సాక్షి, న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాల న్యాయాధికారుల విభజనపై సుప్రీం కోర్టులో చేపట్టిన విచారణ రేపటికి వాయిదా పడింది. విభజనపై మంగళవారం సుప్రీం కోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. సీనియారిటీ ప్రకారం విభజన చేస్తే తెలంగాణ న్యాయాధికారులకు అన్యాయం జరుగుతుందని తెలంగాణ న్యాయాధికారుల సంఘం తరపున సల్మాన్ ఖుర్షి, అహ్మద్‌లు వాదనలు వినిపించారు. గంటకు పైగా వాదనలు విన్న ధర్మసనం తదుపరి విచారణను రేపటికి (బుధవారం)వాయిదా వేసింది. న్యాయాధికారుల విభజనపై హైకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్‌పై తెలంగాణ న్యాయాధికారుల సంఘం సుప్రీం కోర్టుని ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
Published Tue, Aug 28 2018 8:17 PM | Last Updated on Sun, Sep 2 2018 5:18 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment