BharatRatna to LK Advani అద్వానీ కంట తడి, కుమార్తె రియాక్షన్‌ | Bharat Ratna to LK Advani Daughter Pratibha Advani hugs and greats | Sakshi
Sakshi News home page

అద్వానీకి భారత రత్న పురస్కారం: అద్వానీ కంట తడి, కుమార్తె రియాక్షన్‌,

Published Sat, Feb 3 2024 2:28 PM | Last Updated on Sat, Feb 3 2024 3:37 PM

Bharat Ratna to LK Advani Daughter Pratibha Advani hugs and greats - Sakshi

#LKAdvanBharat Ratna బీజేపీ కురువృద్ధుడు, మాజీ ఉప ప్రధానమంత్రి లాల్ కిషన్ అద్వానీకి అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న లభించనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఈవిషయాన్ని ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. దేశ అభివృద్ధికి అద్వానీ  కృషి చిరస్మరణీయ మైందనీ, కింది స్థాయినుంచి ​దేశ ఉపప్రధాని స్థాయికి ఎదిగారని, దేశానికి ఎనలేని సేవలు చేశారంటూ మోదీ ప్రశంసించారు.   దీంతో  అద్వానీ కుటుంబం, బీజేపీ శ్రేణులతోపాటు దేశవ్యాప్తంగా  అద్వానీకి శుభాకాంక్షలు వెల్లువ కురుస్తోంది.

ఇది ఇలా ఉంటే తన తండ్రికి దేశ అత్యున్నత పురస్కారం దక్కడంపై అద్వానీ కుమార్తె ప్రతిభా అద్వానీ సంతోషం ప్రకటించారు.   ఢిల్లీలోని అద్వానీ నివాసంలో తండ్రిని కలిసిన ఆమె ఆయనకు లడ్డూ తినిపించిశుభాకాంక్షలందించారు. ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని ప్రత్యేక అభినందనలు తెలిపారు.

“దాదా (ఎల్‌కె అద్వానీ)కి దేశ అత్యున్నత గౌరవం లభించినందుకు కుటుంబం మొత్తం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు నేను నా తల్లిని చాలా మిస్ అవుతున్నాను. ఎందుకంటే  వ్యక్తిగత జీవితమైనా లేదా రాజకీయ జీవితమైనా ఆయన జీవితంలో ఆమె చేసిన సహకారం చాలా పెద్దది’’ అన్నారామె.  అలాగే తనను ఇంత పెద్ద అవార్డుతో సత్కరించినందుకు ప్రధాని మోదీకి, దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపు తున్నానని తన తండ్రి చెప్పారని ప్రతిభా అద్వానీ వెల్లడించారు.ఈ విషయంలో  తెలిసి  తండ్రి కళ్లలో నీళ్లు తిరిగాయని చెప్పారు.   ఆయన జీవిత కాల స్వప్నం రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా  కూడా ఆయన భావోద్వేగానికి లోనయ్యారని తెలిపారు.   

తన జీవితంలో ఈ దశలో, ఆయన చేసిన కృషికి ఈ అద్భుతమైన గుర్తింపు లభించడం గమనించడం చాలా అద్భుతంగా ఉందని సీనియర్ బీజేపీ నాయకుడు ఎల్‌కే అద్వానీ కుమారుడు జయంత్ అద్వానీ అన్నారు. 

కాగా గుజరాత్ ఉంచి లోక్‌సభకు ఆరుసార్లు ఎంపికయ్యారు అద్వానీ. 1991లో తొలిసారిగా ఇక్కడి నుంచి గెలుపొందిన ఆయన 2014 వరకూ లోక్‌సభకు ఎన్నికవుతూ వచ్చారు.. ప్రస్తుతం క్రియాశీలక రాజకీయాల నుంచి వైదొలి విశ్రాంతి తీసుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement