ఢిల్లీ : ప్రధాని మోదీకి వ్యతిరేకంగా లోక్‌సభలో సభాహక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. నిన్న అనురాగ్ ఠాగూర్ ప్రసంగాన్ని మోదీ ప్రశంసించారు. అంతేకాదు అందరు వినాల్సిన ప్రసంగం అంటూ మోదీ ట్వీట్ చేశారు. దీనిపై కాంగ్రెస్ అభ్యంతరం తెలిపింది.
లోక్‌సభ సమావేశాలపై ప్రధాన సమస్యలపై అధికార, విపక్షాల మధ్యవాగ్వాదం చోటు చేసుకుంది. మరీ ముఖ్యంగా కులగణనపై కాంగ్రెస్‌తో పాటు రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ విరుచుకు పడ్డారు.
ఈ సందర్భంగా సభలో ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. అంతే ధీటుగా రాహుల్ గాంధీ బదులిచ్చారు. వెనుకబడిన వర్గాల కోసం పోరాడే వారికి అవమానాలు తప్పవని అన్నారు. ఇలాంటి అవమానాలు ఎన్ని ఎదురైన తన పోరాటం ఆగదని వ్యాఖ్యానించారు. కులగణన బిల్లును లోక్‌సభలో అమోదింప జేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు
ఈ తరుణంలో లోక్‌సభలో అనురాగ్ ఠాకూర్ చేసిన ప్రసంగంపై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. విపక్షనేత రాహుల్ గాంధీకి కౌంటర్ ఇవ్వడాన్ని ప్రశంసిస్తూ.. ఠాకూర్ ప్రసంగాన్ని తప్పకుండా వినాలని అన్నారు.
‘యువనేత అనురాగ్ ఠాకూర్ చేసిన ప్రసంగాన్ని తప్పకుండా వినాలి. వాస్తవాలు, హాస్యచతురతతో కూడిన ఆయన ప్రసంగం ఇండియా కూటమి దుర్మార్గపు రాజకీయాల్ని బహిర్ఘతం చేసింది’అని ట్విటర్‌లో పోస్ట్ చేశారు మోదీ. అయితే మోదీ ట్వీట్‌పై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మోదీకి వ్యతిరేకంగా సభాహక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రవేశపెట్టాలని తీర్మానించింది.
STORY | Congress MP Charanjit Singh Channi submits notice to move privilege motion against PM for sharing expunged remarks
READ: https://t.co/0o8feagLlN pic.twitter.com/hNtsFKSWN8— Press Trust of India (@PTI_News) July 31, 2024
మోదీపై ప్రివిలేజ్ మోషన్
కాంగ్రెస్ ఎంపీ, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ చన్నీ ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ప్రివిలేజ్ మోషన్‌ను ప్రవేశపెట్టారు. బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ చేసిన కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలను ప్రధాని ట్వీట్ చేయడం,వాటిని ప్రచారం చేయడం సభను ధిక్కరించారని పేర్కొంటూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
Comments
Please login to add a commentAdd a comment