
సాక్షి, అమరావతి: అంగన్‌వాడీ స్కూళ్లు.. సోమవారం ‘వైఎస్సార్ ప్రీ ప్రైమరీ ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు’గా ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో 55,607 అంగన్‌వాడీ స్కూళ్లున్నాయి. వీటిలో 8.5 లక్షల మంది బాలలు విద్యాబుద్ధులు నేర్చుకుంటున్నారు. ఇప్పటివరకు విద్యాబుద్ధులు నేర్పే పద్ధతులు మార్చి ఆట వస్తువుల ద్వారా విద్యను నేర్పించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది.
పిల్లలను స్కూళ్లకు పంపించేందుకు 85 శాతం మంది తల్లిదండ్రులు సుముఖత వ్యక్తం చేస్తూ లిఖిత పూర్వకంగా అంగన్‌వాడీ టీచర్లకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు పిల్లలు స్కూళ్లకు హాజరయ్యారు. అంగన్‌వాడీ స్కూళ్లకు వచ్చే పిల్లల కోసం ప్రీ ప్రైమరీ1, ప్రీ ప్రైమరీ2, ప్రీ ఫస్ట్‌క్లాస్ తరగతులుగా విభజించి ఇంగ్లిష్ మాధ్యమంలో విద్యను నేర్పించే కార్యక్రమం మొదలైంది. ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల్లో వసతుల్ని మెరుగుపరిచింది. కాగా, రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలలు సోమవారం ప్రారంభమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment