Cetral Government
-
ఉద్యోగులకు గుడ్‌న్యూస్..అంచనాలకు మించి భారీగా జీతాల పెంపు!
DA Hike: లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 2023 ఏడాదికి గాను రెండో రౌండ్ డియర్నెస్ అలవెన్స్ (DA) పెంపు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో తాజా నివేదికలు ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందిస్తున్నాయి. రానున్న పండుగ సీజన్లో డీఏ పెంపుపై కేంద్ర సర్కార్ ప్రకటన చేయనుంది. ముఖ్యంగా ఊహించిన దానికి మించి డీఏ పెంపు ఉంటుందని భావిస్తున్నారు. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో ఉద్యోగులకు కేంద్రం ప్రభుత్వం తీపి కబురందించనుంది. త్వరలోనే డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు. 2023 సంవత్సరంలో రెండో రౌండ్ డీఏ పెంపునిపై కీలక ప్రకటన చేసేందుకు కేంద్రం సిద్ధమవుతోందని నివేదికలు చెబుతున్నాయి. అక్టోబరు-నవంబరు మధ్యలో నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. గతంలో ఈ పెంపును 3శాతంగా అంచనా వేసినప్పటికీ, తాజా పరిణామాల నేపథ్యంలో దాని కంటే ఎక్కువే ఉండ వచ్చని తెలుస్తోంది. పెంపుతో దాదాపు 48 లక్షల మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68 లక్షల మందికి పైగా పెన్షనర్లు ప్రయోజనం పొందుతారు. అయితే దీనిపై ప్రభుత్వ అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. (లెజెండరీ క్రికెటర్ల కళ్లు చెదిరే ఇంద్రభవనాలు: అత్యాధునిక ఫీచర్లు) కన్సూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ (CPI-IW) ఆధారంగా చేసిన లేటెస్ట్ కాలిక్యులేషన్స్ 4 శాతం డీఏ పెంపును సూచిస్తున్నాయి. ఇదే నిజమైతే డీఏ పెంపు 46శాతంగా ఉండనుంది. ముఖ్యంగా గత నెలలో ఆల్ ఇండియా రైల్వేమెన్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ శివ గోపాల్ మిశ్రా తాము నాలుగు శాతం డీఏ పెంపు డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు తాజా నివేదికలకు ఊతమిస్తున్నాయి. కాగా దేశంలో ద్రవ్యోల్బణం ఆధారంగా ప్రభుత్వం డీఏ పెంపుపై నిర్ణయం తీసుకుంటుందనేది విదితమే. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2023 ఏడాదిలో రెండో DA పెంపు, ఎప్పుడు ప్రకటించినా, 7వ వేతన సంఘం నిబంధనల ప్రకారం జూలై 1, 2023 నుండి అమలులోకి వస్తుంది. (నడిరోడ్డుపై ఖరీదైన డైమండ్లు, ఎగబడిన జనం: అదిరిపోయే ట్విస్ట్) ఇదీ చదవండి: మస్క్ మామూలోడు కాదయ్యా..వీడియో వైరల్! ఇక ఆ రోబో కూడా? -
ఛార్జింగ్ సమస్యలకు చెక్.. శుభవార్త చెప్పిన కేంద్రం
హైదరాబాద్ : ఎలక్ట్రిక్ వాహనాలు కలిగిన భాగ్యనగర వాసులకు శుభవార్త. త్వరలో హైదరాబాద్ నగర వ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో యాభై వరకు ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. దీంతో ఇంటి దగ్గరే కాకుండా నగరంలో మరికొన్ని చోట్ల అత్యవసర పరిస్థితుల్లో ఎలక్ట్రిక్ వాహనాలను ఛార్జింగ్ చేసుకునే వెసులుబాటు కలగనుంది. 50 ఛార్జింగ్ స్టేషన్లు దేశవ్యాప్తంగా మొత్తం 350 ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లను ‘ఫేమ్’ ఫేజ్ 2లో భాగంగా నెలకొల్పబోతున్నట్టు పార్లమెంటు సమావేశాల్లో కేంద్రం మంత్రి కిషన్‌పాల్ గుర్జార్ తెలిపారు. దీనికి సంబంధించిన నివేదికను పార్లమెంటుకు సమర్పించారు. ఇందులో హైదరాబాద్‌లో 50 ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నట్టుగా తేలింది. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ (94), ఛండీగడ్ (48), జైపూర్ (49), బెంగళూరు (45), రాంచీ (29), లఖ్నౌ(1), గోవా (17), ఆగ్రా (10), షిమ్లా (7) ఉన్నాయి. ఫేమ్ ద్వారా రోజురోజుకి పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్‌కి తగ్గట్టుగా మౌలిక వసతులు కల్పించేందుకు కేంద్రం ఫేమ్ (ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్, ఈవీ) పేరుతో ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తోంది. 2015లో ఫేమ్ అమలులోకి రాగా ఇప్పటికే ఫేజ్ 1 పూర్తయ్యింది. తాజాగా ఫేజ్ 2లో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలకు పలు రాయితీలు అందిస్తోంది. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లను కేంద్ర ప్రభుత్వం నెలకొల్పనుంది. పెరుగుతున్న మార్కెట్ పెట్రోలు, డీజిల్ రేట్లు పెరిగిపోతున్నాయి. మరోవైపు ప్రభుత్వం ఈవీ సెగ్మెంట్‌కు భారీ రాయితీలు ప్రకటిస్తోంది. దీంతో క్రమంగా దేశంలో ఈవీ మార్కెట్ విస్తరిస్తోంది. వాహన తయారీ కంపెనీలు కొత్త మోడళ్లను మార్కెట్లోకి తెస్తున్నాయి. అయితే ఛార్జింగ్ స్టేషన్లు/ పాయింట్లదే ప్రధాన సమస్యగా ఉంది. ఇప్పుడు ఈ సమస్య కూడా తీరబోతుంది. -
అత్యుత్తమంగా ఎందుకు నడపడం లేదు: సుప్రీం
న్యూఢిల్లీ: విద్యా రంగానికి సరైన వసతులు కల్పించడంలో ఎందుకు విఫలమవుతున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ప్రాథమిక స్థాయిలో పాఠశాలలను ఎందుకు అత్యుత్తమంగా నడపలేకపోతున్నారని కేంద్రానికి సుప్రీం సూటిగా ప్రశ్నను సంధించింది. టాప్ మెడికల్ కాలేజీలు నడపగలుగుతున్న ప్రభుత్వం మెరుగైన ప్రాథమిక పాఠశాలలను ఎందుకు ఏర్పాటు చేయలేకపోతోందని సుప్రీం కోర్టు వ్యాఖ్యలు చేసింది. సుప్రీం కోర్టుకు ప్రశ్నలకు తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. -
రూ.1,350 కోట్లు పాయె!
కేంద్రం నుంచి రావాల్సిన నిధులకు గండి సాక్షి, హైదరాబాద్: మూడున్నరేళ్లు గడచినా ప్రభుత్వం మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించని కారణంగా... రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన రూ.1,350 కోట్లకు గండిపడింది! అధికారులు నివేదికలు పంపినా, సీఎం కిరణ్ లేఖలు రాసినా ఆ నిధుల్లో కేంద్రం నయాపైసా కూడా ఇవ్వనంటోంది. జాతీయ పట్టణ నవీకరణ పథకం కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ నిధులు రాష్ట్రానికి రావాల్సి ఉంది. వాస్తవానికి 2012తోనే ఈ పథకం కాల పరిమితి ముగిసింది. అయితే ఏడాదిపాటు పొడిగిస్తూ... ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయడానికి అవకాశం ఇచ్చింది. ట్రాన్సిషన్ పీరియడ్కుగాను బడ్జెట్లో మొత్తం రూ.14 వేల కోట్లు కేటాయించింది. ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి వివరాలతో కూడిన నివేదిక (డీపీఆర్)లు సమర్పించాలని, భూసేకరణ, వివిధ శాఖల అనుమతులు అన్ని ఉన్న ప్రాజెక్టులకు నిధులు ఇస్తామని వెల్లడించింది. దీంతో రాష్ట్ర పురపాలక శాఖలోని ప్రజారోగ్య ఇంజనీరింగ్ విభాగం అధికారులు 17 మున్సిపాలిటీల అధికారులతో సమన్వయం చేసుకుని మొత్తం రూ.1,350 కోట్ల విలువైన తాగునీటి ప్రాజెక్టు పనులను ప్రతిపాదించారు. పార్వతీపురం, నర్సీపట్నం, ఏలేశ్వరం, జంగారెడ్డిగూడెం, హుస్నాబాద్, హుజురాబాద్ తదితర మున్సిపాలిటీల్లో పనులు చేయాలని భావించి నివేదికలు సిద్ధం చేశారు. రాష్ట్ర స్థాయి కమిటీ సైతం ఈ పనులకు ఆమోద ముద్ర వేసింది. నివేదికలను అధికారులు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ పరిశీలన నిమిత్తం పంపించారు. జాతీయ పట్టణ నవీకరణ పథకంలో పేర్కొన్న సంస్కరణలన్నింటినీ అమలు చేసిన రాష్ట్రాల కన్నా ముందు వరుసలో ఉంది. అయితే 2010 సెప్టెంబర్‌లో మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో నిధులు విడుదల చేసేందుకు కేంద్రం నిరాకరిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి కేవలం 2 నెలలు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఇక ఈ నిధులు విడుదలయ్యే అవకాశం లేదని తెలుస్తోంది.