ముకరంపుర : ఈనెల 19న జరిగే సమగ్ర కుటుంబ సర్వేకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఇన్‌చార్జి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. శుక్రవారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్ హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్ఫరాజ్ మాట్లాడుతూ సర్వేపై ఇప్పటికే తహశీల్దార్, ఎంపీడీవోలతోపాటు మాస్టర్ ట్రైయినీలకు శిక్షణ ఇచ్చినట్లు పేర్కొన్నారు. సర్వేకు జిల్లాకు 39 వేల బుక్‌లెట్స్ అవసరమవుతాయని అంచనా వేసినట్లు తెలిపారు.
ఈ నెల 12లోపు ఇళ్లకు నంబర్లు వేస్తామని, ఆ పనిని వీఆర్వో, వీఆర్‌ఏలు పూర్తి చేస్తారని పేర్కొన్నారు. రేమండ్ పీటర్ మాట్లాడుతూ ఆధార్‌కార్డు ఉన్నవారికి ప్రభుత్వ పథకాలలో ప్రాధాన్యత కల్పించాలన్నారు. ప్రజల స్థితిగతులను తెలుసుకోవడానికే సామాజిక, ఆర్థిక సర్వే చేపడుతున్నట్లు వివరించారు. మారుమూల ప్రాంతాల్లో సర్వేకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, అవసరమైన వాహనాలను ముందుగానే సమకూర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీకేష్ లట్కర్, డీఆర్‌వో వీరబ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
కుటుంబ సర్వేకు సకలం ఏర్పాట్లు
Published Sat, Aug 9 2014 3:54 AM | Last Updated on Sat, Sep 2 2017 11:35 AM
Advertisement