ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 3 శాతం పెంచుతూ కేంద్ర కేబినెట్ కీలకం నిర్ణయం తీసుకుంది. దీంతో మొత్తం డీఏ 31 శాతానికి చేరుకుంది. కరోనా కారణంగా జనవరి 2020 నుంచి జూన్ 2021 వరకు డీఏ పెంపుదల అంశం వాయిదా పడింది. ఈ ఏడాది జూలై నెలలో కేంద్ర ప్రభుత్వ సంస్ధలో పని చేస్తున్న ఉద్యోగులకు ,పెన్షనర్లకు చెల్లించే డియర్నెస్ అలవెన్స్ (డీఏ), డియర్నెస్ రిలీఫ్ (డీఆర్) లను 17శాతం నుంచి 28 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
ఇక కొత్తగా పెరిగిన డీఏ, డీఆర్ జూలై 1 నుంచి అమలులోకి రానున్నట్లు కేంద్రం తెలిపింది. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో 47.14 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68.62లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది.
చదవండి: Jio Exclusive Offer: స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై జియో బంపర్ ఆఫర్...!
Comments
Please login to add a commentAdd a comment