సుప్రీం, హైకోర్టుల జడ్జీల డీఏ పెంపు | SC, HC judges get DA hike, bills to raise their salary await cabinet nod | Sakshi
Sakshi News home page

సుప్రీం, హైకోర్టుల జడ్జీల డీఏ పెంపు

Published Mon, Nov 6 2017 3:18 AM | Last Updated on Sun, Sep 2 2018 5:18 PM

SC, HC judges get DA hike, bills to raise their salary await cabinet nod - Sakshi

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల కరువు భత్యం (డీఏ)ను ప్రభుత్వం మూడు శాతం పెంచింది. తాజా పెంపు ఈ ఏడాది జూలై 1 నుంచే అమల్లోకి వస్తుందంటూ ప్రభుత్వం సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్, హైకోర్టుల రిజిస్ట్రార్‌ జనరల్స్‌కు లేఖలు రాసింది.కాగా ఏడవ వేతన సంఘం ప్రకారం న్యాయమూర్తుల జీతాల పెంపుకు సంబంధించిన రెండు బిల్లులు ప్రస్తుతం మంత్రివర్గం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. కేబినెట్‌ ఆమోదం తర్వాత వీటిని ఈ శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కాగా, ప్రస్తుతం సుప్రీంకోర్టు జడ్జీలు నెలకు రూ.1.5 లక్షలు (అన్ని కోతల అనంతరం) వేతనంగా అందుకుంటుండగా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంతకన్నా ఎక్కువగా, హైకోర్టుల న్యాయమూర్తులు రూ.1.5 లక్షల కన్నా తక్కువగా వేతనాలను పొందుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement