PV Narasimha rao
-
దేశ ఆర్థిక ప్రగతిని పీవీ పరుగులు పెట్టించారు
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ప్రధాని దివంగత పీవీ నర్సింహారావు దేశ ఆర్థికప్రగతిని పరుగులు పెట్టించారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొనియాడారు. ఆయన తెచి్చన ఎన్నో సంస్కరణలు నేటికీ ఆదర్శంగా ఉన్నాయని చెప్పారు. పీవీ 103వ జయంతి సందర్భంగా ఢిల్లీలోని తన నివాసంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్, కోదాడ ఎమ్మెల్యే ఎన్.పద్మావతిరెడ్డిలతో కలసి రేవంత్ పీవీ చిత్రపటానికి నివాళులరి్పంచారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ విద్యావ్యవస్థలో పెనుమార్పులు తెచ్చి విద్యను అన్నివర్గా ల వారికి అందించిన వ్యక్తి పీవీ అన్నారు. ప్రధానిగా, ఉమ్మడి ఏపీ సీఎంగా, కేంద్రంలో వివిధ శాఖల మంత్రిగా దేశానికి, రాష్ట్రానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమ న్నారు. తెలంగాణ భవన్లో.. తెలంగాణభవన్‌లో ఏర్పాటు చేసిన పీవీ జయంతి కార్యక్రమానికి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు, ప్రభుత్వ విప్ లక్ష్మణరావు, ఎమ్మెల్యే శ్రీహరి, ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్‌రెడ్డిలు హాజరయ్యారు. ఆర్థిక అసమానతలు తొలగించేందుకు సంస్కరణలు తెచి్చన వ్యక్తి పీవీ అని భట్టి తెలిపారు. మంథని నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్రంలో పీవీ అనేక విద్యామార్పులు తెచ్చారని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. అనంతరం బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, గోడెం నగేశ్, టీడీపీ ఎంపీ కృష్ణప్రసాద్, బీఆర్ఎస్ ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, కేఆర్.సురేశ్‌రెడ్డి, దివికొండ దామోదర్‌లు నివాళులరి్పంచారు. ఆరుసార్లు మైక్ కట్.. మంత్రుల అసహనం భట్టి ప్రసంగిస్తుండగా మైక్ కట్ అయ్యింది. తొలుత సాంకేతికలోపం అనుకున్న భట్టికి మరో ఐదుపర్యాయాలు మైక్ కట్ అవ్వడం, మాట్లాడే మాట సరిగ్గా అర్థం కాకపోవడంతో అసహనానికి గురయ్యారు. ఓ పక్క ఆడిటోరియంలో జనాలు లేక మరోపక్క మైక్ సమస్యతో తన ప్రసంగాన్ని మధ్యలో ముగించేసిన భట్టి సీఎం నివాసానికి వెళ్లిపోయారు. అనంతరం శ్రీధర్‌బాబు మాట్లాడేటప్పుడు కూడా మైక్ కట్ అవ్వడంతో ఆయన కూడా ప్రసంగాన్ని మధ్యలోనే ముగించి వేదికపై కూర్చున్నారు.కార్యక్రమం ముగిసిన వెంటనే కింద ఉన్న డిప్యూటీ కమిషనర్ సంగీతను భవన్ లో ఎంత మంది పనిచేస్తున్నారని ప్రశ్నించారు. 120 మంది అని సమాధానం ఇవ్వడంతో.. పట్టు మని పదిమందిని తీసుకురాలేకపోయారు మీరేం ఆర్గనైజ్ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రాజకీయ చాతుర్యంలో.. ఆయనకు సాటి లేరు!
దేశ గమనాన్ని మలుపుతిప్పినవారు మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు. నాటకీయ పరిణామాల మధ్య ప్రధాని పీఠాన్ని అధిష్టించి మైనారిటీ ప్రభుత్వాన్ని ఐదేళ్లు నడపడం ఆయన పాలనాదక్షతకు ప్రతీక. అసలు ఆయన ప్రధాని కాకపోతే నేటి సరళీకరణ ఫలాలు మనకు కనిపించేవి కావేమో? దశ (అదృష్టం), దిశ (గమ్యం) రెండూ కొందరి జీవితాల్లో అనూహ్యంగా ట్విస్ట్ అవుతుంటాయి.దేశ రాజధానిలో మూడు దశాబ్దాల రాజకీయ జీవితానికి స్వస్తి చెప్పి, వానప్రస్థం స్వీకరించాలనుకున్న సీనియర్ కాంగ్రెస్ నేత పాములపర్తి వెంకట నరసింహారావు విషయంలో ఇదే జరిగింది. 1991 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకుండా డిల్లీ నుండి పెట్టే బేడాసర్దుకుని ఇంటిదారి పట్టేపనిలో ఉన్నారు. శ్రీ సిద్దేశ్వరి మఠం (తమిళనాడు)లో శేష జీవితం గడపటానికి వెళ్ళబోతున్నానని తన సన్నిహితులకు చెప్పారు.ఈ తరుణంలోనే 1991 మే 21 రాత్రి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మృత్యువాత పడటంతో, దేశ రాజకీయ పరిస్థితి ఒక్క ఉదుటున తారు మారయింది. ఇంకో విడత ఎన్నికలు జరగాల్సి ఉంది; పార్టీ అధ్యక్షుని హఠాన్మరణంతో అగాథంలో పడిన కాంగ్రెస్ నాయకులు మరుసటి రోజు మధ్యాహ్నం వర్కింగ్ కమిటీ మీటింగు ఏర్పాటు చేసి, అధ్యక్షుని స్థానంలో సీనియర్ నేత పీవీ నర్సింహారావును నియమించారు.కేవలం అరగంట పాటు జరిగిన ఆ సమావేశంలో వర్కింగ్ కమిటీ సభ్యులు, పార్టీ అధ్యక్షుని మరణ రీత్యా సంతాప తీర్మానం చేసి, తర్వాత తాత్కాలిక పార్టీ అధ్యక్షునిగా పీవీని నియమించారు. భర్తను కోల్పోయిన విషాదంలో, సోనియా గాంధీ పార్టీ కార్య కలాపాలకు దూరంగా ఉండాలనుకుంది. జూన్‌లో వెలువడిన 10వ లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ 232 సీట్లు సంపాదించి, అతి పెద్ద పార్టీగా ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది.గాంధీ కుటుంబీకులు రేసులో లేకపోవటంతో... అర్జున్ సింగ్, మాధవ్ రావ్ సింధియా, రాజేష్ పైలట్, శరద్ పవార్ లాంటి సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత పదవికి బరిలోకి దిగినప్పటికీ ఎన్నికైన అత్యధిక ఎంపీలు, గాంధీ కుటుంబానికి విధేయత, అనుభవం ఉన్న పీవీ వైపే మొగ్గు చూపారు. ‘పార్లమెంటు పార్టీ నేత ప్రధాని పీఠానికి అర్హుడు కాబట్టి, ఈ పదవికి పార్టీ ఎంపీలు తమలోని నాయకుణ్ణి డెమాక్రటిక్ పద్ధతిలోనే ఎన్నుకోవాలని’ పాచిక విసిరారు శరద్ చంద్ర పవార్. రాజకీయ చదరంగం ఆటలో అప్పటికే ఆయన పేరొందిన ఆటగాడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు.ఆయన అనునాయిడూ, పూణె ఎంపీ అయిన సురేష్ కల్మాడి (ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మాజీ స్క్వాడ్రన్ లీడర్) మహారాష్ట్ర సదన్ నుండి, ఉత్తరాది కాంగ్రెస్ ఎంపీలను పవార్ లాబీ కోసం సమీకరణ చేస్తూ షాం–ఏ–దావతులు ఏర్పాటు చేశారు. ఇటు కేరళ హౌస్ నుండి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. కరుణాకరన్, పీవీ కోసం దక్షిణాది కాంగ్రెస్ ఎంపీలను ఏకతాటిపై తేవటానికి ప్రయత్నాలు జరిపారు. అక్బర్ రోడ్డులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం జూన్ 19 నాడు కాంగ్రెస్ నేతలతో కిక్కిరిసింది. 232 మంది నూతన ఎంపీలను పార్లమెంటరీ పార్టీ నాయకుణ్ణి ఎన్నుకోమని ఒకవేళ ఓటింగ్ నిర్వహిస్తే పవార్ 35 ఓట్లతో వెనుకంజలో ఉంటాడని తెలిసిపోయింది. వీరిని తన వైపు మరల్చుకోవటానికి ఆయనకు ఇట్టే సమయం పట్టదని గ్రహించిన పీవీ, పోటీకి దిగిన శరద్ పవార్‌ను ఆఖరి ప్రయత్నంగా, ఒక వైపు తీసుకెళ్లాడు.ఏకాంతంలో పవార్‌తో, ఈ మధ్యనే తన గుండెకు శస్త్ర చికిత్స జరిగిందనీ, వయోభారంతో రాజకీయ విధులు నిర్వర్తించటం ఎక్కువ కాలం సాధ్యపడక పోవచ్చని చెబుతూ... మరాఠీలో, ‘మీ హీ జబాబ్దారీ మాఝ్య ఖాంధ్యా వర్ కితీ దివస్ పేల్వూ (నేను ఈ భాధ్యత నా భుజాలపై వేసుకుని ఎన్ని రోజులని మోయగలను) అంటూ, ‘కొన్ని రోజులపాటు తనకు ప్రధానిగా అవకాశం ఇవ్వవలసిందిగా’ నవ్వుతూ కోరాడు పీవీ. పీవీ తాత్విక ధోరణితో మాట్లాడిన మాటలకు చలించి పోయారు పవార్ సాహెబ్.మరుసటి రోజు ఉదయం (జూన్ 20) పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. హాజరైన ఎంపీలు అంతా హాలులోకి ప్రవేశించిన శరద్ పవార్ వైపే సస్పెన్స్‌తో చూస్తున్నారు. మీటింగు ఆరంభం కావటంతోనే పవార్, జేబులోనుండి తను రాసిన ఒక లెటర్ తీసి సభ్యుల ముందుంచారు. ‘పార్టీ నాయకత్వాన్ని నిర్ణయించడంలో సీపీపీని సమావేశ పరచాలన్న డిమాండ్‌ను కాంగ్రెస్ అధ్యక్షులు (పీవీ) అంగీకరించడాన్ని నేను స్వాగతిస్తున్నాను. సీపీపీ సభ్యులందరూ శ్రీ పీవీ నరసింహారావుకు మద్దతు ఇవ్వాలనీ, ఈ విషయంలో ఏకగ్రీవ నిర్ణయానికి రావాలనీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను’ అని అందులో కోరారు.అంతే, మరునాడు (1991 జూన్ 21) రాష్ట్రపతి భవన్లో పీవీ నరసింహారావు తొమ్మిదవ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తను ప్రధాని అయ్యాక, శరద్ పవార్‌ను పార్టీ జాతీయ అధ్యక్షునిగా నియమిస్తానని రావు ప్రామిస్ చేసినట్టు అంటారు. కాని, ఏప్రిల్ 1992 ఏప్రిల్‌లో జరిగిన తిరుపతి కాంగ్రెస్ పార్టీ సదస్సులో, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని తన అనుకూల సభ్యులతో పునర్వ్యవస్థీకరించి, అధ్యక్షునిగా పార్టీ పగ్గాలు సైతం నాటకీయంగా కైవసం చేసుకున్నారు అపర చాణక్యుడు పీవీ నరసింహారావు. (శరద్ పవార్ రాజకీయ ఆత్మకథ ‘లోక్ మాఝే సాంగతి’, రషీద్ కిద్వాయి రాసిన ‘24 అక్బర్ రోడ్’ ఆధారంగా) వ్యాసకర్త విశ్రాంత పీఎఫ్ కమిషనర్ 9819096949.సందర్భం: - జిల్లా గోవర్ధన్ -
మహామహులకూ తప్పని... ఓటమి
రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ప్రజలు ఎప్పుడు ఎలాంటి తీర్పు ఇస్తారో, ఏ అనామకున్ని అందలమెక్కిస్తారో, ఏ దిగ్గజాన్ని తిరస్కరిస్తారో అనూహ్యం. తిరుగులేదనుకున్న మహామహ నేతలు ఓటమిపాలైన ఉదంతాలు మన దేశ ఎన్నికల చరిత్రలో ఎన్నో! అలాంటి పది మంది దిగ్గజ నేతల అనూహ్య ఓటమి చరిత్రను ఓసారి చూద్దాం... – సాక్షి, నేషనల్ డెస్క్బాబా సాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగ నిర్మాతగా యావద్దేశానికీ ప్రాతఃస్మరణీయుడు. అంతటి మహా నాయకుడు కూడా ఎన్నికల్లో ఓడతారని ఊహించగలమా?! కానీ 1951–52లో జరిగిన దేశ తొలి సార్వత్రిక ఎన్నికల్లో అంబేడ్కర్ ఓటమి చవిచూడాల్సి వచి్చంది! నార్త్ బాంబే లోక్‌సభ నుంచి పోటీచేసి ఓడిపోవడమే కాదు, ఏకంగా నాలుగో స్థానంలో నిలిచారాయన! ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విఠల్ బాలకృష్ణ గాంధీ గెలుపొందారు. ఇందిరాగాంధీ దేశ రాజకీయాల్లో అజేయ శక్తిగా వెలిగిపోయిన నాయకురాలు. తొలి, ఏకైక మహిళా ప్రధాని. దశాబ్దానికి పైగా తిరుగులేని అధికారం చలాయించిన ఇందిర 1977 లోక్‌సభ ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకతలో కొట్టుకుపోయారు. ఎమర్జెన్సీ నిర్ణయం ఆమె ఏకైక ఎన్నికల ఓటమికి బాటలు వేసింది. రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానంలో సోషలిస్టు పార్టీ ప్రముఖుడు, రాం మనోహర్ లోహియా సన్నిహితుడు రాజ్ నారాయణ్ చేతిలో ఇందిర ఓటమి చవిచూశారు. ఆయన 1971 లోక్‌సభ ఎన్నికల్లో కూడా సంయుక్త సోషలిస్ట్ పార్టీ అభ్యర్థిగా ఇందిరపై పోటీ చేసి ఓడిపోయారు.కానీ ఇందిర అవినీతికి పాల్పడ్డారని, ఆమె ఎన్నిక చెల్లదని కోర్టుకెక్కారు. ఇది అంతిమంగా ఎమర్జెన్సీ విధింపుకు దారి తీయడం విశేషం! రాజ్‌నారాయణ్ వాదనతో అలహాబాద్ హైకోర్టు ఏకీభవించింది. రాయ్‌బరేలీ నుంచి ఇందిర ఎన్నిక చెల్లదని ప్రకటించింది. అంతేగాక ఆరేళ్ల పాటు లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయకుండా నిషేధం విధించింది. దాంతో చిర్రెత్తుకొచి్చన ఇందిర 1975లో దేశమంతటా ఎమర్జెన్సీ విధించారు. 1977లో ఎమర్జెన్సీ ఎత్తేసి లోక్‌సభ ఎన్నికలకు వెళ్లి రాజ్‌నారాయణ్ చేతిలో 50 వేల పైగా ఓట్ల తేడాతో ఓడారు. ఇది భారత ఎన్నికల చరిత్రలోనే సంచలనాత్మక ఫలితంగా నిలిచిపోయింది.మినూ మసాని మినోచర్ రుస్తోమ్ మసాని. స్వాతంత్య్ర సమరయోధుడు. స్వతంత్ర పార్టీ అగ్ర నేత. మూడుసార్లు పార్లమెంటు సభ్యుడు, ఇండియన్ లిబరల్ గ్రూప్ థింక్ ట్యాంక్ వ్యవస్థాపకుల్లో ఒకరు. సంపాదకుడు, సామాజిక కార్యకర్త. ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలి. అసమానతలకు వ్యతిరేకంగా బలమైన గొంతుక వినిపించిన మసాని 1971 లోక్‌సభ ఎన్నికల్లో రాజ్‌కోట్ నుంచి ఓటమి చవిచూడాల్సి వచి్చంది. కాంగ్రెస్ నాయకుడు ఘన్‌శ్యామ్ బాయ్ ఓజా చేతిలో 60,000 ఓట్లకు పైగా తేడాతో ఓడిపోయారు.అటల్ బిహారీ వాజ్‌పేయ్ రాజకీయ దురంధరుడు. భారత రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన నాయకుడు. అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్న ఆయనకూ ఎన్నికల ఓటమి తప్పలేదు. 1984 లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన కీలక కాంగ్రేసేతర నేతల్లో వాజ్‌పేయి ఒకరు. గ్వాలియర్‌లో కాంగ్రెస్ నేత మాధవరావు సింధియా రెండు లక్షల పై చిలుకు ఓట్ల మెజారిటీతో ఆయనపై విజయం సాధించారు.సీకే జాఫర్ షరీఫ్ భారత రైల్వేల్లో స్వర్ణ యుగానికి నాంది పలికిన దార్శనికుడు. కాంగ్రెస్ సీనియర్ నేతల్లో ఒకరు. 2004లో తొలిసారి లోక్‌సభ ఎన్నికల ఎన్నికల బరిలో దిగిన హెచ్‌టీ సాంగ్లియానా చేతిలో ఓటమి చవిచూశారు. అప్పటిదాకా డీజీపీగా ఉన్న సాంగ్లియానా బీజేపీ ఆహా్వనం మేరకు పదవీ విరమణ చేసి పారీ్టలో చేరారు. పాత బెంగళూరు ఉత్తర లోక్‌సభ స్థానం నుంచి బరిలో దిగి షరీఫ్‌పై విజయం సాధించారు.దేవెగౌడఅత్యంత అనుభవజు్ఞడైన నాయకుడు. ప్రధానిగా దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించారు. అనంతరం కర్నాటక రాజకీయాల్లో కింగ్ మేకర్ అయ్యారు. ఆయనకు కూడా లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తప్పలేదు. 2004లో కర్నాటకలోని కనకపుర నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నేత తేజస్వినీ గౌడ రమేశ్ చేతిలో లక్ష పై చిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు.బిజోయ్ కృష్ణ హండిక్ గొప్ప విద్యావేత్త. కాంగ్రెస్ నుంచి ఆరుసార్లు ఎంపీగా గెలుపొందిన తిరుగులేని అస్సామీ నేత. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. జోర్హాట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కేపీ తాసా ఆయనపై లక్ష ఓట్ల పై చిలుకు మెజారిటీతో గెలుపొందారు.సోమనాథ్ ఛటర్జీ సీపీఎం దిగ్గజం. పదిసార్లు లోక్‌సభ సభ్యునిగా గెలిచిన ఎదురులేని నేత. 1971లో తొలిసారి సీపీఎం తరఫున పశి్చమబెంగాల్‌లోని బుర్ద్వాన్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1984లో మాత్రం జాదవ్‌పూర్ లోక్‌సభ స్థానంలో యువ సంచలనం మమతా బెనర్జీ చేతిలో ఓటమి చవిచూశారు. ఆ తర్వాత మాత్రం 1989 నుండి 2004 వరకు సోమనాథ్ విజయ పరంపర సాగింది. సీపీఎం కంచుకోటగా భావించే బోల్పూర్ లోక్‌సభ స్థానం నుంచి 2004లో పదోసారి గెలిచి 14వ లోక్‌సభ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.అరుణ్ జైట్లీపారీ్టలకతీతంగా అందరూ మెచ్చిన నేత. ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితుడు. కేంద్ర ఆర్థిక మంత్రిగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తొలిసారి మోదీ హవా కొనసాగిన 2014 లోక్‌సభ ఎన్నికల్లో అరుణ్ జైట్లీ మాత్రం ఓటమి చవిచూశారు. అమృత్సర్ లోక్‌సభ స్థానం నుంచి పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెపె్టన్ అమరిందర్ సింగ్ లక్ష ఓట్ల పై చిలుకు మెజారిటీతో జైట్లీపై గెలుపొందారు. పీవీ నరసింహారావుపాములపర్తి వేంకట నరసింహారావు. ప్రధాని పదవిని అధిష్టించిన తొలి దక్షిణాది వ్యక్తి. ఒకే ఒక్క తెలుగువాడు. బహుముఖ ప్రజ్ఞాశాలి. కుదేలైన దేశ ఆరి్ధక వ్యవస్థను విప్లవాత్మక సంస్కరణలతో పట్టాలెక్కించి ఆధునిక బాట పట్టించిన దార్శనికుడు. అంతటి నాయకునికి కూడా ప్రధాని కాకమునుపు ఓటమి తప్పలేదు. 1984 ఎన్నికల్లో బీజేపీ దేశవ్యాప్తంగా గెలిచిన రెండు లోక్‌సభ స్థానాల్లో తెలంగాణలోని హన్మకొండ ఒకటి. బీజేపీ అభ్యర్థి చందుపట్ల జంగారెడ్డి అక్కడ పీవీపై విజయం సాధించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌పై సానుభూతి వెల్లువెత్తినా ఆ పార్టీ తరఫున పోటీ చేసిన పీవీ మాత్రం ఓటమి చవిచూడటం విశేషం. -
పీవీ, చరణ్ సింగ్ సహా నలుగురికి భారతరత్న ప్రదానం
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ప్రధాన మంత్రులు పీవీ నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్లకు మరణానంతరం దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శనివారం ప్రదానం చేశారు. పీవీ నరసింహారావు తరఫున ఆయన కుమారుడు పీవీ ప్రభాకర్‌రావు, చరణ్ సింగ్ తరఫున ఆయన మనవడు జయంత్ చౌదరి, ఎంఎస్ స్వామినాథన్ తరఫున ఆయన కుమార్తె నిత్యా రావు, కర్పూరీ ఠాకూర్ తరఫున కుమారుడు రాంనాథ్ ఠాకూర్ పురస్కారాన్ని అందుకున్నారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే హాజరయ్యారు. ఈ సందర్భంగా పీవీ సేవలను స్మరించుకుంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. బీజేపీ నేత ఎల్కే అద్వానీకి భారతరత్న పురస్కారాన్ని ఆదివారం ఆయన నివాసంలో రాష్ట్రపతి ప్రదానం చేయనున్నారు. -
భారతరత్న ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
సాక్షి, ఢిల్లీ: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు భారతరత్న అవార్డులను ప్రదానం చేశారు. రాష్ట్రపతిభవన్‌లో భారతరత్న అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ సందర్బంగా ఇటీవల భారతరత్న పొందిన వారు అవార్డులను స్వీకరించారు. మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్.. అలాగే, ఎమ్ఎస్ స్వామినాథన్, బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్‌ను మరణానంతరం భారతరత్న అవార్డు వరించింది. మాజీ ప్రధాని పీవీ నరసింహరావు తరపున భారతరత్న పురస్కారం అందుకున్న ఆయన కుమారుడు పీవీ ప్రభాకర్ రావు. చౌదరి చరణ్ సింగ్ తరపున భారతరత్న పురస్కారం అందుకున్న ఆయన కుమారుడు జయంత్ చౌదరి. మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ తరపున భారతరత్న పురస్కారం అందుకున్న ఆయన కుమారుడు రామ్‌నాథ్ ఠాకూర్. వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్. స్వామినాథన్ తరపున భారతరత్న పురస్కారం అందుకున్న ఆయన కుమార్తె డాక్టర్ నిత్య. #WATCH | President Droupadi Murmu confers Bharat Ratna upon former PM Chaudhary Charan Singh (posthumously) The award was received by Chaudhary Charan Singh's grandson Jayant Singh pic.twitter.com/uaNUOAdz0N — ANI (@ANI) March 30, 2024 అనారోగ్యం కారణంగా హాజరు కాలేకపోయిన బీజేపీ సీనియర్ నేత అద్వానీ. దీంతో, రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ రేపు(ఆదివారం) ఎల్కే అద్వానీ ఇంటికి వెళ్లి అవార్డును అందించనున్నారు. #WATCH | President Droupadi Murmu presents the Bharat Ratna award to former PM PV Narasimha Rao (posthumously) The award was received by his son PV Prabhakar Rao pic.twitter.com/le4Re9viLM — ANI (@ANI) March 30, 2024 అయితే, ఇటీవలే ఐదుగురికి కేంద్రం భారతరత్న అవార్డులను ప్రకటించింది. ఇందులో భాగంగానే నేడు భారతరత్నల ప్రదానం జరిగింది. ఇక, ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పలువురు నాయకులు పాల్గొన్నారు. పీవీ కుటుంబ సభ్యుల హర్షం.. పీవీ నరసింహారావుకు భారత రత్న ఇవ్వడం సంతోషంగా ఉంది -శారద, పీవీ నరసింహారావు కూతురు దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు సరైన దిశలో నడిపించారు. ఆయన చేసిన కృషికి భారతరత్న అవార్డు నిదర్శనం. నరేంద్ర మోదీకి ధన్యవాదాలు.- జస్టిస్ శ్రవణ్ కుమార్, పీవీ మనవడు యూపీఏ హయంలోనే పీవీకి భారతరత్న రావాలి. అవార్డు ఆలస్యం అయినా, ఎన్డీఏ ప్రభుత్వం గుర్తించడం సంతోషం. పీవీ నరసింహారావుకు అనేక అవమానాలు జరిగాయి. ఆయన చేసిన మంచి పనులు కాంగ్రెస్ ఖాతాలో వేసుకున్నారు- సుభాష్ , పీవీ.మనవడు. -
వెబ్ సిరీస్‌గా పీవీ నరసింహారావు బయోపిక్
భారతదేశ దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు జీవితంతో వెబ్ సిరీస్ రూ΄÷ందనుంది. ఆహా స్టూడియో, అ΄్లాజ్ ఎంటర్టైన్మెంట్ కలిసి ‘హాఫ్ లయన్’ పేరుతో ఈ వెబ్ సిరీస్ నిర్మించనున్నట్లు ప్రకటించాయి. ప్రముఖ రచయిత వినయ్ సీతాపతి రచించిన ‘హాఫ్ లయన్’ పుస్తకం ఆధారంగా జాతీయ అవార్డు గ్రహీత ప్రకాశ్ ఝా ఈ సిరీస్‌కి దర్శకత్వం వహించ నున్నారు. ‘‘1991 నుంచి 1996 వరకు పీవీ నరసింహారావు అందించిన విశేష సేవలకుగానూ భారత ప్రభుత్వం అత్యున్నత ΄ûర పురస్కారం ‘భారతరత్న’ ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ సిరీస్‌ను రూ΄÷ందిస్తాం’’ అని మేకర్స్ అన్నారు. -
మరణానంతర ప్రదానం మంచిదేనా?
ఇటీవల ప్రకటించిన భారతరత్న పురస్కారాల్లో ముగ్గురికి మరణానంతరం ఇచ్చారు. ఆ ముగ్గురూ దానికి పూర్తి అర్హులు. కానీ వీటిని వారు బతికి ఉన్నప్పుడే ఇచ్చివుంటే ఎంత బాగుండేది! 53 మంది ఇప్పటివరకు ‘భారతరత్న’తో అలంకృతులయ్యారు. వారిలో 18 మందికి మరణానంతరం ప్రకటించారు. మరణానంతర ప్రదానంలోని ఇబ్బంది ఏమిటంటే, ఫలానావాళ్లకు ఎందుకు ఇవ్వలేదనే ప్రశ్నకు సమాధానం ఉండదు. కర్పూరీ ఠాకూర్‌కు ఇచ్చినప్పుడు, అన్నాదురైకి ఎందుకు ఇవ్వకూడదు? మరి రాంమనోహర్ లోహియాను ఎలా విస్మరిస్తారు? మొదటి నుంచీ మరణానంతరం ఇవ్వడాన్ని ఒక నియమంగా కాక, ఒక మినహాయింపుగా మాత్రమే చూశారు. జీవించి ఉన్నప్పుడు ఇవ్వడమే భారతరత్నకు ప్రమాణంగా ఉండటం మంచిది. చౌధురీ చరణ్ సింగ్, పీవీ నరసింహారావు, ఎం.ఎస్. స్వామినాథన్ – ముగ్గురికీ మరణానంతరం ‘భారతరత్న’ పురస్కారం ప్రకటించడమే ఈ వ్యాసం రాయడానికి నన్ను పురిగొల్పింది. ఈ ముగ్గురూ దానికి పూర్తిగా అర్హులు, ప్రశంసించదగినవారు. వాస్తవానికి వీరికి అత్యున్నత పురస్కారం ప్రకటించడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా ‘సెల్యూట్’ చేసింది. కానీ రెండు యూపీఏ (యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్) ప్రభుత్వాలూ లేదా రెండు ఎన్డీయే (నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్) ప్రభుత్వాలూ ఇన్నేళ్లుగా వీరిని ఈ రత్నాలతో ఎందుకు సత్కరించలేదనేది ప్రశ్న. నిజంగానే రత్నాలైన వీరిని దేశం కృతజ్ఞతతో అధికారికంగా కూడా అలాగే పరిగణిస్తుందనే విషయాన్ని వారి జీవితకాలంలోనే చెప్ప వలసింది కదా! అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కుమార్తె ఇందిరా గాంధీ 1954 ఆగస్టు 15న మొదటి భారతరత్న సి. రాజగోపాలాచారికి ఇలా రాశారు: ‘మీరు మొదటి భారతరత్న అయినందుకు మేమంతా చాలా సంతోషిస్తున్నాము. చాలా ఏళ్లుగా భారత్‌కు ‘రత్నం’గా మీరు గుర్తింపు పొందారు. అది ఇప్పుడు అధికారికంగా ప్రకటించడం చాలా మంచి విషయం.’ 53 మంది ఇప్పటివరకు ‘భారతరత్న’తో అలంకృతులయ్యారు. వారిలో 18 మందికి మరణానంతరం ప్రకటించారు. నేను ‘ఇప్పటి వరకు’ అని నొక్కి చెబుతున్నాను. ఎందుకంటే గత కొన్ని రోజులుగా, ఈ గుర్తింపులు వెంటవెంటనే వచ్చేస్తున్నాయి. నేను ఈ అంశంపై మరింతగా చెప్పడానికి ముందు, కొన్ని గణాంకాలను చూద్దాం. భారతరత్న పురస్కారాలన్నింటినీ వరుస రాష్ట్రపతులే ప్రదానం చేశారు. అయినప్పటికీ ఈ విషయంలో దాదాపుగా దేశ ప్రధానులదే అధికారం. వీరిలో కొందరు ప్రధానులు తాము కూడా దీన్ని పొందారు. నెహ్రూ (1947–64) తనతో కలుపుకొని, 13 మందికి అవార్డును ప్రదానం చేశారు. గుల్జారీలాల్ నందా పరివర్తనా కాలపు బాధ్యత (1966)లో ఉన్నప్పుడు ఒక్క భారతరత్నను ఇచ్చారు. ఇందిరా గాంధీ తన మొదటి ప్రధానమంత్రి పదవీ కాలంలో (1965–77) తనకు ఒకటి, మూడు ఇతరులకు ప్రదానం చేశారు. ఆమె రెండోసారి ప్రధానిగా ఉన్నప్పుడు (1980–84) ఇద్దరికి ఇచ్చారు. రాజీవ్ గాంధీ (1984–89) ఇద్దరికీ, వీపీ సింగ్ (1989– 90) ఇద్దరికీ, పీవీ నరసింహారావు (1991– 96) ఆరుగురికీ, ఐకే గుజ్రాల్ (1997–98) నలుగురికీ, అటల్ బిహారీ వాజ్‌పేయి (1999–2004) ఏడుగురికీ, మన్మోహన్ సింగ్ (2004–14) ముగ్గురికీ ఇచ్చారు. నరేంద్ర మోదీ (2014–) హయాంలో పదిమందికి ప్రకటించారు. ఇప్పటివరకు అత్యధిక కాలం ప్రధానిగా ఉన్న నెహ్రూ తన పదవీ కాలంలో అత్యధిక సంఖ్యలో 13 భారతరత్నలను ప్రదానం చేశారు. నరేంద్ర మోదీ ఆ తర్వాత అత్యధిక సంఖ్యలో పదిమందికి ఇచ్చారు. భారత రత్నలు ప్రకటించడం 1954లో ఉనికిలోకి వచ్చిందని గుర్తుంచుకుంటే, ‘సాంద్రత’ పరంగా ఇద్దరు ప్రధానులూ సమానంగా పదేళ్లలో పది మందికి ఇచ్చారు. మరణానంతరం ప్రదానం చేసిన భారతరత్నల సంఖ్యలో మాత్రం మోదీ ముందున్నారు. మరణానంతరం ప్రకటించిన 18 భారతరత్నాలలో మోదీ స్కోరు ఏడు. తదుపరి అత్యధికం పీవీ నరసింహారావుది– మూడు. భారతరత్న అసలు ప్రకాశాన్ని రెండు పరిణామాలు ప్రభావితం చేశాయి: ఒకటి, మరణానంతరం బహూకరించడం. ముందుగా ఈ అంశాన్ని చేపడదాం. దీనిని 1955 జనవరి 15న, నాటి భారత ప్రభుత్వ గెజిట్ నంబర్ 222 ద్వారా ప్రారంభించారు. అయితే దీన్ని ఒక నియమంగా కాక, ఒక మినహాయింపుగా మాత్రమే చూశారు. ఈ ‘సడలింపు’ అమలులోకి రావడానికి పదేళ్లు పట్టింది. 1966 జనవరి 11న తాష్కెంట్లో అప్పటి ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి మరణించిన కొన్ని గంటల్లోనే ఆయనకు రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ తొలి మరణానంతర భారతరత్నను ప్రకటించారు. రెండవ మరణానంతర భారతరత్నకు మరో పదేళ్లు పట్టింది. ప్రధాని ఇందిరాగాంధీ దాన్ని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు కె. కామరాజ్‌కు ప్రకటించారు. అయితే, ఆయన జీవించి ఉంటే, ఆయన జీవిత కాలంలో ఆమె ఆ గౌరవం ఇచ్చివుండేవారు కాదు. కాంగ్రెస్వాద మూలాలతో కూడిన మరణానంతర భారతరత్న కొనసాగుతోంది. అదే సమయంలో ‘జీవించి ఉండగా’ ఇవ్వడాన్ని అధిగమించింది. మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాల హయాంలో ప్రదానం చేసిన పదింటిలో ఏడు మరణానంతరమైనవి. అయితే ‘అర్హత’కు సంబంధించిన ప్రశ్నలు అనివార్యంగా తలెత్తు తాయి. మరణానంతర గ్రహీతల్లో ప్రధానులు వీపీ సింగ్, చంద్రశేఖర్‌లను వదిలివేయవచ్చా? బిహార్ దివంగత ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌కు ఈ పురస్కారం లభించినందున, సీఎన్ అన్నాదురైనీ, సాటిలేని ఈఎంఎస్ నంబూద్రిపాద్నూ విస్మరించగలమా? మరి మన కాలానికి దగ్గరగా ఉండే ఎం.కరుణానిధి, జ్యోతి బసు సంగతి? ఆచార్య వినోబా భావే మరణానంతరం పొందారు. అలాంటప్పుడు జేబీ కృపలానీ, నరేంద్ర దేవ్ వంటి ఆచార్యులను మరచిపోగలమా? జయప్రకాశ్ నారాయణ్, నానాజీ దేశ్‌ముఖ్ వంటి రాజకీయ చింతనా పరులు మరణానంతరం పొందినప్పుడు, పెరియార్‌కు ఇవ్వకూడదా? కల్లోల తుఫాన్లను దాటి దూసుకొచ్చే సముద్ర పక్షి లాంటి అరుణా అసఫ్ అలీ భారతరత్నను పొందారు. మరింత ‘తుఫాను లాంటి’ కమలాదేవీ ఛటోపాధ్యాయను వదిలివేయవచ్చా? కాంగ్రెస్ వాళ్లు ఈ ఆలోచనంటేనే విరుచుకుపడతారేమోగానీ ఏ సోషలిస్టు, ప్రజాస్వామ్యవాది రాంమనోహర్ లోహియాను మరచిపోతారు? పున రాలోచన, అధికార రాజకీయ ప్రేరణలతో ఉండే ‘ఇబ్బంది’ ఇదీ! భారతరత్న ప్రకాశాన్ని ప్రభావితం చేసిన రెండవ పరిణామం ఏమిటంటే, దానిపై అహంభావపు స్పర్శ. నెహ్రూ, ఇందిరా గాంధీలు ఇద్దరూ తమ పదవీకాలంలో దానిని అంగీకరించకపోయి ఉంటే పురస్కార గొప్పదనాన్ని పెంచి, తమ గొప్పతనాన్నీ పెంచుకునేవారు. వారు దానిని పొందడం అంటే తమకు తామే దండలు మెడలో వేసు కున్నట్టు. మరణానంతర ప్రదానాలు లోపాలకు సంబంధించిన ప్రశ్నలను లేవనెత్తితే, అధికారంలో ఉన్నప్పుడు పొందే ప్రదానాలు వ్యవహారాలకు సంబంధించిన ప్రశ్నలను లేవనెత్తుతాయి. మౌలానా ఆజాద్‌కు కేబినెట్ మంత్రిగా ఉన్నప్పుడు భారతరత్నను ఆఫర్ చేసినప్పుడు ఆయన ఇలా చెప్పారని ప్రతీతి: ‘మేము ఇచ్చేవాళ్లలో ఉన్నాం, తీసు కునేవాళ్లలో కాదు.’ నేను ఇలా చెప్పడం ద్వారా ఈ వ్యాసాన్ని పూర్తి చేయాలని అనుకుంటున్నాను: జీవించి ఉన్నప్పుడు ఇవ్వడమే భారతరత్నకు ప్రమా ణంగా ఉండనివ్వండి. మరణానంతర ఎంపిక ఒక మినహాయింపుగా ఉండాలి. ఆమె లేదా అతను పదవిలో ఉండేవరకు ‘ఇచ్చేవారు’గానే ఉండాలి తప్ప, ‘గ్రహీత’లు కావాలని కలలు కనకూడదని ఆశిద్దాం. పదవిలో లేనట్టయితే పురస్కార విలువ పెరుగుతుంది. అంతర్జాతీయంగానూ, జాతీయ స్థాయిలోనూ గౌరవం పొందిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను ఇటీవల పార్లమెంటులో ప్రధాని మోదీ ప్రశంసించారు. బహుశా ఆయనకు భారతరత్నను ప్రతిపాదించి ఉండొచ్చు, సలక్షణమైన వినమ్రతతో ఆయన తిరస్కరించి ఉండొచ్చు. ఆయనను ‘రత్నం’గా చూసిన చాలామందికి అది అధికా రికం అయినప్పుడు ఒక సంతృప్తి ఉండదా? గోపాలకృష్ణ గాంధీ వ్యాసకర్త పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్, మాజీ దౌత్యవేత్త (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
ఒకేసారి ఐదుగురికి భారతరత్న.. మోదీ వ్యూహం అదేనా?
భారత మాజీ ప్రధాని పీవీ నరసింహరావుకు కేంద్ర ప్రభుత్వం భారత రత్న బిరుదు ఇవ్వడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అయింది. అదే సమయంలో నరేంద్ర మోదీ వ్యూహాత్మకంగా ఈ అవార్డులను ప్రకటిస్తున్నారన్న అభిప్రాయం కూడా ఏర్పడుతోంది. యూపీలో మరో మాజీ ప్రధాని చరణ్ సింగ్, బీహారులో మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ కు, మాజీ ఉప ప్రధాని ఎల్.కె. అద్వానికి, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎమ్.ఎస్.స్వామినాదన్కు ఈ అవార్డులు ఇచ్చారు. వీరిలో ఎవరిపైన అభ్యంతరాలు లేవు. కాకపోతే ఎన్నికలు మరో రెండు నెలల్లో జరగనున్న తరుణంలో ఈ ప్రముఖులను ఎంపిక చేసుకున్న తీరు మాత్రం చర్చనీయాంశమే. బీహారులో జేడీయూ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎన్డీఏ కూటమిలోకి మారిన నేపథ్యంలో అక్కడ ఉన్న బీసీ వర్గాలను ఆకట్టుకోవడానికి దివంగత నేత కర్పూరికి భారత రత్న ఇచ్చారు. మాజీ ఉప ప్రధాని అద్వానికి ఇవ్వడంలో బీజేపీ ఇంటరెస్టు ఉంటుంది. అద్వానికి సరైన ప్రాధాన్యత లభించడం లేదన్న భావన ప్రబలిన తరుణంలో ఆ వాదనను పూర్వపక్షం చేయడానికి ఇచ్చి ఉండవచ్చు. దివంగత నేత చరణ్ సింగ్‌కు భారతరత్న ఇవ్వడం ద్వారా యూపీలో జాట్ వర్గాన్ని ఆకట్టుకునే ప్లాన్ ఉండవచ్చు. దానికి తగినట్లే చరణ్ సింగ్ మనుమడు జయంత్ సమాజవాది పార్టీ కూటమి నుంచి ఎన్డీఏ.లోకి వచ్చేస్తున్నట్లు ప్రకటించారు. స్వామినాధన్ తమిళనాడుకు చెందినవారు. ఇటీవలికాలంలో ఆ రాష్ట్రంపై మోదీ ఫోకస్ పెట్టారు. ఇది కూడా ఒక కారణం కావచ్చు. ఇక ఇంకో దివంగత నేత పీవీ నరసింహారావు కాంగ్రెస్ ప్రధాన మంత్రిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన తీసుకు వచ్చిన ఆర్దిక సంస్కరణలు దేశ ప్రగతికి బాటలు వేశాయి. బహుభాషా కోవిదుడు అయిన పీవీ నరసింహారావు పట్ల అందరిలోను గౌరవ భావం ఉన్నప్పటికి, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని యూపీఎ ఇవ్వని భారత రత్న అవార్డును బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ. ఇవ్వడం కూడా ఆసక్తికర అంశమే. తెలంగాణలో పీవీ పట్ల ఉన్న అభిమానాన్ని దృష్టిలో ఉంచుకుని కూడా ఈ నిర్ణయం చేసి ఉండవచ్చు. వచ్చే పార్లమెంటు ఎన్నికలలో తెలంగాణ లో ఎక్కువ సీట్లు గెలవాలని ప్రయత్నిస్తున్న బీజేపీ దీనిని కూడా ఒక అస్త్రంగా వాడుకోవచ్చు. ఇక్కడ మరో కోణం ఏమిటంటే 1992లో బాబ్రిమసీదు కూల్చివేత ఘటనకు సంబంధించి అద్వానిపై అప్పట్లో కేసు నమోదు అయింది. ఆ మసీదు కూలుతున్నప్పుడు పీవీ నరసింహారావు గట్టి చర్య తీసుకోకుండా మౌనంగా ఉన్నారన్న విమర్శ ఉంది. వీరిద్దరికి ఒకేసారి భారతరత్న ఇవ్వడం గమనించదగ్గ అంశమే. పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన సంస్కరణలను ఆ రోజుల్లో బీజేపీ, వామపక్షాలు వ్యతిరేకించేవి. నిరసనలు చేపట్టేవి. ఆ తర్వాత కాలంలో బీజేపీ కూడా వాటినే అనుసరించింది. కాని చిత్రంగా కాంగ్రెస్ లో పవర్ పుల్ ఉమన్ గా ఉన్న సోనియాగాంధీతో పీవీకి అప్పట్లో విబేధాలు వచ్చాయి. సోనియాగాందీ చేసిన కొన్ని డిమాండ్లను పీవీ అంగీకరించలేదని,దాంతో ఆయనపై కోపం పెంచుకున్నారని అంటారు. అందువల్లే పీవీ ఢిల్లీలో మరణిస్తే,కుటుంబ సభ్యులు కోరినా, దేశ రాజధానిలో అంత్యక్రియలకు అవకాశం ఇవ్వలేదని అంటారు. ప్రత్యేక ఘాట్‌ను ఏర్పాటు చేయలేదన్న భావన ఉంది.అంతేకాక ఏఐసీసీ కార్యాలయానికి ఆయన బౌతిక కాయాన్ని తీసుకు వెళ్లినప్పుడు లోపలికి తీసుకురాకుండా, గేటు బయటే ఉంచడం కూడా వివాదాస్పదం అయింది. ఆర్దిక సంస్కరణలకు ఆద్యుడు అయిన పీవీ 1996లో కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తెప్పించలేకపోయారు. తెలుగుదేశం, జెఎమ్ఎమ్ వంటి పార్టీలను చీల్చి అధికారంలో ఐదేళ్లపాటు కొనసాగినా, పార్టీ సాదారణ ఎన్నికలలో ఓటమి పాలైంది. జెఎమ్ఎమ్కు లంచాలు ఇచ్చారన్న అబియోగానికి గురయ్యారు. ఇన్ని ఉన్నప్పటికీ దేశ ప్రయోజనాల రీత్యా ఆయన చేపట్టిన కార్యక్రమాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా పెద్దగా సక్సెస్ కాలేకపోయిన పీవీ దేశ ప్రదానిగా సఫలం అయ్యారని చెప్పాలి. తెలుగువారిలో భారతరత్న అవార్డు పొందిన తొలి వ్యక్తిగా పీవీ కీర్తిప్రతిష్టలు పొందారు. తెలుగువారందరికి ఇది గర్వకారణమే. ఒకప్పుడు ప్రధానిగా మాత్రమే కాకుండా , ఏఐసీసీ అధ్యక్షుడుగా అధికారం చెలాయించిన పీవీ ఆ తర్వాత కాలంలో కాంగ్రెస్ లో దాదాపు ఒంటరి అయ్యారు. 1991 లో రాజకీయాల నుంచి దాదాపు విరమించుకుని హైదరాబాద్ వచ్చేసిన ఆయన అనూహ్యంగా దేశ ప్రధాని అయ్యారు. ప్రధాని పదవి నుంచి దిగిపోయిన తర్వాత మళ్లీ అదే రకమైన పరిస్థితిని ఆయన ఎదుర్కున్నారు. కాగా పీవీ మరణానంతరం ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రం హుస్సేన్ సాగర్ ఒడ్డున స్థలం కేటాయించి అంత్యక్రియలు జరిపించి ఆయన స్మృతివనంగా అభివృద్ది చేశారు. కాంగ్రెస్ అధిష్టానం అనుసరించిన వైఖరి నేపద్యంలో పీవీ కుటుంబం కూడా కాంగ్రెస్ కు దూరం అయింది. 2014లో తెలంగాణ ముఖ్యమంత్రి అయిన కెసిఆర్ ఆ పరిస్థితిని తనకు అనుకూలంగా మలచుకున్నారు. పీవీ బందువులకు ప్రాదాన్యం ఇవ్వడం, ఒకరికి మంత్రి పదవి ఇవ్వడం , పీవీ కుమార్తె అయిన వాణి కి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం వంటివి చేశారు. పీవీ శత జయంతి ఉత్సవాలను కూడా నిర్వహించారు. ఇప్పుడు పీవీకి భారత రత్న ఇవ్వడం ద్వారా తెలంగాణలో బీజేపీకి ఎంత మేర రాజకీయ లబ్ది చేకూరుతుందన్నది చూడాలి. బీఆర్ఎస్ కూడా ఈ విషయంలో పోటీ పడుతుంది. కాంగ్రెస్‌కు మాత్రం ఇది కొంత ఇబ్బందికరమైనదే. పీవీకి భారత ఇవ్వలేకపోయారన్న విమర్శను ఎదుర్కుంటోంది. పార్లమెంటు ఎన్నికలలో ఈ అంశం ఎంత ప్రభావం చూపుతుందన్నది అప్పుడే చెప్పలేం. కాగా మరో నేత , తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావుకు భారత రత్న ఇవ్వాలన్న డిమాండ్ రెండు దశాబ్దాలుగా ఉంది. వాజ్ పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఆయనకు భారత రత్న ఇవ్వడానికి దాదాపు నిర్ణయం అయిపోగా , అందుకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులే అడ్డుకున్నారన్న అభిప్రాయం ఉంది. ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతి ఆ అవార్డును స్వీకరించే అవకాశం ఉండడంతో ,అది ఇష్టలేని కుటుంబ సభ్యులు బిరుదును అప్పట్లు ఇవ్వవద్దన్నారని చెబుతారు. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా, ఎన్డీఏ కన్వీనర్‌గా కూడా ఉండేవారు. అయినా ఎన్టీఆర్‌కు భారత రత్న రాలేదు. కాని ప్రతి మహానాడులోను ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలని తీర్మానం చేస్తుంటారు. దాంతో ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల చిత్తశుద్దిపై సందేహాలు ఏర్పడ్డాయి. 2014-2019 టర్మ్‌లో కూడా చంద్రబాబు నాయుడు ఎన్డీఏ.లో ఉన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వంలో ఇద్దరు టిడిపి మంత్రులు కూడా ఉన్నారు. అయినా ఎన్టీఆర్‌కు మాత్రం భారతరత్న రాలేదు. 2018లో మోదీతో తగదా పడి బయటకు వచ్చారు. దాంతో కాస్తో,కూస్తో ఉన్న అవకాశం కూడా పోయినట్లయింది. అదేకనుక ఎన్టీఆర్‌కు కూడా భారతరత్న వచ్చి ఉంటే ఇద్దరు తెలుగువారు ఈ ఘనత సాధించినట్లయ్యేది. ప్రధాని మోదీ వ్యూహాత్మకంగానే పద్మ అవార్డులు ప్రకటిస్తుంటారు. ఉదాహరణకు యూపీ మాజీ ముఖ్యమంత్రి మూలాయం సింగ్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శరద్ పవార్ కు, కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ అజాద్ వంటివారికి పద్మవిభూషణ్ అవార్డులు ఇచ్చారు. ఎన్నికల టైమ్‌లో ఐదుగురికి భారత రత్న అవార్డులు ఇవ్వడంతో రాజకీయంగా ప్రాముఖ్యత ఏర్పడింది. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
భారతరత్నకు ఎంపికైన ఐదుగురూ 'పంచరత్నాలు'
దేశ అత్యున్నత పురస్కారం 'భారతరత్న' ఏకకాలంలో (కొద్ది తేడాలతో) ఐదుగురిని వరించింది. ఠాకూర్‌కు కొన్నిరోజులు ముందుగా, ఆ తర్వాత కొన్నిరోజులకు అద్వాణీకి, మిగిలిన ముగ్గురికీ తాజాగా ఒకేరోజు చేరింది. చౌదరి చరణ్ సింగ్, స్వామినాథన్, పీ.వీ.నరసింహారావు ముగ్గురూ ముగ్గురే! ఇది బీజేపీ ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయం. ఈ ఐదుగురిలో ఎల్కే అద్వాణీ ఒక్కరే జీవించివున్నారు. మిగిలినవారు గతించినా, చరిత్రగతిలో చిరయశస్సుతో చిరంజీవిగా జీవిస్తారు. ఠాకూర్‌కు ప్రకటించినప్పుడు దేశంలో పెద్ద స్పందన లేదు. పర్వాలేదులే అనుకున్నారు. అద్వాణీకి ప్రకటించిన రోజు అందరూ ఆశ్చర్యపోయారు. పీ.వీ.నరసింహారావుకు ఇవ్వకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఎన్టీఆర్‌కు కూడా ఇవ్వాలనే అభ్యర్థనలు తెలుగువారి నుంచి వినిపించాయి. అందరినీ ఆశ్చర్యపరుస్తూ, ముఖ్యంగా తెలుగువారిని అమితానంద పరిచేలా 'పీవీ వార్త' గొప్ప సందడి చేసింది. ఏదోరోజు ఎన్టీఆర్‌కు కూడా దక్కుతుందనే ఆశ కూడా చిగురిస్తోంది. కొద్దికాలం వ్యవధిలోనే ఇందరు పెద్దలకు అతిపెద్ద 'భారతరత్న' ప్రదానం చెయ్యడం చాలా గొప్ప విషయం. ఈ నిర్ణయం వెనకాల ఎందరి సలహాలు ఉన్నప్పటికీ, మనస్ఫూర్తిగా, సంపూర్ణంగా అభినందనలు అందుకోవాల్సిన వ్యక్తి నూటికి నూరు శాతం మన ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ఇన్నేళ్ల స్వాతంత్య్ర భారతంలో ఈ తీరుగ నిర్ణయం తీసుకున్న ఏకైక ప్రధాని మోదీ. కొందరికి ఆలస్యమైంది, ఇంకా ఇవ్వాల్సిన వాళ్ళు చాలామంది వున్నారు అన్నమాటలు వాస్తవమే ఐనప్పటికీ, ఈ స్థాయిలో 'భారతరత్న' ప్రదానం చేయడం పరమానందకరం. మొన్ననే! ఇద్దరు తెలుగుతేజాలు ఎం.వెంకయ్యనాయుడు, చిరంజీవికి 'పద్మవిభూషణ్' ప్రకటించడంతో తెలుగువారు ఎంతో అనందించారు. ఆ ఆనందడోలికల్లో ఇంకా తేలుతూనే వున్నాం, తూలుతూనే వున్నాం. నేడు పీవీకి 'భారతరత్న' ప్రకటనతో ఆనందతాండవంలోకి ప్రవేశించాం. ఎన్నికల వేళ నరేంద్రమోదీ తీసుకున్న గొప్ప నిర్ణయమే కాదు, అనూహ్య వ్యూహం. ఈ దెబ్బతో ప్రతిపక్షాలు, ప్రత్యర్ధులకు నోటమాట ఆగిపోయేట్టు చేశారు. అద్భుతమైన రాజనీతి. ఎన్నికల్లో తప్పక మేలుచేస్తుంది. పీవీని కాంగ్రెస్ దూరం చేసుకుంది. కాంగ్రెస్ ఎంత దూరం చేసుకుందో, మోదీ బీజేపీ ప్రభుత్వం అంతకు మించి దగ్గరకు తీసుకుంది. ఈరోజు భారతరత్నకు ఎంపికైన ఐదుగురూ 'పంచరత్నాలు'. వీరి నేపథ్యాలు భిన్నం, ప్రాంతాలు విభిన్నం. కానీ, వీరి ఆత్మ ఒక్కటే! అదే 'భారతీయం'. వీరు కేవలం భారతీయులు కారు, విశ్వమానవులు. ఈ ఐదుగురు పంచభూతాల్లాంటివారు. విశ్వదృష్టితో విశాలంగా అలోచించినవారు. ఇందులో స్వామినాథన్ తప్ప మిగిలినవారికి రాజకీయ నేపథ్యం ఉండవచ్చు గాక! దాని వెనక జాతి హితం వుంది. ఒక్కొక్కరూ ఒక్కొక్క రంగానికి, తత్త్వానికి, ప్రయోజనానికి ప్రతీకలు. అందరూ స్ఫూర్తిప్రదాతలే. వారు వేసిన మార్గంలో నడవడం ఎవరికైనా, ఎప్పటికైనా తప్పదని నిరూపించినవారే. ఈ సందర్భంలో, ఈ సంరంభంలో మన 'తెలుగువెలుగు' పీవీని ప్రత్యేకంగా తలచుకుందాం. వంద సంవత్సరాల క్రితం (1921), ప్రఖ్యాత జంటకవులు కొప్పరపు సోదరులు పశ్చిమ గోదావరి జిల్లా పంగిడిగూడెంలో రాజా బొమ్మదేవర నాగన్ననాయుడు రాజాస్థానంలో 'సంపూర్ణ శతావధానం' చేశారు. అందులో ఒక పద్యం చెప్పారు. పీవీ నరసింహారావు పుట్టిన సంవత్సరం కూడా 1921. ఆ మహాకవులు రచించిన ఆ పద్యాన్ని ఒకసారి గుర్తుచేసుకుందాం. ఎట్టివారు మంత్రిపదవికి అర్హులు? ఇది ఒక పృచ్ఛకుడు సంధించిన ప్రశ్న. దీనికి కొప్పరపు కవుల పద్యరూపమైన సమాధానం. "పతికిన్ భూప్రజకాప్తుడై, బహు విధోపాయంబులన్ శాత్రవ ప్రతతిం గీడ్వడ జేసి, రాణ్మణికి హర్షశ్రీలు సేకూర్చి, ధీ చతురుండై, పటుకార్య కౌశలుడునై సత్కీర్తులం బొల్తునే మతిమంతుండతడే యమాత్యపద సంభావ్యుండగున్ భూవరా" - ఇదీ సంపూర్ణ పద్యం. 'మంత్రిగా పీఠంపై కూర్చోవలసినవారికి ఎటువంటి అర్హతలు ఉండాలో కవులు స్పష్టంగా వివరించారు. రాజుకు, ప్రజలకు పరమ ఆప్తుడై, బహు ఉపాయాలతో శతృవులను తొక్కిపడేసేవాడై, రాజ్యానికి ఎల్లవేళలా సంతోషాన్ని, ఆనందాన్ని కలుగజేస్తూ, చతుర బుద్ధిబల సంపన్నుడై, ఎటువంటి కార్యాన్నైనా అలవోకగా నిర్వహించే చాతుర్యం కలిగి, రాజ్యానికి, రాజుకు, ప్రజలకు, మంత్రిమండలికి, సత్కీర్తులు కలుగజేసే మతిమంతుడు ఎవరై ఉంటారో? అటువంటివారే మంత్రిపదవికి సంపూర్ణంగా అర్హులౌవుతారు రాజా....!' అని ఈ పద్యం చెప్పే తాత్పర్యం. ఎప్పుడో వందల సంవత్సరాల క్రితం రాజాస్థానాలలో అటువంటి ప్రధానమంత్రులు, మహామంత్రులు ఉండేవారు. అటువంటివారినే మంత్రులుగా నియమించుకొనే ప్రభువులు ఉండేవారు. స్వాతంత్య్రం రాక ముందు, దివానులు కూడా అటువంటివారే ఉండేవారు. పీవీ నరసింహారావు నూటికి నూరుశాతం అటువంటి విలక్షణ, లక్షణ సంపన్నుడైన మంత్రీశ్వరుడే. అటువంటి మహామంత్రులకు అసలు సిసలైన వారసుడే. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మారుతున్న రాజకీయ ప్రభుత్వాల నేపథ్యంలో, పూర్వుల వలె సకల సద్గుణ, సర్వజ్ఞాన క్రియాశూరులైన మంత్రులు దొరకడం దుర్లభమేనని నడుస్తున్న చరిత్ర చెబుతోంది. ఇటువంటి సంధికాలంలోనూ కేంద్రమంత్రిగా, ప్రధానమంత్రిగా పీవీ నరసింహారావు దొరకడం దేశానికి వైభవ చిహ్నం. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రధానులుగా దేశాన్ని పాలించిన సమయంలో, కేంద్రమంత్రిగా పీవీ విశేషమైన సేవలు దేశానికి అందించారు. వ్యక్తిగతంగానూ వారికి విశిష్టమైన సలహాలను అందజేశారు. తర్వాత కొంతకాలానికి ఆయనే రాజు అయ్యారు. ఆ సమయాన్ని అద్భుతంగా సద్వినియోగం చేసుకున్నారు. ప్రభువుగా తనకు దక్కిన స్వాతంతత్రా్యనికి పొంగిపోయి, నియంతగా మారక, ప్రజాస్వామ్యయుతంగా పాలనను అందించారు. రాజు - మంత్రి ఇద్దరి అంతరంగాలు బాగా ఎరిగిననవాడు కాబట్టి, మంచి మంత్రులను, మంచి సలహాదారులను నియమించుకున్నారు. "రాగ ద్వేషాలకు అతీతంగా, నిష్పక్షపాతంగా విధులను నిర్వహిస్తాం" అని ప్రమాణ స్వీకార మహోత్సవంనాడు అందరు మంత్రులు ప్రమాణం చేస్తారు. అదికూడా ఆత్మసాక్షిగా అంటూ ఒట్టు కూడా వేస్తారు. ఆ తర్వాత చరిత్రను గమనిస్తే, ఎందరు ఆ ప్రమాణాన్ని పాటించారన్నది లోక విదితమే. దానిని అక్షరాలా పాటించినవారు అతి తక్కువమంది. వారిలో ప్రథమ శ్రేణీయుడుగా గణనీయుడు పీవీ. ఆణిముత్యాల వంటి ఎందరినో తన సలహా మండలిలో, వివిధ హోదాల్లో నియమించుకున్న ప్రతిభా పక్షపాతి. ఆ జాబితా అతి పెద్దది. ఒక్క మన్మోహన్సింగ్ చాలు, గొప్పగా ఉదాహరించడానికి. నిన్ననే మన్మోహన్సింగ్ పై సభా మధ్యమున మన ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసల జల్లులు కురిపించారు. ఆ మరునాడే పీవీకి 'భారతరత్న' ప్రకటించారు. పాఠాలు చెప్పుకుంటున్న ఆచార్యుడిని తీసుకువచ్చి, కేంద్రమంత్రి స్థానంలో కూర్చోబెట్టిన ఘనత మన పీవీదే. తదనంతరం ఆయనే ప్రధానమంత్రిగా పదేళ్లు దేశాన్ని పాలించారు. అంతటి దార్శనిక ప్రతిభ పీవీది. ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా నియమించుకోవాలో తెలియడం కూడా మంచి మంత్రికి వుండే మంచి లక్షణం. పీవీని అపరచాణుక్యుడుగా అభివర్ణిస్తారు. పీవీలో చాణుక్యుడుతో పాటు తిమ్మరసు, తిక్కన, అల్లసాని పెద్దన కూడా ఉన్నారు. చాణక్యుడు అనగానే అర్థశాస్త్రం గుర్తుకు వస్తుంది. పీవీ అనగానే ఆర్ధిక సంస్కరణలు గుర్తుకు రాక తప్పవు. 'అర్థశాస్త్రం'లో కేవలం ఆర్ధిక అంశాలే కాదు అనేకం ఉన్నాయి. పాలన, రాజనీతి, మనస్తత్వశాస్త్రం, భౌగోళిక పరిజ్ఞానం, విదేశాంగ విధానం మొదలైన విశేష అంశాల కలయిక కౌటిల్యుడి 'అర్థశాస్త్రం'. పీవీ జ్ఞానం కూడా వీటన్నిటి సముదాయమే. చాణుక్యుడు/కౌటిల్యుడు ఎన్నో ఆర్ధిక సంస్కరణలను అమలుపరచాడు. పీవీ కూడా ఇంచుమించుగా అదే వరుసలో సంస్కరణలు చేపట్టారు. కాలమానాలను బట్టి వ్యూహాలు, ప్రాధాన్యతలు మారాయి అంతే. చాణుక్యుడు పేదలపట్ల ఎంతో దయకలిగి ఉండేవాడు. చివరిదశలో తన సంపదనంతా పేదలకే దానం చేశాడు. పీవీ తన వందలాది ఎకరాల భూమిని తొలిదశలోనే పేదలకు దానం చేశారు. చాణుక్యుడికి భయం అంటే ఏమిటో తెలియదు. పీవీ కూడా తాను చేపట్టాలనుకున్న కార్యక్రమాలన్నీ నిర్భీతిగా చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో భూసంస్కరణలు చేపట్టినప్పుడు భూస్వాములంతా బెదిరించే ప్రయత్నం చేసినా ఎవరికీ లొంగలేదు, ఎక్కడా తగ్గలేదు. చివరికి పదవిని కోల్పోయినా లెక్కచేయలేదు. ప్రధానమంత్రి పదవిని చేపట్టినప్పుడు కూడా ఎవరి బెదిరింపులకు చలించలేదు. ఆయన అంతరాత్మకు తప్ప దేనికీ వెరవలేదు. అందుకే, ఏ పని చేసినా త్రికరణశుద్ధితోనే ఆచరించారు. రాజు తన ఆధిపత్యాన్ని కాపాడుకోడానికి, శతృవుల నుంచి తనను, తన రాజ్యాన్ని రక్షించుకోడానికి అవలంబించాల్సిన మార్గాలను కౌటిల్యుడు వివరించాడు. విదేశీ వాణిజ్యం ఎలా చెయ్యాలి, ధనానికి సంబంధించిన విషయాల్లో ఎలా వ్యవహరించాలి తెలిపాడు. పీవీ వాటన్నింటినీ అందిపుచ్చుకుంటూనే తనదైన మార్గంలో నడిచారు. జ్ఞానయోగిగా తాను పొందిన జ్ఞానాన్ని, ఆ మహాగ్రంథాల సారాన్ని ఆధునిక మార్గంలో ఆచరణలో చూపించారు. జవహర్ నెహ్రూ, ఇందిరాగాంధీ నిర్దేశించిన ఆర్ధిక విధానాలకు గౌరవం, ప్రచారం కలిపిస్తూనే, దేశ పరిస్థితులకు అనుగుణంగా, తన సరళిని జతపరచి జేజేలు కొట్టించుకున్నారు. అదే పీవీ చూపించిన లౌక్య ప్రతిభ. చీఫ్ ఎలక్షన్ కమీషనర్‌గా టీఎన్ శేషన్ ధిక్కార స్వరంతో సర్వ స్వతంత్రుడుగా వ్యవహరిస్తున్న సమయంలో, అదనంగా మరో ఇద్దరు కమీషనర్లను నియమించి, సరిచేసి సమతుల్యతను ఏర్పరచారు. ఇదీ మంత్రాంగంలో భాగమే. కౌటిల్యుడు 'అర్ధశాస్త్ర' రచనకు శ్రీకారం చుట్టినపుడు అర్ధశాస్త్ర ప్రవర్తకులుగా భావించే బృహస్పతికి, శుక్రాచార్యుడికి తొలి నమస్కారం సమర్పించాడు. అట్లే, పీవీ కూడా చాణుక్యుడు, తిమ్మరసు మొదలు మహామంత్రులందరికీ మనసులో నమస్కారం చేసుకొని, ముందుకు సాగి వుంటారు. ఇదంతా భారతీయమైన ఆలోచనా విధానమే. పీవీ ఆసాంతం భారతీయతను అంటిపెట్టుకొని జీవించారు. కౌటిల్యుడు చాలా సూత్రాలను నిర్దేశించాడు. పెద్దల సహవాసం, ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం మొదలైనవి ఎన్నో ఉన్నాయి. ఇంచుమించు వాటన్నింటినీ పీవీ పాటించారు. చైనా నుంచి ఎప్పటికైనా ముప్పు ఉంటుందని గ్రహించి, అమెరికాతో బంధాలను పెంచారు. అదే ఈరోజు అక్కరకు వస్తోంది. భవిష్యత్తు మొత్తం శాస్త్ర, సాంకేతిక రంగాలదేనని గ్రహించి, టెలీకమ్యూనికేషన్ వ్యవస్థల బలోపేతానికి బలమైన పునాదులు వేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఎక్కడో కుగ్రామం నుంచి అమెరికా రాజధాని వాషింగ్టన్ డిసీలో ఉండేవారిని, చూస్తూ వీడియో కాల్లో మాట్లాడుకునే సౌకర్యం ఈనాడు మనం అనుభవిస్తున్నాం. ఇండియాలో కూర్చొని ఆస్ట్రేలియా యూనివర్సిటీలో ఆన్ లైన్ కోర్సును చేయగలుగుతున్నాం. అంబాసిడర్, ఫియట్, మారుతివంటి నాలుగైదు మోడల్స్ తప్ప మిగిలిన కార్లు మనకు తెలియదు. ఇప్పుడు రోల్స్ రాయిస్ మొదలు అనేక విదేశీ కార్లు మన రోడ్లపై తిరుగుతున్నాయి. విమానాలలో ప్రపంచ దేశాలన్నింటినీ ఈనాడు చుట్టేస్తున్నాం. ఈ సకల భోగాలన్నీ పీవీ నరసింహారావు కల్పించిన ఆర్ధిక సంస్కరణల మహాఫలమే. ఇదే దార్శనికత, దేశభక్తికి ప్రతీక. మౌనం విలువ, మాట విలువ తెలిసిన వాడు కాబట్టే, అన్ని భాషలను నేర్చుకున్నా కొన్ని వేళల్లో మౌనాన్నే ఆశ్రయించారు. ఒక సందర్భంలో, స్పానిష్‌లో అనర్గళంగా మాట్లాడి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఇదీ మంత్రిత్వ ప్రతిభలో భాగమే. దార్శనికత, దేశభక్తి, సకలశాస్త్ర జ్ఞానసంపద, సంయమనం, ఆచరణాశీలం కలిగిన జ్ఞానయోగి, కర్మయోగి పీవీ. మహారాజులు, చక్రవర్తుల కాలం తర్వాత ఆధునిక యుగంలో, నేటి భారతంలో పీవీ నరసింహారావు నిస్సందేహంగా మహామంత్రి శబ్దవాచ్యుడు. అచ్చమైన ఆంధ్రుడు, స్వచ్ఛమైన భారతీయుడు. ఈ మహామనీషికి భారతప్రభుత్వం 'భారతరత్న' అందించి తన ఔన్నత్యాన్ని చాటుకుంది. - మాశర్మ, సీనియర్ జర్నలిస్టు -
అసలైన రత్నానికి సిసలైన గుర్తింపు
-
‘ఆర్థిక’ భారతానికి ఊపిరి పీవీ
విదేశాలకు చెల్లింపులు చేయలేక దివాలా అంచుల్లో ఉన్న దేశాన్ని ఆర్థిక సంస్కరణలతో గట్టెక్కించిన మాజీ ప్రధాని పాములపర్తి వెంకట నరసింహారావును భారతరత్న వరించింది. ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడిగానే కాదు.. దేశానికి గాందీ, నెహ్రూ కుటుంబేతర వ్యక్తుల్లో పూర్తికాలం పనిచేసిన తొలి ప్రధానిగా, మైనార్టీ ప్రభుత్వాన్ని విజయవంతంగా ఐదేళ్లూ కొనసాగించిన రాజకీయ చాణక్యుడిగా పీవీ పేరు పొందారు. దక్షిణ భారతదేశం నుంచి ప్రధాని అయిన తొలి వ్యక్తి కూడా పీవీనే కావడం గమనార్హం. ఆయన రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ప్రధానిగా తాను పనిచేసిన అన్ని పదవులకు వన్నె తెచ్చారు. – సాక్షి, హైదరాబాద్ గడ్డు పరిస్థితిలో బాధ్యతలు చేపట్టి.. పీవీ భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించే నాటికి దేశం గడ్డు పరిస్థితుల్లో ఉంది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు బిలియన్ డాలర్ల కంటే తగ్గిపోయాయి. విదేశాలకు చెల్లించాల్సిన అప్పులు, దిగుమతుల కోసం చేయాల్సిన చెల్లింపులు పేరుకుపోయాయి. ద్రవ్యోల్బణం గరిష్టంగా రెండంకెలకు చేరింది. ఏతావాతా దేశం ఆర్థికంగా దివాలా అంచున ఉన్న సమయంలో.. దేశాన్ని ముందుకు నడిపించేందుకు పీవీ సిద్ధమయ్యారు. వెంటనే దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేపని మొదలుపెట్టారు. అప్పట్లో రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా ఉన్న ఆర్థికవేత్త మన్మోహన్సింగ్ను పిలిపించి నేరుగా కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. మన్మోహన్తోపాటు ఇతర ఆర్థికవేత్తలతో చర్చించి సంస్కరణలను అమల్లోకి తెచ్చారు. ఎగుమతులు పెరిగి విదేశీ మారక ద్రవ్యం సమకూరేందుకు వీలుగా రూపాయి విలువను తగ్గించారు. తాను ప్రధాని బాధ్యతలు స్వీకరించిన నెలలోనే రిజర్వుబ్యాంకు వద్ద ఉన్న బంగారం నిల్వలను బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌లో తాకట్టు పెట్టి 400 మిలియన్ డాలర్ల రుణం తెచ్చారు. కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటించారు. విదేశీ పెట్టుబడులకు తలుపులు తెరిచారు. లైసెన్సుల విధానాన్ని సరళీకృతం చేశారు. అన్ని రంగాల్లో ప్రభుత్వ సంస్థల గుత్తాధిపత్యాన్ని తగ్గిస్తూ.. ప్రైవేటు సంస్థల స్థాపనకు అవకాశం కల్పించారు. ఎన్ని విమర్శలు వచ్చినా.. 1991 జూలై 24న ప్రవేశపెట్టిన దేశ బడ్జెట్లో అనేక సంస్కరణలను ప్రకటించారు. కార్పొరేట్ పన్ను పెంపు, టీడీఎస్ విధానం అమల్లోకి తేవడం, వంట గ్యాస్, కిరోసిన్, పెట్రోల్, ఎరువుల ధరలు పెంపు, చక్కెరపై సబ్సిడీ తొలగింపు, దిగుమతుల పన్ను తొలగింపు వంటి విధానాలను అమల్లోకి తెచ్చారు. ఈ చర్యలతో పీవీ అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్)కు దేశాన్ని అమ్మేస్తున్నారన్న విమర్శలు వచ్చాయి. అయినా మొక్కవోని ధైర్యంతో పారీ్టలో, ప్రభుత్వంలో అసమ్మతివాదులను ఒప్పిస్తూ సంస్కరణలను కొనసాగించారు. ఎగుమతుల కోసం ప్రత్యేక వాణిజ్య విధానాన్ని తేవడంతోపాటు చిన్న సంస్థలకు ప్రోత్సాహకాలు అందించారు. ఈ చర్యలన్నింటి ఫలితంగా రెండున్నరేళ్లలో ద్రవ్యోల్బణం 17 శాతం నుంచి 8.5 శాతానికి తగ్గింది. బిలియన్ డాలర్లలోపే ఉన్న విదేశీ మారకద్రవ్య నిల్వలు 15 బిలియన్ డాలర్లకు చేరాయి. ద్రవ్యలోటు 8.4 నుంచి 5.7 శాతానికి తగ్గింది. ఎగుమతులు రెండింతలయ్యాయి. వృద్ధిరేటు 4 శాతానికి పెరిగింది. అక్కడి నుంచి ఇక భారత్ వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి తలెత్తలేదు. ఇప్పుడు ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఐదో స్థానానికి చేరింది. దీనంతటికీ నాడు పీవీ వేసిన ఆర్థిక సంస్కరణలే పునాది. బేగంపేట.. బ్రాహ్మణవాడి అడ్డాగా.. పీవీ నరసింహారావు హైదరాబాద్‌లో ఉన్నంతకాలం బేగంపేటలోని బ్రాహ్మణవాడి కేంద్రంగానే కార్యకలాపాలను నిర్వహించారు. తొలుత స్వామి రామానంద తీర్థ ఇక్కడ నివాసం ఏర్పర్చుకోగా.. ఆయన అనుచరుడిగా పీవీ ఎక్కువ సమయం ఇక్కడే గడిపేవారు. 1973లో రామానంద తీర్థ పరమపదించగా.. పీవీ అక్కడ స్వామి రామానంద తీర్థ మెమోరియల్ కమిటీ సంస్థను నెలకొల్పారు. ఆ సంస్థ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించేవారు. ప్రస్తుతం పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ వాణిదేవి ఈ కమిటీ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. ఆమె ఈ కమిటీ భవనంలో పీవీ స్మారక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. పీవీ రాసిన, సేకరించిన వేలాది పుస్తకాలు ఇక్కడ కొలువుదీరాయి. 60 ఏళ్ల వయసులో కంప్యూటర్‌తో కుస్తీ పట్టి.. ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకోవడంలో పీవీ ఎప్పుడూ ముందుండే వారు. ఆయన అసాధారణ ప్రతిభతో త్వరగానే పట్టు సాధించేవారు. అలా ఏకంగా దేశ, విదేశ భాషలు సహా 13 భాషలను నేర్చుకున్నారు. రాజీవ్‌గాంధీ హయాంలో మన దేశంలోకి కంప్యూటర్లను ప్రవేశపెట్టినప్పుడు.. పీవీ ఓ కంప్యూటర్ తెప్పించుకుని పట్టుపట్టాడు. 60 ఏళ్ల వయసులో కూడా రోజూ గంటల పాటు కూర్చుని టైపింగ్ మాత్రమేకాదు.. కంప్యూటర్ లాంగ్వేజ్‌నూ నేర్చుకున్నారు. ఉస్మానియాలో విద్యాభ్యాసం.. కలం పేరుతో వ్యాసాలు.. అపర మేధావి, బహుభాషా కోవిదుడుగా పేరుపొందిన పీవీ నరసింహారావు.. 1921 జూన్ 28న నాటి హైదరాబాద్ సంస్థానంలోని వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లికి చెందిన నియోగి బ్రాహ్మణ దంపతులు సీతారామారావు, రుక్మాబాయిలకు జన్మించారు. మూడేళ్ల వయసులో ఉమ్మడి కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు, రుక్మిణి దంపతులు ఆయన్ను దత్తత తీసుకున్నారు. భీమదేవరపల్లి మండలం కట్కూరులోని బంధువు గబ్బెట రాధాకిషన్‌రావు ఇంట్లో ఉంటూ పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఉస్మానియా వర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ చదివారు. 1938 సమయంలో హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్‌లో చేరారు. నిజాం నిషేధాజ్ఞలను ధిక్కరిస్తూ వందేమాతరం గేయాన్ని పాడారు. దీంతో ఆయనను ఉస్మానియా వర్సిటీ నుంచి బహిష్కరించగా.. ఓ మిత్రుడి సాయంతో నాగ్‌పూర్ విశ్వవిద్యాలయంలో చేరి న్యాయశాస్త్రంలో పట్టా తీసుకున్నారు. కొంతకాలం జర్నలిస్టుగానూ పనిచేశారు. తన సోదరుడు పాములపర్తి సదాశివరావుతో కలసి ‘జయ–విజయ’ అనే కలం పేరుతో కాకతీయ వారపత్రికకు వ్యాసాలు రాశారు. ఎమ్మెల్యే నుంచి ప్రధాని వరకు.. కాలేజీలో రోజుల నుంచే పీవీ దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పారీ్టలో సభ్యుడిగా చేరారు. 1957–77 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి మంథని నుంచి ప్రాతినిధ్యం వహించారు. అందులో 1962–71 మధ్య వివిధ శాఖల మంత్రిగా పనిచేశారు. 1971లో ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ► సీఎంగా పలు భూసంస్కరణలను ప్రవేశపెట్టారు. భూగరిష్ట పరిమితి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయించారు. గురుకుల విద్యా వ్యవస్థకు పునాది వేశారు. ► 1969లో కాంగ్రెస్ పార్టీ చీలిన సమయంలో ఇందిరాగాంధీ వెన్నంటి నిలిచారు. 1978లో ఇందిరాగాంధీ స్థాపించిన కాంగ్రెస్ (ఐ)లో చేరారు. ► 1977లో తొలిసారిగా హన్మకొండ ఎంపీగా గెలిచిన ఆయన.. 1984, 1989, 1991, 1996లలో జరిగిన ఎన్నికల్లో మహారాష్ట్రలోని రాంటెక్, కర్నూల్ జిల్లా నంద్యాల, ఒడిశాలోని బరంపురం లోక్‌సభ స్థానాల నుంచి ప్రాతినిధ్యం వహించారు. కేంద్రంలో హోం, రక్షణ, విదేశాంగ శాఖల మంత్రిగా పనిచేశారు. ► 1991లో రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలని పీవీ భావించారు. ఆ ఏడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో పోటీ చేయలేదు కూడా. కానీ రాజీవ్‌గాంధీ హత్యతో పీవీ క్రియాశీలకంగా వ్యవహరించాల్సి వచ్చింది. ► రక్షణ మంత్రిగా పనిచేసిన అనుభవంతో పారీ్టలోని ఇతర పోటీదారులను వెనక్కినెట్టి మైనారీ్టలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడిపించే అవకాశం దక్కించుకున్నారు. 1991 జూన్ 21న ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటికి ఎంపీ కాకపోవడంతో.. నంద్యాల లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. అప్పుడు ఏకంగా ఐదు లక్షల ఓట్ల భారీ మెజార్టీ సాధించి గిన్నిస్ రికార్డుల్లో ఎక్కారు. ► 1995 మే 16 వరకు మైనార్టీ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపి రాజకీయ దురంధరుడిగా నిలిచారు. ► ఆర్థిక రంగమైనా, రాజకీయ రంగమైనా, అభివృద్ధి పథమైనా, సంక్షేమ బాటలోనైనా.. తాను నిర్వహించిన పదవులకు వన్నె తెచ్చిన పీవీ 83 ఏళ్ల వయసులో.. 2004 డిసెంబర్ 23న ఢిల్లీలో కన్నుమూశారు. తర్వాత 19 ఏళ్ల అనంతరం ఆయనకు కేంద్రం భారతరత్న ప్రకటించింది. పీవీ ఇంట్లోనే పనిజేసిన.. ప్యాంట్లు వేసుకుని సిగ్గుపడ్డం నా చిన్నప్పుడు పీవీ ఇంట్ల, వారి పొలాల్లో పనిచేసిన. ఊర్లో అందరం ఆయన ఇంటిని గడి అని పిలిచేటోళ్లం. పీవీ ఇంటివాళ్లు అందరితో కలివిడిగా ఉండేవారు. మాది చిన్న పల్లెటూరు. ధోవతులు తప్ప ప్యాంట్లు తెలియవు. ఎవరన్నా ప్యాంట్ వేసుకుంటే వింతగా జూసేది. ఏ ఊరి దొరనో అని గొప్పగా అనుకునే వాళ్లం. ఒకనాడు ఇంటికి వచ్చిన పీవీ దొరను.. మీరెందుకు ప్యాంట్లు వేసుకోరని అడిగిన. ఆయన చిన్నగా నవి్వండు. తర్వాత మా ఊళ్లనే బావులకాడ పనిచేసే పది మందికి ప్యాంట్లు కుట్టిచిండు. వాళ్లు బజార్ల తిరగాలంటే ఒకటే సిగ్గుపడుడు. గుర్తొస్తే నవ్వొస్తది. పీవీకి భారతరత్న వచ్చిందంటే.. మా ఊరికి కాదు దేశానికి గౌరవం ఇచ్చినట్టే.. – కాల్వ రాజయ్య, వంగర గ్రామస్తుడు వంగరలో సంబురాలు సాక్షి ప్రతినిధి, వరంగల్/మంథని: పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించడంతో.. ఆయన స్వగ్రామం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలో.. కుటుంబసభ్యులు, గ్రామస్తులు సంబురాలు జరుపుకొన్నారు. పీవీ ఇంటి ఆవరణలో టపాసులు కాల్చారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులరి్పంచారు. స్వీట్లు పంచుకున్నారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. పీవీ సేవలను ఆలస్యంగానైనా గుర్తించి భారతరత్న ఇచ్చినందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలిపారు. అందరు ప్రధానమంత్రులను గౌరవించినట్టుగానే.. పీవీకి కూడా ఢిల్లీలో ఘాట్ నిర్మించాలని కోరారు. మరోవైపు పీవీ రాజకీయ అరంగేట్రం చేసి, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మంథని నియోజకవర్గంలోనూ స్థానికులు సంబురాలు చేసుకున్నారు. తెలుగు ప్రజలందరికీ గౌరవం పీవీకి భారతరత్నపై ఏపీ సీఎం జగన్ హర్షం సాక్షి, అమరావతి : మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించటంపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. ‘పీవీ నరసింహారావు రాజనీతిజు్ఞడు, ఉన్నత రాజకీయ, నైతిక విలువలు కలిగిన పండితుడు. ఆయనకు అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించడం తెలుగు ప్రజలందరికీ గౌరవం’అని సీఎం పేర్కొన్నారు. అలాగే, రైతుల కోసం పాటుపడిన మాజీ ప్రధాని చరణ్‌సింగ్, మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ, బీహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌కు కూడా భారతరత్న ప్రకటించడం యావత్ జాతి గరి్వంచదగ్గ విషయమని శుక్రవారం రాత్రి ‘ఎక్స్’లో సీఎం ట్వీట్ చేశారు. -
పీవీకి భారతరత్న
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు తేజం, దివంగత ప్రధాని పాములపర్తి వెంకట నరసింహారావుకు ఎట్టకేలకు దేశ అత్యున్నత పౌర పురస్కారం లభించింది. సార్వత్రిక ఎన్నికల వేళ ఆయనకు కేంద్రం భారతరత్న ప్రకటించింది. మరో దివంగత ప్రధాని చౌదరి చరణ్‌సింగ్, హరిత విప్లవ పితామహుడు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్‌లను కూడా ఈ అత్యున్నత పురస్కారంతో గౌరవించింది. ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ‘ఎక్స్’వేదికగా ఈ మేరకు వెల్లడించారు. ఆ ముగ్గురు దిగ్గజాలూ దేశానికి చేసిన సేవలు ఎనలేనివంటూ గుర్తు చేసుకున్నారు. ‘‘పీవీ ఆర్థిక సంస్కరణలు దేశానికి కొత్త దిశను, ఆర్థిక రంగానికి నూతన జవసత్వాలను ప్రసాదించాయి. ఇక చరణ్‌సింగ్ రైతు సంక్షేమానికి ఆజన్మాంతం పాటుపడ్డారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ ఆహార రంగంలో భారత్ స్వయంసమృద్ధి సాధించడంలో కీలకపాత్ర పోషించారు’’అంటూ ప్రధాని కొనియాడారు. తర్వాత కాసేపటికే ఈ ముగ్గురికీ భారతరత్న ఇస్తున్నట్లు రాష్ట్రపతి భవన్ నుంచి ప్రకటన వెలువడింది. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వేళ ప్రధాని పదవి చేపట్టి ఆర్థిక సంస్కరణలతో ప్రగతి బాట పట్టించిన రాజనీతిజ్ఞుడు పీవీ. అంతర్గత భద్రత మొదలుకుని విదేశాంగ విధానం దాకా, ఆర్థిక రంగం నుంచి రైతు సంక్షేమం దాకా అన్ని అంశాల్లోనూ చెరగని ముద్ర వేసిన ఆయన 2004లో మరణించారు. ఇక చరణ్‌సింగ్ పశి్చమ ఉత్తరప్రదేశ్‌కు చెందిన జాట్ నేత. కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. రెండుసార్లు యూపీ సీఎంగా, అనంతరం కేంద్ర హోం మంత్రిగా రాణించారు. ఎమర్జెన్సీ కాలంలో జైలు జీవితం గడిపారు. 1979లో స్వల్పకాలం ప్రధానిగానూ చేశారు. 1987లో తుదిశ్వాస విడిచారు. ఆయనదీ, పీవీదీ పూర్తిగా బీజేపీయేతర నేపథ్యమే కావడం గమనార్హం. వారికి భారతరత్న పురస్కారం రాజకీయంగా, సామాజికంగా ఎంతో ప్రభావం చూపగల నిర్ణయమంటున్నారు. ముఖ్యంగా రాజకీయ జీవితాన్నంతా కాంగ్రెస్‌కే ధారపోసిన పీవీకి ఆ పార్టీ సరైన గుర్తింపు, గౌరవం ఇవ్వలేదని ఆయన అభిమానులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. ఈ నేపథ్యంలో ఎన్నికల వేళ తెలుగు రాష్ట్రాల్లో దీని ప్రభావం గణనీయంగా ఉంటుందన్న భావన వ్యక్తమవుతోంది. ఇక యూపీలో గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓడిన 16 స్థానాల్లో ఆరు చరణ్‌సింగ్ మనవడైన జయంత్ సింగ్ సారథ్యంలోని ఆర్ఎల్డీ ప్రాబల్యమున్నవే. ఆయనను ఎన్డీఏలో చేర్చుకునేందుకు బీజేపీ కొంతకాలంగా గట్టిగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో చరణ్‌సింగ్‌కు భారతరత్న ప్రకటించగానే జయంత్ ఎన్డీయేలో చేరుతున్నట్టు వెల్లడించడం విశేషం! ఇక మన్‌కోంబు సాంబశివన్ స్వామినాథన్ ప్రపంచ ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త. తన విశేష పరిశోధనలతో భారత్‌ను స్వయంసమృద్ధంగా తీర్చిదిద్ది కరువు మహమ్మారిని దేశం నుంచి తరిమికొట్టిన దార్శనికుడు. ఆయన 2023లో మృతి చెందారు. బిహార్ దివంగత ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌తో పాటు బీజేపీ సీనియర్ నేత ఎల్కే ఆడ్వాణీలకు కూడా ఇటీవలే భారతరత్న ప్రకటించడం తెలిసిందే. దాంతో ఈ ఏడాది ఈ పురస్కార గ్రహాతల సంఖ్య ఐదుకు చేరింది. ఒకే ఏడాదిలో ఇంతమందికి భారతరత్న ఇవ్వడం ఇదే తొలిసారి. 1999లో అత్యధికంగా నలుగురికి ఈ గౌరవం దక్కింది. 1954 నుంచి ఇప్పటిదాకా మొత్తమ్మీద ఇప్పటిదాకా 53 మందికి భారతరత్న పురస్కారం అందజేశారు. ఈసారి ఈ అవార్డు ప్రకటించిన వారిలో అడ్వాణీ (96) మాత్రమే జీవించి ఉన్నారు. సంస్కరణల రూపశిల్పి పీవీ... మాజీ ప్రధాని పీవీని భారతరత్నతో సత్కరిస్తున్నందుకు సంతోíÙస్తున్నామని మోదీ పేర్కొన్నారు. ‘‘ఆయన విశిష్ట పండితుడు. గొప్ప రాజనీతిజు్ఞడు. పలు హోదాలలో దేశానికి అసమాన సేవలందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, అనేక ఏళ్ల పాటు లోక్‌సభ, శాసనసభ సభ్యునిగా ఆయన చేసిన కృషి మరులేనిది. దేశ ఆరి్ధకాభివృధ్ధిలో దూరదృష్టితో కూడిన ఆయన నాయకత్వం అతి కీలకపాత్ర పోషించింది. దేశ శ్రేయస్సుకు, అభివృద్ధికి బలమైన పునాది వేసింది. భారత మార్కెట్లను ప్రపంచానికి తెరుస్తూ ప్రధానిగా పీవీ తెచ్చిన సంస్కరణలు చాలా కీలకమైనవి. తద్వారా ఆర్థిక రంగంలో నూతన శకానికి తెర తీశారు పీవీ. విదేశాంగ విధానాన్ని సమూలంగా మార్చేయడమే గాక భాష, విద్య తదితర రంగాలెన్నింటిపైనో చెరగని ముద్ర వేశారు. క్లిష్ట పరిస్థితుల్లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టి దేశ సాంస్కృతిక, మేధో వారసత్వాన్ని సుసంపన్నం చేసిన బహుముఖ ప్రజ్ఞశాలి పీవీ’’అంటూ ప్రస్తుతించారు. మార్గదర్శకుడు స్వామినాథన్... వ్యవసాయ రంగానికి, రైతు సంక్షేమానికి స్వామినాథన్ చేసిన సేవలు మరవలేనివని మోదీ అన్నారు. ‘‘క్లిష్ట సమయంలో దేశం వ్యవసాయ స్వావలంబన సాధించడంలో ఆయనది కీలక పాత్ర. దేశ వ్యవసాయాన్ని ఆధునీకరించే దిశగా అద్భుతమైన ప్రయోగాలు చేశారు. స్వామినాథన్ దార్శనికత సాగు తీరుతెన్నులనే సమూలంగా మార్చడమే గాక దేశ ఆహార భద్రతకు, శ్రేయస్సుకు బాటలు పరిచింది. నాకాయన ఎంతగానో తెలుసు. ఆయన అంతర్ దృష్టిని నేనెప్పుడూ గౌరవిస్తాను. స్వామినాథన్ బాటలో యువతను, విద్యార్థులను పరిశోధనల దిశగా ప్రోత్సహిస్తున్నాం’’అని వివరించారు. రైతు సంక్షేమానికి అంకితం... దివంగత ప్రధాని చరణ్‌సింగ్‌ను భారతరత్నతో సత్కరించడం తమ ప్రభుత్వ అదృష్టమని మోదీ అన్నారు. ‘‘దేశానికి ఆయన చేసిన సాటిలేని కృషికి ఈ గౌరవం అంకితం. ఆయన జీవితమంతా రైతుల హక్కులు, సంక్షేమానికే అంకితం చేశారు. దేశ నిర్మాణంలో తనదైన ముద్ర వేశారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా నిలిచారు. ప్రజాస్వామ్యం పట్ల ఆయన నిబద్ధత యావత్ జాతికి స్ఫూర్తిదాయకం’’అంటూ కొనియాడారు. స్వాగతించిన పార్టీలు పీవీ, చరణ్‌సింగ్, ఎంఎస్‌లకు భారతరత్న ప్రకటించడంపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్ణయాన్ని పార్టీలకు అతీతంగా నేతలంతా స్వాగతించారు. వారు ముగ్గురూ ఎప్పటికీ భారతరత్నాలేనని కాంగ్రెస్ పేర్కొంది. కాంగ్రెస్ తరఫున ఈ నిర్ణయాన్ని పూర్తిగా స్వాగతిస్తున్నట్టు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎక్స్‌లో పోస్ట్ చేశారు. జాతి నిర్మాణానికి పీవీ చేసిన కృషి ఎనలేనిదని ప్రస్తుతించారు. ఆర్థికం, విదేశాంగం, వ్యవసాయం, అణు శక్తి మొదలుకుని లుక్ ఈస్ట్ పాలసీ దాకా ఆయన కృషిని ఒక్కొక్కటిగా ఖర్గే ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. మరోవైపు, పీవీకి భారతరత్న రావడంపై ఏమంటారని కాంగ్రెస్ అగ్ర నేత సోనియాగాందీని పార్లమెంటు బయట మీడియా ప్రత్యేకంగా ప్రశ్నించడం విశేషం. ‘‘నేను స్వాగతిస్తున్నా. కచ్చితంగా’’అంటూ ముక్తసరి స్పందనతో సరిపెట్టారామె. స్వామినాథన్‌కు భారతరత్న ప్రకటించిన మోదీ, ఆయన ఫార్ములా ఆధారంగా రూపొందిన కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంపై మాత్రం మూగనోము పట్టారంటూ కాంగ్రెస్ విమర్శించింది. ఇలాంటి నిర్ణయాల్లో బీజేపీ పార్టీ రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తుందని మరోసారి రుజువైందని పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. వారికి ఎప్పుడో ఈ గౌరవం దక్కి ఉండాల్సిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అభిప్రాయపడ్డారు. పీవీకి భారతరత్న ఇవ్వడాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రస్తుతించారు. -
పీవీకి భారత ప్రభుత్వ అత్యున్నత పౌర పురస్కారం
-
PV: ఓర్పు.. నేర్పు.. మౌన ముని పీవీ చెప్పే పాఠం
అనేక భాషల్లో పీవీ పాండిత్యం, ఆయన రచనలు, అంతర్జాతీయ విధానాలు, రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ప్రధానిగా ఆయన తీసుకున్న సాహసోపేతమయిన నిర్ణయాలు, ఇతర పార్టీల నాయకులను గౌరవించిన తీరు, ఆర్థిక సంస్కరణలు, వార్ధక్యంలో కూడా కొత్త విషయాలు నేర్చుకునే ఉత్సాహం…ఇలా పీవీ గురించి అన్ని విషయాలు అందరికీ తెలిసినవే. సినిమా తారల్లాంటి వారిని కంటితో చూడాలి. ఘంటసాల లాంటివారిని చెవితో వినాలి. పీవీ, వాజపేయి లాంటివారిని బుద్ధితో చూడాలి. జ్ఞానంతో అర్థం చేసుకోవాలి. వారి సందర్భాల్లోకి వెళ్లి అవగాహన చేసుకోవాలి. మెదడుతో చూడాలి. మనసుతో తాకాలి. అప్పుడే పీవీ నుండి ఎంతో తెలుసుకోగలం. నేర్చుకోగలం. ఓర్పు పీవీది ఎంత సుదీర్ఘ ప్రయాణం? ఎన్ని మజిలీలు? ఎన్ని సత్కారాలు? ఎన్ని ఛీత్కారాలు? ఎన్ని పొగడ్తలు? ఎన్ని తిట్లు? ఒక దశలో సర్వసంగ పరిత్యాగిలా సన్యాసం స్వీకరించడానికి పెట్టే బేడా సర్దుకున్న వైరాగ్యం. అయినా బయటపడలేదు. కీర్తికి పొంగిపోలేదు. అవమానాలకు కుంగిపోలేదు. ఓపికగా, మౌనంగా, సాక్షిగా చూస్తూ ఉన్నాడు. ఆయన రోజు రానే వచ్చింది. అప్పుడు కూడా యోగిలా ఆ మౌనంతోనే అన్ని అవమానాలకు సమాధానం ఇచ్చాడు. తన ప్రత్యర్థుల ఊహకందనంత ఎత్తుకు ఎదిగాడు. కంచు మోగునట్లు కనకంబు మోగునా? నేర్పు ఎక్కడి తెలంగాణా పల్లె? ఎక్కడి ఢిల్లీ గద్దె? రాజకీయ పరమపద సోపాన పటంలో, అందునా అడుగడునా మింగి పడేసే పెద్ద పెద్ద పాములమధ్య పాములపర్తి పి వి ప్రధాని అయ్యాడంటే ఎంత నేర్పు ఉండాలి? ఎన్ని విద్యలు నేర్చుకుని ఉండాలి? ఎన్ని భాషలు నేర్చుకుని ఉండాలి? ఎన్నెన్ని కొత్త విషయాలు తెలుసుకుని ఉండాలి? ఎంత ఉత్సాహం ఉరకలు వేసి ఉండాలి? ముసలితనంలో, ఢిల్లీ తెలి మంచు ఉదయాల్లో స్వెటర్ వేసుకుని కంప్యూటర్ కీ బోర్డు ముందు ప్రోగ్రామింగ్ రాయగలిగాడంటే ఎంత జిజ్ఞాస లోపల దీపమై వెలుగుతూ ఉండాలి? పది భాషలు అవలీలగా మాట్లాడాలంటే మెదడు ఎంత చురుకుగా ఉండి ఉండాలి? రాజకీయంగా ఊపిరి సలపని పనుల్లో ఉంటూ లోపల భాషా సాహిత్యాలకు సంబంధించిన ఒక మూర్తిని తనకు తాను పెంచి పోషించుకోవాలంటే ఎంత సాహితీ పిపాస ఉండి ఉండాలి? విశ్వనాథ పెద్ద నవల వేయి పడగలను సహస్రఫణ్ పేరిట హిందీలోకి అనువదించాలంటే తెలుగు ఠీవిని దేశానికి రుచి చూపించాలని ఎంత తపన ఉండి ఉండాలి? మార్పు సంప్రదాయ చట్రాల్లో ఇరుక్కుపోకుండా నిత్యం కాలానుగుణంగా మారడంలో పీవీ వేగాన్ని చాలామంది ఆయన సమకాలీనులు అందుకోలేకపోయారు. మన్మోహన్ సింగ్ ను ఆర్థిక మంత్రిగా తన కొలువులో పెట్టుకోవడం అప్పట్లో ఒక సాహసం. కునారిల్లుతున్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ఆయన చేసిన మార్పులే ఇప్పటికీ దారి దీపాలు. రెవిన్యూ సంస్కరణలు, పేదవారికి హాస్టల్ చదువులు, వినూత్న నవోదయ చదువులు… రాస్తూ పొతే రాయలేనన్ని మార్పులు. చేర్పు ఎవరిని చేర్చుకోవాలో? ఏది చేర్చుకోవాలో? ఎప్పుడు చేర్చుకోవాలో? తెలిసి ఉండాలి. మన్మోహన్ ను ఎందుకు చేర్చుకున్నాడో లోకానికి తెలుసు. అంతర్జాతీయ యవనిక మీద భారత వాణిని వినిపించడానికి ప్రతిపక్ష నాయకుడు వాజపేయిని కోరి ఎందుకు చేర్చుకున్నాడో లోకానికి తెలుసు. లోకానికి తెలియనివి, తెలియాల్సిన అవసరం లేనివి ఎన్నో చేర్చుకున్నాడు. కూర్పు ఎన్నిటిని ఓపికగా కూర్చుకుంటే పీవీని ఇప్పుడిలా మనం స్మరించుకుంటాం? సహనాన్ని కూర్చుకున్నాడు. తెలివితేటలను కూర్చుకున్నాడు. తెగువను కూర్చుకున్నాడు. కార్యదక్షులను కూర్చుకున్నాడు. చివరికి కాలాన్ని కూడా తనకు అనుకూలంగా కూర్చుకున్నాడు. తీర్పు ఏ నిర్ణయం తీసుకోకాకపోవడం కూడా ఒక నిర్ణయమే- అంటూ పి వి ని విమర్శించేవారు తరచు అనే మాట. టీ వీ తెరల ప్రత్యక్ష ప్రసారాల్లోకి వచ్చి చిటికెల పందిళ్లు వేస్తూ…జనం మీద సర్జికల్ స్ట్రైక్ నిర్ణయాల హిరోషిమా నాగసాకి సమాన విస్ఫోటనాలు విసిరి వినోదం చూసే నాయకులతో పోలిస్తే పి వి ఏ నిర్ణయం ఎందుకు తీసుకోలేదో? ఏ సయోధ్య కుదరని విషయాలను ఎందుకు కాలానికి వదిలేశాడో? అర్థమవుతుంది. ఇప్పుడు మన సర్టిఫికెట్లు ఆయనకు అవసరం లేదు. ఏ తప్పు లేని వాడు దేవుడే. మనిషిగా పుట్టినవాడికి గుణదోషాలు సహజం. నేర్చుకోగలిగితే పి వి నుండి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. సామాన్యుడిగా పుట్టి అసామాన్యుడిగా ఎదిగి, ఒదిగిన పి వి మన ఠీవి అనుకుని విగ్రహాలు పెడితే కూడళ్లలో మౌన సాక్షిగా ఉండిపోతాడు. మనం తెలుసుకుని నడవదగ్గ అడుగుజాడ పీవీ అనుకుంటే నిజంగా మన మనసుల్లో పి వీ ఠీవి అవుతాడు. :::పమిడికాల్వ మధుసూదన్ 9989090018 ఇదీ చదవండి: తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధాని పీవీకి భారత రత్న -
పీవీ నరసింహరావుకు భారతరత్న.. స్పందించిన మెగాస్టార్!
తెలంగాణ బిడ్డ, దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహరావుకు భారతరత్న ప్రకటించడంపై మెగాస్టార్ స్పందించారు. దేశానికి ఆయన చేసిన సేవలు అద్భుతమని కొనియాడారు. విప్లవాత్మక ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టడం ద్వారా దేశ స్థితిగతులను మార్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఈ మేరకు చిరంజీవి ట్వీట్ చేశారు. చిరంజీవి తన ట్వీట్లో రాస్తూ..'నిజమైన దార్శనికుడు, పండితుడు, బహుభాషావేత్త, గొప్ప రాజనీతిజ్ఞుడైన తెలుగు బిడ్డకు భారతరత్న రావడం మనందరికీ గర్వకారణం, విప్లవాత్మక ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టడం ద్వారా ఆధునిక భారతదేశాన్ని మార్చివేశారు. ప్రపంచంలో భారతదేశం ఆర్థిక శక్తిగా మారడానికి పునాది వేసిన వ్యక్తి ఆయనే. తాను చేసిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహారావును భారతరత్నతో సత్కరించింది. ఇది భారతీయులందరితో పాటు తెలుగువారికి మరింత సంతోషకరమైన విషయం. ఈ గౌరవం లభించడం ఆలస్యమైనప్పటికీ.. ఇంతకు మించిన గొప్పది ఏమీ ఉండదు.' అని పోస్ట్ చేశారు. కాగా.. చిరంజీవి ప్రస్తుతం బింబిసార డైరెక్టర్ వశిష్ఠతో సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి విశ్వంభర అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రంలో చిరుకు జోడీగా స్టార్ హీరోయిన్ త్రిష కనిపంచనుంది. A true visionary, scholar, polyglot, great statesman, pride of All Telugus , someone whose vision has transformed modern India by ushering in revolutionary economic reforms and laid the foundation for India to become an economic powerhouse, former Prime Minister Late Shri.PV… pic.twitter.com/hMnvCIFy6g — Chiranjeevi Konidela (@KChiruTweets) February 9, 2024 -
పీవీకి భారత రత్న.. కవిత ఫస్ట్ రియాక్షన్
-
PV చనిపోయినప్పటి నుంచి ఇప్పటి దాకా పట్టించుకోని కాంగ్రెస్
-
పీవీకి భారత ప్రభుత్వ అత్యున్నత పౌర పురస్కారం
-
పీవీకి భారత రత్న: రాజకీయ ప్రముఖుల హర్షం
సాక్షి, హైదరాబాద్: భారత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహరావును దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న వరించింది. కేంద్ర ప్రభుత్వం పీవీకి శుక్రవారం భారత రత్న ప్రకటించింది. పీవీకి భారత రత్న దక్కటంపై పలువురు రాజకీయ ప్రముఖలు హర్షం వ్యక్తం చేశారు. పీవీకి భారత రత్న దక్కటంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. ‘తెలుగుజాతి కీర్తి ప్రతిష్ఠలను ఆకాశమంత ఎత్తున ఎగరేసిన మన తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధాని, ఆర్థిక మేధావి, బహుభాషా కోవిదుడు పీవీ నర్సింహారావు గారికి భారతరత్న దక్కడం గర్వించదగ్గ విషయం. తెలంగాణ బిడ్డలుగా మనందరి గుండెల్లో ఆనందం ఉప్పొంగే క్షణం. మాజీ ప్రధాని చరణ్ సింగ్, ఎల్ కె అద్వానీ, కర్పూరీ ఠాకూర్, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాధన్ గార్లకు భారతరత్న రావడం సంతోషకరం.’అని ఆయన ఎక్స్ అకౌంట్ ద్వారా హర్షం వ్యక్తం చేశారు. తెలుగుజాతి కీర్తి ప్రతిష్ఠలను ఆకాశమంత ఎత్తున ఎగరేసిన మన తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధాని, ఆర్థిక మేధావి, బహుభాషా కోవిదుడు పీవీ నర్సింహారావు గారికి భారతరత్న దక్కడం గర్వించదగ్గ విషయం. తెలంగాణ బిడ్డలుగా మనందరి గుండెల్లో ఆనందం ఉప్పొంగే క్షణం. మాజీ ప్రధాని చరణ్ సింగ్, ఎల్ కె అద్వానీ,… pic.twitter.com/yNme5aBsjg — Revanth Reddy (@revanth_anumula) February 9, 2024 తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవం: మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ బిడ్డ, భారత మాజీ ప్రధాని పివి నరసింహారావుకు దేశ అత్యన్నత పురస్కారం భారత రత్న దక్కడం పట్ల బిఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావు గారు హర్షం వ్యక్తం చేశారు. ఈ పురస్కారం తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవంగా కేసీఆర్ పేర్కొన్నారు. పీవీకి భారత రత్న ప్రకటించాలని బీఆర్ఎస్ పార్టీ చేసిన డిమాండ్ ను గౌరవించి పీవీ నరసింహారావు కు భారత రత్న ఇవ్వడం పట్ల కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. మోదీకి ధన్యవాదాలు: ఎమ్మెల్యే కేటీఆర్ ‘దేశ మాజీ ప్రధాని పీవీ నరసింహారావును భారతరత్నతో సత్కరించడం సంతోషకరం. ఈ నిర్ణయం తీసుకున్నందుకు ప్రధాని నరేంద్రమోదీకి ధన్యవాదాలు. కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన పీవీఎన్ఆర్ శత జయంతి ఉత్సవాల నుంచి ఈ గౌరవం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం’అని ట్విటర్లో పేర్కొన్నారు. Glad that the Union Government has honoured Former Prime Minister Sri PV Narasimha Rao with Bharat Ratna 🙏 I thank PM Sri @narendramodi Ji for this decision We have been demanding the Union Government for this honour since the centenary celebrations of Sri PVNR held by… https://t.co/RPmwHtWo06 — KTR (@KTRBRS) February 9, 2024 భారత రత్న ఇవ్వటం సంతోషంగా ఉంది: పీవీ కుమార్తె.. ఎమ్మెల్సీ సురభీ వాణి దేవి ‘తెలంగాణ గడ్డ మీద పుట్టిన తొలి తెలుగు ప్రధాని మన పీవీ నరసింహారావు గారికి భారత రత్న ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. పీవీ గారికి భారత రత్న ఇవ్వడంతో భారత రత్న విలువ మరింత పెరిగింది. 1991 నుంచి 1992 భారత దేశ పరిస్థితి ఏ రకంగా ఉండేదో అందరూ ఆలోచించాలి. ప్రజల క్షేమంమే తన జీవితం అని పీవీ గారు అనుకున్నారు. కొంచం లేట్ అయిన పీవీ గారికి భారత రత్న ఇవ్వడం చాలా సంతోషం. ... అయిన కుటుంబ సభ్యులుగా అందరం ఆనంద పడుతున్నాం. పీవీ గారి శత జయంతి ఉత్సవాలు కేసీఆర్ ఘనంగా నిర్వహించారు. పార్టీలకు అతీతంగా బీజేపీ పీవీ గారిని గుర్తించి భారత రత్న ఇవ్వడం ప్రధానీ మోదీ సంస్కారంకు నిదర్శనం. రాజకీయాలు పక్కన పెట్టీ ప్రతి ఒక్కరూ ఈ నిర్ణయాన్ని స్వాగతించాలి’ అని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. తెలుగు ఠీవీ పీవీకి భారతరత్న భేష్: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ‘తెలుగు ప్రజలకు ప్రత్యేకించి తెలంగాణకు దక్కిన గౌరవమిది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డకు అత్యున్నత పురస్కారం లభించడం ఆ జిల్లావాసిగా నేను నగర్వపడుతున్నా. దేశం కోసం ఎంతో సేవ చేసిన పీవీ నర్సింహారావును కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విస్మరించింది. పీవీని కేవలం రాజకీయ లబ్దికే వాడుకున్న చరిత్ర బీఆర్ఎస్ది. రాజకీయాలకు అతీతంగా దేశానికి పీవీ చేసిన సేవలను గుర్తించి దేశ అత్యున్నత పురస్కారం అందించిన మోదీ ప్రభుత్వానికి ధన్యవాదములు. .. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉత్సవాలు నిర్వహించాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిస్తున్నా. మాజీ ప్రధాని చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ కు కూడా భారతరత్న పురస్కారం ప్రకటించడం సముచిత నిర్ణయం’అని బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. పీవీకి భారతరత్న దక్కటం దేశప్రజలందరికీ గర్వకారణం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ‘కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, వారి కుటుంబ సభ్యులు ఏనాడూ పీవీ గారిని గౌరవించలేదు. కాంగ్రెస్ పార్టీ పెద్దలు పీవీ పట్ల కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారు. పీవీ తుదిశ్వాస విడిచాక కూడా పార్టీ కార్యాలయంలోకి పార్థివదేహాన్ని రానివ్వలేదు. కాంగ్రెస్ పార్టీ పీవీ గారిని దారుణంగా అవమానించింది. ఢిల్లీలో పీవీ స్మృతి కేంద్రాన్ని కాంగ్రెస్ ఏర్పాటుచేయలేదు. ... చివరకు పీవీ అంతిమ సంస్కారంలోనూ ఆటంకాలు కల్పించారు. యూపీఏ పదేళ్ల హయాంలో ఏనాడూ.. పీవీ దేశానికి చేసిన సేవలను గుర్తుచేయలేదు. దేశానికి పీవీ చేసిన సేవలను బీజేపీ పార్టీ నేతృత్వంలోని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుర్తించి.. దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్నతో వారిని గౌరవించడం గొప్ప విషయం’అని కిషన్‌రెడ్డి తెలిపారు. పీవీకి భారత రత్న ప్రకటించిన కేంద్రానికి ధన్యవాదాలు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి ‘తెలంగాణ బిడ్డ పివి కి భారత రత్న అవార్డు దక్కడం తెలుగు వారందరికీ గర్వ కారణం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పీవీకి భారత రత్న ఇవ్వాలని పలు మార్లు కేంద్రాన్ని కోరారు. పీవీకి భారత రత్న ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. తెలంగాణ ఠీవి మన పీవీ అని కేసిఆర్ సగర్వంగా అన్ని వేదికల మీద చెప్పారు. పీవీ కూతురు వాణి దేవికి ఎమ్మెల్సిగా అవకాశం కల్పించి వారి కుటుంబానికి సమున్నత గౌరవాన్ని ఇచ్చారు. ట్యాంక్ బండ్ మీద పీవీ విగ్రహం, నెక్లెస్ రోడ్‌కు పీవీ మార్గ్‌గా నామకరణం, అసెంబ్లీలో చిత్ర పటం పెట్టిన ఘనత కేసీఆర్‌దే’అని ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. -
భారతరత్న.. ఆ సంప్రదాయాన్ని తిరగరాసి మరీ..!
మునుపెన్నడూ లేని రీతిలో.. దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ఈ ఏడాది ఏకంగా ఐదుగురికి ప్రకటించింది భారత ప్రభుత్వం. భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ.. మాజీ ప్రధానులైన పీవీ నరసింహరావు, చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌లకు ప్రకటించారు. అంతకు ముందు మరో ఇద్దరి పేర్లను ప్రధాని మోదీ స్వయంగానే ప్రకటించిన సంగతీ తెలిసిందే. సాధారణంగా భారతరత్న అవార్డులను ఒకరు, ఇద్దరు, గరిష్టంగా ముగ్గురికి ఇస్తూ వస్తోంది కేంద్రం. ఆ సంప్రదాయానికి 1999లో బ్రేక్ పడి.. ఏకంగా నలుగురికి ప్రకటించింది అప్పటి ప్రభుత్వం. ఆ తర్వాత మళ్లీ ఒకరు, ఇద్దరు, ముగ్గురికి ఇస్తూ వచ్చారు. అయితే ఈ ఏడాది మాత్రం ఏకంగా ఐదుగురికి ప్రకటించింది. ఈ ఏడాది.. బీజేపీ దిగ్గజం ఎల్కే అద్వానీకి, బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి థాకూర్‌కు భారతరత్నలకు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇవాళ మరో ముగ్గురికి ప్రకటించడంతో మొత్తం ఐదుగురికి ఇచ్చినట్లయ్యింది. ఐదుగురివి వేర్వేరు ప్రాంతాలు. ఇందులో స్వామినాథన్ మినహాయించి మిగిలిన నలుగురికి వేర్వేరు రాజకీయ నేపథ్యం ఉంది. దీంతో.. ఆయా ప్రాంతాల రాజకీయ నేతలు పార్టీలకతీతంగా తమ ప్రాంత దిగ్గజాలకు భారతరత్న దక్కడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. పీపీ నరసింహరావు పాములపర్తి వెంకట నరసింహారావు 1921 జూన్ 28న వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లిలో జన్మించారు. 1991 జూన్ 21 నుంచి 1996 మే 16 దాకా భారత దేశానికి ప్రధానిగా పని చేశారు. అంతకు ముందు.. కేంద్రంలో మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్‌గాంధీ ప్రభుత్వాల్లో పనిచేశారు. దేశ హోం, రక్షణ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల బాధ్యతలు నిర్వర్తించారు. స్వాతంత్రోద్యమం సమయంలో దేశం కోసం పోరాడిన పీవీ.. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1957-77 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించిన ఆయన పలు మంత్రిపదవులు చేపట్టారు. 1971 నుంచి 1973 వరకు ఏపీ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఇదీ చదవండి: తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధాని పీవీకి భారత రత్న చరణ్ సింగ్.. ఉత్తర ప్రదేశ్ మీరట్‌లో పుట్టిన పెరిగిన చరణ్ సింగ్.. 1979 జులై 28వ తేదీ నుంచి 1980 జనవరి 14వ తేదీ దాకా దేశానికి ప్రధానిగా పని చేశారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగానూ ఆయన రెండుసార్లు పని చేశారు. యూపీలో చెప్పుకోదగ్గ స్థాయిలో బలం,బలగం ఉన్న రాష్ట్రీయ లోక్‌దళ్(ఆర్ఎల్డీ.. చరణ్ సింగ్ వారసులు స్థాపించిన పార్టీ), విపక్ష శిబిరానికి షాక్ ఇచ్చి ఎన్డీయేలో చేరుతుందన్న ప్రచారం ఉన్న సమయంలోనే.. చరణ్ సింగ్‌కు అవార్డు ప్రకటించడం గమనార్హం. ఇదీ చదవండి: గ్రామీణ ప్రజాబంధు చరణ్ సింగ్ ఎం.ఎస్ స్వామినాథ్.. భారత దేశ హరితవిప్లవ పితామహుడిగా మాన్‌కోంబు సాంబశివన్ స్వామినాథ్ 1925 ఆగస్టు 7న తమిళనాడు రాష్ట్రంలో కావేరి డెల్టా ప్రాంతంలోని కుంభకోణం పట్టణంలో జన్మించారు. కొంతకాలం కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో పనిచేసిన స్వామినాథన్ 1954లో మళ్లీ భారత్‌లో అడుగు పెట్టారు. ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో శాస్త్రవేత్తగా పరిశోధనలపై దృష్టి పెట్టారు. 1972–79లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్‌గా వ్యవహరించారు. 1979లో కేంద్ర ప్రభుత్వం ఆయనను వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. 2007 నుంచి 2013 దాకా రాజ్యసభలో నామినేట్ ఎంపీగా సేవలను అందించారు. స్వామినాథన్ దేశ విదేశాల్లో ఎన్నో ప్రఖ్యాత సంస్థలకు నాయకత్వం వహించారు. కిందటి ఏడాది సెప్టెంబర్ 28వ తేదీన ఆయన కన్నమూశారు. ఇదీ చదవండి: ఆకలిపై పోరాటం జరిపిన శాస్త్రవేత్త కర్పూరి ఠాకూర్ బిహార్ మాజీ సీఎం, దివంగత నేత కర్పూరి ఠాకూర్ ఆయన శతజయంతి వేళ కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న తో గౌరవించింది. బిహార్‌కు రెండు పర్యాయాలు (డిసెంబరు 1970 నుంచి జూన్ 1971 వరకు, డిసెంబరు 1977 నుంచి ఏప్రిల్ 1979 వరకు) సీఎంగా సేవలందించి.. తన పాలనా దక్షతతో జన నాయక్‌గా చెరగని ముద్ర వేసుకున్నారు. 1924 జనవరి 24న బిహార్‌లోని సమస్తీపూర్ జిల్లాలో జన్మించిన కర్పూరి ఠాకూర్.. అనునిత్యం పేద ప్రజల సంక్షేమం కోసం, సామాజిక మార్పు కోసం పనిచేశారు.జనం కోసం నిబద్ధతతో పనిచేసిన ఆయన్ను ‘జననాయక్ కర్పూరి ఠాకూర్’ అని అక్కడి ప్రజలు పిలుస్తారు. లాలూ ప్రసాద్ యాదవ్, నీతీశ్ కుమార్, రాం విలాస్ పాశవాన్ వంటి నేతలకు ఠాకూర్ రాజకీయ గురువు. తాను విశ్వసించిన సిద్ధాంతాలకు కట్టుబడి సుదీర్ఘకాలం పాటు బిహార్, దేశ రాజకీయాలను ప్రభావితం చేయడం ద్వారా గొప్ప రాజనీతిజ్ఞుడిగా గుర్తింపుపొందిన ఆయన 1988 ఫిబ్రవరి 17న తుదిశ్వాస విడిచారు. ఇదీ చదవండి: అరుదైన జననాయకుడు ఎల్కే అద్వానీ రాజకీయ కురువృద్ధుడు, బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీకి భారతరత్న గౌరవం దక్కింది. సంఘ్ భావజాలాన్ని అణువణువునా పుణికిపుచ్చుకుని.. అంచెలంచెలుగా రాజకీయ దిగ్గజంగా ఎదిగిన మేధావి. అద్వానీ.. 1927 నవంబరు 8న భారత్‌లోని కరాచీ (ప్రస్తుతం పాక్‌లో ఉంది)లో జన్మించారు. 1941లో తన పద్నాలుగేళ్ల వయసులో ఆయన ఆరెస్సెస్‌లో చేరారు.దేశ విభజన తర్వాత ముంబయిలో స్థిరపడ్డ అద్వానీ.. రాజస్థాన్‌లో సంఘ్ ప్రచారక్‌గా పనిచేశారు. 1970లో ఢిల్లీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా తొలిసారి ఎన్నికయ్యారు.1980లో అద్వానీ సహా కొంతమంది జన సంఘ్ నేతలు జనతా పార్టీని వీడారు. ఆ తర్వాత వాజ్పేయీతో కలిసి 1980 ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీని స్థాపించారు. కాంగ్రెస్‌ను ఎదుర్కొనేందుకు నేషనల్ డెమొక్రటిక్ అలయెన్స్(ఎన్డీయే)కు రూపకల్పన చేసిన రాజనీతిజ్ఞుడు. 1999లో జరిగిన ఎన్నికల్లో గాంధీనగర్ లోక్‌సభ స్థానం నుంచి అద్వానీ గెలిచారు. లోక్‌సభలో సుదీర్ఘకాలం పాటు ప్రతిపక్ష నేతగా పనిచేశారు. ఉప ప్రధాని పదవిని సైతం ఆయన చేపట్టారు. 2019 నుంచి క్రియాశీల రాజకీయాలకు ఆయన దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇదీ చదవండి: గమ్యం చేరని రథ యాత్రికుడు -
మాజీ ప్రధాని పీవీకి భారత రత్న.. సీఎం జగన్ హర్షం
సాక్షి, తాడేపల్లి: మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ‘‘పీవీ నరసింహారావు రాజనీతిజ్ఞుడు, ఉన్నత రాజకీయ, నైతిక విలువలు కలిగిన పండితుడు. ఆయనకు అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించటం తెలుగు ప్రజలందరికీ గౌరవం. రైతుల కోసం పాటుపడిన మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్, హరిత విప్లవ పితామహుడు వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌కు కూడా భారతరత్న ప్రదానం చేయడం యావత్ జాతి గర్వించదగ్గ విషయం’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. మాజీ ప్రధానమంత్రి దివంగత పీవీ నరసింహరావుకు భారతరత్న వరించింది. కేంద్ర ప్రభుత్వం పీవీకి భారతరత్నను శుక్రవారం ప్రకటించింది. పీవీతో పాటు మాజీ ప్రధాని చౌదరీ చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌కు కేంద్ర ప్రభుత్వం భారత తర్న ప్రకటించిన విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీటర్ వేదికగా వెల్లడించారు. వరంగల్ జిల్లా నర్సింపేట (మ) లక్నేపల్లిలో 1921 జూన్ 28న జన్మించిన పీవీ నరసింహారావు 1991లో భారత ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడయ్యాయడు. ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించడంలో పీవీ కీలక పాత్ర పోషించారు. బహు భాషా కోవిదుడిగానూ పీవీ నరసింహారావుకు గుర్తింపు ఉంది. కాంగ్రెస్ ను కష్టకాలంలో ఆదుకున్న పీవీని ఆ తర్వాత కాంగ్రెస్ పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. ఇదీ చదవండి: తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధాని పీవీకి భారత రత్న -
తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధాని పీవీకి భారత రత్న
ఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి దివంగత పీవీ నరసింహరావుకు భారతరత్న వరించింది. కేంద్ర ప్రభుత్వం పీవీకి భారతరత్నను శుక్రవారం ప్రకటించింది. పీవీతో పాటు మాజీ ప్రధాని చౌదరీ చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌కు కేంద్ర ప్రభుత్వం భారత తర్న ప్రకటించిన విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీటర్ వేదికగా వెల్లడించారు. Delighted to share that our former Prime Minister, Shri PV Narasimha Rao Garu, will be honoured with the Bharat Ratna. As a distinguished scholar and statesman, Narasimha Rao Garu served India extensively in various capacities. He is equally remembered for the work he did as… pic.twitter.com/lihdk2BzDU — Narendra Modi (@narendramodi) February 9, 2024 వరంగల్ జిల్లా నర్సింపేట (మ) లక్నేపల్లిలో 1921 జూన్ 28న జన్మించిన పీవీ నరసింహారావు 1991లో భారత ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడయ్యాయడు. ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించడంలో పీవీ కీలక పాత్ర పోషించారు. బహు భాషా కోవిదుడిగానూ పీవీ నరసింహారావుకు గుర్తింపు ఉంది. కాంగ్రెస్ ను కష్టకాలంలో ఆదుకున్న పీవీని ఆ తర్వాత కాంగ్రెస్ పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. It is a matter of immense joy that the Government of India is conferring the Bharat Ratna on Dr. MS Swaminathan Ji, in recognition of his monumental contributions to our nation in agriculture and farmers’ welfare. He played a pivotal role in helping India achieve self-reliance in… pic.twitter.com/OyxFxPeQjZ — Narendra Modi (@narendramodi) February 9, 2024 हमारी सरकार का यह सौभाग्य है कि देश के पूर्व प्रधानमंत्री चौधरी चरण सिंह जी को भारत रत्न से सम्मानित किया जा रहा है। यह सम्मान देश के लिए उनके अतुलनीय योगदान को समर्पित है। उन्होंने किसानों के अधिकार और उनके कल्याण के लिए अपना पूरा जीवन समर्पित कर दिया था। उत्तर प्रदेश के… pic.twitter.com/gB5LhaRkIv — Narendra Modi (@narendramodi) February 9, 2024 పీవీ ప్రస్థానం.. పాత కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని వంగరకు చెందిన పీవీ నరసింహారావు మంథని నియోజకవర్గం నుంచి తన రాజకీయ అడుగులు వేశారు. 1957లో మొదటిసారి కాంగ్రెస్ అభ్యర్థి గా పోటీచేసి విజయం సాధించారు. తర్వాత 1962, 67, 72లో వరుసగా విజయం సాధించారు. ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచిన తర్వాత పీవీకి మంత్రిగా అవకాశం వచ్చింది. తొమ్మిది సంవత్సరాల పాటు ఆయన న్యాయ, సమాచార, వైద్య, దేవాదాయ శాఖల మంత్రిగా పనిచేశారు. 1971లో జరిగిన పరిణామాలతో పీవీని కాంగ్రెస్ అధిష్టానం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియమించింది. రెండు సంవత్సరాల పాటు ఆ పదవిలో కొనసాగిన ఆయన తర్వాత రాష్ట్ర రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. 1977లో హనుమకొండ లోక్‌సభస్థానం నుంచి పోటీ చేసి కేంద్ర రాజకీయాల్లో అడుగుపెట్టారు. 1980లో జరిగిన ఎన్నికల్లో మరోసారి ఇదే నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత 1984, 89 సంవత్సరాల్లో మహారాష్ట్రలోని రాంటెక్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. కేంద్ర కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. 1991లో అనూహ్యంగా అత్యున్నతమైన ప్రధానమంత్రి పదవి వరించింది. 1996 వరకు ప్రధానమంత్రి పనిచేశారు. పీఎం పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా, దక్షిణ భారతీయుడిగా చరిత్రలో నిలిచిపోయారు. ఈ ఏడాది ఐదుగురికి భారతరత్న భారత అత్యున్నత పురస్కారమైన భారతరత్నను ఈ ఏడాది ఐదుగురికి ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్, బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్ కే అద్వానీలకు ఇటీవల భారతరత్న ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా పీవీ నరసింహారావు, చరణ్‌సింగ్, స్వామినాథన్‌లకు ఈ అత్యున్నత పురస్కరాన్ని ప్రకటించింది. ఎం.ఎస్ స్వామినాథ్ ప్రస్థానం.. మాన్‌కోంబు సాంబశివన్ స్వామినాథ్ 1925 ఆగస్టు 7న తమిళనాడు రాష్ట్రంలో కావేరి డెల్టా ప్రాంతంలోని కుంభకోణం పట్టణంలో జన్మిమంచారు. ఆయన తండ్రి డాక్టర్ ఎం.కె.సాంబశివన్ వైద్యుడు. తల్లి పార్వతీ తంగమ్మల్ గృహిణి. 11వ ఏట తండ్రిని కోల్పోయారు. తన మామయ్య సంరక్షణలో పెరిగిన స్వామినాథన్ కుంభకోణంలో మెట్రిక్యులేషన్, త్రివేండ్రంలో జంతుశాస్త్రంలో డిగ్రీ చేశారు. తర్వాత కోయంబత్తూరు అగ్రికల్చరల్ కాలేజీ నుంచి అండర్గ్రాడ్యుయేట్ డిగ్రీ సాధించారు. ఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన సంస్థలో పీజీ పూర్తి చేశారు. స్వామినాథన్ 2004 నుంచి 2006 దాకా ‘నేషనల్ కమిషన్ ఆన్ ఫార్మర్స్’ అధినేతగా వ్యవహరించారు. పంటలకు కనీస మద్దతు ధరపై ప్రభుత్వానికి విలువైన ప్రతిపాదనలు చేశారు. పంటల ఉత్పత్తి వ్యయం కంటే కనీసం 50 శాతాన్ని కనీస మద్దతు ధరగా నిర్ణయించాలని సూచించారు. ఎన్నో పదవులు కొంతకాలం కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో పనిచేసిన స్వామినాథన్ 1954లో మళ్లీ భారత్‌లో అడుగు పెట్టారు. ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో శాస్త్రవేత్తగా పరిశోధనలపై దృష్టి పెట్టారు. 1972–79లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్‌గా వ్యవహరించారు. 1979లో కేంద్ర ప్రభుత్వం ఆయనను వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. 2007 నుంచి 2013 దాకా రాజ్యసభలో నామినేట్ ఎంపీగా సేవలను అందించారు. స్వామినాథన్ దేశ విదేశాల్లో ఎన్నో ప్రఖ్యాత సంస్థలకు నాయకత్వం వహించారు. ► 1981 నుంచి 1985 దాకా ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ కౌన్సిల్ స్వతంత్ర చైర్మన్ ► 1984 నుంచి 1990 దాకా ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్ అధ్యక్షుడు ► 1982 నుంచి 1988 దాకా ఫిలిప్పీన్స్‌లోని ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ జనరల్ ► 1989 నుంచి 1996 దాకా వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్(ఇండియా) అధ్యక్షుడు ► ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్) డైరెక్టర్ జనరల్ వరించిన అవార్డులు ► 1967లో పద్మశ్రీ ► 1971లో రామన్ మెగసెసే ► 1972లో పద్మభూషణ్ ► 1987లో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ► 1989లో పద్మవిభూషణ్ ► ప్రపంచవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల నుంచి 84 గౌరవ డాక్టరేట్లు మాజీ ప్రధాని చౌదరీ చరణ్ సింగ్ ప్రస్థానం... జమిండారీ విధానం రద్దు అయిన తరువాత అప్పటికి వాస్తవంగా భూమిని సాగుచేస్తూ ఉన్న కోట్లాది మంది కౌలుదారులకు, గ్రామీణ పేదలకు భూమిపైన హక్కు కల్గించిన రైతు బాంధవుడు చరణ్‌సింగ్. భారతీయ రైతాంగ సమస్యసల పరిష్కారంలో అద్వితీయ పాత్ర పోషించిన రైతుజన బాంధవుడు చౌదరి చరణ్‌సింగ్. జిల్లా స్థాయి నుంచి ప్రధానమంత్రి స్థాయికి ఎదిగిన క్రమంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి రైతు సంక్షేమానికి తుది వరకూ చిత్తశుద్ధితో ప్రయత్నించిన వారిలో అగ్రగణ్యులు చరణ్ సింగ్. సహకార వ్యవసాయం భారతీయ వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలో పడవేస్తుందన్న అభిప్రాయంతో, జవహర్లాల్ నెహ్రూ విధానాలనే చరణ్‌దిక్కరించిన ధీరుడు 1902లో డిసెంబర్ 23న పశ్చిమ యూపీలో మీరట్ జిల్లాలో భడోల్ అనే చిన్న గ్రామంలో మధ్య తరగతి రైతు కుటుంబంలో జన్మించిన చరణ్‌సింగ్.. 1923లో సైన్స్‌లో డిగ్రీని పొంది.. 1925లో ఆగ్రా యూనివర్శిటీ నుండి ఎంఏ, ఎంఎల్ పట్టాలను పొందారు. వృత్తిపరంగానే కాక గ్రామీణ ప్రజల సమస్యలను ప్రత్యేకంగా వ్యవసాయదారుల కష్టసుఖాలను క్షుణ్ణంగా అవగాహన చేసుకుని గ్రామీణ ప్రజానీకంతో మమేకం అయ్యేవారు. 1937-1974 వరకూ శాసనసభ్యుడిగా వరుసుగా ఎన్నిక అవుతూ వచ్చారు. యూపీ రాష్ట్రానికి రెండుసార్లు సీఎంగా, కేంద్రంలో జనతా ప్రభుత్వంలో ఆర్థికమంత్రి, ఉప ప్రధాని పదవులను నిర్వహించారు. 1979లో ప్రధాని అయిన చరణ్ సింగ్ 170 రోజులకే ఆ పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. 1987, మే 29వ తేదీన ఆయన అసువులు బాశారు. -
మాజీ ప్రధానికి సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళ సై నివాళులు
-
పీవీపై సీఎం రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: దేశ మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు 19వ వర్థంతి నేడు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయనకు పలువురు రాజకీయ నేతలు నివాళులర్పిస్తున్నారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పీవీ జ్ఞాన భూమి వద్ద ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నిష్ణాతుడైన పండితుడు, రాజనీతిజ్ఞుడు, పరిపాలదక్షకుడు.. తెలంగాణ గడ్డ మీద పుట్టిన గొప్ప బిడ్డ అని పీవీని కొనియాడారామె. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా దేశవ్యాప్తంగా ఆయన వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పలువురు మంత్రులు పీవీ జ్ఞాన భూమి వద్ద పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి పీవీ. పరిపాలనలో సమూల మార్పులు తెచ్చి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి. దేశ ఆర్ధిక వ్యవస్థ ప్రశ్నార్ధకంగా మారినప్పుడు సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. బంగారాన్ని కుదవ పెట్టి అప్పులు తేవడంపై ఆయన ఒకే మాట చెప్పారు. తెలివైన వాడు సగం ఆస్తిని కుదవపెట్టి అయినా సరే మిగతా ఆస్తిని కాపాడుకుంటారని ఆయన అన్నారు. భూమిని పేదవాడికి అందుబాటులోకి తీసుకొచ్చిన వ్యక్తి పీవీ. పేదలకు భూములు పంచడానికి పీవీ బలమైన పునాదులు వేశారు. పీవీ మన మధ్య లేకపోయినా వారి సంస్కరణలు సదా ఆచరణీయం. పీవీ ఘాట్, జైపాల్ రెడ్డి ఘాట్ లను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. వీరిద్దరూ తెలంగాణకు లంకె బిందెల్లాంటి వారు. పీవీ కీర్తిని పెంచేలా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుంది’’ అని అన్నారు. ఇక ఢిల్లీ పర్యటలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి.. అక్కడి తెలంగాణ భవన్లో జరిగిన పీవీ వర్ధంతి కార్యక్రమానికి హాజరయ్యారు. మాజీ ప్రధాని పీవీ. నరసింహారావు చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ కూడా పాల్గొన్నారు. భారత ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పీవీని అభివర్ణిస్తూ.. దేశానికి ఆయన అందించిన సేవల్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ఉంచింది. On his death anniversary, we pay tribute to the former Prime Minister of India, PV Narasimha Rao. Often remembered as the 'Father of Indian Economic Reforms', who revolutionised the Indian economy, we honour him for his exceptional contributions to the nation. pic.twitter.com/sHD7W01XO0 — Congress (@INCIndia) December 23, 2023 As we observed the 19th death anniversary of former Prime Minister Shri.PV Narasimha Rao Garu,paid floral tributes to him at #Hyderabad. A great son of #Telangana Soil, he's an erudite scholar,a statesman & administrator par excellence.#PVNarasimhaRao pic.twitter.com/atAOi8HkSk — Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) December 23, 2023 దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 19వ వర్ధంతి సందర్భంగా పీవీ జ్ఞాన భూమి వద్ద పూలమాల వేసి నివాళులు అర్పించిన సీఎం శ్రీ @revanth_anumula గారు మరియు మంత్రులు. pic.twitter.com/b6Z7w1XHHN — Telangana Congress (@INCTelangana) December 23, 2023 -
ప్రియాంకకు చరిత్ర తెలియకపోవడం దురుదృష్టకరం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు కాంగ్రెస్ పార్టీ చాలా అన్యాయం చేసిందని, ఈ చరిత్ర గురించి కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీకి ఏ మాత్రం అవగాహన లేకపోవడం నిజంగా దురదృష్టకరమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పీవీ మనందరం అభిమానించే గొప్ప వ్యక్తి అని, మట్టిలో పుట్టిన మాణక్యమని తెలిపారు. తన జీవితమంతాకాంగ్రెస్ పార్టీ కోసం సేవ చేసిన వ్యక్తని పేర్కొన్నారు. అలాంటి నిరాడంబరమైన వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ దారుణంగా అవమానించిందని మంత్రి చెప్పారు. ప్రధానమంత్రి ఉన్న పీవీ నర్సింహరావుకు 1996లో పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఎంపీ టికెట్ నిరాకరించి ఘోరంగా అవమానించారని కేటీఆర్ ప్రస్తావించారు., ఆయన చనిపోయిన తర్వాత కూడా కనీసం 24 అక్బర్ రోడ్డులోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలోకి కూడా ఆయన భౌతిక కాయాన్ని అనుమతించలేదని గుర్తు చేశారు.చరిత్ర గురించి ప్రియాంకాగాంధీకి అవగాహన లేకపోవడం దారుణమని అన్నారు. పీవీ కుటుంబానికి రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చదవండి: మోదీకి కేసీఆర్, ఓవైసీ స్నేహితులు: రాహుల్ గాంధీ #WATCH | Hyderabad: On Former PM PV Narasimha Rao, Telangana Minister and BRS MLA KT Rama Rao says, "It's truly unfortunate that Priyanka Gandhi does not seem to have any information on the history of the injustice meted out to late PM PV Narasimha Rao. He is someone we all look… pic.twitter.com/mjMOSdew3j— ANI (@ANI) November 25, 2023 #WATCH | Telangana Minister and BRS MLA KT Rama Rao says, "Rahul Gandhi is jobless today because he lost his job in 2014. He and his party both lost their job in 2014. That's why today he remembered unemployment... I want to ask if Rahul Gandhi has ever written a single entrance… pic.twitter.com/7PkNPpajrx— ANI (@ANI) November 25, 2023 -
ఇద్దరూ కరీంనగర్ బిడ్డలే
సాక్షి, కరీంనగర్ డెస్క్: రాజకీయ ఉద్ధండులు పీవీ నరసింహారావు, చెన్నమనేని విద్యాసాగర్‌రావు కరీంనగర్ జిల్లా నుంచే రాజకీయ ఓనమాలు నేర్చుకున్నారు. ఈ ప్రాంతంలోనే పుట్టి, ఇక్కడి నుంచే ఎమ్మెల్యేలుగా ప్రస్థానాన్ని ప్రారంభించారు. అంచెలంచెలుగా ఎదిగి ఒకరు ముఖ్యమంత్రి, ఆ తర్వాత ఏకంగా దేశానికే ప్రధానమంత్రి అయ్యారు. మరొకరు గవర్నర్‌గా పనిచేశారు. మంథని నుంచి పీవీ.. పాత కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని వంగరకు చెందిన పీవీ నరసింహారావు మంథని నియోజకవర్గం నుంచి తన రాజకీయ అడుగులు వేశారు. 1957లో మొదటిసారి కాంగ్రెస్ అభ్యర్థి గా పోటీచేసి విజయం సాధించారు. తర్వాత 1962, 67, 72లో వరుసగా విజయం సాధించారు. ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచిన తర్వాత పీవీకి మంత్రిగా అవకాశం వచ్చింది. తొమ్మిది సంవత్సరాల పాటు ఆయన న్యాయ, సమాచార, వైద్య, దేవాదాయ శాఖల మంత్రిగా పనిచేశారు. 1971లో జరిగిన పరిణామాలతో పీవీని కాంగ్రెస్ అధిష్టానం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియమించింది. రెండు సంవత్సరాల పాటు ఆ పదవిలో కొనసాగిన ఆయన తర్వాత రాష్ట్ర రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. 1977లో హనుమకొండ లోక్‌సభస్థానం నుంచి పోటీ చేసి కేంద్ర రాజకీయాల్లో అడుగుపెట్టారు. 1980లో జరిగిన ఎన్నికల్లో మరోసారి ఇదే నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత 1984, 89 సంవత్సరాల్లో మహారాష్ట్రలోని రాంటెక్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. కేంద్ర కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. 1991లో అనూహ్యంగా అత్యున్నతమైన ప్రధానమంత్రి పదవి వరించింది. పీఎం పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా, దక్షిణ భారతీయుడిగా చరిత్రలో నిలిచిపోయారు. మెట్పల్లి నుంచి విద్యాసాగర్‌రావు.. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని నాగారం గ్రామానికి చెందిన చెన్నమనేని విద్యాసాగర్‌రావు ఏబీవీపీలో చురుకుగా పనిచేశారు. 1983లో కరీంనగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 1985లో మెట్పల్లి నుంచి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి గా బరిలోకిదిగి విజయం సాధించారు. 1989, 1994 సంవత్సరాల్లో వరుసగా గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. 1998లో లోక్‌సభకు జరిగిన మధ్యంతర ఎన్నికల్లో కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత ఏడాది జరిగిన ఎన్నికల్లోనూ మరోమారు గెలుపొందారు. ఆ సమయంలో వాజ్‌పేయి ప్రభుత్వంలో హోం, వాణిజ్య, పరిశ్రమలశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2014లో మహారాష్ట్ర గవర్నర్‌గా కేంద్రం నియమించింది. -
The Reverse Swing: Colonialism to Cooperation: పీవీ నుంచి వాజ్‌పేయీకి రహస్య చీటీ!
న్యూఢిల్లీ: దిగ్గజ నేత అటల్ బిహారీ వాజ్‌పేయీ ప్రధాన మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సమయంలో మాజీ ప్రధాని, కాంగ్రెస్ నేత పీవీ నరసింహా రావు ఆయనకు ఓ చీటీ అందించారని తాజాగా విడుదలైన ఒక పుస్తకం ద్వారా వెల్లడైంది. వివరాల్లోకి వెళ్తే.. వాజ్‌పేయీ ప్రధానిగా కొనసాగిన కాలంలో అంటే 1998–2004 కాలంలో అశోక్ టాండన్ అనే అధికారి ప్రధానమంత్రి కార్యాలయంలో మీడియా వ్యవహారాల ఇన్చార్జ్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన రాసిన ‘ది రివర్స్ స్వింగ్: కలోనియలిజం టు కోఆపరేషన్’ అనే పుస్తకంలో ఇటీవల విడుదలైంది. దానిని పెట్రోలియం, సహజవాయు, గృహ, పట్టణవ్యవహారాల కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురీ ఢిల్లీలో ఆవిష్కరించారు. ఆ పుస్తకంలో మాజీ ప్రధాని వాజ్‌పేయీ గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలను టాండన్ పంచుకున్నారు. రాష్ట్రపతిభవన్‌లో ప్రమాణస్వీకారం వేళ వాజ్‌పేయీ ప్రధానమంత్రి పదవి చేపట్టినపుడు అదే సమయంలో అక్కడే ఉన్న మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు ఒక చీటీని వాజ్‌పేయీకి రహస్యంగా అందించారు. ‘అంసంపూర్తిగా మిగిలిపోయిన ఒక పనిని మీరు పూర్తిచేయాలి’ అని ఆ చీటిలో రాసి ఉందట. 1996 సంవత్సరంలో ఈ ఘటన జరిగిందని పుస్తకంలో పేర్కొన్నారు. ‘ పీవీ తాను ప్రధానిగా కొనసాగిన కాలంలో అమెరికా నుంచి తీవ్ర ఒత్తిళ్ల కారణంగా అణు పరీక్షలను విజయవంతంగా నిర్వహించలేకపోయారు. ఆ బాధ్యతలను పీవీనే స్వయంగా వాజ్‌పేయీకి అప్పగించి ఉంటారు’ అని ఆ పుస్తకంలో టాండర్ రాసుకొచ్చారు. 1996లో వాజ్‌పేయీ ప్రధాని పదవి చేపట్టడం 13 రోజులకే ప్రభుత్వం కూలడం, 1998లో ప్రధాని పగ్గాలు చేపట్టి విజయవంతంగా ఐదేళ్ల పాలన వాజ్‌పేయీ పూర్తిచేసుకోవడం తెల్సిందే. 1996లో అణుపరీక్షలకు ప్రయతి్నంచి విఫలమైన ప్రభుత్వం 1998లో పోఖ్రాన్లో విజయవంతంగా పూర్తిచేసి అమెరికాను సైతం విస్మయానికి గురిచేసిన సంగతి తెల్సిందే. రాష్ట్రపతి పదవి తిరస్కరణ! 2002 సంవత్సరంలో ప్రధాన మంత్రిగా దిగిపోయి రాష్ట్రపతి పదవి చేపట్టాలని వాజ్‌పేయీకి సూచనలు వచ్చాయని, కానీ వాజ్‌పేయీ అందుకు ససేమిరా అన్నారని పుస్తకంలో ఉంది. ప్రధానిగా వాజ్‌పేయీ దిగిపోతే ఆ బాధ్యతలు అద్వానీకి అప్పగించాలని చూశారని పేర్కొన్నారు. ‘ ప్రధానిగా ఉన్న వ్యక్తి వెంటనే రాష్ట్రపతి పదవి చేపడితే అది ప్రజాస్వామ్య దేశానికి ఎంతమాత్రం మంచిదికాదు. పరిణామాలు దారుణంగా ఉంటాయి’ అని తన తోటి మంత్రులతో వాజ్‌పేయీ అన్నారట. 1996 తర్వాత మెజారిటీ ప్రభుత్వం అమెరికాకు నచ్చలేదట పుస్తకంలో పీవీ ఆలోచనలనూ పొందుపరిచారు. ‘ 1996 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఇండియాలో పటిష్టమైన ప్రభుత్వం ఏర్పడటం అమెరికాకు ఇష్టంలేదట. వాజ్‌పేయీ ప్రధాని కావడం అమెరికాకు ఇష్టం లేదనుకుంటా. వాజ్‌పేయీ ముక్కుసూటి తనం, ఆయన వ్యవహార శైలి చూస్తుంటే ఆయన అణుపరీక్షలకు పచ్చజెండా ఊపేలా ఉన్నారని అమెరికా ప్రభుత్వానికి ఢిల్లీలోని ఆ దేశ రాయబారి సమాచారం చేరవేశారు’ అని పీవీ అప్పట్లో అన్నట్లు పుస్తకంలో పేర్కొన్నారు. -
ఆదర్శప్రాయుడు పీవీ: ఇంద్రకరణ్
నిర్మల్‌టౌన్: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అందరికీ ఆదర్శప్రాయుడని, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆశయాలను కొనసాగిద్దామని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని శాంతినగర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన పీవీ నరసింహారావు విగ్రహాన్ని సోమవారం మంత్రి ఆవిష్కరించారు. అంతకుముందు నిర్మల్‌కి విచ్చేసిన రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.కేశవరావుకు స్థానిక ఫారెస్ట్ గెస్ట్‌హౌస్‌లో మంత్రి పూలమొక్క అందజేసి స్వాగతం పలికారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పీవీ హయాంలో 1991 నుంచి 1996 వరకు పార్లమెంట్ సభ్యుడిగా ఉండటం తన అదృష్టమన్నారు. తెలంగాణ బిడ్డ పీవీ ప్రధానమంత్రి అవుతున్నారనే ఉద్దేశంతో తనతోసహా ఏడుగురు టీడీపీ ఎంపీలం ఆయనకు మద్దతు తెలిపామని చెప్పారు. పీవీ చాణక్యనీతితో దేశాన్ని బ్రహ్మాండంగా పాలించి ప్రజల మన్ననలు పొందారని గుర్తుచేశారు. కేశవరావు మాట్లాడుతూ పీవీతో తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. ఉపాధ్యాయులు, మేధావులు విద్యార్థులకు, పిల్లలకు చిన్నప్పటి నుంచే ప్రముఖుల జీవిత చరిత్ర తెలియజేయాలని సూచించారు. -
భారత ప్రధానుల నిర్ణయ విధానాలు!
ఆరుగురు ప్రధానమంత్రులపై నీరజా చౌధరి తాజాగా ‘హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్’ పుస్తకాన్ని వెలువరించారు. ఈ పుస్తక విజయ రహస్యం అంతా కూడా... చరిత్రనూ, జీవిత చరిత్రనూ మిళితం చేసి, దానికి ఉల్లాసభరితమైన చిట్టి పొట్టి కథల్ని, కబుర్లూ–కాకరకాయలను జోడించడంలోనే ఉంది. ఈ ప్రధానులలో ఎవరి మీదనైనా మీకు ఇదివరకే ఉన్న అభిప్రాయాన్ని పునరాలోచింపజేసేంతటి రహస్యాల వెల్లడింపులేమీ ఈ పుస్తకంలో లేవు. ఇది పునఃసమీక్ష కాదు. కానీ ఇందులో ఉల్లేఖనాలు, ఉటంకింపులతో పాటు... మీకు ఇప్పటికే తెలిసి ఉన్న వివరాలకు జోడింపుగా పరిశోధనాత్మక వివరాలు ఉన్నాయి. విషయాలను మీరు మరింత బాగా అర్థం చేసుకోడానికి ఈ పుస్తకం సహాయపడుతుంది. ప్రధానంగా జీవిత చరిత్రలు నాకు మనో రంజకంగా ఉంటాయి. అందుకు కారణం ఆ ముఖ్య పాత్రల జీవితాలలో మనం పాలుపంచుకోవడం ఒక్కటే కాదు, అవి చదవడానికి సరదాగా అనిపించే అనేక చిన్న చిన్న నిజ జీవితపు ఘటనల ఆసక్తికరమైన కథలతో నిండి ఉంటాయి. గంభీరమైన చరిత్ర పుస్తకాలు ఇందుకు భిన్నమైనవి. అవి మరింత విశ్లేషణాత్మకంగా ఉండడం వల్ల వాటిని చదివేందుకు ప్రయాస పడవలసి వస్తుంది. ఇక అవి దేనినైనా పునఃమూల్యాంకనం జరుపుతున్నట్లుగా ఉంటే కనుక అవి అర్థం చేసుకునేందుకు దుర్భేద్యంగా తయారవడం కద్దు. పఠనీయతను, పారవశ్యాన్ని రెండు శైలులుగా జతపరచి ఆరు గురు ప్రధానమంత్రులపై నీరజా చౌధరి తాజాగా ‘హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్’ పుస్తకాన్ని వెలువరించారు. ఈ పుస్తక విజయ రహస్యం అంతా కూడా... చరిత్రనూ, జీవిత చరిత్రనూ మిళితం చేసి, దానికి ఉల్లాసభరితమైన చిట్టి పొట్టి కథల్ని, కబుర్లూ–కాకరకాయలను జోడించడంలోనే ఉంది. ఉదాహరణకు, రాజీవ్ గాంధీపై నీరజ రాసిన అధ్యాయం ఇలా మొదలౌతుంది. ‘‘రాజీవ్! ఈ ముస్లిం మహిళా బిల్లుపై మీరు నన్నే ఒప్పించలేకపోతే, దేశాన్ని ఎలా ఒప్పించబోతారు? అని సోనియా తన భర్తతో అన్నారు.’’ ఇక పీవీ నరసింహారావు అధ్యాయ ప్రారంభ వాక్యం అయితే మరింతగా ఆసక్తిని రేకెత్తించేలా ఉంటుంది. ‘‘డిసెంబరు 6వ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల సమయం తర్వాత మీరు పూజలో కూర్చొని ఉన్నారని విన్నాను అని వామపక్ష పాత్రికేయుడు నిఖిల్ చక్రవర్తి ప్రధాని నరసింహారావుతో అన్నారు’’ అని ఉంటుంది. ఆ విధమైన ప్రారంభ వాక్యంతో లోపలికి వెళ్లకుండా ఉండటం అసాధ్యం. ఇప్పుడేమిటంటే, ఈ ప్రధానులలో ఎవరి మీదనైనా మీకు ఇది వరకే ఉన్న అభిప్రాయాన్ని పునరాలోచింపజేసేంతటి రహస్యాల వెల్లడింపులేమీ ఈ పుస్తకంలో లేవు. ఇది పునఃసమీక్ష కాదు. కానీ ఇందులో ఉల్లేఖనాలు, ఉటంకింపులతో పాటు... మీకు ఇప్పటికే తెలిసి ఉన్న వివరాలకు జోడింపుగా పరిశోధనాత్మక వివరాలు ఉన్నాయి. విషయాలను మీరు మరింత బాగా అర్థం చేసుకోడానికి ఈ పుస్తకం సహాయపడుతుంది. నరసింహారావుపై ఆమె చేసిన వ్యాఖ్యలైతే విశేషంగా మనల్ని ఆకట్టుకుంటాయి. మొదటిది – ఆ మనిషి గురించి ఆమెకు ఉన్న అవగాహన. ‘‘పీవీ నరసింహారావు... తనతో తను వాగ్వాదానికి దిగు తారు. ఒక విషయాన్ని ఆయన అంతర్గతంగా చర్చించుకుంటారు. ఎంత లోతుగా వెళతారంటే, ఏ వైపూ స్పష్ట మైన చిత్రం కనిపించని స్థాయిలో ఆ విషయంలోని రెండు దృక్కోణాలనూ వీక్షి స్తారు’’ అంటారు నీరజ. ఇంకా అంటారూ, 1996లో ఆయన మెజారిటీ కోరుకోలేదనీ, ఆయన కోరుకున్న విధంగానే మెజారిటీ రాలేదనీ! ఎందుకంటే మెజారిటీ వస్తే సోనియాగాంధీకి దారి ఇవ్వవలసి వస్తుంది కదా! ‘‘కాంగ్రెస్ మైనారిటీలో ఉంటేనే రావుకు మళ్లీ ప్రధాని అయ్యే అవకాశం ఉంటుంది’’ అని రాశారు నీరజా చౌధరి. ఆమె సరిగ్గానే చెప్పారు. ఇంతకు ముందె ప్పుడూ నాకు ఆ ఆలోచనే తట్టలేదు. వాజ్‌పేయితో నరసింహారావుకు ఉన్న దగ్గరితనం నా దృష్టిని మొత్తం అటు వైపునకే మరల్చింది. ‘‘ఇద్దరూ కలిసి చాలా దూరం ప్రయాణించారు. సంక్షోభ సమయాలలో ఒకరినొకరు కాపాడు కున్నారు’’ అని రాస్తారు నీరజ. 1996 అక్టోబరులో జరిగిన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమా వేశంలో వాజ్‌పేయి... నరసింహారావుకూ, భువనేశ్ చతుర్వేది అనే ఒక జూనియర్ మంత్రికీ మధ్య కూర్చొని ఉన్నారు. అప్పుడు ‘‘వాజ్ పేయి... రావు వైపు ఒరిగి, ‘కల్యాణ్ సింగ్ హమారే బహుత్ విరో«ద్ మే హై, ఉన్ కో నహీ బన్నా చాహియే’ (కల్యాణ్ సింగ్ నన్ను వ్యతిరేకి స్తున్నారు. ఆయన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్ట కూడదు) అన్నారు’’ అని భువనేశ్ చతుర్వేదిని ఉటంకిస్తూ నీరజ రాశారు. ఆ సాయంత్రం చతుర్వేది, ‘వాజ్‌పేయికి సహాయం చేయాలా?’ అని రావును అడిగారు. అందుకు ఆయన ‘హా... కెహ్ దో వోరాజీ కో’ (అవును... అవసరమైనది చేయమని వోరాజీకి చెప్పండి) అన్నారు. వోరా ఆనాటి యూపీ గవర్నర్. నరసింహారావు సందేశం వోరాకు అందింది. కల్యాణ్ సింగ్ ముఖ్యమంత్రి కాలేదు. నీరజ వివరణ ఎక్కువ మాటలతో ఉండదు. ‘‘లక్నోలో కల్యాణ్ సింగ్‌ను ముఖ్యమంత్రిగా నియమించడం అంటే అధికారం అద్వానీ చేతుల్లోకి వెళ్లడం. ఇది వాజ్‌పేయికి సమస్యల్ని సృష్టించ వచ్చు. వాజ్‌పేయి విషయంలో యూపీకి ఉన్న ప్రాము ఖ్యాన్ని అర్థం చేసుకుని, తన స్నేహితుడికి సహాయం చేయాలని రావు నిర్ణయించు కున్నారు’’ అని ఒక్కమాటలో చెప్పేశారు నీరజ. తిరిగి ఐదేళ్ల తర్వాత పీవీ నరసింహారావుకు ప్రతిఫలంగా వాజ్‌పేయి సహాయం అందించారు. 2000 సెప్టెంబరులో అవిశ్వాస తీర్మానాన్ని వీగి పోయేలా చేసేందుకు ఎంపీలకు లంచం ఇచ్చిన కేసులో ట్రయల్ కోర్టు రావును దోషిగా నిర్ధారించింది. అప్పుడు, ‘‘ఆ కేసును మూసి వేయించడానికి వాజ్‌పేయి సహాయం కోరారు నరసింహారావు’’ అని నీరజ రాశారు. ‘‘మధ్యవర్తిగా తను వాజ్‌పేయి దగ్గరకు వెళ్లినట్లు చతుర్వేది నాతో చెప్పారు: ‘నేను అటల్‌జీని కలవడా నికి వెళ్లాను. అప్పుడు ఆయన నన్ను లోపలికి పిలిచారు. ‘ఇస్ కో ఖతమ్ కీజియే’ (ఆ విషయాన్ని ముగించండి) అని అన్నారు’’ అని భువనేశ్ చతుర్వేది తనతో చెప్పి నట్లు నీరజా చౌధరి పేర్కొన్నారు. 2002 మార్చిలో ఢిల్లీ హైకోర్టు నరసింహారావును నిర్దోషిగా ప్రకటించింది. ‘‘హైకోర్టు తీర్పుపై అప్పీలు చేయకూడదని వాజ్‌పేయి ప్రభుత్వం నిర్ణయించుకోవడం గమనార్హం’’, ‘‘సీబీఐ కూడా కేసును ఉపసంహరించుకుంది’’ అని రాశారు నీరజ. నా ఇన్నేళ్లలోనూ నేను ఇలాంటి ఇచ్చిపుచ్చుకోవడాలను చూడ లేదు. వాళ్లిద్దరూ ప్రత్యర్థులు. ప్రధాని పదవి కోసం తలపడ్డవారు. అయినప్పటికీ తమకెదురైన సవాళ్లను మొగ్గలోనే తుంచేయడానికి ఒకరికొకరు సహాయం చేసుకున్నారు. ‘నా వీపు నువ్వు గోకు, నీ వీపు నేను గోకుతా’ అనే మాటకు ఇదొక చక్కని నిదర్శనం. అత్తరు వాసనలా బయటికి కూడా రాదు. ఈ విషయంపై వారి వారి పార్టీలు ఎలా స్పందిస్తాయో తెలుకోవాలని నాకు ఇప్పుడు కుతూహలంగా ఉంది. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
కాంగ్రెస్ VS బీజేపీ: పీవీ జయంతి చుట్టూ రాజకీయాలు
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 102 వ జయంతి సందర్భంగా జాతీయ నేతలతోపాటు తెలుగు రాష్ట్రాల నేతలు ఘన నివాళులు అర్పించారు. శుక్రవారం ఉదయం నెక్లెస్‌రోడ్డులోని పీవీ ఘాట్‌కు వెళ్లి పలువురు నేతలు ఆయన సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. దేశానికి పీవీ చేసిన సేవలను సర్మించుకున్నారు. పీవీ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సందేశాన్ని ట్విటర్లో పంచుకున్నారు. భారతదేశ అభివృద్ధికి అతని దూరదృష్టి గల నాయకత్వం, నిబద్ధత ఎంతో గొప్పదని, మన దేశ ప్రగతికి ఆయన చేసిన అమూల్యమైన సేవలను గౌరవిస్తున్నామంటూ పీవీని ప్రశంసిస్తూ ప్రధాని ట్వీట్ చేశారు. Remembering Shri PV Narasimha Rao Ji on his birth anniversary. His far-sighted leadership and commitment to India’s development was noteworthy. We honor his invaluable contributions to our nation's progress. — Narendra Modi (@narendramodi) June 28, 2023 అదే విధంగా పీవీకి కాంగ్రెస్ నివాళులు అర్పించింది. పీవీ నరసింహారావు భారత ఆర్థిక వ్యవస్థకు అనేక ఉదారవాద సంస్కరణలను అందించారని పేర్కొంది. నేడు స్వదేశంలో, విదేశాలలో భారతదేశాన్ని పునర్నిర్మించిన విశిష్ట రాజనీతిజ్ఞుడు పీవీకి తాము వినయపూర్వకంగా నివాళులు అర్పిస్తున్నామని ట్విటర్ ద్వారా తెలిపింది. On his birth anniversary, we remember the former PM of India, P.V. Narasimha Rao, who introduced some noteworthy liberal reforms to the Indian economy. Today, we pay a humble tribute to Mr. Rao, a distinguished statesman who reinvented India, both at home & abroad. pic.twitter.com/Cb0YPKbGjw — Congress (@INCIndia) June 28, 2023 అయితే, కాంగ్రెస్‌పై బీజేపీ మండిపడింది. కాంగ్రెస్‌కు పీవీ నరసింహారావు ఇప్పుడు గుర్తొచ్చారా? అని బీజేపీ ఐటీ సెల్ జాతీయ కన్వీనర్ అమిత్ మాల్వీయా ప్రశ్నించారు. తెలంగాణలో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ట్వీట్లు చేశారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా మాజీ ప్రధాని పీవీని కాంగ్రెస్ అవమానించిందని గుర్తుచేశారు. పీవీ మరణించిన సమయంలోనూ సోనియా గాంధీ ఆ గొప్ప వ్యక్తిని గౌరవించలేదని మండిపడ్డారు. మాజీ ప్రధాని భౌతిక కాయాన్ని డీల్లీ కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్‌లో ఉంచేందుకు కూడా అనుమంతిచలేదనే విషయం మర్చిపోకూడదన్నారు. చదవండి: గవర్నర్‌పై మంత్రి హరీష్‌రావు సంచలన వ్యాఖ్యలు After disparaging former Prime Minister and Congress President PV Narasimha Rao for decades, Congress suddenly remembers him on his birth anniversary because Telangana elections are round the corner. Lets not forget that Sonia Gandhi denied him dignity even death. His mortal… pic.twitter.com/nCY93YjSRt — Amit Malviya (@amitmalviya) June 28, 2023 ‘పీవీ అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి ఢిల్లీలో స్థలం, స్మారక చిహ్నాన్ని ఇవ్వాలని అతని కుటుంబం కోరింది. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పీవీ దేశ సరళీకరణ, ఆర్థిక సంస్కరణల రూపశిల్పి అయినప్పటికీ కాంగ్రెస్ అతన్ని అవమానించింది. అతని వారసత్వాన్ని తుడిచిపెట్టే ప్రయత్నాలనూ విడిచిపెట్టలేదు. కానీ ఆయన మరణించిన 10 సంవత్సరాల తర్వాత మోదీ ప్రభుత్వంలో మాజీ ప్రధాని పీవీకి ఢిల్లీలోని ‘రాష్ట్రీయ స్మృతి’లో స్మారక చిహ్నం ఏర్పాటు చేశారు. రాహుల్ గాంధీ కూడా తన భారత్ జోడో యాత్రలో హైదరాబాద్‌లోని నరసింహారావు స్మారక చిహ్నం వద్ద నివాళులర్పించడం సముచితమని భావించలేదు. ఎందుకంటే అతను ప్రయాణించిన మార్గంలో రాళ్లు విసిరారు.’ అని అమిత్ మాల్వీయా పేర్కొన్నారు. 'తెలంగాణ ఠీవి... మన పీవీ' ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో విధానపరమైన సంస్కరణలతో భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడిన, ఇనుమడింపజేసిన తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధాని శ్రీ పీవీ నర్సింహారావు జయంతి సందర్భంగా వారికి ఘన నివాళి! pic.twitter.com/PSNXFdKZAM — Telangana CMO (@TelanganaCMO) June 28, 2023 కాగా, దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా పీవీ నరసింహారావు నిలిచారు. 1957లో శాసనసభ్యుడిగా రాజకీయ జీవితం ఆరంభించిన ఆయన రాష్ట్రమంత్రిగా, ముఖ్యమంత్రిగానే కాకుండా కేంద్ర రాజకీయాలలో కూడా ప్రవేశించి ప్రధానమంత్రి పదవిని చేపట్టారు. 1991 నుంచి 1996 వరకు ప్రధానమంత్రి పదవిలో ఐదేళ్లపాటు దిగ్విజయంగా కొనసాగారు. బహుభాషా కోవిదుడుగా ప్రసిద్ధిగాంచారు. భారత ఆర్ధిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజం వేసి, కుంటుబడ్డ భారత ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనుడు. -
తెలంగాణ ఠీవీ.. మన పీవీ: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: నేడు(బుధవారం) మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 102వ జయంతి. ఇక, పీవీ జయంతి వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ క్రమంలో దేశానికి పీవీ అందించిన సేవలను కేసీఆర్ సర్మించుకున్నారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. క్లిష్ట సమయంలో దేశాన్ని కాపాడిన తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు. నాడు పీవీ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల ఫలాలే నేడు దేశ ప్రజల అనుభవంలోకి వచ్చాయని చెప్పారు. పలు సంస్కరణలతో భారతదేశ ఔన్నత్యాన్ని పీవీ కాపాడారు. పీవీ జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని వెల్లడించారు. తెలంగాణ ఠీవీ.. మన పీవీ అని చెప్పారు. పీవీ స్ఫూర్తితో దేశాభివృద్ధి దిశగా ముందుకు సాగుతామని వెల్లడించారు. మరోవైపు.. పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ వాణిదేవి కూడా జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా వాణిదేవి మాట్లాడుతూ.. పీవీ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల అభివృద్ధి ఫలాలు మనం అనుభవిస్తున్నాం. పీవీ జయంతి ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నది అని తెలిపారు. ఇది కూడా చదవండి: తెలంగాణ బీజేపీ.. మరీ ఇంత గందరగోళమా? -
PV జయంతి నేడు: క్లిష్టకాలంలో దేశాన్ని గట్టెక్కించిన తెలుగు బిడ్డ
భారత దేశ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం కలిగిన మేధావీ, పరిపాలనాదక్షుడూ పాము లపర్తి వెంకట నరసింహారావు. ఎవరి జీవితం, ఎట్లా మలుపు తిరుగుతుందో ఎవరికీ తెలియదు. తమిళ నాడు శ్రీపెరుంబుదూర్‌లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న రాజీవ్ గాంధీని 1991 మే 21న ఎల్టీ టీఈ ఆత్మాహుతి దాడితో హత్య చేసింది. అత్యధిక మెజారిటీతో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్ట బెట్టారు. భారత పదవ ప్రధానమంత్రిగా బాధ్యత చేపట్టారు పీవీ. ఆ సమయంలో భారతదేశం అంతర్జాతీయ చెల్లింపులపై డిఫాల్ట్ అయ్యి రెండు వారాలు కావ స్తోంది. విదేశీ మారక నిల్వలు కేవలం రెండు వారాల దిగుమతులకు మాత్రమే సరిపో యేంతగా ఉన్నాయి. అంతకు నెలరోజుల క్రితం మొత్తం 55 టన్నుల బంగారాన్ని రిజర్వ్ బ్యాంక్ తనఖా పెట్టింది. పెద్ద మొత్తంలో చెల్లింపులు తగ్గు ముఖం పట్టాయి. భారతదేశా నికి రుణం ఇవ్వడానికి ఎవరూ సిద్ధంగా లేరు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్‌ను ఆర్థిక మంత్రిగా నియమించారు పీవీ. దేశ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడడానికి ఎటువంటి నిర్ణయం తీసుకోవడానికైనా ఆయనకు స్వేచ్ఛ నిచ్చారు. అప్పటివరకూ ఉన్న కఠిన నిబంధనలను సడళించి సరళీకరణకు ద్వారాలు తెరచింది పీవీ ప్రభుత్వం. దాని ఫలితాలనే ఇప్పుడు మనమంతా అనుభ విస్తున్నాం. అంతర్జాతీయ సమాజంలో భారత్ పట్ల సన్నగిల్లిన విశ్వాసాన్ని తిరిగి పాదుకొల్పారు పీవీ. ఫలితంగా అంతర్జాతీయ ద్రవ్య సంస్థల సహాయం మళ్లీ ప్రారంభమయ్యింది. అలా దేశాన్ని తిరిగి అభివృద్ధి పథంలోకి తీసుకువచ్చారు. ప్రస్తుత తెలంగాణలోని హనుమకొండ జిల్లా లోని ‘వంగర’ గ్రామంలో 1921లో పీవీ జన్మించారు. అంచెలంచెలుగా రాష్ట్ర, కేంద్ర రాజకీయాల్లో ఎదిగారు. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే బాబ్రీ మసీద్ కూల్చివేత జరిగింది. ఆ సమయంలో ఆయన తీవ్ర మైన విమర్శలను ఎదుర్కొన్నారు. దక్షిణ భారత్‌కు చెందిన పీవీకి వ్యతిరేకంగా ఆయన సొంత పార్టీ ప్రముఖులే పనిచేసి ఆయనను పదవి నుంచి లాగి వేయడానికి ప్రయత్నించారు. కానీ ఇటు ప్రతి పక్షాలు, అటు అసంతృప్తులైన సొంత పార్టీ వారి ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఆయన విజయవంతంగా తన ఐదేళ్ల పదవీకాలాన్ని దిగ్విజయంగా ముగించారు. ఆయన మరణించి 18 ఏళ్లు గడిచాయి. పీవీ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ తన సందేశాన్ని ట్వీట్ ద్వారా పంచుకున్నారు. Remembering Shri PV Narasimha Rao Ji on his birth anniversary. His far-sighted leadership and commitment to India’s development was noteworthy. We honor his invaluable contributions to our nation's progress. — Narendra Modi (@narendramodi) June 28, 2023 కాంగ్రెస్ పార్టీ పీవీ చేసిన సేవలను స్మరించుకుంది. On his birth anniversary, we remember the former PM of India, P.V. Narasimha Rao, who introduced some noteworthy liberal reforms to the Indian economy. Today, we pay a humble tribute to Mr. Rao, a distinguished statesman who reinvented India, both at home & abroad. pic.twitter.com/Cb0YPKbGjw — Congress (@INCIndia) June 28, 2023 ఈ తరుణంలో దేశానికి పీవీ చేసిన సేవను అన్ని వర్గాలూ మరచిపోవడం బాధాకరం. ఆయన శత జయంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శత జయంతి ఉత్సవాలను ఏడాది పాటు ఘనంగా నిర్వహించి ఆయన కీర్తి ప్రతిష్ఠలను ఇను మడింప చేశారు.ఇంతటి మహా మేధా వినీ, పరిపాలనా దక్షుణ్ణీ నేను నా జీవితంలో ఆరుసార్లు అతి దగ్గర నుండి చూశాను. ఆయనతో కొంత సమయం గడిపాను. నా జీవితంలో మరపు రాని సందర్భాలివి. 1977లో పెద్ద పల్లి జిల్లా మా కొలనూరు పక్క ఊరైన ‘పెగడ పల్లి’లో మా చుట్టాల ఇంటిలో పెళ్లి సందర్భంగా ఆయనతో కలిసి బంతి భోజనం చేశాను. మరొకసారి ఒక దినపత్రిక విలేక రిగా పెద్దపల్లి విశ్రాంత భవనంలో ఆయన పక్క కూర్చుని ముచ్చటించడం అరుదైన ఘటన. – దండంరాజు రాంచందర్ రావు, రిటైర్డ్ డిప్యూటీ సూపరింటెండెంట్, సింగరేణి భవన్, హైదరాబాద్ (నేడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి) -
పీవీ మధ్యే మార్గమే దేశానికి రక్ష!
సాక్షి, హైదరాబాద్: రాజకీయంగా భిన్న పార్టీలకు చెందిన వారైనప్పటికీ.. మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, అటల్ బిహారీ వాజ్‌పేయిలు ఒకే నాణేనికి ఉన్న రెండు పార్శ్వాలని ప్రఖ్యాత జర్నలిస్టు, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ సలహాదారు సంజయ్ బారు అభిప్రాయడ్డారు. దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందింది... అన్ని రంగాల్లోనూ ముందంజ వేసింది కూడా పీవీ, వాజ్‌పేయి, మన్మోహన్సింగ్ల ఏలుబడిలోనే అని ఆయన గణాంకాలతో సహా వివరించారు. పీవీ గ్లోబల్ ఫౌండేషన్ శనివారం ఏర్పాటు చేసిన పీవీ స్మారకోపన్యాస కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 1950ల నుంచి 2015 వరకూ దేశ ఆర్థికాభివృద్ధిని పరిశీలిస్తే.. 2000 – 2015 మధ్యకాలంలోనే సగటు ఆర్థికాభివృద్ధి అత్యధికంగా 7.5 శా తంగా నమోదైందని, ఈ కాలంలోనే దేశంలో పేదరికం గణనీయంగా తగ్గిందని తెలిపారు. 2015 తరువాత వృద్ధి తిరోగమనంలో ఉందని, కోవిడ్–19 విజృంభించిన ఏడాది రుణాత్మక వృద్ధిని మినహాయిస్తే 2014– 2023 మధ్యకాలంలో సగటున 6 శాతం మాత్రమే వృద్ధి నమోదైందని చెప్పారు. 1990లో ప్రధానిగా పీవీ చేపట్టిన ఆర్థిక సంస్కరణల ప్రభా వం 2000 సంవత్సరం నుంచి కనిపించడం మొదలైందని అన్నారు. మధ్యే మార్గంతో వృద్ధి పథంలోకి... 1990 వరకూ దేశంలో పేరెన్నిక కంపెనీలంటే ఓ వందకు మించి ఉండేవి కాదని, టాటా, బిర్లాలు, మోడీ, గోయాంకా, సింఘానియా, థాపర్లు వంటి పేర్లే ప్రతి రంగంలోనూ వినిపించేవని సంజయ్ బారు గుర్తు చేశారు. 1991లో పీవీ నరసింహారావు ఆర్థిక సరళీకరణ విధానాలను అవలంబించడం మొదలుపెట్టి.. పరిశ్రమల శాఖ మంత్రిగా వాటి అమల్లోనూ ముందున్న ఫలితంగా అంబానీలు మొదలుకొని మహింద్రా, ప్రేమ్‌జీ, ఇన్ఫోసిస్, టీవీఎస్ గ్రూపు వంటి దిగ్గజాలు ఎదిగాయని చెప్పారు. పీవీ ప్రధానిగా రోజుకో సవాలును ఎదుర్కొన్నా మధ్యే మార్గమన్న తారకమంత్రంతో వాటి ని అధిగమించారని రాజకీయ, ఆర్థిక విధానాల్లోనూ ఇదే రీతిన పాలన సాగిందని చెప్పారు. ఆధిపత్య రాజకీయాలతో చేటు...: పీవీ నరసింహరావు, అటల్ బిహారీ వాజ్‌పేయి, మన్మోహన్ సింగ్‌లు భారత జాతీయత పునాదులను పటిష్టం చేయడం ద్వారా ఆర్థికంగాఎదిగేందుకు సాధికారికంగా మెలిగేందుకు కారణమయ్యారని స్పష్టం చేశారు. రాజకీయ, ఆర్థిక ఆధిపత్యభావజాలం ఈ దేశానికి గతంలోనూ నష్టం కలుగజేసిందని, ఇప్పుడు జరిగేది కూడా అదేనని, దేశ కీర్తిని గతంలో తగ్గించినట్టే ఇప్పుడూ తగ్గిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. పీవీ తరహాలోనే అందరినీ కలుపుకుని పోయే రాజకీయాలు, మధ్యేమార్గాలు మాత్రమే మనల్ని రక్షించగలవని సంజయ్‌బారు అభిప్రాయపడ్డారు. భారత రత్నకు అన్ని విధాలుగా అర్హుడు పీవీ అని.. మన్మోహన్ ఏలుబడిలో ఆయనకు ఈ అవార్డు దక్కకపోవడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. కార్యక్రమంలో పీవీ గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ పీవీ ప్రభాకర్ రావు, సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వి.వి.లక్ష్మీనారాయణ, సీనియర్ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి, మా శర్మ తదితరులు పాల్గొన్నారు. -
పీవీకి కాంగ్రెస్ ఘన నివాళి
సాక్షి, హైదరాబాద్: దివంగత ప్రధానమంత్రి పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ పర్యట నలో ఉన్న పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్ శుక్రవారం ఉదయం నెక్లె స్‌రోడ్డులోని పీవీ ఘాట్‌కు వెళ్లి నివాళులర్పించారు. దేశానికి పీవీ చేసిన సేవలను స్మరించుకున్నారు. గాంధీభవన్‌లో కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు పీవీకి నివాళులర్పించారు. టీపీసీసీ నేతలు హర్కర వేణుగోపాల్‌రావు, జనక్ ప్రసాద్, మెట్టు సాయికుమార్, పాల్వాయి స్రవంతి, కె.ఎస్.ఆనందరావు తదితరులు పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన దేశాభివృద్ధికి చేసిన సేవలను కొనియాడారు. -
పార్లమెంట్ సమావేశాల్లోనే పీవీకి భారతరత్న ప్రకటించాలి
సనత్‌నగర్: ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే మాజీ ప్రధానమంత్రి దివంగత పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించాలని రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ డిమాండ్ చేశారు. పీవీ నరసింహారావు 18వ వర్ధంతి సందర్భంగా పీవీ మార్గ్‌లోని పీవీ జ్ఞానభూమిలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ వాణీదేవి రచించిన ‘నిజాం రాష్ట్రంలో మహాత్ముని పర్యటనలు’, ‘హైదరాబాద్ నగరంలో రాజకీయ సభలు’, ‘భాగ్యనగర్ రేడియో’అనే పుస్తకాలను మంత్రి ఆవిష్కరించారు. అనంతరం తలసాని మాట్లాడుతూ ప్రధానిగా పీవీ సంస్కరణలను తీసుకువచ్చి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారన్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా అంచెలంచెలుగా ఎదుగుతూ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసి సమర్ధవంతమైన పాలనను అందించారని గుర్తుచేసుకున్నారు. దేశానికి, రాష్ట్రానికి ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఏడాదిపాటు పీవీ శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన విషయాన్ని గుర్తుచేశారు. 26 అడుగుల కాంస్య విగ్రహాన్ని హుస్సేన్‌సాగర్ తీరాన ఏర్పాటు చేయడంతోపాటు నెక్లెస్ రోడ్డుకు పీవీ మార్గ్‌గా నామకరణం చేసినట్లు చెప్పారు. నివాళులు అర్పించినవారిలో ఎమ్మెల్సీ వాణీదేవి, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, మాజీ కార్పొరేటర్లు అరుణగౌడ్, శేషుకుమారి తదితరులు ఉన్నారు. పీవీకి నివాళులు అర్పించిన గవర్నర్ పీవీ జ్ఞానభూమిలో జరిగిన వర్ధంతి కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై హాజరై నివాళులు అర్పించారు. కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ సీనియర్ నేతలు దిగ్విజయ్‌సింగ్, కేవీపీ, పొన్నం ప్రభాకర్, మల్లు రవి, శ్రీధర్‌బాబు, అంజన్‌కుమార్‌యాదవ్, బీజేపీ నుంచి మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ తదితర ప్రముఖులు పీవీకి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. -
స్వగృహానికి పీవీ కారు
భీమదేవరపల్లి: భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఉపయోగించిన కారును హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలోని ఆయన స్వగృహానికి కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు. పీవీ నరసింహారావు 1980 ప్రాంతంలో ఈ కారును కొనుగోలు చేసినట్లు పీవీ సోదరుడి కుమారుడు పీవీ మదన్మోహన్ తెలిపారు. ఇంతకాలం కారు హైదరాబాద్‌లో ఉండగా.. ఇటీవల ఆయన కుటుంబ సభ్యులు పీవీ ఉపయోగించిన కారు, కంప్యూటర్, టీవీ, కుర్చీ, మంచం తదితర వస్తువులను వంగరకు తీసుకొచ్చారు. కారు ఢిల్లీ రిజిస్ట్రేషన్‌తో ఉంది. పీవీ 18వ వర్ధంతి సందర్భంగా వివిధ పార్టీల నాయకులు, గ్రామస్తులు శుక్రవారం వంగరలోని ఆయన ఇంటిని సందర్శించి.. ఆవరణలో నిలిపిన కారును ఆసక్తిగా తిలకించారు. -
పీవీ గౌరవాన్ని పెంచేలా కార్యక్రమాలు: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్/రాంగోపాల్‌పేట్: దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 101వ జయంతిని పురస్కరించుకుని పలువురు ప్రముఖులు మంగళవారం నెక్లెస్‌రోడ్‌లోని పీవీ ఘాట్‌లో ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహమూద్ అలీ, మల్లారెడ్డి, సత్యవతి రాథోడ్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్సీ వాణీదేవి, పీవీ కుటుంబసభ్యులు తదితరులు ఆయన సేవలను స్మరించుకున్నారు. అనంతరం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ దివంగత మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు గౌరవాన్ని పెంచే కార్యక్రమాల్లో భాగంగా ఆజాదీకా అమృతోత్సవ్ సందర్భంగా పీవీ పేరుపై త్వరలోనే తపాలా బిళ్లను విడుదల చేస్తామని ప్రకటించారు. రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ పరిపాలన దక్షతతో దేశ గౌరవాన్ని ఇనుమడింపజేసిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. తన ఆర్థిక, సరళీకృత విధానాలతో దేశానికి దశ, దిశ చూపిన మాజీ ప్రధాని పీవీ.. భారత జాతిరత్నమని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కొనియాడారు. పీవీ స్వగ్రామమైన వంగరలో ఆయన స్మారకంగా చేపట్టిన అభివృద్ధి పనులు అసంపూర్తిగా మిగిలాయని, వాటిని పూర్తి చేయాలని కోరారు. పీవీ నరసింహారావులాంటి గొప్ప వ్యక్తిని స్మరించుకుని, గౌరవించే తీరిక ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. అంతకుముందు పీవీ ఘాట్‌లో ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. కాగా, గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ పీవీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. శాసనసభ ప్రాంగణంలో .,. దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 101వ జయంతి వేడుకలను శాసనసభ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లాబీహాల్లో ఏర్పాటు చేసిన పీవీ చిత్రపటానికి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మండలి విప్ ఎంఎస్ ప్రభాకర్‌రావు, లెజిస్లేచర్ సెక్రటరీ నరసింహాచార్యులు పాల్గొన్నారు. ప్రపంచం లోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి పరిపాలనాదక్షుడు పీవీ అని, ఈరోజు దేశం ఆర్థిక సమస్యలను తట్టుకుని నిలబడుతుందంటే ఆయన ప్రారంభించిన సంస్కరణలే కారణమని గుత్తా కొనియాడారు. -
మహోజ్వల భారతి: చాణక్య నరసింహ
భారతదేశానికి తొమ్మిదవ ప్రధానమంత్రిగా 1991 నుంచి 1996 దాకా పని చేసిన పాములపర్తి వేంకట నరసింహారావు జయంతి నేడు (జూన్ 28). న్యాయవాది, బహుభాషావేత్త, రచయిత. ప్రధాని పదవిని అధిష్టించిన మొదటి దక్షిణాది నేత. భారత ఆర్ధిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజంవేసి, కుంటుతున్న వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనతను సొంతం చేసుకున్న వ్యక్తి. అదే సమయంలో దేశభద్రతకు సంబంధించిన బాబ్రీ మసీదు కూల్చివేత లాంటి కొన్ని సంఘటనలకు కూడా ఆయన సాక్షిగా ఉన్నారు. 1957 లో శాసనసభ్యుడిగా రాజకీయజీవితం ఆరంభించిన పి.వి.. రాష్ట్రమంత్రిగా, ముఖ్యమంత్రి గానే కాకుండా కేంద్ర రాజకీయాలలో కూడా ప్రవేశించి ప్రధానమంత్రి పదవిని చేపట్టారు. కాంగ్రెస్ నేతృత్వంలో తగిన సంఖ్యాబలం లేని మైనారిటీ ప్రభుత్వాన్ని పూర్తికాలం పాటు నడిపించగలిగారు. తెలంగాణ లోని వరంగల్ జిల్లా, నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో రుక్నాబాయి, సీతారామారావు దంపతులకు పీవీ జన్మించారు. వరంగల్లు జిల్లాలో ప్రాథమిక విద్య అభ్యసించారు. పూర్వపు కరీంనగర్ జిల్లా, భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మలు దత్తత తీసుకోవడంతో అప్పటినుండి పాములపర్తి వేంకట నరసింహారావు అయ్యారు. 1938 లో హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెసు పార్టీలో చేరి నిజాము ప్రభుత్వ నిషేధాన్ని ధిక్కరిస్తూ వందేమాతరం గేయాన్ని పాడారు. దీంతో తాను చదువుకుంటున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఆయనను బహిష్కరించారు. అనంతరం ఓ మిత్రుడి సాయంతో నాగపూర్ విశ్వవిద్యాలయంలో చేరి నాగపూరులో ఆ మిత్రుడి ఇంట్లోనే ఉంటూ 1940 నుండి 1944 వరకు ఎల్.ఎల్.బి చదివారు. స్వామి రామానంద తీర్థ, బూర్గుల రామకృష్ణారావుల అనుయాయిగా స్వాతంత్య్రోద్యమంలోను, హైదరాబాదు విముక్తి పోరాటంలోను పాల్గొన్నారు. బూర్గుల శిష్యుడిగా కాంగ్రెసు పార్టీలో చేరి అప్పటి యువ కాంగ్రెసు నాయకులు మర్రి చెన్నారెడ్డి, శంకరరావు చవాన్, వీరేంద్ర పాటిల్ లతో కలిసి పనిచేశారు. 1951లో అఖిల భారత కాంగ్రెసు కమిటీలో సభ్యుడిగా స్థానం పొందారు. నరసింహారావు తన రాజకీయ జీవితాన్ని జర్నలిస్టుగా ప్రారంభించి, కాకతీయ పత్రిక నడిపి అందులో జయ అనే మారుపేరుతో 1950 ప్రాంతాలలో అనేక వ్యాసాలు రాశారు. పీవీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో భారత రాజకీయ, ఆర్థిక, సామాజిక వ్యవస్థలలో ఎన్నో గొప్ప మలుపులు, పరిణామాలు చోటుచేసుకున్నాయి. దివాలా తీసే స్థాయికి చేరుకున్న ఆర్థికవ్యవస్థకు పునరుజ్జీవం కల్పించేందుకు సంస్కరణలకు బీజం వేశారు. తన ఆర్థికమంత్రి మన్మోహన్ సింగ్‌కు స్వేచ్ఛనిచ్చి, సంస్కరణలకు ఊతమిచ్చారు. ఆ సంస్కరణల పర్యవసానమే ఆ తరువాతి కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ సాధించిన అద్భుతమైన అభివృద్ధి. అందుకే పీవీని ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పేర్కొంటారు. పంజాబు తీవ్రవాదాన్ని విజయవంతంగా అణచివేసిన ఘనత పీవీ ప్రభుత్వానిదే. కశ్మీరు తీవ్రవాదులు ప్రముఖులను అపహరించినపుడు వారి డిమాండ్లకు లొంగకుండా ప్రముఖులను విడిపించిన ఘనత కూడా పీవీదే. ఏడాదిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పీవీ శత జయంతి వేడుకలు జరుగుతున్నాయి. 1921లో జన్మించిన పీపీ 2004లో తన 88 ఏళ్ల వయసులో 2004 డిసెంబర్ 23 న కన్నుమూశారు. (చదవండి: మహోజ్వల భారతి: ఐదు యుద్ధాల వీరుడు) -
తాతయ్య బయోపిక్ తీస్తా: అజిత
స్వర్గీయ భారత ప్రధాని పీవీ నరసింహరావుగారి బయోపిక్ తీస్తానని ఆయన మనవరాలు అజిత అన్నారు. తన తాతగారి బహుభాషా ప్రావీణ్యం, అసాధారణ రాజకీయ చాతుర్యంతోపాటు బాహ్య ప్రపంచానికి పెద్దగా తెలియని ఎన్నో విషయాలను ఈ బయోపిక్ లో ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. బయోపిక్ కోసం తన తల్లి, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వాణిదేవి సలహాలు, సూచనలు తీసుకుంటున్నామని, నేటి యువతకు స్పూర్తి నింపేలా చిత్రాన్ని తెరకెక్కిస్తామని చెప్పారు. పీవీ నరసింహారావుతో అజిత(పాత ఫోటో) ఇక తమ ఫిల్మ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుతూ.. ‘త్వరలో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ స్టార్ట్ చేయాలనే ఆలోచన ఉంది. మా దగ్గరున్న గ్రీన్ మ్యాట్ స్టూడియో, ఆడియో మిక్సింగ్, ఎడిటింగ్, డబ్బింగ్ యూనిట్ లను అందరికీ అందుబాటులో ఉంచడం ద్వారా సినిమా రంగానికి మావంతు సేవలందించాలని భావిస్తున్నాం. అలాగే ఈ ప్రాంగణంలో షూటింగ్స్ మరియు ఓపెనింగ్, ఆడియో రిలీజ్ వంటి ఫంక్షన్స్ చేసుకునేందుకు కూడా వీలు కల్పిస్తున్నాము’అని అన్నారు. -
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుపై వెబ్‌సిరీస్
Prakash Jha Set To Direct Multilingual Series On PV Narasimha Rao: మాజీ ప్రధాని పీవీ నరసింహారావుపై వెబ్ సిరీస్ రాబోతుంది. భారతదేశ రూపురేఖల్ని మార్చిన పీవీ తీరుపై వినయ్ సీతాపతి ‘హాఫ్ లయన్’ పుస్తకం రాసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ పుస్తకం ఆధారంగానే వెబ్‌సిరీస్‌ను రూపొందించనున్నారు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ప్రకాష్ ఝా దీనికి దర్శకత్వం వహించనున్నారు. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో దీనిని తెరకెక్కించనున్నట్టు ప్రకాష్ ఝా ప్రకటించారు. వెబ్ సిరీస్‌ను ఆహా స్టూడియోస్, అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ కలిసి అల్లు అరవింద్ నిర్మించనున్నారు. 2023లో వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. కాగా 1991 నుంచి 1996 వరకు దేశ ప్రధానిగా పనిచేసిన సంగతి తెలిసిందే. -
పీవీ నరసింహారావు స్థితప్రజ్ఞుడు: కేకే
హిమాయత్‌నగర్: సంఘ సంస్కరణకర్తగా, సామాజికవేత్తగా, విద్యావేత్తగా, రాజకీయ దురంధరుడిగా దివంగత ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు అందించిన సేవలు చిరస్మరణీయమని రాజ్యసభ సభ్యుడు, పి.వి.శతజయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ కె.కేశవరావు అన్నారు. అందుకే ఆయన్ని ప్రతిఒక్కరూ ‘స్థిత ప్రజ్ఞడు’గా కొనియాడుతున్నారని, ఈ పదం పి.వి.కి నూటికి నూరుశాతం సరిపోతుందని పేర్కొన్నారు. తెలుగు అకాడమీ పూర్వ ఉపసంచాలకులు ఆచార్య జి.చెన్నకేశవరెడ్డి రచించిన ‘జాతిరత్న పి.వి.నరసింహారావు’గ్రంథాన్ని సోమవారం ఇక్కడి తెలుగు అకాడమీలో ఆయన ఆవిష్కరించారు. కేశవరావు మాట్లాడుతూ ‘పి.వి.పై ఉన్న అభిమానంతో ప్రతి ఒక్కరూ ఏదో ఒక అంశంతో పుస్తకాన్ని, గ్రంథాన్ని రచిస్తున్నారు. ఒక్కో పుస్తకంలో ఒక్కో కోణాన్ని మనం గమనించి దానిని అనుసరించాలి’అని అన్నారు. కేవలం 560 పేజీలతో పి.వి.జీవితాన్ని లెక్కించలేమని పేర్కొన్నారు. ‘మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ మరణం తర్వాత దేశంలో ఏర్పడ్డ విపత్కర పరిస్థితుల్లో పి.వి. ప్రధానమంత్రి అయ్యారు. ఆ సమయంలో ఎన్నో ఒడిదుడుకులను ఆయన అధిగమించారు. ప్రత్యేక పంజాబ్ కావాలని వేర్పాటువాదులు పోరాడుతున్న సమయంలో అక్కడ ఎన్నికలు జరిపించి శాంతి సామరస్యాలను సాధించిన ధైర్యసాహసిగా పీవీ నిలిచారు’అని కొనియాడారు. పీవీ గొప్ప పాలనాదక్షుడని పేర్కొన్నారు. తన తండ్రి పీవీ సంస్కరణాభిలాషి అని ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి అన్నారు. పీవీ శతజయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఇటీవలి తెలుగు అకాడమీ కుంభకోణం వార్తలు ఎంతో బాధించాయన్నారు. పీవీ గురించి ఓ గ్రంథాన్ని రాయడం నిజంగా వరంలాగా భావిస్తున్నానని ఆచార్య జి.చెన్నకేశవరెడ్డి అన్నారు. కార్యక్రమంలో అకాడమీ పూర్వ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ అవ్వం పాండయ్య తదితరులు పాల్గొన్నారు. -
పీవీ నరసింహారావు ఒక కీర్తి శిఖరం
సాక్షిప్రతినిధి, వరంగల్: మాజీ ప్రధానమంత్రి దివంగత పీవీ నరసింహారావు ఒక కీర్తి శిఖరం అని మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంపీ కె.కేశవరావు పేర్కొన్నారు. శుక్రవారం పీవీ నరసింహారావు స్వగ్రామం అయిన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలో పీవీ విజ్ఞాన వేదిక, స్మృతి వనం, మ్యూజియంలకు వారు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ పీవీ బహుముఖ ప్రజ్ఞాశాలి అని పేర్కొ న్నారు. పీవీ స్మృతివనాన్ని నాలుగున్నర ఎకరాల్లో, 7 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తామని, సంవత్సరంలోపు పూర్తి చేస్తామని చెప్పా రు. వంగర గ్రామాన్ని పర్యాటకపరంగానూ అభివృద్ధి చేస్తామన్నారు. మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ పీవీ నరసింహారావు దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసిన మహోన్నత వ్యక్తి అని అన్నారు. ఎంపీ కేశవరావు మాట్లాడుతూ పీవీ జ్ఞాపకాలను పదిలపరచాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో రాజ్య సభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీ కాంతరావు, పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, హుస్నా బాద్ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా, ఎండీ మనో హర్, పీవీ కుమారుడు ప్రభాకర్‌రావు పాల్గొన్నారు. -
మరో మార్గం లేదు!
అధికార వ్యవస్థ నియంత్రణ అనే మృతహస్తం నుంచి ఆర్థిక వ్యవస్థను ఆర్థిక సంస్కరణలతో విముక్తి చేసినందుకు పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ ద్వయానికి మనం కృతజ్ఞులమై ఉండాలి. సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనాలను అందించాయనడంలో ఏ మాత్రం సందేహం లేదు. దేశగతిని మార్చిన 1991 నాటి సంస్కరణలు మొదలై 30 ఏళ్లయిన సందర్భంగా అనేక వ్యాఖ్యానాలు, పునఃస్మరణలు వచ్చిపడుతున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఏ దేశంలోనూ లేనంత కఠిన నిబంధనలతో కూడిన ఆర్థిక వ్యవస్థను కది లించివేసి సరళీకరించిన నాటి సందర్భం ఎప్పటికైనా చర్చనీయాంశమే. అయితే నాటి సంస్కరణలను సరళీకరణ పేరుతో సమర్థకులు ప్రశంసిస్తుండగా, దాన్ని నయా ఉదారవాదం పేరిట విమర్శకులు తూర్పారపడుతున్నారు. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలన్నింటిలో పేదల ఆదాయ స్థాయిలు దిగజారిపోతున్న వాతావరణంలో ఈ విమర్శనలను అర్థం చేసుకోవచ్చు. కానీ 1991 సంస్కరణల ఫలితాలపై పునరాలోచన్ని కూడా చేయలేని విధంగా దేశ ఆర్థికం మారింది. ఆరోజుల్లో ఆర్థిక వ్యవస్థలో నిర్ణాయక అంశాలు ప్రభుత్వ రంగానికే ప్రత్యేకించేవారు. ప్రైవేట్ రంగం ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడి పెట్టాలంటే కూడా అవకాశం ఉండేది కాదు. ఇతర అన్ని రంగాల్లోనూ ప్రైవేట్ కంపెనీలు కొత్త పెట్టుబడులు పెట్టేవి. అయితే ప్రభుత్వం నుంచి పారిశ్రామిక లైసెన్సులు పొందగలిగే కంపెనీలకే అలాంటి అవకాశం ఉండేది. నేర విచారణ ప్రమాదంలో పడకుండా నాటి లైసెన్స్ రాజ్ అనుమతించిన దాని కంటే మించి ఉత్పత్తిని విస్తరించలేకపోతున్నందున బజాజ్ స్కూటర్‌ను పొందాలంటే బజాజ్ కస్టమర్లు సంవత్సరాల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని ఒక చర్చలో రాహుల్ బజాజ్ తన శ్రోతలకు చెప్పిన విషయం నేను గుర్తు చేసుకుంటున్నాను. నాటి భారతీయ వాణిజ్య విధానం కూడా సమర్థతకు ప్రోత్సాహకాలను నిర్మూలించే క్రమాన్ని వేగిరపర్చేది. వినియోగదారీ సరకుల దిగుమతిని పూర్తిగా నిషేధించారు. పోటీపడే విదేశీ కంపెనీల ఉత్పత్తిదారులను అవహేళన చేసి మరీ వారి సరకులను పక్కనపెట్టేవారు. ఉత్పత్తికి అవసరమైన మూలధన, మధ్యంతర సరకుల దిగుమతిని మాత్రమే దిగుమతి లైసెన్సులతో అనుమతించేవారు. ఈ దిగుమతులు అత్యవసరమా, వీటికి దేశీయంగా ప్రత్యామ్నాయాలు లేవా అని మదింపు చేసిన తర్వాత ఎగుమతి, దిగుమతుల కంట్రోలర్ జనరల్ ఈ అనుమతులను ఇచ్చేవారు. వాణిజ్య పరిస్థితులపై ఎలాంటి ఆచరణాత్మక జ్ఞానం లేని కొద్దిమంది ఉన్నతాధికారులు ఇలాంటి నిర్ణయాలు తీసుకునేవారు. అయితే బ్యూరోక్రాటిక్ నియంత్రణ మృత హస్తం నుంచి ఆర్థిక వ్యవస్థను విముక్తి చేసినందుకు గాను పీవీ నరసింహారావు, మన్మోహన్సింగ్ ద్వయానికి మనం ఎంతో కృతజ్ఞులమై ఉండాలి. అయితే ఈ గొప్ప మార్పు బిగ్ బ్యాంగ్ విస్ఫోటనం అంత వేగంగా జరగలేదు. క్రమానుగతంగా మార్పు జరిగింది. అంటే ఒక నిర్దిష్టం కాలంలో ఈ సంస్కరణల ప్రయోజనాలు అందుతూ వచ్చాయి. సంస్కరణలు ప్రయోజనాలను అందించాయనడంలో కాసింత సందేహం కూడా లేదు. సంస్కరణల ప్రధాన లక్ష్యం ఆర్థికాభివృద్ధి రేటును పెంచడమే. దీన్ని సాధించాం కూడా. నాటి సంస్కరణలు మొదలై 23 ఏళ్లు గడిచాక యూపీఏ పాలనాకాలం ముగింపు సమయానికి భారత ఆర్థిక వృద్ధి రేటు 7 శాతానికి పెరిగింది. సంస్కరణలకు ముందు 23 ఏళ్లవరకు ఇది 4.2 శాతంగా మాత్రమే ఉండేది. ఆర్థిక వృద్ధి వేగవంతం అయ్యే కొద్దీ, ఆ వృద్ధి ఫలితాలను పేదలకు కూడా అందించడానికి యూపీఏ ప్రభుత్వం సమీకృత వృద్ధి వ్యూహాన్ని చేపట్టింది. గ్రామీణ పనికి ఆహార పథకం ద్వారా గ్రామీణ కూలీలకు ఆదాయ మద్దతును అందించడం కూడా ఈ వ్యూహంలో భాగమైంది. 2004 నుంచి 2011 సంవత్సరాల మధ్య డేటా లభ్యమైనంత వరకు 14 కోట్ల మంది ప్రజలను దారిద్య్ర రేఖ నుంచి తప్పించడం జరిగింది. అయితే కోవిడ్ మహమ్మారి ప్రతిదాన్నీ మార్చివేసింది. ఈ మధ్యకాలంలో పలు అధ్యయనాలు దారిద్య్రం పెరుగుతూ వచ్చిందని అంచనా వేశాయి. కానీ ఇది మనం విడిగా నిర్వహించవలసిన, చర్చించవలసిన ఒక కొత్త పరిణామం అని గుర్తించాలి. మాంటెక్‌సింగ్ అహ్లూవాలియా వ్యాసకర్త మాజీ డిప్యూటీ చైర్మన్, ప్రణాళికా సంఘం -
నాటి సంస్కరణలే గుర్తుకొస్తున్నాయ్..!
భారత ఆర్థిక వ్యవస్థను మూలమలుపు తిప్పిన తీవ్ర సంస్కరణలు దేశంలో మొదలై నేటికి 30 ఏళ్లయింది. నాటి ప్రధాని పీవీ నరసింహారావు, ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ ప్రారంభించిన సంస్కరణలు నేటికీ కొనసాగుతున్నాయి. కానీ, మూడు దశాబ్దాల తర్వాత కూడా దేశ ఆర్థికవృద్ధిపై నిరాశ అలుముకుంటోంది. 1991 నాటి తీవ్ర సంస్కరణలను పునఃసృష్టి చేయాలని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. జీడీపీ పతనం, కోవిడ్–19 కలిగించిన ఉత్పాతం మళ్లీ తీవ్రమైన నిర్ణయాలు తీసుకునేలా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రేరేపిస్తున్నాయి. పీవీ, మన్మోహన్‌ల సంస్కరణల వేగాన్ని మరోసారి తీసుకురావలసి ఉందనే అభిప్రాయాలు కొంతకాలంగా బలపడుతుండటం నాటి సంస్కరణల ప్రభావానికి తిరుగులేని నిదర్శనం. భారతదేశంలో 1991 సంస్కరణలు మొదలై నేటికి 30 ఏళ్లు. దేశ ఆర్థిక విధానాలను మూల మలుపు తిప్పిన ఆ గొప్ప దశ గురించి ఘనంగా చెప్పుకుంటున్నారు. ఏదైనా ఒక విశిష్ట ఘటనను తర్వాతి కాలక్రమంలో రజిత, స్వర్ణ, ప్లాటినమ్, శతాబ్ది వార్షికోత్సవాలతో గుర్తుంచుకోవడం కద్దు. వీటితో పోల్చి చూస్తే ముప్ఫై సంవత్సరాలకు అంతగా ప్రాధాన్యత లభించకపోవచ్చు. కానీ 1991 నాటి సంస్కరణలను ఇప్పుడు ఇంత విస్తృతంగా గుర్తించు కోవడానికి కారణం ఏమిటి? దీనికి ప్రధాన కారణం ఆర్థికవృద్ధికి సంబంధించి ప్రస్తుతం అలుముకుంటున్న నిరాశా దృక్పథమే. దేశంలో సంస్కరణలు కానీ, ప్రభుత్వ విధానాలు కానీ అసలు పని చేస్తున్నాయా లేదా అనే అంశంపై సందేహాలు తలెత్తుతున్న సందర్భ మిది. మనకు ఆర్థికవృద్ధికి సంబంధించి ఒక వ్యూహం కానీ విధానం కానీ ఉందా అనే ప్రశ్న రేగుతోంది. 1991లో చేపట్టిన ఉదారవాద, సరళీకరణ క్రమం ఇప్పుడు వెనకపట్టు పడుతున్న సూచనలు కనిపిస్తు న్నాయి. అందుకనే 1991లో జరిగినట్లుగా ఆర్థిక స్తబ్దతను బద్దలు గొట్టడానికి ఏదైనా నాటకీయ చర్యను తప్పకుండా చేపట్టాలని ఆర్థిక రంగ నిపుణులు పిలుపునిస్తున్నారు. అప్పట్లో మారకద్రవ్య విలువను తగ్గించడం, పారిశ్రామిక లైసెన్స్ రాజ్‌ను ఎత్తివేయడం వంటి చర్యలు వనరుల సమీకరణలో కీలకమైన మార్పులు తీసుకొచ్చాయి. రెండేళ్లక్రితమే మోదీ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. కోవిడ్– 19 నేపథ్యంలో ఆనాటి సంస్కరణలను గుర్తుచేసుకోవడం మరింతగా పెరిగింది. 1991లో దేశం చెల్లింపుల సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పుడు తీవ్ర చర్యలు చేపట్టినట్లే, ప్రస్తుత సంక్షోభాన్ని కూడా అవకాశంగా మార్చుకోవాలని చాలామంది సూచిస్తున్నారు. రెండేళ్లకు ముందు చమురుధరలు కుప్పగూలడంతో భారత ఆర్థిక వృద్ధికి చెందిన అడ్డం కులు తొలిగిపోయినట్లయింది. ప్రైవేట్ పెట్టుబడులకు డిమాండ్ కొరత కొనసాగింది. ఈ కొరతను ప్రభుత్వ పెట్టుబడి వ్యయాలతో భర్తీ చేయసాగారు. దీనికి చమురుపై పన్ను ద్వారా పెరిగిన రాబడులు దేవుడిచ్చిన బహుమతిగా ఉపయోగపడ్డాయి. అదే సమయంలో అంటే 2016–17 ఆర్థిక సంవత్సరంలో తీసుకొచ్చిన పెద్దనోట్ల రద్దు సగటు ఉత్పత్తి, ఉద్యోగితపై ప్రతికూల ప్రభావం చూపింది. రాజకీయ ఇచ్ఛ లోపించడం కారణంగా పెండింగులో ఉండిపో యిన ఉత్పత్తి–మార్కెట్ సంస్కరణలకు సంబంధించిన డిమాండ్ ఈ సమయంలోనే వేగం పుంజుకుంది. నిజానికి మొదలుపెట్టకుండా నిలిపివేసిన సంస్కరణలకు కొత్త దారి చూపేందుకు, 2014లో బల మైన కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి ఇదే రంగం సిద్ధం చేసిందని చెప్పాలి. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం తన తొలి హయాంలో వస్తుసేవల పన్నును 2017 జూలైలో ప్రవేశపెట్టడం ద్వారా తీవ్రమైన ఆర్థిక సంస్క రణలకు దారితీసింది. 2016లో బ్యాంకింగ్, కార్పొరేట్ రంగాల నుంచి చాలాకాలంగా పేరుకుపోయి ఉన్న మొండిబకాయిల పరి ష్కారం కోసం దివాలా కోడ్‌ని ప్రవేశపెట్టారు. అయినప్పటికీ, స్థూలదేశీయోత్పత్తి తదుపరి రెండేళ్లలో పతనాన్ని చవిచూసింది. 2018–2019 సంవత్సరాల్లో మన జీడీపీ వరుసగా 6.8 శాతం, 6.5 శాతాన్ని మాత్రమే నమోదు చేసింది. దీంతో 1991 తరహా సంస్కరణలకు అనుకూలంగా ప్రైవేట్ రంగం గొంతు విప్పసాగింది. 2019 మధ్యనాటికి కేంద్రంలో గత ప్రభుత్వమే మళ్లీ అధికారానికి వచ్చినప్పటికీ ఆర్థిక వృద్ధి విషయంలో నిరాశాతత్వం మరింత పెర గడం కాకతాళీయమే కావచ్చు. ఆర్థిక సంస్కరణల్లో సమూల మార్పులు తీసుకురావాల్సిందిగా పరిశ్రమ నుంచి అభ్యర్థనలు పెరి గాయి. అంతవరకు కొనసాగిన సంస్కరణలు అనుకున్నంత ప్రయో జనం కలిగించలేదని, ప్రభుత్వ మదుపు.. వాణిజ్య రంగానికి అవస రమైనంతమేరకు లభ్యం కావడం లేదని అభిప్రాయాలు బలపడ్డాయి. దీంతో ప్రైవేట్ మదుపును ప్రోత్సహించడానికి కేంద్రప్రభుత్వం వేగంగా స్పందించి 2019 సెప్టెంబర్‌లో కార్పొరేట్ పన్నులపై కోత పెట్టింది. ప్రతివారం అనేక ఇతర చర్యలు కూడా చేపట్టింది. కానీ జీడీపీ 5 శాతానికి దిగువకు పడిపోయింది. 2019 జూలై–సెప్టెంబర్‌లో 4.6 శాతానికి, అక్టోబర్–డిసెంబర్లో 3.3 శాతానికి 2020 మార్చితో ముగిసిన త్రైమాసికంలో 3 శాతానికి మన స్థూల దేశీయోత్పత్తి దిగ జారిపోయింది. గత సంవత్సరం దేశవ్యాప్త లాక్డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థ వెన్నెముక విరిగినంత పనయింది. ఈ సంక్షోభాన్ని అవ కాశంగా మలచాలంటూ పిలుపులు మొదలైపోయాయి. దీంతో కార్మిక, వ్యవ సాయ చట్టాల్లో కేంద్ర ప్రభుత్వం తీవ్ర మార్పులు తీసుకొచ్చింది. అలాగే ఆత్మనిర్భర్ సిరీస్‌లో కూడా కొన్ని పథకాలు తీసుకొచ్చారు. కానీ, వ్యవసాయ మార్కెట్లు, సంస్థలలో తీసుకొచ్చిన కీలక మార్పులు ఎదురుతన్నడంతో ఈ రంగంలో భవిష్యత్ ప్రయో జనాలను ఊహించడం కష్టసాధ్యమవుతోంది. చరిత్ర గతిని మార్చిన ఆ వందరోజులు ముప్ఫై ఏళ్ల క్రితం పార్లమెంటు సభ్యుడు కూడా కాని నాటి కేంద్ర ఆర్థిక మంత్రి, భారత ఆర్థిక వ్యవస్థ క్రమాన్నే నాటకీయంగా మార్చివేసిన సాహ సోపేతమైన సంస్కరణలకు నాంది పలికారు. ద్రవ్య, చెల్లింపుల సంక్షోభం నుంచి దేశాన్ని బయటపడవేసేందుకు నాటి ప్రభుత్వం తన తొలి వంద రోజుల పాలనలోనే వరుస సంస్కరణలకు తెరతీసింది. దీనికి బలమైన నేపథ్యం ఉంది. 1991 జూలై తొలి వారంలో భారత విదేశీమారక ద్రవ్య నిల్వలు కేవలం ఒక బిలియన్ డాలర్లకు పడిపోయాయి. ప్రవాస భారతీ యులు తమ డిపాజిట్లను ఉపసంహరించుకోవడం మొదలెట్టడంతో పరి స్థితి మరింత తీవ్రమైంది. దీంతో నాటి ప్రధాని పీవీ నరసింహారావు, ఆయన ఆర్థిక మంత్రి మన్మోహన్సింగ్ తమ తొలి వందరోజుల పాలన లోనే దేశ ఆర్థికక్రమాన్ని మలుపుతిప్పిన కఠిన చర్యలకు పూనుకున్నారు. మైనారిటీలో ఉన్న ప్రభుత్వం ఏర్పడిన తొలి పక్షం రోజుల్లోనే అంటే 1991 జూలై 2న అమెరికా డాలర్‌తో పోల్చినప్పుడు భారత కరెన్సీ విలువను 9.5 శాతానికి తగ్గించివేసింది. ఆ తర్వాత ఒక్క రోజు వ్యవధిలో రూపాయి విలువను మరో 12 శాతం మేరకు తగ్గించి షాక్ కలిగించింది. అదేరోజున నాటి వాణిజ్యమంత్రి పి. చిదంబరం ఎగుమతిదారులకు నగదు ప్రోత్సాహా న్నందిస్తున్న సబ్సిడీలను రద్దుచేశారు. కొన్ని రకాల సరకుల దిగుమతిపై ప్రభుత్వ రంగ సంస్థలు చలాయిస్తున్న గుత్తాధిపత్యాన్ని ఎత్తివేశారు. మార్కెట్‌కు స్వేచ్ఛకలిగించే ఎగ్జిమ్ చట్టాన్ని తీసుకువస్తూ సుంకం లేని దిగుమతులకు అవకాశమిచ్చే లైసెన్సులను రద్దు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల గుత్తాధిపత్యాన్ని తొలగించి పది కీలకరంగాల్లో ప్రైవేట్ సంస్థలకు అనుమతించారు. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వ వాటాను క్రమంగా ఉపసంహరించుకునే విధానాన్ని ప్రకటించారు. గడిచిన ముప్ఫై ఏళ్లుగా ద్రవ్య, వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో ఇతర సంస్కరణలను ఎన్నింటినో తీసుకువచ్చారు. కానీ ఆరోజు పీవీ ప్రభుత్వం చేపట్టిన సంస్క రణల నమూనా తర్వాత గత ముప్ఫై ఏళ్లుగా కేంద్రంలో ఏర్పడిన ప్రభు త్వాలు, వాటి ఆర్థిక మంత్రులు అదే రీతిలో కొనసాగిస్తూ ఉండటం గొప్ప విషయంగానే చెప్పాలి. గత రెండేళ్లకుపైగా డీజీపీ రేటు పడిపోవడం, కోవిడ్– 19 దెబ్బకు ఆర్థిక వ్యవస్థ కుదేలవడం నేపథ్యంలో నాటి పీవీ, సింగ్ సంస్కరణల వేగాన్ని మరోసారి తీసుకురావలసి ఉందనే అభిప్రాయాలు గత కొంతకాలంగా బలపడుతుండటం నాటి సంస్కరణల ప్రభావానికి తిరుగులేని నిదర్శనం. రేణు కోహ్లి వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
పీవీని కేసీఆర్ అవమానించారు: బండి సంజయ్
భీమదేవరపల్లి: భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని చెప్పిన సీఎం కేసీఆర్, వేడుకలను తూతూమంత్రంగా నిర్వహించి ఆయనను అవమానపర్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మం డలంలోని ఆయన స్వగ్రామమైన వంగరను సోమ వారం సంజయ్ సందర్శించారు. ఈ సందర్భంగా పీవీ విగ్రహం వద్ద నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ పీవీ శతజయంతి ఉత్సవాలను నిర్వహిస్తామని గతంలో కేసీఆర్ చెప్పగానే ఒవైసీ సోదరుల్లో ఒకరు పీవీ ఘాట్‌ను కూలుస్తామని ప్రకటించాడని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్‌కు పీవీపై ప్రేమ ఉంటే అలాంటి మాటలన్నందుకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. చదవండి: నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు: కోమటిరెడ్డి -
మాజీ ప్రధాని పీవీ బయోగ్రఫీ, ఆయనే డైరెక్టర్!
దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జీవితం తెరపైకి రానుంది. గతంలో శ్రీహరి హీరోగా ‘శ్రీశైలం’ చిత్రాన్ని నిర్మించిన తాడివాక రమేశ్ నాయుడు ఎన్టీఆర్ ఫిల్మ్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మించనున్నారు. ప్రముఖ సీనియర్ దర్శకుడు ధవళ సత్యం ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. సోమవారం పీవీ జయంతి సందర్భంగా ఈ సినిమాను ప్రకటించారు. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘జాతీయ స్థాయిలో సుపరిచితుడైన ఓ ప్రముఖ నటుడితో పీవీ నరసింహారావుగారి పాత్రను ధరింపజేస్తున్నాం. తెలుగు–హిందీ భాషలతోపాటు మరికొన్ని ముఖ్య భారతీయ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తాం. అతి త్వరలో సెట్స్‌కు వెళ్లనున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జూన్ 28న పీవీ జయంతి నాటికి విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. చదవండి: రసవత్తర పోరు.. 'మా' అధ్యక్ష బరిలోకి మరొకరు! -
చుక్క నీటినీ వదులుకోం: వైఎస్ షర్మిల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు సంబంధించిన ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోబోమని దివంగత ముఖ్యమంత్రి వైఎస్సాఆర్ తనయ వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరితోనైనా పోరాడటానికి తాను సిద్ధమని చెప్పారు. న్యాయవాది నుంచి దేశ ప్రధాని స్థాయికి అంచలంచెలుగా ఎదిగిన మన తెలంగాణ బిడ్డ మాజీ ప్రధాని పీవీ జీవితం నేటి సమాజానికి మార్గదర్శకమని సోమవారం ట్విట్టర్లో పేర్కొన్నారు. చదవండి: ‘హైదరాబాద్‌లోని ఆంధ్రా ప్రజలు ప్రశ్నించాలి’ అంతా మాఇష్టం.. రూ.137.46 కోట్ల నిధులు ‘నీళ్ల ’పాలు.. -
రేపు పీవీ శతజయంతి ఉత్సవాలు
సాక్షి, హైదరాబాద్: మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు శత జయంతి ఉత్సవాలను ఈ నెల 28న నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పా ట్లు చేస్తోంది. సోమవా రం ఉదయం 11.30కు పీవీ మార్గ్‌లోని పీవీ జ్ఞానభూమి వద్ద జరిగే కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. పీవీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా పీవీపై రూపొందించిన 9 పుస్తకాలను వారు ఆవిష్కరించనున్నారు. బహుభాషా కోవిదుడు, నూతన ఆర్థిక విధానాల రూపశిల్పి పీవీ సేవలను గుర్తు చేసుకుంటూ ప్రసంగిస్తారు. ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచా రి వ్యాఖ్యాతగా వ్యవహరించే ఈ కార్యక్రమంలో పీవీ శత జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్, రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు స్వాగతోపన్యాసం చేస్తారు. నెక్లెస్‌రోడ్‌లో పీవీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. చదవండి : సీఎం కేసీఆర్‌కు దళిత సాధికారతపై చిత్తశుద్ధి ఉందా? -
పీవీకి ఆప్తుడు.. కేంద్ర మాజీ మంత్రి కరోనాతో కన్నుమూత
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా కదనోత్సహంతో దరిమిలా వ్యాప్తిస్తుండగా సామాన్యుడితో పాటు ప్రముఖులు కూడా మృత్యువాత పడుతున్నారు. గురువారం ఉదయం ఆర్జేడీ అధినేత అజిత్‌సింగ్ కరోనాతో మృతి చెందగా సాయంత్రం కేంద్ర మాజీ మంత్రి మాతాంగ్ సిన్హ్ కరోనాతో కన్నుమూశారు. మాజీ ప్రధానమంత్రి, దివంగత పీవీ నరసింహారావుకు మాతాంగ్ సిన్హ్ అత్యంత ఆప్తుడు. అస్సాంకు చెందిన మాతాంగ్ సిన్హ్ 1992లో రాజ్యసభకు ఎన్నికయ్యాడు. పీవీ నరసింహారావు హయాంలో 1994 నుంచి 98 వరకు కేంద్ర సహాయ మంత్రిగా పని చేశారు. ఆ సమయంలో పీవీకి దగ్గరయ్యారు. మాజీ రాజ్యసభ సభ్యుడు మాతాంగ్ సిన్హ్ పీవీ నరసింహారావుకు ఆప్తుడు. ఏప్రిల్ 22వ తేదీన కరోనా బారినపడ్డాడు. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. సిన్హ్‌ను అస్సాంలో గుర్తుపట్టని వారంటూ ఎవరూ ఉండరు. సిన్హ్ మొదట బొగ్గు వ్యాపారం మొదలుపెట్టారు. ఆ తర్వాత అస్సాంలో తొలిసారిగా 2013లో శాటిలైట్ ద్వారా టీవీ ఛానెల్ (నార్త్ఈస్ట్ విజన్-ఎన్‌ఈటీవీ)ను 2003లో ప్రారంభించాడు. సిన్హ్‌ను శారద చిట్‌ఫండ్ కుంభకోణంలో పాత్ర ఉందని ఆరోపిస్తూ సీబీఐ 2015 జనవరిలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. చదవండి: కరోనాపై కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు చదవండి: కొత్తగా పెళ్లయిన కమెడియన్ జంటకు షాకిచ్చిన పోలీసులు -
బరిలో పీవీ కూతురు: మజ్లిస్ వెనకంజ
సాక్షి,సిటీబ్యూరో : ప్రధాన రాజకీయ పక్షాలకు ప్రతిష్టాత్మకంగా మారిన హైదరాబాద్– మహబూబ్ నగర్–రంగారెడ్డి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో మజ్లిస్ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుందన్న విషయంపై ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఎప్పటి మాదిరిగానే ఈసారి కూడా మజ్లిస్ అధికారికంగా అభ్యర్థిని రంగంలోకి దింపలేదు. ఈ ఎమ్మెల్సీ స్థానానికి 93 మంది పోటీ పడుతుండగా, ఓటర్లు ఐదు లక్షలకు పైగానే ఉన్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా మైనారిటీ వర్గానికి చెందిన పట్టభద్రులు పెద్ద ఎత్తున ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. అయితే మజ్లిస్ పార్టీ ఎన్నికల బరిలో లేని కారణంగా ఏదో ఒక అభ్యర్థికి సహకరించక తప్పదు. అయితే పార్టీపరంగా ఇప్పటి వరకూ ఎలాంటి సంకేతాలు లేకపోవడంతో మజ్లిస్ కేడర్‌లో అయోమయం నెలకొంది. మైత్రి కొనసాగేనా.. అధికార టీఆర్ఎస్తో మజ్లిస్ పార్టీకి బలమైన మైత్రిబంధం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ బరిలో దిగని స్థానాల్లో టీఆర్ఎస్కు బాహాటంగా సహకరించింది. ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీలో ఎవరికి వారు ఒంటరిగా పోటీ చేసినప్పటికీ అందరి ఊహలను తలకిందులు చేస్తూ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించి స్నేహ్నబంధాన్ని మరోసారి చాటింది. తాజాగా పట్టభద్రుల ఎన్నికల్లో మాత్రం అధికార పక్షానికి సహకరించే పరిస్థితి కనపించడం లేదు. పీవీ కూతురు కావడంతోనే.. అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిత్వంపై మజ్లిస్ పార్టీలో నిరాసక్తత వ్యక్తమవుతోంది. సురభివాణి దేవి మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కూతురు కావడంతో మద్దతు విషయంపై మజ్లిస్ ఎటూ తేల్చుకోలేక పోతోంది. పీవీ ఆయోధ్యలోని బాబ్రీ మసీదు కూల్చివేతకు బాధ్యడని మజ్లిస్ పార్టీ ఆరోపిస్తూ వస్తోంది. అలాంటి వ్యక్తి తనయ అభ్యర్థిత్వాన్ని సమర్థించే ప్రసక్తే ఉండదన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మైనార్టీ వర్గంలో కూడా పీవీపై కొంత వ్యతిరేకత ఉంది. దీంతో అధికార టీఆర్ఎస్కు మజ్లిస్ సహకరించే పరిస్థితి కనిపించడం లేదు. చదవండి: టీఆర్ఎస్కు ఓటేస్తే చెప్పుకు వేసినట్లే.. -
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు: ఆ హాట్ సీటే టార్గెట్
సాక్షి, హైదరాబాద్: శాసనమండలి పట్టభద్రుల కోటాలోని రెండు స్థానాలకు జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి వారం రోజుల్లో ప్రచార పర్వం ముగియనుంది. సిట్టింగ్ స్థానమైన నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ను నిలబెట్టుకోవడంతో పాటు, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కైవసం చేసుకోవాలని టీఆర్ఎస్ సర్వశక్తులూ ఒడ్డుతోంది. ‘హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్’ స్థానా నికి ప్రస్తుతం నాలుగో పర్యాయం ఎన్నిక జరుగు తుండగా.. గతంలో ఒక్కసారి కూడా ఈ స్థానంలో విజయం సాధించకపోవడాన్ని టీఆర్ఎస్ సవా లుగా తీసుకుంది. ఈ స్థానంలో వరుస ఓటముల అపప్రథను తొలగించుకోవడంతోపాటు దుబ్బాక ఉపఎన్నిక, గ్రేటర్ ఎన్నికల ఫలితాలతో దూకుడు మీదున్న బీజేపీకి ఈ స్థానంలో గెలుపు ద్వారా పగ్గాలు వేయాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచందర్‌రావు మరోమారు ఎన్నికల బరిలో నిలిచారు. సిట్టింగ్ స్థానంలో బీజేపీని ఓడించడం ద్వారా ఆ పార్టీకి షాక్ ఇవ్వాలని టీఆర్ఎస్ ఆశిస్తోంది. అందుకే వాణీదేవి గెలుపును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. మహిళా ఓటర్లపై ఆశలు హైదరాబాద్- రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కూతురు సురభి వాణీదేవి పేరును టీఆర్ఎస్ పార్టీ చివరి నిముషంలో ఖరారు చేసింది. పీవీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా వాణీదేవిని ఎమ్మెల్సీగా గెలిపించడమే అసలైన నివాళి అని టీఆర్ఎస్ చెబుతోంది. పట్టభద్రుల కోటా ఎన్నికలో ఒక ప్రధాన రాజకీయ పక్షం మహిళా అభ్యర్థిని బరిలోకి దించడం ఇదే ప్రథమం కావడంతో వాణీదేవి అభ్యర్థిత్వంపై ఆసక్తి నెలకొంది. ఈ నియోజకవర్గంలో 5.31 లక్షల మంది ఓటర్లుగా నమోదు కాగా, ఇందులో 1.94 లక్షలు... అంటే సుమారు 36 శాతం మంది మహిళా ఓటర్లు ఉన్నారు. విద్యావేత్తగా వాణీదేవికి ఉన్న గుర్తింపు, ఎలాంటి వివాదాలు లేకపోవపోడం, పీవీ కూతురు కావడం... కలిసి వస్తుందని టీఆర్ఎస్ అంచనా వేస్తోంది. వాణీదేవిని రాజ్యసభకు ఎందుకు పంపలేదని, శాసనమండలికి నేరుగా ఎందుకు నామినేట్ చేయలేదని కాంగ్రెస్, బీజేపీ ప్రశ్నిస్తుండగా టీఆర్ఎస్ మాత్రం పట్టభద్రుల ఆమోదంతో ఆమె మండలిలో అడుగుపెడతారని ధీమా వ్యక్తం చేస్తోంది. ప్రధాని హోదాలో పీవీ చేపట్టిన సంస్కరణలు, ఆయన వ్యక్తిత్వం, వాణీదేవి అభ్యర్థిత్వం తదితర అంశాలతో పాటు తమ సంస్థాగత బలం కలిసి వస్తుందని టీఆర్ఎస్ లెక్కలు వేస్తోంది. మంత్రిమండలిలో పది మంది ఇక్కడే శాసనమండలి పట్టభద్రుల ఓటరు నమోదు స్థాయిలో చురుగ్గా వ్యవహరించిన టీఆర్ఎస్ ‘హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్’ నుంచి అభ్యర్థిని ప్రకటించే విషయంలో ఆఖరి దాకా సస్పెన్స్ కొనసాగించింది. చివరి నిముషంలో వాణీదేవి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన టీఆర్ఎస్ ప్రచారానికి తక్కువ సమయం ఉండటంతో పెద్ద సంఖ్యలో పార్టీ యంత్రాంగాన్ని ఇక్కడ మొహరించింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కే.కేశవరావుకు సమన్వయ బాధ్యతలు అప్పగించింది. క్షేత్రస్థాయి పార్టీ యంత్రాంగాన్ని కార్యరంగంలోకి దించుతూ.. ప్రచార బాధ్యతలను ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన ఆరుగురు మంత్రులకు అప్పజెప్పింది. వీరితో పాటు పట్టభద్రుల ఎన్నికలు లేని మెదక్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాకు చెందిన మంత్రులు హరీష్‌రావు, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్‌రెడ్డికి కూడా ఈ స్థానంలో ప్రచార బాధ్యతలు కట్టబెట్టింది. ఇలా మొత్తం పదిమంది మంత్రులు ‘హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్’లో గెలుపే లక్ష్యంగా ప్రచారం కొనసాగించడం, పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేయడం, పార్టీ వ్యూహం అమలు చేయడంపై దృష్టి కేంద్రీకరించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిధులు, పథకాల మంజూరులో రాష్ట్రానికి అన్యాయం చేస్తోందని మంత్రులు ప్రతిచోటా ఎత్తిచూపుతున్నారు. అలాగే కాంగ్రెస్, బీజేపీ రాష్ట్ర నేతలను లక్ష్యంగా చేసుకుని టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తోంది. -
పీవీకి అసలైన గౌరవమిచ్చింది మేమే
సాక్షి, హైదరాబాద్: దేశాన్ని ఆర్థిక సంస్కరణలతో పురోగతి బాట పట్టించిన మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావుకు అసలైన గౌరవమిచ్చింది టీఆర్ఎస్ పార్టీయేనని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఇప్పుడు పీవీ కుమార్తె సురభి వాణీదేవికి హైదరాబాద్– రంగారెడ్డి– మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వంతో మరింత ప్రాధాన్యత ఇచ్చామన్నారు. ఈ ఎన్నికల్లో ఆమెను గెలిపించి పీవీకి అసలైన నివాళి ఇవ్వాలని గంగుల పిలుపునిచ్చారు. గురువారం ఇక్కడ మినిస్టర్స్ క్వార్టర్స్‌లో టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జులు, డివిజన్ ఇన్చార్జులు, ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ అభ్యర్థి తోపాటు మంత్రులు మహమూద్ అలీ, తల సాని శ్రీనివాస్‌యాదవ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. మంత్రి గంగుల మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటైన ఈ ఏడేళ్లలో సరికొత్త అవకాశాలను సృష్టించుకుంటూ రాష్ట్రం ముందుకుపోతోందన్నారు. ప్రభుత్వ రంగంలో కేవలం ఆరేళ్లలోనే 1.30 లక్షలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసినట్లు వివరించారు. ప్రైవేటు రంగంలో కూడా లక్షలాది ఉద్యోగాల కల్పనకు కృషి చేశామన్నారు. రాష్ట్రానికి మంజూరైన ఐటీఐఆర్ ప్రాజెక్టును హైదరాబాద్‌కు ఇవ్వకుండా తన్నుకుపోయిన గద్దలు బీజేపీ నేతలని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 3,400 మంది కార్యకర్తలతో డివిజన్ల వారీగా ఇన్చార్జీలను నియమించి, ప్రతి 50 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలోని 1.53 లక్షలకుపైగా ఓటర్లను కలిసి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించేలా కార్యాచరణ రూపొందించినట్లు వెల్లడించారు. -
పీవీ.. ఐటీఐఆర్.. ఇద్దరు ప్రొఫెసర్లు
సాక్షి, హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం వేడెక్కింది. నాయకుల మాటలు మంటలు పుట్టిస్తున్నాయి. రాజకీయ పార్టీల దూకుడు సాధారణ ఎన్నికలను తలపిస్తోంది. రాష్ట్రంలోని 77 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ ఎన్నికలు జరుగుతుండటంతో ప్రధాన రాజకీయ పక్షాలు తమ వద్ద ఉన్న అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్నాయి. మాజీ ప్రధాని పి.వి.నర్సింహారావు కుమార్తెను రంగంలోకి దింపిన టీఆర్ఎస్ ఒక్కసారిగా సెంటిమెంట్‌ను తెరపైకి తీసుకురాగా, రాష్ట్రం ఏర్పాటయ్యాక జరిగిన ఉద్యోగ ఖాళీల భర్తీ, ఐటీఐఆర్, కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ లాంటి అంశాలపై ప్రతిపక్షాలు మాటల తూటాలు పేలుస్తున్నాయి. ప్రధానంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పట్టభద్రుల్లో ఉన్న అసంతృప్తి, సానుభూతి, అనుభవం, సామాజిక కోణం లాంటి అంశాల ప్రాతిపదికన ఈ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. మీరేం చేశారంటే... మీరేం చేశారు ఉద్యోగాల భర్తీ అంశం ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల మధ్య వేడి పుట్టిస్తోంది. ఈ అంశంపై అధికార టీఆర్ఎస్కు కాంగ్రెస్ పార్టీ బహిరంగ సవాల్ విసరగా, మంత్రి కేటీఆర్ ప్రతిస్పందిస్తూ తాము అధికారంలోకి వచ్చాక జరిగిన ఖాళీల భర్తీ గురించి శ్వేతపత్రం రూపంలో లెక్కలు చెప్పారు. ఆ తర్వాత బీజేపీ అభ్యర్థి ఎన్.రాంచందర్‌రావు కూడా ట్విట్టర్ వేదికగా సవాల్ చేయగా, మంత్రి కేటీఆర్ దీటుగా స్పందించి ‘నో డాటా అవైలబుల్ (ఎన్డీఏ)’ అంటూ కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపారు. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన ఐటీఐఆర్‌ను టీఆర్ఎస్ నిర్లక్ష్యం చేసిందని, బీజేపీ అమల్లోకి తేలేకపోయిందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తుండగా, ఇదే అంశంపై బీజేపీ, టీఆర్ఎస్ల నడుమ కూడా మాటలయుద్ధం సాగుతోంది. ఐటీఐఆర్ రాకపోవడానికి టీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ ఆరోపించగా, కర్ణాటకలో కూడా ఐటీఐఆర్ అమలు కాకపోవడానికి టీఆర్ఎస్ పార్టీనే కారణమా అని కేటీఆర్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అవసరం లేదన్న బీజేపీ నేతల వ్యాఖ్యలను కూడా కేటీఆర్ కేంద్రంపై విమర్శనాస్త్రాలు సంధించేందుకు ఉపయోగించుకుంటున్నారు. ఈ రెండు పార్టీల విమర్శలు, ప్రతివిమర్శలు మాట అటుంచితే బీజేపీ, టీఆర్ఎస్ల పట్ల పట్టభద్రుల్లో ఉన్న అసంతృప్తిని ఉపయోగించుకుని ఓట్లు రాబట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీతోపాటు స్వతంత్రులు ప్రయత్నిస్తూ వాగ్బాణాలు విసురుతుండటం గమనార్హం. ప్రొఫెసర్ల పరిస్థితేంటి? ఈసారి ఎన్నికల్లో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల నుంచి ఇద్దరు ప్రొఫెసర్లు కోదండరాం, నాగేశ్వర్లు బరిలో నిలవడం ద్వారా అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. చాలాకాలంగా ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైన నల్లగొండ–ఖమ్మం–వరంగల్ జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి, టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం తన శక్తియుక్తులన్నింటినీ ధారపోస్తున్నారు. గతంలో జరిగిన అన్ని ఎన్నికల్లో టీజేఎస్ పక్షాన ప్రతికూల ఫలితాలు వచ్చిన నేపథ్యంలో మండలి ఎన్నికలు కోదండరాంకు జీవన్మరణ సమస్యగా మారాయని రాజకీయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు తనకు రంగారెడ్డి–హైదరాబాద్–మహబూబ్‌నగర్ ప్రజల్లో ఉన్న సానుభూతిని సద్వినియోగం చేసుకునే దిశలో ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న డాక్టర్ కె.నాగేశ్వర్ కూడా శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. తనకున్న పరిచయాలు, అనుభవంతో ఈ మాజీ ఎమ్మెల్సీ మరోమారు విజయం తన పక్షాన ఉండేలా పక్కావ్యూహంతో ముందుకెళుతున్నారు. ఈసారి అనూహ్యంగా ఈ స్థానం నుంచి పీవీ కుమార్తె సురభి వాణీదేవిని టీఆర్ఎస్ రంగంలోకి దించడంపై కూడా రాజకీయవర్గాల్లో, పట్టభద్రుల్లో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. -
అనూహ్య నిర్ణయం: ఎమ్మెల్సీ అభ్యర్థిగా పీవీ కుమార్తె
సాక్షి, హైదరాబాద్ : పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ స్థానానికి మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు కుమార్తె వాణిదేవిని అభ్యర్థిగా ఖరారు చేశారు. టీఆర్ఎస్ వర్గాల సమాచారం ప్రకారం సోమవారం ఆమె నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ స్థానం అభ్యర్థి ఎంపికపై గతకొంత కాలంగా ఉత్కంఠ కొనసాగుతున్న విషయం తెలిసిందే. జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌కు అవకాశం ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగినప్పటికీ ఎవరూ ఊహించని విధంగా ఆదివారం కేసీఆర్ అభ్యర్థిని ప్రకటించారు. ఖమ్మం-వరంగల్-నల్గొండ స్థానానికి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డిని ఖరారు చేసిన విషయం తెలిసిందే. కాగా తెలంగాణలో వివిధ రాజకీయ పక్షాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రెండు పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇప్పటికే అన్ని పార్టీలు అభ్యర్థులను ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఖమ్మం-నల్గొండ-వరంగల్ స్థానం నుంచి రాములు నాయక్ (కాంగ్రెస్), పల్లా రాజేశ్వరరెడ్డి (టీఆర్ఎస్) ప్రధానంగా పోటీలో ఉండగా.. ఫ్రొపెసర్ కోదండరాం, తీన్మార్ మల్లన్న, ప్రేమేందర్ రెడ్డి (బీజేపీ), విజయసారథి రెడ్డిలు బరిలో ఉన్నారు. మరోవైపు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానం నుంచి మాజీమంత్రి చిన్నారెడ్డి (కాంగ్రెస్) రామచంద్రారెడ్డి (బీజేపీ), ఫ్రొపెసర్ నాగేశ్వర్ ప్రధానంగా పోటీలో ఉన్నారు. తాజాగా టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించడంతో ఎన్నిక రసవత్తరం కానుంది. పట్టభద్రుల కోటా ఎన్నిక కావడంతో నిరుద్యోగులను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే అన్ని జిల్లాల్లో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే పలు విడతల సమావేశాలు నిర్వహించారు. కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కావడం, నిరుద్యోగులు ఉపాధి అవకాశాలు సంక్లిష్టం కావడం వంటి గడ్డు పరిస్థితుల్లో ఎన్నిక జరుగుతుండటం అధికార టీఆర్ఎస్ పార్టీకి కొంత ఇబ్బందికర పరిణామమే. ఉన్న ఉద్యోగాలు ఊడిపోవడంతో పాటు గత ఏడాదిన్నరగా కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు లేవనేది నిరుద్యోగుల వాదన. దానికి తోడు కరోనా కాలంలో తనను ఆదుకోలేదని, గత ఎన్నికల సమయంలో ఇచ్చిన నిరుద్యోగ భృతి అమలు చేయడంలేదని ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో రెండు పట్టభద్రుల స్థానాలను గెలుపొందడం గులాబీ పార్టీకి అంతసులువైన విషయం కాదు. బరిలో ప్రధాన పార్టీలతో పాటు ఉద్యమనేతలు కూడా ఉండటం టీఆర్ఎస్ కొంతమేర ఇబ్బంది ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి తెలంగాణ మరో రసవత్తరమైన పోటీకి సిద్ధమైంది. పట్టభద్రుల శాసనమండలి స్థానాలకు ఎన్నికల నిర్వహణకుగాను కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 23 వరకు నామినేషన్ల దాఖలుకు గడువు ఉండగా.. మార్చి 14న పోలింగ్ జరుగనుంది. మార్చి 17వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. రామచంద్రరావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి పదవీ కాలం ముగియడంతో ఈ ఎన్నిక జరుగుతోంది. -
అక్కడ చెట్టూ పుట్టా పీవీ జ్ఞాపకాలే!
సాక్షి, హైదరాబాద్: పీవీ నరసింహారావు.. బహుభాషా కోవిదుడు, మేధావి, రాజకీయ చతురుడు, దార్శనికుడు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయనలో ఉన్న ప్రత్యేకతలెన్నో. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన జీవితం విద్యార్థుల మొదలు రాజకీయ నేతల వరకు ఓ పాఠం లాంటిది. పీవీ ప్రత్యేకతలను భావితరాలకు తెలియజేసేందుకు తన సొంత గ్రామమైన వంగరలో ఓ విజ్ఞానవేదిక రూపుదిద్దుకుంటోంది. తెలంగాణ పర్యాటకాభి వృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ వేదిక నిర్మిస్తున్నారు. టెండర్ల ప్రక్రియ పూర్తి చేసుకుని మరో నెలరోజుల్లో పనులు మొదలుకానున్నాయి. 2022లో ఆయన జయంతి నాటికి వేదికను ప్రారంభించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. నాలుగు ఎకరాల్లో నిర్మాణం.. వంగరలో పీవీ విజ్ఞాన వేదిక పేరుతో నాలుగు ఎకరాల్లో దీన్ని రూపొందిస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం భూమిని కేటాయించింది. పీవీ నరసింహారావు రాష్ట్రమంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, ప్రధానమంత్రిగా పదవులు నిర్వహించి ఎన్నో వినూత్న నిర్ణయాలు తీసుకు న్నారు. ప్రధానిగా దేశముఖచిత్రంపై చెరగని ముద్ర వేశారు. ప్రతి శాఖలోనూ, ప్రతి సందర్భంలోనూ ఆయన చూపిన ప్రత్యేకతలు ప్రతిబింబించేలా ఇది రూపుదిద్దుకోనుంది. దాన్ని కళ్లకు కట్టేలా చిత్రాలు, శిల్పాలతో తీర్చిదిద్దనున్నారు. రైతులు, సాంకేతిక పరిజ్ఞానం, విద్యా విధానం, భూసంస్కరణలు, పల్లె ప్రగతి.. ఇలా ప్రతి అంశానికి ఇందులో చోటుదక్కనుంది. పర్యాటకులు పీవీ గురించి తెలుసుకునేలా దీన్ని తీర్చిదిద్దనున్నారు. ఇక పర్యాటకులకు ఫుడ్ కోర్టులు, ఉద్యానవనాలు లాంటివి ఇక్కడ సమకూరనున్నాయి. మధ్యలో పీవీ విగ్రహం కొలువుదీరనుంది. మ్యూజియంగా పీవీ ఇల్లు వంగర గ్రామంలో పీవీ నరసింహారావు నివసించిన ఇంటిని మ్యూజియంగా అభివృద్ధి చేస్తున్నారు. ఆయన వాడిన వస్తువులు, ఆయన ఛాయాచిత్రాలు ఇందులో ఉంటాయి. ఈ ప్రాజెక్టుకు రూ.11 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేస్తున్నారు. తాజాగా ప్రభుత్వం రూ.7 కోట్లు కేటాయించింది. పీవీ కుటుంబంతో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ భేటీ దివంగత ప్రధాని పీవీ నరసింహారావు స్వగ్రామం వంగరలో ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణలు ప్రతిబింబించేలా ఓ విజ్ఞాన వేదికను నిర్మించను న్నట్టు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వెల్లడించారు. పీవీ శత జయంతి వేడుకల నిర్వహణ కమిటీ అధ్యక్షుడు కె.కేశవరావుతో కలసి శుక్రవారం ఆయన పీవీ కుటుంబ సభ్యులతో భేటీ అయ్యారు. వంగర గ్రామంలో విజ్ఞాన కేంద్రం నిర్మాణం కోసం ప్రభుత్వం రూ. 7 కోట్లు కేటాయిస్తూ జారీ చేసిన ఉత్తర్వు ప్రతిని వారికి అందించారు. వంగర గ్రామాభివృద్ధి, పీవీ నివాసాన్ని మ్యూజియంగా మార్చటం, విజ్ఞాన వేదిక థీమ్ పార్కు ఏర్పాటుపై వారికి వివరించారు. అనంతరం శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ అధికారులతో కలసి వంగరలో పర్యటించి అక్కడ చేపట్టాల్సిన కార్యక్రమాలపై పీవీ కుటుంబంతో చర్చించానన్నారు. సిద్దిపేట–వరంగల్ రహదారిపై ఆర్చి, విగ్రహం -
పీవీ భారతదేశ చరిత్రలో నిలిచిపోతారు: కేసీఆర్
నిరంతర సంస్కరణశీలి సాక్షి, హైదరాబాద్: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు నిరంతర సంస్కరణ శీలిగా భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని సీఎం కేసీఆర్ అన్నారు. బుధవారం పీవీ వర్ధంతి సందర్భంగా కేసీఆర్ ఆయనను స్మరించుకుంటూ నివాళులర్పించారు. ఆర్థిక, విద్య, భూ పరిపాలన తదితర రంగాల్లో ఆయన అమలు చేసిన సంస్క రణల ఫలితాన్ని నేడు భారతదేశం అనుభ విస్తుందని అభిప్రాయపడ్డారు. అంతర్గత భద్రత, విదేశాంగ వ్యవహారాల్లోనూ ఆయన అవలం బించిన దృఢమైన వైఖరి, దౌత్యనీతి భారతదేశ సమ గ్రతను, సార్వభౌమాత్వాన్ని పటిష్టపరిచిం దని సీఎం కొనియాడారు. బహు భాషావేత్తగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా, గొప్ప పరిపాలకుడిగా అనేక రంగాల్లో విశిష్ట సేవలందించిన పీవీకి ఘననివాళి అర్పించేందుకే శతజయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతతో నిర్వహిస్తోందన్నారు. నెక్లెస్ రోడ్‌లోని పీవీ ఘాట్‌ని సందర్శించి నివాళులర్పించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్): దివంగత ప్రధాన మంత్రి పీవీ నరసింహారావుకు పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. బుధవారం పీవీ 16వ వర్ధంతి సందర్భంగా నెక్లెస్ రోడ్‌లోని ఆయన ఘాట్ వద్ద మంత్రులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు ఆయనకు నివాళులర్పించి స్మరించుకున్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు కేవీ రమణాచారి, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రులు గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, మాజీ రాజ్యసభ సభ్యుడు వీహెచ్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, ప్రభుత్వ మాజీ ముఖ్య కార్యదర్శి రాజీవ్‌శర్మలతో పాటు పీవీ కుటుంబసభ్యులు నివాళులర్పించారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, బీసీ కమిషన్ మాజీ సభ్యులు వకులాభవరణం కృష్ణమోహన్, తెలంగాణ భాష, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేస్తాం: కేకే ప్రపంచంలో భారతదేశ కీర్తి ప్రతిష్టలు పెంచేందుకు కృషి చేసిన గొప్ప మేధావి దివంగత ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని పీవీ శత జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ కె.కేశవరావు తెలిపారు. పీవీ జ్ఞాపకార్థం నెక్లెస్ రోడ్‌కు ఆయన పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారని చెప్పారు. ఈ నెల 31లోపు పీవీ పేరుతో స్మారక పోస్టల్ స్టాంపును ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆవిష్కరించేలా కృషి చేస్తున్నామన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ధైర్యంతో భూ సంస్కరణలతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. ఆయన చేపట్టిన సంస్కరణలను, సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పోస్టల్ స్టాంపును విడుదల చేస్తుందన్నారు. పీవీ చరిత్రలో నిలిచిపోతారు: ఉత్తమ్ పీవీ నరసింహారావు చేపట్టిన సంస్కరణల వల్ల దేశ చరిత్రలో ఆయన నిలిచిపోతారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆయన చేపట్టిన ఆర్థిక సంస్కరణలు ప్రపంచంలో భారతదేశాన్ని సూపర్ పవర్‌గా నిలబెట్టాయన్నారు. -
పీవీ నర్సింహారావు వ్యక్తి కాదు ఒక శక్తి..
సాక్షి, హైదరాబాద్ : మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావు 16వ వర్థంతి సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు బుధవారం ఉదయం నివాళులు అర్పించారు. నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్ వద్ద అంజలి ఘటించారు. పీవీ కుమార్తె వాణి, కుమారుడు పీవీప్రభాకర్ రావు హోంమంత్రి మహమూద్ అలీ, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ, పీవీ జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ కేశవరావు (కేకే), ఎమ్మెల్సీ కవిత తదితరులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘పీవీ వ్యక్తి కాదు ఒక శక్తి. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా పీవీ ఆలోచనలు సూచనలు మన వెంట ఉన్నాయి. శత జయంతి ఉత్సవాలు సీఎం కేసీఆర్, ఎంపి కేకే ఆధ్వర్యంలో గొప్పగా జరుగుతున్నాయి. దేశానికి దిక్సూచి పీవీ. ఆయన శత జయంతి ఉత్సవాలు జరుపుకోవడం మంచి పరిణామం. ‘దేశానికి ఒక దిక్సూచి పీవీ నర్సింహారావు. భారత దేశంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన గొప్ప మహనీయుడు. శత జయంతి ఉత్సవాలు జరుపుకోవడం ఆయనకు మనం ఇచ్చే ఘనమైన నివాళి. పీపీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’ అని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఎంపీ కేకే మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద ఎత్తున పీవీ నర్సింహారావు శత జయంతి ఉత్సవాలు జరుపుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఆయన చేసిన సంస్కరణలు, ఆలోచనలు తెలంగాణ ప్రజలకు, దేశ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. పీవీకి భారతరత్న ఇవ్వాలని ఎన్నారైలు కోరుతున్నారు. మేం కూడా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపుతాం. పీవీ పేరుతో ఒక తపాల బిళ్లను విడుదల చేయాలని కోరుతున్నాం’ అని పేర్కొన్నారు. -
సంస్కరణలను కలగన్న కర్మయోగి
హస్తిన... నాటి రాచరికం నుంచి నేటి ప్రజాస్వామం వరకు పరిపాలన కేంద్రం. ఎందరో పాలకుల కార్యక్షేత్రం. 2004 డిసెంబర్. మోతీలాల్ నెహ్రూ మార్గ్, 9వ నంబర్ ఇల్లు. విశాల ప్రాంగణంలోని పచ్చని చెట్లపై పక్షుల కిలాకిలా రావాలు స్పష్టంగా వినిపించేంత నిశ్శబ్ద వాతావరణం. ఎప్పుడో ఒకసారి పలకరింపుల కోసం వచ్చే ఆత్మీయులు మినహా ఆ ప్రాంగణమంతా నిర్మానుష్యం. ఆ విశాల ఇంట్లోని హాలులో ఒంటరిగా కుర్చీలో పీవీ నరసింహారావు. ఇంతకీ ఎవరీ పీవీ? భారతమాతకు సరైన సమయంలో ఎదిగివచ్చిన బిడ్డడు. కర్తవ్యాన్ని నిర్వర్తించి, నిష్క్రమించిన కర్మయోగి. పీవీలో మానవీయ, నిస్వార్థ వ్యక్తిత్వం, నిర్మల మనస్సు ఎలా నిర్మితమయ్యాయి? పీవీ జీవన ప్రయాణాన్ని పరిశీలిస్తే ఇందుకు జవాబు దొరుకుతుంది. ఆరేళ్లు బాలుడిగా ఉన్నప్పుడు పీవీని ఇంటి పక్కనే ఉన్న రంగారావు కుటుంబానికి దత్తత ఇచ్చారు. రెండు కుటుంబాల మధ్య కలహాలు పరిష్కరించేందుకు తనను దత్తత ఇచ్చినట్టుగా తోచింది. హైదరాబాద్ సంస్థానంలో అసమానత, అణచివేత బాలుడైన పీవీని వేదనకు గురిచేసేవి. అమానుషమైన భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాలనే ఆలోచన కలిగింది. నిరక్షరాస్యత వల్లే అణచివేత రాజ్యమేలుతోందని అర్థమైంది. ప్రపంచ పరిణామాలు, వివిధ సంస్కృతులు అర్థం చేసుకునే క్రమంలో పలు భాషలు, సాహిత్యం నేర్చుకు న్నారు. విమోచన పోరాటంలో స్వామీ రామానంద తీర్థ నాయకత్వంలో పనిచేశారు. నిరంకుశ వ్యవస్థపై బయట నుంచి పోరాడిన పీవీ ప్రజా స్వామ్యంలో వ్యవస్థ లోపల ఉండి సమస్యలు పరిష్కరించాలని ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి 35 ఏళ్ల పాటు సంస్కరణల ప్రస్థానం సాగించారు. భూమి లేని నిరుపేదల్ని యజమానులుగా మార్చే లక్ష్యంతో ముఖ్యమంత్రిగా పీవీ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయం భూసంస్కరణలు. ప్రతికూల తలు, బెదిరింపుల్ని లెక్క చేయకుండా అనుకున్నది సాధించారు. ఒక రాజకీయ నాయకుడిగా ఆలోచిస్తే భూసంస్కరణల ఆలోచనే వచ్చేది కాదు. భూస్వామ్య వ్యవస్థను సమూలంగా కూలదోయా లని, పేదల పక్షాన నిలబడాలనే సంకల్పం బాల్యం నుంచే ఉంది కాబట్టే రాజీపడలేదు. సరళీకృత ఆర్థిక విధానాలంటే పెట్టుబడిదారు లకు అనుకూలమో, ప్రయో జనాలు కల్పించడమో కాదు. పీవీ చూపులు వేల మైళ్ల దూరంలోని గమ్యాన్ని చూశాయి. స్తబ్ధుగా ఉన్న ఆర్థిక వ్యవస్థను మేల్కొలిపి, పరుగులు పెట్టించారు. సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వాల ముఖ్య విధులు. అభివృద్ధి ప్రాజెక్టుల్లో ప్రైవేటుకు భాగస్వామ్యం కల్పిస్తూ ఆదా అయిన ప్రభుత్వ నిధుల్ని సంక్షేమానికి మళ్లిస్తే పేదలకు మేలు జరుగుతుందని సంస్కరణల ఉద్దేశం. 1991 నాటి అత్యంత సంక్షోభ సమయంలో ప్రధాని పదవి చేపట్టే అవకాశం వచ్చింది. దాన్ని వ్యవస్థలో సమూల మార్పు తీసుకొచ్చే సదవకాశంగా మలచుకున్నారు. దేశ గతిని మార్చారు. బాబ్రీ మసీదు కూల్చివేతకు దోషిగా నిందిస్తూ కొందరు, ఘనతగా కీర్తిస్తూ మరికొందరు తమతమ దృక్పథాల్లో పీవీని చూస్తు న్నారు. కానీ ఆనాడు ప్రధానిగా రాజ్యాంగానికి లోబడి తన విధిని నిర్వర్తించారు. 2004 డిసెంబర్ 23. ఢిల్లీ. ఎయిమ్స్ హాస్పిటల్. శరీరం అలసినా మనసు అలసిపోలేదు. మౌనముని నోటి వెంట ఒక్కటే ప్రశ్న. ‘ఇంకెందుకు ఈ శరీరంలో ప్రాణాన్ని కొనసాగించాలని ప్రయత్ని స్తున్నారు? నేను చేయాల్సిన పని పూర్తయిందనే తృప్తి ఉంది. ఇప్పుడింకేం కోరికల్లేవు. ఈ శరీరాన్ని వదిలే సమయమొచ్చింది. దేశాన్ని ప్రజల చేతుల్లో పెట్టాను. ముందుకు నడిపించాల్సింది వాళ్లే. 21వ శతాబ్దం భారతదేశానిదే. నాకేం కీర్తి అవసరం లేదు. మళ్లీ జన్మంటూ ఉంటే సగర్వ భారతీ యుడిగా తిరిగి వస్తా’ అన్నారు. కారణజన్ముడు తన కర్తవ్యాన్ని కర్మయోగిలా నిర్వహించి జన్మను ముగించిన రోజిది. భౌతికంగా దూరమైనా భారతీయులకు నిత్యస్మరణీయుడు. –పి.వి.ప్రభాకర్ రావు వ్యాసకర్త పీవీ తనయుడు నేడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతి -
ఒవైసీని అరెస్ట్ చేయాలి : బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్ : దేశ మాజీ ప్రధాని తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు తెలుగు జాతి గౌరవానికి ప్రతీకలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు గర్వించదగ్గ గొప్పవారిని పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా వారిని అందరూ గౌరవిస్తారని గుర్తుచేశారు. నగరంలోని పీవీ, ఎన్టీఆర్ ఘాట్లను గురువారం బండి సంజయ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. పీవీ, ఎన్టీఆర్ ఘాట్లకు బీజేపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. మహానేతలపై ఒవైసీ మాట్లాడిన తీరు దురదృష్టకరమని, ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే స్పందించి అతన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ ఘాట్‌ను కూల్చివేస్తామంటూ ఎంఐఎం నేతలు చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్, టీడీపీ నేతలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. (కమలనాథుల గ్రేటర్ అటెన్షన్) ఈ సందర్భంగా బీజేపీ నేతలతో కలిసి మీడియా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడారు. ‘ఎన్టీఆర్, పీవీ ఘాట్లకు బీజేపీ రక్షణగా ఉంటుంది. ఎంఐఎం పార్టీ దేశ ద్రోహ పార్టీగా ముస్లీంలే భావిస్తున్నారు. న్టీఆర్ స్కూల్ నుంచే వచ్చి ఈ రోజు సీఎం అయిన కేసీఆర్.. అభిమాన నాయకుడిని అవమనిస్తే ఎందుకు సీఎం ఎందుకు స్పందించడం లేదు. రోహింగ్యాలను ప్రభుత్వం గుర్తించినట్లు భావిస్తున్నాం. ప్రశాంతంగా గ్రేటర్ ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నాం. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ గెలవబోతుంది. గ్రేటర్ ప్రజలు స్వేచ్చగా ఓటు వేయకుండా టీఆర్ఎస్ నేతలు భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. పార్టీలకు అతీతంగా నివాళులు అర్పించడానికి బీజేపీ నేతలు వస్తే...భారత రత్నకు, ఎన్టీఆర్ ఘాట్ కూల్చడానికి ఎంఐఎం వ్యాఖ్యలకు సంబంధం ఏంటి ?భారతరత్న ఇవ్వాలని బీజేపీ ఖచ్చితంగా కోరుతుంది. ఏపీ, తెలంగాణ రెండు బీజేపీ శాఖలు కలిసి ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని కోరుతాం’ అని అన్నారు. (అక్బరుద్దీన్‌ని పిచ్చోడితో పోల్చిన కేటీఆర్) -
ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ
సాక్షి, హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ రంగ రైల్వే పరీక్షలను రెండు భాషల్లోనే నిర్వహిస్తున్నారనీ, ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహించేందుకు అనుమతించాలని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. దీనివల్ల గ్రామీణ ప్రాంత విద్యార్ధులకు మేలు చేకూరుతుందని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు. రాష్ట్రపతికి తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖ దేశ మాజీ ప్రధానమంత్రి, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు స్మారక తపాలా స్టాంప్‌కు అనుమతి ఇవ్వాలని కోరుతూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు సీఎం కేసీఆర్ లేఖ రాశారు. స్టాంప్‌ను హైదరాబాద్‌లో విడుదల చేయాలని లేఖలో పేర్కొన్నారు. పీవీకి భారతరత్న పురష్కారం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కేంద్రానికి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. -
సంతోషం, సంతృప్తి... సాంకేతికత లక్ష్యం
సమాజంలో మనుషుల జీవనం నిరంతర ప్రవాహం. నిన్నటి కంటే నేడు, నేటి కంటే రేపు మెరుగైన జీవనం సాగించాలనే తపన సహజం. మానవాళి అవసరాల్ని తీర్చే సాధనాలు సమకూరితేనే ఇది సాధ్యమవుతుంది. ఇందుకు దోహ దపడేది శాస్త్ర, సాంకేతికత. వర్త మాన అవసరాలు తీర్చుతూనే భావి భారతంలో ప్రజలు మెరుగైన జీవనం సాగించేలా శాస్త్ర, సాంకేతికతపై పూర్వ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు దృష్టి పెట్టారు. సై¯Œ ్స అండ్ టెక్నాలజీ ద్వారానే మెరుగైన, సంతోషకరమైన జీవనం సాధ్యమవుతుందని విశ్వసించారు. సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చెందడం ద్వారా మనిషికి తన పట్ల, ప్రపంచం పట్ల ఆలోచించే దృక్పథం మారుతుందన్న నెహ్రూ మాటల్ని పీవీ గుర్తుచేసేవారు. జైపూర్‌లో జరిగిన సైన్ ్స కాంగ్రెస్ వేదికపై పీవీ ప్రసంగం సైన్స్ అండ్ టెక్నాలజీపై ఆయన దార్శనికతకు నిదర్శనం. సైన్స్ అండ్ టెక్నాలజీతో ఆర్థిక అభివృద్ధికి తోడ్పడేలా మార్గాలు అన్వేషించాలని ఈ వేదికపై నుంచి శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలకు దిశానిర్దేశం చేశారు. పూర్వకాలంలోనే మన వద్ద మెరుగైన సాంకేతిక నైపుణ్యం ఉందని చెబుతూ పలు ఉదాహరణల్ని పేర్కొన్నారు. రాజస్తాన్‌లోని వివిధ ప్రాంతాల్లో భూగర్భ కాలువల ద్వారా జరుగుతున్న సమర్థ నీటి పారుదల ఇందుకు నిదర్శనమని చెప్పారు. భూమి ఉపరితలం మీదనే కాకుండా భూగర్భంలోనూ నీటి ప్రవాహం ఉంటుందని మన పూర్వీకులకు తెలుసుననీ; అలాంటి విజ్ఞానానికి రిమోట్ సెన్సింగ్ పరిజ్ఞానం కూడా తోడయితే అద్భుతాలు సాధించవచ్చని తెలిపారు. గత వైభవం నుంచి మనం స్ఫూర్తి పొందుతున్నట్టుగానే వర్తమానంలో మనం చేసే కృషి నుంచి భావితరాలు స్ఫూర్తి పొందేలా విజ్ఞాన సంపద పెరగాలని చెప్పారు. శాటిలైట్, మిస్సైళ్లను ప్రయోగించడంలో భారత్ విజయాలు ఇందుకు నిదర్శనమని వివరించారు. న్యూక్లియర్ రియాక్టర్లు, కమ్యూ నికేషన్, రిమోట్ సెన్సింగ్ శాటిలైట్, గైడెడ్ మిస్సైళ్ల తయా రీలో భారత్ సామర్థ్యాన్ని ప్రదర్శించిందని తెలిపారు. ఇంతటి మెరుగైన స్థితిలో ఉన్నప్పటికీ సాంకేతిక అభివృద్ధి ద్వారా ఆర్థిక ప్రగతి ఎలా సాధించవచ్చు అనే ప్రశ్నకు సరైన సమాధానం ఇంకా దొరకాల్సి ఉందని అన్నారు. శాస్త్ర, సాంకేతికత ద్వారా ఆర్థిక అభివృద్ధి సాధించడం గురించి ఆలోచించాలని శాస్త్రవేత్తలకు సూచిస్తూనే పీవీ తన మదిలోని ఆలోచనల్ని పంచుకున్నారు. భారత్ నుంచి ఎగుమతుల్లో వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులు, జౌళి, వస్త్రాలు, జెమ్స్, నగలు, తోలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్ అండ్ డీ, టెక్నాలజీ ద్వారా ప్రొడక్షన్, ప్రాసెసింగ్, ఎగు మతుల్లో పురోగతి అవసరమని ఉద్ఘాటించారు. ‘దేశంలో ఏటా ధాన్యం, కూరగాయలు వంటి వ్యవసాయ ఉత్పత్తుల విలువ ప్రోత్సాహకరంగా ఉన్నా ఆహార తయారీ రంగం పెద్దగా అభివృద్ధి చెందలేదు. ఫుడ్ ప్రాసెసింగ్, ప్యాకేజింగ్‌కు మిషనరీ అవసరం. వస్త్ర, తోలు, గని పరిశ్రమల స్థితి కూడా ఇలాగే ఉంది. తగిన టెక్నాలజీ ఉంటే ఉత్పత్తులను వ్యాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్‌గా తయారు చేయవచ్చు. దేశంలోని పారి శ్రామిక ఉత్పత్తుల్లో చిన్న తరహా పరిశ్రమల భాగస్వామ్యం 40 శాతం ఉంది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన రంగానికి టెక్నాలజీ తోడయితే చిన్న తరహా పరిశ్రమలు అద్భుత ప్రగతి సాధించగలుగుతాయి’ అని చెప్పారు. పశ్చిమ దేశాలైనా, జపాన్‌లో అయినా ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ద్వారా ఆర్థిక అభివృద్ధి జరి గింది. ఇది భారత్‌లోనూ జరగాల్సి ఉందని అన్నారు. ఇదే లక్ష్యంతో ఆర్ అండ్ డీ రంగంలో ప్రభుత్వం పెట్టుబడులు పెడుతోందని కూడా చెప్పారు. ఇందులో ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం 15 శాతం కంటే తక్కువే. రీసెర్చ్ అండ్ డెవ లప్మెంట్ రంగంలో మెరుగైన మార్పులు సంభవించనున్నా యని ఆనాడే అంచనా వేశారు. భారత్ సాంకేతికంగా బల మైన దేశంగా ఎదగాలంటే ఆర్ అంyŠ డీ అనేది కేవలం పరిశ్రమల్లోనే కాకుండా విశ్వవిద్యాలయాల్లోనూ జరగాల్సిన అవసరం ఉందని 27 ఏళ్ల క్రితమే పీవీ చెప్పారు. యూని వర్సిటీల్లో జరిగే ప్రయోగాల కోసం పరిశ్రమలు పెట్టుబ డులు పెట్టాలని సూచించారు. 1986లో తీసుకొచ్చిన నూతన విద్యా విధానంలోనూ యూనివర్సిటీలు, పరిశ్రమల మధ్య అనుసంధాన ఆవశ్యకతను పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు. సై¯Œ ్స అండ్ టెక్నాలజీ ద్వారా ఆర్థిక ప్రగతి సాధించి, సంపద సృష్టించాలని పీవీ చెప్పారు. సృష్టించిన సంపద న్యాయబద్ధమైన పంపిణీ జరిగినప్పుడే ప్రతి ఒక్క రిలో సంతోషం కనిపిస్తుందని చెప్పిన దార్శనికుడు పీవీ. పి.వి. ప్రభాకరరావు వ్యాసకర్త పీవీ తనయుడు (ఇది పీవీ శతజయంతి సంవత్సరం) -
రెండో రోజు ఎంఐఎం గైర్హాజరు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ సమావేశాల రెండో రోజు మంగళవారం దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా జరిగిన చర్చలో ‘భారతరత్న’ఇవ్వాలనే తీర్మానాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రతిపాదించారు. తీర్మానాన్ని బలపరుస్తూ పలువురు మంత్రులతో పాటు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు చెందిన 12 మంది సభ్యులు ప్రసంగించారు. ఏఐఎంఐఎం సభ్యులు తీర్మానంపై చర్చ సందర్భంగా సభకు గైర్హాజరయ్యారు. రెండో రోజు సమావేశంలో ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ ప్రస్తావన లేకుండా పీవీకి భారతరత్న ఇవ్వాలనే తీర్మానానికే సభా వ్యవహారాలు పరిమితమయ్యాయి. సుమారు రెండు గంటలపాటు సాగిన అసెంబ్లీని బుధవారం ఉదయం 10 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. శాసనసభ వర్షాకాల సమావేశాల నిర్వహణకు సంబంధించి నలుగురు సభ్యులను ప్యానెల్ చైర్మన్లుగా నామినేట్ చేస్తున్నట్లు స్పీకర్ తెలిపారు. టీఆర్ఎస్ శాసనసభ్యులు హన్మంతు షిండే (జుక్కల్), మంచిరెడ్డి కిషన్‌రెడ్డి (ఇబ్రహీంపట్నం), డీఎస్ రెడ్యానాయక్ (డోర్నకల్), ఏఐఎంఐఎం శాసనసభ్యుడు మహ్మద్ మౌజంఖాన్ (బహదూర్‌పురా) ఈ జాబితాలో ఉన్నారు. కాగా, బుధవారం ఉదయం ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ అనంతరం కరోనాపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. బీఏసీ సమావేశంలో కరోనాపై చర్చించేందుకు అధికార, విపక్షాలు ఏకాభిప్రాయానికి వచ్చిన విషయం తెలిసిందే. కరోనాపై జరిగే చర్చలో ముఖ్యమంత్రి సమాధానం అనంతరం.. రెవెన్యూ చట్టాన్ని సభలో ప్రవేశపెడతారు. అనంతరం సభను మరుసటి రోజుకు వాయిదా వేస్తారు. రెండు రోజులు రెవెన్యూ చట్టంపై చర్చ జరగనుంది. -
పీవీకి భారతరత్న ఇవ్వాల్సిందే..
సాక్షి, హైదరాబాద్ : మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న పురస్కారం ప్రకటించాలని ప్రభుత్వం తరఫున సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానంపై టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ సభ్యులు చర్చలో పాల్గొని తీర్మానాన్ని సమర్థించారు. పీవీకి భారతరత్న ఇవ్వాల్సిందేనని కేంద్రాన్ని కోరారు. ఈ తీర్మానంపై మాట్లాడిన వారిలో ఎవరేమన్నారంటే...! చబహుముఖ ప్రజ్ఞాశాలి పీవీ: సీఎల్పీ నేత భట్టి ‘తత్వవేత్తలే ఉత్తమ పాలకులని, వారి పాలనలోనే న్యాయం, ధర్మం సమపాళ్లలో ఉంటాయని ప్లేటో.. భావోద్వేగాలకు అనుకూలంగా, వ్యతిరేకంగా కాకుండా అర్థం చేసుకుని పాలన చేసే వ్యక్తి గొప్ప నాయకుడు కాగలడని చాణక్యుడు చెప్పారు. ఈ రెండు లక్షణాలను పుణికి పుచ్చుకుని ఈ దేశాన్ని పాలించిన గొప్ప నేత పీవీ. ఆయన ఓ తత్వవేత్త, ఆర్థిక, అభ్యుదయ, విద్యావేత్త. బహుముఖ ప్రజ్ఞాశాలి. సరళీకృత ఆర్థిక సంస్కరణ ప్రవేశపెట్టి ఈ దేశాన్ని కాపాడారు. అణుపరీక్షల కార్యక్రమాన్ని కూడా ఆయనే ప్రారంభించారు.’అని సీఎల్పీ నేత భట్టి పేర్కొన్నారు. అయితే, తన ప్రసంగం త్వరగా ముగించాలని స్పీకర్ విజ్ఞప్తి చేయడంతో భట్టి అభ్యంతరం వ్యక్తం చేశారు. తానేమీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం లేదని, సభలో ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్దతిస్తున్నానని చెప్పారు. మరోసారి స్పీకర్ బెల్ కొట్టి ప్రసంగాన్ని ముగించాలనడంతో ఆయన కూర్చున్నారు. ఆ తర్వాత మంత్రి కేటీఆర్ మాట్లాడారు. మళ్లీ భట్టి మాట్లాడుతూ.. పదేపదే తమను అవమానించేలా సభలో వ్యవహరించడం మంచిది కాదన్నారు. దీన్ని కేటీఆర్ వ్యతిరేకించారు. స్పీకర్‌నుద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని, సభ్యుల బలాబలాలను బట్టి మాట్లాడే సమయం ఇస్తారన్నారు. భట్టి వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తర్వాత భట్టి మాట్లాడుతూ.. ప్రభుత్వ తీర్మానానికి మద్దతు తెలుపుతున్నామని, పీవీకి భారతరత్న ప్రకటించాలని డిమాండ్ చేశారు. అస్తిత్వాన్ని స్మరించుకోవడమే – మంత్రి కేటీఆర్ తెలంగాణ జాతి ఔన్నత్యాన్ని యావత్తు దేశం సమున్నతంగా గౌరవించేలా పీవీకి భారతరత్న ఇవ్వాలి. తెలంగాణ పోరాటం ఆస్తుల కోసం కాదు.. అస్తిత్వం కోసమని కేసీఆర్ చెప్పేవారు. ఒక్క పీవీనే కాదు.. అనేక మంది తెలంగాణ వైతాళికులు మరుగున పడేయబడ్డారు. మగ్దూం మొహినోద్దీన్, సంత్‌సేవాలాల్ మహరాజ్, ఈశ్వరీబాయి. భాగ్యరెడ్డి వర్మ, దాశరథి కృష్ణమాచార్యులు, సురవరం ప్రతాపరెడ్డి, కాళోజీ, దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ, పైడి జయరాజు, సర్వాయి పాపన్నగౌడ్... ఇలా 25 మందికి పైగా యోధులను ప్రస్తుతం స్మరించుకుంటున్నాం. వీరిని స్మరణ అంటే తెలంగాణ సొంత అస్తిత్వాన్ని స్మరించుకోవడమే. పీవీ తెలంగాణ జాతి సామూహిక జ్ఞాన ప్రతీక. పట్వారి నుంచి ప్రధాని దాకా ఎదిగిన నేత. పల్లె నుంచి ఢిల్లీ దాకా విస్తరించిన చైతన్య పతాక పీవీకి భారతరత్న పురస్కారం ఇవ్వాలి. సముచిత గౌరవం ఇవ్వాలి – మంత్రి సత్యవతి రాథోడ్ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు చేసిన సేవలకు సముచిత గౌరవం ఇవ్వాలి. వారి స్ఫూర్తిని భావితరాలకు చాటాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఏడాది పాటు శతజయంతి ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయం. దేశంలో ఎన్నో సంస్కరణలకు ఆద్యుడు ఆయన. దళిత, గిరిజన బిడ్డలు గురుకులాల్లో చదువుకుని ఎదుగుతున్నారనేందుకు ఆయనే కారణం. మద్దతిస్తున్నాం – రాజాసింగ్, బీజేపీ పీవీకి భారతరత్న కోరుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సమర్థిస్తున్నా. ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉంది.. కానీ సమయం చాలదు. నిజాం పాలనలోనే ఉస్మానియా గడ్డపై వందేమాతరం పాడినందుకు ఆయన బహిష్కరణకు గురయ్యారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మంచి నాయకుడిగా, దార్శనికుడిగా గుర్తింపు పొందారు. బీసీలకు మేలు చేశారు – గంగుల కమలాకర్, మంత్రి వెనుకబడిన కులాలకు చెందిన వ్యక్తులు బాగా చదువుకోవాలనే ఆలోచన ఉన్న నేత పీవీ నరసింహారావు. నేను ఇంజనీరింగ్ చదివింది కూడా ఆయన చలువతోనే. ఆయన ప్రధాని అయిన తర్వాత కలిశాం. పీవీ కన్న కలలను కేసీఆర్ నిజం చేస్తున్నారు. కరీంనగర్ నుంచి వరంగల్ వెళ్లే రహదారికి ఆయన పేరు పెట్టాలి. -
కేసీఆర్ తీర్మానం : వ్యతిరేకించిన ఎంఐఎం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముద్దుబిడ్డ, భారత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు దేశ అత్యున్నత పురస్కారాన్ని ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసింది. ఈ మేరకు ముఖ్యమంంత్రి కే చంద్రశేఖరరావు సంబంధిత తీర్మానాన్ని మంగళవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. దీనిపై అధికార పార్టీకి చెందిన సభ్యులతో పాటు, విపక్ష కాంగ్రెస్ సభ్యులు సైతం ప్రసంగించి తీర్మానానికి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా దేశ ప్రధానిగా పీవీ చేసిన సేవలను కొనియాడారు. ఆయన సేవలను గుర్తించిన భారతరత్న పురస్కారం ఇవ్వాల్సిందేనని ముక్తకంఠంగా డిమాండ్ చేశారు. నూతన ఆర్థిక సంస్కరణల సృష్టికర్త పీవీ అని సీఎం కేసీఆర్ కొనియాడారు. తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ లభించాల్సిన గౌరవం దక్కలేదన్నారు. ఏడాది పాటు పీవీ శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. (పీవీ నరసింహరావుకు భారతరత్న ఇవ్వాలి: కేసీఆర్) అయితే సీఎం ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని టీఆర్ఎస్ మిత్రపక్షమైన ఎంఐఎం వ్యతిరేకించడం గమనార్హం. పీవీకి భాతతరత్న ఇవ్వాలన్న తీర్మాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించిన మజ్జీస్ పార్టీ ఆ సమయంలో సభ నుంచి వాకౌట్ చేసింది. అయినప్పటికీ తీర్మాన్నీ సభ ఏకగ్రీవంగా ఆమోదించినట్లు శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. అనంతరం సభను బుధవారానికి వాయిదా వేశారు. బుధవారం నుంచి అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు ప్రారంభం కానున్నాయి. -
పీవీ నరసింహరావుకు భారతరత్న ఇవ్వాలి: కేసీఆర్
-
కొలంబస్లో పీవీ శతజయంతి వేడుకలు
సాక్షి, హైదరాబాద్: దేశ ప్రధానిగా పీవీ నర్సింహారావు ఆర్థిక సంస్కరణలతో ఆధునిక భారతాన్ని ఆవిష్కరించారని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, పీవీ శతజయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ కె.కేశవరావు అన్నారు. అమెరికాలోని ఓహియో రాష్ట్రం కొలంబస్లో టీఆర్ఎస్ ఎన్నారై అడ్వైజరీ కమిటీ చైర్మన్ మహేశ్ తన్నీరు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేకే ప్రసంగించారు. దివంగత మాజీ ప్రధాని పీవీకి భారతరత్న ఇవ్వాలనే విషయాన్ని పార్లమెంటులో ప్రస్తావిస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్ సూచన మేరకు అమెరికా, బ్రిటన్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్, మలేసియా, మారిషస్‌లో పీవీ విగ్రహాలు ఏర్పాటు చేస్తామని టీఆర్ఎస్ ఎన్నారై సెల్ కోఆర్డినేటర్, శత జయంతి ఉత్సవ కమిటీ సభ్యుడు మహేశ్ బిగాల ప్రకటించారు. పీవీకి భారతరత్న ఇవ్వాలనే ఆన్లైన్ పిటిషన్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో పీవీ కుమార్తెలు వాణీదేవి, సరస్వతితో పాటు టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ రీజినల్ కోఆర్డినేటర్ కానుగంటి నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
పీవీకి భారతరత్న... సభలో తీర్మానం చేద్దాం..!
సాక్షి, హైదరాబాద్ : దివంగత మాజీ ప్రధానమంత్రి, పీవీ నరసింహారావుకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించాలంటూ వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేస్తామని ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. హైదరా బాద్ నడిబొడ్డున ఉన్న నెక్లెస్ రోడ్డును ఉద్యానవనా లతో పీవీ జ్ఞానమార్గ్‌గా అభివృద్ధి చేసి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతోపాటు ఆయన మెమోరి యల్ను నిర్మిస్తామన్నారు. పీవీ శత జయంతి ఉత్సవాల నిర్వహణపై సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా రాష్ట్రపతి, ప్రధాని, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాస్తామన్నారు. శత జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు, ఎంపీ కె.కేశవరావు, మంత్రులు ఈటల రాజేందర్, శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు. పార్లమెంటులో పీవీ చిత్రపటం ఏర్పాటు ‘తెలంగాణ అస్తిత్వ ప్రతీకగా, దేశంలోనే అనేక సంస్కరణలకు ఆద్యులుగా ప్రపంచం గుర్తించిన మహా మనిషి పీవీ. ఆయన మహోన్నత వ్యక్తిత్వంపై అసెంబ్లీ సమావేశాల్లో విస్తృతంగా చర్చించడంతో పాటు అసెంబ్లీలో పీవీ తైలవర్ణ చిత్రాన్ని ఏర్పాటు చేస్తాం. పార్లమెంటులో పీవీ చిత్రపటం ఏర్పాటుతోపాటు, హైదరాబాద్ సెంట్రల్ యూని వర్సిటీకి పీవీ పేరు పెట్టాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేస్తాం’అని సీఎం తెలిపారు. ఈ సందర్భంగా పీవీ రచించిన పుస్తకాలతోపాటు ఆయన మీద ప్రచురితమైన పుస్తకాలను పీవీ కుమార్తె వాణిదేవి సీఎంకు అందజేశారు. సమీక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ►పీవీ జన్మించిన లక్నేపల్లి, పెరిగిన వంగర గ్రామాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక ►హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయిలో పీవీ మెమోరియల్. ►విద్యా, వైజ్ఞానిక సాహితీ రంగాల్లో సేవ చేసిన వారికి పీవీ పేరిట అంతర్జాతీయ అవార్డుకు ఇవ్వాలని యునెస్కోకు ప్రతిపాదన, అవార్డుకు సంబంధించిన నగదు తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాలని నిర్ణయం. ►అమెరికా, సింగపూర్, దక్షిణాఫ్రికా, మలేషియా, మారిషస్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనెడా తదితర దేశాలతోపాటు ప్రపంచ వ్యాప్తంగా శత జయంతి ఉత్సవాల నిర్వహణకు షెడ్యూలు. ►ప్రధానిగా, విదేశాంగ మంత్రిగా పనిచేసిన కాలంలో పీవీకి సన్నిహిత సంబంధాల ఉన్న అమెరికా మాజీ అద్యక్షుడు బిల్ క్లింటన్, బ్రిటన్ మాజీ ప్రధాని జాన్ మేజర్ తదితరులను శత జయంతి ఉత్సవాలకు ఆహ్వానించాలని నిర్ణయం. ►పీవీ రచనలను తెలంగాణ సాహిత్య అకాడమీ తరపున ముద్రణ, వివిధ పత్రికల్లో వచ్చిన వ్యాసాలు, ప్రసంగాలు, ఇంటర్వ్యూలతో పుస్తకాలు, జీవిత విశేషాలతో కూడిన కాఫీ టేబుల్ తయారు. -
పీవీపై కేసీఆర్ సంచలన నిర్ణయాలు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముద్దుబిడ్డ, దేశ మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేయాలని నిర్ణయించారు. అలాగే నెక్లెస్‌రోడ్డుకు పీవీ జ్ఞాన్ మార్గ్‌గా పేరు పెట్టాలని, హైదరాబాద్‌లో పీవీ మెమోరియల్ ఏర్పాటుకు కేసీఆర్ సంకల్పించారు. ఈ మేరకు ప్రగతిభవన్‌లో పీవీ శతజయంతి వేడుకల నిర్వహణపై శుక్రవారం సీఎం కేసీఆర్ సమీక్ష చేపట్టారు. హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీకి పీవీ నరసింహారావు పేరు పెట్టాలని కేంద్రాన్ని కోరుతూ.. అసెంబ్లీలో తీర్మానం చేస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పీవీ సాహసోపేతమైన భూ సంస్కరణలు అమలు చేశారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. (సంస్కరణల ఆద్యుడు పీవీ) ఆయన సంస్కరణల ఫలితంగానే తెలంగాణలో 93 శాతం మంది చిన్న, సన్నకారు రైతులకు భూమి వచ్చిందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగు పర్చడంతో పాటు..అనేక రంగాల్లో సంస్కరణలు తెచ్చిన పీవీ ఆదర్శప్రాయుడని కేసీఆర్ కొనియాడారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా పీవీకి మరింత గౌరవం తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. లక్నేపల్లి, వంగర గ్రామాలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని సీఎం నిర్ణయించారు. పీవీ శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. దేశ,విదేశాల్లో కూడా పీవీ శత జయంతి వేడుకలు నిర్వహించాలన్నారు. పార్లమెంట్లో మాజీ ప్రధాని విగ్రహం ప్రతిష్టించాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. (ధీశాలి.. సంస్కరణశీలి) -
పీవీకి భారతరత్న ప్రకటించాలి
సాక్షి, హైదరాబాద్: దివంగత మాజీ ప్రధాని, తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావుకు భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత కోరారు. పీవీ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కవిత అధ్యక్షతన బుధవారం హైదరాబాద్‌లో ‘తెలంగాణ తేజం పీవీ’పేరిట సమాలోచన సభ జరిగింది. దేశం క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన పీవీ.. సంకీర్ణ ప్రభుత్వాన్ని ఐదేళ్లు విజయవంతంగా నడిపారని కొనియాడారు. తన మేధస్సును దేశం కోసం ఉపయోగించిన ఆయన, రాజకీయాల్లో ప్రత్యర్థులు కూడా పొగిడేంత హుందాతనంతో వ్యవహరించారన్నారు. తెలంగాణ జాగృతి నిర్వహిస్తున్న బుక్ క్లబ్ పేరును ‘పీవీ బుక్ క్లబ్’గా మారుస్తున్నట్లు కవిత ప్రకటించారు. పీవీకి భారతరత్న ఇవ్వాలనే తీర్మానాన్ని వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తామని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, పీవీ శత జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ కె.కేశవరావు వెల్లడించారు. అన్ని రంగాల్లోనూ పీవీ చెరగని ముద్ర.. తమ తండ్రి తన జీవిత కాలంలో వివిధ రంగాల్లో చేసిన కృషిని పీవీ కుమార్తె వాణీదేవి గుర్తు చేసుకున్నారు. ప్రధానిగా పనిచేసిన ఐదేళ్ల కాలంలో తమ తండ్రితో చేసిన ప్రయాణం ఆయన విశిష్టతను అర్థం చేసుకునేందుకు దోహదం చేసిందని పేర్కొన్నారు. సాహిత్యం, సమాజంతో పాటు వ్యవస్థలోని లోటుపాట్ల గురించి పీవీ అనేక రచనలు చేశారని ఆయన తనయుడు పీవీ ప్రభాకర్‌రావు గుర్తు చేసుకున్నారు. శత జయంతి ఉత్సవాల్లో భాగంగా 51 దేశాల్లో కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు, ఐదు ఖండాల్లో పీవీ విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ మహేశ్ బిగాల వెల్లడించారు. పీవీ రచించిన ఇన్సైడర్ పుస్తకం ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుందని, పీవీ జీవిత చరిత్రపై బయోపిక్ తీసుకురావాలని సీనియర్ జర్నలిస్టు కల్లూరి భాస్కరం అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ జాగృతి ఉపాధ్యక్షులు మేడే రాజీవ్ సాగర్, తెలంగాణ క్రీడా మండలి చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పీవీ శతజయంతి ఉత్సవాలపై రేపు సీఎం సమీక్ష సాక్షి, హైదరాబాద్: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల నిర్వహణపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 28వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహిస్తారు. పీవీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఇప్పటివరకు జరిగిన కార్యక్రమాలను సమీక్షించడంతో పాటు, భవిష్యత్‌లో చేయాల్సిన కార్యక్రమాలపై చర్చిస్తారు. పీవీ శత జయంతి ఉత్సవాలను ఏడాది పొడవునా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. -
ఈ మౌన ముని.. ‘పోఖ్రాన్–2’ పథ నిర్దేశకుడు
1996 మే 8. ప్రధాని కార్యాలయం నుంచి ఏపీజే అబ్దుల్ కలాంకు వర్తమానం వచ్చింది – రాత్రి 9 గంటలకు ప్రధానిని కలవమని. పి.వి.నరసింహారావు ప్రధాని. కలాం ప్రధానికి శాస్త్ర సాంకేతిక విషయాల సలహాదారు, డీఆర్డీఓ కార్యదర్శి. ‘‘కలాంగారూ, నేను తిరుపతి వెళ్తున్నాను. అటామిక్ ఎనర్జీ డిపార్ట్మెంట్, మీ బృందం పరీక్షలకు సిద్ధంగా ఉండండి. నా అనుమతి కోసం వేచి ఉండండి. ఈ పరీక్షలకు డీఆర్డీఓ, డీఏఈ సిద్ధంగా ఉండాలి’’– అని కలాంకు ముఖాముఖిగా చెప్పారు పీవీ. అది ఎన్నికల సమయం. 1996 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అధికారం లభించలేదు. 1996 మే 16న మాజీ ప్రధాని నరసింహారావు, అబ్దుల్ కలాం, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ డైరెక్టర్ ఆర్. చిదంబరం కలసి అంతకుముందురోజే ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అటల్ బిహారీ వాజ్‌పేయిని కలిశారు. పీవీ ప్రధానికి ఓ చీటీ ఇచ్చారు. వాజ్‌పేయి కేవలం 13 రోజులు పని చేసి, మెజారిటీ చాలదనే కారణం మీద జూన్ 1న బాధ్యతల నుంచి తప్పుకున్నారు. మళ్ళీ సార్వత్రిక ఎన్నికలు 1998 మార్చిలో జరిగాయి. మార్చి 19న వాజ్‌పేయి మళ్లీ ప్రధాని అయ్యారు. 2004 మే 22 దాకా పదవిలో ఉన్నారు. 2004 క్రిస్మస్ రోజులు. డిసెంబర్ 23న పీవీ కన్నుమూశారు. గ్వాలియర్‌లో వాజ్‌పేయి రచయితల సమావేశంలో మాట్లాడుతూ ‘ఈ విషయం బయటికి చెప్పవద్దని పీవీ కోరారు. కానీ ఆయనే గతించారు. చెప్పడం తన విధి’ అని ప్రకటిస్తూ 1996 మే 16న అందుకున్న చీటీలోని విషయం వివరించారు. ‘సామగ్రి తయ్యార్ హై’ అని రాసిన చీటీ లోగుట్టు చెప్పేశారు. ‘అణుపరీక్షలకు అంతా సిద్ధం, నిరభ్యంతరంగా ముందుకెళ్ళవచ్చు’ అని దాని అంతరార్థం. పీవీనే పోఖ్రాన్– 2 న్యూక్లియర్ ప్రోగ్రాం మూలపురుషుడు అని ఆ రోజు వాజ్‌పేయి ప్రకటించి ఉండకపోతే మనకు సాధికారంగా తెలిసి ఉండేదికాదు. ఆంధ్రప్రదేశ్‌లో పీవీ ప్రారంభించిన భూసంస్కరణలు, విద్యాసంబంధమైన పలు చర్యలు ఆయనను తెలుగు ప్రాంతంలో చిరంజీవిని చేశాయి. ప్రధానిగా చేసిన ఆర్థిక సంస్కరణలు, విదేశీ వ్యవహారాలలో భారత్ ధోరణి, హ్యూమన్ రిసోర్సెస్ మంత్రిగా చేసిన మార్పులు నేటికీ కొనసాగుతున్నాయి. అయితే, అణుశక్తి రంగంలో ఆయన చూపిన చొరవ, వ్యూహం గురించి ఎక్కువ ప్రస్తావన రాలేదు. 1996 మే నెలలో జరగవలసిన అణుపరీక్షలు నరసింహారావు మళ్ళీ అధికారంలోకి రాకపోవడం వల్ల ఆగిపోయాయి. నిజానికి 1995 డిసెంబర్లో ఒకసారి ప్రయత్నాలు మొదలై, ఆరునెలలు వాయిదా పడ్డాయి. 1995 నవంబర్ చివర్లో ప్రధాని అణు పరిశోధనా బృందాల నాయకులు అబ్దుల్ కలాం, ఆర్.చిదంబరంకు టి–30 కార్యక్రమం నిర్దేశించారు. ముప్పయి రోజుల్లో అణుపరీక్షలు జరగాలని అంతరార్థం. అయితే డిసెంబర్ 15న న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఆ దేశ ఉపగ్రహాలు సేకరించిన సమాచారం మేరకు భారతదేశం అణుపరీక్షలు జరుపుతోందని వార్త ప్రచురించి సంచలనం రేపింది. మరోవైపు సమగ్ర అణుపరీక్షల నిషేధ ఒప్పందం (సీటీబీటీ), అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్పీటీ)లపై సంతకాలు చేయాలా, వద్దా అని దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. మొత్తానికి డిసెంబర్లో అణు పరీక్షలు జరుపలేదు. మరి మళ్ళీ ఆరునెలలకే ఎందుకు అణుపరీక్షలు జరపాలని భావించారు పీవీ? ఎందుకంటే 1995 డిసెంబరు నాటికి హైడ్రోజన్ బాంబు సిద్ధం కాలేదు. శాస్త్రవేత్తలు ఆరు నెలల వ్యవధి అడిగారు. అంతేకాకుండా థార్ ఎడారిలో పోఖ్రాన్ దగ్గర అణుపరీక్షలకు సిద్ధం చేయడంలో గూఢచారి ఉపగ్రహాల కెమెరా కళ్ళను ఎలా బురిడీ కొట్టిం చాలో కూడా ఈ వ్యవధిలో మన శాస్త్రవేత్తలు నేర్చుకున్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాలు మాత్రమే దృష్టిలో పెట్టుకొని ఉంటే 1995 డిసెం బర్లో కొన్ని పరీక్షలు జరిపి ఉండేవారు పీవీ. కానీ ఆయన ఆవిధంగా ఆలోచించలేదు. నరసింహా రావు కనుమూయడానికి కొన్నినెలల ముందు జర్నలిస్టు శేఖర్ గుప్తా ఈ విషయం అడిగితే– ‘భయ్యా కొన్ని రహస్యాలు నా పాడెతోనే పోనీవోయ్’ అని పీవీ అనడం అందరూ టీవీల్లో చూశారు. పోఖ్రాన్–2 అణుపరీక్షల తర్వాత ప్రపంచం సులువుగానే భారతదేశాన్ని అంగీకరించింది. అదేవిధంగా పీవీ ధోరణికి తగినట్టుగానే తరవాత వచ్చిన ప్రధానులు సీటీబీటీ, ఎన్పీటీ ఒప్పందాలపై సంతకాలు చెయ్యలేదు. కనుకనే ఈ విషయాలన్నీ దగ్గరగా చూసిన అబ్దుల్ కలాం– దేశభక్తితో అలరారే రాజనీతిజ్ఞుడు పీవీ అని కొనియాడటం ఎంతో అర్థవంతం అనిపిస్తుంది. వ్యాసకర్త సైన్స్ రచయిత, వర్తమాన అంశాల వ్యాఖ్యాత మొబైల్ : 94407 32392 డా. నాగసూరి వేణుగోపాల్ -
దక్షిణాది రాష్ర్టాల నుంచి ఆ గౌరవం పీవీకే దక్కింది
సాక్షి, హైదరాబాద్ : పీవీ నరసింహారావు శత జయంతి వేడుకలు శుక్రవారం ఇందిరాభవన్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో టీపీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీఎల్సీ నేత భట్టి విక్రమార్క, పొన్నాల లక్ష్మయ్య , షబ్బీర్ అలీ, కమిటీ చైర్మన్ గీతారెడ్డి, వీహెచ్ హనుమంతరావు సహా పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బట్టి విక్రమార్క మాట్లాడుతూ..ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండానే దేశాన్ని పాలించే స్థాయికి పీవీ ఎదిగారని కొనియాడారు. ఒక సామాన్యుడు సైతం ప్రధాని కావచ్చనే విషయాన్ని పీవీని చూసి స్ఫూర్తి పొందాలన్నారు. ఒక తెలుగువ్యక్తికి అంతటి గోప్ప స్థాయి కాంగ్రెస్ పార్టీ కల్పించిందన్నారు. దక్షిణాది రాష్ర్టాల నుంచి పీవీకి దక్కిన గౌరవం మరెవరికి దక్కలేదని, సోనియాగాందీ సలహామేరకు ఏఐసీసీ ఆమోదంతో పీవీ ప్రధాని అయ్యారని గుర్తుచేశారు. పీవీ ప్రధాని పదవి చేపట్టాక దేశ ఆర్థిక సంస్కరణలు పీవీకి ముందు ఆయన తర్వాత అనేలా ఉన్నాయని పేర్కొన్నారు. ('పుట్టుక నుంచి చనిపోయే వరకు పీవీ కాంగ్రెస్ వాది') 24వ శతాబ్ధంలో రాజీవ్‌గాంధీ ఆలోచనలకు రూపకల్పన చేసింది పీవీ అని వీహెచ్ హన్మంతరావు అన్నారు. సొంత గూటి నుంచే పీవీకి గట్టి పోటీ ఉండేదన్నారు. 'పీవీని తెలంగాణ వ్యతిరేకిగా ముద్రవేసే ప్రయత్నం జరిగింది. మా అధ్యక్షుడు మాటకు గౌరవం ఇచ్చి ఇప్పుడు రాజకీయాలు మాట్లాడటం లేదు. కొందరు ఆయన్ని హైజాక్ చేయాలని చూస్తున్నారు. కానీ అది ఎవరి వల్లా కాదు. మన్మోహన్ సింగ్, ఇతర కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో నిర్ణయాలు తీసుకోవడం సరికాదు. పీవీ ఆశించినట్లు బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరగాలి' అని వీహెచ్ అన్నారు. తెలుగు జాతికి వన్నె తెచ్చిన వ్యక్తి పీవీ నరసింహారవు అని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు అన్నారు. ఆయన ఘనత భావితరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. (హ్యాపీ బర్త్‌డే తారక్: సీఎం జగన్) -
'పుట్టుక నుంచి చనిపోయేదాకా ఆయన కాంగ్రెస్ వాది'
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ శుక్రవారం రోజున ఘనంగా ప్రారంభించింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ పీవీపై ప్రశంసల వర్షం కురిపించారు. పీవీ మాకు ఎల్లప్పుడూ గర్వకారణం. ఆయన శతజయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఏడాదిపాటు నిర్వహిస్తోంది. పీవీ గురించి ఎవరు వేడుకలు చేసిన స్వాగతిస్తాం. 2023లో పీవీ స్పూర్తితో పనిచేస్తూ తెలంగాణలో అధికారంలోకి వస్తామని సోనియాగాంధీ పేర్కొన్నారు. (సంస్కరణల ఆద్యుడు పీవీ) మరో సందేశంలో మాజీ ప్రధాని మన్మోహన్ పీవీ శతజయంతి వేడుకల నిర్ణయం మంచి ఆలోచన. క్యాబినెట్లో ఆయన ఆర్థిక మంత్రిగా తొలి బడ్జెట్ ప్రవేశపెట్టడం సంతోషంగా ఉంది. ఆదర్శవంతమైన వ్యక్తి పీవీ. ఆర్థిక సంస్కరణలు తెచ్చిన గొప్ప ప్రధాని. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్నారు. పీవీ సంస్కరణల వల్లనే దేశం ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడింది అని మన్మోహన్ సింగ్ కొనియాడారు. (వార్తల కెక్కని పీవీ చాణక్యం) హైదరాబాద్: ఇందిరాభవన్‌లో పీవీ జయంతి వేడుకలను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. పీవీ వంగరలో ఓ సామాన్య కార్యకర్తగా పని చేసి ప్రధాని స్థాయికి ఎదిగారు. ఆయనతో వ్యక్తిగతంగా నాకు మంచి పరిచయం. భూసంస్కరణలు తెచ్చిన ఘనత పీవీది. పుట్టుక నుంచి చనిపోయే వరకు కాంగ్రెస్ వాది. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా భూసంస్కరణలు తెచ్చిన గొప్ప నాయకుడు పీవీ. ఉమ్మడి రాష్ట్రంలో ఆయనకి భారతరత్న ఇవ్వాలని తీర్మానం చేశారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న దేశాన్ని అదుకున్నది పీవీ సంస్కరణలే. జూలై 24, 1991 నాటి కేంద్ర బడ్జెట్ మన దేశ ఆర్థిక పరివర్తనకు మార్గం సుగమం చేసింది. ఆయన పదవీకాలం అనేక రాజకీయ, సామాజిక, విదేశాంగ విధాన విజయాలకు నాంది అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీవీ సోదరులు మనోహర్ రావ్, పీవీ శత జయంతి కమిట్ చైర్మన్ గీతారెడ్డి, గౌరవ చైర్మన్ వీ హనుమంత రావు, వైస్ చైర్మెన్ శ్రీధర్ బాబు, కన్వీనర్ మహేష్ గౌడ్, ముఖ్య నాయకులు పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్ అలీ, చిన్నారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, దాసోజు శ్రవణ్, అనిల్ యాదవ్, మల్లు రవి, రుద్ర రాజు, వేణుగోపాల్, సీజే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. (నిరాడంబరతకు నిలువెత్తు ప్రతీక..) -
ప్రజల మనిషికి బహువచనమే లోపలి మనిషి
ఏ సాహిత్య ప్రక్రియ అయినా శూన్యం నుంచి రాదు. అది చరిత్ర నుంచి ప్రేరణ పొందుతూనే, వర్తమానంతో ప్రభావితమవుతూ ఉంటుంది. ఇందుకు గొప్ప ఉదాహరణ పీవీ నరసింహారావు ‘లోపలి మనిషి’ నవల (ఆంగ్లంలో ‘ది ఇన్సైడర్’, తెలుగు ‘లోపలి మనిషి’, అనువాదం: కల్లూరి భాస్కరం). గాఢమైన జీవితానుభవం, ఇతివృత్తంగా స్వీకరించిన చారిత్రక ఘటనల నుంచి ఉన్మీలనమైన తాత్త్విక కాంతిధార వెంటాడుతూ ఉంటే పీవీ ఈ నవల రాసి సాంత్వన పొందారనిపిస్తుంది. రాజకీయ సంస్థ పరిధిలో ఆయన లోపలి మనిషి. రాజకీయ వంచనతో, విలువల శైథిల్యంతో జాతి కన్న కల భగ్నమైపోతుంటే నిరసన గళం విప్పిన ప్రజల మనిషి కూడా. శతాబ్దాల పరాయి పాలన నుంచి విముక్తం కావడానికి ఎన్నో స్రవంతులనూ, పంథాలనూ కలుపుకుని పోరాడి గెలిచిన ఒక పురాతన జాతి తొలి అడుగులే తడబడుతుంటే, సంకెళ్లు తెగిపడ్డాయన్న స్పృహ లుప్తమై, కొత్త చరిత్ర నిర్మాణం వైపు కాకుండా, మళ్లీ బానిసత్వ చిహ్నాలను ముద్రించుకోవడానికి తహతహలాడుతూ ఉంటే సహించలేని లోపలి మనిషి, వాటి గురించి ప్రజల మనిషి చేత పలికించడమే ఈ నవల విశిష్ట శైలి. స్వేచ్ఛాభారతంలోనూ దగా పడుతున్న ప్రజల తరఫున వకాల్తా పుచ్చుకున్న లోపలి మనిషి, ప్రజల మనిషికి బహువచనంలా వినిపిస్తాడు. లోపలి మనిషి పీవీ. ప్రజల మనిషి ఆనంద్, ఈ నవలానాయకుడు. ఆగస్ట్ 15, 1947 అనే ఆ ఒక్క తేదీతో సమాన చారిత్రక ప్రాధాన్యమున్న తేదీగా మరొకదానికి పట్టం కట్టడం అసాధ్యం. అదే, అఫ్రోజాబాద్ సంస్థానమైతే ‘1948’ కాలచక్రంలోని ఒకానొక సంవత్సరం కాదు, కొత్త ఉషోదయం. ఈ ఉషస్సుకు ముందుటి అంధకారంలోనే ‘లోపలి మనిషి’ ప్రస్థానం ఆరంభమవుతుంది. భారతదేశమంతటా గాంధీజీ అహింసా సిద్ధాంతంతో భారత జాతీయ కాంగ్రెస్ పరాయి పాలన పునాదులు కదిలిస్తున్నది. అఫ్రోజాబాద్ సముద్రంలో దీవిలా మిగిలింది (562 స్వదేశీ సంస్థానాలలో ఒకటైన హైదరాబాద్‌కు రచయిత పెట్టిన పేరు). అక్కడ నవాబు ప్రపంచ కోటీశ్వరుడు. కానీ ఒంటి నిండా గుడ్డ ఉన్న పౌరులు అతి తక్కువ. వార్తాపత్రిక, రేడియో నిషిద్ధం. అయినా కాంగ్రెస్ ఉద్యమ ప్రభావమే కాదు, ఆయుధాన్ని నమ్మిన తీవ్ర జాతీయోద్యమ సెగ సైతం సంస్థానంలోకి ప్రవేశించింది. హఫీజ్ అనే విప్లవకారుడు అందించిన విప్లవ సాహిత్యం, భగత్‌సింగ్ తండ్రికి రాసిన చరిత్రాత్మక లేఖ ఆనంద్‌ను అప్పటికే నిజాం మీద ఆరంభమైన సాయుధపోరు వైపు అడుగులు వేయించాయి. స్వతంత్ర భారతంలో తొలిపొద్దు సందేశం– దేశానికి స్వాతంత్య్రం, దేశ విభజన ఏకకాలంలో జరిగాయనే. ఆపై గాంధీజీ హత్య. తరువాత గొడ్డలి పిడి తత్త్వాన్ని గుర్తు చేస్తూ కశ్మీర్ కోసం పాకిస్తాన్ మొదటి దాడి. నలభై ఆరుశాతం భూభాగంలో విస్తరించి ఉన్న సంస్థానాల విలీనంతో విశాల భారత ఆవిష్కరణ... వరుసగా జరిగాయి. తరువాత– తొలి సార్వత్రిక ఎన్నికలు. ‘టికెట్లు కోరుకునేవారిలో చాలామందిని ఆకర్షించేది అధికారమే కానీ, మరొకటి కాదని సాధారణ పరిశీలకులకు సైతం తెలిసిన వాస్తవం’(పే 98) అనతికాలంలోనే ఆవిర్భవించింది. పాతికేళ్ల స్వతంత్ర భారత ఉత్థానపతనాల మీద వ్యాఖ్య ఈ నవల. అందులో ఎన్నికలకి ఇచ్చిన స్థానం చాలా పెద్దది. ఎన్నికలలో రచయిత మహా పతనమే చూశారు. దేని పతనం? ప్రజాస్వామ్య పతనం. ‘దేశ పరిపాలన విషయంలో ప్రజాభిమతాన్ని ప్రతిబింబించడమనే వాస్తవిక ప్రయోజనాన్ని క్రమంగా ఎన్నికలు కోల్పోతూ వస్తున్నాయ’ (పే. 324)ని నిర్ధారణకొస్తాడతడు. దేశంలో సగం ఉన్న మహిళ ఎన్నికలలో పోటీ చేయాలంటే, మొదట జాతీయ కాంగ్రెస్ శల్యపరీక్షలో, ‘నా పడకగదిలోంచి ఆమె నడవనప్పుడు ఎన్నికల్లో కూడా ముందుకు సాగలేదు’ (పే. 221) అని చెప్పే పరిశీలకుల దగ్గర ఎలా నెగ్గాలి? లాల్‌బహదూర్ శాస్త్రి వంటి ఉన్నత వ్యక్తిత్వం కలిగిన నాయకుడు కలగచేసుకోవడంతో పరిశీలకుడు అప్పటికి (ఆనంద్ సన్నిహితురాలు అరుణ టికెట్టు రగడ) ఓడిపోయాడు. ప్రథమ ప్రధాని నెహ్రూ గురించీ, వ్యక్తిత్వం గురించీ ఇంతటి సమదృష్టితో పరిశీలించిన రచన మరొకటి ఉండదేమో! నెహ్రూ అంటే ఒక మహావృక్షం. అలీనవాదం, మిశ్రమ ఆర్థికత, సోషలిజం, ప్రభుత్వ రంగం, పంచవర్ష ప్రణాళికలు, నిరాయుధీకరణ, అకాడమీల స్థాపన, ఫెడరలిజం, సెక్యులరిజం – ఆ మహావృక్షం శాఖలే. అయినా, ‘నెహ్రూ అనే దేవత లక్షల మంది దెయ్యాలున్న పార్టీకి నాయకత్వం వహిస్తున్నాడన్నదే’ (పే 284) ఆనాటి అభిప్రాయం. నెహ్రూ ఆదర్శాలకీ, సమకాలిక సమాజానికీ మధ్య ఇంత దూరం! ‘ఎంతో తలపండిన రాజకీయవాదులు కూడా అలీన విధానాన్ని తేలికగా జీర్ణించుకోలేకపోయారు’ (పే 343). సోషలిజం నెహ్రూ స్వప్నం. కానీ అది వేదికలకీ, ఉపన్యాసాలకీ పరిమితం కావాలన్నదే కాంగ్రెస్ పెద్దల అభిమతం. లౌకికవాదం విషయంలో నెహ్రూ ఏకాకి. ‘భారతదేశంలో జాతీయవాది అనదగిన ఏకైక ముస్లిం ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ’ (పే 400) అని ఆయన వ్యతిరేకులు ఎత్తి పొడిచేవారు. 1962 నాటి చైనా యుద్ధంలో భారత్ ఓటమి దరిమిలా ఆయన తన ఈ పాత ప్రపంచం నుంచి తనను తానే బలవంతంగా బయటకు తెచ్చుకున్నారు. ఇక్కడ ఆనంద్ ఆరోపణ ఏమిటి? ‘నెహ్రూ మహాత్మా గాంధీని, ఆయన ఆదర్శాలను ముందుకు సాగించినట్టు నెహ్రూను, నెహ్రూ ఆదర్శాలను సాగించేవారు ఒక్కరూ లేరు’ (పే 386). ఆఖరికి నెహ్రూ కుమార్తె ఇందిరా గాంధీ కూడా అందుకు మినహాయింపు కాదన్నదే అతడి నిశ్చితాభిప్రాయం. ఇందిర పాత్ర చిత్రణ దగ్గర పీవీలోని స్వరాజ్య సమరయోధుడు, స్వతంత్ర భారత రాజకీయాల ప్రత్యక్ష సాక్షి మరింత కఠినంగా మారిపోవడం గమనిస్తాం. 1969 నాటి రాష్ట్రపతి ఎన్నిక, అందులో ఇందిర పాత్ర (పార్టీ సమావేశంలో నీలం సంజీవరెడ్డి అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించి, లోపాయికారిగా ఉపరాష్ట్రపతి వివి గిరిని అభ్యర్థిగా నిలిపి గెలిపించారు, దానికి అంతరాత్మ ప్రబోధం అని పేరు పెట్టారు) భారతీయులు రెండుగా చీలిపోయారన్న అపోహకు బీజం వేశాయని (ప్రపంచం దృష్టిలో, ముఖ్యంగా పాక్ దృష్టిలో) ఆనంద్ అభిప్రాయపడతాడు. ఆమె హయాంలో సాగిన అసమ్మతి రాజకీయాలు, ముఖ్యమంత్రుల మార్పు దేశ ప్రతిష్టకే భంగకరమని ఆనంద్ బాధ. ‘ఎంతో గొప్పవాడైన తన తండ్రిని కూడా జనం మరచిపోయేంత ఘనకీర్తిని సంపాదించాలన్న తపనతో ఆమె వేగిపోతోంది’ (పే 454) అనుకుంటాడు లోపలి మనిషి. తన తరువాత ఈ వైభవం కొడుకు సంజయ్‌కి సంక్రమించాలన్న తపననూ ఆమెలో గమనిస్తాడు. భూమి సమస్య; ప్రాధాన్యం, రాష్ట్రాల పునర్విభజన,రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయకరణ, భారత జాతీయ కాంగ్రెస్‌కు కాంగ్రెస్ (ఐ) అనే ‘తోక’, పత్రికారంగం పతనం, నక్సల్బరీ, పాక్, చైనా సంబంధాలు, కామరాజ్ పథకం, హిందూ ముస్లిం సమస్య .... ఇలా నవలలో ఆనంద్ చేత లోపలి మనిషి మాట్లాడించిన చారిత్రకాంశాల జాబితా విస్తారమైనది. ఆ జాబితా స్వతంత్ర భారతదేశ చరిత్ర పుటలలోని ప్రతి అధ్యాయపు ఛాయే. చరిత్రకు ఛాయ సాహిత్యమే. ‘లోపలి మనిషి’ నవలాకారుడు సాహిత్యం లోతులు తెలిసినవారు. బహుభాషా పండితుడు. అందుకే పత్రికారంగం, భాషా వివాదాలు ఆయన దృష్టిపథం నుంచి తప్పించుకోలేదు. స్కూప్, స్పెషల్ కరస్పాండెంట్లు, కొసన ప్రశ్నార్థకం ఉన్న శీర్షికలతో వెలువడే వార్తలు, అవి సృష్టించే కృతక వాతావరణం వంటి అంశాలను పీవీ చిత్రించారు. నెహ్రూ వారసులెవరు అంటూ డజన్ల కొద్దీ పుస్తకాలు వెలువడుతుంటే, కొన్ని ప్రమాదకర సమస్యలు దేశంలో ఉద్యమ రూపంలో వీధులకెక్కాయి. అవి ప్రాంతీయమైనవి, భాషాపరమైనవి, మతపరమైనవి. నిజానికి అంతా రాజకీయమే. అస్సాం సాహిత్య సభ 1959లో వారి భాషను అధికార భాషగా ప్రకటించాలని కోరింది. అక్కడ బెంగాలీ మాట్లాడేవారు ఉన్నారు. ఇది హింసాత్మకమైంది. ఇంతకంటే దారుణం– తమిళనాడు హిందీ వ్యతిరేకాందోళన. ‘తమిళతల్లి’ కోసం ఆత్మాహుతులు జరిగిపోతున్న కాలం. ఒక మంత్రి ఇంట జరిగిన పెళ్లిలో ఉత్తర భారత నర్తకుడు బిర్జూ మహరాజ్ కార్యక్రమం ఏర్పాటయిందని తెలిసి తెలుగుప్రాంతం నుంచి వెళ్లిన ఆనంద్ తదితర నేతలు కంగుతిన్నారు. ఈ హిందీ వ్యతిరేకోద్యమ ఘట్టానికి కొసమెరుపు– ఎంపీ అయిన ఓ హిందీ వ్యతిరేకోద్యమ నేత ఆనంద్‌కు పరిచయం. ఒక విమానాశ్రయంలో ఇద్దరూ తారసపడ్డారు. తమిళ ఎంపీ వెంట కొడుకు ఉన్నాడు. వారి మధ్య సంభాషణ ఇది. ‘మీకు తెలుసో లేదో, మావాడు ఢిల్లీలో చదువుతున్నాడు. హిందీలో వీడిక్లాసులో ఎప్పుడూ వీడే ఫస్టు’ అన్నాడు ఎంపీ. ‘మీకు హిందీ రాదు. పైగా ఆ భాషకు వ్యతిరేకం. ఎప్పుడూ ఆందోళన చేస్తూనే ఉంటారు’ విస్మయంతో అడిగాడు ఆనంద్. ఇందుకు మరింత విస్మయం కలిగించే జవాబు, ‘చూడండి, అవి రాజకీయాలు...’ (పే. 321). సమాఖ్య వ్యవస్థలో కేంద్రం బలహీనంగా ఉందన్న అభిప్రాయం బలపడినప్పుడూ, తమను పట్టించుకునే వెసులుబాటు ఢిల్లీకి లేదు కాబోలునని వెనుకబడిన ప్రాంతాల ప్రజలు నిరాశ పడినప్పుడు నక్సలిజం వంటి సమస్యలు అనివార్యమనే పీవీ చెబుతారు. ‘భూస్వామ్య వ్యవస్థ వైఫల్యాలను మీ పార్టీ (కాంగ్రెస్) వాడుకుంటే, ఇప్పుడు నక్సలైట్లు మీ విధానంలోని వైఫల్యాలను వాడుకుంటున్నారు. అవి మరింత కొట్టొచ్చినట్టు కనిపించే వైఫల్యాలు’ అని బలరాం అనే పాత్ర (భూస్వామి) వ్యక్తం చేసిన అభిప్రాయంలో ప్రతిబింబించేది ఇదే. భూమి సమస్యకు కొనసాగింపుగానే పీవీ నక్సల్ సమస్యను చూశారు. అయినా ఆయన దృష్టిలో భారతీయతకు ఆకృతిని ఇచ్చినదే భూమి. సోషలిజం కాంగ్రెస్ పార్టీ నినాదం. కానీ భూసంస్కరణలు తేవడానికి ముఖ్యమంత్రి అయిన తరువాత ఆనంద్ చేసిన ప్రయత్నం భంగపడింది. చివరికి అది అతడి పదవిని బలిగొన్నది(వాస్తవంలో ఇందుకు బలిపశువైనవారు పీవీయే). ఇదే ఈ నవలకు ముగింపు. ‘లోపలి మనిషి’ పీవీ ఆత్మకథాత్మక నవలగా చెబుతున్నారు. కానీ ఇది నాటి ఎందరో విజ్ఞుల ఆత్మావలోకనం. దానికి అక్షరరూపం ఇచ్చినవారు దాదాపు పీవీ ఒక్కరే. ఎంతటి చరిత్రపురుషులనైనా దేవుళ్లుగా ప్రతిష్టించవద్దంటుందీ నవల. చరిత్రను మింగే స్థాయిలో చరిత్ర పురుషులను ఆరాధించకూడదని ఘోషిస్తుంది. - డా‘‘ గోపరాజు నారాయణరావు -
సంస్కరణల ఆద్యుడు పీవీ
దేశ ప్రధానిగా మాత్రమే కాదు.. మహా మేధావిగా, బహుభాషా కోవిదుడిగా, పాలనాదక్షుడిగా, రచయితగా పేరుప్రఖ్యాతులు గడించిన స్వర్గీయ పీవీ నరసింహారావు ఆదినుంచీ సంస్కరణాభిలాషి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విద్యామంత్రిగా పనిచేసినప్పుడే ఆయన ఎన్నో సంస్కరణలను తీసుకొచ్చి ఆ రంగంపై తనదైన ముద్ర వేశారు. ఆ సంస్కరణల వల్ల నిరుపేద వెనుకబడిన వర్గాలకు కూడా నాణ్యమైన గురుకుల విద్య అందుబాటులోకి వచ్చింది. అనంతరకాలంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక దేశంలోనే తొలిసారి భూసంస్కరణలు అమలు చేశారు. ఆ రోజుల్లో ఆ చర్య దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ఒక పాలకుడు తనంత తాను భూసంస్కరణలు అమలు చేసే సాహసం ఎక్కడా చేయలేదు. రాజకీయాలను శాసించే భూస్వామ్య వర్గాలకు ఆగ్రహం కలిగితే సమస్యలొస్తాయని వారు భావించారు. కానీ పీవీ భిన్నమైన రాజకీయ నాయకుడు. ఆయన జాతీయోద్యమంలో కార్యకర్తగా పనిచేసినవాడు. వందేమాతరం గీతాన్ని ఆలపించి కళాశాల నుంచి బహిష్కరణకు గురైనవాడు. ఆ తర్వాతకాలంలో రహస్య జీవితంలోకి వెళ్లి నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్మించడం, తోటి యువకులకు తుపాకీ కాల్చ డంలో శిక్షణనీయడం వంటి కార్యకలాపాల్లో పాల్గొన్నాడు. ఆయన ప్రధానిగా మాత్రమే కాదు...మహామేధావిగా, పాలనా దక్షుడిగా, బహుభాషా కోవిదుడిగా, రచయితగా అందరికీ గుర్తుండిపోతాడు. ప్రతిభాపాటవాల్లో తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూకు దీటైన నేత. తెలంగాణ మట్టిలో పుట్టిన మాణిక్యం. కాంగ్రెస్ పార్టీలో సామాన్య కార్యకర్తగా చేరి తన ప్రతిభతో ఎదుగుతూ, 1957లో మొదటిసారి మంథని నుంచి ఎంఎల్ఏగా ఎన్నికైనారు. మొదటినుంచీ కాంగ్రెస్ పార్టీ నమ్మినబంటుగా వుండి, శ్రీమతి ఇందిరాగాంధీ ఆంతరంగిక వర్గంలో ఒకరిగా మెలిగిన పీవీ అనుకోని పరిస్థితులలో యాదృచ్ఛికంగా ప్రధాని అయ్యారు. అప్పుడు కాంగ్రెస్‌కి పార్లమెంటులో చాలినంత బలం లేదు. ప్రభుత్వాన్ని నడపడం కత్తిమీద సాము. దేశ ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నమైపోయి, మన బంగారం నిల్వ లను విదేశాలలో కుదువ పెట్టి అప్పు తెచ్చుకుం టున్న పరిస్థితి. ఈ పరిస్థితులలో ప్రధాని పదవి ఒక ముళ్ళకిరీటం. ఆ కిరీటాన్ని పీవీ ధరించి, చాణక్య నీతితో ప్రతిపక్షాలను కలుపుకుపోతూ మైనారిటీ ప్రభుత్వాన్ని నడుపుతూ, దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్ది విదేశాలలో కుదువ పెట్టిన బంగారాన్ని తిరిగి తెప్పించి దేశ ప్రతిష్టను కాపాడడమే కాక కాంగ్రెస్ పార్టీని బతికించారు. ఇంత చేసినా కాంగ్రెస్ నాయకులకే పీవీ మీద గౌరవ మర్యాదలు లేవు. ప్రధానిగా వున్నప్పుడే కుట్రలు, కుతంత్రాలు పన్నారు. ప్రధానిగా ఆయన ఐదేళ్ళ పదవీకాలం జయప్రదంగా పూర్తి చేసుకుంటే ఓర్వలేకపోయారు. ఆయనపై చిల్లర మల్లర కేసులు పెట్టించి, కోర్టుల చుట్టూ తిప్పించారు. కష్టకాలంలో ఒక్కరూ అండగా నిలువలేదు. మరణానంతరం కూడా ఒక ప్రధానిగా పనిచేసిన వ్యక్తి పార్థివదేహానికి లభించవలసిన గౌరవాలు ఆయనకు దక్కనివ్వలేదు. దేశ రాజధానిలో ఆయన స్మృతి చిహ్నానికి ఒప్పుకోలేదు. కనీసం పార్థివదేహాన్ని ఏఐసీసీ కార్యాలయం ప్రాంగణంలోకి కూడా రానివ్వలేదు. పార్థివ దేహాన్ని హైదరాబాద్ తెచ్చి దహన సంస్కారాలు చేశారు. ఇక ఆయనను మర్చిపోయారు. ఆయన గురించి ప్రస్తావించడమే మహా నేరంగా భావించారు కాంగ్రెస్ పెద్దలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 2014 జూన్‌లో తెలంగాణ బిడ్డ కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే భూస్థాపితమైన పీవీ ప్రతిష్టను పునరుద్ధరించారు. ఆయన మేధా సంపదను, రాజనీతిజ్ఞతను లోకానికి చాటారు. ఆయన వారసత్వాన్ని కాపాడుకోవలసిన అవసరం ప్రతి తెలంగాణ వ్యక్తికి ఉందని చాటారు. ప్రతి సంవత్సరం ఆయన జయంతి, వర్ధంతి ఉత్సవాలను ప్రభుత్వం తరఫున ఘనంగా నిర్వహించడం ప్రారంభించారు. ఏడాదిపాటు ప్రపంచవ్యాప్తంగా జరిగే శతజయంతి ఉత్సవాలను జూన్ 28న ప్రారంభించారు. నగరాలు, పట్టణాలలో పీవీ శతజయంతి ఉత్సవ హోర్డింగ్‌లను ఏర్పాటు చేశారు. 54 దేశాలలో ఈ ఉత్సవాలను ఇంతే ఘనంగా నిర్వహించడానికి అక్కడి తెలుగు సంఘాల ప్రతినిధులతో చర్చించి ఏర్పాటు చేశారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇందుకోసం శాసనసభలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపారు. ఇది తెలంగాణ బిడ్డగా పుట్టి జాతిరత్నంగా ఎదిగిన ఒక మహనీ యునికి ఇస్తున్న ఘననివాళి. కోలేటి దామోదర్ వ్యాసకర్త చైర్మన్, తెలంగాణ రాష్ట్ర పోలీస్ గృహ నిర్మాణ సంస్థ లిమిటెడ్ మొబైల్ : 98491 44406 -
వార్తల కెక్కని పీవీ చాణక్యం
అవి 1994 ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలు. రాష్ట్రంలో పదో అసెంబ్లీ కొలువు తీరింది. తిరుగులేని మెజా రిటీతో ఎన్టీఆర్ ముఖ్య మంత్రిగా ఆసీనులయ్యారు. దిష్టి తగిలిందో ఏమో ఏడాది తిరక్కుండా సంక్షోభం మొద లైంది. ఆగస్టు సంక్షోభంగా పేపర్లకు ఎక్కింది. కలయో, వైష్ణవ మాయయో ఇతర సంకల్పార్థమో గానీ గట్టిగా ఉన్న టీడీపీ పీఠం తాలూకు కూసాలు కదిలాయి. ఎన్టీఆర్‌కి పాపం దెబ్బ మీద దెబ్బ! కో పైలట్ నాదెళ్ల కొట్టిన దెబ్బ సర్దుకోక ముందే తిప్పు కోలేని, వూహించని పోటు. యన్టీఆర్ తల్లడిల్లి పోయారు. కనిపించిన వాళ్లందరి దగ్గరా గోడు వెళ్ల బోసుకున్నారు. చంద్రబాబుని కాళ్లు కడిగిన అల్లుడని కూడా చూడక నానా దుర్భాషలాడారు. నిస్సహాయ స్థితిలో పడ్డారు పాపం. జరిగిన అన్యాయాన్ని నిలదీసిన పెద్ద మను షులు లేరు. న్యాయాన్యాయాలు కాదు. ఇక్కడ బలా బలాల సమస్య. ఇతరేతర కారణాల వల్ల యన్టీఆర్ మద్దతుదార్లు బాగా క్షీణించారు. రకరకాల వ్యూహ రచనలతో మీడియా యావత్తు చంద్రబాబుకి పూర్తిగా కొమ్ము కాసింది. అల్లుడు దశమగ్రహమంటూ, శని గ్రహమంటూ ఎన్టీఆర్ మాట్లాడిన అనేకానేక ఆడి యోలు రాష్ట్రంలో హల్చల్ చే శాయ్. ప్రజలు చాలా సందర్భాలలో ఉదాసీనంగా ఉంటారు. అంతకు ముందు దాకా ఎన్టీఆర్ బొమ్మల్ని పూజామందిరాల్లో పెట్టుకున్న జనం ‘ఇది పూర్తిగా మీ కుటుంబ సమస్య. కొట్టుకు చావండని’ నిమ్మకు నిరెత్తినట్టు ఉండి పోయారు. ఇంకొంచెం వివరాల్లోకి వెళితే ఆసారి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీకి ఘనంగా 216 సీట్లు, జాతీయ కాంగ్రెస్‌కి కేవలం 26 కుర్చీలు, ఉభయ కమ్యూనిస్టులు వెరసి 34 సీట్లు, మిగిలిన పార్టీలన్నీ కలిస్తే కేవలం 6 స్థానాలు వచ్చాయి. ఎన్టీఆర్‌పై వేర్వేరు కారణాల వల్ల వచ్చిన వ్యతిరేకతని మొత్తంగా కలిపి జనానికి భూతద్దంలో చూపించారు. వైస్రాయ్ హోటల్ భూమికగా చంద్రబాబు తన మైండ్ గేమ్‌ని ఆరంభించారు. 170 మంది అసెంబ్లీ సభ్యులు నాగూట్లో ఉన్నారని నమ్మపలికారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు సైతం పూర్తిగా విశ్వసించారు. దీనివల్ల కప్పదాట్లు లేకుండా ఆగాయి. అప్పుడు ఎన్టీఆర్‌తో కేవలం 28 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. ఆయన ఆక్రోశం ఆగ్రహం హద్దులు లేకుండా పోయాయి. అంతా జారిపోయారు. ఎన్టీఆర్ నిరాశ నిస్పృహల మధ్య పీవీ నరసింహారావుని కూడా కలిశారు. ఇంటికి పిలిచి బొబ్బట్లతో మంచి తెలుగు భోజనం పెట్టారు. వాళ్ల కుటుంబ వ్యవహా రంలో ఆయనెందుకు తలపడతాడు? పైగా ఏది ఏమైనా ఆయనకు ఒనగూరే లాభమూ లేదు. నష్టమూ లేదు. కోట బీటవారితే కొంత లాభమే. మౌనం వహించారు. అయితే, పి.వి. గొప్ప చాణక్యపు ఎత్తుగడ వేశారు. అదేంటంటే పూర్వ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత కోట్ల విజయభాస్కర రెడ్డికి తన వ్యూహాన్ని వివరించారు. ‘మనవాళ్లని టీడీపీ రామా రావు గ్రూపుతో కలుపు. సీఎం ఆయనే. మనకి మంత్రి పదవులు కూడా వద్దు’ అనగానే కోట్ల అందరం కలి సినా యాభై నాలుగే అని చప్పరించారు. మంత్రి పదవులు ఎరవేస్తే మరి కొందరొస్తారు. కొందరు కొందర్ని తెచ్చుకుంటారు. అసలు కవ్వం వేసి కదల్చకుండానే వెన్న పడాలంటావేమమయ్యా అన్నారు. పీవీ. ‘అసలేమో లేదనుకున్నవాళ్లం వందకి వచ్చాం కదా. నువ్ కూడా మైండ్‌గేమ్‌కి పావులు కదిలించు’ అనగానే మీరుంటారా అన్నారు జంకుతో కోట్ల, ఎప్పుడూ నవ్వని పీవీ చిరునవ్వు నవ్వి, ‘నా ఢిల్లీ సీటు వదిలి ఇక్కడ ఉండటమా? అక్కడ కుర్చీ ఏ గంటకా గంటే లెక్క! అందుకని ఆ విధంగా ముందు కెళ్లు. తక్కువలుంటే సామదాన భేద దండోపాయాల ద్వారా సాధిద్దాం. రాజకీయంలో అసాధ్యమంటూ ఏమీ ఉండదు’ అని పరిపరివిధాల హితబోధ చేశారు. పి.వి. అయితే, కోట్ల అందుకు సాహసించలేదు. ఆ వ్యూహం ఫలించి వుంటే టీడీపీ చెక్కలు ముక్కలై పోయేది. నల్లేరు మీద బడిలా ఆ సందర్భం నడి చింది. పీవీ వ్యూహాలు అప్పటికీ యిప్పటికీ వెలుగు లోకి రాలేదు. ఆయనే ప్రత్యక్షంగా చదరంగంలోకి దిగితే, బాబుకి ఎక్కడికక్కడ చెక్‌లు పడేవి. పదవి పోయి అపకీర్తి మాత్రం మిగిలేది. నిశ్శబ్దంలోనే ఉండి పోయింది. పీవీ మహా మేధావి, రాజకీయ దురంధ రుడు, నిత్సోత్సాహి. ఆయనకు అక్షర నీరాజనం. (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
త్వరలో పీవీ నరసింహారావు పోస్టల్ స్టాంప్
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్:: మాజీ ప్రధాని, తెలుగు బిడ్డ స్వర్గీయ పీవీ నరసింహారావు స్మారకార్థం ప్రత్యేక పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేయాలని కేంద్రం నిర్ణయించడం పట్ల కేంద్రం హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పీవీ శత జయంతిని పురస్కరించుకొని ఆయన గౌరవార్థం తపాళ బిళ్లను విడుదల చేయాలని కేంద్ర సమాచార శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను కోరినట్లు ఆయన తెలిపారు. తన విజ్ఞప్తిని కేంద్రం పరిగణలోకి తీసుకొని పీవీ పోస్టల్ స్టాంప్ విడుదలపై సానుకూల నిర్ణయం తీసుకుందన్నారు. ఇందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర సమాచార శాఖ, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. (అయ్యా నిజం చెప్పమంటారా...!) పీవీ దూర దృష్టి, సంస్కరణలు, సౌత్ ఈస్ట్ ఆసియాతో భారత్ వ్యూహాత్మక, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేశాయన్నారు. భారత ఆర్థిక సంస్కరణల పితగా పీవీ నరసింహరావును కిషన్ రెడ్డి అభివర్ణించారు. ఆయన చేసిన సేవలను భవిష్యత్ తరాలకు తెలపాలన్న యోచనతోనే పీవీ పోస్టల్ స్టాంప్ విషయంలో చొరవ చూపినట్లు పేర్కొన్నారు. త్వరలో భారత ప్రభుత్వం పీవీ పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేస్తుందని చెప్పారు. ఇది దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ, గౌరవ చిహ్నంగా తీసుకున్న నిర్ణయంగా భావిస్తున్నట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. (అచ్చమైన భారత రత్నం) -
నిరాడంబరతకు నిలువెత్తు ప్రతీక..
సాక్షి, సిద్దిపేటజోన్: తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధా ని పీవీ నరసింహారావు గొప్ప సంస్కరణలకు నాం ది పలికిన వ్యక్తి అని, నిరాడంబరతకు నిలువెత్తు ప్రతీకగా నేటి సమాజానికి పీవీ స్ఫూర్తిగా నిలుస్తారని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం ఆయన సిద్దిపేట జిల్లా కలెక్టరేట్లో పీవీ జయంతి ఉత్సవాల సందర్భంగా పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం పట్టణంలో పలు చోట్ల హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీవీ నరసింహారావు శతజయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఈ ఏడాదిని పీవీ శతజయంతి సంవత్సరంగా ప్రకటించారని పేర్కొన్నారు. పీవీ శతజయంతి ఉత్సవాలను ఈ ఏడాది పొడవునా నిర్వహించాలని, అన్ని జిల్లా కేంద్రాల్లో పీవీ విగ్రహాలను ఏర్పాటు చేయాలని కేసీఆర్ సంకల్పించారని పేర్కొన్నారు. తెలంగాణ వ్యక్తిగాపీవీకి మద్దతిచ్చా: మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు చెందిన వ్యక్తి కావడమే కాకుండా ప్రధానిగానూ ఉండడంతో పీవీకి ఎంపీగా తాను మద్దతునిచ్చినట్లు రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. 1991లో టీడీపీ నుంచి ఆదిలాబాద్ ఎంపీగా గెలిచిన తాను, 1993లో పీవీ ప్రభుత్వం మైనారిటీలో పడినపుడు ఇతర టీడీ పీ, జేఎంఎం ఎంపీలతో కలిసి మద్దతివ్వడం వ ల్ల నాడు ఆ ప్రభుత్వం నిలబడిందని గుర్తుచేశారు. ఆదివారం పీవీ శతజయంతి సందర్భంగా నెక్లెస్‌రోడ్‌లోని పీవీ జ్ఞానభూమిలో మంత్రి నివాళులర్పించారు. దేశం విపత్కర స్థితిలో ఉన్నపు డు ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి గాడిన పెట్టి న మొట్టమొదటి ప్రధాని పీవీ అని కొనియాడారు. ఈ సందర్భంగా పీవీతో తనకున్న అనుబంధాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. -
పీవీ మ్యూజియంను ప్రారంభించిన గవర్నర్
సాక్షి, మాదాపూర్: మాజీ ప్రధాని, స్వర్గీయ పీవీ నరసింహారావు మ్యూజియాన్ని వర్చువల్ విధానంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదివారం ప్రా రంభించారు. సురభి విద్యాసంస్థల ఆధ్వర్యంలో మాదాపూర్‌లోని శ్రీ వేంకటేశ్వర గ్రూప్ ఆఫ్ కళాశాలల ప్రాంగణంలో ఈ మ్యూజియం ఏర్పాటుచేశా రు. ఈ కార్యక్రమంలో సురభి విద్యాసంస్థల చీఫ్, పీవీ నరసింహారావు కుమార్తె వాణీదేవి, పీవీ ప్రభాకర్‌రావు పాల్గొన్నారు. -
దేశానికి ఎనలేని సేవ చేశారు..
సాక్షి, హైదరాబాద్: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి సందర్భంగా ఆదివారం గాంధీభవన్‌లో పలువురు కాంగ్రెస్ నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్యెల్యే శ్రీధర్‌బాబు, కార్య నిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి, అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, మాజీ ఎంపీలు అంజన్‌కుమార్ యాదవ్, మల్లు రవి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు కుమార్‌రావ్ తదితరులు ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించిన అనంతరం దేశానికి పీవీ చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ తెలంగాణ సమాజం లోని అన్ని వర్గాల మనసుల్లో చిరస్థాయిగా ఉన్న వ్యక్తి పీవీ అని కొనియాడారు. ఎవరో ఇప్పుడు ఆయన జయంతి వేడుకలు చేస్తున్నారని రాష్ట్ర ప్ర భుత్వాన్ని పరోక్షంగా విమర్శించిన ఉత్తమ్, అయి నా తాము గర్విస్తామని, స్వాగతిస్తామన్నారు. గీతారెడ్డి చైర్మన్‌గా కమిటీ ఏర్పాటు పీవీ శతజయంతి వేడుకల నిర్వహణకుగాను మా జీ మంత్రి గీతారెడ్డి చైర్మన్‌గా, మంథని ఎమ్యెల్యే శ్రీధర్‌బాబు వైస్ చైర్మన్‌గా 15 మంది సభ్యులు, ముగ్గురు సలహాదారులతో ఉత్తమ్ కమిటీ ఏర్పాటు చేశారు. కాగా, దిగవంత పీవీ నరసింహారావు శత జయంతి వేడుకలను ఏడాదిపాటు జరపాలని సోనియా గాంధీ ఆదేశాలిచ్చారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని ఉమ్మడి రాష్ట్రంలోనే తీర్మానం చేశామని, ఆయనకు భారతరత్న ఇవ్వాలని పార్లమెంట్లో కూడా కోరతామని చెప్పారు. -
ధీశాలి.. సంస్కరణశీలి
సాక్షి, హైదరాబాద్ : ‘మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన 360 డిగ్రీల కోణంలోనూ అద్భుత వ్యక్తిత్వంగల వ్యక్తి. ఆయన వ్యక్తిత్వ పటిమ, ఆయనకు ఆయనే సృష్టించుకున్న గరిమను వర్ణించడానికి మాటలు చాలవు. గొప్ప సంస్కరణశీలి. విమర్శలు వస్తాయని ఏదైనా చేయడానికి కొందరు భయపడతారు. కానీ భయపడకుండా సంస్కరణలను అమలు చేసిన ధీశాలి పీవీ. ఏ రంగంలో కాలుపెడితే ఆ రంగంలో సంస్కరణలు తెచ్చారు’అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు కొనియాడారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేస్తామని, పీవీ కుటుంబ సభ్యులను ప్రధాని వద్దకు తీసుకెళ్లి స్వయంగా విజ్ఞప్తి చేస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అలాగే శాసనసభలో పీవీ చిత్రపటం ఏర్పాటు చేస్తామన్నారు. పార్లమెంటులోనూ ఆయన చిత్రపటం ఏర్పాటు చేయాలని పోరాడుతామన్నారు. పీవీ నరసింహారావు 99వ జయంతి సందర్భంగా ఆదివారం హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీవీ జ్ఞానభూమి వద్ద ఆయన సమాధికి సీఎం కేసీఆర్ ఘన నివాళులర్పించి శతజయంతి వేడుకలను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు... అన్ని రకాల తెలంగాణ ప్రభలు, ప్రతిభలు మసకబారాయి. వాటన్నింటినీ బయటకు తీసి భావితరాలకు అందించాలి. వ్యక్తిత్వ పటిమను పెంపొందించడానికి పీవీ చరిత్ర ఆదర్శంగా నిలుస్తుంది. నవభారత నిర్మాతల్లో ఆద్యుడు నెహ్రూ అయితే ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు పీవీ. నెహ్రూకు సమాంతర వ్యక్తి పీవీ అని వంద శాతం ఢంకా బజాయించి చెప్పాలి. ఈ రోజు 51 దేశాల్లో పీవీ జయంతిని తెలంగాణ బిడ్డలు నిర్వహిస్తున్నారు. ఇందుకు రూ. 10 కోట్లు విడుదల చేశాం. హర్పల్ మౌలా (ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్పగలే ప్రజ్ఞగలగే వ్యక్తి) అని పీవీని పాకిస్తానీయులు సైతం పొగిడారు. పీవీ శత జయంతి ఉత్సవాల ముగింపు సభ లక్ష మందితో నిర్వహించే పరిస్థితి రావాలి. జ్ఞాన భూమిలో భారీ మెమోరియల్ తెలుగు అకాడమీకి పీవీ పేరు పెడతాం. కాకతీయ యూనివర్శిటీలో ఆధునిక ఆర్థిక విధానాలపై పీవీ పేరుతో అధ్యయన కేంద్రం ఏర్పాటు చేస్తాం. రామేశ్వరంలో ఏర్పాటు చేసిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మెమోరియల్‌ను మించి పీవీ మెమోరియల్‌ను జ్ఞాన భూమిలో వచ్చే ఏడాది జూన్ 28లోగా ఆవిష్కరిస్తాం. ఇంకొన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు సైతం పీవీ పేరు పెడతాం. పోస్టల్ స్టాంపు విడుదల చేయాలని కేంద్రాన్ని కోరతాం. ఎంపీ కేశవరావు సూచన మేరకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి పీవీ పేరు పెట్టాలని కేంద్రానికి లేఖ రాస్తా. అముద్రితమైన పీవీ రచనలను తెలుగు అకాడమీ ద్వారా ముద్రించి వర్సిటీలకు పంపిస్తాం. ఏ బాధ్యతలు చేపట్టినా సంస్కరణలు ఉమ్మడి ఏపీలో పీవీకి విద్యా మంత్రి పదవి ఇస్తే సర్వేల్లో నవోదయ పాఠశాలలను ఏర్పాటు చేశారు. డీజీపీ మహేందర్‌రెడ్డి సహా ఎందరో ఐఏఎస్, ఐపీఎస్, దౌత్యవేత్తలు వాటిల్లో రూపుదిద్దుకున్నారు. కేంద్ర విద్యాశాఖ పదవి ఇస్తే శాఖ పేరును హెచ్ఆర్డీగా మార్చారు. మళ్లీ దేశవ్యాప్తంగా నవోదయ పాఠశాలలను ప్రారంభించారు. ఆయనకు జైళ్ల శాఖను అప్పగిస్తే ఓపెన్ జైల్ కాంసెప్ట్ తీసుకొచ్చారు. ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు భూ సంస్కరణలు తీసుకొచ్చారు. ఆయన 1,000/1,200 ఎకరాల ఆసామి. ఆయన 200 ఎకరాల భూమిని కుటుంబానికి ఇచ్చుకొని మిగిలిన 800 ఎకరాలను ప్రభుత్వానికి అప్పగించారు. అందుకే పీవీ తెలంగాణ ఠీవీ. విమర్శలొచ్చినా వెనకాడని నిశ్చలమైన వ్యక్తి. భూస్వామ్య వ్యవస్థ పోయి నేడు రాష్ట్రంలో 93% చిన్న, మధ్య రైతులు ఉండటానికి కారణం ఆయనే. ఆర్థిక స్వేచ్ఛకు కారణభూతుడు.. పీవీ ప్రధాని అయ్యే నాటికి దేశం ఉన్న బంగారాన్ని విదేశాల్లో తాకట్టు పెట్టి పరువు నిలబెట్టుకుంటున్న పరిస్థితి ఉండేది. అలాంటి సంక్షోభ సమయంలో ప్రధాని పదవి ఆయన్ను వరించింది. అప్పటివరకు రాజకీయాల్లో లేని, ఆర్బీఐ గవర్నర్‌గా పనిచేసిన మన్మోహన్సింగ్ను కేంద్ర ఆర్థిక మంత్రిని చేసి ఆయన ద్వారా ఆర్థిక సంస్కరణలను అమలు చేశారు. ఈ రోజు మనం అనుభవిస్తున్న ఆర్థిక స్వేచ్ఛ, ఆర్థిక పరిణతికి కారణభూతుడు పీవీ. తగిన గౌరవం లభించలేదు రాష్ట్రానికి, దేశానికి, భూగోళానికి విజ్ఞాన సముపార్జన చేసిన పీవీ లాంటి గొప్ప వ్యక్తికి లభించాల్సిన గౌరవం లభించకపోవడం బాధాకరం. చేయవలసిన వారు చేయకపోయినప్పటికీ మన బిడ్డ పీవీకి గొప్ప పేరు ప్రఖ్యాతి వచ్చేలా ముందు తరాలకు తెలిసేలా శత జయంతి ఉత్సవాలను ఏడాది పొడవునా నిర్వహిద్దాం. కుల, ధన బలం లేకున్నా ప్రధాని అయ్యారు. నిరంతర అధ్యయనశీలి... పీవీ నోట సరస్వతి నాట్యం చేసినట్లు ఉంటది. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నందుకు నిజాం రాజు పీవీని ఓయూ నుంచి రస్టికేట్ చేసి తెలంగాణ రాజ్యంలో ఎక్కడా సీటు ఇవ్వొద్దంటే మహారాష్ట్రలో సీటు సంపాదించారు. మరాఠీ భాషను నేర్చుకోవడమే కాకుండా ఆ భాషలోని నవలను తెలుగులోకి తర్జుమా చేశారు. వయసుతో నిమిత్తం లేని గొప్ప విద్యార్థి పీవీ. అందుకే ఆయనకు 17 భాషలు వచ్చాయి. నిరంతర అధ్యయనశీలి పీవీ. పీవీ ఆశయం కోసమే 900 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి పదవికి వన్నె తెచ్చారు: కేకే ప్రతి పదవికి వన్నె తెచ్చిన మహానీయుడు పీవీ అని పీవీ శత జయంతి ఉత్సవాల కమిటీ అధ్యక్షుడు కె.కేశవరావు అన్నారు. . భారత ఆర్థిక, సామాజిక, రాజకీయ సుస్థిరతకు పీవీ అందించిన సేవలు సదా స్మరణీయమన్నారు. నాడే చెప్పిన పీవీ: పోచారం తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ వల్లే సాధ్యమని, ఆయనే తొలి సీఎం అవుతారని ముందే పీవీ చెప్పారని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. శ్రమను ఎక్కడా చెప్పుకోలేదు పీవీలో ఎన్నో పార్శా్వలు ఉన్నాయి. బహుభాషా కోవిదుడు, రాజనీతిజు›్ఞడు, సాహితీవేత్తగా మాత్రమే పీవీ ప్రజలకు తెలుసు. కానీ ఆయన శాస్త్ర పరిజ్ఞానాన్ని, ఖగోళ శాస్త్రాన్ని, సంగీతాన్ని బాగా ఇష్టపడేవారు. మంచి దౌత్యవేత్త కూడా. చేసే పనిని ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఇష్టపడేవారు. తన శ్రమను ఎప్పుడూ చెప్పుకోలేదు. పక్క వారిని కూడా చెప్పనిచ్చే వారు కాదు. పీవీ శత జయంతి ఉత్సవాలు ఆయన గురించి ప్రజలకు తెలియజేయడానికి మంచి వేదిక. వచ్చే ఏడాది నాటికి పూర్తిగా భిన్నమైన పీవీని ఈ ఉత్సవాలు ప్రపంచానికి పరిచయం చేస్తాయని ఆశిస్తున్నా. – పీవీ ప్రభాకర్‌రావు, పీవీ కుమారుడు హెచ్సీయూకు పీవీ పేరు పెట్టాలి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. 1975లో జరిగిన తొలి దశ తెలంగాణ ఉద్యమ ఫలితంగా, 6 పాయింట్స్ ఫార్మూలా అమలులో భాగంగా ఈ వర్సిటీ ఏర్పాటైందని ప్రధానికి కేసీఆర్ గుర్తుచేశారు. దేశ ఆర్థిక, విద్యా, సాహిత్య రంగాల వృద్ధికి ఎంతో కృషి చేసిన పీవీ పేరును ఈ వర్సిటీకి పెట్టాలని తెలంగాణ సమాజం కోరుకుంటోందని ప్రధానికి తెలియజేశారు. కేసీఆర్‌కు కృతజ్ఞతలు భాషకు అందని వ్యక్తిత్వం మా బాపుది. మాకు బాపు గురించి అన్నీ తెలుసనుకున్నాం. కానీ మాకు తెలియని విషయాలు రోజూ తెలుస్తూనే ఉన్నాయి. పీవీ శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. – వాణీ దయాకర్‌రావు, పీవీ కుమార్తె శ్రమను ఎక్కడా చెప్పుకోలేదు పీవీలో ఎన్నో పార్శా్వలు ఉన్నాయి. బహుభాషా కోవిదుడు, రాజనీతిజు›్ఞడు, సాహితీవేత్తగా మాత్రమే పీవీ ప్రజలకు తెలుసు. కానీ ఆయన శాస్త్ర పరిజ్ఞానాన్ని, ఖగోళ శాస్త్రాన్ని, సంగీతాన్ని బాగా ఇష్టపడేవారు. మంచి దౌత్యవేత్త కూడా. చేసే పనిని ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఇష్టపడేవారు. తన శ్రమను ఎప్పుడూ చెప్పుకోలేదు. పక్క వారిని కూడా చెప్పనిచ్చే వారు కాదు. పీవీ శత జయంతి ఉత్సవాలు ఆయన గురించి ప్రజలకు తెలియజేయడానికి మంచి వేదిక. వచ్చే ఏడాది నాటికి పూర్తిగా భిన్నమైన పీవీని ఈ ఉత్సవాలు ప్రపంచానికి పరిచయం చేస్తాయని ఆశిస్తున్నా. – పీవీ ప్రభాకర్‌రావు, పీవీ కుమారుడు -
పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలు
-
పీవీ శతజయంతి: స్పెషల్ ఫోటోలు
-
మోదీ మన్ కీ బాత్
-
పీవీ నిరంతర సంస్కరణ శీలి: కేసీఆర్
-
పీవీ నరసింహారావుకు సీఎం కేసీఆర్ నివాళి
సాక్షి, హైదరాబాద్ : దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు ఘనంగా నివాళి అర్పించారు. పీవీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆదివారం ఉదయం పీవీ జ్ఞానభూమి వద్ద ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పీవీ కుటుంబసభ్యులు, మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ రావు, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం తరఫున ఏడాదిపాటు నర్సింహారావు శత జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు. (చదవండి : పీవీ.. అపర మేధావి) గాంధీభవన్ లో దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావు శతజయంతి సందర్భంగా గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీ నేతలు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్యెల్యే శ్రీధర్ బాబు, కార్య నిర్వాహక అధ్యక్షులు పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శి చిన్నా రెడ్డి, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, మాజీ ఎంపీలు అంజన్ కుమార్ యాదవ్, మల్లు రవి, టీపీసీసీ ఉపాధ్యక్షులు కుమార్ రావ్, ప్రధాన కార్యదర్శులు మహేష్ కుమార్ గౌడ్, బొల్లు కిషన్, ప్రేమ లాల్, నగేష్, అజ్మ షాకేర్, నిరంజన్, అధికార ప్రతినిధులు జి.నిరంజన్, సుజాత, సంధ్య, శ్రీరంగం సత్యం తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. ఆర్థికంగా దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉన్నప్పుడు దేశ ఆర్థిక పరిస్థితి గాడిలో పెట్టిన ఘనత పీవీది అని కొనియాడారు. ల్యాండ్ సీలింగ్ తెచ్చి ఎంతో మంది పేదలకు సాయం చేసిశారని గుర్తుచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పీవీని చూసి రాజనీతిజ్ఞత నేర్చుకోవాలన్నారు. ఏడాది పాటు వేడుకలు చేస్తామని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. -
అచ్చమైన భారత రత్నం
ఆర్థిక రంగంలో సంస్కరణలకు ఆద్యుడు, దేశ ఆర్థిక వ్యవస్థను మలుపు తిప్పిన యోధుడు మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహా రావు జయంతి సందర్భంగా నేటి నుంచి ఒక ఏడాది పాటు పీవీ శతజయంతి ఉత్సవాలను ఘనంగా జరపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. చాలా ముదావహం. అత్యంత అదృష్టవంతుడు, బహు దురదృష్టవంతుడు అయిన రాజకీయ నాయకుడు ఎవరయ్యా అంటే చప్పున తట్టే పేరు పీవీ నరసింహా రావు. ఆయన ప్రధానిగా ఉన్నంతకాలం అందరూ ‘ఆహా! ఓహో!!’ అన్నారు. పీకలలోతు సమస్యల్లో కూరుకుపోయివున్న దేశ ఆర్థిక వ్యవస్థను నూతన సంస్కరణలతో ఒడ్డున పడేసిన మేధావిగా కీర్తిం చారు. సంఖ్యాబలం బొటాబొటిగా వున్న పాలకపక్షాన్ని అయిదేళ్ళ పాటు ‘పూర్తి కాలం’ అధికార పీఠంపై వుంచిన ‘అపర చాణక్యుడ’ని వేనోళ్ళ పొగిడారు. అధికారం దూరం అయి, పదవి నుంచి దిగిపోయిన తరువాత పొగిడిన ఆ నోళ్లతోనే ఆయనను తెగడటం ప్రారంభించారు. పదవికి ప్రాణం ఇచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన పదవికి దూరం కాగానే వాళ్ళూ దూరం జరిగారు. అయిదేళ్ళు ‘తెలుగువాడి’లోని ‘వాడినీ, వేడినీ’ లోకానికి చాటిచెప్పిన ‘వృద్ధ రాజకీయవేత్త’, నిస్సహాయంగా న్యాయస్థానాలలో ‘బోనులో’ నిలబడినప్పుడు, ఆయన పార్టీ వాళ్ళెవ్వరూ ఆయనను పట్టించుకోకపోగా ఏమీ తెలియనట్టు ‘కళ్ళు’, ‘నోళ్ళు’ మూసుకున్నారు. గాంధీ, నెహ్రూల కుటుం బానికి చెందని ఒక కాంగ్రెస్ నాయకుడు భారత ప్రధానిగా ఒక మైనారిటీ ప్రభుత్వాన్ని తన తెలివితేటలతో, మేధస్సుతో పూర్తికాలం అయిదేళ్ళు నడపడమే కాదు, అప్పటికే ఆర్థికంగా కునారిల్లుతున్న దేశాన్ని ఒడ్డున పడేసిన కృతజ్ఞత కూడా ఆయనకు తన సొంత పార్టీ నుంచి లభించలేదు. ఇదీ కాంగ్రెస్ పార్టీలో కృతజ్ఞతకు ఉన్న స్థానం. ఒక సాధారణ నాయకుడు చనిపోయినా అతడి పార్థివదేహాన్ని పార్టీ కార్యకర్తలు, సాధారణ ప్రజలు దర్శించి కడపటి వీడ్కోలు ఇచ్చేందుకు వీలుగా పార్టీ ఆఫీసులో కొంతసేపు ఉంచడం అనేది అన్ని పార్టీలు అనుసరిస్తూ వస్తున్న సాంప్రదాయం. కానీ కాంగ్రెస్ అధిష్టానానికి ఆయన పట్ల ఆ మాత్రం కనీస మర్యాద చూపాలన్న సోయికూడా లేకుండాపోయింది. పీవీ మరణించడానికి కొన్ని నెలలముందు హైదరాబాద్ వచ్చారు. మాజీ ప్రధాని హోదాలో రాజ్‌భవన్ గెస్టు హౌస్‌లో బస చేశారు. గతంలో ప్రధానిగా ఆయన అక్కడ దిగినప్పుడు కనబడే హడావుడి ఎలా వుండేదో ఒక విలేకరిగా నాకు తెలుసు. ఆయన చుట్టూనే కాదు చుట్టుపక్కల ఎక్కడ చూసినా అధికారులు, అనధికారులు, మందీమార్బలాలు, వందిమాగధులు, ఆయన కళ్ళల్లో పడితే చాలనుకునే రాజకీయ నాయకులు. ఆ వైభోగం వర్ణించతరమా? అన్నట్టు ఉండేది. మాజీ ప్రధానిగా పీవీ రాజభవన్లో ఉన్నప్పుడు, నేనూ, ఆకాశవాణిలో నా సీనియర్ కొలీగ్ ఆర్వీవీ కృష్ణారావుగారు గవర్నర్ రికార్డింగ్ నిమిత్తం వెళ్లి, ఆ పని పూర్తిచేసుకున్న తరవాత, రాజ్‌భవన్ గెస్ట్‌హౌస్ మీదుగా తిరిగివెడుతూ అటువైపు తొంగి చూశాం. ఒకరిద్దరు సెక్యూరిటీ వాళ్ళు మినహా రాజకీయుల హడావుడి కనిపించకపోవడంతో మేము లోపలకు వెళ్ళాము. ‘పీవీ గారిని చూడడం వీలుపడుతుందా’ అని అక్కడవున్న భద్రతాధికారిని అడిగాము. అతడు తాపీగా ‘లోపలకు వెళ్ళండి’ అన్నట్టు సైగ చేశాడు. ఆశ్చర్యపోతూనే లోపలకు అడుగుపెట్టాం. అడుగుపెట్టిన తరువాత, మా ఆశ్చర్యం రెట్టింప యింది. పీవీ ఒక్కరే కూర్చుని టీవీలో ఫుట్‌బాల్ మ్యాచ్ చూస్తూ కనిపించారు. డిస్టర్బ్ చేశామేమో అన్న ఫీలింగ్‌తోనే, మమ్మల్ని పరిచయం చేసుకున్నాము. లుంగీ మీద ఒక ముతక బనీను మాత్రమే వేసుకునివున్న పీవీగారు నావైపు చూస్తూ, ‘మీ అన్నయ్య పర్వతాలరావు ఎలావున్నాడయ్యా!’ అని అడిగేసరికి నాకు మతిపోయినంత పనయింది. ఎప్పుడో దశాబ్దాల క్రితం, పీవీగారు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు, రాష్ట్ర సమాచార శాఖలో పనిచేస్తున్న మా పెద్దన్నయ్య భండారు పర్వతాలరావు ఆయనకు పీఆర్వోగా కొద్దికాలం పనిచేశారు. అసలు పీవీగారు ముఖ్యమంత్రిగా ఉన్నదే అతి కొద్దికాలం. అప్పటి విషయాలను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఆయనకు లేదు. అయినా ఆప్యాయంగా గుర్తు పెట్టుకుని మరీ అడిగారు. అదీ పీవీ గారి గొప్పతనం. ఆ తరవాత కూడా ఆయన ఏదో మాట్లాడుతున్నారు కానీ మాకు ‘కలయో వైష్ణవ మాయయో’ అన్నట్టుగా ఉంది. మేము కలసి కూర్చుంది, కొన్నేళ్ళ క్రితం వరకు దేశాన్ని ఒంటిచేత్తో పాలించిన వ్యక్తితో అన్న స్పృహ ఉండటం వల్ల కొంత ఇబ్బంది పడుతూ కూర్చున్నాము. కాసేపటి తరువాత, కొణిజేటి రోశయ్య గారు వచ్చారు. ఆయన్ని చూడగానే పీవీ గారి మొహంలో ఒక రిలీఫ్ కనిపించింది. రోశయ్య గారు వచ్చిన తరువాత కాసేపు వుండి మేము వచ్చేశాము. ఇది జరిగి ఏళ్ళు గడిచినా ఈ చక్కని జ్ఞాపకం మా గుండెల్లో ఇంకా తాజాగానే వుంది. మరో సందర్భంలో పీవీ గారిని ఢిల్లీలో కలిశాను. రేడియో మాస్కోలో పనిచేయడానికి మాస్కో వెడుతూ అప్పుడు కేంద్ర మంత్రిగా అత్యంత ఉచ్ఛస్థానంలో ఉన్న పీవీ గారిని కలుద్దామని వెళ్లాను. బంగ్లా అంతటా నీరవ నిశ్శబ్ధం. కాసేపటి తరువాత ఎవరో అటుగా వస్తే ‘పీవీ గారిని కలవడానికి వీలుంటుందా’ అని వచ్చీరాని హిందీలో అడిగాను. అతగాడు బంగ్లాలో ఓ గది చూపించి వెళ్ళిపోయాడు. నెమ్మదిగా తలుపు తోసి చూస్తే ఎదురుగా పీవీ గారు. ఎవ్వరూ లేరు. పరిచయం చేసుకుని మాస్కో వెడుతున్నట్టు చెప్పాను. అప్పుడు ఆయన విదేశాంగ మంత్రి అనుకుంటాను. నా మొహంలో భావాలు పసికట్టినట్టున్నారు. ‘పనులు చేసి పెడుతూ వుంటే కదా పదిమంది వచ్చేది’ అన్నారు ఆయన తన మొహంలో భావాలు ఏమీ తెలియకుండా.‘మాస్కో ఎందుకయ్యా! వేరే దేశంలో మీ రేడియో ఉద్యోగాలు లేవా? బాగా చలిదేశం. పెళ్ళాం పిల్లలతో ఎలా ఉంటావు’ అని అడిగారు. చాలా ముక్తసరిగా మాట్లాడేవారని పేరున్న పీవీ గారు నేను ఊహించని విధంగా చనువుగా ఆ రెండు ముక్కలు మాట్లాడ్డం నా అదృష్టం అనే భావిస్తాను. కనీసం ఆయన శత జయంతి సంవత్సరంలో అయినా కేంద్ర ప్రభుత్వం పీవీకి భారతరత్న ప్రకటిస్తే, ఆ అత్యున్నత పురస్కారానికే శోభస్కరంగా ఉంటుందనడంలో సందేహం లేదు. ఆ విధంగా ఆ మహనీయుడికి జాతి యావత్తూ కృతజ్ఞత తెలిపినట్టవుతుంది కూడా. వ్యాసకర్త, సీనియర్ జర్నలిస్టు: బండారు శ్రీనివాసరావు, మొబైల్ : 98491 30595 -
వరంగల్ అర్బన్ జిల్లాకు పీవీ పేరు పెట్టాలి
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు, కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ గల సైనికుడిగా పనిచేసిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావును తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించడం హర్షణీయమని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఆయన స్వస్థలం వంగర ఉన్న వరంగల్ అర్బన్ జిల్లాకు పీవీ పేరు పెట్టాలని కోరారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు శుక్రవారం పొన్నం లేఖ రాశారు. ఎస్సారెస్పీ వరద కాల్వ, రాష్ట్రంలోని ఒక మెడికల్ కాలేజీ, ఒక యూనివర్సిటీకి కూడా పీవీ పేరు పెట్టాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వానికి పీవీపై చిత్తశుద్ధి ఉంటే ఆయన శత జయంతి సందర్భంగా ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేయాలని ఆ లేఖలో పేర్కొన్నారు. -
పార్టీలకతీతంగా మహనీయులకు నివాళి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు ఘననివాళులర్పించేందుకు ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. ఈనెల 28న ప్రపంచ వ్యాప్తంగా పీవీ శతజయంతి నిర్వహించనున్నారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర మంత్రి కేటీఆర్ నెక్లెస్‌రోడ్డులోని పీవీ జ్ఞానభూమిని సందర్శించి ఏర్పాట్ల తీరును పరిశీలించారు. ఏడాది పొడవునా నిర్వహించే శతజయంతి కార్యక్రమాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరూ పాల్గొంటారని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. అంతకుముందు కేటీఆర్ ఎన్నారైలతో మాట్లాడుతూ తెలంగాణ అస్థిత్వానికి అండగా నిలిచిన మహనీయులను స్మరించుకునే దిశగా తమ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని, పార్టీలకతీతంగా ముందుకువెళ్తోందని తెలిపారు. అందులో భాగంగానే పీవీ, వెంకటస్వామి, ఈశ్వరీభాయి, కొమరంభీం, జయశంకర్ తదితరులకు ఘననివాళులర్పిస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ ఏడాది మొత్తం జరిగే ఉత్సవాలకు సంబంధించి సమన్వయం చేసుకునేందుకు ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేశ్ బిగాలను శత జయంత్యుత్సవాల కమిటీలో సభ్యుడిగా చేర్చుతున్నట్లు తెలిపారు. -
చిరస్మరణీయ నేత పీవీ
ఏడు దశాబ్దాలు దాటిన స్వతంత్ర భారత దేశానికి ప్రధానమంత్రులుగా ఎందరో పని చేశారు. చరిత్రలో ఒకానొక ప్రధానమంత్రి స్థానం ఏమిటో నిర్ణయించే క్రమంలో పరిశీలనకు వచ్చే అంశాలలో యుద్ధం ప్రధానమైనది. యుద్ధం గెలిచిన ప్రధానులకు దేశప్రజల హృదయాలలో స్థిరమైన స్థానం ఉంటుంది. పాకిస్తాన్‌పైన 1965లో జరిగిన యుద్ధంలో భారత్ గెలిచింది కనుక నాటి ప్రధాని లాల్ బహద్దూర్ శాస్త్రి పట్ల భారతీయులకు అపారమైన అభిమానం. 1971లో తూర్పు పాకిస్తాన్లో సంభవించిన తిరుగుబాటు సందర్భంగా పాకిస్తాన్‌తో జరిగిన మరో యుద్ధంలో ఘనవిజయం సాధించి బంగ్లాదేశ్ ఆవిర్భావానికి దోహదం చేసిన ఫలితంగా అప్పటి ప్రధాని ఇందిరాగాంధిని ప్రజలు ఎప్పటికీ విజయేందిరగానే గుర్తు పెట్టుకుంటారు. కార్గిల్ ప్రాంతాన్ని పాకిస్తాన్ ఆక్రమించడానికి ప్రయత్నించినప్పుడు దేశ ప్రధానిగా అటల్ బిహారీ వాజపేయి ఉన్నారు. పరిమితమైన యుద్ధమైనప్పటికీ పాకిస్తాన్ సేనలను కార్గిల్ నుంచి తరిమికొట్టినందుకు వాజపేయికి ప్రజలు బ్రహ్మరథం పట్టి 1999 ఎన్నికలలో గెలిపించారు. రెండో ప్రపంచయుద్ధంలో విజేతలుగా అప్పటి ఇంగ్లండ్ ప్రధాని విన్స్టన్ చర్చిల్, అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్, ఫ్రాన్స్ అధినేత చార్లెస్ డీగాల్ ఆయా దేశాల ప్రజలకు ప్రాతఃస్మరణీయులైనారు. 1962లో చైనా చేతిలో భారత్ చిత్తుగా ఓడిపోయింది. అప్పటి వరకూ నవభారత నిర్మాతగా, స్వాతంత్య్ర సమరయోధుడుగా, గాంధీజీ ప్రియశిష్యుడుగా, సాగునీటి ప్రాజెక్టులు నిర్మించిన ప్రగతిరథ సారథిగా, అలీనోద్యమ నేతగా పేరుప్రఖ్యాతులు గడించిన నెహ్రూ చైనా చేతిలో ఓటమితో అపఖ్యాతిపాలైనారు. 1962 నవంబర్‌లో తగిలిన దెబ్బ నుంచి కోలుకోకుండానే 1964లో నెహ్రూ ఈ లోకం వదిలి వెళ్ళిపోయారు. ఇప్పుడు చైనాతో భారత్‌కు సరిహద్దు యుద్ధం ఇంతటితో ఆగిపోతుందో లేక కొనసాగుతుందో తెలియదు. అంతిమ ఫలితం భారత్‌కు అనుకూలంగా ఉంటే ప్రధాని నరేంద్రమోదీ ప్రభ నిలిచి వెలుగుతుంది. ఒక ప్రధాని లేదా ఒక దేశాధ్యక్షుడి జీవితంలో యుద్ధం అత్యంత ప్రధానమైనది. యుద్ధంలో గెలిచి నిలిచిన ప్రజానాయకుల రాజకీయ జీవితాలలో అపజయాలు ఉన్నప్పటికీ చరిత్ర వాటిని పెద్దగా పట్టించుకోదు. దేశాల చరిత్రను మలుపు తిప్పినవారికి పెద్ద పీట వేస్తుంది. దేశ తొమ్మిదవ ప్రధాని పాములపర్తి వేంకట నరసింహారావు (పీవీ) చేసిన యుద్ధం సరిహద్దులో కాదు, విపణిలో. ప్రజల మస్తిష్కాలలో. దిగజారిన ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు పీవీ చేసిన పోరాటం చరి త్రాత్మకమైనది. బాబరీమసీదు విధ్వసం, జార్ఖండ్ ముక్తిమోర్చా పార్లమెంటు సభ్యుల కొనుగోలు వ్యవహారం, సెయెంట్ కిట్స్ కేసు, హర్షద్ మెహతా ఉదంతం, లక్కూభాయ్ పాఠక్ కేసు వంటి నిందలు వచ్చినప్పటికీ ఆయన స్వయంగా కోర్టులకు హాజరై నిర్దోషిగా నిరూపించుకున్న తర్వాతనే కన్నుమూశారు. తక్కిన కేసుల సంగతి ఏమైనా, జేఎంఎం ఎంపీల ముడుపుల వ్యవహారం మాత్రం పీవీకి తెలియకుండా జరిగే అవకాశం లేదు. 1993 జులైలో లోక్‌సభలో బలపరీక్ష జరిగినప్పుడు పీవీ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా 244 మంది సభ్యులు ఉన్నారు. బలపరీక్షలో నెగ్గాలంటే 269 సభ్యులు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు చేయాలి. విపక్షాలలో చీలిక తెచ్చి, ఏదో ఒక చాణక్యం చేసి ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవలసిన అవసరం ఉన్నదని, ఆర్థిక సంస్కరణలు గాడి తప్పకుండా ఉండాలంటే రాజ కీయ, నైతిక విలువలతో రాజీపడక తప్పదని పీవీ భావించారు. కేరళ మాజీ ముఖ్యమంత్రి కరుణాకరన్, మరో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బూటాసింగ్లకు ప్రభుత్వాన్ని గట్టెక్కించే బాధ్యత అప్పగిం చారు. జెఎంఎం ఎంపీలనూ, జనతాదళ్‌లో అజిత్ సింగ్ వర్గీయులనూ సుముఖులను చేసుకున్నారు. టీడీపీని చీల్చారు. ములాయంసింగ్ మద్దతు సైతం స్వీకరించారు. ప్రభుత్వానికి అనుకూలంగా 265 ఓట్లూ, వ్యతిరేకంగా 251 ఓట్లూ వచ్చాయి. ఆ రోజున ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు పీవీ చేసింది నైతికంగా తప్పే అయినప్పటికీ, అప్పుడు కనుక ప్రభుత్వం కూలిపోయి ఏ దేవగౌడ వంటి నాయకుడో ప్రధానిగా వచ్చి ఉంటే ఆర్థిక సంస్కరణలు దిశ కోల్పోయేవి. చరిత్ర మరోరకంగా ఉండేది. ఆరోపణలు కానీ, కోర్టు కేసులు కానీ, నైతిక తప్పిదాలు కానీ, బాబ్రీమసీదు వంటి కీలకమైన అంశంలో వైఫల్యం కానీ పీవీ సాధించిన ఆర్థిక విజయం ముందు దిగదుడుపే. చరిత్ర పీవీని దేశంలో లైసెన్స్–పర్మిట్ రాజ్ నడ్డివిరిచి ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన దార్శనికుడిగానే నమోదు చేస్తుంది. పంజాబ్‌లో ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేసిన ఖ్యాతి కూడా ఆయనకు దక్కుతుంది. అందుకే ఆయనకు సముచితమైన స్థానం కేటాయిస్తుంది. హైదరాబాద్ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో ప్రధానకార్యదర్శిగా చేరి 1951లో రాజకీయ జీవితం ఆరంభించిన పీవీ ఎంఎల్ఏగా, ఎంపీగా అనేక పర్యాయాలు గెలుపొందారు. రాష్ట్రమంత్రిగా పని చేశారు. ముఖ్యమంత్రిగా భూసంస్కరణలు అమలు చేసి భూస్వాములు ఆగ్రహానికి గురైనారు. జైఆంధ్ర ఉద్యమం కారణంగా పదవి నుంచి వైదొలిగారు. తర్వాత ఢిల్లీ వెళ్ళి ఇందిరాగాంధీ కొలువులో ముఖ్యమైన పాత్ర పోషించారు. బహుభాషాకోవిదుడిగా, రచనావ్యాసంగంలో దిట్టగా పేరుప్రఖ్యాతులు కలిగిన పీవీ ఏఐసీసీ సమావేశాలలో తీర్మానాల రూపకల్పన బాధ్యత నిర్వహించేవారు. కాంగ్రెస్ నాయకుడిగా అనేక పనులు చేస్తూనే విశ్వనాథవారి వేయిపడగలు హిందీలో సహస్రఫణ్‌గా అనువదించారు. ప్రణబ్ ముఖర్జీ లేక మరెవరైనా తీర్మానం రాసినా దాన్ని చదివి పీవీ ఆమోదించిన తర్వాతే ఇందిరాగాంధీ కానీ రాజీవ్‌గాంధీ కానీ చర్చకు పెట్టేవారు కాదు. కేంద్రమంత్రిగా అనేక శాఖలు నిర్వహించారు. అన్ని శాఖలలో రాణించారంటే అబద్ధం అవుతుంది. మానవ వనరుల అభివృద్ధి శాఖనూ, విదేశీ వ్యవహారాల శాఖనూ అద్భుతంగా నిర్వహించారు. ఏ శాఖ నిర్వహించినా, ఏ పని చేసినా సృజనాత్మకంగా ఆలోచించి, కొత్త పోకడలు పోవడం, అదనపు విలువను జోడించడం పీవీ ప్రత్యేకత. స్వరాష్ట్రంలో జైళ్ళ శాఖను నిర్వహించినప్పుడు బహిరంగజైలు పద్ధతికి శ్రీకారం చుట్టారు. విద్యాశాఖను పర్యవేక్షించినప్పుడు గురుకుల విద్యావిధానాన్ని ప్రవేశపెట్టారు. కేంద్ర మావన వనరుల మంత్రిగా నవోదయ పాఠశాలలు నెలకొల్పారు. విదేశాంగ మంత్రిగా వందకు పైగా దేశాలను సందర్శించడమే కాకుండా చైనాతో చాలా ముఖ్యమైన ఒప్పందం కుదుర్చుకున్నారు. సరిహద్దు సమస్యపై చర్చలు కొనసాగిస్తూనే ఇతర రంగాలలో ద్వైపాక్షిక సంబంధాలు పెంపొందించుకోవాలని ఇండియా–చైనా పీస్ అండ్ ట్రాంక్విలిటీ అగ్రిమెంట్‌పై బీజింగ్‌లో సంతకాలు చేశారు. ఫలితంగా అప్పటి నుంచి మొన్నటి వరకూ భారత్–చైనా సరిహద్దు ప్రశాంతంగా ఉంది. వాణిజ్యం ఇబ్బడిముబ్బడిగా అభివృద్ధి చెందింది. వాణిజ్యంలో పరిస్థితి చైనాకు అనుకూలంగా ఉన్నట్టు కనిపిస్తుంది. చైనాకు భారత్ ఎగుమతుల విలువ కంటే దిగుమతుల విలువ పది రెట్లు ఎక్కువ. నిజమే. కానీ చైనా ఎగుమతులలో 3.5 శాతం కంటే తక్కువే భారత్‌కు చేరుతున్నాయి. భారత్ ఎగుమతులలో 5 శాతానికి పైగా చైనాకు చేరుతున్నాయి. మన ఆర్థిక వ్యవస్థ కంటే చైనా ఆర్థిక వ్యవస్థ దాదాపు అయిదు రెట్లు ఎక్కువ అనే వాస్తవాన్ని గుర్తు పెట్టుకుంటే చైనా వస్తువులను బహిష్కరించాలనీ, చైనాతో వాణిజ్య సంబంధాలు తెగతెంపులు చేసుకోవాలనీ ఎవ్వరూ వాదించరు. చైనాతో సమస్యను సామరస్యంగా పరిష్కరించుకొని ఎగుమతులను పెంచుకోవడం శ్రేయస్కరం. 1993లో చైనాతో పీవీ కుదుర్చుకున్న ఒప్పందం ఉభయతారకమైనది. దూరదృష్టితో చేసుకున్నది. నెహ్రూ అలీనోద్యమ నిర్మాతగా ప్రపంచ ప్రసిద్ధి గడించినప్పటికీ పక్కనే ఉన్న తూర్పు ఆసియా దేశాలతో సంబంధాలను పెద్దగా పట్టించుకోలేదు. భారత దేశానికి తూర్పు దిశగా ఉన్న సింగపూర్, మలేసియా, ఇండోనీసియా వంటి దేశాలు ఆర్థికంగా అభివృద్ధి చెంది ఆసియన్ టైగర్లుగా అంతర్జాతీయ విపణిలో గాండ్రిస్తుంటే ఆ దేశాలను విస్మరించడం సరి కాదని లుక్ ఈస్ట్ పాలసీని పీవీ ప్రతిపాదించారు. తూర్పు ఆసియా దేశాలతో సంబంధాలను పెంపొందించారు. వాణిజ్యం సంబంధాలను వృద్ధి చేశారు. ఇప్పుడు నరేంద్రమోదీ సర్కార్ అదే పాలసీని యాక్ట్ ఈస్ట్ పాలసీగా మరింత పదును పెట్టి అమలు చేస్తున్నది. ప్రధానిగా పీవీ ప్రమాణస్వీకారం చేసినప్పటి దేశ ఆర్థికస్థితి ఎట్లా ఉన్నది? రెండు వారాల దిగుమతులకు మాత్రం చెల్లించడానికి సరిపోను విదేశీమారకద్రవ్యం ప్రభుత్వ ఖజానాలో ఉంది. రెండు వారాలు దాటితే దిగుమతులకు డబ్బు చెల్లించలేని డిఫాల్టర్‌గా మిగి లిపోయే దుస్థితిలో దేశం ఉండేది. ప్రమాణస్వీకారం చేసి ఇంటికి వచ్చిన వెంటనే మన్మోహన్ సింగ్‌కు ఫోన్ చేసి పిలిపించుకున్నారు. భయపడుతున్న మన్మోహన్ సింగ్‌కు ధైర్యం నూరిపోసి, తాను అండగా ఉంటానని నచ్చజెప్పి ఆర్థికమంత్రిగా చేర్చుకున్నారు. పరిశ్రమల శాఖను తన దగ్గరే ఉంచుకున్నారు. నాటి ఆర్థికశాఖ సహాయమంత్రి (అనంతరం రాజ్యసభ ఉపాధ్యక్షుడు) కురియన్ చేత పరిశ్రమల విధానాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టించారు. రూపాయి విలువను 18 శాతం తగ్గించారు. లండన్ బ్యాంక్‌కి బంగారం నిల్వలు తరలించి విదేశీ మారక ద్రవ్యం సంపాదించారు. మోనోపలీస్ అండ్ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ (ఎంఆర్ టీపీ) చట్టాన్ని రద్దు చేసి లైసెన్స్ –పర్మిట్ రాజ్‌కు భరతవాక్యం పాడారు. దిగుమతి సుంకాలనూ, ఆదాయం పన్నునూ, కార్పొరేట్ పన్నునూ క్రమంగా తగ్గించారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించారు. విదేశీ పెట్టుబడులను ఉదారంగా అనుమతించారు. ఫలితంగా 1992–97 ప్రణాళికా కాలంలో ఆర్థికాభివృద్ధి రేటు సగటున 6.5 శాతం సాధించారు. ఇది అపూర్వం. పీవీ అధికారంలో ఉన్న చివరి రెండేళ్ళలో ఆర్థికాభివృద్ధి రేటు 7.5 శాతం. 1991లో అడుగంటిన విదేశీమారక ద్రవ్యం 1995 నాటికి 25.1 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకున్నది. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ పేరు తెచ్చుకున్నది. ఈ రోజున దేశం కరోనా కల్లోలంలో సైతం ఈ మాత్రం నిలబడి ఉందంటే అందుకు కారణం 1991లో పీవీ నాటిన బీజమే. పీవీ నిరాడంబరజీవి. ఆయనపైన ఎన్ని ఆరోపణలు వచ్చినా వ్యక్తిగతంగా అవినీతిపరుడని ఆయన బద్ధశత్రువులు కూడా అనరు. 1991 నాటికి సుదీర్ఘమైన తన రాజకీయ జీవితానికి స్వస్తి చెప్పి హైదరాబాద్ తిరిగి వచ్చి రామానందతీర్థ ఆశ్రమంలోనో, కుర్తాళం పీఠాధిపతిగానో సమాజ సేవ చేయాలనే సంకల్పంతోనే పీవీ ఎన్నికలలో పోటీ చేయలేదు. ఎన్నికలలో మొదటి దశ పూర్తయిన తర్వాత రెండవ దశ ప్రచారంలో భాగంగా విశాఖపట్టణం నుంచి శ్రీపెరంబదూరు వెళ్ళిన రాజీవ్ గాంధీని ఎల్టీటీఈ హంతకి మానవబాంబు రూపంలో వచ్చి పాదాల దగ్గర పేలిపోయి హత్య చేసిన కారణంగా రెండవ దశ పోలిం గ్లో ఎక్కువ స్థానాలు సంపాదించిన కాంగ్రెస్‌కు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం వచ్చింది. దుఃఖంలో మునిగిపోయిన సోనియాగాంధీ నమ్మకస్తుల మాట నమ్మి ముందు శంకర్ దయాళ్ శర్మకు కబురు పెట్టారు. ప్రధానమంత్రి వంటి గురుతర బాధ్యత నిర్వహించే ఆరోగ్యం తనకు లేదని ఆయన ఆహ్వానాన్ని మృదువుగా తిరస్కరించారు. శర్మకు ముసలితనంతోపాటు ఆరోగ్యం కూడా సరిగా లేదు కనుక పీవీకి ప్రధాని బాధ్యతలు అప్పగిస్తే సరిపోతుందని అర్జున్‌సింగ్ చేసిన సూచనను సోనియా అమలు పరిచిందని శరద్ పవార్ తన ఆత్మకథలో రాశారు. అలెగ్జాండర్ ఆత్మకథ ప్రకారం పీవీ పేరు సూచించిన వ్యక్తి హక్సర్. తన మాట జవదాటకుండా వ్యవహరిస్తారనే ఉద్దేశంతోనే సోనియా పీవీకి అవకాశం ఇచ్చి ఉండవచ్చు. పీవీ ప్రధానమంత్రిగా ఆత్మగౌరవంతో, స్థిరచిత్తంతో వ్యవహరిస్తూనే సోనియా పనులన్నీ చేయడానికి చిదంబరంను పురమాయించారు. కానీ అర్జున్‌సింగ్, ఎన్డి తివారీ, శివశంకర్, మాధవరావ్ సింథియా వంటి నాయకుల మాటలు విశ్వసించి పీవీ పట్ల వ్యతిరేకత పెంచుకున్న సోనియా కాంగ్రెస్ ప్రధానిగా ఐదేళ్ళు పని చేసిన వ్యక్తికి గౌరవం ఇవ్వలేదు. పీవీ పార్థివకాయాన్ని ఏఐసీసీ ప్రాంగణంలో ఉంచడానికి అనుమతించకుండా అవమానిం చారు. 1996లో ఘోర ఓటమి తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేసిన పీవీ రాజకీయంగా ఒంటరి జీవితం గడిపారు. కోర్టు కేసులు ఎదుర్కొంటూ, లాయర్ ఫీజు చెల్లించడానికి డబ్బులేక ఇబ్బం దిపడిన సందర్భాలు సన్నిహితులకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ పీవీని మాజీ ప్రధానిగా కూడా గుర్తించక పోయినా దేశ ప్రజలు ఆయన చేసిన సేవను ఎన్నటికీ మరచిపోరు. ఏళ్లు గడిచినకొద్దీ దేశానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపు పెరుగుతూ వస్తోంది. రాజకీయ జీవితం పూర్తయిం దని భావించిన తరుణంలో చరిత్ర ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తన దేశానికి ఆర్థికరంగంలో నూతన దిశా నిర్దేశం చేసిన సమర్థుడైన ప్రధానిగా పీవీ చరిత్రలో నిలిచిపోతారు. వ్యాసకర్త: కె.రామచంద్రమూర్తి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు -
మ్యూజియంగా పీవీ ఇల్లు
భీమదేవరపల్లి: మాజీ ప్రధాని దివంగత పీవీ నర్సింహారావు స్వగ్రామమైన వరంగల్ అర్బన్ జిల్లా వంగరలోని ఆయన స్వగృహం మ్యూజియంగా మారనుంది. పీవీ శతజయంతి ఉత్సవాల నేపథ్యంలో ఆయన స్మారకార్థం ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఇందులో పీవీ ఉపయోగించిన 150 వస్తువులు ప్రదర్శనకు ఉంచుతారు. వచ్చే నెల 13, 14, 15 తేదీల్లో నూతన గృహప్రవేశంతో పాటు మ్యూజియాన్ని గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ చేత ప్రారంభించేందుకు కుటుంబీకులు ప్రయత్నిస్తున్నారు. -
‘పీవీ’... ఠీవీ
సనత్‌నగర్: అక్కడ పీవీ జ్ఞాపకాలు అడుగడుగునా స్పృశిస్తాయి. భౌతికంగా తాను లేకపోయినా ఆయన అందించిన స్మృతులకు నెలవు అది. ఆయన ఠీవీకి నిలువెత్తు సాక్ష్యం అది. ఆనాడు ప్రధానమంత్రి హోదాలో ఆయన ఉపయోగించిన అంబాసిడర్ కారు దగ్గర నుంచి..ఆయన చదివిన, ఆయన సేకరించిన ప్రతి పుస్తకం అక్కడ పదిలం. చట్టసభల్లో చేసిన డిబేట్స్, అక్కడ చేసిన శాసనాలు..ఇలా రీసెర్చ్ స్కాలర్స్‌కు ఆయుధంగా మలిచే పీవీ స్మారక విజ్ఞాన భండాగారం అక్కడ కొలువై విజ్ఞాన సంపత్తికి కేరాఫ్‌గా మారింది. మహాత్మాగాంధీ, అంబేద్కర్, జవహర్లాల్ నెహ్రు, సర్దార్ వల్లభాయ్‌పటేల్, స్వామి వివేకానంద, సుభాష్‌చంద్రబోస్...ఇలా ఎందరో మహోన్నతుల జీవిత గ్రంథాలు ఆ భండాగారంలో మది మదినీ తట్టిలేపుతాయి. భారతావాని దశ దిశను మార్చేలా లోక్‌సభ, రాజ్యసభలో తీసుకున్న నిర్ణయాలు అక్కడ నిక్షిప్తమై చరిత్రకు ఆలవాలంగా నిలుస్తాయి.. దేశాల మధ్య కొనసాగుతున్న సంబంధ బంధవ్యాలు ఇక్కడ గ్రంథరాజల్లో భద్రంగా ఉన్నాయి. న్యాయ పరిపరిపాలన శాస్త్రాలు...కాళోజీ కవితలు, గొల్లపూడి మారుతీరావు, కాశీపట్నం రామారావు, కృష్ణశాస్త్రిల సాహిత్యం, పురాణేతిసాహాలు. ఆధ్యాత్మికం...ఇలా సకల గ్రంథాల సమాహారంగా ఆ గ్రంథాలయం విరాజిల్లుతోంది. పదులు, వందలు కాదు...అక్షరాలా పది వేలకు పైగా పుస్తకాలతో విజ్ఞాన కేంద్రంగా భాసిల్లుతోంది. అవన్నీ కూడా బహుబాషా కోవిదుడు, మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావు సేకరించుకున్న పుస్తకాలే. మాజీ ప్రధానమంత్రిగా, రాజకీయ నేతగా మాత్రమే పీవీ అందరికీ తెలుసు..కానీ ఆయన ఓ సాహితీ పిపాసి అని కొద్ది మందికే తెలుసు. ఆయన సేకరించిన ఆ పుస్తకాలను చూస్తే ఆయనలోని సాహితీ విలువలకు అద్దంపడుతోంది. ఇంతకీ పీవీ జ్ఞాపకాల దొంతర్లు కొలువుదీరిన ప్రాంతం ఏదనేగా..మీ ప్రశ్ప. అదే బేగంపేట బ్రాహ్మణవాడీ లేన్–9లోని స్వామి రామానందతీర్థ మెమోరియల్ కమిటీ ప్రాంగణం. ఇప్పటికీ చెక్కుచెదరని అంబాసిడర్... పీవీ నరసింహారావు ఢిల్లీలో ఉపయోగించిన అంబాసిడర్ కారు ఇప్పటికీ ఇక్కడ ప్రాంగణంలో చెక్కు చెదరకుండా ఉంది. డీఎల్ 2సీ జీ 4395 నెంబర్ రిజిస్ట్రేష¯Œన్ కలిగిన అంబాసిడర్ కారు స్వామి రామానంద తీర్థ మోమోరియల్ కమిటీ భవనం ప్రవేశ ద్వారం వద్దనే దర్శనమిస్తుంది. ప్రతిరోజూ కారును అక్కడ సిబ్బంది తుడవడం దినచర్యలో భాగం. ఎన్నెన్నో భాషలు...అన్నింటా సాహిత్యాలు... పీవీ నర్సింహారావు అనర్గళంగా మాట్లాడే భాషలు ఎన్ని ఉన్నాయో అంతకుమించి భాషల్లోనూ ఇక్కడ పుస్తకాలు ఉన్నాయి. ఇంగ్లీష్, తెలుగు, హిందీ, మరాఠి, కన్నడ, సంస్కృతం, మళయాళం, ఉర్దూ భాషలతో పాటు ఫ్రెంచ్, రష్యన్, స్పానిష్ వంటి దాదాపు దేశ, విదేశాలకు చెందిన 20 భాషలకు చెందిన పుస్తకాలు ఇక్కడ చూడవచ్చు. ఎక్కువ శాతం పీవీ నర్సింహారావు స్వయంగా కొనుగోలు చేయగా, చాలామంది ఆయనకు గిఫ్ట్‌గా ఇచ్చారు. 1950లో కొనుగోలు చేసిన పుస్తకాలు కూడా ఇక్కడ లభిస్తాయి. ఇక్కడి చాలా పుస్తక ధరలు అణాల్లో చూడవచ్చు. సకల శాస్త్రాలకు కేరాఫ్... లోక్‌సభ, రాజ్యసభల్లో జరిగిన డిబేట్స్, ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, దేశభక్తి నాయకులపై రాసిన గ్రంథాలు, ఆయా మహనీయుల బయోగ్రఫీలు, అంతర్జాతీయంగా పేరెన్నిక గన్న రచయితలు రాసిన సాహిత్య పుస్తకాలు, హైదరాబాద్ స్వాతంత్య్రోద్యమ చరిత్ర, కాంగ్రెస్ చరిత్ర, జీవిత సత్యాలను ప్రతిబింబించే భారత, భాగవతం, రామాయణ గ్రంథాలు, కంప్యూటర్ రంగ పరిజ్ఞానాన్ని పంచే పుస్తకాలు, సత్యసాయిబాబా, షిర్డిసాయిబాబా, అహోబిల స్వామిలతో పాటు ఎందరో స్వాముల ఆధ్యాత్మిక ప్రవచనాలు, యోగా వాసిష్టం, మలయాళ సద్గురు గ్రంథం, తెలుగు పౌరాణిక సాహిత్యం, ఆంధ్ర మహా గ్రంధం, చైతన్య రామాయణం, న్యాయశాస్త్రాలు, ఐక్యరాజ్యసమితి నిర్ణయాలు.. ఇలా అన్ని రంగాలకు సంబంధించిన పుస్తకాలు ఇక్కడ కొలువుదీరాయి. అలాగే పీవీ ముందస్తు మాటలను రాసిన పుస్తకాలు ఇక్కడ వందల్లో ఉంటాయి. ఇది అరుదైన పుస్తకాల వేదిక లైబ్రరీలో ఉన్న పుస్తకాల పేర్లను ఓ రిజిస్ట్రర్‌లో రాస్తున్నాను. ఇప్పటికి పది వేలకు పైగా పుస్తకాలు ఇండెంట్లో పొందుపర్చాను. ఇంకా ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. ఒక్కో పుస్తకం చూస్తుంటే లక్షలు, కోట్లు పెట్టినా కొనలేని విజ్ఞానం సంపాదించుకోవచ్చని కలుగుతుంది. దేశంలోనే అరుదైన పుస్తకాలకు ఇదో వేదిక అని ఖచ్చితంగా చెప్పగలను.– చీకోలు సుందరయ్య, లైబ్రరీ పర్యవేక్షకుడు.. రీసెర్ ్చ స్కాలర్స్‌కు ఆయుధంగా... పీవీ స్మారక గ్రంథాలయం రీసెర్చ్ స్కాలర్స్‌కు ఎంతగానో ఉపయోగపడుతుంది. చరిత్రలో దాగి ఉన్న ఎన్నో విశేషాలను ఇక్కడి పుస్తకాల ద్వారా తెలుసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీలకు చెందిన విద్యార్థులు ఇక్కడి గ్రంథాలయం గురించి తెలుసుకుని ఇక్కడకు వచ్చి పుస్తకాల ద్వారా విజ్ఞాన సముపార్జన చేస్తూ తమ రీసెర్చ్‌ను కొనసాగిస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఎక్కడా దొరకని సమాచారం కూడా ఇక్కడ లభిస్తుందంటే అతిశయోక్తి కాదు. -
నెహ్రూను మించిన ప్రధాని పీవీ
సాక్షి, హైదరాబాద్: జవహర్లాల్ నెహ్రూను మించిన ప్రధాని పీవీ నరసింహారావు అని బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ మాజీ వీసీ ఆర్వీఆర్ చంద్రశేఖర్‌రావు కొనియాడారు. సోమవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్లో జరిగిన కార్యక్రమం సందర్భంగా పీవీకి సన్నిహితుడిగా తన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. పీవీ నరసింహారావు బహుబాషా కోవిదుడే కాదని, బహుముఖ ప్రజ్ఞాశాలి అని పేర్కొన్నారు. లండన్‌లో జరిగిన లీడర్షిప్ ఇన్ సౌత్ ఏషియా కాన్ఫరెన్స్‌లో పీవీ చేసిన ప్రసంగం అందర్నీ ఆకట్టుకుందని, ఆయన ప్రసంగాన్ని కొనసాగించేందుకు కాన్ఫరెన్స్‌ను మరో రోజు పొడిగించడం ఆయన గొప్పతనానికి నిదర్శనమని చెప్పారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ మాట్లాడుతూ.. పీవీకి అనుకోకుండా పదవులు వచ్చినా.. అంకితభావంతో పనిచేశారని కొనియాడారు. పీవీని ప్రధానిగా కాంగ్రెస్ ప్రకటించే సమయంలో తాను ఢిలీల్లో ఉన్నానని, ఈ విషయాన్ని ఎన్టీఆర్‌కు చెప్పగా, తెలుగు వ్యక్తి ప్రధాని కావడంపై ఆయన ఎంతో సంతోషించారన్నారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని ఆయన మనవడు ఎన్వీ సుభాష్ ప్రభుత్వాన్ని కోరారు. సీనియర్ జర్నలిస్టు కె.రామచంద్రమూర్తి ఏటా ఈ కార్యక్రమం నిర్వహించడం హర్షణీయమని పేర్కొన్నారు. -
'సిక్కుల ఊచకోత జరిగేది కాదు'
న్యూఢిల్లీ : ఐకే గుజ్రాల్ సలహా నాటి కేంద్ర హోం మంత్రి పీవీ నరసింహారావు విని ఉంటే, 1984 నాటి సిక్కుల ఊచకోత చోటు చేసుకునేదే కాదని మాజీ ప్రధాని మన్మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్ సంస్మరణ సభలో గురువారం మన్మోహన్ మాట్లాడారు. ‘1984లో ఆ విషాదకర సంఘటన జరిగిన రోజే.. గుజ్రాల్నాటి హోంమంత్రి పీవీ నరసింహారావు వద్దకు వెళ్లారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉందని, తక్షణమే ఆర్మీని మోహరిస్తే మంచిదని పీవీకి సలహా ఇచ్చారు. ఆ సలహాను పీవీ పాటించి ఉంటే, సిక్కుల ఊచకోత జరిగి ఉండేది కాదు’ అని మన్మోహన్ వ్యాఖ్యానించారు. మన్మోహన్ వ్యాఖ్యలపై బీజేపీ స్పందిస్తూ.. అంత చెడ్డవాడైన పీవీ కేబినెట్లో ఆరి్థకమంత్రిగా ఎందుకు పనిచేశారని మన్మోహన్‌ను ప్రశి్నంచింది. ఇప్పటికైనా వాస్తవం బయట పెట్టినందుకు మన్మోహన్‌కు కృతజ్ఞతలని ఐకే గుజ్రాల్ కుమారుడు అకాలీదళ్ నేత నరేశ్ గుజ్రాల్ వ్యాఖ్యానించారు. ఊచకోత బాధ్యతను రాజీవ్ గాంధీ నుంచి తప్పించేందుకు చేసిన వ్యాఖ్య ఇదని శిరోమణి అకాలిదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ పేర్కొన్నారు. మన్మోహన్ వ్యాఖ్యలపై స్పందించేందుకు కాంగ్రెస్ నిరాకరించింది. -
‘అయోధ్యపై నివేదికను పీవీ తిరస్కరించారు’
న్యూఢిల్లీ: అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేసే సమయంలో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు చాకచక్యంగా వ్యవహరించి ఉంటే మసీదు కూల్చివేత ఉండేది కాదని అప్పటి హోంశాఖ కార్యదర్శి మాధవ్ గాడ్బొలే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మసీదు కూల్చివేతకు ముందు హోంమంత్రిత్వ శాఖ రూపొందించిన నివేదికను పీవీ తిరస్కరించారని పేర్కొన్నారు. ‘ప్రధాని పదవిలో ఉన్న పీవీ.. రాజకీయ చొరవ తీసుకుని ఉంటే ఆ సంఘటన జరగకుండా ఉండేది’అని అయోధ్య వివాదంపై గాడ్బొలే రాసిన ‘ది బాబ్రీ మసీద్–రామ మందిర్ డైలెమా: ఆన్ యాసిడ్ టెస్ట్ ఫర్ ఇండియాస్ కాన్స్టిట్యూషన్’అనే కొత్త పుస్తకంలో వెల్లడించారు. ఈ వివాదాస్పద కూల్చివేతకు ముందు తర్వాత సంఘటనలను ఆయన ఈ పుస్తకంలో పొందుపరిచారు. ప్రధాని పీవీ ఆ సమయంలో అత్యంత కీలక పాత్ర పోషించారని, అయితే దురదృష్టవశాత్తు ఆయనొక అసమర్థ కెప్టెన్‌గా మిగిలిపోయారని విమర్శించారు. గతంలో ప్రధాన మంత్రులుగా పనిచేసిన రాజీవ్ గాంధీ గానీ, వీపీ సింగ్ గానీ ఈ వివాద పరిష్కారంలో తమ సరైన వైఖరిని తెలియజేయలేదన్నారు. -
అందుకే పీవీని పక్కకు పెట్టారు : ఎన్వీ సుభాష్
సాక్షి, హైదరాబాద్ : గాంధీ - నెహ్రూ కుటుంబానికి ప్రాధాన్యం తగ్గుతుందనే ఉద్దేశంతోనే.. పీవీ నరసింహరావును పక్కకు పెట్టారని ఆయన మనవడు సుభాష్ ఆరోపించారు. నేడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 98వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు సుభాష్. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పీవీకి కాంగ్రెస్ పార్టీ తగిన గుర్తింపు ఇవ్వలేదనీ, అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ విషయంలో పీవీ నరసింహరావుకు క్షమాపణలు చెప్పాలని సుభాష్ డిమాండ్ చేశారు. రాజీవ్ గాంధీ తర్వాత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన పీవీ.. అస్తవ్యస్తంగా మారిన దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగు పర్చడానికి కృషి చేశారన్నారు. నాడు పీవీ తీసుకున్న నిర్ణయాలే నేటి దేశ ఆర్థిక ప్రగతికి కారణమన్నారు. ఈ విషయాన్ని నరేంద్ర మోదీ కూడా గుర్తించారు. ప్రశంసించారు. కానీ సొంత పార్టీ వారు మాత్రం పీవీ ప్రతిభను గుర్తించకపోవడం దారుణం అన్నారు. ప్రభుత్వం విజయాల్ని తమ విజయాలుగా కాంగ్రెస్ నేతలు చెప్పుకున్నారనీ, ప్రభుత్వ వైఫల్యాల్ని మాత్రం పీవీ వైఫల్యాలుగా చిత్రీకరించారని సుభాష్ విమర్శించారు. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలోకి పీవీ పార్థివ దేహాన్ని తీసుకెళ్లేందుకు అనుమతించలేదన్న వాస్తవం సాక్ష్యాధారాలతో సహా ఉందన్నారు సుభాష్. ఒక్క పీవీది తప్ప మిగతా మాజీ ప్రధానుల సమాధులన్నీ ఢిల్లీలో ఉన్నాయనీ, కాంగ్రెస్ నేతలు చూపించే విరుద్ధ వైఖరికి ఇదే సాక్ష్యం అన్నారాయన. నేడు పీవీ జయంతి సందర్భంగా బీజేపీ, టీఆర్ఎస్, టీడీపీ ఇతర పార్టీల నాయకులు ఆయనకు నివాళులర్పించారని.. కానీ కాంగ్రెస్ నాయకులు మాత్రం ఆయనను పట్టించుకోలేదని వాపోయారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు, గాంధీ కుటుంబం తాము చేసిన తప్పును ఒప్పుకొని... పీవీకి చేసిన అన్యాయానికి క్షమాపణ చెప్పాలని కోరారు సుభాష్. -
పీవీపై వ్యాఖ్యలు.. చిన్నారెడ్డిపై హైకమాండ్ ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్ : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, దివంగత ప్రధాని పీవీ నర సింహారావులను ఉద్దేశించి ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘకాలం సేవలందించిన నేతలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం ఏమిటని మండిపడింది. దీనిపై తక్షణమే క్షమాపణ లు చెప్పాలని, ఏ సందర్భంలో అలా అనాల్సివచ్చిం దో వివరణ ఇవ్వాలని సూచించినట్లు తెలిసింది. బుధవారం చిన్నారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ‘తిన్నింటి వాసాలు లెక్కపెట్టిన వ్యక్తి పీవీ’ అని విమర్శించారు. నాగ్‌పూర్‌లో ఆరెస్సెస్ సభకు వెళ్లి, సంఘ్ భావజాలాన్ని ప్రశంసించినందుకే ప్రణబ్‌కు బీజేపీ భారత రత్నతో సత్కరించిందని అన్నారు. దీనిపై పార్టీలో రాజకీయ దుమారం రేగింది. పార్టీ లోని కొందరు ఈ వ్యాఖ్యలను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, సీనియర్ నేత అహ్మద్ పటేల్‌ల దృష్టికి తీసుకెళ్లారు. ఇతర సీనియర్ నేతలతో దీనిపై చర్చించిన హైకమాండ్ పెద్దలు దీనిపై వివర ణ ఇవ్వాలని చిన్నారెడ్డికి సూచించారు. వారి ఆదేశాల మేరకు ఆయన వివరణతో కూడిన ప్రకటనను గురువారం విడుదల చేశారు. పీవీ నరసింహారావు, ప్రణ బ్ ముఖర్జీలు అంటే తనకు అపారమైన గౌరవమని, వారు గొప్ప మేధావులు కావడం వల్లనే కాంగ్రెస్ పార్టీ వారికి గొప్ప అవకాశాలు ఇచ్చిందని చిన్నారెడ్డి అందులో పేర్కొన్నారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ పీవీ, ప్రణబ్‌లను కాంగ్రెస్ అవమానించిందని అన డం రాజకీయమని, కాంగ్రెస్ వారికి గొప్ప గౌరవం ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయాలు బీజేపీకి ఎందుకని తాను ప్రశ్నించానని అంతే కాని పీవీ, ప్రణబ్‌లను అవమానించాలనే ఉద్దేశ్యం తనకు లేదని, వారంటే తనకు ఎంతో అభిమానం, గౌరవం ఉందని తెలిపారు. ఈ విషయంలో అపార్థాలు చోటు చేసుకున్నాయని తన వ్యాఖ్యల పట్ల ఎవరైనా బాధ పడితే అందుకు చింతిస్తున్నానని పేర్కొన్నారు. -
మాజీ ప్రధాని పీవీకి మోదీ నివాళి
సాక్షి, న్యూఢిల్లీ : దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 98వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం నివాళులు అర్పించారు. పాలనా వ్యవహారాల్లో దిగ్గజ నేతగా పేరొందిన పీవీ దేశాన్ని సంక్లిష్ట పరిస్ధితుల్లో దీటుగా ముందుకు నడిపారని కొనియాడారు. ఆయన చేపట్టిన చర్యలు దేశ పురోగతికి బాటలువేశాయని మోదీ ట్వీట్ చేశారు. దేశ తొమ్మిదో ప్రధానిగా 1991 జూన్‌లో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన పీవీ 1996 మే వరకూ అధికారంలో కొనసాగారు. దేశ అభివృద్ధికి అవరోధంగా నిలిచిన లైసెన్స్ రాజ్‌ను తొలగించడంతో పాటు సంస్కరణలు ప్రవేశపెట్టి ఆర్థిక వ్యవస్ధను కొత్తపుంతలు తొక్కించిన ఘనత పీవీ నరసింహరావుకు దక్కింది. -
పీవీపై అనుచిత వ్యాఖ్యలు : చిన్నారెడ్డి వివరణ
సాక్షి, హైదరాబాద్ : మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు, మాజీ రాష్ట్ర పతి ప్రణబ్ ముఖర్జీ లు అంటే తనకు అపారమైన గౌరవమని, వాళ్ళు గొప్ప మేధావులు కావడం వల్లనే కాంగ్రెస్ పార్టీ వాళ్లకు గొప్ప అవకాశాలు ఇచ్చిందని ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి అన్నారు. పీవీ నర్సింహారావు, ప్రణబ్ ముఖర్జీ లపై బుధవారం తాను చేసిన ప్రకటనలపై వివరణ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ పివి, ప్రణబ్ లను కాంగ్రెస్ అవమానించిందని అనడం రాజకీయమని, కాంగ్రెస్ పార్టీ వారికి గొప్ప గౌరవం ఇచ్చిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయాలు బీజేపీకి ఎందుకని తాను ప్రశ్నించానే తప్ప వాళ్ళను అవమానించాలనే ఉద్దేశ్యం తనకు లేదన్నారు. పీవీ, ప్రణబ్ అంటే ఎంతోఅభిమానం, గౌరవం ఉందని అన్నారు. తన వాఖ్యలపై కొంతకొంత అపార్థాలు చోటు చేసుకున్నాయని, ఎవరైనా బాధ పడితే చింతిస్తున్నానని అన్నారు. పివి, ప్రణబ్ లు ఎప్పటికైనా కాంగ్రెస్ గౌరవించే నేతలని ఆయన వివరణ ఇచ్చారు. (చదవండి : పీవీపై కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి అనుచిత వాఖ్యలు) కాగా బుధవారం చిన్నారెడ్డి పీపీ, ప్రణబ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ప్రధాన మంత్రి చేసిన సోనియా గాంధీని, ఆమె అనుచరులను పీవీ అణగదొక్కారని ఆరోపించారు. తిన్నింటి వాసాలు లెక్కబెట్టే వ్యక్తి పీవీ అని విమర్శించారు. ఇక మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నాగపూర్‌లో జరిగిన ఆరెస్సెస్ సభకు వెళ్లి భారతరత్న తెచ్చెకున్నారని ఆరోపించారు. -
పీవీ, ప్రణబ్‌పై చిన్నారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: మాజీ ప్రధాని, దివంగత కాంగ్రెస్ సీనియర్ నేత పీవీ నరసింహారావు, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీలపై ఏఐసీసీ కార్యదర్శి జి.చిన్నారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టిన వ్యక్తి పీవీ అని తీవ్రంగా విమర్శించారు. రాజకీయాలు మానుకొని హైదరాబాద్‌లో కూర్చున్న పీవీని సోనియాగాంధీ పిలిచి ప్రధానిని చేశారన్న చిన్నారెడ్డి.. ఇంత గౌరవం ఇచ్చినప్పటికీ పీవీ పార్టీని భ్రష్టు పట్టించారని దుయ్య బట్టారు. బుధవారం గాంధీభవన్‌లో మీడియా సమావేశంలో చిన్నారెడ్డి మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ పార్టీ పీవీకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది. కానీ ఆయన మాత్రం గద్దెనెక్కిన తర్వాత సోనియా సహా సీనియర్లను అణగదొక్కే ప్రయత్నం చేశారు. ప్రధాని పదవికి మరోనేత పోటీగా తయారవుతారనే ఆయన అలా వ్యవహరించారు. బాబ్రీ మసీదు కూల్చివేతకు సహకరించి పీవీ మరో ఘోరతప్పిదం చేశారు. దీంతో అప్పటివరకు కాంగ్రెస్‌ను లౌకిక పార్టీగా విశ్వసించిన మైనారిటీలు పార్టీకి దూరమయ్యారు. దీంతో పార్టీకి ఇబ్బందులు తలెత్తడంతోనే గాంధీ కుటుంబం ఆయన్ను పక్కనబెట్టింది. కేవలం బాబ్రీని కూల్చినందుకే బీజేపీ నేతలు పీవీని పొడుగుతున్నారు’అని చిన్నారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రణబ్‌ను రాష్ట్రపతి చేసిన ఘనత కూడా కాంగ్రెస్‌దే అన్నారు. నాగ్‌పూర్‌లో ఆరెస్సెస్ సభకు వెళ్లి, సంఘ్ భావజాలాన్ని ప్రశంసించినందుకే ప్రణబ్‌కు బీజేపీ భారతరత్నతో సత్కరించిందన్నారు. అది కూడా ఆరెస్సెస్ నేత నానాజీ దేశ్ముఖ్తో కలిపి ఇచ్చారని చిన్నారెడ్డి గుర్తుచేశారు. ఆరెస్సెస్ భావజాలం ఉన్న వాళ్లనే బీజేపీ దగ్గరకి తీస్తోందని, దేశమంతా ఆ భావజాలాన్ని నింపాలనే లక్ష్యంతోనే ఎన్డీయే ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరెస్సెస్‌కు అనుకూలంగా లేనందుకే బీజేపీ ఆయన్ను పొగడదని చిన్నారెడ్డి అన్నారు. మన్మోహన్‌సింగ్‌కు కాంగ్రెస్ పార్టీ ఎంతో గౌరవం ఇస్తోందని, పార్టీ ప్రధాన కార్యక్రమాలన్నింటిలో ఆయనకు తగిన గౌరవం ఇస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ అప్పులకుప్ప మిగులు బడ్జెట్‌తో ఉన్నామని చెబుతున్నప్పటికీ.. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని చిన్నారెడ్డి విమర్శించారు. తెలంగాణకు 1.8లక్షల కోట్ల రూపాయల అప్పున్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా చెప్పిందన్నారు. ఈ నిధులను ఎక్కడ ఖర్చు పెట్టారో కేసీఆర్ వెల్లడించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ద్వారా నీరందించేందుకు ఎకరాకు రూ.75వేల ఖర్చు అవుతుందని, కాళేశ్వరం ప్రాజెక్ట్ వ్యయం ఇప్పటికే రూ.50 వేల కోట్లు దాటిందని ఆయన తెలిపారు. వీటన్నింటిపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
పీవీపై కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి అనుచిత వాఖ్యలు
సాక్షి, హైదరాబాద్ : మాజీ ప్రధాని పీవీ నరసింహారావుపై ఏఐసీసీ కార్యదర్శి, తెలంగాణ కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాన మంత్రి చేసిన కాంగ్రెస్ పార్టీని, సోనియా గాంధీ అనుచరులను పీపీ అణగదొక్కే ప్రయత్నం చేశారని ఆరోపించారు. తిన్నింటి వాసాలు లెక్కబెట్టిన వ్యక్తి పీవీ అని అనుచిత వ్యాఖ్యలు చేశారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో ఎందరో సీనియర్లను పీపీ తొక్కేశాడని ఆరోపించారు. బాబ్రీ మసీదును కూల్చి పీవీ పెద్ద తప్పు చేశాడని, దాని వల్ల కాంగ్రెస్‌కు ముస్లింలు దూరమయ్యారన్నారు. అందుకే పీవీని గాంధీ కుటుంబం పక్కన పెట్టిందని చెప్పుకొచ్చారు. ‘రాజకీయాలను మానుకొని హైదరాబాద్‌కు వచ్చిన పీవీని సోనియా గాంధీ పిలిచి ప్రధానిని చేశారు. కానీ పీవీ మాత్రం గాంధీ కుటుంబాన్నే అణగదొక్కే ప్రయత్నం చేశారు. గాంధీ కుటుంబం వాళ్లు వస్తే తనకు రాజకీయ భవిష్యత్తు ఉండదని అందరిని తొక్కేశారు. దీంతో ఆయనను కాంగ్రెస్ పార్టీ పక్కకు పెట్టింది. బాబ్రీ మసీదు కూల్చినందుకే బీజేపీ నేతలు పీవీని పొగుడుతున్నారు’ అని చిన్నారెడ్డి ఆరోపించారు. ప్రణబ్ కూడా పీవీలాగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌పై కూడా చిన్నారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రణబ్ నాగపూర్‌లో జరిగిన ఆరెస్సెస్ సభకు వెళ్లి భారతరత్న తెచ్చెకున్నారని ఆరోపించారు. ప్రణబ్‌ను కాంగ్రెస్ పార్టీయే దేశానికి రాష్ట్రపతి చేసిందన్నారు. బీజేపికి ప్రయోజనాలు చేకూర్చారు కాబట్టే ఆ పార్టీ నేతలు పీవీ, ప్రణబ్‌లను పొగుడుతున్నారని ఆరోపించారు. మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ బీజేపీకి ఎలాంటి ప్రయోజనాలు చేకూర్చలేదు కాబట్టే బీజేపీ ఆయనను పొగడడం లేదని చిన్నారెడ్డి అన్నారు. తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రమని ప్రభుత్వం చెబుతోందని.. కానీ, రాష్ట్రానికి లక్షా పదివేల కోట్ల అప్పు ఉందని పార్లమెంటులో ప్రకటించారన్నారు. కేంద్ర ఆర్థిక సంఘం చెప్పిన లక్షా పదివేల కోట్లను ఎక్కడ ఖర్చు చేశారని ప్రశ్నించారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలని చిన్నారెడ్డి డిమాండ్ చేశారు. -
హన్మకొండ లోక్‌సభలో అన్నీ రికార్డులే..
హన్మకొండ లోకసభ నియోజకవర్గం పేరుతో రికార్డులే రికార్డులు.. ఇక్కడ కాంగ్రెస్ ఒకసారి, కాంగ్రెస్ (ఐ) నాలుగుసార్లు, టీడీపీ రెండుసార్లు, బీజేపీ ఒకసారి, టీఆర్ఎస్ రెండుసార్లు గెలిచాయి. దేశానికి ప్రధానిగా సేవలు అందించిన పి.వి నరసింహారావు ప్రాతినిధ్యం వహించిన ఆ నియోజకవర్గం 2009 తరువాత రద్దు అయ్యింది. నరసింహారావు రెండుసార్లు ఇక్కడ నుంచి గెలుపొందారు. ఆయన ప్రస్తుత ఏపీలోని నంద్యాల నుంచి రెండుసార్లు, రామ్‌టెక్, బరంపురం నుంచి కూడా గెలుపొందారు. మూడు రాష్ట్రాలలో ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన తెలుగునేతగా రికార్డులకెక్కారు. ఆయన రాష్ట్రమంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, ప్రధానమంత్రిగా పనిచేసి రాష్ట్రానికి వన్నె తెచ్చారు. కాగా ఇక్కడ మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించిన కమాలుద్దీన్ అహ్మద్ వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి ఒకసారి గెలుపొందారు. టీడీపీ పక్షాన చాడ సురేష్‌రెడ్డి రెండుసార్లు హన్మకొండ నుంచి గెలిచారు. ఇంకా ఇక్కడ రెండుసార్లు గెలిచిన బోయినపల్లి వినోద్‌కుమార్ (టీఆర్ఎస్).. కరీంనగర్ నుంచి మరోసారి గెలుపొందారు. సీనియర్ బీజేపీ నేత జంగారెడ్డి 1984లో ఒకసారి గెలవడమే కాక.. ఆ ఎన్నికల్లో పి.వి.నరసింహారావును ఓడించడం సంచలనం సృష్టించింది. -
‘ఆర్థిక భారత’ ఆర్కిటెక్ట్
మోత్కూరి శ్రీనివాస్–మంథని :దేశంలో గాడితప్పిన ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టి ప్రపంచ ముఖచిత్రంలో భారత ఖ్యాతిని నెలబెట్టిన ఘనత పీవీ నరసింహారావుకే దక్కింది. 1991లో భారత ఆర్థిక నిల్వలు తరిగిపోయిన పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థను దారిలో పెట్టి దార్శనికత ప్రదర్శించిన పీవీ.. ఆర్థిక రంగానికి మార్గదర్శిగా నిలిచారు. ప్రధానిగా పగ్గాలు చేపట్టిన ఆయన అపర చాణక్యత ప్రదర్శించి సుస్థిరతకు మారుపేరుగా నిలిచారు. విపక్షాలు ఎంత వాదించినా తలొగ్గకుండా ఆర్థిక నిపుణుడు మన్మోహన్‌సింగ్‌కు ఆర్థిక మంత్రిత్వశాఖ బాధ్యతలు అప్పగించి పూర్తి స్వేచ్ఛ కల్పించిన ఘనుడు పీవీ నరసింహారావు. ఆయన ఐదేళ్ల కాలంలో భారత ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడమే కాకుండా దేశం ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి బాటలు వేశారు. ఎనిమిదేళ్ల క్రితం అనేక దేశాలు ఆర్థికంగా అతలాకుతం అయినప్పటికీ దాని ప్రభావం మన దేశంపై నామమాత్రమైనా పడలేదంటే నాడు పీవీ ముందుచూపుతో ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలనే చెప్పవచ్చు. ఓటమి నుంచి ప్రారంభమైన రాజకీయ ప్రస్థానం విద్యాభ్యాసం తర్వాత న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించేందుకు వచ్చిన పీవీ.. స్వామి రామానంద తీర్థ శిష్యరికంలో మొదట 1952లో కరీంనగర్ పార్లమెంట్ నుంచి పోటీచేసి కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి బద్దం ఎల్లారెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు. అటు తర్వాత 1957లో మొట్టమొదటిసారిగా మంథని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అలాగే 1962, 67, 72 సంవత్సరాలలో జరిగిన ఎన్నికల్లో నిలిచి శాసనసభ్యునిగా విజయం సాధించారు. 1972లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1977 వరకు అవే బాధ్యతలు నిర్వర్తించారు. అటు తర్వాత హన్మకొండ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి గెలుపొందారు. ప్రధాని ఇందిరాగాంధీ మృతితో 1980లో మధ్యంతర ఎన్నికలు రావడంతో మళ్లీ అదే స్థానం నుంచి పోటీచేసి విజయం సాధించారు. తిరిగి 1984లో హన్మకొండ నుంచి, మహారాష్ట్రలోని రాంటెక్ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసిన ఆయన హన్మకొండలో ఓటమి చవిచూశారు. రాంటెక్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచిన ఆయన కేంద్ర విదేశీ వ్యవహారాలు, హోంమంత్రిగా పనిచేశారు. 1984లో అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీకి ముఖ్య సలహాదారుగా వ్యవహరించారు. అనంతరం కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖలో పనిచేశారు. కాగా రాజీవ్ హత్యానంతరం రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉన్నారు. ప్రధానిగా దేశానికి దిశానిర్దేశం.. 1991లో రాజీవ్ హత్యానంతరం కాంగ్రెస్ బాధ్యతలు ఎవరు చేపట్టాలనే ప్రశ్న పార్టీలో తలెత్తింది. నిజానికి ఆ సమయంలో పీవీ రాజకీయాలకు దూరంగా ఉన్నారు.రాజీవ్ హత్యానంతరం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ సంపూర్ణ మెజారిటీ సాధించింది. ప్రధానిగా పీవీ పేరును కాంగ్రెస్ పార్టీలోని అందరూ ప్రతిపాదించారు. పీవీనే ప్రధాని పదవికి అర్హుడని ఏకగ్రీవంగా మద్దతు తెలపడంతో ప్రధాని పగ్గాలు అప్పగించారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆరు మాసాల్లోపు కర్నూలు జిల్లా నంద్యాల నుంచి ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. 1991 నుంచి 96 వరకు దేశ ప్రధానిగా సమర్థంగా వ్యవహరించారు. అదే సమయంలో ఆయన ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు దేశాన్ని ప్రగతి పథంలో నడిపించడమే కాక భారత ప్రగతి ప్రస్థానాన్ని కొత్త మలుపు తిప్పాయి. కేంద్రీయ విద్యాలయాల రూపకర్త దేశ ప్రధానిగా పీవీ నరసింహారావు పనిచేసిన సమయంలో కేంద్రీయ విద్యాలయాలను, నవోదయ విద్యాసంస్థలను ఏర్పరిచారు. నాడు ఆయన ప్రవేశపెట్టిన ఈ విద్యాలయాలు నేడు ఎందరో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు వరంగా మారాయి. భూ సంస్కరణలు ఆయన చలవే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పీవీ పనిచేసిన సమయంలో భూ సంస్కరణ చట్టం తీసుకొచ్చి వందలాది ఎకరాలను కలిగి ఉన్న భూస్వాముల నుంచి భూములను ఒకే చట్టం ద్వారా ప్రభుత్వం స్వాధీనం చేసుకునేట్టు చేశారు. భూస్వాముల ఆగ్రహావేశాలను లెక్క చేయకుండా భూసేకరణ చట్టం పకడ్బందీగా అమలు చేసిన ధైర్యశాలి. పీవీ స్వతహాగా భూస్వామ్య కుటుంబానికి చెందిన తన వద్ద ఉన్న 1200 ఎకరాల భూమిని వదులుకున్న ధైర్యశాలి. పీవీ ముఖ్య మంత్రిగా ఉన్న కాలంలో పెత్తందార్లు అడవుల్లో వన్యమృగాలను చంపడంతో చలించిపోయి వాటి సంరక్షణకు వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని తీసుకొచ్చారు. -
భారత్‌ను బలమైన శక్తిగా మార్చిన ఘనత పీవీదే
హైదరాబాద్ : అంతర్జాతీయంగా అనేక ఒడిదుడుకులు ఉన్న సమయంలో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన పీవీ నరసింహారావు చేపట్టిన సంస్కరణలతో భారతదేశం బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని ప్రముఖ పాత్రికేయుడు శేఖర్‌గుప్తా అన్నారు. బల హీన భారత్‌ను బలమైన శక్తిగా మార్చిన ఘనత పీవీదేనన్నారు. మైనార్టీ ప్రభుత్వాన్ని నడిపించాల్సి వచ్చినా జాతీయ భద్రతపై ఆయన ఏనాడూ రాజీపడని దృఢసంకల్పం ప్రదర్శించారని కొనియాడారు. పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా ఆదివారం ‘సాక్షి’ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్‌లోని దస్పల్లా హోటల్లో పీవీ స్మారకోపన్యాసం చేశారు. 1991లో ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర అనిశ్చితి ఉండేదని, గల్ఫ్ యుద్ధం ముగింపు, సోవియట్ పతనం, తదితర అంశాలతో భారత్‌లో ఆ కూడా ప్రభావం ఉన్న సమయంలో రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారని అలాంటి సమయంలో ప్రధానిగా పీవీ బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చినా అయోమయానికి గురికాకుండా దేశంలో ఆర్థిక సంస్కరణలు అమలు చేశారన్నారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న భారత్ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడంతో పాటు, విదేశీ విధానాన్ని కూడా కొత్త పుంతలు తొక్కించారన్నారు. అప్ప టిదాకా రష్యాతో మైత్రీబంధాన్ని నెరుపుతున్న భారత్‌కు సోవియట్ పతనం తర్వాత అమెరికా, ఇజ్రాయెల్ తదితర దేశాలతో మైత్రి ఏర్పడటానికి పీవీ చేసిన కృషిని చాలామంది మర్చిపోయారన్నారు. అద్వానీ మాటలు నమ్మారు.. బాబ్రీ మసీదు కూల్చివేత అంశంలో పీవీపై వచ్చిన ఆరోపణలు వాస్తవాలు కావన్నారు. బాబ్రీ మసీదు జోలికి వెళ్లబోమని బీజేపీ నేత అద్వానీ కచ్చితంగా చెప్పిన మాటలను పీవీ నమ్మారని కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చివేయడంతో పీవీ తీవ్ర మనస్తాపానికి గురయ్యారని వెల్లడించారు. బాబ్రీ మసీదు విధ్వంసాన్ని ఆపేందుకు రాష్ట్రపతిపాలన విధించి ఉండొచ్చు కదా అని చాలా మంది పీవీని విమర్శిస్తుంటారని అలా కేంద్ర పాలన అమలుకు కనీసం 48 గంటలు పట్టేదని ఆలోగా జరగాల్సిన విధ్వంసం జరిగిపోయిందని పీవీ తనతో చెప్పారని శేఖర్‌గుప్తా గుర్తు చేసుకున్నారు. దేశంలో అల్లర్లు చెలరేగకుండా పీవీ చాకచక్యంగా వ్యవహరించారని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభంలో అనవసర విషయాల్లో సమయం వృథా చేసి చివరి రెండేళ్లలో జీఎస్టీ లాంటి కీలక సంస్కరణలు అమలు చేయడం ఇబ్బందికరంగా మారిందన్నారు. ఈ కార్యక్రమానికి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి అధ్యక్షత వహించగా గౌరవ అతిథిగా సీనియర్ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావు వ్యవహరించారు. జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న పీవీ బహుభాషా కోవిదుడిగా అందరికీ సుపరిచితులని ఆయన రాజకీయాల్లో లేకపోతే కచ్చి తంగా గొప్ప అధ్యాపకుడు, పరిశోధకుడు అయ్యేవారన్నారు. పీవీ తాను నిర్వహించిన అన్ని మంత్రిత్వ శాఖల్లో తనదైన ముద్రను వేసి పనితీరును మెరుగుపరిచారన్నారు. ప్రభుత్వ విభా గాలు సరైన విధానంలో పనిచేసేలా అనేక చర్య లు చేపట్టారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్ధులకు నాణ్యమైన విద్యను అందించేందుకు నవోదయ విధానాన్ని రూపకల్పన చేయడంలో ఆయన పాత్ర ఎంతో ఉందన్నారు. -
అనంత ఏకాంతంలో ‘లోపలి మనిషి’
పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నం తకాలం అందరూ ‘ఆహా! ఓహో!!’ అన్నారు. పీకలలోతు సమస్యల్లో కూరుకుపోయివున్న దేశ ఆర్థిక వ్యవస్థను నూతన సంస్కరణలతో ఒడ్డున పడేసిన మేధావిగా కీర్తించారు. సంఖ్యా బలం బొటాబొటిగా ఉన్న పాలకపక్షాన్ని అయిదేళ్ళ పాటు ‘పూర్తి కాలం’ అధికార పీఠంపై ఉంచిన ‘అపర చాణక్యుడ’ని వేనోళ్ళ పొగిడారు. అధికారం దూరం అయిన తరువాత, పొగిడిన ఆ నోళ్లతోనే ఆయన్ని తెగడటం ప్రారంభించారు. పదవికి ప్రాణం ఇచ్చే పార్టీ నాయకులు ఆయన పదవికి దూరం కాగానే వాళ్ళూ దూరం జరిగారు. మాజీగా మారిన పీవీపై విమర్శల దాడి పార్టీకి ఆయన దేశానికి చేసిన ‘మేళ్ళు’ కానరాలేదు. అయిదేళ్ళు ‘తెలుగువాడి’లోని ‘వాడినీ, వేడినీ’ లోకానికి చాటిచెప్పిన ‘వృద్ధ రాజకీయవేత్త’, నిస్సహాయంగా న్యాయస్థానాలలో ‘బోనులో’ నిలబడినప్పుడు, ఆయన పార్టీ వాళ్ళెవ్వరూ ఆయనను పట్టించుకోకపోగా ఏమీ తెలియనట్టు ‘కళ్ళు’, ‘నోళ్ళు’ మూసుకున్నారు. ప్రధానిగా ఆయన హయాంలో జరిగిన తప్పులో, పొరబాట్లనో సమర్ధించడం నా ఉద్దేశం కాదు. రాజకీయాల్లో ‘కృతజ్ఞత’, ‘విధేయత’ అనే పదాలకి తావు లేకుండా పోయిందన్న విషయాన్ని విశదం చేయడానికే ఈ ఉదాహరణ. పీవీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఏటా బేగంపేటలోని ఒక సందులో ఉన్న స్వామి రామానంద తీర్ధ ట్రస్టు కార్యాలయానికి వచ్చేవారు. ప్రధాని పదవి నుంచి దిగిపోయిన తరువాత అక్కడ జరిగిన ట్రస్టు సమావేశాలకు కూడా ఆయన హాజరయ్యేవారు. వాటిని కవర్ చేయడానికి వెళ్ళినప్పుడు ‘అధికారాం తమునందు..’ అనే పద్యపాదం జ్ఞాపకం చేసుకోవాలో, ‘ఈ కర్మభూమిలో పదవి, అధికారం ముందు అన్నీ దిగదుడుపే’ అనే నిజాన్ని హరాయించుకోవాలో నాకు అర్ధం అయ్యేది కాదు. పీవీ గురించిన మరో జ్ఞాపకం నా మదిలో పదిలంగా ఉండిపోయింది. మాజీ ప్రధానిగా పీవీ రాజ్‌భవన్‌లో వున్నప్పుడు, నేనూ, ఆకాశవాణిలో నా సీనియర్ కొలీగ్ ఆర్వీవీ కృష్ణారావు గవర్నర్ రికార్డింగ్ నిమిత్తం వెళ్లి, ఆ పని పూర్తిచేసుకున్నతరవాత, రాజ్‌భవన్ గెస్ట్ హౌస్ మీదుగా తిరిగి వెడుతూ అటువైపు తొంగి చూసాము. ఒకరిద్దరు సెక్యూరిటీ వాళ్ళు మినహా రాజకీయుల హడావిడి కనిపించక పోవడంతో మేము లోపలకు వెళ్ళాము. ‘పీవీ గారిని చూడడం వీలుపడుతుందా’ అని అక్కడవున్న భధ్రతాధికారిని అడిగాము. అతడు తాపీగా ‘లోపలకు వెళ్ళండి’ అన్నట్టు సైగ చేసాడు. ఆశ్చర్యపోతూనే లోపలకు అడుగు పెట్టాము. పెట్టిన తరవాత, మా ఆశ్చర్యం రెట్టింపు అయింది. పీవీ ఒక్కరే కూర్చుని టీవీలో ఫుట్ బాల్ మ్యాచ్ చూస్తూ కని పించారు. డిస్టర్బ్ చేశామేమో అన్న ఫీలింగుతోనే, మమ్మల్ని పరి చయం చేసుకున్నాము. లుంగీ మీద ఒక ముతక బనీను మాత్రమే వేసుకునివున్న పీవీగారు నా వైపు చూస్తూ, ‘మీ అన్నయ్య పర్వతాల రావు ఎలా వున్నాడయ్యా!’ అని అడిగేసరికి నాకు మతిపోయినంత పనయింది. ఎప్పుడో దశాబ్దాల క్రితం, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, రాష్ట్ర సమాచార శాఖలో పనిచేస్తున్న మా పెద్దన్నయ్య భండారు పర్వతాలరావు ఆయనకు పీఆర్వోగా కొద్దికాలం పనిచేశారు. అసలు పీవీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నదే అతి కొద్దికాలం. అయినా ఆప్యాయంగా గుర్తు పెట్టుకుని మరీ అడిగారు. అదీ పీవీగారి గొప్పతనం. ఇది జరిగి ఏళ్ళు గడిచిపోయాయి కానీ ఈ చక్కని జ్ఞాపకం మాత్రం మా గుండెల్లో ఇంకా తాజాగానే వుంది. మరో సందర్భంలో పీవీ గారిని ఢిల్లీలో కలిసాను. రేడియో మాస్కోలో పనిచేయడానికి మాస్కో వెడుతూ అప్పుడు కేంద్రమంత్రిగా అత్యంత ఉచ్ఛస్థానంలో ఉన్న పీవీ గారిని కలుద్దామని వెళ్లాను. బంగ్లా అంతటా నిశ్శబ్దం. కాసేపటి తరువాత ఎవరో అటుగా వస్తే ‘పీవీ గారిని కలవడానికి వీలుంటుందా’ అని వచ్చీరాని హిందీలో అడిగాను. అతగాడు బంగ్లాలో ఓ గది చూపించి వెళ్ళిపోయాడు. నెమ్మదిగా తలుపు తోసి చూస్తే ఎదురుగా పీవీ గారు. ఎవ్వరూ లేరు. పరిచయం చేసుకుని మాస్కో వెడుతున్నట్టు చెప్పాను. అప్పుడు ఆయన విదేశాంగ మంత్రి అనుకుంటాను. నా మొహంలో భావాలు పసిగట్టినట్టున్నారు. ‘పనులు చేసి పెడుతూ వుంటే కదా పదిమంది వచ్చేది’ అన్నారు ఆయన తన మొహంలో భావాలు ఏమీ తెలియకుండా. ‘మాస్కో ఎందుకయ్యా వేరే దేశంలో... మీ రేడియో ఉద్యోగాలు లేవా? బాగా చలిదేశం. పెళ్ళాం పిల్లలతో ఎలా ఉంటావ్?’ అని అడిగారు. చాలా ముక్తసరిగా మాట్లాడేవారని పేరున్న పీవీ గారు నేను ఊహించని విధంగా చనువుగా ఆ రెండు ముక్కలు మాట్లాడ్డం నా అదృష్టం అనే భావిస్తాను. పీవీ స్మృతికి నా నివాళి. (నేడు హైదరాబాద్‌లోని దసపల్లా హోటల్లో ఉదయం 11 గంటలకు సుప్రసిద్ధ జర్నలిస్టు, ‘ది ప్రింట్’ సంపాదకులు శేఖర్ గుప్తా దివంగత ప్రధాని పీవీపై స్మారకోపన్యాసం చేయనున్నారు) భండారు శ్రీనివాసరావు వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు ‘ 98491 30595 -
తెరపైకి పీవీ జిల్లా !
పీవీ జిల్లా కోసం మళ్లీ ఉద్యమాలు మొదలవుతున్నాయి. జిల్లాల పునర్విభజన సందర్భంగా ఉమ్మడి కరీంనగర్లో ఐదో జిల్లాగా హుజూరాబాద్‌ను ఎంపిక చేసి, దివంగత ప్రధాని పీవీ నర్సింహరావు పేరుతో ప్రకటించాలని అప్పట్లో ఉద్యమాలు జరిగాయి. ఇదే జరిగితే జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లితోపాటు హుజూరాబాద్‌ను ఏర్పాటుచేస్తే.. మిగిలిన కరీంనగర్‌తో ఐదు జిల్లాలు అయ్యేవి. హుజూరాబాద్ జిల్లాకోసం జేఏసీలుగా ఏర్పడి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. అప్పటిమంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే సతీష్‌కుమార్ సానుకూలంగా స్పందించి ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం సైతం హైపవర్ కమిటీ వేసింది. అఖిలపక్షం ఆధ్వర్యంలో హైదరాబాద్ వెళ్లి రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు ఆధ్వర్యంలోని హైపవర్ కమిటీని కలిసి పీవీ (హుజూరాబాద్) జిల్లా ఏర్పాటు ఆవశ్యకత, ప్రజల మనోభావాలు, సాధ్యాసాధ్యాలను వివరించారు. అయినప్పటికీ చివరి నిమిషంలో జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలను ప్రకటించారు. రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో రెండు కొత్త జిల్లాల ఏర్పాటుకు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యలలో కొత్తగా ములుగు, నారాయణపేట జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలను పరిశీలిస్తుండగా.. హుజూరాబాద్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవాలంటూ ఆందోళనలు మళ్లీ తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. సాక్షి ప్రతినిధి, కరీంనగర్: 14 మండలాలతో పీవీ జిల్లాను ఏర్పాటు చేయాలని హుస్నాబాద్, హుజూరాబాద్ నియోజకవర్గాలకు చెందిన అఖిలపక్ష నేతలు గతంలో హైపవర్ కమిటీకి ప్రతిపాదించారు. ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో కలిసిన హుస్నాబాద్ నియోజకవర్గంలో ఆరు, హుజూరాబాద్‌లో నాలుగు మండలాలున్న సంగతి తెలిసిందే. ఇవి కాకుండా ఇల్లందకుంట, హుస్నాబాద్‌రూరల్ మండలాలు కొత్తగా ఏర్పాటు చేశారు. వీటితో కలిపితే 12 మండలాలు అవుతున్నాయి. హుజూరాబాద్‌కు సమీపంలోనే ఉన్న శంకరపట్నం మండలాన్ని పీవీ జిల్లాలో కలపాలని ప్రతిపాదించారు. జమ్మికుంట మండలంలోని వావిలాలను కొత్త మండలం చేస్తే బాగుంటుందని సూచించారు. తద్వారా మొత్తం 14 మండలాలతో పీవీ జిల్లాను ఏర్పాటు చేయాలని రెండు నియోజకవర్గాల అఖిలపక్ష నాయకులు కోరారు. ఈ నియోజకవర్గాల్లో ప్రస్తుత జనాభా దాదాపు ఆరు లక్షలు. ఆ సమయంలో కొత్తగా ప్రతిపాదించిన సిరిసిల్ల జిల్లానూ తొమ్మిది పాత, ఐదు కొత్త మండలాలతోనే ఏర్పాటు చేశారు. ఈ జిల్లా జనాభా 5.48 లక్షలు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఆరు లక్షల జనాభా, 14 మండలాలతో పీవీ జిల్లాను ఏర్పాటు చేయడం న్యాయబద్ధమని వివరించారు. అయినప్పటికీ ఫలితం లేకపోగా హుస్నాబాద్ నియోజకవర్గంలోని భీమదేవరపల్లి, ఎల్కత్తురిని వరంగల్ అర్బన్, హుస్నాబాద్, హుస్నాబాద్‌రూరల్, అక్కన్నపేట తదితర మండలాలను సిద్దిపేట జిల్లాలో కలిపారు. హుజూరాబాద్, చొప్పదండి, మానకొండూరు, కరీంనగర్ నియోకవర్గాలతో కరీంనగర్ జిల్లా మిగిలింది. ఇప్పుడు మళ్లీ మండలాల పెంపుద్వారాగానీ, కొత్త మండలాల ఏర్పాటు ద్వారానైనా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని ఓవైపు ప్రత్యక్ష ఆందోళనలు, మరోవైపు సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పీవీ జిల్లా కోసం మళ్లీ ఉద్యమాలు.. హుస్నాబాద్ పరిరక్షణ సమితి కన్వీనర్ కేడం లింగమూర్తి, సింగిల్‌విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్, జేఏసీ కన్వీనర్ కొయ్యడ కొమురయ్య, సింగిల్‌విండో డెరైక్టర్ అయిలేని మల్లికార్జున్‌రెడ్డి, అఖిలపక్ష నాయకులు కోమటి సత్యనారాయణ, పచ్చిమట్ల రవీందర్, మ్యాక రమేష్, చిట్టి గోపాల్‌రెడ్డి తదితరులు గతంలో ఉద్యమాలు చేశారు. మరోవైపు హుజూరాబాద్‌లో పీవీ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో అనేక ఆందోళనలను చేపట్టారు. ఇప్పుడు హుస్నాబాద్ నియోజకవర్గం సిద్దిపేట జిల్లాలో కలపగా.. కరీంనగర్ జిల్లాలో ఇప్పుడున్న 16 మండలాలకు తోడు సిద్దిపేట, వరంగల్ అర్బన్ జిల్లాల్లో కలిసిన కొన్నింటిని కలిపి హుజూరాబాద్‌ను కొత్తగా జిల్లా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సోమవారం హుజూరాబాద్, జమ్మికుంట, వీణవంక తదితర మండలాల్లో ఈ జిల్లాకోసం ఆందోళనలు చేపట్టారు. మాజీ ప్రధాని పీవీ పేరిట హుజూరాబాద్ కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జేఏసీల ఆధ్వర్యంలో హుజూరాబాద్ ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ములుగు, నారాయణపేటతోపాటు హుజూరాబాద్‌ను జిల్లా చేయాలని, అవసరమైతే ఆయా జిల్లాల్లో కలిపిన మండలాలను తిరిగి పునర్విభజన చేయాలని కోరుతున్నారు. ఇప్పుడున్న 31 జిల్లాలకు తోడు మరో రెండు కొత్తగా ఏర్పాటు చేసే ప్రతిపాదనలను సీఎం పరిశీలిస్తున్న తరుణంలో హుజూరాబాద్ (పీవీ) జిల్లా ఏర్పాటు ఉద్యమం తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. హుజూరాబాద్ ఆర్డీవోకు వినతి హుజూరాబాద్‌రూరల్: పీవీ పేరిట హుజూరాబాద్ జిల్లా ఏర్పాటు చేయాలని సోమవారం హుజూరాబాద్ బార్ అసోసియేషన్ న్యాయవాదులు ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. హుజూరాబాద్ కు భౌగోళికంగా జిల్లా ఏర్పాటుకు అవసరమైన అన్ని అవకాశాలు ఉన్నాయన్నారు. జిల్లా ఏర్పాటు చేయకపోతే ఉద్యమానికి సిద్ధం కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. న్యాయవాదులు సమ్మిరెడ్డి, ముక్కెర రాజు, సత్యనారాయణరెడ్డి, దొంత భద్రయ్య, మొలుగూరి సదయ్య, గుండేటి జయకృష్ణ, సత్యనారాయణ, గంగాడి కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు. వినతిపత్రం ఇస్తున్న న్యాయవాదులు -
ఆరేళ్ల అసెంబ్లీ ఇదొక్కటే!
1972 ఎన్నికలకు ఏడాది ముందునుంచే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమార్పులు చోటుచేసుకున్నాయి. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకోసం ఉద్యమాన్ని నడిపిన మర్రి చెన్నారెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రజా సమితి (టీపీఎస్) ప్రభావం రాష్ట్రంలో స్పష్టంగా కనిపించింది. నాటకీయ పరిణామాల మధ్య చెన్నారెడ్డి తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఈ రాజకీయాల పరిణామక్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌కు తొలి తెలంగాణ సీఎంగా పీవీ నరసింహారావు బాధ్యతలు స్వీకరించారు. 1972 మార్చిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్నడూలేనంత ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 52.3% ఓట్లు సంపాదించింది. అంతకుముందు, ఆ తర్వాత కాంగ్రెస్ ఎప్పుడూ ఇంతశాతం ఓట్లను పొందలేదు. తెలంగాణలోని 101 సీట్ల (ఏపీ మొత్తంగా 287)లో ఎస్సీలకు 17, ఎస్టీలకు మూడు అసెంబ్లీ స్థానాలు రిజర్వ్‌చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ అభ్యర్థులు 17 మంది పోటీలేకుండా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు 78 సీట్లు వచ్చాయి. అయితే 1972 చివర్లో ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం ఊపందుకోవడం.. దీన్ని సమర్థవంతంగా అణచివేయడంలో విఫలమయ్యారన్న ఆరోపణలతో సీఎం పదవిని పీవీ వదులుకోకతప్పలేదు. ఆ తర్వాత 11 నెలలపాటు రాష్ట్రపతి పాలన తర్వాత జలగం వెంగళ్రావు సీఎం బాధ్యతలు చేపట్టడం చకచకా జరిగిపోయాయి. ఇందిర జోరుకు చెన్నారెడ్డి బ్రేకులు నాటి ప్రధాని ఇందిరాగాంధీ 1971లో ముందస్తు పార్లమెంటు ఎన్నికలకు వెళ్లారు. ఇందిర నాయకత్వంలోని కాంగ్రెస్ (కొత్త కాంగ్రెస్ లేదా కాంగ్రెస్–రిక్విజిషనిస్ట్) ఘనవిజయం సాధించింది. అంతకు కొద్దినెలల క్రితమే బంగ్లాదేశ్ అవతరణకు దారి తీసిన యుద్ధంలో పాకిస్తాన్‌పై భారత్ విజయం తర్వాత జరిగిన అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తిరుగులేని విజయాలు లభించాయి. కానీ తెలంగాణలో మాత్రం ఆమె పప్పులు ఉడకలేదు. ఇందిర జోరుకు చెన్నారెడ్డి బ్రేకులు వేశారు. ఈ ప్రాంతంలోని మొత్తం 14 పార్లమెంటు స్థానాల్లో టీపీఎస్ 10చోట్ల విజయం సాధించింది. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో కాసు బ్రహ్మానంద రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. టీపీఎస్ ఘన విజయం.. ఆ తర్వాత నాటకీయ పరిణామాల మధ్య చెన్నారెడ్డి టీపీఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేయడం జరిగింది. ఈ సమయంలో ఇందిర, చెన్నారెడ్డి మధ్య కుదిరిన ఒప్పందాల్లో భాగంగానే పీవీ నరసింహారావు (తెలంగాణకు సీఎం పదవి ఇవ్వాలని)ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. అయితే.. పీవీ 1971 సెప్టెంబర్ 30 ప్రమాణం చేసిన ఆరు నెలలకే 1972 మార్చిలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. మైనార్టీలు, బీసీలకు గుర్తింపు టికెట్ల కేటాయింపులో గతంలో పోల్చితే తెలుగునాట వెనుకబడిన కులాలు, మైనారిటీలకు కొంత ప్రాధాన్యం కూడా కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలుచుకోవడానికి కారణమైంది. చీలిక తర్వాత సీపీఎం నుంచి అనేక నక్సలైట్ పార్టీలు పుట్టడం కామ్రేడ్లకు చాలా నష్టం చేసింది. తెలంగాణలో కాంగ్రెస్ తర్వాత ఇండిపెండెంట్ అభ్యర్థులకే ఎక్కువ సీట్లు (16) రావడం ఇందుకు నిదర్శనం. సీపీఐకి మూడు, ఎంఐఎంకు రెండు సీట్లు లభించాయి. చెన్నారెడ్డి టీపీఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేయడం ఇష్టంలేని కొందరు నేతలు ‘సంపూర్ణ తెలంగాణ ప్రజాసమితి’పేరుతో పోటీచేశారు. ఇందులో రిపబ్లికన్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జెట్టి ఈశ్వరీబాయి ఒక్కరే గెలిచారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో చాలా మందికి టికెట్ లభించకపోవడంతో వారు తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీచేశారు. వారిలో కొందరు ఇండిపెండెంట్లుగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం 57 మంది స్వతంత్రులుగా గెలిచారు. పీసీసీ అధ్యక్షునిగా కాకినాడకు చెందిన మహ్మద్ ఇస్మాయిల్ ఉన్నారు. ముఖ్యమంత్రి పీవీ, పీసీసీ నేత ఇద్దరూ పలుకుబడి ఉన్న నేతలు కాకపోవడంతో రాష్ట్ర రాజకీయాలపై కాంగ్రెస్ హైకమాండ్ పెత్తనం పెరిగింది. ఆరేళ్ల అసెంబ్లీ ఇదొక్కటే! 1972 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏర్పడిన ఐదో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆరేళ్లపాటు కొనసాగింది. ఎమర్జెన్సీ కాలంలో చట్ట సవరణతో అసెంబ్లీ ఐదేళ్ల కాలపరిమితిని మరో ఏడాది పొడిగించారు. ఈ కారణంగా మామూలుగా 1977లో జరగాల్సిన ఎన్నికలు 1978లో జరిగా యి. ఈ ఆరేళ్ల కాలం లో పీవీ, జలగం కలిసి ఐదేళ్లు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. రాష్ట్రపతి పాలనను తెలుగు ప్రజలు మొదటిసారి చూశారు. చివరిసారిగా అసెంబ్లీకి పీవీ సీఎం పీవీ నరసింహారావు నాలుగోసారి కరీంనగర్ జిల్లా మంథని నుంచి పోటీచేసి గెలిచారు. ఆయన అసెంబ్లీకి పోటీచేయడం ఇదే చివరిసారి. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ మాజీ మంత్రి జేవీ నరసింగరావు లక్సెట్టిపేటలో మరోసారి విజయం సాధించారు. పీవీ తర్వాత రెండో తెలంగాణ ప్రాంత సీఎం అయిన జలగం వెంగళరావు వేంసూరులో విజయంసాధించారు. పీవీ కేబినెట్ సభ్యులైన తెలంగాణ కాంగ్రెస్ నేతలు జె.చొక్కారావు (కరీంనగర్), మహ్మద్ ఇబ్రహీం అలీ అన్సారీ(పాలమూరు), ఎం.మాణిక్‌రావు (తాండూరు), సహాయ మంత్రులు సి.రాజనరసింహ (ఆంధోల్), పి.మహేంద్రనాథ్ (అచ్చంపేట), కె.భీంరావు (ఆసిఫాబాద్), ఎ.మదన్మోహన్ (సిద్దిపేట) విజయం సాధించారు. మరో కాంగ్రెస్ సీనియర్ నేత పి.నర్సారెడ్డి నిర్మల్ నుంచి మళ్లీ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కాంగ్రెస్ నేత ఎస్ జైపాల్ రెడ్డి ఈ ఎన్నికల్లో కూడా కల్వకుర్తి నుంచి మరోసారి గెలిచారు. కొన్నేళ్ల తర్వాత కేబినెట్ మంత్రి అయిన కమతం రాంరెడ్డి పరిగి నుంచి విజయం సాధించారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు టి.అంజయ్య (ముషీరాబాద్), కొండా లక్ష్మణ్ బాపూజీ (భువనగిరి), పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి (మునుగోడు) తదితరులు కూడా శాసనసభకు ఎన్నికయ్యారు. పీవీ కేబినెట్ మంత్రి టి.హయగ్రీవాచారి ఘన్పూర్ నుంచి సీపీఐ నాయకురాలు ఆరుట్ల కమలాదేవిపై విజయం సాధించారు. 1969–71 మధ్య జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తెలంగాణ ప్రజాసమితి టికెట్‌పై గెలిచిన ఎ.మదన్మోహన్ (సిద్దిపేట), నాగం కృష్ణారావు (ఖైరతాబాద్) ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులుగా గెలిచారు. ఈ ఎన్నికల్లో ఎంఐఎం నేత సలావుద్దీన్ ఓవైసీ హైదరబాద్ నగరంలోని యాకుత్‌పురాలో జనసంఘ్ అభ్యర్థి ఆర్.అంజయ్యను ఓడించి అసెంబ్లీకి మూడోసారి వరుసగా ఎన్నికయ్యారు. తెలంగాణ ప్రజా సమితి ఏర్పాటు కాలంలో సహచరులతో మర్రి చెన్నారెడ్డి పీవీ సర్కారు రాజీనామా, రాష్ట్రపతి పాలన! రాష్ట్రంలో మొత్తం 219 సీట్లు, తెలంగాణలో దాదాపు ఐదింట నాలుగొంతుల సీట్లు (78/101) కైవసం చేసుకున్నా ఎన్నికలు జరిగిన ఏడాదిలోపే వచ్చిన ముల్కీ నిబంధనల రద్దుకు, తర్వాత ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోరుతూ వచ్చిన ‘జై ఆంధ్ర’ఉద్యమం ఊపందుకుంది. దీని కారణంగా పీవీ ప్రభుత్వం 1973 జనవరి రెండో వారంలోనే రాజీనామా చేసింది. ఉద్యమం కారణంగా పాలన స్తంభించడంతో అప్పటి కాంగ్రెస్ ప్రధాని ఇందిరాగాంధీ 11నెలలు రాష్ట్రపతి పాలన విధించారు. డిసెంబర్లో మాజీ హోంమంత్రి వెంగళరావు ముఖ్యమంత్రి అయ్యారు. ఓడిన ప్రముఖులు కాంగ్రెస్ నేత డీకే సత్యారెడ్డి కుమారుడు డీకే సమరసింహారెడ్డి సంపూర్ణ తెలంగాణ ప్రజాసమితి టికెట్‌పై గద్వాల నుంచి పోటీచేసి ఓడిపోయారు. అలాగే అంతకుముందు అసెంబ్లీకి రెండుసార్లు కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికైన టీఎన్ సదాలక్ష్మి వికారాబాద్‌లో స్వతంత్ర అభ్యర్థి తిరుమలయ్య చేతిలో ఓడిపోయారు. అంతకుముందు ఏఎస్పీ నుంచి అసెంబ్లీకి ఎన్నికైన బద్రివిశాల్ పిత్తీ మహరాజ్‌గంజ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్.లక్ష్మీనారాయణ చేతిలో ఓడిపో యారు. గతంలో రెండుసార్లు విజయం సాధించిన కాంగ్రెస్ నాయకురాలు రెడ్డిగారి రత్నమ్మ రామాయంపేటలో ఇండిపెండెంట్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. కమ్యూనిస్ట్ నేత చెన్నమనేని రాజేశ్వరరావును సిరిసిల్లలో కాంగ్రెస్ అభ్యర్థి జువ్వాడి నరసింగరావు ఓడించారు. కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్యే ఎన్.యతిరాజారావు భార్య విమలాదేవి వరంగల్ జిల్లా చెన్నూరులో ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతం నుంచి ఆరుగురు మహిళలు శాసనసభకు ఎన్నికయ్యారు. వారిలో ఐదుగురు కాంగ్రెస్ టికెట్‌పై గెలిచారు. రిపబ్లికన్ పార్టీ నాయకురాలు జెట్టి ఈశ్వరీబాయి ఈసారి సంపూర్ణ తెలంగాణ ప్రజాసమితి తరఫున గెలిచారు. పార్లమెంటులో టీపీఎస్ జోరు తెలంగాణలోని మొత్తం 14 ఎంపీ సీట్లలో టీపీఎస్ 10 స్థానాలు గెలుపొందింది. కాంగ్రెస్, కమ్యూనిస్టులపై స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. రాజా రామేశ్వరరావు (పాలమూరు), జీఎస్ మేల్కొటే (హైదరాబాద్), ఎంఎం హషీం (సికింద్రాబాద్), ఎం.మల్లికార్జున్ (మెదక్), ఎం.సత్యనారాయణరావు (కరీంనగర్), కంచర్ల రామకృష్ణారెడ్డి (నల్లగొండ), వి.తులసీరాం (పెద్దపల్లి–ఎస్సీ)లు టీపీఎస్ తరపున గెలిచి తొలిసారి పార్లమెంట్‌కు వెళ్లారు. డీకే సత్యారెడ్డి (పాలమూరు), కేఎల్ నారాయణ (సికింద్రాబాద్), టీఎన్ సదాలక్ష్మి (టీఈసీ) వంటి ప్రముఖులకు ఓటమి తప్పలేదు. మిర్యాలగూడ నుంచి సీపీఎం అభ్యర్థిగా భీంరెడ్డి నర్సింహారెడ్డి గెలుపొంది తొలిసారిగా పార్లమెంట్‌లోకి అడుగుపెట్టారు. ఏకగ్రీవ హీరోలు మక్తల్ – రామచంద్రరావు కల్యాణీ తాండూరు – ఎం.మాణిక్‌రావు, ముధోల్ – జి.గడ్డెన్న నిర్మల్ – పి.నర్సారెడ్డి ఆ ఐదుగురు శాంతాబాయి తపాలికర్ – గగన్‌మహల్ బి.సరోజినీ పుల్లారెడ్డి – మలక్‌పేట సుమిత్రాదేవి – మేడ్చల్ దుగ్గినేని వెంకట్రావమ్మ – మధిర ప్రేమలతా దేవి – నుస్తులాపూర్ -
‘విశ్వాసం–అవిశ్వాసం’ విశేషాలు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పట్ల లోక్‌సభకు విశ్వాసం ఉందా, లేదా తెలుసుకోవడానికి రాజ్యాంగ నిబంధనల ప్రకారం విశ్వాసం లేదా అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెడతారు. సాధారణంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపక్షం ప్రవేశపెడితే, విశ్వాస తీర్మానాన్ని ప్రభుత్వమే ప్రవేశపెడుతుంది. రెండు తీర్మానాల సందర్భంగా కూడా ప్రభుత్వ సాఫల్య, వైఫల్యాలపై చర్చకు (కొత్తగా ప్రభుత్వం ఏర్పడినప్పుడు మినహాయిస్తే) అవకాశం లభిస్తుంది. ఈ రెండు తీర్మానాలపై ఓటింగ్ సందర్భంగా ప్రభుత్వం ఓడిపోతే ప్రధాన మంత్రి, కేంద్ర కేబినెట్ మంత్రులు తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ప్రధాన మంత్రే లోక్‌సభ రద్దుకు సిఫార్సు చేయవచ్చు. సాధారణంగా విశ్వాస తీర్మానంలో ఓడిపోతామని భావించిన సందర్భాల్లోనే ఓటింగ్‌కు కంటే ముందే ప్రధాని లోక్‌సభ రద్దుకు సిఫార్సు చేస్తారు. 26 సార్లు అవిశ్వాస తీర్మానాలు కేంద్ర ప్రభుత్వాలపై గతంలో 26 సార్లు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టారు. 25 సార్లు అవి వీగిపోయాయి. ఒక్కసారి మాత్రం తీర్మానంపై ఓటింగ్‌కు అవకాశం ఇవ్వకుండా అప్పటి ప్రధాన మంత్రి మురార్జీ దేశాయ్ రాజీనామా చేశారు. దేశంలో మొట్టమొదటి సారిగా జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వంపై అవిశ్వాసం వచ్చింది. భారత్–చైనా యుద్ధానంతరం 1963లో ఆయన ప్రభుత్వంపై ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అప్పటి ప్రజా సోషలిస్ట్ పార్టీ అధ్యక్షుడు, మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జేబీ కృపలాని ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా 285 ఓట్ల మార్జిన్‌తో నెహ్రూ సభా విశ్వాసాన్ని పొందారు. రాజీÐŒ గాంధీ, అటల్ బిహారీ వాజపేయి చెరోసారి అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొనగా, లాల్ బహదూర్ శాస్త్రీ, పీవీ నర్సింహారావులు మూడేసి సార్లు అవిశ్వాసాన్ని ఎదుర్కొన్నారు. ఇందిరాగాంధీ మొత్తం 15 సార్లు అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్నారు. మురార్జీ దేశాయ్‌కి కూడా రెండు సార్లు అవిశ్వాస తీర్మానం ఎదురుకాగా, ఒకసారి ఓటింగ్‌కన్నా ముందే (1979, జూలై 12) తన ప్రధాని పదవికి రాజీనామా చేశారు. చివరి సారి 2003లో అవిశ్వాస తీర్మానాన్ని ఎదురుకొన్నది అటల్ బిహారి వాజపేయికాగా, 15 ఏళ్ల అనంతరం ఇప్పుడు ఆయన పార్టీకి చెందిన ప్రధాని నరేంద్ర మోదీకే అవిశ్వాసం ఎదురయింది. విశ్వాస తీర్మానాల్లో.. దేశంలో ఇప్పటి వరకు విశ్వాస తీర్మానాల సందర్భంగా ఐదుగురు ప్రధాన మంత్రులు రాజీనామా చేయగా, ఏడుసార్లు మాత్రం ప్రధాన మంత్రులు సభా విశ్వాసాన్ని నిరూపించుకో గలిగారు. రెండు సార్లు ప్రధాన మంత్రులు విశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చి వాటిపై ఓటింగ్ జరగక ముందే పదవులకు రాజీనామా చేశారు. 1979లో చరణ్ సింగ్ రాజీనామా చేయగా, 1996లో వాజపేయి రాజీనామా చేశారు. 1979, ఆగస్టు 20వ తేదీన తీర్మానం చర్చకు రావల్సి ఉండగా ముందే చరణ్ సింగ్ రాజీనామా చేశారు. 1996, మే 27,28 తేదీల్లో వాజపేయి విశ్వాస తీర్మానంపై సుదీర్ఘ చర్చ జరిగింది. అయినప్పటికీ ఓటింగ్ ఎదుర్కోకుండానే ఆయన రాజీనామా చేశారు. 1989లో వీపీ సింగ్, 1990లో చంద్రశేఖర్, 1993లో పీవీ నర్సింహారావు, 1996లో హెచ్డీ దేవెగౌడ, 1997లో ఐకే గుజ్రాల్, 1998లో వాజపేయి, 2008లో మన్మోహన్ సింగ్‌లు సభా విశ్వాసాన్ని పొందారు. వీరిలో ముగ్గురు ఆ తర్వాత జరిగిన విశ్వాస పరీక్షల్లో వీగిపోయి వారి పదవులకు రాజీనామా చేశారు. 1990లో వీపీ సింగ్, 1997లో దేవెగౌడ, 1999లో వాజపేయిలు అలా రాజీనామా చేశారు. చంద్రశేఖర్, ఐకే గుజ్రాల్ సభా విశ్వాసాన్ని పొంది తమ పదవులకు రాజీనామా చేయడం విశేషం. వారి స్థానాల్లో పీవీ నర్సింహారావు, మన్మోహన్ సింగ్‌లు ప్రభుత్వాలకు సారథ్యం వహించారు. -
పీవీని స్మరించుకున్న మోదీ
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ ప్రధాని, బహుభాషా కోవిదుడు పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆయనను స్మరించుకున్నారు. ‘మన మాజీ ప్రధాని శ్రీ పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటున్నాం. ఆయన ఒక రాజనీతిఙ్ఞుడు. విలువైన నాయకత్వంతో దేశాన్ని విపత్కర పరిస్థితుల నుంచి బయటపడేలా చేశారు. లోతైన పరిఙ్ఞానం, విఙ్ఞత కలిగిన గొప్ప మేధావి ఆయన’ అంటూ నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కూడా... ‘భారత తొమ్మిదవ ప్రధాని పీవీ నరసింహారావు పుట్టినరోజు సందర్భంగా ఆయనను స్మరించుకుంటున్నాం. చాణక్యుడిగా పేరొందిన పీవీ తన మేధస్సుతో మైనార్టీ ప్రభుత్వాన్ని ఎంతో సమర్థవంతంగా నడిపించారు’ అంటూ కాంగ్రెస్ పార్టీ అధికార ట్విటర్ పేజీలో పోస్ట్ చేసింది. గతేడాది కాంగ్రెస్ పార్టీ పీవీ జయంతిని గుర్తుపెట్టుకోలేదు గానీ ఇప్పుడు ప్రధాని మోదీ ట్వీట్ చూసిన అనంతరం.. ఈవిధంగా తమ సొంత పార్టీకి చెందిన గొప్ప మేధావి, ప్రభావశీలిని స్మరించుకోవాలనే స్పృహ రావడం చూస్తుంటే అచ్చేదిన్ వచ్చినట్లుగానే కన్పిస్తోందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. Remembering our former PM Shri PV Narasimha Rao on his birth anniversary. Shri Rao is widely respected as a statesman who provided valuable leadership during a critical period of India’s history. Blessed with immense wisdom, he made a mark as a distinguished scholar as well. — Narendra Modi (@narendramodi) June 28, 2018 We remember PV Narasimha Rao, India's 9th Prime Minister, on his birth anniversary today. He was referred to as Chanakya for his ability to steer tough economic & political legislation through the parliament at a time when he headed a minority Govt. pic.twitter.com/Iad7WElFmG — Congress (@INCIndia) June 28, 2018 -
మానవత్వమే శీలం
కథాసారం ఢాం... ఢాం... ఢాం..! బాంబుల ప్రేలుడుతో అర్ధరాత్రి ప్రశాంత వాతావరణం ఛిన్నాభిన్నమైంది. గాఢనిద్రలో వున్న గ్రామమంతా ఒక్క పెట్టున దద్దరిల్లిపోయింది. ఊరివారందరికీ ఒకే సమయాన ఏదో మహాభయంకరమైన పీడకల వచ్చి నిద్ర నుండి త్రుళ్లిపడి లేచారా అన్నంత అలజడి. ఊరిచుట్టు పెరండ్లలో కుక్కల అరుపు. తల్లులు పిల్లలకు శ్రీరామరక్ష తీశారు. గొల్ల రామవ్వ తన గుడిసెలో చీకటిలోనే కూర్చుని వుంది. ఆమె కాళ్లు చేతులు వణుకుతున్నవి, కొంత వృద్ధాప్యం వల్ల, కొంత భయం వల్ల. ఆమె ఒడిలో ఒక పదిహేనేండ్ల బాలిక తలదాచుకొని వుంది. పేరు మల్లమ్మ. హఠాత్తున కిటికీ నెవరో తట్టారు. కిటికీ అంటే దాని ప్రాణమెంత? మంటిగోడలో వెల్తురు కొరకని ఉంచబడ్డ ఒక రంధ్రం. దానికి రెండు చిన్న తలుపులు. చప్పుడుకు వారిద్దరు ఉలికిపడ్డారు. శ్వాస బిగబట్టి జాగ్రత్తగా వినసాగారు. మళ్లీ అదే చప్పుడు. ఎవరో కిటికీ తలుపులు తట్టుతున్న మాట నిజం. గాలి కాదు, పిల్లి అసలే కాదు. ఏం చేయాలి? ఇక లాభం లేదు. ముసలవ్వ మెల్లగా లేవసాగింది. మల్లమ్మ గుండె దడదడ మాత్రం మితిమీరింది. ‘నాకు బయమైతాందే అవ్వ’. ‘అట్లుండు! ఏదో చూత్తాం’ అని ముసలవ్వ దృఢ నిశ్చయంతో లేచింది. గొళ్లెం తీస్తూ ‘ఎవర్రా?’ అంది. ఆ ప్రశ్న ఉచ్చరించబడిందో లేదో ముసలవ్వ నోరు గట్టిగా మూయబడింది. వెంటనే అతడే తలుపులు బిగించాడు. ఏ రజాకారో ఇంట్లో దూరాడు. తనకు చావు తప్పదు. తానల్లారు ముద్దుగా పెంచి పెండ్లి చేసిన మనుమరాలికి మానభంగం తప్పదు. తాను పిల్లను సాది సంబాళించింది తుదకీ రాక్షసునికి ఒప్పగించడానికేనా? ఇంకొక్క అడుగులో తన బ్రతుకు కొనముట్టుతుంది. ఆ తరువాత పాపం మల్లి! ముసలవ్వ వెంటనే ఆ వ్యక్తి రెండు కాళ్లు దొరికించుకుంది. ‘నీ బాంచెను. నీ కాళ్లు మొక్కుత. అది నీ చెల్లెలనుకో’. ఆ వ్యక్తి గుసగుసగా చెప్పాడు: ‘నేను దొంగను కాను, రజాకార్ను కాను, పోలీసును కాను. మిమ్మల్నేమీ అనను’. కాళ్లు పట్టుకొన్న ముసలవ్వ మెల్లగా లేస్తూ అతని మోకాళ్లు, నడుము తడుమసాగింది. చొక్కా లేదు. దేహమంతటా పల్లేరుకాయలు, జిట్టరేగు ముండ్లు. గాయాల నుండి స్రవిస్తున్న రక్తపు తడి. శరీరం జ్వరంతో రొట్టెపెంక వలె మసలి పోతున్నది. ఆ వ్యక్తి నిస్సహాయుడు. అపాయస్థితిలో హఠాత్తుగా తటస్థించిన శరణాగతుడు. ‘మల్లీ! దీపం ముట్టియ్యే జెప్పన’ ‘వద్దవ్వా వద్దు. దీపం వెలిగించకు. పోలీసులు నా వెంటపడ్డారు, పట్టుకుంటారు’ ‘పోలీసుల కన్నా ముందు నిన్ను సావుదేవతే పట్టుకునేటట్టున్నది’ గద్దించింది ముసలమ్మ. మల్లమ్మ దీపం వెలిగించింది. ముసలవ్వ మూలకొక గొంగడి పరిచింది. అతడు పదునెనిమిదేండ్లకు మించని బక్కపలుచని యువకుడు. ‘మల్లిపోరీ! కుంపటి మీద కడుముంతెడు నీళ్లెక్కియ్యే. ఎక్కిచ్చినవా? ఇగరా. కూకో వాని పక్కన. ముండ్లు తీసెయ్యి ఉల్లుల్లుగ. అయొ! సిగ్గయితాందా వాన్ని ముట్టుకుంటె? ఏం మానవతివి గదనే! పాపం పీనుగోలె పడున్నడుగాదె!’ ముసలవ్వ గొణుగు మహాప్రవాహం వలె సాగిపోతున్నది. అందులోనే చివాట్లు, అందులోనే వినోదం, అందులోనే ఆజ్ఞలు. యువకుని దేహమంతా శుభ్రమైంది. ఇంతలో తలె తెచ్చి, ముసలవ్వ యువకుని తలాపున కూర్చుంది. ‘ఇగ లే కొడుకా. కొద్దిగంత గట్క చిక్కటి సల్లల పిసుక్కచ్చిన. పొయ్యే పాణం మర్లుతది. కులం జెడిపోతవని భయపడుతున్నవా? మొదలు పాణం దక్కిచ్చుక్కో’. ఆమె మాటలకు చిరునవ్వుతో యువకుడు తలె అందుకున్నాడు. అందులోది నవజీవన సర్వస్వ సారమన్నట్టు గటగట త్రాగాడు. సగం పోయిన ప్రాణాలు తిరిగివచ్చాయి. కండ్లలో జీవనజ్యోతి వెలుగజొచ్చింది. యువకుడి దేహాన్ని ప్రేమతో నిమురుతున్న ముసలవ్వ చేయి హఠాత్తుగా అతని చడ్డీ జేబు వద్ద ఆగింది. ‘గిదేందిరో’ అంటూ ఒక్కు వస్తువ తీసింది. ‘అది తోటాల తుపాకి’ అన్నాడు యువకుడు. ‘ఎందుక్కొడుకో తుపాకి? మమ్ములగిట్ల చంపుదమనుకున్నవా ఏంది?’ ‘లేదవ్వా! మిమ్మల్ని చంపేవాళ్లను చంపే అందుకది... ఈ రాత్రి ఇద్దరు పోలీసులను హతమార్చాను. మొన్న మీ గ్రామంలో నలుగురు నిర్దోషుల్ని కాల్చి చంపిన పోలీసులే’ ‘ఎందుకురా నీకు పోలీసోల్ల తోటి కైలాట్కం?’ ‘నేను స్టేట్ కాంగ్రెస్ వాలెంటియర్ను. నైజాం రాజుతోటి కాంగ్రెస్ పోరాడుతున్నది’ పెద్ద పెద్దోల్లేమో పట్నంల ముచ్చట్లు పెట్టుకుంటు కూకుంటరట, పసిపోరగాళ్లనేమో పోలీసోల్ల మీదికి పొమ్మంటరట... అని రామవ్వ కాసేపు గొణిగింది. కొద్దిగ కన్ను మలుపుకొమ్మని యువకునికి చెప్పింది. పాలు పిండేవేళ అతిక్రమించి పోతున్నది. యువకుడు సుఖనిద్ర పోతున్నాడు. అకస్మాత్తుగా బజారులో మోటారు ట్రక్కు చప్పుడైంది. ఎటువిన్నా బూటుకాళ్ల తటతటలే. మల్లమ్మ గడగడలాడింది. యువకుడు దిగ్గున లేచాడు. బయటికి పోబోతే ముసలవ్వ వారించింది. ‘అటో యిటో తేలిపోవాలి. నా వల్ల మీకు అపాయం కలుగుతుంది’ అన్నాడు యువకుడు. ముసలవ్వ అతణ్ని వెనక్కి నెట్టింది. రివాల్వరు లాగుకుంది. మినుకు మినుకు మంటున్న దీపాన్ని పూర్తిగా ఆర్పేసింది. బయట మనుషుల అలికిడి. మల్లమ్మకు చెప్పింది: ‘పొల్లా! నిన్న మర్రి కొంరడు కట్టుటానికియ్యలె? ఆ దుప్పటిన్నూ కండువా తీస్కరా!...’ తలుపు మీద నాలుగుసార్లు దిబదిబమని దెబ్బలు పడ్డవి. యువకుడిని దుప్పటి కట్టుకొమ్మంది. కండువాను నెత్తికి చుట్టుకొమ్మంది. ‘ఓ రామీ! తల్పూకి ఖోల్’ మల్లివి రెండు దండె కడాలు తీయించి అతడికి తొడిగింది. ‘గొల్ల వేషం’ తయారైంది. మళ్లీ తలుపు మీద దిబదిబ. ‘ఓ రామీ! తల్పూ తీస్తా లేదూ. నీకి తోడ్కల్ తీస్తం ఠైర్. ఫౌరన్ తీ తల్పు’. ‘మల్లీ! ఆ మూలకు మంచం వాల్చి గొంగడెయ్యె. పిల్లగా! అండ్ల పండుకో’ యువకునికి ఎటూ తోచలేదు. తుదకు పట్టుపడటమే నొసటన వ్రాసి యున్నట్లుంది. విధి లేక పడుకున్నాడు. ముసలవ్వ ఇప్పుడిప్పుడే నిద్ర లేచిన దాని వలె ఆవలిస్తూ– ‘ఎవర్రా పెద్ద దొంగనాత్తిరచ్చి తలుపు కొడ్తాన్రు. మీ ఇల్లు పాడుబడ. పోలీసోల్లు రాత్రి గత్తుకత్తె మీ యిపులు పెట్న బలుగుతయ్’ అంది. ‘మల్లీ! మాట్లాడక ఆ పోరని పక్కల పండు, ఊ నడూ!... బయటినుండి ‘మేం పోలీసోళ్లం’ అన్నది ముసలవ్వ వినిపించుకోలేదు. ‘నన్నేం దోసుకుంటర్రా? లేచి తలుపు తీసేదాక గూడా ఓపిక లేకపోతే పగులగొట్టుండ్రి. దీపమన్న ముట్టిత్తామంటే కుంపట్ల అగ్గిలేదు. మల్లికి నిన్న మొగడచ్చిండేమో, దానికి పట్టపగ్గాల్లేకుంటున్నది. ఏ పని చెప్పినా యినిపించుకోదు...’ ‘చెయ్యేసి పండుకో పోరడా దానిమీద. చూసెటోని కనుమానం రావద్దు... ’ ‘ఓ మల్లీ! ఓరి మల్లిగా! ఊహూ వీల్లు లేవరు. వీల్ల వైసు వక్కలుగాను, బజార్ల గంత లొల్లాయితాంటె మా రాజుగ గుర్రుకొడతాన్రు... నా ముంగట్నే కొడుకూ కోడలూ రుచ్చాలోలె పడిపోయిన్రు. ఈ పోర్ని నా నెత్తిన పడేశిన్రు. యాడున్నవురో కొడుకా’ అంటూ రాగం పెట్టి ఏడువసాగింది. బయటివాళ్లు నానావిధాల మాట్లాడుతున్నారు. ‘పాపం పోనీ’ అని ఒకరు. ‘అబ్బో ఈ ముసలిది చాలా బద్మాష్’ అని మరొకరు. బయటినుంచి పగలగొట్టుదామనే లోపు తలుపు తీసింది. ‘పోరి మెడల గంటెపుత్తెలున్నయి, పోరగానికి రెండు దండె కడియాలున్నయి, ఇగేం కావాల్నో తీసుకోండి’ అంది. అప్పుడే నిద్రలోంచి లేచినట్టు మల్లమ్మ కండ్లు నులుముకుంటూ లేచింది. యువకుడు కూడా లేచి కూర్చున్నాడు. యువకుని వైపు చూపిస్తూ పోలీసు ‘వాడు కాంగ్రెసోడా యేం’ అని ప్రశ్నించాడు. ‘వాడెవ్వడా? ఎవ్వడు పడితే వాడు మా పక్కల్ల పండుటానికి మేమేం బోగమోల్లమనుకున్నవా? నిన్నెవడన్న గట్టనే అడుగుతె ఎట్టుంటది?’ ముసలవ్వ తీవ్రతకు పోలీసులు చకితులైనారు. రేపు వీన్ని హాజరు చెయ్యాలని ఆదేశించి వెళ్లిపోయారు. ‘అవ్వా నువ్వు సామాన్యురాలవు కావు, సాక్షాత్ భారతమాతవే’ అన్నాడు యువకుడు. ‘దోడ్త్! నాకే పేర్లు బెడుతున్నావు? నేను గొల్లరామిని. గంతే. ఇగ నువ్వెల్లు. మల్లిని అత్తోరింటికి తోలుకపోత’. కాళ్లు పట్టుకొన్న ముసలవ్వ మెల్లగా లేస్తూ అతని మోకాళ్లు, నడుము తడుమసాగింది. చొక్కా లేదు. దేహమంతటా పల్లేరుకాయలు, జిట్టరేగు ముండ్లు. గాయాల నుండి స్రవిస్తున్న రక్తపు తడి. భారత మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు కథ ‘గొల్ల రామవ్వ’కు సంక్షిప్త రూపం ఇది. ఈ కథ కాకతీయ పత్రికలో 1949లో అచ్చయింది. ‘విజయ’ కలంపేరుతో రాశారు. బహుభాషా కోవిదుడిగా కీర్తినొందిన పీవీ ఆత్మకథాత్మక నవల ‘ఇన్సైడర్’ (లోపలి మనిషి) రాశారు. - పి.వి. నరసింహారావు -
‘ధిక్కారం’ కేసునే మరచిపోవడం దిగ్భ్రాంతికరం
సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్య స్థల వివాదంపై సుప్రీం కోర్టు త్వరలోనే తుది విచారణను ప్రారంభించనున్న నేపథ్యంలో 1992, డిసెంబర్ ఆరవ తేదీన బాబ్రి విధ్వంసానికి సహకరించిన నేతలపై దాఖలైన కోర్టు ధిక్కార పిటిషన్ విచారణ పునరుద్ధరణకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. 1995లో సుప్రీం కోర్టులో దాఖలైన ఈ కోర్టు ధిక్కార పిటిషన్ ఒకే ఒక్కసారి అంటే, 1997. మార్చి 26వ తేదీన విచారణకు వచ్చింది. అదే సంవత్సరం వేసవి సెలవుల తర్వాత ఈ పిటిషన్‌పై విచారణను కొనసాగిస్తామని నాటి సుప్రీం కోర్టు బెంచీ ప్రకటించింది. ఆ తర్వాత ఈ పిటిషన్ ఎవరికి అంతుచిక్కని విధంగా మరుగున పడిపోయింది. పిటిషన్‌ను దాఖలు చేసిన వారే కాకుండా, ఇందులో నిందితులుగా ఉన్న వారు కూడా ఈ పిటిషన్‌ను మరచిపోయారు. ఈ పిటిషన్లో ఏడుగురు ప్రముఖులు నిందితులుకాగా, నలుగురు ఇప్పటికే మరణించారు. అయోధ్య టైటిల్ కేసుకు సంబంధించిన వందలాది పిటిషన్లపై విచారణల పరంపర కొనసాగడం, పర్యవసానంగా టైటిల్‌పై 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇవ్వడం, దాన్ని సవాల్ చేస్తూ పిటిషనర్లు సుప్రీం కోర్టును ఆశ్రయించడం, ఇప్పుడు సుప్రీం కోర్టులో తుది విచారణం ప్రారంభమవడం లాంటి పరిణామాల మధ్య బాబ్రీ మసీదు విధ్వంసానికి సంబంధించిన కీలకమైన కోర్టు ధిక్కార పిటిషన్‌ను మరచిపోవడం న్యాయవర్గాలకే దిగ్భ్రాంతి కలిగించే విషయం. ఇందులో ఉన్న నిందితులను గుర్తుచేసుకుంటే పిటిషన్ ఎందుకు మరుగున పడిపోయిందో అర్థం చేసుకోవచ్చునుకుంటా! పీవీ నర్సింహారావు, ఎస్బీ చవాన్, ఎల్కే అద్వానీ, మురళీమనోహర్ జోషి, కళ్యాణ్ సింగ్, విజయ్‌రాజ్ సింధియా, అశోక్ సింఘాల్‌లు ఈ కేసులో నిందితులు. బాబ్రీ మసీదు వద్ద యథాతథా స్థితిని కొనసాగించాలని, మసీదుకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా తగిన చర్యలు తీసుకోవాలంటూ అలహాబాద్ హైకోర్టుతోపాటు సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను వీరు ‘మనస్ఫూర్తిగా, ఉద్దేశపూర్వకంగా’ ఉల్లంఘించారని కేసు దాఖలైంది. అయోధ్య–బాబ్రీ వివదానికి సంబంధించి 1961లో సున్నీవక్ఫ్ బోర్డుతోపాటు తొలి పిటిషన్‌ను దాఖలు చేసిన సహ వాది మొహమ్మద్ హాషిమ్ అన్సారీయే ఈ కోర్టు ధిక్కార పిటిష¯Œ ను దాఖలు చేశారు. నాడు పీవీ నర్సింహారావు ప్రధాన మంత్రిగా, ఎస్బీ చవాన్ హోం మంత్రిగా ఉన్నారు. వారు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు. ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, విజయరాజె సింధియా, కళ్యాణ్ సింగ్‌లు బీజేపీ అగ్ర నాయకులు. అశోక్ సింఘాల్ బీజేపీకి మిత్రపక్షమైన విశ్వహిందూ పరిషత్ నాయకులు. కళ్యాణ్ సింగ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన నేడు రాజస్థాన్ గవర్నర్‌గా కొనసాగుతున్నారు. వ్యక్తిగతంగా వీరిని పిటిషన్లో నిందితులుగా పేర్కొనడంతోపాటు కేంద్ర, యూపీ ప్రభుత్వాలను కూడా ముద్దాయిలుగా పిటిషనర్ చేర్చారు. ఈ పిటిషన్ మొదటిసారి 1997, మార్చి 26వ తేదీన సుప్రీం కోర్టు జస్టిస్ జీఎన్ రాయ్, జస్టిస్ ఎస్పీ బారుచాలతో కూడిన ద్విసభ్య బెంచీ ముందు విచారణకు వచ్చింది. ఆ ఏడాది కోర్టు వేసవి సెలవుల తర్వాత విచారణ కొనసాగిస్తామని బెంచీ ప్రకటించింది. 20 ఏళ్లు గడిచిపోయినా పిటిషన్ అతా, పతా లేదు. పిటిషనర్ అన్సారీ కూడా 2016, జూలై నెలలో మరణించారు. అయోధ్య టైటిల్‌పై ఫిబ్రవరి నెలలో తుది విచారణ జరుగుతుందని భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నాయకత్వంలోని త్రిసభ్య బెంచీ ప్రకటించిన నేపథ్యంలో కోర్టు ధిక్కార పిటిషనర్ అన్సారీ తరఫు న్యాయవాది షకీల్ అహ్మద్ సయీద్ ఇటీవల సుప్రీం కోర్టు రిజిస్ట్రీని ఆశ్రయించి పిటిషన్ గురించి వాకబు చేశారు. ఆయనకు రిజిస్ట్రీ నుంచి వచ్చిన సమాధానం కూడా దిగ్భ్రాంతికరంగానే ఉంది. తాము పలు విచారణ పిటిషన్లతో దీన్ని కలిపినందున దీనిపై ఎప్పుడో సుప్రీం కోర్టు విచారణ జరిపి తీర్పు వెలువరించి ఉంటుందన్న భావనలో ఉన్నామని రిజిస్ట్రీ వర్గాలు తెలిపాయి. పిటిషనర్ తరఫున విచారణ కొనసాగించాలంటే ఆయన చనిపోయిన 90 రోజుల్లోనే మరో పిటిషన్‌ను దాఖలు చేయాలని, లేదంటే తన తదనంతరం కూడా కేసును కొనసాగించాల్సిందిగా పిటిషనర్ తన కుటుంబ సభ్యులు లేదా న్యాయవాదికి వీలునామా రాసిచ్చినట్లయితే కేసును కొనసాగించవచ్చని రిజిస్ట్రీ వర్గాలు ఆయనకు సూచించాయి. దీంతో షకీల్ అహ్మద్, పిటిషనర్ వీలునామా తనిఖీలో పడ్డారు. చనిపోయిన నిందితులందరిని పిటిషన్ నుంచి తొలగించాలని, మిగతా వారిపై విచారణ కొనసాగించాలని కోరుతూ కూడా పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయని న్యాయవర్గాలు చెబుతున్నాయి. ఏడుగురు నిందితుల్లో ప్రస్తుతం అద్వానీ, మురళీ మనోహర్ జోషి, కళ్యాణ్ సింగ్‌లు మాత్రమే ఉన్నారు. బతుకున్నవారిలో ప్రభుత్వ ప్రతినిధులు ఎవరూ లేనందు వల్లనే 20 ఏళ్ల తర్వాతనైనా ఈ పిటిషన్ బయటకు వచ్చిందని ఆరోపిస్తున్న వాళ్లు లేకపోలేదు. కానీ పిటిషన్లో కేంద్రాన్ని, యూపీ ప్రభుత్వాలను కూడా ముద్దాయిలుగా చేర్చారన్న విషయాన్ని మరువరాదు. ఏది ఏమైనా అయోధ్య టైటిల్ కేసులో తీర్పు ఇవ్వడానికి ముందే కోర్టు ధిక్కార పిటిషన్‌పై తీర్పు వెలువడాలని న్యాయవర్గాలు కోరుతున్నాయి. ఆ తర్వాత తీర్పు వెలువడితే ఆశించిన ప్రయోజనం ఉండదని ఆ వర్గాలు వాదిస్తున్నాయి. ఒకవేళ అయోధ్య టైటిల్ హిందువులదేనని తీర్పు వస్తే బాబ్రీ మసీదును విధ్వంసం చేయడం సమంజమేనన్న అభిప్రాయం కలుగుతుందన్నది వారి వాదన. ‘న్యాయం ఆలస్యమైతే అసలు న్యాయం జరగనట్లే లెక్క’ అన్న న్యాయసూత్రం ప్రకారమైనా తీర్పు సాధ్యమైనంత త్వరగా వెలువడాల్సి ఉంది. -
పీవీ టీడీపీ ప్రధాని
► మరోసారి లోకేష్ తడబాటు న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి తనయుడు, రాష్ట్ర ఐటీ మంత్రి లోకేశ్ మరోసారి తడబడ్డారు. తడబాటును అలవాటుగా మార్చు కున్న లోకేష్ బుధవారం మాజీ ప్రధాని పీవీ నర సింహారావును తెలుగుదేశం ప్రధాన మంత్రిగా మార్చేశారు. మాజీ ప్రధాని పీవీ జయంతిని పురస్కరించుకుని ఏపీ భవన్లో ఆయన చిత్రపటానికి లోకేశ్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... పీవీ నరసింహారావు మన తెలుగుదేశం నుంచి ప్రధానమంత్రి అవటం అదృష్టంగా భావించాం అని అనబోతూ వెంటనే సవరించుకుని.. పీవీ నరసింహారావు మన తెలుగు ప్రజల నుంచి ప్రధాన మంత్రి అవడం అదృష్టంగా భావించామని చెప్పారు. కాగా, ఇండియన్ బీపీవో పథకంలో రాష్ట్రానికి ఇప్పటికే కేటాయించిన 4,500 సీట్లకు అదనంగా మరో 2,700 సీట్లు పెంచాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేశ్ కేంద్రాన్ని కోరారు. ఇక్కడి ఎలక్ట్రానిక్ నికేతన్ భవన్లో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, కార్యదర్శి అజయ్ సహానీలతో ఆయన భేటీ అయ్యారు. ఏపీ ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేయబోతున్న ఐదు ఎలక్ట్రానిక్ తయారీ క్లస్టర్లకు ఆమోదం ఇవ్వాలని కోరారు. విశాఖలో సీ–డ్యాక్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. -
చంద్రస్వామి కన్నుమూత
► జ్యోతిష్కుడిగా ప్రసిద్ధి పొందిన చంద్రస్వామి ► రాజీవ్ హత్యలోనూ పాత్ర ఉన్నట్లు ఆరోపణలు న్యూఢిల్లీ: దివంగత మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావుకు అత్యంత సన్నిహితుడు, వివాదాస్పద జగదాచార్య చంద్రస్వామి (66) ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో కన్నుమూశారు. మరో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యలోనూ ‘తాంత్రిక స్వామి’ చంద్రస్వామి పాత్ర ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అనారోగ్యంతో ఏప్రిల్ 3న ఆసుపత్రిలో చేరిన ఆయనకు ఇటీవల గుండెపోటు వచ్చిన అనంతరం, తాజాగా బహుళ అవయవ వైఫల్యాలతో మంగళవారం చంద్రస్వామి మరణించారని వైద్యులు వెల్లడించారు. అంత్యక్రియలను బుధవారం ఉదయం 9 గంటలకు నిగమ్‌బోధ్ ఘాట్ వద్ద నిర్వహించనున్నారు. పీవీ నరసింహా రావు ఆంధ్రప్రదేశ్ హోం మంత్రిగా ఉన్న చంద్రస్వామి ఆయనకు దగ్గరయ్యారు. పీవీ ప్రధాని అయ్యాక చంద్రస్వామి ఢిల్లీలో ‘విశ్వ ధర్మయాతన్ సనాతన్’ అనే ఆశ్రమాన్ని కూడా నిర్మించారనీ, ఇందుకు స్థలాన్ని మాజీ ప్రధాని ఇందిరా గాంధీయే కేటాయించారని చెబుతారు. పీవీ నరసింహారావుకు అత్యంత నమ్మకస్తుల్లో చంద్రస్వామి ఒకరు. పీవీ ప్రధానిగా ఉన్న సమయంలో చంద్రస్వామి బాగా అధికారం చెలాయించేవారు. పలుసార్లు వివాదాల్లో చిక్కుకున్న ఆయనకు రాజీవ్ గాంధీ హత్య కేసులోనూ పాత్ర ఉన్నట్లు మిలాప్ చంద్ జైన్ కమిషన్ ఆరోపించింది. జైన్ కమిషన్ తన నివేదికలోని ఓ భాగం మొత్తం చంద్రస్వామి పాత్ర గురించే చర్చించింది. రాజీవ్ గాంధీని హత్య చేసిన ఎల్టీటీఈకి చంద్రస్వామి నిధులు సమకూర్చినట్లు కమిషన్ తన నివేదికలో పేర్కొంది. రాజీవ్ గాంధీ హత్యకేసులో ఆయనపై ఆరోపణలు రావడంతో విదేశాలకు వెళ్లకుండా నిషేధం విధించారు. అనంతరం 2009లో ఈ నిషేధాన్ని సుప్రీంకోర్టు ఎత్తివేసింది. చంద్రస్వామిపై ఆర్థిక అవకతవకల ఆరోపణలు కూడా పలుమార్లు వచ్చాయి. లండన్‌కు చెందిన వ్యాపారవేత్తను మోసం చేశారనే అభియోగంపై 1996లో ఆయన ఓ సారి అరెస్టయ్యారు కూడా. విదేశీ మారకద్రవ్యం నియంత్రణ చట్టం(ఫెరా)ను చంద్రస్వామి పలుమార్లు ఉల్లంఘించినట్లుగా అభియోగాలున్నాయి. ఫెరాను ఉల్లంఘించినందుకు 2011 జూన్‌లో సుప్రీంకోర్టు చంద్రస్వామికి రూ.9 కోట్ల జరిమానా కూడా విధించింది. మార్గరెట్ థాచర్‌కూ జ్యోతిష్యం చంద్రస్వామి అసలు పేరు నేమి చంద్. రాజస్తాన్‌కు చెందిన ఆయన తండ్రి వడ్డీ వ్యాపారి. చంద్రస్వామి బాల్యంలోనే ఆయన కుటుంబం హైదరాబాద్‌కు వలస వచ్చింది. అనంతరం చంద్రస్వామి బిహార్ అడవుల్లో తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించి తాంత్రిక స్వామీజీగా, జ్యోతిష్కుడిగా బాగా పేరు తెచ్చుకుని ఢిల్లీ గూటికి చేరారు. నటి ఎలిజబెత్ టేలర్, బ్రిటన్ మాజీ ప్రధాని మార్గరెట్ థాచర్, ఆయుధ వ్యాపారి అద్నన్ ఖషోగ్గీ, అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంలకూ ఆయన ఆధ్యాత్మిక సలహాలిచ్చే వారని చెబుతారు. ఆయన ఆశ్రమంపై ఆదాయపు పన్ను అధికారులు దాడులు చేయగా, అద్నన్ ఖషోగ్గీకి చెల్లింపులు చేసినట్లుగా ఆధారాలూ బయటపడ్డాయి. 1975లో థాచర్ తన ‘కామన్స్ ఆఫీస్’లో చంద్రస్వామితో మాట్లాడినప్పుడు.. నాలుగేళ్లలో ఆమె ప్రధాని అయ్యి, దశాబ్దకాలం పాటు ఆ పదవిలో కొనసాగుతారని ఆయన జ్యోతిష్యం చెప్పినట్లు కొన్ని నివేదికలు వెల్లడించాయి. అనంతరం చెప్పినట్లుగానే ఆమె బ్రిటన్ ప్రధాని అయ్యారు. -
వివాదాస్పద తాంత్రికుడు చంద్రస్వామి కన్నుమూత
-
ఓయూలోనే ఓనమాలు...
ఎందరో రాజకీయ పాఠాలు నేర్చింది ఉస్మానియాలోనే.. - ప్రజాజీవితంలో గుబాళించిన ప్రముఖులు - పీవీ, కేసీఆర్‌ల ప్రస్థానం ఇక్కడ్నుంచే.. సాక్షి, హైదరాబాద్: శత వసంతాల చదువుల తల్లి ఉస్మానియా ఒడిలో ఓనమాలు నేర్చుకున్న ఎందరో రాజకీయ కార్యక్షేత్రంలో ప్రముఖులుగా ఎదిగారు. దేశ ప్రధానిగా పనిచేసిన పీవీ నరసింహారావు మొదలు.. సీఎంలు.. కేంద్రమంత్రులుగా పనిచేసిన పలువురు నేతలు విశ్వవిద్యాలయంతోపాటు ఓయూ అనుబంధ కళాశాలల్లో చదివారు. శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఓయూ లెజెండ్స్‌పై ప్రత్యేక కథనం.. సంస్కరణల సారథి.. పీవీ.. దక్షిణాది నుంచి దేశ అత్యున్నత పదవి ప్రధాని పీఠాన్ని అధిరోహించిన గొప్ప పరిపాలనాధ్యక్షుడు, సంస్కరణల రథసారథి పాములపర్తి వెంకట నరసింహారావు ఉస్మానియా వర్సిటీలోనే చదివారు. బహు భాషాకోవిదుడిగా, న్యాయవాదిగా, కవిగా, పరిపాలనాదక్షుడిగా, అపర రాజకీయ చాణక్యుడిగా పేరొందిన తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ 1921, జూన్ 28న కరీంనగర్ జిల్లాలో జన్మించారు. ఆయన ఓయూ ఆర్ట్స్ కళాశాల నుంచి బ్యాచిలర్ డిగ్రీ పొందారు. ఉమ్మడి ఏపీకి సీఎంగా పనిచేసిన కాలంలో భూసంస్కరణలకు నాంది పలికారు. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ కేబినెట్లలో సుదీర్ఘ కాలంపాటు మంత్రిగా పనిచేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టడం తో దేశంలోకి బహుళ జాతి కంపెనీలతోపాటు పెట్టుబడులు వెల్లువెత్తాయి. ఉపాధి అవకాశాలు పెరిగాయి. దేశ ఆర్థిక వ్యవస్థను గొప్ప మలుపు తిప్పిన చరిత్ర పీవీకే సొంతం. ఆయన ఉస్మానియా ముద్దుబిడ్డ కావడం ఓయూ పూర్వ విద్యార్థులకు గర్వకారణం. వి.ఎస్.రమాదేవి కేంద్ర ఎన్నికల సంఘం తొలి మహిళా చీఫ్ కమిషనర్‌గా పనిచేసిన వీఎస్ రమాదేవి ఓయూ పూర్వ విద్యార్థే. 1934 జనవరి 15న జన్మించిన ఆమె.. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పీజీ చేశారు. పి.శివశంకర్ కేంద్ర న్యాయశాఖ మంత్రిగా, గొప్ప పార్లమెంటేరియన్‌గా పనిచేసిన పుంజాల శివశంకర్ కూడా ఓయూ పూర్వ విద్యార్థే. మూడుసార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. సిక్కిం, కేరళ గవర్నర్‌గా పనిచేశారు. 1929 ఆగస్టు 10న ఆయన జన్మించారు. కె.చంద్రశేఖర్‌రావు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి.. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సారథి కేసీఆర్ ఓయూలోనే చదివారు. 1954 ఫిబ్రవరి 17న జన్మించిన ఆయన.. ఉస్మానియా వర్సిటీ ఆర్ట్స్ విభాగంలో డిగ్రీతోపాటు పీజీ పూర్తి చేశారు. తెలంగాణ ఉద్యమానికి ఓయూ పురిటిగడ్డగా నిలిచిన విషయం విదితమే. కేసీఆర్ తన ఉద్యమపథంలో ఏ పిలుపునిచ్చినా ఓయూ విద్యార్థులు కదన రంగంలోకి దూకారు. ఉమ్మడి ఏపీలో అసెంబ్లీ ఉప సభాపతిగా, రాష్ట్ర మంత్రిగా, యూపీఏ హాయాంలో కేంద్రమంత్రిగా పలు కీలక పదవులు చేపట్టారు. నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి చిట్ట చివరి సీఎంగా పనిచేసిన నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఓయూ కామర్స్ విభాగంలో డిగ్రీ, న్యాయశాస్త్రంలో పీజీ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభ స్పీకర్‌గా, చీఫ్ విప్‌గా పనిచేశారు. ఆయన 1960 సెప్టెంబర్ 13న జన్మించారు. సూదిని జైపాల్‌రెడ్డి... కేంద్రమంత్రిగా, ఉత్తమ పార్లమెంటేరియన్‌గా, గొప్ప వక్తగా పేరొందిన సూదిని జైపాల్‌రెడ్డి ఓ యూ నుంచి ఆంగ్ల సాహిత్యంలో పీజీ డిగ్రీతోపాటు జర్నలిజంలో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. కేంద్ర ప్రభుత్వంలో కీలక శాఖలకు మంత్రిగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో తనదైన పాత్ర పోషించారు. 1942 జనవరి 16న ఆయన జన్మించారు. మరాఠా సీఎం ఎస్బీ చవాన్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండుసార్లు, కేంద్రమంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసిన ఎస్.బి.చవాన్ (శంకర్రావ్ భావ్‌రావ్ చవాన్)కూడా ఉస్మానియా పూర్వ విద్యార్థే. ఆయన 1920 జూలై 14న జన్మించారు. ఓయూ నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ పొందారు. నాలుగుసార్లు మహారాష్ట్ర నుంచి ఎంపీగా గెలుపొందారు. ధరమ్‌సింగ్ నారాయణ్‌సింగ్ కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసిన ధరమ్‌సింగ్ నారాయణ్ సింగ్ ఓయూలో మాస్టర్స్ డిగ్రీతోపాటు న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1936 డిసెంబర్ 25న జన్మించిన ఆయన పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశారు. శివరాజ్ విశ్వనాథ్ పాటిల్ గొప్ప పార్లమెంటేరియన్‌గా, కేంద్ర హోంమంత్రిగా, లోక్‌సభ స్పీకర్‌గా పనిచేసిన శివరాజ్ పాటిల్ ఓయూ పూర్వ విద్యార్థే. ఆయన ఏడుసార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1935 అక్టోబర్ 12న జన్మించిన ఆయన.. పంజాబ్, చండీగఢ్‌లకు గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్‌గా పనిచేశారు. ఓయూ నుంచి ఆయన సైన్స్‌లో డిగ్రీ పొందారు. -
వారి డబ్బు దక్కేలా చూడటమే మా లక్ష్యం
అగ్రిగోల్డ్ కేసులో స్పష్టం చేసిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ యాజమాన్యం చెల్లించాల్సిన మొత్తాలను డిపాజిటర్లకు దక్కేలా చూడటమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమని ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసింది. అందులో భాగంగా ముందు ఆస్తులను వేలం వేయడం, తరువాత వేలం ద్వారా వచ్చిన మొత్తాలను డిపాజిటర్లకు ఆయా నిష్పత్తిలో పంపిణీ చేయడమే తమ ముందున్న ప్రాధాన్యత కార్యక్రమాలని తెలిపింది. ఈ రెండూ పనులు పూర్తి చేసిన తరువాతే, డిపాజిట్లు ఎగవేసిన అగ్రి యాజమాన్యంపై ప్రాసిక్యూషన్ వ్యవహారాన్ని పరిగణనలోకి తీసుకుంటామంది. ఆస్తుల వేలానికి మెరుగైన స్పందన వచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు, సలహాలు ఇచ్చేందుకు ఏపీ సీఐడీ, అగ్రిగోల్డ్ యాజమాన్యానికి మరింత గడువునిచ్చింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పీవీ పాఠ్యాంశాన్ని ఎందుకు చేర్చడం లేదు? ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను వివరణ కోరిన హైకోర్టు మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ పీవీ నరసింహారావుకు సంబంధించిన పాఠ్యాంశాన్ని ఎనిమిదో తరగతి హిందీ పాఠ్యపుస్తకం నుంచి తొలగించడంపై హైకోర్టు బుధవారం ఉభయ రాష్ట్ర ప్రభుత్వాల వివరణ కోరింది. పీవీ పాఠ్యాంశాన్ని ఎందుకు పునరుద్ధరించడం లేదో చెప్పాలంటూ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శులు, కమిషనర్లు తదితరులకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారు. -
నేడు ఏయూలో పీవీ స్మారకోపన్యాసం
-
నేడు ఏయూలో పీవీ స్మారకోపన్యాసం
గోరటి వెంకన్నకు ’లోక్‌నాయక్’ పురస్కార ప్రదానం: యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ సాక్షి, విశాఖపట్నం: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఐదవ స్మారకోపన్యాసాన్ని విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం బీఆర్ అంబేడ్కర్ హాలులో శనివారం నిర్వహిస్తున్నట్టు రాజ్యసభ మాజీ సభ్యుడు, లోక్‌నాయక్ ఫౌండేషన్ అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ శనివారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వెంకటాచలయ్య ’నాగరికత–సంస్కృతి–సమాజం’ అనే అంశంపై ప్రసంగిస్తారన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ సభకు అధ్యక్షత వహిస్తారని, సుప్రీంకోర్టు మరో న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు, జ్యుడిషియల్ అకాడమీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జస్టిస్ గోడె రఘురాం, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి, ఎమెస్కో అధిపతి దూపాటి విజయకుమార్‌లు పాల్గొంటారని చెప్పారు. లోక్‌నాయక్ ఫౌండేషన్ 13వ వార్షిక పురస్కార ప్రదాన కార్యక్రమం సాయంత్రం 5 గంటలకు ఏయూ అసెంబ్లీ హాల్లో జరుగుతుందని యార్లగడ్డ తెలిపారు. తెలుగు సాహిత్యంలో విశేష కృషి చేసిన వారికి ఏటా ఈ అవార్డులను ఇస్తున్నామన్నారు. ఈ ఏడాది గోరటి వెంకన్నకు ఈ పురస్కారానికి ఎంపిక చేశామని, అవార్డుతో పాటు రూ.లక్షా 50 వేల నగదును అందజేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా సంగీత విభావరి ఏర్పాటు చేశామన్నారు. -
పీవీ రాజేశ్వరరావుకు కన్నీటి వీడ్కోలు
- తరలివచ్చిన కాంగ్రెస్ ప్రముఖులు.. భౌతికకాయం గాంధీభవన్‌కు తరలింపు - మహాప్రస్థానంలో ముగిసిన అంత్యక్రియలు హైదరాబాద్: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తనయుడు, కాంగ్రెస్ పార్టీ మాజీ లోక్‌సభ సభ్యుడు పీవీ రాజేశ్వరరావుకు ప్రజలు కన్నీటి వీడ్కోలు పలికారు. తీవ్ర అనారోగ్యానికి గురై సోమవారం సాయం త్రం రాజేశ్వరరావు కన్నుమూసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ ఆదర్శనగర్‌లోని స్వగృహంలో ఆయన భౌతికకాయానికి మం గళవారం పలువురు కాంగ్రెస్ ప్రముఖులు నివాళులు అర్పించారు. పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి, పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, కాంగ్రెస్ నేతలు జైపాల్‌రెడ్డి, సుబ్బిరామిరెడ్డి జానారెడ్డి, శ్రీధర్‌బాబు, దానం నాగేందర్, అంజన్‌కుమార్ యాదవ్, సంతోష్‌రెడ్డి, శ్రీచరణ్జోషి, దైవజ్ఞశర్మ తదితరులు రాజేశ్వరరావు భౌతిక కాయానికి నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు. రాజేశ్వరరావు భార్య రాధిక, కుమారుడు రాఘవేంద్ర కశ్యప్, కుమార్తెలు సత్యశ్రీ, విశాలలను పరామర్శించి సానుభూతిని ప్రకటించారు. భౌతికకాయం గాంధీభవన్‌కు తరలింపు ఇతర కాంగ్రెస్ నేతల సందర్శనార్ధం రాజేశ్వరరావు భౌతికకాయాన్ని గాంధీ భవన్ కు తరలించారు. ఇక్కడ గంట పాటు ఉంచి అనంతరం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థా నానికి తరలించి అంత్యక్రియలను పూర్తి చేశారు. అంతిమయాత్రలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గాంధీభవన్‌లో నివాళులు పీవీ రాజేశ్వరరావు భౌతికకాయానికి హైదరాబాద్‌లోని గాంధీ భవన్లో పలువురు నేతలు మంగళవారం నివాళులర్పించారు. అనారోగ్యంతో సోమవారం తుదిశ్వాస విడిచిన రాజేశ్వరరావు భౌతిక కాయాన్ని కార్యకర్తలు, అభిమానుల సందర్శన కోసం గాంధీభవన్‌లో మంగళవారం కొద్దిసేపు ఉంచారు. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్‌రెడ్డి, మాజీ మంత్రులు డి.శ్రీధర్ బాబు, దానం నాగేందర్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ తదితరులు పుష్పగుచ్ఛాలుంచి నివాళులర్పించారు. ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. -
ఆర్థిక సంస్కరణలతో దేశాన్నికాపాడింది పీవీయే!
-
ఆర్థిక సంస్కరణలతో దేశాన్నికాపాడింది పీవీయే!
సాక్షి, హైదరాబాద్: నూతన సంస్కరణలను ప్రవేశపెట్టి, దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి కాపాడిన హీరో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అని మాజీ గవర్నర్ రంగరాజన్ అభిప్రాయపడ్డారు. ఆయన తన విధానాలతో దేశాన్ని అనేక సమస్యల నుంచి బయటపడవేయగలిగారని చెప్పారు. గురువారం హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ ఎకనమిక్ సోషల్ స్టడీస్‌లో జరిగిన కార్యక్రమంలో సంజయ్ బారు రచించిన ‘1991 హౌ పీవీ నరసింహారావు మేడ్ హిస్టరీ’ అనే పుస్తకాన్ని రంగరాజన్ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడారు. సంజయ్‌బారు తన పుస్తకంలో పీవీ కన్నా ముందు ప్రధానులుగా ఉన్న వీపీ సింగ్, చంద్రశేఖర్లకు ఈ దేశ పరిస్థితులపై ఎటువంటి అవగాహన ఉన్నదన్న సంశయాన్ని లేవనెత్తారని రంగరాజన్ పేర్కొన్నారు. ఐఎంఎఫ్ లాంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి ఆర్థిక సాయాన్ని పొందడంపై కూడా ఆనాటి రాజకీయనేతల్లో అవసరమైన చొరవ కొరవడిందని వ్యాఖ్యానించారు. అయితే 1991 నాటి రాజకీయ, ఆర్థిక పరిస్థితులు పీవీ నరసింహారావుకు సంస్కరణల అవకాశం కల్పించాయని చెప్పారు. ఒకవేళ అప్పుడు చంద్రశేఖర్ ప్రధానిగా ఉన్నా ఆర్థిక సంస్కరణలను ఆహ్వానించక తప్పేది కాదన్నారు. ఈ పుస్తకం ఆద్యంత ఆసక్తిదాయకంగా ఉందని చెప్పారు. అయితే 1992లో పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించిన ప్రస్తావన కూడా పుస్తకంలో ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. అద్భుత పథకాల రూపశిల్పి ఆర్థిక సంస్కరణల సృష్టికర్త మాత్రమే కాదని.. సోషలిజాన్ని కాంక్షించిన నెహ్రూ అనుయాయుడు పీవీ అని ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు సీహెచ్ హనుమంతరావు పేర్కొన్నారు. ఉపాధి అవకాశాల ద్వారానే సామాజిక న్యాయం చేకూర్చగలమని ఆయన నమ్మి, ఆచరించారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అట్టడుగు బలహీన వర్గాలకు పథకాలు చేరకపోతే నష్టం జరుగుతుందని భావించి.. నేరుగా కేంద్రం నుంచి పేద, దళిత, బలహీనవర్గాలకు అందేలా అద్భుతమైన పథకాలను రూపొందించారని ప్రశంసించారు. ఆనాడు పీవీ వద్ద పనిచేసిన ఎస్.ఆర్.శంకరన్, కె.ఆర్.వేణుగోపాల్‌లు రూపొం దించిన అనేక పథకాల ఫలితాలను ప్రజలు ఇప్పటికీ అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలకు చేరువైన మానవతా మూర్తి పీవీ అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికార ప్రతినిధి పరకాల ప్రభాకర్ పేర్కొన్నారు. ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఆర్థిక సౌలభ్యాలన్నీ ఆయన సంస్కరణల ఫలితమేనని చెప్పారు. పుస్తక రచయిత సంజయ్ బారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ పీవీ నరసింహారావు చరిత్రను పూర్తిగా చెరిపేసే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఆర్కీవ్స్లోగానీ, లైబ్రరీలోగానీ పీవీ చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు కూడా లేకుండా చేశారన్నారు. కానీ పీవీ లేని కాంగ్రెస్ చరిత్ర ప్రజలు అంగీకరించరని వ్యాఖ్యానించారు. కార్యక్రమానికి సంధానకర్తగా శ్రీరాం వ్యవహరించగా.. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బీపీఆర్ విఠల్ తదితరులు పాల్గొన్నారు. -
పీవీకి భారతరత్న ఇవ్వాలి
పుస్తకావిష్కరణ సభలో సంజయ్ బారు సాక్షి,న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మీడియా సలహాదారు, సీనియర్ పాత్రికేయుడు సంజయ్ బారు రచించిన ‘1991: హౌ పీవీ నరసింహారావు మేడ్ హిస్టరీ’ పుస్తకాన్ని ఢిల్లీలో మంగళవారం కేంద్ర మాజీ మంత్రులు పి.చిదంబరం, యశ్వంత్‌సిన్హా ఆవిష్కరించారు. కాంగ్రెస్‌లో నెహ్రూ-గాంధీ కుటుంబం ఆధిపత్యానికి గండికొట్టి పీవీ అధికారాన్ని చేపట్టినందుకే ఆయన చనిపోయినపుడు పార్థివ దేహాన్ని లోపలికి తీసుకురానీయకుండా పార్టీ కార్యాలయ ద్వారాలు మూసేశారని, అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలూ నిర్వహించలేదని ఈ పుస్తకంలో పేర్కొన్నారు. పీవీ పాలనలో చూపిన దక్షతకు భారతరత్న ప్రకటించాలని, కాంగ్రెస్‌లో నెహ్రూ-గాంధీ కుటుంబంవారే కాక ఇతరులూ ప్రధానులు కావొచ్చన్న ఆశలు నింపిన వ్యక్తి పీవీ అని సంజయ్ అన్నారు. భారత చరిత్రలో 1991 సంవత్సరానికి ఎంతో ప్రత్యేకత ఉందనీ, అత్యంత అవసరమైన ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టడమేకాక, రాజకీయ సుస్థిరతను పీవీ పునరుద్ధరించారని గుర్తుచేశారు. -
వినేవాడు వెర్రివాడైతే.. చెప్పేవాడు చంద్రబాబు!
సాక్షి, హైదరాబాద్: వినేవాడు వెర్రివాడైతే చెప్పేది చంద్రబాబు అన్న చందం మరోసారి నిజమైంది. తన అభివృద్ధిని అప్పటి ప్రధాని అమెరికాలోనూ మెచ్చుకున్నారని మండలి సభ్యులను నమ్మించే ప్రయత్నం చేశారు చంద్రబాబు. ఇంతకీ విషయం ఏంటంటే.. తాను హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన విషయాన్ని అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు అమెరికా పర్యటనలో పొగిడారని, మాక్కూడా మీలాంటి నగరాలున్నాయని హైదరాబాద్ పేరు చెప్పారని చంద్రబాబు గురువారం మండలిలో చెప్పారు. అయితే బాబు సీఎం అయింది 1995 సెప్టెంబరులో. పీవీ నరసింహారావు ప్రధానిగా 1996లో దిగిపోయారు. అంటే చంద్రబాబు పదవిలోకి వచ్చిన 8 నెలల్లోనే హైదరాబాద్‌ను ఎలా అభివృద్ధి చేశారని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. -
పీవీ గొప్ప సంస్కరణవేత్త కాదు
- తప్పనిసరి పరిస్థితుల వల్లే సంస్కరణలు తెచ్చారు: జైట్లీ - పీవీ ప్రధాని అయినపుడు దేశం దివాలా తీసే పరిస్థితి ఉంది ముంబై : మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు గొప్ప సంస్కరణవేత్తో, పెద్ద సరళీకరణవేత్తో కాదని, నెహ్రూ తరహా ఆర్థిక విధానాలు విఫలమవటంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే పీవీ సంస్కరణలను ప్రారంభించారని కేంద్ర ఆర్థికమంత్రి జైట్లీ వ్యాఖ్యానించారు. పీవీ ప్రధానిగా ఉండగా 1991లో దేశంలో ఆర్థిక సంస్కరణలను ప్రారంభించారు. జైట్లీ శనివారం ముంబైలో బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. పీవీ మీద రాసిన పుస్తకం (హాఫ్ లయన్: హౌ పి.వి.నరసింహారావ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇండియా)లో ప్రస్తావించిన ఒక ఘటనను ఉటంకిస్తూ.. ‘‘పీవీ ఏపీలో న్యాయశాఖ మంత్రిగా ఉన్నపుడు ప్రైవేటు కాలేజీలన్నిటినీ రద్దుచేయాలని, ప్రభుత్వమే కాలేజీలు నడపాలన్నది ఆయన తొలి నిర్ణయం. కానీ ఆయన ప్రధాని అయినపుడు దేశ ఖజానాలో విదేశీ మారకద్రవ్య నిల్వలు లేవని ఆయన గుర్తించారు. దేశం దివాలా దిశగా పోతోంది. తప్పనిసరి స్థితి కారణంగా సంస్కరణలు తెచ్చారు.’ అని అన్నారు. తీవ్ర విమర్శల పాలైన ‘హిందూ వృద్ధి రేటు’ (ఆర్థిక సంస్కరణలకు పూర్వం 1950 - 1980ల మధ్య దేశంలో వృద్ధి రేటు)కు నెహ్రూ ఆర్థికవిధానాలే కారణమన్నారు. ‘‘1950, 60లలో మనకు పరిమిత వనరులు ఉన్నాయి. 70లు, 80లలో వృథా అయ్యాయి. అప్పుడు కొన్ని పనులు తామే చేయాలనేది ప్రభుత్వ ఆలోచన. టెలికం రంగం ఇందుకు ఉదాహరణ. 1947-95 వరకూ ఫోన్ కనెక్షన్ ఇవ్వడం తమ పనేనని ప్రభుత్వాలు భావించాయి. తొలి 50 సంవత్సరాల్లో భారతీయుల్లో ఒక శాతం కన్నా తక్కువ మందికే టెలిఫోన్లు ఉన్నాయి. కానీ టెలికాం రంగంలోకి ప్రైవేటు రంగం ప్రవేశించాక కనెక్షన్ల సంఖ్య 20 ఏళ్లలో 80 శాతానికి పెరిగాయి. తప్పనిసరి పరిస్థితితో నెహ్రూ తరహా ఆలోచనా విధానం నుంచి బయటకు వచ్చాం’’ అని అన్నారు. -
ఉగ్రవాదులకు పీవీ బిర్యానీ పెట్టించారా?
'ముంబైలో మారణహోమం సృష్టించి, పోలీసులకు పట్టుబడ్డ పాక్ ఉగ్రవాది అజ్మల్ కసబ్.. జైలులో బిర్యానీ కావాలని గొడవచేసేవాడని విన్నాం. ఈ ఉగ్రవాదులకు బిర్యానీ తినిపించే ప్రక్రియ ఇప్పటిదికాదు.. మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు సైతం టెర్రరిస్టులకు బిర్యానీ తినిపించారని అప్పట్లో వార్తలు వచ్చాయి. సీమాంతర ఉగ్రవాదం, వేర్పాటువాదం కశ్మీర్ ను తీవ్రంగా వణికిస్తున్న రోజులవి. ఎడతెగని ఆందోళనలనలను అదుపుచేసే క్రమంలో పీవీ సర్కారు.. ఉగ్రవాదుల(వేర్పాటువాదుల)తో చర్చలు జరపాలని నిర్ణయించింది. 1993లో శ్రీనగర్ లోని ప్రఖ్యాత హజ్రత్ బాల్ దర్గా వేదికగా చర్చలు జరిగాయి. గంటలపాటు జరిగిన నాటి చర్చల్లో భోజనవిరామం అనివార్యమైంది. కానీ చివరికి చర్చలు విఫలమయ్యాయి. 'చేతికి చిక్కిన టెర్రరిస్టు నాయకులను చంపకుడా.. పీవీ నర్సింహారావు వాళ్లకు బిర్యానీ పెట్టి పంపించారు' అని పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. మీడియా సంస్థలు సైతం పీవీ బిర్యానీని హైలెల్ చేశాయి. అసలేం జరిగింది? నిజానికి కసబ్ బిర్యానీ అడగనేలేదని, అతనిపై జడ్జీలకు, ప్రజలకు కోపం పెరగాలని(!) తానే బిర్యానీ థియరీని సృష్టించినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ తర్వాతికాలంలో (కసబ్ ఉరితీత అనంతరం) వెల్లడించారు. అలానే పీవీ టెర్రరిస్టులకు బిర్యానీ వడ్డించారన్నది కూడా పచ్చి అవాస్తవం. అప్పటి చర్చల్లో భోజనం తిన్నది నిజమే, అయితే అది సీఆర్పీఎఫ్ క్యాంప్ నుంచి తెప్పించిన సాధారణ భోజనం. కశ్మీరీ రచయిత బషారత్ పీర్ వివరణ ప్రకారం అసలు కశ్మీరీలు బిర్యానీని పెద్దగా ఇష్టపడరు. ఈ రెండు సందర్భాల్లోనూ కనీస నిజనిర్ధారణ లేకుండా వార్తా సంస్థలు చర్చలు చేశాయి. అలాంటివి ఎన్నో.. 2014లో బదౌన్ కు చెందిన ఇద్దరు దళిత యువతులపై సామూహిక అత్యాచారం, హత్య ఉదంతం కూడా అలాంటిదే. ఆ ఘటనపై టీవీ చర్చల్లో నాయకులు ఆవేశపూరితంగా మాట్లాడు. నిందితులను ఉరితీయాలని డిమాండ్ చేశారు. నిజానికి అది అత్యాచారహత్య కాదు.. ఆత్మహత్య అని తర్వాత తెలిశాక.. టీవీల చర్చలను 'పెద్ద జోక్'గా వీక్షకుడు భావించడా? రోహతక్ అక్కచెల్లెళ్లు తమను బస్సులో వేధించిన ఆకతాయిని తన్ని పతాక శీర్షికల్లో చోటుచేసుకున్నారు. వారి సాహసాన్ని మెచ్చుకుంటూ ప్రభుత్వం వారికి రివార్డులు కూడా ప్రకటించింది. కానీ ఆ తెగింపు దృశ్యాలన్నీ నాటకమని, తన్నులు తిన్నది వాళ్ల మనిషేఅని తెలిసిన తర్వాత మనం ముక్కున వేలేసుకున్నాం. ఈ సందర్భంలోనూ టీవీ చర్చలు కామెడీ షోలయ్యాయి. నాగాలాండ్ లో ఒక మహిళపై అత్యాచారం చేశాడనే ఆక్రోశంతో జనం.. జైలు గొడలు బద్దలుకొట్టిమరీ లోపలున్న యువకుణ్ని బైటికి ఈడ్చుకొచ్చి కొట్టి చంపారు. అసలు ఆ యువకుడికీ, రేప్ కు సంబంధమేలేదని, నిజానికి అతడో అమర సైనికుడి సోదరుడని తేలిసింది. కోల్ కతాలో 70 ఏళ్ల క్రైస్తవ సన్యాసినిపై రేప్ కేసులో పట్టుబడ్డ యువకులదీ ఇలాంటి గాధే. విషయం తెలిసిన వెంటనే.. టీవీ చానెళ్లు దానిపైన విస్తృత చర్చ మొదలుపెడతాయి. అభిప్రాయ ప్రకటనలో వక్తలు ఆవేశాగ్రహాలు వ్యక్తచేస్తారు. కానీ అందులోని నిజానిజాల గురించి తెలుసుకునే ప్రయత్నం చెయ్యరు.' ఇది.. టీవీ చానెళ్ల తీరుతెన్నులు, వార్తల వెనుక వాస్తవాలను క్రోడీకరిస్తూ ఇటీవలే విడుదలైన 'More News is Good News : Untold Stories from 25 Years of Television: ' అనే పుస్తకంలో ప్రముఖ జర్నలిస్ట్ శేఖర్ గుప్తా వెలిబుచ్చిన అభిప్రాయం. 'What Kasab's Biryani In Jail Says About News TV' శీర్షికతో ఆయన రాసిన ఒపీనియన్.. నేటి చానెళ్ల లేదా టీవీ చర్చల వింత పోకడను సులువుగా అర్థం చేసుకునేలా ఉంటుంది. ఇలాంటి ఎన్నో అభిప్రాయల సంకలనమైన 'More News is Good News' పుస్తకాన్ని హూపర్ కొలిన్స్ సంస్థ ప్రచురించింది. ఎమ్మార్పీ ధర రూ.799. అమెజాన్ లో రూ.543కే లభిస్తుంది. -
పాతికేళ్ళ సంస్కరణల గుణపాఠాలు
ప్రపంచంలోని పేదలలో సగానికి పైగా ఇండియాలోనే. ప్రాథమిక ఆరోగ్యం, వైద్యరంగాల నుంచి ప్రభుత్వం పూర్తిగా వైదొలుగుతోంది. నిరుద్యోగం యువతను పీడిస్తూనే ఉంది. ఆర్థిక సంస్కరణలలో మానవీయకోణం కనిపించడం లేదని పదవీ విరమణ చేసిన తర్వాత పీవీ అంటూ ఉండే వారు. ‘రిఫార్మ్స్ విత్ హ్యూమన్ ఫేస్’ అంటూ ఆయన ప్రతిపాదించిన సూత్రం ఎక్కడో ఆగిపోయింది. ‘పరిస్థితి ఇంత దారుణంగా ఉందా?’ కేబినెట్ సెక్రటరీ నరేశ్‌చంద్ర ఇచ్చిన నోట్ చదివిన మీదట ప్రధాని పీవీ నరసింహారావు ప్రశ్న. ‘లేదు సర్. అంతకంటే అధ్వానంగా ఉంది’ అని రమేశ్చంద్ర జవాబు. ఆ నోటు చదివిన తర్వాత కొన్ని గంటలలోనే ఆర్థిక సంస్కరణలు అమలు చేయాలని పీవీ నిర్ణయించారు. కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్ రాసిన గ్రంథం ‘టు ది బ్రింక్ అండ్ బ్యాక్-ఇండియాస్ 1991 స్టోరీ’లో ఈ ఉదంతం వివ రంగా ఉంది. ఆర్థిక సంస్కరణల అమలు జరిగిన విధంపైన మొట్టమొదట వచ్చిన పుస్తకం గురుచరణ్‌దాస్ రచించిన ‘ఇండియా అన్బౌండ్’. తాజా పుస్తకం వినయ్ సీతాపతి రచన ’పీవీ నరసింహారావు-హాఫ్ లయన్’. నాటి ప్రధాని కార్యాలయంలో ప్రత్యేకాధికారిగా పనిచేసిన జైరాం ఆర్థిక సంస్కరణ లకు ప్రత్యక్ష సాక్షి. సరిగ్గా పాతికేళ్ళ కిందట ఇదే రోజు (జూలై 24, 1991) కేంద్ర ఆర్థికమంత్రి మన్మోహన్సింగ్ తొలి సంస్కరణల బడ్జెట్ ప్రతిపాదనలను లోక్ సభలో ప్రవేశపెట్టారు. మన్మోహన్ బడ్జెట్ ప్రసంగం ప్రారంభంలోనే ‘సమయం ఆసన్నమైన ఆలోచనను ప్రపంచంలో ఏ శక్తీ నిలువరించలేదు’ అంటూ విక్టర్ హ్యూగోని ఉటంకించారు. ‘ఆర్థికశక్తిగా భారత్ ఎదగాలన్నది అటువంటి ఆలో చనలలో ఒకటి’ అని ప్రకటించారు. (’Victor Hugo said no power on earth can stop an idea whose time has come. I suggest to this August House that emergence of India as a major economic power in the world happens to be one such idea. Let the whole world hear loud and clear. India is now wide awake. We shall prevail. We shall overcome!’). ఈ చారిత్రక ఘట్టం తర్వాత పాతి కేళ్ళు కాలగర్భంలో కలసిపోయాయి. పీవీ-మన్మోహన్ ద్వయం ఆశించినట్టు ఇండియా ఆర్థికశక్తిగా ఎదిగే క్రమంలో వేగంగా ముందుకు పోతోంది. ఆర్థిక సంస్కరణలు అనివార్యమైన పరిస్థితి దాపురించిన పాడురోజులను తలచు కుంటే సంస్కరణలు దేశానికి చేసిన మేలు అర్థం అవుతుంది. దిగుమతులకు విదేశీ మారకద్రవ్యం చెల్లించలేని దుస్థితిలో దేశం ఉన్నప్పుడు అంతర్జాతీయ ద్రవ్యసంస్థ (ఇంటర్నేషనల్ మానెటరీ ఫండ్-ఐఎంఎఫ్)తో చేసుకున్న ఒప్పందం ప్రకారం చంద్రశేఖర్ ప్రభుత్వం యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జ ర్లాండ్‌లో, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌లో బంగారం కుదువపెట్టవలసి వచ్చింది. అప్పటికి రెండు, మూడు వారాలకే బొటాబొటి సరిపోను విదేశీమారకద్రవ్యం నిల్వలు ఉన్నాయి. నిజానికి నరేశ్‌చంద్ర పీవీకి చూపించిన నోటు చంద్రశేఖర్ ప్రభుత్వ పరిశీలన కోసం మాంటెక్‌సింగ్ అహ్లూవాలియా తయారుచేసింది. కాంగ్రెస్ మద్దతు ఉపసంహరణతో చంద్రశేఖర్ ప్రభుత్వం కూలిపోయింది. ఆ నోట్లోని అంశాలను అమలు చేసే అవకాశం లేకపోయింది. 1991 ఎన్నికలు మొదటి దశ ముగిసి రెండవ దశకు ప్రచారంలో ఉండగా శ్రీపెరంబుదూరులో ఎల్టీటీఈ ప్రయోగించిన మానవబాంబు విస్ఫోటనంలో రాజీవ్ మరణిం చారు. సన్యాసం స్వీకరించి కుర్తాళం పీఠాధిపతిగా బాధ్యతలు నిర్వహించేందుకు సిద్ధమైన పీవీకి ఆ విధంగా రాజయోగం పట్టింది. ఆర్థిక సంస్కరణలు అమలు చేసి చరిత్రలో చిరస్థాయిగా నిలిచే అపూర్వమైన అవకాశం దక్కింది. అందరిదీ అదే బాట సంస్కరణల బాటలో రెండున్నర దశాబ్దాలు నిర్నిరోధంగా ప్రయాణం చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి. పరిస్థితిని సమీక్షించుకోవాలి. పీవీ హయాంలో ప్రారంభమైన సంస్కరణలనే వాజ్‌పేయి, మన్మోహన్సింగ్ కొనసాగించారు. నరేంద్రమోదీ సమధికోత్సాహంతో సంస్కర ణలను వేగవంతం చేస్తున్నారు. ఆర్థిక విధానంలో రెండు జాతీయ పక్షాలకూ భావసామ్యం ఉండటం వల్ల సంస్కరణలకు విఘాతం కలగలేదు. నాటి ఇండియా అభివృద్ధి చెందిన దేశాల బృందం జి-77 కి నాయకత్వం వహించింది. నేడు అభివృద్ధి చెందిన దేశాల సరసన జి-20లో కూర్చున్నది. ఈ రోజు చైనా కంటే వేగంగా పెరుగుతున్న ఆర్థికవ్యవస్థగా ముందు వరుసలో ఉంది. నాడు తలసరి ఆదాయం 375 డాలర్లు ఉండగా ఇప్పుడు 1,700 డాలర్లు. కొనుగోలు శక్తిని ప్రాతిపదికగా తీసుకుంటే చైనా, అమెరికాల తర్వాత స్థానం ఇండియాదే. 2004 నుంచి 2011 వరకూ దేశంలో 13.8 కోట్ల మంది దారిద్య్ర రేఖ దాటుకొని పైకి వచ్చారు. పేదరికం నిర్మూలన చైనాలో కంటే వేగంగా ఇండియాలో జరిగిందని లెక్కలు చెబుతున్నాయి. నాడు భారతదేశంలోని కంపె నీలు బహుళజాతి కంపెనీలు వస్తే తమను మింగేస్తాయని బెదిరిపోయేవి. ఇప్పుడు భారతీయ కంపెనీలు బహుళజాతి సంస్థలుగా వర్థిల్లుతున్నాయి. వాణిజ్యంలో సంస్కరణలకు పూర్వం కొన్ని కుటుంబాలదే హవా. 1940లో ఏ కుటుంబాలు (టాటా, బిర్లా వగైరా) వాణిజ్య, పారిశ్రామిక రంగాలలో ముందు న్నాయో 1990లో కూడా అవే కుటుంబాలు ఉన్నాయి- ధీరూభాయ్ అంబానీ మినహా. సంస్కరణల పుణ్యమా అని ప్రేమ్‌జీ, నారాయణమూర్తి వంటి ప్రతిభా వంతులు మెగా ఐటీ సంస్థలను నిర్మించగలిగారు. నెహ్రూ, పీసీ మహలనొ బిస్ల ఆలోచనల ఫలితంగా పంచవర్ష ప్రణాళికలతో, మిశ్రమ ఆర్థిక విధానా లతో, సోషలిస్టు భావాలతో ప్రారంభమైన ప్రయాణం ఇందిరాగాంధీ హయాంలో సోషలిజాన్ని రాజ్యాంగ పీఠికలో చేర్చే వరకూ వెళ్ళింది. 1950 లలోనే మన ఆర్థికవ్యవస్థను ‘లెసైన్స్రాజ్’ అంటూ చక్రవర్తుల రాజగోపాలా చారి ఎద్దేవా చేశారు. ఇది అవినీతికీ, అసమర్థతకూ దారితీస్తుందంటూ జోస్యం కూడా చెప్పారు. ప్రముఖ ఆర్థికవేత్త, నెహ్రూ అభిమాని రాజ్‌కృష్ణ దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్న తీరును ‘హిందూ రేట్ ఆఫ్ గ్రోత్’ అంటూ అభివర్ణించారు. హిందూ ఆచారాలకూ, సంప్రదాయాలకూ తగినట్టు సాదా సీదాగా అభివృద్ధి ఉన్నదనీ, దేశం నెహ్రూని విఫలం చేసింది కానీ నెహ్రూ దేశాన్ని విఫలం చేయలేదనీ ఆయన వాదన. నెహ్రూ హయాంలో స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ) అభివృద్ధి రేటు 4.8 శాతం ఉండేది. ఇందిర పాలనలో ఆత్యయిక పరిస్థితి వరకూ (1965-1975) అది 3.4 శాతానికి తగ్గింది. 1975 నుంచి 1984 వరకూ 4.2కు పెరిగింది. 1984 నుంచి 1995 వరకూ 5.9 శాతానికీ, 1995 నుంచి 2005 వరకూ 7.1 శాతానికీ, 2004-05 నుంచి 2013-14 వరకూ 8.3 శాతానికీ పెరిగింది. ఈ లెక్కల ప్రకారం ఆర్థిక సంస్కరణలు దేశానికి గొప్ప మేలు చేశాయనే చెప్పాలి. చైనాతో పోటీయా? ఇప్పుడు చైనాతో పోటీపడాలనీ, ప్రపంచంలోనే మూడవ ఆర్థికశక్తిగా ఎదగాలనీ కలలు కంటున్నాం. ఈ అభివృద్ధి కథ యావత్తూ నాణేనికి ఒక వైపు మాత్రమే. ఇది చాలా ఆశాజనకం, ఆనందదాయకం. కానీ, నాణేనికి మరోవైపున ఏము న్నదో తెలుసుకుంటే ఆవేశం తగ్గి ఆలోచన మొదలవుతుంది. చైనా ఆర్థిక వ్యవస్థలో మన ఆర్థికవ్యవస్థ విలువ అయిదింట ఒక వంతు మాత్రమే. చైనాను అందుకోవడం అంత తేలిక కాదు. ప్రగతి రేటూ, విదేశీమారకద్ర వ్యం నిల్వలూ పెరగడాన్ని అభివృద్ధికి సంకేతంగా పరిగణిస్తున్నాం. నేషనల్ అకౌంట్స్ స్టాటిస్టిక్స్ అనే సంస్థ అభివృద్ధి రేటును లెక్కించడానికి ప్రాతిపదికగా తీసుకునే సంవత్సరాన్ని 2011-12కు జరపడం వల్లనే ఎక్కువ రేటు కనిపిస్తున్నదంటూ దేశంలోనూ, విదేశాలలోనూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విదేశీమారక ద్రవ్యం నిల్వలు పెరుగుతున్నది మనం దిగుమతులకు ఖర్చు చేసే నిధులకంటే ఎగుమతుల ద్వారా ఎక్కువ సంపాదిస్తున్నందువల్ల కాదు. నిజానికి, ఇప్పటికీ మన దిగుమతుల విలువ ఎగుమతుల విలువ కంటే అధికం. అంటే విదేశీ మారకద్ర వ్యం సంక్షోభంలో దేశం ఉండాలి. కానీ నిల్వలు ఉన్నాయి. కారణం ఏమిటి? మన దేశంలో పెట్టుబడి పెడుతున్నవారు విదేశీమారకద్రవ్యం కుప్పలు తెప్పలుగా తెస్తున్నారు. 2004కు పూర్వం విదేశీమారకద్రవ్యం విదేశాల నుంచి 800 కోట్ల నుంచి 1,500 కోట్ల డాలర్లు వచ్చింది. 2007-08 నాటికి అది 6000 కోట్ల డాలర్లకు పెరిగింది. ఇప్పుడు ఇంకా చాలా ఎక్కువ నిల్వలు ఉన్నాయి. అంటే నిల్వలు మనం సంపాదించుకున్నవి కావు. అరువు తెచ్చుకున్నవి. 1991లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టినప్పుడు విదేశీమారకద్రవ్యం గురించీ, అభివృద్ధి గురించే ఆలోచించారు కానీ వ్యవసాయరంగంపైన దృష్టి పెట్టలేదు. పత్తి పంట 1998 నుంచి తెలంగాణలో, విదర్భలో లక్షల ప్రాణాలు బలి తీసుకున్నది. ఉత్పాదకరంగంలో స్తబ్దత సంస్కరణలు భేషంటూ ప్రశంసించినవారు ప్రగతిపథంలో పరిశ్రమలూ, ఉత్పా దకరంగం ముందుంటాయని నమ్మబలికారు. లెసైన్స్-పర్మిట్‌రాజ్‌ను రద్దు చేసిన తర్వాత పరిశ్రమలు శరవేగంగా అభివృద్ధి చెందుతాయని భావించారు. నిజానికి అభివృద్ధి చెందిన ఇతర దేశాలలో అదే జరిగింది. 2010లో చైనా జీడీపీలో ఉత్పాదక రంగానికి 47శాతం, ఇండొనేషియాలో 47 శాతం, దక్షిణ కొరి యాలో 39 శాతం, మలేసియాలో 44 శాతం, థాయ్‌ల్యాండ్‌లో 45 శాతం ఉంటే ఇండియాలో 27 శాతం. రెండు దశాబ్దాలుగా పారిశ్రామికరంగంలో ఎదుగూ బొదుగూ లేదు. నేరుగా విదేశీ పెట్టుబడులు (ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్-ఎఫ్‌డీఐ) రూపంలో 2000 నుంచి 2015 వరకూ దేశంలోకి వచ్చిన 25,800 కోట్ల డాలర్లలో 49 శాతం ఫిలిప్పీన్స్, సింగపూర్ మార్గంలో వచ్చినవేనని జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ పరిశోధనలో తేలింది. పన్ను ఎగగొట్టడానికి ఈ మార్గం ఎంచు కున్నవారు విదేశీయులు కావచ్చు. మన దేశానికి చెందిన పెట్టుబడిదారులు కావచ్చు. అందుకే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సింగపూర్‌ను ఆకాశానికి ఎత్తు తుంటే ఆందోళన కలుగుతోంది. ఎఫ్డీఐలో కూడా ఉత్పాదక రంగంలోకి వెడుతున్నది 30 శాతం మాత్రమే. ప్రాథమిక సౌకర్యాల (ఇన్ఫ్రాస్ట్రక్చర్) రంగా నికీ, బడావ్యాపార సంస్థలకే ప్రభుత్వ రంగంలోని వాణిజ్య బ్యాంకులు సైతం ఉదారంగా రుణాలు ఇస్తున్నాయి. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రుణ సౌకర్యం లేదు. ప్రధాని నరేంద్రమోదీ ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదం తర్వాత కూడా పరిస్థితి మారలేదు. ప్రపంచంలోని పేదలలో సగానికి పైగా ఇండియాలోనే. ప్రాథమిక ఆరోగ్యం, వైద్య రంగాల నుంచి ప్రభుత్వం పూర్తిగా వైదొలుగుతోంది. నిరు ద్యోగం యువతను పీడిస్తూనే ఉంది. ఆర్థిక సంస్కరణలలో మానవీయకోణం కనిపించడం లేదని పదవీ విరమణ చేసిన తర్వాత పీవీ అంటూ ఉండే వారు.‘రిఫార్మ్స్ విత్ హ్యూమన్ ఫేస్’ అంటూ ఆయన ప్రతిపాదించిన సూత్రం ఎక్కడో ఆగిపోయింది. ఆర్థికంగా పెరిగాం. మానవీయ కోణంలో ఎదగలేదు. ఆర్థికాభివృద్ధి ఫలితాలు పేదలకు అందడం లేదు. సమాజంలో అంతరాలు భయంకరంగా పెరుగుతున్నాయి. నేర ప్రవృత్తి హెచ్చుతోంది. ఈ పరిస్థితులు మారే వరకూ ఆర్థిక సంస్కరణల వల్ల ప్రయోజనం ఉండదు. - కె.రామచంద్రమూర్తి సాక్షి, ఎడిటోరియల్ డైరెక్టర్ -
పీవీకి ఘనంగా నివాళి
సాక్షి, న్యూఢిల్లీ: తొలి తెలుగు ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు 95వ జయంతి సందంర్భంగా మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో పలువురు నివాళులర్పించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర మంత్రులు సురేశ్ ప్రభు, బండారు దత్తాత్రేయ, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్, కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్,కేంద్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ జీవీజీ కృష్ణమూర్తి తదితరులు హాజరయ్యారు దత్తాత్రేయ మాట్లాడుతూ పీవీ ఆర్థిక సంస్కరణలకు పునాదులు వేశారని, ఆయన చూపిన బాటలో నడవడమే ఆయనకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు. పార్లమెంట్లో పీవీ విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ కోరారు. కష్టకాలంలో ముందున్నారు: మోదీ ప్రధాని నరేంద్ర మోదీ కూడా పీవీకి నివాళి అర్పించారు. పీవీ కష్టకాలంలో జాతిని ముందుండి నడిపించారని , ఆయన నాయకత్వం దేశానికి ఎంతో కీలకమైందని, గుర్తుంచుకోదగినదని ట్వీట్ చేశారు. -
పీవీ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
ఆయన ప్రధానమంత్రి పదవి చేపట్టినప్పుడు దేశం పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. దేశంలో ఎటుచూసినా నిరాశ, నిస్పృహలు నిండిన తరుణంలో ఆయన చూపిన దార్శనికత ఇప్పటికీ ఫలాలు అందిస్తూనే ఉంది. సరళీకృత ఆర్థిక విధానాలతో దేశ దిశను, దశను మార్చి.. భారతీయ ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పేరొందిన ఆయనే పీవీ నరసింహారావు. ప్రధానమంత్రిగా దేశానికి కొత్త పునరుజ్జీవానాన్ని అందించిన పీవీ 95వ జయంతి సందర్భంగా ఆయనకు సంబంధించిన పది ఆసక్తికర విషయాలివి.. పీవీని ఆధునిక చాణుక్యుడిగా అభివర్ణిస్తారు. దేశం అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయిన సమయంలో ఆయన చూపిన చాణుక్యం, దార్శనికత ఆధునిక భారతానికి పునాదాలు వేశాయి. అత్యంత కఠినమైనవిగా భావించిన ఆర్థిక, రాజకీయ సంస్కరణలకు పీవీ ఆద్యుడిగా నిలిచారు. పీవీ బాహుముఖ ప్రజ్ఞాశాలి. బాహుభాషా కోవిదుడు. ఆయన తొమ్మిది భారతీయ భాషలు (తెలుగు, హిందీ, ఒరియా, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, సంస్కృతం, తమిళ్, ఉర్దూ), ఎనిమిది విదేశీ భాషలు (ఇంగ్లిష్, ఫ్రెంచ్, అరబిక్, స్పానిష్, జర్మన్, లాటిన్, పర్షియన్) మాట్లాడగలరు. ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ప్రస్తుత తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చిన మొట్టమొదటి ప్రధానమంత్రి పీవీ. పీవీ ప్రభుత్వ హయాంలోనే రూపాయి విలువను తగ్గించి అంతర్జాతీయ వాణిజ్యానికి వీలుగా మార్చారు. దేశంలో అణ్వాయుధ పరీక్షలు నిర్వహించాలని మొదట భావించిన ప్రధాని పీవీనే. ఈ ఆలోచననే తదుపరి ప్రధాని వాజపేయి అమలుచేశారు. హైదరాబాద్ సంస్థానంలో 1940లో నిజాం రాజుకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలోనూ పీవీ కీలక పాత్ర పోషించారు. 1948 నుంచి 1955 మధ్యకాలంలో ఆయన, ఆయన బంధువు కలిసి ‘కాకతీయ పత్రిక’ ను నడిపారు. పీవీకి ‘భారత రత్న’ ఇవ్వాలంటూ బీజేపీ నేత సుబ్రహ్మణ్యం సహా ఎన్నో పార్టీల నాయకులు, మంత్రులు గతంలో డిమాండ్ చేశారు. ‘లుక్ ఈస్ట్’ పాలసీని మొదటి చేపట్టిన ప్రధాని పీవీనే. వ్యూహాత్మకంగా కీలకమైన దక్షిణాసియా దేశాలతో సంబంధాలు నెరపాల్సిన ఆవశ్యకతను గుర్తించిన మొదటి ప్రధాని పీవీనే. లోక్‌సభలో మైనారిటీలో ఉన్నప్పటికీ పూర్తిగా ఐదేళ్లపాటు ప్రభుత్వాన్ని నడిపిన మొదటి ప్రధాని పీవీ నరసింహారావు. పీవీ సాహిత్య సేవ..! సహస్రఫణ్: విశ్వనాథ సత్యనారాయణ వ్రాసిన వేయిపడగలుకు పీవీ చేసిన హిందీ అనువాదం ఇది. ఈ పుస్తకానికి పీవీకి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి వచ్చింది. ఇన్సైడర్: ఆయన రచించిన ఆత్మకథాత్మక నవల. తాను ముఖ్యమంత్రి పదవి అధిష్టించి.. దిగిపోయేంతవరకూ ఆయన జీవితఘట్టాలకు ఈ నవలలోని చిత్రణకు చాలా దగ్గర పోలిక వుంది. నవలలోని కథానాయకుడు ఆనంద్.. పీవీ నరసింహారావేనని విమర్శకులు భావించారు. ఇందులో జాతీయస్థాయి నాయకుల పాత్రలకు నిజమైన పేర్లు పెట్టి, రాష్ట్రనాయకుల పాత్రలకు మాత్రం పేర్లు మార్చారు. ఈ బృహన్నవల వివిధ భాషల్లోకి అనువాదమయింది. తెలంగాణా సాయుధ పోరాట నేపథ్యంలో పీవీ రాసిన "గొల్ల రామవ్వ" కథ కాకతీయ పత్రికలో 1949లో ప్రచురితమైంది. -
పీవీ మంచి చేశారు.. చెడూ చేశారు!: అన్సారీ
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తన విధానాలతో దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించారని ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ కొనియాడారు. 1991లో ఆర్థిక వ్యవస్థలో చేపట్టిన సంస్కరణలు దేశాన్ని మార్చివేశాయన్నారు. అయితే ఆయన తీసుకున్న కొన్ని తప్పు నిర్ణయాల ప్రతికూల పర్యవసానాలు కూడా ఇంకా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. బాబ్రీ మసీదు విధ్వంసం ఘటనను నిలువరించడంలో విఫలమయ్యారని, అప్పుడు తీసుకున్న నిర్ణయం ప్రభావం ఇంకా దేశాన్ని వీడలేదన్నారు. వినయ్ సీతాపతి రచించిన‘హాఫ్ లయన్-హౌ పీవీ నరసింహారావు ట్రాన్స్‌ఫామ్డ్ ఇండియా’ పుస్తకావిష్కరణ సభలో అన్సారీ మాట్లాడారు. -
ఆర్థిక సంస్కరణలకు పాతికేళ్లు
1991 జూన్ 21న ప్రధాని పదవి చేపట్టిన వెంటనే సంస్కరణల పర్వానికి పీవీ శ్రీకారం దేశంలో ఆర్థిక సంస్కరణలకు ఆధ్యుడైన పీవీ నరసింహారావు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి పాతికేళ్లు పూర్తయ్యింది. 1991 జూన్ 21న ప్రధాని పదవి చేపట్టిన వెంటనే సంస్కరణల పర్వానికి శ్రీకారం చుట్టారు. ప్రముఖ ఆర్థిక వేత్త మన్మోహన్ సింగ్‌కు ఆర్థికమంత్రిగా బాధ్యతలు అప్పగిస్తూ పీవీ వేసిన విత్తన ప్రభావమే నేటి మన 2 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ. అప్పటికే విదేశీ కరెన్సీ నిల్వలు లేక ఎదుర్కొంటున్న చెల్లింపులు సంక్షోభం నుంచి గట్టెక్కడానికి రూపాయి విలువను తగ్గించడం ద్వారా మన్మోహన్ సంస్కరణల తొలి అడుగు వేశారు. ఆర్థిక వ్యవస్థ ద్వారాలు తెరవడానికి మన్మోహన్ చేస్తున్న ప్రయత్నాలకు గట్టి మద్దతునిస్తూ, విమర్శలను అడ్డుకుంటూ పీవీయే సంస్కరణల్ని ముందుండి నడిపించారు. సరిగ్గా ఈ పాతికేళ్లు పూర్తయిన సమయంలోనే నరేంద్ర మోదీ ప్రభుత్వం పలు రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి పరిమితుల్ని పెంచడం విశేషం. తాజా నిర్ణయాలతో ఇండియా పూర్తి స్వేచ్ఛాయుత ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించిందని మోదీ ప్రకటించడం పీవీకి ఘనమైన నివాళి. -
పీవీ అల్లుడు కన్నుమూత
హైదరాబాద్: మాజీ ప్రధాని, దివంగత పీవీ నరసింహారావు అల్లుడు దయాకర్‌రావు(70) శుక్రవారం సాయంత్రం కన్నుమూశారు. కొన్ని రోజులుగా అస్వస్థత తో ఉన్న ఆయన జూబ్లీహిల్స్ రోడ్‌నంబర్ 33లోని నివాసంలో మృతిచెందారు. ఆయన సతీమణి వాణీదేవి పీవీ మూడో కూతురు. దయాకర్‌రావు సురభి ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్‌గా ఉన్నారు. ఆయన అంత్యక్రియలు ఆదివారం మహాప్రస్థానం శ్మశాన వాటికలో జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు. -
28న ఢిల్లీలో పీవీ స్మారకస్థూపం ఆవిష్కరణ
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని, దివంగత నేత పీవీ నరసింహారావుకు సొంతపార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కంటే ఎన్డీయే ప్రభుత్వంలో సముచిత గౌరవం దక్కనుంది. దేశ రాజధాని ఢిల్లీలో మొదటిసారి పీవీ నరసింహారావు స్మారక స్థూపాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 28న పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా స్మారక స్థూపాన్ని ప్రతిష్టించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆవిష్కరిస్తారు. -
పీవీపై బురద జల్లిన సీఎం
బాబ్రీ మసీదు కూల్చివేత విషయంలో పీవీ నరసింహారావుకు తాను లేఖ రాసినా ఆయన పట్టించుకోలేదంటూ అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ బురద చల్లారు. ఆయనకు పార్టీ మీద పట్టు లేదన్నారు. బాబ్రీ కూల్చివేత సమయానికి ఆహారశాఖ మంత్రిగా ఉన్న తరుణ్ గొగోయ్.. అప్పటి పరిస్థితిలో పీవీ వ్యవహరించిన తీరుపట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 'టర్న్ ఎరౌండ్ - లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్' అనే పేరుతో తాను రాసిన పుస్తకంలో గొగోయ్ ఈ విషయం చెప్పారు. 1992 డిసెంబర్ నెలలో బాబ్రీ కూల్చివేత సమయంలో పీవీ వ్యవహరించి తీరు సరికాదన్నారు. పీవీ చాలా ఆధునిక భావాలు కలిగిన వ్యక్తి అని, ఆయన హయాంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారని, ఏనాడూ మంత్రుల పనిలో వేలుపెట్టేవారు కారని చెప్పారు. ఆహార శాఖ మంత్రిగా కూడా తన నిర్ణయాలన్నీ తానే తీసుకునేవాడినని చెప్పారు. 2001 నుంచి ఇప్పటివరకు అసోం ముఖ్యమంత్రిగా ఉంటున్న గొగోయ్.. తన రాజకీయ జీవితంలోని ముఖ్యాంశాలతో ఈ పుస్తకం రాశారు. అయితే పీవీకి పార్టీ మీద అంతగా పట్టు లేదని, మంత్రిగా తనకున్న పరిమితులు కూడా దాటి తాను ఆయనకు ఒక లేఖ రాశానని, మైనారిటీ నేతలను ఆయన విశ్వాసంలోకి తీసుకుని ఉండాల్సిందని గొగోయ్ రాశారు. మసీదు కూల్చివేత తర్వాతే మైనారిటీలు కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారని.. అయితే ఆయన తన లేఖకు స్పందించలేదని అన్నారు. కోకా కోలా, పెప్సీ లాంటి బహుళ జాతి సంస్థలను భారతదేశంలోకి అనుమతించినది తానేనని గుర్తుచేసుకున్నారు. దానిపై ప్రతిపక్షాలు విమర్శించినా.. తాను మాత్రం ఆ నిర్ణయానికే కట్టుబడి ఉన్నానని చెప్పారు. -
బ్యాక్ ఫ్రం బ్రింక్: జైరాం రమేష్
-
మాజీ ప్రధాని పివికి ఘన నివాళి
-
మాజీ ప్రధాని పివికి ఘన నివాళి
హైదరాబాద్ : భారత మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు 11వ వర్ధంతి సంస్మరణ సభ బుధవారం నెక్లెస్ రోడ్డులోని పి.వి.జ్ఞానభూమిలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రులు నాయిని నరసింహరెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్, తెలుగు రాష్ట్రాల్లోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతోపాటు పివి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పివి చిత్ర పటానికి వారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం దేశ ప్రధానిగా పివి అందించిన సేవలను వారు ఈ సందర్భంగా కొనియాడారు. అనంతరం పి.వి.జ్ఞానభూమిలో ప్రార్థనలు, భజనలు, సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. అందులోభాగంగా రక్తదాన శిబిరాన్ని మంత్రులు ప్రారంభించారు. అనంతరం పివి నరసింహరావు ఛాయ చిత్రాలను ప్రదర్శించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. -
పీవీ ఎక్స్‌ప్రెస్ వే పై నాలుగు కార్లు ఢీ
-
పీవీకి ప్రముఖుల ఘన నివాళి
-
ఆర్థిక సంస్కరణలకు పీవీ మూల పురుషుడు
హైదరాబాద్ : దేశంలో ఆర్థిక సంస్కరణలకు మూల పురుషుడు పీవీ నరసింహరావు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పీవీ నరసింహరావు 94వ జయంతి సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో ఆయన చిత్ర పటానికి బాబు పూలమాల వేసి... ఘనంగా నివాళులర్పించారు. పీవీ నరసింహరావు తెలుగువారందరికీ గర్వకారణమని అన్నారు. దేశానికి దిశానిర్దేశం చేసి మేథావి పీవీ అని ఆయన సేవలను చంద్రబాబు కొనియాడారు. గాంధీ భవన్ : గాంధీభవన్‌లో మాజీ ప్రధాని పీవీ నరసింహరావుకి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్, ఏపీపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి ఘనం నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. -
పీవీ పునరావాసం?
పీవీ 94వ జయంతి సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీల సంయుక్త ఆధ్వర్యంలో సంస్మరణ సభ జరగడం విశేషం. పీవీ అస్తమించి పదేళ్లు దాటిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న తొలి సమావేశం ఇది. ఒక రకంగా కాంగ్రెస్ పార్టీలో పీవీకి పునరావాసం. పీవీని బీజేపీ తన ఖాతాలో జమకట్టుకుంటుందన్న భయంతోనో, పీవీకి అన్యాయం చేశామన్న పశ్చాత్తాపంతోనో కాంగ్రెస్ నాయకత్వం ఇందుకు అనుమతించి ఉంటుంది. దాదాపు రెండు వారాలుగా ప్రధాని నరేంద్రమోదీ దేశాన్ని అట్టుడికిస్తున్న కొన్ని అంశాలపైన మౌనం పాటిస్తున్నారు. నిష్క్రియాపరుడంటూ, మౌనీబాబా అంటూ మన్మోహన్సింగ్ను ఎద్దేవా చేసిన మోదీ అదే మౌనాన్ని ఆశ్రయించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రతినిధిగానే మన్మోహన్ పదేళ్లూ గద్దె మీద కూర్చున్నారు. ఆ వాస్తవాన్ని ఆయన ఎన్నడూ విస్మరించలేదు. మరో ప్రధాని పీవీ నరసింహారావు నెహ్రూ-గాంధీ కుటుంబ సభ్యుల ఆగ్రహం ఒక వైపూ, అర్జున్‌సింగ్ లేఖాస్త్రాలు మరోవైపు బాధిస్తున్నా మౌనంగానే అన్నీ సహిం చవలసి వచ్చింది. మోదీ సంగతి వేరు. ఆయన స్వయంగా దేశం అంతటా అద్భుతంగా ప్రచారం చేసి ఎన్నికలలో ఘనవిజయం సాధించి అట్టహాసంగా అధికారం చేపట్టిన శక్తిమంతుడు. అడ్వానీ వంటి భీష్మాచార్యుడిని పూర్వపక్షం చేసి మార్గదర్శక మండలికి పరిమితం చేసిన యుక్తిపరుడు. ఈ రోజున మోదీకి ఎదురు చెప్పేవారు భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లో ఎవ్వరూ లేరు. ఆరెస్సెస్ నాయకులైనా సలహాలూ, సూచనలూ ఇవ్వవలసిందే కానీ ఆదేశించే పరిస్థితి లేదు. మీడియా ఎంత రెచ్చగొడుతున్నా, ఎంతగా పొడుస్తున్నా మోదీ మారు మాట్లాడరేమి? విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజేలు క్రికెట్ జూదరి లలిత్‌మోదీకి అక్రమంగా సహాయం చేశారన డానికి సాక్ష్యాధారాలు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ నోరు మెదపరేమి? శని వారంనాడు ఢిల్లీలో నీతిఆయోగ్ సమావేశానికి హాజరైన వసుంధరా రాజే బీజేపీ పెద్దలను కలుసుకొని తన వాదన వినిపించుకునే అవకాశం లేకుండా జైపూర్‌కి తిరిగి వెళ్ళవలసిన దయనీయమైన స్థితి ఎందుకు దాపురించింది? మోదీ కానీ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కానీ రాజే సంజాయిషీ వినకుండా, ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా, సుష్మా, రాజేల గురించి ప్రస్తావించకుండా ఎంతకాలం దాటవేయగలుగుతారు? ‘న ఖావూంగా, న ఖానేదూంగా (తినను, తిననివ్వను)’ అంటూ ఎన్నికల ప్రచారంలో ప్రతిజ్ఞ చేసి, సంవత్సర పాలన పూర్తయిన సందర్భంగా నిష్కళం కంగా ఏడాది పరిపాలించడమే ఎన్డీఏ సర్కార్ సాధించిన విజయంగా చెప్పు కుంటూ ఇప్పుడు అక్రమాలు, అవినీతి జరిగినట్టు బలమైన ఆరోపణలు వచ్చి నప్పటికీ, స్పష్టమైన ఆధారాలు కనిపిస్తున్నప్పటికీ మోదీ స్పందించకుండా ఉండటాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? భారత చట్టాలనుంచి తప్పించుకొని లం డన్లో తలదాచుకున్న క్రికెట్ మాయావి లలిత్ మోదీతో సుష్మా, రాజేల లావా దేవీల గురించి పెదవి విప్పకుండా మోదీ (కాంగ్రెస్ నాయకులు అభివర్ణించి నట్టు) ‘లలితాసనం’ వేసి మౌనమె నా భాష అంటే కుదురుతుందా? పార్లమెంటు వర్షాకాలం సభలు సజావుగా సాగుతాయా? పీవీ, మన్మోహన్లు ప్రధా నులు కాకపూర్వం సైతం మితంగా మాట్లాడే అలవాటున్నవారు. మోదీ అతి భాషి. అతివాది. అసాధారణమైన వాగ్ధాటి కలిగిన రాజకీయ యోధుడు. అటు వంటి అధినేత పాటిస్తున్న నిశ్శబ్దం చెవులలో హోరెత్తిస్తున్నది. రెండో తరం ఆర్థిక సంస్కరణలు అమలు చేయలేక, చేయకుండా ఉండ లేక, సంక్షేమబాటలో ప్రయాణం చేస్తున్న సోనియాను ఒప్పించలేక సతమత మైన మన్మోహన్ మనోవ్యధ ఏమిటో ఇప్పుడు మోదీకి అర్థం అవుతూ ఉండ వచ్చు. తన నెత్తిన సోనియా వంటి జేజమ్మ లేకపోయినా, పార్టీలోనూ, ప్రభు త్వంలోనూ తనకు ఎదురు చెప్పేవారు ఒక్కరూ లేకపోయినా నరేంద్రమోదీ నిర్ణ యాలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు? పాతాళం నుంచి ఆకాశానికి... నిరుడు మోదీ ప్రధానమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించినప్పటి పరిస్థితుల కంటే దారుణమైన స్థితిలో దేశం ఉన్నప్పుడు ఇరవై నాలుగేళ్ల కిందట పీవీ ప్రధా నిగా పగ్గాలు చేతబట్టారు. 1989 నుంచి 1991 వరకూ వీపీ సింగ్, చంద్రశేఖ ర్లు తలా సంవత్సరం కూడా పదవిలో కొనసాగలేక విఫల మనోరథులై నిష్ర్క మించారు. మధ్యంతర ఎన్నికలలో కాంగ్రెస్ శ్రేణులను బరిలో నడిపిస్తున్న రాజీవ్‌గాంధీని ఎన్నికల నడిమి ఘట్టంలో ఎల్టీటీఈ హంతకులు హత్య చేశా రు. అప్పటికే ఎన్నికలలో పోటీచేయకుండా, రామానందతీర్థ ట్రస్టు వ్యవహా రాలు చూసుకుంటూ, రాసుకుంటూ కాలక్షేపం చేయాలని నిర్ణయించుకొని మూటాముల్లె సర్దుకొని హైదరాబాద్‌కి తిరుగు ప్రయాణానికి సిద్ధంగా ఉన్న పీవీ ప్రధానిగా ప్రమాణం చేయవలసివచ్చింది. నాటి దేశ ఆర్థికపరిస్థితి అత్యం త దుర్బలం. అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి ఆరుమాసాల కిందట అప్పుచేసి తెచ్చుకున్న నిధులు అడుగంటాయి. చంద్రశేఖర్ హయాంలో విదేశీమారక ద్ర వ్యం బొత్తిగాలేకపోవడంతో లండన్ బ్యాంకులో బంగారం కుదువపెట్టవలసివ చ్చింది. అటువంటి నిర్వీర్యమైన ఆర్థికవ్యవస్థను సంస్కరించడానికి పీవీ తీసు కున్న చర్యలు ఏమిటో, అత్యంత ప్రభావవంతమైన నిర్ణయాలను ఎంత ప్రశాం తంగా అమలు చేయగలిగారో తెలుసుకుంటే మోదీకి మార్గదర్శనం అవుతుంది. రాజకీయాలు తెలియని ఆర్థికవేత్త మన్మోహన్సింగ్ను ముందు పెట్టుకొని అత్యంత లాఘవంగా మార్కెట్ సంస్కరణలను పీవీ ప్రవేశపెట్టారు. ఆర్థికంగా నలిగిపోయిన దశ ఏ దేశంలోనైనా కార్మికచట్టాలను తిరగతోడటానికి మంచి సమయమనే అంతర్జాతీయ ద్రవ్యసంస్థ (ఐఎంఎఫ్), ప్రపంచబ్యాంకు వాద నను తోసిరాజన్నారు పీవీ. బ్యాంకులను ప్రైవేటైజ్ చేస్తారేమోనన్న భయంతో సమ్మె నోటీసు ఇచ్చిన బ్యాంకు ఉద్యోగులకు అటువంటి భయమే అక్కరలేదని భరోసా ఇచ్చారు. భూములు స్వాధీనం చేసుకుంటారేమోనన్న భయంతో ఉద్యమి స్తున్న వ్యవసాయదారులకు కూడా భయపడవలసిన అవసరం లేదనీ, వ్యవసా యరంగాన్ని ముట్టుకోబోమనీ భరోసా ఇచ్చారు. అయినప్పటికీ గరీబీ హటావో నాటి జీడీపీ పెరుగుదల రేటు 3.5, రాజీవ్ హయాంలో 5.5 శాతం ఉంటే పీవీ పాలనలో అది 7.5 శాతం పెరిగింది. 2000లలో జీడీపీ 8.5 శాతం తాకడానికి కూడా పీవీ ప్రభుత్వం వేసిన ఆర్థిక పునాదులే కారణం. చైనాకు డెంగ్ ఎంత మేలుచేశాడో ఇండియాకు పీవీ అంత ఉపకారం చేశారు. పీవీ రాజకీయ జీవితంలో తప్పులు చేసి ఉండవచ్చు. వ్యక్తిగత జీవితంలో చంద్రస్వామి వంటి మార్మికులకు మితిమీరిన చనువు ఇచ్చి పొరపాటు చేసి ఉండవచ్చు. బాబరీ మసీదు విధ్వంసమైనప్పుడు బీజేపీ నాయకుల హామీలు విశ్వసించి మోసపోయి ఉండవచ్చు. పరిపాలనాపరంగా పొరపాట్లు చేసి ఉండ వచ్చు. ఆర్థిక సంస్కరణల విషయంలో మాత్రం మోదీ కంటే ఎక్కువ గుండెదిట వును పీవీ ప్రదర్శించారు. చాకచక్యం, వాస్తవిక దృష్టి, సమయజ్ఞత, పట్టువిడు పులు పీవీ శైలిలో గమనించవలసిన ముఖ్యమైన అంశాలు. లెసైన్స్, పర్మిట్ రాజ్‌ను పీవీ పూర్వపక్షం చేసిన తీరు నుంచి మోదీ, చంద్రబాబునాయుడు గుణ పాఠాలు నేర్చుకోవాలి. ఆర్థిక శాఖను మన్మోహన్‌కు అప్పగించినప్పటికీ పరిశ్ర మల శాఖను పీవీ తనదగ్గరే ఉంచుకున్నారు. లెసైన్స్, పర్మిట్ వ్యవస్థకు చరమ గీతం పాడింది ఆయనే. ఎట్లా? పారిశ్రామిక విధానంలో పెనుమార్పులు తెస్తు న్నామంటూ చాటింపు వేయలేదు. హడావుడి చేయలేదు. మన్మోహన్సింగ్ బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు ఉదయమే పారిశ్రామిక విధానం ఆర్భాటం లేకుండా ప్రకటించారు. బడ్జెట్లో భాగంగానే మీడియా పారిశ్రామిక విధానాన్ని పరిగ ణించి దానికి అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదు. చడీచప్పుడు లేకుండా వచ్చిన నూతన పారిశ్రామిక విధానం పారిశ్రామికరంగాన్ని అంతవరకూ కట్టివేసి కుంగదీసిన సంకెళ్ళను ఒక్క దెబ్బతో ఛేదించింది. మధ్యేమార్గం రొనాల్డ్ రేగన్లాగానో, మార్గరెట్ థాచర్ మాదిరో మార్కెట్ ఎకానమీ (విపణి చోదక ఆర్థిక వ్యవస్థ)లో తిరుగులేని విశ్వాసం ఉన్న నాయకుడు కాదు పీవీ. మధ్యేమార్గం అనుసరించాలన్నదే ఆయన అభిమతం. మానవీయకోణం వీడ కుండా సంస్కరణలు (రిఫార్మ్స్ విత్ హ్యూమన్ ఫేస్) అమలు చేయాలన్నది సంకల్పం. ఇందుకు భిన్నంగా మోదీ అధికారంలోకి వస్తూనే భూసేకరణ చట్టాన్ని సవరించాలంటూ మొండిపట్టు పట్టి కూర్చున్నారు. ఇప్పటికి మూడు సార్లు ఆర్డినెన్స్ జారీ చేయించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండోసారి అధికారంలోకి రాగానే రాజధాని నిర్మాణం పేరిట రైతు లతో తెగని పంచాయితీ పెట్టుకున్నారు. పీవీ వ్యక్తిగతంగా పరిశుభ్రమైన రాజ కీయ నేత. నాలుగు దశాబ్దాలు (రెండు హైదరాబాద్‌లో, రెండు ఢిల్లీలో) అధికా రంలో ఉన్నప్పటికీ అవినీతి పంకిలం అంటించుకోలేదు. నాడు పీవీ ఆవిష్క రించిన ‘లుక్ ఈస్ట్’ విధానాన్నే నేడు మోదీ ‘యాక్ట్ ఈస్ట్’ విధానంగా మాటమా ర్చుకున్నారు. దేశ ఆర్థిక భవిష్యత్తు తూర్పు, ఆగ్నేయాసియా దేశాలతో సన్ని హిత సంబంధాలు పెట్టుకోవడంలోనే ఉన్నదనే సత్యాన్ని ఆయన రెండున్నర దశాబ్దాల కిందటే గ్రహించారు. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏసియన్ కం ట్రీస్‌తో స్నేహానికి బలమైన పునాది వేశారు. చైనాతో దృఢమైన సంబంధాలకు శ్రీకారం చుట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో విద్యామంత్రిగా, రాజీవ్ మంత్రిమండలిలో మానవవనరుల అభివృద్ధిశాఖ మంత్రిగా పీవీ విద్యారంగంలో మౌలికమైన సంస్కరణలు ప్రవేశపెట్టారు. పీవీ ప్రధానిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు పం జాబ్ రగులుతూ ఉన్నది. కశ్మీర్లో ఆటంకవాదులు చెలరేగిపోతున్నారు. సిక్కు పోలీసు ఉన్నతాధికారి కేపీఎస్ గిల్ సహకారంతో, బలప్రయోగంతో పంజా బ్లో వేర్పాటు ఉద్యమాన్ని చల్లార్చారు. కశ్మీర్లో తీవ్రవాదుల ఆట కట్టించి సైన్యానిది పైచేయి చేయగలిగారు. ఇందుకు అనేక వ్యూహాలు అనుసరించారు. తిరుగుబాటుదారులైనా, వేర్పాటువాదులైనా తోటి పౌరులను కాల్చి చంపడం అన్నది బాధాకరమైన పని. ఈ విషయంలో గొప్పలు చెప్పుకోవడం అవివేకం. ఇటీవల మయన్మార్ భూభాగంలో తీవ్రవాదులను భారత సైనికులు మట్టుబె ట్టిన ఉదంతాన్ని పరాక్రమ ప్రదర్శనగా రక్షణ మంత్రి మనోహర్ పారికర్, మరి కొందరు మంత్రులూ, న్యూస్ చానళ్ల యాంకర్లూ అభివర్ణించడం పరిక్వతలేని దూకుడుతనం. ఇటువంటి బడాయిల వల్ల నష్టమే కానీ ప్రయోజనం లేదు. సమస్యను క్షుణ్ణంగా అధ్యయనం చేయడం, సంపూర్ణంగా అవగాహన చేసుకోవడం, రాజ్యాంగపరమైన, చట్టపరమైన కోణాలను నిశితంగా పరిశీలిం చడం, పరిష్కారమార్గాన్ని కనుగొనడంలో సృజనాత్మకంగా ఆలోచించడం, సమర్థంగా అమలు చేయడం పీవీ విజయ రహస్యం. ఆయన ఎక్కడ ఏ శాఖ నిర్వహించినా దాన్ని ఒకటి, రెండు మెట్లు పైకి తీసుకొనివెళ్లి కూర్చోబెట్టారు. కొత్త పుంతలు తొక్కించారు. ఆర్థిక సంస్కరణలలో, విదేశీ వ్యవహారాలలో, విద్యారంగంలో పీవీ ముద్రను ఎవ్వరూ చెరపలేరు. భారత్ ప్రపంచం గుర్తించ దగిన ఆర్థికశక్తిగా ఎదుగుతుందని కానీ, ఒకానొక దశలో చైనాకంటే అధికమైన జీడీపీ వృద్ధిరేటును సాధిస్తుందని కానీ రెండున్నర దశాబ్దాల కిందట ఎవ్వరూ కలలో కూడా ఊహించి ఉండరు. అనూహ్యమైన విజయాలు సాధించడానికి ప్రధాన కారకుడు పీవీ నరసింహారావు. కాంగ్రెస్ అగ్రనాయకత్వం గుర్తించినా, గుర్తించకపోయినా, తాత్కాలికంగా అవమానాలు ఎదుర్కొని, నిరాదరణకు లోనై ఈ లోకం వీడి వెళ్లిపోయినా చరిత్రలో పీవీ స్థానం మాత్రం చిరస్థాయిగా ఉంటుంది. దేశానికి పీవీ చేసిన నిరుపమాన సేవను గుర్తించి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వాన్ని ఉడికించడానికి కావచ్చు మోదీ ప్రభుత్వం పీవీ స్మారక చిహ్నాన్ని ఢిల్లీలోని ఏక్తాస్థల్ సమాధి ప్రాంగణంలో నిర్మించాలని నిర్ణయించ డాన్ని మనసారా స్వాగతించాలి. ఈ రోజు పీవీ 94వ జయంతి సందర్భంగా గాంధీభవన్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీల సంయుక్త ఆధ్వ ర్యంలో పీవీ సంస్మరణ సభ జరగడం విశేషం. పీవీ అస్తమించి పదేళ్లు దాటిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న తొలి సమావేశం ఇది. ఒక రకంగా కాంగ్రెస్ పార్టీలో పీవీకి పునరావాసం. పీవీని బీజేపీ తన ఖాతాలో జమ కట్టుకుంటుందన్న భయంతోనో, పీవీకి అన్యాయం చేశామన్న పశ్చాత్తాపంతో నో కాంగ్రెస్ నాయకత్వం ఇందుకు అనుమతించి ఉంటుంది. తప్పు ఆలస్యంగా నైనా దిద్దుకుంటున్నందుకు కాంగ్రెస్ నాయకులను అభినందించాలి. - కె.రామచంద్రమూర్తి సాక్షి, ఎడిటోరియల్ డైరెక్టర్ -
‘లోపలి మనిషి’ స్మృతిలో...
దేశ రాజధానిగా మాత్రమే కాదు...ఢిల్లీ మహానగరానికి ఇతరత్రా కూడా పేరు ప్రఖ్యాతులున్నాయి. చరిత్రతో విడదీయరాని అనుబంధం ఉంది. ఆ మహానగరంలో ఘనంగా బతికినవారిని, జీవించినకాలంలో మంచి చేసినవారిని మరణించినంత మాత్రాన మరిచిపోరాదన్న సంస్కారం ఉంది. అందుకే అక్కడ ఏమూలకెళ్లినా ‘మృతజీవులు’ పలకరిస్తారు. వారి సమాధులు దర్శనమిస్తాయి. కనుకే ఆ నగరానికి ‘సమాధుల నగరం’గా కూడా పేరొచ్చింది. దేశ ప్రధానిగా అవిచ్ఛిన్నంగా అయిదేళ్లు పనిచేసి, ఆర్థిక సంస్కరణలతో దేశ గతినే మలుపుతిప్పిన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు స్మారక స్థలి ఏర్పాటు చే సేందుకు అలాంటి మహానగరంలో చారెడు నేల దొరకలేదు! బతికుండగా ఆయనను ఎన్నో విధాలుగా అవమానించిన కాంగ్రెస్ పార్టీయే ఢిల్లీలో ఆయనకు మరణానంతరం స్మృతిచిహ్నం లేకుండా చేసింది. ఈ నేపథ్యంలో... దశాబ్దకాలం తర్వాత కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఆయనకు సముచిత రీతిలో స్మారక చిహ్నం ఏర్పాటుచేయాలని నిర్ణయించిందని వెలువడిన కథనం అందరికీ ఊరటనిస్తుంది. పీవీ నరసింహారావు స్వాతంత్య్ర సమరయోధుడు. కాంగ్రెస్ వాదిగా రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన పీవీ ఆజన్మాంతం అందులోనే కొనసాగారు. 1969లో పార్టీలో వచ్చిన చీలిక మొదలుకొని దేశంలో చోటుచేసుకున్న ఎన్నో పరిణామాల్లో ఆయన ఇందిరాగాంధీ వెనక దృఢంగా నిలబడ్డారు. అటు తర్వాత రాజీవ్‌గాంధీకి సైతం బాసటగా ఉన్నారు. వివిధ కీలక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి వారిద్దరి ప్రశంసలూ పొందారు. ఈ క్రమంలో ఆయన నిర్వహించిన పాత్రపై ప్రత్యర్థి రాజకీయపక్షాలనుంచి విమర్శలు వచ్చి ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో ఆయన మరో విధంగా వ్యవహరించి ఉంటే బాగుండేదన్న అభిప్రాయాలు వ్యక్తమై ఉండొచ్చు. కానీ నమ్మినదాన్ని త్రికరణశుద్ధిగా ఆచరించడం పీవీ విశిష్టత. రాజకీయ రంగంలో మాత్రమే కాదు... సాహిత్య రంగంలో సైతం ఆయన కృషి ఎన్నదగినది. ఆయన బహుభాషా కోవిదుడు. 14 భాషల్లో అనర్గళంగా మాట్లాడటం, రాయడం వచ్చు. ‘ద ఇన్సైడర్’ (లోపలి మనిషి) వంటి నవల రాయడంతోపాటు విశ్వనాథ వారి వేయిపడగలను హిందీలోకి అనువదించిన పండితుడాయన. ఒకపక్క రాజకీయ రంగంలో క్షణం తీరిక లేకుండా గడుపుతూనే వీటన్నిటినీ ఆయన కొనసాగించారు. ఇన్ని రంగాల్లో నిష్ణాతుడైన పీవీ వాస్తవానికి రాజకీయ రంగంనుంచి స్వచ్ఛందంగా వైదొలగి తన శేష జీవితాన్ని తనకు ఎంతో ఇష్టమైన సాహితీరంగానికి అంకితం చేద్దామనుకున్నారు. అందుకోసమని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ఈలోగా ఉగ్రవాద దాడిలో రాజీవ్‌గాంధీ మరణించడంతో కాంగ్రెస్ సారథ్య బాధ్యతలను స్వీకరించడంతోపాటు ప్రధానిగా పనిచేయాల్సివచ్చింది. ఆయన అభీష్టమే నెరవేరి ఉంటే దేశం పీవీ సాహితీ వైశిష్ట్యాన్ని మరింత నిశితంగా చూడగలిగేది. కానీ, ఒక విశ్లేషకుడన్నట్టు ప్రపంచీకరణ విధానాలను ఎంతో చాకచక్యంగా, సమర్థవంతంగా అమలుచేసి దేశ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయగలిగిన నాయకుణ్ణి మాత్రం పొందలేకపోయేది. అందులో వాస్తవం ఉంది. ప్రధానిగా పీవీ బాధ్యతలు చేపట్టిన నాటికి దేశంలో విదేశీ మారక నిల్వలు నిండా రూ. 3,000 కోట్లు కూడా లేవు. ఆయన గద్దె దిగేనాటికి ఆ నిల్వలు 14,000 కోట్ల డాలర్ల (దాదాపు రూ. 6 లక్షల కోట్లు)కు చేరుకున్నాయి. అప్పటికి ఆర్ధికవేత్తగా మాత్రమే పేరున్న మన్మోహన్ సింగ్‌ను కేంద్ర ఆర్థికమంత్రిగా తీసుకురావడం మాత్రమే కాదు... అయిదేళ్లలోనూ ఆయన తీసుకున్న నిర్ణయాలకు రాజకీయంగా ఎలాంటి ఆటంకాలూ లేకుండా చూశారు. ఆర్థిక సంస్కరణలపై వివిధ వర్గాలనుంచి వచ్చిన విమర్శలకు పీవీయే జవాబిచ్చేవారు. కాంగ్రెస్ పార్టీకి లోక్‌సభలో పూర్తి మెజారిటీ లేని సమయంలోనే ఈ సంస్కరణలను ఆయన జయప్రదంగా అమలుచేయగలిగారు. యూపీఏ పదేళ్ల పాలనాకాలంలో మలి దశ సంస్కరణల అమలుకు ఎన్ని పిల్లిమొగ్గలు వేయాల్సి వచ్చిందో, ఎలాంటి వైఫల్యాలను చవిచూసిందో గమనిస్తే పీవీ గొప్పతనం అవగతమవుతుంది. నెహ్రూ కుటుంబీకులు మినహా మరెవరూ దేశానికి సుస్థిర పాలన అందించలేరన్న వాదనను పీవీ పూర్వపక్షం చేశారు. ఢిల్లీలో మొఘల్ వంశస్తులు మొదలుకొని ఎందరెందరి సమాధులో ఉన్నాయి. స్వాతంత్య్రానంతరం మహాత్ముడి స్మారక స్థలి మొదలుకొని నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, జగ్జీవన్‌రామ్ వరకూ ఎందరివో స్మృతి చిహ్నాలున్నాయి. ఏ పదవీ చేపట్టని సంజయ్‌గాంధీకి కూడా సమాధి ఉంది. కానీ, పీవీకి అక్కడ చోటీయకుండా చేసి కాంగ్రెస్ తన సంస్కారాన్ని బయట పెట్టుకుంది. ఆయనకు సముచిత చిహ్నం నిర్మించాలని తెలుగుదేశం ప్రభుత్వం నుంచి ప్రతిపాదన అందాక ఎన్డీయే ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకున్నదంటున్నారు. మంచిదే. అయితే, పదిహేనేళ్లక్రితం పీవీపై అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు అప్పటికి ఎనిమిదో తరగతి హిందీ రీడర్లో పీవీ నరసింహారావు జీవిత విశేషాలతో ఉన్న ‘భారత్ కే ప్రధాన్‌మంత్రి’ పాఠ్యాంశాన్ని తొలగించిన ఘనత కూడా ఆనాటి తెలుగుదేశం సర్కారుదే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా గొంతు సవరించుకుని పీవీ స్మారక చిహ్నం నిర్మాణం ప్రతిపాదనకు తమ మద్దతు ఉంటుందని ప్రకటించింది. ఆయన జీవించి ఉన్నప్పుడుగానీ, మరణించాక ఈ దశాబ్దకాలంలోగానీ పీవీకి తగిన గౌరవం ఎందుకీయలేదన్న విషయంలో మాత్రం సంజాయిషీ ఇవ్వలేదు. అంతేకాదు...ఢిల్లీలో ఇక స్థలం లేదన్న సాకుతో ప్రముఖుల స్మృతి చిహ్నాలకు అనుమతినీయరాదని 2013లో దేన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయించారో చెప్పలేదు. సంక్షోభంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలిచ్చి నిలబెట్టిన నిరుపమానమైన నేతను సొంతం చేసుకోలేని దీనస్థితిలో కాంగ్రెస్ పడితే... చివరకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు ఆయన సేవలను గుర్తించి గౌరవించాల్సివచ్చింది. ఇందుకు కాంగ్రెస్ సిగ్గుపడాలి! -
‘బాబ్రీ విధ్వంసంలో పాత్రకు ప్రతిఫలం’
లక్నో: పీవీకి ఎన్డీఏ ప్రభుత్వం నిర్మించనున్న స్మారకం.. బాబ్రీ మసీదు విధ్వంసం, దాని స్థానంలో తాత్కాలిక రామమందిర నిర్మాణంలో ఆరెస్సెస్‌తో ఆయన లోపాయికారీ అవగాహనకు ప్రతిఫలమని యూపీ మంత్రి ఆజమ్ ఖాన్ విమర్శించారు. ఈ స్మారకంతో కేంద్రం బాబ్రీ విధ్వంసాన్ని దేశచరిత్రలో భాగం చేయాలనుకుంటోందన్నారు. -
పీవీకి ఎన్డీఏ సర్కారు స్మారకం
న్యూఢిల్లీ: ఆర్థిక సంస్కరణల వైతాళికుడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు దేశ రాజధాని ఢిల్లీలో ఎట్టకేలకు స్మారక చిహ్నం దక్కనుంది. ఆయనకు సొంత పార్టీ అయిన కాంగ్రెస్ హస్తినలో స్మారకాన్ని నిరాకరించగా, ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం ఆ గౌరవాన్ని కట్టబెట్టేందుకు సిద్ధమైంది. పదేళ్ల కిందట చనిపోయిన పీవీకి ఢిల్లీలోని యమునా నది ఒడ్డున ఏక్తా స్థల్లో స్మారకాన్ని నిర్మించాలని ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిపాదన సిద్ధం చేసిందని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈమేరకు ఓ కేబినెట్ నోట్‌ను సిద్ధం చేసింది. పీవీకి సముచిత స్మృతి చిహ్నాన్ని నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన అందాక దీన్ని రూపొందించింది. తెలంగాణకు చెందిన పీవీకి స్మారకాన్ని కట్టాలని టీ డీపీ గత ఏడాది అక్టోబర్‌లో తీర్మానం చేసింది. పట్టణాభివృద్ధి శాఖ ప్రతిపాదన ప్రకారం.. పీవీ స్మారకాన్ని పాలరాతితో కడతారు. పైన శిలాఫలకం ఉంటుంది. 1991-96 మధ్య ప్రధానిగా పనిచేసిన పీవీని కాంగ్రెస్ విస్మరించడం, 2004లో ఆయన చనిపోయాక స్మారక నిర్మాణానికీ తిరస్కరించడం తెలిసిందే. ఢిల్లీలో స్థలం కొరత వల్ల ఇకపై ఏ నేతకూ ప్రత్యేక స్మృతిచిహ్నాన్ని ఏర్పాటు చేయకూడదని కూడా 2013లో అప్పటి యూపీఏ ప్రభుత్వం నిర్ణయించింది. స్మృతి నిర్మాణాలకు బదులుగా ఉమ్మడి స్మారక స్థలాన్ని ఏర్పాటు చేశా రు. 22.56 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఏక్తా స్థల్ లో మాజీ ప్రధానులు ఐకే గుజ్రాల్, చంద్రశేఖర్, మాజీ రాష్ట్రపతులు జ్ఞానీ జైల్‌సింగ్, శంకర్ దయాళ్ శర్మ, కేఆర్ నారాయణన్, ఆర్. వెంకటరామన్‌ల స్మారకాలు ఉన్నాయి. తొమ్మిది స్మారకాల కోసం దీన్ని ఏర్పా టు చేయగా, మరో మూడింటికి స్థలముంది. -
త్రికాలమ్: ఒక వివరణ
ఆదివారం సంచికలో‘ పీవీ, మన్మోహన్ ఔర్ సోనియా’ శీర్షికతో ప్రచురించిన త్రికాలమ్‌లో ఒక ఆర్డినెన్స్‌ను రాహుల్ గాంధీ ‘అట్టర్ నాన్సెన్స్’ అని అభివర్ణించినట్టు వచ్చిన అంశంపై ఒక వివరణ. పార్లమెంటు సభ్యుడు కానీ, శాసనసభ్యుడు కానీ ఏదైనా కేసులో దోషిగా న్యాయస్థానం నిర్ణయిస్తే సదరు సభ్యుల సభ్యత్వం రద్దు అవుతుందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఎన్నికల చట్టంలో చట్టసభల సభ్యులకు అనుకూలంగా ఉన్న నిబంధనను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేయడం వల,్ల చట్టసభల సభ్యులు దిగువ కోర్టుల నిర్ణయాలను శిరసావహించి సభ్యత్వాన్ని వదులుకోవలసి వస్తుంది. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని వమ్ము చేసే లక్ష్యంతో యూపీఏ సర్కార్ 2013 ఆగస్టు 17వ తేదీన అఖిల పక్ష సమావేశం నిర్వహించింది. సుప్రీం నిర్ణయానికి విరుగుడుగా ఆర్డినెన్స్ జారీ చేయాలన్న ప్రతిపాదనకు ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ సుముఖత వ్యక్తం చేసినట్టు ప్రభుత్వం చెప్పింది. చట్టసభలో సభ్యులుగా ఉన్నవారిని దోషులుగా న్యాయస్థానాలు నిర్ణయించినప్పటికీ కోర్టు తీర్పును సవాలు చేస్తూ మూడు మాసాలలోగా ఎగువ కోర్టుకు అప్పీలు చేసుకున్నట్లయితే సభ్యులుగా కొనసాగవచ్చునంటూ ఒక ఆర్డినెన్స్ జారీ చేయించాలని యూపీఏ మంత్రిమండలి నిర్ణయించింది. వెంటనే ఈ నిర్ణయాన్ని బీజేపీ, వామపక్షాలు వ్యతిరేకించాయి. బీజేపీ అగ్రనేత అద్వానీ నాయకత్వంలో ఉన్నత స్థాయి ప్రతినిధి వర్గం రాష్ట్రపతిని కలుసుకొని ఆర్డినెన్స్ జారీ చేయవద్దంటూ అభ్యర్థించింది. ఆర్డినెన్స్ ప్రతిపాదన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి చేరిన తర్వాత ఆయన న్యాయశాఖ మంత్రిని పిలిపించుకొని ఇందుకు సంబంధించిన బిల్లు పార్లమెంటు పరిశీలనలో ఉండగా ఇప్పుడు ఆర్డినెన్స్ ఎందుకంటూ ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రెస్‌క్లబ్‌లో కాంగ్రెస్ పార్టీ మీడియా విభాగం పర్యవేక్షకుడు అజయ్ మాకెన్ (మొన్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి) మీడియాతో మాట్లాడుతున్నారు. ఆర్డినెన్స్ తీసుకురావాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. అంతలోనే అక్కడికి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ వెళ్ళి ‘ఈ ఆర్డినెన్స్ పరమ చెత్తది. దీన్ని చించి అవతల పారేయాలి (దిస్ ఆర్డినెన్స్ ఈజ్ ఎ కంప్లీట్ నాన్సెన్స్, షుడ్ బీ టార్న్ అండ్ త్రోన్ అవే) అంటూ నాటకీయంగా వ్యాఖ్యానించారు. ఆ తర్వాత మీడియా ప్రతినిధులు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పి రాహుల్ నిష్ర్కమించిన అనంతరం మాకెన్ మాట్లాడుతూ, ‘రాహుల్‌గాంధీ ఇప్పుడు చెప్పిందే మా పార్టీ విధానం’ అంటూ ప్రకటించారు. ఇంత జరిగినా నాటి ప్రధాని మన్మోహన్సింగ్ మౌనంగా ఉండటాన్ని చాలామంది రాజకీయ పరిశీలకులూ, వ్యాఖ్యాతలూ తప్పుపట్టారు. - ఎడిటర్ -
పీవీ, మన్మోహన్ ఔర్ సోనియా!
రెండోసారి ప్రధానిగా ప్రమాణం చేసింది లగాయతు తన అధికారాన్నీ, స్వేచ్ఛనూ సోనియా, రాహుల్ హరిస్తుంటే ఆయన వారించలేదు. ఆర్థిక సంస్కరణలకు అడ్డం వస్తూ ప్రజారంజక కార్యక్రమాలను అమలు చేయాలంటూ సోనియా లేఖలు రాస్తూ వాటిని మీడియాకు రహస్యంగా అందించడాన్ని సైతం సహించారు. ‘ఇందిరాగాంధీని తీహార్ జైలుకు తీసుకుపోతుంటే వ్యాన్‌ను మధ్యలో ఆపు చేయించి ఆవిడ మోరీ గట్టు మీద కూర్చుంది. అప్పుడు నేనూ, ఇతర కాంగ్రెస్ నాయకులూ నానా తంటాలు పడి పత్రికా విలేకరు లకూ, సంపాదకులకూ కబురు పెట్టి, వారు హుటా హుటిన అక్కడికి వచ్చేటట్టు చేశాం. అది సంచలనా త్మక సందర్భం. కాంగ్రెస్ పార్టీలో మాబోటి నాయకులందరూ ఇందిరమ్మకు అండగా నిలిచారు. ఇప్పుడు మనకు తోడు ఎవరున్నారు?’ 1996 మేలో ప్రధాని పదవి నుంచి వైదొలిగిన తర్వాత పీవీ నరసింహారావు హైదరాబాద్ చాలాసార్లు వచ్చారు. రాజ్‌భవన్‌లో దిగేవారు. తరచు కలుసుకునే అవకాశం ఉండేది. ప్రముఖ సంపాదకుడు పొత్తూరి వెంకటేశ్వరరావూ, నేనూ పీవీని కలుసుకున్నప్పుడు ఆయన మనసు విప్పి వెలిబుచ్చిన వేదన ఇది. మరో మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ను సీబీఐ కోర్టు బుధవారంనాడు బోనులో నిలబెట్టినప్పుడు పీవీ వ్యధ కళ్ళకు కట్టింది.. బొగ్గు నిల్వలను బిర్లాకు చెందిన హిండాల్కో సంస్థకు కేటాయించాలన్న ‘అక్రమ’ నిర్ణయంలో మన్మోహన్ సింగ్‌కు పాత్ర ఉన్నదని భావించిన కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) స్పెషల్ జడ్జి భరత్ పరాశర్ మాజీ ప్రధానికి సమన్స్ జారీ చేశారు. ఈ వ్యవహారంలో మన్మోహన్ తప్పిదం ఏమీలేదనీ, ఆయనను నిందితుడుగా పేర్కొనవలసిన అవసరం లేదనీ సీబీఐ లోగడ రెండు విడతలు నిర్ధారించినప్పటికీ న్యాయమూర్తి మాత్రం ఏ కారణం చేతనో మాజీ ప్రధానిని నిందితుడుగా పరిగణించి కోర్టుకు రావలసిందిగా ఆదేశించారు. చట్టాన్ని గౌరవించే పౌరునిగా మన్మోహన్ కోర్టుకు హాజరైనారు. దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నిజాయితీపరునిగా పేరు ప్రఖ్యాతులున్న మన్మోహన్సింగ్ను నిందితుడుగా బోను ఎక్కించడం వెనుక రాజ కీయ కుట్ర ఉన్నదంటూ కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాగాంధీ ఆగ్రహించారు. ఆమె నాయకత్వంలో ఏకే ఆంటోనీ, దిగ్విజయ్‌సింగ్, చిదంబరం, షీలాదీక్షిత్, గులాంనబీ ఆజాద్ వంటి కాంగ్రెస్ హేమాహేమీలు మన్మోహన్‌సింగ్‌కు సంపూర్ణ సంఘీభావ సూచనగా అక్బర్ రోడ్డులోని ఏఐసీసీ కార్యాలయం నుంచి మాజీ ప్రధాని నివాసం వరకూ పాదయాత్ర చేశారు. పీవీ పట్ల సంఘీభావం లేకపోగా ఆయన పట్ల శత్రుభావాన్ని సోనియాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రదర్శించింది. పీవీ, మన్మోహన్ గురుశిష్యులు. ఇద్దరూ వ్యక్తిగతంగా అవినీతికి అతీతమైనవారే. కానీ ఇద్దరూ అవినీతి కేసులలో నిందితులుగా బోను ఎక్కవలసి రావడం విశేషం. తుది వరకూ ఒంటరి పోరాటం జార్ఖండ్ ముక్తి మోర్చాకు చెందిన నలుగురు లోక్‌సభ సభ్యులను కొనుగోలు చేశారన్న ఆరోపణపై ఢిల్లీ న్యాయమూర్తి అజిత్ భ ర్తోక్ పీవీకి మూడేళ్ళ కారాగార శిక్ష విధిస్తూ 2000 అక్టోబర్ 12న తీర్పు ఇచ్చారు. ఆ రోజు మాజీ ప్రధానిని పరామర్శించేందుకు ఆయన ఇంటికి వెళ్ళిన ఒకే ఒక మాజీ సహచరుడు మన్మో హన్‌సింగ్. పీవీ తనపైన వచ్చిన మూడు కేసులలోనూ కడవరకూ ఒంటరి పోరు చేయవలసి వచ్చింది. పీవీపైన పెట్టిన లఖూభాయ్ చీటింగ్ కేసు, సెయింట్ కిట్స్ ఫోర్జరీ కేసు, జేఎంఎం కేసులలో చివరిది మాత్రమే బలమైనది. లఖూభాయ్ కేసులో చంద్రస్వామి నిందితుడు. పీవీ నిందితుడు కాదు. లఖూభాయ్ దాఖలు చేసిన అఫిడవిట్లో తాను చంద్రస్వామికి పీవీ సమక్షంలో డబ్బు చెల్లించానని ఆరోపించాడు. ఇంకో ప్రధాని విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ పరువు తీసే దురుద్దేశంలో పత్రాలను ఫోర్జరీ చేశారనే ఆరోపణపై పెట్టిన సెయింట్ కిట్స్ కేసులో కూడా ప్రధాన నిందితులు చంద్రస్వామి, ఆయన స్నేహితుడైన ఆయుధాల వ్యాపారి అద్నాన్ ఖషోగి. సెయింట్ కిట్స్ కాన్సలేట్ అధికారి చేత పత్రాలు ఫోర్జరీ చేయించారన్నది పీవీపైన అభియోగం. చంద్రస్వామి వంటి మార్మికుడినీ, దళారినీ దగ్గరికి తీసిన పీవీ విచక్షణారాహిత్యానికి మూల్యంగా ఆయన మెడకు ఈ రెండు కేసులూ చుట్టుకున్నాయి. దేశంలో అస్థిర పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్న సమయంలో మైనారిటీ ప్రభుత్వాన్ని ఏ విధంగానైనా సరే రక్షించుకొని పూర్తికాలం పరిపాలించాలనే సంకల్పంతో చేసిన చాణక్యం మూడో కేసుకు దారితీసింది. 1993 జూలై 26న లోక్‌సభలో విశ్వాస తీర్మానం నెగ్గేందుకు జేఎంఎం ఎంపీలను కొనుగోలు చేశారనే అభియోగంతో పెట్టిన కేసులో ఎంపీలలో ఒకరైన శైలేంద్ర మహతో అప్రూవర్‌గా మారడంతో కేసు జటిలమైంది. చివరికి ఢిల్లీ హైకోర్టు మహతో సాక్ష్యం నమ్మశక్యంగా లేదని నిర్ధారించి పీవీని నిర్దోషిగా ప్రకటించింది. ఈ మూడు కేసుల నుంచీ పీవీ 2003లో నిర్దోషిగా బయటపడ్డారు. బాబ్రీమసీదు కూల్చివేత ఘటనపైన దర్యాప్తు చేసిన లిబరహాన్ కమిషన్ సైతం పీవీ తప్పు లేదని తేల్చింది. ఈ నివేదిక జస్టిస్ లిబరహాన్ 2009 జూన్ 30 వ తేదీన అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు అందజేశారు. అప్పటికి అయిదేళ్ళ కిందటే పీవీ కన్ను మూశారు. సోనియా సంఘీభావం వెనుక... మన్మోహన్సింగ్ను కాపాడుకుంటామంటూ సోనియా ప్రతిజ్ఞ ఎందుకు చేశారు? ఇప్పుడు మాజీ ప్రధానికి మద్దతు తెలపకపోతే ఆయన సోనియా నివాసం నుంచి తనకు వచ్చిన చిట్టీల గుట్టు రట్టు చేస్తారనే భయం కారణం కావచ్చు. మన్మోహన్ కుమార్తె సూచించినట్టు ఆయన స్వీయచరిత్ర రాసినా రాయవచ్చు. అందులో జార్జి, అహ్మద్ పటేల్ వంటి సోనియా మనుషులు అధికారుల నియామకాలూ, బదిలీలూ, కీలకమైన ఫైళ్లపై సంతకాలూ వంటి అనేక అంశాలలో ఆమె ఆదేశాలంటూ పంపించిన సిఫార్సుల గురించి ప్రస్తావించవచ్చు. కాంగ్రెస్ పార్టీ 2014 ఎన్నికలలో చిత్తుగా ఓడినప్పటికీ పూర్తిగా చేవ ఉడిగిపోలేదు. రాహుల్ గాంధీ విదేశాలలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో దిగువ స్థాయి పోలీసు అధికారులు ఆయన నివాసానికి విధ్యుక్తధర్మంగా వెళ్ళడంపై ఆ పార్టీ శనివారం నాడు రాద్ధాంతం చేసింది. ఈ తంతు చూస్తుంటే తన ఇంటి ముందు ఇద్దరు పోలీసు కానిస్టేబుల్స్ తచ్చాడుతూ కనిపించారన్న సాకుతో చంద్రశేఖర్ ప్రభుత్వా నికి కాంగ్రెస్ మద్దతు ఉపసంహరిస్తున్నట్టు రాజీవ్‌గాంధీ ప్రకటించినప్పటి ఉదంతం గుర్తుకొస్తున్నది. పీవీ పట్ల వాజపేయికి సానుభూతి ఉన్నట్లే మన్మోహన్ పట్ల నరేంద్రమోదీకీ సద్భావం ఉంది. కానీ న్యాయస్థానంలో కేసులు ఉన్నప్పుడు ప్రధానులైనా, రాష్ట్రపతులైనా చేయగల సాయం అంటూ ఏమీ ఉండదు. పైగా, బలమైన కారణం లేకుండా న్యాయమూర్తి మాజీ ప్రధానిని నిందితుడుగా నిర్ధారించరు. పరిస్థితులు అనుకూలించి ఈ కేసులో బొగ్గు మసి అంటకుండా బయటపడినప్పటికీ చరిత్ర మన్మోహన్‌సింగ్‌కు ఉదాత్తమైన స్థానం మాత్రం కేటాయించదు. కారణం ఏమిటి? ఉన్నత పదవులలో ఉన్నవారికి ఎప్పుడు పదవీ విరమణ చేయాలో తెలియాలి. అవమానాలను ఎంతవరకూ దిగమింగాలో గ్రహించాలి. మైనారిటీ ప్రభుత్వాన్ని ఐదేళ్ళ పాటు నడిపించి అర్జున్‌సింగ్ లేఖాస్త్రాలను తట్టుకొని, సోనియాకు విధేయుడుగా ఉండటానికి నిరాకరించి ఆమె ఆగ్రహానికి గురైన పీవీ విపరీతమైన మానసిక క్షోభ అనుభవించారు. కానీ చివరి శ్వాస వరకూ ఆత్మాభిమానం కాపాడుకున్నారు. ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన ప్రధానిగా, విదేశాంగ విధానంలో సృజనాత్మకమైన పోకడలు పోయిన దక్షుడుగా పీవీకి చరిత్రలో గౌరవనీయమైన చోటు దక్కుతుంది. చారిత్రక తప్పిదం పీవీ రాజకీయాలలోకి తీసుకొని వచ్చిన ఉన్నతాధికారి, అధ్యాపకుడు, ఆర్థికవేత్త మన్మోహన్సింగ్ ప్రధానిగా పూర్తి భిన్నంగా వ్యవహరించారు. తాను సోనియా నియమించిన ప్రధానిననీ, ఆమె దయతోనే పదవిలో ఉన్నాననే స్పృహ ఆయనను క్షణం కూడా వీడలేదు. 2009 ఎన్నికల తర్వాత రెండోసారి ప్రధానిగా ప్రమాణం చేసింది లగాయతు తన అధికారాన్నీ, స్వేచ్ఛనూ సోనియా, రాహుల్ హరిస్తుంటే ఆయన వారించలేదు. ఆర్థిక సంస్కరణలకు అడ్డం వస్తూ ప్రజారంజక కార్యక్రమాలను అమలు చేయాలంటూ మన్మోహన్‌కు సోనియా లేఖలు రాస్తూ వాటిని మీడియాకు రహస్యంగా అందించడాన్ని సైతం సహించారు. మౌనంగా బాధపడుతూ ‘మౌన్‌మోహన్’ అనే పేరు తెచ్చుకొని అపహాస్యం పాలైనారే కానీ ప్రతిఘటించలేదు. అవినీతి నిరోధక ఆర్డినెన్స్‌ను రాహుల్ గాంధీ ఢిల్లీ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల గోష్ఠిలో నాటకీయంగా చించివేసి ‘అట్టర్ నాన్సెన్స్’ అంటూ కటువుగా వ్యాఖ్యానించినప్పుడు మన్మోహన్ విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన స్వదేశానికి తిరిగి రాగానే రాహుల్ ప్రవర్తనకు నిరసనగా రాజీనామా చేసి ఉన్నట్లయితే ఆయనకు చరిత్ర మెరుగైన స్థానం కేటాయించేది. అంతులేని కృతజ్ఞతాభావంతో సోనియాకు ఎదురు చెప్పలేక ప్రధాని పదవిలో బందీగా 2010 నుంచి నాలుగేళ్ళపాటు ఎందుకు ఉండిపోయారో ఆయన ఎప్పటికైనా సంజాయిషీ చెప్పవలసిందే. కనీసం తనకు తాను సమాధానం చెప్పుకోక తప్పదు. స్వలాభం లేదు. సొంత ముఠా లేదు. ఒకరిని ఉద్ధరించాలని కానీ ఒకరిపైన ప్రతీకారం తీర్చుకోవాలనీ లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే మనస్సన్యాసి. అటువంటి వ్యక్తి సోనియా, రాహుల్ మాత్రమే కాకుండా మంత్రి మండలిలోని సీనియర్ సహచరులు కూడా బహిరంగంగా అవమానించినప్పుడు పదవిని పట్టుకొని వేళ్ళాడటం అవివేకం. పీవీ మంత్రి మండలిలో ఐదేళ్ళు ఆర్థిక మంత్రి గానూ, 2004 నుంచి ఐదేళ్ళు ప్రధానిగానూ ఆర్జించిన కీర్తి యావత్తూ రెండవసారి ప్రధానిగా పని చేసిన ఐదేళ్ళలో పూర్తిగా తుడిచిపెట్టుకు పోయింది. సమకాలీన వ్యాఖ్యాతల కంటే భవిష్యత్తులో చరిత్రకారులు మన్మోహన్సింగ్ను అంచనా వేయడంలో ఇంకాస్త ఉదారంగా వ్యవహరించవచ్చునేమో కానీ, సకాలంలో పదవి నుంచి వైదొలగకపోవడం మాత్రం చారిత్రక తప్పిదం. - కె.రామచంద్రమూర్తి -
పీవీ హయాంలోనే పిలిచారు
- ఎయిర్‌లైన్స్ ఏర్పాటు చేయాలని అడిగారు - జేఆర్డీ టాటా చాలా ఆనందపడ్డారు - మంచి భాగస్వామిని వెదకమని నాకు చెప్పారు - అప్పట్లో అది కుదరలేదు: రతన్‌టాటా వెల్లడి న్యూఢిల్లీ: ‘‘అవి పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న రోజులు. కేంద్ర కేబినెట్ కార్యదర్శిని జేఆర్డీ టాటా కలిశారు. ప్రైవేటు విమానయాన కంపెనీలకు అనుమతివ్వాలని పీవీ ప్రభుత్వం అనుకుంటోందనే సంగతి ఆయనకు చెప్పారు. జేఆర్డీ ఉద్వేగానికి లోనై నాతో ఈ సంగతి చెప్పారు. అయితే ఎయిర్ ఇండియాను ఆరంభించినప్పటి రోజులు కావని, విమానయాన రంగంలో తీవ్ర పోటీ ఉందని, ఏవియేషన్ కంపెనీకి మంచి భాగస్వామి కావాలని, అప్పుడే దేశానికి అంతర్జాతీయ స్థాయి కంపెనీని అందించగలమని సూచించారు. కానీ అది జరగలేదు.’’ ఈ మాటలన్నది ఎవరో కాదు. టాటా సన్స్ చైర్మన్ ఎమిరిటస్ రతన్ టాటా. సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో కలసి విస్తారాను ఆరంభించిన సందర్భంగా బుధవారం రాత్రి ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ విషయం చెప్పారు. ‘‘తరవాత విమానయాన సంస్థను ఏర్పాటు చేయాలంటూ అదే ప్రభుత్వం మమ్మల్ని నేరుగా కోరింది. కానీ కుదరలేదు’’ అని తెలియజేశారు. పీవీ నరసింహారావు 1991-96 మధ్య ప్రధానిగా ఉండగా... ఈ సంఘటన ఏ సంవత్సరంలో జరిగిందన్నది మాత్రం టాటా వెల్లడించలేదు. 1932లో టాటా ఎయిర్‌లైన్స్‌ను జేఆర్డీ టాటా ఏర్పాటు చేయగా... దాన్ని జాతీయం చేసి ఎయిర్ ఇండియాగా పేరు మార్చారు. ఆయన 1993 నవంబర్‌లో మరణించారు. అప్పటిదాకా ఉన్న లెసైన్స్-పర్మిట్-కోటా పద్ధతిని తొలగిం చి ఆర్థిక వ్యవస్థలో ప్రైవేటు పెట్టుబడులకు ద్వారాలు తెరచిన పీవీ హయాంలోనే జెట్ ఎయిర్వేస్, దమానియా ఎయిర్వేస్ లెసైన్సులు పొందాయి. గతంలోనే మనసు విప్పిన టాటా... నిజానికి ఎయిర్‌లైన్స్ సంస్థను ప్రారంభించాలన్న ఆలోచన ఉన్నా కుదరలేదని గతంలో కూడా చెప్పారు. అధికారులకు లంచాలివ్వటం ఇష్టంలేకే విమానయాన సంస్థను ఏర్పాటు చేయలేదని... ఓ మంత్రికి 15 కోట్లిస్తే లెసైన్సు వస్తుందని సహ పారిశ్రామికవేత్త చెప్పినా తానా పని చేయలేదని 2010లో కూడా చెప్పారు. నిజానికి ఎయిర్ఇండియాలో 40 శాతం వాటా కొనటానికి టాటా, సింగపూర్ ఎయిర్‌లైన్స్ కలసి చేసిన ప్రయత్నాలు గతంలో ఫలించలేదు. రెండోసారి ఇవి రెండూ కలసి విమాన సంస్థను ఏర్పాటు చేయబోయినా కుదరలేదు. మూడో ప్రయత్నంలో ఇవి విజయవంతమై... ‘విస్తారా’ విమానం ఇటీవలే తొలి ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. సేవలతోనే నిలబడాలి... ‘‘మిగతా ఎయిర్‌లైన్స్‌తో పోలిస్తే మనం ప్రత్యేకమైన సేవలందించాలి. భద్రతతో పాటు ప్రయాణికులకు ప్రత్యేక అనుభూతినివ్వాలి. అప్పుడే ప్రయాణికులు మనని ఎంచుకుంటారు. అది చేయలేకపోతే చాలా కోల్పోతాం’’ అని టాటా చెప్పారు. ప్రత్యర్థులు ఇబ్బందులు పెడతారని కూడా ఆయన హెచ్చరించారు. అయితే సేవలు ఆరంభించడానికి తమ సంస్థ ఎంత ఓపిగ్గా వేచి చూసిందో చెబుతూ... ఎలాంటి సవాళ్లనైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామనడానికి ఇదే నిదర్శనమన్నారు. -
పద్మ అవార్డులకు తెలంగాణ నుంచి 26 పేర్లు
కేంద్రం అందించే పద్మ అవార్డులకు తెలంగాణ ప్రభుత్వం 26 మంది ప్రముఖుల పేర్లను సిఫార్సు చేసింది. దేశంలో అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను... దేశానికి ప్రధానిగా సేవలందించిన తెలంగాణ ప్రాంత వ్యక్తి పీవీ నరసింహారావుకు ఇవ్వాలని టీ- సర్కారు కేంద్రాన్ని కోరింది. ప్రొఫెసర్ జయశంకర్ కు పద్మ విభూషణ్, ఇగ్నో, ఆంధ్రా యూనివర్సిటీల సార్వత్రిక విశ్వవిద్యాలయాల తొలి వీసీ ప్రొఫెసర్ జి.రామిరెడ్డికి పద్మ భూషణ్ అవార్డులు ఇవ్వాలని తెలంగాణ సర్కారు సిఫార్సు చేసింది. ఇంకా.. ప్రభుత్వం సిఫార్సు చేసిన వారిలో డాక్టర్ ఎన్.గోపి, చుక్కా రామయ్య, మిథాలీ రాజ్, సుద్దాల అశోక్ తేజల పేర్లున్నాయి. -
కల్లోల కాలాలను గెలిచిన తెలంగాణ బిడ్డ పీవీ
దేశ ప్రధానిగా పీవీ నరసింహారావు వేసిన బాట మోదీ దాకా కొనసాగిందంటే ప్రపంచదేశాలలో భారత్ అస్థితాన్ని నిలపటంలో ఈ తెలంగాణ బిడ్డడి ఆలోచనలు కీలకమని స్పష్టంగా నిర్ధారణ అయింది. పీవీని స్మరించుకోవటమంటే ఇప్పుడున్న పరిస్థితులలో దేశాన్ని ఏ దిశగా తీసుకుపోవాలని ఆలోచించడమే. ఇది డిజిటల్ యుగం. ఇది మార్కెట్ ప్రపంచం. ప్రపంచం నిత్యయుద్ధాల నిత్య సం ఘర్షణల సమాహారం. అందుకే ప్రపంచాన్ని కూడా మనం సమతుల్యంగా ఉంచు కోవాలి. సమతుల్యత దెబ్బతింటే వ్యవస్థలు తిరగబడ తాయి. దేశాలు తలకిందు లవుతాయి. సమాజాలు కకావికలవుతాయి. ఇలాంటి సమయాల్లోంచే దార్శనికులు పుట్టుకుని వస్తారు. ఇలా కాలానికి పాఠం చెప్పగల దార్శనికులతోటే చరిత్ర గమనం సాగుతుంది. కొన్ని సందర్భాలలో కొందరు చేసే పనులు విమర్శలకు గురికావచ్చును. అవే భవిష్యత్తులో తిరిగి ప్రయోజనాలుగా నిలిచిపోవచ్చును. ఫలితాలను పక్కనబెట్టి చూస్తే సంబంధిత కాలానికి సంబంధిత సందర్భం అన్నదే ముఖ్యమైనది. మన కాలంలో దేశంలో ఏర్పడ్డ అనేక కల్లోల కాలాల సందర్భాలను జయించిన అతి కొద్దిమంది రాజకీయ నేతలలో పీవీ నర్సింహారావు ఒకరు. ఇప్పుడు ప్రపంచం అంతా ప్రపంచీకరణకు పల్లవిగా మారిపోయింది. కమ్యూ నిస్టు ప్రభావిత దేశాలు కూడా ప్రపంచీకరణ పంచన చేరిపోయి తమ దేశ ఆర్థిక వ్యవస్థలను కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. రాజీవ్ గాంధీ హత్యానంతరం దేశంలో ఏర్పడ్డ సంక్షోభాన్ని పరిష్కరించే పనికి పీవీ నర్సింహారావు నడుంకట్టడంతో ఆనాటికి ఆయన ఆపద మొక్కులవాడయ్యాడు. పీవీ ప్రపంచీకరణ విధానాలు దేశంలో ఒక రకమైన స్థితిగతులను ఏర్పరిచాయి. వాటి వల్ల పొందిన లాభ నష్టాలు కూడా ఉన్నాయి. అది వేరే విషయం. ఈ ఆదివారం (28-12-2014) సీనియర్ జర్నలిస్టు కె.రామచంద్రమూర్తి హైదరాబాద్‌లో పీవీ స్మారకోప న్యాసం ఏర్పాటు చేశారు. దానికి గాంధీ మహాత్ముడి మనవడు రాజమోహన్ గాంధీ విచ్చేశారు. ఆ సం దర్భంగా పలువురు చేసిన ఉపన్యాసాలన్నీ విన్నాక పీవీకి సంబంధించిన వ్యక్తిత్వం మననం చేసుకోవటం జరి గింది. తాను పుట్టిన తెలంగాణకు అంతగా సేవ చేయ లేకపోయినప్పటికినీ దేశాన్ని మాత్రం విపత్తు నుంచి కాపాడేందుకు ప్రధాన మంత్రిగా కృతకృత్యుడైనాడు. పీవీ నరసింహారావు బహుజన వర్గాల అభివృద్ధికి తన వంతు కృషి చేసినట్లు ఆనాటి స్మారకోపన్యాసంలో పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అప్పటి ముఖ్య మంత్రిగా ఉన్న పీవీ 40 శాతం మంది బీసీలకు చట్ట సభలలోకి వచ్చేందుకు సీట్లు ఇచ్చారు. పీవీ వేసిన దారిలో ఆ తర్వాత కాంగ్రెస్ నడవలేకపోయింది కానీ ఆయన వేసిన బాటలో నడచిన ఎన్టీఆర్ మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంపై బలమైన ముద్రవేయ గలిగాడు. తెలంగాణ మట్టి నుంచి ఎదిగొచ్చిన పీవీ ఏ శాఖలో పనిచేసినా ఆ శాఖకు వన్నె తెచ్చాడు. దేశంలో గురుకుల విద్యా వ్యవస్థను నెలకొల్పి విద్యారంగంలో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టారు. కేంద్ర విద్యా శాఖ పేరును తొలగించి ఆ శాఖను మానవ వనరుల శాఖగా తీర్చి దిద్దాడు. బహుభాషలలో పండితుడైన పి.వి. తెలుగు భాషపట్ల అపరిమితమైన ప్రేమ కలవాడు. తెలుగు భాష కొనసాగింపునకు ఏం చేయాలో ఆలోచనలు చేసినవాడు. పి.వి. నరసింహారావును స్మరించుకోవటమంటే ఇప్పు డున్న పరిస్థితులలో దేశాన్ని ఏ దిశగా తీసుకుపోవాలని ఆలోచించడమే. పి.వి. స్మారకోపన్యాసం ద్వారా దేశం దశదిశను మార్చటానికి కొత్త ఆలోచనలు చేయాలి. ప్రస్తుత ప్రధాని మోదీ కొనసాగిస్తున్న విధానాలు పీవీ ఆలోచనలకు కొనసాగింపా? కాదా? అన్న విషయం చర్చనీయాంశంగా మారింది. పీవీ సరళీకరణ విధానాలే దేశాన్ని గట్టెక్కించా యని పాలకపక్షాలు చెబుతుంటే, దేశంలో ప్రస్తుతస్థితికి, పలు రంగాలలో నిరాసక్తతకు పీవీ విధానాలే కారణమన్న బలమైన వాదనలూ ఉన్నాయి. మొత్తం మీద దేశానికి మంచో చెడో ఏదో ఒకటి మాత్రం పీవీ చేయగలిగాడు. పీవీ నాయకుడిగా వేసిన బాట మోదీ దాకా కొన సాగిందంటే ప్రపంచదేశాలలో భారత్ అస్థిత్వాన్ని నిల పటంలో ఈ తెలంగాణ బిడ్డడి ఆలోచనలు కీలకమని స్పష్టంగా నిర్ధారణ అయింది. దేశానికి గొప్ప పేరు ప్రతిష్టలు తేగలిగిన వాడు. చివరకు తన సొంత పార్టీ నుం చి తీవ్ర నిరాదరణకు గురయ్యారు. ఒక దేశ ప్రధానిగా పని చేసిన వ్యక్తికి లభించాల్సిన ఆదరణ లభించలేదని ఇతర రాజకీయ పార్టీలు ప్రశ్నించాయి. పీవీ తెలంగాణకు చేయాల్సింది చేయలేకపోయినా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం మాత్రం ఆయనను గౌరవించి సమున్నతంగా నిలిపింది. భారతదేశంలో సరళీకరణల మార్పులు తెచ్చిన వ్యక్తిగా పి.వి. దేశమంత ఎత్తు ఎదిగిన వాడు. దేశమంతా బ్రహ్మ రథం పడుతుంటే ఆయనను నిలువునా ప్రశ్నించగలిగింది కూడా తెలంగాణ సమాజమే. పీవీ వ్యక్తిత్వం విభిన్నమైనది. మన్మోహన్ సింగ్ లాంటి ఆర్థిక వేత్తను తెరపైకి తీసుకువచ్చి ప్రపం చీకరణకు దారులు తెరి చారు. పీవీ రాజకీయరంగంలో అపర చాణుక్యుడిగా పేరు గడించాడు. పీవీ తన ఆలోచనలతో దేశానికి దడపుట్టించగలి గాడు కానీ వ్యక్తిగతంగా కాళోజీని చూసి వణికిపోయాడు. దేశానికి నాయకునిగా చలామణి కాగలిగినా కాళోజీ ఇంట్లో పిల్లవానిగానే వ్యవహరించాడు. స్మారకోపన్యా సాలు, సంతాప సందేశాలు కాదు. స్మార కోపన్యాసాలు దేశానికి కొత్త ఆలోచనలు అందించేందుకు దోహద కారులుగా నిలుస్తాయి. విద్యారంగంలో మరిన్ని విప్లవా త్మక మార్పులకు పీవీ చూపిన దారిలో మరింత ముందుకుపోవలసి ఉంది. (వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త, సామాజిక విశ్లేషకులు) - చుక్కా రామయ్య -
రవీంద్ర భారతిలో పీవీ స్మారక ఉపన్యాసం
-
28న పీవీ స్మారకోపన్యాసం
ప్రసంగించనున్న గాంధీ మనవడు రాజ్‌మోహన్‌గాంధీ సాక్షి,హైదరాబాద్: మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు జ్ఞాపకార్థం ఈనెల 28న హైదరాబాద్‌లో ‘స్వాతంత్య్రం - సామాజిక న్యాయం’ అంశంపై ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పీవీ ఫౌండేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కార్యక్రమంలో మహాత్మాగాంధీ మనవడు, ప్రముఖ రచయిత రాజ్‌మోహన్‌గాంధీ స్మారకోపన్యాసం చేస్తారని పేర్కొంది. ఆదివారం ఉదయం రవీంద్రభారతిలో సీనియర్ సంపాదకులు డాక్టర్ కె.రామచంద్రమూర్తి అధ్యక్షతన జరిగే కార్యక్రమంలో పలువురు సీనియర్ జర్నలిస్టులు, యూనివర్సిటీ ప్రొఫెసర్లతో పాటు పీవీ కుటుంబసభ్యులు, పలు రంగాల ప్రముఖులు హాజరుకానున్నారు. రెండేళ్లుగా పీవీ డెవలప్మెంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్మారకోపన్యాస కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తొలి ఏడాది రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, గత ఏడాది అప్పటి కేంద్రమంత్రి గులాంనబీ ఆజాద్ స్మారకోపన్యాసం చేశారు. -
అధికారికంగా పీవీ వర్ధంతి సభ
సాక్షి, హైదరాబాద్: దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు 10వ వర్ధంతి కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. నెక్లెస్ రోడ్డులోని పీవీ జ్ఞానభూమిలో మంగళవారం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్మరణ కార్యక్రమానికి పీవీ కుటుంబసభ్యులతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్, ఉప ముఖ్యమంత్రులు టి. రాజయ్య, మహమూద్ అలీ, మంత్రులు హరీశ్‌రావు, నాయిని నర్సింహారెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, జూపల్లి కృష్ణారావు, పి.మహేందర్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న, ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి తదితరులు హాజరై నివాళులు అర్పించారు. పీవీ కుమారుడు, మాజీ ఎంపీ పీవీ రాజేశ్వర్‌రావు, కుమార్తెలు శ్రీవాణి, జయ నందన, మనవళ్లు, మనవరాళ్లను పలుకరించిన ముఖ్యమంత్రి అనంతరం సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. పీవీ మనవడు నవీన ఏర్పాటు చేసిన ఉచిత నేత్రవైద్య శిబిరాన్ని ప్రారంభించారు. కాగా, పీవీ వర్ధంతి కార్యక్రమానికి కాంగ్రెస్ శ్రేణులు దూరంగా ఉన్నాయి. పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, పార్టీ అధికార ప్రతినిధి వకుళాభరణం కృష్ణమోహన్‌రావు మినహా పార్టీ నేతలెవరూ ఈ కార్యక్రమానికి రాకపోవడం గమనార్హం. ఖైరతాబాద్ బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పీవీ సమాధి వద్ద నివాళులు అర్పించారు. కాగా, టీడీపీ నాయకులెవ్వరూ పీవీ సమాధిని సందర్శించలేదు.