ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల ప్రారంభంలో కేంద్రం, 7వ వేతన సంఘం ప్రకారం జీతం తీసుకునే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4% డీఏ పెంపును ప్రకటించిన సంగతి తెలిసిందే. దీపావళికి కొద్ది రోజులే ముందు, తాజాగా ఉద్యోగుల డీఏను 15 శాతం పెంచింది. ఈ పెంపు 5వ, 6వ పే కమీషన్ కింద జీతాలు తీసుకుంటున్నట్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర సంస్థ ఉద్యోగులకు వర్తించనున్నట్లు తెలిపింది.
5వ వేతన సంఘం ప్రకారం.. వేతనాలను విత్ డ్రా చేసుకునే ఉద్యోగుల డీఏ రేటును 15% మేర 381% నుంచి 396%కి పెంచారు. ఇది జూలై 1, 2022 నుంచి అమలులోకి వస్తుంది. అదేవిధంగా, 6వ వేతన సంఘం ప్రకారం.. తమ వేతనాలను తీసుకుంటున్న ఉద్యోగుల డీఏ రేటును 9% పెంచి బేసిక్ పేలో 203% నుంచి 212%కి పెంచారు. ఇది జూలై 1, 2022 నుండి అమలులోకి వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment