తరహాలోనే వారిద్దరికీ ఫోన్ ద్వారా ఆహ్వానం పలుకుతామని పేర్కొన్నాయి. అడ్వాణీ, జోషి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భూమిపూజ కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం. కరోనా వైరస్ వ్యాప్తితోపాటు ఆరోగ్య కారణాల రీత్యా వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆహ్వానాల వ్యవహారాన్ని ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్ పర్యవేక్షిస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి ఉమా భారతి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్‌కు శనివారం ఆహ్వానాలు అందాయి. భూమి పూజకు తాము కచ్చితంగా హాజరవుతామని వారు పేర్కొన్నారు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో అడ్వాణీ, జోషీ, ఉమా భారతి ప్రధాన నిందితులన్న సంగతి తెలిసిందే. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, బిహార్ సీఎం నితీశ్ కుమార్ కూడా అయోధ్యలో భూమిపూజ మహోత్సవానికి హాజరు కానున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వీఐపీ అతిథుల జాబితాను 50 మందికి కుదించినట్లు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు తెలియజేసింది. భవ్య రామ మందిరం భూమిపూజకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఘనమైన ఏర్పాట్లు చేస్తోంది. భూమిపూజ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మరో నలుగురు నాయకులు వేదికను పంచుకోనున్నారు. ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్, రామ జన్మభూమి న్యాస్ చీఫ్ నృత్యగోపాల్ దాస్తోపాటు మరో ఇద్దరు వేదికపై ఉంటారు. -
అద్వానీ, జోషిలకు అందని ఆహ్వానం
న్యూఢిల్లీ: అయోధ్యలో రామమందిర నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఆగస్టు 5న ప్రధాని మోదీ చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం జరగనుంది. అందుకోసం ఏర్పాట్లను ముమ్మరం చేశారు. కరోనా నేపథ్యంలో ఎక్కువ మందిని ఆహ్వానించకూడదని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు నిర్ణయించింది. కేవలం 150 మంది అతిథులు సహా 200 మంది మాత్రమే కార్యక్రమంలో పాల్గొంటారని వెల్లడించింది. రామ మందిరం అనగానే మొదటగా మనకు గుర్తొచ్చే పేర్లలో మొదటి వరుసలో ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి, కళ్యాణ్‌సింగ్ ఉంటారు. వీరి ఆధ్వర్యంలో అయోధ్యలో రామమందిరం కట్టాలన్న డిమాండ్‌తో 1990లో అద్వానీ చేపట్టిన రథయాత్ర బీజేపీని మరింత ఎత్తున నిలబెట్టాయి. అయితే రామమందిర భూమి పూజ కార్యక్రమానికి బీజేపీ అగ్ర నాయకులు ఎల్కే అద్వానీ, ఎమ్ఎమ్ జోషిలకు ఆహ్వానం అందకపోగా.. మాజీ కేంద్రమంత్రి ఉమాభారతి, మాజీ గవర్నర్ కళ్యాణ్ సింగ్‌లకు మాత్రమే ఆహ్వానం అందింది. ఈ వివాదంలో ఈ ఇద్దరు నేతలు సీబీఐ విచారణను సైతం ఎదుర్కొన్నారు. బాబ్రీ మసీదు వివాదంలో వీరంతా కోర్టు ముందు కూడా హాజరయ్యారు. అటువంటి అగ్రశ్రేణి నాయకులకు ఆగస్టు 5న జరిగే రామ మందిరం శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానం అందలేదు. ఇప్పటివరకు రూపొందించిన షెడ్యూల్‌లోకానీ, వేదికపై కూర్చొనే ఆహ్వానితుల జాబితాలో కానీ వారి పేర్లు ఎక్కడా కనిపించలేదు. -
ఎల్.కె. అడ్వాణీ (బీజేపీ లీడర్) రాయని డైరీ
నెమ్మదిగా వెళ్లి వీడియో కాన్ఫరెన్సింగ్ రూమ్‌లో కూర్చున్నాను. అటువైపు సీబీఐ స్పెషల్ జడ్జి స్క్రీన్ మీద కనిపిస్తున్నాడు. అతడు ఉన్నది లక్నోలో. నేను ఉన్నది ఢిల్లీలో. ‘‘మొదలు పెడదామా మిస్టర్ అడ్వాణీ..’’ అన్నాడు. జడ్జి వైపు చూశాను. ‘‘మిస్టర్ అడ్వాణీ, చెప్పండి.. ఆ రోజు కరసేవకుల్ని రెచ్చగొట్టి మీరే కదా అయోధ్యలోని బాబ్రీ మసీదు ధ్వంసం అవడానికి ప్రేరణ అయ్యారు?’’ అన్నాడు నేరుగా నన్ను గుచ్చి చూస్తూ! అతడెలా అడిగాడంటే.. నా కళ్లలో ఇప్పటికీ కరసేవకులు గునపాలతో ఆ కట్టడాన్ని కూలగొడుతున్న దృశ్యం కనిపిస్తున్నట్లుగా అడిగాడు. ‘‘మీరు ఏ కట్టడం గురించి అడుగుతున్నారో ఆ కట్టడం గురించి నాకసలు ఏమీ తెలీదు. అడ్వాణీకి తెలుసు అని మీతో ఎవరైనా చెప్పి ఉంటే, లేదా మీకై మీరు ఊహించి ఉంటే మీరు విన్నది నిజం కాదు. మీ ఊహా ఎటూ నిజం కాబోదు..’’ అని చెప్పాను. జడ్జి ఒక్క క్షణం ఆగాడు. ‘‘మిస్టర్ అడ్వాణీ.. మిమ్మల్ని నేను అడగవలసిన ప్రశ్నలు ఇంకా ఒక వెయ్యీ నలభై తొమ్మిది ఉన్నాయి. నా ప్రతి ప్రశ్నకూ మీరు ఒక వెయ్యీ యాభై సమాధానాలు ఇచ్చుకుంటూ పోతుంటే కొన్ని గంటల్లోనో, కొన్ని రోజుల్లోనో, కొన్ని సంవత్సరాల్లోనో మేము మీ నుంచి స్టేట్మెంట్ తీసుకోలేం. ఆగస్టు 31 లోపు మా విచారణ పూర్తవాలని సుప్రీంకోర్టు మమ్మల్ని ఆదేశించింది కనుక మేము మిమ్మల్ని అడిగే ప్రశ్నలకు మీరు మాకిచ్చే సమాధానాలను ఉప ప్రశ్నలు ఉత్పన్నం కాకుండా పరిమితం చేసుకోవడం వల్ల ఈ తొంభై రెండేళ్ల వయసులో మీరు మీ మధ్యాహ్న భోజనాన్ని వేళ తప్పకుండా తీసుకునేందుకు కూడా ఎలాంటి అంతరాయమూ ఏర్పడబోదని నేను భావిస్తున్నాను’’ అన్నాడు!! ‘‘ఢిల్లీలో నా భోజన వేళల గురించి లక్నోలో ఉండి ఆలోచిస్తున్నందుకు ధన్యవాదాలు మిస్టర్ జస్టిస్. ప్రశ్నలూ సమాధానాలు అనేవి అడగడాన్ని బట్టి, చెప్పడాన్ని బట్టి తమ విస్తృతిని, సుదీర్ఘతను కలిగి ఉండవు. వాటిని కుదించుకోవడంలో ప్రావీణ్యం లేకపోవడం వల్లనే అవి విస్తరిస్తాయి. నన్ను అడిగేందుకు మీ దగ్గర సిద్ధంగా ఉన్న ఒక వెయ్యీ యాభై ప్రశ్నలన్నిటికీ నేను ఇవ్వవలసిన సమాధానాలను రెండంటే రెండే సమాధానాలుగా కుదించుకోగలను. నా రెండు సమాధానాలకు తగ్గట్లు మీరు మీ ఒక వెయ్యీ యాభై ప్రశ్నలను రెండంటే రెండే ప్రశ్నలుగా కుదించుకోగలరా? అప్పుడు లక్నోలో మీ భోజనం వేళల గురించి కూడా ఢిల్లీ నుంచి నేను ఆందోళన చెందవలసిన పని ఉండదు..’’ అన్నాను. జడ్జి ముఖం అప్రసన్నం అయింది. ‘‘మిస్టర్ అడ్వాణీ.. సులువుగా పని చేయడం ఒకటి ఉంటుంది. పద్ధతిగా పని చేయడం ఒకటి ఉంటుంది. సులువైన పద్ధతిలోకి వెళ్లామంటే సులువు అవడం కోసం పద్ధతి తప్పుతున్నామనే. సీబీఐ ఎప్పుడూ అలా చేయదు. చెప్పండి. నా రెండో ప్రశ్న.. మసీదు కూల్చివేతకు రెండేళ్ల ముందు మీరు అరెస్టు అయ్యారు. మిమ్మల్ని అరెస్ట్ చేసినందుకు కరసేవకులు భారత్ బంద్‌కు పిలుపు ఇచ్చారు. ఇవన్నీ కూల్చివేత కుట్రలో భాగమైన పరిణామాలే కదా..’’ అన్నాడు! ‘‘నేనే కుట్రా పన్నలేదు. నా మీదే కుట్రలు పన్నారు’’ అని చెప్పాను. ‘‘ఇవేనా.. రెండుగా కుదించుకున్న మీ సమాధానాలు?’’ అనేసి, లంచ్కేమో లేచాడు. డెబ్బై ఐదేళ్ల వయసులో డిప్యూటీ పీఎంగా ఉన్నప్పుడు నా దగ్గర ఎన్ని సమాధానాలైతే ఉన్నాయో.. ఈ తొంభై రెండేళ్ల వయసులోనూ అన్నే సమాధానాలు ఉన్నాయి. సీబీఐయ్యే అనవ సరంగా ప్రశ్నలు పెంచుకుంటూ వస్తోంది. -మాధవ్ శింగరాజు -
‘ఉరి తీసినా ఆశీర్వాదంగానే భావిస్తాను’
న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో తీర్పు గురించి తనకు ఎలాంటి పట్టింపు లేదన్నారు బీజేపీ నాయకురాలు ఉమా భారతి. తీర్పు ఎలా ఉన్నా.. దాన్ని అంగీకరిస్తానని ఆమె తెలిపారు. ఈ కేసులో కుట్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నాయకులలో ఉమా భారతి, ఎల్కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఉమా భారతి మాట్లాడుతూ.. ‘నా స్టేట్మెంట్ కోసం కోర్టు నన్ను పిలిచింది. నిజం ఏంటో కోర్టుకు వెల్లడించాను. ఇక తీర్పు ఎలా వస్తుంది అనే దాని గురించి నాకు చింత లేదు. ఒక వేళ నన్ను ఉరి తీయాలనుకున్నా.. దాన్ని కూడా నేను ఆశీర్వాదంగానే భావిస్తాను. నా స్వస్థలంలో కూడా ఎంతో ఆనందిస్తారు’ అని తెలిపారు. (5 శతాబ్దాల సమస్య!) ఉమా భారతి ఈ నెల ప్రారంభంలో లక్నోలోని ప్రత్యేక సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ప్రముఖ బీజేపీ నాయకుడు ఎల్కే అడ్వాణీ (92) శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరుకాగా.. మురళీ మనోహర్ జోషి గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో తన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. సీబీఐ కోర్టు, రోజువారీ విచారణల ద్వారా, దర్యాప్తును పూర్తి చేసి, ఆగస్టు 31 లోగా తన తీర్పును ఇవ్వాలి.(బాబ్రీ మసీదు కేసులో కొత్త మలుపు) రామ మందిరం నిర్మాణం గురించి శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలపై ఉమా భారతి స్పందించారు. ‘కరోనా, మందిర నిర్మాణం ఈ రెండు అంశాలకు అసలు ఎలాంటి సంబంధం లేదు. వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు కోవిడ్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. వీరితో ఎలాంటి సంబధం లేని ట్రస్ట్ ఆలయ నిర్మాణం చేపడుతోంది. పవార్ వ్యాఖ్యలు వ్యతిరేక అర్థాన్ని సూచిస్తాయి. ఎలాంటి గొడవ జరగకుండా మందిర నిర్మాణం జరగడం వారికి నచ్చడం లేదు. ఆ ఆందోళనలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. మోదీ జీ అయోధ్యలో ఉన్నప్పుడు పవార్ జీ.. ‘జై శ్రీరామ్.. జై రామ్’ అని పాడాలని నేను కోరుకుంటున్నాను’ అన్నారు ఉమా భారతి. -
బాబ్రీ కేసులో సీబీఐ కోర్టు ముందుకు అడ్వాణీ
న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ప్రముఖ బీజేపీ నాయకుడు, మాజీ ఉప ప్రధాని, 92 ఏళ్ళ ఎల్కే అడ్వాణీ సీబీఐ ప్రత్యేక కోర్టు ఎదుట హాజరవగా, ఆయన స్టేట్మెంట్ని రికార్డు చేశారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు, నాలుగున్నర గంటలపాటు జరిగిన ఈ విచారణలో, ఎల్కే అడ్వాణీని సీబీఐ ప్రత్యేక కోర్టు 100కు పైగా ప్రశ్నలను అడిగింది. అడ్వాణీ తనపై వచ్చిన అన్ని ఆరోపణలను తిరస్కరించారని, ఆయన తరఫు న్యాయవాది వెల్లడించారు. బుధవారం హోం మంత్రి అమిత్‌షా, ఎల్కే అడ్వాణీతో అరగంట పాటు సమావేశమయ్యారు. రోజువారీ విచారణ చేస్తున్న కోర్టు, ఆగస్టు 31లోగా తీర్పును ప్రకటించాల్సి ఉంది. -
బాబ్రీ కేసు : అద్వానీపై ప్రశ్నల వర్షం
లక్నో : భారత మాజీ ఉప ప్రధానమంత్రి, బీజేపీ కురవృద్ధుడు ఎల్కే అద్వానీపై సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ప్రశ్నల వర్షం కురిపించింది. 1992 బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించి.. సీబీఐ కోర్టు శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అద్వానీ వాంగూల్మం నమోదు చేసింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల మధ్యలో దాదాపు నాలుగున్నర గంటల పాటు ఈ కేసు విచారణ కొనసాగింది. ఈ క్రమంలో న్యాయమూర్తి అద్వానీని 100 ప్రశ్నలు అడిగినట్టు ఆయన తరఫున లాయర్ తెలిపారు. అయితే ఈ సందర్భంగా తనపై ఉన్న ఆరోపణలను అద్వానీ ఖండించినట్టు వెల్లడించారు. (జోషి వాంగ్మూలం నమోదు చేసిన సీబీఐ కోర్టు) ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం గురువారం బీజేపీ సీనియర్ నాయకులు మురళీ మనోహర్ జోషి వాంగ్మూలం నమోదు చేసిన సంగతి తెలిసిందే. సీఆర్పీసీ సెక్షన్ 313 కింద ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మొత్తం 32 మంది తమ వాదనలను వినిపించవచ్చని న్యాయమూర్తి ఇదివరకే పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగా, బాబ్రీ మసీదు కూల్చివేత కేసును ఆగస్టు 31 లోగా పూర్తి చేయాలని లక్నో సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తిని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గడువులోగా విచారణ పూర్తిచేసి, తీర్పు వెలువరించేందుకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం రోజువారి విచారణ చేపడుతోంది. (నదిలో మధ్యలో సెల్ఫీ దిగుదామనుకుంటే..) మరోవైపు కోర్టు ముందు వాంగ్మూలం వినిపించడానికి రెండు రోజుల ముందు అద్వానీ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమైన సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య భేటీ దాదాపు 30 నిమిషాల పాటు సాగింది. -
జోషి వాంగ్మూలం నమోదు చేసిన సీబీఐ కోర్టు
-
జోషి వాంగ్మూలం నమోదు చేసిన సీబీఐ కోర్టు
లక్నో : బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనకు సంబంధించి సీబీఐ ప్రత్యేక న్యాయ స్థానం బీజేపీ కురవృద్ధుడు మురళీ మనోహర్ జోషి వాంగ్మూలం నమోదు చేసింది. ప్రత్యేక న్యాయమూర్తి ఎస్కే యాదవ్.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జోషి వాంగ్మూలాన్ని తీసుకున్నారు. ఇదే కేసుకు సంబంధించి శుక్రవారం మాజీ ఉప ప్రధానమంత్రి ఎల్కే అద్వానీ వాంగ్మూలం కూడా రికార్డు చేయనున్నారు. కాగా, సీఆర్పీసీ సెక్షన్ 313 కింద ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మొత్తం 32 మంది తమ వాదనలను వినిపించవచ్చని న్యాయమూర్తి పేర్కొన్న సంగతి తెలిసిందే.(మధ్యప్రదేశ్ మంత్రికి సోకిన కరోనా) బాబ్రీ మసీదు కూల్చివేత కేసును ఆగస్టు 31 లోగా పూర్తి చేయాలని లక్నో సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తిని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. నిర్ణీత గడువు లోగా విచారణ పూర్తి చేసి తుది తీర్పు వెలువరించాలని సూచించింది. ఈ నేపథ్యంలో గడువులోగా విచారణ పూర్తిచేసేందుకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం రోజువారి విచారణ చేపడుతోంది. ఈ కేసులో బీజేపీ అగ్రనేతలు ఎల్కే అద్వానీ, అశోక్ సింఘాల్, మురళీ మనోహర్ జోషీ, ఉమాభారతి.. వంటివారి పేర్లు ఉన్నాయి. కరసేవకులను రెచ్చగొట్టి మసీదును కూల్చివేశారని వీరు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.(పిల్లల కోసం ఆ కాస్త ఆసరా వదిలేశాడు!) -
వృద్ధ నేతను వెంటాడుతున్న బాబ్రీ విధ్వంసం
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ కురు వృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ (92) తన రాజకీయ జీవితంలో వింత పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. జనతా పార్టీ బీజేపీగా మార్పు, ఎదుగుదలలో కీలకంగా వ్యవహరించి అయోధ్య రామందిరం కోసం చేసిన కృషి, పోరాటం ప్రతి ఒక్కరికీ తెలిసిందే. అయితే 1992 నాటి బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో నిందితులుగా ఉన్న అద్వానీ.. ఆ కేసు నుంచి బయటపడేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన అనంతరం రాష్ట్రపతి పదవికి సీనియర్ నేతను నామినేట్ చేస్తారని అంతా ఊహించారు. కానీ మోదీ సర్కార్ మాత్రం ఆ సాహసం చేయలేకపోయింది. ఓ విధంగా అద్వానీకి ఊహించని షాక్‌గానే పలువురు వర్ణించారు. కేసుల కారణంగనే ఆయనకు ఆ పదవి దక్కలేదని కొందరు విశ్లేషించారు. బాబ్రీ కేసులో వాంగ్మూలం.. అద్వానీ చిరకాల స్వప్నం అయోధ్య మందిర నిర్మాణ భూమి పూజ కార్యక్రమానికి ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. ఆగస్ట్ 3 లేదా 5న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునాది రాయిని వేయనున్నారు. దీని కోసం ఆలయ ట్రస్ట్ ఇప్పటికే మోదీకి ప్రత్యేక ఆహ్వానాన్ని సైతం పంపింది. ఆయనతో మరో 50 మందిని సైతం ఆహ్వానించనున్నట్లు కమిటీ తెలిపింది. ఈ నేపథ్యంలోనే బాబ్రీ కుట్రలో కేసులో ఎల్కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి తదితరుల వాంగ్మూలాల నమోదుకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తేదీలను ఖరారు చేసింది. ఈనెల 23వ తేదీన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వినిపించే వాంగ్మూలాలను న్యాయస్థానం నమోదు చేయనుందని ప్రత్యేక న్యాయమూర్తి ఎస్.కె.యాదవ్ తెలిపారు. ఈ కేసుతో సంబంధమున్న మొత్తం 32 మంది తమ వాదనను వినిపించవచ్చన్నారు. (బాబ్రీ విధ్వంసం: విచారణ ఆపండి) కేసు కొట్టేయండి.. ఈ క్రమంలో అద్వానీ, మురళి మనోహర్ జోషిపై నమోదైన బాబ్రీ మసీదు కేసును కొట్టేయాల్సిందిగా బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి భూమిపూజ చేసే సమయంలోపు ఈ కేసును కొట్టేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. అద్వానీ, జోషి, ఇతర బీజేపీ నాయకులు బాబ్రీ మసీదును కూల్చారని కొంతమంది ఆరోపిస్తున్నారని, కానీ ఈ ఘటనతో వాళ్లకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఆలయ పునర్నిర్మానానికే పనిచేసినట్లు వెల్లడించారు. మరోవైపు అయోధ్యలోని బాబ్రీ మసీదు కూల్చివేత కేసు విచారణను మూసివేస్తే మంచిదని ‘రామ జన్మభూమి’ కేసులో ప్రధాన పిటిషనర్ అయిన ఇక్బాల్ అన్సారీ లక్నో సీబీఐ కోర్టుని కోరారు. అయోధ్య భూ వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇప్పటికే తుది తీర్పును వెలువరించిందని, ఈ సమయంలో మళ్లీ బాబ్రీ మసీదు కూల్చివేతపై విచారణ చేపట్టడం అంత మంచిది కాదని అభిప్రాయపడ్డారు. సున్నితమైన అంశం కాబట్టి సీబీఐ తీర్పు దేశంలో మరోసారి రాజకీయ వైరుధ్యాలకు దారితీసే అవకాశం ఉందని పేర్కొన్నారు. తుది తీర్పుకు గడువు.. మరోవైపు బాబ్రీ విధ్వంసం కేసు విచారణను వీలైనంత త్వరగా పూర్తి చేసి.. తుది తీర్పును వెలువరించాలని సుప్రీంకోర్టు ఇటీవల లక్నో సీబీఐ న్యాయస్థానాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఆగస్ట్ ఆగస్ట్ 31లోపు విచారణను పూర్తిచేయాలని గడువు విధించింది. ఈ నేపథ్యంలో సీబీఐ కోర్టు తీర్పుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో అద్వానీతో పాటు, సీనియర్ నేతలు మురళీ మనోహర్ జోషి, కళ్యాన్ సింగ్, ఉమా భారతి వంటి పలువురు నేతలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. -
బాబ్రీ కేసును మూసివేయాలి : స్వామి
సాక్షి, న్యూఢిల్లీ : బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో బీజేపీ దిగ్గజ నేత ఎల్కే అద్వానీని ఆ పార్టీ నేత సుబ్రహ్మణ్య స్వామి సమర్ధించారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమం చేసేలా సుప్రీంకోర్టు గత ఏడాది నవంబర్‌లో తీర్పు వెలువరించిన బాబ్రీ కేసు మాత్రం అద్వానీ, మురళీమనోహర్ జోషీ వంటి బీజేపీ నేతలను వెంటాడుతోంది. 1992 మసీదు విధ్వంసం కేసుకు సంబంధించి స్టేట్మెంట్ రికార్డు చేసేందుకు తమ ఎదుట హాజరుకావాలని సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం 92 ఏళ్ల అద్వానీకి సమన్లు జారీ చేయడంపై సుబ్రహ్మణ్య స్వామి మంగళవారం స్పందించారు. మూడు దశాబ్ధాల కిందట దేశవ్యాప్తంగా కలకలం రేపిన బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనను స్వామి సమర్ధిస్తూ ఈ కేసును మూసివేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. బాబ్రీ ఘటనలో వారు పాలుపంచుకుంటే ఆ స్ధలంలో ఆలయ పునర్మిర్మాణానికి సాయపడతారని అన్నారు. అయోధ్య రామ జన్మభూమిలో మందిర నిర్మాణానికి శంకుస్ధాపన జరుగుతున్న నేపథ్యంలో వృద్ధ నేతలు అద్వానీ, మురళీమనోహర్ జోషీలను అయోథ్యకు తీసుకువెళ్లేముందు వారిపై ఉన్న వెర్రి కేసును మూసివేసేలా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉత్తర్వులు జారీ చేయాలని సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్ చేశారు. ఆగస్ట్ 5న అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి శంకుస్ధాపన కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొంటారు. కాగా 1992 డిసెంబర్ 6న అయోధ్యలో బాబ్రీమసీదును కరసేవకులు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. మసీదు నిర్మించిన చోట ఆలయం ఉందనే వాదనతో మసీదును నేలమట్టం చేశారు. ఎల్కే అద్వానీ, మురళీమనోహర్ జోషీలు అప్పట్లో రామమందిర ఉద్యమానికి నేతృత్వం వహించారు. బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనలో వీరితో పాటు బీజేపీ ప్రముఖ నేతలు అశోక్ సింఘాల్, ఉమాభారతి.. వంటివారి పేర్లు ఉన్నాయి. కరసేవకులను రెచ్చగొట్టి మసీదును కూల్చివేశారని వీరు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. చదవండి : అద్వానీ వాంగ్మూలం తీసుకోనున్న సీబీఐ కోర్టు -
అద్వానీ వాంగ్మూలం తీసుకోనున్న సీబీఐ కోర్టు
లక్నో : బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ కీలక నేతల వాంగ్మూలం నమోదు చేసేందుకు రంగం సిద్ధమైంది. బీజేపీ సీనియర్ నాయకులు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషిల స్టేట్మెంట్లను రికార్డు చేసేందుకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తేదీలు ఖరారు చేసింది. జూలై 23న మురళీ మనోహర్ జోషి, జూలై 24న అద్వానీల వాదనలు రికార్డు చేయనున్నట్టు తెలిపింది. ఈ మేరకు స్పెషల్ జడ్జ్ జస్టిస్ ఎస్కే యాదవ్ సోమవారం ఉత్తర్వులు వెలువరించారు. సీఆర్పీసీ సెక్షన్ 313 కింద అద్వానీ, జోషిల వాంగ్మూలం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రికార్డు చేయనున్నట్టు పేర్కొన్నారు. (బాబ్రీ మసీదు కేసులో కొత్త మలుపు) మరోవైపు బాబ్రీ మసీదు కూల్చివేత కేసును ఆగస్టు 31 లోగా పూర్తి చేయాలని లక్నో సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తిని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. నిర్ణీత గడువు లోగా విచారణ పూర్తి చేసి తుది తీర్పు వెలువరించాలని సూచించింది. ఈ నేపథ్యంలో గడువులోగా విచారణ పూర్తిచేసేందుకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం రోజువారి విచారణ చేపడుతోంది. కాగా, బాబ్రీ మసీదు కేసులో బీజేపీ అగ్రనేతలు ఎల్కే అద్వానీ, అశోక్ సింఘాల్, మురళీ మనోహర్ జోషీ, ఉమాభారతి.. వంటివారి పేర్లు ఉన్నాయి. కరసేవకులను రెచ్చగొట్టి మసీదును కూల్చివేశారని వీరు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. -
ఎల్.కె. అద్వానీ.. రాయని డైరీ
రాహుల్ గాంధీకి లైన్ కలపమని చెప్పి కొన్ని ఏళ్లు అయినట్లుగా ఉంది. ‘‘ఏమైంది, దొరకట్లేదా?’’ అన్నాను. ‘అయ్యో అద్వానీజీ.. మీకు ఇప్పటికే కనీసం కొన్నిసార్లు చెప్పి ఉంటాను. రాహుల్జీ కొన్నాళ్లుగా రఘురామ్ రాజన్, అభిజిత్ బెనర్జీలతో ఉంటున్నారట’ అన్నాడు నాకు కేటాయించబడిన యువ సహాయకుడు. తొంభై ఏళ్లు పైబడిన వ్యక్తికి తొంభై ఏళ్లు పైబడిన సహాయకుడు మాత్రమే ఉపకరించే సహాయకుడిలా ఉండగలడేమో! అభిజత్ బెనర్జీ కోల్‌కతాలో ఉన్నట్లు విన్నాను. రాజన్ ఈ మధ్య భోపాల్ వెళ్లినట్లున్నాడు. రాహుల్ వేయనాడ్లో ఉండాలి. అక్కడ లేకపోతే ఢిల్లీలో ఉండాలి. ఈ ముగ్గురూ ఎక్కడ కలుసుకుంటున్నట్లు! లాక్డౌన్లో గాయపడిన ఎకానమీకి కట్టు కడతానని దూది, గాజుగుడ్డ, టించరు బాటిలు పట్టుకుని కొన్నాళ్లుగా తిరుగుతున్నాడు రాజన్. అభిజిత్‌కి ఆర్థికశాస్త్రంలో నోబెల్ వచ్చింది కాబట్టి తనూ ఏదో ఒకటి పట్టుకుని తిరగాలి. వాళ్లిద్దర్నీ పట్టుకున్నట్లున్నాడు రాహుల్. లాక్డౌన్ అని మూత వేసుకుని కూర్చుంటే నెలాఖరు తర్వాత అకౌంట్లో తెరిచి చూసుకోడానికి ఏముంటుంది అని మోదీజీ అడగడానికి రాహుల్ వాళ్లిద్దరితో ఉంటున్నట్లుంది. అయినా ఉండటమేంటి! అదే అడిగాను నా యువ సహాయకుడిని. ‘‘జూమ్ వీడియోలో ఉంటున్నారట అద్వానీజీ’’ అన్నాడు. మళ్లీ ఒకసారి రాహుల్ కోసం ప్రయత్నించమని చెప్పాను. ‘నాకు నిద్ర వచ్చేలోపు ప్రయత్నించు’’ అని కళ్లు మూసుకున్నాను. ‘‘అద్వానీజీ.. లైన్లో రాహుల్జీ’’ అన్నాడు యువ సహాయకుడు! నన్ను నిద్రపోనివ్వకూడదనుకుని నేను నిద్రపోయే వరకు వేచి ఉండి అప్పుడు లైన్లోకి వచ్చాడా ఏంటి! ఫోన్ తీసుకున్నాను. ‘‘నమస్తే అద్వానీజీ’’ అన్నాడు. ‘‘నమస్తే రాహుల్ బాబు. చక్కగా మాట్లాడుతున్నావు ఈ మధ్య. చక్కగా కూడా కనిపిస్తున్నావు. కుర్తా పైజమా మీదకు ఆ నల్లటి జాకెట్ ఉండటం లేదిప్పుడు. రిలీఫ్‌గా ఉంది నిన్ను అలా చూస్తుంటే..’’ అన్నాను. రాహుల్ నవ్వాడు. ‘‘థ్యాంక్యూ అద్వానీజీ. ఎందుకు కాల్ చేయించారు’’ అన్నాడు. ‘‘ఏం లేదు. నేను, జోషి, ఉమ, కల్యాణ్.. జూమ్‌లో కలుసుకుంటున్నాం. నువ్వూ కలుస్తావేమోనని’’ అన్నాను. ‘‘ఓ.. బాబ్రీ కూల్చివేత కేసు! ఆగస్టులోపు తేల్చేయమంది కదా కోర్టు. అయినా అద్వానీజీ.. స్థలం ఎవరిదన్నది తేలిపోయాక, కూల్చిందెవరన్నది మాత్రం తేలిపోకుండా ఉంటుందా?’’ అన్నాడు రాహుల్. ‘‘మంచి మాట చెప్పావు రాహుల్ బాబు. జూమ్‌కి కనెక్ట్ అవుతావా.. నేను, నువ్వు, జోషి, ఉమ, కల్యాణ్ మాట్లాడుకుందాం’’ అన్నాను. ‘‘అది మీ పర్సనల్ విషయం కదా అద్వానీజీ. నేనెందుకు స్క్రీన్ పైకి రావడం?’’ అన్నాడు. ‘‘మా నలుగురిదీ ఒక పర్సనల్ విషయం. నాదొక్కటే ఒక పర్సనల్ విషయం రాహుల్ బాబూ. నీకు చేతులు జోడిస్తే ఫోన్లో నీకు కనిపించదు కదా. అందుకే నిన్నూ కలవమని అడుగుతున్నా..’’ అన్నాను. ‘‘అద్వానీజీ!! మీరు నాకు చేతులు జోడించడం ఏమిటి? పెద్దవాళ్లు మీరు’’ అన్నాడు ఆశ్చర్యం కలిసిన గొంతుతో. ‘‘ఆ మాట అనొద్దనే నీకు చేతులు జోడించాలనుకుంటున్నా రాహుల్ బాబూ. కరోనా వల్ల ప్రమాదం పెద్దవాళ్లకే గానీ, మిగతా వాళ్లకేమీ భయం లేదని ప్రచారం చెయ్యమని మోదీజీకి చెబుతున్నావు. పెద్దవాళ్లకు కదా ధైర్యం చెప్పాల్సింది’’ అన్నాను. ‘‘ఓ.. సారీ అద్వానీజీ. ఎకానమీ బతికితే చాలనుకున్నాను. ఈ యాంగిల్ నాకు తట్టలేదు’’ అన్నాడు!! -మాధవ్ శింగరాజు -
బాబ్రీ మసీదు కేసులో కొత్త మలుపు
సాక్షి, న్యూఢిల్లీ : హిందూవులు చిరకాల స్వప్నం అయోధ్య రామమందిర నిర్మాణానికి ఓ వైపు అడుగులు పడుతున్న వేళ.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను జారీచేసింది. బాబ్రీ మసీదు కూల్చివేత కేసును ఆగస్ట్ 31లోపు పూర్తి చేయాలని లక్నో సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తిని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. విచారణ పూర్తి చేసి తుది తీర్పును కూడా వెలువరించాలని కోర్టు తెలిపింది. ఈ కేసులో బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ, అశోక్ సింఘాల్, మురళీ మనోహర్ జోషీ, ఉమాభారతి, వినయ్ కటియార్, గిరిరాజ్ కిషోర్, నాటి యూపీ సీఎం కళ్యాణ్‌సింగ్ కూడా ఉన్నారు. కరసేవకులను రెచ్చగొట్టి కుట్రపూరితంగానే మసీదును కూల్చివేశారని (కుట్ర) ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దాదాపు 28 ఏళ్ల పాటు కోర్టుల్లో విచారణ సాగుతున్న ఈ కేసును సుప్రీంకోర్టు తాజాగా తెరపైకి తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది. (అయోధ్య తీర్పు: అద్వానీకి జైలుశిక్ష తప్పదా?) అయోధ్య వివాదంపై తీర్పును వెలువరిస్తున్న సమయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ తీర్పును వెలువరిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ‘1992 డిసెంబర్ 6న కరసేవకులు వివాదాస్పద బాబ్రీ మసీదును కూల్చివేశారు. ఇది ముమ్మాటికి చట్ట విరుద్ధం. మసీదును ధ్వసం చేసి ఇస్లామిక్ మూలాలను దెబ్బతీయడానికి ప్రయత్నించారు. ముస్లిం వర్గాలకు ఖచ్చితంగా న్యాయం జరగాల్సింది’ అంటూ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో విచారణను ముగించాలని సుప్రీంకోర్టు సీబీఐ కోర్టును ఆదేశించింది. (5 శతాబ్దాల సమస్య!) సీబీఐ కేసులో బీజేపీ అగ్రనేతలు.. 1992 డిసెంబర్ 6న సాయంత్రం (బాబ్రీ మసీదు కూల్చివేత) స్థానిక పోలీస్ స్టేషన్లో 198/92 నెంబర్‌తో మరో ఎఫ్ఐఆర్ నమోదైంది. వీరిలో బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ, అశోక్ సింఘాల్, మురళీ మనోహర్ జోషీ, ఉమాభారతి, వినయ్ కటియార్, గిరిరాజ్ కిషోర్, నాటి యూపీ సీఎం కళ్యాణ్‌సింగ్ కూడా ఉన్నారు. అయితే 2003 సెప్టెంబర్ 19న రాయ్‌బరేలీలోని స్పెషల్ మెడిస్ట్రేట్ అద్వానీ, జోషీలకు విచారణ నుంచి విముక్తి కల్పించింది. అయితే దీనిపై పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. 2017లో తీర్పును వెలువరిస్తూ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న అద్వానీ, జోషీ, ఉప భారతి, కళ్యాణ్ సింగ్‌లను కూడా విచారించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. దీంతో సీబీఐ వీరందరినీ విచారించనుంది. కేసు విచారణ తుది దశతో ఉన్న నేపథ్యంలో.. నేరం రుజువైతే శిక్ష కూడా పడే అవకాశం ఉన్నట్లు న్యాయ నిపుణులు చెబుతున్నారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_381238725.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
అయోధ్య తీర్పు: అద్వానీకి జైలుశిక్ష తప్పదా?
సాక్షి, న్యూఢిల్లీ: దశాబ్దాలుగా సాగుతున్న అయోధ్య రామమందిర-బాబ్రీ మసీదు వివాదాస్పద భూ వివాదంపై సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పును వెలువరించడంతో దేశ వ్యాప్తంగా హిందూసంఘాలతో పాటు అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రెండు వర్గాల మధ్య నలుగుతూ వస్తున్న వివాదానికి ముగింపు పలికి.. న్యాయ వ్యవస్థ సరికొత్త చరిత్రను సృష్టించిందని సంబరపడుతున్నారు. అయోధ్య వివాదంపై తీర్పును వెలువరిస్తున్న సమయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం చేసిన వాఖ్యలు పలువురి గుండెల్లో రైలు పరిగెత్తుస్తున్నాయి. ‘1992 డిసెంబర్ 6న కరసేవకులు వివాదాస్పద బాబ్రీ మసీదును కూల్చివేశారు. ఇది ముమ్మాటికి చట్ట విరుద్ధం. మసీదును ధ్వసం చేసి ఇస్లామిక్ మూలాలను దెబ్బతీయడానికి ప్రయత్నించారు. ముస్లిం వర్గాలకు ఖచ్చితంగా న్యాయం జరగాల్సింది’ అంటూ ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూ కోర్టులో 27 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సీబీఐ కేసుపై పడింది. బాబ్రీ మసీదు కూల్చివేశారన్న ఆరోపణలతో 40 మంది సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత మరికొంత మందిపై చార్జ్‌షీట్ దాఖలు చేసింది. (‘అయోధ్య’ రామయ్యదే..!) సీబీఐ కేసులో అద్వానీ.. 1992 డిసెంబర్ 6న సాయంత్రం స్థానిక పోలీస్ స్టేషన్లో 198/92 నెంబర్‌తో మరో ఎఫ్ఐఆర్ నమోదైంది. వీరిలో బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ, అశోక్ సింఘాల్, మురళీ మనోహర్ జోషీ, ఉమాభారతి, వినయ్ కటియార్, గిరిరాజ్ కిషోర్, నాటి యూపీ సీఎం కళ్యాణ్‌సింగ్ కూడా ఉన్నారు. అయితే 2003 సెప్టెంబర్ 19న రాయ్‌బరేలీలోని స్పెషల్ మెడిస్ట్రేట్ అద్వానీ, జోషీలకు విచారణ నుంచి విముక్తి కల్పించింది. అయితే దీనిపై పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. 2017లో తీర్పును వెలువరిస్తూ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న అద్వానీ, జోషీ, ఉప భారతి, కళ్యాణ్ సింగ్‌లను కూడా విచారించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అయితే తాజాగా అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పును వెలువరిస్తూ.. మసీదు కూల్చివేతను చట్టవిరుద్ధమైనదిగా వర్ణించింది. ఈ నేపథ్యంలో కేసును విచారిస్తున్న సీబీఐ విచారణను మరింత వేగవంతం చేసింది. దీనిపై పూర్తి నివేదికను త్వరలోనే సుప్రీం ధర్మాసనం ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. దీంతో మసీదు కూల్చివేత కేసు ఎదుర్కొంటున్న అద్వానీ మరోసారి సీబీఐ విచారణ ఎదుర్కొనే అవకాశం ఉందని పలువురు పరిశీలకు అభిప్రాయపడుతున్నారు. కేసు విచారణ తుది దశతో ఉన్న నేపథ్యంలో.. నేరం రుజువైతే శిక్ష కూడా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అద్వానీతో పాటు మురళీ మనోహర్ జోషీ, కళ్యాణ్ సింగ్, ఉమ భారతీ కూడా విచారణను ఎదుర్కొన్నారు. దీనిలో భాగంగానే మొన్నటి వరకు రాజస్తాన్ గవర్నర్‌గా ఉన్న కళ్యాణ్ సింగ్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించినట్లు వార్తలు వినిపించాయి. అయితే తాజా తీర్పు నేపథ్యంలో విచారణను సీబీఐ ఎలా డీల్ చేస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. లిబర్హాన్ కమిషన్.. అయితే 1992 డిసెంబర్ 6న జరిగిన బాబ్రీమసీదు కూల్చివేత ఘటనపై విచారణకు అప్పటి కేంద్ర ప్రభుత్వం లిబర్హాన్ కమిషన్‌ను అదేనెల 16న ఏర్పాటు చేసింది. హర్యానా హైకోర్టులో సిట్టింగ్ జడ్జిగా పనిచేస్తున్న జస్టిస్ ఎంఎస్ లిబర్హాన్ సారథ్యంలో ఏర్పాటయిన ఈ కమిషన్‌ను... మసీదు కూల్చివేతకు దారితీసిన ఘటనలపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశించింది. కమిషన్‌కు తుది నివేదిక ఇవ్వటానికి ఏకంగా 16 ఏళ్ల ఆరు నెలలు పట్టింది. చివరకు 2009 జూన్ 30న కమిషన్ తన 998 పేజీల నివేదికను కేంద్రానికి సమర్పించింది. విచారణలో భాగంగా కమిషన్ పలువురు అగ్రశ్రేణి రాజకీయ ప్రముఖులను విచారించింది. కమిషన్ ఏం చెప్పిందంటే... ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీతోపాటు బీజేపీకి, హిందూసంస్థలకు చెందిన దాదాపు 68 మందిని ఈ నివేదిక అభిశంసించింది. అప్పటి యూపీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వమే ఈ ఘటనకు పూర్తి బాధ్యత వహించాలని దుయ్యబట్టింది. ఇలా మత ఆధారిత రాజకీయాలు జరిపే ప్రభుత్వాలను బర్తరఫ్ చేయాలని కూడా కమిషన్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. వాజ్‌పేయి, అద్వానీ లాంటి వాళ్లను మిధ్యా ఉదారవాదులుగా అభివర్ణించింది. వీరంతా మూకుమ్ముడిగా బాబ్రీ కూల్చివేతకు ప్రత్యక్ష, పరోక్ష బాధ్యులని స్పష్టంచేసింది. వీరిపై తగిన చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. బాబ్రీ ఘటనలో అప్పటి కేంద్ర ప్రభుత్వానిది ఏమాత్రం దోషం లేదని కూడా కమిషన్ తెలిపింది. -
5 శతాబ్దాల సమస్య!
2019 నవంబర్ 9న ఈ వివాదానికి శాశ్వత పరిష్కారం లభించింది. సర్వోన్నత న్యాయస్థానం తీర్పును దేశమంతా స్వాగతించింది. అయోధ్య వివాదం పూర్వాపరాలపై సమగ్ర కథనమిది. అయోధ్యలో 1528లో మొఘల్ సామ్రాజ్య సైనికాధికారి మిర్ బాకీ తాష్కేండీ బాబ్రీ మసీదును నిర్మించాడు. హిందువుల పవిత్రంగా భావించే ప్రాంతాన్ని ఆక్రమించుకుని ఈ మసీదును నిర్మించారనేది వివాదం. 1853–55లో ఈ కట్టడం విషయంలో తొలిసారి ఘర్షణలు చెలరేగడంతో అప్పట్లోనే మసీదు బయటి ప్రాంగణంలో హిందువులు పూజలు చేసుకునేందుకు, లోపలి భాగంలో ముస్లింల ప్రార్థనలకు వీలు కల్పిస్తూ ఓ గోడ నిర్మించారు. తొలి కేసు 1885లో... బాబ్రీ మసీదు ప్రాంగణంలోని ఛబుత్రా జన్మస్థాన్‌లో దేవాలయ నిర్మాణానికి అనుమతివ్వాలంటూ, జన్మస్థాన్‌కు మహంత్‌గా ప్రకటించుకున్న రఘుబర్ దాస్ ఫైజాబాద్ సబ్ జడ్జి కోర్టులో సివిల్ కేసు వేశారు. అయోధ్య న్యాయపోరాటానికి అదే ఆద్యం. స్టేట్ ఆఫ్ ఇండియా కార్యదర్శిని ప్రతివాదిగా చేరుస్తూ దాఖలైన ఈ కేసులో... ఆలయ నిర్మాణాన్ని మసీదు సంరక్షకుడు అడ్డుకోకుండా ఆదేశాలివ్వాలని రఘుబర్ దాస్ కోరారు. 1885 డిసెంబర్ 24న ఫైజాబాద్ సబ్ జడ్జీ కోర్టు న్యాయమూర్తి పండిట్ హరికిషన్ సింగ్ ఈ కేసు కొట్టివేస్తూ... ఆలయ నిర్మాణానికి అనుమతిస్తే ఏదో ఒక రోజు క్రిమినల్ కేసులు దాఖలు కావడంతోపాటు వేల మంది హత్యకు గురయ్యే అవకాశముందని వ్యాఖ్యానించారు. ఆ తీర్పును సవాలు చేస్తూ రఘుబర్‌దాస్ జిల్లా కోర్టును ఆశ్రయించగా న్యాయమూర్తి కల్నల్ ఎఫ్.ఇ.ఎ.ఛామెయిర్ కేసు కొట్టేశారు. హిందువుల పవిత్ర స్థలంపై ఓ మసీదు నిర్మించడం దురదృష్టకరమని, ఈ ఘటన ఎప్పుడో 356 ఏళ్ల క్రితం జరిగింది కాబట్టి అప్పుడు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే సమయం మించిపోయిందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. యథాతథ స్థితిని కొనసాగించాలని మాత్రమే ఇప్పుడు చెప్పగలమని స్పష్టం చేశారు. రఘుబర్ దాస్ దీన్ని అప్పటి ప్రావిన్స్ ప్రధాన కేంద్రమైన అవధ్ న్యాయస్థానంలోనూ సవాలు చేసినా ఫలితం లేకపోయింది. విభజనతో రాజుకున్న వివాదం... దేశ విభజనతో అయోధ్య వివాదం మరోసారి రాజుకుంది. 1949 డిసెంబర్ 22 రాత్రి బాబ్రీ మసీదులోని ప్రధాన గుమ్మటం లోపల రాముడి విగ్రహాలు ప్రత్యక్షమయ్యాయి. అఖిల భారతీయ రామాయణ్ మహాసభ తొమ్మిది రోజులపాటు అఖండ రామాయణ కీర్తన (రామచరిత మానస్ పఠనం) జరిపాక ఈ అద్భుతం చోటు చేసుకుందని, మసీదు లోపల రాముడి విగ్రహాలు ప్రత్యక్షమయ్యాయని చెబుతారు. కొందరు వీటిని రహస్యంగా లోపలపెట్టారని కూడా చెబుతారు. ఆ రోజు శుక్రవారం కావడంతో మసీదులో ప్రార్థనల కోసం భారీ సంఖ్యలో ముస్లింలు చేరడం యాదృచ్ఛికం. దీనిపై అయోధ్య అడిషనల్ సిటీ మేజిస్ట్రేట్ కోర్టులో విచారణ మొదలైంది. విగ్రహాలున్న కట్టడానికి తాళం వేయాలని జస్టిస్ మార్కండేయ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో మసీదులోకి ప్రవేశించే హక్కును ముస్లింలు కోల్పోగా, పూజలు చేసుకునే అవకాశం హిందువులకు దక్కింది. కోర్టు నియమించిన నలుగురు పూజారుల ద్వారా పక్క గేటు నుంచి విగ్రహాలను సందర్శించేందుకు వీలు ఏర్పడింది. 1950లో సివిల్ వ్యాజ్యం... రాముడి విగ్రహాలను తొలగించకుండా అయోధ్యకు చెందిన ఐదుగురు ముస్లిం అధికారులను నిరోధించాలని, దర్శనానికి తనకు హక్కు ఉన్నట్లుగా ప్రకటించాలని గోపాల్ సింగ్ విశారద్ 1950లో సివిల్ వ్యాజ్యం వేయడంతో వివాదం మలుపు తిగింది. విచారణ జరిపిన న్యాయమూర్తి ఎన్.ఎన్.ఛద్దా ఇందుకు అనుమతించారు. పైకోర్టులూ ఈ తీర్పును సమర్థించాయి. 1955లో రాష్ట్ర హైకోర్టు కూడా కింది కోర్టుల తీర్పులను బలపరిచింది. ఈ దశలోనే నిర్మోహీ అఖాడా మసీదు ప్రాంతాన్ని తమకివ్వాలని కేసు వేయగా, 1961 డిసెంబరులో సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు స్థల యాజమాన్య హక్కులపై తొలి సివిల్ కేసు వేసింది. వీటిపై అలహాబాద్ హైకోర్టు విచారణ చేపట్టింది. బాబ్రీ మసీదు యాక్షన్ కమిటీ ఏర్పాటు... 1950–51లో విగ్రçహాల పూజలపై ఆంక్షల్ని సడలించాలని స్థానిక న్యాయవాది ఒకరు 1986లో ఫైజాబాద్ మున్సిఫ్ కోర్టులో తాజా కేసు వేయడం బాబ్రీ మసీదు యాక్షన్ కమిటీ ఏర్పాటుకు కారణమైంది. మున్సిఫ్ కోర్టు ఈ కేసును కొట్టేయటంతో అప్పీల్ చేశారు. ఫైజాబాద్ జిల్లా జడ్జి కె.ఎం.పాండే తీర్పునిస్తూ తాళాలు, గేట్లు తొలగించడం వల్ల నష్టమేమీ లేదన్నారు. ఈ తీర్పు వెలువడిన గంట లోపే జిల్లా యంత్రాంగం తాళాలు తొలగించడం అవతలి వర్గాల్లో అనుమానాలు రేకెత్తించింది. మూడు భాగాలుగా విభజన... 1994లో మసీదు ప్రాంతాన్ని కేంద్రం స్వాధీనం చేసుకునేందుకు వీలు ఏర్పడింది. మసీదు కూల్చివేత నేపథ్యంలో ఆ స్థలాన్ని కేంద్రం ప్రత్యేక చట్టం ద్వారా స్వాధీనం చేసుకోవడం సబబేనని, సెక్యులరిజం భావనకిది వ్యతిరేకం కాదని సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొంది. ఈ నేపథ్యంలో 2002 ఏప్రిల్‌లో అయోధ్యలోని వివాదాస్పద 2.77 ఎకరాల భూమికి యజమాని ఎవరనేది తేల్చేందుకు అలహాబాద్ హైకోర్టు విచారణ ప్రారంభించింది. జస్టిస్ ఖాన్, జస్టిస్ సుధీర్ అగర్వాల్, జస్టిస్ ధరమ్వీర్ శర్మలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం వివాదాస్పద భూమిని సున్నీ వక్ఫ్‌బోర్డు, రామ్ లల్లా, నిర్మోహీ అఖాడాలకు మూడు సమాన భాగాలుగా చేస్తూ 2010లో తీర్పునిచ్చింది. అయితే హైకోర్టు తీర్పును మూడు వర్గాలు çసుప్రీం కోర్టులో సవాలు చేశాయి. ఈ ముగ్గురితోపాటు మరో 11 మంది వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం కలిపి విచారించి తాజా తీర్పు వెలువరించింది. ప్రభుత్వంలో మార్పు.. రథయాత్ర మొదలైన కొద్ది నెలలకు యూపీలో, కేంద్రంలో ప్రభుత్వాలు మారాయి. యూపీలో బీజేపీ అధికారం చేపట్టగా, కేంద్రంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పాటైంది. పర్యాటకాభివృద్ధి పేరుతో యూపీ ప్రభుత్వం వివాదాస్పద కట్టడం సమీపంలోని అనేక నిర్మాణాల్ని కూల్చేసింది. 1992 డిసెంబర్ 6న గంటల వ్యవధిలోనే కరసేవకుల చేతిలో బాబ్రీ మసీదు ధ్వంసమైంది. దీంతో యూపీ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 8న పారా మిలటరీ బలగాలు వివాదాస్పద స్థలాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. రాముడి విగ్రహాలకు పూజలు నిలిచిపోయాయి. కానీ.. ఆ రోజు సాయంత్రం పూజలు మళ్లీ మొదలయ్యాయి. అప్పటి నుంచి పూజలు కొనసాగుతున్నా భక్తులకు దర్శనాలు మాత్రం లేకుండా పోయాయి. -
అయోధ్య తీర్పుపై స్పందించిన అద్వానీ
సాక్షి, న్యూఢిల్లీ: అయోధ్య భూ వివాదంపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ స్వాగతించారు. తీర్పుపై శనివారం సాయంత్రం ఆయన స్పందించారు. ‘ఇది ఎంతో ఆనందకరమైన క్షణం. మహోన్నతమైన ఉద్యమంలో పాల్గొనే అవకాశం దేవుడు నాకు కల్పించాడు. దేశ స్వాతంత్య్ర పోరాటం తరువాత అయోధ్య రామమందిరం కొరకు సాగిన ఉద్యమమే ఉన్నతమైనది. దానిలో పాల్గొన్నందుకు గర్వంగా ఉంది. సుదీర్ఘ పోరాటానికి సుప్రీంకోర్టు తీర్పుతో ఫలితం వచ్చింది’ అని అన్నారు. కాగా అయోధ్యలోని వివాదాస్పద 2.77 ఎకరాల స్థలంలో రామమందిరం నిర్మించాలని అద్వానీ పెద్ద ఎత్తున ఉద్యమించిన విషయం తెలిసిందే. మందిర నిర్మాణం కొరకు గుజరాత్‌లోని సోమనాథ్ నుంచి అయోధ్య వరకు రథయాత్ర సైతం చేపట్టారు. ఆయన చేపట్టిన యాత్రతోనే మందిర నిర్మాణం ఉద్యమం ఊపందుకుంది. అద్వానీ బాటలోనే నడిచిన పలు హిందూసంఘాలు మందిర నిర్మాణం కొరకు మరింత ఉధృతంగా పోరాటం సాగించాయి. కాగా రథయాత్ర ముగింపు సందర్భంగానే కరసేవకులు అయోధ్యంలోని బాబ్రీ మసీదును ధ్వసం చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో అద్వానీ సీబీఐ విచారణను కూడా ఎదుర్కొన్నారు. కాగా దశాబ్దాలుగా సాగిన అయోధ్య వివాదానికి సుప్రీంకోర్టు నేటి తీర్పుతో ముగింపు పలికింది. వివాదాస్పద కట్టడం ఉన్న స్థలం హిందువులదేనని స్పష్టం చేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తుది తీర్పు చెప్పింది. 2.77 ఎకరాల స్థలం హిందువులకే చెందుతుందని తేల్చిచెప్పేసింది. వివాదాస్పద స్థలానికి సంబంధించి 3 నెలల్లో కేంద్రం ట్రస్ట్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. వివాదాస్పద స్థలాన్ని ట్రస్ట్ ఆధీనంలో ఉంచాలని, కేంద్రం ఏర్పాటు చేసే ట్రస్ట్‌లో నిర్మోహి అఖాడాకు ప్రాతినిథ్యం కల్పించాలని సూచించింది. ఈ తీర్పుతో అద్వానీ కళ సాకారమైందని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు. -
అయోధ్య వెళ్తా.. అద్వానీని కలుస్తా: ఠాక్రే
సాక్షి, ముంబై: అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అనుకూలంగా తీర్పు రావడంలో విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ) నేత అశోక్ సింఘాల్, ఎల్కే అద్వానీ చేసిన కృషే కారణమని శివసేన చీఫ్ ఉద్దవ్‌ఠాక్రే అన్నారు. నాడు వారు చేసిన పోరాటం, త్యాగం ఫలితంగానే నేడు అనుకూలంగా తీర్పు వచ్చిందని అభిప్రాయపడ్డారు. త్వరలోనే తాను ఎల్కే అద్వానీతో సమావేశమవుతున్నట్లు ఠాక్రే తెలిపారు. అలాగే నెల 24న అయోధ్యలో పర్యటిస్తున్నట్లు వెల్లడించారు. కాగా అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు వెల్లడించిన తీర్పును కేంద్ర ప్రభుత్వం తన ఘనతగా చాటుకోలేదని శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ఇదివరకే పేర్కొన్న విషయం తెలిసిందే. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి చట్టం చేయాలని తాము ప్రభుత్వాన్ని కోరితే అందుకు నిరాకరించిందని, సుప్రీం తాజా తీర్పును ప్రభుత్వం ఇప్పుడు తమ ఘనతగా చెప్పుకోరాదని ఠాక్రే అన్నారు. ( చదవండి: ‘అద్వానీ, సింఘాల్ సాధించారు’). -
అయోధ్య తీర్పు: వారిదే ఘనత
సాక్షి, న్యూఢిల్లీ: అయోధ్య వివాదంలో సుప్రీంకోర్టు తీర్పును ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త, రామ జన్మభూమి రథయాత్రలో కీలక పాత్రధారి కేఎన్ గోవిందాచార్య స్వాగతించారు. ఈ కేసులో తీర్పు తమకు అనుకూలంగా రావడానికి విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ) నేత అశోక్ సింఘాల్, ఎల్కే అద్వానీ చేసిన కృషే కారణమని ఆయన వ్యాఖ్యానించారు. ‘సుప్రీంకోర్టు తుది తీర్పు చాలా సంతోషం కలిగించింది. ఇక మూడు నెలల్లో రామమందిరం నిర్మాణానికి ప్రణాళిక రూపొందించాల’ని ఆయన అన్నారు. ప్రజలంతా సంయమనంతో మెలగాలని, మత సామరస్యం పాటించాలని కోరారు. ఈ విజయానికి ప్రధాన కారణం ఎవరు అనుకుంటున్నారని ప్రశ్నించగా.. ‘ఆలయ నిర్మాణం కోసం లక్షలాది మంది త్యాగాలు చేశారు. చాలా మంది అనేక రకాలుగా రామ జన్మభూమి ఉద్యమంలో తమ పాత్ర పోషించారు. కీలక భూమిక మాత్రం అశోక్ సింఘాల్, ఎల్కే అద్వానీదే’ అని సమాధానం ఇచ్చారు. అయోధ్య వివాదంలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు చరిత్రాత్మకమని హిందూ మహాసభ తరపు న్యాయవాది వరుణ్‌కుమార్ సిన్హా వ్యాఖ్యానించారు. భిన్నత్వంలో ఏకత్వం సందేశాన్ని ఇచ్చేలా తీర్పు ఉందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు బాలెన్స్డ్గా ఉందని, ఇది ప్రజల విజయమని రామ్ లల్లా తరపు న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ అన్నారు. (చదవండి: సుప్రీంతీర్పును గౌరవిస్తున్నాం.. కానీ) -
ఎయిమ్స్‌లో జైట్లీని పరామర్శించిన అద్వానీ
సాక్షి, న్యూఢిల్లీ : తీవ్ర అనారోగ్యంతో ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ (66)ని పార్టీ దిగ్గజ నేత ఎల్కే అద్వానీ సోమవారం పరామర్శించారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఈ నెల 9న ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరిన విషయం తెలిసిందే. జైట్లీ ఇంకా కోలుకోకపోవడంతో పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్ నాయకులు ఆయనను పరామర్శిస్తున్నారు. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, జితేంద్ర సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ఎయిమ్స్‌లో జైట్లీని పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు ఈనెల 10 నుంచి జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై ఎయిమ్స్ ఎలాంటి హెల్త్ బులెటిన్ విడుదల చేయకపోవడంతో పలువురు ప్రముఖ నేతలు ఆయన ఆరోగ్య పరస్థితిని వాకబు చేసేందుకు ఎయిమ్స్‌కు తరలివస్తున్నారు. కాగా, నరేంద్ర మోదీ తొలి సర్కార్‌లో ఆర్థికమంత్రిగా ఉన్నపుడే అరుణ్ జైట్లీ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఈ క్రమంలో అమెరికాలో ఆయనకు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరిగింది. ఈ నేపథ్యంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన అనంతరం, అనారోగ్యం కారణంగా తనను కేంద్రమంత్రి వర్గంలోకి తీసుకోవద్దని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసిన సంగతి విదితమే. -
వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న ఎల్కే అద్వానీ
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే అద్వానీ (91) స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు దూరంగా ఉండనున్నారు. ప్రతి ఏడాది ఆయన ఆగస్టు 15న తన నివాసంలో జెండా వందనం చేయడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. అయితే అద్వానీకి వైరల్ ఫీవర్ కారణంగా ఈసారి జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం లేదని ఆయన కార్యాలయం బుధవారం ఓ ప్రకటన చేసింది. గత అయిదు రోజులుగా ఆయన వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నట్లు తెలిపింది. -
గుర్తుండిపోయే నేత!
కొందరు తమకొచ్చిన పదవులకుండే ప్రాముఖ్యత వల్ల వెలిగిపోతారు. కానీ చాలా తక్కువమంది చేపట్టిన పదవి ఏదైనా దానిపై తమదైన ముద్ర వేస్తారు. ఆ పదవికే వన్నె తెస్తారు. మంగళవారం రాత్రి కన్నుమూసిన సుష్మాస్వరాజ్ 42 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో చాలా తరచుగా తన విశిష్టతను చాటుకున్నారు. ఒకానొక దశలో ఆమెను ప్రధాని పదవికి అభ్యర్థిగా బీజేపీ ఎంపిక చేయొచ్చునన్న ఊహాగానాలు రావడానికి ఈ విశిష్టతే కారణం. ఇతర రంగాల మాదిరిగా పురుషాధిక్యత రాజ్యమేలే రాజకీయరంగంలో మహిళలు ఉన్నత స్థాయికి చేరుకోవడం, తమను తాము నిరూపించుకోవడం సాధారణమైన విషయం కాదు. దేశ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసి, ఉక్కు మహిళగా పేరు తెచ్చుకున్న ఇందిరాగాంధీకి తండ్రి జవహర్లాల్ నెహ్రూ సమున్నత వారసత్వం ఉంది. కానీ సుష్మా స్వరాజ్‌కు అటువంటి నేపథ్యం లేదు. ఆమె పూర్తిగా స్వశక్తితో ఎదిగిన మహిళ. విద్యార్థి దశలోనే సమస్యలపై పోరాడి, పరిష్కారాలు సాధించిన చరిత్రగలవారు. అప్పట్లోనే గొప్ప వక్తగా అందరి మన్ననలూ పొందారు. అరుదైన నాయకత్వ లక్షణాలు, ఏ సమస్యపైన అయినా ప్రభావవంతంగా మాట్లాడగల సామర్థ్యం సొంతం చేసుకోవడం వల్లనే ఆమె 25 ఏళ్ల పిన్న వయసులోనే హర్యానాలో కేబినెట్ మంత్రి కాగలిగారు. జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా వ్యవ హరించారు. ఏడు సార్లు ఎంపీగా, మూడు దఫాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఢిల్లీకి తొలి మహిళా ముఖ్యమంత్రిగా పనిచేశారు. విద్యార్థి దశలో సంఘ్ పరివార్ అనుబంధ సంఘమైన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ)లో చురుగ్గా పనిచేసిన చరిత్ర ఆమెది. ఆ దశలోనే ఆమె ఆనాటి జనసంఘ్ నాయకుడు ఎల్కే అడ్వాణీ దృష్టిలో పడ్డారు. తన రాజకీయంగా భిన్నాభిప్రా యాలుండే స్వరాజ్ కౌశల్‌ను పెళ్లాడాక ఆమె జనసంఘ్‌కు దూరమయ్యారు. సోషలిస్టు రాజకీ యాల్లో చురుకైన పాత్ర పోషించారు. దేశం ఉక్కు నిర్బంధాన్ని చవిచూసిన అత్యవసర పరిస్థితి కాలంలో నిరసన ప్రదర్శనల్లో ధైర్యంగా పాల్గొన్నారు. ఆ చీకటి రోజుల్లోనే సోషలిస్టు నేత, దివంగత నాయకుడు జార్జి ఫెర్నాండెజ్‌ను ప్రధాన కుట్రదారుగా చేర్చిన బరోడా డైనమైట్ కేసులో భర్తతో పాటు న్యాయస్థానంలో వాదించారు. ఆ క్రమంలో ఆమె లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ అనుయాయిగా మారారు. అత్యవసర పరిస్థితి రద్దయ్యాక సోషలిస్టు పార్టీ జనతా పార్టీలో విలీనమై నప్పుడు ఆ పార్టీలో చేరారు. అనంతరకాలంలో బీజేపీలో చేరి కీలకపాత్ర పోషించారు. కేంద్ర మంత్రిగా, విపక్ష నేతగా పనిచేశారు.అయితే బీజేపీలో చాలామందికి లేని వెసులుబాటు çసుష్మకు ఉంది. సోషలిస్టుగా రాజకీయ రంగప్రవేశం చేయడం వల్ల కావొచ్చు... బీజేపీలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నా ఆమెను ఉదారవాద నేతగానే అనేకులు పరిగణించారు. దానికితోడు ఆమె కొన్ని కీలక సందర్భాల్లో నిర్మొహమాటంగా వ్యక్తం చేసిన అభిప్రాయాలు కూడా ఆ భావనే కలిగించేవి. బెంగళూరులోని పబ్‌పై హిందూ ఛాందసవాదులు దాడిచేసి మహిళలపై దౌర్జన్యానికి దిగినప్పుడు ఆ చర్యను ఖండించిన ఏకైక బీజేపీ నేత సుష్మానే. ప్రియాంకా చతుర్వేది కాంగ్రెస్ నేతగా ఉండగా పదేళ్ల ఆమె కుమార్తె పట్ల అసభ్యకరంగా ట్వీట్లు చేసినవారిని సుష్మ మందలించారు. ప్రియాంకకు అండగా నిలిచారు. మతాంతర వివాహం చేసుకున్న జంట పాస్‌పోర్టు కోసం వచ్చినప్పుడు లక్నోలోని అధికారి ఆ మహిళపై తన పరిధి దాటి వ్యాఖ్యానించినప్పుడు సుష్మ మందలించారు. ఆమెకు పాస్‌పోర్టు అందేలా చూశారు. ఇలాంటి సందర్భాల్లో సంఘ్ పరివార్ శ్రేణులుగా చెప్పుకున్నవారు ఆమెపై విద్వేషపూరితంగా, వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేసినా సుష్మ లెక్కచేయలేదు. విదేశీ వ్యవ హారాల శాఖ నిర్వహణ ఏ రాజకీయ నేతకైనా ప్రతిష్టాత్మకమైనదే. ఐక్యరాజ్యసమితితోసహా అనేక అంతర్జాతీయ వేదికలపై దేశానికి ప్రాతినిధ్యంవహించే అవకాశం లభించడం, మన వాదనను సమ ర్ధవంతంగా వినిపించడం ఒక వరం. అదే సందర్భంలో ఆ పదవితో సమస్యలు కూడా ఉన్నాయి. అక్కడ నిత్యం వార్తల్లో వ్యక్తిగా ఉండటం సాధ్యపడదు. కానీ ఆ పదవి స్వభావాన్నే ఆమె మార్చారు. ఇరాక్‌లోని బస్రాలో ఉగ్రవాదుల చక్రబంధంలో చిక్కుకున్న 168మందిని కాపాడటం వెనక ఆమె కృషి చాలా ఉంది. విదేశాల్లో పాస్‌పోర్టు పోగొట్టుకున్నవారికి, ఇక్కడి వ్యక్తిని పెళ్లాడి వీసా లభించక ఇబ్బందులు పడుతున్నవారికి, గల్ఫ్ దేశాలకెళ్లి అక్కడ వెట్టిచాకిరీలో మగ్గినవారికి ఆమె అమ్మలా ఆపన్నహస్తం అందించారు. ‘మీరు అరుణగ్రహంపై చిక్కుకున్నా కాపాడతాన’ంటూ ఆమె ఒక సందర్భంలో పెట్టిన ట్వీట్ విదేశాల్లో ఉండకతప్పనివారికి ఎంతో భరోసానిచ్చింది. ఆమెలోని మాన వీయతకు అద్దం పట్టింది. విదేశాంగ శాఖలో కూడా ఇంత చేయొచ్చా అని అందరూ ఆశ్చర్య పోయారు. అడ్వాణీ శిబిరానికి చెందినవారు గనుక ఆమెకు మోదీ ప్రభుత్వంలో చోటుండకపోవ చ్చన్న ఊహాగానాలొచ్చాయి. కానీ ఆమె సమర్థతను మోదీ సరిగానే గుర్తించారు. కీలకమైన విదే శాంగ శాఖ అప్పగించారు. వాజపేయి ప్రభుత్వంలో సమాచార మంత్రిగా ఆ శాఖపై సుష్మ చెరగని ముద్రవేశారు. చిత్రరంగాన్ని పరిశ్రమగా గుర్తించింది ఆమె హయాంలోనే. అందువల్లే చిత్ర నిర్మా ణాలకు బ్యాంకు రుణాలు అందడం మొదలైంది. తమపై వివక్ష ప్రదర్శిస్తున్నారని, ఎదగనీయడం లేదని అనేకులు ఫిర్యాదు చేస్తుంటారు. అలాంటివారు సుష్మ రాజకీయ జీవితం అధ్యయనం చేయాలి. అడుగడుగునా ఆధిపత్య ధోర ణులు, పితృస్వామిక భావజాలం తొంగిచూసే సమాజంలో ఎలాంటి నేపథ్యమూ లేని కుటుంబాల నుంచి వచ్చిన మహిళలకు ఏదో ఒక రూపంలో, ఎప్పుడో ఒకప్పుడు సమస్యలు తప్పవు. వాట న్నిటినీ దీటుగా ఎదుర్కొనడం వల్లనే, తనను తాను నిరూపించుకోవడం వల్లనే సుష్మా స్వరాజ్ ఇంతమంది అభిమానాన్ని పొందగలిగారు. విశిష్ట నేతగా ఎదిగారు. -
‘సుష్మ.. నా పుట్టినరోజుకు కేక్ తెచ్చేవారు’
న్యూఢిల్లీ: సుష్మా స్వరాజ్ మరణం తనని తీవ్రంగా కలచివేసిందన్నారు బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వాణీ. బుధవారం ఉదయం ఆమె మృతదేహానికి నివాళులర్పిస్తూ.. అద్వాణీ కన్నీరు పెట్టుకున్నారు. ‘సుష్మ చాలా చిన్న వయసులోనే పార్టీలో చేరారు. అంచెలంచెలుగా ఎదుగుతూ... శక్తివంతమైన రాజకీయ వేత్తగా ఎదిగారు. నేటి తరం మహిళా నాయకులకు ఆదర్శంగా నిలిచారు. సుష్మ గొప్ప వక్త. ఆమె జ్ఞాపకశక్తిని చూసి చాలాసార్లు నేను ఆశ్చర్యపోయేవాడిని. సుష్మ ప్రతిసంవత్సరం నా పుట్టిన రోజు నాడు నాకిష్టమైన చాకొలెట్ కేక్ తీసుకొచ్చేవారు. ఒక్క సారి కూడా కేక్ తేవడం మర్చిపోలేదు’ అంటూ సుష్మతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు అద్వాణీ. అంతేకాక సుష్మ చాలా మంచి వ్యక్తి అన్నారు. ఆమె తన మంచితనంతో అందరిని ఆకట్టుకున్నారు. ఆమె మరణం బీజేపీకి తీరని లోటు అంటూ అద్వాణీ కన్నీటి పర్యంతమయ్యారు. -
మోదీ , అమిత్‌షాకు అభినందనలు : అద్వానీ
-
‘ఇదో సాహసోపేత నిర్ణయం’
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడంపై బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వాణీ హర్షం వ్యక్తం చేశారు. ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని సాహసోపేత నిర్ణయంగా వర్ణించారు. ఈ సందర్భంగా అద్వాణీ మాట్లాడుతూ.. ‘జాతీయ సమగ్రత బలోపేతం దిశగా ఇదో గొప్ప ముందడుగు. ఆర్టికల్ 370 రద్దు బీజేపీ ప్రధాన భావజాలాల్లో ఒకటి. జనసంఘ్ రోజుల నుంచే ఈ ప్రతిపాదన ఉంద’ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఆయన అద్వాణీ అభినందనలు తెలిపారు. జమ్ముకశ్మీర్, లడఖ్‌లో శాంతి, సుఖ సంతోషాల స్థాపనలో ఈ నిర్ణయం కీలకంగా మారనుందని అద్వాణీ వ్యాఖ్యానించారు. -
రాజ్యసభకు సుష్మా, అద్వానీ..!
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న బీజేపీ సీనియర్లను రాజ్యసభకు పంపాలని ఆ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ సీనియర్ నేతలపై ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, సుష్మా స్వరాజ్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయలేదు. వయసు కారణంగా అద్వానీ, జోషీలను పార్టీ పోటీకి నిరాకరించగా.. అనారోగ్యం కారణంగా మాజీ కేంద్రమంత్రి సుష్మా పోటీకి దూరంగా ఉన్నారు. వీరిని పెద్దల సభకు పంపాలని యోచిస్తున్నట్లు సమాచారం. రానున్న రెండు నెలల్లో రాజ్యసభలో పది స్థానాలు ఖాళీ కానున్నాయి. గుజరాత్లో 2, బిహార్ 1, అస్సాం 2, తమిళనాడులో 5 స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ నేపథ్యంలో వాటికి ఎన్నిక అనివార్యం కానుంది. వీటిలో మెజార్టీ స్థానాలను అధికార బీజేపీ సొంతం చేసుకునే అవకాశం ఉంది. సీనియర్ల సేవలను ఉపయోగించుకోవాలనే ఉద్దేశ్యంతో వీరిని రాజ్యసభకు పంపాలని భావిస్తున్నట్లు బీజేపీ వర్గాల సమాచారం. కాగా 75 ఏళ్లుపైబడిన వాళ్లను లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంచాలని పార్టీ నిబంధనలు విధించిన విషయం తెలిసిందే. దీంతో సీనియర్లను పోటీ నుంచి తప్పించారు. మోదీ ప్రభుత్వంలో కేంద్ర హోంశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అమిత్ షా గుజరాత్‌లోని గాంధీ నగర్ నుంచి లోక్‌సభకు ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే పోటీకి ముందే ఇదే విషయంపై అద్వానీతో షా, మోదీ చర్చించినట్లు తెలిసింది. మధ్య ప్రదేశ్‌లోని విదిశ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన సుష్మా ఈసారి పోటీకి దూరంగా ఉన్నారు. దీంతో ఆమెను కూడా పెద్దల సభకు పంపాలని బీజేపీ భావిస్తోంది. దీనికి ఆమె కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. కాగా విదేశాంగ మంత్రిగా నియమితులైన ఎస్ జైశంకర్, రాంవిలాస్ పాశ్వన్‌లను కూడా రాజ్యసభకు పంపనున్నారు. అస్సాం నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పదవీ కాలం కూడా మరో రెండు నెలల్లో ముగియనుంది. -
మళ్లీ అదే జోడీ
కేంద్ర హోంశాఖ మంత్రిగా అమిత్ షా నియామకంపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నప్పటికీ భారతీయ జనతా పార్టీలో సీనియర్లకు మాత్రం కొన్ని మధుర స్మృతులు కళ్ల ముందు మెదులుతున్నాయి. మోదీ–షా ద్వయాన్ని చూస్తున్న వారందరూ ఒక్కసారిగా రెండు దశాబ్దాలు వెనక్కి వెళ్లి అటల్జీ రోజుల్లో విహరిస్తున్నారు. 1998లో ప్రధానమంత్రిగా అటల్ బిహారి వాజపేయి నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటైంది. లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో లక్నో నియోజకవర్గం నుంచి వాజపేయి ఎన్నికైతే, గుజరాత్లో గాంధీనగర్ నుంచి ఎన్నికైన ఎల్.కె. అడ్వాణీ హోం మంత్రి పదవిని అందుకున్నారు. ఆ తర్వాత ఉప ప్రధాని పదవిని చేపట్టారు. వాజపేయి–అడ్వాణీ జోడీ తమకున్న పరస్పర సహకారంతో బీజేపీకి ఎనలేని పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టారు. దశాబ్దాల తరబడి కాంగ్రెస్ వంశపారంపర్య పాలనతో విసిగిపోయిన జనంలో వాజపేయి–అడ్వాణీ జోడీ పట్ల ఎనలేని నమ్మకం ఏర్పడింది. బీజేపీ తొలిసారిగా స్వర్ణయుగం అనుభవించిన రోజులవి. మళ్లీ ఇరవై సంవత్సరాల తర్వాత అదే రిపీట్ అయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి ప్రాతినిధ్యం వహిస్తే, హోంమంత్రి అమిత్ షా ఇన్నాళ్లుగా అడ్వాణీ ప్రాతినిధ్యం వహించిన గాంధీనగర్ నుంచే నెగ్గారు. యూపీ పీఏం, గుజరాత్ హెచ్ఎం ఫార్ములా అప్పట్లో బీజేపీని తారాపథంలోకి తీసుకువెళ్లింది. ఇప్పుడు హోం మంత్రిగా షా నియామకంతో అదే యూపీ, గుజరాత్ కాంబినేషన్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందోనన్న ఆసక్తి నెలకొంది మోదీ షా ద్వయం ఎదుర్కోనున్న సవాళ్లు అప్పట్లో వాజపేయి అడ్వాణీ జోడి ఎదుర్కొన్న సవాళ్లే ఇప్పుడూ మోదీ, షా ఎదుట ఉన్నాయి. అయితే అప్పటి పరిస్థితులకి, ఇప్పటి పరిస్థితులకి ఎంతో వ్యత్యాసం ఉంది. వికాస్ పురుష్‌గా పేరుతెచ్చుకున్న వాజపేయి, లోహ్పురుష్ అని పిలుచుకునే అడ్వాణీ కాంబినేషన్ అందరినీ ముచ్చటగొలిపింది. బీజేపీకి ఒక గుర్తింపు తేవడానికి వారు ఎంతో కృషి చేశారు. వాళ్లిద్దరు వేసిన బాటలోనే నడుస్తున్న మోదీ–షా ద్వయం దృష్టంతా ఇప్పుడు మోదీ తరహా రాజకీయాలను తిరస్కరిస్తున్న రాష్ట్రాల్లో పట్టు బిగించడంపైనే ఉంది. వివిధ రాష్ట్రాల్లో పార్టీని క్షేత్రస్థాయిలో విస్తరింపజేయడమే మోదీ–షా ద్వయం ముందున్న అసలు సిసలు సవాల్. రాష్ట్రాల్లో పట్టుబిగిస్తే తప్ప రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వానికి మెజార్టీ దక్కదు. కొత్త చట్టాలు చేసి పరిపాలనలో సంస్కరణలు తీసుకురావాలన్నా, బూజుపట్టిన పాత చట్టాలకు సవరణలు చేయాలన్నా పెద్దల సభలో బీజేపీకి మెజార్టీ అత్యవసరం. అప్పుడే ఈ జోడీ తాము అనుకున్నది సాధించగలదు. యూపీ, మహారాష్ట్ర, బిహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైతేనే పెద్దల సభలో పట్టు బిగించగలరు. -
బీజేపీని ప్రజలు ఆశీర్వదించారు
-
జాతీయ ఆశయాలు.. ప్రాంతీయ ఆశలు
న్యూఢిల్లీ: నవ భారత నిర్మాణానికి నూతన శక్తితో తమ ప్రభుత్వం నూతన ప్రయాణాన్ని ప్రారంభిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. కుల, విశ్వాసపరమైన మరే ఇతర వివక్షకు తావులేకుండా పనిచేయాల్సిందిగా కొత్తగా ఎన్నికైన ఎంపీలను ఆయన కోరారు. ‘జాతీయ ఆశయాలు .. ప్రాంతీయ ఆశలు (నేషనల్ యాంబిషన్స్, రీజనల్ ఆస్పిరేషన్స్– నారా)’ ఎన్డీయే కూటమికి తానిచ్చే నినాదంగా మోదీ చెప్పారు. ఎన్డీయే ఈ రెండు మార్గాల్లో ముందుకు వెళుతోందని, అభివృద్ధిని వేగవంతం చేసేందుకు ఈ రెండిటి కలయిక అవసరమని పేర్కొన్నారు. ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ నేతగా మోదీ శనివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో సమావేశమైన ఆయా పార్టీలకు చెందిన ఎంపీలు మోదీని తమ నేతగా ఎన్నుకున్నారు. ప్రకాశ్‌సింగ్ బాదల్ (అకాలీదళ్) మోదీ పేరును ప్రతిపాదిస్తూ తీర్మానం ప్రవేశపెట్టగా..నితీశ్ కుమార్ (జేడీయూ), ఉద్ధవ్ థాకరే (శివసేన) తదితర నేతలు బలపరిచారు. మోదీ 353 మంది ఎంపీల పార్లమెంటరీ పార్టీ నేతగా ఏకగ్రీవంగా ఎంపికైనట్లు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఎంపీల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. అంతకుముందు బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేతగా మోదీని ఆ పార్టీ ఎంపీలు ఎన్నుకున్నారు. మోదీ పేరును షా ప్రతిపాదించగా పార్టీ మాజీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కారీలు మద్దతు పలికారు. బీజేపీ సీనియర్ నేతలు ఎల్కే అద్వాణి, మురళీ మనోహర్ జోషి తదితరులు వేదికపై ఆసీనులయ్యారు. ఎన్డీయే నేతగా ఎన్నికైన తర్వాత శనివారం రాత్రి మోదీ రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. దీంతో మోదీని ప్రధానిగా కోవింద్ నియమించారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించారు. అంతకుముందు ఎన్డీయే నేతలు రాష్ట్రపతిని కలిసి తమ ఎంపీల జాబితాను అందజేశారు. కేబినెట్ కూర్పుపై మీడియా కథనాలు నమ్మొద్దు ఎన్డీయే పక్ష నేతగా ఎన్నికైన సందర్భంగా మోదీ 75 నిమిషాలకు పైగా ప్రసంగించారు. ఎన్నికల్లో మైనారిటీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారంటూ పరోక్షంగా ప్రతిపక్ష పార్టీలను విమర్శించారు. వారు ఎప్పుడూ భయంతో బతికేలా చేశారన్నారు. వారి విశ్వాసాన్ని కూడా పొందాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. 1857 నాటి స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తిని ఆయన గుర్తుచేశారు. ఆనాడు స్వాతంత్య్రం కోసం అన్ని మతాలూ చేతులు కలిపాయన్నారు. సుపరిపాలన కోసం ఇప్పుడు మళ్లీ అలాంటి ఉద్యమం ప్రారంభించాల్సి ఉందని మోదీ చెప్పారు. తమపై విశ్వాసం ఉంచిన వారితో పాటు, ఎవరి విశ్వాసం చూరగొనాల్సి ఉందో వారితో కూడా తాము ఉంటామన్నారు. ఈ సందర్భంగా మోదీ కొత్త ఎంపీలకు పలు సూచనలు కూడా చేశారు. వీఐపీ సంస్కృతిని విడనాడటంతో పాటు ప్రచారం కోసం మీడియాకు ప్రకటనలివ్వద్దని చెప్పారు. కొత్త మంత్రివర్గ కూర్పుపై మీడియాలో వచ్చే కథనాలను నమ్మవద్దన్నారు. అవన్నీ గందరగోళం సృష్టించడమే లక్ష్యంగా,, కొన్ని సందర్భాల్లో దురుద్దేశపూరితంగా ఉంటాయని అన్నారు. ఎన్డీయే ఎంపీలందరి వివరాలను తానింకా పరిశీలించాల్సి ఉందని చెప్పారు. నియమ, నిబంధనలను అనుసరించి బాధ్యతలు అప్పగించడం జరుగుతుందని అన్నారు. ప్రజలను ఏకం చేసిన ఎన్నికలు ఎన్నికలు ఎప్పుడూ విభజించడంతో పాటు అంతరాన్ని సృష్టిస్తాయని, కానీ 2019 ఎన్నికలు ప్రజలను, సమాజాన్ని ఏకం చేశాయని చెప్పారు. ఈసారి ప్రభుత్వ అనుకూల వాతావరణం ఉండటం గమనార్హమని, దాని ఫలితంగానే సానుకూల తీర్పు వెలువడిందని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సేవ చేయడానికి మించిన మంచి మార్గం మరొకటి లేదన్నారు. 2014–19 మధ్య పేదల కోసం ప్రభుత్వాన్ని నడిపామని, ఆ పేదలే ఇప్పుడు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని తాను చెప్పగలనని మోదీ అన్నారు. ఇప్పుడు లభించిన భారీ విజయం అంతే పెద్ద బాధ్యతను మనపై ఉంచిందని చెప్పారు. దేశాభివృద్ధికి ఎన్డీయే ఎంపీలందరూ కలసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పాల్గొన్న తెలంగాణ బీజేపీ ఎంపీలు లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన నలుగురు తెలంగాణ బీజేపీ ఎంపీలు శనివారం ఢిల్లీలో జరిగిన ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ, ఎన్డీయే పక్ష సమావేశంలో పాల్గొన్నారు. సికింద్రాబాద్ ఎంపీ కిషన్‌రెడ్డి, అదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌లు హాజరయ్యారు. ఎన్డీయే భారీ మెజారిటీతో తిరిగి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో తన తల్లి హీరాబా మోదీ ఆశీస్సులు తీసుకునేందుకు ప్రధాని ఆదివారం గుజరాత్ వెళ్లనున్నారు. వీఐపీ సంస్కృతిని దేశం అసహ్యించుకుంటుంది. విమానాశ్రయంలో సెక్యూరిటీ చెక్ కోసం మీరెందుకు క్యూలో నిలబడలేరు? అందులో తప్పేం లేదు. ‘రెడ్ లైట్’ (ఎర్ర బుగ్గ) సంస్కృతికి మోదీ స్వస్తి చెప్పారని ప్రజలు చెప్పుకుంటారు. మనోహర్ పరీకర్ ఏం చేసేవారో మీరు చూశారు. ఆయన్ను అనుసరించండి. ఎలాంటి వలలోనూ పడకండి. ప్రభుత్వ వ్యతిరేకత హానిచేస్తుంది. కానీ మనం చేసిన పని ప్రభుత్వ అనుకూల గాలి సృష్టించింది. ఫలితంగా సానుకూల ఓటును మనం చూడగలిగాం. 16వ లోక్‌సభ రద్దు కేంద్ర మంత్రివర్గం సిఫారసు నేపథ్యంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ 16వ లోక్ససభను రద్దు చేసినట్లు రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రుల రాజీనామాలను రాష్ట్రపతి శుక్రవారం ఆమోదించిన విషయం విదితమే. మోదీ మే 30న నూతన ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. కాగా ప్రమాణ స్వీకార తేదీ, సమయాన్ని, కొత్త మంత్రులుగా నియమించే వారి పేర్లను అందజేయాల్సిందిగా ప్రధానిని రాష్ట్రపతి కోవింద్ కోరినట్లు రాష్ట్రపతి భవన్ తెలిపింది. మోదీ 30న ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశముందని బీజేపీ శ్రేణులు తెలిపాయి. రాష్ట్రపతిభవన్‌లో మోదీకి ప్రధానిగా నియామక పత్రం ఇస్తున్న రాష్ట్రపతి కోవింద్ శనివారం ఢిల్లీలో పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఎన్డీఏ పార్లమెంటరీ బోర్డు సమావేశానికి హాజరైన ఎన్డీఏ ఎంపీలు, కూటమి నేతలు పార్లమెంటు ప్రాంగణంలో తెలంగాణ బీజేపీ ఎంపీలు బండి సంజయ్ కుమార్, కిషన్ రెడ్డి, సోయం బాపూరావు పార్లమెంటు లోపలికి వస్తూ ఎంపీ సన్నీడియోల్ విజయసంకేతం, పార్లమెంటు ద్వారం వద్ద మోకరిల్లాక నమస్కరిస్తున్న ఎంపీ హన్స్‌రాజ్ హన్స్ -
మంత్రివర్గంలోకి అమిత్ షా..!
న్యూఢిల్లీ: కేంద్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు దిశగా రంగం సిద్ధమయ్యింది. శుక్రవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ 16వ లోక్‌సభ రద్దుకు సిఫారసు చేసింది. సమావేశం ముగిసిన తర్వాత ప్రధాని మోదీ, మిగతా కేంద్రమంత్రులు రా6ష్టపతిని కలసి రాజీనామాలు సమర్పించారు. కేంద్ర మంత్రివర్గం రాజీనామాలు సమర్పించే సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి వారిని విందుకు ఆహ్వానించారు. వారి రాజీనామాలను ఆమోదించిన రాష్ట్రపతి కొత్త ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించే వరకు కొనసాగాల్సిందిగా ప్రధానిని కోరినట్లు రాష్ట్రపతిభవన్ తెలిపింది. అంతకుముందు ప్రధాని గైర్హాజరీలో మోదీ నాయకత్వాన్ని, గత ఐదేళ్లలో ప్రభుత్వం చేసిన కృషిని ప్రశంసిస్తూ కేంద్ర మంత్రులు ఒక తీర్మానం ఆమోదించారు. కాగా కొత్త మంత్రివర్గ పదవీ ప్రమాణ స్వీకారోత్సవం ఈ నెల 30న జరిగే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. జూన్ 3వ తేదీలోగా 17వ లోక్‌సభ కొలువుదీరాల్సి ఉంది. ఒకటీరెండు రోజుల్లో ముగ్గురు ఎన్నికల కమిషనర్లు రాష్ట్రపతిని కలసి కొత్తగా ఎన్నికైన సభ్యుల జాబితాను అందజేయడంతో కొత్త సభ ఏర్పాటు ప్రక్రియ మొదలవుతుంది. నేడు ఎన్డీయే సమావేశం మోదీని తమ నేతగా ఎన్నుకునేందుకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ఎంపీలు శనివారం సమావేశం కానున్నారు. కూటమి ప్రధాని అభ్యర్థిగా మోదీ ముందే ఖరారైన నేపథ్యంలో లాంఛనపూర్వకంగా ఈ భేటీ జరగనుంది. పార్లమెంటు సెంట్రల్ హాల్లో సాయంత్రం 5 గంటలకు ఈ సమావేశం జరగనుంది. అంతకుముందు పార్లమెంట్ హౌస్‌లో బీజేపీ ఎంపీలు సమావేశమవుతారు. ఎంపీలు తనను నేతగా ఎన్నుకున్న తర్వాత మోదీ వారినుద్దేశించి ప్రసంగిస్తారని సమాచారం. ఇలావుండగా ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు మే 28న మోదీ తన నియోజకవర్గం వారణాసిని సందర్శించే అవకాశం ఉందని పార్టీవర్గాలు వెల్లడించాయి. శుక్రవారం వారణాసి నుంచి వచ్చిన బీజేపీ కార్యకర్తలు మోదీని కలసి ఆయన ఎన్నికకు సంబంధించిన అధికారిక సర్టిఫికెట్‌ను అందజేశారు. సౌత్ బ్లాక్‌లో పీఎంఓ అధికారులతో ప్రధాని సమావేశమయ్యారు. ఈసారి మంత్రివర్గంలో అమిత్ షా లోక్‌సభ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి రెండోసారి అధికార పీఠాన్ని అధిరోహించేందుకు బీజేపీ సిద్ధమైన నేపథ్యంలో అందరి దృష్టీ కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై పడింది. ఈసారి మోదీ మంత్రివర్గంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సమా పలు కొత్త ముఖాలు కనబడే అవకాశం ఉందని తెలుస్తోంది. అమిత్ షాను మంత్రివర్గంలోకి తీసుకునే పక్షంలో ఆయనకు హోం, ఆర్థిక, విదేశీ వ్యవహారాలు, రక్షణ.. ఈ నాలుగు కీలక శాఖల్లో ఏదో ఒకటి అప్పగించవచ్చని తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌లు ఆరోగ్య సమస్యలతో బాధపడుతుండటంతో వీరు కొత్త మంత్రివర్గం లో ఉంటారా? లేదా? అన్న అనుమానాలు న్నాయి. రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక శాఖతో కేబినెట్లో కొనసాగే అవకాశం కన్పిస్తోంది. అమేథీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌పై సంచలన విజయం సాధించిన స్మృతీ ఇరానీకి పార్టీ ముఖ్యమైన బాధ్యతనే అప్పగించవచ్చు. వీరితో పాటు సీనియర్ మంత్రులు రాజ్‌నాథ్æ, నితిన్ గడ్కారీ, రవిశంకర్, గోయెల్, ప్రకాశ్ జవదేకర్లు కూడా కొనసాగవచ్చని తెలుస్తోంది. మిత్రపక్షాల్లో శివసేన (18), జేడీ(యూ) (16)లు మంచి ఫలితాలు సాధించిన నేపథ్యంలో వారికి కూడా చోటు దొరకవచ్చు. ఇక పశ్చిమ బెంగాల్, ఒడిశా, తెలంగాణల నుంచి కొత్త ముఖాలకు అవకాశం ఇచ్చే సూచనలున్నాయని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. సూర్యాస్తమయం అయినా వెలుగు కొనసాగుతుంది ప్రస్తుత ప్రభుత్వ పదవీకాలంపై సూర్యాస్తమయం అయినా ప్రజల జీవితాలను కాంతివంతం చేసేందుకు దాని వెలుగు ఇంకా కొనసాగుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ‘ఓ కొత్త ఉదయం ఎదురుచూస్తోంది...’ అంటూ శుక్రవారం ఒక ట్వీట్లో మోదీ పేర్కొన్నారు. మనమందరం కలలుగన్న నవ భారత సృష్టికి, 130 కోట్ల మంది ప్రజల కలలు నెరవేర్చేందుకు తన ప్రభుత్వం మరింత కృత నిశ్చయంతో ఉందని ఆయన తెలిపారు. అడ్వాణీ, జోషీలతో మోదీ–షా భేటీ సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా శుక్రవారం ఆ పార్టీ సీనియర్ నేతలు ఎల్కే అడ్వాణీ, మురళీమనోహర్ జోషీలను కలుసుకున్నారు. అమిత్ షాతో కలిసి తొలుత అడ్వాణీ ఇంటికెళ్లిన మోదీ, ఆయనకు పాదాభివందనం చేశారు. అనంతరం సార్వత్రిక ఎన్నికల ఫలితాల సరళిపై కొద్దిసేపు చర్చించారు. సమావేశం అనంతరం మోదీ స్పందిస్తూ..‘ఈరోజు బీజేపీ విజయం సాధించిందంటే అడ్వాణీలాంటి గొప్ప వ్యక్తులు దశాబ్దాలపాటు కష్టపడి పార్టీని నిర్మించడమే కారణం. వీరంతా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి సరికొత్తగా తీసుకెళ్లారు’ అని ట్వీట్ చేశారు. అనంతరం మోదీ, షా ద్వయం మురళీ మనోహర్ జోషి ఇంటికెళ్లారు. వీరిద్దరికి సాదరస్వాగతం పలికిన జోషి, మోదీకి శాలువాను బహూకరించారు. ఈ సందర్భంగా జోషికి పాదాభివందనం చేసిన మోదీ, తనవెంట తెచ్చిన స్వీట్స్‌ను అందించారు. దీంతో జోషి ధన్యవాదాలు తెలిపారు. ‘డా.మురళీమనోహర్ జోషి గొప్ప విద్యావేత్త. భారత విద్యావ్యవస్థను మెరుగుపర్చడంలో ఆయన పాత్ర చాలా కీలకమైంది. నాతో పాటు చాలామంది కార్యకర్తలకు మార్గదర్శిగా వ్యవహరించిన జోషి, బీజేపీని బలోపేతం చేసేందుకు నిరంతరం కృషి చేశారు’ అని మోదీ ప్రశంసించారు. ఈ సమావేశం అనంతరం జోషి మీడియాతో మాట్లాడుతూ.. మోదీ, అమిత్ షాలు బీజేపీకి బ్రహ్మాండమైన విజయాన్ని అందించారని కితాబిచ్చారు. ఎన్నికల్లో విజయం అనంతరం తనకు శుభాకాంక్షలు చెప్పిన అమెరికా ఉపాధ్యక్షుడు పాంపియో, రష్యా అధ్యక్షుడు పుతిన్, కెనడా ప్రధాని ట్రూడో, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, సౌదీ రాజు బిన్సల్మాన్లకు కృతజ్ఞతలు తెలిపారు. బాలీవుడ్ నటీనటులు శిల్పాశెట్టి, మాధవన్, సంగీత దర్శకుడు రెహమాన్, సరోద్ విద్వాంసుడు అమ్జాద్ ఆలీఖాన్, బాక్సర్ మేరీకోమ్లకు ధన్యవాదాలు చెప్పారు. సీనియర్ నేత ఎల్కే అద్వానీ పాదాలకు నమస్కరిస్తున్న ప్రధాని మోదీ -
‘కంటతడి పెట్టుకున్నారు కానీ ఆపలేదు’
ముంబై : నేను ఇప్పుడు సరైన, ఉత్తమమైన దారిలోనే వెళ్తున్నాను. దీనికి అద్వానీజీ ఆశీర్వాదాలు కూడా ఉన్నాయన్నారు నటుడు, కాంగ్రెస్ నాయకుడు శతృఘ్న సిన్హా. 20 ఏళ్లుగా బీజేపీతో కలిసి సాగిన శతృఘ్న.. సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ.. ‘నేను ఇప్పుడు సరైన దారిలో వెళ్తున్నాను. ఉత్తమైన మార్గాన్ని ఎంచుకున్నాను. ఇందుకు అద్వానీ ఆశీర్వాదాలు కూడా తీసుకున్నాను. నా నిర్ణయం తెలుసుకుని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. కానీ వెళ్లవద్దని నన్ను ఆపలేదు. సరే మంచిది అని మాత్రం అన్నార’ని తెలిపారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి అధ్వర్యంలో శతృఘ్న బీజేపీలో చేరారు. దాదాపు 20 ఏళ్ల పాటు బీజేపీతో కొనసాగిన శతృఘ్న.. కొన్ని రోజుల క్రితం కాంగ్రెస్‌లో చేరారు. వాజ్‌పేయి కాలంలో బీజేపీలో ప్రజాస్వామ్యం కనిపించేదని.. కానీ నేడు రాచరికం పెత్తనం చెలాయిస్తుందని శతృఘ్న ఆరోపించారు. ప్రస్తుతం పార్టీలో అనుభజ్ఞులను పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. బీజేపీ అద్వానీకి టికెట్ కేటాయించకపోవడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘నేను అద్వానీలానే. ఎవరికి తలవంచను. వారు కూర్చోమంటే కూర్చోవడం.. నిల్చోమంటే నిల్చోడం వంటి పనులు నేను చేయలేను’ అన్నారు. అంతేకాక నిరుద్యోగం, వ్యవసాయం సంక్షోభం గురించి ప్రశ్నిస్తే.. మోదీ పుల్వామా ఉగ్రదాడి గురించి మాట్లాడతారని శతృఘ్న మండిపడ్డారు. -
11 సార్లు ఎన్నికైన ఏకైక జననేత...
మొదటిసారి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయిన వాళ్లు మళ్లీ ఆ పదవి పొందాలని ఆశించడం సహజమే. అయితే, అందరికీ అది సాధ్యం కాదు. వాజపేయి, అడ్వాణీ, ఇంద్రజిత్ గుప్తా, సుమిత్రా మçహాజన్ వంటి వారు కొందరు అనేక సార్లు ఎంపీలుగా గెలిచినా మెజారిటీ ఎంపీలకు రెండో అవకాశం దక్కలేదని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 1951 నుంచి ఇంత వరకు జరిగిన ఎన్నికల్ని పరిశీలిస్తే... 60 శాతం ఎంపీలు అంటే ప్రతి ఐదుగురిలో ముగ్గురు రెండోసారి ఎంపీ కాలేకపోయారు. ఇంత వరకు జరిగిన 16 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 4,843 మంది ఎంపీలుగా (నామినేట్ ఎంపీలు 22 మంది కాకుండా) ఎన్నికయ్యారు. వీరిలో 2,840 మంది రెండోసారి ఎంపీలుగా ఎన్నిక కాలేదు. మిగిలిన 2003 మందిలో 50 శాతం మంది మూడోసారి ఎన్నికకాలేదు. అంటే వీరు రెండు సార్లు మాత్రమే గెలిచారు. మొత్తం ఎంపీల్లో 999 మంది రెండుసార్లు, 502 మంది మూడుసార్లు, 249 మంది నాలుగు సార్లు, 134 మంది ఐదు సార్లు గెలిచారు. ఒకసారికి మించి లోక్‌సభకు ఎన్నిక కాని వాళ్ల సంగతి ఇలా ఉంటే, కొందరు అనేకసార్లు పార్లమెంటుకు ఎన్నికయి రికార్డు సృష్టించారు. ఇంద్రజిత్ గుప్తా 11 సార్లు ఎన్నికయి దేశంలో ఆ ఘనత సాధించిన ఏకైక వ్యక్తిగా చరిత్ర నెలకొల్పారు. ఆ తర్వాత అటల్ బిహారీ వాజపేయి, సోమనాథ్ చటర్జీ, పీఎం సయీద్‌లు పదేసి సార్లు ఎంపీలయ్యారు. వీరు కాక తొమ్మిది మంది నాయకులు 9 సార్లు, పద్దెనిమిది మంది ఎనిమిది సార్లు, 34 మంది ఏడుసార్లు, 54 మంది 6 సార్లు,134 మంది ఐదు సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఇక నామినేటెడ్ ఎంపీల విషయానికి వస్తే ఇంత వరకు మొత్తం 22 మంది లోక్‌సభకు నామినేట్ కాగా వారిలో చాలా మంది కేవలం ఒకసారే నామినేట్ అయ్యారు. అయితే, ఆంగ్లో ఇండియన్ ఫ్రాంక్ అంటోనీ ఏకంగా 8సార్లు నామినేట్ అయి రికార్డు సృష్టించారు. ఏఈటీ బారో ఏడు సార్లు ఆంగ్లో ఇండియన్ సభ్యునిగా పార్లమెంటుకు నామినేట్ అయ్యారు. -
మోదీ అడ్వాణీ చెంపపై కొట్టారు
చండీగఢ్ / సిమ్లా: ప్రధాని మోదీ తనతో పాటు తన కుటుంబాన్ని ఎంతగా ద్వేషించినా తాను ప్రేమతోనే జవాబు ఇస్తానని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ తెలిపారు. ‘మోదీ నాకు, దివంగత ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీలకు వ్యతిరేకంగా విద్వేషాన్ని వ్యాప్తి చేయొచ్చు. కానీ నేను మాత్రం ప్రేమతోనే ఆయనకు జవాబిస్తా’ అని అన్నారు. రాజకీయాలను కబడ్డీ ఆటగా అభివర్ణించిన రాహుల్.. ‘మోదీ తన గురువైన అడ్వాణీ చెంపపై కొట్టారు’ అని వ్యాఖ్యానించారు. రాజకీయ గురువైన అడ్వాణీని మోదీ బీజేపీ మార్గదర్శక మండలికి పరిమితం చేయడంపై రాహుల్ ఈ మేరకు స్పందించారు. ఇది రిహార్సల్ మాత్రమే.. ‘ఇది డ్రస్ రిహార్సల్ మాత్రమే. మే 23(ఫలితాలు వెలువడే రోజు)న మరో తుపాను వస్తుంది. బీజేపీని కూకటివేళ్లతో సహా పెకలిస్తుంది’ అని అన్నారు. ఎన్నికల్లో బీజేపీ ఓటమి దిశగా వెళుతుండటంతో మోదీ కలవరపడుతున్నారని విమర్శించారు. ఈ ఆందోళనలో ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మధ్యప్రదేశ్‌లో ఇటీవల ప్రసంగంపై ఈసీ జారీచేసిన షోకాజ్ నోటీస్‌పై స్పందించారు. తాను ఎన్నికల నియమావళిని ఉల్లంఘించలేదనీ, ఓ చట్టానికి సంబంధించిన సవరణను సాధారణ పరిభాషలో ప్రజలకు వివరించానన్నారు. -
మోదీ అడ్వాణీకి పంచ్ ఇచ్చారు
భివానీ(హరియాణా): నిరుద్యోగంపై పోరాడేందుకు బాక్సింగ్ రింగ్‌లోకి దిగిన మోదీ.. అడ్వాణీకే ముఖంపై పంచ్ ఇచ్చారని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ ఎద్దేవా చేశారు. తన రాజకీయ గురువైన అడ్వాణీని మోదీ బీజేపీ మార్గదర్శకమండలికి పరిమితం చేయడంపై రాహుల్ ఈ మేరకు స్పందించారు. మోదీ కారణంగా దేశంలోని నిరుద్యోగులు, చిరువ్యాపారులు, రైతులు సహా అన్నివర్గాల ప్రజలు నష్టపోయారని వ్యాఖ్యానించారు. హరియాణాలో బాక్సర్ల తయారీకేంద్రంగా పేరుగాంచిన భివానీలో రాహుల్ గాంధీ సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చిరు వ్యాపారుల నడ్డివిరిచారు.. భివానీలో కాంగ్రెస్ నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్ మాట్లాడుతూ.. ‘‘56 అంగుళాల ఛాతి ఉందని ప్రగల్భాలు పలికే మోదీ అనే బాక్సర్ నిరుద్యోగాన్ని, రైతుల సమస్యలను, అవినీతిని ఓడిస్తానని రింగ్‌లోకి దిగాడు. ఈ బాక్సర్ రింగ్‌లోకి దిగిన వెంటనే తన గురువైన అడ్వాణీ ముఖంపై ఒక్క పంచ్ ఇచ్చాడు. ఆ తర్వాత నోట్లరద్దు, గబ్బర్ సింగ్ ట్యాక్స్(వస్తుసేవల పన్ను–జీఎస్టీ)తో దేశంలోని చిరువ్యాపారుల నడ్డి విరిచాడు. కనీస మద్దతుధర, రుణమాఫీ కోరుతున్న రైతులకు ఇంకో పంచ్ ఇచ్చాడు. గత ఐదేళ్లలో ఈ బాక్సర్ దేశంలోని నిరుపేదలను, వెనుకబడ్డ వర్గాలు, రైతులు, నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకున్నాడు. దీంతో ప్రజలంతా ‘ఈ బాక్సర్ మాకొద్దు’ అని మొరపెట్టుకుంటున్నారు. అసలు తాను ఎవరితో పోరాడుతున్నాడో ఈ బాక్సర్‌కు అర్థం కావట్లేదు’ అని ఎద్దేవా చేశారు. రైతులను అరెస్ట్ చేయబోం.. ‘మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే రుణాలను తిరిగి చెల్లించలేని రైతులను అరెస్ట్ చేయబోం. మేం మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతీహామీని అమలు చేస్తాం. కాంగ్రెస్ పార్టీకి ప్రజాభిప్రాయమే శిరోధార్యం’ అని స్పష్టం చేశారు. సాయుధ బలగాలను బీజేపీ రాజకీయం చేస్తోందనీ, కాంగ్రెస్ ఆ పని ఎన్నటికీ చేయబోదని తేల్చిచెప్పారు. ప్రధాని మోదీ తనను, తన కుటుంబాన్ని ఎంతగా ద్వేషించినా, ఆయన్ను తాను ప్రేమిస్తానని రాహుల్ అన్నారు. -
విశ్రాంతి తీసుకోమన్నా వినని అద్వానీ
అహ్మదాబాద్: బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ మరోసారి చాలా మందికి స్పూర్తి కలిగించేలా వ్యవహరించారు. తనకు ఆరోగ్యం సహకరించకపోయినప్పటికీ అద్వానీ తన హక్కును మరిచిపోలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నారు. జ్వరంతో బాధపడుతున్నప్పటికీ.. ఆ బాధను లెక్కచేయకుండా మంగళవారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అద్వానీ ప్రస్తుతం 102 డిగ్రీల జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో బీజేపీ అద్వానీని విశ్రాంతి తీసుకోవాల్సిందిగా కోరింది. కానీ ఆ మాటలు పక్కనబెట్టిన అద్వానీ అహ్మదాబాద్‌లోని షాపూర్ హిందీ స్కూల్లోని పోలింగ్ బూత్‌కు వచ్చి ఓటు వేశారు. తాను 1952 నుంచి ఎప్పుడు కూడా ఓటు హక్కు వినియోగించకుండా ఉండలేదని అద్వానీ పేర్కొన్నారు. ప్రస్తుతం అద్వానీ గాంధీనగర్ ఎంపీగా ఉన్నారు. అయితే ఈసారి బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఆ స్థానం నుంచి బరిలో నిలిచారు. కాగా, ఈ సారి ఎన్నికల్లో అద్వానీ పోటీ చేయడం లేదనే సంగతి తెలిసిందే.