సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణలో టపాసులపై నిషేధం విధిస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ తెలంగాణ క్రాకర్స్ అసోసియేషన్ శుక్రవారం సుప్రీంకోర్టులో లంచ్ పిటిషన్ దాఖలు చేసింది. దీపావళి పండుగ సందర్భంగా క్రాకర్స్‌ను బ్యాన్ చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని కోరింది. ఇప్పటికే షాపులలో స్టాకును నింపామని, పండుగ రెండు రోజుల ముందు బ్యాన్ విధిస్తే తాము కోట్లల్లో నష్టపోతామని పిటిషన్‌లో పేర్కొంది. హైకోర్టు తీర్పు వల్ల చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటారని తెలిపింది. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టనుంది.
కాగా, హైకోర్టు ఆదేశాలతో తెలంగాణలో టపాసులపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం ఉత్వర్వులు జారీ చేసింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో టపాసుల అమ్మకాలపై నిషేధం ఉందని తెలిపారు. టపాసుల అమ్మకాలతో పాటు కాల్చడం కూడా నిషేధమన్నారు. క్రాకర్స్ షాపులను మూసివేయాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment