ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల పరిశుభ్రత ఖర్చులకు నిధులు కేటా యిస్తామని పాఠశాల విద్యా కమిషనర్ టీచర్ల సంఘాలకు కొంతకాలం క్రితం హామీ ఇచ్చారు. ఆయన ఇచ్చిన హామీ మేరకు వెంటనే జీవో జారీచేయాలి. ఈ విషయం పై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా సుముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో విద్యాశాఖ ప్రతిపాదనలకు మోక్షం కలిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలను జారీచేయాలి.
రాష్ట్రంలో అత్యధిక శాతం పాఠశాలల్లో విద్యార్థినీ విద్యార్థులే తరగతి గదులను, పాఠశాల ఆవరణను పరిశుభ్రం చేస్తున్నారు. ప్రాథమిక పాఠశాలలకు రూ.1,000, ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ.1,500, ఉన్నత పాఠశాలలకు రూ.2,500 వంతున పరిశుభ్రత ఖర్చుల కింద కేటాయించాలని విద్యాశాఖ ఇటీవల ప్రతిపాదించింది. ప్రభుత్వం ఈ మేరకు ఆదే శాలు విడుదల చేస్తే పాఠశాలలకు మంచి జరగడమే కాకుండా, నిరుపేదలైన కొందరికి పాక్షికంగా ఉపాధి కలుగుతుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు విడు దల చేయాలని కోరుతున్నాను.
- వి.కొండలరావు పొందూరు, శ్రీకాకుళం జిల్లా
బడి పరిశుభ్రతకు జీవో
Published Sun, Jan 18 2015 12:35 AM | Last Updated on Sat, Sep 15 2018 5:14 PM
Advertisement
Advertisement