DA Hike: లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 2023 ఏడాదికి గాను రెండో రౌండ్ డియర్‌నెస్ అలవెన్స్ (DA) పెంపు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో తాజా నివేదికలు ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందిస్తున్నాయి. రానున్న పండుగ సీజన్‌లో డీఏ పెంపుపై కేంద్ర సర్కార్ ప్రకటన చేయనుంది. ముఖ్యంగా ఊహించిన దానికి మించి డీఏ పెంపు ఉంటుందని భావిస్తున్నారు.
ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో ఉద్యోగులకు కేంద్రం ప్రభుత్వం తీపి కబురందించనుంది. త్వరలోనే డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు. 2023 సంవత్సరంలో రెండో రౌండ్ డీఏ పెంపునిపై కీలక ప్రకటన చేసేందుకు కేంద్రం సిద్ధమవుతోందని నివేదికలు చెబుతున్నాయి. అక్టోబరు-నవంబరు మధ్యలో నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. గతంలో ఈ పెంపును 3శాతంగా అంచనా వేసినప్పటికీ, తాజా పరిణామాల నేపథ్యంలో దాని కంటే ఎక్కువే ఉండ వచ్చని తెలుస్తోంది. పెంపుతో దాదాపు 48 లక్షల మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68 లక్షల మందికి పైగా పెన్షనర్లు ప్రయోజనం పొందుతారు. అయితే దీనిపై ప్రభుత్వ అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. (లెజెండరీ క్రికెటర్ల కళ్లు చెదిరే ఇంద్రభవనాలు: అత్యాధునిక ఫీచర్లు)
కన్సూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ (CPI-IW) ఆధారంగా చేసిన లేటెస్ట్ కాలిక్యులేషన్స్ 4 శాతం డీఏ పెంపును సూచిస్తున్నాయి. ఇదే నిజమైతే డీఏ పెంపు 46శాతంగా ఉండనుంది. ముఖ్యంగా గత నెలలో ఆల్ ఇండియా రైల్వేమెన్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ శివ గోపాల్ మిశ్రా తాము నాలుగు శాతం డీఏ పెంపు డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు తాజా నివేదికలకు ఊతమిస్తున్నాయి. కాగా దేశంలో ద్రవ్యోల్బణం ఆధారంగా ప్రభుత్వం డీఏ పెంపుపై నిర్ణయం తీసుకుంటుందనేది విదితమే. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2023 ఏడాదిలో రెండో DA పెంపు, ఎప్పుడు ప్రకటించినా, 7వ వేతన సంఘం నిబంధనల ప్రకారం జూలై 1, 2023 నుండి అమలులోకి వస్తుంది. (నడిరోడ్డుపై ఖరీదైన డైమండ్లు, ఎగబడిన జనం: అదిరిపోయే ట్విస్ట్)
ఇదీ చదవండి: మస్క్ మామూలోడు కాదయ్యా..వీడియో వైరల్! ఇక ఆ రోబో కూడా?
Comments
Please login to add a commentAdd a comment