
తెలంగాణే అని చెప్పండి: రావెల
1956 తర్వాత హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడిన వారంతా తెలంగాణకు చెందినవారమేనంటూ 19న జరిగే కుటుంబ సర్వేలో స్పష్టం చేయాలని ఆంధ్రప్రదేశ్ సాంఘిక, గిరిజన సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు పిలుపునిచ్చారు.
సాక్షి, హైదరాబాద్: 1956 తర్వాత హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడిన వారంతా తెలంగాణకు చెందినవారమేనంటూ 19న జరిగే కుటుంబ సర్వేలో స్పష్టం చేయాలని ఆంధ్రప్రదేశ్ సాంఘిక, గిరిజన సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు పిలుపునిచ్చారు. సర్వే ఫార్మాట్‌లో ‘ఏ రాష్ట్రం నుంచి వచ్చారనే’ కాలమ్‌లోనూ ఇదే విషయాన్ని పొందుపరచాలని సూచించారు. ఇలా చేయకుంటే ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు. శుక్రవారం సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. రాజధాని కావడంతో హైదరాబాద్‌లో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చి ఎంతోమంది స్థిరపడ్డారని తెలిపారు.