Primary Schools
-
కులగణన నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఒక్క పూటే బడులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను బుధవారం నుంచి ఒంటిపూట మాత్రమే నిర్వహిస్తారు. కులగణన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఎస్జీటీల సేవలను సర్వేకు ఉపయోగిస్తున్నందున, మధ్యాహ్నం నుంచి పాఠ శాలలను మూడు వారాల పాటు మధ్యాహ్నం ఒంటిగంట వరకూ నడపాలని పాఠశాల విద్య డైరెక్టరేట్ ఆదేశించింది. మధ్యాహ్న భోజనం తర్వాత విద్యార్థులను ఇళ్లకు పంపుతారు.టెట్ బులెటిన్ విడుదల రేపు సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ బులెటిన్‌ను ఈ నెల 7వ తేదీన విడుదల చేయనున్నట్టు పాఠశాల విద్య డైరెక్టరేట్ ఒక ప్రకటనలో తెలిపింది. వాస్తవానికి ఈ బులెటిన్‌ను మంగళవా రం విడుదల చేయాల్సి ఉంది. సాంకేతిక కారణాల వల్ల సాధ్యం కాలేదని పేర్కొంది.ఎంబీఏ సాయంకాలపు కోర్సుల ప్రవేశ పరీక్ష 17కు వాయిదా ఉస్మానియా యూనివర్సిటీ: ఈ నెల 9న జరగాల్సిన ఓయూ ఎంబీఏ సాయంకాలపు కోర్సుల ప్రవేశ పరీక్షను నవంబర్ 17కు వాయిదా వేశారు. వర్సిటీ క్యాంపస్‌లోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాలలో సాయంకాలపు కోర్సులైన ఎంబీఏ, ఎంబీఏ టెక్నాలజీ మేనేజ్మెంట్ (టీఎం) ప్రవేశ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఈ నెల 14 వరకు రూ.500 అపరాధ రుసముతో దరఖాస్తు చేసుకోవచ్చని పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి తెలిపారు.ముగిసిన వివిధ సెట్ల కౌన్సెలింగ్ ఉస్మానియా యూనివర్సిటీ: ఈ విద్యా సంవత్సరానికి వివిధ సెట్ల కౌన్సెలింగ్ పక్రియ ముగిసిందని కన్వీనర్ ప్రొఫెసర్ రమేశ్‌బాబు మంగళవారం తెలిపారు. పీజీ లాసెట్, లాసెట్–2024, పీజీఈసెట్–2024, ఎడ్‌సెట్– 2024, పీఈసెట్–2024 తదితర సెట్ల కౌన్సెలింగ్ ద్వారా సీట్లు భర్తీ చేసిన్నట్లు చెప్పారు. -
Tholimettu Program: ‘తొలిమెట్టు’తో కొత్త ఒరవడి
‘నేషనల్ అచీవ్మెంట్ సర్వే’ (నాస్) 2017 నవం బర్–2021 ఫలితాలు విద్యార్థులలో కనీస సామర్థ్యాలు కొరవడినట్టు తేల్చింది. భాషలో విద్యార్థులు సుమారు 70 శాతం మంది కనీస స్థాయి లేదా అంత కంటే తక్కువస్థాయి సామ ర్థ్యాన్ని కలిగి ఉన్నట్లు 2021 నాస్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. 2020 మార్చి నుండి రెండేళ్ల పాటు కరోనా కారణంగా విద్యారంగం అతలాకుతలం అయింది. దీనివలన తలెత్తిన అభ్యసనా సంక్షోభం విద్యాశాఖ ముందు అనేక సవాళ్లను మిగిల్చింది. పాఠశాల విద్యలో ప్రధానంగా ప్రాథమిక స్థాయిలో చోటు చేసుకున్న అభ్యసన సంక్షోభాన్ని నివారించి, తరగతి వారీగా భాష, గణితాల సామర్థ్యాలను సాధించడానికి ‘జాతీయ విద్యావిధానం–2020’ అమలులో భాగంగా దేశవ్యాప్తంగా ‘ఫండమెంటల్ లిటరసీ అండ్ న్యూమరసీ’ (ఎఫ్ఎల్ఎన్) కార్యక్రమానికి రూపకల్పన చేశారు. దీని ద్వారా ప్రాథమిక స్థాయిలో 11 ఏళ్ల లోపు ఉన్న 5 కోట్ల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని అంచనా. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రంలో ‘తొలి మెట్టు’ అనేపేరుతో 2022 ఆగస్టు 15 నుండి అమలు చేస్తున్నారు. ‘సెంట్రల్ స్క్వేర్ ఫౌండేషన్’ అనే స్వచ్ఛంద సంస్థ భాగస్వామ్యంతో ‘తొలిమెట్టు’ కార్యక్రమాన్ని నిర్వహించడానికి తెలంగాణ విద్యా శాఖ శ్రీకారం చుట్టింది. ఇందుకోసం రాష్ట్రంలోని 52 వేల మంది ఉపాధ్యాయులకు 3 విడతలలో శిక్షణ అందించారు. అందుకే ఈ కార్యక్రమాన్ని 2025 వరకు అమలు అయ్యే విధంగా రూపకల్పన చేశారు. దీనివల్ల రాష్ట్రంలో 11.24 లక్షల విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. ఈ కార్యక్రమం అమలులో భాగంగా ప్రతి తరగతి గదిలో మూడు ముఖ్యమైన విషయాలు చోటు చేసుకోవాలి. 1. తగిన పాఠ్య బోధన సోపానాలు వినియోగించుకుంటూ పీరియడ్ ప్రణాళికను అమలు చేయాలి. 2. అవసరమైన బోధనాభ్యసన సామగ్రితో అభ్యసన ప్రక్రియ కొనసాగాలి. 3. పాఠ్యపుస్తకాన్ని సమర్థంగా వినియోగించాలి. ‘తొలిమెట్టు’ కార్యక్రమం అమలులో భాగంగా ప్రతి తరగతి గదిలో విద్యార్థితో మాట్లాడించడం, కీలక పదాలను గుర్తింపచేయడం, పఠన కృత్యాలు నిర్వహించడం వంటివి నిర్వహించి అభ్యాసం కల్పించాలి. ఇందుకోసం రాష్ట్ర విద్యాపరిశోధనా శిక్షణాసంస్థ కృత్యపత్రాలను కూడా తయారు చేసి ఉపాధ్యాయులకు అందచేస్తుంది. వీటి సహకారంతో పాఠశాల విద్య పూర్తయ్యేసరికి విద్యార్థులంతా ఆయా సబ్జెక్టులలో నిర్దేశించిన సామర్థ్యాలలో అభ్య సన ఫలితాలను సాధించాలి. అప్పుడే గుణాత్మక విద్యను సాధించినట్లుగా భావిస్తారు. ‘తొలిమెట్టు’ కార్యక్రమాల అమలు పర్య వేక్షణ కోసం మండల స్థాయిలోనూ, పాఠశాల సముదాయ స్థాయిలోనూ... నోడల్ అధికారులనూ, విషయ నిపుణులనూ నియమించారు. వీరు పాఠశాలకు వెళ్లి తరగతి గదిలో బోధనను పరిశీలించి ఎక్కడికక్కడ అనుమాన నివృత్తి చేసి, సమీక్షలు నిర్వహిస్తూ ‘తొలిమెట్టు’ విజయవంతం కావడానికి ప్రయత్నం చేస్తారు. ఇంతవరకు బాగానే ఉన్నా తెలంగాణ రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలల్లో 50 మందికి పైగా విద్యార్థులు ఉన్నచోట కూడా 5 తరగతులకు ఒకరు లేదా ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే పని చేస్తున్నారు. మధ్యాహ్న భోజన నిర్వహణతో పాటు విద్యాశాఖకు ఎప్పటికప్పుడు పంపించవలసిన నివేదికలను నింపడంతోనే ఒకరికి బాధ్యతలు సరిపోతే మిగిలిన ఒక్కరితో బోధన సాధ్యమేనా? ఏలికలే ఆలోచించాలి. (క్లిక్ చేయండి: విన్నారా? ‘మెదడే’ ప్రమాదకరమట!) మొత్తం మీద జాతీయ విద్యావిధానం–2020 అమలుకు తొలిమెట్టు కార్యక్రమ ఉత్తమ ఫలితాలు అవసరం. తెలంగాణలో తొలిమెట్టు కార్యక్రమం ద్వారా తరగతి గదిలో మార్పు ఎంతవరకు సాధ్యం అనేది వేచి చూడాల్సిందే. (క్లిక్ చేయండి: ప్రాథమిక స్థాయిలో శిక్షణేదీ?) - డాక్టర్ సిద్ధాంతపు ప్రభాకరాచార్యులు సామాజిక విశ్లేషకులు -
తొలిమెట్టు.. తీసికట్టు!
సాక్షి, హైదరాబాద్: సర్కారు బడుల విద్యార్థుల్లో సామర్థ్యాలు పెంచే ‘తొలిమెట్టు’ అమలు కాగితాలకే పరిమితమైంది. కరోనా తీవ్రత నేపథ్యంలో వరుసగా రెండేళ్లు స్కూళ్ల మూత, ఆన్లైన్ బోధనలతో విద్యార్థుల సామర్థ్యాలు బాగా తగ్గాయి. ప్రైమరీ పాఠశాలల విద్యార్థులు బేసిక్స్ కూడా మరిచిపోవడంతో వారిని గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం తొలిమెట్టు కార్యక్రమాన్ని ప్రారంభించింది. జూలై చివరి నుంచి ఆగస్టు మొదటి వారం వరకు ప్రైమరీ స్కూల్ టీచర్లకు శిక్షణ ఇచ్చారు. సామర్థ్యాల పంపు ప్రక్రియ మాత్రం కనిపించడం లేదు. షెడ్యూలు ఇలా.. విద్యార్థులకు మౌలిక భాష, గణితంలో సామర్థ్యం పెరిగేలా బోధించడం కోసం తొలిమెట్టులో ప్రత్యేక కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. ప్రాథమిక పాఠశాలల్లో పిల్లలకు బేస్ లైన్ టెస్ట్‌లు నిర్వహించి అభ్యసన స్థాయిలను గుర్తించాలి. అనంతరం విద్యార్థుల స్థాయికి తగ్గట్టు బోధనా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఈ షెడ్యూలు ఇప్పటికే పూర్తి కావాల్సి ఉండగా.. కనీసం ప్రస్తావన కూడా లేకుండా పోయింది. నెలకోసారి పిల్లల ప్రగతిని నమోదు చేసి కాంప్లెక్స్ స్థాయిలో ప్రతి నెలా 26న టీచర్లతో, 28న మండలాలవారీగా, 30న జిల్లాలవారీగా సమీక్షలు జరగాలి. ఆచరణలో మాత్రం ఆ జాడ కనిపించడం లేదు. టీచర్ల కొరతతోనే.. సర్కారు స్కూళ్లల్లో టీచర్ల కొరత కారణంగానే తొలిమెట్టు సక్రమంగా అమలు కావడం లేదు. కరోనాకు ముందు విద్యా వలంటీర్లతో కొంత సర్దుబాటు జరిగినా...ఆ తర్వాత వలంటీర్లను రెన్యూవల్ చేయలేదు. దీంతో బోధన కుంటుపడుతోంది. పలు సబ్జెకుల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కనీసం పర్యవేక్షణకు ప్రధానోపాధ్యాయులు లేక ఇన్చార్జిలతో కొనసాగుతున్నాయి. వాస్తవంగా ఏళ్లుగా టీచర్ల ఖాళీలు భర్తీ లేక బోధనకు ఆటంకం కలుగుతోంది. నాలుగేళ్లుగా బదిలీలు, ఏడేళ్లుగా పదోన్నతులు, 17 ఏళ్లుగా పర్యవేక్షణ అధికారుల నియామకాలు జరగడం లేదని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. టీచర్ల భర్తీ ప్రక్రియ పూర్తయ్యే దాకా బోధనకు ఆటంకం కలగకుండా వలంటీర్లను నియమించాలని డిమాండ్ వ్యక్తమవుతోంది. (చదవండి: ఎన్ఐఏ విస్తృత తనిఖీలు) -
Omicron Outbreak: ఇప్పట్లో స్కూళ్లు తెరిచేదే లేదు!
భువనేశ్వర్: ఓ వైపు కరోనా భీభత్సం, మరోవైపు ఒమిక్రాన్ ఉధృతి వెరసి విద్యాసంస్థలు తెరవాలనే నిర్ణయానికి గండి పండింది. ఒడిశా రాష్ట్రంలో ప్రాధమిక పాఠశాలలను తెరవాలనే నిర్ణయం మరోమారు వాయిదా పడింది. ఈ ఏడాది జనవరి 3 నుంచి 1 నుంచి 5 తరగతులకు చెందిన పాఠశాలలను పునఃప్రారంభిస్తున్నట్లు ఒడిసా ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. కోవిడ్ వ్యాప్తి దృష్ట్యా అధికారులు వివిధ పాఠశాలలను సందర్శించిన అనంతరం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు విద్యాశాఖ మంత్రి ఎస్ఆర్ దాష్ తెలిపారు. ఐతే 6 నుంచి 10 తరగతుల పిల్లలు మాత్రం యథాతథంగా ఫిజికల్ క్లాసులకు హాజరుకావాలని చెప్పారు. కోవిడ్ ప్రొటోకాల్‌కు కట్టుబడి షెడ్యూల్ ప్రకారం ఆఫ్‌లైన్ పరీక్షలు కూడా నిర్వహిస్తామని మంత్రి పేర్కొన్నారు. ఆరోగ్య శాఖ బులెటన్ ప్రకారం గడచిన రెండు నెలల్లో కన్నా నిన్న ఒక్క రోజే 424 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యినట్లు ఆదివారం తెల్పింది. కొత్తగా కరోనా సోకిన పేషంట్లలో 18 ఏళ్ల కంటే తక్కువ వయసున్నవారు దాదాపు 67 మంది ఉన్నట్లు బులెటన్ తెల్పుతోంది. చదవండి: Covid Live Updates: కోటికి పైగా కోవిడ్ కేసులు నమోదైన ఆరో దేశంగా రికార్డు..! -
‘ఎయిడెడ్’ అప్పగింత స్వచ్ఛందమే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత ప్రభుత్వాల నిర్వాకం కారణంగా నిర్వీర్యమైన ఎయిడెడ్ విద్యా సంస్థల్లోని విద్యార్థులకు అత్యుత్తమ విద్య అందించేందుకు వీలుగా ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలకు అత్యధికుల నుంచి మద్దతు లభిస్తోంది. వాస్తవానికి అత్యధిక శాతం సంస్థలు పూర్తిగా అధ్వాన ప్రమాణాలతో కునారిల్లాయి. వీటిలో చదివే విద్యార్థులకు కనీస సదుపాయాలు లేవు. టీచర్లు, అధ్యాపకులు లేక సరైన బోధన కూడా అందడం లేదు. ఈ నేపథ్యంలో ఆయా సంస్థల యాజమాన్యాలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అప్పగించే విద్యా సంస్థలను ప్రభుత్వ పరంగా అభివృద్ధి చేసి విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలన్నది లక్ష్యం. అయితే తెలుగుదేశం, కొన్ని విపక్ష పార్టీలు ఈ విషయాన్ని వక్రీకరిస్తూ విద్యార్థులను, తల్లిదండ్రులను రెచ్చగొడుతుండటం వెనుక వారి రాజకీయ స్వార్థమే తప్ప మరేమీ లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. నిపుణుల కమిటీ నివేదిక మేరకే.. ► ఎయిడెడ్ విద్యా సంస్థల విషయంలో ప్రభుత్వం ఎక్కడా ఏకపక్షంగా ముందుకు వెళ్లలేదు. ప్రభుత్వం ఈ విద్యా సంస్థలపై అధ్యయనానికి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ప్రొఫెసర్ రత్నకుమారి నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. ► ప్రొఫెసర్ డబ్ల్యూ రాజేంద్ర, ప్రొఫెసర్ గొల్ల జ్ఞానమణి, సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ కె.వెట్రిసెల్వి, పాఠశాల విద్య, ఇంటర్ విద్య, కాలేజీ విద్య కమిషనర్లను సభ్యులుగా కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ క్షుణ్ణంగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందించింది. ► ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు పెద్ద ఎత్తున కొత్త కోర్సులతో అందుబాటులోకి వచ్చినందున ఎయిడెడ్ విద్యా సంస్థల్లో విద్యార్థుల చేరికలు బాగా తగ్గిపోయాయి. 400కు పైగా ఎయిడెడ్ స్కూళ్లలో ఒక్క విద్యార్థీ లేడంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ► ఇదే సమయంలో సీఎం వైఎస్ జగన్ నాడు–నేడు ద్వారా ప్రభుత్వ విద్యా సంస్థల్లో అన్ని వసతులు కల్పిస్తున్నారు. జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యాకానుక వంటి పథకాల ద్వారా విద్యార్థులకు ఎంతగానో మేలు జరుగుతోంది. ► ఎయిడెడ్ విద్యా సంస్థలపై ప్రభుత్వం ఏటా రూ.1,226.01 కోట్లు వెచ్చిస్తోంది. ఈ నేపథ్యంలో ఎయిడెడ్ విద్యా సంస్థలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్‌ను కొనసాగించనవసరం లేదని నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. ఈ సూచనల మేరకు ప్రభుత్వం అన్ని వివరాలతో సమగ్రంగా ఒక జీవో జారీ చేసింది. ఇలా చేయడం ఏ విధంగా తప్పవుతుంది? ► ప్రభుత్వ గ్రాంట్ పొందుతున్నందున నిబంధనల మేరకు విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలి. ఆయా సంస్థలను దాతలు ఏ లక్ష్యం మేరకు ఏర్పాటు చేశారో ఆ లక్ష్యం కోసమే సంస్థల ఆస్తులను వినియోగించాలి. ► నిబంధనల మేరకు నడపలేకపోతే తమ సంస్థ కమిటీ అభీష్టం మేరకు సంస్థలను పూర్తిగా ప్రభుత్వానికి అప్పగించవచ్చు. లేదా సంస్థలోని ఎయిడెడ్ సిబ్బందిని మాత్రమే ప్రభుత్వానికి అప్పగించి, పూర్తి స్థాయి ప్రయివేటు విద్యా సంస్థగా కొనసాగవచ్చు. లేదా ప్రభుత్వ నిబంధనల మేరకు యధాతథంగా కొనసాగవచ్చు. విద్యా సంస్థలు, అధ్యాపకుల అంగీకారం ► రాష్ట్రంలో 2,249 ఎయిడెడ్ విద్యా సంస్థలుండగా అందులో 1,446 సంస్థలు సిబ్బందిని అప్పగించేందుకు అంగీకరించాయి. 101 సంస్థలు ఆస్తులతో సహా ప్రభుత్వ పరిధిలో చేర్చేందుకు సుముఖత వ్యక్తపరిచాయి. 702 సంస్థలు అంగీకారం చెప్పకుండా యధాతథంగా కొనసాగేందుకు నిర్ణయించుకున్నాయి. ► సిబ్బంది కూడా ప్రభుత్వంలో కలవడం ద్వారా ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు మాదిరిగానే తమకు అన్ని సదుపాయాలు అమలవుతాయని విలీనానికి ముందుకు వచ్చారు. ► విలీనానికి ఆప్షన్లు ఇచ్చిన సంస్థలు తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని భావిస్తే దానికీ ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందని సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే స్పష్టం చేశారు. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు ► ఎయిడెడ్ సంస్థలు, సిబ్బంది విలీన ప్రక్రియలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ముందు నుంచి పగడ్బందీ ఏర్పాట్లు చేపట్టింది. ఆయా సంస్థలకు కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలను మ్యాపింగ్ చేసి వారిని అందులో చేర్చేలా ప్రతి స్కూలుకూ ఇన్‌చార్జ్‌లను నియమించింది. ► ఒకవేళ నిర్ణీత దూరంలో ప్రభుత్వ స్కూలు అందుబాటులో లేకుంటే ఆ ఎయిడెడ్ స్కూలు భవనంలోనే ప్రభుత్వ పరంగా పాఠశాల ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చారు. అందుకు అవకాశం లేని చోట భవనాలను అద్దెకు తీసుకొని పాఠశాల నెలకొల్పేలా ఏర్పాట్లు చేశారు. ఆ మేరకు విద్యార్థుల చేరికలూ సాఫీగా సాగేలా చేశారు. తల్లిదండ్రులను సంప్రదించి వారికి నచ్చిన స్కూలులో పిల్లలను చేర్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఫీజుల భారం లేనే లేదు ► ఎయిడెడ్ విద్యా సంస్థలు, సిబ్బంది ప్రభుత్వంలో విలీనంతో ఫీజులు పెరుగుతాయని తెలుగుదేశం, ఇతర పార్టీలు చేస్తున్న వాదన కేవలం దుష్ప్రచారమే. ఎయిడెడ్ విద్యా సంస్థలు ప్రైవేటు విద్యా సంస్థలుగా కొనసాగినా, అవి ఇష్టానుసారం ఫీజులు పెంచేందుకు వీలులేదు. ► పలు ఎయిడెడ్ విద్యా సంస్థల్లో ఎయిడెడ్ సెక్షన్లతో పాటు అన్ ఎయిడెడ్ సెక్షన్లు కూడా ప్రస్తుతం కొనసాగుతున్నాయి. అన్ ఎయిడెడ్ సెక్షన్ల కోర్సుల ఫీజులను ప్రైవేటు విద్యా సంస్థలకు మాదిరిగానే రాష్ట్ర ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ప్రతి మూడేళ్లకు ఒకసారి నిర్ణయిస్తుంది. ► ప్రస్తుతం 2020–21 నుంచి 2022–23 వరకు ఫీజులు ఖరారయ్యాయి. ఈ ఫీజులకు మించి ఏ విద్యా సంస్థ కూడా అదనంగా వసూలు చేయడానికి వీల్లేదు. ఈ ఫీజుల భారం కూడా విద్యార్థులపై పడకుండా ప్రభుత్వమే వాటిని జగనన్న విద్యాదీవెన కింద పూర్తిగా రీయింబర్స్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఫీజుల భారం అనే ప్రసక్తే ఎక్కడా ఉండదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ► వాస్తవానికి ఎయిడెడ్ విద్యా సంస్థలను పూర్తిగా నిర్లక్ష్యం చేసి వాటిని నిర్వీర్యం చేసింది చంద్రబాబునాయుడే. ఈ విద్యా సంస్థల్లో ఎలాంటి నియామకాలూ చేపట్టడానికి వీల్లేకుండా ఖాళీల భర్తీని తిరస్కరిస్తూ 1999 డిసెంబర్ 17వ తేదీన ఆయన ఉత్తర్వులు జారీ చేయించారు. ఆ తర్వాత 2004, 2017లోనూ అవే ఆదేశాలు జారీ చేయించారు. ఇది చంద్రబాబు నిర్వాకమే ఎయిడెడ్ వ్యవస్థ కుప్పకూలడానికి గతంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలే కారణం. నియామకాలు నిలిపివేయించారు. ఇతర సదుపాయాలకు ఇచ్చే నిధులను ఆపేశారు. తనకు సంబంధించిన నారాయణ తదితర కార్పొరేట్ విద్యా సంస్థలను ప్రోత్సహించేలా నిర్ణయాలు తీసుకున్నారు. ఫలితంగా ఎయిడెడ్‌లో టీచర్లు లేక విద్యార్థుల చేరికలూ తగ్గిపోయాయి. – శివశంకర్, విద్యావేత్త ఎక్కడ బలవంతం ఉంది? ప్రభుత్వం మా విద్యా సంస్థల విలీనానికి ఎక్కడా ఒత్తిడి చేయలేదు. ఉన్నత ప్రమాణాలతో కొనసాగిస్తామనుకుంటే మీరే నిర్వహించుకోండి.. లేదంటే ప్రభుత్వానికి అప్పగిస్తే అభివృద్ధి చేసి ఉత్తమ విద్యను విద్యార్థులకు అందిస్తామని చెబుతోంది. ఇందులో ఎక్కడ బలవంతం ఉంది? మేమే ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాం. యాజమాన్యాలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇచ్చినవే విలీనం అవుతున్నాయి. సిబ్బందిని అప్పగించినా విద్యార్థులపై ఫీజుల భారం పడదు. ఆ ఫీజులను ప్రభుత్వమే రీయింబర్స్ చేస్తుంది. ప్రభుత్వ నిర్ణయం బాగుండబట్టే సిబ్బందంతా ఆప్షన్లు ఇచ్చారు. – రత్నకుమార్, రాష్ట్ర ఎయిడెడ్ విద్యా సంస్థల అసోసియేషన్ అధ్యక్షుడు విద్యార్థులకు ఎంతో మేలు ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. ప్రస్తుతం ఎయిడెడ్‌లో సరైన బోధన చేసేందుకు తగినంత సిబ్బంది లేరు. ప్రభుత్వ సంస్థల్లో మెరుగైన బోధన జరుగుతోంది కనుక విద్యార్థులకు మేలు జరుగుతుంది. ఎయిడెడ్ అధ్యాపకులుగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం. ప్రభుత్వంలో చేరడం ద్వారా ఆ సమస్యలు తీరుతాయి. ప్రభుత్వ విద్యా సంస్థలూ మరింత బలోపేతమై విద్యార్థులకు మంచి విద్య అందుతుంది. – త్రివిక్రమరెడ్డి, ఏపీ ఎయిడెడ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు -
AP: చిన్నారుల బంగారు భవితకు బాటలు
సాక్షి, అమరావతి: చిన్నారుల బంగారు భవితకు బాటలు వేసేలా.. వారికి సంపూర్ణ పోషణ, సమగ్ర విద్య అందించేలా ఫౌండేషన్ పాఠశాలల ఏర్పాటుకు కసరత్తు మొదలైంది. రాష్ట్రంలో కొత్త విద్యా విధానానికి శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ ఫౌండేషన్ పాఠశాలల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలు బడిబాట పట్టనున్నాయి. ప్రాథమిక పాఠశాలల ఆవరణలోనే అదనపు తరగతి గదులు నిర్మించి వాటిలోకి అంగన్వాడీ కేంద్రాలను తరలించనున్నారు. వీటిని ఫౌండేషన్ పాఠశాలలుగా నిర్వహించనున్నారు. తొలి దశలో 5,664 అంగన్వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశాలల్లో కలపనున్నారు. ఇందుకోసం 3,824 ప్రాథమిక పాఠశాలల ఆవరణలో 6,692 అదనపు తరగతి గదులను నిర్మించనున్నారు. వీటివల్ల రాష్ట్రవ్యాప్తంగా మూడు నుంచి ఆరేళ్లలోపు ఉన్న 1,20,165 మంది చిన్నారుల విద్యకు బలమైన పునాది పడనుంది. తొలిదశలో చేపట్టే తరగతి గదుల నిర్మాణాన్ని 2021–2022 మధ్యలో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. ఒక్కో తరగతి గది నిర్మాణానికి రూ.10 లక్షలు చొప్పున మొత్తం రూ.669.20 కోట్లు ఖర్చు చేయనుంది. భవితకు బలమైన పునాది బాలల భవితకు బలమైన పునాది వేసేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యా విధానంలో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే అంగన్వాడీ కేంద్రాలను సమీపంలోని ప్రాథమిక పాఠశాలల్లో కలిపి ఫౌండేషన్ స్కూళ్లుగా వాటిని మార్పు చేస్తున్నారు. తొలి దశలో 5,664 అంగన్వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశాలల్లో కలపనున్నాం. అంగన్వాడీ కేంద్రాల తరహాలోనే ఫౌండేషన్ పాఠశాలలు బాలలకు అన్ని సౌకర్యాలు, మంచి విద్య అందిస్తాయి. అంగన్వాడీల్లో అందించే సంపూర్ణ పోషణ పథకాన్ని ఫౌండేషన్ పాఠశాలల్లోనూ అమలు చేస్తాం. ఆటపాటలతోపాటు బలమైన ఆహారం, ఆరోగ్యం, విద్యకు కేంద్రంగా ఇవి ఉంటాయి. – కృతికా శుక్లా, రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ సంచాలకులు -
ఎయి‘డెడ్’తో రాజకీయాలా?
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వాల తప్పిదాలు, యాజమాన్యాల స్వప్రయోజనాలతో రాష్ట్రంలోని ఎయిడెడ్ విద్యా సంస్థలు పూర్తిగా గాడి తప్పాయి. 95 శాతానికిపైగా ఈ సంస్థల్లో కనీస బోధనాభ్యసన కార్యక్రమాలు కూడా సరిగా జరగడం లేదు. అనేక స్కూళ్లలో చేరికలు నిలిచి పోవడంతో మూతపడ్డాయి. మరికొన్నింటిలో చేరికలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. విద్యార్థులు లేనందున పలు చోట్ల ప్రభుత్వ వేతనాలు పొందుతున్న వేలాది మంది ఉపాధ్యాయులు బోధన మానేసి సొంత పనుల్లో ఉంటున్నారు. వీరిలో 90% మంది స్కూళ్లకు సరిగా హాజరు కావడం లేదు. ప్రభుత్వ నిబంధనలను, సంస్థ విద్యా కార్యకలాపాలను యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. దశాబ్దాలుగా ఇదే తంతు ఉండడంతో ఈ సంస్థలన్నీ నిర్వీర్యమయ్యాయి. దాతలు ఏ ఉద్దేశంతో ఈ విద్యా సంస్థలను ఏర్పాటు చేశారో ఆ లక్ష్యాలను యాజమాన్యాలు విస్మరించాయి. సంస్థల ఆస్తులు, నిధులను తమ వ్యక్తిగత ప్రయోజనాలకు వినియోగించుకోవడంపైనే దృష్టి సారించాయి. ఇవీ వాస్తవాలు.. ► బ్రిటిష్ పాలనా కాలంలో ఎయిడెడ్ విద్యా వ్యవస్థ ప్రారంభమైంది. దాతలు తమ సొంత ఆస్తులు, నిధులు దానంగా ఇచ్చి విద్యా సంస్థలను ఏర్పాటు చేయించారు. కాలక్రమంలో ఈ సంస్థల్లోని టీచర్లకు ప్రభుత్వం తరఫున వేతనాలు అందించడంతో పాటు ఇతర కార్యక్రమాలకు ఆర్థిక సాయం చేస్తూ వచ్చింది. ► విద్యా హక్కు చట్టం వచ్చాక ప్రతి కిలోమీటర్‌కు ఒక ప్రాథమిక పాఠశాల, 3 కిలోమీటర్లకు ప్రాథమికోన్నత పాఠశాల, 5 కిలోమీటర్లకు హైస్కూలు.. జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ► ప్రభుత్వ స్కూళ్లలో అన్ని అర్హతలతో కూడిన టీచర్లతో బోధన, ఇతర సదుపాయాలతో పాటు పలు పథకాల కింద ఆర్థిక సాయం విద్యార్థులకు అందుతోంది. ఈ నేపథ్యంలో ఎయిడెడ్ విద్యా సంస్థల్లో చేరికలు చాలా వరకు తగ్గిపోయాయి. దీంతో ఈ విద్యా సంస్థల యాజమాన్యాలు వాటిని తమ వ్యక్తిగత స్వార్థానికి వినియోగించుకుంటున్నాయి. ► నియామకాల్లో యాజమాన్యాలు ఇష్టానుసారం వ్యవహరించి డబ్బులిచ్చిన వారిని నియమించడంతో ప్రమాణాలు పూర్తిగా పడిపోయాయి. ► ప్రభుత్వ అనుమతులు లేకుండానే సిబ్బందిని నియమించుకుని, ఆ తర్వాత వారిని రెగ్యులర్ చేసేలా పైరవీలు చేస్తున్నాయి. ఈ సంస్థల్లో సిబ్బందికి, ఇతర కార్యకలాపాలకు ప్రభుత్వం ఏటా కోట్లాది రూపాయలు వెచ్చిస్తోంది. ► ఎయిడెడ్ సంస్థల్లో సిబ్బంది ఉన్నప్పటికీ పిల్లలు ఉండడం లేదు. దీంతో ఆ సిబ్బందిని అవసరమైన చోట వినియోగించుకోవాలని ప్రభుత్వం ఆలోచించినా, యాజమాన్యాలు అంగీకరించడం లేదు. ఈ తరుణంలో ఈ సంస్థల్లో నియామకాలు, క్రమబద్ధీకరణలు ప్రభుత్వంపై విపరీత భారాన్ని మోపేవిగా మారాయి. ► అమ్మ ఒడి, జగనన్న విద్యా కానుక, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాల ద్వారా పేద విద్యార్థులను ప్రభుత్వం ఆదుకొంటోంది. నాడు–నేడు కింద ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలను మెరుగు పరుస్తోంది. దీంతో ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థుల చేరికలు బాగా పెరగడంతో అక్కడ ఉపాధ్యాయుల అవసరం ఏర్పడుతోంది. ప్రభుత్వంలోకి తీసుకున్న విద్యా సంస్థల్లోని విద్యార్థులకూ అన్ని పథకాలను వర్తింప చేస్తుంది. ► రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్లు 44,639 ఉన్నాయి. వీటిలో ప్రాథమిక పాఠశాలలు 33,774, ప్రాథమికోన్నత పాఠశాలలు 4,198, ఉన్నత పాఠశాలలు 6,667 ఉన్నాయి. ఎయిడెడ్ స్కూళ్లు మొత్తం 2,001 ఉన్నాయి. వీటిలో ప్రైమరీ 1,301, అప్పర్ ప్రైమరీ 258, హైస్కూళ్లు 442 ఉన్నాయి. ► రాష్ట్రంలో చేరికలు లేక 482 ఎయిడెడ్ స్కూళ్లు మూత పడ్డాయి. వీటిలో 262 సంస్థలు ప్రభుత్వానికి అప్పగించేందుకు అంగీకరించాయి. నిర్వహణలో ఉన్న 1,988 స్కూళ్లలో 1,302 స్కూళ్లు కూడా ప్రభుత్వంలో విలీనానికి అంగీకరించాయి. వీటిలో 1,127 సంస్థలను ప్రభుత్వంలోకి తీసుకుంటూ ఉత్తర్వులు కూడా ఇచ్చారు. 686 సంస్థలు సమ్మతి తెలపలేదు. సిబ్బంది, విద్యార్థుల కోసం ఇలా.. ► విద్యార్థులను వారి తల్లిదండ్రుల అభీష్టం మేరకు వారు కోరుకునే సమీపంలోని మరో పాఠశాలలో చేర్చించేలా రీజనల్ జాయింట్ డైరెక్టర్లు, డీఈవోలు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ పథకాలన్నీ వర్తించేలా ఏర్పాట్లు చేయాలని చెప్పింది. ► టీచర్లను వారి సీనియార్టీని అనుసరించి ఇతర స్కూళ్లలో నియమించేలా కౌన్సెలింగ్ షెడ్యూలు ఇచ్చింది. నవంబర్7వ తేదీలోగా వీరి నియామకాలు పూర్తి చేయనున్నారు. ► ఎయిడెడ్ సిబ్బంది ప్రభుత్వంలో విలీనమయ్యాక వారి సేవలను అవసరమైన ఇతర విద్యా సంస్థల్లో వినియోగించుకోనుంది. ఆయా సంస్థలు, అందులోని తాత్కాలిక అన్ఎయిడెడ్ సిబ్బందికీ చట్ట నిబంధనల ప్రకారం ఔట్సోర్సింగ్ విధానం మేరకు వేతనాలు చెల్లిస్తారు. ఇందుకు ప్రభుత్వంపై రూ.95 కోట్ల వరకు భారం పడనుంది. ఎయిడెడ్ డిగ్రీ కాలేజీల్లో ఇదీ పరిస్థితి ► రాష్ట్రంలో ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలు 137 ఉన్నాయి. డిగ్రీ కాలేజీల్లో 4 ఎండోమెంట్(రిలిజియస్) డిపార్టుమెంటు పరిధిలోవి కాగా 16 మైనార్టీ స్టేటస్‌తో ఉన్నాయి. డిగ్రీ కాలేజీల్లో ఎయిడెడ్ కోర్సులతో పాటు అన్ఎయిడెడ్ కోర్సులను నిర్వహిస్తున్నారు. ఈ విద్యా సంస్థల్లో సరైన చేరికలు ఉండడం లేదు. 7 డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు సిబ్బందితో పాటు వాటికి సంబంధించిన ఆస్తులు ఇస్తామని రాత పూర్వకంగా తెలిపాయి. 124 డిగ్రీ కాలేజీలు స్టాఫ్‌ను మాత్రమే సరెండర్ చేస్తామని, ఆస్తులను తామే ఉంచుకుని ప్రైవేటు కళాశాలలుగా నడుపుకుంటామని తెలిపాయి. ► డిగ్రీ కాలేజీల్లోని ఎయిడెడ్ కోర్సుల్లో 1,02,234 సీట్లుంటే 51,085 మంది, అన్ఎయిడెడ్ కోర్సుల్లో లక్షకు పైగా సీట్లుంటే అందులో సగం మంది మాత్రమే చేరారు. కొన్ని ప్రముఖ కాలేజీల్లో తప్ప తక్కిన వాటిల్లో 30% కూడా సీట్లు నిండడం లేదు. ► 32 ఎయిడెడ్ డిగ్రీ కాలేజీల్లో చేరికలు 30 శాతం కన్నా తక్కువగా ఉన్నాయి. 33 కాలేజీల్లో చేరికలు 50 శాతానికన్నా తక్కువగా ఉన్నాయి. కొన్ని చోట్ల పది శాతం విద్యార్థులు కూడా లేరు. ఈ సంస్థల్లో ఎయిడెడ్ విభాగాల్లో బోధనా సిబ్బంది 1,303 మంది, బోధనేతర సిబ్బంది 1,422 మంది ఉన్నారు. అన్ఎయిడెడ్ కోర్సులకు సంబంధించి 1,621 మంది బోధనా సిబ్బంది, 909 మంది బోధనేతర సిబ్బంది ఉన్నారు. ► 122 ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లోని 5 జూనియర్ కాలేజీలు.. ఆస్తులతో, 103 కాలేజీలు కేవలం సిబ్బందిని ఇస్తామని తెలిపాయి. ► ఎయిడెడ్ పాఠశాలల్లో 2.60 లక్షల మంది విద్యార్థులు.. 6,900 మంది బోధన, బోధనేతర సిబ్బంది ఉన్నారు. జూనియర్ కాలేజీల్లో 40 వేల మంది విద్యార్థులు ఉన్నారు. 10 కాలేజీలు మూత రాజమండ్రిలోని ఏవైఎస్ కాలేజ్, పాలకొల్లులోని ఎస్కేఆర్ఎస్ ఓరియంటల్కాలేజ్, గుడ్లవల్లేరులోని ఎస్సీఎస్కాలేజ్, గుంటూరులోని ఎస్జీహెచ్ఆర్, ఎంసీఎంఆర్ కాలేజ్, నరసారావుపేటలోని ఎన్బీటీ, ఎన్వీసీ కాలేజ్, తెనాలిలోని కేఎల్ఎన్సంస్కృత కళాశాల, పొన్నూరులోని ఎస్బీఎస్సంస్కృత కళాశాల, గుంటూరులోని డా.కేవీకే సంస్కృత కళాశాల, ఎస్జీకే ఓరియంటల్ కాలేజ్‌లు మూత పడ్డాయి. ఇలా చేయడం మేలేగా.. ► ఈ నేపథ్యంలో ఎయిడెడ్ విద్యా సంస్థల పరిస్థితిపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ 6వ తేదీన పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ రత్నకుమారి నేతృత్వంలో ఎనిమిది మంది నిపుణులతో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. ► అన్ని విధాలా నిర్వీర్యమైన ఈ సంస్థలకు ప్రభుత్వ ఆర్థిక సాయం కొనసాగించాల్సిన అవసరం లేదని ఈ కమిటీ తేల్చి చెప్పింది. ఈ విషయమై ప్రభుత్వం తొలుత ఆయా సంస్థల యాజమాన్యాలు, సిబ్బందితో చర్చించింది. ► ప్రభుత్వానికి ఆయా ఎయిడెడ్ సంస్థలను అప్పగించే విషయంలో నిర్ణయాన్ని యాజమాన్యాల అభీష్టానికే ప్రభుత్వం వదిలేసింది. ప్రభుత్వానికి అప్పగించని సంస్థలు నియమ నిబంధనల మేరకు మాత్రమే వాటిని నడుపుకోవాలి. ప్రతిపక్షాల దుష్ప్రచారం రాష్ట్రంలో ఎయిడెడ్ విద్యా సంస్థల పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే టీడీపీ సహా కొన్ని రాజకీయ పక్షాలు వాస్తవాలను వక్రీకరిస్తూ రాజకీయం చేస్తున్నాయని తల్లిదండ్రులు, ఎయిడెడ్ సిబ్బంది నుంచే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకటి రెండు చోట్ల విద్యార్థులను రోడ్లపైకి తెస్తూ ఆందోళనలు చేపట్టడం వెనుక వారి స్వార్థ రాజకీయ ప్రయోజనాలే తప్ప మరేమీ లేవని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ నిర్వాకం కారణంగా ఏకంగా 300 వరకు కోర్టు ధిక్కార కేసులు నమోదవ్వగా వాటిని ప్రస్తుత ప్రభుత్వంలోని అధికారులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ విషయాలన్నింటినీ టీడీపీ విస్మరించి ప్రస్తుతం దుష్ప్రచారం చేస్తుండటం గమనార్హం. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం రాష్ట్రంలోని ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలను ప్రభుత్వ పరిధిలోకి తీసుకోవడాన్ని ఏపీ ఎయిడెడ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఇప్పటికే స్వాగతించింది. పూర్తి స్థాయి వేతనాలు పొందుతున్నా వివిధ కారణాల వల్ల సంపూర్ణంగా న్యాయం చేయలేకపోతున్నాం. ప్రభుత్వంలో ఎయిడెడ్ కాలేజీలను విలీనం చేయడం వల్ల మేమంతా బాధ్యతాయుతంగా పని చేస్తాం. ఎక్కడ అవసరమో అక్కడ మా విధులు నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది కనుక విద్యార్థులకూ మేలు జరుగుతుంది. – కనపర్తి త్రివిక్రమరెడ్డి, ఏపీ ఎయిడెడ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఎయిడెడ్‌పై శ్వేతపత్రం విడుదలకు సిద్ధం ఎయిడెడ్ విద్యా వ్యవస్థపై శాస్త్రీయంగా అధ్యయనం చేయించి మంచి విద్యా ప్రమాణాలను అందించాలన్న ఆలోచనలతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై కొన్ని మాధ్యమాలను అడ్డం పెట్టుకొని ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయి. ఎయిడెడ్ ఆస్తులు ఇప్పటికే దుర్వినియోగం అయ్యాయి. వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. వాటిని దాతలు ఏ లక్ష్యంతో ఇచ్చారో దానికే వాడాలని ప్రభుత్వం జీఓ ఇచ్చింది. ఎయిడెడ్ విద్యా సంస్థలపై శ్వేతపత్రం ఇస్తాం. – ఆదిమూలపు సురేష్, విద్యా శాఖ మంత్రి అన్ని సబ్జెక్టులకు ఉపాధ్యాయులు లేరు ప్రస్తుతం ఎయిడెడ్ పాఠశాలల్లో అన్ని సబ్జెక్టులకు సబ్జెక్టు నిపుణులు లేరు. అందువల్ల మేము అందరిలా సబ్జెక్టుల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించలేకపోతున్నాం. ఎన్టీఎస్ఈ, ఎన్ఎమ్ఎమ్ఎస్ వంటి జాతీయ స్థాయి పరీక్షల్లో ర్యాంకులు సాధించలేకపోతున్నాం. ఎయిడెడ్ పాఠశాలలను ప్రభుత్వంలో వీలీనం చేస్తే అన్ని సబ్జెక్టులకు ఉపాధ్యాయులు వస్తారు. మేమ అన్ని పోటీ పరీక్షల్లోను సత్తా చాటుతాం. – ఎస్.వీరదుర్గ, పదో తరగతి, గిల్డ్ ఆఫ్ సర్వీస్ పాఠశాల, కాకినాడ, తూర్పుగోదావరి -
ప్రైమరీ టీచర్లకు బ్రిడ్జి కోర్సు తప్పనిసరి
సాక్షి, అమరావతి: బీఈడీ, ఎంఈడీ చేసి ప్రైమరీ స్కూళ్లలో (1–5 తరగతులు) టీచర్లు (ఎస్జీటీ)గా చేరే వారు ఇకపై 6 నెలల బ్రిడ్జి కోర్సును తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. సర్వీసులో చేరిన తర్వాత రెండేళ్లలో ఈ కోర్సులో ఉత్తీర్ణులు కావల్సి ఉంటుంది. ఈ మేరకు నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) నూతన మార్గదర్శకాలను ఇటీవల జారీ చేసింది. ప్రైమరీ స్కూల్ టీచర్ (సెకండరీ గ్రేడ్ టీచర్లు–ఎస్జీటీ) పోస్టులకు ఎలిమెంటరీ టీచర్ ట్రైనింగ్ (డీఎడ్, డీఎల్ఈడీ) పాసయిన వారిని మాత్రమే గతంలో అనుమతించేవారు. బీఈడీ, ఎంఈడీ చేసిన వారు కేవలం స్కూల్ అసిస్టెంటు పోస్టులకు మాత్రమే అర్హులుగా ఉండేవారు. అయితే సుప్రీంకోర్టు సూచనల మేరకు ఎన్సీటీఈ ఈ నిబంధనను కొద్దికాలం కిందట మార్పు చేసింది. బీఈడీ, ఎంఈడీ చేసిన వారు కూడా ఎలిమెంటరీ టీచర్ పోస్టులకు అర్హులుగా ప్రకటించింది. మన రాష్ట్రంలో టెట్ నిర్వహణలో ఎస్జీటీ పోస్టులకు పేపర్–1ను, స్కూల్ అసిస్టెంటు పోస్టులకు పేపర్–2ను వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. ఎన్సీటీఈ నిబంధనలు మార్చిన అనంతరం ఎస్జీటీ పోస్టులకు దరఖాస్తు చేసే బీఈడీ, ఎంఈడీ అభ్యర్థులకు పేపర్–1ను తప్పనిసరి చేసింది. ఇలా పేపర్–1ను రాసి ఎస్జీటీ పోస్టులకు ఎంపికయ్యే బీఈడీ, ఎంఈడీ అభ్యర్థులు సర్వీసులో చేరిన అనంతరం బ్రిడ్జి కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు పాఠాలు చెప్పే టీచర్ పోస్టులకు కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేట్ డిగ్రీ, ఒక ఏడాది బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ శిక్షణ, లేదా 55 శాతం మార్కులతో పోస్టు గ్రాడ్యుయేషన్, మూడేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ, ఎంఈడీలు చేసి ఉండాలని ఎన్సీటీఈ పేర్కొంది. ఈ అర్హతలున్న వారు ఆయా రాష్ట్రాల్లో టీచర్ ఎలిజిబులిటీ టెస్టు (టెట్), లేదా సెంట్రల్ టీచర్ ఎలిజిబులిటీ టెస్టు (సీటీఈటీ)లలో అర్హత సాధించాల్సి ఉంటుంది. వీటిలో ఒక సారి అర్హత సాధిస్తే ఆ సర్టిఫికెట్‌కు జీవితకాల పరిమితి ఉంటుంది. -
ప్రాథమిక పాఠశాలల్లో సీబీఎస్ఈ
సాక్షి, అమరావతి: రాష్ట్ర విద్యారంగంలో సమూల సంస్కరణలకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం‘మన బడి–నాడు నేడు’ కింద పాఠశాలల్లో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. పాఠశాలలను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతూ.. సంస్కరణలు సత్ఫలితాలిచ్చేలా కార్యాచరణ దిశగా అడుగులేస్తోంది. పాఠశాల విద్యలో దశల వారీగా సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఆ పద్ధతుల్లో బోధన చేసేలా ఉపాధ్యాయులనూ సిద్ధం చేయిస్తోంది. ఇందులో భాగంగా విద్యార్థులలో అత్యున్నత ప్రమాణాలతో కూడిన సామర్థ్యాలను మెరుగుపర్చేలా సీబీఎస్ఈ పాఠ్యాంశాల బోధనపై ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు సీబీఎస్ఈ బోధన కొనసాగించడంతో పాటు మూల్యాంకన రీతులను అనుసరించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. సీమ్యాచ్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలు ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు నిరంతర వృత్తిపరమైన అభివృద్ధిలో భాగంగా ‘స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్ అండ్ ట్రైనింగ్’ (సీమ్యాట్) ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలల్లో ఉన్న దాదాపు 90 వేల మంది టీచర్లను ఈ శిక్షణలో భాగస్వాములను చేస్తున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్ఈ విధానాన్ని అమలు చేయాలని సంకల్పించిన నేపథ్యంలో ఆంగ్ల మాధ్యమంలోనూ బోధన చేసేలా ఉపాధ్యాయులకు తర్ఫీదు ఇస్తారు. తద్వారా విద్యార్థులకు ఉత్తమ పరిజ్ఞానం అందించి వారి సామర్థ్యాలను మరింత మెరుగుపర్చాలని సర్కారు నిర్ణయించింది. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు సీబీఎస్ఈ బోధనా విధానం (టీచింగ్ మెథడాలజీ), మూల్యాంకన పద్ధతులపై తర్ఫీదు ఇస్తారు. కరోనా నేపథ్యంలో దీక్షా డిజిటల్ వేదిక ద్వారా ఉపాధ్యాయులకు ఆన్లైన్ ద్వారా శిక్షణ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. సోమవారం నుంచి జూలై 3వ తేదీ వరకు కొనసాగే శిక్షణ కార్యక్రమంపై ఉపాధ్యాయులకు సూచనలు జారీ చేయాలని పాఠశాల విద్యాశాఖ డీఈవోలకు, సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కో–ఆర్డినేటర్లకు ఆదేశాలు జారీ చేసింది. శిక్షణ ముఖ్యోద్దేశాలివీ.. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల కోసం 1–6వ తరగతి వరకు పుస్తకాలను ఆంగ్ల, తెలుగు మాధ్యమాల్లో ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేసింది. నూతన పాఠ్య పుస్తకాల నేపథ్య పరిజ్ఞానం, కార్యాచరణ ఆధారిత, ప్రయోగాత్మక అభ్యసనాలతో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నూతన పాఠ్య పుస్తకాల్లోని పాఠ్యాంశాలను లక్ష్యాలను సాధించేలా సీబీఎస్ఈ విధానంలో బోధన చేసేలా ఉపాధ్యాయులను తీర్చిదిద్దనున్నారు. అభ్యసన ఫలితాలు సాధించడంపై కంటెంట్ అనాలసిస్‌తోపాటు సృజనాత్మక రీతుల్లో బోధనాభ్యసన విధానాలను అనుసరించేలా తర్ఫీదునిస్తారు. మూల్యాంకన విధానాలు, సాధనాలు, మూల్యాంకన ప్రాసెస్‌లపై శిక్షణ ఇస్తారు. సీబీఎస్ఈ విధానాన్ని ప్రవేశపెడుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణమైన సామర్థ్యాలతో విద్యార్థులకు బోధన చేసేలా శిక్షణ ఇస్తారు. తెలుగు మాధ్యమంలో బోధన చేస్తున్న ఉపాధ్యాయులకు సీబీఎస్ఈ విధానంలో ఆంగ్ల మాధ్యమ బోధనా పద్ధతులపై శిక్షణ ఇస్తారు. శిక్షణ ఇలా.. ► ఉపాధ్యాయులకు ప్రాథమిక స్థాయిలో ఇంగ్లిష్, మేథమెటిక్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్ బోధనపై శిక్షణ ఉంటుంది. ► దీక్షా ప్లాట్ఫారం ద్వారా నిర్వహించే ఈ కోర్సు నిడివి 12 గంటలు. ఆన్లైన్లో రోజుకు గంట చొప్పున మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు 12 రోజుల పాటు దీనిని నిర్వహిస్తారు. ► ఎన్సీఈఆర్టీ–న్యూఢిల్లీ, రీజనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఆర్ఐఈ), మైసూర్‌కు చెందిన ప్రొఫెసర్లు, కేంద్రియ విద్యాలయాల బోధనా సిబ్బంది రిసోర్సు పర్సన్లుగా వ్యవహరిస్తున్నారు. ఇదీ షెడ్యూల్ ఇంగ్లిష్: జూన్ 21 నుంచి 24వ తేదీ వరకు, మేథమెటిక్స్: జూన్ 25 నుంచి 29వ తేదీ వరకు, ఈవీఎస్: జూన్ 30 నుంచి జూలై 3వ తేదీ వరకు. నూతన పాఠ్య పుస్తకాలు రెడీ.. 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి పంపిణీకి సిద్ధమైన నూతన పాఠ్య పుస్తకాలు సంఖ్య తరగతి పాఠ్య పుస్తకాల సంఖ్య 1వ తరగతి 29,10,424 2వ తరగతి 30,96,822 3వ తరగతి 39,46,165 4వ తరగతి 39,40,938 5వ తరగతి 38,68,931 6వ తరగతి 35,38,818 7వ తరగతి 36,43,742 8వ తరగతి 41,19,992 9వ తరగతి 39,58,521 10వ తరగతి 37,93,110 -
దశలవారీగా మౌలిక వసతులు..
సాక్షి, హైదరాబాద్: సర్కారు బడి సరికొత్త హంగులతో ముస్తాబు కానుంది. కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా అన్నిరకాల మౌలిక వసతులతో అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న మౌలిక వసతుల సమస్యకు అతి త్వరలో చెక్ పడనుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ వార్షిక బడ్జెట్లో రూ.4వేల కోట్లు కేటాయించింది. వీటి వినియోగానికి వ్యూహాత్మక ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించిన నేపథ్యంలో విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం గురువారం బీఆర్కేఆర్ భవన్లో సమావేశమైంది. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, పాఠశాల విద్య కమిషనర్ దేవసేన తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రస్తుతం పాఠశాలల్లో ఉన్న మౌలికవసతుల తీరుపై చర్చించిన అనంతరం ప్రాధాన్య క్రమంలో సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో 26,040 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో మౌలికవసతుల ఆవశ్యకతపై ఇప్పటికే పాఠశాల విద్యా శాఖ నిర్ణీత ఫార్మాట్లో సమాచారం సేకరించింది. ఈ సమాచారాన్ని విశ్లేషించి ప్రాధాన్య క్రమంలో రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో మూడు దశల్లో వసతులు కల్పించేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రివర్గ ఉపసంఘం పాఠశాల విద్యా శాఖను ఆదేశించింది. ఈ ప్రతిపాదనలను సీఎం కేసీఆర్‌కు సమర్పించాలని మంత్రులు నిర్ణయానికి వచ్చారు. సీఎం ఆదేశాల ప్రకారం పనులు ప్రారంభించనున్నారు. నమూనాగా ఢిల్లీ, ఏపీ స్కూళ్లు.. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు సంబంధించి పాఠశాల విద్యా శాఖ అధికారులు ఇప్పటికే ఢిల్లీతో పాటు ఆంధ్రప్రదేశ్‌ను సందర్శించారు. ఆ రాష్ట్రాల్లో మౌలిక వసతుల తీరుపై అధ్యయనం చేసి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేశారు. ఈ రెండింటిలో ఒక రాష్ట్రంలో అనుసరిస్తున్న తీరును ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా అన్వయించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. తొలుత విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న పాఠశాలలను ఎంపిక చేసుకోనుంది. ఇలా ఎంపిక చేసుకున్న పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనలో భాగంగా పూర్తిస్థాయి భవనం, టాయిలెట్లు, కిచెన్ షెడ్లు, ఫర్నెచర్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ సామగ్రి, బోధన, అభ్యసన పరికరాలు తదితరాలు సమకూరుస్తారు. వీటితోపాటు డిజిటల్ పద్ధతిలో పాఠ్యాంశ బోధన కోసం డిజిటల్ క్లాస్‌రూమ్స్ ఏర్పాటు చేస్తారు. -
అదే మా తపన, అదే మా ఆరాటం: సీఎం వైఎస్ జగన్
సాక్షి,అమరావతి: ప్రీప్రైమరీ ప్రైమరీ విద్యార్థులకు అత్యున్నత విద్యను అందించడంలో భాగంగా విద్యా శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం క్యాంప్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, మహిళా సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, విద్యా శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమీక్షా సమావేశంలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. అదే మా తపన, అదే మా ఆరాటం ''పిల్లల్లో 6 ఏళ్ల వయసులోపే 80 శాతం మేధో వికాసం చెందుతుంది. అందుకే ఈ ఆలోచన.. నిరుపేద విద్యార్థులకు కూడా అత్యుత్తమ ప్రమాణాలతో విద్య అందించాలని నా తపన, ఆరాటం. ఆ ఆలోచనల నుంచి పుట్టుకొచ్చినవే ఈ వైఎస్సార్ ప్రి ప్రైమరీ స్కూళ్లు.. ఫౌండేషన్ స్కూళ్లు. అన్ని వసతులతో విద్యార్థులకు మంచి చదువు అందించడమే లక్ష్యంగా మనబడి, నాడు–నేడు చేపట్టాము. కార్యక్రమంలో భాగంగా, స్కూళ్ల రూపురేఖలనే సమూలంగా మార్చేస్తున్నాము. అధికారులు ఇప్పుడు చేస్తున్న ప్రతిపాదనల వల్ల కాస్ట్ ఇంపార్ట్, ఎడ్యుకేషన్ ఇంపాక్ట్‌పె పరిశీలన చేయండి. ప్రతి మండలానికీ ఒక జూనియర్ కాలేజీ పెట్టాలనుకున్నాం. ఇది కాకుండా ప్రస్తుతం ఉన్న హైస్కూళ్లలో 11, 12 తరగతులను పెట్టడమా? లేక మండలానికి ఒక జూనియర్ కాలేజీని పెట్టాలా? అలాగే కొన్ని మండలాల్లో అవసరాల మేరకు 2 జూనియర్ కాలేజీలు పెట్టాలా? అన్నదానిపై పూర్తి స్థాయి పరిశీలన చేయండి. దీని తర్వాత తుది నిర్ణయం తీసుకుందాం. ఈ నిర్ణయం వల్ల 11, 12 తరగతులకు ప్రభుత్వ రంగంలోనే మంచి విద్య అందించే అవకాశం ఉంటుంది. పీపీ స్కూళ్లు–మ్యాపింగ్: ఇక ఇప్పుడు ఏర్పాటు చేయదలచిన ఫౌండేషన్ స్కూళ్లు అన్నీ కూడా ఒక కిలోమీటర్ దూరం లోపల ఉండాలి. అలాగే అన్ని హైస్కూళ్లు (3 తరగతి నుంచి 10 లేదా 12వ తరగతి) 3 కిలోమీటర్ల దూరం లోపల ఉండాలి.వైఎస్సార్ ప్రిప్రైమరీ స్కూళ్లు పిల్లలకు చాలా దగ్గరగా అందుబాటులో ఉండాలి. ఆ విధంగా ఆ స్కూళ్ల మ్యాపింగ్ చేయాలి. టీచర్లలోని బోధనా సామర్థ్యాని మరింత వినియోగించుకునేలా తగిన హేతుబద్ధీకరణ చేపట్టాలి. తద్వారా పిల్లలకు ఇంకా అత్యుత్తమ విద్యను అందించవచ్చు. కొత్త ప్రతిపాదనల అమలు వల్ల ఎలాంటి ప్రభావం ఉండబోతుందన్న దానిపై పూర్తిస్థాయిలో అధికారులు ఆలోచనలు చేసి.. తదుపరి సమీక్షలో నివేదించాలని సీఎం ఆదేశం. ఒకవేళ వాటిని అమలు చేయాల్సిన పక్షంలో ముందుగా 3, 4, 5 తరగతులను యూపీ స్కూళ్లకు, హైస్కూళ్లకు బదిలీ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఖరారు అయిన తర్వాత ఫౌండేషన్ స్కూళ్లలో చేపట్టాల్సిన నాడు–నేడు కార్యక్రమాలపై కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలి. డిజిటల్ టీచింగ్: స్థానిక ప్రాథమిక పాఠశాలలో అంగన్ వాడీలు (పీపీ–1, పీపీ–2), 1, 2 తరగతుల ఫౌండేషన్ స్కూళ్ల ఏర్పాటు తర్వాత డిజిటల్ బోధన ప్రక్రియ (డిజిటల్ టీచింగ్)పై దృష్టి పెట్టండి. ఆ మేరకు డిజిటిల్ బోధనా పద్ధతులు (టీచింగ్ మెథడాలజీ) రూపొందించండి. మనం బ్లాక్ బోర్డు నుంచి గ్రీన్ బోర్డ్స్‌కు మారాం. ఇక ముందు డిజిటిల్ బోర్డ్స్‌కు వెళ్లే పరిస్థితి వస్తుంది. డిజిటల్ బోర్డుల డ్యూరబులిటీ (దీర్ఘకాలం పని సామర్థ్యం) ఉండేలా చూసుకోండి.మనం ఏర్పాటు చేసే పరికరం ఒక రోబస్ట్‌గా ఉండాలి. మరమ్మతులకు అవకాశం తక్కువగా ఉండే డివైజ్‌లను గుర్తించండి. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని పరిశీలన చేయండి.ఎన్ని స్కూళ్లలో, ఎన్ని క్లాస్‌రూమ్‌లలో ఏర్పాటు చేయగలం? ఎంత వ్యయం అవుతుంది? అన్నవాటిని సమీక్షించాలి.'' అని పేర్కొన్నారు. -
YSR Pre Primary Schools: బాల బడికి సొంత ఒడి
చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యను అందించే అంగన్వాడీ కేంద్రాలను అన్నివిధాలా తీర్చిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వీటిని ‘వైఎస్సార్ ప్రీ ప్రైమరీ స్కూళ్లు’గా మార్చి.. పిల్లలకు పౌష్టికాహారంతో పాటు ఆంగ్ల విద్యనూ అందిస్తోంది. ఈ ‘బాల బడులు’ కొత్త రూపు సంతరించుకుంటుండటంతో చిన్నారులు ఆహ్లాదకర వాతావరణంలో ఉత్సాహంగా అక్షరాలు దిద్దుకోవడంతో పాటు తల్లిదండ్రుల్లోనూ ఎనలేని సంతోషాన్ని నింపుతోంది. – కర్నూలు (రాజ్‌విహార్) రాష్ట్రవ్యాప్తంగా 55,607 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో తొలి విడతగా 8,047 కేంద్రాలను అభివృద్ధి చేయనున్నారు. వీటిలో 4,706 కేంద్రాలకు నూతన భవనాలు నిర్మించనున్నారు. ఒక్కో భవన నిర్మాణానికి రూ.14 లక్షలు వెచ్చిస్తున్నారు. ఇందులో రూ.10.20 లక్షలతో భవన నిర్మాణ పనులు, రూ.2.80 లక్షలతో విద్యుత్, నీటి సౌకర్యం, ఫర్నిచర్, రూ.99 వేలతో టాయిలెట్లు, ఇంటర్నల్ పనులు చేయనున్నారు. అలాగే 3,341 కేంద్రాలను ఆధునికీకరిస్తారు. వీటిలో భవనాల అప్‌గ్రేడేషన్‌తో పాటు మౌలిక సదుపాయాలు, విద్యాబోధనకు అవసరమైన వసతులు కల్పిస్తారు. అవసరాన్ని బట్టి ఒక్కో కేంద్రానికి రూ.50 వేల నుంచి రూ.5.50 లక్షల వరకు ఖర్చు చేయనున్నారు. పనుల బాధ్యత గృహ నిర్మాణ సంస్థకు.. అంగన్వాడీ కేంద్రాలను అభివృద్ధి చేసే పనులను గృహ నిర్మాణ సంస్థకు అప్పగించారు. గడువులోపు పూర్తి చేయాలనే లక్ష్యంతో ఆ సంస్థ ఇంజినీరింగ్ అధికారులతో ఐసీడీఎస్ ఉన్నతాధికారులు ఇప్పటికే సమీక్షలు నిర్వహించారు. పనుల్లో నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించారు. నాణ్యతపై ప్రశ్నించేందుకు వీలుగా బాలల తల్లులనూ ప్రభుత్వం భాగస్వామ్యం చేస్తోంది. ప్రతి అంగన్వాడీకి ఏడుగురితో కమిటీ ఏర్పాటు చేస్తోంది. కన్వీనర్‌గా సూపర్వైజర్, సభ్యులుగా అంగన్వాడీ టీచర్, గ్రామ/వార్డు మహిళా పోలీసు, ఇంజనీరింగ్ అసిస్టెంట్‌తో పాటు రెండేళ్ల నుంచి నాలుగేళ్ల వయసున్న చిన్నారుల తల్లులు ముగ్గురు ఉంటారు. ఈ కమిటీ పేరున బ్యాంకు ఖాతా తెరిచి.. ఇద్దరికి చెక్ పవర్ ఇస్తారు. వీరి ద్వారానే అవసరమైన నిధులు డ్రా చేయాల్సి ఉంటుంది. ప్రారంభమైన ఆంగ్ల బోధన అంగన్వాడీల్లో 3నుంచి 6 ఏళ్ల మధ్య వయసున్న చిన్నారులకు ఈ ఏడాది ఫిబ్రవరి 1నుంచే ఇంగ్లిష్ బోధిస్తున్నారు. పిల్లల్లో ఆసక్తి పెంచేలా ఆట వస్తువులు, బొమ్మలతో చదువు నేర్పిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక సిలబస్ రూపొందించడంతో పాటు సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లకు శిక్షణ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 3–6 ఏళ్ల మధ్య వయసున్న 10,88,461 మంది చిన్నారులు ఏబీసీడీలు దిద్దుతున్నారు. చిన్నారుల్లో నూతనోత్తేజం ఐదేళ్లలోపు చిన్నారులకు గ్రహించే శక్తి బాగా ఉంటుంది. ఈ సమయంలో విద్యాపరమైన, మంచి విషయాలను చక్కగా గ్రహిస్తారు. అందుకే వాళ్లకు నాణ్యమైన ఆహారంతో పాటు మంచి విద్య అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అంగన్వాడీ కేంద్రాలను వైఎస్సార్ ప్రీ ప్రైమరీ ఇంగ్లిష్ మీడియం స్కూళ్లుగా మార్చాం. అందుకు తగ్గట్టుగా సిబ్బందికి అందరికీ శిక్షణ ఇచ్చాం. – కృతికా శుక్లా, స్టేట్ డైరెక్టర్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆడిస్తూ.. పాడిస్తూ.. పిల్లలకు పౌష్టికాహారం ఇవ్వడంతో పాటు వారిని ఆడిస్తూ, పాడిస్తూ విద్య నేర్పిస్తున్నాం. మాకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. అందుకు అనుగుణంగానే పిల్లలకు ఇంగ్లిష్ నేర్పిస్తున్నాం. పిల్లల్లో ఆసక్తి కలిగేలా వస్తువులు, బొమ్మలతో బోధిస్తున్నాం. – శ్రీదేవి, అంగన్వాడీ టీచర్, కర్నూలు భవనాలు నిర్మిస్తే కొత్త లుక్ అంగన్వాడీ సెంటర్లకు కొత్త భవనాలు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అభినందనీయం. దీనివల్ల సౌకర్యాలు ఏర్పడి కొత్త లుక్ వస్తుంది. అలాగే ఇంగ్లిష్ బోధించడం వల్ల పిల్లల బంగారు భవిష్యత్‌కు బాటలు వేసినట్లు అవుతుంది. – తరంగిణి, చిన్నారి తల్లి, కర్నూలు -
ప్రారంభమైన వైఎస్సార్ ప్రీ ప్రైమరీ స్కూళ్లు
సాక్షి, అమరావతి: అంగన్వాడీ స్కూళ్లు.. సోమవారం ‘వైఎస్సార్ ప్రీ ప్రైమరీ ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు’గా ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో 55,607 అంగన్వాడీ స్కూళ్లున్నాయి. వీటిలో 8.5 లక్షల మంది బాలలు విద్యాబుద్ధులు నేర్చుకుంటున్నారు. ఇప్పటివరకు విద్యాబుద్ధులు నేర్పే పద్ధతులు మార్చి ఆట వస్తువుల ద్వారా విద్యను నేర్పించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. పిల్లలను స్కూళ్లకు పంపించేందుకు 85 శాతం మంది తల్లిదండ్రులు సుముఖత వ్యక్తం చేస్తూ లిఖిత పూర్వకంగా అంగన్వాడీ టీచర్లకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు పిల్లలు స్కూళ్లకు హాజరయ్యారు. అంగన్వాడీ స్కూళ్లకు వచ్చే పిల్లల కోసం ప్రీ ప్రైమరీ1, ప్రీ ప్రైమరీ2, ప్రీ ఫస్ట్‌క్లాస్ తరగతులుగా విభజించి ఇంగ్లిష్ మాధ్యమంలో విద్యను నేర్పించే కార్యక్రమం మొదలైంది. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో వసతుల్ని మెరుగుపరిచింది. కాగా, రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలలు సోమవారం ప్రారంభమయ్యాయి. -
బడి 'రెడీ': నేటి నుంచి ప్రైమరీ స్కూళ్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలలు సహా అన్ని పాఠశాలలు ఫిబ్రవరి 1 నుంచి పూర్తిస్థాయిలో పనిచేయనున్నాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ 1 నుంచి 5 తరగతులుండే ప్రాథమిక పాఠశాలల్లోనూ సోమవారం నుంచి తరగతులు నిర్వహించనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో 9 నుంచి 12 తరగతులను నవంబర్ 2 నుంచి.. అనంతరం 7, 8 తరగతులను నిర్వహిస్తూ వచ్చిన ప్రభుత్వం సంక్రాంతి సెలవుల తర్వాత ఆరో తరగతి విద్యార్థులకూ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఎలిమెంటరీ స్కూళ్లలోని 1 నుంచి 5 తరగతుల విద్యార్థులకు కూడా సోమవారం నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల తరగతుల నిర్వహణకు సంబంధించిన టైమ్ టేబుల్‌ను రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి విడుదల చేసింది. ఎలిమెంటరీ స్కూళ్లలోని 1, 2, 3, 4, 5 తరగతుల విద్యార్థులకు ఉ.9 గంటల నుంచి మ.3.45 గంటల వరకు తరగతులు ఉంటాయి. విరామాలు, ఆనంద వేదిక కార్యక్రమాలు సçహా మొత్తం ఏడు పీరియడ్లు నిర్వహిస్తారు. ప్రాథమికోన్నత పాఠశాలల్లోని 1 నుంచి 5 తరగతుల విద్యార్థులకు ఉ.9 నుంచి మ.3.45 వరకు.. అలాగే 6 నుంచి 8 తరగతుల విద్యార్థులకు ఉ.9 నుంచి మ.4.10 వరకు తరగతులు నిర్వహించేలా టైమ్‌టేబుల్‌ను ప్రకటించారు. ఒకరి వస్తువు ఇంకొకరు వాడకూడదు విధి విధానాలకు సంబంధించి కూడా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కోవిడ్ నియమాలను ప్రకటించింది. పెన్నులు, పుస్తకాలు, పెన్సిళ్లు, వాటర్ బాటిళ్లు.. ఇలా ఏదైనా సరే ఒకరి వస్తువు ఇంకొకరు వినియోగించరాదని స్పష్టంచేసింది. అంతేకాక.. ► నాన్ కంటైన్మెంటు జోన్లలోని స్కూళ్లను మాత్రమే తెరవాలి. ► విద్యార్థులు అన్నివేళలా మాస్కులను ధరించాలి. స్కూళ్లలో పరిశుభ్ర వాతావరణం ఉండేలా చూడాలి. ► విద్యార్థులు ఎవరైనా జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలతో బాధపడుతున్నట్లు గమనిస్తే ఇంటికి పంపించి వైద్య పరీక్షలకు సూచించాలి. ► తల్లిదండ్రులు తమ పిల్లలకు జలుబు వంటి లక్షణాలు కనిపిస్తే ముందుగానే దగ్గర్లోని హెల్త్ సెంటర్లో పరీక్షలు చేయించాలి. ► హ్యాండ్ శానిటైజర్‌ను అందుబాటులో ఉంచి విద్యార్థులు చేతులు శుభ్రం చేసుకునేలా చూడాలి. భోజనానికి ముందు, మరుగుదొడ్డికి వెళ్లివచ్చాక చేతులను శుభ్రం చేసుకునేలా అవగాహన కల్పించాలి. ► భౌతిక దూరం పాటిస్తూ స్కూళ్లలోకి ప్రవేశించేలా చూడాలి. విద్యార్థుల మధ్య ఆరు అడుగుల భౌతిక దూరం ఉండేలా ఏర్పాట్లు చేయాలి. ► విద్యార్థులను, వారి తల్లిదండ్రుల అంగీకారాన్ని తీసుకుని మాత్రమే పాఠశాలల్లోకి ప్రవేశాన్ని అనుమతించాలి. ► తరగతి గదులను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలి. ► వృద్ధులు, అనారోగ్య సమస్యలున్న వారు ఇళ్లలో కనుక ఉంటే అలాంటి విద్యార్థులను స్కూళ్లకు అనుమతించకుండా ఇళ్ల వద్దనే ఉండేలా చూడాలి. ప్రధానోపాధ్యాయులు ఈ అంశాలను దగ్గరుండి పర్యవేక్షించాలి. ► భౌతిక దూరం పాటిస్తూ సెక్షన్‌కు 16 మందిని మాత్రమే అనుమతించాలి. రోజు విడిచి రోజు బ్యాచుల వారీగా నిర్వహించడం లేదా ఒక పూట ఒక బ్యాచ్‌కు, మరో పూట మరో బ్యాచ్‌కు తరగతులు నిర్వహించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ► అసెంబ్లీ, గ్రూప్ వర్కు, గేములు వంటి వాటిని తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు నిర్వహించరాదు. ► మధ్యాహ్న భోజనాన్ని బ్యాచుల వారీగా వేర్వేరు సమయాల్లో అందించాలి. ► విరామ సమయాన్ని 10 నిమిషాల చొప్పున ఇచ్చినా విద్యార్థులు గుమిగూడకుండా, ముఖాముఖి ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ► స్కూలు వదిలిన సమయంలో కూడా బ్యాచుల వారీగా పది నిమిషాల వ్యవధి ఇస్తూ విద్యార్థులను క్రమపద్ధతిలో వెళ్లేలా చూడాలి. ► రోజు విడిచి రోజు ఇద్దరు విద్యార్థులు, ఒక సిబ్బందికి ర్యాండమ్ టెస్టులు నిర్వహించాలి. -
1 నుంచి ప్రాథమిక పాఠశాలలు ప్రారంభం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ప్రాథమిక పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎలిమెంటరీ స్కూళ్లలో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. తరగతి గదిలో 20 మంది విద్యార్థులుండేలా జాగ్రత్తలు తీసుకోవాలని, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తరగతుల నిర్వహణ ఉండాలని సూచించారు. సరిపడా తరగతి గదుల్లేని చోట రోజు మార్చి రోజు తరగతులు నిర్వహించాలని పేర్కొన్నారు. తల్లిదండ్రుల లిఖితపూర్వక హామీతో విద్యార్థులను అనుమతించాలని మంత్రి సూచించారు. -
పాఠశాలలు, టీచర్ల హేతుబద్ధీకరణ చేపట్టాల్సిందే
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఒక్క విద్యార్థి లేని పాఠశాలల సంఖ్య (జీరో ఎన్రోల్మెంట్) వందల్లో పెరిగింది. అలాగే విద్యార్థులు తగ్గిపోయిన స్కూళ్ల సంఖ్య కూడా పెరిగిపోయిందని సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు (పీఏబీ) పేర్కొంది. దీంతో ఆయా పాఠశాలల్లో 8,883 మంది టీచర్లు సర్‌ప్లస్‌గా ఉన్నారని వెల్లడించింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో వెంటనే పాఠశాలలు, టీచర్ల హేతుబద్ధీకరణ చేపట్టాలని పీఏబీ స్పష్టం చేసింది. ఎస్ఎస్ఏ 2020–21 విద్యా సంవత్సరపు పీఏబీ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన లెక్కలను బట్టి కేంద్రం ఈ విషయాన్ని వెల్లడించింది. మరోవైపు రాష్ట్రంలో 17,873 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పేర్కొంది. అందులో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 11,517, ఉన్నత పాఠశాలల్లో 6,356 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వెల్లడించింది. పీఏబీ లేవనెత్తిన అంశాలు.. రాష్ట్రంలో ఒక్క విద్యార్థి లేని ప్రాథమిక పాఠశాలల సంఖ్య 1,097 పెరిగింది. అలాగే ఒక్క విద్యార్థి లేని ప్రాథమికోన్నత పాఠశాలల సంఖ్య 315కు పెరిగింది. ప్రాథమిక స్థాయిలో 15 మందిలోపు విద్యార్థులు ఉన్న స్కూళ్ల సంఖ్య 4,582 నుంచి 4,960కి పెరిగాయి. ప్రాథమికోన్నత స్థాయిలో 15 మందిలోపు విద్యార్థులు ఉన్న స్కూళ్లు 1,400 నుంచి 1,651కి పెరిగాయి. 30 మందిలోపు విద్యార్థులు ఉన్న స్కూళ్ల సంఖ్య 11,096కు పెరిగింది. ప్రాథమికోన్నత స్థాయిలో 30 మందిలోపే విద్యార్థులు ఉన్న పాఠశాలల సంఖ్య 2,809 నుంచి 3,085కు పెరిగాయి. ప్రాథమిక స్థాయిలో సింగిల్ టీచర్ ఉన్న స్కూళ్లు 4,372 నుంచి 4,448కి, ప్రాథమికోన్నత స్థాయిలో 127 నుంచి 168కి పెరిగాయి. దీంతో ఆయా పాఠశాలల్లో 8,883 మంది టీచర్లు అదనంగా (సర్ప్లస్) ఉన్నారు. మరోవైపు రాష్ట్రంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 11,517 టీచర్ పోస్టులు, ఉన్నత పాఠశాలల్లో 6,356 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక 84 శాతం ఉన్నత పాఠశాలల్లో మాత్రమే అన్ని ప్రధాన సబ్జెక్టులకు టీచర్లు ఉన్నారు. భాషా సబ్జెక్టుల్లో విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి 41 కాగా, సైన్స్‌లో ప్రతి 37 మందికి ఒక టీచర్, మేథమెటిక్స్‌లో ప్రతి 54 మందికి ఒక టీచర్, సోషల్ స్టడీస్‌లో ప్రతి 73 మందికి ఒక టీచర్ ఉన్నారు. ∙ వందల సంఖ్యలో పెరిగిపోయిన ఒక్క విద్యార్థి లేని స్కూళ్లు ∙ తక్కువ మంది విద్యార్థులున్న స్కూళ్ల సంఖ్యలోనూ పెరుగుదల ∙ దీంతో ఆయా పాఠశాలల్లో 8 వేల మందికి పైగా సర్ప్లస్ టీచర్లు ∙ సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు వెల్లడి -
దశల వారీగా పాఠశాలలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో దశల వారీగా స్కూళ్లను ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. పరిస్థితిని బట్టి జూలై 1 నుంచి లేదా 15 నుంచి ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్న అభిప్రాయంతో ఉంది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, అధికా రులతో జరిగిన సమీక్షలో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అయితే ఇతర రాష్ట్రాల్లో ఇప్పుడే స్కూళ్ల ప్రారంభంపై పెద్దగా నిర్ణయాలు లేవన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. ఒకవేళ కరోనా అదుపులోకి వస్తే జూలైలో ప్రారంభించాలని, అప్పుడు మొదట 7, 8, 9, 10 తరగతులు ప్రారంభించాలన్న ఆలోచనకు వచ్చారు. ఆ తర్వాత అప్పర్ ప్రైమరీ తరగతులను ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిసింది. జూలై నెలాఖరు లేదా ఆగస్టు మొదటి వారంలో ప్రాథమిక తరగతులను ప్రారంభిస్తే బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చారు. టీచర్లను మాత్రం పాఠశాలల పునఃప్రారంభ దినమైన జూన్ 12 నుంచే వచ్చేలా చూడాలని నిర్ణయించినట్లు తెలిసింది. త్వరలోనే ఈ మేరకు ఆదేశాలు జారీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. టీచర్లంతా గ్రామ పంచా యతీల సమన్వయంతో పాఠశాలలను శుభ్రపరచుకోవడం, శానిటైజేషన్ చేయించడం వంటి చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. స్థానిక సంస్థల నుంచి నిధులు రాబట్టుకునేలా చర్యలు చేపట్టాలన్న అంశంపైనా చర్చించారు. ఎక్కువుంటే షిఫ్ట్ పద్ధతిలో.. పాఠశాలల్లో విద్యార్థులు ఎక్కువగా ఉంటే షిఫ్ట్ పద్ధతుల్లో కొనసాగించాలని, ముఖ్యంగా రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో ఇది అవసరమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక, డిజిటల్ తరగతులు, కేబుల్ టీవీ ద్వారా తరగతుల నిర్వహణ చేపట్టాలని సూచించారు. వాస్తవానికి ఆన్లైన్ బోధన ప్రత్యామ్నాయం కానే కాదని పేర్కొన్నా.. ఉన్నత తరగతులకు ఆన్లైన్లో నిర్వహించేలా చర్యలు చేపట్టాలన్న అభిప్రాయానికి వచ్చారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత స్థాయిలో ప్రత్యక్ష బోధన లేకుంటే ప్రయోజనం ఉండదన్న అభిప్రాయం వ్యక్తమైంది. అయితే, భౌతిక దూరం పాటించడం గ్రామీణ పాఠశాలల్లో పెద్దగా ఇబ్బంది ఉండదన్న అభిప్రాయం వ్యక్తమైంది. కరోనా అదుపులోకి రాని ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా ముందుకు సాగాలన్న అంశంపైనా విద్యా శాఖ అధికారులు నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. మరో 10–15 రోజుల తర్వాత కరోనా పరిస్థితిని చూసి మళ్లీ సమీక్ష నిర్వహించి తుది నిర్ణయం తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది. ఈలోగా అవసరమైతే ఉపాధ్యాయ సంఘాలతోనూ ఓసారి సమావేశం కావాలని నిర్ణయించినట్లు సమాచారం. జూలై 15 నుంచి ఇంటర్ తరగతులు ఇంటర్ ద్వితీయ సంవత్సర తరగతులను జూలై 15 నుంచి ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇంటర్ విద్యా కార్యక్రమాలపైనా బోర్డు అధికారులు మంత్రికి నివేదిక అందజేసినట్లు సమాచారం. అయితే ఇంటర్లో సిలబస్ తగ్గించొద్దని ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. రాష్ట్ర విద్యార్థులు జాతీయ స్థాయిలో పోటీ పడాలంటే సిలబస్ అలాగే ఉండాలని, అవసరమైతే నష్టపోయిన పని దినాలను ఆన్లైన్ బోధన ద్వారా సర్దుబాటు చేయాలని సూచించారు. భేటీలో విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామచంద్రన్, కళాశాల విద్య కమిషనర్ నవీన్ మిట్టల్, ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, పాఠశాల విద్య సీనియర్ అధికారులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
ఇంగ్లిష్ మీడియంపై సిఫార్సులివ్వండి
సాక్షి, అమరావతి: ప్రాథమిక పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ బోధన అమలుపై రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) ప్రభుత్వానికి త్వరలోనే సిఫార్సులు అందించనుంది. వీటి ఆధారంగా ప్రాథమిక పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. విద్యార్థుల తల్లిదండ్రుల్లో అత్యధికులు ఆంగ్ల మాధ్యమానికే మొగ్గు చూపిన దృష్ట్యా ఆ మాధ్యమం అమలుకు వీలుగా సిఫార్సులు అందించాలని ప్రభుత్వం ఎస్సీఈఆర్టీకి సూచించింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ శుక్రవారం ఉత్తర్వులు (జీవో–21) జారీ చేశారు. ఆంగ్ల మాధ్యమం అమలుపై హైకోర్టు తీర్పు మేరకు ఏపీ విద్యా చట్టం (ఎడ్యుకేషన్ యాక్ట్)లోని సంబంధిత సెక్షన్లను అనుసరించి ప్రభుత్వానికి సిఫార్సులు సమర్పించాలని జీవోలో పేర్కొన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో గతంలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టి అమలు చేసిన తీరు, అందుకు దశలవారీగా తీసుకున్న చర్యలకు సంబంధించిన అంశాలను కూడా నివేదికల్లో పొందుపర్చాలని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్‌తో పాటు విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ)లోని సంబంధిత అవకాశాలను కూడా పరిశీలించి సిఫార్సుల్లో పొందుపర్చాలన్నారు. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందని వివరించారు. ఆంగ్ల మాధ్యమం వైపు తల్లిదండ్రుల మొగ్గు ► ఆంగ్ల మాధ్యమంపై హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు కావడంతో ప్రభుత్వం ఇచ్చిన జీవోలు 81, 85లను రద్దు చేస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ► అకడమిక్ అంశాలపై అధికారాలు ఎస్సీఈఆర్టీవేనని, విద్యాహక్కు చట్టం ప్రకారం అకడమిక్ వ్యవహారాల్లో ఎస్సీఈఆర్టీ ప్రమేయం లేకుండా కీలక నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదని తీర్పులో పేర్కొంది. ► అదే సమయంలో నిర్ణయం తీసుకునే ముందు మాధ్యమంపై తల్లిదండ్రుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోలేదని తీర్పులో అభిప్రాయపడింది. ► ఈ నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరం (2020–21)లో తమ పిల్లలకు ఏ మాధ్యమంలో బోధన కోరుకుంటున్నారనే దానిపై విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలు తెలుసుకోవాలని పాఠశాల విద్యా కమిషనర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. ► ఈ ఆదేశాల మేరకు తల్లిదండ్రుల అభిప్రాయాలను సేకరించిన కమిషనర్ ప్రభుత్వానికి నివేదించారు. ► 1 నుంచి 5 తరగతి వరకు చదువుతున్న 17,87,035 మంది విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఆప్షన్లు కోరగా.. 17,85,669 మంది నుంచి ఆప్షన్లు అందాయి. ► 96.17 శాతం మంది ఆంగ్ల మాధ్యమం.. 3.05 శాతం మంది తెలుగు మాధ్యమం, 0.78 మంది ఇతర మైనర్ మాధ్యమాలు కావాలని ఆప్షన్లు ఇచ్చారు. ► హైకోర్టు తీర్పును అనుసరించి నిర్వహించిన ఆప్షన్ల సేకరణలో మాధ్యమంపై పిల్లలు/తల్లిదండ్రుల అభిప్రాయాలు ఇలా ఉన్న నేపథ్యంలో ప్రాథమిక పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అమలుపై తగిన సిఫార్సులు అందించాలని ప్రభుత్వం ఈ జీవోలో ఎస్సీఈఆర్టీని కోరింది. -
జనం కష్టాలు తెలిసిన నేత: జగన్
పాదయాత్రలో ప్రజల కష్టాలు చూశాను.. నేను విన్నాను.. నేను ఉన్నాను..అని భరోసా ఇచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన క్షణం నుంచి బడుగుజీవులకు ఆర్థిక భరోసా ఇస్తున్నారు. సామాజిక పింఛన్లు రూ.2,250, కిడ్నీ రోగులకు రూ.10 వేలు, దివ్యాంగ పింఛన్ రూ.3వేలకు పెంచుతూ తొలిసంతకం చేశారు. ఏళ్ల తరబడి ప్రభుత్వ పాఠశాలల్లో వంట చేస్తున్న అమ్మలకు ఇస్తున్న గౌరవ వేతనాన్ని రూ. వెయ్యి నుంచి రూ.3 వేలకు పెంచారు. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, గుడిపాల(చిత్తూరు): మండలంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 65 ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు 80మంది ఉన్నారు. వారికి గౌరవ వేతనం రూ.3వేలకు పెంచడంతో ఆర్థికంగా ఎంతో ఆసరా కానుంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులు నిరాటంకంగా విద్యాభ్యాసం చేసేందుకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పధకాన్ని ప్రవేశ పెట్టారు. ప్రస్తుతం పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా గౌరవ వేతనాన్ని పెంచాలని కార్మికులు గత ప్రభుత్వాన్ని కోరారు. అయితే సర్కార్ వారి మొరను పెడచెవిన పెట్టింది. వారి ఆకాంక్షను నిర్లక్ష్యం చేసింది. తమ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇవ్వాలని ఎన్నిసార్లు ఉద్యమాలు చేసినా గత ప్రభుత్వం స్పందించలేదు. ఈ క్రమంలో రాష్ట్రసారధ్య బాధ్యతలు స్వీకరించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.వెయ్యి గౌరవవేతనాన్ని రూ.3 వేల పెంచడంతో వారిలో ఆనందం వెల్లువెత్తుతోంది. వైఎస్ జగన్ తండ్రిబాటలోనే సువర్ణ పాలన సాగిస్తారని ప్రగాఢ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. జనం కష్టాలు తెలిసిన నేత ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి కాబట్టే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే మా గౌరవ వేతనం రూ.3వేలు చేశారు. గత ప్రభుత్వంలో ఇస్తామని చెప్పారు. కాని ఇవ్వలేదు. ఇప్పుడు సమాజంలో మాకు కూడా గౌరవంగా చెప్పుకునే వేతనం ఇస్తున్నారు. –లక్ష్మీ, నరహరిపేట, గుడిపాల మాట నిలబెట్టుకున్నారు: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి,వంట ఏజెన్సీల కష్టాలను గుర్తించి గౌరవ వేతనాన్ని రూ.3వేలు చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ప్రజల సమక్షంలో ఇచ్చిన వాగ్ధానాన్ని నిలబెట్టుకున్నారు. –విజయ, నరహరిపేట, గుడిపాల మా నమ్మకం నిజమైంది మా కష్టాలు తీర్చే నాయకులు ఒక్క వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమే అని ఎప్పటినుంచో నమ్మకం పెంచుకున్నాం. ఆయన సీఎం అయిన వెంటనే వృద్ధులు, కిడ్నీ బాధితులకు పింఛన్లు పెంచారు. వంట ఏజెన్సీలకు కూడా ఇచ్చినహామీ నెరవేర్చారు. ఆయనకు రుణపడి ఉంటాం. –మునెమ్మ, గుడిపాల ఎంతో ఆనందంగా ఉంది గత ప్రభుత్వంలో సక్రమంగా గౌరవ వేతనం వచ్చేది కాదు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వంట ఏజెన్సీల కష్టాలు చూసి గౌరవవేతనం రూ.3వేలు చేశారు. మమ్మల్ని గుర్తించి ఇంతమేలు చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఈశ్వరమ్మ, గుడిపాల -
విద్యార్థులు తక్కువున్న స్కూళ్లు తరలింపు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఒక్క విద్యార్థి లేని స్కూళ్లు 793 ఉండగా, ఒకటి నుంచి పదిమంది లోపే విద్యార్థులున్న స్కూళ్లు 1,544 ఉన్నాయి. ఇపుడు ఆ స్కూళ్లన్నీ సమీపంలోని మరో పాఠశాలల పరిధిలోకి వెళ్లనున్నాయి. అవేకాదు 20 మందిలోపు విద్యార్థులున్న ప్రాథమికోన్నత పాఠశాలలు, 30 మందిలోపు ఉన్న ఉన్నత పాఠశాలలది కూడా అదే పరిస్థితి. మరోవైపు ఒక్క విద్యార్థి లేని స్కూళ్లలో 715 మంది టీచర్లు ఉండగా, వారిని గతేడాదే అవసరం ఉన్న స్కూళ్లలో సర్దుబాటు చేశారు. ఇక 1 నుంచి 10 మందిలోపు విద్యార్థులున్న స్కూళ్లలో 1,900 మంది టీచర్లు ఉన్నారు. ఇప్పుడు వారితో పాటు ప్రాథమికోన్నత పాఠశాలల్లో 20 మందిలోపు విద్యార్థులు ఉన్న స్కూళ్లలోని టీచర్లు, 30 మందిలో విద్యార్థులున్న ఉన్నత పాఠశాలల్లోని టీచర్లను అవసరం ఉన్న స్కూళ్లకు పంపించనున్నారు. విద్యా శాఖ గతేడాది ఈ లెక్కలు వేసింది. తాజాగా ఆ వివరాలను సేకరించి, అలాంటి పాఠశాలలను సమీప పాఠశాలల్లో రీలొకేట్ చేసేందుకు విద్యా శాఖ చర్యలు చేపట్టింది. వాటిల్లోని టీచర్లను టీచర్లను అవసరం ఉన్న పాఠశాలల్లోకి తరలించేందుకు చర్యలు చేపట్టింది. విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి ఈనెల 11న నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జారీ చేసిన ఆదేశాల మేరకు జిల్లాల్లో డీఈవోలు పాఠశాల రీలొకేషన్‌కు చర్యలు చేపట్టారు. అక్కడి విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా వారిని సమీప స్కూళ్లకు పంపించేందుకు రవాణ సదుపాయం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అయితే తాజాగా మండలాల వారీగా అలాంటి స్కూళ్లను గుర్తించి ప్రతిపాదనలు పంపించాలని మండల విద్యాధికారులకు (ఎంఈవో) డీఈవోలు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులకు రవాణా సదుపాయం.. విద్యార్థులు తక్కువ ఉన్న పాఠశాలలను రీలొకేట్ చేయడం, టీచర్లను అవసరం ఉన్న స్కూళ్లకు పంపించడం ద్వారా అక్కడి విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని విద్యా శాఖ ఆదేశించింది. విద్యా హక్కు చట్టం ప్రకారం ఆవాస ప్రాంతంలో పాఠశాల లేకపోతే అక్కడి విద్యార్థులకు ట్రాన్స్‌పోర్టు సదుపాయం కల్పించాల్సి ఉంది. ఆ నిబంధనను పక్కాగా అమలు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. రీలొకేట్ చేసే స్కూళ్లలోని విద్యార్థులందరికి ట్రాన్స్‌పోర్టు సదుపాయం కల్పించేందుకు సమగ్ర వివరాలతో ప్రతిపాదనలు పంపించాలని డీఈవోలు ఆదేశాలు జారీ చేశారు. -
అసంపూర్తిగా అంగన్వాడీ భవనాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అనేక అంగన్వాడీ కేంద్రాలు సొంత భవనాలు లేక అరకొర వసతులు, అద్దె భవనాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో కొన్ని అద్దె భవనాల్లో, మరికొన్ని ప్రాథమిక పాఠశాలల్లో, కొన్ని శాశ్వత భవనాల్లో నడుస్తున్నాయి. అయితే ఆశించిన మేర సొంత భవనాలు లేక ఐసీడీఎస్ లక్ష్యం నీరుగారుతోంది. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణీలు, బాలింతలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కొన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పరిస్థితులు మరీ దారుణంగా తయారయ్యాయి. సొంత భవనాలు, అదిరిపోయే హంగులతో చిన్నారులకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించేలా అంగన్వాడీ కేంద్రాలు ఉండాలని ఉండాలని ఆ శాఖ నిర్ణయించినప్పటికి అమలుకు నోచుకోవడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. కింది స్థాయి సిబ్బంది నిర్లక్ష్యం, బడ్జెట్‌లోపం వెరసి అంగన్వాడీలు సమస్యల వలయంలో చిక్కుకుంటున్నాయి. నిధులు రావు.. పనులు కావు సిరిసిల్ల జిల్లాలో రెండు ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు కింద 587 అంగన్వాడీ కేంద్రాలు నడుస్తున్నాయి. వేములవాడ పరిధిలో 40 భవనాలు ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోయా యి. వీటిని ప్రారంభించి రెండేళ్లయినా నిర్మా ణాలు పూర్తి కాలేదని పలువురు వాపోతున్నారు. సిద్దిపేట, దుబ్బాక, చేర్యాల, గజ్వేల్, హుస్నాబాద్ ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 1,150 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఇందులో సొంతభవనా ల్లో ఉన్న అంగన్వాడీ కేంద్రాలు 298 ఉండగా, 422 అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. ప్రాథమిక పాఠశాలల్లో 368 అంగన్వాడీ కేంద్రాలు, 430 కేంద్రాలను అద్దె లేకుండా జీపీలు, కమ్యూనిటీ హాల్లో నిర్వహిస్తున్నారు. అద్దె భవనాల్లో తరచూ సమస్యలు తలెత్తుతుండడంతో అంగన్వాడీలు నడపలేకపోతున్నారు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే.. అంగన్వాడీ భవన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ పథకాలైన ఎంజీ నరేగా, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ (ఆర్ఐడీఎఫ్), ఏపీఐపీల ద్వారా నిధులు కేటాయిస్తారు. రాష్ట్ర స్థాయిలో జిల్లా పరిషత్ ఫండ్ నుంచి 15 శాతం, మండల పరిషత్ ఫండ్ నుంచి 15 శాతం తీర్మానాలు చేసి పరిమిత బిల్డింగ్‌లకు కేటాయిస్తుంటారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులతో రాష్ట్ర పరిధిలోని పంచాయతీరాజ్ ఏఈలు నిర్మాణ పనులు చేపడతారు. కొన్ని సందర్భాల్లో నిధులు విడుదలైనప్పటికీ అధికారుల అలసత్వం, నిధుల దుర్వినియోగంతో భవన నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉపాధి హామీ పథకం ద్వారా పనులు చేసిన వారికి బిల్లులు చెల్లించకపోవడంతో కొన్ని మధ్యలోనే ఆగిపోతున్నాయని పలువురు అధికారులు చెబుతున్నారు. కాగా, అంగన్వాడీ కేంద్రాలకు కేంద్రం నుంచి నిధులు రావాల్సి ఉందని మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ విజయేందిర బోయి తెలిపారు. -
'మంచి' నీరేనా
- గత కొన్నేళ్లలో ప్రాథమిక స్కూళ్లలో పెరగని తాగునీటి వసతి.. - దాని నాణ్యతపైనా అనుమానాలు.. 2010లో తాగునీటి సదుపాయమున్న బడులు 83% 2016లో తాగునీటి సదుపాయమున్న బడులు 85% ఇందులో వినియోగానికి అనువుగా ఉన్నవి 73% ఇందులో వినియోగానికి అనువుగా ఉన్నవి 74% గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందుతోందా..? అసలు వాటిలో నీటి సదుపాయాలెలా ఉన్నాయి..? విద్యార్థులకు అందిస్తున్న నీరు నిజంగా సురక్షితమేనా..? ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్(ఏఎస్ఈఆర్) అనే స్వచ్ఛంద సంస్థ దేశంలోని గ్రామీణ పాఠశాలల్లో అధ్యయనం చేసింది. ఆరేళ్ల క్రితంతో పోలిస్తే.. ప్రస్తుతం ప్రభుత్వ స్కూళ్లలో తాగునీటి పరిస్థితిలో కొద్ది మేరకే మార్పు వచ్చిందని సర్వేలో తేలింది. స్కూళ్లలో తాగునీటి సదుపాయాలపై (పైపులు, హ్యాండ్ పంపులు, నీటి కూజాలు వంటివి) ఈ సర్వే నిర్వహించారు. పైకి కనిపించడానికి 2016లో 74 శాతం తాగునీటి సదుపాయాలు వినియోగానికి అనువుగా ఉన్నప్పటికీ.. తాగు నీటి నాణ్యత సందేహాస్పదమే అంటున్నారు. ఎందుకంటే.. దీన్ని కచ్చితంగా పరీక్షించే వ్యవస్థ లేకపోవడం ఇందుకు ఓ కారణం. – సాక్షి, తెలంగాణ డెస్క్ ప్రాథమిక స్కూళ్లలో విద్యార్థులు 20 కోట్లు.. 2016లో ఏఎస్ఈఆర్ సంస్థ దేశంలోని 619 గ్రామీణ జిల్లాలకుగానూ 589 జిల్లాల్లో సర్వే చేసింది. 17,473 మంది సర్వేయర్లు ప్రాథమిక పాఠశాలలను పరిశీలించారు. ఏఎస్ఈఆర్ 2009 నుంచి గ్రామీణ ప్రభుత్వ స్కూళ్లలో తాగునీరు, పారిశుధ్య సదుపాయాలపై గణాంకాలను సేకరిస్తోంది. ప్రస్తుతం దేశంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య సుమారు 20 కోట్లు. వీరికి సర్వశిక్షా అభియాన్ నిబంధనల ప్రకారం.. ప్రతి పాఠశాలలోనూ తాగునీటి సదుపాయం ఉండటం తప్పనిసరి. అయితే తాగునీటి సదుపాయం వినియోగంలో ఉందా లేదా అనే విషయాన్ని మాత్రం ఇందులో ప్రస్తావించలేదు. తాగే నీరు సురక్షితమేనా? పాఠశాలల్లో తాగునీటి సదుపాయాలు సరిగ్గా ఉన్నాయా లేదా తాగునీటి నాణ్యత ఎలా ఉంది అనేదానిపై డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్(డీఐఎస్ఈ) గణాంకాలు సేకరించాలి. అయితే డీఐఎస్ఈ ఈ గణాంకాలను సరిగా సేకరించడం లేదు. ప్రభుత్వ ప్రాథమిక స్కూళ్లలో తాగునీటి వసతి తగ్గిన రాష్ట్రాలు -
ప్రైమరీ స్కూళ్ల పరిధిలోకి 12 వేల అంగన్వాడీ కేంద్రాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలల్లో 11,831 అంగన్వాడీ కేంద్రాలు అనుసంధానమయ్యాయి. ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రీ ప్రైమరీ విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగించాలని విద్యాశాఖ ఇటీవల నిర్ణయించింది. దీంతో ఇప్పటికే 7,602 అంగన్వాడీ కేంద్రాలను గతంలోనే ప్రాథమిక పాఠశాలల పరిధిలోకి తరలించగా, బడిబాటలో భాగంగా తాజాగా 4,229 అంగన్వాడీ కేంద్రాలను తరలించింది. వాటిల్లో బోధించేందుకు అవసరమైన పాఠ్యాంశాలను రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి ఇదివరకే రూపొందించింది. మరోవైపు మహిళా శిశు సంక్షేమ శాఖ కూడా పలు పాఠ్యాంశాలను అమలు చేస్తోంది. ప్రస్తుతం ఆ రెండింటినీ పరిశీలించి విద్యార్థులకు బోధన చేపట్టేలా విద్యా శాఖ ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రం మొత్తంలో 16,332 ప్రాథమిక పాఠశాలలు ఉండగా, 15,446 గ్రామాల్లో 31,414 అంగన్ వాడీ కేంద్రాలు ఉన్నాయి. మరో 8,177 గ్రామాల్లో ప్రాథమిక పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు వేర్వేరుగా కొనసాగుతున్నాయి. అయితే ఆ గ్రామాల్లో కొన్ని ప్రాథమిక పాఠశాలల్లో తగిన వసతులు, తరగతి గదులు లేనందున వాటిని పాఠశాలల పరిధిలోకి తరలించలేదు. పాఠశాలల్లో వసతులు కల్పించి వాటిని కూడా దశల వారీగా పాఠశాలల పరిధిలోకి తీసుకొచ్చేందుకు విద్యాశాఖ చర్యలు చేపడుతోంది. -
‘ప్రాథమిక’ కోత
– జిల్లాలో రెండు ప్రాథమిక పాఠశాలలు మూత – 40 ప్రాథమికోన్నత పాఠశాలల స్థాయి తగ్గింపు – ముగిసిన హేతుబద్ధీకరణ ప్రక్రియ – జిల్లాలో మిగిలిన పోస్టులు 1044 కర్నూలు (సిటీ): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా చేపట్టిన హేతుబద్ధీకరణ దాదాపు పూర్తి అయింది. దీంతో జిల్లా విద్యాశాఖ అధికారులు ఏ జిల్లాలో ఏయే పాఠశాలలు మూత పడుతాయి, స్థాయి తగ్గే స్కూళ్ల వివరాలను ఆన్లైన్లో పొందు పరిచారు. ఈ ప్రక్రియ పూర్తయితే దానిపైనే ఉపాధ్యాయుల బదిలీల దరఖాస్తు కొంతమేరకు ఆధారపడి ఉంది. జిల్లాలో ఆత్మకూరు మండలంలోని రెండు ప్రాథమిక పాఠశాలలు విద్యార్థుల సంఖ్య సింగిల్ డిజిట్లో ఉండటంతో వాటికి సమీపంలో ఉండే స్కూళ్లలో విలీనం చేశారు. దీంతో కేవలం ఆ రెండు స్కూళ్లు మాత్రమే హేతుబద్ధీకరణ వల్ల మూతపడనున్నాయి. అదేవిధంగా 40 ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పదిలోపు ఉండటం, స్కూలుకు, స్కూలుకు మధ్య ఉన్న దూరం 3కి.మీ మించి ఉండడంతో వాటి స్థాయిని ప్రాథమిక పాఠశాలగా తగ్గించారు. అయితే వీటిపై అభ్యంతరాలకు విద్యాశాఖ అనుమతి ఇవ్వకపోవడంతో ఉపాధ్యాయ వర్గాల నుంచి కొంత వ్యతిరేకత వస్తోంది. మిగిలిన పోస్టులు ఇవే.. జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో చేపట్టిన హేతుబద్ధీఖరణతో 1044 పోస్టులు మిగలనున్నాయి. వాస్తవానికి జిల్లాలో 3వేలకు పైగా టీచర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఈ మిగులు పోస్టులు ఖాళీలలో భర్తీ చేసిన తర్వాతనే క్లియర్ వేకెన్సీ లిస్టును విద్యాశాఖ అధికారులు ప్రదర్శించనున్నారు. ఈ జాబితా ఆధారంగానే ఉపాధ్యాయులు బదిలీల కోసం ఆప్షన్లు ఇచ్చుకుంటారు. అయితే ఉపాధ్యాయులు బదిలీల కోసం దరఖాస్తు చేసుకునేందుకు శనివారం చివరి రోజు కావడంతో క్లియర్ వేకెన్సీ పొజిషన్ తెలియక.. కొంతమంది ఆప్షన్లు ఇచ్చుకోవడంలో గందరగోళానికి గురవుతున్నారు. మిగులు ఇలా.. పాఠశాల మిగులు ఉపాధ్యాయుల సంఖ్య ప్రాథమిక 237 ప్రాథమికోన్నత 52 ఉన్నత 755 మిగిలిపోయిన పోస్టులు ఇవే.. ప్రాథమికోన్నత పాఠశాలల్లో గణితం 5పోస్టులు, సామాన్య శాస్త్రం 10 పోస్టులు, సాంఘిక శాస్త్రం 16 పోస్టులు, గ్రేడ్–1 తెలుగు 12, గ్రేడ్–1 హిందీ–9 పోస్టులు మిగిలాయి. ఉన్నత పాఠశాలల్లో గణితం కన్నడ మీడియం 3 పోస్టులు, తెలుగు మీడియం 90, ఉర్దూ మీడియం 4, భౌతిక శాస్త్రం కన్నడ మీడియం 1, తెలుగు మీడియం 119, ఉర్దూ మీడియం 6, బయోలజికల్ సైన్స్ తెలుగు మీడియం 65, కన్నడ 1, ఉర్దూ 5, సోషల్ కన్నడ మీడియం 1, తెలుగు మీడియం 55, ఉర్దూ 5, ఇంగ్లిష్ 115, గ్రేడ్–1 తెలుగు 15, హిందీ 3, ఫిజికల్ డైరెక్టర్ 60, పీఈటీ 2, ఇతర పోస్టులు 114, తెలుగు భాష పండిత పోస్టులు 60, హిందీ భాషా పండిత పోస్టులు 4 మిగలనున్నాయి. -
‘అంగన్వాడీ’ల తరలింపుపై అయోమయం
- ప్రాథమిక పాఠశాలల ఆవరణలోకి అంగన్వాడీ కేంద్రాలు తరలించాలని నిర్ణయం - అంగన్వాడీ కేంద్రాలున్నా ప్రాథమిక పాఠశాలలు లేని గ్రామాలు 991 - మరో 2,720 పాఠశాలల పరిధిలో అంగన్వాడీ కేంద్రాలు లేవు - సాధ్యాసాధ్యాలపై అధికారుల మల్లాగుల్లాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలల పరిధిలోకి అంగన్వాడీ కేంద్రాలను తరలించడంపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. అనేక పాఠశాలల పరిధిలో అంగన్వాడీ కేంద్రాలున్నా... 5 వేల వరకు పాఠశాలల్లో సరిపడ తరగతి గదులు లేక వాటిల్లోకి అంగన్వాడీ కేంద్రాలను తరలించలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు 991 గ్రామాల్లో ప్రాథమిక పాఠశాలలే లేని పరిస్థితులతో అంగన్వాడీ కేంద్రాలను తరలించడానికి వీల్లేని పరిస్థితి ఏర్పడింది. మరో 2,720 పాఠశాలల పరిధిలో అంగన్వాడీ కేంద్రాలే లేవు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక పాఠశాలలు ఉన్న ప్రాంతాల్లోని 1,797 పాఠశాలల పరిధిలోకి అంగన్వాడీ కేంద్రాలు ఇదివరకే వచ్చాయి. మరో 672 కేంద్రాలను తరలించారు. ఇక మిగిలిన స్కూళ్ల పరిధిలోకి జూన్ 12న స్కూళ్లు తెరిచేనాటికి వీలైనన్ని అంగన్ వాడీ కేంద్రాలను తరలించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఎన్నింటిని పాఠశాలల పరిధిలోకి తరలిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. 6.54 లక్షల మంది విద్యార్థులు ప్రస్తుతం రాష్ట్రంలో 35,750 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వాటిల్లో మెయిన్ అంగన్వాడీ కేంద్రాలు 31,711 ఉండగా, మినీ కేంద్రాలు 3,989 ఉన్నాయి. వాటిన్నింటిలో మూడు నుంచి 6 ఏళ్లలోపు పిల్లలు 6.54 లక్షల మంది ఉన్నాయి. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 18,162 ప్రాథమిక పాఠశాలలు ఉండగా, వాటిల్లో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదివే పిల్లలు 9,742,464 మంది విద్యార్థులు ఉన్నారు. ఆయా పాఠశాలల్లోకి తరలించేందుకు వీలుగా 5 కంటే ఎక్కువ గదులు ఉన్న పాఠశాలలను గుర్తించే పనిలో విద్యాశాఖ పడింది. కొన్నింటిలో ఐదు తరగతి గదులు లేకపోయినా విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నందున.. అక్కడికి అంగన్వాడీ కేంద్రాలను తరలించవచ్చని విద్యాశాఖ భావిస్తోంది.