హైదరాబాద్: ప్రొ. హరగోపాల్ నేతృత్వంలో విద్యా పరిరక్షణ కమిటీ సోమవారం తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిని కలిసింది. ఈ సందర్భంగా రేషనలైజేషన్ విషయమై కడియంతో విద్యా పరిరక్షణ కమిటీ చర్చించింది. రేషనలైజేషన్ పేరుతో స్కూళ్లు మూసివేయడం సరికాదని పేర్కొంది. తక్షణమే ప్రభుత్వ పాఠశాలల మూసివేత ఆపాలని డిమాండ్ చేసింది.
అంగన్వాడీలను ప్రాథమిక స్కూళ్లలో కలపాలని ప్రొ. హరగోపాల్ కోరారు. రేషనలైజేషన్కు వ్యతిరేకంగా ఈ నెల 25న అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నా చేయనున్నట్టు ప్రొ. హరగోపాల్ చెప్పారు.
'అంగన్వాడీలను ప్రాథమిక స్కూళ్లలో కలపాలి'
Published Mon, May 18 2015 3:57 PM | Last Updated on Sat, Jun 2 2018 8:29 PM
Advertisement
Advertisement