కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. దేశంలో కోటి మంది ఉద్యోగులకు 4 శాతం డేర్‌నెస్ అలవెన్స్ (dearness allowance)లను పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. 38 శాతం నుంచి 42 శాతానికి పెరిగిన ఈ డీఏ జనవరి 1, 2023 నుంచి అమల్లోకి వస్తున్నట్లు తెలిపింది.
ఈ సందర్భంగా డీఏ పెంపును కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. దీంతో కేంద్రంపై రూ. 12,815 కోట్ల భారం పడనున్నట్లు చెప్పారు.
కరువు భత్యం(డీఏ) పెంపుతో 47.58లక్షల కేంద్రం ప్రభుత్వ ఉద్యోగులకు 69.76లక్షల మందికి పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. 7వ వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా నిర్ణయించిన ఫార్ములా ఆధారంగా ఈ పెంచుతుంది.
Comments
Please login to add a commentAdd a comment