family Survey
-
వచ్చే నెల 2న కేబినెట్ సబ్ కమిటీకి సమగ్ర ఇంటింటి సర్వే నివేదిక
-
2న ‘సమగ్ర సర్వే’ నివేదిక
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నివేదికను అధికారులు వచ్చే నెల 2న మంత్రివర్గ ఉప సంఘానికి సమర్పించనున్నారు. దానికన్నా రెండు రోజులు ముందే నివేదిక ముసాయిదాను సిద్ధం చేసి అందించనున్నారు. ఈ మేరకు బుధవారం జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో వెల్లడించారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై బుధవారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి సమీక్షించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు, మాజీ మంత్రి జానారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమగ్ర కుటుంబ సర్వేను విజయవంతంగా నిర్వహించిన అధికారులు, ఉద్యోగులను ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి అభినందించారు. ఈ సర్వే రాష్ట్రంలో సామాజిక సాధికారతతోపాటు భవిష్యత్తులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బలహీన వర్గాల అభ్యున్నతికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ కుల సర్వే చేపట్టి చిత్తశుద్ధిని చాటుకుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీసీ డెడికేటెడ్ కమిషన్‌కు ఈ గణాంకాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ సర్వే దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిందని.. జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నం పట్ల ప్రశంసలు అందుతున్నాయని పేర్కొన్నారు. విస్తృత స్థాయిలో ప్రక్రియ చేపట్టి.. గత ఏడాది ఫిబ్రవరి 4న సీఎం రేవంత్ నేతృత్వంలో భేటీ అయిన రాష్ట్ర మంత్రివర్గం.. ఇంటింటి సర్వే ద్వారా కుల గణన చేపట్టాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై సబ్ కమిటీ ఏర్పాటు, పరిశీలన తర్వాత.. నవంబర్ 6న ‘సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే–2024’ ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో డిసెంబర్ మొదటి వారంలో సర్వే పూర్తయింది. ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు కలిపి దాదాపు లక్ష మంది వరకు ఉద్యోగులు పాలుపంచుకున్నారు. రాష్ట్రంలోని దాదాపు 1.16 కోట్ల కుటుంబాలను సర్వే కోసం గుర్తించగా.. 96 శాతం కుటుంబాల వివరాలను సర్వే బృందాలు సేకరించాయి. కొన్నిచోట్ల కుటుంబాలు సర్వేకు నిరాకరించటం, ఇళ్లకు తాళాలు ఉండటం, అందుబాటులో లేకపోవటంతో మిగతా కుటుంబాల వివరాల సేకరణ జరగలేదని అధికారులు సమీక్షలో వివరించారు. -
కులగణన సమాజానికి ‘ఎక్స్‌రే’ లాంటిది... తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడి
-
సర్వేతో పథకాలకు ముప్పులేదు
బంజారాహిల్స్: ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేతో ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపా రు. ఎవరికీ సంక్షేమ పథకాలను రద్దుచేయబోమని భరోసా ఇచ్చారు. అర్హులకు మరిన్ని పథకాలు అమలవుతాయని చెప్పారు. బంజారాహిల్స్ ఎన్బీటీనగర్లోని ఎన్క్లేవ్ అపార్ట్‌మెంట్స్‌లో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కమిషనర్ స్నేహ శబరీష్ తో కలిసి గురువారం ఆయన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కుటుంబ సర్వేపై ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని ప్రజలకు సూచించారు. సర్వే సమాచారం గోప్యంగా ఉంటుందని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రజల స్థితిగతులు తెలుసుకొని పటిష్టమైన భవిష్యత్తు ప్రణాళికల ద్వారా రాష్ట్రంలో మంచి మార్పు తీసుకువచ్చి ఆదర్శ తెలంగాణను ఆవిష్కరించటమే సర్వే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఇప్పటికే 30 శాతం సర్వే పూర్తయ్యిందని తెలిపారు. -
సర్వే చేస్తున్నఉద్యోగులకు ఎదురు ప్రశ్నలు..
-
సమగ్ర సర్వే: మా అప్పులు తీరుస్తారా? మీకెందుకు చెప్పాలి?
‘‘మా ఆస్తుల వివరాలు, వార్షికాదాయం లెక్కలు ఎందుకు? స్థిర, చరాస్తులు, బ్యాంకు ఖాతా వివరాలతో ఏం చేస్తారు? ధరణి పాస్‌బుక్ నంబర్ ఎందుకు చెప్పాలి? మేం ఎక్కడ రుణం తీసుకుంటే, ఎందుకోసం తీసుకుంటే ప్రభుత్వానికి ఎందుకు? వీటితో మాకొచ్చే ప్రయోజనం ఏంటి? రైతుబంధు రానప్పుడు భూముల వివరాలు ఎందుకు అడుగుతున్నారు? ఇల్లు ఎన్ని గజాల్లో ఉంటే ఏం చేస్తారు?.. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కోసం వెళ్తున్న ఎన్యూమరేటర్లకు ప్రజల నుంచి ఎదురవుతున్న ప్రశ్నలివి. అసలు ఈ సర్వే ఎందుకు చేస్తున్నారో, ఏ వివరాలు చెబితే ఏ పథకాలకు కోతపెడతారో, రేషన్‌కార్డు ఏమైనా రద్దు చేస్తారోనని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక వివరాలు, ఉద్యోగం, వ్యాపారం వంటి వివరాలు చెప్పడానికి ముందుకురాని పరిస్థితి కనిపిస్తోంది. దీనిపై ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో చేపట్టిన పరిశీలనలో వెల్లడైన అంశాలివీ..సాక్షి, హైదరాబాద్/సాక్షి నెట్వర్క్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో వివరాల సేకరణ గందరగోళంగా మారింది. పేర్లు, కులం, వృత్తి వంటి కొన్ని సాధారణ వివరాలను వెల్లడిస్తున్న జనం.. ఆర్థికపర అంశాలను వెల్లడించేందుకు ఇష్టపడటం లేదు. ప్రజల నుంచి సరైన సమాధానాలు రాకపోవడం, కొన్ని అంశాల్లో సందేహాలు వ్యక్తం చేస్తూ ఎదురు ప్రశ్నలు వేస్తుండటం, వారికి సర్దిచెప్పాల్సి రావడంతో సర్వేలో తీవ్ర జాప్యం జరుగుతోందని ఎన్యుమరేటర్లు వాపోతున్నారు.మరోవైపు పేద వర్గాల నుంచి మాత్రం సర్వేకు మంచి స్పందన కనిపిస్తోంది. రేషన్‌కార్డులు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు కావాలంటూ పెద్ద సంఖ్యలో విజ్ఞప్తులు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే ప్రక్రియలో భాగంగా... ఈ నెల 6వ తేదీ నుంచి ఇళ్లను గుర్తించి స్టిక్కర్లు వేసిన సంగతి తెలిసిందే. శనివారం నుంచి ఎన్యూమరేటర్లు ఆ ఇళ్లకు వెళ్లి పూర్తి వివరాలను సేకరించి, సర్వే ఫారాల్లో నమోదు చేసే ప్రక్రియను ప్రారంభించారు. కాలమ్ నంబర్ 19 నుంచి తిప్పలు! రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రశ్నావళిలో 75 ప్రశ్నలు (56 ప్రధాన ప్రశ్నలు, 19 ఉప ప్రశ్నలు) ఉన్నాయి. సర్వే బుక్లెట్ రెండు భాగాలుగా ఉంది. మొదటి విభాగం (పార్ట్–1)లో కుటుంబ యజమాని, కుటుంబ సభ్యుల వ్యక్తిగత వివరాలపై ప్రశ్నలు అడుగుతున్నారు. ఇందులో విద్య, ఉద్యోగ, ఉపాధి, భూమి, రిజర్వేషన్లు, రాజకీయాలు, వలసలకు సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయి. సాధారణ వివరాలను వెల్లడించేందుకు ప్రజలు సిద్ధంగానే ఉన్నా.. కాలమ్ నంబర్ 19 నుంచి వస్తున్న పలు ప్రశ్నలు ఆందోళన రేపుతున్నాయి.ప్రధానంగా వ్యాపారం వార్షిక టర్నోవర్, వార్షికాదాయం, ఆదాయ పన్ను చెల్లింపులు, బ్యాంకు ఖాతా సమాచారం, భూములు, ధరణి పాసు పుస్తకం వివరాలు, భూమి కొనుగోలు కోసం వనరులకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించేందుకు చాలా మంది విముఖత చూపుతున్నారు. అదేవిధంగా రిజర్వేషన్ ఫలాలు, ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన వివరాలను అడిగినప్పుడు.. ఆ వివరాలు ఎందుకని ఎదురు ప్రశ్నలు ఎన్యూమరేటర్లకు ఎదురవుతున్నాయి. ‘ఆర్థిక స్థితిగతుల’పై ఆందోళన సర్వే ప్రశ్నావళి రెండో విభాగం (పార్ట్–2)లో కుటుంబ ఆర్థిక స్థితిగతులపై ప్రశ్నలు అడిగినప్పుడు ప్రజల్లో ఆందోళన కనిపిస్తోంది. వాటికి సరైన సమాధానం రావడం లేదని ఎన్యూమరేటర్లు చెప్తు న్నారు. రుణాలు, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు, పశు సంపద, స్థిరాస్తి, వాహనాలు, రేషన్‌కార్డు, నివాస గృహానికి సంబంధించిన సమాచారాన్ని చెప్పేందుకు ఇష్టపడటం లేదని అంటున్నారు. బ్యాంకు రుణాలు, అప్పులు, ఆస్తులకు సంబంధించిన ప్ర శ్నలు అడుగుతున్నప్పుడు ప్రజల నుంచి ఎదురు ప్రశ్నలు వస్తున్నాయని వివరిస్తున్నారు. ‘మేం రుణాలు చెల్లించకుంటే ప్రభు త్వం చెల్లిస్తుందా? ఆస్తుల వివరాలు మేమెందుకు చెప్పాలి? మా కున్న అప్పులకు ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? ఆదాయం వి వరాలు చెబితే పథకాలు వస్తాయా? ఉన్నవాటికి కోతపెడతారా?’ అని ప్రజలు నిలదీస్తున్నారని ఎన్యూమరేటర్లు వాపోతున్నారు. శనివారమూ కొనసాగిన స్టిక్కరింగ్ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ఈ నెల 6వ తేదీనే ప్రారంభమైంది. 6, 7, 8వ తేదీల్లో ఎన్యూమరేటర్లు తమకు కేటాయించిన ప్రాంతంలోని ఇళ్లను పరిశీలించి యజమానులు, అద్దెదారుల వివరాలను తెలుసుకుని, స్టిక్కర్లు అంటించాలని, 9వ తేదీ నుంచి సర్వే ఫారాల్లో వివరాల నమోదు చేపట్టాలని నిర్ణయించారు. కానీ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో నాలుగో రోజు కూడా స్టిక్కరింగ్ ప్రక్రియే కొనసాగింది. ఇళ్లకు తాళం ఉండటం, యజమానులు అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో ఇళ్ల విజిటింగ్, స్టిక్కరింగ్ ప్రక్రియలో జాప్యం జరిగినట్లు ఎన్యూమరేటర్లు చెప్తున్నారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా స్టిక్కరింగ్ ప్రక్రియ పూర్తయిందని.. ఆదివారం నుంచి సర్వే ఫారాల్లో వివరాల నమోదు కొనసాగుతుందని ప్రణాళిక శాఖ వర్గాలు వెల్లడించాయి. వివరాల సేకరణలో తిప్పలు సర్వేలో ఒక్కో ఇంటికి సంబంధించి 75 ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టడం, 43 ప్రశ్నలకు బుక్లెట్ చూసుకుని కోడింగ్ వేయడం వేయడం ఎన్యూమరేటర్లకు తలకు మించిన భారమవుతోంది. పట్టణాలు, గ్రామాల్లో 150 నుంచి 175 వరకు ఇళ్లను ఎన్యూమరేషన్ బ్లాక్‌గా విభజించి ఒక్కో ఎన్యూమరేటర్‌కు అప్పగించారు. రోజుకు 10 ఇళ్లలో సర్వే చేయాలని ఆదేశించారు. కానీ చాలా ప్రాంతాల్లో తొలిరోజు ఐదు, ఆరు ఇళ్ల సర్వేనే పూర్తయింది. కుటుంబాలు ఎక్కువగా ఉన్న ఇళ్లలో అయితే గంటకుపైనే సమయం పడుతోందని.. మధ్యాహ్నం నుంచి కాకుండా రోజంతా చేస్తేనే సర్వే పూర్తవుతుందని సిబ్బంది స్పష్టం చేస్తున్నారు. వివరాలు సేకరిస్తూ ఫామ్ నింపడం కష్టంగా ఉండటంతో కుటుంబ సభ్యులను సహాయకులుగా తీసుకెళుతున్నట్టు చెప్తున్నారు. ఇళ్లకు తాళాలతో ఇబ్బంది పంటల కోతల సమయం కావడంతో ఎన్యూమరేటర్లు ఎప్పుడు వస్తారో తెలియక రైతులు, కూలీలు పనులకు వెళ్తున్నారు. దీనితో సర్వే కోసం వెళ్తున్న ఎన్యూమరేటర్లకు తాళాలు వేసిన ఇళ్లు దర్శనమిస్తున్నాయి. పట్టణాల్లో ఇళ్లలో ఎవరో ఒకరు ఉంటుండటంతో సర్వే ముందుకుసాగుతోంది. తాళాలు వేసిన ఇళ్లను గుర్తుంచుకుని మళ్లీ రావడం ఇబ్బందేనని ఎన్యూమరేటర్లు చెప్తున్నారు.జిల్లాల వారీగా ‘సర్వే’ తీరును పరిశీలిస్తే.. ⇒ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 8,53,950 ఇళ్లు ఉండగా ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో శనివారం రాత్రి వరకు స్టిక్కరింగ్ పూర్తి కాలేదు. వ్యవసాయ సీజన్ కావడంతో రైతులు, కూలీలు పొలాలకు వెళ్లడంతో చాలా ఇళ్లకు తాళం వేసి ఉంది. కొందరు ఇళ్ల యజమానులు వ్యక్తిగత వివరాలు చెప్పేందుకు నిరాకరించారు. భద్రాద్రి జిల్లాలో సర్వే ఫామ్‌లు ఆలస్యంగా చేరాయి. ఏజెన్సీ ఏరియాలో ఎస్టీ సామాజిక వర్గానికి చెందినవారు కులాంతర, మతాంతర వివాహాలు చేసుకుంటే ఆ వివరాలు చెప్పలేదు. గొత్తికోయలకు ఆధార్‌కార్డులు, ఓటరు కార్డులు ఉన్నా కులం సర్టిఫికెట్లు లేక సర్వేలో ఏం రాయాలో స్పష్టత లేకుండా పోయింది. ⇒ ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా మంది ఆదాయ వివరాలను సరిగ్గా చెప్పలేదు. ధరణి సమాచారం అడిగిన ఎన్యుమరేటర్లకు ‘మీకెందుకు?’అనే ప్రశ్న ఎదురైంది. రోజువారీ కూలీలు మొదటిరోజు పనులు వదులుకుని ఇంటి వద్దే ఉన్నా ఎన్యుమరేటర్లు రాక విసుగుపడటం కనిపించింది. ఇంటి నిర్మాణం, విస్తీర్ణంపై సమాధానాలు రాలేదు. ఐటీ రిటర్నులు, వడ్డీ వ్యాపారులు, కులాంతర వివాహాల సమాచారం రాబట్టలేకపోతున్నారు. ⇒ కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధిలో శనివారం కూడా స్టిక్కరింగే కొనసాగింది. పలుచోట్ల కొందరు ఇంటికి స్టిక్కర్లు వేయవద్దంటూ నిరాకరించారు. ⇒ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పత్రాల కొరతతో సర్వే ఆలస్యంగా మొదలైంది. ఒక్కో ఎన్యుమరేటర్ రోజుకు పది గృహాలను అప్పగించగా.. సమయం సరిపోక 5, 6 ఇళ్లే సర్వే చేస్తున్నారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో శనివారం రాత్రి వరకు కూడా స్టిక్కరింగ్ కొనసాగింది. రెండో శనివారం కావడంతో ఆరీ్పలు, ఉపాధ్యాయులు సర్వేకు హాజరుకాలేదు. బోధన్ నియోజకవర్గంలో సర్వే స్టిక్కర్లు వేయలేదని స్థానికులు చెప్పారు. ⇒ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 11,17,467 ఇళ్లు ఉండగా.. 8,231 మంది ఎన్యుమరేటర్లను నియమించారు. గ్రామీణ ప్రాంతాల్లో భూములు, ఆస్తుల వివరాలను చెప్పడం లేదు. ఆధార్ నంబర్, పాస్‌బుక్ వివరాలు ఇచ్చేందుకు కూడా వెనకాడుతున్నారు. పట్టణాల్లో దాదాపు అన్ని వివరాలు చెబుతున్నా ఉద్యోగం, ఆస్తి వివరాలు దాటవేస్తున్నారు. ⇒ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 8.5 లక్షల కుటుంబాలు ఉన్నట్లు గుర్తించారు. పలువురు ఆస్తులు, భూములు, ఓపెన్ ప్లాట్ల వివరాలు చెప్పడం లేదు. ఇంట్లో ఉద్యోగం చేసే వారి వివరాలు చెప్పడం లేదు. ఉమ్మడి కుటుంబాల్లోని వారు వేర్వేరుగా వివరాలు నమోదు చేయాలని కోరుతున్నారు. ధరణి పాస్ బుక్ నంబర్, ఆధార్ కార్డులు వెతకడం, పట్టాపాస్ బుక్‌లు బ్యాంకుల్లో ఉండటంతో వివరాల నమోదులో జాప్యం జరుగుతోంది. బెల్లంపల్లిలో చాలాచోట్ల వార్డు కౌన్సిలర్లు, నాయకులు అందరినీ ఒకేచోటకు పిలిపించి.. వివరాలు నమోదు చేయించారు. ⇒ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 9,67,871 కుటుంబాలు ఉన్నాయి. రుణాలు, భూములు, ఆస్తి వివరాలు చెప్పడానికి చాలామంది ముందుకురాలేదు. బీసీ–ఈ, సీ సరి్టఫికెట్లు తీసుకున్న వారు చెప్పడానికి వెనుకంజ వేశారు. కొందరు మహిళా టీచర్లు తమ భర్త, పిల్లలను సహాయకులుగా తెచ్చుకున్నారు.రైతు భరోసా లేదు.. నేనెందుకు చెప్పాలి?వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గిరి్నబావి ప్రాంతంలో నరిగె ఐలయ్య ఇంటికి సర్వే కోసం ఎన్యూమరేటర్ వెళ్లారు. కొన్నింటికి సమాధానాలు చెప్పిన ఐలయ్య.. వ్యక్తిగత ఆస్తుల విషయంలో సరిగా స్పందించలేదు. రైతు భరోసా రానప్పుడు భూమి వివరాలు ఎందుకని ఎదురు ప్రశ్నించారు. పింఛన్ ఎప్పుడు ఇస్తారని ఆరా తీశారు. ఎన్యూమరేటర్ సర్దిచెప్పడంతో చివరకు భూమి వివరాలు చెప్పినా.. ఈ కుటుంబం వద్దే రెండు గంటలు గడిచిపోయింది.అరగంట నుంచి గంట వరకు పడుతోంది.. మాకు రోజుకు 20 కుటుంబాల చొప్పున సర్వే చేయాలంటూ బుక్లెట్లు ఇచ్చారు. ప్రశ్నలు అడగడం, వాటి కోడ్ కోసం బుక్లెట్ చూడటం ఇబ్బందిగా ఉంది. డైరెక్ట్‌గా ఫామ్‌లోనే నమోదు చేసేలా ఉంటే బాగుండేది. సర్వేపై ప్రజలకు అవగాహన లేక సమాధానాలు చెప్పడానికి ఆలోచిస్తున్నారు. ఒక కుటుంబంలో ఎక్కువ మంది సభ్యులు ఉంటే అరగంట నుంచి గంట వరకు సమయం పడుతోంది. – ఎన్.పారిజాత, ఎన్యుమరేటర్, నకిరేకల్, నల్లగొండ జిల్లావివరాలు చెప్పేందుకు వెనకాడుతున్నారు ఇంటి యజమానిని ప్రశ్నలన్నీ అడిగి పూర్తి చేయడానికి చా లా సమయం పడుతోంది. కొన్ని ప్రశ్నలకు జవాబు చెప్పేందుకు చాలా మంది ఇష్టపడటం లేదు. అవగాహన లేకపోవడంతో ఆస్తులకు సంబంధించిన వివరాలు చెప్పడానికి వెనుకాడుతున్నారు. కొన్ని ఇళ్ల వద్ద గంట దాకా సమయం పడుతోంది. సర్వే కోసం మరికొంత సమయం ఇవ్వాలి. – వేలిశెట్టి నరసింహారావు, ఎన్యుమరేటర్, వైరా, ఖమ్మం జిల్లా -
మీకెందుకు చెప్పాలి?
‘‘మా ఆస్తుల వివరాలు, వార్షికాదాయం లెక్కలు ఎందుకు? స్థిర, చరాస్తులు, బ్యాంకు ఖాతా వివరాలతో ఏం చేస్తారు? ధరణి పాస్‌బుక్ నంబర్ ఎందుకు చెప్పాలి? మేం ఎక్కడ రుణం తీసుకుంటే, ఎందుకోసం తీసుకుంటే ప్రభుత్వానికి ఎందుకు? వీటితో మాకొచ్చే ప్రయోజనం ఏంటి? రైతుబంధు రానప్పుడు భూముల వివరాలు ఎందుకు అడుగుతున్నారు? ఇల్లు ఎన్ని గజాల్లో ఉంటే ఏం చేస్తారు?.. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కోసం వెళ్తున్న ఎన్యూమరేటర్లకు ప్రజల నుంచి ఎదురవుతున్న ప్రశ్నలివి. అసలు ఈ సర్వే ఎందుకు చేస్తున్నారో, ఏ వివరాలు చెబితే ఏ పథకాలకు కోతపెడతారో, రేషన్‌కార్డు ఏమైనా రద్దు చేస్తారోనని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక వివరాలు, ఉద్యోగం, వ్యాపారం వంటి వివరాలు చెప్పడానికి ముందుకురాని పరిస్థితి కనిపిస్తోంది. దీనిపై ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో చేపట్టిన పరిశీలనలో వెల్లడైన అంశాలివీ..సాక్షి, హైదరాబాద్/సాక్షి నెట్వర్క్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో వివరాల సేకరణ గందరగోళంగా మారింది. పేర్లు, కులం, వృత్తి వంటి కొన్ని సాధారణ వివరాలను వెల్లడిస్తున్న జనం.. ఆర్థికపర అంశాలను వెల్లడించేందుకు ఇష్టపడటం లేదు. ప్రజల నుంచి సరైన సమాధానాలు రాకపోవడం, కొన్ని అంశాల్లో సందేహాలు వ్యక్తం చేస్తూ ఎదురు ప్రశ్నలు వేస్తుండటం, వారికి సర్దిచెప్పాల్సి రావడంతో సర్వేలో తీవ్ర జాప్యం జరుగుతోందని ఎన్యుమరేటర్లు వాపోతున్నారు. మరోవైపు పేద వర్గాల నుంచి మాత్రం సర్వేకు మంచి స్పందన కనిపిస్తోంది. రేషన్‌కార్డులు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు కావాలంటూ పెద్ద సంఖ్యలో విజ్ఞప్తులు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే ప్రక్రియలో భాగంగా... ఈ నెల 6వ తేదీ నుంచి ఇళ్లను గుర్తించి స్టిక్కర్లు వేసిన సంగతి తెలిసిందే. శనివారం నుంచి ఎన్యూమరేటర్లు ఆ ఇళ్లకు వెళ్లి పూర్తి వివరాలను సేకరించి, సర్వే ఫారాల్లో నమోదు చేసే ప్రక్రియను ప్రారంభించారు. కాలమ్ నంబర్ 19 నుంచి తిప్పలు! రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రశ్నావళిలో 75 ప్రశ్నలు (56 ప్రధాన ప్రశ్నలు, 19 ఉప ప్రశ్నలు) ఉన్నాయి. సర్వే బుక్లెట్ రెండు భాగాలుగా ఉంది. మొదటి విభాగం (పార్ట్–1)లో కుటుంబ యజమాని, కుటుంబ సభ్యుల వ్యక్తిగత వివరాలపై ప్రశ్నలు అడుగుతున్నారు. ఇందులో విద్య, ఉద్యోగ, ఉపాధి, భూమి, రిజర్వేషన్లు, రాజకీయాలు, వలసలకు సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయి. సాధారణ వివరాలను వెల్లడించేందుకు ప్రజలు సిద్ధంగానే ఉన్నా.. కాలమ్ నంబర్ 19 నుంచి వస్తున్న పలు ప్రశ్నలు ఆందోళన రేపుతున్నాయి. ప్రధానంగా వ్యాపారం వార్షిక టర్నోవర్, వార్షికాదాయం, ఆదాయ పన్ను చెల్లింపులు, బ్యాంకు ఖాతా సమాచారం, భూములు, ధరణి పాసు పుస్తకం వివరాలు, భూమి కొనుగోలు కోసం వనరులకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించేందుకు చాలా మంది విముఖత చూపుతున్నారు. అదేవిధంగా రిజర్వేషన్ ఫలాలు, ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన వివరాలను అడిగినప్పుడు.. ఆ వివరాలు ఎందుకని ఎదురు ప్రశ్నలు ఎన్యూమరేటర్లకు ఎదురవుతున్నాయి. ‘ఆర్థిక స్థితిగతుల’పై ఆందోళన సర్వే ప్రశ్నావళి రెండో విభాగం (పార్ట్–2)లో కుటుంబ ఆర్థిక స్థితిగతులపై ప్రశ్నలు అడిగినప్పుడు ప్రజల్లో ఆందోళన కనిపిస్తోంది. వాటికి సరైన సమాధానం రావడం లేదని ఎన్యూమరేటర్లు చెప్తు న్నారు. రుణాలు, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు, పశు సంపద, స్థిరాస్తి, వాహనాలు, రేషన్‌కార్డు, నివాస గృహానికి సంబంధించిన సమాచారాన్ని చెప్పేందుకు ఇష్టపడటం లేదని అంటున్నారు. బ్యాంకు రుణాలు, అప్పులు, ఆస్తులకు సంబంధించిన ప్ర శ్నలు అడుగుతున్నప్పుడు ప్రజల నుంచి ఎదురు ప్రశ్నలు వస్తున్నాయని వివరిస్తున్నారు. ‘మేం రుణాలు చెల్లించకుంటే ప్రభు త్వం చెల్లిస్తుందా? ఆస్తుల వివరాలు మేమెందుకు చెప్పాలి? మా కున్న అప్పులకు ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? ఆదాయం వి వరాలు చెబితే పథకాలు వస్తాయా? ఉన్నవాటికి కోతపెడతారా?’ అని ప్రజలు నిలదీస్తున్నారని ఎన్యూమరేటర్లు వాపోతున్నారు. శనివారమూ కొనసాగిన స్టిక్కరింగ్ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ఈ నెల 6వ తేదీనే ప్రారంభమైంది. 6, 7, 8వ తేదీల్లో ఎన్యూమరేటర్లు తమకు కేటాయించిన ప్రాంతంలోని ఇళ్లను పరిశీలించి యజమానులు, అద్దెదారుల వివరాలను తెలుసుకుని, స్టిక్కర్లు అంటించాలని, 9వ తేదీ నుంచి సర్వే ఫారాల్లో వివరాల నమోదు చేపట్టాలని నిర్ణయించారు. కానీ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో నాలుగో రోజు కూడా స్టిక్కరింగ్ ప్రక్రియే కొనసాగింది. ఇళ్లకు తాళం ఉండటం, యజమానులు అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో ఇళ్ల విజిటింగ్, స్టిక్కరింగ్ ప్రక్రియలో జాప్యం జరిగినట్లు ఎన్యూమరేటర్లు చెప్తున్నారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా స్టిక్కరింగ్ ప్రక్రియ పూర్తయిందని.. ఆదివారం నుంచి సర్వే ఫారాల్లో వివరాల నమోదు కొనసాగుతుందని ప్రణాళిక శాఖ వర్గాలు వెల్లడించాయి. వివరాల సేకరణలో తిప్పలు సర్వేలో ఒక్కో ఇంటికి సంబంధించి 75 ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టడం, 43 ప్రశ్నలకు బుక్లెట్ చూసుకుని కోడింగ్ వేయడం వేయడం ఎన్యూమరేటర్లకు తలకు మించిన భారమవుతోంది. పట్టణాలు, గ్రామాల్లో 150 నుంచి 175 వరకు ఇళ్లను ఎన్యూమరేషన్ బ్లాక్‌గా విభజించి ఒక్కో ఎన్యూమరేటర్‌కు అప్పగించారు. రోజుకు 10 ఇళ్లలో సర్వే చేయాలని ఆదేశించారు. కానీ చాలా ప్రాంతాల్లో తొలిరోజు ఐదు, ఆరు ఇళ్ల సర్వేనే పూర్తయింది. కుటుంబాలు ఎక్కువగా ఉన్న ఇళ్లలో అయితే గంటకుపైనే సమయం పడుతోందని.. మధ్యాహ్నం నుంచి కాకుండా రోజంతా చేస్తేనే సర్వే పూర్తవుతుందని సిబ్బంది స్పష్టం చేస్తున్నారు. వివరాలు సేకరిస్తూ ఫామ్ నింపడం కష్టంగా ఉండటంతో కుటుంబ సభ్యులను సహాయకులుగా తీసుకెళుతున్నట్టు చెప్తున్నారు. ఇళ్లకు తాళాలతో ఇబ్బంది పంటల కోతల సమయం కావడంతో ఎన్యూమరేటర్లు ఎప్పుడు వస్తారో తెలియక రైతులు, కూలీలు పనులకు వెళ్తున్నారు. దీనితో సర్వే కోసం వెళ్తున్న ఎన్యూమరేటర్లకు తాళాలు వేసిన ఇళ్లు దర్శనమిస్తున్నాయి. పట్టణాల్లో ఇళ్లలో ఎవరో ఒకరు ఉంటుండటంతో సర్వే ముందుకుసాగుతోంది. తాళాలు వేసిన ఇళ్లను గుర్తుంచుకుని మళ్లీ రావడం ఇబ్బందేనని ఎన్యూమరేటర్లు చెప్తున్నారు.జిల్లాల వారీగా ‘సర్వే’ తీరును పరిశీలిస్తే.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 8,53,950 ఇళ్లు ఉండగా ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో శనివారం రాత్రి వరకు స్టిక్కరింగ్ పూర్తి కాలేదు. వ్యవసాయ సీజన్ కావడంతో రైతులు, కూలీలు పొలాలకు వెళ్లడంతో చాలా ఇళ్లకు తాళం వేసి ఉంది. కొందరు ఇళ్ల యజమానులు వ్యక్తిగత వివరాలు చెప్పేందుకు నిరాకరించారు. భద్రాద్రి జిల్లాలో సర్వే ఫామ్‌లు ఆలస్యంగా చేరాయి. ఏజెన్సీ ఏరియాలో ఎస్టీ సామాజిక వర్గానికి చెందినవారు కులాంతర, మతాంతర వివాహాలు చేసుకుంటే ఆ వివరాలు చెప్పలేదు. గొత్తికోయలకు ఆధార్‌కార్డులు, ఓటరు కార్డులు ఉన్నా కులం సర్టిఫికెట్లు లేక సర్వేలో ఏం రాయాలో స్పష్టత లేకుండా పోయింది. ⇒ ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా మంది ఆదాయ వివరాలను సరిగ్గా చెప్పలేదు. ధరణి సమాచారం అడిగిన ఎన్యుమరేటర్లకు ‘మీకెందుకు?’అనే ప్రశ్న ఎదురైంది. రోజువారీ కూలీలు మొదటిరోజు పనులు వదులుకుని ఇంటి వద్దే ఉన్నా ఎన్యుమరేటర్లు రాక విసుగుపడటం కనిపించింది. ఇంటి నిర్మాణం, విస్తీర్ణంపై సమాధానాలు రాలేదు. ఐటీ రిటర్నులు, వడ్డీ వ్యాపారులు, కులాంతర వివాహాల సమాచారం రాబట్టలేకపోతున్నారు. ⇒ కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధిలో శనివారం కూడా స్టిక్కరింగే కొనసాగింది. పలుచోట్ల కొందరు ఇంటికి స్టిక్కర్లు వేయవద్దంటూ నిరాకరించారు. ⇒ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పత్రాల కొరతతో సర్వే ఆలస్యంగా మొదలైంది. ఒక్కో ఎన్యుమరేటర్ రోజుకు పది గృహాలను అప్పగించగా.. సమయం సరిపోక 5, 6 ఇళ్లే సర్వే చేస్తున్నారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో శనివారం రాత్రి వరకు కూడా స్టిక్కరింగ్ కొనసాగింది. రెండో శనివారం కావడంతో ఆరీ్పలు, ఉపాధ్యాయులు సర్వేకు హాజరుకాలేదు. బోధన్ నియోజకవర్గంలో సర్వే స్టిక్కర్లు వేయలేదని స్థానికులు చెప్పారు. ⇒ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 11,17,467 ఇళ్లు ఉండగా.. 8,231 మంది ఎన్యుమరేటర్లను నియమించారు. గ్రామీణ ప్రాంతాల్లో భూములు, ఆస్తుల వివరాలను చెప్పడం లేదు. ఆధార్ నంబర్, పాస్‌బుక్ వివరాలు ఇచ్చేందుకు కూడా వెనకాడుతున్నారు. పట్టణాల్లో దాదాపు అన్ని వివరాలు చెబుతున్నా ఉద్యోగం, ఆస్తి వివరాలు దాటవేస్తున్నారు. ⇒ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 8.5 లక్షల కుటుంబాలు ఉన్నట్లు గుర్తించారు. పలువురు ఆస్తులు, భూములు, ఓపెన్ ప్లాట్ల వివరాలు చెప్పడం లేదు. ఇంట్లో ఉద్యోగం చేసే వారి వివరాలు చెప్పడం లేదు. ఉమ్మడి కుటుంబాల్లోని వారు వేర్వేరుగా వివరాలు నమోదు చేయాలని కోరుతున్నారు. ధరణి పాస్ బుక్ నంబర్, ఆధార్ కార్డులు వెతకడం, పట్టాపాస్ బుక్‌లు బ్యాంకుల్లో ఉండటంతో వివరాల నమోదులో జాప్యం జరుగుతోంది. బెల్లంపల్లిలో చాలాచోట్ల వార్డు కౌన్సిలర్లు, నాయకులు అందరినీ ఒకేచోటకు పిలిపించి.. వివరాలు నమోదు చేయించారు. ⇒ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 9,67,871 కుటుంబాలు ఉన్నాయి. రుణాలు, భూములు, ఆస్తి వివరాలు చెప్పడానికి చాలామంది ముందుకురాలేదు. బీసీ–ఈ, సీ సర్టిఫికెట్లు తీసుకున్న వారు చెప్పడానికి వెనుకంజ వేశారు. కొందరు మహిళా టీచర్లు తమ భర్త, పిల్లలను సహాయకులుగా తెచ్చుకున్నారు.రైతు భరోసా లేదు.. నేనెందుకు చెప్పాలి?వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గిరి్నబావి ప్రాంతంలో నరిగె ఐలయ్య ఇంటికి సర్వే కోసం ఎన్యూమరేటర్ వెళ్లారు. కొన్నింటికి సమాధానాలు చెప్పిన ఐలయ్య.. వ్యక్తిగత ఆస్తుల విషయంలో సరిగా స్పందించలేదు. రైతు భరోసా రానప్పుడు భూమి వివరాలు ఎందుకని ఎదురు ప్రశ్నించారు. పింఛన్ ఎప్పుడు ఇస్తారని ఆరా తీశారు. ఎన్యూమరేటర్ సర్దిచెప్పడంతో చివరకు భూమి వివరాలు చెప్పినా.. ఈ కుటుంబం వద్దే రెండు గంటలు గడిచిపోయింది.అరగంట నుంచి గంట వరకు పడుతోంది.. మాకు రోజుకు 20 కుటుంబాల చొప్పున సర్వే చేయాలంటూ బుక్లెట్లు ఇచ్చారు. ప్రశ్నలు అడగడం, వాటి కోడ్ కోసం బుక్లెట్ చూడటం ఇబ్బందిగా ఉంది. డైరెక్ట్‌గా ఫామ్‌లోనే నమోదు చేసేలా ఉంటే బాగుండేది. సర్వేపై ప్రజలకు అవగాహన లేక సమాధానాలు చెప్పడానికి ఆలోచిస్తున్నారు. ఒక కుటుంబంలో ఎక్కువ మంది సభ్యులు ఉంటే అరగంట నుంచి గంట వరకు సమయం పడుతోంది. – ఎన్.పారిజాత, ఎన్యుమరేటర్, నకిరేకల్, నల్లగొండ జిల్లావివరాలు చెప్పేందుకు వెనకాడుతున్నారు ఇంటి యజమానిని ప్రశ్నలన్నీ అడిగి పూర్తి చేయడానికి చా లా సమయం పడుతోంది. కొన్ని ప్రశ్నలకు జవాబు చెప్పేందుకు చాలా మంది ఇష్టపడటం లేదు. అవగాహన లేకపోవడంతో ఆస్తులకు సంబంధించిన వివరాలు చెప్పడానికి వెనుకాడుతున్నారు. కొన్ని ఇళ్ల వద్ద గంట దాకా సమయం పడుతోంది. సర్వే కోసం మరికొంత సమయం ఇవ్వాలి. – వేలిశెట్టి నరసింహారావు, ఎన్యుమరేటర్, వైరా, ఖమ్మం జిల్లా -
Family Survey : ఇద్దరు మహిళా ఎన్యుమరేటర్లపై కుక్కల్ని వదిలిన ఇంటి యజమాని
-
సర్వే అంటారు..సర్వం దోచేస్తారు
-
సమగ్ర కుటుంబ సర్వేలో అడిగే ప్రశ్నలివే
-
సమగ్ర సర్వే షురూ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే) ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభమైంది. తొలిరోజు ఇళ్లకు స్టిక్కర్లు వేసే కార్యక్రమాన్ని రాష్ట్రమంతటా నిర్వహించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో మంత్రి శ్రీధర్‌బాబు స్టిక్కర్లు వేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. పలు జిల్లాల్లో కలెక్టర్లు సర్వే పనుల్లో పాల్గొన్నారు. గురు, శుక్రవారాల్లో కూడా స్టిక్కర్లు వేసే కార్యక్రమం కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. మొదటి దశలో భాగంగా ఈ నెల 8వ తేదీ వరకు ప్రతి ఎన్యూమరేషన్ బ్లాక్‌లో ఉన్న ప్రతి ఇంట్లో ఉన్న కుటుంబాలను నమోదు చేసి, వారి ఇంటి నంబరు, కుటుంబ యజమాని పేరుతో కూడిన జాబితాను తయారు చేయనున్నారు. ఈ జాబితా పూర్తయిన ఇళ్లకు స్టిక్కర్లు వేయనున్నారు. ఆ తర్వాత రెండోదశలో ఈ నెల 9 నుంచి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేపట్టనున్నారు. ఈ సర్వేలో లభించిన సమాచారాన్ని మండల, జిల్లా స్థాయిలో కంప్యూటరీకరిస్తారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో డ్యాష్‌బోర్డు ఏర్పాటు చేసి సర్వే వాస్తవ పురోగతిని నిరంతరం పర్యవేక్షించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 87,092 ఎన్యూమరేషన్ బ్లాక్‌లను గుర్తించగా, జీహెచ్ఎంసీలో 19,328, ఇతర ప్రాంతాల్లో 67,764 ఉన్నాయి. ఈ బ్లాక్‌ల వారీగా సర్వే చేసేందుకు 94,750 మంది ఎన్యూమరేటర్లను ఎంపిక చేశారు. 24,488 మందిని జీహెచ్ఎంసీలో నియమించగా, ఇతర ప్రాంతాల్లో 70,262 మందిని నియమించారు. వీరి సహకారంతో రాష్ట్రంలోని 1,17,44,954 కుటుంబాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించనున్నారు. -
తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభం
-
కుల గణన కోసం పోరుబాట
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కుల గణన చేపట్టాలనే డిమాండ్ పెరుగుతోంది. దేశవ్యాప్తంగా జన గణనకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దానితోపాటే కుల గణన కూడా చేపట్టాలని బీసీ సంఘాలు ఒత్తిడి చేస్తున్నాయి. జనాభా లెక్కల సేకరణ 2011లో దేశవ్యాప్తంగా జరిగింది. మళ్లీ 2021లో జరగాల్సిన ఉండగా, కోవిడ్, ఇతర కారణాల వల్ల జాప్యమైంది. తాజాగా 2025లో జన గణన చేపట్టి 2026కు పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించింది.దీంతో జనాభా లెక్కల ఫార్మాట్లో ఈసారి బీసీ కులం కాలమ్ కూడా చేర్చి కుల గణన కూడా చేపట్టాలనే డిమాండ్ కేంద్రం ముందుకు వచ్చింది. ఈ డిమాండ్‌ను అంగీకరించేది లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. గతంలో మాదిరిగానే జనాభా లెక్కల సేకరణ మాత్రమే నిర్వహిస్తామని తేల్చి చెప్పింది. ఫలితంగా రాష్ట్రాల్లో కుల గణనకు డిమాండ్ పెరిగింది. ఈ మేరకు మన రాష్ట్రంలో ఉద్యమానికి బీసీ నేతలు సిద్ధమవుతున్నారు. కుల గణనకు చర్యలు చేపట్టిన జగన్ జనాభా లెక్కల్లోనే కుల గణన ద్వారా ఏయే కులాల జనాభా ఎంత అనేది తేలుతుంది. ఆర్థిక, సామాజిక, రాజకీయ తదితర రంగాల్లో ఆయా వర్గాల స్థానం ఏమిటీ అనేది తెలుసుకోవచ్చు. తద్వారా దామాషా పద్ధతిలో వారికి తగిన అవకాశాలు కలి్పంచేందుకు చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి... ముఖ్యమంత్రిగా ఉండగానే బీసీ నేతలు కోరకముందే రాష్ట్రంలో కుల గణన చేపడతామని ప్రకటించారు. దానికి అనుగుణంగా చర్యలు కూడా చేపట్టారు. ఈలోపు ఎన్నికలు రావడంతో ఆగిపోయింది. నైపుణ్య గణన పేరుతో కుల గణనకు బాబు బ్రేక్! దేశం లోనే బిహార్ రాష్ట్రం మొదట కుల గణన చేపట్టి పూర్తిచేసింది. ఆ తర్వాత ఏపీలోను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కుల గణన ప్రక్రియను ప్రారంభించింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కుల గణనను పక్కన పెట్టి నైపుణ్య గణన అంటూ కొత్త నినాదాన్ని తెరపైకి తెచి్చంది. పొరుగున ఉన్న తెలంగాణలోను కుల గణన చేపడతామని తాజాగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌లోను కుల గణనను పూర్తి చేయాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.ఇప్పటికే బీఎస్పీ రాష్ట్ర కో–ఆర్డినేటర్, మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు దశలవారీ ఉద్యమాలు నిర్వహిస్తున్నారు. పలువురు బీసీ నేతలు సైతం సీఎం చంద్రబాబును కలిసి రాష్ట్రంలో కులగణన చేపట్టాలని వినతిపత్రాలు అందించారు. అయినప్పటికీ కుల గణన విషయంలో చంద్రబాబు నుంచి సానుకూల స్పందన రావడంలేదని, బీసీ నేతలు రాష్ట్ర వ్యాపిత ఉద్యమాలకు సిద్ధమవుతున్నారు. -
తెలంగాణలో నేటి నుంచి కుటుంబ సర్వే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల తదితర వివరాలు సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఉదయం నుంచే ఎన్యుమరేటర్లు తమకు కేటాయించిన ప్రాంతంలో ఇంటింటికి తిరిగి కుటుంబాల సమగ్ర వివరాలను నమోదుచేస్తారు. ఈ సర్వేలో 85 వేల మంది ఎన్యుమరేటర్లు పాల్గొంటున్నారు.ప్రతి పదిమంది ఎన్యుమ రేటర్లకు ఒక పరిశీలకుడు చొప్పున 850 మందిని ప్రభుత్వం నియమించింది. ఎన్యుమరేటర్లలో 32 వేల మంది టీచర్లు ఉన్నారు. ఇప్పటికే ఎన్యుమరేటర్లకు, పరిశీలకులకు, పర్యవేక్షణ అధికారులకు విడతలవారీగా జిల్లా కలెక్టర్లు శిక్షణ ఇచ్చారు. ప్రాథమిక పాఠశాలల్లో పనిచేసే టీచర్లు మధ్యా హ్నం భోజనం తర్వాత సర్వే ప్రక్రియను ప్రారంభిస్తారు. సర్వే ప్రక్రియలో ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందితోపాటు ప్రభుత్వ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, గెస్ట్ టీచర్లను సైతం నియమించారు. పూర్తి వివరాలు సేకరణ ఈ సర్వే రెండు భాగాలుగా సాగుతుంది. మొదటి విభాగం(పార్ట్–1)లో కుటుంబ యజమాని, సభ్యుల వ్యక్తిగత వివరాలకు సంబంధించిన ప్రశ్నలుంటాయి. సాధారణ వివరాలు, విద్య, ఉద్యోగ, ఉపాధి, భూమి, రిజర్వేషన్లు, రాజకీయాలు, వలసలకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. రెండో విభాగం (పార్ట్–2)లో కుటుంబ ఆర్థిక స్థితిగతులపై ప్రశ్నలుంటాయి. రుణాలు, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు, పశు సంపద, స్థిరాస్తి, రేషన్ కార్డు, నివాసగృహం, తాగునీరు తదితర ప్రశ్నలు అడుగుతారు. సర్వే ప్రశ్నావళిలో 75 ప్రశ్నలుండగా... ఇందులో 56 ప్రధాన ప్రశ్నలు, 19 ఉప ప్రశ్నలు.175 కుటుంబాలు ఒక బ్లాకుసమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రక్రియను సులభతరంగా చేపట్టేందుకు 175 ఇళ్లను ఒక బ్లాకుగా విభజించి ఎన్యుమరేటర్లకు కేటాయించారు. ఈ బ్లాకుల విభజన ప్రక్రియ జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో జరిగింది. సెన్సెస్ డైరెక్టర్ నుంచి ఎన్యు మరేషన్ బ్లాక్(ఈబీ) మ్యాపులు తీసుకుని బ్లాకులను విభ జించారు. ఎన్యుమరేటర్లు వారికి కేటాయించిన బ్లాకులోని ప్రతి ఇంటిని సర్వే చేయాలి. అనంతరం సర్వే పూర్తి చేసినట్లు స్టిక్కర్ అంటిస్తారు. ఎన్యుమరేటర్లు సర్వే పూర్తి చేసిన తర్వాత ఆ సమాచారంలోని 10 శాతం కుటుంబాలను ర్యాండమ్‌గా ఎంపిక చేసి వాటిని సూపర్వైజర్లు మరోమారు తనిఖీ చేసి ఎన్యుమరేటర్ పనితీరును అంచనా వేస్తారు.చదవండి: తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే.. ఈ వివరాలు తెలుసుకోండిఎన్యుమరేటర్లు సేకరించిన సమాచారాన్ని గోప్యంగా ఉంచాలి. సేకరించిన కుటుంబాల వివరాలను ఏ రోజుకారోజు కంప్యూటర్లలో ఎంట్రీ చేస్తారు. ఈ ఎంట్రీనే అత్యంత కీలం కానుంది. డేటా ఎంట్రీలో పొరపాట్లు దొర్లితే సర్వే స్వరూపం మారిపోతుంది. అందుకే డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ సర్వేకు ప్రతి జిల్లాలో నోడల్ అధికారిగా అదనపు కలెక్టర్‌ను ప్రభుత్వం నియమించింది. సర్వే నిర్వహణలో రోజువారీ పురోగతిని ప్రణాళిక శాఖకు ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల లోపు పంపాలి. ఈ నెలాఖరు నాటికి సర్వేను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించడంతో ఆ మేరకు జిల్లా కలెక్టర్లు కార్యాచరణ సిద్ధం చేశారు. -
కులం, మతం వద్దు అనుకునే స్వేచ్ఛను రాజ్యాంగం ఇచ్చింది
సాక్షి, హైదరాబాద్: దేశంలోని ప్రతి ఒక్కరికీ మతం వద్దు, కులం వద్దు అనుకునే స్వేచ్ఛను రాజ్యాంగం ఇచ్చిందని ఓ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు స్పష్టం చేసింది. కులాన్ని, మతాన్ని ప్రకటించడానికి, ఆచరించడానికి ప్రజలందరికీ సమాన స్వేచ్ఛ ఉందని అభిప్రాయపడింది. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో ‘కులం లేదు, మతం లేదు’అనే కాలమ్‌ను చేర్చాలంటూ పిటిషనర్లు అక్టోబర్ 29న, నవంబర్ 1న ఇచ్చిన వినతిపత్రాలను పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే నవంబర్ 6 నుంచే సర్వే ప్రారంభమవుతున్నందున ‘కులం లేదు, మతం లేదు’అనే కాలమ్పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పింది.ఏ నిర్ణయం తీసుకున్నదీ పిటిషనర్లకు తెలియజేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ డిసెంబర్ 4కు వాయిదా వేసింది. ప్రభుత్వం నిర్వహిస్తున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో ‘కులం లేదు, మతం లేదు’అనే కాలమ్‌ను చేర్చాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్ వాహీద్, కృష్ణ చంద్ రెండుసార్లు అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. అయినా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, అధికారుల తీరు ఉన్నత న్యాయస్థానం గత ఉత్తర్వులకు విరుద్ధమంటూ వారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నందా మంగళవారం విచారణ చేపట్టారు. వాదనల అనంతరం.. ‘మతం లేదు.. కులం లేదు’ అనుకునేవారి కోసం భారత సెన్సెస్ కమిషన్ వాటిని ప్రస్తావించకుండా స్వేచ్ఛను మంజూరు చేసిందని న్యాయమూర్తి తెలిపారు. 2010, 2021లో దాఖలైన పిటిషన్లలో హైకోర్టు ఇచ్చిన తీర్పులను ప్రస్తావించారు. పాఠశాల విద్యా సర్టిఫికెట్లలో కులం, మతం ప్రస్తావన వద్దంటూ పిటిషనర్లు కోరగా, వారికి అనుకూలంగా ఉత్తర్వులు వెలువడ్డాయని చెప్పారు. తదుపరి విచారణలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, జీఏడీ, సాంఘిక సంక్షేమ శాఖ, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శులకు నోటీసులు జారీ చేశారు. -
కులగణన నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఒక్క పూటే బడులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను బుధవారం నుంచి ఒంటిపూట మాత్రమే నిర్వహిస్తారు. కులగణన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఎస్జీటీల సేవలను సర్వేకు ఉపయోగిస్తున్నందున, మధ్యాహ్నం నుంచి పాఠ శాలలను మూడు వారాల పాటు మధ్యాహ్నం ఒంటిగంట వరకూ నడపాలని పాఠశాల విద్య డైరెక్టరేట్ ఆదేశించింది. మధ్యాహ్న భోజనం తర్వాత విద్యార్థులను ఇళ్లకు పంపుతారు.టెట్ బులెటిన్ విడుదల రేపు సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ బులెటిన్‌ను ఈ నెల 7వ తేదీన విడుదల చేయనున్నట్టు పాఠశాల విద్య డైరెక్టరేట్ ఒక ప్రకటనలో తెలిపింది. వాస్తవానికి ఈ బులెటిన్‌ను మంగళవా రం విడుదల చేయాల్సి ఉంది. సాంకేతిక కారణాల వల్ల సాధ్యం కాలేదని పేర్కొంది.ఎంబీఏ సాయంకాలపు కోర్సుల ప్రవేశ పరీక్ష 17కు వాయిదా ఉస్మానియా యూనివర్సిటీ: ఈ నెల 9న జరగాల్సిన ఓయూ ఎంబీఏ సాయంకాలపు కోర్సుల ప్రవేశ పరీక్షను నవంబర్ 17కు వాయిదా వేశారు. వర్సిటీ క్యాంపస్‌లోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాలలో సాయంకాలపు కోర్సులైన ఎంబీఏ, ఎంబీఏ టెక్నాలజీ మేనేజ్మెంట్ (టీఎం) ప్రవేశ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఈ నెల 14 వరకు రూ.500 అపరాధ రుసముతో దరఖాస్తు చేసుకోవచ్చని పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి తెలిపారు.ముగిసిన వివిధ సెట్ల కౌన్సెలింగ్ ఉస్మానియా యూనివర్సిటీ: ఈ విద్యా సంవత్సరానికి వివిధ సెట్ల కౌన్సెలింగ్ పక్రియ ముగిసిందని కన్వీనర్ ప్రొఫెసర్ రమేశ్‌బాబు మంగళవారం తెలిపారు. పీజీ లాసెట్, లాసెట్–2024, పీజీఈసెట్–2024, ఎడ్‌సెట్– 2024, పీఈసెట్–2024 తదితర సెట్ల కౌన్సెలింగ్ ద్వారా సీట్లు భర్తీ చేసిన్నట్లు చెప్పారు. -
తెలంగాణ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే.. ప్రశ్నలు ఇవే..
తెలంగాణ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు. ఎన్ని ప్రశ్నలు ఉంటాయి, ఎలాంటి ధ్రువపత్రాలు అవసరమవుతాయనే దాని గురించి రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలని అనుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కులగణనకు వేళయింది. బుధవారం (నవంబర్ 6) నుంచి రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల వివరాలను ఈ సర్వేలో సేకరిస్తారు. ఇప్పటికే ఎన్యుమరేటర్లు ఇంటింటికీ తిరిగి సర్వేకు సంబంధించిన సమాచారం అందజేశారు. అయితే కులగణనలో ఎలాంటి ప్రశ్నలు ఉంటాయి, ఎన్ని ఉంటాయనే దానిపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ప్రభుత్వం ఇప్పటికే నమూనా పత్రాన్ని మీడియాకు విడుదల చేసింది.సర్వేలో భాగంగా 75 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సివుంటుంది. సర్వే ప్రశ్నావళిని రెండు భాగాలుగా ఉంటుంది. మొదటి భాగం (పార్ట్-1)లో కుటుంబ యజమాని, సభ్యుల వ్యక్తిగత వివరాలు తెలపాల్సి ఉంటుంది. పార్ట్-1లో మొత్తం 60 ప్రశ్నలు ఉంటాయి. రెండో భాగంలో కుటుంబ వివరాలు.. అంటే ఆస్తులు, అప్పులు, ఇంటికి సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయి. కాగా, సర్వేలో ప్రధాన ప్రశ్నలు, 19 ఉప ప్రశ్నలకు జవాబులు ఇవ్వాలి.సర్వే జరిగేది ఇలా.. ముందుగా జిల్లా, మండలం, పంచాయతీ, మున్సిపాలిటీ, వార్డ్ నంబర్, ఇంటి నంబర్ వివరాలను ఎన్యుమరేటర్లు నమోదు చేస్తారు.పార్ట్-1లో కుటుంబ యజమాని పేరు, సభ్యుల పేర్లతో పాటు లింగం, మతం, కులం, వయసు, మాతృభాష, ఆధార్‌తో సహా 10 వివరాలు సేకరిస్తారు. కాగా, వీటన్నింటికీ ధ్రువీకరణ పత్రాలు చూపించాల్సి ఉంటుంది.మొబైల్ నంబరు, వైకల్యం, వైవాహిక స్థితి, విద్యార్హతలతో పాటు ఉద్యోగం, ఉపాధి, వ్యాపారం, వార్షిక ఆదాయం, ఐటీ ట్యాక్స్, బ్యాంక్ అకౌంట్ వివరాలు తర్వాత క్రమంలో నమోదు చేస్తారు.వ్యవసాయ భూములు కలిగివున్నట్టయితే ధరణి పాస్‌బుక్ నంబర్‌తో పాటు భూమి రకం, నీటిపారుదల వనరు, కౌలు సాగుభూమి వివరాలు కూడా సేకరిస్తారు.రిజర్వేషన్ల నుంచి పొందిన విద్యా, ఉద్యోగ ప్రయోజనాలు.. ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన పథకాల పేర్లు, ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఈబీసీ సర్టిఫికెట్లు తీసుకున్నారా, సంచార తెగకు చెందివారా అనే వివరాలు కూడా సర్వేలో నమోదు చేస్తారు.రాజకీయ నేపథ్యం, ప్రభుత్వ పదవులు, ఇతర దేశాలు, రాష్ట్రాలకు వలసలు.. వలస వెళ్లడానికి కారణాలు కూడా చెప్పాల్సి ఉంటుంది.గత 5 ఏళ్లలో రుణాలు తీసుకుని ఉంటే... ఏ అవసరం కోసం తీసుకున్నారు, ఎక్కడి నుంచి తీసుకున్నారు వంటి వివరాలు పార్ట్-2లో పొందుపరిచారు. కుటుంబ సభ్యులందరి మొత్తం స్థిర, చరాస్తులతో ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు అడుగుతారు.చివరగా ఎన్యుమరేటర్‌కు అందించిన సమాచారం నిజమని ప్రకటిస్తూ కుటుంబ యజమాని సంతకం చేయాల్సి ఉంటుంది. తెలంగాణ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రశ్నావళి pdf కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. -
సమగ్ర కుల సర్వేకు సహకరించండి
-
తెలంగాణ వ్యాప్తంగా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే
-
సోలో బ్రతుకే సో 'బెటరు'
ప్రపంచవ్యాప్తంగా ఏక్ నిరంజన్ల సంఖ్య ఏటా పెరుగుతోంది. మన రాష్ట్రంలోనూ ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. రాష్ట్ర జనాభాలో 6 శాతానికి పైగా ఒంటరులే ఉన్నట్టు తేలింది. రాష్ట్రంలో మొత్తంగా 31,20,499 మంది ఒంటరి జీవితం సాగిస్తున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2019లో వలంటీర్ల ద్వారా నిర్వహించిన కుటుంబ సర్వేలో రాష్ట్రంలో 1.66 కోట్ల కుటుంబాలు ఉన్నట్టు నిర్ధారణ కాగా.. అందులో 31.20 లక్షల మంది ఏక్ నిరంజన్లేనని తేలింది. సాక్షి, అమరావతి: తాత నాయనమ్మ.. అమ్మానాన్న.. అన్నా చెల్లెళ్లు.. బాబాయ్ చిన్నమ్మ కలిసి ఉండే ఉమ్మడి కుటుంబాలకు సుమారు 30–35 ఏళ్ల క్రితమే కాలం చెల్లింది. అమ్మానాన్న.. అన్నదమ్ములు.. అక్క చెల్లెమ్మలు వరకే పరిమితమైన కుటుంబాలకు పూర్తిగా అలవాటు పడిపోయాం. వాళ్లలో ఎవరికైనా పెళ్లయిందంటే.. వెంటనే వేరు కాపురం పెట్టే పరిస్థితికి వచ్చేశాం. ఇప్పుడు ఆ రోజులు కూడా మారిపోతున్నాయి. ప్రస్తుతం ఒంటరిగా నివాసం ఉండాలనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ఆడ, మగ అనే తేడా లేకుండా కొందరు పెళ్లి చేసుకోకుండా ఒంటరి జీవనం సాగిస్తుంటే.. భార్య లేదా భర్తను కోల్పోయి ఒంటరిగా మిగిలిపోతున్నారు.. కొందరైతే పిల్లలున్నా విదేశాలు లేదా దూరప్రాంతాల్లో ఉండటం వల్ల ఒంటరి జీవనం సాగిస్తున్నారు. అమెరికాలో సగం మందికి పైనే ఒంటరి జీవులు వ్యక్తిగత ఆదాయాల పరంగా.. దేశ ఆర్థిక పరిస్థితి పరంగా ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశంగా వెలుగొందుతున్న అమెరికాలో అయితే 18 ఏళ్లు వయసు దాటిన వారిలో ఎక్కువ మంది ఒంటరి జీవులుగానే మిగిలిపోతున్నట్టు తేలింది. తల్లిదండ్రులతో కలిసి జీవించే వారికంటే తల్లిదండ్రులు లేదా ఇతరులెవరితో సంబంధం లేకుండా జీవనం సాగించే వారి సంఖ్య ఆ దేశంలో ఎక్కువగా ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఆ దేశ 2021 నాటి జనాభా గణాంక అంచనాల ప్రకారం 3.39 కోట్ల మంది తల్లిదండ్రులతోనో లేదంటే ఇతరులతో కలిసి జీవిస్తుంటే.. 3.75 కోట్ల మంది ఒంటరిగా జీవనం సాగిస్తున్నారు. 1965లో అమెరికాలో 15 శాతం మంది మాత్రమే 18 ఏళ్ల తర్వాత తల్లిదండ్రులతో సంబంధం లేకుండా ఒంటరిగా జీవనం సాగించే పరిస్థితి ఉండగా.. ఆ తర్వాత కాలంలో ఏటా ఆ సంఖ్య పెరుగుతూ వచ్చింది. 2013–16 మధ్యకాలంలో తల్లిదండ్రులతో కలిసి జీవించే వారి కంటే ఒంటరి జీవనం సాగించే వారే ఎక్కువ అయ్యారని గణాంకాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో 6 శాతానికి పైగా ఒంటరులే మన రాష్ట్రంలో 31,20,499 మంది ఒంటరిగా జీవనం సాగిస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. 2019లో రాష్ట్ర ప్రభుత్వం వలంటీర్ల ద్వారా నిర్వహించిన కుటుంబాల సర్వేలో రాష్ట్రంలో 1.66 కోట్ల కుటుంబాలు ఉన్నట్టు నిర్ధారణ అయింది. అందులో 31.20 లక్షల మంది ఒకే వ్యక్తి ఒక కుటుంబంగా ఉంటూ ఒంటరి జీవితం సాగిస్తున్నట్టు తేలింది. రాష్ట్రంలో 5.21 కోట్ల జనాభా ఉంటుందని అంచనా వేయగా.. వారిలో ఒంటరి జీవనం సాగించే వారి సంఖ్య 6 శాతానికి పైగా ఉన్నట్టు స్పష్టమవుతోంది. -
దీనావస్థలో బాలికా విద్య
సాక్షి, బెంగళూరు: ఐటీ హబ్‌గా మురిసిపోతున్న బెంగళూరు నగరం.. బాలికల విద్యలో మాత్రం చాలా వెనుకబడి ఉంది. ప్రస్తుతం ఉద్యాననగరిలో దాదాపు 33 శాతం మహిళలు పదో తరగతి వరకు కూడా చదువుకోలేదు. ఇటీవల విడుదల చేసిన జాతీయ కుటుంబ, హెల్త్ సర్వే నివేదికలో ఈ వాస్తవం వెల్లడైంది. 2015–16 సంవత్సరంలో 67 శాతం మంది మహిళలు 10వ తరగతి లేదా ఆపై తరగతుల వరకు చదువుకున్నారని సర్వేలో తేలింది. మిగిలిన 33 శాతం మంది కుటుంబ, ఆర్థిక, సామాజిక పరిస్థితుల దృష్ట్యా చదువును మధ్యలోనే ఆపేస్తున్నట్లు తేలింది. ప్రస్తుతం దేశంలో బాలికల విద్య కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను ప్రవేశపెట్టారు కానీ ఫలితాలు మాత్రం ఆశించినంత స్థాయిలో లేవని విద్యావేత్తలు చెబుతున్నారు. పేద బాలికలకు భాగ్యలక్ష్మి పథకం ద్వారా చదువుకయ్యే ఖర్చును భరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని పేద బాలికలకు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు ఉచితంగా చదువు అందించేలా కొత్త పథకాన్ని తీర్చిదిద్దుతోంది. -
అభివృద్ధి, సంక్షేమాల దిక్సూచి
సమగ్ర కుటుంబ సర్వే తేల్చిన వాస్తవాలు దేశ చరిత్రలోనే అపూర్వమైన రీతిలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే తెలంగాణ సమాజపు సంక్లిష్టతకు, మౌలిక సమస్యలకు అద్దం పట్టింది. అది ఇచ్చిన వాస్తవిక అంచనాలు నూతన రాష్ట్ర ప్రభుత్వానికి దిశా నిర్దేశన చేయడమే కాదు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో కీలకమైన సూక్ష్మస్థాయి ప్రణాళికా రచనకు దోహదపడేవిగా ఉన్నాయి. నూతన రాష్ట్రంలో ప్రజలు ప్రధానంగా భూమి, నీరు, నీడ, ఉపాధుల కోసం తపిస్తున్నారని సర్వే నిగ్గు తేల్చింది. ఆ లక్ష్యాల సాధనకు అన్ని వర్గాలను కలుపుకొని సమష్టిగా కృషి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. సమగ్ర కుటుంబ సర్వే... తెలంగాణ సామాజిక స్వభావాన్ని ఒక్క రోజులో అద్దం పట్టి చూపేందుకు చేసిన బృహత్ యత్నం. ఒక్క హైదరాబాద్ మినహా కాస్త అటూ ఇటుగా తెలంగాణ జన జీవితాన్ని సర్వే ఫలితాలు ప్రతి బింభించాయి. దేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవిం చిన తెలంగాణ రాష్ట్రం ‘స్వయం నిర్ణయం - అర్హులకే సంక్షే మం’ లక్ష్యంతో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే ధనిక, పేద తేడాలు లేకుండా వీధి, పల్లె, పట్నం, నగరం ప్రతిచోటా సాగింది. గత అంచనాలకు కాలదోషం పట్టిం చిన ఈ సర్వే వాస్తవికతకు అతి దగ్గరగా ఉన్న తాజా అంచనాలను ప్రభుత్వం చేతుల్లో ఉంచింది. తెలంగాణ జనాభాలో బీసీ కులాలు 51.08%, బీసీ కులాలు 112%, ఉన్నత కులాలు 21.50%, దళితులు 17.50%, గిరిజను లు 9.91%, మైనారిటీలు 14.46%గా ఈ సర్వే తేల్చింది. అంతేకాదు దళితుల్లోని 56 ఉప కులాలు, గిరిజనుల్లోని 16 తెగలు, మైనారిటీల స్థితిగతులను సైతం వివరంగా వెల్లడించింది. ఈ వివరాలన్నీ అప్పుడే సర్కారు లెక్క ల్లోకి చేరిపోయాయి. కొత్త రాష్ట్రం సరికొత్త లక్ష్యంతో ముందుకు సాగడానికి సమగ్ర కుటుంబ సర్వే తాజా అంచనాలు సోపానాలు కాగలుగుతాయనడంలో సందే హం లేదు. కాకపోతే సర్వే తిరుగులేని విధంగా తేల్చి చెప్పినట్టుగా ప్రజలకు ప్రధానంగా కావాల్సింది భూమి, నీళ్లు, నీడ, ఉపాధులేనని గుర్తించి వాటిని కేంద్రంగా చేసుకుని పక్కాగా పథక రచన చేసి, తగు కేటాయిం పులు చేయాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వానిదే. అదే జరిగితే బంగారు తెలంగాణ స్వప్నం సాకారం సు సాధ్యమే అవుతుంది. సమగ్ర కుటుంబ సర్వే లక్ష్యమూ నెరవేరుతుంది. వెనుకబడిన తరగతులు సగానికి పైగానే రాష్ట్ర జనాభా 3.63 కోట్లుగానూ, అందులో సగానికిపైగా వెనుకబడిన తరగతుల వారేనని (బీసీలు) సర్వే తేల్చిం ది. మొత్తం బీసీల జనాభా 1,85,61,856 లక్షలు (51.08%). ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 136 బీసీ కులాలు ఉండగా తెలంగాణ రాష్ట్రంలో అవి 112 కులాల కు తగ్గాయి. ఇంత పక్కాగా బీసీల జనాభా తేల్చటం ఇదే మొదటిసారని చెప్పొచ్చు. 2011 జనాభా లెక్కల్లో తెలంగాణలోని ఎస్సీల జనాభా 15.44%గా నమోదు కాగా, తాజా సర్వేలో అది 17.50% శాతమని తేలింది. ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీలలో 62 ఉప కులాలుండగా, తెలంగాణలో అవి 56 ఉప కులాలకు తగ్గాయి. మొత్తం ఎస్సీల జానాభా 63,60,158 (17.50%). 2011 లెక్కల్లో గిరిజన జనాభా 9.34%గా ఉండగా, ఈ సర్వేలో అది 9.91%గా నమోదయింది. ఉమ్మడి రాష్ట్రంలో 36 గిరిజన తెగలుండగా, కొత్త రాష్ట్రంలో 16 గిరిజన తెగలు మాత్రమే ఉన్నాయి. తాజా సర్వేలో తెగల వారీ లెక్కలు తేలటంతో వారి అభివృద్ధికి, సంక్షేమానికి బడ్జెట్ కేటాయింపులు చేసి, సూక్ష్మ స్థాయి ప్రణాళికలను అమలుపరచే అవకాశం లభించింది. ‘భూమి’ చుట్టూ తిరిగిన సర్వే ఈ సర్వే ఫలితాలన్నీ ప్రధానంగా భూమి చుట్టే తిరిగాయి. తెలంగాణ పది జిల్లాల్లో గుంటెడు సాగు భూమి కూడా లేని కుటుంబాల సంఖ్య 69.19 లక్షలు (మొత్తం కుటుంబాలు 1,01,93,027). అంటే సాగు భూమి 31 శాతం మందికే పరిమితమైందని తేలింది. వీరిలో ఎకరం కంటే తక్కువ భూమి ఉన్న కుటుంబాలు 9.67 లక్షలు. ఒకటి నుంచి రెండెకరాలలోపు 6.83 లక్షలు, 2-3 ఎకరాల మధ్య 5.73 లక్షలు, 3-4 ఎకరా మధ్య 3.62 లక్షలు, 4-5 ఎకరాల మధ్య ఉన్న కుటుంబాలు 3 లక్షలున్నాయి. 6.84 లక్షల కుటుంబా లకు ఐదెకరాలకుపైగా భూములున్నాయి. బోర్లు, బావులే సేద్యానికి ప్రాణాధారం తెలంగాణలో బోర్లు, చెరువులు, కుంటలు, కాల్వలు, ఎత్తిపోతల పథకాల ద్వారా మొత్తం 69.13 లక్షల ఎక రాల్లో సేద్యం సాగుతుండగా, అందులో 28.49 లక్షల ఎకరాలకు బోర్లు, 15.85 లక్షల ఎకరాలకు బావులే దిక్కు. కృష్ణా, గోదావరి, మూసీ కాల్వలతో సాగవుతు న్నది కేవలం 8.97 లక్షల ఎకరాలే. రాష్ట్రంలో అత్య ధికంగా మహబూబ్‌నగర్‌లో 11.08 లక్షల ఎకరాలు సాగవుతుండ గా అందులో 6.24 లక్షల ఎకరాలకు బోరు నీళ్లే ఆధారం. ఇక బావుల నీటితో సేద్యం చేసే జిల్లాల్లో కరీంనగర్‌ది మొదటి స్థానం (5.36 లక్షల ఎకరాలు). నాగార్జునసాగర్ ఎడమకాలువ సాగునీరు అందే జిల్లాల్లో నల్లగొండ (2.27 లక్షల ఎకరాలు) తెలంగాణలో మొదటి స్థానంలో నిలిచింది. బోరు బావుల సేద్యంలో (4.14 లక్షల ఎకరాలు) ఈ జిల్లా రాష్ట్రంలో రెండవ స్థానంలో ఉంది. మొత్తంగా చూస్తే తెలంగాణ రైతాంగ జీవనం వర్షాధారమేనని స్పష్టమైంది. కాబట్టి భారీ నీటి ప్రాజెక్ట్‌ల నిర్మాణం, గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ కార్యక్ర మాలతో పాటు బోర్లు, బావులకు సరిపడా విద్యుత్తును అందించడం తెలంగాణ ప్రభుత్వం ముందు అతి పెద్ద సవాలుగా నిలుస్తోంది. అందరికీ గూడు అందరాని కలగానే... రాష్ట్రంలో 1,01,93,027 కుటుంబాలుండగా వారిలో 24,90,594 మందికే పక్కా ఇళ్లు ఉన్నట్లు (24%) సర్వేలో తేలింది. మిగతా వారిలో 24,58,341 కుటుంబాలు (24%) అద్దె ఇళ్లలో ఉంటున్నాయి. మొత్తం కుటుంబాల్లో 44%, అంటే 45,02,101 కుటుంబాలు ఒకే గది ఇంట్లో నివసిసున్నాయి. గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాల న్నిట్లో మొత్తం 3,24,312 కుటుంబాలవి ప్లాస్టిక్ పైక ప్పున్న తాత్కాలిక నివాసాలే. పెంకు లేదా రాతి పైకప్పు ఉన్న ఇళ్లలో 7,41,492 కుటుంబాలు నివసిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 14,49,462 కుటుంబాలు కరెంటు సదు పాయానికి నోచుకోక, కిరోసిన్ దీపాల మసక వెలుతు రులోనే వెళ్లదీస్తున్నాయి. కరెంట్ సదుపాయం లేని కుటుంబాలు అధికంగా నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లో ఉన్నట్లు వెల్లడైంది. రాష్ట్ర వ్యాప్తంగా 41% కుటుంబాలకు మరుగుదొడ్ల సదుపాయం లేదు. కాగా గ్రామీణ ప్రాంతాల్లో 42,10,019 కుటుంబాలకు ఆ సదుపాయం లేకపోవడం గమనార్హం. మరుగుదొడ్ల సదుపాయం లేని జిల్లాల్లో వరంగల్, నల్లగొండ, ఆదిలాబాద్ జిల్లాలు ముందు నిలిచాయి. మెట్రోపాలిటన్ నగరంగా చెప్పు కుంటున్న హైదరాబాద్‌లో కూడా ఇప్పటికీ 45,901 కుటుంబాలకు మరుగుదొడ్డి సదుపాయం లేకపోవడం మింగుపడని చేదు వాస్తవం. చెలిమె నీళ్లతో గొంతు తడపాల్సిందే అందరికీ తాగునీరు అత్యధికులకు అందని ఎండమా విగానే నేటికీ మిగిలిందన్న దిగ్భ్రాంతికర వాస్తవాన్ని సర్వే బయటపెట్టింది. రాష్ట్రంలోని 69% ప్రజలు మంచి నీటి కోసం నానా అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల్లో 1.83 లక్షల కుటుంబాల దాహార్తిని తీర్చేవి చెలిమ నీళ్లేననేది నమ్మలేని నిజం. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనే నల్లా నీళ్లు ఎక్కువ మందికి అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్రంలో 4.14 లక్షల కుటుంబాలు తాగునీటికి బావులపైన, 9.40 లక్షల కుటుంబాలు చేతిపంపులపైన ఆధారపడుతున్నాయి. 3.43 లక్షల కుటుంబాలు బోర్లు, మరో 8.16 లక్షల కుటుంబాలకు బావులే దాహం తీరుస్తున్నాయి. 4.48 లక్షల కుటుంబాలు మంచి నీటి క్యాన్లను కొనుక్కొని గడుపుకుంటున్నాయి. కుటుంబ పెద్దగా ‘ఆమె’ కుటుంబంలో మహిళల ప్రాధాన్యం క్రమంగా పెరుగు తున్న పరిణామం స్పష్టంగా కనిపిస్తోంది. 18,48,208 లక్షల కుటుంబాలకు మహిళలే కుటుంబ పెద్దలుగా వ్యవ హరిస్తున్నట్లు తాజా సర్వే నిగ్గు తేల్చింది. అత్యధికంగా కరీంనగర్ జిల్లాలో మహిళలు 2.47 లక్షల కుటుంబాల ను ముందుండి నడిపిస్తుండటం విశేషం. ఉమ్మడి కుటుంబాల విషయానికి వస్తే ఆరుగురు సభ్యులున్న కుటుంబాలు మొత్తం 5.14 లక్షలు. మహబూబ్‌నగర్ 94,164 కుటుంబాలతో ఆ విషయంలో ముందున్నది. అలాంటి కుటుంబాలు ఖమ్మం జిల్లాలో అత్యల్పంగా, కేవలం 18,131 ఉన్నాయి. ఆరుగురికి మించి ఉన్న కుటుంబాలు రాష్ట్రంలో 3.56 లక్షలు. అత్యధికంగా మహబూబ్‌నగర్ జిల్లాలో 1.16 లక్షలు, అత్యల్పంగా ఖమ్మం జిల్లాలో 8,057 ఉన్నాయి. కారు యోగం నూటికి ముగ్గురికే పది జిల్లాల్లో ప్రతి 100 మందిలో కారున్నవారు కేవలం ముగ్గురే. 22 మందికి ద్విచక్ర వాహనాలు, ఒక్క శాతానికి మాత్రం ట్రాక్టర్లు ఉన్నాయి. అత్యధిక వాహనాలను బ్యాంకు రుణాలతో తీసుకోవటం వల్ల అవి సొంత వాహనాలుగా నమోదు కాలేదన్న వాస్తవం సర్వేను బట్టి అర్థం అవుతోంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో సుమారు 44 లక్షల వాహనాలు ఆర్టీఏలో నమోదు కాగా, సమగ్ర సర్వేలో వాహన యజమానుల సంఖ్య కేవలం 10,21,899గా తేలడం విశేషం. మరీ చిత్రంగా ఆ రెండు జిల్లాల్లో నమోదైన కార్లు రెండు లక్షలు కూడా లేవు. మొత్తంగా రంగారెడ్డి, కరీంనగర్, హైదరాబాద్, నల్లగొండ జిల్లాలు వాహనాల యాజమ్యానంలో అగ్ర స్థానంలో ఉన్నాయి. ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ సంబంధ యంత్రాలు ఉన్న జిల్లాల్లో నల్గొండ, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాలు ముందు వరుసలో ఉన్నట్లు వెల్లడైంది. పట్టణాల్లోనే ఉపాధి అవకాశాలు తెలంగాణ జిల్లాల్లో పట్టణాలు, నగరాలే ఉపాధి కేంద్రాలుగా మారాయి. పరిశ్రమలు, సేవా సంస్థల కేంద్రీకరణతో ప్రైవేటు ఉపాధి అవకాశాలన్నీ దాదాపు అక్కడే కేంద్రీకృతమైన పరిస్థితి నెలకొంది. ప్రైవేటురంగ ఉపాధి కల్పనలో రంగారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. రాష్ట్రం మొత్తంగా 15,55,009 మంది ప్రైవేటు ఉద్యోగులుగా నమోదు కాగా, అందులో ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే 4,99,948 మంది ఉన్నారు. పూర్తి వ్యవసాయ ఆధారిత జిల్లా నిజామాబాద్‌లో ప్రైవేటు రంగం కేవలం 72,882 మందికే ఉపాధిని కల్పిస్తోందని తేలింది. పల్లెలు జబ్బులకు నిలయాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 7.58 లక్షల మంది దీర్ఘకాలిక వ్యాధులతో, 32 వేల మంది క్యాన్సర్ తో, 1.17 లక్షల మంది గుండె జబ్బుతో, 69 వేల మంది పక్షవాతం, 75 వేల మంది ఆస్తమా, 66 వేల మంది ఫ్లోరోసిస్, 37 వేల మంది ఫైలేరియాతో బాధపడుతున్నట్లు వెల్లడైంది. అత్యధిక బాధితులు కరీంనగర్లో ఉండగా, అత్యల్ప బాధితులు హైదరాబాద్‌లో ఉన్నట్లు తేలింది. తెలంగాణ జనాభాలో 4% క్యాన్సర్‌తో, 16% హృద్రోగ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. క్షయతో 1% శాతం, పక్షవాతంతో 9%, ఎయిడ్స్‌తో 1%, ఆస్తమాతో 10%, ఫ్లోరోసిస్‌తో 9%, పైలేరియాతో 5% బాధపడుతున్నట్లు తేలింది. రోగుల నిష్పత్తిలో కరీంనగర్ తొలిస్థానంలో ఉండగా, నల్లగొండ జిల్లా రెండో స్థానంలో ఉంది. మొత్తంగా చూస్తే గుండెజబ్బుల తీవ్రత పెరిగింది. కరీంనగర్, నల్లగొండ, వరంగల్ జిల్లాలు గుండెపోటు, క్యాన్సర్ వ్యాధుల్లో మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. మారిన జీవన శైలితో పల్లెల్లోనూ వ్యాధులు విజృం భిస్తున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పోలిస్తే కరీంనగర్, నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో గుండె, నరాలు, క్యాన్సర్ సంబంధమైన వ్యాధులు అధికంగా నమోదయ్యాయి. గుండె సంబంధమైన వ్యాధుల విషయంలో కరీంనగర్ 18,631, వరంగల్ 17,367, నల్లగొండ 17,211, ఖమ్మం 13,601 కేసులతో ముందున్నాయి. ఆహారం, ఆరోగ్యం విషయంలో పట్టణ ప్రజల్లో పెరిగిన అవగాహన కారణంగా వ్యాధి నివారణ, నిర్మూలన దిశగా ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్న ట్లు స్పష్టమైంది. అంటువ్యాధుల తీవ్రత కూడా పల్లెల్లోనే ఎక్కువగా ఉంటోంది. కాబట్టి గ్రామీణ ప్రజలకు ఆరోగ్య సేవలను, పౌష్టిక ఆహారాన్ని అందించడంపై, అవగా హన కల్పించడానికి సత్వర ప్రణాళికను రూపొందించి అమలు చేయాల్సిన తక్షణ ఆవశ్యకతగా మారింది. సమగ్ర సర్వేకు సమష్టి కృషి తోడైతేనే... ఆరు దశాబ్దాల ఉద్యమ అనంతరం సాకారమైన తెలంగా ణలోని అన్ని వర్గాలు సంతులిత అభివృద్ధితో, సామ రస్యంతో జీవనం సాగించాలంటే.. సర్వే నివేదిక ఆధా రంగా సర్కారు కేటాయింపులు చేయాల్సిన అవసరం ఉంది. భూమి, నీరు, నివాసం, ఉపాధి, విద్య, వైద్యం తదితర ముఖ్య రంగాల్లో ఆశించిన ప్రగతి లేదని సమగ్ర కుటుంబ సర్వేలో నిగ్గు తేలింది. దృఢ సంకల్పంతో సర్వేను విజయవంతంగా నిర్వహించిన తెలంగాణ తొలి ప్రభుత్వం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల, వర్గాల అభివృద్ధి, సంక్షేమానికి అన్ని వర్గాలను కలుపుకొని సమష్టిగా కృషి చేయడమే బంగారు తెలంగాణ స్వప్నం సాకారం కావడానికి ఏకైక మార్గం. - శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి, చీఫ్ రిపోర్టర్, ‘సాక్షి’, హైదరాబాద్ -
‘సర్వే’తో ముడి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: సంక్షేమ పథకాల పంపిణీ అంశంలో సర్కారు మరో ముందడుగు వేసింది. ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియను వేగిరం చేసిన ప్రభుత్వం.. తాజాగా వాటి పరిశీలనకు సంబంధించి చర్యలు చేపట్టింది. రెండు నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన సమగ్ర కుటుంబ సర్వే సమాచారం ఆధారంగా సంక్షేమ పథకాల అమలుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా దరఖాస్తు పరిశీలన అంశాన్ని సర్వే వివరాలతో ముడిపెట్టిన ప్రభుత్వం.. గురువారం ఆ వివరాలను తహసీల్దార్ల యూజర్ ఐడీతో లింక్ చేసింది. దీంతో రంగంలోకి దిగిన అధికారగణం.. ఆ వివరాలను ప్రింట్కాపీలతో సిద్ధంచేసే పనిలో నిమగ్నమైంది. కుటుంబాలు 17.63 లక్షలు.. సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా సేకరించిన గణాంకాల ప్రకారం జిల్లాలో 17,63,829 కుటుంబాలున్నాయి. ఇందులో గ్రామీణ పరిధిలో 8,10,697 కుటుంబాలుండగా.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 9,53,132 కుటుంబాలున్నాయి. సంక్షేమ పథకాల కోసం వచ్చే దరఖాస్తులను సమగ్ర కుటుంబ సర్వే వివరాలతో సరిపోల్చిన అనంతరం తనిఖీ బృందాల ధ్రువీకరణతో కొత్తగా అర్హులను ఎంపిక చేయనున్నారు. ఇందుకు సమగ్ర కుటుంబ సర్వే వివరాలను కుటుంబాల వారీగా ప్రింప్అవుట్ తీసి సిద్ధం చేసుకుంటున్నారు. తాజా గణాంకాల ప్రకారం జిల్లాలో ఆహార భద్రతకు సంబంధించి 9,45,731 దరఖాస్తులు అందగా, పింఛన్ల కోసం 2.9లక్షలు వచ్చాయి. ఇలా తనిఖీ చేసి.. సంక్షేమ పథకాల అర్హత కోరుతూ వచ్చిన దరఖాస్తులపై మండలస్థాయిలో ఆరుగురు సభ్యులున్న బృందం క్షేత్ర పరిశీలన చేపట్టనుంది. ఈ బృందంలో మండల తహసీల్దార్, ఉప తహసీల్దార్, ఎంపీడీఓ, రెవెన్యూ ఇన్‌స్టెక్టర్, సీనియర్ అసిస్టెంట్లు ఉంటారు. అర్జీదారు పెట్టుకున్న దరఖాస్తుతో సమగ్ర కుటుంబ సర్వే వివరాలను జోడించి వాటితో క్షేత్రస్థాయిలో తనిఖీ చేపడతారు. సర్వే వివరాలను రూఢీ చేసుకోవడంతోపాటు దరఖాస్తుదారు అర్హతను తేల్చుతారు. అనంతరం లబ్ధిదారుడిని ఖరారుచేస్తూ ధ్రువీకరిస్తారు. ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే నమూనా పత్రాలను సిద్ధంచేసి క్షేత్రస్థాయి అధికారులకు చేరవేసింది. ముందుగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈనెల 16 నుంచి దరఖాస్తుల పరిశీలన మొదలు పెట్టాల్సి ఉండగా.. దరఖాస్తు ప్రక్రియను 20తేదీకి పెంచడంతో పరిశీలన ప్రక్రియ కొంత ఆలస్యమైంది. వారికీ వెసులుబాటు.. ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే ప్రక్రియలో నమోదుకాని వారికి తాజాగా వెసులుబాటు కల్పించనుంది. తనిఖీ ప్రక్రియకు వచ్చే అధికారులకు ‘సమగ్ర’ వివరాలు ఇవ్వడంతోపాటు సంక్షేమ పథకాల అర్హత కోసం దరఖాస్తు సమర్పించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో వారి అక్కడికక్కడే ధ్రువీకరించి అర్హతను ఎంపికచేసే అవకాశం ఉంది. -
కుటుంబ సర్వే వివరాలు పథకాలకు అనుసంధానం
హైదరాబాద్: సమగ్ర కుటుంబ సర్వే వివరాలను సంక్షేమ పథకాలకు అనుసంధానం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సమగ్ర కుటుంబ సర్వే వివరాల నమోదు ప్రక్రియ వేగంగా జరుగుతోంది. దాదాపు అన్ని జిల్లాలలో కంప్యూటరైజేషన్ కార్యక్రమం పూర్తికావస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్(జిహెచ్ఎంసి) పరిధిలో మాత్రం కంప్యూటరైజేషన్ మరికొన్ని రోజులు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కంప్యూటరైజేషన్ పూర్తి అయిన తరువాత పథకాలకు అనుసంధానం చేస్తారు. రేషన్‌కార్డుల పంపిణీపై కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. జిహెచ్ఎంసి పరిధిలో సర్వే వివరాల కంప్యూటరీకరణ వేగంగా పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ** -
రెండో రోజూ కొనసాగిన సర్వే
చింతపల్లి :కలెక్టర్ చిరంజీవులు ఆదేశాల మేరకు స్థానిక తహసీల్దార్ పుష్పలత.. మండలంలోని వర్కాల, ఘడియగౌరారం, మల్లారెడ్డిపల్లి గ్రామాలలో రెం డో రోజైన బుధవారం కూడా సమగ్ర కుటుంబ సర్వేను కొనసాగించారు. ఘడియగౌరారం, మ ల్లారెడ్డిపల్లిలలో సర్వే సాఫీగా సాగింది. కానీ వర్కాలలో మాత్రం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వర్కాలకు చెందిన శ్రీను అనే వ్యక్తికి గ్రామంలో రేషన్‌కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, సొంత ఇల్లు ఉన్నా అతని పేరు సర్వేలో నమోదు చేయకపోవడంతో ఎన్యుమరేటర్‌ను సంప్రదిస్తున్నాడు. ఆ సమయంలో వర్కాల సర్పంచ్ కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ విషయమై కల్పించుకుని తహసీల్దార్ ఎదుటే శ్రీనుపై దాడి చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. దీంతో గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని సర్వే ప్రశాంతంగా కొనసాగేలా చర్యలు చేపట్టారు. అద్దె కుటుంబాల సర్వే వాడపల్లి(దామరచర్ల): మండల పరిధిలోని వాడపల్లి గ్రామంలో అద్దెకు ఉంటున్న కుటుంబాలను కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం సర్వే చేశారు. గ్రామంలో వేరే ప్రాంతాల నుంచి వచ్చి అద్దె ఇళ్లలో ఉంటున్న కుటుంబాలను ఎన్యుమరేటర్లు మంగళవారం సర్వే చేయలేదు. దీంతో వారు స్థానిక నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక అధికారులను సర్వే చేయాలని కోరినప్పటికీ స్పందించక పోవడంతో మంగళవారం రాత్రి ఫోన్ ద్వారా కలెక్టర్‌కు ఈ విషయం చెప్పారు. కలెక్టర్ ఆదేశాల మేరకు తసీల్దార్ రమాదేవి.. అద్దెకు ఉంటున్న వారిని సర్వే చేయాలని స్థానిక అధికారులను ఆదేశించారు. 120 ఇళ్లను ఎనిమిది మంది ఎన్యుమరేటర్ల ద్వారా గ్రామ పంచాయ తీ కార్యాలయంలో సర్వే చేయించారు. ఈ విషయమై గ్రామ పంచాయతీ కార్యదర్శి కేశ్యానాయక్‌కు ఎంపీడీఓ ఉమాదేవి మెమో జారీ చేశారు. అన్ని కుటుంబాల సర్వే పూర్తి చేయాలని ధర్నా బేగంపేట(రాజాపేట) : అన్ని కుటుంబాల సర్వే పూర్తి చేయాలని కోరుతూ మండలంలోని బేగంపేటవాసులు బుధవారం స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట గంట పాటు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు మాట్లాడారు. సమగ్ర సర్వేలో కొందరిని మాత్రమే గుర్తించి సర్వే చే శారని మిగిలినవారిని పట్టించుకోలేదన్నారు. ఒక ఇంటిలో మూడు కుటుంబాలు ఉన్నా ఒకే కుటుంబంగా గుర్తించినట్లు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అన్ని కుటుంబాలను సర్వే చేయడానికి చర్యలు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో సుదగాని వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
సర్వేకు పవన్ కళ్యాణ్, విజయశాంతి నిరాకరణ
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ సర్వేలో వివరాలు ఇచ్చేందుకు సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిరాకరించారు. ఆయనతోపాటు.. విజయశాంతి కూడా సర్వే వివరాలు ఇవ్వడానికి తిరస్కరించారు. వారి నుంచి మరోసారి సమగ్ర కుటుంబ సర్వే వివరాలు తీసుకునేందుకు ప్రయత్నిస్తామని ఆ ప్రాంతానికి వెళ్లిన ఎన్యుమరేటర్లు తెలిపారు. కాగా, హైదరాబాద్ నగరంలో 30 శాతం వరకు సర్వే పూర్తయిందని, మొత్తం సర్వేను మంగళవారమే పూర్తి చేస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్ తెలిపారు. ప్రజల నుంచి అద్భుతమైన స్పందన ఉందని, సర్వేపై పూర్తి వివరాలను గవర్నర్‌కు అందజేశానని ఆయన అన్నారు. సమగ్ర సర్వేలో ఎలాంటి ఇబ్బందులు లేవని, ఉదయం 7 గంటల నుంచి అన్ని డివిజన్లలో సర్వే ప్రారంభమైందని తెలిపారు. సర్వేతో ఇబ్బందిపడుతున్న ప్రజలనుంచి ఫిర్యాదులు తీసుకుంటున్నామని, 24 గంటలు పనిచేసే జీహెచ్ఎంసీ కాల్ సెంటర్‌తోపాటు ఎస్ఎంఎస్లు, ఈమెయిల్స్ ద్వారా కూడా ఫిర్యాదులు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. ఎస్కేఎస్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి డివిజన్ నంబర్ టైప్‌చేసి స్పేస్ ఇచ్చి సమస్యను టైప్ చేసి 9177999876 నెంబరుకు ఎస్ఎంఎస్ చేయాలని ఆయన సూచించారు. -
సర్వేతో బయటపడ్డ కుటుంబ కలహాలు
-
సమగ్ర సర్వేతో బయటపడ్డ కుటుంబ కలహాలు
సమగ్ర కుటుంబ సర్వే సందర్భంగా కుటుంబ కలహాలు కూడా బయటపడుతున్నాయి. హైదరాబాద్ కూకట్పల్లి ప్రాంతంలో ఇంతకాలం తమ కుటుంబానికి దూరంగా ఉన్న మహిళ.. ఇప్పుడు తనను కుటుంబంలో భాగంగా చేయాలని కోరుతూ ఇంటికి వచ్చింది. అయితే, మూడేళ్లుగా కనీసం ముఖం కూడా చూపించలేదని, తన కొడుకును కూడా తనకు చూపించలేదని ఇప్పుడు ఎందుకు వచ్చావని అంటూ ఆమె భర్తతో పాటు అత్తమామలు కూడా ఆమెను ఇంట్లోకి రానివ్వడానికి తిరస్కరించారు. ఆమె తమపై తప్పుడు కేసులు పెట్టిందని, హత్యాయత్నం, 498ఎ కేసులు పెట్టిందని చెబుతున్నారు. ఆమె నుంచి తనకు విడాకులు మంజూరు చేయాలని కూడా తాను కోర్టులో కోరినట్లు ఆమె భర్త చెబుతున్నారు. ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సదరు మహిళ ఇంటిముందు బైఠాయించింది. కానీ చుట్టుపక్కల కుటుంబాల వాళ్లు కూడా మహిళనే తప్పుబడుతున్నారు. అత్తమామల పట్ల ఆమె చాలా దురుసుగా ప్రవర్తించేదని అంటున్నారు. కేవలం తమ ఆస్తి కోసమే ఆమె ఇప్పుడు వచ్చిందని ఆమె అత్తమామలు అంటున్నారు. ఇన్నాళ్లూ తమతో ఎలాంటి సంబంధాలు లేకుండా, సమాజంలో దుర్మార్గంగా చిత్రీకరించిందని చెబుతున్నారు. సర్వే మాట దేవుడెరుగు, కుటుంబ కలహాలతో చుట్టుపక్కల వాళ్లు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. -
గర్భిణి ప్రాణాల మీదకు తెచ్చిన సర్వే
మెదక్ జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వే ఫలితంగా ఓ మహిళ పురిటినొప్పులతో ప్రాణాపాయ స్థితిలో రోడ్డుమీదే కొట్టుమిట్టాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. శివంపేట ప్రాంతానికి చెందిన జ్యోతి అనే గర్భిణి పురిటి నొప్పులతో నరసాపూర్ ఆస్ప్తత్రికి వచ్చింది. ఉదయం ఏడు గంటల ప్రాంతంలోనే ఆమె ఆస్పత్రికి చేరుకున్నా, సిబ్బంది ఎవరూ లేరంటూ ఆమెను తిప్పి పంపారు. 9.30 గంటల వరకు కూడా ఎవరూ రాలేదు. సమగ్ర కుటుంబ సర్వే ఉండటం వల్ల సిబ్బంది ఎవరూ రారని చెప్పారు. వాస్తవానికి వైద్యసేవల లాంటి అత్యవసర సేవలకు సర్వే నుంచి మినహాయింపు ఇవ్వాల్సి ఉన్నా, ఇక్కడి ప్రభుత్వ వైద్యులకు కూడా సూపర్వైజర్ బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది. కనీసం ఆస్పత్రిలో నర్సులు, హెడ్ నర్సు ఉండాల్సి ఉన్నా, సర్వే కోసం వాళ్లు తమ తమ ఇళ్లకు వెళ్లినట్లు చెబుతున్నారు. కనీసం ప్రైవేటు ఆస్పత్రులు కూడా ఏవీ తెరవకపోవడంతో పురిటినొప్పులతో బాధపడుతున్న జ్యోతి నడిరోడ్డుమీదే ఉండిపోవాల్సి వచ్చింది. ఆమెకు తక్షణం చికిత్స అందించకపోతే ప్రాణాపాయం ముప్పు ఉందని స్థానికులు అంటున్నారు. -
గర్భిణి ప్రాణాల మీదకు తెచ్చిన సర్వే
-
'సర్వేలో వ్యక్తిగత అంశాలు చెప్పనక్కర్లేదు'
సర్వేలో వ్యక్తిగత అంశాలను ప్రస్తావించాల్సిన అవసరం లేదని తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు డి.శ్రీనివాస్ అన్నారు. సీఎల్పీ ఆఫీసులో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు సోమవారం భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ఏడుగురు ఎమ్మెల్సీలు హాజరు కాగా, ఇద్దరు మాత్రం గైర్హాజరయ్యారు. టీఆర్ఎస్ ఇచ్చిన హామీలను అమలు చేయడానికి రాబోయే బడ్జెట్లో నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా డీఎస్ అన్నారు. ప్రతిపక్షంగా తాము పోరాటాలకు సిద్ధమవుతామని చెప్పారు. సర్కారు చేపడుతున్న సమగ్ర కుటుంబ సర్వేకు తాము వ్యతిరేకం కాదని, అయితే ఆ ఫార్మాట్‌ను చూసి మాత్రం కొందరు భయాందోళన వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. -
‘సర్వే’ విధులు సక్రమంగా నిర్వహించాలి
ప్రగతినగర్ : ప్రతి ఒక్కరు తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లా ప్రజలు బాగుండాలనే సంకల్పంతో సమగ్ర కు టుంబ సర్వే విధులు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రాస్ అధికారులకు, ఎన్యూమరేటర్లకు సూచించారు. శనివారం రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో సమగ్ర కుటుంబ సర్వేపై జోనల్ అధికారులు, ప్రత్యేక అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈనెల 17న జిల్లాలోని అన్ని మండలాల్లో రెండో విడత శిక్షణ తరగతులు ఏర్పాటు చేసినందున ఎన్యూమరేటర్లు అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలన్నారు. బ్యాంకు ఉద్యోగులు కూడా శిక్షణకు హాజరయ్యేందుకు లీడ్ బ్యాంక్ మేనేజర్ బ్యాంకర్లందరికి తెలియజేయాలన్నారు. ఎన్యూమరేటర్లకు డ్యూటీ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నామని తహశీల్దారులు, స్పెషల్ అధికారులు డ్యూటీ ఆర్డరుతో పాటు వాటిని తీసుకుని 17వ తేదీకల్లా ఎన్యూమరేటర్లకు అందచేయాలని కలెక్టర్ ఆదేశించారు. 19వ తేదీన ఉదయం 6 గంటల కల్ల సంబంధిత మండల కేంద్రంలోని కార్యాలయం వద్ద సిద్ధంగా ఉండాలన్నారు. ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసినట్లు, గ్రామాలకు వెళ్లేందుకు రూట్ ఆఫీసర్స్ సహకరిస్తారని తెలిపారు. మెటీరియల్‌తో కూడిన కిట్ బ్యాగులను ఎన్యుమరేటర్లకు అందజేస్తామన్నారు. కొత్తగా రూపొందించిన కర దీపికను తీసుకెళ్లాలని ఎన్యూమరేటర్లకు స్పెషల్ ఆఫీసర్లు చెప్పాలన్నారు. జోనల్ ఆఫీసర్లు, మండల స్పెషల్ ఆఫీసర్లు ,గ్రామ స్పెషల్ ఆఫీసర్ల వద్ద రిజర్వు సిబ్బందిని కేటాయిస్తున్నామని, అవసరమైతే వారి సేవలు వినియోగించుకోవాలని సూచించారు. స్పెషల్ ఆఫీసర్లు 19వ తేదీన ఎన్యూమరేటర్ల బస్సులు బయలుదేరినప్పటి నుంచి సర్వే పూర్తి అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తుండాలన్నారు. 17వ తేదీన జరిగే శిక్షణ కార్యక్రమంలో జోనల్ అధికారులు, మండల ప్రత్యేక అధికారులు అన్ని వివరాలు ఎన్యూమరేటర్లకు తెలియచేయాలని సూచించారు. సమావేశంలో జడ్పీ సీఈవో రాజారాం, ఐకేపీ పీడీ వెంకటేశం, డీపిఓ సురేష్‌బాబు, అధికారులు పాల్గొన్నారు. కుటుంబ వివరాలు తప్పులు లేకుండా నమోదు చేయాలి ప్రభుత్వం నిర్దేశించిన ప్రోఫార్మలో ఎన్యూమరేటర్లు కుటుంబ వివరాలు సమాచారం తప్పులు లేకుండా నమోదు చేయాలని జిల్లా పరిషత్ సీఈవో రాజారాం సూచించారు. ఈనెల 12వ తేదీన అనివార్య కారణాల వల్ల శిక్షణకు హాజరుకాని ఉద్యోగులకు, ఎన్యూమరేటర్లకు శనివారం రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలోప్రత్యేక శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాచారం సరిగ్గా ఇవ్వకపోతే ఆ కుటుంబాల వారు భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలు అందక నష్టపోతారన్నారు. అందువల్ల సర్వే ప్రాముఖ్యతను వారికి తెలియచెప్పి, వివరాలు తీసుకొని సమాచారం నమోదు చేయాలని ఎన్యూమరేటర్లకు సూచించారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివిధ అంశాలలో ఏ విధంగా సమాచార నమోదు చేయాలో వివరించారు. కార్యక్రమంలో ఇన్చార్జి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మంగతాయారు, పలువురు అధికారులు పాల్గొని ఎన్యూమరేటర్లకు అవగాహన కల్పించారు. -
అభివృద్ధే నినాదం
‘రాష్ట్ర అవతరణతో మన బాధ్యత మరింత పెరిగింది. సుదీర్ఘ పోరాటాలు.. అమరుల త్యాగాల ఫలితంగా 29వ రాష్ట్రంగా సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరముంది. కలిసికట్టుగా.. అభివృద్ధే నినాదంగా ముందుకుసాగాల్సిన సమయం ఆసన్నమైంది.. దీనికి ప్రతిఒక్కరం కలిసివద్దాం.. బంగారు తెలంగాణ నిర్మాణానికి పునరంకితమవుదాం..’ - ఈటెల రాజేందర్,రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ►బంగారు తెలంగాణకు పునరంకితమవుదాం ►దసరా నుంచి కొత్త పింఛన్లు ►పటిష్టంగా పోలీసు వ్యవస్థ ►కాకతీయ కెనాల్ సామర్థ్యాన్ని పెంచుతాం ►గల్ఫ్ బాధితులకు కేరళ తరహా ప్యాకేజీ ►సమగ్రంగా కుటుంబ సర్వే ►స్వాతంత్య్ర వేడుకల్లో మంత్రి ఈటెల ముకరంపుర : రాష్ట్ర ఆవిర్భావం అనంతరం తొలిసారి జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జిల్లాకు వన్నెతెచ్చాయి. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్‌గ్రౌండ్‌లో నిర్వహించిన వేడుకల్లో మంత్రి ఈటెల రాజేందర్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జెండా వందనం చేసి పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన 200 మందికి ప్రశంసాపత్రాలు అందించారు. స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు. దళితులకు పట్టాలు అందించి మొదటివిడత భూ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం మాట్లాడారు. ఆయన మాటల్లోనే.. రాష్ట్రం గ్రామ స్థాయిలో అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ మన ఊరు- మన ప్రణాళిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా జిల్లాకు రూ.5.424కోట్లతో 7,444 పనులను గుర్తించాం. వాటికి వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయిస్తాం. నిరుపేద దళిత కుటుంబాలకు మూడెకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి పంపిణీ చేస్తున్నాం. నియోజకవర్గానికో గ్రామాన్ని ఎంపిక చేసి అందులో గుర్తించిన లబ్ధిదారులకు భూమి ఇస్తాం. ఇందుకు ప్రభుత్వం రూ.ఐదు కోట్లు విడుదల చేసింది. రుణమాఫీతో ఐదు లక్షల మందికి లబ్ధి పంటరుణాలు మాఫీ చేయడం ద్వారా జిల్లాలో ఐదు లక్షలమందికి లబ్ధి చేకూరనుంది. దసరా నుంచి కొత్త పింఛన్లు ఇస్తాం. వృద్ధులు, వితంతువులకు నెలకు రూ.వెయ్యి, వికలాంగులకు రూ.1500 చొప్పున పింఛన్ అందిస్తాం. దళిత, గిరిజన కుటుంబాల్లో పుట్టిన అమ్మాయిల పెళ్లి ఖర్చులకు ‘కళ్యాణలక్ష్మి’ పథకం కింద రూ.50 వేల చొప్పున అందిస్తాం. గిరిజనతండాలను, గూడాలను పంచాయతీలుగా మారుస్తాం. అమరుల కుటుంబాలకు రూ.10 లక్షలు 1969 నుంచి తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగాలు చేసిన అమరుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున సాయం అందిస్తాం. 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిపై కేసులు ఎత్తివేసేందుకు చర్యలు తీసుకుంటున్నం. వ్యవసాయ ట్రాక్టర్లు, ట్రాలీలు, ఆటోలకు రవాణా పన్నును రద్దు చేశాం. గల్ఫ్ బాధితులకు కేరళ తరహా ప్యాకేజీ ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి తిరిగొచ్చిన వారిని ఆదుకునేందుకు కేరళ తరహా ప్యాకేజీ అమలు చేస్తాం. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ కోసం కమిషన్ ఏర్పాటు చేశాం. మైనార్టీ కమిషన్‌కు రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తాం. ఆర్థిక స్థోమత లేక విద్యార్థులు చదువులకు దూరం కావద్దనే లక్ష్యంతో ఫాస్ట్ పథకాన్ని తీసుకొచ్చాం. కరీంనగర్ చుట్టూ రింగురోడ్డు కరీంనగర్ నగరం చుట్టూ రింగురోడ్డు, నగరంలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ ఏర్పాటు చేస్తాం. జిల్లా పోలీస్ విభాగానికి అత్యాధునిక వాహనాలను అందించి వ్యవస్థను పటిష్టం చేస్తాం. రామగుండంలో ఎన్టీపీసీ ద్వారా 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి చర్యలు తీసుకుంటున్నాం. సింగరేణి ఆధ్వర్యంలో రామగుండంలో మెడికల్ కాలేజీ, అనుబంధంగా ఆధునాత ఆసుపత్రిని నిర్మిస్తాం. అక్కడే మైనింగ్ పాలిటెక్నిక్ ఏర్పాటు, మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తాం.జిల్లాకేంద్ర ఆసుపత్రిని నిమ్స్‌స్థాయిలో అభివృద్ధి చేస్తాం. మంథని ఆసుపత్రిని వంద పడకలు, హుస్నాబాద్ ఆసుపత్రిని 50 పడకల స్థాయికి పెంచుతాం. అన్ని ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. ఆర్ఎంపీ, పీఎంపీలకు ప్రభుత్వం తరఫున సర్టిఫికెట్లు ఇవ్వాలని నిర్ణయించాం. కాకతీయ కెనాల్ సామర్థ్యం పెంచుతాం కాకతీయ కెనాల్ నీటి సామర్థ్యాన్ని 12వేల నుంచి 14 వేల క్యూసెక్కులకు పెంచుతాం. ఎస్సారెస్పీ, మిడ్‌మానేరు మధ్య మరో జలాశయం నిర్మిస్తాం. రాయికల్- బోర్నపల్లి వద్ద గోదావరిపై బ్రిడ్జి నిర్మిస్తాం. ఏడు కొత్త వ్యవసాయ మార్కెట్లు ప్రారంభిస్తాం. బతుకమ్మ నిమజ్జనం కోసం మానకొండూర్ చెరువును అభివృద్ధి చేస్తాం. కొండగట్టును ప్రముఖ పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు 300 ఎకరాల స్థలాన్ని గుర్తిస్తాం. హుజురాబాద్‌ను కొత్త డివిజన్‌గా ఏర్పాటు చేసి ప్రజల చిరకాల కోరికను నెరవేర్చాం. రామగుండం పట్టణానికి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి తాగునీరందిస్తాం. ఇంటి సర్వే ముఖ్యం ఈ నెల 19న నిర్వహించనున్న ఇంటింటి సర్వే చాలా ముఖ్యమైనది. అర్హులకు ప్రభుత్వ ఫలాలు అందించేందుకు ఈ సర్వే దోహదపడుతుంది. ఆరోజు సెలవు ప్రకటించినందున ప్రజలు ఇంటివద్దనే ఉండి ఎన్యుమరేటర్లకు సమాచారం అందించాలి. ప్రాజెక్టుల పూర్తికి చర్యలు అసంపూర్తిగా ఉన్న మధ్యమానేరు, ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌లను త్వరితగతిన పూర్తి చేస్తాం. గొలుసు కట్టు చెరువులను అభివృద్ధి చేసి జిల్లాలోని ప్రతి ఎకరాకూ సాగునీరందిస్తాం. అదే సమయంలో తాగునీటికి కొరత లేకుండా చూస్తాం. తాగునీటి సమస్య పరిష్కారానికి అన్ని పథకాలను సమన్వయం చేసి 160 టీఎంసీలతో గ్రిడ్‌ను ఏర్పాటు చేస్తున్నాం. యంత్ర పరికరాలకు సబ్సిడీ వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద రైతులకు 50 శాతం సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలు, పరికరాలు అందించేందుకు జిల్లాకు రూ.18.60 కోట్ల మంజూరు చేశాం. వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులు బిందు, స్ప్రింక్లర్ల సేద్యానికి ప్రాధాన్యత నివ్వాలి. ఈ ఏడాది జిల్లాలో 3500 హెక్టార్లలో బిందు సేద్యం, 1208 హెక్టార్లలో తుంపర్ల సేద్యం లక్ష్యంగా పెట్టుకున్నాం. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, రసమయి బాలకిషన్, బొడిగే శోభ, కొప్పుల ఈశ్వర్, చెన్నమనేని రమేశ్‌బాబు, పుట్ట మధు, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, మేయర్ రవీందర్‌సింగ్, ఇన్చార్జి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, డీఐజీ నాయక్, ఎస్పీ శివకుమార్ , అదనపు ఎస్పీ జనార్దన్, డీఎస్పీ రవీందర్, ఏజేసీ నంబయ్య, డీఆర్వో వీరబ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
నిజమే చెప్పండి
►కచ్చితత్వం కోసమే కుటుంబసర్వే ►అపోహలు, అనుమానాలు వద్దు ► పథకాల అమలుకు సర్వే ప్రాతిపదిక కాదు ►స్థానికత’కోసం కాదు ►19న కుటుంబసభ్యుల హాజరు తప్పనిసరి ►గల్ఫ్ వెళ్లిన వారి వివరాలు నమోదు చేయం ►జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : ప్రజల సామాజిక స్థితిగతులు తెలుసుకునేందుకోసమే 19న కుటుంబసర్వే నిర్వహిస్తున్నట్లు ఇన్చార్జి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు. సర్వేపై ప్రజల్లో అనేక అపోహలు... సందేహాలు నెలకొన గా వాటిని నివృత్తి చేసేందుకు కలెక్టరేట్ మీటింగ్ హాల్లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి సమగ్రంగా వివరించారు. రాష్ట్ర సమగ్ర సమాచారంతో ప్రభుత్వానికి అర్హులకు సంక్షేమ ఫలాలను అందించడం, పథకాల రూపకల్పన లబ్ధిదారుల ఎంపిక సులభతరమవుతుందని తెలిపారు. ఈ సర్వేలో స్థానికతను నిర్ధారించడం లేదన్నారు. ప్రతి పౌరుడి సమాచారం సేకరిస్తామని చెప్పారు. సూక్ష్మంగా నిర్వహించే ఈ సర్వేతో ప్రతి కుటుంబానికి సంబంధించిన సమాచారం ప్రభుత్వ రికార్డుల్లోకి చేరుతుందని, తద్వారా సంక్షేమ ఫలాలు దుర్వినియోగం కాకుండా దోహదపడతుందనిస్పష్టం చేశారు. కొందరికి మినహాయింపు ఇంటింటి సర్వేకు కుటుంబసభ్యుల హాజరు తప్పనిసరి అని కలెక్టర్ తెలిపారు. పాఠశాలలు, హాస్టల్లో ఉండే పిల్లలు, అత్యవసర వైద్య సేవలు తీసుకునేవారు, సర్వే విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు మాత్రమే మినహాయింపు ఉంటుందని వెల్లడించారు. ఇతర దేశాల్లో నివసిస్తున్న కుటుంబసభ్యుల వివరాలు నమోదు చేయబోమని స్పష్టం చేశారు. ఉపాధి నిమిత్తం గ్రామీణ ప్రాంతాలనుంచి పట్టణాల్లోకి వచ్చి స్థిరపడిన వారు ఒకేచోట వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. అయితే పట్టణాల్లో లేదంటే సొంత గ్రామానికి వెళ్లి నమోదు చేసుకోవచ్చని తెలిపారు. సర్టిఫికెట్లలో ఏదో ఒకటి చూపాలి సర్వేకు వచ్చే ఎన్యుమరేటర్‌కు కుటుంబసభ్యులు ధ్రువీకరణ పత్రాలు చూపించాల్సి ఉంటుందని కలెక్టర్ వివరించారు. వికలాంగులు సదెరమ్ సర్టిఫికెట్లు ఉంటే చూపించాలని సూచించారు. రేషన్‌కార్డు, బ్యాంకు, పోస్టాఫీస్ ఖాతా, కరెంటుబిల్లు, ఆధార్‌కార్డును ధ్రువీకరణగా చూపాలని చెప్పారు. కుటుంబాల విభజనకు మాత్రమే వంట గదులను ప్రామాణికంగా తీసుకుని వివరాలు నమోదు చేస్తామని వెల్లడించారు. తప్పుడు సమాచారమిస్తే భవిష్యత్తులో ఇబ్బందులెదురవుతాయని తెలిపారు. ఉదాహరణకు భూములు, వాహనాలు ఉన్నప్పటికీ లేవనే సమాధానం చెబితే భవిష్యత్తులో వాటిని విక్రయించుకోరాదని, రిజిస్ట్రేషన్‌లో ఆ వివరాలు తేలిపోతాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. పక్కా ఏర్పాట్లు జిల్లాలో కుటుంబాల సమాచారం నమోదులో కచ్చితత్వమే లక్ష్యంగా ఇంటింటి సర్వేను పకడ్బందీగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో 9.76 లక్షల కుటుంబాలున్నాయని, వాటన్నింటికీ నోషనల్ నంబర్లు ఇస్తున్నామని తెలిపారు. నంబర్ల ప్రకారం 10.20 లక్షల కుటుంబాలు కావచ్చని అంచనా వేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ లెక్కన సర్వేకు 35 నుంచి 36 వేల మంది ఎన్యుమరేటర్లు అవసరముందని అంచనా వేశామన్నారు. సర్వే ఉదయం 8 గంటలకు ప్రారంభమై 10 గంటలపాటు సాగుతుందని, సర్వే రోజు సాయంత్రమే ఫ్రీజ్ చేస్తామని పేర్కొన్నారు. -
అటు సర్వే.. ఇటు సెలవులు!
19న సాధారణ సెలవుకు ఆంధ్రా ఉద్యోగుల దరఖాస్తులు 18 నుంచి అసెంబ్లీ ఉన్నందున సెలవులు ఇవ్వడంపై తర్జనభర్జన తెలంగాణలో ఈ నెల 19న నిర్వహించే కుటుంబ సమగ్ర సర్వే ప్రభావం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులపై పడింది. హైదరాబాద్‌లో ఉంటున్నందున సర్వేకు వివరాలు అందించేందుకు సెలవు పెట్టాలని ఏపీలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు నిర్ణయానికి వచ్చారు. సాక్షి, హైదరాబాద్: ఈ నెల 19న నిర్వహించే కుటుంబ సమగ్ర సర్వే ప్రభావం ఏపీ ఉద్యోగులపై పడింది. హైదరాబాద్‌లో ఉంటున్నందున సర్వేకు వివరాలు అందించేందుకు సెలవు పెట్టాలని ఏపీలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు నిర్ణయానికి వచ్చారు. సర్వేలో వివరాలు అందజేయకపోతే భవిష్యత్‌లో పిల్లల చదువులు, ఉద్యోగాలకు ఇంటి చిరునామాతో పాటు ఇతర సర్టిఫికెట్లు కావాలంటే సమస్యలు తలెత్తుతాయనేది ఉద్యోగుల అభిప్రాయంగా ఉంది. సచివాలయంలో ఒక శాఖలోనే మంగళవారం ఏకంగా 20 మంది ఉద్యోగులు సాధారణ సెలవు కోసం దరఖాస్తు చేసుకున్నారు. హక్కును ఎలా కాదంటాం? సాధారణ సెలవు కోరడం ఉద్యోగుల హక్కని, దాన్ని ఎలా తిరస్కరించగలమని అధికారులు అభిప్రాయపడుతున్నారు. 18 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఉద్యోగులకు సెలవులు ఇవ్వడం సాధ్యం కాదని కూడా అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. సచివాలయంతో పాటు విభాగాధిపతుల కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా సాధారణ సెలవు కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. అడిగినవారందరికీ సెలవు మంజూరు చేస్తే 19న ఏపీ సచివాలయంతో పాటు పలు శాఖల కార్యాలయాలు ఉద్యోగులు లేక ఖాళీ అవుతాయని అధికారులు పేర్కొంటున్నారు. సర్వేలో ఏపీ ఉద్యోగులు పాల్గొనకున్నా హైదరాబాద్‌లో ఉంటున్నందున కుటుంబ వివరాలు చెప్పడానికి 19న ఇంటి దగ్గర ఉండక తప్పదని, అందుకే సెలవు కోసం దరఖాస్తు చేశామని సచివాలయ ఉద్యోగి ఒకరు తెలిపారు. సీఎం, సీఎస్‌లే నిర్ణయం తీసుకోవాలి ఏపీ ప్రభుత్వంలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులతో పాటు ఆంధ్రా ఉద్యోగులూ సెలవుకు దరఖాస్తులు చేసుకుంటున్నందున సీఎం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయిలో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలని అధికారులు పేర్కొంటున్నారు. -
కార్మికులకు ‘సర్వే’ వర్తించదా?
గోదావరిఖని : ‘ఈ నెల 19న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబ సర్వే చేపట్టనున్నాం.. ఆ రోజు కుటుంబంలోని అందరూ ఇళ్ల వద్దనే ఉండాలి.. ఒకవేళ సర్వేకు వచ్చిన సమయంలో ఎవరు లేకపోయినా వారిని ఇక మీదట వారిని లెక్కలోనికి తీసుకోం..’ అంటూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించగా.. సర్వే రోజు సెలవు దినంగా పేర్కొంటూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల న్నీ 19న బంద్ పాటించనుండగా... తెలంగాణలోనే అతిపెద్ద సంస్థ అయిన సింగరేణిలో మాత్రం యా జ మాన్యం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలే దు. కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లా ల్లో 63 వేల మంది కార్మికులు పనిచేస్తుండగా...మరో 2,500 మంది అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. సర్వేలో ఇంటికి వచ్చే ఎన్యుమరేటర్లకు అడిగిన వివరా లు తెలిపి తప్పనిసరిగా ఇంటి యజమానులే సంతకం చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం పదేపదే చెప్తోంది. ఈ తరుణంలో సింగరేణికి ఇటు ప్రభుత్వం గానీ, అ టు యాజమాన్యం గానీ సెలవు ప్రకటించకపోవడం తో కార్మికులు, ఉద్యోగులు అయోమయంలో పడ్డారు. ఇదిలా ఉండగా సింగరేణిలో ఒక రోజు బొగ్గు ఉత్పత్తి లక్ష్యం సుమారు 1.60 లక్షల టన్నులుండగా...19న సెలవు ప్రకటిస్తే ఆ మేరకు బొగ్గు ఉత్పత్తిని కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే అధికారికంగా సెలవు ప్రకటిస్తే వారికి సుమారు రూ.5 కోట్ల నుంచి రూ.6 కో ట్ల వరకు కార్మికులు, ఉద్యోగులకు వేతనాల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. బొగ్గు ఉత్పత్తితో పాటు వేతనా ల రూపంలో నష్టపోవాల్సి వస్తుందనే కారణంతో యా జమాన్యం సెలవు ప్రకటించడంలో వెనుకంజ వేస్తున్న ట్లు స్పష్టమవుతోంది. అయితే దీనికి విరుగుడుగా వా రాంతపు సెలవు దినమైన ఆదివారం రోజు కేవలం సిం గరేణి కార్మికుల కోసం సర్వే చేపడితే ఎలా ఉంటుం దనే ఆలోచన యాజమాన్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, 19న సార్వజనీన సర్వేకు సింగరేణిలో సెలవు ప్రకటించాలని కోరుతూ గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ అధ్యక్షుడు ఆకునూరి కనకరాజు సింగరేణి సీఎండీ సు తీర్థ భట్టాచార్యకు ఫ్యాక్స్ ద్వారా లేఖ పంపించారు. ఇదిలా ఉండగా అందరితో పాటు సింగరేణికి కూడా సెలవు ప్రకటిస్తే గనులు, ఓపెన్‌కాస్ట్‌లలో భూగర్భంలో ఏర్పడే సహజసిద్ధ్దమైన మార్పులను గమనించి, వాటిని సరిదిద్దేందుకు అత్యవసర సిబ్బంది అవసరం ఏర్పడుతుంది. అంటే నీ టి ఊటలు తొలగించే పంప్ ఆపరేటర్లు, ఫిట్టర్లు, ఎలక్ట్రీషియన్లు, ఇతర సూపర్వైజర్లు దాదాపు 10 శాతం వరకు విధులు నిర్వహించాల్సిందే. ఈ తరుణంలో వారికి ఎప్పుడు సర్వే నిర్వహిస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. మొత్తంగా ఇప్పటి వరకు సింగరేణిలో 19న సెలవు ప్రకటిస్తారా ? లేదా ? సంశయంగా మారగా.. యాజమాన్యం, ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇవ్వాలని కార్మికులు, సంఘాల నాయకులు కోరుతున్నారు. -
యజమాని సంతకం తప్పనిసరి!
సకుటుంబ సర్వేలోని ముఖ్యాంశాల ఖరారు ఫార్మాట్‌ను విడుదల చేసిన ప్రభుత్వం ఆధార్, బ్యాంక్ పాస్‌బుక్స్, గ్యాస్ బుక్, విద్యా సర్టిఫికెట్లు చూపాలి ఒక కుటుంబానికి ఎక్కడెక్కడ ఎన్ని ఆస్తులు, భూములున్నాయో చెప్పాలి ఒకే ఇంట్లో అన్నదమ్ములు వేరుగా ఉంటే వేర్వేరుగా సర్వే ఫారాలు నింపాలి సాక్షి, హైదరాబాద్: ఈనెల 19న రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న సమగ్ర సకుటుంబ సర్వే ఫార్మాట్ ను రాష్ర్ట ప్రభుత్వం శనివారం ఖరారు చేసింది. జిల్లాల్లో కూడా వీటికనుగుణంగా ఎన్యూమరేట్ చేస్తారు. అయితే ఈ ఫారంలో స్థానికతకు సంబంధించి అంశాలను పేర్కొనలేదు. సర్వే బుక్‌లెట్‌లో పొందుపరిచిన ముఖ్యాంశాలు.. సర్వే ఫారంపై కుటుంబ యజమాని సంతకం తప్పనిసరిగా తీసుకోవాలి. ఇంటికి తాళం వేసి ఉంటే పక్కింటివారిని అడిగి ఇంటి యాజమాని పేరు మాత్రమే నమోదుచేసి, మిగతా వివరాలు వదిలివేయాలి. సర్వే చేసే వారు ప్రజలు చెప్పిన వివరాలను మాత్రమే నమోదు చేసుకోకుండా ఆయా అంశాలను చర్చించి ఆ సమాచారాన్ని రాయాలి. ఆధార్ కార్డు, బ్యాంకు పాస్‌బుక్, పోస్టాఫీస్ పాస్‌బుక్, గ్యాస్ కనెక్షన్ బుక్, విద్యా సర్టిఫికెట్లు, వికలాంగుల సర్టిఫికెట్లు, భూమి పట్టాల వివరాలు తీసుకుని సర్వే పత్రాలు నింపాలి. సంచార జాతుల వివరాలను సేకరించి వారి సొంత మండలాల తహసీల్దార్లకు ఈ సమాచారాన్ని పంపించాలి. గ్రామాల్లో సర్వే చేస్తున్నపుడు ఈ పట్టికలో ప్రస్తుతం గ్రామాల్లో నివసిస్తున్న వారి వివరాలు మాత్రమే తీసుకోవాలి. పట్టణంలో సర్వే చేస్తున్నపుడు పట్టికలో ప్రస్తుతం పట్టణంలో నివసిస్తున్న వారి వివరాలను రాయాలి. విద్యార్థులు చదువు కోసం వేరే ప్రదేశాల్లో నివసిస్తుంటే వారి వివరాలు కూడా రాయాలి. ఒకవేళ వారి కొడుకుల కుటుంబాలు ఉద్యోగరీత్యా పట్టణాల్లో నివసిస్తుంటే వారి వివరాలు రాయకూడదు. కుటుంబం మొత్తం సొంత స్థిరాస్తుల వివరాలు రాయాలి. వారికి ఏయే ఆస్తులున్నాయో, ఎన్ని ఉన్నాయో, అడిగి వాటి మొత్తం సంఖ్యను, వాటి రిజిస్ట్రేషన్ నంబర్లు రాయాలి. ఒకే రకమైన చరాస్తులు రెండు ఉన్నాయంటే.. కేవలం ఒకదాని రిజిస్ట్రేషన్ నంబరే మాత్రమే రాయాలి. కుటుంబ సభ్యులు చేసే పనిని రాయాలి. ఒకవేళ రెండు వృత్తులు చేస్తే.. అందులో ఏ వృత్తి ద్వారా వారు ఎక్కువ ఆదాయాన్ని పొందుతారో దాని కోడ్ రాయాలి. రెండు వృత్తుల కోడ్లు రాయకూడదు. కుటుంబానికి భూమి ఉన్నట్లయితే ఈ విభాగంలోని వివరాలు రాయాలి. కుటుంబానికి అన్నిచోట్ల ఉన్న భూమి వివరాలతో సహా రాయాలి. కుటుంబంలో ఎవరెవరి పేరు మీద (వారు ఆ గ్రామంలో లేకున్నా) భూమి ఉందో వారందరి వివరాలు రాయాలి. కుటుంబం నిర్వచనమిదీ.. సాధారణంగా కొందరు వ్యక్తుల సమూహం ఒకే కప్పు కింద ఉంటూ, ఒకే వంటగది నుంచి భోజనాలు సమకూర్చుకుంటుంటే, దాన్ని ఒక కుటుంబంగా పరిగణిస్తారు. ఒకవేళ ఇంట్లో తల్లిదండ్రులతోపాటు ఒకటికంటే ఎక్కువ పెళ్లైన జంటలుంటే, ఒక పొయ్యితోనే (అంటే ఒకే కుటుంబంగా కలిసి) నివసిస్తుంటే ఒక కుటుంబంగా భావించి ఒక ఫారంలోనే పూర్తి వివరాలు రాయాలి. మామూలుగా ఒక ఇంట్లో ఒక కుటుంబమే నివసిస్తుంది. కానీ, కొన్ని ఇళ్లలో మాత్రం అన్నదమ్ములు ఒకటి కంటె ఎక్కువ కుటుంబాలు వేర్వేరుగా ఉంటూ, వేర్వేరుగా వంట చేసుకుంటున్న పక్షంలో అక్కడ ఎన్ని కుటుంబాలు వేరుగా నివసిస్తే.. అన్ని సర్వే ఫారాలు నింపాలి. 19న ‘సర్వే’ జన సెలవు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ నెల 19న ఇంటింటా సర్వే నిర్వహించాలని తలపెట్టిన నేపథ్యంలో ఆ రోజు సెలవు దినంగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఫైల్‌పై సీఎం కేసీఆర్ సంతకం చేశారు. సర్వేకు సామాన్య ప్రజలందరూ అందుబాటులో ఉండేలా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించనుంది. సెలవు అమలు చేయని సంస్థలపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. సర్వే విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు సెలవు వర్తించదు. -
సమగ్ర సర్వేకు సిద్ధంకండి
మహబూబ్‌నగర్ టౌన్: ఈనెల 19న నిర్వహించే సమగ్ర కుటుంబసర్వేకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి రేమండ్ పీటర్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. డాటా ఎంట్రీని ఎప్పటికప్పుడు పొందుపర్చాలని సూచించారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్వేను ఎలాంటి పొరపాట్లు లేకుండా నిర్వహించాలని, అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఇక సర్వే ఫారాల్లోని వివరాలు నింపడంతోపాటు వాటిని సేకరించే విధానంపై జిల్లా, మండల స్థాయి రిసోర్సు పర్సన్లు, ఎన్యుమరేటర్లకు శిక్షణ ఇవ్వాలన్నారు. సర్వే సమయంలో ఎన్యుమరేటర్లను వాహన సదుపాయం కల్పించేందుకు జిల్లాలకు బడ్జెట్ మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఈసర్వేకు సంబంధించిన బుక్లెట్లను హైదరాబాద్ నుంచి తీసుకెళ్లేందుకు ప్రత్యేకాధికారిని నియమించాలని కోరారు. సర్వేకు సిద్ధంగా ఉన్నాం: కలెక్టర్ కలెక్టర్ జీడీ ప్రియదర్శిని మాట్లాడుతూ.. సర్వేకు ఇప్పటికే సిద్ధంగా ఉన్నామని వివరించారు. ప్రస్తుతం ఎన్యుమరేటర్లకు కేటాయించే బ్లాక్‌లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సర్వేఫారంలో కుటుంబసభ్యుల వివరాలను సేకరించేందుకు ఇచ్చిన 8 కాలమ్స్ సరిపోవని వీటిని పెంచాలని కలెక్టర్ ప్రిన్సిపల్ కార్యదర్శి దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన ఆయన అవసరమైన చోట అదనంగా పేపర్లు మంజూరుచేస్తామని తెలిపారు. సమావేశంలో జేసీ ఎల్.శర్మన్, ఏజేసీ రాజారాం, డీఆర్ఓ రాంకిషన్, డీఆర్డీఏ పీడీ చంద్రశేఖర్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ రవిందర్ తదితరులు పాల్గొన్నారు. బ్లాక్‌ల కేటాయింపు పూర్తిచేయాలి ఎన్యుమరేటర్లకు కేటాయించే బ్లాక్‌ల గుర్తింపు ప్రక్రియను తక్షణమే పూర్తిచేయాలని కలెక్టర్ జీడీ ప్రియదర్శిని అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక రెవెన్యూ సమావేశ మందిరంలో మండల ప్రత్యేకాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సమగ్రసర్వేపై ప్రతిఒక్కరూ దృష్టిసారించాలని కోరారు. ప్రతి గ్రామంలో ఇళ్లకు వేసే ప్రాథమిక నెంబర్లే కీలకమని, వీటి ఆధారంగానే ఎన్యుమరేటర్లు సర్వేకు వెళ్తారన్నారు. ప్రత్యేకాధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీఓలు, ఇంటినెంబర్లు, ఎన్యుమరేషన్ బ్లాకుల నమోదుపై ర్యాండమ్‌గా తనిఖీచేయాలని సూచించారు. ప్రతి ఇంటికి ఒక ఫారం కేటాయించడంతో పాటు కిరాయిదారులకు కూడా ప్రత్యేక ఫారం కేటాయించనున్నట్లు కలెక్టర్ స్పష్టంచేశారు. ప్రతి ఎన్యుమరేటర్ 25 కుటుంబాలను మాత్రమే సర్వే చేస్తారని, తప్పులు లేకుండా సమాచారం సేకరించాలని సూచించారు. 19న ఉదయం 6గంటలకే కేటాయించిన గ్రామాలకు చేరుకొని 7గంటల నుంచి సర్వే చేపట్టాలని కోరారు. ఇళ్ల నెంబర్లు లేనివారు తహశీల్దార్లను సంప్రదించాలి జిల్లాలో ఇదివరకే ఇళ్లకు నెంబర్లు వేశామని, ఎవరి ఇంటికైనా నెంబర్ వేయకపోతే వారు వెంటనే సంబంధిత తహశీల్దార్‌ను సంప్రదించాలని కలెక్టర్ కోరారు. ఇప్పుడే జాగ్రత్త పడకపోతే, సర్వే సమయంలో ఉపయోగం ఉండదన్నారు. సమాచారం ఇవ్వని వారిని ప్రభుత్వ పథకాలేవీ అందవనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కార్యక్రమంలో జేసీ ఎల్.శర్మన్, ఏజేసీ రాజారాం, డీఆర్ఓ రాంకిషన్‌తో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
కుటుంబ సర్వేకు సకలం ఏర్పాట్లు
ముకరంపుర : ఈనెల 19న జరిగే సమగ్ర కుటుంబ సర్వేకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఇన్చార్జి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. శుక్రవారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్ హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్ఫరాజ్ మాట్లాడుతూ సర్వేపై ఇప్పటికే తహశీల్దార్, ఎంపీడీవోలతోపాటు మాస్టర్ ట్రైయినీలకు శిక్షణ ఇచ్చినట్లు పేర్కొన్నారు. సర్వేకు జిల్లాకు 39 వేల బుక్లెట్స్ అవసరమవుతాయని అంచనా వేసినట్లు తెలిపారు. ఈ నెల 12లోపు ఇళ్లకు నంబర్లు వేస్తామని, ఆ పనిని వీఆర్వో, వీఆర్ఏలు పూర్తి చేస్తారని పేర్కొన్నారు. రేమండ్ పీటర్ మాట్లాడుతూ ఆధార్‌కార్డు ఉన్నవారికి ప్రభుత్వ పథకాలలో ప్రాధాన్యత కల్పించాలన్నారు. ప్రజల స్థితిగతులను తెలుసుకోవడానికే సామాజిక, ఆర్థిక సర్వే చేపడుతున్నట్లు వివరించారు. మారుమూల ప్రాంతాల్లో సర్వేకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, అవసరమైన వాహనాలను ముందుగానే సమకూర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీకేష్ లట్కర్, డీఆర్వో వీరబ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణే అని చెప్పండి: రావెల
సాక్షి, హైదరాబాద్: 1956 తర్వాత హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడిన వారంతా తెలంగాణకు చెందినవారమేనంటూ 19న జరిగే కుటుంబ సర్వేలో స్పష్టం చేయాలని ఆంధ్రప్రదేశ్ సాంఘిక, గిరిజన సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు పిలుపునిచ్చారు. సర్వే ఫార్మాట్లో ‘ఏ రాష్ట్రం నుంచి వచ్చారనే’ కాలమ్‌లోనూ ఇదే విషయాన్ని పొందుపరచాలని సూచించారు. ఇలా చేయకుంటే ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు. శుక్రవారం సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. రాజధాని కావడంతో హైదరాబాద్‌లో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చి ఎంతోమంది స్థిరపడ్డారని తెలిపారు. -
ఉద్యమంలా.. సర్వే!
ముకరంపుర : రాష్ట్ర సర్కారు ఆదేశాల మేరకు ఈనెల 19న ఇంటింటి సర్వేను జిల్లాలో ఉద్యమంలా చేపట్టి విజయవంతం చేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. కుటుంబ సర్వే ను పకడ్బందీగా పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు ఇన్చార్జి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ గురువారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీవోలతో సమావేశమయ్యా రు. సర్వే నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. నాలుగు గంటలపాటు పవర్ పాయింట్ ప్రజెం టేషన్ ద్వారా అధికారులకు అవగాహన కల్పిం చారు. సర్వేపై జిల్లావ్యాప్తంగా విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించారు. సిబ్బంది లభ్యత, కొరతపై దృష్టి సారించాలని సూచించారు. అప్పగించిన బాధ్యతలను సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని ఆదేశించారు. 9.70 లక్షల కుటుంబాలు జిల్లాలో 9.70 లక్షల కుటుంబాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందుకు 32,500 మంది ఉద్యోగులు అవసరమని గుర్తించి ఆ మేరకు క్షేత్రస్థాయిలో ప్రణాళిక రూపొందించారు. ప్రతి ఉద్యోగి 25 నుంచి 30 ఇళ్లు సర్వే చేసే లా సన్నద్ధం చేస్తున్నారు. ప్రతి 30 కుటుంబాలకు ఒక ఎన్యుమరేటర్, 20 మంది ఎన్యుమరేటర్లకు ఒక సూపర్వైజర్ను నియమించారు. గ్రామస్థాయి లో విలేజ్ ఆఫీసర్ అందుబాటులో ఉంటారు. సర్వేకు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు, గురుకుల పాఠశాల, కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో పనిచేస్తున్న టీచర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులను ఉపయోగించాలని ఇన్చార్జి కలెక్టర్ సూచించారు. నేటి నుంచి నోషనల్ సీరియల్ నంబర్ జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాల్లో అన్ని ఇళ్లకు నంబర్లు వేయాలని సర్ఫరాజ్ సూచించారు. వరుస క్రమంలో ఒకటి నుంచి మొదలుపెట్టి ప్రక్రియను ( నోషనల్ సీరియల్ నంబర్) ఈ నెల 12లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. సర్వే సిబ్బందికి పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వాలని సూచించారు. వంద మంది ఎన్యుమరేటర్లకు ఒక మాస్టర్ ట్రైనర్‌ను నియమించాలని, వారితో శిక్షణ ఇప్పించాలని సూచించారు. మున్సిపాలిటీల్లో సర్వే బాధ్యత కమిషనర్లదేనని, మండల స్థాయిలో తహశీల్దార్లు బాధ్యత వహించాలని ఆదేశించారు. ఆగస్టు 19న ఇంటింటి సర్వే గురించి అన్ని గ్రామాల్లో ప్రతి రోజు చాటింపు వేయించాలన్నారు. మున్సిపాలిటీల్లో ఆటోల ద్వారా విస్తృత ప్రచారం చేయించాలని సూచించారు. డివిజన్, మండల స్థాయి అధికారులు పత్రికల ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అవగాహన కల్పించాలన్నారు. సర్వే ఇలా.. ఇంటింటి సర్వే సందర్భంగా ఎన్యుమరేటర్లు ముఖ్యంగా గ్యాస్ కనెక్షన్, వయసు ధ్రువీకరణపత్రాలు, పోస్టాఫీస్, బ్యాంకు పుస్తకాలు, పింఛన్ గుర్తింపుకార్డు, స్వశక్తి సంఘాల పాస్‌బుక్‌లు, ఆధార్ కార్డులు, వికలాంగుల సదరన్ సర్టిఫికెట్లు, విద్యుత్ బిల్లులు, భూములకు సంబంధించిన పట్టాదారు పాస్‌బుక్కులు, టైటిల్‌డీడ్, వాహనాలకు సంబంధించిన ఆర్సీ బుక్‌లు, పశుసంపద వివరాలు, ఓటరు గుర్తింపుకార్డులను పరిశీలించి వివరాలు నమోదు చేసుకుంటారని తెలిపారు. ప్రజలు పత్రాలన్నింటినీ ఇంటికొచ్చే ఎన్యుమరేటర్‌కు చూపించాలని, అందుకనుగుణంగా అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. మండలస్థాయి సిబ్బందికి తహశీల్దార్లు సర్వేపై శిక్షణ ఇవ్వాలన్నారు. సమావేశంలో అదనపు జేసీ టి.నంబయ్య, డీఆర్వో టి.వీరబ్రహ్మయ్య, డీఆర్డీఏ పీడీ విజయగోపాల్, జెడ్పీ సీఈవో సదానందం, సీపీవో సుబ్బారావు తదితరులు ఉన్నారు. -
సర్వేకు ప్రజలు సహకరించాలి
చిన్నసూరారం (తిప్పర్తి) :ఈ నెల 19న నిర్వహించే సమగ్ర సర్వేకు తమ వివరాలు అందించి ప్రజలందరూ సహకరించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (సంక్షేమ శాఖ) రాంలక్ష్మణ్ కోరారు. ఆదివారం మండలంలోని చిన్నసూరారం గ్రామంలో జరిగిన బోనాల పండుగకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడుతూ సర్వే రోజు ప్రజలంతా ఇంటి వద్దే ఉండి సర్వే బృందానికి సరైన వివరాలు అందించాలన్నారు. ప్రభుత్వ పరంగా అందించే పథకాలకు ఈ సర్వే ఎంతో ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్రంలో 4 లక్షల మంది ఉద్యోగులతో ఒకే రోజు సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సర్వే ద్వారా కుటుంబానికి ఒక నంబర్‌ను కేటాయించి వారి పూర్తి డాటాను అందులో పొందుపర్చనున్నట్లు తెలిపారు. దీని ద్వారా ప్రభుత్వ పథకాలకోసం అసలైన లబ్ధిదారుల వివరాలు తెలుస్తాయన్నారు. ఎస్సీల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా చొరవ చూపుతున్నారన్నారు. అందులో భాగంగానే ఆగస్టు 15న భూ పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. ఆయన వెంట జెడ్పీటీసీ తండు సైదులుగౌడ్, స్థానిక సర్పంచ్ నారగోని భద్రయ్యగౌడ్, మాజీ సర్పంచ్‌లు సంకు ధనలక్ష్మి, కట్టా యాదయ్య, బస్వయ్య తదితరులు ఉన్నారు.