
ఎన్టీఆర్ జిల్లా, సాక్షి: వేతనాల పెంపు డిమాండ్‌తో అంగన్‌వాడీలు చేపట్టిన విజయవాడ మహా ధర్నా.. కూటమి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో మారుమోగుతోంది. చంద్రబాబూ.. డౌన్ డౌన్.. కూటమి సర్కార్‌కు మా సత్తా ఏంటో చూపిస్తామంటూ నినాదాలతో విజయవాడ మారుమోగుతోంది.
అంతకు ముందు.. ఛలో విజయవాడ ధర్నాను అడ్డుకునేందుకు శతవిధాల ప్రయత్నించారు. ఎక్కడికక్కడే అడ్డుకునేందుకు తనిఖీలు నిర్వహించారు. అయినప్పటికీ రాష్ట్రం నలుమూలలా నుంచి అంగన్‌వాడీలు తరలి వచ్చారు.
వేతనాల పెంపు సహా పలు సమస్యల పరిష్కార డిమాండ్లతో అంగన్‌వాడీలు సోమవారం (మార్చి 10న) ఛలో విజయవాడ ధర్నా నిర్వహించ తలపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విజయవాడ వెళ్లే అన్ని మార్గాలను పోలీసులు తమ గుప్పిట పెట్టుకున్నారు. అంగన్‌వాడీలను ఎక్కడికక్కడే అడ్డుకుంటూ నిరంకుశంగా వ్యవహరించారు. కానీ..

👉టియర్ గ్యాస్ వాహనంతో..
పోలీసుల వలయం దాటి.. విజయవాడకు ఇప్పటికే భారీగా చేరుకున్న అంగన్వాడీలు మహా ధర్నాకు సిద్ధమయ్యారు. అలంకార్ సెంటర్‌కు అంగన్‌వాడీలు చేరుకోవడంతో.. పోలీసులు అలర్ట్ అయ్యారు. భారీ సంఖ్యలో మహిళా పోలీసులు, సిబ్బంది మోహరించారు. రోడ్డు బ్లాక్ చేసి ఎవరిని ముందుకు కదలనివ్వడం లేదు. ఈ క్రమంలో.. టియర్ గ్యాస్ వాహనం సైతం అక్కడ కనిపించడం గమనార్హం. అయితే ధర్నాను అడ్డుకుంటే తమ సత్తా చూపిస్తామంటూ అంగన్‌వాడీలు చెబుతున్నారు.

👉రైళ్లోంచి బలవంతంగా..
అనంతపురం నుంచి అంగన్‌వాడీలు రైలులో విజయవాడకు బయల్దేరారు. అయితే..వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల స్టేషన్‌లో కార్యకర్తలతో పోలీసులు అమానుషంగా వ్యవహరించారు. బలవంతంగా వాళ్లను బయటకు దించేశారు. ఈ క్రమంలో చంద్రబాబు డౌన్.. డౌన్ నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది.
👉మచిలీపట్నం మూడు స్తంభాల సెంటర్ లో పోలీస్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ప్రతి వాహనాన్ని.. ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment