సాక్షి, ఢిల్లీ: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు భారతరత్న అవార్డులను ప్రదానం చేశారు. రాష్ట్రపతిభవన్‌లో భారతరత్న అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ సందర్బంగా ఇటీవల భారతరత్న పొందిన వారు అవార్డులను స్వీకరించారు.
మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్.. అలాగే, ఎమ్‌ఎస్ స్వామినాథన్, బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్‌ను మరణానంతరం భారతరత్న అవార్డు వరించింది. మాజీ ప్రధాని పీవీ నరసింహరావు తరపున భారతరత్న పురస్కారం అందుకున్న ఆయన కుమారుడు పీవీ ప్రభాకర్ రావు. చౌదరి చరణ్ సింగ్ తరపున భారతరత్న పురస్కారం అందుకున్న ఆయన కుమారుడు జయంత్ చౌదరి. మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ తరపున భారతరత్న పురస్కారం అందుకున్న ఆయన కుమారుడు రామ్‌నాథ్ ఠాకూర్. వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్. స్వామినాథన్ తరపున భారతరత్న పురస్కారం అందుకున్న ఆయన కుమార్తె డాక్టర్ నిత్య.
#WATCH | President Droupadi Murmu confers Bharat Ratna upon former PM Chaudhary Charan Singh (posthumously)
— ANI (@ANI) March 30, 2024
The award was received by Chaudhary Charan Singh's grandson Jayant Singh pic.twitter.com/uaNUOAdz0N
అనారోగ్యం కారణంగా హాజరు కాలేకపోయిన బీజేపీ సీనియర్ నేత అద్వానీ. దీంతో, రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ రేపు(ఆదివారం) ఎల్‌కే అద్వానీ ఇంటికి వెళ్లి అవార్డును అందించనున్నారు.
#WATCH | President Droupadi Murmu presents the Bharat Ratna award to former PM PV Narasimha Rao (posthumously)
— ANI (@ANI) March 30, 2024
The award was received by his son PV Prabhakar Rao pic.twitter.com/le4Re9viLM
అయితే, ఇటీవలే ఐదుగురికి కేంద్రం భారతరత్న అవార్డులను ప్రకటించింది. ఇందులో భాగంగానే నేడు భారతరత్నల ప్రదానం జరిగింది. ఇక, ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పలువురు నాయకులు పాల్గొన్నారు.
పీవీ కుటుంబ సభ్యుల హర్షం..
పీవీ నరసింహారావుకు భారత రత్న ఇవ్వడం సంతోషంగా ఉంది -శారద, పీవీ నరసింహారావు కూతురు
దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు సరైన దిశలో నడిపించారు. ఆయన చేసిన కృషికి భారతరత్న అవార్డు నిదర్శనం. నరేంద్ర మోదీకి ధన్యవాదాలు.- జస్టిస్ శ్రవణ్ కుమార్, పీవీ మనవడు
యూపీఏ హయంలోనే పీవీకి భారతరత్న రావాలి. అవార్డు ఆలస్యం అయినా, ఎన్డీఏ ప్రభుత్వం గుర్తించడం సంతోషం. పీవీ నరసింహారావుకు అనేక అవమానాలు జరిగాయి. ఆయన చేసిన మంచి పనులు కాంగ్రెస్ ఖాతాలో వేసుకున్నారు- సుభాష్ , పీవీ.మనవడు.
Comments
Please login to add a commentAdd a comment