
భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ ప్రధాని, బహుభాషా కోవిదుడు పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆయనను స్మరించుకున్నారు. ‘మన మాజీ ప్రధాని శ్రీ పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటున్నాం. ఆయన ఒక రాజనీతిఙ్ఞుడు. విలువైన నాయకత్వంతో దేశాన్ని విపత్కర పరిస్థితుల నుంచి బయటపడేలా చేశారు. లోతైన పరిఙ్ఞానం, విఙ్ఞత కలిగిన గొప్ప మేధావి ఆయన’ అంటూ నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ కూడా...
‘భారత తొమ్మిదవ ప్రధాని పీవీ నరసింహారావు పుట్టినరోజు సందర్భంగా ఆయనను స్మరించుకుంటున్నాం. చాణక్యుడిగా పేరొందిన పీవీ తన మేధస్సుతో మైనార్టీ ప్రభుత్వాన్ని ఎంతో సమర్థవంతంగా నడిపించారు’ అంటూ కాంగ్రెస్ పార్టీ అధికార ట్విటర్ పేజీలో పోస్ట్ చేసింది. గతేడాది కాంగ్రెస్ పార్టీ పీవీ జయంతిని గుర్తుపెట్టుకోలేదు గానీ ఇప్పుడు ప్రధాని మోదీ ట్వీట్ చూసిన అనంతరం.. ఈవిధంగా తమ సొంత పార్టీకి చెందిన గొప్ప మేధావి, ప్రభావశీలిని స్మరించుకోవాలనే స్పృహ రావడం చూస్తుంటే అచ్చేదిన్ వచ్చినట్లుగానే కన్పిస్తోందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Remembering our former PM Shri PV Narasimha Rao on his birth anniversary. Shri Rao is widely respected as a statesman who provided valuable leadership during a critical period of India’s history. Blessed with immense wisdom, he made a mark as a distinguished scholar as well.
— Narendra Modi (@narendramodi) June 28, 2018
We remember PV Narasimha Rao, India's 9th Prime Minister, on his birth anniversary today.
— Congress (@INCIndia) June 28, 2018
He was referred to as Chanakya for his ability to steer tough economic & political legislation through the parliament at a time when he headed a minority Govt. pic.twitter.com/Iad7WElFmG