సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను బుధవారం నుంచి ఒంటిపూట మాత్రమే నిర్వహిస్తారు. కులగణన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఎస్‌జీటీల సేవలను సర్వేకు ఉపయోగిస్తున్నందున, మధ్యాహ్నం నుంచి పాఠ శాలలను మూడు వారాల పాటు మధ్యాహ్నం ఒంటిగంట వరకూ నడపాలని పాఠశాల విద్య డైరెక్టరేట్ ఆదేశించింది. మధ్యాహ్న భోజనం తర్వాత విద్యార్థులను ఇళ్లకు పంపుతారు.
టెట్ బులెటిన్ విడుదల రేపు
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ బులెటిన్‌ను ఈ నెల 7వ తేదీన విడుదల చేయనున్నట్టు పాఠశాల విద్య డైరెక్టరేట్ ఒక ప్రకటనలో తెలిపింది. వాస్తవానికి ఈ బులెటిన్‌ను మంగళవా రం విడుదల చేయాల్సి ఉంది. సాంకేతిక కారణాల వల్ల సాధ్యం కాలేదని పేర్కొంది.
ఎంబీఏ సాయంకాలపు కోర్సుల ప్రవేశ పరీక్ష 17కు వాయిదా
ఉస్మానియా యూనివర్సిటీ: ఈ నెల 9న జరగాల్సిన ఓయూ ఎంబీఏ సాయంకాలపు కోర్సుల ప్రవేశ పరీక్షను నవంబర్ 17కు వాయిదా వేశారు. వర్సిటీ క్యాంపస్‌లోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ కళాశాలలో సాయంకాలపు కోర్సులైన ఎంబీఏ, ఎంబీఏ టెక్నాలజీ మేనేజ్‌మెంట్ (టీఎం) ప్రవేశ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఈ నెల 14 వరకు రూ.500 అపరాధ రుసముతో దరఖాస్తు చేసుకోవచ్చని పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి తెలిపారు.
ముగిసిన వివిధ సెట్ల కౌన్సెలింగ్
ఉస్మానియా యూనివర్సిటీ: ఈ విద్యా సంవత్సరానికి వివిధ సెట్ల కౌన్సెలింగ్ పక్రియ ముగిసిందని కన్వీనర్ ప్రొఫెసర్ రమేశ్‌బాబు మంగళవారం తెలిపారు. పీజీ లాసెట్, లాసెట్–2024, పీజీఈసెట్–2024, ఎడ్‌సెట్– 2024, పీఈసెట్–2024 తదితర సెట్ల కౌన్సెలింగ్ ద్వారా సీట్లు భర్తీ చేసిన్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment