'సర్వేలో వ్యక్తిగత అంశాలు చెప్పనక్కర్లేదు' | need not reveal personal matters in survey, says d srinivas | Sakshi
Sakshi News home page

'సర్వేలో వ్యక్తిగత అంశాలు చెప్పనక్కర్లేదు'

Published Mon, Aug 18 2014 2:48 PM | Last Updated on Sat, Sep 2 2017 12:04 PM

'సర్వేలో వ్యక్తిగత అంశాలు చెప్పనక్కర్లేదు'

'సర్వేలో వ్యక్తిగత అంశాలు చెప్పనక్కర్లేదు'

సర్వేలో వ్యక్తిగత అంశాలను ప్రస్తావించాల్సిన అవసరం లేదని తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు డి.శ్రీనివాస్ అన్నారు. సీఎల్పీ ఆఫీసులో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు సోమవారం భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ఏడుగురు ఎమ్మెల్సీలు హాజరు కాగా, ఇద్దరు మాత్రం గైర్హాజరయ్యారు.

టీఆర్ఎస్ ఇచ్చిన హామీలను అమలు చేయడానికి రాబోయే బడ్జెట్లో నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా డీఎస్ అన్నారు. ప్రతిపక్షంగా తాము పోరాటాలకు సిద్ధమవుతామని చెప్పారు. సర్కారు చేపడుతున్న సమగ్ర కుటుంబ సర్వేకు తాము వ్యతిరేకం కాదని, అయితే ఆ ఫార్మాట్ను చూసి మాత్రం కొందరు భయాందోళన వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement