DA hike
-
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డియర్నెస్ అలవెన్స్ (డీఏ) పెంపు కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అక్టోబర్‌లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నా దీనికి సంబంధించిన సమాచారమేదీ ఇంకా బయటకు రాలేదు. గతేడాది అక్టోబర్ మొదటి వారంలో డీఏ పెంపును ప్రకటించారు.నివేదికల ప్రకారం.. దీపావళికి ముందు ప్రభుత్వం 3-4 శాతం డీఏ పెంపును ప్రకటించే అవకాశం ఉంది. దీని ప్రకారం రూ. 18,000 బేసిక్ జీతం ఉన్న ఉద్యోగికి నెలకు రూ. 540-720 జీతం పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ ఉన్నట్లే పెన్షనర్లకు డియర్నెస్ రిలీఫ్ (డీఆర్) అందజేస్తారు. రెండూ సంవత్సరానికి రెండుసార్లు జనవరి, జూలై నెలల్లో సవరిస్తారు. ప్రస్తుతం కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు 50 శాతం డీఏ పొందుతున్నారు.ఇదీ చదవండి: ‘సుకన్య సమృద్ధి’పై వడ్డీ పెరిగిందా?ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వం ఇప్పటికే డీఏ, డీఆర్‌లను 4 శాతం పెంచింది. వాటిని బేసిక్ పేలో 50 శాతానికి తీసుకువచ్చింది. డీఏలో పెరుగుదల శాతం ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (ఏఐసీపీఐ)పై ఆధారపడి ఉంటుంది. -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్
కేంద్ర ప్రభుత్వం డీఏ (Dearness Allowance)ను 4 శాతం పెంచే నిర్ణయానికి ఈ రోజు (గురువారం) ఆమోదం తెలిపినట్లు. ఈ పెంపు తరువాత డియర్నెస్ అలవెన్స్ & డియర్నెస్ రిలీఫ్ (డిఆర్) 50 శాతానికి చేరుతుంది. ఈ పెంపు వల్ల కేంద్రం రూ.12,868.72 కోట్ల రూపాయల అదనపు భారాన్ని భరించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దాదాపు 49.18 లక్షల మంది ఉద్యోగులు, 67.95 లక్షల మంది పెన్షనర్లు ప్రయోజనం పొందనున్నారు. వచ్చే నెల నుంచే జీతాలు, పెన్షన్ వంటివి భారీగా పెరుగుతాయి. డియర్నెస్ అలవెన్స్ పెంపుతో పాటు, రవాణా అలవెన్స్, క్యాంటీన్ అలవెన్స్, డిప్యుటేషన్ అలవెన్స్‌లలో కూడా 25 శాతం పెరుగుదల ఉంటుందని సమాచారం. #WATCH | Union Cabinet approves hike in Dearness Allowance to govt employees and Dearness Relief to pensioners by 4% from January 1, 2024, announces Union Minister Piyush Goyal. pic.twitter.com/IsWUnwBGHW — ANI (@ANI) March 7, 2024 -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపు..
ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పింది. దీపావళి బోనస్‌తో పాటు డియర్నెస్ అలవెన్స్ (dearness allowance (DA)) 4 శాతం పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో డీఏ అలవెన్స్ 42 శాతం నుంచి 46 శాతానికి పెరిగింది. ఈ ఏడాది మార్చి నెలలో కేంద్ర కేబినెట్ ఉద్యోగుల డీఏ అలెవన్స్ను 4 శాతానికి పెంచింది. కేంద్ర నిర్ణయంతో 47.58 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 69.76 లక్షల మంది పెన్షన్లకు లబ్ది చేకూరుతుందని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. తద్వారా ఏడాదికి ప్రభుత్వ ఖజానాపై ఏకంగా రూ.12,815.60 కోట్ల అదనపు భారం పడనుందని అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. కాగా, ఈ పెంపు జనవరి 01, 2023 నుండి అమలులోకి రానుంది. డియర్నెస్ అలవెన్స్ అంటే..? ఏటా రెండుసార్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను కేంద్రం సవరిస్తూ ఉంటుంది. పెరుగుతున్న ధరలకు పరిహారంగా ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ అందజేస్తారు. డీఏను మన దేశంలో మొదటిసారిగా 1972లో ముంబై నుంచి ప్రవేశపెట్టారు. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ డియర్నెస్ అలవెన్స్ ఇవ్వడం ప్రారంభించారు. 👉 : Follow the Sakshi TV channel on WhatsApp: -
ఉద్యోగులకు గుడ్‌న్యూస్..అంచనాలకు మించి భారీగా జీతాల పెంపు!
DA Hike: లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 2023 ఏడాదికి గాను రెండో రౌండ్ డియర్నెస్ అలవెన్స్ (DA) పెంపు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో తాజా నివేదికలు ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందిస్తున్నాయి. రానున్న పండుగ సీజన్లో డీఏ పెంపుపై కేంద్ర సర్కార్ ప్రకటన చేయనుంది. ముఖ్యంగా ఊహించిన దానికి మించి డీఏ పెంపు ఉంటుందని భావిస్తున్నారు. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో ఉద్యోగులకు కేంద్రం ప్రభుత్వం తీపి కబురందించనుంది. త్వరలోనే డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు. 2023 సంవత్సరంలో రెండో రౌండ్ డీఏ పెంపునిపై కీలక ప్రకటన చేసేందుకు కేంద్రం సిద్ధమవుతోందని నివేదికలు చెబుతున్నాయి. అక్టోబరు-నవంబరు మధ్యలో నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. గతంలో ఈ పెంపును 3శాతంగా అంచనా వేసినప్పటికీ, తాజా పరిణామాల నేపథ్యంలో దాని కంటే ఎక్కువే ఉండ వచ్చని తెలుస్తోంది. పెంపుతో దాదాపు 48 లక్షల మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68 లక్షల మందికి పైగా పెన్షనర్లు ప్రయోజనం పొందుతారు. అయితే దీనిపై ప్రభుత్వ అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. (లెజెండరీ క్రికెటర్ల కళ్లు చెదిరే ఇంద్రభవనాలు: అత్యాధునిక ఫీచర్లు) కన్సూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ (CPI-IW) ఆధారంగా చేసిన లేటెస్ట్ కాలిక్యులేషన్స్ 4 శాతం డీఏ పెంపును సూచిస్తున్నాయి. ఇదే నిజమైతే డీఏ పెంపు 46శాతంగా ఉండనుంది. ముఖ్యంగా గత నెలలో ఆల్ ఇండియా రైల్వేమెన్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ శివ గోపాల్ మిశ్రా తాము నాలుగు శాతం డీఏ పెంపు డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు తాజా నివేదికలకు ఊతమిస్తున్నాయి. కాగా దేశంలో ద్రవ్యోల్బణం ఆధారంగా ప్రభుత్వం డీఏ పెంపుపై నిర్ణయం తీసుకుంటుందనేది విదితమే. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2023 ఏడాదిలో రెండో DA పెంపు, ఎప్పుడు ప్రకటించినా, 7వ వేతన సంఘం నిబంధనల ప్రకారం జూలై 1, 2023 నుండి అమలులోకి వస్తుంది. (నడిరోడ్డుపై ఖరీదైన డైమండ్లు, ఎగబడిన జనం: అదిరిపోయే ట్విస్ట్) ఇదీ చదవండి: మస్క్ మామూలోడు కాదయ్యా..వీడియో వైరల్! ఇక ఆ రోబో కూడా? -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. దేశంలో కోటి మంది ఉద్యోగులకు 4 శాతం డేర్‌నెస్ అలవెన్స్ (dearness allowance)లను పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. 38 శాతం నుంచి 42 శాతానికి పెరిగిన ఈ డీఏ జనవరి 1, 2023 నుంచి అమల్లోకి వస్తున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా డీఏ పెంపును కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. దీంతో కేంద్రంపై రూ. 12,815 కోట్ల భారం పడనున్నట్లు చెప్పారు. కరువు భత్యం(డీఏ) పెంపుతో 47.58లక్షల కేంద్రం ప్రభుత్వ ఉద్యోగులకు 69.76లక్షల మందికి పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. 7వ వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా నిర్ణయించిన ఫార్ములా ఆధారంగా ఈ పెంచుతుంది. -
ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం!
ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల ప్రారంభంలో కేంద్రం, 7వ వేతన సంఘం ప్రకారం జీతం తీసుకునే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4% డీఏ పెంపును ప్రకటించిన సంగతి తెలిసిందే. దీపావళికి కొద్ది రోజులే ముందు, తాజాగా ఉద్యోగుల డీఏను 15 శాతం పెంచింది. ఈ పెంపు 5వ, 6వ పే కమీషన్ కింద జీతాలు తీసుకుంటున్నట్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర సంస్థ ఉద్యోగులకు వర్తించనున్నట్లు తెలిపింది. 5వ వేతన సంఘం ప్రకారం.. వేతనాలను విత్ డ్రా చేసుకునే ఉద్యోగుల డీఏ రేటును 15% మేర 381% నుంచి 396%కి పెంచారు. ఇది జూలై 1, 2022 నుంచి అమలులోకి వస్తుంది. అదేవిధంగా, 6వ వేతన సంఘం ప్రకారం.. తమ వేతనాలను తీసుకుంటున్న ఉద్యోగుల డీఏ రేటును 9% పెంచి బేసిక్ పేలో 203% నుంచి 212%కి పెంచారు. ఇది జూలై 1, 2022 నుండి అమలులోకి వస్తుంది. చదవండి: ఇది ఊహించలేదు.. యూజర్లకు భారీ షాకిచ్చిన జియో! -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త?!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పనుంది. హోలీ పండుగ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ (డీఏ) పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై మార్చి 16న కేంద్రం కేబినెట్ సమావేశం నిర్వహించనుందని, ఈ భేటీ అనంతరం డీఏపై స్పష్టమైన ప్రకటన వెలువడనుందని కొన్ని నివేదికలు వెలుగులోకి వచ్చాయి. డీఏ ఎంత పెరుగుతుందనే అంశంపై కేంద్రం స్పష్టత ఇవ్వనప్పటికీ ప్రస్తుతం ఉన్న 31శాతం డీఏను 34శాతానికి పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఒక వేళ కేంద్ర ప్రభుత్వం డీఏ పెంపుపై అధికారిక ప్రకటన చేస్తే.. 50 లక్షల మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షలకుపైగా పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. డీఏ పెంపుతో శాలరీ ఎంత పెరుగుతుంది? ఈ సారి ప్రకటనలో 3 శాతం డీఏ పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే ఉద్యోగుల సగటు వేతనం కనీసం రూ.6,480 నుంచి.. అత్యధికంగా రూ.20 వేల వరకు పెరగొచ్చని తెలుస్తోంది. ఒక ఉద్యోగి బేసిస్ శాలరీ రూ.18,000 ఉంటే..కొత్త డీఏ (34 శాతం) వాటా రూ.6,120గా ఉంటుంది. ప్రస్తుతం 31 శాతం డీఏ (రూ.5,580) వస్తోంది. చదవండి: గ్యాప్ తీసుకోలేదు..వచ్చింది అంతే! ఎలన్ మస్క్ యుద్ధం వచ్చినా ఆగేలా లేడే! -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 3 శాతం పెంచుతూ కేంద్ర కేబినెట్ కీలకం నిర్ణయం తీసుకుంది. దీంతో మొత్తం డీఏ 31 శాతానికి చేరుకుంది. కరోనా కారణంగా జనవరి 2020 నుంచి జూన్ 2021 వరకు డీఏ పెంపుదల అంశం వాయిదా పడింది. ఈ ఏడాది జూలై నెలలో కేంద్ర ప్రభుత్వ సంస్ధలో పని చేస్తున్న ఉద్యోగులకు ,పెన్షనర్లకు చెల్లించే డియర్నెస్ అలవెన్స్ (డీఏ), డియర్నెస్ రిలీఫ్ (డీఆర్) లను 17శాతం నుంచి 28 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక కొత్తగా పెరిగిన డీఏ, డీఆర్ జూలై 1 నుంచి అమలులోకి రానున్నట్లు కేంద్రం తెలిపింది. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో 47.14 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68.62లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. చదవండి: Jio Exclusive Offer: స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై జియో బంపర్ ఆఫర్...! -
Andhra Pradesh : ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కరువు భత్యాన్ని(డీఏ) 3.144 శాతం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉద్యోగుల డీఏ వారి బేసిక్ జీతంలో 30.392 శాతం నుంచి 33.536 శాతానికి చేరుకుంది. ఈ పెరిగిన డీఏ 2019 జనవరి నుంచి అమల్లోకి వస్తుందని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పెరిగిన డీఏతోనే జూలై నెల జీతాలు, పెన్షన్లు ఇవ్వనున్నారు. 2019 జనవరి నుంచి 2021 జూన్ వరకు ఉన్న డీఏ బకాయిలను పెన్షనర్లకు, సీపీఎస్ ఉద్యోగులకు మూడు విడతల్లో అందజేయనున్నారు. అలాగే జనరల్ ప్రావిడెంట్ ఫండ్(జీపీఎఫ్) ఉన్న ఉద్యోగులకు బకాయిలను మూడు విడతలుగా.. వారి పీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తారు. రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాద్ నుంచి తరలివచ్చిన ఉద్యోగులకు ఇస్తున్న 30 శాతం ఇంటి అద్దె అలవెన్స్(హెచ్ఆర్ఏ)ను మరో ఏడాది కొనసాగిస్తూ ఆర్థిక శాఖ మరో ఉత్తర్వు విడుదల చేసింది. హైదరాబాద్‌లోని సచివాలయం, శాఖల ప్రధాన కార్యాలయాల నుంచి వచ్చి.. అమరావతి, గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లోని ప్రధాన కార్యాలయాల్లో పనిచేస్తున్న వారికి 2021 జూలై 1 నుంచి ఏడాది పాటు 30 శాతం హెచ్ఆర్ఏ అమల్లో ఉంటుంది. ఉద్యోగ సంఘాల హర్షం.. డీఏ పెంపు, బకాయిల చెల్లింపుతోపాటు 30 శాతం హెచ్ఆర్ఏను మరో ఏడాది పాటు కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపాయి. ఉద్యోగుల సమస్యలను గురువారం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన వెంటనే వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కె.వెంకటరామిరెడ్డి తెలిపారు. సీఎం ఇచ్చిన మాట ప్రకారం వెంటనే ఉత్తర్వులు జారీ చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. -
ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు ఏపీ గుడ్‌న్యూస్
-
ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు ఏపీ గుడ్‌న్యూస్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు 3.144 శాతం డీఏ పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను శనివారం ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేశారు. పెంపుదల చేసిన 3.144 శాతం మేర కరవు భత్యాన్ని 2019 జనవరి 1వ తేదీ నుంచి వర్తింపచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కొత్త పెంపుతో 33.536 శాతానికి కరువు భత్యం పెరిగింది. 2021 జూలై నుంచి పెంపుదల చేసిన డీఏతో కలిపి పింఛన్ చెల్లించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. బకాయి ఉన్న డీఏను వాయిదాల్లో చెల్లించనున్నట్టు స్పష్టం చేసింది. 2019 జూలై నుంచి పెంచాల్సిన మూడో డీఆర్ 5.24 శాతాన్ని 2022 జనవరి నుంచి చెల్లించనున్నట్టు ఆర్ధిక శాఖ తెలిపింది. 2018 జూలై 1వ తేదీన 27.248 శాతం నుంచి 30.392 శాతానికి పెన్షనర్ల డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. 2019 జూలై నుంచి 5.24 శాతం మేర మూడో డీఆర్ పెంపుదల చేశారు. ఈ పెంపుతో 38.776 శాతానికి పింఛన్‌దారుల డీఏ పెరగనుంది. -
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్
సాక్షి, అమరావతి : ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపుపై ఏపీ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు విడుదల చేసింది. 2018లోజులైలో పెంచిన 3.144 శాతం కరువు భత్యం మంజూరు చేస్తున్నట్లు పేర్కొంది. దీంతో కరువు భత్యం 27.248 నుంచి 30.392కు పెరిగినట్లయింది. 2021 జనవరి జీతాలతో (ఫిబ్రవరి 1న) కలిపి నగదుగా చెల్లింపులు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 2018, జులై 1 నుంచి 2020 డిసెంబర్ 31 వరకు 30 నెలల బకాయిలు జీపీఎఫ్/జడ్పీపీఎఫ్ వారికి 3 సమ భాగాల్లో పీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తామన్నారు. సీపీఎస్ వారికి 30 నెలల ఆరియర్స్ 90 శాతం నగదుతో పాటు 10శాతం ప్రాన్ అకౌంట్‌కు..జనవరి జీతాల చెల్లింపు తర్వాత 3 సమ భాగాల్లో జమ చేస్తామని తెలిపింది.2019 జనవరి డీఏ 2021 జూలై నుంచి.. 2019 జూలై డీఏ ..2022 జనవరి నుంచి చెల్లించడానికి హామీ ఇచ్చారు. -
బుల్.. ధనాధన్!
ఆరు రోజుల పతనం కారణంగా భారీగా నష్టపోయి ఆకర్షణీయంగా ఉన్న షేర్లలో కొనుగోళ్లు జరగడం(వేల్యూ బయింగ్)తో బుధవారం స్టాక్ మార్కెట్ భారీగా లాభపడింది. కంపెనీల ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాల వెల్లడి నేటి(గురువారం) నుంచి ఆరంభం కానున్నది. కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు కారణంగా కంపెనీల నికర లాభాలు పెరిగే అవకాశాలున్నాయన్న అంచనాలతో ఈ క్యూ2 ఫలితాలు బాగానే ఉండగలవన్న ఆశావహంతో కొనుగోళ్ల సునామీ చోటు చేసుకుంది. బీఎస్ఈ సెన్సెక్స్ 38,000 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 11,300 పాయింట్లపైకి ఎగబాకాయి. కేంద్ర ప్రభుత్వం డీఏను పెంచడం పండుగ డిమాండ్‌కు మరింత జోష్నివ్వగలదన్న అంచనాలు నెలకొన్నాయి. ముడి చమురు ధరలు తగ్గడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ నష్టాల నుంచి రికవరీ కావడం, నేడు(గురువారం) నిప్టీ వీక్లీ ఆప్షన్లు ఎక్స్పైరీ కానుండటంతో షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు చోటు చేసుకోవడం సానుకూల ప్రభావం చూపించాయి. బ్యాంక్, ఆర్థిక, టెలికం షేర్లు లాభపడ్డాయి. సెన్సెక్స్ 646 పాయిం ట్లు లాభపడి 38,178 పాయింట్ల వద్ద, నిఫ్టీ 187 పాయింట్లు లాభపడి 11,313 పాయింట్ల వద్ద ముగిశాయి. ఐటీ, కన్సూమర్ డ్యూరబుల్స్, టెక్నాలజీ సూచీలు మినహా మిగిలిన అన్ని సూచీలు లాభపడ్డాయి. ఇక ఎన్ఎస్ఈ ఐటీ సూచీ మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు లాభపడ్డాయి. క్యూ2 ఫలితాలే దిక్సూచి.... ఆరు రోజుల నష్టాల నుంచి మార్కెట్ రికవరీ అయిందని జియోజిత్ ఫైనాన్షియల్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ పేర్కొన్నారు. ఆర్బీఐ మరోసారి రేట్లు తగ్గించే అవకాశాలున్నాయన్న అంచనాలతో బాండ్ల రాబడులు తగ్గాయని, దీంతో బ్యాంక్ షేర్లు పెరిగాయని వివరించారు. రేట్ల తగ్గింపు కారణంగా మరిన్ని నిధులు వ్యవస్థలోకి వస్తాయని, దీంతో డిమాండ్ పుంజుకోగలదన్న ఆశావహంతో కొనుగోళ్లు జోరుగా సాగాయని విశ్లేషించారు. రానున్న క్యూ2 ఫలితాలు మార్కెట్ గతిని నిర్దేశిస్తాయని పేర్కొన్నారు. మధ్యాహ్నం తర్వాత లాభాలు..... దసరా సందర్భంగా మంగళవారం సెలవు. ఒక రోజు విరామం తర్వాత సెన్సెక్స్ స్వల్ప లాభాలతో ఆరంభమైంది. మధ్యాహ్నం వరకూ పరిమిత శ్రేణి లాభాల్లో కదలాడింది. ఆ తర్వాత కొనుగోళ్లు జోరందుకోవడంతో భారీ లాభాల దిశగా కదిలింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 678 పాయింట్లు, నిఫ్టీ 196 పాయింట్ల మేర లాభపడ్డాయి. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఒప్పందం విషయమై అనిశ్చితి చోటు చేసుకోవడంతో ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. కంపెనీల ఆర్థిక ఫలితాలపై ఆశావహ అంచనాలు, చైనా అమెరికాతో పరిమిత వాణిజ్య ఒప్పందానికి ఒప్పుకోగలదన్న వార్తల (ఆసియా మార్కెట్లు ముగిశాక ఈ వార్తలు వచ్చాయి)కారణంగా యూరప్ మార్కెట్లు లాభాలతో ఆరంభమై, లాభాల్లోనే ముగిశాయి. బ్యాంక్ షేర్ల జోరు పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో ఆపరేటివ్ బ్యాంక్(పీఎమ్‌సీ), లక్ష్మీ విలాస్ బ్యాంక్‌ల్లో అవకతవకలు వెలుగులోకి రావడంతో గత 6 ట్రేడింగ్ సెషన్లలో బ్యాంక్, ఆర్థిక రంగ షేర్లు నష్టపోయాయి. ఈ నష్టాల కారణంగా పలు బ్యాంక్ షేర్లు ఆకర్షణీయ ధరల్లో లభిస్తున్నాయి. మరోవైపు నేడు(గురువారం) వెల్లడి కానున్న ఇండస్ఇండ్ బ్యాంక్ క్యూ2 ఫలితాలపై పలు బ్రోకరేజ్ సంస్థలు ఆశావహ అంచనాలను వెలువరించాయి. దీంతో బ్యాంక్ షేర్లు జోరుగా పెరిగాయి. నిఫ్టీ బ్యాంక్ సూచీ 1,018 పాయింట్లు (3.6%) మేర ఎగసింది. ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్ 5.4% లాభంతో రూ.1,310 వద్ద ముగిసింది. సెన్సెక్స్ షేర్లలో అధికంగా లాభపడిన షేర్ ఇదే. మరిన్ని విశేషాలు... ► యస్ బ్యాంక్ షేర్ 5.2% నష్టంతో రూ.43 వద్ద ముగిసింది. సెన్సెక్స్, నిఫ్టీల్లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ► ప్రమోటార్ల షేర్ల వాటాను డిపాజిటరీ సంస్థ, సీడీఎస్ఎల్ స్తంభింపజేయడంతో దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్(డీహెచ్ఎఫ్ఎల్) షేర్ 10 శాతం లోయర్ సర్క్యూట్‌తో పదేళ్ల కనిష్ట స్థాయి, రూ.26కు పడిపోయింది. ► షేర్ల బైబ్యాక్ వార్తలతో ఇండియాబుల్స్ వెంచర్స్ 9 శాతం లాభంతో రూ.109కు, ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ 5 శాతం లాభంతో రూ.43కు పెరిగాయి. ► ఇండియామార్ట్ ఇంటర్మెష్ మెరుపులు కొనసాగుతున్నాయి. 20% లాభంతో జీవిత కాల గరిష్ట స్థాయి, 2,304ను తాకి.. చివరకు 18% లాభంతో రూ.2,264 వద్ద ముగిసింది. ఇన్వెస్టర్ల సంపద 1.66 లక్షల కోట్లు అప్ స్టాక్ మార్కెట్ భారీ లాభాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.1.66 లక్షల కోట్లు పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1.66 లక్షల కోట్లు పెరిగి రూ.1,43,92,456 కోట్లకు చేరింది. లాభాలు ఎందుకంటే... ► వేల్యూ బయింగ్: గత ఆరు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్, నిఫ్టీలు చెరో 4 శాతం మేర నష్టపోయాయి. ఈ ఆరు రోజుల నష్టాల కారణంగా బ్యాంక్, ఆర్థిక, లోహ, వాహన, రియల్టీ రంగ షేర్ల ధరలు తగ్గి ఆకర్షణీయంగా ఉండటంతో కొనుగోళ్లు జోరుగా సాగాయి. ► కరువు భత్యం(డీఏ) పెంపు: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు డీఏను 12 శాతం నుంచి 17 శాతానికి,.. 5 శాతం మేర పెంచింది. ఫలితంగా 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 62 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం కలగనున్నది. డీఏ పెంపు కారణంగా కేంద్రంపై రూ.16,000 కోట్ల భారం పడనున్నప్పటికీ, ఆ మేరకు ఆర్థిక వ్యవస్థలో లిక్విడిటీ పెరిగి, కొనుగోళ్లు చోటు చేసుకుంటాయని, వినియోగం పుంజుకుంటుందన్న అంచనాలున్నాయి. దీంతో మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు జోష్ రాగలదన్న ఆశాభావంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. ► చల్లబడ్డ చమురు ధరలు: అమెరికా... ఇతర దేశాలపై సుంకాలు విధిస్తున్న కారణంగా అంతర్జాతీయంగా వృద్ధి కుంటుపడుతుందన్న ఆందోళనతో ముడి చమురు ధరలు పతనమయ్యాయి. గత మూడు రోజులుగా చమురు ధరలు తగ్గుతున్నాయి. 80 శాతానికి పైగా చమురును దిగుమతి చేసుకుంటున్న మన దేశానికి చమురు ధరలు తగ్గడం సానుకూల ప్రభావం చూపుతుంది. అయితే మన మార్కెట్ ముగిసిన తర్వాత చమురు ధరలు పెరిగాయి. ► రూపాయి రికవరీ: ఫారెక్స్ మార్కెట్లో రోజులో ఎక్కువ భాగం నష్టాల్లో ట్రేడైన డాలర్‌తో రూపాయి మారకం విలువ స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి 8 పైసలు పుంజుకోవడం సానుకూల ప్రభావం చూపించింది. -
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తన ఉద్యోగులకు తీపి కబురు అందించింది. ప్రభుత్వం ఉద్యోగులకు డీఏ పెంచుతున్నట్టు శనివారం ప్రకటించింది. దీని ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 3.144 శాతం డీఏ పెరగనుంది. పెరిగిన డీఏ 2018 జులై 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని ప్రభుత్వం పేర్కొంది. మొత్తంగా 27.248 శాతం నుంచి 30.392 శాతానికి డీఏ పెరిగింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం శనివారం జీవో జారీ చేసింది. -
ఉద్యోగులకు సర్కార్ దివాళీ కానుక
పట్నా: దీపావళికి ముందు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు బిహార్ ప్రభుత్వం తీపికబురు అందించింది. ఉద్యోగులకు ప్రస్తుతం ఏడు శాతంగా ఉన్న డీఏను 9 శాతానికి పెంచేందుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. పెరిగిన డీఏను ఈ ఏడాది జులై 1 నుంచి వర్తింపచేస్తామని కేబినెట్ సెక్రటేరియట్ ముఖ్య కార్యదర్శి సంజయ్ కుమార్ వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, సవరించిన వేతనాలను అందుకుంటున్న ఫ్యామిలీ పెన్షనర్లు ఈ పెంపునకు అర్హులని కుమార్ తెలిపారు. డీఏ పెంపుతో ప్రభుత్వంపై ఏటా రూ 419 కోట్ల అదనపు భారం పడుతుందని పేర్కొన్నారు. మరోవైపు పెన్షన్ స్కీమ్‌లో ప్రస్తుతమున్న 3.09 కోట్ల ఉద్యోగుల సంఖ్యను 6 కోట్ల ఉద్యోగులకు పెంచాలని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్ ప్రయత్నిస్తోందని అధికారులు తెలిపారు. మరోవైపు ఏడవ వేతన సంఘ సిఫార్సులకు అతీతంగా కనీస వేతనం, ఫిట్మెంట్లను పెంచాలని 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న డిమాండ్‌ను ఆర్థిక శాఖ సహాయ మంత్రి పీ రాధాకృష్ణన్ తోసిపుచ్చారు. కాగా ఇప్పటికే ఏడవ వేతన సంఘం సిఫార్సులను పలు రాష్ట్రాలు అమలుచేసిన సంగతి తెలిసిందే. -
తెలంగాణలో 1.572 శాతం డీఏ పెంపు
-
1.572 % డీఏ పెంపు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఒక విడత కరువుభత్యం (డీఏ) చెల్లించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి 1.572 శాతం డీఏ చెల్లించే ఉత్తర్వులపై సోమవారం సంతకం చేశారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఒకట్రెండు రోజుల్లో జారీ కానున్నాయి. పెంచిన డీఏ బకాయిలను జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్)తో కలిపి అక్టోబర్ 1న చెల్లించే సెప్టెంబర్ వేతనంలో నగదుగా చెల్లించనున్నారు. తాజా పెంపుతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మొత్తం డీఏ 27.24 శాతానికి చేరుకుంది. తాజా డీఏ పెంపుతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై ఏటా రూ.350 కోట్ల అదనపు భారం పడనుంది. జూలై డీఏ ఎప్పుడో? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలోని ఉద్యోగులకు, పెన్షనర్లకు ఏటా జనవరిలో, జూలైలో డీఏలను పెంచుతాయి. కేంద్రం పెంచిన డీఏ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు రెండుసార్లు డీఏ చెల్లిస్తుంది. జూలై డీఏను పెంచుతూ ఆగస్టు 29న కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో డీఏ పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వ డీఏ మంజూరులో ఈసారి జాప్యం జరిగింది. 2017 జూలై డీఏ పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మే 17న ఉత్తర్వులు జారీ చేసింది. అప్పుడు సైతం 1.572 శాతం పెంచింది. 2018 జనవరి డీఏ పెంపుపై తాజాగా సీఎం నిర్ణయం తీసుకున్నారు. 2018 జూలై డీఏ పెంపుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. జూలై డీఏ పెంపు ఎప్పుడనే దానిపై స్పష్టత రావట్లేదని ఉద్యోగులు చెబుతున్నారు. అసెంబ్లీకి ముందుస్తు ఎన్నికలు జరిగే పరిస్థితులు ఉంటే రెండు విడతల డీఏలను కలిపి ఒకేసారి చెల్లించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందని ఉద్యోగ సంఘాలు ఆశిస్తున్నాయి. -
కేంద్ర ఉద్యోగులకు డీఏ 2% పెంపు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం(డీఏ), కరవు సాయం(డీఆర్)ను అదనంగా 2 శాతం పెంచడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో సుమారు 48.41 లక్షల మంది ఉద్యోగులు, 62.03 లక్షల మంది పించన్‌దారులకు(మొత్తం 1.1 కోట్ల మంది) ప్రయోజనం కలగనుంది. ప్రధాని అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. డీఏ, డీఆర్‌లను పెంచడం ద్వారా కేంద్ర ఖజానాపై ఏటా రూ.6,112.20 కోట్ల భారం పడుతుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పెంచిన భత్యాలు ఈ జూలై 1 నుంచే అమల్లోకి రానున్నాయి. ఖజానాపై రూ.4074.80 కోట్ల అదనపు భారం పడుతుంది. మరోవైపు, రైల్వే రంగంలో శాస్త్రీయ, సాంకేతికత సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి దక్షిణ కొరియా రైల్వేతో కుదుర్చుకున్న ఒప్పందం గురించి అధికారులు కేబినెట్‌కు వివరించారు. -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏలో రెండు శాతం అదనపు పెంపునకు బుధవారం కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. డీఏ పెంపు నిర్ణయం ఈ ఏడాది జులై 1 నుంచి వర్తింపచేస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో పెన్షనర్లకు డీఏ అదనపు ఇన్స్టాల్మెంట్ విడుదలకూ గ్రీన్‌సిగ్నల్ లభించింది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మూల వేతనం లేదా పెన్షన్‌లో ప్రస్తుతం ఏడు శాతంగా ఉన్న డీఏకు అదనంగా మరో రెండు శాతాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. డీఏ, డీఆర్‌ల పెంపుతో ప్రభుత్వ ఖజానాపై ఏటా రూ 6112 కోట్ల భారం పడనుంది. క్యాబినెట్ నిర్ణయంతో 48.41 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు 62.03 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు. ఏడవ వేతన సంఘం సిఫార్సుల మేరకు డీఏ పెంపు నిర్ణయం జరిగిందని అధికార వర్గాలు తెలిపాయి. -
ఉద్యోగులకు తీపికబురు
సాక్షి,న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు తీపికబురు అందించింది. ఏడవ వేతన సంఘం సిఫార్సులకు అనుగుణంగా 48 లక్షల ప్రభుత్వ ఉద్యోగుల డిప్యుటేషన్ అలవెన్సును రెట్టింపు చేసేందుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.డిప్యుటేషన్ అలవెన్సును 2.25 రెట్లు పెంచేందుకు ప్రభుత్వం అనుమతించిందని, 2017, జులై 1 నుంచి ఈ నిర్ణయం వర్తింపచేస్తామని సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఒకే స్టేషన్లో డిప్యుటేషన్‌కు సంబంధించి డిప్యుటేషన్ అలవెన్స్‌ను బేసిక్ పేలో 5 శాతంగా ఉంటుందని గరిష్టంగా నెలకు రూ 4500 వరకూ పెరుగుతుందని, లొకేషన్ మారితే మూల వేతనంలో పది శాతం గరిష్టంగా రూ 9000 వరకూ డిప్యుటేషన్ అలవెన్స్ చెల్లిస్తారని నోటిఫికేషన్ తెలిపింది.ప్రస్తుతం డిప్యుటేషన్ అలవెన్స్‌ను ఈ రెండు కేటగిరీల్లో వరుసగా రూ2000, రూ 4000గా చెల్లిస్తున్నారు. -
సుప్రీం, హైకోర్టుల జడ్జీల డీఏ పెంపు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల కరువు భత్యం (డీఏ)ను ప్రభుత్వం మూడు శాతం పెంచింది. తాజా పెంపు ఈ ఏడాది జూలై 1 నుంచే అమల్లోకి వస్తుందంటూ ప్రభుత్వం సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్, హైకోర్టుల రిజిస్ట్రార్ జనరల్స్‌కు లేఖలు రాసింది.కాగా ఏడవ వేతన సంఘం ప్రకారం న్యాయమూర్తుల జీతాల పెంపుకు సంబంధించిన రెండు బిల్లులు ప్రస్తుతం మంత్రివర్గం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. కేబినెట్ ఆమోదం తర్వాత వీటిని ఈ శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కాగా, ప్రస్తుతం సుప్రీంకోర్టు జడ్జీలు నెలకు రూ.1.5 లక్షలు (అన్ని కోతల అనంతరం) వేతనంగా అందుకుంటుండగా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంతకన్నా ఎక్కువగా, హైకోర్టుల న్యాయమూర్తులు రూ.1.5 లక్షల కన్నా తక్కువగా వేతనాలను పొందుతున్నారు. -
కేసీఆర్‌కి కృతజ్ఞతలు తెలిపిన టీఎన్జీవోస్ నేతలు
హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగులకు 3.1444 శాతం డీఏ పెంపుపై టీఎన్జీవోస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. డీఏ పెంచినందుకు సీఎం కేసీఆర్‌కు టీఎన్జీవోస్ గౌరవ అధ్యక్షుడు దేవీ ప్రసాద్, అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజేందర్ కృతజ్ఞతలు తెలిపారు. సదరు ఫైల్‌పై సీఎం కేసీఆర్ గురువారం సంతకం చేశారు. ఈ పెంచిన డీఏ ఈ ఏడాది జనవరి నుంచి అమల్లోకి వస్తుంది. -
ఆర్టీసీ కార్మికులకు 3.4 శాతం డీఏ అమలు
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు 3.4 శాతం డీఏ అమలు కానుంది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆర్టీసీ కార్మికులకు డీఏ అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ కావడంపై తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యానికి టీఎమ్‌యూ నేత థామస్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. -
ఉద్యోగులకు కేంద్రం హోలీ గిఫ్ట్!
న్యూ ఢిల్లీ: హోలీ సందర్భంగా ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి వార్త అందించింది. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు, పెన్షనర్లకు కరువు భత్యాన్ని(డీఏ) 6 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది జనవరి నెల నుంచి అమలులోకి వస్తుందని టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. ఈ నిర్ణయంతో 2016-17 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఖజానాపై 14,700 కోట్ల భారం పడనుంది. డీఏ పెంపు నిర్ణయంతో 50 లక్షల మంది ఉద్యోగులు, 58 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. తాజా పెంపుతో మూల వేతనంలో డీఏ అలవెన్స్ 119 శాతం నుంచి 125 శాతానికి పెరిగింది. గతంలో ఏడవ వేతన సంఘం 24 శాతం డీఏ పెంచాలని సిఫారసు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇలా పెంచాలంటే ప్రభుత్వంపై లక్ష కోట్ల అదనపు భారం పడనుంది. -
ప్రభుత్వోద్యోగులకు 3.14 % డీఏ పెంపు
రాష్ట్ర కేబినెట్ నిర్ణయం.. 2015 జూలై నుంచి వర్తింపు మార్చి తొలి వారంలో బడ్జెట్ సమావేశాలు దుమ్ముగూడెం ప్రాజెక్టు రీ డిజైన్‌కు ఆమోదం రామ సాగర్ సాగునీటి ప్రాజెక్టుగా నామకరణం రాష్ట్రంలో కొత్తగా హార్టికల్చర్ కార్పొరేషన్ పాడికి ప్రోత్సాహకంపై మంత్రివర్గ ఉప సంఘం తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధిపై మరో సబ్ కమిటీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ భేటీ వివరాలు వెల్లడించిన మంత్రి హరీశ్‌రావు సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువుభత్యం(డీఏ) పెంచేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2015 జూలై 1 నుంచి పెరిగిన కరువు భత్యం చెల్లింపులకు పచ్చజెండా ఊపింది. పీఆర్సీ సిఫారసు మేరకు ఉద్యోగులకు 3.14 శాతం డీఏ పెరగాల్సి ఉంది. కానీ నారాయణఖేడ్ ఉప ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రభుత్వం డీఏ పెంపు నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. తాజా డీఏ పెంపుతో దాదాపు నాలుగున్నర లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుంది. సమావేశం అనంతరం కేబినెట్ నిర్ణయాలను వెల్లడించిన మంత్రి హరీశ్‌రావు డీఏ విషయాన్ని దాటవేశారు. రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు మార్చి మొదటి వారంలో జరపాలని నిర్ణయం తీసుకున్నామని హరీశ్ తెలిపారు. బడ్జెట్ రూపకల్పనే ప్రధాన ఎజెండాగా ఆదివారం సచివాలయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. అనంతరం మంత్రులు హరీశ్‌రావు, తుమ్మల నాగేశ్వర్రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఖమ్మం జిల్లాలో 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో నిర్మించ తలపెట్టిన దుమ్ముగూడెం ప్రాజెక్టు రీడిజైన్‌కు మంత్రి వర్గం ఆమోదం తెలిపిందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. 50 టీఎంసీల సామర్థ్యంతో రూ.7,900 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును రూపొందించినట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టుకు శ్రీరామసాగర్ ప్రాజెక్టుగా పేరు మారుస్తూ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. గతంలో చేపట్టిన ఇందిరా, రాజీవ్ సాగర్, దుమ్ముగూడెం ప్రాజెక్టులు రీడిజైన్ చేసి సాగునీరు అందని కరువు పీడిత ప్రాంతాల కు నీరు అందిస్తామన్నారు. విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు రూ.4 ప్రోత్సాహకంగా ఇస్తున్నామని, ఇతర డెయిరీలకు పాలు పోసే వారికి కూడా ఈ ప్రోత్సాహకం అందజేయాలన్న డిమాండ్ నల్లగొండ, కరీంనగర్ జిల్లాల నుంచి వచ్చిందన్నారు. దీంతో ఈ అంశంపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఈ ఉపసంఘానికి మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చైర్మన్‌గా మంత్రులు ఈటల రాజేందర్, జగదీశ్వర్‌రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి సభ్యులు ఉంటారన్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయడానికి మరో మంత్రివర్గ సబ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దీనికి సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ చైర్మన్‌గా ఉంటారని, మంత్రులు కేటీఆర్, తుమ్మల నాగేశ్వర్రావు సభ్యులుగా ఉంటారనన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ కోసం గతంలోనే కేబినెట్ నిర్ణయం తీసుకుందని, ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు ఏపీ ఉద్యోగుల క్రమబద్ధీకరణ చట్టాన్ని అడాప్ట్ చేసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ ప్రక్రియను ఆయా శాఖలు త్వరిత గతిన చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో కొత్తగా హార్టికల్చరల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, కొత్తగా ఉద్యోగాల నియామకాలు చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుందన్నారు. కూరగాయలు, పండ్ల సాగు పెంచుతాం.. రాష్ట్రంలో కూరగాయలు, పండ్లు, పూల సాగును పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో ఇవి ప్రస్తుతం 6.65 లక్షల హెక్టార్లలో సాగవుతున్నాయని, 3.70 కోట్ల జనాభా అవసరాలకు 67.83 లక్షల టన్నుల ఉత్పత్తులు అవసరం అవుతున్నాయన్నారు. అందువల్ల వీటి సాగును మరో 4,400 హెక్టార్లకు విస్తరిస్తామని చెప్పారు. ఆహార పదార్థాల్లో కల్తీ నివారణకు హార్టీకల్చర్ కార్పొరేషన్ ద్వారా 200 ఎకరాల్లో ప్రాసెస్ యూనిట్లను ఏర్పాటు చేస్తామన్నారు. మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లా గోదావరి జలాలపైనే ఆధారపడిందన్నారు. గతంలో గోదావరిపై ప్రారంభించిన పథకాలు నిరుపయోగం కావడంతోపాటు జిల్లాలోని కొన్ని మండలాలు ఏపీకి వెళ్లడంతో ఆ ప్రాజెక్టులు పూర్తి చేసే అవకాశం ప్రభుత్వానికి రాలేదన్నారు. మంత్రి హరీశ్ ఏపీని సంప్రదించినా.. ఆ ప్రభుత్వం స్పందించలేదని చెప్పారు. ఖమ్మం రైతుల సాగునీటి అవసరాలు తీర్చేందుకు చొరవ తీసుకున్నందుకు జిల్లా ప్రజల తరపున సీఎంకు ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. గోదావరి నికర జలాల్లో కేటాయించిన 50 టీఎంసీలనే ఈ ప్రాజెక్టుకు వాడుకుంటున్నందున ఎలాంటి అనుమతులు అక్కర్లేదన్నారు. దాదాపు మూడున్నర గంటల పాటు కేబినెట్ సమావేశం జరిగింది. తొలి రెండు గంటలూ బడ్జెట్ తయారీ, ప్రతిపాదనల రూపకల్పనపై అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. అనంతరం ఎజెండాలోని అంశాలను చర్చించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో పాటు అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు హాజరయ్యారు.