అత్యుత్తమంగా ఎందుకు నడపడం లేదు: సుప్రీం
న్యూఢిల్లీ: విద్యా రంగానికి సరైన వసతులు కల్పించడంలో ఎందుకు విఫలమవుతున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ప్రాథమిక స్థాయిలో పాఠశాలలను ఎందుకు అత్యుత్తమంగా నడపలేకపోతున్నారని కేంద్రానికి సుప్రీం సూటిగా ప్రశ్నను సంధించింది.
టాప్ మెడికల్ కాలేజీలు నడపగలుగుతున్న ప్రభుత్వం మెరుగైన ప్రాథమిక పాఠశాలలను ఎందుకు ఏర్పాటు చేయలేకపోతోందని సుప్రీం కోర్టు వ్యాఖ్యలు చేసింది. సుప్రీం కోర్టుకు ప్రశ్నలకు తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.