anurag tagore
-
ప్రధానిపై సభాహక్కుల తీర్మానం
న్యూఢిల్లీ: విపక్షనేత రాహుల్ గాందీపై లోక్‌సభలో బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాగూర్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల వివాదం మరో మలుపు తీసుకుంది. అనురాగ్ వ్యాఖ్యల్లో స్పీకర్ తొలగించిన భాగాలను కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ’ఎక్స్‘లో షేర్ చేశారని, ఇది సభాహక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని కాంగ్రెస్ ఎంపీ, పంజాబ్ మాజీ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ బుధవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు నోటీసు ఇచ్చారు. సభా నియమావళి రూల్–222 కింద ప్రధానిపై సభాహక్కుల ఉల్లంఘన తీర్మానానికి నోటీసు ఇస్తున్నట్లు చన్నీ తెలిపారు. మంగళవారం అనురాగ్ ఠూకూర్ లోక్‌సభలో మాట్లాడుతూ.. తమ కులమేమిటో తెలియని వారు కులగణన గురించి మాట్లాడుతున్నారని రాహుల్‌ను ఉద్దేశించి అన్నారు. దీనిపై విపక్ష సభ్యుల అభ్యంతరంతో స్పీకర్ స్థానంలో ఉన్న జగదంబికా పాల్ (కాంగ్రెస్ ఎంపీ) అనురాగ్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు. ‘నిబంధనల ప్రకారం రికార్డుల నుంచి తొలిగించిన వ్యాఖ్యలను ప్రచురించడం సభాహక్కుల ఉల్లంఘనే. సుప్రీంకోర్టు కూడా దీన్నే ధృవకరించింది’ అని చన్నీ తెలిపారు. ‘ అయితే అనురాగ్ తమ కులమేమిటో తెలియని వారు కులగణన గురించి మాట్లాడుతున్నారని అన్నపుడు ఎవరి పేరునూ తీసుకోలేదని, ఈ వ్యాఖ్యను రికార్డుల నుంచి తొలగించలేదని, దీని ఆధారంగా చన్నీ ఇచ్చే నోటీసు పరిగణనకు రాకపోవచ్చని అధికారవర్గాలు తెలిపాయి. ప్రధాని మోదీ మంగళవారం ఎక్స్‌లో అనురాగ్ ఠాకూర్ ప్రసంగాన్ని మొత్తం షేర్ చేస్తూ.. ‘తప్పకుండా వినాల్సినది. వాస్తవాలు, హాస్యం మేలు కలయిక. ఇండియా కూటమి నీచ రాజకీయాలను ఎండగట్టింది’ అని కితాబిచ్చారు. అనురాగ్ వ్యాఖ్యలపై బుధవారం కూడా లోక్‌సభలో తీవ్ర దుమారం రేగింది. -
ట్వీట్ దుమారం..ప్రధాని మోదీపై కాంగ్రెస్ సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం
ఢిల్లీ : ప్రధాని మోదీకి వ్యతిరేకంగా లోక్‌సభలో సభాహక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. నిన్న అనురాగ్ ఠాగూర్ ప్రసంగాన్ని మోదీ ప్రశంసించారు. అంతేకాదు అందరు వినాల్సిన ప్రసంగం అంటూ మోదీ ట్వీట్ చేశారు. దీనిపై కాంగ్రెస్ అభ్యంతరం తెలిపింది.లోక్‌సభ సమావేశాలపై ప్రధాన సమస్యలపై అధికార, విపక్షాల మధ్యవాగ్వాదం చోటు చేసుకుంది. మరీ ముఖ్యంగా కులగణనపై కాంగ్రెస్‌తో పాటు రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ విరుచుకు పడ్డారు.ఈ సందర్భంగా సభలో ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. అంతే ధీటుగా రాహుల్ గాంధీ బదులిచ్చారు. వెనుకబడిన వర్గాల కోసం పోరాడే వారికి అవమానాలు తప్పవని అన్నారు. ఇలాంటి అవమానాలు ఎన్ని ఎదురైన తన పోరాటం ఆగదని వ్యాఖ్యానించారు. కులగణన బిల్లును లోక్‌సభలో అమోదింప జేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు ఈ తరుణంలో లోక్‌సభలో అనురాగ్ ఠాకూర్ చేసిన ప్రసంగంపై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. విపక్షనేత రాహుల్ గాంధీకి కౌంటర్ ఇవ్వడాన్ని ప్రశంసిస్తూ.. ఠాకూర్ ప్రసంగాన్ని తప్పకుండా వినాలని అన్నారు.‘యువనేత అనురాగ్ ఠాకూర్ చేసిన ప్రసంగాన్ని తప్పకుండా వినాలి. వాస్తవాలు, హాస్యచతురతతో కూడిన ఆయన ప్రసంగం ఇండియా కూటమి దుర్మార్గపు రాజకీయాల్ని బహిర్ఘతం చేసింది’అని ట్విటర్లో పోస్ట్ చేశారు మోదీ. అయితే మోదీ ట్వీట్‌పై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మోదీకి వ్యతిరేకంగా సభాహక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రవేశపెట్టాలని తీర్మానించింది. STORY | Congress MP Charanjit Singh Channi submits notice to move privilege motion against PM for sharing expunged remarksREAD: https://t.co/0o8feagLlN pic.twitter.com/hNtsFKSWN8— Press Trust of India (@PTI_News) July 31, 2024మోదీపై ప్రివిలేజ్ మోషన్కాంగ్రెస్ ఎంపీ, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ చన్నీ ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ప్రివిలేజ్ మోషన్‌ను ప్రవేశపెట్టారు. బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ చేసిన కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలను ప్రధాని ట్వీట్ చేయడం,వాటిని ప్రచారం చేయడం సభను ధిక్కరించారని పేర్కొంటూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. -
కేంద్రం కీలక నిర్ణయం..తగ్గనున్న పీఎన్జీ,సీఎన్జీ గ్యాస్ ధరలు!
సహజ వాయివు (నేచురల్ గ్యాస్) ధరల విషయంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేచురల్ గ్యాస్ ధరల్ని నియంత్రించేందుకు కొత్త పద్దతిని అమలు చేసింది. చమురు క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్‌ను ఇంధనం ధరల్ని ఇక నుంచి ముడిచమురు ధరలతో అనుసంధానం చేసినట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. దీంతో పీఎన్జీ, సీఎన్జీ గ్యాస్ ధరలు మరింత తగ్గన్నాయి. సాధారణంగా కేంద్రం యూఎస్, కెనడా, రష్యాతో పాటు మిగిలిన దేశాల్లో గ్యాస్ ట్రేడింగ్ హబ్ల్లోని ధరలకు అనుగుణంగా సహజ వాయివు ధరల్ని ప్రతి 6 నెలలకు ఒకసారి మార్చుతూ వచ్చేది. కానీ ఇంధనం ధరల్ని ముడిచమురు ధరలతో అనుసంధానం చేయడంతో.. ధరల్లో ప్రతినెలా మార్పులు ఉండబోతున్నాయి.. #Cabinet approves revised domestic gas pricing guidelines price of natural gas to be 10% of the monthly average of Indian Crude Basket, to be notified monthly Move to ensure stable pricing in regime and provide adequate protection to producers from adverse market fluctuation pic.twitter.com/NRONPAOzzK — Rajesh Malhotra (@DG_PIB) April 6, 2023 తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ) 10 శాతం చౌకగా మారుతుందని, కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) ధర 6 శాతం నుండి 9 శాతానికి తగ్గుతుందని చమురు కార్యదర్శి పంకజ్ జైన్ తెలిపారు. సహజవాయు ఇంధన ధరలను నిర్ణయించటంలో కేంద్రం కొత్త విధానానికి ఆమోదంపై శనివారం నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. దేశంలో కోటి మంది ఉద్యోగులకు 4 శాతం డేర్‌నెస్ అలవెన్స్ (dearness allowance)లను పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. 38 శాతం నుంచి 42 శాతానికి పెరిగిన ఈ డీఏ జనవరి 1, 2023 నుంచి అమల్లోకి వస్తున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా డీఏ పెంపును కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. దీంతో కేంద్రంపై రూ. 12,815 కోట్ల భారం పడనున్నట్లు చెప్పారు. కరువు భత్యం(డీఏ) పెంపుతో 47.58లక్షల కేంద్రం ప్రభుత్వ ఉద్యోగులకు 69.76లక్షల మందికి పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. 7వ వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా నిర్ణయించిన ఫార్ములా ఆధారంగా ఈ పెంచుతుంది. -
టాలీవుడ్ సినీ ప్రముఖులతో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ భేటీ, చిరు ట్వీట్
కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో మెగాస్టార్ చిరంజీవి, టాలీవుడ్ ప్రముఖులు సమావేశమయ్యారు. మంత్రి హైదరాబాద్ పర్యటనలో భాగంగా టాలీవుడ్ సినీ ప్రముఖులు ఆయనతో భేటీ అయినట్లు తెలుస్తోంది. చిరు ఇంట్లో జరిగిన ఈ సమావేశానికి నాగార్జున అక్కినేని, అగ్ర నిర్మాత అల్లు అరవింద్‌తో పాటు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ విషయాన్ని స్వయంగా చిరు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ సందర్భంగా అనురాగ్ ఠాకూర్‌తో కలిసి దిగిన ఫొటోలను చిరు షేర్ చేశారు. చదవండి: మీకు ఉర్ఫీ ఫివర్ అట్టుకుందా!: శిల్పా శెట్టిపై దారుణమైన ట్రోల్స్ ఈ మేరకు చిత్ర పరిశ్రమ అభివృద్ధి, వ్యక్తిగత, ఇతరత్రా అంశాలపై వారు చర్చించినట్లు సమాచారం. ఈ మేరకు చిరు ట్వీట్ చేస్తూ.. ‘హైదరాబాద్ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మా ఇంటికి వచ్చారు. మాతో గడిపిన ఈ వీలువైన సమయానికి ఆయనకు ధన్యవాదాలు. ఈ సందరర్భంగా నా సోదరుడు నాగార్జునతో కలిసి భారతీయ చలనచిత్ర పరిశ్రమ, వేగవంతమైన పురోగతి గురించి ఆయన చర్చించడం జరిగింది. ఈ ఆహ్లాదకరమైన సమావేశం నాకేంతో నచ్చింది’ అంటూ చిరు రాసుకొచ్చారు. Thank you dear Sri @ianuragthakur for making time to drop by at my place on your visit to Hyderabad yesterday. Loved the delightful discussion we had along with my brother @iamnagarjuna about the Indian Film Industry and the rapid strides it is making! pic.twitter.com/Bm6bjvHT39 — Chiranjeevi Konidela (@KChiruTweets) February 27, 2023 -
పట్టు విడువని రెజ్లర్లు.. చర్యలు చేపట్టిన కేంద్రం.. నిరసన విరమణ
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్‌సింగ్‌ను తొలగించడం సహా డిమాండ్లన్నీ పరిశీలిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో రెజర్లు శుక్రవారం అర్ధరాత్రి తర్వాత తమ ధర్నాను విరమించారు. ‘‘రెజ్లర్ల ఆరోపణలపై ఓవర్‌సైట్ కమిటీని ఏర్పాటు చేస్తాం. ఈ కమిటీ డబ్ల్యూఎఫ్ఐ, దాని చీఫ్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి నాలుగు వారాల్లో నివేదిక ఇస్తుంది. దాని ఆధారంగా చర్యలు ఉంటాయి’’ అని కేంద్ర క్రీడామంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. ఇదిలాఉండగా.. ‘దంగల్’లో దిగితే ప్రత్యర్థుల పట్టుపట్టే రెజ్లర్లు అదే జోరుతో ధర్నాతో హడలెత్తించి.. డిమాండ్లు సాధించుకున్నారు. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)లో ఏళ్ల తరబడి తిష్టవేసుకొని లైంగిక వేధింపులకు పాల్పడుతున్న అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌ను గద్దె దించేదాకా ధర్నా విరమించబోమని స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, సాక్షి మలిక్, రవి దహియా, బజరంగ్ పూనియా, దీపక్ పూనియా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తమ ప్రాణాలకు ముప్పున్నా వెరువమని, అన్నింటికి సిద్ధపడే న్యాయ పోరాటానికి దిగామని చెప్పారు. డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడిని తొలగించడంతో పాటు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని వారంతా పట్టుబట్టడంతో కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. మరోవైపు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ప్రత్యేక కమిటీ వేసి విచారణ జరపాలన్న రెజ్లర్ల డిమాండ్‌కు అనుగుణంగా ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉష వ్యవహరించారు. అత్యవసర భేటీ నిర్వహించి ఏడుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసి న్యాయం చేస్తానని ఉష హామీ ఇచ్చారు. మేరీకోమ్ నేతృత్వంలో కమిటీ... లైంగిక ఆరోపణల వ్యవహారంపై దర్యాప్తు చేయాలన్న స్టార్ రెజ్లర్ల డిమాండ్‌పై భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) స్పందించింది. అథ్లెట్ దిగ్గజం పీటీ ఉష నేతృత్వంలోని ఐఓఏ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (ఈసీ) సభ్యులు శుక్రవారం సాయంత్రం అత్యవసరంగా సమావేశమయ్యారు. ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉషతో పాటు ఈసీ సభ్యులైన మాజీ షూటర్ అభినవ్ బింద్రా, యోగేశ్వర్ దత్, సంయుక్త కార్యదర్శి కల్యాణ్ చౌబే, ప్రత్యేక ఆహ్వానితులుగా శివ కేశవన్ ఈ ఉన్నతస్థాయి భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా రెజ్లర్లు చేస్తున్నవి తీవ్రమైన ఆరోపణలు కావడంతో వీటిపై నిగ్గు తేల్చేందుకు దిగ్గజ మహిళా బాక్సర్ మేరీకోమ్ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఐఓఏ ప్రకటించింది. ఏజీఎం తర్వాతే బ్రిజ్‌భూషణ్ స్పందన గోండా (ఉత్తర ప్రదేశ్): తీవ్రస్థాయిలో లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న డబ్ల్యూ ఎఫ్ఐ చీఫ్ బ్రిజ్‌భూషణ్ త్వరలోనే ఈ వ్యవహారంపై స్పందిస్తారని ఆయన కుమారుడు, బీజేపీ ఎమ్మెల్యే ప్రతీక్ భూషణ్ సింగ్ శుక్రవారం మీడియాతో అన్నారు. ‘ఈ నెల 22న డబ్ల్యూఎఫ్ఐ వార్షిక సర్వసభ్య సమావేశం జరుగుతుంది. ఇది ముగియగానే అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ తనపై వచ్చిన ఆరోపణలపై లిఖితపూర్వక ప్రకటన విడుదల చేస్తారు’ అని అన్నారు. -
‘ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదవటం కాదు’.. అనురాగ్ ఠాగూర్‌పై నిప్పులు చెరిగిన ఏపీ మంత్రి
తాడేపల్లి: విజయవాడలో పర్యటించిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ ఏపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు మంత్రి జోగి రమేష్. సుజనా చౌదరి టీడీపీ ఆఫీసు నుంచి తెచ్చిన స్క్రిప్టుని బీజేపి నేత అనురాగ్ ఠాగూర్ చదివారని.. అసలు అనురాగ్‌కి ఏపీ గురించి, ఇక్కడి ప్రభుత్వం గురించి ఏం తెలుసు? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం గురించి తెలుసుకోవాలని సూచించారు. ఈ మూడేళ్లలో రెండు లక్షల మంది యువతకి రెగ్యులర్ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. 90 వేలమందికి ఔట్ సోర్సింగ్ ద్వారా ఉపాధి కల్పించామన్నారు. ఇవేమీ తెలుసుకోకుండా టీడీపీ ఇచ్చిన స్క్రిప్టు చదివితే సరిపోతుందా? అని ధ్వజమెత్తారు. మతతత్వ రాజకీయాలతో రాష్ట్రంలో ఎదగాలని ఆశ పడుతున్నారని ఆరోపించారు. ‘యువతకు ఉద్యోగాలు లేవన్న అంశంపై చర్చకు వస్తారా? ఢిల్లీ నుంచి రావటం, ఎవరో ఇచ్చిన స్క్రిప్టు చదివి వెళ్లటం కాదు. మీ బీజేపీ పాలిత రాష్ట్రంలో ఎక్కడైనా 2 లక్షల మంది యువతకి ఉద్యోగాలు ఇచ్చారా? దమ్ముంటే చర్చకు వచ్చి సమాధానం చెప్పాలి. కరోనా కష్ట కాలంలో కూడా వాలంటీర్లతో సంక్షేమం అందించాం. రాష్ట్రంలో దోపిడీ చేసింది ఎవరు? రాష్ట్రంలో మీరు పెంచి పోషించిన చంద్రబాబు దోచుకున్నారు. అవినీతి చక్రవర్తి చంద్రబాబు. అసలు మీకు ఈ రాష్ట్రంలో అడుగుపెట్టే అర్హత ఉందా? ప్రత్యేక హోదా ఇస్తామని మోసం చేశారు. పోలవరం పూర్తి చేస్తామని చెప్పి నిలువునా మోసం చేశారు. హామీ ఇచ్చిన యూనివర్సిటీలు, లోటు బడ్జెట్ నిధులు ఎందుకు ఇవ్వలేదు? రాష్ట్రంలో మతతత్వ చిచ్చు పెట్టాలని చూస్తున్నారా? మా రాష్ట్రాన్ని మోసం చేసిన మీకు ఏం చూసి ఓటెయ్యాలి? మీరు ఒక్క ఎమ్మెల్యే సీటు కాదుకదా.. వార్డు సభ్యునిగా కూడా గెలవలేరు.’ అని అనురాగ్ ఠాగూర్‌పై ధ్వజమెత్తారు మంత్రి జోగి రమేష్. పవన్ కళ్యాణ్‌కి కనీసం అన్ని సీట్లలో పోటీ చేస్తానని చెప్పే దమ్ము ఉందా? అని ప్రశ్నించారు మంత్రి జోగి రమేష్. వైఎస్ జగన్ సీఎం అయినందుకు అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని.. అసలు పవన్‌కి కౌలు రైతులు, వ్యవసాయం అంటే ఏంటో తెలుసా? చెప్పాలన్నారు. 2014లో జనసేనని టీడీపీకి తాకట్టు పెట్టారని.. 2024లో కూడా అదే చేస్తారని విమర్శించారు. తన ప్యాకేజీ తీసుకుని పవన్ వెళ్ళిపోతారని.. కులాలను రెచ్చగొట్టే తెగులు చంద్రబాబు, పవన్‌దేనన్నారు. అందుకే గత ఎన్నికలలో వారికి ప్రజలు తగిన బుద్ది చెప్పారని గుర్తు చేశారు. 2024లో 175 సీట్లు వైఎస్ఆర్సీపీ సాధించి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ జగన్‌ని ఎదుర్కొనే దమ్ము వీరెవరికీ లేదని.. ఐదు కోట్ల జనం ఆయన వెంట ఉన్నారని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: ఏం తమాషాగా ఉందా.. పోలీసులకే వార్నింగ్ ఇచ్చిన నారా లోకేష్ బాబు.. -
రజతంతో స్వదేశంలో...
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ తొలి రోజు వెయిట్‌లిఫ్టింగ్‌లో రజతం సాధించి భారత్ గర్వపడేలా చేసిన మీరాబాయి చాను సోమవారం సొంతగడ్డపై అడుగు పెట్టింది. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆమెకు ఘన స్వాగతం లభించింది. ‘భారత్ మాతాకీ జై’ నినాదాలతో ఎయిర్పోర్ట్ అంతా హోరెత్తింది. మీరా రాక సందర్భంగా పెద్ద సంఖ్యలో అభిమానులు, మీడియా తదితరులు అక్కడ చేరడంతో కొద్దిసేపు తోపులాట జరిగింది. భారత ఆర్మీ జవాన్లు, ఇతర సెక్యూరిటీ సిబ్బంది కలిసి ఆమెను సురక్షితంగా బయటకు తీసుకు వెళ్లాల్సి వచ్చింది. అనంతరం మీరాబాయి కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, సహాయ మంత్రి నితీశ్ ప్రమాణిక్, న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డిలను మర్యాదపూర్వకంగా కలిసింది. మరోవైపు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తమ ఉద్యోగి అయిన మీరాబాయికి రూ. 2 కోట్లు నజరానా ప్రకటించారు. 2018 నుంచి నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (స్పోర్ట్స్)గా పని చేస్తున్న మీరాబాయికి పదోన్నతి కల్పిస్తామని హామీ ఇచ్చారు. చైనా లిఫ్టర్ డోపింగ్ వార్తలతో అలజడి... మీరాతో పోటీ పడి స్వర్ణం సాధించిన జిహుయ్ హౌ ‘డోపింగ్’కు పాల్పడినట్లు, నిర్ధారణ అయితే మీరాకు స్వర్ణం లభిస్తుందంటూ సోమవారం ఉదయం నుంచి పలు పత్రికలు, వెబ్సైట్లలో వార్తలు చక్కర్లు కొట్టాయి. పోటీ ముగిసిన రెండు రోజుల తర్వాత జిహుయ్కు డోపింగ్ పరీక్షలు నిర్వహిస్తుండటం అనుమానాలు రేకెత్తిస్తుందంటూ ఒక భారత మీడియా ప్రతినిధి రాసిన వార్త దీనికంతటికీ కారణమైంది. అయితే ఐఓసీ నుంచి గానీ ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నుంచి గానీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. భారత ఒలింపిక్ సంఘం కూడా తమకేమీ తెలీదని స్పష్టం చేసింది. నిజానికి కనీస సమాచారం, ఆధారం లేకుండా కేవలం జిహుయ్ రెండోసారి పరీక్షకు వెళుతోంది కాబట్టి ఏదో జరిగి ఉంటుందనే అంచనాలపై ఆధారపడి ఈ వార్తను ప్రచారంలోకి తెచ్చినట్లు తర్వాత తేలింది. పోటీ ముగియగానే తీసుకున్న ‘శాంపిల్’పై అనుమానం ఉండటం వల్లే స్పష్టత కోసం రెండో ‘శాంపిల్’ తీసుకుంటున్నారని వినిపించినా... దానిపై కూడా అధికారికంగా ఎలాంటి స్పష్టత రాలేదు. రోజూ ఐఓసీ నిర్వహించే సుమారు 5000 డోపింగ్ పరీక్షల్లో ఇది కూడా ఒక రొటీన్ పరీక్ష కూడా కావచ్చు! -
నీతి ఆయోగ్ సూచనతోనే ఆ నిర్ణయం: కేంద్ర మంత్రి
సాక్షి, హైదరాబాద్: నీతి ఆయోగ్ సూచనతోనే దేశవ్యాప్తంగా కంపెనీల నుంచి పెట్టుబడులు ఉపసంహరణ చేస్తున్నామని కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. శనివారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, కంపెనీల పనితీరుపై ఎప్పటికప్పుడు కేంద్రం అంచనా వేస్తోందని పేర్కొన్నారు. ఏ కంపెనీ ప్రజలకు ఉపయోగపడుతుందో పరిశీలిస్తుందని.. అన్ని కంపెనీలను ప్రైవేటుపరం చేస్తామన్నది కరెక్ట్ కాదని ఆయన చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ఎవరికీ నష్టం లేదన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటేజేషన్ ద్వారా ఉద్యోగులకు, కంపెనీ అభివృద్ధికి ఎంతగానో ఉపయోగం ఉందన్నారు. (చదవండి: ఘోర అన్యాయం: కేంద్రానికి ఘాటు లేఖ) మెట్రో, వాటర్, విద్యా రంగానికి చాలా కేటాయింపులు చేశామని.. తాముచ్చిన హామీ మేరకు పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇచ్చామని పేర్కొన్నారు. నిధుల కోసం గత ఐదు నెలలుగా ఆ రాష్ట్ర మంత్రులతో మాట్లాడానని తెలిపారు. పోలవరం కోసం ఏపీ ఆర్థిక మంత్రితో మాట్లాడి, అగ్రిమెంట్ మేరకు నిధులు కూడా కేటాయించామని చెప్పారు. కేంద్ర నిర్ణయంతో ఏపీ, తెలంగాణకు అనేక ప్రాజెక్టులు కేటాయించామని తెలిపారు.(చదవండి: టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రాజీనామా) ‘‘తెలంగాణలో 9172.90 వేలకోట్లకు పైగా నిధులు కేటాయించాం. ఆ రాష్ట్రానికి 400 కోట్లు ప్రతిఏటా ఆత్మనిర్భర భారత్ కింద వస్తాయి. ప్రపంచం మొత్తం కరోనాను ఎదుర్కొంది. భారత్ కరోనాను సమర్థంగా ఎదుర్కొంది. ఆపదలోనే అవకాశాలను వెతుక్కోవాలని ప్రధాని మోదీ అన్నారు. రెండు వ్యాక్సిన్లను తయారు చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. అనేక రంగాలకు ప్రధాని చేయూతనిచ్చారు. పేదలకు ఆహార భద్రత కల్పించాం. ఎంఎస్ఎంఈలకు ఆర్థిక సాయం అందించాం. ఆర్థికంగా దేశం వేగంగా అభివృద్ధి చెందుతూ వస్తోంది. ఇబ్బందుల్లో ఉన్నా బడ్జెట్లో ఆరోగ్యం కోసం అదనపు కేటాయింపులు చేశాం. రైతులకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచేందుకు అగ్రిసెస్ వసూలు చేస్తున్నామని’ అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. -
ఇది రాజీవ్ ఫిరోజ్ ఖాన్ సర్కార్ కాదు
న్యూఢిల్లీ: ఢిల్లీలోని షహీన్‌బాగ్‌లో కొనసాగుతున్న పౌరసత్వ సవరణ చట్ట(సీఏఏ) వ్యతిరేక నిరసనలపై, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఎంపీలు అనురాగ్ ఠాకూర్, పర్వేశ్ వర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సోమవారం నాటి లోక్‌సభ సమావేశాలు దద్ధరిల్లాయి. ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభం కాగానే కాంగ్రెస్, డీఎంకే సభ్యులు సీఏఏ, ఎన్పీఆర్, ఎన్నారీల వ్యతిరేక నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకెళ్లారు. బుల్లెట్లతో ప్రజల గొంతుకను అణచేయలేరని కాంగ్రెస్ సభ్యుడు ఆధిర్ రంజన్ చౌధరి వ్యాఖ్యానించారు. ‘మీరు నకిలీ హిందువులు’ అని అధికార పక్షాన్ని ఉద్దేశించి పేర్కొన్నారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో సీఏఏ వ్యతిరేక నిరసనకారులను ఉద్దేశించి ‘ద్రోహులను కాల్చి చంపండి’ అని మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై విపక్ష సభ్యులు మండిపడ్డారు. ‘మీ తూటాలెక్కడ?’ అని ప్రశ్నించారు. సప్లిమెంటరీ ప్రశ్నలకు జవాబిచ్చేందుకు ఠాకూర్ ప్రయత్నించిన ప్రతీసారి నినాదాలతో హోరెత్తించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చను ప్రారంభించేందుకు బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ లేచినపుడు.. ‘సిగ్గు పడు’ అని విపక్ష సభ్యులు గట్టిగా నినాదాలు చేశారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా.. ‘సీఏఏ నిరసనకారులు మీ ఇళ్లల్లోకి వచ్చి, మీ మహిళలపై అత్యాచారం చేస్తారు’ అని వర్మ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ జిందాబాద్ అంటున్నారు వర్మ ప్రసంగం ప్రారంభించగానే.. నిరసనగా కాంగ్రెస్, డీఎంకే సహా విపక్ష పార్టీల సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం వర్మ మాట్లాడుతూ.. సీఏఏను వెనక్కు తీసుకునే ప్రసక్తే లేదని, అది దేశ సమగ్రతకు సంబంధించిన విషయమని తేల్చిచెప్పారు. ‘ఇది రాజీవ్ ఫిరోజ్ ఖాన్ ప్రభుత్వం కాదు.. ఇది మోదీ ప్రభుత్వం’ అని ఇందిరా గాంధీ కుటుంబం ముస్లింలేనని పరోక్షంగా వ్యాఖ్యానించారు. ‘షహీన్‌బాగ్ నిరసనలు సీఏఏను వ్యతిరేకిస్తూ చేస్తున్నవి కావు. అక్కడి నిరసనకారులు పాకిస్తాన్ జిందాబాద్ అని, కశ్మీర్‌ను, అస్సాంను భారత్ నుంచి విడగొట్టాలి అని అంటున్నారు’ అని వర్మ పేర్కొన్నారు. మానవత్వ సందేశం ఇచ్చిన రాముడికి కాంగ్రెస్ మతం రంగు పులిమిందని విమర్శించారు. ‘ఇప్పటికైనా ప్రతిపక్ష సభ్యులు జై శ్రీరాం అని నినదిస్తే వారి పాపాలు తొలగిపోతాయి’ అన్నారు. రాజ్యాంగం తొలి ప్రతుల నుంచి శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, హనుమంతుడి చిత్రాలను కాంగ్రెస్ తొలగించిందని ఆయన ఆరోపించారు. ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా ఆర్టికల్ 370 లాంటి సమస్యలను కాంగ్రెస్ పెంచి పోషించిందన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే అనధికార కాలనీల ప్రజలకు పక్కా ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. వర్మ ప్రసంగంపై టీఎంసీ స్పందిస్తూ.. అది ఢిల్లీ ఎన్నికల ప్రచార ప్రసంగంలా ఉందని ఎద్దేవా చేసింది. ప్రశ్నోత్తరాల సమయంలో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. జామియా మిలియా యూనివర్సిటీలో సీఏఏ నిరసనకారులను దారుణంగా కొట్టారని గుర్తు చేశారు. ఒక విద్యార్థిని తన కన్ను కూడా కోల్పోయిందన్నారు. ‘అమ్మాయిలను దారుణంగా కొట్టారు. పిల్లలపై తూటాలు ప్రయోగించారు. ఈ ప్రభుత్వానికి సిగ్గు లేదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యసభలోనూ... పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్)లపై చర్చించాలని డిమాండ్ చేస్తూ విపక్ష సభ్యులు సోమవారం రాజ్యసభ కార్యకలాపాలను అడ్డుకున్నారు. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విపక్ష సభ్యుల ఆందోళనలతో సభ పలుమార్లు వాయిదా పడింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టకుండా బీజేపీ సభ్యుడు భూపేందర్ యాదవ్‌ను అడ్డుకున్నారు. సీఏఏ వ్యతిరేక నిరసనలపై కాల్పులు జరిపిన ఘటనలను కాంగ్రెస్, సీపీఎం, టీఎంసీ తదితర విపక్ష పార్టీల సభ్యులు తీవ్రంగా ఖండించారు. సభ్యులను శాంతపర్చేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో డెప్యూటీ చైర్మన్ హరివంశ్ సభను మంగళవారానికి వాయిదా వేశారు. -
జీఎస్టీకి నేటితో రెండేళ్లు
న్యూఢిల్లీ: దేశంలో వస్తు సేవల పన్ను(జీఎస్టీ) విధానం అమలుకు రెండేళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఉత్సవాలు జరపనుంది. దీంతోపాటు రిటర్నుల దాఖలుకు కొత్త పద్ధతిని, సింగిల్ రీఫండ్ వ్యవస్థ వంటి అదనపు సంస్కరణలు చేపట్టనుంది. జీఎస్టీ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ నేతృత్వంలో నేడు జరిగే కార్యక్రమంలో వివిధ శాఖలఉన్నతాధికారులు పాల్గొననున్నారని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. చిన్న పన్ను చెల్లింపుదారుల కోసం సహజ్ సులభ్ రిటర్ను దాఖలు విధానం అమలు కానుంది. జూలై ఒకటో తేదీ నుంచి ప్రయోగాత్మకంగా చేపట్టనున్న ఈ విధానం అక్టోబర్ ఒకటి నుంచి పూర్తి స్థాయిలో అమలు కానుందని పేర్కొంది. వస్తు సరఫరాదారులకు ప్రవేశ పరిమితిని రూ.40 లక్షల వరకు ఇచ్చే వెసులుబాటును రాష్ట్రాలకు కల్పిస్తున్నట్లు తెలిపింది. వార్షిక టర్నోవర్ రూ.50 లక్షలున్న స్మాల్ సర్వీస్ ప్రొవైడర్లకు 6 శాతం పన్ను రేటుతో కాంపొజిషన్ స్కీం ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొంది. 2017 జూలై ఒకటో తేదీ నుంచి అమలవుతున్న జీఎస్టీ విధానంలో కేంద్రం గత రెండేళ్లలో పలు మార్పులు చేర్పులు చేపట్టింది. -
బీజేపీ, కాంగ్రెస్ గరమ్ గరమ్ పోటీ
హిమాచల్‌ప్రదేశ్‌లోని నాలుగు లోక్‌సభ స్థానాలకు చివరి దశలో ఈ నెల 19న పోలింగ్ జరుగుతుంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని నాలుగు సీట్లను బీజేపీ గెలుచుకుంది. 1989 నుంచీ జరిగిన పార్లమెంటు ఎన్నికల ఫలితాలు పరిశీలిస్తే ఒక్క 1991లోనే కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు చెరో రెండు సీట్లు కైవసం చేసుకున్నాయి. కిందటి పార్లమెంటు ఎన్నికల సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా, ఇప్పుడు కాషాయ ప్రభుత్వ పాలన సాగుతోంది. కిందటి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 53.8 శాతం ఓట్లతో నాలుగు సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ 41 శాతం ఓట్లు సాధించినా ఒక్క సీటూ దక్కించుకోలేకపోయింది. రాజధాని సిమ్లాతోపాటు మండీ, కాంగ్ఢా, హమీర్పూర్ లోక్‌సభ స్థానాలకు బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. 2018 నవంబర్‌లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మొత్తం 68 సీట్లలో 44 స్థానాలు కైవసం చేసుకుని అధికారంలోకి వచ్చింది. సిమ్లా బరిలో బీజేపీ కొత్త అభ్యర్థి షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్‌చేసిన సిమ్లా స్థానంలో బీజేపీ సిట్టింగ్ సభ్యుడు వీరేందర్ కశ్యప్‌కు బదులు సురేష్ కశ్యప్‌కు టికెట్ ఇచ్చారు. కాంగ్రెస్ తరఫున ధనీరామ్ శాండిల్ బరిలోకి దిగారు. కిందటి ఎన్నికల్లో వీరేందర్(బీజేపీ) తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి మోహన్‌లాల్ బ్రాక్తాను 84 వేలలకు పైగా ఓట్ల ఆధిక్యంతో ఓడించారు. ప్రస్తుత అభ్యర్థులు సురేష్ కశ్యప్, ధనీరామ్ శాండిల్ కోలీ(ఎస్సీ) కులానికి చెందినవారే. ఇద్దరికీ సైన్యంలో పనిచేసిన అనుభవం ఉంది. నియోజకవర్గ పరిధిలోని సిర్మోర్ ప్రాంతంలోని హాటీ సామాజికవర్గానికి ఆదివాసీ(ఎస్టీ) హోదా కల్పించడం ఈ ఎన్నికల్లో ముఖ్యాంశంగా మారింది. ఈ వర్గం ప్రజల్లో ఉన్న అసంతృప్తి కారణంగా సిట్టింగ్ సభ్యుడు వీరేందర్‌కు బీజేపీ టికెట్ ఇవ్వలేదు. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత వాయుసేన మెరుపు దాడులను ఎన్నికల్లో గెలుపునకు బీజేపీ వాడుకుంటోందని గతంలో సిమ్లాకు రెండుసార్లు ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ అభ్యర్థి శాండిల్ ప్రచారం చేస్తున్నారు. పాక్‌పై వైమానిక దాడులపై కాంగ్రెస్ అనుమానాలు వ్యక్తం చేస్తోందంటూ బీజేపీ అభ్యర్థి విమర్శిస్తున్నారు. హమీర్‌పూర్‌లో నాలుగోసారి అనురాగ్ కాంగ్రెస్, బీజేపీ మధ్య గట్టి పోటీ జరుగుతున్న మరో నియోజకవర్గం హమీర్పూర్. ఎప్పుడూ ఠాకూర్లే గెలిచే ఈ స్థానం నుంచి బీజేపీ సిట్టింగ్ ఎంపీ అనురాగ్ ఠాకూర్ ఇప్పటికి వరుసగా మూడుసార్లు ఎన్నికయ్యారు. మాజీ సీఎం ప్రేమ్‌కుమార్ ధూమల్ కుమారుడైన అనురాగ్ ఇంతకు ముందు క్రికెట్ కంట్రోల్ బోర్డు అధ్యక్షునిగా పనిచేశారు. ఆయన బీజేపీ టికెట్‌పై నాలుగోసారి పోటీకి దిగారు. కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి రామ్‌లాల్ ఠాకూర్ పోటీచేస్తున్నారు. ఆయనకు గతంలో రాష్ట్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. రాష్ట్ర కబడ్డీ జట్టులో సభ్యునిగా ఆయన ఆరుసార్లు జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నారు. 1998 నుంచీ బీజేపీ అభ్యర్థులే గెలుస్తున్న ఈ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలనే పట్టుదలతో కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. అనురాగ్ తండ్రి ధూమల్ కూడా గతంలో ఇక్కడి నుంచి మూడుసార్లు గెలిచారు. 44 ఏళ్ల అనురాగ్ 2014లో తన సమీప అభ్యర్థి రాజేంద్ర రాణాను 98 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఓడించారు. నాలుగోసారి విజయానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. అనురాగ్‌కు ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రామ్‌లాల్ గట్టి పోటీ ఇస్తున్నారు. కాంగ్ఢాలో మంత్రితో కాంగ్రెస్ ఎమ్మెల్యే పోటీ రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన బీజేపీ సీనియర్ నేత శాంతాకుమార్ 2014లో నాలుగోసారి గెలిచిన కీలక నియోజవర్గం కాంగ్ఢా. కిందటిసారి ఆయన తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి చందర్కుమార్ను లక్షా 70 వేలకు పైగా ఓట్లతో ఓడించారు. బీజేపీ ఈసారి 84 ఏళ్ల శాంతాకుమార్కు బదులు రాష్ట్ర మంత్రి కిషన్ కపూర్‌ను పోటీకి దింపింది. కాంగ్రెస్ తరఫున పార్టీ ఎమ్మెల్యే పవన్ కాజల్ పోటీలో ఉన్నారు. బీసీ వర్గానికి చెందిన కాజల్ ఈ ప్రాంతంలో గణనీయ సంఖ్యలో ఉన్న గద్దీ కుటుంబంలో జన్మించారు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ స్థానానికి ఆనుకుని ఉన్న కాంగ్ఢాలో పంజాబీలు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి కపూర్ కూడా పంజాబీయే. బీజేపీ తరఫున బాలీవుడ్ నటుడు, గురుదాస్‌పూర్ బీజేపీ అభ్యర్థి సన్నీ దేవల్, కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ, పంజాబ్ మంత్రి నవజోత్‌సింగ్ సిద్ధూ పాల్గొంటున్నారు. -
'విశాఖలో త్వరలో టెస్టు మ్యాచ్‌లు'
విజయవాడ : దేశంలోని ఏళ్ల నాటి క్రికెట్ మైదానాలను కూడా హరిత మైదానాలుగా మారుస్తామని బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఇందుకోసం బీసీసీఐ రూ.100 కోట్ల నిధులు ఖర్చుచేస్తుందన్నారు. ఏసీఏ, కేడీసీఏ సంయుక్త ఆధ్వర్యంలో ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని మూలపాడులో ట్విన్ క్రికెట్ గ్రౌండ్స్‌ను, మంగళగిరిలోని ఇండోర్ క్రికెట్ అకాడమీని సోమవారం ఆయన ప్రారంభించారు. అన్ని స్టేడియాలను హరిత మైదానాలుగా తయారు చేయడంతో పాటు వర్షపునీటి యాజమాన్య పద్ధతులు పాటిస్తామన్నారు. వాడిన నీటిని శుద్ధి చేసి రీ-సైక్లింగ్ ద్వారా వాడడం, విద్యుత్ ఆదా కోసం సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేయడం, ఎల్ఈడీ బల్బులు వాడడం వంటి కార్యక్రమాలు చేపడతామన్నారు. ఒక్క క్రికెట్లోనే కాకుండా అన్ని ఆటలకు సంబంధించిన అసోసియేషన్లు, ఫెడరేషన్లకు ప్రపంచంలోనే బీసీసీఐ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. దేశంలో తొలి ఉమెన్ క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేసిన ఘనత కూడా ఏసీఏదేని ప్రశంసించారు. విశాఖట్నం స్టేడియంలో త్వరలోనే టెస్ట్ మ్యాచ్‌లు జరుగుతాయన్నారు. మ్యాచ్‌ల నిర్వహించే వేదికలు ఖరారు చేసేందుకు వేసిన కమిటీకి ఏసీఏ ప్రధాన కార్యదర్శి గంగరాజు చైర్మన్ కావడంతో... ఆయన ఎప్పుడు కేటాయిస్తే అప్పుడు విశాఖపట్నంలో టెస్ట్ మ్యాచ్‌లు జరుగుతాయని చమత్కరించారు. మంగళగిరి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, మూలపాడు ట్విన్ గ్రౌండ్స్ కొత్త రాజధానికి తలమానికం కానున్నాయని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వంపై భారం లేకుండా రాజధాని ఏర్పాటుకు ముందే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. పూనే, నాగపూర్, ముంబాయి వంటి చోట్ల ఐపీఎల్ మ్యాచ్‌లు రద్దయితే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వెంటనే ముందుకొచ్చి విశాఖపట్నంలో ఆరు మ్యాచ్‌లు నిర్వహించిందని కొనియాడారు. ఈ సందర్భంగా బీసీసీఐ అధ్యక్ష,కార్యదర్శులు అనురాగ్ఠాకూర్, షిర్కే కొద్ది సేపు బ్యాటింగ్ చేసి భారీ షాట్లతో అలరించారు. అనంతరం ఎంపీలు అనురాగ్ ఠాకూర్, గోకరాజు గంగరాజు, కేశినేని నాని, గల్లా జయదేవ్ నలుగురూ సెల్ఫీలతో సందడి చేశారు. చిన్నారులతో అనురాగ్ ఠాకూర్ సెల్ఫీని తానే స్వయంగా తీసి ఇచ్చి ఉత్సాహపరిచారు.